20, ఆగస్టు 2020, గురువారం

యోగ.. రహస్యం...

భారతీయ యోగ.. రహస్యం...

మన ఋషులు ఎందుకు అన్ని ఏళ్లు బ్రతికారో
ఆ రహస్యం ...

శ్వాస
-------------
మనిషి నిమిషానికి "15 సార్లు" శ్వాస తీస్తాడు...100 నుండి 120 సం.. బ్రతుకు తాడు.తాబేలు నిమిషానికి "3 సార్లు" శ్వాస తీస్తుంది...500 సం. లు బ్రతుకు తుంది.

ఐతే ప్రాణాయామం ద్వారా 'శ్వాస' లు తగ్గించడం వలన ఆయుష్షు ఎలా పెరుగు తుంది....?

దీనిని సశాస్త్రీయం గా వివరించే 'వ్యాసం' ఇది...
అప్పుడు ప్రాణాయామం యొక్క శక్తి,గొప్ప దనం ఏమిటో మనకు తెలుస్తుంది.

మన శరీరం  కోట్ల కణాల  కలయిక వలన ఏర్పడింది. ఒక గ్రామ్ మానవ మాంసం లో కోటాను కోట్ల కణాలు ఉంటాయి. వీటినే " సెల్స్" అంటాం. ఈ ప్రతి కణంలోనూ 'మైటోకాండ్రియా (హరిత రేణువు) అనే ప్రత్యేక కణ వ్యవస్థ ఉంటుంది.

ఈ మైటోకాండ్రియా- మనం శ్వాస తీసు కున్నప్పుడు,గాలి లోని 'ఆక్సిజన్' ను తీసుకుని మండిస్తుంది.
దీని ద్వారా "ఉష్ణం" జనిస్తుంది.
ఈ ఉష్ణమే మనం ప్రాణాలతో ఉండటానికి కావలసిన " ప్రాణశక్తి".
ఇలా శరీరంలోని కాలి గోరు నుండి తల వెంట్రుకలు చివర వరకూ ఉన్న ప్రతి కణం లోనూ ఉష్ణం జనిస్తున్నది...

ఇలా ఒక్కొక్క కణం నిమిషానికి,15 సార్లు ఉష్ణాన్ని జనింపజేస్తుంది.
ఎందుకంటే, మనం నిమిషానికి "15 సార్లు" శ్వాస తీసుకుంటాం కాబట్టి...
ఇలాంటి కణం 3 రోజులు ఏకధాటి గా పని చేసి, తరువాత ఉష్ణాన్ని పుట్టించే సామర్థ్యం కోల్పోయి మరణిస్తుంది...
ఇలాంటి మృత కణాలు మలినాల రూపం లో శరీరం లోంచి బయటకు వెళ్లిపోతాయి.
ఎప్పుడైతే ఒక మృత కణం బయటికి వెళ్లిందో,ఆ స్థలంలో ఒక కొత్త కణం మనం తీసుకొనే ఆహారం ద్వారా తయారవు తుంది......

ఉదాహరణకు - మన  గుండెలో 1000 మృత కణాలు తయారయ్యాయి,అను కుంటే...
ఆ కణాలన్నీ విసర్జన అనగా చెమట,ఉమ్మి,మూత్రం ద్వారా బయటికి వెళ్ళి పోయి, గుండెలో ఖాళీ ఏర్పడినప్పుడు మాత్రమే...
ఆ స్థలంలో కొత్తకణాలు తయారవు తాయి.

పాత వాటిని ఖాళీ చేస్తేనే...
కొత్తవి రాగల్గుతాయి.
అందుకే ప్రతి దినం మన మల విసర్జన క్రియ అతి ముఖ్యమైనది.

ఎవరైతే మల విసర్జన సరిగా చెయ్యరో...
వారి శరీరం నిండా ఈ "మృత కణాలు(toxins)" నిండిపోయి,
సరిగా ఉష్ణం జనించక......
తీవ్ర రోగాల బారిన పడతారు...

కనుక ఈ టాక్సిన్ లను
బయటికి పంపే "డిటాక్సీఫీకేషన్
(విసర్జన)"
చాలా ముఖ్యం.

ఒక కణం 15 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే...3 రోజులు జీవిస్తుంది.

అదే కణం 14 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే...

5 రోజులు జీవిస్తుంది......

13 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే...

7 రోజులు జీవిస్తుంది......

ఈ విధంగా మనం.. 'శ్వాస' ల సంఖ్యను తగ్గించే కొద్దీ...
మన కణాలు పని చేసే కాలం పెరుగు తుంది.

ఎలా ఐతే ఒక యంత్రం దగ్గర ఎక్కువ పని చేయిస్తే...త్వరగా చేస్తుందో......
అలాగే ఈ కణాలు కూడా......

భారతీయ యోగులు ...
కణం యొక్క జీవిత కాలాన్ని...
3 నుండి 21 రోజుల వరకూ
పెంచి...2100 సంవత్సరాలు కూడా జీవించ గలిగారు.

మనం శ్వాసను ఎక్కువ తీసుకునే కొద్దీ...

శరీరంలోని ప్రతీ కణం పై తీవ్ర పని ఒత్తిడి పడి...
ఆ కణం త్వరగా పాడై పోతుంది.

ప్రాణ యామ సాధన ద్వారా "శ్వాస" ల సంఖ్యను తగ్గించి కణాల పని రోజులని పెంచ గల్గితే......
మన శరీరంలోని ప్రతి అవయం మరి కొన్ని రోజులు ఎక్కువగా పని చేస్తుంది...

ఎందుకంటే......

అవయవాలు అంటే...
కణాల సముదాయమే.

ఇలా మనలోని ప్రతీ అవయవం యొక్క...
ఆయుష్షు పెరిగితే...

మన ఆయుష్షు కూడా పెరిగినట్టే కదా.!!

మనం ఒక్క "శ్వాస"ను తగ్గించ గల్గితే...
20 సంవత్సరాల ఆయుష్షును
పెంచు కోవచ్చు...

యోగులు...
ఈ శ్వాసల సంఖ్యను గణించడం ద్వారానే...
తాము... ఏ రోజు...మరణించేదీ...
ముందే చెబుతారు 🙏
****************

ఏ దేవుడు అయినా ఒకటే.

ఏ దేవుడు అయినా ఒకటే.
మనం పరమేశ్వరుడు అంటాం వారు యెహోవా అంటారు వీరు అల్లాహ్ అంటారు ..అంతే .. నువ్వు మత పిచ్చితో కొట్టుకుంటున్నావు . నీ వల్ల మత కల్లోలాలు జరుగుతాయి ..
ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రతీ ఓడూ హిందుత్వం హిందుత్వం అంటూ తెగ రెచ్చిపోతున్నారు ...

ఇదండీ ..!
మన పనికిమాలిన,/జ్ఞానం లేని , చదువులేని , చదువుకున్న పశువులు ఆయిన హిందువులు మాట్లాడే మాటలు. మళ్ళీ భగవద్గీత లో ఒక శ్లోకం చెప్పమంటే ఒక్క అక్షరం పలకడం చేతకాదు .. బైబిల్లో, ఖురాన్లో ఏముందో అడిగితే ఏముంటుంది? అందర్నీ ప్రేమించమనేగా ఉంటుంది...! అని మత గ్రంధాల మీద పీ.హెచ్.డీ పట్టా పొందిన వారిలా ఫోజులు కొడతారు .

కృష్ణుడి గురించి అడిగితే మిడి మిడి జ్ఞానంతో తీసిన  N.T.R సినిమాలో కధనో లేదా గోపాలా గోపాలా సినిమా కధనో చెబుతారు ..
అసలు గ్రంధాలలో ఏముందో తెలీదు .. రాముడు సీతని అనుమానించాడు ... రాముడు మంచి వాడు కాదు .. సీతను తాకనైనా తాకని రావణుడే గొప్పవాడు అని ఎవడో వెధవ వాట్సప్ మెసేజ్ పెడితే అబ్బో పెద్ద గొప్ప విషయం తేలిసేసుకున్నానోచ్ అని వందమందికి షేర్ చేసేసి మహా జ్ఞానిలా ఫీల్ అవుతూ ఉంటాడు ..

క్రిస్మస్ , రంజాన్ రాగానే ఏగేసుకుని వెళ్ళి వాళ్ళకి విషెస్ చెప్పేసి పెద్ద ఘన కార్యం చేసేసాను అని ఫీల్ అయిపోతాడు ..
చర్చ్ మైకుల్లోంచి మన దేవుళ్ళని తిడుతుంటే నిజమే కదా వాళ్ళు చెప్పింది కూడా పాయింటే .. రాముడు అలా చేసి ఉండకూడదు. కృష్ణుడికి అంత మంది భార్యలు ఎందుకో .. అని ఇలా దిక్కుమాలిన ఆలోచనలు చేయడం .

పొరపాటున ఎవడైనా బైబిల్ /ఖురాన్ లను ప్రశ్నిస్తే నీకేం తెలుసు .. ఎవరి దేవుళ్ళు వాళ్ళకి గొప్ప అని వారి తరపున వారి కంటే ఎక్కువగా స్పందించేెడం. ఉగాది అంటే పచ్చడి తినడం .. జెమినీ టీవీ లో వచ్చే పనికి మాలిన ప్రోగ్రామ్ లు చూసేసి ఎంజాయ్ చేసేసాను అనుకోవడం ..
జనవరి ఒకటి రాగానే మాత్రం నానా హంగామా చేయడం .. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ తాగి రోడ్ల మీద పిచ్చి కేకలు వేయడం .. ఏది అసలు సంవత్సర ఆరంభమో తెలియని పరిస్థితి .. ఎవడైనా బొట్టు పెట్టుకున్నా , సాంప్రదాయంగా కనపడినా మాహా భక్తుడు వచ్చాడు రోయ్ అని ఎగతాళి చేయడం .. ఎవడైనా చంకలో బైబిల్ పెట్టుకున్నా , నెత్తి మీద టోపీ పెట్టుకున్నా ఎక్కడ లేని గౌరవం ఇచ్చేయడం .... ఇదీ సగటు హిందువు మానసిక స్థితి .. వీళ్ళ పీక మీద కత్తి పడినప్పుడో , వాళ్ళ అమ్మాయి లవ్ జీహాద్ కి బలి అయితేనో , చదువుకుని ఉద్దరిస్తాడు అనుకున్న కొడుకు ఉగ్రవాదుల శిబిరంలో చేరితేనో లేదా పెళ్ళాం పాస్టర్ మాయ మాటలకు మోసపోయి పండగలు , పబ్బాలు మానేసి మతం మారితేనే కాపురం చేస్తాను అని బెదిరిస్తేనో తప్ప కళ్ళు తెరుచుకోవు ..వీడికి!
అప్పుడు కదా సత్యం తెలుసుకునేది ......లబోదిబోమని ఏడ్చేది!

ఆలోచించండి హిందూ బంధువుల్లారా!
ఇవి విమర్శలు కావు, మన అజ్ఞానం! మనం మారాలి! హిందుత్వమనేది మతమో, మూఢాచారమో కాదు! మన దేశ ప్రతిష్ట! ఆ ప్రతిష్టకు ప్రతినిధులం మనమే అయినప్పుడు కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే! పైన చెప్పినవన్నీ ఒకప్పుడు నేను కూడా చేసిన పొరపాట్లు! కానీ బైబిల్ పూర్తిగా చదివాకే, ఏముందో తెలిసింది.
ఖురాన్ అర్ధమయ్యాకే జీహాద్ ప్రేమల వ్యవహారం అర్ధమైంది.
మన హిందూ జాతి ప్రమాదంలో ఉంది. నువ్వూ, నేను, మన కుటుంబాలు కూడా!
వీటికి మనం హిందుత్వాన్ని బ్రతికించుకుని చెక్ పెట్టాలా? వద్దా? ఈరోజే బాగా ఆలోచించండి! రాబోయే వినాశనాన్ని గుర్తించండి!
అజ్ఞానంలో మన మెడపై కత్తి పడనివ్వకండి! గీత, బైబిల్, ఖురాన్ లు చెప్పేవి ఒక్కటి కాదు!
మనది సంస్కృతి, మన సంస్కృతి ని నాశనం చెయ్యమనే మిగతా మత గ్రంధాలు చెబుతున్నాయి! చరిత్రలో కూడా తెల్ల వారు, తురకలు చేసింది వాటిలోనివే!
చదివి తెలుసుకోండి!

హిందుత్వం మన బలం, హిందుత్వం మన జీవనం!
జై శ్రీరామ్!

కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం

మృత్తికా ప్రసాదం, కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం

  మృత్తికా ప్రసాదం అంటే దేవాలయంల్లో ప్రసాదరూపంగా మట్టిని ఇస్తారు .దిన్ని వెంటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. అన్ని దేవాలయాల్లో ప్రసాదంగా భక్తులకు విభూది, కుంకుమ, చందనం తదితరాలను ఇస్తే నుదిటికి పెట్టుకోవచ్చు.

    ఒక వేళా పండ్లు లేదా తినే పదార్ద్దాన్ని ఇస్తే తినవచ్చు. అయితే ప్రసాద రూపంగా వచ్చే మన్ను ప్రసాదాన్ని తినేoదుకు అవకాశం లేకుండా ఉంటుంది. అలా అని దాన్ని పడేసేందుకు మనస్సు ఒప్పుకోదు. అటువంటి సందర్భంలో ఎం చేయాలో మనస్సుకు తోచదు. మృత్తికా ప్రసాదంతో మనకు ప్రయోజనం ఏమ్మిటి. ఆ ప్రసాదాలను ఎం చేయాలి. ఇక్కడ చూద్దాం

   మీరు ఎప్పుడైనా కుక్కే సుబ్రమణ్య దేవాలయానికి వెళ్ళితే అక్కడి అది సుబ్రమణ్య దేవాలయంలో భక్తులకు వల్మిక మృత్తికా అంటే పుట్ట మన్ను ప్రసాదరూపంలో అందిస్తారు.

  ఉడిపి సమీపంలో ఉన్న నాగబనగహళ్లి అంటే శ్రీ సుబ్రమణ్య దేవాలయంలో కూడా మీకు పుట్ట మన్నును ప్రసాదరూపంలో ఇస్తారు. ఈ ప్రసాదాలను ఏమి చేయాలో యోచించేoతలోనే చేసే పనులతో ఈ విషయాన్నీ మీరు మరచి పోతారు.

 మృత్తికా ప్రసాదం వివరాలు

01. మృత్తికా ప్రసాదాన్ని ఎవరు ధరిస్తారో వారికీ నాగుల భయం ఉండదు. నాగ దేవతల అనుగ్రహం ఉంటుంది.

02. ఎవరైతే పాములను చూసి చాలా భయపడతారో, ఎవరిఅతే కలలో పాములు ఎక్కువుగా కనబడుతుంటయో అటువంటి వారు మృత్తికా ప్రసాదాన్ని ధరిస్తే సర్పాల భీతి తొలగిపోతుంది.

03. ఆడ పిల్లలు ఎవరైతే ఎంత మంది పెళ్లి కొడుకులు వచ్చిన వివాహానికి ఒప్పుకోరో అటువంటి ఆడ పిల్లలు లేదా అబ్బాయులు పెళ్లి చూపులకు వెళ్ళే సమయంలో శ్రీ సుబ్రమన్యస్వామిని ధ్యానించి ఒక చిటిక మృత్తికాను మరో చిటిక పసుపును స్తానంచేసి సమయంలో వేడినీరు కాచే పాత్రలో వేసి తరువాత స్తానం చేయాలి. తరువాత శుబ్రమైన వస్త్రాన్ని కట్టుకొని దేవునికి నేతి దీపాన్ని వెలిగించి ప్రాద్దన చేస్తే వివాహం త్వరగా అవుతుంది.

04. ఎవరైతే అర్ధం పర్ధం లేకుండా ఎక్కువగా మాట్లడుతుంటారో అటువంటి వారికీ కొబ్బరి నూనెలో ఒక చిటికె మృత్తికాను వేసి తల దువ్వుకొంటె ఎక్కువ మాట్లాడకుండా ఉంటారు. అలాగే సమాజంలో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకొంటారు.

05. ఎ పిల్లలకైతే బాలగ్రహ దోషాలు ఉంటాయో చాల ఎక్కువుగా పళ్ళను కోరుకుతుండటం, కింద పడి కొట్టుకోవడం, ఒకే వైపు తదేకంగా చూస్తూ ఉండడం, అదే పనిగా ఏడుస్తూ ఉండడం, సన్నబడుతూ ఉండడం తదితరాలు ఉంటె మృత్తికాను తీసుకొని శ్రీ సుబ్రమణ్య స్వామిని ధ్యానించి పిల్లల నుదిటికి పెడితే వారు ఆరోగ్యంగా ఎదుగుతారు.

06.ఎ పిల్లలు ఆరోగ్యభాగ్యం లేకుండా పదే పదే అనారోగ్యానికి గురి అవుతుంటారో .అటువంటి పిల్లలకు స్తానం చేయిoచే సమయంలో  వేడి నీటితో స్తానం చేయిoచిన అనంతరం  దేవునికి నేతి దీపాన్ని వెలిగించి  ప్రాద్దించి  ఆ నీటితో పిల్లలకు స్తానం చేయిస్తే అట్టి వారికీ ఆరోగ్యం చాల భాగుంటుంది.

07. ఎవరికైతే ఋతు సమయంలో కడుపు నొప్పి ఎక్కువుగా వస్తుoటుoదో అటువంటి వారు ఋతు కాలానికి ముందు ఒక చిటిక మృత్తికాను బాగా పొడి చేసుకొని, కొబ్బరి నూనే లేదా అముదంలో వేసి పొట్టకు పూసుకుంటే ఋతుకాలంలో పొట్టనొప్పి ఉండదు.

08. ఎవరైతే పరీక్షా కాలంలో చదివిందంతా మరచిపోతుంటే అటువంటి వారు ఒక చిటిక మృత్తికాను ఒక గ్లాస్ నీటిలో వేసి రాత్త్రంత్ర  నానబెట్టి ఉదయం ఆ గ్లాస్లో నీటిని వడకట్టి తాగుతూవుంటే ఆపుడు మంచి జ్ఞాపక శక్తీ వస్తుంది. పరీక్షలో ఉత్తమ శ్రేణిలో పాసవుతారు.

09. వివాహం అయి సంతానభాగ్యం లేనివారు మంగళవారం శ్రీ సుబ్రమణ్య స్వామి పూజను చేసిన తరువాత దేవునికి ప్రసాదంగా పెట్టి పాలకు ఒక చితిక మృత్తికాను  వేసి దేవునికి చూపించి ప్రాద్దన చేసుకొని త్రాగితే స్వామి అనుగ్రహంతో కచ్చితంగా సంతాన భాగ్య్యం కలుగుతుంది.

10. ఎవరింట్లో అయెతే తులసి మొక్క తమలపాకు ఆకుల తీగలు ఎంత  వేసిన వదలి పోతుంటాయో అటువంటి వారు బృందావనపు కుండలో ఒక చిటిక మృత్తికాను వేసి మొక్కలను పెంచేతే మొక్కలు బాగా పెరుగుతాయి.

11. ఎవరికీ చర్మం పొడి బారుతుందో, నాగఫణి రోగాన్ని అనుభావిస్తుంటారో, ఎవరైతే బాగా నీరసంతో ఇబ్బంది పడుతుంటారో అటువంటి వారు ఒక చిటిక మృత్తికాను నీటిలో వేసి సాయంకాలం స్తానం చేస్తే ఎటువంటి రోగాలు రాకుండా ఆరోగ్యవంతులుగా, భాగ్యవంతులుగా ఉండగలరు.
********************

పెళ్లి సాధారణంగా జరగాలి.

పెళ్లి సాధారణంగా జరగాలి.
💐 షష్టిపూర్తి ఘనంగా జరగాలి


1. మానవుని  సంపూర్ణ ఆయుర్దాయం 120 సంవత్సరాలు అని జ్యోతిష్య శాస్త్రం  చెబుతున్నది.

2.  60 సంవత్సరాలు నిండినప్పుడు  చేసుకునేది షష్టిపూర్తి.
3. ప్రతివారికీ మృత్యువు
60 వ యేట ఉగ్రరథుడు అను పేరుతో ,
70 వ యేట భీమరథు డు అను పేరుతో,

78 వ యేట విజయరథు డు అను పేరుతో ఎదురుచూస్తుంటాడు.

4. ఆరోగ్య సమస్యలకు తట్టుకోవటానికి  చేసే శాంతి ప్రక్రియ షష్టిపూర్తి.

5. బృహస్పతి , శని 30 సంవత్సరాలకు  మానవుని జన్మకాలంలో ఉన్నరాశికి చేరటానికి 60 సంవత్సరాలు పడుతుంది. వాళ్ళిద్దరూ తాము బయలుదేరిన రాశికి చేరుకోవటంతో మానవుని జీవితం మరలా ప్రారంభమవుతుంది. తిరిగి జీవితం ప్రారంభం ఐనట్లు సంకేతం.

6.  మానవుడు పుట్టిన  తెలుగు సంవత్సరాలు (60) నిండుతాయి కనుక షష్టిపూర్తి.

7. షష్టిపూర్తి  సందర్భంగా  ఆయుష్కామన యజ్ఞము చేస్తారు. ఆయువును కోరి చేయు యజ్ఞము ఆయుష్కామనయజ్ఞము

8.  పెద్దలు ఈ ఆయుష్కామన యజ్ఞాన్ని చేసే పధ్ధతిని ఇలా చెప్పారు.

9. ‘’  తెల్లని నూతన వస్త్రముపై తూర్పు దిక్కుగా 12 గీతలు గీచి వాటిమీద అయిదు గీతలు గీసి మొత్తము 60 గదులు వచ్చే విధంగా చేస్తారు . వరుసకు 12 అయిదు వరుసలు తూర్పు దిక్కున బియ్యం పోసి కలశం ఉంచుతారు. ప్రభవ నుంచి క్షయ వరకు 60 సం " అధిదేవతలతో ఆవాహన చేస్తారు. దక్షిణాయన ఉత్తరాయణ దేవతలను, 6 ఋతువులను 12 మాసములను ఆవాహన చేస్తారు. పక్షములను,తిదులను వారములను - వారదేవతలు అయిన - సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని ని ఆవాహన చేస్తారు - వీరికి అధిదేవతలు - అగ్ని, జలము , భూమి, విష్ణువు ఇంద్రుడు, ప్రజాపతి లని ఆవాహన చేస్తారు - వీరికి అధిదేవతలు శివుడు, దుర్గ, కుమారస్వామి, బ్రహ్మ - ఇంకా ఏకాదశ రుద్రులు, నక్షత్ర దేవతలు 27 యోగములు 11 కరణములు ఇలా అందరి దేవి దేవతా స్వరూపాలని మృత్యుంజయుని ఆవాహన చేసి బ్రాహ్మణోత్తములు మంగళాచరనములతొ వేదయుక్తంగా ఈ కార్యక్రమం జరిపిస్తారు. అపమృత్యు నివారణార్థం హోమాల్ని, జపాలని కుడా చేస్తారు.తదుపరి బ్రహ్మలను సత్కరించి బంధుమిత్రులతో విందు ఆరగిస్తారు.

10. పూర్వకాలంలో  పురుషుడు ఏ వేడుక చేసుకున్నా భార్యకు కూడా జరగినట్టే   భావించేవారు కనుక  స్త్రీలకు మళ్ళీ విడిగా షష్టిపూర్తి చేసే ఆచారంలేదు.

11. పెళ్లి సాధారణంగా జరగాలి. షష్టిపూర్తి ఘనంగా జరగాలని పెద్దల మాట. ఎందుకంటే షష్టిపూర్తి దృఢమైన   ఆత్మీయతల సుగంధం పరిమ

గోవిందా! గోవింద!

జైశ్రీమన్నారాయణ - జైశ్రీహనుమాన్

సందేహం;- తిరుమల వేంకటేశ్వరుని దర్శించే యాత్రీకులు గోవిందా! గోవిందా అని అంటారెందుకు?

సమాధానం;- నైమిశారణ్యవాసులగు కొందరు మహర్షులు శుక మహర్షి ద్వారా శ్రీవేంకటాచల మహిమను విని, తమ తిరుమల యాత్రలో గోవిందా! అనే నామాన్నే మాటిమాటికి ఎలుగెత్తి పలికారని శ్రీవరాహపురాణంలో ఉంది.

గోవింద పదం వరాహస్వామిని, శ్రీకృష్ణుని, వేంకటేశ్వరుని తెలుపుతుంది. హిరణ్యాక్షునిచే పాతాళంలో ముంచి వేయబడిన భూమిని ఉద్ధరించినది వరాహావతారంలోనే కదా! అందుకే ఆయన గాం విందతి గోవిందః భూమిని  పొందినవాడు గోవిందుడయ్యాడు.

మరల గోవర్థన పర్వతమునెత్తి గోపాలకులను, గోవులను కాపాడినపుడు ఇంద్రుడు గోవింద పట్టాభిషేకం చేశాడు కనుక శ్రీకృష్ణుడు గోవిందుడయ్యాడు.

తర్వాత కలియుగ వైకుంఠమైన తిరుమలలో వేంచేసిన శ్రీనివాసుడు కూడా శ్రీకృష్ణుడే అని భగవద్గీతలోని చరమశ్లోకం సర్వధర్మాన్ పరిత్యజ్య అర్థమును, తన దివ్యహస్తములలోని ముద్రలతో ప్రకాశింపజేయుచున్నాడని పెద్దలు చెబుతున్నారు.

అందువల్ల గోవిందా! అని పిలిచే భక్తుల ప్రయాణంలో అలసటను ఆర్తిని శ్రీవేంకటేశ్వరుడు తొలగిస్తున్నాడు. గోవిందా! అని పిలిస్తేచాలు శ్రీవరాహస్వామి, శ్రీకృష్ణుడు, శ్రీనివాసుడు ముగ్గురు ఒకేసారి పలికి కటాక్షాన్ని భక్తులపై కురిపిస్తున్నారు.

గోవింద నామం మరువాం మరువాం అని భక్తులనడానికి కారణం ఇదే. ప్రహ్లాదుడు, ద్రౌపది, గోదాదేవి మున్నగువారు తమ ఆర్తిని గోవింద నామ స్మరణతోనే వెలిబుచ్చి రక్షణ పొందారు.

గోవిందా! గోవింద!
***************

రమణ మహర్షి వాణి ముత్యాలు

భగవాన్ శ్రీ రమణ మహర్షి వాణి ముత్యాలు
🕉🌞🌎🌙🌟🚩

🥀.జనన మరణాలు, భూత ,భవిష్యత్ ,వ ర్తమానాలు అనే విభజన మనం చేసుకున్నవే . కాలం అఖండం!

🥀.  నీవు- నేను అన్న ద్వైతం, మనం అనుకుంటున్నదే!

🥀 అపరిణామము కాలాద్య విచ్ఛిన్నమైన సత్యమే శాశ్వతము .అది మార్చదగనిది.

🥀. బంధము, బంధన ముక్తి దేహానికే గాని ఆత్మకు లేవు

🥀. అభ్యాసం ఒక నిరంతర ప్రక్రియ

🥀 వైరాగ్యం ఒక అంతరంగ భావన

🥀ఇవన్నీ సహజస్థితులే..

🥀 ప్రపంచమంతా పరమాత్మ రూపమే.

🥀 నీవు విస్తృతమౌతున్న కొద్దీ పరిపూర్ణత అనుభవం లోకి వస్తుంది.

🥀. దేహమే" అసలు నీవు" కానప్పుడు నీవు కర్తవూ కాదు. నీకు కర్తృత్వమూ లేదు.
 జరుగుతున్న అనేక విషయాలలో ప్రమేయం నీ  నిజానికి శూన్యం. ఉన్నదంతా అనుకోవడం లోనే ఉన్నది. ఇటువంటి భావనే కర్మయోగం.కర్మలన్నింటికి  నీవు కర్తవు కాదు ..కర్మలు జరుగుతూనే ఉంటాయి.
******************

భోక్త లేకుండా బ్రాహ్మణ ఆబ్దికం చేయవచ్చు


(ప్రస్తుత  విపత్కర కొరోనా దృష్ట్యా మరియు 2020నవంబర్ 21 నుండి గురువు మకరమునందు శనితో సంచరించుట వలన 
వాతావరణం లో ఆనారోగ్యసమస్యలు(కలరా లాంటివి) 2021మార్చి మాసాంతము వరకూ భవిషత్తులో రాగల అవకాశాలు ఉన్నందున
(మకరగురవునీచం లో,దక్షిణాయన రవి బలహీనుడుగాను,మకర శని స్వస్థానమునందు బలవంతుడైనందున) 
ఈ వ్యాసమును పోస్ట్ చేస్తున్నాను.
ప్రధానంగా వైదిక వృత్తి లో ఉన్న సభ్యులు అందరూ నన్ను క్షమించవలసినదిగా ప్రార్థిస్తూ🙏🙏🙏

మనలో చాలామందికి ఒక భావన వున్నది అది ఆబ్దికం అంటే ఇద్దరు బ్రాహ్మణులు (భోక్తలు) ఒక బ్రాహ్మణుడుమంత్రం చెప్పాలి అదే ఆబ్దికం అని.

నిజానికి మన హిందూధర్మం చాలా గొప్పది మనం ఎటువంటి స్థితిలో వున్నా మన ధర్మాన్ని పాటించటానికి తగిన మార్గాలు మన మహర్షులు సూచించారు.  కేవలం మనం వాటిని తెలుసుకొని ఆచరించటమే.  ఈ విషయం గూర్చి తరువాత విస్తృతంగా వివరించ ప్రయత్నిస్తాను.

ఇప్పుడు మనం కరోనా భయంతో వున్నాము మనం  బ్రాహ్మణులను ఇంటికి పిలిచి యధావిధిగా ఆబ్దికాన్ని ఆచరించే స్థితిలో లేము అంతే కాక  ఒక బ్రాహ్మణుని కూడా పిలిచి బ్రహ్మార్పణంగా కూడా తంతు జరిపించే పరిస్థితి లేదు. వేరే చోటికి అంటే ఆబ్దిక కేంద్రాలకు, మఠాలకు వెళ్లే పరిస్థితి అస్సలు కాదు బైట తిరిగితే ఏమవుతుందా అని భయం.  మరైతే తత్దిన్నం ఎలా పెట్టాలి.  ఈ విషయమై నేను పలువురుసంప్రదాయము పట్ల అవగాహన ఉన్న పెద్దలను సంప్రదించినాను. దైవానుగ్రహంతో నాకు పరిష్కారం దొరికింది.  నాలా ఇంకా మన మిత్రులు ఇలాగే ఆలోచిస్తూవుంటారని వారి నుద్దేశించి ఇది వ్రాస్తున్నాను.  

దయచేసి పౌరోహిత్యం చేసే బ్రాహ్మణ బంధువులు నన్ను అపార్ధం చేసుకోవద్దని మనవి🙏.

యెవ్వరూ బ్రాహ్మణులు లేకుండా కేవలం కర్త మాత్రమే నిర్వహించే శ్రార్ధ క్రియను దర్శ శ్రార్థం అంటారు.  
ఈ శ్రార్ధ విధి చేయటానికి మీకు ఎలాంటి వైదిక జ్ఞానం అవసరంలేదు. కేవలం మీరు మా పితృదేవతల శ్రార్ధ విధిని చేయాలనేఆసక్తి మరియు శ్రద్ద  ఉంటే చాలు.

చేసే విధానం.
ఈ విధానం కోసం మీరు మీ వాట్సాప్ నంబరు మరియు మీ గోత్ర నామాలు పెడుతూ (ప్రవర) ఇక్కడ కామెంట్ చేయగలరు. మీకు వ్యక్తిగతంగా ఆ క్రియ విధానం తెలియపరచబడును. ఎందుకంటె అవసరం లేనివారికి ఆ విషయాలు తెలపటం ఎందుకని ఈ ఏర్పాటు చేయడమైనది.
ఒక్క విషయం. మీరు ఈ బ్లాగు ఫాలోవర్ కావటం మరవవద్దు.
*************************

"పంచభూతాల - వరం

బ్రహ్మ దేవుడు "పంచభూతాలను" పిలిచి ఒక్కో వరం
కోరుకోమన్నాడు.

🌹వరం కోసం తొందర పడిన "ఆకాశం"🙏 అందరికంటే పైన ఉండాలని కోరింది. ఎవరికీ అందనంత ఎత్తులో నిలిపాడు
బ్రహ్మ.

🌹ఆకాశం మీద కూర్చునే వరాన్ని "సూర్యుడు"🙏 కోరడంతో నేటికీ ఆకాశం మీద విహరిస్తున్నాడు.

🌹వారిద్దరి మీద ఆధిపత్యం చేసే వరమడిగిన "జలం"🙏      మేఘాల రూపంలో మారి... ఆకాశం మీద 
పెత్తనం చలాయిస్తూనే.. కొన్నిసార్లు సూర్యుడుని కప్పేస్తుంది.

🌹పై ముగ్గురినీ జయించే శక్తిని "వాయువు"🙏 కోరడంతో         పెనుగాలులు వీచినప్పుడు రేగే దుమ్ము ధూళికి
       మేఘాలు పటాపంచలవడం....
  సూర్యుడు, ఆకాశం కనుమరుగవడం జరుగుతాయి.

🌹చివరివరకు సహనంగా వేచి చూసింది 🌹భూదేవి🙏
         పై నలుగురూ నాకు సేవచేయాలని కోరడంతో
                  బ్రహ్మ అనుగ్రహించాడు.

🌹అప్పటినుండి ☁️ఆకాశం భూదేవికి గొడుగు పడుతోంది.
         ☀️వేడి, వెలుగు ఇస్తున్నాడు సూర్యుడు.
          🌧వర్షం కురిపించి చల్లబరుస్తోంది జలం.
సమస్త జీవకోటికీ ప్రాణవాయువు అందిస్తున్నాడు వాయువు.

🌹సహనంతో మెలిగి వరం కోరిన భూదేవికి ..
          మిగతా భూతాలు సేవకులయ్యాయి.

🌹సహనవంతులు అద్భుత ఫలితాలు పొందగలరని    నిరూపించడానికి ఈ కథ చాలు.             
             
                 🌹సహనానికి ప్రతిరూపం స్త్రీ🌹

🌹అందుకే భూదేవిని ఓర్పు, సహనాలకు ప్రతిరూపంగా చెప్పారు పెద్దలు.

🌹సహనం అంటే నిగ్రహం పాటించడం. కష్టాల్లో ఉన్నప్పుడు
ఉద్వేగాన్ని దాటవేయడం లేదా వాయిదా వేయడం.

🌹బాధను అధిగమించడమే సహనం. సహనంగా ఆలోచించే వారికి సమస్యలు దూరమవుతాయి.

🌹కొన్ని సార్లు ఏదైనా పెద్ద సమస్య ఎదురైతే చావు వైపు నడిచే బదులు సహనంగా ఆలోచిస్తే పరిష్కారం కనిపిస్తుంది.

🌹సరైన ఆలోచన కలగనప్పుడు అనుభవజ్ఞుల్ని🙏
          ఆశ్రయిస్తే పరిష్కారం దొరుకుతుంది.
                             🍀🌺🍀🌺🍀
🌹ఓం శ్రీ మాత్రే నమః🙏
*******************

హరితాళిక గౌరీ వ్రతం



సైకత (ఇసక) లింగపూజ
ఈవ్రతాన్ని చేసే అమ్మవారు శివుడిని పొందింది.
హరితాళిక వ్రతం , సువర్ణగౌరీ వ్రతం : భాద్రపద శుక్ల పక్ష తదియనాడు ’ హరితాళిక వ్రతం’ లేదా ’ సువర్ణb గౌరీ వ్రతం ’ ’పదహారు కుడుముల తద్ది’ ఆచరిస్తారు. శివపార్వతులను పూజించి, పదహారు కుడుములను తయారుచేసి నైవేద్యంగా సమర్పించవలెను. ఈ పూజను కన్యలు పాటించడంవల్ల వారికి మంచి భర్త లభిస్తాడు. ముత్తయిదువలు పాటించడంవల్ల వారి సౌభాగ్యం అభివృద్ధి చెందుతుందని శాస్త్ర వచనం.
హరితాళిక వ్రతం విశిష్టత
కైలాస శిఖరమందు పార్వతి ఒకనాడు పరమశివుడిని ఇలా అడిగింది “స్వామీ! తక్కువ శ్రమతో, ధర్మాచరణతో ఎవరు నిను భక్తిక్షిశద్ధలతో సేవిస్తారో వారికెలా ప్రసన్నుడవౌతావో తెలుపుమని ప్రార్థించింది. అంతేకాక, జగవూత్పభువైన మీరు నాకు యే తపోదాన వ్రతమాచరించుటచే లభించారు”అని అడిగింది. ప్రసన్నవదనంతో పరమశివుడు ‘‘దేవీ! వ్రతాల్లోకి చాలా ఉత్తమమైంది, అత్యంత రహస్యమైన వ్రతమొకటున్నది. దాన్నెవరాచరించినా నేను వారికి వశుడనైతాను. భాద్రపద శుక్లపక్షంలో హస్తనక్షవూతంతో కూడిన తదియయందీ వ్రతాన్నాచరించినవారు సర్వపాప విముక్తులవుతారు. ‘‘దేవీ! నీవు నీ చిన్ననాట హిమాలయాల్లో ఈ మహా వ్రతాన్ని ఎలా ఆచరించాలో చెబుతాను. విను!” అన్నాడు.

భూలోకమున వివిధ పక్షులతో, విచిత్ర మృగాలతో మంచుచేత కప్పబడి బహుసుందరమైన హిమవత్పర్వతము కలదు. హిమవంతుడా ప్రాంతానికి ప్రభువు. నీవాతని కూతురువు. చిన్నతనం నుంచే శివభక్తురాలవు. యుక్తవయసు వస్తున్న నీకు వరుడెవరగునా?యని హిమవంతుడాలోచించగా, త్రిలోక సంచారి నారద మునీశ్వరులొకనాడు మీ తడ్రి వద్దకు వచ్చాడు. అర్ఘ్య పాద్యాలందించి మీ తండ్రి నిను చూపి, ఈ కన్యనెవరికిచ్చి వివాహం చేయవపూను? తగిన వరుడెవరని నారదుని అడిగినాడు. వెంటనే నారదుడు ‘ఓ గిరిరాజా! నీ కన్యారత్నమున కన్నివిధముల యోగ్యమైనవాడు బ్రహ్మాదిదేవతలలో విష్ణువు. అతడు పంపితేనే నీ వద్దకు వచ్చానన్నాడు. సంతోషంతో హిమవంతుడు మునీందరా ఆ విష్ణుదేవుడే స్వయంగా ఈ కన్యను కోరి నినుపంపాడు కనుక గౌరవించి, అతనికిచ్చి వివాహం చేస్తానని వెంటనే తెలుపుమన్నాడు. నారదుడందుకంగీకరించి బయలుదేరాడు.

హిమవంతుడానందంతో భార్యాపిల్లలకావిషయం తెలిపాడు. కుమార్తెను దగ్గరకు పిలిచి “ఓ పుత్రీ! గరడవాహనునితో నీ వివాహం నిశ్చయం చేస్తున్నానని” తెలిపెను. ఆ మాటలు విని పార్వతి తన మందిరంలోకి వెళ్లి పొర్లిపొర్లి దుఃఖించసాగింది. ఇది చూసిన పార్వతి ప్రియసఖి ఆమె మనసా పెండ్లికి సుముఖంగా లేదని తెలుసుకుని స్నేహితురాలికొక ఉపాయం చెప్పింది. నీ త్రండి జాడ తెలియని అడవిలోకి మనమిద్దరం కొంతకాలం పారిపోదామని చెప్పింది. ఆమె అనుమతితో ఇద్దరూ వనవూపాంతానికి ప్రయాణమైనారు. కుమార్తె కనిపించుటలేదని గిరిరాజు హాహాకారాలు చేసి, ఏడ్చి మూర్ఛిల్లాడు. నీవు పరమశివుని గూర్చి ఘోర తపస్సు చేశావు. అడవిలో దొరికిన ఫలాలతో, పుష్పాలతో, పత్రాలతో అనేక విధాల పూజించావు. నీభక్తికి మెచ్చి సైకత లింగాన్ని (ఇసుక) చేసుకొని పూజిస్తున్న నీకు భాద్రపదశుక్ల తదియనాడు నేను ప్రసన్నుడైనాను. చెలికత్తెచే హరింపబడినావు కనుక ఈ వ్రతాన్ని ‘‘హరితాళిక వ్రతం” అంటారు. ఆరోజు శివరావూతివలె ఉపవసించి, రాత్రంతా జాగరణతో ఎవరైనా పరమశివుని సైకత లింగాన్ని పత్రపుష్పాలతో పూజిస్తారో వారికి సకల సౌభాగ్యాలు, సంపత్తులు కలుగుతాయి” అని పరమేశ్వరుడు పార్వతితో చెప్తాడు. 16 ఉత్తరేణి ఆకులతో 16 వరుసల దారాన్ని 16 గ్రంథులు ముళ్లు వేసి తోరానికి గ్రంథిపూజచేసి భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం నోచుకోవాలి. తెల్లవారి వినాయక చవితిరోజు దంపతులకు భోజ, వస్త్ర, దక్షిణ తాంబూలాలతో పార్వతీ పరమేశ్వరులుగా భావించి పూజించాలి. ముత్తైదువలంతా చవితి తెల్లవారుఝామున మేళతాళాలతో సైకతలింగరూపంలోని సాంబశివుని దగ్గరలోని జలాశయంలో నిమజ్జన చేయాలని శివుడు పార్వతికి తెలియజేశాడు.
**********************

జీవిత సహచరి

నీ జీవిత సహచరి ఎవరు?
అమ్మనా?
నాన్ననా?
భార్యనా?
భర్తనా?
కొడుకా?
కూతురా?
స్నేహితులా?
బందువులా?
లేదు.ఎవరూ కాదు.!
నీ నిజమైన సహచరి ఎవరో తెలుసా?
నీ శరీరమే!
ఒక్కసారి నీ శరీరం స్పందించడం ఆగిపోతే ఎవ్వరూ నీ దగ్గర ఉండరు గాక ఉండరు!!
నువ్వు అవునన్నా?కాదన్నా?ఇది కఠిక నిజం.!!!
నీవూ నీ శరీరం మాత్రమే జననం నుండి మరణం దాకా కలిసి ఉంటారు.
నీవేదైతే నీ శరీరం కొరకు భాద్యతగా ఏ పనైతే చేస్తావో అదే నీకు తప్పక తిరిగి వస్తుంది.
నీవెంత ఎక్కువ శ్రద్ధగా శరిరాన్ని బాగా చూసుకుంటావో.,నీ శరీరం కూడా నిన్ను అంతే శ్రద్ధగా బాగా చూసుకుంటుంది.
నీవేమి తినాలి?
నీవేమి చేయాలి?
ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి?
నీవెంత విశ్రాంతి తీసుకోవాలి?
అనేవి మాత్రమే నీ శరీరం స్పందనను నిర్ణయిస్తాయి.
గుర్తించుకో.!
నీ శరీరమొక్కటే నీవు జీవిస్తున్న చిరునామా.!!
నీ శరీరమే నీ ఆస్థి.,సంపద.
వేరే ఏదీ కూడా దీనికి తులతూగదు.
నీ శరీరం నీ భాద్యత.!
ఎందుకంటే?
నీవే నిజమైన సహచరివి.!
కనుక జాగ్రత్తగా ఉండు.
నీ గురించి నువ్వు జాగ్రత్త తీసుకో.
డబ్బు వస్తుంది.వెళ్తుంది.
బందువులు.,స్నేహితులు శాశ్వతం కాదు.
గుర్తుంచుకో.!
నీ శరీరానికి ఎవరూ సహాయం చేయలేరు.
ఒక్క నీవు తప్ప.!
ఊపిరితిత్తులకు- ప్రాణాయామం.
మనసుకు-ద్యానము.
శరీరానికి-యోగా.
గుండెకు-నడక.
ప్రేగులకు-మంచి ఆహారం.
ఆత్మకు-మంచి ఆలోచనలు.
ప్రపంచానికి-మంచి పనులు.
ఆంగ్లరచనకు తెలుగు అనువాదం.

33జిల్లాల ఉపాధ్యాయులు
ఉపాధ్యాయులకు సంబంధించిన సత్వర సమాచారం కోసం ఈ క్రింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.👇


https://t.me/joinchat/P3Akqk28ymKTHSx9LKIXcA
*****************

ముహూర్తానికి ప్రాధాన్యత

1. మాంగళ్య ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం..
ఫలితం: దీనివలన వచ్చే నష్టం మనోవైకల్యం,
చిత్తచాంచల్యం, అన్యోన్యత లేకపోవటం..
భార్యా భర్తలు మంచి సంతానం పొందకపోవటం..!

2. జీలకర్ర బెల్లం పెట్టాక వధువరులు ఒకరి కళ్లలో
ఒకరు చూపులు నిలపకపోవటం.. -
ఫలితం: దీనివల్ల కలిగే నష్టం వారి మధ్య ప్రేమ లోపించటం..!
(వీడియోలు ఫోటోల వైపు మాత్రమే చూడటం)
(పోటోలు తీపి జ్ఞాపకాలే కానీ ధర్మం ఆచరించాకే మిగతావి)

3. ఫోటోలు వీడియోలపై తమ దృష్టంతా ఉంచటం..
ఫలితం: దీనివలన కలిగే నష్టం సంస్కారం లోపించటం...!

4. తలంబ్రాల కు బదులు థర్మాకోల్ మరియు రంగుల గుండ్లు పోసుకోవటం..
ఫలితం: దీనివలన బంధు ద్వేషం, ఆర్థిక ఇబ్బదులు...!

5. బంధువులు చెప్పులు వేసుకొని కళ్యాణ మండపం లోనికి
రావటం వధూవరులని ఆశీర్వదించటం..
ఫలితం: దీనివలన మంటపంలో ఉండే దేవతలు వెళ్లిపోయి
జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనటం..!

6. బఫే భోజనాలు..
ఫలితం: దీనివలన అన్నదాన ఫలితం పొందక పోవటం.!

7. వేదమంత్రాలు మైకుల్లో వినకుండా వాటి స్థానంలో సినిమా పాటలు వినటం..
ఫలితం: దీనివలన దైవ కటాక్షం దూరమవ్వటం..!

ఇవేకాక ఇంకా చాలా పొరపాట్లు ఉన్నాయి.
అవన్నీ గ్రహించి శాస్త్రీయ విధానంగా వివాహం జరుపుకొని
భగవంతుడి కృపకు పాత్రులై మంచి జీవితం గడుపుతూ మంచి సంతానం పొంది పదిమందికీ ఆదర్శంగా నిలవండి....

అందరికి చెప్పండి, చెప్పకపోతే తప్పు, చెప్పినా వాడు పాటించక పోతే వాడి కర్మ. ఇవి శాస్త్రం లో ప్రతి పనీ ఒక నిర్దుష్ట లక్ష్యం కోసం ఏర్పాటు చేశారు.

వాటిని పాటించకుండా వెర్రి తలలు వేస్తే ఏమి జరుగుతుంది అని, ఆలోచనతో ఒక 15000 మంది దంపతులపై గడచిన 20 సంవత్సరాల నుంచి observe చేస్తున్న ఒక పండితుల టీం చేసిన కృషికి అక్షర రూపం ఈ వ్యాసం. అందరికి అందించండి.

అందరూ హిందూ వివాహ వ్యవస్థ నిర్దేశించిన లక్ష్యం
నెరవేరేటట్లుగా తెలియచెప్పి ఆచరింపచేస్తారని ఆశిస్తూ.🌹

🙏 సర్వేజనా సుఖినో భవంతు 🙏
*******************