15, డిసెంబర్ 2025, సోమవారం

సంపూర్ణ మహాభారతము

  🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*🌞ఆదివారం 14 డిసెంబర్ 2025🌞*

``

            *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

  సరళ వ్యావహారిక భాషలో!

                            7️⃣4️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


        *సంపూర్ణ మహాభారతము*        

                    *74 వ రోజు*

                    

*వన పర్వము ప్రథమాశ్వాసము*


*అర్జునుడు శివుడి కొరకు తపమాచరించుట*```


వెంటనే అర్జునుడు ఇంద్రకీలాద్రికి వెళ్ళి అక్కడ శివుని గురించి ఘోర తపస్సు మొదలు ఆరంభించాడు. పరమ శివుడు అర్జునుని పరీక్షించదలిచాడు. ఒక కిరాతుడి వేషంలో అర్జుని దగ్గరకు వచ్చాడు. అక్కడ మూకాసురుడు అనే రాక్షసుడు అర్జునుడిని చంపడానికి పంది రూపంలో వచ్చాడు. అర్జునుడు ఆ పందిని బాణంతో కొట్టాడు. అదే సమయంలో కిరాతుని వేషంలో ఉన్న శివుడు కూడా పందిని కొట్టాడు. రెందు బాణాలు తగలగానే ఆ పంది ప్రాణాలు వదిలింది. 


అర్జునుడు కిరాతునితో “నేను కొట్టిన జంతువును నువ్వు ఎందుకు కొట్టావు? వేటలో అలా కొట్టకూడదన్న ధర్మం నీకు తెలియదా?” అన్నాడు. 


ముందు నేను కొట్టిన బాణంతో ఆ పంది చనిపోయింది. నువ్వు కొట్టినట్లు చెప్పుకోవడానికి సిగ్గు లేదా? చేవ ఉంటే నాతో యుద్ధానికి రా” అన్నాడు శివుడు.

అర్జునుడు శివుని మీద బాణవర్షం కురిపించాడు. కానీ శివుడు చలించ లేదు. అర్జునునకు ఆశ్చర్యం వేసింది “ఇతను సామాన్యుడు కాదు”దేవేంద్రుడైనా పరమ శివుడైనా అయి ఉండాలి" అనుకున్నాడు. కాని ఈ ఎరుక నాపై వేసిన బాణాలు నన్ను బాధిస్తున్నాయి. ఇవి దివ్యాస్త్రాల వలె ఉన్నాయి" అని మనసులో అనుకున్నాడు. అర్జునుడు వేసే బాణములనన్నీ శివుడు పర్వతం శిలావర్షాన్ని స్వీకరించి నట్లు స్వీకరించాడు. అక్షయ తూణీరాలలోని బాణాలు అన్నీ అయిపోయాయి. గాండీవం తీసుకుని కొట్టగా అతని చేతిలోని గాండీవం అదృశ్యం అయింది. ఖడ్గం తీసుకొని శివుని శిరస్సుపై బలమంతా ప్రయోగించి కొట్టగా ఖడ్గం ముక్కలై పోయింది. చెట్లతోనూ శిలలతోను యుద్ధం చేశాడు. అన్నిటిని శివుడు తనలోనికి తీసుకున్నాడు. ఇక పిడికిళ్ళతో శంకరుడిని కొట్టనారంభించాడు. కిరాతార్జునులిరువురు భయంకరంగా ద్వంద యుద్ధం చేయసాగారు. కొంతసేపటికి అర్జునుడు శివుని దెబ్బలకు తాళలేని మూర్చబోయాడు. కాసేపటికి తేరుకుని రక్తసిక్తమైన తన శరీరమును చూసుకొని మట్టితో శివలింగమును చేసి పుష్పములు, మాలలతో పూజించాడు. అప్పుడు పార్ధివ లింగంపై తను పూజించిన మాల కిరాతుని శిరస్సుపై కనిపించింది. ఆశ్చర్యపోయిన అర్జునుడు కిరాతకుడే శివుడని గ్రహించి కైమోడ్చి శివునకు నమస్కరిస్తూ అనేక విధాల స్తుతించాడు. "పరమశివా! నిన్ను సామాన్యుడిగా ఎంచి నీతో యుద్ధం చేసాను. నా తప్పు మన్నించు" అన్నాడు. 


అంత నిజ రూపంలో ప్రత్యక్షమైన శివుడు “అర్జునా! నిన్ను క్షమించాను. నీవు సామాన్యుడివి కాదు. పూర్వజన్మలో నువ్వు నరుడు అనే దేవఋషివి. ఇదిగో నీ గాండీవం. ఇంకా ఏదైనా వరం కోరుకో" అన్నాడు. 


అర్జునుడు “త్రయంబకా! నాకు పాశుపతం అనే అస్త్రం ప్రసాదించు. ఈ లోకంలో బ్రహ్మశిరం, పాశుపతం మహాస్త్రాలు. శత్రు సంహారానికి అవి అవసరం కనుక నాకు వాటిని ప్రసాదించు" అన్నాడు. 


ఈశ్వరుడు సంతోషించి అర్జునుడికి మంత్ర,ధ్యాన,జప,హోమ పూర్వకంగా పాశుపతాస్త్రం, సంధానం, మోక్షణము

సంహారం సహితంగా అర్జునుడికి ఉపదేశించాడు. 

శివుడు అర్జునుడితో  “అర్జునా! ఈ పాశుపతాన్ని ప్రయోగిస్తే  జగత్తును నాశనం చేస్తుంది. ఈ దివ్యాస్త్ర ప్రభావంతో నీవు అఖిల లోకాలను జయిస్తావు" అని చెప్పి అంతర్ధానం అయ్యాడు. 


పరమశివుని చూసినందుకు అర్జునుడు సంతోషించాడు. పరమశివుని స్పర్శతో అర్జునిని శరీరం దివ్యకాంతితో ప్రకాశిస్తోంది. ఈ విషయం తెలుసుకుని ఇంద్రుడు, కుబేరుడు, యముడు, వరుణుడు, అశ్వినీ దేవతలతో కలసి అర్జునిని వద్దకు వచ్చాడు. "అర్జునా నీ పరాక్రమానికి మెచ్చి నీకు వరాలివ్వడానికి వచ్చాము” అన్నాడు ఇంద్రుడు. 


యముడు తన దండాన్ని అర్జునుడికి ఇచ్చాడు. వరుణుడు వరుణపాశాలను, కుబేరుడు కౌబేరాస్త్రాన్ని దానం చేసారు. 


అర్జునుడు వారిని దర్శించినందుకు, వారిచ్చిన అస్త్రాలకు పరమానందం చెందాడు. దేవేంద్రుడు అర్జునుడికి రథం పంపి ఇంద్రలోకానికి ఆహ్వానించాడు.```


            *(సశేషం)*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```

*🚩జై శ్రీ కృష్ణ!   జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

15డిసెంబర్2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*   

     🕉️ *సోమవారం*🕉️   

 *🌹15డిసెంబర్2025🌹*  

    *దృగ్గణిత పంచాంగం* 

                          

         *ఈనాటి పర్వం*

  *సర్వేషాం సఫలైకాదశి*

   

          *స్వస్తి శ్రీ విశ్వావసు* 

          *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - హేమంత ఋతౌః*

*మార్గశిర మాసం -  కృష్ణపక్షం*


*తిథి       : ఏకాదశి* ‌రా 09.19 వరకు ఉపరి *ద్వాదశి*

*వారం    : సోమవారం* ( ఇందువాసరే )

*నక్షత్రం   : చిత్త* ఉ 11.08 వరకు ఉపరి *స్వాతి*

*యోగం  : శోభన* మ 12.30 వరకు ఉపరి *అతిగండ*

*కరణం   : బవ* ఉ 08.03 *బాలువ* రా 09.19 ఉపరి *కౌలువ*


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 06.30 - 07.30  & 11.00 - 12.00*

అమృత కాలం  : *రా 04.15 - 06.03 తె వరకు*

అభిజిత్ కాలం  : *ప 11.40 - 12.25*


*వర్జ్యం             : సా 05.27 - 07.15*

*దుర్ముహూర్తం  : మ 12.25 - 01.10 & 02.39 - 03.23*

*రాహు కాలం   :  ఉ 07.52 - 09.15*

గుళికకాళం      : *మ 01.26 - 02.50*

యమగండం    :  *ఉ 10.39 - 12.03*

సూర్యరాశి : *వృశ్చికం*                    

చంద్రరాశి : *తుల*

సూర్యోదయం :*ఉ 06.38* 

సూర్యాస్తమయం :*సా 05.44*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :*ఉ 06.28 - 08.42*

సంగవ కాలం         :     *08.42 - 10.56*

మధ్యాహ్న కాలం    :    *10.56 - 01.10*

అపరాహ్న కాలం    : *మ 01.10 - 03.23*


*ఆబ్ధికం తిధి         : మార్గశిర బహుళ ఏకాదశి*

సాయంకాలం        :  *సా 03.23 - 05.37*

ప్రదోష కాలం         :  *సా 05.37 - 08.12*

రాత్రి కాలం           :*రా 08.12 - 11.37*

నిశీధి కాలం          :*రా 11.37 - 12.29*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.46 - 05.37*

<><><><><><><><><><><><><><>

        🌷 *ప్రతినిత్యం*🌷

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🕉️శివాపరాధ క్షమాపణ స్తోత్రం🔯*


*క్షంతవ్యో మేఽపరాధః శివ* 

*శివ శివ భో శ్రీమహాదేవ శంభో*


    🕉️ *ఓం నమః శివాయ*🕉️


🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

 🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

పంచాంగం

  కాశీ విశ్వేశ్వరుడు



పంచాంగం 15.12.2025 Monday,

 ఈ రోజు పంచాంగం 15.12.2025 Monday,


స్వస్తి శ్రీ చాన్ద్రమాన విశ్వావసు నామసంవత్సర: దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాస కృష్ణ పక్ష ఏకాదశి తిథి ఇందు వాసర చిత్ర నకత్రం శోభన యోగః బవ తదుపరి బాలవ కరణం.


రాహుకాలం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.

 

యమగండం: పగలు 10:30 నుండి 12:00 వరకు. 

  

 

శ్రాద్ధ తిథి: ఏకాదశి

 


నమస్కారః , శుభోదయం

చండీశ్వరుడికి

  *పార్వతీ పరమేశ్వరులు,కుటుంబంలో చండీశ్వరుడికి అయిదవ స్థానం ఇచ్చిన శంకరుడు అరుణాచలం లో పార్వతీ పరమేశ్వరులు, గణపతి, సుబ్రహ్మణ్యుడు, తో పాటు చండీశ్వరుడు ని ఊరేగింపుగా తీసుకువెళతారు,* ఈ రోజు చండీశ్వరుడికి గురించి తెలుసుకుందాము.


✨💗ఒకానొకప్పుడు చిదంబర క్షేత్రంలో ‘యచ్చదత్తనుడు’ అనబడే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు ‘విచారశర్మ’ అనబడే కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు వేదం నేర్చుకున్నాడు. ఆయన వేదమును చక్కగా సుస్వరంతో చదివేవాడు. ఎప్పుడూ స్వరంతప్పేవాడు కాదు. గోవులు దేవతలని నమ్మిన పిల్లవాడు. ఒకరోజు ఒక ఆవులను కాసే ఆయన ఆవును కొడుతూ తీసుకువస్తున్నాడు. అది చూసిన ఆ పిల్లవాడి మనసు బాధపడి ‘నేనే రేపటి నుండి ఈ ఆవులను కాస్తాను. నీవు ఈ ఆవులను కొట్టవద్దు. తీసుకుని వెళ్ళవద్దు’ అని చెప్పాడు. బ్రాహ్మణుడు బ్రహ్మచారి వేదం చదువుకున్నవాడు ఆవులను కాపాడితే మంచిదే కదా అని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆవుల వెనకాల ఈ పిల్లవాడిని పంపించారు. ఈ పిల్లవాడు వేదమంత్రములను చదువుకుంటూ వాటిని స్పృశించి వాటిని జాగ్రత్తగా కాపాడుతుండేవాడు. వేదంలో కొన్ని కొన్ని పన్నాలకు కొన్ని కొన్ని శక్తులు ఉంటాయి. ఆవుల్ని రక్షించడానికి ఆ పన్నాలను చదువుతూ వాటిని కాపాడేవాడు. ఆవులు సంతోషించి ఆ పిల్లవాడు కూర్చున్న చోటికి వచ్చి అతడు మంచినీళ్ళు తాగడానికి ఒక కుండ తెచ్చుకుంటే ఆ కుండలో పాలు విడిచి పెట్టేస్తుండేవి. రోజూ ఇచ్చే పాలకన్నా ఎక్కువ పాలను ఇంటి దగ్గర ఇచ్చేవి. ఈ పిల్లవాడు ఆవులు ఎలాగూ పాలువిడిచి పెడుతున్నాయి కదా వట్టినే కూర్చోవడం ఎందుకని ఈ ఆవులన్నింటిని విడిచిపెట్టి కట్టేవాడు. రుద్రం చదవడం కన్నా గొప్పది మరొకటి లేదు. అందుకే లోకమునందు సన్యసించినవారు కూడా రుద్రాధ్యాయం చదవాలని నియమం. రుద్రాధ్యాయం అంత గొప్పది. అది చదివితే పాపములు పటాపంచెలు అయిపోతాయి. అటువంటి రుద్రం చదువుతూ ఇసుకతో శివలింగం కట్టి ఈ పాలను తీసి రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తూ ఉండేవాడు.


ఒకరోజున అటునుంచి ఒక వెర్రివాడు వెళ్ళిపోతున్నాడు. ‘అయ్యో, ఈ పిల్లవాడు ఈ పాలనన్నిటిని ఇసుకలో పోసేస్తున్నాడు. ఇంకా ఆవులు ఎన్ని పాలిచ్చునో’ అని వెళ్ళి ఆ పిల్లవాడి తండ్రికి చెప్పాడు. చెప్తే యచ్చదత్తనుడికి కోపం వచ్చింది. ‘రేపు నేను చూస్తాను’ అని చెప్పి మరుసటి రోజున కొడుకు కన్నా ముందే బయలుదేరి అడవిలోకి వచ్చి ఆవులు మేసేచోట చేట్టిక్కి కూర్చున్నాడు. పూర్వకాలం క్రూర మృగములు ఎక్కువ. అందుకని కర్ర గొడ్డలికూడా తనతో తెచ్చుకుని చెట్టెక్కి కూర్చున్నాడు. కాసేపయింది. కొడుకు ఆవులను తీసుకువచ్చి అక్కడ ఆవులను విడిచిపెట్టాడు. ఆవులు అక్కడ మేత మేస్తున్నాయి. ఈయన సైకత లింగమును తయారుచేసి సైకతప్రాకారములతో శివాలయ నిర్మాణం చేశాడు.తరువాత చక్కగా ఈ ఆవులు తమంత తాముగా విడిచిపెట్టిన పాలతో రుద్రం చదువుతూ అభిషేకం చేసుకుంటున్నాడు. ఆయన మనస్సు ఈశ్వరుని యందు లయం అయిపోయింది. ఆటను పరవశించిపోతూ సైకత లింగమునకు అభిషేకం చేస్తున్నాడు. అవును అతడు చెప్పింది నిజమే. వీడు ఇసుకలో పాలు పోస్తున్నాడని దూరంగా చెట్టు మీద ఉన్న తండ్రి చెట్టు దిగి పరుగెత్తుకుంటూ వచ్చి పెద్ద పెద్ద కేకలు వేసి పిల్లాడిని భుజముల మీద కొట్టాడు. ఆ పిల్లవాడికి బాహ్యస్మృతి లేదు. అతని అభిషేకం చేస్తున్నాడు. కోపం వచ్చిన తండ్రి తన కాలితో అక్కడి సైకత లింగమును తన్నాడు. అది ఛిన్నాభిన్నమయిందో అప్పుడు ఆ పిల్లవాడికి బాహ్యస్మృతి వచ్చింది. తండ్రి వచ్చినప్పుడు గొడ్డలి అక్కడ పెట్టాడు. ఈ పిల్లవాడు వచ్చినవాడు తండ్రియా లేక మరొకడా అని చూడలేదు. ఏ పాదము శివలింగమును తన్నిందో ఆ పాదము ఉండడానికి వీలులేదని గొడ్డలి తీసి రెండు కాళ్ళు నరుక్కుపోయేటట్లు విసిరాడు. తండ్రి రెండు కాళ్ళు తొడలవరకు తెగిపోయాయి. క్రిందపడిపోయాడు. నెత్తుటి ధారలు కారిపోతున్నాయి. కొడుకు చూశాడు. ‘శివలింగమును తన్నినందుకు నీవీ ఫలితం అనుభవించవలసిందే’ అన్నాడు. నెత్తురు కారి తండ్రి మరణించాడు. ఆశ్చర్యంగా అక్కడ ఛిన్నాభిన్నమయిన సైకతలింగంలోంచి పార్వతీపరమేశ్వరులు ఆవిర్భవించారు. నాయనా, ఇంత భక్తితో మమ్మల్ని ఆరాధించావు. అపచారం జరిగిందని తండ్రి అనికూడా చూడకుండా కాళ్ళు రెండూ నరికేశావు. మనుష్యుడవైపుట్టి తపస్సు చేయకపోయినా వరం అడగకపోయినా నీకు వరం ఇస్తున్నాను. ఇవాల్టి నుండి నీవు మాకుటుంబంలో అయిదవవాడవు. నేను, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్యుడు. అయిదవ స్థానం చండీశ్వరుడిదే. నిన్ను చండీశ్వరుడు అని పిలుస్తారు. ఇకనుంచి సాధారణంగా లోకంలో వివాహం అయిపోతే ఆ విడిచి పెట్టిన దానిని పత్నీ భాగం అని పిలుస్తారు. భార్యకు దానిని తినే అధికారం ఉంటుంది. దానిని ఎవరు బడితే వారు తినెయ్యకూడదు. భార్య కొక్కదానికే ఆ అధికారం ఉంటుంది. అది పత్నీభాగం. కానీ శంకరుడు ఎంత అనుగ్రహం చేశాడో చూడండి. పార్వతీ నేను ఈవేళ చండీశ్వరుడికి ఒక వరం ఇచ్చేస్తున్నాను. నీవు అంతఃపురంలో నాకు భోజనం పెడతావు కదా. నేను తిని విడిచిపెట్టిన దానిని చండీశ్వరుడు తింటూంటాడు. వేరొకరు తినరాదు’ అన్నాడు.ఆ చండీశ్వరుడు ఎప్పుడూ శంకరుని ధ్యానం చేస్తూ ఉత్తరముఖంలో కూర్చుని ఉంటాడు. చండీశ్వరుడు బహిర్ముఖుడై ఉండడు. నందీశ్వరుడి లాగే ఆయన కూడా. ఎప్పుడూ కళ్ళు మూసుకుని ఉంటాడు. ఎప్పుడూ శివ ధ్యాన తత్పరుడై ఉంటాడు. ఆయనను పిలిస్తే ఆయనకు కోపం వస్తుంది. అందుకని ఆయనకు ‘ధ్వనిశ్చండుడు’ అని పేరు. మనలో చాలామంది తెలిసీ తెలియక శివాలయంలో కొట్టిన కొబ్బరికాయ ఇంటికి తీసుకువెళ్ళకూడదని గోడల మీదపెట్టి వెళ్లిపోతుంటారు. ప్రసాద తిరస్కారం మహాదోషం. అలా వదిలి పెట్టి వెళ్ళకూడదు. శాస్త్ర ప్రకారం ఆయన దగ్గరకు వెళ్ళినపుడు చిన్న చిటిక మాత్రం వెయ్యాలి.అందుకే ఆయనకి చిటికల చండీశ్వరుడు అని పేరు. చిటిక వేస్తే ధ్యానమునందు ఉన్నవాడు కళ్ళు విప్పి కోపంగా చూస్తాడు. ఓహో మా స్వామిని ఆరాధించావా? ప్రసాదం తీసుకున్నావా? సరి అయితే తీసుకు వెళ్ళు’ అంటాడు. ఆయనకు చూపించిన తర్వాత ఆ ప్రసాదం మీద మీకు పూర్ణాధికారం ఉంటుంది. దానిని మీరు ఇంటికి తీసుకువెళ్ళవచ్చు. లోపల శివుడికి ఒక ముక్క ఉండిపోయింది. అది చండీశ్వరునికి వెళ్ళిపోతుంది. మీకు ఇచ్చినది ప్రసాద రూపము. దానిని మీరు గుడియందు విడిచి పెట్టి వెళ్ళిపోతే మీ కోరిక తీరదు. అందుకని శివాలయంలో ఇచ్చిన కొబ్బరి చెక్కలు గాని, ప్రసాదం కానీ అక్కడ వదిలిపెట్టేయ్యకూడదు. నంది మీద పెట్టడం కాదు. చండీశ్వర స్థానమునందు తప్పట్లు కొట్టకూడదు. చిటిక చిన్నగా మాత్రమే వేయాలి. అంత పరమ పావనమయిన స్థితికి చేరిన వాడు చండీశ్వరుడు. 


ద్రవిడ దేశంలో శివాలయంలో ఊరేగింపు జరిగితే నందిని తీసుకు వెళ్ళరు. చండీశ్వరుడు ఉంటాడు ఉత్సవ మూర్తులలో. పార్వతీ పరమేశ్వరులు, గణపతి, సుబ్రహ్మణ్యుడు, చండీశ్వరుడు ఈ అయిదింటిని ఊరేగింపుగా తీసుకువెడతారు. పరమేశ్వరుడు చండీశ్వరునికి అయిదవ స్థానం ఇచ్చారు. ఒక్కసారి శివాలయంలోకి మనం గడపదాటి అడుగుపెడితే అటువంటి మూర్తులను దర్శనం చేసి శివలింగ దర్శనం చేసి అమ్మవారిని చూస్తాము. మన భాగ్యమే భాగ్యం. అందుకే శివాలయం విష్ణ్వాలయం ఈ రెండూ లేని ఊరు పూర్వం ఉండేది కాదు. ఈ రెండూ ఉండి తీరాలి. మనదేశం అంతటి భాగ్యవంతమయిన దేశం. *ఓం నమో చండీశ్వరాయ నమః*🙏🪷🙇‍♂️

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము - హేమంత ఋతువు - మార్గశిర మాసం - కృష్ణ పక్షం - ఏకాదశి - చిత్ర -‌‌ ఇందు వాసరే* (15.12.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*