24, మార్చి 2025, సోమవారం

తల్లిదండ్రులకు సేవచేయాలని

 అసలు సనాతనధర్మం సంబంధించిన విషయ జ్ఞానాన్ని పొందండి...

మొట్టమొదటి సనాతన ధర్మం ఏమిటో మార్కండేయుడు చెప్పాడు...తల్లిదండ్రులకు సేవచేయాలని ...అది మొదటి విషయము...ఆ ధర్మానికి యముడు సైతం కట్టుబడియుండినాడు.

రెండవ సనాతన ధర్మంలో రాముడు వైరాగ్య జ్ఞానాన్ని ప్రసాదించాడు. ప్రతి వ్యక్తి ప్రతిరోజు రెండుగటల సమయాన్ని వేదాలు ఉపనిషత్తులు రామాయణ మహాభారతాలు , భగవత్గీత , జ్ఞానవాశిష్టం , యోగ వాశిష్టాలు , సాంఖ్యాలు , స్మృతులు వంటివి అభ్యసనం చేయాలి...ఇవి ప్రతియొక్కరు అనుసరించండి.

తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, సంతానాన్ని ఎలా పెంచాలి , భార్యతో ఎలా ఉండాలి , భర్తతో ఎలా మెలగాలి , ఇరుగుపొరుగు లతో ఎలా ఉండాలి, గురువులతో ఎలా ఉండాలి , బంధు మిత్రులతో ఎలా ఉండాలి , సోదర సోదరీ వర్గముతో ఎలా ఉండాలి...రాజ్యాన్ని ఏలే వారితో ఎలా మెలగాలి ..ఇలాంటి కోకొల్లలు సనాతన ధర్మం వేల సంవత్సరాల క్రితమే తెలియచేసింది. విద్యా విధానంలో పెద్దబాలశిక్షలో తెలిపిన సమాచారాన్ని ఖచ్చితంగా పాఠ్యశాలల్లో అమలు పరచాలి అని ఏదయినా చట్టం ఉంటే మంచిది.

గరుడ పురాణం_*25వ

 *గరుడ పురాణం_*25వ భాగం*



_*శ్రీ గోపాలదేవుని పూజ - శ్రీధరపూజ త్రైలోక్యమోహన మంత్రం:*_


_ఋషులారా! నేనిపుడు భోగమోక్షదాయకాలైన విష్ణురూప దైవతములు గోపాల, శ్రీధరుల పూజా విధానాన్ని వినిపిస్తాను. ముందుగా పూజ కొఱకొక మండలాన్నేర్పాటు చేసి దాని ద్వార ప్రదేశంలో గంగాయమునలనూ, బ్రహ్మ యొక్క శక్తులైన ధాత, విధాతలనూ పూజించాలి. తరువాత లక్ష్మి, శంఖం, పద్మనిధి, శారంగధనువు, శరభాలను పూజించాలి. ఆ తరువాత తూర్పు దెసలో భద్ర, సుభద్రలకూ, దక్షిణ దిశలో చండ ప్రచండులకూ, పడమటి దిక్కున బల, ప్రబలులకూ, ఉత్తరం వైపున జయ విజయులకూ పూజలు చేయాలి. పిమ్మట నాలుగు ద్వారాలలో క్రమంగా లక్ష్మి, గణపతి, దుర్గ, సరస్వతమ్మలను పూజించాలి._


_*మండలం ఆగ్నేయాది కోణాల్లో పరమ భాగవతోత్తముడైన నారదునీ, సిద్ధులనూ, గురుగ్రహాన్నీ, నలకూబరునీ స్థాపించి పూజించాలి. తూర్పు వైపు విష్ణువునీ విష్ణుశక్తినీ అర్చించాలి. మండలంలో విష్ణు పరివారాన్ని స్థాపించి పూజించాలి. మండలమధ్యంలో శక్తి కూర్మ, అనంత, పృథ్వి, ధర్మ, జ్ఞాన, వైరాగ్య మూర్తులకు ఆగ్నేయాది కోణాల్లో పూజలు చేయాలి. వాయవ్య కోణంలోనూ ఉత్తర దిశలోనూ ప్రకాశ, ఐశ్వర్యాలను పూజించాలి.*_


_*"గోపీజన వల్లభాయ స్వాహా "*_ 

_ఇది గోపాల మంత్రం. ఈ మంత్రాన్ని జపిస్తూ మండలంలో తూర్పుతో మొదలెట్టి క్రమంగా ఎనిమిది వైపులా కృష్ణపత్నులైన సుశీల, జాంబతి, రుక్మిణి, సత్యభామ, సునంద, నాగ్నజితి, లక్షణ, మిత్రవిందలను స్థాపించి ఆ తరువాత వారిని పూజించాలి. వెంటనే శ్రీ గోపాలదేవుని శంఖ, చక్ర, గద, పద్మ, ముసల, ఖడ్గ, పాశ, అంకుశ, శ్రీవత్స, కౌస్తుభ, ముకుట, వనమాలాది చిహ్నాలను పూజించాలి. పిమ్మట ఇంద్రాది ధ్వజపాలక దిక్పాలకునూ, విష్వక్సేనునీ, లక్ష్మీసహిత శ్రీకృష్ణ భగవానునీ అర్చించాలి._


_*గోపీ జన వల్లభ మంత్రాన్ని జపించి, ధ్యానించి, సాంగోపాంగంగా ఆయన పూజను పై విధంగా చేసే వారికి సర్వాభీష్ట సిద్ధి కలుగుతుంది.*_


_*త్రైలోక్యమోహన శ్రీధరీయ మంత్రం :*_


_ఓం శ్రీం (లేదా శ్రీః) శ్రీధరాయ త్రైలోక్య మోహనాయ నమః ।_


_క్లీం పురుషోత్తమాయ త్రైలోక్య మోహనాయ నమః |_


_ఓం విష్ణవే త్రైలోక్య మోహనాయ నమః ।_


_ఓం శ్రీం హ్రీం క్లీం త్రైలోక్యమోహనాయ విష్ణవే నమః ।_


_*ఈ మంత్రం సమస్త ప్రయోజనాలనూ సంపూర్ణంగా కలిగిస్తుంది.*_


_మహర్షులారా! ఇపుడు శ్రీధర భగవానుని అనగా విష్ణుదేవుని మంగళమయమైన పూజా విధానాన్ని వర్ణిస్తాను. సాధకుడు ముందుగా ఈ క్రింది మంత్రాలతో అంగన్యాసమును చేయాలి._


ఓం శ్రాం హృదయాయ నమః, 

ఓం శ్రీం శిరసే స్వాహా, 

ఓం శ్రూం శిఖాయై వషట్, 

ఓం శైం కవచాయ హుం, 

ఓం శ్రౌం నేత్రత్రయాయ వౌషట్, 

ఓం శ్రః అస్త్రాయ ఫట్.


_*అనంతరం శంఖ, చక్ర, గదాది స్వరూపిణీ ముద్రలను ప్రదర్శించి వాటిని ధరించి యున్న ఆత్మస్వరూపుడైన శ్రీధర భగవానుని ఇందాకటి మంత్రంతో ధ్యానించాలి. స్వస్తిక లేదా సర్వతో భద్రమండలాన్ని సిద్ధం చేసి శ్రీ భగవానుని ఆసనాన్ని పూజించి ఆ స్వామిని "ఓం శ్రీధరాసన దేవతా ఆగచ్ఛత " అని ఆవాహనం చేయాలి.*_


_*ఈ క్రింది మంత్రాలతో ఆసన పూజ చేయాలి._


_*ఓం సమస్త "పరివారాయాచ్యుతా సనాయ నమః " అపై*_


_ఓం ధాత్రే నమః, ఓం విధాత్రే నమః లతో మొదలెట్టి ధాతా, విధాతా గంగాది దేవతలను ఈ క్రింది మంత్రాలతో పూజించాలి._


ఓం గంగాయై నమః, 

ఓం యమునాయై నమః, 

ఓం ఆధార శక్ష్యై నమః, 

ఓం కూర్మాయ నమః, 

ఓం అనంతాయ నమః, 

ఓం పృథివ్యై నమః, 

ఓం ధర్మాయ నమః, 

ఓం జ్ఞానాయ నమః, 

ఓం వైరాగ్యాయ నమః, 

ఓం ఐశ్వర్యాయ నమః, 

ఓం అధర్మాయ నమః, 

ఓం అజ్ఞానాయ నమః,

ఓం అవైరాగ్యాయ నమః, 

ఓం అనైశ్వర్యాయ నమః, 

ఓం కందాయ నమః, 

ఓం నాలాయ నమః, 

ఓం పద్మాయ నమః, 

ఓం విమలాయై నమః, 

ఓం ఉత్కర్షిణ్యై నమః, 

ఓం జ్ఞానాయై నమః, 

ఓం క్రియాయై నమః, 

ఓం యోగాయై నమః, 

ఓం ప్రహ్ వ్యై నమః, 

ఓం సత్యాయై నమః, 

ఓం ఈశానాయై నమః, 

ఓం అనుగ్రహాయై నమః.


మరల శ్రీధర దేవుని ఇలా అంటూ ఆవాహన చేసి పూజ చేయాలి.


_*ఓం హ్రీం శ్రీధరాయ త్రైలోక్య మోహనాయ విష్ణవే నమః ఆగచ్ఛ ।*_


_ఈ పూజానంతరము లక్ష్మీదేవిని ఓం శ్రియై నమః అంటూ పూజించాలి. ఆ తరువాత_


_*ఈ క్రింది మంత్రాలతో షడంగ న్యాసం చేయాలి.*_


ఓం శ్రాం హృదయాయ నమః,

ఓం శ్రీం శిరసే నమః,

ఓం శ్రూం శిఖాయై నమః,

ఓం శైం కవచాయ నమః,

ఓం శ్రౌం నేత్రత్రయాయ నమః,

ఓం శ్రః అస్త్రాయ నమః.


_అనంతరము స్వామివారి ఆయుధాలనూ ఆభరణాలనూ అవరోధ వ్రాతము (పరివారము)నూ ఈ మంత్రాలతో అర్చించాలి._


ఓం శంఖాయ నమః, ఓం పద్మాయ నమః, ఓం చక్రాయ నమః, ఓం గదాయై నమః, ఓం శ్రీవత్సాయ నమః, ఓం కౌస్తుభాయ నమః, ఓం వనమాలాయై నమః, ఓం పీతాంబరాయ నమః, ఓం బ్రహ్మణే నమః, ఓం నారదాయ నమః, ఓం గురుభ్యో నమః, ఓం ఇంద్రాయ నమః, ఓం అగ్నయే నమః, ఓం యమాయ నమః, ఓం నిరృతయే నమః, ఓం వరుణాయ నమః, ఓం వాయవే నమః, ఓం సోమాయ నమః, ఓం ఈశానాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం బ్రహ్మణే నమః, ఓం సత్త్వాయ నమః, ఓం రజసే నమః, ఓం తమసే నమః,

ఓం విష్వక్సేనాయ నమః !


_*ఈ దేవస్వరూపాలను షడంగన్యాస, అస్త్రపూజలతో తృప్తిపఱచిన పిమ్మట విష్ణుభగవానుని మూర్తిని అభిషేకించి వస్త్ర యజ్ఞోపవీతాలతో సింగారించి గంధ పుష్ప ధూప దీపాలను నివేదించి ప్రదక్షిణ చేయాలి. నైవేద్యం పెట్టి, మూలమంత్రాన్ని నూట యెనిమిదిమార్లు జపించి దాని ఫలాన్ని కూడా శ్రీధర భగవానునికి సమర్పించి వేయాలి.*_


_ఒక ముహూర్తం పాటు కనులు మూసుకొని సాధకుడు తన హృదయ దేశంలో పరిశుద్ధ స్ఫటిక మణి సమానకాంతులతో విరాజిల్లువాడు, కోట్ల సూర్యుల ప్రభలతో వెలుగొందువాడు, ప్రసన్నముఖుడు, సౌమ్యముద్రలోనుండువాడు, ధవళ మకర కుండలాలతో శోభిల్లువాడు, ముకుటధారి, శుభలక్షణ సంపన్నములైన అంగములు గలవాడు, వన మాలాలంకృతుడునగు శ్రీధర దేవుని పరబ్రహ్మ స్వరూపాన్ని ధ్యానించాలి. తరువాత ఈ క్రింది స్తోత్రాన్ని చదవాలి._


శ్రీనివాసాయ దేవాయ నమః శ్రీపతయే నమఃl 

శ్రీధరాయ సశారంగాయ శ్రీప్రదాయ నమో నమః ॥ 

శ్రీవల్లభాయ శాంతాయ శ్రీమతే చనమో నమఃl 

శ్రీ పర్వత నివాసాయ నమః శ్రేయస్కరాయ చ ॥ 

శ్రేయసాం పతయే చైవ హ్యాశ్రయాయ నమో నమఃl శరణ్యాయ వరేణ్యాయ నమో భూయో నమో నమః ll 

స్తోత్రం కృత్వా నమస్కృత్య దేవదేవం విసర్జయేత్ ll 


_*విష్ణువు శివునికి ఈ విధంగా ఉపదేశించాక శివుడు అత్యంత దుస్తరమైన భవసాగరాన్ని సులువుగా దాటించే పూజా విధానమేదైనా వినిపించుమని అభ్యర్థించాడు. దానికి విష్ణువు ఇలా చెప్పాడు (అని సూతుడు శౌనకాది మహామునులకు చెప్పసాగాడు)*_

*శ్రీ అమరలింగేశ్వర స్వామి*

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

    *శ్రీ అమరలింగేశ్వర స్వామి*

              *అమరావతి*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*పంచారామాలలో మొట్టమొదటిది ‘అమరారామం’.* 


*అమరారామము,కొమరారామమ, భీమారామము, ద్రాక్షారామము, క్షీరారామములలో మొదటిది.*


*ఇక్కడ 'అమరేశ్వరస్వామి' కొలువై ఉన్నారు. ఇక్కడ స్వామి ముఖం ‘అఘోర’ రూపంలో ఉంటుంది. అమ్మవారు ‘బాల చాముండేశ్వరి’. ఆమె శాంతి స్వరూపురాలిగా ఇక్కడ కొలవై ఉన్నారు.*


*శంకరుడులో ‘శం’ అంటే శుభాన్ని, ‘కరుడు’ అంటే కలిగించే వాడనే అర్థం దాగుంది.*


*స్థల పురాణం ప్రకారం తారకాసుర సంహారం జరిగినప్పుడు కుమారస్వామి తారకుని కంఠంలో ఉన్న శివలింగాన్ని చేధించగా ఏర్పడిన అయిదు శకలాల్లో (ముక్కలు) పెద్దది, మొదటి శకలం పడిన చోటు ఈ అమరారామం.*


*ఇక్కడ అభించిన శాసనాలలో అమరావతి పూర్వనామం ధష్టుకడ (ధరణికోట) లేక ధాన్యకటకం అన్న పేర్లే కాని అమరావతి అన్న పేరు కన్పించదు. అమరావతిలో ఒకప్పడు బౌద్ధ స్తూపం వుండేది. అది అద్భుత శిల్పకళకు పుట్టినిల్లు. మరుగున పడిపోయిన ఆ స్తూపపు అవశేషాలను వెలికి తీసి ఆంగ్లేయులు చాలవరకు లండన్ మ్యూజియానికి తరలించారు. అమరావతి శిల్పాలు ప్రపంచ ఖ్యాతిని పొందాయి. మిగిలిన కళాఖండాలను ఇక్కడ నెలకొల్పిన మ్యూజియంలో భద్రపరచి ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ బుద్ధ భగవానుని ఆస్థికావశేషాలున్న స్ఫటికపు భరిణె లభించింది. భారతీయ శిల్పకళకు అమరావతి కళ శిరోభూషణమని కళాకోవిదులు వ్రాశారు. అమరావతి కళ తనదైన ఒక బాణీని ఏర్పరచుకొని అమరావతి శిల్పరీతిగా ప్రపంచ ప్రస్థిది పొందింది.*


*ప్రాచీన బౌద్ధ వాజ్మయములో విశిష్ఠ స్థానము పొందిన 'ఆంధ్రపురి'యే ధాన్యకటకం.*


*కృష్ణా నదీ తీరంలో వెలసిన మహా మహిమాన్విత పుణ్యక్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో అమరేశ్వర లింగాన్ని దేవేంద్రుడు ప్రతిష్టించాడు. అందువల్లే ఇక్కడి శివయ్య అమరేశ్వరుడయ్యాడు. ఈ క్షేత్ర మహత్యం గురించి స్కంధ, బ్రహ్మ, పద్మ పురాణాలలో చెప్పారు.*


*ఈ ఆలయానికి మూడు ప్రాకారాలున్నాయి. నాలుగు దిక్కులా నాలుగు ధ్వజ స్తంభాలు వున్నాయి.  ఇక్కడ ప్రణవేశ్వర, అగస్తేశ్వర, కోసలేశ్వర మొదలగు శివలింగాలే కాక ఇంకా అనేక దేవతా మూర్తులున్నారు. రెండవ ప్రాకారంలో వున్న కాలభైరవుడు ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడు. మూడవ ప్రాకారంలో నైరుతిలో కాశీ ,శ్రీశైల మల్లికార్జునుడు, వాయువ్య దిశలో విశ్వేశ్వరుడు, ఈశాన్యంలో చండీశ్వరుడు, ఆగ్నేయంలో శ్రీకాళహస్తీశ్వరుడు ప్రతిష్ఠింపబడ్డారు.*


*భౌగోళికంగా ఆ పుణ్య క్షేత్రాలు అమరావతికి ఆ దిక్కుల్లోనే వుండటం గమనించదగ్గ విషయం.*


*శివ కేశవులకు బేధము లేదని నిరూపిస్తూ వేణు గోపాల స్వామి ఆలయం కూడా ఈ ప్రాకారంలో వుంది. దక్షిణ ముఖంగా ముఖ మండపం, తూర్పు ద్వారానికి ఎదురుగా కృష్ణవేణి ప్రవాహం ఉంది. దీనినే "‘పంచాయతన క్షేత్రం"’ అంటారు.*


*రాక్షసులకు మరియు దేవుళ్ళకు జరిగిన యుద్ధములో దేవుళ్ళు ఓడిపోవడంతో పరమ శివుడిని ఆశ్రయించగా అప్పుడు దేవతామూర్తులను ఈ అమరావతిలో ఉంచి రాక్షసులను ఈ ప్రాంతములోనే వధించాడు. అమరులను ఈ ప్రదేశంలో కాపాడాడు కనుక  అమరావతి అని పిలువబడుతుంది.*


*ఈ అమరావతికి ఒక పురాణ కథ కూడా వుంది. దేవేంద్రుడు అహల్యా జారుడై తత్పాప పరిహారార్ధం ఇక్కడ శివలింగమును ప్రతిష్ఠించాడని దేవతల ప్రభువైన సురేంద్రుని చేత ప్రతిష్టించబడినది గాబట్టి ' అమరావతి ' నామము సార్ధకంగా ప్రసిద్ధమయినది అని అంటారు. ఈ శివలింగం ఒకానొక కాలంలో ఆ శ్రీరామచంద్రుని చేత పూజించబడ్డ శివలింగంగా ప్రసిద్ధిగాంచింది.*


*అమరావతి ఆలయంలో లింగం చాల పొడవుగా వుంటుంది. ఇక్కడ ప్రచారంలో వున్న కథ ప్రకారం ఈ లింగం 'పెరుగుతూ వుండేదట. అందువలన ఎప్పటికప్పుడు గుడిని పెంచవలసి వస్తుండేది. చివరకు విసుగుచెంది అర్చకులలో వొకరు స్వామిపై ఒక మేకు కొట్టారు. అంతటితో లింగం పెరుగుదల ఆగిందట. దీనిని నిదర్శనంగా తెల్లని లింగంపై ఎర్రని (నెత్తుటి) చారికలను చూపిస్తారు. మేకు కొట్టినప్పుడు కారిన నెత్తుటి చారికలన్నమాట. ఈ లింగం 3 అడుగుల చుట్టుకొలతతో 60 అడుగుల ఎత్తు వుంటుంది.*


*ఇక్కడ కొలువుతీరిన అమ్మవారు బాలచాముండిక.  ఈ దేవేరి శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణిపబడుతోంది. భక్తుల ఈతి బాధలనుండి విముక్తి కలిగించి మనశ్శాంతిని, సుఖసంతోషాలను ప్రసాదించే చల్లని తల్లి అని భక్తులు భావిస్తారు.ఈ ప్రాంతాన్ని దర్శించినంత మాత్రానే మనలోనూ నూతన శక్తి ప్రవేశిస్తుందని భక్తుల నమ్మకం.*


*త్రిలోక ప్రసిద్ధమైన ఈ అమరేశ్వర తీర్థం ఉత్తమమైంది. అమరేశ్వరస్వామిని దర్శించడం వలన వేయి గోవులను దానమిచ్చిన ఫలితంతో పాటు, పునర్జన్మ ఉండదని పురాణ ప్రవచనం. ఇక్కడ శివుణ్ణి ప్రణవేశ్వరుడు, అగస్తేశ్వరుడు, కోసలేశ్వరుడు, సోమేశ్వరుడు, పార్థివేశ్వరుడు అనే నామాలతో కీర్తిస్తున్నారు. భక్తి శ్రద్ధలతో మూడు రోజులు వరుసగా కృష్ణానదిలో స్నానం చేసి అమరలింగేశ్వరుడిని పూజించిన వారు మరణానంతరం శివ సాన్నిద్యం పొందుతారని భక్తుల విశ్వాసం.*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

శ్రీమద్ భాగవతం*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(83వ రోజు)*

   *(క్రితం భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

            *కృష్ణావతారం* 

*చిన్ని కృష్ణుడు - పూతన సంహారం*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*నందగోపుడు బంధువు.అతన్ని పలకరించేందుకు వచ్చాడు వసుదేవుడు. వసుదేవుణ్ణి చూస్తూనే నందుడు లేచి కౌగిలించుకున్నాడు. కంసుని చెరలో దేవకీ వసుదేవులు కష్టాలపాలయిన సంగతి తలచుకుని, కన్నీరు పెట్టుకున్నాడు. నందుడు కన్నీరు పెట్టుకోవడం గమనించక ఎటో చూస్తూ ఆందోళన చెందసాగాడు వసుదేవుడు.*


*అతని ఆందోళనను గమనించి ఆశ్చర్యపోయాడు నందుడు. కన్నీరు తుడుచుకుని అడిగాడు.‘‘ఏమైంది వసుదేవా? ఎందుకలా ఆందోళనగా ఉన్నావు?’’ ‘‘గోకులానికి ఏదో కీడు మూడనున్నట్టుగా అపశకునాలు తోస్తున్నాయి. దయచేసి నువ్వు తొందరగా వ్రేపల్లెకు బయల్దేరు.’’ చెప్పాడు వసుదేవుడు. అతని మాటను కాదనలేదు నందుడు. వెంటనే పరివారంతో వ్రేపల్లెకు బయల్దేరాడు.*


*పూతన సంహారం:-*


*కంసుని అనుచరి పూతన. రాక్షసి. పిల్లలను చంపుతుందది. దానిని ‘పూతిక’ అని కూడా అంటారు.*


*ఈ పూతన పూర్వజన్మలో బలి చక్రవర్తి కూతురు. పేరు రత్నమాల. శ్రీహరి వామనమూర్తిగా వచ్చి, బలిచక్రవర్తిని దానం అడిగినప్పుడు చూసిందతన్ని. బాలవటువు బాగున్నాడని ముచ్చటపడింది. పుత్రప్రేమ కలిగిందామెకు. ఇలాంటి బాలుడికి చన్నుకుడిపి, పాలు తాగించే అదృష్టానికి నోచుకుంటే బాగుండుననుకున్నది. ఆ కోరికను గ్రహించిన శ్రీహరి, వచ్చే జన్మలో ఆమె కోరిక తీర్చాలనుకున్నాడు.* 


*ఫలితంగానే పూతన జన్మించింది. కంసుని ఆజ్ఞమేరకు పూతన పల్లెలు, పట్టణాలు తిరుగుతూ కనిపించిన శిశువునల్లా చంపుతూ వస్తోంది. వ్రేపల్లెకు చేరుకుంది.*


*రాక్షసి రూపంలో గాక చక్కని స్త్రీరూపం ధరించి మరీ చేరుకుందక్కడికి. పట్టుచీరె కట్టుకుంది. మల్లెపూలు పెట్టుకుంది. చెవులకు అద్భుతమయిన కుండలాలు ధరించింది. నడుస్తోంటే కుండలాలు ఊగుతూ కాంతులు విరజిమ్ముతోంటే చూసిన ప్రతి ఒక్కరూ పూతనను మామూలు స్త్రీ కాదు, ఎవరో దివ్యాంగన అనుకున్నారు. ఊరంతా తిరిగింది పూతన. ఆఖరికి నందుడి ఇంటికి చేరింది.*


*చిన్ని కృష్ణుణ్ణి చూసిందక్కడ. యశోద, రోహిణి అతన్ని ముద్దు చెయ్యడాన్ని చూసి, ముందుకొచ్చింది. చిన్నికృష్ణుడు అప్పుడు ఉయ్యాలలో పడుకుని ఉన్నాడు. వస్తున్నది పూతన అని తెలుసతనికి. ఆమె రాక్షసి అని తెలుసు. అయినా ఏమీ తెలియని వాడిలా కళ్ళుమూసుకుని, పిడికిళ్ళు బిగించి పడుకున్నాడు*


*‘‘పిల్లాడు ముద్దొస్తున్నాడు.’’ అన్నది పూతన. కృష్ణుని బొజ్జనొక్కి చూసింది. మెత్తగా ఉన్నది.‘‘కడుపులో పాలులేవు. ఆకలి మీద ఉన్నాడు.’’ అన్నది.*


*యశోద అనుమతి కోసం చూడలేదు. రోహిణి ఏమంటుందోనని భయపడలేదు. కృష్ణుణ్ణి అందుకున్నది. ఒడిలో పెట్టుకున్నది. ఏడుస్తున్న కృష్ణుణ్ణి ఓదారుస్తున్నట్టుగా ఎత్తి ఆడిస్తూ, తర్వాత పాలు కుడిపేందుకు రవికె ముడి విప్పింది. చిన్నికృష్ణుని నోటికి చన్ను అందించింది. ఆనందాశ్చర్యాలలో ఉన్నారు యశోద, రోహిణి. మంత్రముగ్ధుల్లా ఇద్దరూ వారించలేదామెను. తనపాలలో విషాన్ని నింపుతుంది పూతన. ఆ పాలను తాగితే చాలు, చనిపోతారు పిల్లలు. చాలా మంది పిల్లల్ని అలాగే చంపింది.*


*ఈ కృష్ణుడో లెక్కా అనుకుంది. అయితే అందుకు భిన్నంగా జరిగిందంతా. పూతన పాలనే కాదు, ఆమె ప్రాణాలను కూడా పీల్చేశాడు కృష్ణుడు. బాధను భరించలేకపోయింది పూతన. చన్ను నుంచి చిన్నికృష్ణుణ్ణి వేరు చేసేందుకు ప్రయత్నించింది. వీలుకాలేదు. కృష్ణుడు గట్టిగా పట్టుకున్నాడు.*


*‘‘వదులు కృష్ణా! వదులు’’ అంటూ రోదించింది పూతన. వదల్లేదు కృష్ణుడు. లాగి లాగి ఆఖరికి ఆమె ప్రాణాలను హరించాడు. చెమటలు పట్టిపోయింది పూతన. కాళ్ళూ చేతులూ కొట్టుకుంది. పెద్దగా అరుస్తూ వెల్లకిలా పడిపోయింది. ఆమె అరుపునకు భూమి వణికి పోయింది. కొండలు దద్దరిల్లాయి. ఆకాశం కంపించింది. గ్రహతారకలు ఒక్క క్షణం గతులు తప్పి అంతలోనే సర్దుకున్నాయి. అధోలోకాలు అదిరిపడ్డాయి. దిక్కులు ప్రతిధ్వనించాయి. ఒక్కసారిగా వందలాది పిడుగులు పడ్డట్టుగా వినవచ్చిన ఆ శబ్దానికి వ్రేపల్లెవాసులు మూర్ఛపోయారు. చనిపోయిన మరుక్షణం పూతన తన నిజరూపంతో ప్రత్యక్షమయింది. పెద్దపెద్ద కోరలతోనూ, కొండగుహలంత నాసికారంధ్రాలతోనూ, కొండల్లాంటి కుచాలతోనూ, పాడుబడిన బావుల్లాంటి కళ్ళతోనూ, నీళ్ళింకిన చెరువంతటి కడుపుతోనూ, ఎర్రటిజుట్టుతోనూ పూతన నేల మీద వెల్లకిలా పడడంతో చుట్టుపక్కల ఆరుకోసుల వరకూ ఉన్న చెట్లూ, మానులూ ఫెళఫెళా విరిగిపడ్డాయి. పూతన శవాన్ని చూసి పరుగులు పెట్టారు ప్రజలు. చిన్నికృష్ణుడు మాత్రం ఎలాంటి ఆందోళనా చెందక దాని శరీరం మీద ఆడుకోసాగాడు.*


*జరిగింది చూస్తూ యశోదా, రోహిణీ తదితరులు చాలాసేపటి వరకు మనుషులు కాలేకపోయారు. అచేతనులయ్యారు. తర్వాత తేరుకున్నారు. తేరుకుని పరుగుదీసి, పూతన మీద ఆడుకుంటున్న కృష్ణుణ్ణి అందుకున్నారు.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                  *విరచిత*

         *”శివానందలహరి”*

             *రోజూ ఒక శ్లోకం* 

       *తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*"జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*భ్రమరాంబా పతియైన మల్లికార్జునుని భ్రమరాధిపతిగా నిరూపించి, ఆభ్రమరాధిపతిని, తన మానస కమలమునందు విహరించుమని శంకరులు ఈ శ్లోకంలో వేడు కుంటున్నారు.*


*శ్లోకం : 51*


*భృంగీచ్ఛానటనోత్కటః కరిమదగ్రాహీస్ఫురన్మాధవా*


*హ్లాదోనాదయుతోమహాసితవపుఃపంచేషుణాచాదృతః*


*సత్పక్షస్సుమనోవనేషుస పునస్సాక్షాన్మదీయే మనో*


*రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః !!*


*గమనిక:~*


*ఈ శ్లోకంలోని విశేషణములు అన్నీ భ్రమరాంబాధిపతియైన శ్రీశైల మల్లికార్జునునికీ తుమ్మెదల అధిపతికీ అన్వయించేలా శ్లేషలో కూర్చబడ్డాయి.*


*భావము - వివరణ :~*


*ఈ శ్లోకంలో శంకరులు భ్రమరాధిపతి అనగా గండు తుమ్మెదను పోలిక చేసుకొని, భ్రమరాంబాధిపతియైన శ్రీ శైలవాసియైన ప్రభువు మల్లికార్జునుని వర్ణించారు.*


*భ్రమరాధిపతి(తుమ్మెద)  - ఆడుతుమ్మెద ఇచ్ఛననుసరించి సంచరిస్తుంది. శివుడు  _  భృంగి అనే ప్రమథగణములలోనివాడూ, శివద్వార పాలకుడూ అయిన నందికేశ్వరుని ఇచ్ఛననుసరించి నాట్యము చేస్తాడు.*


*భ్రమరపతి(తుమ్మెద) ఏనుగుల మదజలముగ్రహిస్తుంది. శివుడు గజాసురుని మదాన్ని అణచాడు.*


*తుమ్మెద వసంత ఋతువుచే ఆనందిస్తుంది. శివుడు మాధవుని ద్వారా ఆనందించాడు.*


*తుమ్మెద ఝంకారం చేస్తుంది. ఈశ్వరుడు ప్రణవనాదంతో కూడుకున్న వాడు.*


*తుమ్మెద మిక్కిలి నల్లని ఆకృతి కలది. శివుడు తెల్లని ఆకారం గలవాడు*


*తుమ్మెద భ్రమరాధిపతి. శివుడు భ్రమరాంబకు అధిపతి.*


*తుమ్మెద మన్మథునిచే సహాయంగా స్వీకరింప బడుతుంది. శివుడు మన్మథునిచే బాణ లక్ష్యంగా చేసికోబడ్డాడు.*


*తుమ్మెద అనగా భ్రమరాధిపతి పూలతోటలయందాసక్తి గలవాడు.*


*శివుడు కూడా విష్ణువువలె రక్షణకర్తయే. శివుడు కూడా విష్ణువు వలె అనేకావతారములను ధరించాడు. శివుడు దక్షిణామూర్తిగా అవతరించి, సనకాదులకు జ్ఞానాన్ని ఉపదేశించాడు. యక్షరూపాన్ని ధరించి దేవతల అహంకారాన్ని పోగొట్టాడు. కిరాత రూపం ధరించి బ్రహ్మను శిక్షించాడు, అర్జునునికి పాశుపతాస్త్రం అనుగ్రహించాడు. విష్ణువు అర్చావతారములు ధరించి నట్లుగా శివుడనేక చోట్ల జ్యోతిర్లింగ మూర్తిగా వెలశాడని శాస్త్రములు చెబుతున్నాయి.*


*కాబట్టి అదృష్టవంతులూ, శ్రద్ధ గలవారూ శ్రీశైల మల్లికార్జునుని సేవించి ధన్యులౌతారు.*


*"సర్వః సద్బుద్ధిమ్ ఆప్నోతు " . ప్రతి వ్యక్తికీ శివుణ్ణి పూజించాలనే సద్బుద్ధి కలుగుగాక*


*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

భక్తి మాత్రమే ముఖ్యం!*

 *🙏🏿భక్తి మాత్రమే ముఖ్యం!*

                  

*ఒక్కోసారి మనకు అర్ధం పర్దం లేని ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయ్ . పూజానియమాలు తెల్సుకోవడం మంచిదే, పూజలో దోర్లుతున్న తప్పులను సవరించుకోవడం మంచిదే కాని వాటికోసం పూజనే మానివేయడం తప్పు.* 


*దేవుడు ఎంత కారుణ్య మూర్తో చూడండి …*


*భక్తకన్నప్ప పెట్టిన నైవేద్యం ఏమిటి...?  జింక మాంసం..!                           *ఆయన భక్తితో పెట్టిన నైవేద్యం కాబట్టి దేవుడు స్వీకరించాడు. కాని దేవుడు “ఛీ నీచుడా...! నీకు ఏమి నైవేద్యంగా పెట్టాలో తెలియదు. నువ్వు స్నానం చేసావా ముందు.   విభూది కూడా పెట్టుకోలేదు దూరం జరుగు!” అనలేదు. పరమ సంతోషంతో స్వీకరించాడు.* 


*ఇక్కడ అర్ధం చేస్కోవాల్సింది అందర్నీ జింక మాంసం పెట్టమని కాదు శివుడికి జింక మాంసం ఇష్టం అని కాదు. నువ్వు భక్తితో ఏది పెట్టినా భగవంతుడు స్వీకరిస్తాడు అనేది గ్రహించండి.*


*గజేంద్ర మోక్షం లో గజ రాజు ప్రాణం పోతున్న సమయంలో స్వామి వారిని పిలిస్తే వైకుంఠం నుండి పరుగెత్తుకుని మరీ వచ్చాడు ..   పైగా తను నిత్యం ధరించే శంఖు చక్రాలను ధరించకుండా. లక్ష్మి దేవికి కూడా చెప్పకుండా వచ్చి రక్షించాడు. అంతే కాని నీ చిన్నప్పటి నుంచి ఒకసారి కూడా పూజ చేయలేదు. ఈ ఆపద వేళలో మాత్రమే నీకు గుర్తుకు వచ్చానా .. నీ చావు నువ్వు చావు అనలేదు. ఆపదలో ఉన్నవాణ్ణి ఆర్తితో పిలిచినవాడిని, నీవుదప్ప వేరెవరూ లేరని సంపూర్ణ శరణాగతుడవైతే అప్పుడు శ్రీహరి నిన్ను కాపాడటానికి ఏ రూపంలో ఐనా సరే, ఏ సమయంలో నైనా సరే వచ్చి కాపాడతాడు, అదే ఆయన నైజం.*


*ద్రౌపతి వస్త్రాపహారణ వేళ నిండు సభలో రక్షించు వారెవరూ లేనప్పుడు ఇతరులెవ్వరు తనకు అండలేనప్పుడు ‘అన్నా శ్రీ కృష్ణా!’ అంటే వెంటనే వచ్చి వస్త్రాలు ఇచ్చి రక్షించాలేదా...?*


*తరువాత  వస్తాను. అప్పటివరకు నన్ను తలచకు అని చెప్పలేదే. భక్తీతో…”స్వామీ నీవే తప్ప నన్ను రక్షించేది ఎవరు”  అని శరణు వేడితే తప్పకుండా ఏదో ఒక రూపం లో స్వామి పలుకుతాడు. ఇక్కడ మనకు కావలసింది సంపూర్ణ భక్తి మాత్రమే...!*


*పూజ చేసేటప్పుడు ఎన్ని వత్తులు వెయ్యాలి .. అవి ఏ దిక్కుకు తిప్పాలి . ఏ నూనేతో వెలిగించాలి అంటూ పూజ ప్రారంభం లోనే సవాలక్ష ప్రశ్నలతో మొదటిలోనే ఆగిపోతే, ఎప్పుడు ప్రార్థించాలి, ఎప్పుడు శరణాగతుడవు కావాలి, అందుకే ఎప్పుడైనా ఒక్కటే గుర్తు పెట్టుకో .. స్వామి కి కావాల్సింది భక్తి తప్ప హంగులూ ఆర్భాటాలు కావు. ఏదైనా పూజలోనో వేరే ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు తప్పులు దొర్లితే “స్వామీ ఏదైనా తెలియక తప్పు చేస్తే క్షమించు తండ్రి!” అంటే అయన చిరునవ్వుతో మన్నిస్తాడు. తెలిసి కూడా తప్పుచేసి దాచేద్దాం అనుకుంటూ చేసే పనులు మాత్రం చేయకూడదు, ఎందుకంటే సర్వవ్యాపితుడైన అతని ముందు ఏదీ దాయటం కుదరదు గాక కుదరదు.*✍️


.                      🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱

గరుడ పురాణం_*24వ

 * *గరుడ పురాణం_*24వ భాగం*


 *"విషదూరక మంత్రం"*_


_ఋషులారా! ఇపుడు మీకు సర్పాది విష జంతువుల వల్ల కలిగే కష్టాలను తొలగించే మంత్రాన్నుపదేశిస్తాను వినండి._


_*'ఓం కణిచికీణి కళ్వాణీ చర్వాణీ భూతహరిణి ఫణి*_ _*విషణి విరథ నారాయణి ఉమే దహదహ హస్తే చండేరౌద్రే*_ 

_*మాహేశ్వరి మహాముఖి జ్వాలాముఖి శంకుకర్ణి శుకముండే*_

_*శత్రుం హనహన సర్వనాశిని స్వేదయ*_

_*సర్వాంగశోణితం తన్నిరీక్షసి మనసాదేవి*_

_*సమ్మోహయ సమ్మోహయ రుద్రస్య*_ 

_*హృదయే జాతా రుద్రస్య హృదయే స్థితా ।*_

_*రుద్రో రౌద్రేణ రూపేణ త్వం దేవి రక్ష రక్ష*_

_*మాం హ్రూం మాం హ్రూం ఫ ఫ ఫ ఠఠ*_ 

_*స్కందమేఖలా బాలగ్రహ శత్రు విషహారీ*_

_*ఓం శాలే మాలే హర హర విషోంకార*_

_*రహి విషవేగే హాంహాం శవరిహుం*_

_*శవరి ఆ కౌలవేగేశే సర్వే వించమేఘమాలే*_ 

_*సర్వనాగాది విషహరణం !'*_


_*ఈ మంత్రాన్ని ప్రయోగిస్తున్నపుడు దీని భావాన్నే మనసు నిండా అమ్మ స్వరూపంతో సహా నిలుపుకుంటూ వుండాలి. దీని భావం ఇది :*_


_'అమ్మా ఉమాదేవీ! నీవు రుద్రుని హృదయం నుండి పుట్టి అక్కడే నివసించగలిగిన పరాశక్తివి. నీది రౌద్రరూపము. నీ ముఖం జ్వాల వలె జాజ్వల్యమానం. నీ కటికి వున్న ఘంటికారవం దుష్టశక్తుల పాలిటి శరాఘాతం. అందుకే దానిని క్షుద్ర ఘంటిక అంటారు. నీవు భూతప్రియవైనా విషసర్పాలకే విషరూపిణివి. విరథనారాయణిగా, శుక్రముండగా పిలువబడే నీవు దుష్టశక్తుల పాలిటి విశాల, భయంకరముఖివి; ప్రచండ స్వభావురాలివి. నీ చెవి కుండల శంకువుల కాంతులే వాటిని నయన విహీనులను గావిస్తాయి. చేతి నుండి జ్వలన శక్తిని పుట్టించి మా శత్రువులను కాల్చివేయి. కాల్చివేయి. విషనాశినివైన ఓ దేవీ! ఈ నరుని (లేదా నారి)లో వ్యాపించిన విష ప్రభావాన్ని నశింపజేయి. ఆ విష జంతువును సమ్మోహితంగా గావించు, సమ్మోహితం గావించు. దేవీ మమ్ము రక్షించు, రక్షించు' అనుకుంటూ మంత్రాన్ని మరల చదివి దేవిని మరల ప్రార్ధించి హ్రూం మాం హ్రూం ఫఫఫఠఠ అనే బీజాక్షరాలను పలుకుతుండాలి. తరువాత హాంహం శవరిహుం అని కూడా ఉచ్చరిస్తూ రోగి శరీరాన్ని స్పృజించాలి. ఇలా రోగికి స్పృహవచ్చేదాకా మంత్ర పఠన, భావచింతన, బీజాక్షరోచ్చాటన, శవర్యుచ్చారణ చేస్తుండాలి._ _*(అధ్యాయం - 27)*_

గరుడ పురాణం_*23వ భాగం*

 *గరుడ పురాణం_*23వ భాగం*


*త్రిపురాదేవి గణేశాదుల పూజ:-*_


_ఋషులారా! ఇష్టకామ్యార్థ సిద్ధిని కలిగించే ఈ పూజలో ముందు శ్రీ గణేశుని ఆసనానికీ, మూర్తికీ పూజలు చేసి ఆసనంపై ఆయనను స్థాపించి మరల న్యాసపూర్వకంగా ఈ మంత్రాలతో పూజించాలి._


ఓం గాం హృదయాయ నమః, 

ఓం గీం శిరసే స్వాహా,

ఓం గూం శిఖాయై వషట్, 

ఓం గైం కవచాయ హుం, 

ఓం గౌం నేత్రత్రయాయ వౌషట్, 

ఓం గః అస్త్రాయ ఫట్


_*తరువాత సాధకుడు. "ఓం దుర్గాయాః పాదుకాభ్యాం నమః " అంటూ దుర్గమ్మ యొక్కయూ, "ఓం గురుపాదుకాభ్యాం నమః" అంటూ గురువు గారి యొక్కయు పాదుకలకు నమస్కారం చేసి త్రిపురాదేవికీ, ఆమె ఆసనానికి నమస్కారం చేసి 'ఓం హ్రీం దుర్గే రక్షిణి' అనే మంత్రంతో హృదయాదిన్యాసాన్ని గావించి మరల ఇదే మంత్రంతో రుద్రచండ, ప్రచండ దుర్గ, చందోగ్ర, చండనాయిక, చండ, చండవతి, చండరూప, చండిక, దుర్గ అనే తొమ్మిది శక్తులనూ పూజించాలి. తరువాత వజ్ర, ఖడ్గాది ముద్రలను ప్రదర్శించి దేవికి ఆగ్నేయంలో సదాశివాది దేవతలకు పూజ చేయాలి. దానికై సాధకుడు ముందుగా "ఓం సదాశివ మహాప్రేత పద్మాసనాయ నమః" అనే మంత్రాన్ని చదువుతూ ప్రణామం చేసి ఆ తరువాత "ఓం ఐం క్లీం (హ్రీం) సౌంత్రిపురాయై నమః " అనే మంత్రంతో త్రిపురాశక్తికి నమస్కారం చేయాలి.*_


_తరువాత త్రిపురాదేవి యొక్క ఆసనానికీ (పద్మానికి), మూర్తికీ, హృదయాది అంగాలకీ నమస్కారం చేసి ఆ పద్మపీఠం పై మాహేశ్వరి, బ్రాహ్మణి, కౌమారి, వైష్ణవి, వారిహి, ఇంద్రాణి, చాముండ, చండిక - అను ఎనమండుగురు దేవతలనూ పూజించాలి. పిమ్మట ఎనమండుగురు భైరవులనూ అర్చించాలి. అసితాంగుడు, రురుడు, చండుడు, క్రోధి, ఉన్మత్తుడు, కపాలి, భీషణుడు, సంహారి అనువారలు అష్టభైరవులు. భైరవ పూజానంతరము రతి, ప్రీతి, కామదేవ, పంచబాణ, యోగిని, బటుక, దుర్గ, విఘ్నరాజాదులనూ, గురువునూ, క్షేత్రపాల దేవతలనూ పూజించాలి._


_*సాధకుడిపుడు ఒక పంచగర్భ మండలాన్నిగానీ త్రికోణ పీఠాన్నిగానీ వేసి దానిపై శుక్లవర్ణ సుశోభితా, వరదాయినీ, వీణాపుస్తక ధారిణీ, అక్షమాల, అభయముద్ర హస్తాలంకృతా యగు సరస్వతీ దేవి మూర్తిని స్థాతిపించి మనసా ధ్యానించి పూజించాలి. చివరగా త్రిపురేశ్వరీ దేవి మంత్రాన్ని లక్షమార్లు జపించాలి. హవనం కూడా చేయాలి. అపుడా తల్లి సాధకునికి సిద్ధిధాత్రి కాగలదు. ఇక అతని శక్తికి తిరుగుండదు.*_


_(అధ్యాయాలు 24-26)_

భ్రమల వల్లే బాధలు*

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

      *భ్రమల వల్లే బాధలు*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*మనిషి శాశ్వతమనుకొని సుఖసారమనుకొని ప్రీతి పెంచుకుంటున్న జీవితంపై జగద్గురువులైన శంకరాచార్యులు అద్భుతమైన వ్యాఖ్యానం చేశారు…* 


*కారణజన్ములుగా ఈ భువిపైన అవతరించిన ఆదిశంకరులు మానవ శ్రేయస్సుకు ఉపయుక్తమైన ఉపదేశాలను అమృతగుళికలుగా అందజేశారు.*


*లౌకికమైన లంపటంలో కూరుకుపోయి ఈలోకంలో స్థిరంగా ఏదో వేల సంవత్సరాలు బతికేస్తామన్న పిచ్చి భ్రమలతో అతి ప్రణాళికలు రచించుకుంటూ మూర్ఖులుగా మసలుకుంటున్నా మానవులకు ఆయన హెచ్చరికలు చేశారు.*


*కొన్నాళ్లు యాత్రికుల్లా గడపడానికి ఈలోకంలోకి అడుగుపెట్టామన్న సత్యాన్ని మరచిపోయి, స్థిరాసనాలు వేసుకునేందుకు ఆస్తులు కూడబెట్టుకునేందుకు తాపత్రపడుతున్నాం. తుదకు మనమూ వెళ్లిపోయే రోజొకటి వస్తుందని తెలుసుకోలేకపోతున్నాం. తామరాకుపై ఉన్న నీటిబిందువులా మనిషి జీవితం కూడా అతిచంచలమైంది. అయినా ఈలోకంలో మనుష్యులు రోగాలతో బాధపడుతూ, దేహాభిమానాన్ని విడువక, దుఃఖంతో చిక్కుకొని ఉంటారు. ఇలా మనిషికి శాశ్వత సుఖమే లేదని తెలుసుకోమంటున్నారు శంకరాచార్యులు.*


*ఈ సత్యం మనల్ని నిరాశలోకి నెట్టేసేందుకు చెప్పింది కాదు. వాస్తవమేంటంటే తెలుసుకొని మసలుకొమ్మని చేస్తున్న హెచ్చరిక.*


*మనం అనవసరంగా ఈ జీవితంపై పెంచుకుంటున్న మమకారం ఈ శరీర సుఖాలకోసం పడుకున్న తాపత్రయం తగ్గించుకోమనే చెప్తున్నారు. ఏ సుఖమూ శాశ్వతం కాదనీ, ఏ కష్టమూ కలకాలం ఉండదనీ, మన మనస్సు అర్థం చేసుకుంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్వేగానికి లోను కాదు. మనల్ని ఉక్కిరిబిక్కిరి చేయలేదు. అందుకే భగవాన్‌ శ్రీరామకృష్ణులు అనేవారు ఎల్లప్పుడూ మృత్యువును జ్ఞాపకం చేసుకోవాలి.*


*మరణించాక చేసేదేమీ లేదు. స్వగ్రామం నుంచి సమీప నగరానికి ఉద్యోగం చేయడానికి వచ్చినట్లుగా, ఏదో కొన్ని కర్మలు నిర్వర్తించడానికి ఈలోకంలోకి వస్తాం. యజమాని తోటను చూడటానికి ఎవరైనా వస్తే తోటమాలి వారిని వెంటబెట్టుకుని ఇది మా తోట. ఇది మా తటాకం అని ఆ వనమంతా చూపిస్తాడు. ఏదైనా పొరపాటు జరిగినప్పుడు యజమాని, తోటమాలిని పని నుంచి తొలగించి వేస్తే, మామిడి చెక్కతో చేసిన తన పెట్టె కూడా తీసుకుపోయే అధికారం అతడికి ఉండదు. పుత్రమిత్ర బంధువులంతా సహచరులేకానీ శాశ్వతం కాదనీ ఇల్లూ, వాకిలీ, ఆస్తి అంతస్తులంతా మనం అద్దెకు తీసుకున్నా వసతి సౌకర్యమే కానీ వాటికి మనం సంపూర్ణ యజమానులం కామనీ, వెంటవచ్చేవి కావనీ గుర్తుంచు కోవాలి. ఈ మర్మం తెలియకే మనలో చాలామంది జీవితాన్ని సంక్లిష్టం చేసుకుంటున్నారు. వేదాంతంలో తామరాకు, నీటిబిందువ్ఞల సహచర్యం గురించి అద్భుతంగా వివరిస్తారు.*


*నీటిలోనే పుట్టి పెరిగి, నీటితోనే నిరంతరం సంబంధం కలిగి ఉంటుంది తామరాకు. కానీ ఆ నీటితో మమేకం కాకుండా, తడిసిపోకుండా, నిర్మలంగా తేలియాడుతుంది. అలాగే స్థితప్రజ్ఞుడు, జ్ఞాన యోగి, గుణాతీతుడు అయిన వ్యక్తి కూడా ఈ సంసారంలో ఉంటున్నా దానికి బందీ కాడు. చలించడు. ప్రయత్నం చేస్తే అందరికీ ఈ స్థితి సాధ్యమే. ఆధునిక సమాజంలో తీరికలేని వ్యవహారాలు మనల్ని మరింత అహంకార పూరితుల్ని చేస్తున్నాయి. మనం లేకపోతే ఈ ఇల్లు ఏమైపోతుందో ఈ పిల్లలేమైపోతారో అన్న ఆందోళనలో పడేస్తున్నాయి. ఈ ప్రపంచం స్తంభించి ఈలోకానికి ఏ ఒక్కరి అవసరమూ లేదు.*


*నెయ్యితో నిప్పును ఆర్పడం ఎంత అమాయకత్వమో, కోర్కెలను తీర్చుకోవడం ద్వారా వాటిని సంతృప్తిపరచాలనుకోవడం కూడా అంతే అమాయకత్వం.*


*ఓం శ్రీ గురుభ్యోనమః.*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

శ్రీమద్ భాగవతం*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(82వ రోజు)*

   *(క్రితం భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

            *కృష్ణావతారం* 

   *వ్రేపల్లె వాసుడు శ్రీకృష్ణుడు*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*ఇంకో సంగతి అంటూ మంత్రివర్గం మళ్ళీ కొన్ని మాటలు చెప్పింది. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విష్ణువు ఉంటాడంటారు. గోవులు, బ్రాహ్మణులు, జపతపాలు, యజ్ఞయాగాలు, వేదపఠనం ఎక్కడ జరుగుతాయో అక్కడ ధర్మం ఉంటుంది కనుక, గోబ్రాహ్మణులను వధించడం, యాజ్ఞయాగాలను ధ్వంసం చేస్తే విష్ణువు బయటపడతారన్నారు. బయటపడితే విష్ణువుని ఇట్టే వధించవచ్చనీ, పగతీర్చుకోవచ్చనీ అన్నారు.*


*మంత్రుల బోధలు కంసునికి నచ్చాయి. వారు చెప్పినట్టుగానే విష్ణువుని వధించి, నిశ్చింతగా ఉండవచ్చనుకున్నాడతను. మంత్రవిద్యలు నేర్చినవారూ, మాయలు పన్నేవారూ, కామరూపులూ, బలాఢ్యులూ, దుర్మార్గులూ, రాక్షసులు ఎందరెందరో కంసుని అనుచరవర్గంలో ఉన్నారు. వారందరినీ కంసుడు ఆజ్ఞాపించాడు. అతడు ఆజ్ఞాపించినట్టుగానే వారంతా చెలరేగిపోయారు. సాధువుల్ని హింసించసాగారు.*


*గోబ్రాహ్మణులను వధించసాగారు. యజ్ఞయాగాదులను ధ్వంసం చేస్తూ, తాపసులను చిత్రహింసల పాల్జేశారు. స్త్రీలను చెరబట్టారు. విష్ణువుకి నిలయాలయిన పుణ్యస్థలాలను అపవిత్రం చేసి, ఆనందించసాగారు. కామరూపులయిన రాక్షసులు కోరుకున్న రూపంలో పల్లెల్లో, నగరాల్లో కనిపించిన బాలలందరినీ చంపడం మొదలుపెట్టారు. తల్లడిల్లిపోయారు తల్లులు. పిల్లలను కనడమే మహాపాపమయినట్టుగా రోదించారు. బాలలు బ్రతకడం కష్టం. వారి బ్రతుకు క్షణక్షణం ఓ గండం అయిపోయింది.* 


*ఒకనాడు కంసుడికి కప్పం కట్టేందుకు నందగోపుడు మధురానగరానికి వచ్చాడు. కంసుడికి సామంతుడతను. ఏటేటా కంసునికి కప్పం కట్టాలి. కప్పం సొమ్మును మూటగా కట్టి మధురానగరానికి బయల్దేరుతూ, వ్రేపల్లెను జాగ్రతగా చూసుకోమని గోపాలురకు హెచ్చరించి వచ్చాడతను. కంసుణ్ణి దర్శించాడు. కప్పం చెల్లించి, కానుకలు కూడా సమర్పించాడతనికి.* 


*వసుదేవునికి నందగోపుడు బంధువు. వసుదేవుని భార్య రోహిణీ, ఆమె కుమారుడు బలరాముడూ, ఇంకొందరు బంధువులూ అతని రక్షణలో వ్రేపల్లెలో ఉన్నారు. వారి క్షేమసమాచారాలు తెలుసుకునేందుకు నందుణ్ణి చూడవచ్చాడు వసుదేవుడు*.



*వసుదేవుణ్ణి చూస్తూనే గట్టిగా అతన్ని కౌగిలించుకున్నాడు నందుడు. ఇద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. చాలా కాలానికి పుత్రసంతానం కలిగినందుకు నందుణ్ణి అభినందించాడు వసుదేవుడు. ఆ అభినందనలకు పొంగిపోలేదు నందుడు, దేవకీ వసుదేవులు కంసుని చెరలో హింసలపాలయినందుకు బాధపడ్డాడతను. కన్నీరు పెట్టుకున్నాడు. నందుడు అలా కన్నీరు పెట్టుకుంటుంటే అతన్ని గమనించక, ఏటో చూస్తూ ఆందోళనగా ఒక్కసారిగా లేచి నిల్చున్నాడు వసుదేవుడు. ఏమయిందేమయింది అన్నట్టుగా నందుడు కూడా లేచి నిల్చున్నాడు. భయాందోళనలతో వణికిపోతున్న వసుదేవుణ్ణి ఆశ్చర్యంగా చూడసాగాడు.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                  *విరచిత*

         *”శివానందలహరి”*

             *రోజూ ఒక శ్లోకం* 

       *తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*"జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*శంకరులు శ్రీ శైల క్షేత్రంలో వెలసిన జ్యోతిర్లింగమూర్తి యైన భ్రమరాంబికా సమేత శ్రీ మల్లికార్జున స్వామిని సేవిస్తున్నారు*


*శ్లోకం : 50*


*సన్ధ్యారంభవిజృంభితం శ్రుతిశిర స్థానాన్తరాధిష్ఠితం*


*సప్రేమ భ్రమరాభిరామమసకృత్ సద్వాసనా శోభితమ్ ।*


*భోగీన్ద్రాభరణం సమస్త సుమనఃపూజ్యం గుణావిష్కృతం*


*సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితమ్ ।*


*పూర్వకథ:~*


*శ్రీ శైల ప్రాంత దేశాన్ని చంద్రగుప్తుడు అనే రాజు పాలించేవాడు.అతని కూతురు రతీదేవి వలె సౌందర్యము కలది. ఆమె పేరు చంద్రవతి. ఆరాజు తన కూతురినే మోహించాడు. ఆవిషయం తెలిసిన చంద్రవతి, రాజ గృహం విడచి శ్రీశైలానికి వెళ్ళి శివుణ్ణి గూర్చి తపస్సు చేసింది. శివుడు ప్రత్రక్షమైనాడు. ఆమె శివునికి భక్తితో మల్లెపూల దండను సమర్పించింది. ఈశ్వర సాయుజ్యాన్ని ఆమె కోరింది. ఆ మల్లికా మాలను తీసుకుని శివుడు తెల్లని వర్ణాన్ని పొందాడు. అప్పుడు చంద్రవతి ఈశ్వరుని "మల్లికార్జునుడు " అనే సార్థకనామాన్ని ధరించమని ప్రార్థించింది. శివుడు అంగీకరించి లింగరూపం ధరించాడు. అప్పటినుండి శ్రీ శైల లింగానికి మల్లికార్జునుడనే పేరు వచ్చింది.*


*తాత్పర్యము:~*


*సంధ్యాకాలం మొదట ఈశ్వరుడు తాండవనృత్యంతో భక్తులను ఆనందపరుస్తాడు. మద్ది చెట్టు సంధ్యారంభ కాలంలో పుష్ప వికాసముతో ఆనంద పరుస్తుంది. ఈశ్వరుడు శ్రీ శైలమునందేగాక శ్రుతి సరస్సులలో అనగా ఉపనిషత్తుల యందు ఉంటాడు. మద్ది చెట్టు పుష్పాలు చెవులయందు, శిరస్సులయందూ అలంకారములుగా ఉంటాయి. మల్లికార్జునుడు అనురాగంతో కూడిన భ్రమరాంబా దేవితో మనోహరంగా ఉంటాడు. మద్ది చెట్టు ప్రీతితో కూడిన తుమ్మెదలచే సుందరముగా ఉంటుంది. ఈశ్వరుడు మాటిమాటికినీ యోగ్యములయిన సంస్కారములచే ప్రకాశించేవాడు. మద్ది చెట్టు మంచి సువాసనలచే ప్రకాశిస్తుంది. ఈశ్వరుడు సర్ప రాజయిన వాసుకి ఆభరణంగా కలవాడు . మద్ది పువ్వు భోగప్రియులైన వారికి ఆభరణమైనట్టిది.*


*ఈశ్వరుడు అందరు దేవతలకూ పండితులకూ పూజనీయుడు. మద్ది పూవు అన్ని పువ్వులలో శ్రేవ్టమైనది. ఈశ్వరుడు సద్గుణములచే వ్యక్తము చేయ బడేవాడు. మద్దిపుష్పము సుగంధ గుణము వలన తెలియబడుతుంది.*


*పార్వతిచే కౌగిలించుకొనబడినవాడు. శ్రీశైల మల్లికార్జున స్వామి మద్ది చెట్టు జమ్మి చెట్టు తో కూడినది. మల్లెపూదండలచే పూజింపబడి ఒకవిధమైన తెల్లనివర్ణము గలవాడు మల్లికార్జునుడు. అటువంటి మల్లికార్జున నామముగల శివుని జ్యోతిర్లింగాన్ని సేవిస్తాను.*


*వివరణ:~*


*శంకరాచార్యులవారు శిష్యులతో పాదచారియై హిందూమత ప్రచారానికై భారతదేశమంతటా పర్యటించారు. ఆసందర్భంలో వారు మన ఆంధ్ర ప్రదేశ్లోని శ్రీశైల మహాపుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. ఆ సమయంలో సంధ్యాకాలమయ్యింది.* *అప్పుడక్కడ మల్లెతీగ అల్లుకున్న మద్ది చెట్టు వారికి కనబడింది. దానిని పోలికగా చేసుకుని పరమేశ్వరుని ఈ అద్భుతమైన శ్లోకంలో వారు వర్ణించారు.*


*ఈ శ్లోకం దీని తర్వాతి శ్లోకము శ్రీశైల మల్లికార్జున స్వామిపై శంకరులు చెప్పిన గొప్ప శ్లోకాలు. శ్రీశైలం గొప్ప పుణ్య జ్యోతిర్లింగ క్షేత్రం.*


*"శ్రీ శైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న లభ్యతే " అంటారు. శివానంద లహరి లోని 100 శ్లోకాలలో శ్రీశైల మల్లికార్జున స్వామి ని వర్ణించే ఈ రెండు శ్లోకాలూ మణిహారంలోని నాయక మణుల వంటివి.*


*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

గరుడ పురాణం_*22వ

 *గరుడ పురాణం_*22వ భాగం*


_*మహాశక్తులను బీజమంత్ర యుక్తంగా ఆయా దిశల్లో ఇలా జపించాలి.*_


ఓం రాం పద్మాయై నమః - ఆగ్నేయం


ఓం రీం దీప్తాయై నమః - నైరృత్యం


ఓం రూం సూక్ష్మాయై నమః - వాయవ్యం


ఓం రేం జయాయై నమః - ఈశాన్యం


ఓం రైం భద్రాయై నమః - తూర్పు


ఓం రోం విభూత్యై నమః - దక్షిణం


ఓం రౌం విమలాయై నమః - పశ్చిమం


ఓం రం అమోఘికాయై నమః - ఉత్తరం


ఓం రం విద్యుతాయై నమః - ఉత్తరం


ఓం రం సర్వతోముఖ్యై నమః - మండలమధ్యం


_*తరువాత శివస్వరూపమున్న సూర్య ప్రతిమను సూర్యాసనంపై స్థాపించి "హ్రాం హ్రూం (లేదా హ్రీం)సః" అనే మంత్రంతో ఆ దేవుని అర్చించి క్రింది మంత్రాలతో న్యాసం చేయాలి.*_


'ఓం ఆం హృదర్కాయ నమః '


'ఓం భూర్భువః స్వః శిరసే స్వాహా'


'ఓం భూర్భువః స్వః శిఖాయై వౌషట్'


'ఓం హ్రం జ్వాలిన్యై నమః '


'ఓం హ్రుం కవచాయ హుం'


'ఓం హ్రూం అస్త్రాయ ఫట్'


'ఓం హ్రం ఫట్ రాజ్యై నమః '


'ఓం హ్రం ఫట్ దీక్షితాయై నమః '


_*అంగన్యాసానంతరము సాధకుడు ఈ దిగువ నీయబడిన మంత్రాలతో సూర్యాది నవగ్రహాలకు ‘మానసీపూజ'ను సంపన్నం గావించాలి.*_


ఓం సః సూర్యాయ నమః 

ఓం సోం సోమాయ నమః 

ఓం మం మంగలాయ నమః 

ఓం బుం బుధాయ నమః 

ఓం బృం బృహస్పతయే నమః, 

ఓం భం భార్గవాయ నమః, 

ఓం శం శనైశ్చరాయ నమః, 

ఓం రం రాహవే నమః, 

ఓం కం కేతవే నమః, 

ఓం తేజశ్చండాయ నమః ।


_*ఈ విధంగా సూర్య దేవాదులను పూజించి ఆచమనం చేసి ఆపై ఈ క్రింది మంత్రా లతో చిటికెన వ్రేలితో మొదలెట్టి అన్ని వేళ్ళతో కరన్యాస, అంగన్యాసాలను చేయాలి.*_


ఓం హం హృదయాయ నమః, 

ఓం హీం శిరసే స్వాహా, 

ఓం హూం శిఖాయై వౌషట్, 

ఓం హైం కవచాయ హుం, 

ఓం హౌం నేత్రత్రయాయ వౌషట్, 

ఓం హః అస్త్రాయ ఫట్


_*తరువాత భూతశుద్ధి గావించి మరల న్యాసం చేయాలి. అర్ఘ్యస్థాపన చేసి ఆ జలాన్ని తన శరీరంపై జల్లుకోవాలి. తరువాత శివునితో పాటు నందీశ్వరాదులను పూజించాలి. 'ఓం హౌం శివాయ నమః' అనే మంత్రంతో పద్మస్థితుడైన పరమశివుని పూజించిన పిమ్మట నంది, మహాకాల, గంగ, యమున, సరస్వతి, శ్రీవత్స, వాస్తుదేవత, బ్రహ్మ, గణపతిలనూ తదుపరి తన గురుదేవునీ సాధకుడు అర్చించాలి.*_


_తరువాత పద్మమధ్యంలో నున్న శక్తి అనంతదేవులనూ, పద్మ పూర్వ దళంలో ధర్మాన్నీ, దక్షిణంలో జ్ఞానాన్నీ, పశ్చిమంలో వైరాగ్యాన్నీ, ఉత్తరంలో ఐశ్వర్యాన్నీ, ఆగ్నేయంలో అధర్మాన్నీ, నైరృత్యంలో అజ్ఞానాన్నీ, వాయవ్యంలో అవైరాగ్యాన్నీ, ఈశాన్యంలో అనైశ్వర్యాన్నీ పద్మకర్ణికపై వామా, జ్యేష్ఠాశక్తులనూ మరల తూర్పుతో మొదలుపెట్టి రౌద్రీ, కాలీ, శివా, అసితాది శక్తులనూ పూజించాలి._


_*తరువాత శివుని కెదురుగా నున్న పీఠంపై ప్రతిష్టింపబడిన కలవికరిణీ, బలవికరిణీ, బలప్రమథినీ, సర్వభూతదమనీ, మనోన్మనీ అనే మహాశక్తులను ఈ దిగువ నీయబడిన మంత్రాలతో పూజించాలి.*_


ఓం హౌం కలవికరిణ్యై నమః, ఓం హౌం, బలవికరిణ్యై నమః, 

ఓం హౌం బల ప్రమథిన్యై నమః, 

ఓం సర్వభూత దమన్యై నమః, 

ఓం మనోన్మన్యై నమః ।


_*తరువాత సాధకుడు ఒక ఆసనం పైకి శివునాహ్వానించి ఆయన మహామూర్తిని స్థాపించాలి. అప్పుడు శివునుద్దేశించి ఆవాహన, స్థాపన, సన్నిధాన, సన్నిరోధ, సకలీకరణాది ముద్రలను చూపించి అర్ఘ్య, పాద్య, ఆచమన, అభ్యంగ, ఉద్వర్తన, స్నానీయ జలాలను సమర్పించాలి. పిమ్మట అరణి- మంథనం చేసి ఆ మహాదేవునికి వస్త్ర, గంధ, పుష్ప, దీప, "చరు" నైవేద్యాలను సమర్పించాలి.*_

_('చరు' అనగా హోమయోగ్యమైన, పక్వం చేయబడిన అన్నము.)_


_*నైవేద్యానంతరము ఆచమనం చేసి ముఖశుద్ధికై (ముఖమనగా నోరు) తాంబూలము, కరోద్వర్తనం, ఛత్రం, చామరం యజ్ఞోపవీతం, ప్రదానం చేసి "పరమీకరణ" చేయాలి.*_

_("పరమీకరణ"మనగా అర్చనీయదేవునిలో సర్వోత్కృష్టత యను భావము గట్టి పఱచుట.)_


_*పిమ్మట సాధకుడు ఆరాధ్య దైవం ఆకారాన్ని ధరించి ఆయనను జపించి వినమ్రతతో స్తుతించాలి. హృదయాదిన్యాసాలను చేసి సంపూర్ణం గావించు ఈ పూజనే 'షడంగ పూజ' అని వ్యవహరిస్తారు.*_


_తరువాత దిక్పాలకులనూ, వారి మధ్యలో చండేశ్వరీ దేవిని పూజించాలి._


_*చివర మరల శివుని ఇలా స్తుతించాలి. క్షమాయాచన చేసి కంకణాన్ని విసర్జించాలి.*_


_*గుహ్యాతిగుహ్యగోప్తాత్వం గృహాణా స్మత్కృతం జపం |*_

_*సిద్ధిర్భవతు మేదేవ త్వత్ప్రసాదాత్ త్వయి స్థితిః ||*_


_*యత్కించిత్ క్రియతే కర్మ సదా సుకృత దుష్కృతం !*_

_*తన్మే శివ పదస్థస్య రుద్ర క్షపయ శంకరః ॥*_


_*శివోదాతా శివోభోక్తా శివః సర్వమిదంజగత్ |*_ 

_*శివోజయతి సర్వత్రయః శివః సో హమేవచ ll*_


_*యత్కృతం యత్ కరిష్యామి తత్సర్వం సుకృతం తవ |*_ 

_*త్వం త్రాతా విశ్వనేతాచనాన్యో నాథో..స్తి మే శివ ॥*_


_'హే ప్రభో! నీవు గుహ్యాతిగుహ్యమైన తత్త్వాలకు సంరక్షకుడవు. నేను చేసిన జపాన్ని స్వీకరించు. నాకు సిద్ధిని ప్రాప్తింపజేయి. నీ కృప వల్ల నాకు నీ పట్ల గల ఈ నిష్ఠ శాశ్వతంగా వుండేలా వరమియ్యి. రుద్రదేవా! శంకరా! నా పాపాలను నశింపజెయ్యి. పుణ్యాన్ని కూడా హరింపజేసి నన్ను నీ పాదాల చెంత పడవేసుకో. భక్తులకు సర్వస్వాన్నీ వరంగా ఇచ్చే నీవే సర్వవ్యాపకుడవు. సర్వభర్తవు. నా భవిష్యత్కర్మలన్నీ నీ వైపే పయనించే లాగ నన్ను దీవించు. రక్షకుడవు నీవే. విశ్వనాయకుడవు నీవే.


హే పరమశివా! నాకు వేరే దిక్కు గాని దైవంగాని లేదు' అని ఈ స్తుతి సారము._


_*ఈ రకంగా శివోపాసనచేయగలిగిన సాధకుడు అకాల మృత్యువాతపడడు. అతి శోతోష్టాలకూ అతీతుడవుతాడు.*_

గరుడ పురాణం_*21వ

 *గరుడ పురాణం_*21వ భాగం*



*పంచవక్త్ర పూజనం - శివార్చన విధి:-*_


_ఋషులారా! ఇపుడు పంచముఖ శివుని పూజా విధానాన్ని విన్నవిస్తాను. ఇది సాధకునికి భుక్తినీ ముక్తినీ ప్రసాదిస్తుంది. ముందుగా ఈ క్రింది మంత్రంతో పరమాత్మను ఆవాహనం చేయాలి._


_*'ఓం భూర్విష్ణవే ఆది భూతాయ సర్వాధారయ మూర్తయే స్వాహా'*_


_తరువాత సద్యోజాత విశేషణధారియైన పరమాత్మ కళను ఈ క్రింది మంత్రంతో ఆవాహనం చేయాలి._


_*'ఓం హాం సద్యోజాతాయ నమః'*_


_ఈ సద్యోజాత శక్తిలో ఎనిమిది కళలుంటాయి. అవి సిద్ధి, బుద్ధి, ధృతి, లక్ష్మి, మేధ, కాంతి స్వధ, స్థితి. వీటన్నిటినీ, ఓంకార ప్రతిసర్గతో షష్ఠీ విభక్తితో 'నమః' ను చేర్చి పూజించాలి._

_(ఉదా॥ సిద్ధిని 'ఓం సిద్ద్యై నమః' అనే మంత్రంతో పూజించాలి.)_


_*తరువాత సాధకుడు "ఓం హీం వామదేవాయ నమః" (కొన్నిచోట్ల హ్రీంకి బదులు హీం వుంది)*_


_అంటూ వామదేవుని పూజించాలి. ఈ శివ స్వరూపానికి పదమూడు కళలు. అవి రజ, రక్ష, రతి, పాల్య, కాంతి తృష్ణ, మతి, క్రియ, కామ, బుద్ధి, రాత్రి, త్రాసని, మోహిని అనేవి._


_అలాగే అఘోర స్వామికీ ఒక మంత్రమూ ఎనిమిది కళలూ వుంటాయి. (ఎందుచేతనో గాని మంత్రమూ బీజాక్షరమూ చెప్పబడలేదు) ఆ కళలు ఇవి మనోన్మనీ, అఘోర, మోహ, క్షుధ, నిద్ర, మృత్యు, మాయ, భయంకర._


_*ఈ కళలను కూడ ఓం, నమః ఆదులను చేర్చి పూజించాక శివుని నాలుగవ వక్త్ర రూపమైన తత్పురుషుని "ఓం హైం తత్పురుషాయ నమః" అనే మంత్రంతో ఆరాధించాలి. ఈ స్వామి కళలు అయిదు. అవి నివృత్తి, ప్రతిష్ఠ, విద్య, శాంతి, సంపూర్ణ. ఈ కళలను కూడా పూజించాక సాధకుడు పంచముఖేశుని ఈశాన దేవరూపాన్ని "ఓం హౌం ఈశానాయ నమః " అనే మంత్రంతో పూజించాలి. ఈ స్వామి కళలు ఆరు. అవి నిశ్చల, నిరంజన, శశిని, అంగన, మరీచి, జ్వాలిని. అన్ని కళలనూ 'ఓం, షష్ఠి, నమః' లను చేర్చి పూజించాలి. అప్పుడే పూజ పూర్ణమౌతుంది.*_


_ఋషులారా! ఇపుడు శివార్చన విధిని వినిపిస్తాను. పన్నెండం గుళాల మేర శివమూర్తిని, బిందు ద్వారా నిర్మించాలి. అది శాంత, సర్వగత, నిరాకార చింతన చేయడానికి దోహదం చేసేలా వుండాలి. శివుని ముఖం వైపు అయిదు బిందువులుండాలి. మూర్తికి దిగువ భాగంలో ప్రతి ఆరవబిందువూ విసర్గ వుండాలి. అది అస్త్ర (హస్తన్యాస)ము. దానితో బాటు 'హౌం' అనే బీజాక్షరాన్ని కూడా వ్రాయాలి. ఇది మహామంత్ర బీజం. సంపూర్ణార్థ ప్రదాయకం. తరువాత సాధకుడు శివమూర్తి ఊర్ధ్వ భాగం నుండి చరణ పర్యంతమూ చేతులతో స్పృశిస్తూ మహాముద్రను చూపిస్తూ తదుపరి సంపూర్ణాంగ కరన్యాసం చేయాలి._


_*అపుడు అస్త్రమంత్రం "ఓం ఫట్" నుచ్చరిస్తూ కుడి పిడికిలితో స్పర్శ, శోధనలను గావించాలి. తరువాత చిటికెన వేలితో మొదలెట్టి మహామంత్ర బీజంతో చూపుడు వేలి దాకా న్యాసం చేయాలి.*_


_ఇక బాహ్యపూజ, మానసిక పూజలు రెండూ ఒకేసారి చేయబడతాయి. హృదయమును కమలంగా అందులోని మధ్యభాగాన్ని కర్ణికగా భావించుకొని ఆ కర్ణికలో ధర్మ, జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్యాలను అర్చించాలి. ఆవాహన, స్థాపన, పాద్య, ఆచమన, అర్ఘ్య, స్నానము లను అర్పించి అన్య వివిధ మానస ఉపచారాలను గావించాలి. తరువాత అగ్నిలో ఆహుతుల నివ్వాలి. అదెలాగంటే సాధకుడు పూజాస్థలంలోనే అగ్నిని రగిల్చి వుంచడానికి ముందే 'ఓం ఫట్' అనే అస్త్ర మంత్రంతో ఒక కుండాన్ని నిర్మించాలి. ఆపై 'ఓం హూం' అనే కవచ మంత్రంతో ఆ కుండంపై అభ్యుక్షణ చేయాలి. అనగా నీళ్ళు చిలకరించాలి. అప్పుడు మానసిక రూపంతో దానిలో శక్తిని విన్యాసం చేయాలి. తరువాత సాధకుడు ముందు తన హృదయంలో, ఆపై ఈ శక్తి కుండంలో జ్ఞానరూపియైన తేజాన్నీ అగ్నినీ విన్యాసం చేయాలి. (అంటే వుంచాలి) ఈ అగ్నిలో నిష్కకృతి సంస్కారాన్ని తప్ప మిగతా అన్ని సంస్కారాలనూ చేసుకోవాలి. అన్నిటి తరువాత సమస్త అంగిక దేవులతో సహా మానసిక రూపంతో శివునికి ఆహుతులివ్వాలి._


_*తరువాత కమలాంకిత గర్భయైన ఆ మండలంలో నీలకంఠుని పూజించాలి. దాని అగ్ని కోణంలో అర్ధచంద్రాకారయుక్తమైన ఒక మంగళమయ అగ్ని కుండాన్ని నిర్మించాలి. అప్పుడు అగ్నిదేవుని అస్త్రయుక్తంగా హృదయాదులలో న్యాసం చేయాలి. తరువాత మండలంలో నున్న కమల కర్ణికపై సదాశివునికీ దిశలలో అస్త్రాలకీ పూజచేయాలి. అంతట పంచతత్త్వాలలో నుండు పృథ్వీ, జల తత్త్వ శక్తులకు విడివిడిగా వంద వంద ఆహుతులను అయిదేసిమార్లు అర్పించి ప్రసన్నతాపూర్వకంగా త్రిశూలధారియైన శివుని ధ్యానించాలి.*_


_అనంతరం ప్రాయశ్చిత్తశుద్ధికై ఎనిమిదిమార్లు ఆహుతులివ్వాలి. ఈ ఆహుతులను అస్త్రబీజమైన 'హుంఫట్' అనే మంత్రంతో అర్పించడం శ్రేష్ఠం. ఈ ప్రకారంగా సంస్కారాన్ని శుద్ధిని సాధించిన సాధకుడు సాక్షాత్తు శివస్వరూపుడే కాగలడు._


_*శివుని యొక్క విశేషపూజలో సాధకుడు మొదట:*_


_ఓం హాం ఆత్మ తత్త్వాయ స్వాహా_


_ఓం హీం విద్యాతత్త్వాయ స్వాహా_


_ఓం హూం శివతత్త్వాయ స్వాహా_


_*అని ఉచ్చరిస్తూ ఆచమనం చేయాలి. తరువాత మానసిక రూపంతో కర్ణేంద్రియాలను స్పర్శించాలి. భస్మధారణ చేసి తర్పణాది క్రియలను ఈ మంత్రాలతో చేయాలి.*_


_'ఓం హం ప్రపితా మహేభ్యః స్వధా,_


_'ఓం హాం మాతా మహేభ్యః స్వధా'_


_'ఓం హాం నమః సర్వ మాతృభ్యః స్వధా'_


_*ఇలాగే తన పితరులందరికీ తర్పణాలిచ్చుకొని సాధకుడు ప్రాణాయామం చేసి ఆచమన, మార్జనలనాచరించి ఈ క్రింది శివగాయత్రి మంత్రాన్ని జపించాలి.*_


_'ఓం హాం తన్మహేశాయ విద్మహే, వాగ్విశుద్ధాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్ I'_


_*పిమ్మట ఈ క్రింది మంత్రాలను జపించాలి.*_


_ఓం హాం హీం హూం హైం హౌం హః శివ సూర్యాయ నమః |_

_ఓం హం ఖఖోల్కాయ సూర్యమూర్తయే నమః |_

_ఓం హ్రాం హ్రీం సః సూర్యాయ నమః ।_


_*ఈ మంత్రాలను సూర్యోపస్థానం చేసి, సూర్య మంత్రాలతోనే సూర్యరూపుడైన మహేశ్వరుని పూజించడంలో భాగంగా జపించాలి.*_


_తరువాత దండీ, పింగళాది భూత నాయకులను " ఓం దండినే నమః, ఓం పింగలాయ నమః " మున్నగు మంత్రాల ద్వారానూ, అనంతరం ఆగ్నేయాది కోణాలలో "ఓం విమలాయై నమః, ఓం ఈశానాయై నమః " అంటూ శక్తి స్వరూపాలను వారి వారి మంత్రాల ద్వారానూ స్థాపించి, స్మరించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉపాసకులకు సకల సుఖాలూ ప్రాప్తిస్తాయి._

శ్రీమద్ భాగవతం*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(80వ రోజు)*

   *(క్రితం భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

            *కృష్ణావతారం* 

   *వ్రేపల్లె వాసుడు శ్రీకృష్ణుడు*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*‘‘కంసా! నన్ను వధించడం నీ తరం కాదు. నిన్ను వధించేవాడు మాత్రం పుట్టి పెరుగుతున్నాడు. అతని చేతుల్లో నీకు చావు తప్పదు.’’*


*కత్తి ఝళిపిస్తూ క్రూరంగా చూశాడు కంసుడు. అదృశ్యమయింది విష్ణుమాయ.*


*విష్ణుమాయ మాటలకు, ఆనాడు ఆకాశవాణి చెప్పిన మాటలకు పొంతన లేకపోవడంతో అంతా అబద్ధం అనుకున్నాడు కంసుడు. అన్యాయంగా దేవకీవసుదేవుల్ని హింసించాననుకున్నాడు. తప్పు చేశాననుకుని, వారిని బంధవిముక్తుల్ని చేశాడు.*


*‘‘బావా! ఆకాశవాణి మాటలు నమ్మి, మీకు చేయరాని అపకారం చేశాను. మిమ్మల్ని బంధించి, మీ బిడ్డల్ని హతమార్చాను. తప్పు చేశాను. నన్ను క్షమించండి.’’ వేడుకున్నాడు కంసుడు.*


*‘‘రాచమర్యాదలు పొందుతూ హాయిగా ఉండండి. వెళ్ళండి.’’ అని అభయాన్నిచ్చాడు కంసుడు. అక్కణ్ణుంచి నిష్క్రమించాడు.*


*యశోదానందులు:~*


*గోకులంలో నందగోపుడు ప్రముఖుడు. అతని నివాసం వ్రేపల్లె. యశోద అతని భార్య పేరు. ఈ దంపతులకు చాలా కాలంగా పిల్లలు లేరు. వయసు మీరుతున్న వేళ యశోద ఆడపిల్లను కన్నది. అయితే తాను ఆడపిల్లను కన్నట్టుగా ఆమెకు తెలియదు. విష్ణుమాయలో ఉందామె. ఆ పిల్లను వసుదేవుడు తీసుకునిపోయి, ఆ పిల్ల స్థానంలో మగబిడ్డను ఉంచిన సంగతి కూడా తెలియదామెకు. ఈ సంగతి యశోదానందులకే కాదు, వ్రేపల్లెలో ఎవరికీ తెలియదు. ఫలితంగా దేవకీ వసుదేవుల బిడ్డే తమ బిడ్డ అనుకుని, యశోదానందులూ, వ్రేపల్లెవాసులూ పొంగిపోయారు.*


*అలా కృష్ణుడు యశోదా తనయుడిగా, నందనందనుడిగా దినదినప్రవర్థమానం కాసాగాడు. కంసునికి దూరంగా గోకులంలో తమ బిడ్డ పెరుగుతున్నాడు, అదే పదివేలు అనుకున్నారు దేవకీ వసుదేవులు.*


*లేకలేక కలిగిన పుత్రుడు శ్రీకృష్ణుడు. దివ్యతేజస్సుతో ప్రకాశిస్తున్నాడు. ఆ ప్రకాశాన్ని గుర్తెరిగి, సాక్షాత్తూ భగవంతుడే తనకి జన్మించాడని ఆనందించాడు నందుడు. విష్ణుభక్తుడతను. భక్తితో పుత్రోత్సాహం చేశాడు.* 


*పూర్వజన్మలో నందుడు ఒక వసువు. అతని పేరు ద్రోణుడు. యశోద పూర్వజన్మలో కూడా అతని భార్యే! అప్పటి ఆమె పేరు ధర. వారు విష్ణుభక్తులూ, పుణ్యాత్ములూ అయిన కారణంగానే శ్రీకృష్ణుడు వారి బిడ్డ అయినాడు*


*‘‘గొప్పబిడ్డను కన్నావు తల్లీ! నీ బిడ్డ చూడముచ్చట అనిపిస్తున్నాడు. కనడం ఆలస్యమయినా బంగారంలాంటి బిడ్డని కన్నావు.’’ అన్నారు గోపకాంతలు. యశోదను అనేక విధాల అభినందించారు. కృష్ణుణ్ణి పన్నీట జలకమాడించి, జోలపాడారు. అష్టమినాడు జన్మించాడు కృష్ణుడు. గోకులంలో ఆనాడు గొప్ప పండుగ చేసుకున్నారు. అదే ‘గోకులాష్టమి’గా ప్రఖ్యాతి చెందింది.*


*బాలకృష్ణుడు ఉట్లను చేజిక్కించుకునేవాడు. అందిన వెన్నను ఆబగా తినేవాడు. పాలు తాగేవాడు. అదే తర్వాతి రోజుల్లో ‘ఉట్లపండుగ’ అయింది. రోహిణీనక్షత్రాన జన్మించిన కృష్ణుడు మేనమామ కంసుణ్ణి వధించాడు. అందుకే కాబోలు, ఈనాడు ఎవరయినా రోహిణీ నక్షత్రాన జన్మిస్తే ‘మేనమామ’ గండం అంటున్నారు.*


*కంసుడు:దురాలోచనలు:~*


*దేవకి అష్టమగర్భంలో మగపిల్లవాడు జన్మిస్తాడు. ఆ బుడతడి చేతిలోనే తను హతమవుతానని భావించిన కంసునికి దేవకి అష్టమగర్భంలో ఆడపిల్ల జన్మించడం, ఆమె నిన్ను హతమార్చేవాడు పుట్టాడు, పెరుగుతున్నాడని చెప్పడం నమ్మలేనిజాలనిపించాయి. ఆ నిజాలను ఆలోచిస్తూ నిద్రకు దూరమయ్యాడు కంసుడు. ఆహారం కూడా రుచించడం లేదతనికి. ఏం చెయ్యాలి? తనని హతమార్చేవాడు పుట్టాడన్నది విష్ణుమాయ. ఎక్కడ పుట్టాడు? ఎక్కడ పెరుగుతున్నాడు? వాణ్ణి తెలుసుకోవడం ఎలా? పరిపరివిధాల ఆలోచించి, ఆపై సలహాలకూ, సూచనలకూ మంత్రివర్గసమావేశాన్ని ఏర్పరిచాడు కంసుడు. మంత్రివర్గం, పరిజనులూ అతనికంటే క్రూరులు. వారంతా మరింతగా కంసుణ్ణి రెచ్చగొట్టారు. విష్ణుమూర్తిపట్ల అతనికి ఉన్న ద్వేషాన్ని పెంచి పెద్దదాన్ని చేశారు. కంస మహారాజుని చంపేవాడు యాదవకులంలోనే జన్మిస్తాడని తెలిసింది కనుక, యాదవ కులాన్నంతటినీ జల్లెడ పడితే సరి, దొరికిపోతాడన్నారు. గొల్లపల్లెలన్నీ గాలిద్దాం అన్నారు. పసిబాలుర ఉసురుతీద్దామన్నారు. ప్రతి ఊరిలోని పసిపిల్లలందరినీ చంపేద్దాం. చంపేస్తే ప్రమాదం ఇంకేముంటుంది? అన్నారు.*


*ప్రధానంగా వసుదేవుని భార్యలూ, నందగోపుడూ నివసించే గోకులాన్ని ఓ కంట కనిపెట్టుకుని ఉందామన్నారు. వారి మాటలు బాగున్నాయనిపించింది కంసునికి.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                  *విరచిత*

         *”శివానందలహరి”*

             *రోజూ ఒక శ్లోకం* 

       *తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*"జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*శంకరులు ఈ శ్లోకంలో శివ భక్తిచే లభ్యమయ్యే ఫలమును కోరుతున్నారు. భక్తిలత తనకు అభీష్టఫలములను ఈయవలెనని కోరుతున్నారు.*


*శ్లోకం : 49*


*ఆనన్దామృతపూరితా హరపదాంభోజాలవాలోద్యతా*


*స్థైర్యోపఘ్నముపేత్య భక్తి లతికా శాఖోపశాఖాన్వితా ।*


*ఉచ్ఛైర్మానస కాయమానపటలీమాక్రంయ నిష్కల్మషా*


*నిత్యాభీష్ట ఫలప్రదా భవతు మే సత్కర్మ సంవర్ధితా ।।*


*తాత్పర్యము :~*


*పరమేశ్వర సేవానురక్తి నీటిపోతగానూ, పరమశివుని చరణకమలము పాదుగానూ, చిత్త స్థైర్యము ప్రాకుడు కొయ్యగానూ అమరగా, బయలుదేరి కొమ్మలతో రెమ్మలతో కూడినదై , క్రమముగా ఉన్నతములైన మనస్సులు అనే పందిళ్ళ మీదికి ప్రాకి , చీడ మొదలైన దోషాలచే శిథిలము కాకుండా ఉన్న, ఈ భక్తిలతామ తల్లి, పురాకృత పుణ్యకర్మలనే దోహద క్రియలచే వృద్ధి చెంది నామనస్సునకు ఇష్టమైన శాశ్వతఫలములను ఫలించు గాక.*


*వివరణ:~*


*ఈ శ్లోకంలో శంకరులు తమభక్తిని తీగతో పోల్చారు, ఈశ్వరుని పాదపద్మములను మొక్క చుట్టూ నీరు నింపడానికి త్రవ్వే పాదు తో పోల్చారు. శంకరులు తమ భక్తి అనే లత పెరిగి అభీష్ట ఫలాలను ప్రసాదించేది కావాలని కోరుకున్నారు. ఆ భక్తి లతకు ఈశ్వరునిపై గల ప్రీతి లేక ప్రేమ అనేది నీరు. ఈ భక్తి లత ఈశ్వరుని పాదపద్మం అనే పాదులో పుట్టింది. భక్తి లోని స్థిరత్వమే , ఈ భక్తిలతకు నిలువుగా పైకి ప్రాకడానికి పాతే వెదురు కఱ్ఱ. ఈ భక్తి లత మనస్సనే పందిరిపైకి ప్రాకి కొమ్మ,రమ్మలతో విస్తరిస్తోంది. భక్తిలత చీడ పీడ వంటి దోషాలతో చెడిపోకుండా, పురాకృత పుణ్య కర్మములు అనే దోహద క్రియలతో వృద్ధి పొంది శాశ్వతమైన అభీష్టఫలమును అంటే శాశ్వతమైన మోక్షఫలాన్ని ఇస్తుంది.*


*ఈశ్వరుని పాదపద్మములను ఆధారంగా చేసుకొని ఏర్పడిన భక్తి పూర్వ పుణ్య విశేషం చేత స్థిరపడి హృదయంలో వ్యాపిస్తుంది.* *శ్రవణము, కీర్తనము, స్మరణము, అర్చన, మొదలయిన భక్తి మార్గాల ద్వారా అది మరింత వృద్ధి చెందుతుంది. భగవంతుని సేవను తప్ప మరేదీ కోరక పోవడంతో ఆ భక్తి నిష్కల్మషముగా ఉండి శాశ్వత అభీష్ట ఫలములను అనగా పునరావృత్తి రహిత నిష్కళంక ముక్తిని ప్రసాదిస్తుంది. నిత్యమూ అభీష్టమైన ఫలములను ప్రసాదిస్తుంది అని కూడా చెప్పవచ్చు.*


*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

Panchang


 

సోమవారం🕉️* *🌹24, మార్చి, 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*   

    *🕉️సోమవారం🕉️*

*🌹24, మార్చి, 2025🌹*

   *దృగ్గణిత పంచాంగం*                  


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిరఋతౌః*

*ఫాల్గుణ మాసం -  కృష్ణపక్షం*


*తిథి         : దశమి* (25) తె 05.05 వరకు ఉపరి *ఏకాదశి*

*వారం    : సోమవారం* (ఇందువాసరే)

*నక్షత్రం   : ఉత్తరాషాఢ* రా 04.27 తె వరకు ఉపరి *శ్రవణం*


*యోగం  : పరిఘ* సా 04.45 వరకు ఉపరి *శివ*

*కరణం   : వణజి* సా 05.27 ఉపరి *భద్ర* పూర్తిగా రాత్రంతా


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 06.00 - 07.00 & 11.00 - 12.00*

అమృత కాలం  : *రా 10.00 - 11.37*

అభిజిత్ కాలం  : *ప 11.49 - 12.38*


*వర్జ్యం                  : మ 12.21 - 01.57*

*దుర్ముహూర్తం  : మ 12.38 - 01.27 & 03.04 - 03.53*

*రాహు కాలం   : ఉ 07.40 - 09.11*

గుళికకాళం      : *మ 01.45 - 03.16*

యమగండం    : *ఉ 10.42 - 12.14*

సూర్యరాశి : *మీనం* 

చంద్రరాశి : *ధనుస్సు/మకరం*

సూర్యోదయం :*ఉ 06.08*

సూర్యాస్తమయం :*సా 06.19*

*ప్రయాణశూల  : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 06.08 - 08.35*

సంగవ కాలం         :      *08.35 - 11.01*

మధ్యాహ్న కాలం    :      *11.01 - 01.27*

అపరాహ్న కాలం    : *మ 01.27 - 03.53*


*ఆబ్ధికం తిధి         : ఫాల్గుణ బహుళ దశమి*

సాయంకాలం        :  *సా 03.53 - 06.19*

ప్రదోష కాలం         :  *సా 06.19 - 08.41*

రాత్రి కాలం               :  *రా 08.41 - 11.50*

నిశీధి కాలం          :*రా 11.50 - 12.37*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.33 - 05.20*

________________________________

        *🌷ప్రతినిత్యం🌷*

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*నటరాజ స్తోత్రం (పతంజలి కృతం)*

*అథ చరణశృంగరహిత శ్రీ నటరాజ స్తోత్రం*


*అజం క్షితిరథం భుజగపుంగవగుణం*

*కనక శృంగి ధనుషం కరలసత్*

*కురంగ పృథు టంక పరశుం రుచిర కుంకుమ రుచిం డమరుకం చ దధతమ్ ।*


    🕉️ *ఓం నమః శివాయ*🕉️


🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

 🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

ఆదమరిస్తే

 *ఆదమరిస్తే.. బ్యాంకు ఖాతా ఖల్లాస్‌*


ఒకప్పుడు బ్యాంకుకు నేరుగా వెళితే తప్ప ఆర్థికలావాదేవీలు జరిగేవి కావు. ఇప్పుడంతా ఆన్‌లైన్‌మయమే. కాలు బయటపెట్టకుండా అరచేతిలోని సెల్‌ఫోన్‌ ద్వారానే ఆ లావాదేవీలు పూర్తి చేసేస్తున్నాం. ఇందుకు దోహదం చేస్తున్న పరిజ్ఞానమే మోసగాళ్లు రూ.కోట్లు కొల్లగొట్టడానికీ కారణంగా మారింది. కూర్చున్న చోటు నుంచే నేరాలకు పాల్పడే హైటెక్‌ మోసగాళ్లకు సాంకేతికత ఆయుధంగా మారింది. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ మోసాలు ఎలా జరుగుతాయి..? వాటి బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి..?


ఆదమరిస్తే.. ఖాతా ఖల్లాస్‌

రకరకాలు...


ఫిషింగ్‌ స్కామ్స్‌ : మోసపూరిత మెసేజ్‌లు, కాల్స్‌ ద్వారా లాగిన్, వ్యక్తిగత డేటాను దొంగిలించడం.


ఎలా చేస్తారంటే..: బ్యాంకు అధికారుల మాదిరిగా కాల్‌ చేస్తారు. లేదా ఎస్‌ఎంఎస్, ఈ-మెయిల్‌ ద్వారా లింక్‌లు పంపిస్తారు. బ్యాంకు లావాదేవీలకు సంబంధించి పాస్‌వర్డ్‌ అడుగుతారు. ఒకవేళ ఆ వివరాలు చెబితే సొమ్ము మాయమవుతుంది.


కార్డ్‌ ఫ్రాడ్‌ : బాధితుల కార్డు వివరాలను వినియోగించి కొనుగోళ్లు జరపడం.


ఎలా చేస్తారంటే.. : ఏటీఎంలు లేదా స్టోర్లలో స్కిమ్మర్లను అమర్చి కార్డు వివరాలను దొంగిలిస్తారు. లేదా బాధితుల కార్డు వివరాలను భౌతికంగా సేకరించి దొంగచాటుగా ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తారు. బ్యాంకు అధికారుల మాదిరిగా ఫోన్‌ చేసి కార్డు వివరాలను తెలుసుకోవడం మరో విధానం.


ఐడెంటిటీ థెఫ్ట్‌ అమాయకుల గుర్తింపుకార్డులను దొంగిలించి నకిలీ ఖాతాలను తెరిచి మోసాలకు పాల్పడటం.


ఎలా చేస్తారంటే.. : బాధితుల వ్యక్తిగత సమాచారాన్ని మోసగాళ్లు దొంగిలిస్తారు. అనంతరం బాధితుల ముసుగులో వారి సన్నిహితులకు మెసేజ్‌లు పంపి డబ్బు అడగడం ద్వారా మోసాలకు పాల్పడతారు.


ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌ మోసాలు బాధితుల ఆన్‌లైన్‌ క్రెడెన్షియల్స్‌ను దొంగచాటుగా సేకరించి మోసాలకు పాల్పడటం.


ఎలా చేస్తారంటే.. : మొబైల్‌ఫోన్‌లోకి మాల్‌వేర్‌ పంపించి ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌ లాగిన్‌ వివరాలను తస్కరిస్తారు. ఆ వివరాల ఆధారంగా అనధికారిక నగదు లావాదేవీలను నిర్వహిస్తారు. అందుకే వెబ్‌సైట్‌ల యూఆర్‌ఎల్‌లను నిశితంగా పరిశీలించాకే ఆన్‌లైన్‌ లావాదేవీలు నిర్వహించాలి. అనుమానాస్పద లింక్‌లను తెరవొద్దు. బ్యాంకింగ్‌ పాస్‌వర్డ్‌లు, పిన్‌నంబర్లు, ఓటీపీలను ఇతరులతో పంచుకోవద్దు.

ఒకవేళ మోసం జరిగితే..


    ఒకవేళ మోసానికి గురైతే వెంటనే కార్డును బ్లాక్‌ చేయించాలి.

    1930కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలి. లేదా నేషనల్‌ సైబర్‌క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌(ఎన్‌సీఆర్‌పీ) వెబ్‌సైట్‌లో ఫిర్యాదును నమోదు చేయాలి.

    ఆర్‌బీఐలోని కంప్లైంట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (సీఎంఎస్‌)కు నివేదించాలి.

    మోసపూరిత లావాదేవీకి సంబంధించిన కాల్‌ రికార్డింగ్స్, ఈ-మెయిల్స్‌లాంటివి కీలకాధారాలవుతాయి. పోలీసులకిచ్చే ఫిర్యాదులో వీటిని జతచేయాలి.


ఈ ప్రక్రియ ఆన్‌లైన్‌ మోసాల గురించి తెలుసుకొని నిఘా ఉంచేందుకు, నియంత్రించేందుకు దోహదపడుతుంది.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే.. 


    వ్యక్తిగత సమాచారం, పాస్‌వర్డ్‌లు, పిన్‌నంబర్లను ఎవరితోనూ పంచుకోవద్దు. 

    బ్యాంకు లావాదేవీల స్టేట్‌మెంట్లను నిశితంగా గమనించాలి. తద్వారా అనుమానస్పద లావాదేవీలు జరిగితే గుర్తించొచ్చు.

    అంకెలు, సంజ్ఞలు, అక్షరాలను మిళితం చేస్తూ ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ పాస్‌వర్డ్‌లను సృష్టించుకోవాలి.

    ఏటీఎంలలో లావాదేవీలు నిర్వహించేటప్పుడు అక్కడి యంత్రాల్లో స్కిమ్మర్లు లేదా కార్డురీడర్లను బిగించారా..? అనేది నిశితంగా గమనించాలి. అలాంటివి ఉంటే సంబంధిత బ్యాంకు అధికారులకు లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలి.

    అనుమానాస్పద లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లో తెరవొద్దు. ఫిషింగ్‌ దాడులను నియంత్రించేందుకు ఇది ఉపకరిస్తుంది.

    ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ లావాదేవీ జరిగిన ప్రతిసారీ సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి. ఏవైనా అనుమానాస్పద లావాదేవీని గుర్తిస్తే వెంటనే ఫిర్యాదు చేసి పోగొట్టుకున్న సొమ్మును తిరిగి తెప్పించుకునే అవకాశముంటుంది.

    సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లలోని సాఫ్ట్‌వేర్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవడంతోపాటు సురక్షితమైన యాంటీవైరస్‌లను నిక్షిప్తం చేసుకోవాలి.


అత్యధికం తెలంగాణలోనే...


    జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక మేరకు 2022లో దేశవ్యాప్తంగా అన్ని రకాల సైబర్‌నేరాలు 64,907 నమోదు కాగా.. తెలంగాణలోనే అత్యధికంగా 15,297 జరిగాయి. అయిదోస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో వీటి సంఖ్య 2,341.

    ఓటీపీ మోసాల్లో తెలంగాణాదే అగ్రస్థానం. దేశవ్యాప్తంగా నమోదైన 2,819 కేసుల్లో తెలంగాణవే 2,179 కావడం గమనార్హం. ఒడిశాలో 201.. మహారాష్ట్రలో 195.. ఆంధ్రప్రదేశ్‌లో 61 నమోదయ్యాయి.

    క్రెడిట్, డెబిట్‌కార్డు మోసాలు దేశవ్యాప్తంగా 1,660 నమోదైతే.. ఒక్క తెలంగాణలోనే 535 నమోదయ్యాయి. బిహార్‌(562కేసులు) తర్వాత స్థానం తెలంగాణదే కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌లో ఇవి 39 నమోదయ్యాయి.

    ఏటీఎంల్లో జరిగిన మోసాలు 1669 నమోదు కాగా.. బిహార్‌లో అత్యధికంగా 638 కేసులయ్యాయి. అనంతరం తెలంగాణలో 624 కేసులు వెలుగుచూశాయి. ఆంధ్రప్రదేశ్‌లో వీటి సంఖ్య 30.

    ఐడెంటిటీ థెఫ్ట్‌ కేసులు దేశవ్యాప్తంగా 5662 నమోదయ్యాయి. కర్ణాటకలో అత్యధికంగా 3752 కేసులుండగా.. తెలంగాణలో 77, ఆంధ్రప్రదేశ్‌లో 82 నమోదయ్యాయి.


ఈనాడు, హైదరాబాద్‌

కంచిలోని బంగారు, వెండి బల్లి

 🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀




🌹కంచిలోని బంగారు, వెండి బల్లి వెనక ఉన్న రహస్యం ఏంటి.............!!

బల్లి మనపై పడిందంటే ఏదోగా వుంటుం ది. ఒళ్లు జలదరిస్తుంది. బల్లులంటే  భయపడే వారు చాల మందే ఉన్నారు. ప్రతి ఇంట్లో బల్లులు వుంటాయి. బల్లులు సాధారణంగా ఇళ్లలో వుంటాయి. ఇంట్లో లైట్ల వద్ద తిరిగే పురుగులను తిని బతుకుతుంటాయి. బల్లి గురించి చాల అపోహలున్నాయి. ఇది విష పురుగు అని. అంటే అది కరవదు గాని అది ఇళ్లలో తిరుగుతుంటుంది కనుక అది ఏదేని ఆహార పదార్థాలలో పడితే దాన్ని తిన్న వారు మరణిస్తారని ప్రజల్లో ఒక అపోహ వున్నది.


అదే విధంగా బల్లి మన శరీరంపై ఏబాగాన పడితే దానికి ఫలితమేమిటి తెలుసుకునే బల్లి శాస్త్రము కూడా ఉన్నది. కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో వున్న బంగారు బల్లిని ముట్టుకున్న వారికి బల్లి వారి దేహంపై ఎక్కడ పడినా దుష్పలితం వుండదని ఒక నమ్మకం. అదే విదంగా బల్లి శరీరం మీద పడిన వారు..... కంచిలోని బంగారు బల్లిని ముట్టుకొని వచ్చిన వారి పాదాలకు నమస్కారము చేస్తే బల్లి పడిన దుష్పలితం వుండదని కూడ ప్రజల్లో మరో నమ్మకం కూడా ఉన్నది.


మనమేదన్నా తలుచు కుంటున్నప్పుడు బల్లి పలికితే అది నిజమవుతుందని కూడ నమ్ముతారు. అది పలికి నపుడు "క్రిష్ణ... క్రిష్ణ " అని అంటారు. చాలా గుడుల గోడల మీద బల్లుల చిత్రాలున్నాయి.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో తూర్పు దిశ నుంచి బల్లి శబ్ధం చేస్తే  రాహు గ్రహ ప్రభావమని అర్థం చేసుకోవాలి. తూర్పు వైపు బల్లి శబ్ధం చేస్తే అనూహ్య భయాలు, అశుభ వార్తలను ముందుగానే మనకు తెలియజేస్తున్నట్లు అర్థమని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.


బంగారు బల్లి అంటేనే తమిళనాడులోని కాంచీపురం కామాక్షి ఆలయం గుర్తుకొస్తుంది. అక్కడి ఆలయంలో బంగారు తొడుగులతో ఏర్పాటుచేసిన బల్లిని తాకితే సకల దోషాలు తొలగి పుణ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. కంచి బంగారు, వెండి బల్లి గురించి పురాణగాధ ఏం చెబుతున్నది ..,?  బంగారు వెండి బల్లుల యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాం...


బంగారు వెండి బల్లికి సంబంధించిన పురాణగాధ ప్రకారం గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు వుండేవారు. నదీ తీరానికి వెళ్లి నీటిని తీసుకువచ్చే సమయంలో కుండలో బల్లి పడిన విషయాన్ని గుర్తించలేదు.అనంతరం దీన్ని చూసిన గౌతమమహర్షి వారిని బల్లులుగా మారిపొమ్మని శపించాడు. శాపవిముక్తి కోసం వారు ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజపెరుమాళ్ ఆలయంలో లభిస్తుందని ఉపశమనం చెప్పాడు. దీంతో వారు పెరుమాళ్ ఆలయంలోనే బల్లులు రూపంలో వుండి స్వామివారిని ప్రార్థించారు.


కొన్నాళ్లకు వారికి విముక్తి కలిగి మోక్షం లభించింది. ఈ సమయంలో సూర్య,చంద్రులు సాక్ష్యంగా వుండటంతో బంగారు, వెండి రూపంలో శిష్యుల శరీరాలు బొమ్మలుగా వుండి భక్తులకు దోషనివారణ చేయమని ఆదేశిస్తాడు.


బంగారు అంటే సూర్యుడు, వెండి అంటే చంద్రుడు అని కూడా అర్థం. సరస్వతీ దేవీ నుంచి శాపవిముక్తి పొందిన ఇంద్రుడు పెరుమాళ్ ఆలయంలో దీనికి గుర్తుగా ఈ బల్లి బొమ్మలను ప్రతిష్టించినట్టు మరో కథనం కూడా ఉంది.


బల్లి ఇంట తిరగాడుతున్నప్పటీకీ ...అది మీదపడితే దోషమనే విశ్వాసం ఎప్పటి నుండో మన ఆచారంలో ఉంది. అలా బల్లి పడినప్పుడు భయపడ కుండా....కంచి కామాక్షి ఆలయంలోని బల్లిని తలచుకుని స్నానం చేసి, ఇష్టదేవతారాధన చేయడం వల్ల ఆ దోషం పోతుందని చెప్పబడుతోంది.


పౌరాణిక ..చారిత్రక నేపథ్యాలను కలిగిన ‘లక్ష్మీ వెంకటేశ్వరస్వామి' క్షేత్రం ఇక్కడ దర్శమిస్తుంటుంది. ఇక్కడి అమ్మవారి మందిరంపైకప్పుకి రెండు బల్లులు చెక్కబడి కనిపిస్తూ ఉంటాయి.


అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు..ఈ బల్లులను తాకుతుంటారు. అప్పటి వరకూ బల్లుల మీద పడటం వల్ల దోషాలు ఏమైనా ఉంటే అవి తప్పకుండా నివారించబడుతాయని స్థల పురాణం చెబుతోంది.


బంగారు బల్లిని తాకటంతో అప్పటివరకూ చేసిన పాపాలు పోతాయన్న నమ్మకం చాలామందిలో ఉంటుంది. అలాంటిది అసలు సిసలు బంగారు బల్లే కనిపిస్తే..? నమ్మటానికి కాస్త కొత్తగా ఉన్నా ఇది నిజం. తాజాగా బంగారు బల్లి కనిపించి అందరిని విస్మయానికి గురి చేసింది.


చాలా అరుదుగా ఉండే బంగారు బల్లులు ఇంకా ఉన్నాయని.. అవికూడా ఎక్కడో కాదు.. మన శేషాచల అడవుల్లో అన్న విషయం తాజాగా బయటపడింది. అంతరించే జాతుల్లో ఒకటిగా చెప్పే బంగారు బల్లులు ఈ మధ్యకాలంలో కనిపించటం లేదు. అలాంటిది శివరాత్రి పర్వదినానికి ఒకరోజు ముందు శేషాచలం ఏడుకొండల్లో కనిపించింది. రాతి గుహలే ఆవాసం.


బంగారు బల్లి శాస్త్రీయ నామం కాలొడాక్టిలోడ్స్ అరీస్. ఇది రాత్రుల్లో సంచరించే నిశాచర జీవి. బంగారు వర్ణం పోలిన ముదురు పసుపు, లేత పసుపు రంగులో మెరిసినట్టు ఉంటుంది.


ఇవి 150 నుంచి 180 మిల్లీ మీటర్ల వరకు పొడవు పెరుగుతాయి. రాతి గుహలు వాటి నివాసానికి అనుకూలం. సూర్యరశ్మి పడని, వేడి తగలని ప్రదేశాల్లో కనిపిస్తాయి. సాధారణంగా చీకటి పడ్డాక గుహల సందుల నుంచి వెలికి వస్తాయి.


అనుకూల వాతావరణంలో జనం చడీచప్పుడు లేనప్పుడు ఒక్కోసారి పగటి పూట బయటకు వస్తాయి. ఇవి 40 నుంచి 50 గుడ్లు పెడతాయి. సాధారణ బల్లుల కంటే గట్టిగా, వింతగా అరుస్తాయి.


శేషాచల అడవిలో శ్రీవారి ఆలయానికి వెనుక మూడు కిలోమీటర్ల దూరంలోని చక్రతీర్థం, 25 కిలోమీటర్ల దూరంలోని రుద్రగళ (యుద్ధగళ) తీర్థం తదితర చల్లటి ప్రదేశాల్లో మాత్రమే బంగారు బల్లి తరచూ కనిపించేది. అయితే ఇటీవల కొన్నాళ్లుగా కనిపించటం లేదని పరిశోధకులు చెబుతున్నార



J N RAO 🙏🙏🙏


☸️🍀☸️🍀☸️🍀☸️🍀☸️🍀☸️🍀

మహాకవి బాణుడు

 🙏మహాకవి బాణుడు🙏

సంస్కృత సాహిత్యంలో విశేష ప్రజ్ఞపాటవములు కలిగిన కవులలో బాణునకు ప్రముఖ స్థానమున్నది. ఆ మహనీయుని గురించి తెలుసుకుందాము 

పద్యకావ్యములనియు, గద్యకావ్యములనిము చంపూకావ్యములనిము, కావ్యములు మూడు విధములు, హర్షచరిత్ర, కాదంబరి, వాసవదత్త, దశకుమార చరిత్ర, గద్యచింతామణి, తిలక మంజరి మొదలగునవి గద్యకావ్యములు, రఘువంశము, శిశుపాలవధ మొదలగునవి పద్యకావ్యములు. గద్యపద్యాత్మక మైనవి చంపూకావ్యములు. అవి రామాయణ చంపు, భారతచంపు, త్రివిక్రమచంపు మొదలైనవి. పైన జెప్ప బడిన గద్యకావ్యములలో కాదంబరీ హర్షచరిత్రములు బాణకవి విరచితములు. కాదంబరి గద్యకావ్యములన్నింటిలో రసవత్తమము. దానిని మించినగద్య కావ్యము ఏ నాఙ్మయములోనులేదని నిశ్చయముగా చెప్పగలను. "కాదంబరీరసజ్ఞానామాహారో పినరోచతే” దాని రసవత్తరము వచింపబడినది. మొదటికృతియగుట చేతనో మరియే కారణముచేతనో గాని హర్ష చరిత్రము కాదంబరికంటె కఠినతరశబ్ద భూయిష్టమైయున్నది. కాదంబరి కధ. వాస్తవచరిత్రకు సంబంధించినది కాదు. అదిపురాణకథవంటిది. హర్షచరిత్రము వాస్తవకథ. 

సూర్య శతకకర్త మయూరుని భార్య ఒక ఆడుబిడ్డను కని గతించింది. క్రమంగా ఆ పిల్ల పెరిగిపెద్దదైనది. బాణునికిచ్చి మయూరుడు కన్యాఫలదానం గడించుకున్నాడు అని పూర్వకవుల వచనము బట్టి బాణుడు, మయూరుడు సమకాలీకులనీ తెలియుచున్నది.

హర్ష వర్ధన మహారాజు ఆస్థానకవి అయిన బాణ భట్టు ఏడవ శతాబ్దానికి చెందిన వాడు .606-647అసలుకాలం గా భావిస్తారు .స్థానేశ్వర అనిపిలువబడే నేటి కనోజ్ జన్మ స్థలం .హర్షుని జీవితచరిత్రను హర్ష హరిత్రగా రాశాడు .బాణుడి ‘’కాదంబరి ‘’జగత్ ప్రసిద్ధం .’’బట్ట బాణుని ముద్దు పట్టి కాదంబరి కధలు చెప్పు చెల్మి కత్తేనాకు ‘’అని తెలుగుకవి ప్రశంసలనందుకొన్నాడు బాణుడు .సంస్కృతం లో తోలి వచన కావ్యం కాదంబరి .ఈ కదా నవలను పూర్తీ చేయకుండానే మరణిస్తే కుమారుడు భూషణ భట్టు పూర్తీ చేశాడని అంటారు బాణుడు చండికా శతకం, పార్వతి పరిణయం నాటకం రాశాడని చెబుతారు .ఈ రెండు గ్రంధాలలో ఆయన చెప్పుకొన్న విషయాల వల్లనే జీవిత చరిత్ర తెలుస్తోంది .’’ముకుట తాడితం ‘’అనే నాటకాన్ని కూడా రాశాడని చంద్రపాలుడు ,గుణ విజయ గణులు చెప్పారు .కాని అది బాణ కృతం కాదు .పార్వతీ పరిణయం వామన భట్ట బాణుడు రాశాడంటారు .కాదంబరి మాటకు నానార్దాలున్నాయి –ఆడుకోయిల ,గోరింక, మద్యం .కోయిల గానం గా పరవశాన్ని కల్గిస్తుంది .గోరింక ళా ముచ్చటగా ఉంటుంది మద్యం లా హృదయానికి కిక్కు ఇస్తుందని సరదాగా మనం అర్ధం చెప్పుకోవచ్చు .

బాణుడి తండ్రి చిత్ర భాను తల్లి రాజా దేవి .హిరణ్య బాహు నదీ తీరం లో ఈ నాటి బీహారు రాష్ట్రంలో చాప్రా జిల్లాలోని ప్రీతి కూట లో పుట్టాడు .భోజక కుటుంబం లో వాత్సాయన గోత్ర సంభవుడు .దేశ సంచారం చేస్తూ ఇంటికి తిరిగి వచ్చాడు .హర్షుడి తమ్ముడు కృష్ణుడు ఆహ్వానం పంపితే వెళ్ళాడు .మనితర లో ఉన్న హర్ష వర్ధనుడిని కలుసు కొన్నాడు .మూకాభినయం తో , కోపాభినయం తో హర్షుని మనసును ఆకర్షించాడు .ఈ నాటి ఔరంగా బాద్ లో హాస్పురా జిల్లాలోని పీరూ గ్రామం లో బాణుడు జన్మించాడని మరోకధనం .’’బాణోచ్చిస్టమిదం జగత్ ‘’అని లోకం లో సామెత ఉంది .అంటే బాణుడు ముట్టి వదలనిదేదీ లేదు .అనగా ఉన్నదంతా బాణుడు ఎంగిలి చేసి వదిలినదే అని భావం. అనగా బాణుడు ఉపయోగించని సంస్కృత పదంలేదు. సంస్కృతపదాలు మొత్తం ఉపయోగించాడని భావం.

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

మా గురువుల్ పరాశరులు

 ఉ.మా గురువుల్ పరాశరులు మాన్యులు వేద పురాణ వేద్య సం

యోగులు, వాగ్మి, ప్రాజ్ఞులు మహోన్నత గోకుల నాథ కృష్ణులా

వాగనుశాసనుం దయను పద్యములన్ రచియింప నేర్చి నే

నీగతి నిల్చి, భక్తి స్మరియించుచుఁ గొల్చుచునుందు భారతీ!౹౹ 103


మ.ముదిగొండాన్వయ వీరభద్రులు దయన్ మోదమ్ముతో నెంచి యీ

సదసద్భావ విశేష నైపుణిని నీ సాహిత్య సాంగత్యమున్

మదికిన్ గూర్చ గ్రహించి, ధీపతులు, సమ్యగ్భావ సంధాన కో

విదులన్ సన్నుతిఁ జేయుచుందుఁ గొలుతున్ వేడ్కన్ సదా భారతీ!౹౹104

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - శిశిర ఋతువు - ఫాల్గుణ మాసం - కృష్ణ పక్షం  - దశమి - ఉత్తరాషాఢ -‌‌ ఇందు వాసరే* (24.03.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*