12, సెప్టెంబర్ 2024, గురువారం

తెలుసుకోవలసిన మంచి విషయాలు

 *అందరూ తెలుసుకోవలసిన మంచి విషయాలు🙏🚩*

ప్రాచీన ప్రదేశాలు - ఆధునిక నామధేయాలు  


భాగవతం, మహాభారతం


1. మహావిష్ణువు గజేంద్రున్ని మొసలి బారి నుంచి రక్షించిన స్థలం - దేవ్ ధాం,నేపాల్.


2. నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం - అహోబిలం,ఆంధ్రప్రదేశ్.


3. జమదగ్ని మహర్షి ఆశ్రమం - జమానియా, ఉత్తర్ ప్రదేశ్.


4. మహీష్మతి (కార్తవీర్యార్జునుని రాజధాని) -మహేశ్వర్,మధ్యప్రదేశ్


5. శమంత పంచకం (పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై దండెత్తి వారి రక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటు) మరియు దుర్యోధనుని చంపిన చోటు-కురుక్షేత్ర, హర్యానా


6. పరశురామక్షేత్రం (పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి విసిరి,సముద్రజలాలను వెనక్కి పంపి తనకోసం నేలను సృష్టించుకొన్న ప్రాంతం) - కేరళ,కర్ణాటక,మహరాష్ట్ర సముద్రతీర ప్రాంతం


7. మహేంద్ర పర్వతం (పరశురాముడు తపస్సు చేసిన స్థలం) - పశ్చిమ ఒరిస్సా


8. నిషాద రాజ్యం (నల మహారాజు రాజ్యం) - గ్వాలియర్ జిల్లా,మధ్యప్రదేశ్


9. వ్యాస మహర్షి పుట్టిన స్థలం- ధమౌలి, నేపాల్


10. నైమిశారణ్యం (వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు,పురాణాలు బోధించిన ప్రాంతం) - సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్


11. వ్యాస మహర్షి చెబుతుండగా, విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసిన చోటు- మన గ్రామం, ఉత్తరాంచల్


12. ప్రతిష్టానపురం (పురూరవుని రాజధాని) -ఝున్సి,అలహాబాద్.


13. సాళ్వ రాజ్యం(సావిత్రీ,సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం)-కురుక్షేత్ర దగ్గర.


14. హస్తినాపురం (కౌరవుల రాజధాని) - హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్.


15. మధుపురం / మధువనం (కంసుని రాజధాని) -మధుర, ఉత్తర్ ప్రదేశ్.


16. వ్రేపల్లె / గోకులం - గోకుల్, మధుర దగ్గర.


17. కుంతిపురి (పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు) - గ్వాలియర్.


18. మద్ర దేశం (పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు) - పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్.


19. ద్రోణనగరి (ద్రోణుడు నివసించిన ప్రాంతం)-డెహ్రాడూన్.


20. గురుగ్రామం (కురుపాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు) - గురుగావ్, హర్యానా.


21. కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం - కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్).


22. పాండవుల లాక్షగృహ దహనం- వర్నాల్, హస్తినాపూర్.


23. కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం - గిర్నార్, గుజరాత్.


24. శ్రీకృష్ణ, బలరాముల ద్వారకా నగరం - ద్వారక,గుజరాత్.


25. హిడింబవనం (హిడింబాసురుడిని భీముడు చంపిన చోటు) -జలాన్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్.


26. విదర్భ (దమయంతి, రుక్మిణిదేవి తండ్రులు యేలిన రాజ్యం) - విదర్భ, మహరాష్ట్ర


27. కుండినపుర (రుక్మిణిదేవి జన్మస్థలం) - కుండినపుర, మహరాష్ట్ర


28. చేది రాజ్యం (శిశుపాలుడు ఏలిన రాజ్యం) - బుందేల్ ఖండ్, మధ్యప్రదేశ్.


29. కారుష రాజ్యం (దంతవక్రుడు ఏలిన రాజ్యం) - దాతియ జిల్లా, మధ్యప్రదేశ్.


30. ఖాండవప్రస్థం / ఇంద్రప్రస్థం (పాండవుల రాజధాని) - ఇంద్రప్రస్థ, ఢిల్లీ దగ్గర.


31. కుచేలుడు నివసించిన చోటు - పోర్ బందర్, గుజరాత్.


32. పాంచాల దేశం (ద్రుపద మహారాజు రాజ్యం) - ఎటాహ్, సహజహంపూర్, ఫారుఖాబాద్ ప్రాంతాలు, ఉత్తర్ ప్రదేశ్.


33. కంప్లి (ద్రౌపది పుట్టినిల్లు,మత్స్యయంత్ర బేధన స్థలం) - కంపిల్, ఉత్తర్.


34. జరాసంధుని భీముడు చంపిన చోటు - జరాసంధ్ కీ ఆఖరా / రణ్ భూమి, బీహార్.


35. కామ్యక వనం,దైత్య వనం (పాండవులు అరణ్య వాసం చేసిన ప్రాంతాలు) - పశ్చిమ హర్యానా.


36. మత్స్య దేశం (విరాట మహారాజు రాజ్యం) -ఆల్వార్,గురుగావ్ నుంచి జైపూర్ వరకు వున్న ప్రాంతం, రాజస్థాన్.


37. విరాటనగరం (పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం) - విరాట్ నగర్,రాజస్థాన్


38. శోణపురం (బాణాసురుడి రాజధాని) - సోనిత్ పూర్, అస్సాం.


39. ప్రాగ్జ్యోతిష్యం (నరకాసురుని రాజధాని) - తేజ్ పూర్, అస్సాం.


40. నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం - ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్.


41. జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం - పర్హాం,ఉత్తర్ ప్రదేశ్.


42. కపిలవస్తు (బుద్ధుని జన్మస్థలం)- నేపాల్ లోని తిలార్కోట్.


43. బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం- బోధ్ గయ, బీహార్.


44. గౌతమ బుద్ధుడు పరినిర్యాణం చెందిన చోటు- కుశీనగర్, ఉత్తర్ ప్రదేశ్.


ప్రాచీన ప్రదేశాలు - ఆధునిక నామధేయాలు.

:::::::::::::::::::::::::::::::::::::

రామాయణం

:::::::::::::::::::::::::::::::::::::


1. భగీరథుడు గంగను భువికి దింపిన స్థలం - గంగోత్రి, ఉత్తరాఖండ్


2. కపిల మహర్షి ఆశ్రమం,(శ్రీరాముని పూర్వీకులు సగర చక్రవర్తి తనయులు 60,000 మంది కాలి బూడిదైన స్థలం.గంగానది వారి భస్మరాసుల మీద ప్రవహించి వారికి పుణ్యలోకాలు ప్రసాదించి బంగాళాఖాతంలో కలుస్తుంది) - గంగాసాగర్, వెస్ట్ బెంగాల్


3. కాంభోజ రాజ్యం - ఇరాన్ ( శ్రీరాముని ముత్తాత రఘు మహారాజు సామ్రాజ్యం ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కజఖిస్తాన్, దాటి యింతవరకూ విస్తరించింది).


4. రక్షస్థలం (రావణుడు తన పది తలలు నరికి శివున్ని పూజించి వరాలు పొందిన చోటు)- లాంగకో, టిబెట్, చైనా


5. పరమశివుని ఆత్మలింగాన్ని గణేశుడు నేలవైచిన చొటు - గోకర్ణ, కర్ణాటక

6. సీతాదేవి భూమిలో లభించిన చోటు - సీతామర్హి, బీహార్


7. మిథిల (సీతాదేవి పుట్టినిల్లు) - జనక్ పూర్, నేపాల్


8. కోసలదేశం - రాజధాని అయిన అయోధ్య నుండి నేపాల్ లోని కొన్ని ప్రాంతాల వరకు ఉన్న ప్రదేశం


9. దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేసిన స్థలం - ఫైజాబాద్,ఉత్తర్ ప్రదేశ్.


10. సరయూ నది (ఈ నదీ తీరంలోనే అయోధ్య నిర్మితమైనది) - ఘాఘర నది.


11. ఆయోధ్య / సాకేతపురం (శ్రీరాముని జన్మస్థలం,బంగారు సీతతో అశ్వమేధ యాగం చేసిన స్థలం,సరయూ నదిలో మునిగి వైకుంఠం చేరిన స్థలం) - అయోధ్య,ఉత్తర్ ప్రదేశ్.


12. తాటక వధ జరిగిన ప్రదేశం - బక్సర్, బీహార్


13. అహల్య శాపవిమోచన స్థలం - అహిరౌలి,బీహార్


14. కుశనాథపురం (విశ్వామిత్రుడు యాగం చేసిన స్థలం) - సుల్తాన్ పూర్, ఉత్తర్ ప్రదేశ్


15. గుహుడు సీతారామలక్ష్మణులను కలిసిన చోటు - శృంగబేరిపురం, అలహాబాద్ దగ్గర

16 దండకారణ్యం - చత్తీస్ ఘడ్ లోని బస్తర్ జిల్లా, ఆంధ్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు.


17. చిత్రకూటం (సీతారామలక్ష్మణులు వనవాసం చెసిన చోటు) - సాత్న జిల్లా, మధ్యప్రదేశ్.


18. పంచవటి (శూర్పణఖ ముక్కూచెవులు కోసిన స్థలం) - నాసిక్, మహరాష్ట్ర.


19. కబంధాశ్రమం - కర్దిగుడ్, బెల్గావి, కర్ణాటక.


20. శబరి ఆశ్రమం - సర్బన్, బెల్గావి, కర్ణాటక.


21. హనుమంతుడు రామలక్ష్మణులను మొదటిసారి గా కలసిన ప్రదేశం - హనుమాన్ హళ్ళి, కొప్పాళ, కర్ణాటక.


22. ఆంజనేయ పర్వతం (హనుమంతుడి జన్మస్థలం), కిష్కింద (సుగ్రీవుని రాజ్యం), ఋష్యమూక పర్వతం -తుంగభద్ర నదీతీర ప్రాంతం, హంపి దగ్గర,కర్ణాటక


23. విభీషణుడు రాముని శరణు కోరిన స్థలం - ధనుష్కొటి, తమిళనాడు.


24. శ్రీరాముడు వానరసైన్యం తో వారధి నిర్మించిన చోటు- రామేశ్వరం,తమిళనాడు


25. రత్నద్వీపం / సింహళం / లంక - శ్రీలంక.


26. అశోకవనం (సీతాదేవి బందీగా ఉన్న ప్రదేశం) - కాండీ దారిలోని సీత ఏళియ, శ్రీలంక


27. శ్రీరాముడు రావణుని వధించిన చోటు - దునువిల్ల, శ్రీలంక


28. సీతాదేవి అగ్నిప్రవేశం చేసిన ప్రాంతం - దివిరుంపోల, శ్రీలంక.


29. వాల్మీకి ఆశ్రమం / సీతాదేవి కుశలవులకు జన్మనిచ్చిన స్థలం / భూదేవిలో ఐక్యమైన స్థలం - ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ నుంచి 30 మైళ్ళ దూరంలోని బితూర్.


30. కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) - కుశార్, పాకిస్తాన్.


31. లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) - లాహోర్, పాకిస్తాన్


32. తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షుడు నిర్మించిన నగరం) - తక్షశిల, పాకిస్తాన్


33. పుష్కలావతి / పురుషపురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం) - పెషావర్, పాకిస్తాన్.


సేకరణ : - మన వేదం🙏🚩

🙏🕉️🔱🔱🕉️🙏🚩

*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 9

 _*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 9 వ భాగము*_

🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿


*తల్లిని జ్ఞాతులకు అప్పజెప్పుట:*


శంకరుని సన్న్యాస వార్త విని కాలడి గ్రామం అంతా ఒక్కసారి గుప్పుమన్నది. ఆర్యాంబకు అండ పోతోందని అంతా బాధ పడ్డారు. “ఎంతటివాడు పుడితేనేమి? పాశాలు త్రెంపుకుని పోతున్నాడు. అందరూ అనుమానిస్తూనే ఉన్నారు. ఏనాడో ఇలా ఉడాయిస్తాడని, అనుకొన్న దంతా అవుతోంది” అని తమలోతాము ఆర్యాంబకు చెప్పుకొంటున్నారు. కాని మరి కొందరు అర్థం చేసికొన్నవారు ధైర్యం మాటలు పలుకుతున్నారు:"ఆర్యాంబా! నీవు ధన్యు రాలవు. మీ వంశానికి అశేష కీర్తి గడించే కొడుకును కన్నావు. మేమంతా నీ హృదయం లో నిండి ఉన్నాం. లోకాన్ని రక్షిస్తోన్న అమ్మవు నువ్వు. నీ సాటి అమ్మ ఏది?' అని కొందరూ, “అమ్మా! వనం లో మొలిచిన మలయజా నివి నీవు. రవిని మించిన తేజస్సు గలవాడు సుతుడు. ఇతడు లోకాలకే వెలుగు” అని మరి కొందరూ, “నీ కుమారుణ్ణి అందరికీ కుమారునిగా చేసావు.శంకరుడు లోక శంకరుడు. లోకాలకు నేడు పండుగ. లోకాలకు జ్ఞాన భాస్కరుడు లభ్యము అయ్యాడు నేడు" అని కొందరు పలు విధాల అభిప్రాయాలు సంతోషాలు వ్యక్తం చేసికొన్నారు. చిద్విలాసంతో ఉన్న శంకరుని చూపులు మిరుమిట్లు గొలుపుతూ చూపరులకు సంభ్రమా శ్చర్యాలు కలగ జేశాయి. అప్పుడు జ్ఞాతుల వంక తిరిగి “లోకానికి సేవ చేయడానికే పుట్టాను. ఆ పుట్టుక నేటితోనే ఆరంభం. కాలడి నిత్య కల్యాణ నిలయం. మా అమ్మ అందరికీ అమ్మగా మీరు చూచు చుండే వారు. మా నాయన ఇచ్చిపోయిన అపార ధనంతో నాకు పని లేదు. మా అమ్మకూ పని లేదు. ఈమె సంగతి తెలియని వారెవ్వరు? ఇలాంటి ఈ అమ్మను మీరు ఎంతో ఆదరిస్తారని నాకు తెలుసును” అంటూ తల్లి రెండు చేతులూ పట్టుకొని జ్ఞాతులకు హస్తగతం చేశాడు బాలశంకరుడు.


*శ్రీ కృష్ణాలయ పునరుద్ధరణ:*


కాలడిలోని తమ ఇంటి ప్రక్కగానే ప్రవహించే పూర్ణానది ప్రక్కన ఆర్యాంబ కట్టించు కొన్న ఆలయంలోని శ్రీకృష్ణుని రోజూ చూచుకొంటూ మురిసిపోతూ వెడుతూ ఉంటుంది. ఒకనాడా పరవళ్ళ సందడిలో ఆలయం ప్రాకారం ప్రవాహపు ధాటికి ఆగలేక పడిపోయింది. ఒకవైపు ఒరిగినది విగ్రహం. ఆ ఆలయం మీద పూచీ ఎవరిది? శంకరునిదని తెలుసును శ్రీకృష్ణుని వారికి. "శంకరా! నీవు ఇల్లువాకిలి వదలి వెళ్ళి పోతున్నావు. ఈ గుడిని ఎవరు పట్టించు కొంటారు?” అన్నట్లుగా ఆకాశవాణి వినబడింది శంకరుని వీనులకు. వెంటనే జాప్యం లేకుండా ఆ ఆలయం బాగుచేయ డానికి తగిన ఏర్పాట్లు కావించాడు. 


*శ్రీకృష్ణాలయము ఎప్పటి వలె కళకళలాడుతూంది*


*ఆర్యాంబ  బెంగ:*


తనయునితో అంటోంది తల్లి: “నాయనా! నాకు జ్ఞాన బోధ చేశావు. లోకానికి సేవ చేయాలం టున్నావు. దేశం కాని దేశం తిరుగు తావు. వేళకాని వేళలు. వేళకింత అన్నం నీకు ఎవరు పెడతారు? ఎవరాదరిస్తారు? మాటాడితే పెద్దపెద్ద కబుర్లతో కడుపు నింపు తావు. ఎన్నడూ ఎవర్నీ దేహి అని అడిగిన వాడవు కాదు. నీ గురించి బెంగతో నా కడుపు తరుక్కు పోతున్నది”. అమ్మ వేదన విన్న శంకరుడు ఇలా అంటాడు: “అమ్మా! అదా నీ బెంగ! వినలేదా ఈ శ్లోకం?


‘సత్యం మాతా పితా జ్ఞానం

ధర్మం భ్రాతా దయా సఖా 

శాంతం పత్నీ క్షమా పుత్రా 

షడైతే మమ బాంధవా:’ 


అమ్మా! నాకు కూడా ఆరుగురు వెంటాడుతూనే ఉంటారు. తల్లీ, తండ్రీ, భ్రాత, సఖుడు,పత్నీ, పుత్రుడు వీళ్ళే పరివారం. వాళ్ళెవళ్ళూ ఎవరికీ కనబడరు. కాని నాలో ఉంటారు. సత్యం తల్లి గాను, జ్ఞానం తండ్రి గాను, ధర్మం సోదరుడు గాను, దయ మిత్రుడు గాను, శాంతము భార్య గాను, క్షమ పుత్రుడు గాను ఉంటూ నన్ను ఎన్నడూ విడనాడక నా బాగోగులు సర్వదా చూచుకొంటారు.


"అమ్మా! సత్యవ్రతం తల్లిలాంటిది. తల్లి ఎన్ని విధాల బిడ్డణ్ణి కంటికి రెప్పలా కాపాడుతుందో సత్యం కూడా జీవికి అండగా ఏడుగడగా ఉంటుంది. మరి తండ్రి తనయుని చదువు సంధ్యలు మొదలయినవి ఎన్నో సమకూరుస్తాడు జ్ఞానము వలెనే. ధర్మ ప్రవర్తన సోదరుని వంటిది. శరీరానికి అవయవాలు ఏ రీతిగా సహాయ సంపత్తి సమకూరుస్తాయో అలాగే సోదరుడు సహకరిస్తాడు కదా! ఇక మిత్రులు ఫలాపేక్ష లేకుండా చేదోడు వాదోడుగా ఉండేవారు కదా! దయాగుణం మిత్రుడి వంటిది. లోకంలో భార్య అన్నది ఎంతో ఓర్పుతో నేర్పుతో తన భర్తకు పిల్లలకు సకలోప చారాలుచేస్తూ, సంసారాన్ని సముద్రుడి వలె గంభీరంగా భరిస్తుంది. అదే శాంత మంటే. పుత్రులు ముసలి తనంలో తల్లిదండ్రులను ఆదుకొనేవారు. క్షమతో ఓర్పుతో ఆ లోటుండదు. అన్నీ చక్క బడతాయి. నా భవిష్యజ్జీవనంలో ఈ గుణాలే నన్ను రక్షించాలి. తదనుగుణంగా ఉంటుంది నా ప్రవృత్తి. నీవు ఏమీ భయపడ నవసరం లేదు. ఇక నాకు ముందు ముందు పని ఉంది. 

శత్రువులన్న వాళ్ళు ఎదుటి వారిని నాశనం చేయడానికి పొంచి ఉంటారు. వాళ్ళకు నిద్రాహారాలు ఉండవు. శత్రు రాజులచే జయింప బడితే ప్రజల్ని పీడిస్తారు. అది బహిశ్శత్రువుల ప్రభ. ఇక అంతశ్శత్రువుల మాట? కంటికి  కనుపిం చని శత్రువులు వీళ్ళు. లెక్కకు పదముగ్గురు. ఒక్కొక్కడు ఒక శాఖకు అధిపతి. వీరందరికీ సర్వసేనాధ్యక్షుడు చిత్త వృత్తి. మరొక పేరు కాముడు. తక్కిన వారందరూ వీనికి దాసులు. ఈ కాముణ్ణి జయిస్తే మిగిలినదంతా సులభమే. శంకరుడు సహజ విరాగి, విజ్ఞాని. అంతరంగవైరులే ఈయన ముందు తలవంచుకొని పారి పోవలసిందే.


*సన్న్యాస యోగము:*


తపస్సు, యజ్ఞ యాగాది క్రతువులూ, దానధర్మాలు తప్పక ఆచరించమని శాస్త్రాలు చెప్పుతున్నాయి. ఇవన్నీ మానవులు పవిత్ర చిత్తులవడానికి వైరాగ్య సిద్ధికి మార్గాలుగా నిర్దేశించారు. కర్మలు చేస్తూ ఉన్నా, తత్కర్మఫలాలను అపేక్షించ కూడదు. కామ్యకర్మలు అసలే మానితే అది సన్న్యాస మవు తుంది. కర్మలు చేస్తూ కర్మఫలం పరమేశ్వరా యత్తం చేసి సన్న్యాసి అనిపించుకోవచ్చు. మనకు నాలుగు ఆశ్రమాలు ఏర్పరచారు: వివాహ మయ్యేంత వరకు బ్రహ్మచర్యం, విహితకర్మా చరణలతో కూడిన గార్హస్థ్యం. ఆ తరువాత గృహసుఖాలకు దూరమై, ఎక్కడో వనంలోనికి పోయి నియమితమైన కట్టుబాట్ల కు లోబడి గడిపే తపో జీవనం వానప్రస్థ్యం. సద్బుద్ధితో ఆలు, బిడ్డల్ని, ఇల్లూ వాకిలి వీడి విరాగియై నడిచేది తుది ఆశ్రమం సన్న్యాసం. సన్న్యాసాశ్రమంలో ప్రవేశించే వ్యక్తి విధిగా కొన్ని శ్రాద్ధకర్మలు పెట్టాలి. మొదట వైశ్వదేవశ్రాద్ధము, తర్వాత నాందీముఖ శ్రాద్ధము, దైవశ్రాద్ధము, ఋషి శ్రాద్ధము, దివ్య శ్రాద్ధము, మానుషశ్రాద్ధము, పితృశ్రాద్ధము, మాతృ శ్రాద్ధమూ పెట్టాలి. ఇవన్నీ ముగించి తన శ్రాద్ధము తానే పెట్టుకోవాలి.


శక్తి ననుసరించి వీటి కన్నింటికీ ధనం వెచ్చించాలి. భూదానం, అన్నదానం, వస్త్రదానం శక్తివంచన లేకుండా చేయాలి. మూడవనాటి కర్మకాండకున్న ధనంలో కొంత మిగుల్చుకొని శేషించినది పుత్రుల కిచ్చివేయాలి. ఆ పైన బంధు మిత్రులతో విందు ఆరగించాలి. ఆనాడు దిగులుండ కూడదు. దాన్ని కనిపెట్టడానికి ఉపాయం చెప్పారు. దిగులుతో ఉన్నవానికి అన్నం రుచించదు. రుచి కలుగని నాడు ఉపవాసం చేయాలి. శ్రాద్ధాన్నాన్ని వాసన చూడాలి. మరునాడే భోజనం. తొలినాడు క్షురకర్మ ఆచరించాలి. స్నానం చేసి మంచి వస్త్రాలు ధరించాలి. అప్పుడు తనకు ఉపదేశం చేసే గురువుకీ సన్న్యాసికీ యుక్తవస్తువులు దానం చేయాలి. ఉపదేశగురువు కడు సమర్థుడై ఉండాలి. ఆనాడు విధివిహిత కర్మ యావత్తూ ఆచరించాలి. తదుపరి నారాయణ ఉపనిషత్తు పఠిస్తూ బంధుమిత్రులతో కలిసి దగ్గరలోని నదికిగాని తటాకానికిగాని వెళ్ళాలి. తన అపరాధాల నన్నిటినీ క్షమించమని వేడుకోవాలి. బంధుమిత్రులు వెళ్ళిన తరువాత ఆ నీట దిగి తానాచరించవలసిన కర్మను ముగించుకోవాలి. ఇంత కాండా సర్వులూ చేయాలా అన్న ప్రశ్న ఉదయిస్తుంది. వృద్ధులూ, రోగులూ,అవసాన దశలో ఉన్నవారు, విపత్తులో ఉన్నవారూ కర్మకాండ చేయలేరు కదా. అట్టివారికి 'ఆతుర సన్న్యాసం' విధించారు. ఆపద్దశలో ‘సన్న్యస్తం మయా' అని ముమ్మారు పలికితే చాలు. సన్న్యాస స్వీకార ఫలం. గడచిన 101 తరాల, రాబోయే 300 తరాల పితృదేవతలూ తరిస్తారని జాబాలముని మతం.


అయితే ఈ తుది ఆశ్రమం అనుసరించడమంటే చెప్పినంత తేలిక కాదు. మతి నతి నిర్మలంగా ఉంచుకోవాలి. వశీకృత చిత్తుడై ఉండాలి. శబ్ద స్పర్శజ్ఞానం తెలియ కూడదు. లేకపోతే స్పర్శతో కాయం పరవశం అవుతుంది. శబ్దం వినబడి తే తన పని దగ్ధమౌతుంది. రాగద్వేషాలను పార ద్రోలాలి. ద్వేషం మంటలను పుట్టిస్తుంది. మమ అనేదాన్ని మరువాలి, విడువాలి. ధ్యానయోగంలో నిమగ్నుడై ఉండాలి. ఏకాంతవాసం వైరాగ్యం వృద్ధిపొందించు కోవాలి.


మనస్సూ వాక్కూ అధీనం లో ఉండాలి. ఇన్ని ఉన్నా శాంతి లేకపోతేప్రయోజనం ఉండదు. ఈ సన్న్యాస ధర్మాలన్నీ క్షుణ్ణంగా అవగాహన చేసికొన్నవాడు శంకరుడు. సన్న్యాస మంటేనే ఆయన జీవితం!


*సద్గురువుకై అన్వేషణ:*


ఆ గురువులు పలురకాలు. చదువు చెప్పే గురువు ఆయనకు అక్కరలేదు. ఆయనకు పనికి వచ్చే గురువు శంకరుని కన్న అధికుడై ఉండాలి. తెరను తొలగించి రహస్యాన్ని వ్యక్తం చేయగల గురువు కావాలి. రహస్యమంతా నాలుగు మహా వాక్యాలలో ఇమడ్చబడి ఉన్నది. ఆ వాక్యాలు ఇవి: 


*తత్త్వమసి. అహంబ్రహ్మాస్మి. అయమాత్మా బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ.*


ఆ వాక్యాలకు అర్థం చెప్పేవారు కావలసినది. ఆ వాక్యాల భావాల స్వరూప వంతుణ్ణి తయారు చేసే సామర్థ్యంకల గురువు కావాలి. అట్టి గురువు లభిస్తే అఖండజ్ఞానం ప్రాప్తిస్తుంది. అలాంటివారు ఒకరిద్దరు ఉండకపోరు. దొరకాలంటే పూర్వపుణ్య ఫలం ఉండాలి. అలాంటి మహాయోగ సంపన్నుడు శంకరుడు. గురువులు అందరూ ఒకలాగున ఉండరు. గూఢుడు, ప్రీతుడు, మౌని, సకృత్కామగతుడు అని రకాలు. వీరిలో మరల విహంగమ, కూర్మ, మత్స్య భేదాలు ఉన్నాయి. విహంగమ గురుడు ఎలా ఉంటాడు? పక్షి తన పక్షాల క్రింద గ్రుడ్లను పొదిగి పిల్లలను చేస్తుంది. పక్షి వలె హస్త మస్తక సంయోగంతో తన శిష్యుని అజ్ఞానావరణంలో నుండి తొలగించి తనంతవానిగా చేస్తాడు. దీనినే విహంగ వృత్తి అంటారు. తాబేలు గ్రుడ్లు పెట్టి ఎక్కడో సంచరిస్తుంది. దానికి ఎప్పుడో గ్రుడ్ల మాట జ్ఞాపకం వస్తుంది. ఈ లోగా ఆ గ్రుడ్లు పగిలి పిల్లలు బయటికి వస్తాయి. ఇది కూర్మ వృత్తి. ఇందులో శిష్యులకు గురువు దూరంగా ఉంటాడు. కాని శిష్యుడు తనంత వాడు కావాలన్న దృఢ సంకల్పం ఇందులో ఉంటుంది. అందువలన శిష్యులు జ్ఞానులౌతారు. చేప కూడా గ్రుడ్లు పెడుతుంది. అవి ఎక్కడో నీటి అడుగున బుఱదపై ఉంటాయి. అప్పుడప్పుడు వెళ్ళి చూసి వస్తుంది. అప్పుడా గ్రుడ్లు పగిలి పిల్లలు బయటికి వస్తాయి. అదే విధంగా గురుదేవులు శిష్యులపై తమ ప్రసాద దృష్టి ప్రసరింపజేసి శిష్యుణ్ణి అనుగ్రహిస్తారు.


ఇది కాక వేదాంత విజ్ఞాన పధంలో నాలుగు విధాల వారున్నారు:


*బ్రహ్మవిదుడు, బ్రహ్మవిద్వరుడు, బ్రహ్మవిద్వరీయుడు, బ్రహ్మవిద్వరిష్ఠుడు.*


శాస్త్రం చెప్పినది తాను ఆచరిస్తూ, శిష్యుని తరింపజేసే వానిని గూఢగురువని, బహ్మ విదుడని అంటారు. తాను చేయవలసిన మంచి పనులు కూడా మరచి జ్ఞానదానంచేసే వాడే పరమహంస. దృఢగురువు అనికూడా పిలువబడు తాడు. ఆహారం మాత్రం విడిచిపెట్టక ఇతరములన్నీ మాని ఉండేవాడే బ్రహ్మ విద్వరుడు. అట్టివానిని ప్రీతుడని కూడా వ్యవహరి స్తుంటారు. సదా నిర్వికల్ప సమాధిలో ఉంటూ తెలివి వచ్చినపుడు మాత్రమే ఏదయినా సేవించేవాడు సకృత్కామగతుడనీ, బ్రహ్మవిద్వరిష్ఠుడు అనబడతాడు. అంతంత ప్రభావాలుండి బ్రహ్మాదులు కూడ గుర్తించలేనంత శక్తిమంతులై ఉంటారు గురువులు. సద్గురువుకై అన్వేషించుకోవడం, దొరికిన గురువును పరీక్షించు కోవడం శిష్యుని విధి. అందుకొరకే శంకరుని ప్రయాణము.


*కైలాస శంకర కాలడి శంకర*

*శ్రీ శంకరాచార్య చరిత్రము* 

*9 వ భాగము*

♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️

వైద్యం నందు జలగలు

 ఆయుర్వేద వైద్యం నందు జలగలు ఉపయోగించే విధానం  -


       జలము ఆయువుగా కలవి కావున జలాయుకములు అనియు , జలము నివాసస్థానం కలవి కావున జలౌకలని మరియు జలగలు అని పిలవబడుతున్నవి.  ఇవి 12 విధములు గా ఆయుర్వేదం విభజించింది. ఇందు విషము కలిగినవి నల్లటి రంగులోని బేధము వలన 6 విధములు .  అందు కృష్ణ అనునది కాటుక రంగు పెద్ద శిరస్సు గలది. కర్బూర  అనునది బొమ్మిడ అను చేప వంటి ఆకృతి కలిగి ఒకచోట చిన్నగా , మరొకచోట పెద్దగా ఉండు పొట్ట కలిగి ఉండును. కలగర్ద అనునది ముడుతలతో కూడి ఉండి పెద్ద పార్శ్వములతో కలిగిన ముఖం 

ఉండును. ఇంద్రాయుధ అనునది ఇంద్రధనస్సులోని నానారంగులు గల నీలపు చారలతో కూడుకుని ఉండును. సాముద్రిక అనునది కొద్దిగా నలుపు , పసుపు రంగులతో ఉండి అనేక ఆకృతులుగల తెల్లని మచ్చలతో కూడుకుని ఉండును. గోచందనం అనునది ఆంబోతు బుడ్డ వలే పొట్ట యందు ఒక గీత కలిగి సన్నని ముఖం కలిగి ఉండును.


           పైనచెప్పిన 6 రకాల జలగలు విషము కలిగి ఉంటాయి. ఇవి కరిచినచో కాటునందు వాపు , మిక్కిలి దురద, మూర్చ, జ్వరం, తాపము , వాంతి  కలుగును. 


        ఇప్పుడు మీకు విషము లేని జలగలు గురించి వివరిస్తాను. విషములేని జలగలు మొత్తం 6 రకాలు .  అందులో కపిల అనునది ప్రక్కల యందు మనశ్శిలతో రంగు వేసినట్లు ఉండి వీపున నిగనిగలాడుచూ పెసలవలే ఆకుపచ్చ రంగు కలిగి ఉండును.  పింగళి అనునది కొంచం ఎరుపు రంగు గుండ్రని శరీరం పచ్చని రంగు ఉండి వేగముగా కదులును. శంఖముఖి అనునది యకృత్ వలే ఎరుపు నలుపు రంగులు కలిగి శీఘ్రముగా రక్తమును తాగే స్వభావం పొడవైన వాడి అయిన ముఖం కలిగి ఉంటుంది. మూషిక అనునది ఎలుక వంటి ఆకారం , రంగు , దుర్వాసన కలిగి ఉంటుంది. పుండరీకం అనునది పెసల వలే పచ్చని రంగు , పద్మముల వలే విశాలమైన ముఖం కలిగి ఉండును.  సావరిక అనునది నిగనిగలాడుచూ తామరాకు వంటి రంగు కలిగి 18 అంగుళముల పొడవు కలిగి ఉండును. ఇది ఏనుగులు, గుఱ్ఱములకు చికిత్స చేయుటలో మాత్రమే వాడవలెను .మనుష్యులకు పనికిరాదు. వీటిని నిర్విష జలగలు అందురు.


             ఈ విషము లేనటువంటి జలగలు లభించు ప్రదేశాలు ముఖ్యంగా ఢిల్లీకి పశ్చిమ దిశలోను , సహ్యాద్రి పర్వతాలు అనగా నర్మదా నది ప్రవహించు పర్వత ప్రాంతాలలోను, మధురా ప్రాంతంలోనూ ఈ విషము లేనటువంటి జలగలు ఉండును. ఈ ప్రదేశాలలో లభించు జలగలు పెద్ద శరీరం కలిగి మంచి బలముతో ఉండి శీఘ్రముగా రక్తమును పీల్చెడి స్వభావం ఎక్కువుగా ఉండి విషము లేకుండా ఉండును.


         విషముతో కూడిన చేపలు , పురుగులు , కప్పలు , మూత్రపురీషములు క్రుళ్ళుట చేత పుట్టిన జలగలు మరియు కలుషిత జలము నందు పుట్టిన జలగలు, నీటిలోని పద్మములు కుళ్లుటచేత పుట్టిన జలగలు విషపూరితంగా ఉండును.  శుద్ధజలము నందు పుట్టిన జలగలు విషం లేకుండా ఉండును.


            ఇప్పుడు జలగలను పట్టే విధానం వాటిని పోషించే విధానం మీకు తెలియచేస్తాను .


     రక్తముతో కూడిన తోలు , జంతుమాంసం , వెన్న , నెయ్యి, పాలు మొదలగు వాటితో  కూడిన అన్నమును జలగలు ఉన్న ప్రదేశంలో వేసినచో అవి పైకి వచ్చును. అప్పుడు వాటిని పట్టుకొని మంచి కుండలో చెరువునీటిని , బురదని పోసి అందులో ఉంచవలెను. వాటికి తిండి కొరకు నాచు, ఎండిన మాంసము , నీటిలో పుట్టే దుంపల చూర్ణం ఇవ్వవలెను. అవి నిద్రించుటకు గడ్డి, నీటి యందు పుట్టే పచ్చి ఆకులను ఆ కుండ నందు వేయవలెను .  రెండు మూడు రోజులకు ఒకసారి ఆ కుండ యందలి నీటిని తీసివేసి కొత్తనీటిని పోసి ఆహారం కూడా కొత్తదానిని వేయవలెను . ప్రతి ఏడు రోజులకు ఒకసారి కుండను మార్చవలెను . ఈ జలగలను శరత్కాలం పట్టుకొనుట మంచిది .


      జలగలను వైద్యంలో ఎలా ఉపయోగించాలో మీకు వివరిస్తాను.


            జలగలచే పోగొట్ట తగిన రోగము కలిగిన వానిని కూర్చుండబెట్టి కాని , పడుకోపెట్టి కాని జలగ పట్టించవలసిన ప్రదేశములో వ్రణము లేనిచో ఆ ప్రదేశంలో ఎండించిన ఆవుపేడ చూర్ణం , మన్ను కలిపి మర్దన చేయవలెను . ఆ తరువాత జలగలను తీసుకుని ఆవాలు , పసుపు కలిపి నూరి కలిపిన నీటిలో ముంచి వేరొక మంచినీటి పాత్రలో ముంచి వాటిని రోగమున్న ప్రదేశములో పట్టించవలెను. ఆ తరువాత ఆ జలగకు మంచి కాటన్ గుడ్డ ముక్కతో  ముఖము విడిచి శరీరం అంతయు కప్పవలెను. అప్పుడు ఆ జలగ రోగ స్థానమును పట్టును . అలా పట్టనిచో ఆ రోగస్థానం పైన పాలచుక్క గాని  రక్తపుచుక్క గాని వేయుట లేక కత్తితో గీయుట చేసినచో జలగ వెంటనే రోగస్థానమును పట్టును . అప్పుడు కూడా జలగ పట్టనిచో దానిని వదిలి వేరొక జలగ పట్టించవలెను .


                   జలగ ఎప్పుడూ తన ముఖమును గుర్రపుడెక్క వలే విస్తరించి స్కంధమును పైకెత్తి రోగస్థానమును తగులుకొనునో అప్పుడు అది రక్తమును పీల్చుతుంది అని అర్ధంచేసుకొనవలెను వెంటనే దానిని తడిగుడ్డతో కప్పి మధ్యమధ్యలో  తడుపుచుండవలెను . అలా చేస్తున్నచో రక్తం బాగుగా పీల్చును. ఆ పీల్చుటలో ముందుగా దుష్టరక్తమునే పీల్చును .


            జలగ రక్తం పీల్చుతూ ఉన్నప్పుడు కొంత సమయం తరువాత పోటు , దురద మొదలగుచున్న అప్పటివరకు అది దుష్టరక్తం పీల్చి ఆ తరువాత మంచిరక్తం పీల్చడం మొదలు అయినది అని అర్థం . ఆ తరువాత వెంటనే జలగను తీసివేయవలెను . రక్తం యొక్క రుచి మరిగి ఆ జలగ రానిచో దాని ముఖము పైన సైన్ధవ లవణము వేసినచో విడిచివేయును .


        చెడు రక్తం పీల్చిన జలగను శుద్దిచేయు విధానం గురించి మీకు తెలియచేస్తాను.


      పైన చెప్పినట్టు రోగస్థానమును విడిచిన జలగకు శరీరం పైన బియ్యపు పిండిని పూసి ముఖం నందు నూనె, ఉప్పు కలిపి రాసి ఎడమచేతితో తోకను పట్టుకొని కుడిచేతితో ముఖము వరకు ఆవుపాలు పితికినట్లు చేయవలెను . ఈ విధంగా చేస్తూ తాగిన రక్తమును బయటకి కక్కునట్టు చేయవలెను . ఆ తరువాత ఆ జలగను శుభ్రపరచి మంచినీటితో కూడిన పాత్ర యందు ఉంచవలెను. అప్పుడు అది ఉత్సాహముగా సంచరించును. అలా సంచరించకుండా కదలక మొద్దుగా ఉన్నచో చెడురక్తం దాని శరీరం నుంచి పూర్తిగా బయటకి పోలేదు అని గ్రహించి మరలా కక్కించు ప్రయత్నం చేయవలెను . కక్కించాక మరలా కుండ నందు భద్రపరచవలెను.


       జలగతో రోగనివారణ క్రియ చేశాక చేయవలసిన విధి గురించి వివరిస్తాను.


          జలగ ద్వారా చెడు రక్తం తీసాక ఆ గాయమునకు ఔషదాలు కలిపిన ఆవునెయ్యి పూయవలేను . కొందరికి తేనె కూడా పూయవచ్చు.


      పైన చెప్పిన జలగతో చెడు రక్తాన్ని తీయు విధానాన్ని రక్తమోక్షణం అంటారు. ఈ క్రియను రోగి యెక్క బలం, రోగం యొక్క బలాన్ని అంచనా వేసుకొని మాత్రమే అంచనా వేసుకొని చేయవలెను .


      ********** సంపూర్ణం ************


      మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


  గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

పూజల్లో రాగిపాత్ర

 పూజల్లో రాగిపాత్రల విశిష్టత

-- విభాతమిత్ర( జనార్దన శర్మ)



నేను మొన్న పూజల్లో రాగి పాత్రలు మాత్రమే వాడాలి, వెండి వాడకూడదు అని చెప్పాను.  అది వాయు పురాణములో ఉంది అని కూడా చెప్పాను. 

తర్వాత, ఇంకా గ్రంధాలు పరిశీలించగా,  ఇంకా కొన్ని పురాణాలలో రాగి పాత్రల వైశిష్ట్యత వివరించబడింది అని తెలిసింది. కాని నేను పరిశీలించిన గ్రంధాలు మూల సంస్కృత గ్రంధాలు కావు. ఎవరో తర్జుమా చేసి, సంక్షిప్తము చేసి వ్రాసినవి.  వీటి మూల సంస్కృత గ్రంధాలు ఒకటి రెండు చూశాను గాని, అవి వేల పేజీలు ఉన్నాయి. కొన్నిటికి విషయ సూచిక లేదు. 

అయితే, ఇప్పటికి నాకు తెలిసిన సమాచారము ప్రకారము, కింది పురాణాలు రాగిపాత్రల విశిష్టతను తెలుపుతున్నాయి

.

అగ్ని పురాణము-- [ ౨౧౫ అధ్యాయము, పదవ శ్లోకము ] లో 

యజ్ఞాలలో రాగి పాత్రల ప్రాశస్త్యము, దానివల్ల ఆధ్యాత్మిక శక్తుల అభివృద్ధి వంటివి వివరించబడినాయి

భవిష్య పురాణము--[ ౧౪౩ అధ్యాయము, ౧౫ వ స్లోకము ] 

దేవతా పూజలో రాగిపాత్రలను వాడితే అది ఆయా దేవతలను సంతృప్తి పరచును అని చెపుతుంది

గరుడ పురాణము --[ ౧౨౫ అధ్యాయము, ౨౦ వ శ్లోకము ]

భగవదారాధనలో రాగి పాత్రలు వాడుట వలన మనసును, ఆత్మను శుద్ధి చేస్తుంది అని వివరిస్తుంది

మత్స్య పురాణము--[౨౪౫ అధ్యాయము, ౧౦ వ శ్లోకము ]

క్రతువులలో రాగి పాత్రలు ఉపయోగించుట యొక్క ప్రాముఖ్యతను తెలుపుతుంది, దాని వల్ల, ఆధ్యాత్మిక అభివృద్ధి, మరియు సకల సంపదలు కలిగిస్తుంది 

స్కాంద పురాణము --[ ౯౮ వ అధ్యాయము, ౨౫ వ శ్లోకము ]

రాగిపాత్రలు శుభ ప్రదమైనవి, వాటిని పూజల్లో వాదుట వలన సకారాత్మక శక్తులు విజృంభిస్తాయి అని తెలుపుతుంది.

వరాహ పురాణము--[౧౪౩ అధ్యాయము, ౧౭ వ శ్లోకము ]

// తామ్ర భాజనే యజేత్ దేవన్, న రజతం, న కాంఅమయే //

అనగా,  దేవతలను పూజించునపుడు రాగిపాత్రలను మాత్రమే ఉపయోగించవలెను, వెండి, బంగారు పాత్రలు కాదు --అని.

// తామ్ర పాత్ర ప్రదీపశ్చ, న రజతం, న కాంస్యం //

పూజలు చేసేటప్పుడు, రాగి పాత్రలు, దీపాలు మాత్రమే వాడాలి, వెండి, కంచు వి కాదు.

ఈశ్లోకము వాల్మీకి రామాయణములో అరణ్య కాండలో ఉందని కొందరన్నారు. నాకైతే కనపడలేదు. ఇంకే కాండలోనైనా ఉందేమో. 

గరుడ పురాణం లో ఉన్నది పదహారు అధ్యాయాలే. 

అయితే, ఈ శ్లోకాలు కాని, ఉటంకింపులు కాని, అన్ని గ్రంధాలలో ఉండవు. మూల గ్రంధాలను ఆసాంతమూ అనువాదము చేసిన పుస్తకాల్లో కానీ, మూల సంస్కృత గ్రంధాలలోనైనా కానీ ఉంటాయి. అయితే , అధ్యాయాలు, శ్లోకాల సంఖ్యలు సరిగా ఉన్నాయని చెప్పలేము, ఎందుకంటే నేను పరిశీలించినవాటిలో ఆ సంఖ్యల్లో ఆ శ్లోకాలు లేవు. వేల పేజీలు ఉండటము, విషయసూచికలు లేకపోవడము వల్ల  కనుక్కోవడము అంత సులభము కాదు. 

[ మొత్తానికి ఏ ఐ, మెటా లను నమ్మితే అధోగతే. ]

అగ్ని పురాణము ప్రకారము, కుమార స్వామి వీర్యము భూమిపై పడగా అది రాగి [ తామ్రము ] గా మారింది.  దానికి అభివృద్ధినొందించే గుణము ఉంది కాబట్టి తామ్రము పూజల్లో సర్వ శ్రేష్టము--అని లోక విఖ్యాతి పొందినది.

ఇక, వెండి ని పూజల్లో ఎందుకు వాడకూడదు--అనుదానికి సమాధానము తైత్తిరీయ సంహిత లోని ప్రథమ కాండలోని పంచమ ప్రశ్నలో ఉంది.

 // దేవాసురాస్సంయత్తా ఆసన్..// అనే అనువాకములో ఇలాగుంది

దేవతలు, అసురులు చేసిన యుద్ధములో  దేవతలు గెలిచి, దానవులనుండి గెలుచుకొన్న శ్రేష్టమైన ధనము [ అది అమృతము కావచ్చు, సోమము కావచ్చు, బంగారము కావచ్చు] అగ్నిలో ఉంచినారు. అగ్ని ఆ ధనము తనదే అని అనుకొని స్వీకరించినాడు. దేవతలు అగ్నిలో తమ ధనాన్ని ఎందుకు పెట్టారంటే, ’ఒకవేళ తరువాతి యుద్ధములో తాము ఓడిపోతే , తాము గెలుచుకొన్న ధనము సురక్షితముగా ఉంటుంది అని. [ తదగ్నిర్న్యకామయత , తేనాపాక్రామత్ ]  అగ్ని ఆ ధనము తనదిగా చేసుకొని, దేవతల నుండీ దూరముగా వెళ్ళిపోయినాడు. అదృష్టవశాత్తూ తరువాతి యుద్ధములో దేవతలు మరలా గెలిచినారు. తమ ధనాన్ని తిరిగి తీసుకోవడానికి అగ్ని వెంట పడినారు. వెంట పడి తమ ధనాన్ని బలవంతంగా లాక్కోవటానికి ప్రయత్నించారు.  దానితో అగ్ని ఏడ్చినాడు. అగ్ని ఏడ్చుట వలన అతడి కన్నీరు భూమిపై పడి, వెండి గా మారింది. 

ఏ కారణము చేత అగ్ని రోదించాడో, ఆ కారణము వలన అగ్నికి రుద్ర రూపము కలిగింది[ అగ్నికి రుద్రుడు అని మరో పేరు రుద్రోవా ఏష యదగ్నిః ] అని మంత్రము] 

అగ్ని కన్నీరు వల్ల పుట్టినది కాబట్టి వెండి కి యజ్ఞములలో దక్షిణ గా ఇవ్వబడే అర్హత పోయింది. యజ్ఞము చేసిన యజమాని గనక వెండిని దక్షిణ గా ఇస్తే, ఒక సంవత్సరం లోపలే ఆ యజమాని ఇంటిలో  రోదనకరమైన అనర్థాలు జరిగి ఆ యింటివారు రోదిస్తారు.  కాబట్టి వెండిని ఎన్నడూ దక్షిణగా ఇవ్వరాదు. రోదించడము వలన పుట్టినది కాబట్టి, వెండిని పూజల్లో వాడటము కూడా అనర్హముగా భావించడము మొదలైంది.

 అగ్ని కథ ఇంకా ముందుకు వెళ్ళి, ఆ ధనములో మొదట నాకు భాగము రావాలి, తర్వాతే మీకు --అని షరతు పెడితే దేవతలు ఒప్పుకుంటారు. అందుకే యజ్ఞములు, హోమములు ఏవి చేసినా మొదట పునరాధానము చేయునది. ఆ పునరాధానము [ హవిస్సు, లేక సమిధలు ] మొదట చేసి, అగ్నికి సమర్పించి, అటుతర్వాతే తమ ఇష్ట దేవతలకు హవిస్సునిచ్చుట ఆచారమైనది.

13. " మహాదర్శనము

 13. " మహాదర్శనము " -- పదమూడవ భాగము- మంత్రార్థము--2


 13. పదమూడవ భాగము-- మంత్రార్థము -2 


        ఆమె కన్నులు మూసుకున్ననూ , మనసు కళ్ళు తెరచుకొని , మెలకువగా , అభ్యాస బలము చేత మంత్రమును చెప్పుతుండినది . తల్లీ కొడుకులు కొంచముసేపు అలాగే ఉన్నారు . పొయ్యిలో ఉన్న మంట వారి సుఖమునకు తానెందుకు అడ్డము కావలెనని నిశ్శబ్దముగా మండి శాంతమైనది . అప్పుడు హఠాత్తుగా తల్లి , తాను వంటింట్లో పొయ్యి ముందర కూర్చున్నది గుర్తుకొచ్చి అదాటుగా కళ్ళు విప్పింది . కొడుకుకు మెలకువ కాకుండా ఉపాయముగా పొయ్యి సరిచేసినది . అంతలోనే కొడుకు కూడా లేచి , " ఎందుకమ్మా , మంత్రము నిలిపివేసినావు ? " అన్నాడు . 


తల్లి నవ్వుతూ , "  నిలపలేదయ్యా , మెల్లగా చెపుతున్నాను . నీకు ఏదో తూగు నిద్ర వచ్చినట్లుండినది " అన్నది .


" నిజమమ్మా , నువ్వు తొడపైన కూర్చోబెట్టుకున్నావు . నిద్ర వచ్చేసింది . ఇప్పుడు దూరముగా కూర్చుంటాను , మంత్రమును చెప్పు " 


" నిద్ర వచ్చిందని నువ్వేమీ దిగులు పడవద్దు . నిద్రలో విన్నది ఇంకా బాగా పట్టుబడుతుందట . "


" అట్లయితే నువ్వు చెప్పుతూ ఉండు , నేను నిద్రపోతూ ఉంటాను " 


’ ఇన్ని దినములూ అలాగే అవుతుండెడిది . నువ్వు తొట్టిలులోనో , తొడపైనో నిద్రపోతున్నపుడు నేను మంత్రములను చెప్పుతూనే ఉంటిని . " 


        బాలుడు , తనకు కావలసినదేదో ఒకటి దొరికినట్లు సంతోషపడుతూ అన్నాడు , " చూడమ్మా , నువ్వు మంత్రము చెప్పినపుడల్లా , ఏదో ఎక్కడో విన్నట్లుందే ! అనిపిస్తున్నది . ఎక్కడ విన్నాను అన్నది తెలీదు . " 


         ఆలంబినికి వాడి జన్మ పూర్వ  వృత్తాంతమును , లేదా తాము చూచిన దృశ్యమును , ఆచార్యుల కల , అంతా వాడికి చెప్పవలె ననిపించెను . అయితే చెప్పవచ్చునో లేదో అని ఆలోచిస్తూ వాడి ముఖాన్ని చూస్తూ ఎందుకో , ’ వద్దు , ఇప్పుడు కాదు ’ అనిపించినది . వాడుకూడా , అమ్మ అట్లే చూచుట చూసి , అర్థము లేని నవ్వు నవ్వుచూ , ’ ఎందుకమ్మా , అట్లా చూస్తున్నావు ? ’ అన్నాడు . తల్లికి పుత్ర వాత్సల్యము అంతా తానే యై , ఆ వెనకటిదంతా మరిపించుటకు , చేతులు చాచి వాడిని హత్తుకొని , తల నిమురుతూ , ’ కాదురా , నీకింకా రెండు సంవత్సరాలే వయసు , ఎంత మాట్లాడుతున్నావే అని ఆశ్చర్యమైనదయ్యా , అందుకే అట్లా చూస్తూ ఉంటిని " అన్నది . 


బాలుడు , అలాగా యని , మరలా ’ ఏదమ్మా , ఇంకా రెండు మంత్రాల అర్థము మళ్ళీ చెప్పవూ ? " అన్నాడు . 


       తల్లి , " ఒక గడియ తాళు , పొయ్యి సరి చేసి నీవైపుకు తిరిగి చెపుతాను " అన్నది . బాలుడు ఆమె వద్దన్ననూ వినక , తొడపై నుంచీ దిగి , కొంచము దూరములో , గురువు గారి వద్ద కూర్చొను శిష్యుని వలె గంభీరముగా ఆమె కోసము వేచి కూర్చున్నాడు . తల్లి కూడా , పొయిలో మంట రాజేసి  , పప్పు ఇంకా ఉడుకుతున్నది చూచి , కొడుకు వైపుకు తిరిగినది .  


" చూడు, ’ భద్రం కర్ణేభిః ’ అనునది రెండవ మంత్రము . 


|| ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః | భద్రం పశ్యేమాక్షభిః యజత్రాః | 

స్థిరైరంగై స్తుష్టువాగ్ం సస్తనూభిః | వ్యశేమ దేవహితం యదాయుః || 


అనునది దాని పూర్ణ రూపము . అర్థము చెప్పేదా ? 


       కొడుకు తల్లి ముఖాన్నే చూస్తూ ఏకాగ్రతతో వింటున్నాడు . ఆ ఏకాగ్రతను చూస్తే , పెద్దవారికి కూడా సాధ్యము కానంత ఏకాగ్రత అది !  అటూ ఇటూ అల్లాడక , నిలుచున్న స్థంభమునైనా అనేకాగ్రత యనవచ్చేమో , వాడు మాత్రము అటుల అనునట్లు లేడు . 


       తల్లి అది చూసి కొంచము ఆశ్చర్యముతో , ’ విను  , యజ్ఞీ , నీకన్నా నేను పెద్దదాన్ని . ఔనా కాదా ? అలాగే , మనకన్నా పెద్దవాళ్ళు దేవతలు . అయితే , వారు కన్నులకు కనపడరు . అలాగని వారు లేరు అనలేము . ఆ దేవతలకు చేసే ప్రార్థన ఇది,’ 


       తల్లి , కొడుకు ఏమైనా చెపుతాడా యని నిలిపింది . కొడుకు అది తెలుసుకొని , ’ అప్పుడే చెప్పితిని కదమ్మా , నువ్వు సరే ననువరకూ నేను మధ్యలో ఏమీ మాట్లాడను ’ అన్నాడు .


        తల్లి , అలాగే కానీవయ్యా అని  మళ్ళీ ఆశ్చర్యపడుతూ అంది , ’ ఆ దేవతలను గురించి భక్తుడు  అంటాడు , 

 ’ఓ దేవతలారా , మేము  చెవుల ద్వారా శుభమైనదానినే వినెదము , కన్నులనుండీ శుభమైనదానిని చూచెదము . మేము ఎల్లపుడూ యజ్ఞమునందు ఉండెదము . మా అంగములు గట్టిగా స్థిరముగా  ఉండనీ , మేము బ్రతికున్నంత వరకూ దేవతలకు హితమైనదానినే చేసెదము .’  ’ అది మంత్రపు అర్థము . నువ్వింక చెప్పేది , అడిగేది అంతా చేయవచ్చు ’ 


       " అది కాదమ్మా , దేవతలు కంటికి కనపడరు అన్నావు , అయినా ఉన్నారు అన్నావు . అదేమిటీ ? నేను ఇప్పుడు చిన్న పిల్లవాడిని . నన్ను అగ్నిని ముట్టుకోవద్దు అంటావు , అదే , నేను నీ అంత పెద్దవాడినైతే ముట్టుకోవచ్చు అంటావు , ఇప్పుడు నాకు అటక పైన ఏముందో తెలీదు , ఎక్కి చూస్తే తెలుస్తుంది . అటులేనా అమ్మా , ఇప్పుడు నువ్వు చిన్న వాడివి, పెద్దవాడివైన తరువాత దేవతలను చూడ వచ్చును అనేనా దీని అర్థము ? చెప్పమ్మా ? " 


        కొడుకు అడిగిన మాట ముద్దుగా ఉండింది . తల్లి మనసు , ముద్దుగా ఉన్ననూ , పెద్ద వారి మాటలవలె ఉన్న కొడుకు మాటలను విని ఆశ్చర్య పడింది . అయినా దాని అర్థము కన్నా , వాడి ముద్దు మాటలనే గమనిస్తూ , కొడుకుకు సమాధానము చెప్పింది , 


         " చూడయ్యా , నువ్వు దేవతల గురించి విన్నావు . నేను మీ తండ్రిగారి వెంట యజ్ఞ యాగాదులకు వెళ్ళినాను కదా , ఒక్కొక్క సారి దేవతలు వచ్చి ఆహుతులను తీసుకొనుటను చూసినాను . అయితే అది ప్రతి దినమూ జరగదు . అదిగాక , ఇంకోటి చూడు , మన అగ్ని మందిరములో చూచినావా ? ఎవరో పెద్దవారు కూర్చున్నట్లే ఉంటుంది , ఎవరు అని చూస్తే ఈ కళ్ళకు ఎవరూ కనపడరు . ఇట్లున్నపుడు , దేవతలు ఉన్నారు అనవలెనా లేదా ? " 


        " నువ్వు చెప్పిన అగ్ని మందిరపు మాట నిజమమ్మా .. నాకు కూడా అనిపించినది . అయితే ఇంకొకటి , అంటే దేవతలు ఉన్నారని చెప్పినావు కదా ! అది నాకు తెలియదు . " 


" చూడయ్యా , ఇంకా కొన్ని రోజులు పోనీ , నువ్వు పెద్దవాడవైనాక వారిని అడుగు . వారు అంతా చెపుతారు " 


       " అలాగే కానీయమ్మా , ఇప్పుడు నేను నోరు మూసుకుని , నువ్వు చెప్పినదంతా విన్నాను . అలాగే ఇంకా కొన్ని రోజులు నోరు మూసుకుని ఉంటాను . ఆ తరువాత తండ్రి గారిని అడుగుతాను . సరేనా ? ఇప్పుడు , నువ్వు అన్నావు ఇంతే కదా , శుభమైనదాన్నే విందాము , శుభమైన దానినే చూద్దాము , యజ్ఞములో ఉందాము , గట్టిగా ఉందాము , దేవతల హితమునే చేద్దాము . అంతా సరియే కదమ్మా ? " 


" సరిగ్గా చెప్పినావయ్యా " 


        " నాకెందుకో ఇది సరిగ్గా అర్థము కాలేదు . అయితే నువ్వన్నావు కదా , పెద్ద వాడినయ్యాక తెలుస్తుంది అని ! అంతవరకూ నువ్వు ఏమి చేయమంటే అది చేస్తాను . తర్వాతది చెప్పమ్మా " 


మూడో మంత్రము ఇది అన్యత్ శ్రేయః అనేది . 


   ||  ’ అన్యత్ శ్రేయః అన్యదుతేవ ప్రేయః తే ఉభే నానార్థే పురుషం సీనీతః | 

తయోః శ్రేయః ఆదదానస్య సాధు భవతి | హీయతే అర్థాత్ య  ఉ ప్రేయ వృణీతే  ||


" అమ్మా , నాకు ఈ మంత్రము చెప్పవలెననిపిస్తున్నది , చెప్పవచ్చునా ? " 


" దానికి కూడా ఆగితే మంచిది నాయనా "


     " ఐతే సరే , అలాగే ఆగుతాను , చెప్పవలెను అనిపించినపుడు నీదగ్గరకు వస్తాను . చెప్ప వచ్చునో , లేదో నువ్వు చెప్పుదువు గాని ! సరే , దీని అర్థము చెప్పు " 


      దాని అర్థము , : శ్రేయస్సు ప్రేయస్సు అనునవి రెండు . అవి రెండూ వేర్వేరు .  రెంటికీ లక్ష్యములు వేరే వేరే . రెండూ మనుష్యుని కట్టివేస్తాయి . వాటిలో శ్రేయస్సును పట్టిన వానికి శుభము కలుగును . ప్రేయస్సుకావాలంటే , వాడు గురిని వదలి దారి తప్పుతాడు  " 


       కొడుకు అది విని గంభీరుడైనాడు . కన్ను రెప్ప కొట్టలేదు . ఏదో ధ్యానిస్తున్నట్లున్నాడు . ముఖ ముద్రా , దేహ భావమూ ఏదో గొప్ప భావముతో కనిపిస్తున్నాయి . ఇప్పుడు వాడిని చూస్తే , ఎవరో జ్ఞాని , తపస్సు చేసినవాడు , ఏదో మహా వాక్యపు అనుసంధానములో ఉన్నట్టు కనిపిస్తున్నాడు ( మహా వాక్యము అంటే బ్రహ్మమును బోధించు వాక్యము ) 


       అది చూచి ఆలంబినికి మరలా ఆశ్చర్యమైనది . " మిగిలిన వారంతా బంతులు , గోళీలు ఆడే వయసు .వీడేమో మంత్రార్థమును అడుగుతున్నాడు . విని  , దానిని మథనము చేయుటకు ప్రయత్నిస్తున్నాడు . ఇదేమిటి వీడి లోక విలక్షణ నడత అని ఆమెకు ఆశ్చర్యమే ఆశ్చర్యము . ఏమైనా సరే , భర్తకు ఈ మాట చెప్పవలెను . " అనుకున్నది . 


        తల్లి , కొడుకు సమాధికి భంగము కలిగించలేదు . సద్దు చేయకుండా లేచి వంట పని చూసుకున్నది . కొంచము సేపైన తర్వాత ఏదో భారమును మోస్తున్న వాడు దానిని దించి , ఊహ్  అనునట్లు , కొడుకు నిట్టూర్పు వదలి లేచినాడు . 


       " అమ్మా , నాకేమో శ్రేయస్సే కావాలి అనిపిస్తున్నది , ప్రేయస్సు అంటే ఏమి ? అనునది తెలీదు . అది నువ్వే చెప్పమ్మా . ఏమైనా సరే  నువ్వు  చెప్పువరకూ నీమాట ప్రకారమే నడచుకొంటాను , అంతే ! "

సెప్టెంబర్,12, 2024*🌹 *ధృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐* 

       🌷 *గురువారం*🌷

🌹 *సెప్టెంబర్,12, 2024*🌹

     *ధృగ్గణిత పంచాంగం*                  


 *స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*

*దక్షిణాయణం - వర్షఋతౌః*

*భాద్రపద మాసం - శుక్లపక్షం*


*తిథి  : నవమి* రా 11.32 వరకు ఉపరి *దశమి*

*వారం : గురువారం* (బృహస్పతివాసరే)

*నక్షత్రం  : మూల* రా 09.53 వరకు ఉపరి *పూర్వాషాఢ*


*యోగం  : ఆయుష్మాన్* రా 10.41 వరకు ఉపరి *సౌభాగ్య*

*కరణం  : బాలువ* ఉ 11.45 *కౌలువ* రా 11.32 ఉపరి *తైతుల*


*సాధారణ శుభ సమయాలు*

*ఉ 11.00 - 12.00 సా 04.00 - 06.00*

అమృత కాలం:*మ 03.20 - 04.59*

అభిజిత్ కాలం  : *ప 11.39 - 12.28* 


*వర్జ్యం         : రా 08.15 - 09.53*

*దుర్ముహూర్తం  : ఉ 10.01 - 10.50 మ 02.55 - 03.44*

*రాహు కాలం   : మ 01.35 - 03.07*

గుళికకాళం      : *ఉ 08.59 - 10.31*

యమగండం     : *ఉ 05.55 - 07.27*

సూర్యరాశి : *సింహం*

చంద్రరాశి : *ధనుస్సు*

సూర్యోదయం :*ఉ 05.55* 

సూర్యాస్తమయం :*సా 06.12*

*ప్రయాణశూల   : దక్షిణ దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం   :  *ఉ 05.55 - 08.23*

సంగవ కాలం  :      *08.23 - 10.50*

మధ్యాహ్న కాలం :*10.50 - 01.17*

అపరాహ్న కాలం :*మ 01.17 - 03.44*

*ఆబ్ధికం తిధి:భాద్రపద శుద్ధ నవమి*

సాయంకాలం  :  *సా 03.44 - 06.12*

ప్రదోష కాలం   :  *సా 06.12 - 08.32*

రాత్రి కాలం  :  *రా 08.32 - 11.40*

నిశీధి కాలం    :*రా 11.40 - 12.27*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.22 - 05.08*

________________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


  *శ్రీ దత్తాత్రేయ అజపాజప స్తోత్రం...!!*


శాంతాకారే శేషశయానం సురవంద్యం |


కాంతానాథం కోమలగాత్రం కమలాక్షమ్ |


చింత్యారత్నం చిద్ఘనరూపం ద్విజరాజం |


దత్తాత్రేయం  శ్రీగురుమూర్తిం ప్రణతోఽస్మి ||


    🌹 *ఓం శ్రీ దత్తాయ నమః*🌹


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌷🌹🌹🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🌷🌷🌹🌷

 🌹🍃🌿🌹🌹🌿🍃🌹

అరుంధతి నక్షత్రం*

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

       *అరుంధతి నక్షత్రం* 

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*అరుంధతి...వశిష్ఠ మహర్షి ధర్మపత్ని.మహా పతివ్రత అని ఆకాశం వంక పెళ్లి సమయంలో చూపించి చెబుతారు బ్రాహ్మణులు. అలా చేస్తే మీ సంసారిక జీవనం నల్లేరు మీద నడకలా సాగుతుందని పండితులు వధూవరులకు చెబుతారు. మాఘమాసాది పంచ మాసాల కాల మందు తప్ప ఈ నక్షత్రం సాయంత్రం వేళ కానరాదు.*


రాత్రిపూట చంద్రుడ్ని, నక్షత్రాలను చూడటం వల్ల కంటి శక్తి పెరుగుతుంది. *అరుంధతి నక్షత్రం నుంచి వచ్చే కిరణాల వల్ల కంటి శక్తి మరింత పెరుగుతుంది. అరుంధతి నక్షత్రం సప్తర్షి మండలంలో ఉండే చిన్న నక్షత్రం, శిశిర, వసంత, గ్రీష్మ రుతువులందు సాయంకాల సమయాన, మిగిలిన కాలాల్లో అర్థరాత్రి లేదా దాటిన తర్వాత తెల్లవారుజామున కనిపిస్తుంది.*


*అరుంధతి నక్షత్రాన్ని చూడాలనుకుంటే జాగ్రత్తగా ఆకాశం వంక చూడండి. '?' మార్కు ఆకారంలో నక్షత్రాలు ఉంటాయి. కచ్చితంగా కాకపోయినా దాదాపుగా ఆ ఆకారంలో ఉంటుంది. చిన్న పిల్లాడిని ? మార్కు గీయమంటే ఎలా గీస్తాడో అలా ఉండే సప్తర్షి మండలంలో పక్కపక్కనే ఉండే నక్షత్రాలే అరుంధతి, వశిష్ఠులవారివి. అరుంధతి నక్షత్రం చిన్నగా ఉంటుంది.*


*హిందూ సంప్రదాయం ప్రకారం వివాహఘట్టంలో వధూవరులు అరుంధతి నక్షత్రాన్ని చూస్తారు.*


*అయితే చాలా మందికి అరుంధతి నక్షత్రం గురించి అస్సలు తెలియదు. దాని నేపథ్యం ఏమిటనే విషయంపై చాలా మందికి అవగాహన ఉండదు.*


*పవిత్రత అనే పదానికి పర్యాయరూపమే అరుంధతి. పతివ్రతల్లో ఈమె మొదటిస్థానంలో ఉంటారు. అందుకే నింగిలో చుక్కలా నిలిచిపోయింది. ఈమె ఎంతో అందగత్తె. మహాపతివ్రత.*


*ఇసుకను అన్నంగా తయారు చెయ్యగలరా..?*


*అరుంధతి గురించి చాలా కథలున్నాయి. అందులో కొన్ని..*


*వశిష్ట మహర్షి గురించి వినే ఉంటారు. ఆయన పెళ్లి చేసుకోవాలని అంతటా తిరుగుతూ ఉంటాడు. ఒకసారి ఒక గ్రామంలో కన్నెలంతా అతన్ని చూడడానికి వచ్చారు. వసిష్టుడు కొంచెం ఇసుకను చేతిలోకి తీసుకున్నాడు.ఈ ఇసుకను ఎవరైనా సరే వండి అన్నంగా తయారు చెయ్యగలరా అని అడిగాడు. అయితే ఆ గ్రామంలోని అమ్మాయిల్లో ఎవ్వరూ అది సాధ్యం కాదని చెప్పారు.*


*పక్క గ్రామమైన మాల పల్లె నుంచి వచ్చిన ఒక అందమైన ఆడపడుచు పైకి లేచి నిలపడుతుంది. నేను చేస్తానండి అని అంటుంది.* 


*వెంటనే పొయ్యి వెలిగించి దానిపై కుండ పెట్టింది.*


*ఎసరు బాగా మరిగిన తర్వాత అందులో ఇసుక వేసింది. ధ్యానం చేస్తూ వంట వడింది. ఇసుక అన్నంగా మారింది.* 


*వశిష్టుడికి కుండలోని అన్నం చూపించింది.* 


*ఆయనకు కూడా ఈ విషయం బోధపడలేదు ఆమెనే అరుంధతి. తర్వాత ఆ అన్నం తినమంటూ అరుంధతి వశిష్టుడికి వడ్డిస్తుంది. కానీ ఆయన తినడు. నన్ను పెళ్లి చేసుకుంటేనే తింటాను అంటాడు. తర్వాత అరుంధతి తల్లిదండ్రులతో మాట్లాడుతాడు వశిష్టుడు. వాళ్లను ఒప్పించి అరుంధతిని పెళ్లి చేసుకుంటాడు.*


*ఇక అరుంధతికి ఎంతో ఏకాగ్రత ఉంటుంది.*

*ఒకసారి వశిష్టుడు తన కమండలం ఆమెకు ఇచ్చి బయటకు వెళ్తాడు. తాను వచ్చే వరకు కమండలం వైపే చూస్తూ ఉండమని చెబుతాడు. అరుంధతి తన భర్త వచ్చేవరకు దాన్నే చూస్తూ ఉండాలనుకుంటుంది.* *చాలా ఏళ్లు గడిచినా వశిష్టుడు రాడు.*


*అయితే అరుంధతి మాత్రం దాని వంకే చూస్తూ ఉంటుంది. పర పురుషుడిని కన్నెత్తి చూడని మహా పతివ్రత. అయితే ఈ విషయాన్ని గ్రహించిన కొందరు దేవతలు అమ్మా అరుంధతి మీ ఆయన ఇన్నేళ్లు అయినా తిరిగిరాలేదు. కాస్త ఇటు చూడమ్మా అంటారు.*


*అయినా ఆమె చూపు మరల్చదు.* 


*కొన్ని ఏళ్ల తర్వాత వశిష్టుడు వచ్చి అరుంధతీ.. అని పిలిస్తే అప్పుడు ఆయన వైపు చూస్తుంది.*


*తన భర్తను తప్ప పర పురుషుడిని కన్నెత్తి చూడని మహా పతివ్రత అరుంధతి.*


*ఒకసారి అగ్ని దేవుడి ఎదుట సప్త ఋషులు  యజ్ఞం చేపడుతారు.ఆ. ఋషుల భార్యలపై అగ్ని దేవుడు మోజు పడతాడు.ఈ విషయాన్ని అగ్ని దేవుడి భార్య అయిన స్వాహాదేవి గ్రహిస్తుంది.ఆ ఏడుగురి భార్యల మాదిరిగా తానే రోజు కొక అవతారం ధరించాలనుకుంటుంది. రోజు కొక  ఋషి  భార్య అవతారం ఎత్తి తన భర్త అగ్ని దేవుడి కోరిక తీరుస్తుంది.*


*ఇక చివరి రోజు తాను అరుంధతిని అనుభవించబోతున్నాననే ఆనందంలో ఉంటాడు అగ్నిదేవుడు. కానీ స్వాహాదేవి ఎంత ప్రయత్నించినా అరుంధతి అవతారంలోకి మారలేదు. అరుంధతి పెద్ద ప్రతివత కావడమే ఇందుకు కారణం.*


*అందుకే ఆమె అరుంధతి నక్షత్రంగా మారి జగత్తుకు ఆందర్శంగా నిలిచింది.* 


*అరుంధతికి శక్తి అనే కుమారుడున్నాడు.శక్తి కమారుడే పరాశరుడు. పరాశరుడి కుమారుడే వ్యాసుడు.*


*అలా ఎంతో గొప్ప చరిత్ర కలిగింది అరుంధతి నక్షత్రం.*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

Parliamentary Committee

 Send to: jpcwaqf-lss@sansad.nic.in

 

TO

The Chairperson

Joint Parliamentary Committee on the Wakf Bill

Parliament House

New Delhi, India

Subject: Request for the Abolition of the Wakf Act Due to Unconstitutionality

Respected Chairperson,

I, __________________________, son of ____________________________, residing at ________________________________ aged ____ YEARS and a concerned citizen of India, am writing to bring to your esteemed committee's attention a matter of significant concern regarding the Wakf Act. It is my firm belief that the current Wakf Act stands in contravention of the Constitution of India and, therefore, merits a comprehensive re-evaluation with a view toward its abolition.

 

The Constitution of India, under Article 14, guarantees equality before the law and explicitly prohibits discrimination on the grounds of religion, race, caste, sex, or place of birth. However, the Wakf Act, as it currently exists, appears to grant preferential treatment to a specific religious community in the administration of properties and affairs. This preferential treatment seems to contradict the secular fabric of our nation and infringes upon the fundamental rights of the majority of the country's population.

 

This special treatment is not afforded to other religious communities under similar laws, thereby creating a disparity that undermines the constitutional principles of equality and fairness.

 

Moreover, the provisions of the Wakf Act have often led to issues related to property rights, administrative inefficiencies, and potential misuse of the law. There have been numerous instances where properties have been declared as wakf without due process or adequate compensation, infringing upon the property rights of owners. Such actions are in direct conflict with the right to property as envisaged under Article 300A of the Constitution of India.

 

It is also important to highlight that the Wakf Act lacks adequate checks and balances to prevent the misuse of power by Wakf boards, resulting in allegations of corruption, mismanagement, and lack of accountability. This not only undermines the rule of law but also erodes public trust in the legal and governance framework of the country.

The current Wakf Act is unprecedented in its scope and enforcement, even when compared to similar laws in Muslim-majority countries. The Act, in its present form, enables the Wakf Board to acquire land and property through coercion, deceit, and violence, akin to the actions of organized crime.

 

In light of the aforementioned concerns, I respectfully urge the Joint Parliamentary Committee to consider the following recommendations:

 

Abolition of the Wakf Act: The Act should be repealed to ensure that all citizens are treated equally before the law, in alignment with the fundamental principles enshrined in the Constitution.

 

Retrospective Abolition: The Wakf Act should be abolished retroactively, from the date it was first introduced as the Mussalman Wakf Act in 1923, including subsequent reintroductions in 1954 and amendments in 1995.

 

Restoration of Property Rights: Any land or property acquired or any structure erected under the Wakf Act should be deemed illegal and returned to the rightful Hindu owner, regardless of whether the acquisition occurred before or after 1923.

 

Government Custody of Unclaimed Property: In cases where the rightful Hindu owner cannot be traced, the Central Government should take possession of the land, property, and structures currently under the Wakf boards.

 

Strengthening Accountability: Any new legislation should incorporate strict guidelines and accountability mechanisms to prevent misuse and ensure transparency in the administration of properties.

 

I trust that the Joint Parliamentary Committee will give due consideration to these concerns and recommendations in the interest of upholding the constitutional values of equality, fairness, and justice.

With Best Regards,

Name:  

Address:

Aadhar:

Mobile:

యమపాశం - సంసారపాశం*

*యమపాశం - సంసారపాశం* 
(సంసారపాశం = భ్రమపూరిత జగత్ వ్యాపకం)

👉యమపాశం కంటే కర్కశమైనది ఈ సంసారపాశం...!
👉 *యమపాశం జన్మచివరలో మాత్రమే సంధించబడుతుంది. కానీ ఈ సంసారపాశం పుట్టుకతోనే వెంటాడుతుంది...!* 
👉యమపాశం జీవాన్ని లాగుతుంది. సంసారపాశం జీవసారాన్ని లాగుతూ దాహం తీర్చుకుంటుంది...!
👉రెండుజన్మలకు మధ్య సున్నితమైన గాయం  యమపాశం. ఒకేజన్మలో కోట్లసార్లు గాయపరిచే ఇనుప బల్లెం ఈ సంసారపాశం...! 
🙏 *యమపాశానికైనా సంసారపాశానికైనా  విరుగుడు ఒక్కటే అదే "హరిభక్తి పాశం"* 🙏
👉ఆలస్యం వలదు.....
🙏హరినామ దారాలను పోగుచేసి బలమైన హరిభక్తి పాశాన్ని తయారుచేసుకుందాం...!
👉ఇక సంసారపాశం పట్టుసడలుతుంది , యమపాశం పక్కకు తప్పుకుంటుంది...!

🌹 *గోసాం శివప్రసాద శాస్త్రి* 🌹

 

పంచాంగం 12.09.2024

 ఈ రోజు పంచాంగం 12.09.2024 Thursday,.


స్వస్తి శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాస శుక్ల పక్ష నవమి తిధి బృహస్పతి వాసర: మూల నక్షత్రం ఆయుష్మాన్ యోగ: బాలవ తదుపరి కౌలవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


నవమి రాత్రి 11:27 వరకు

మూల రాత్రి 09:47 వరకు. 


సూర్యోదయం : 06:07

సూర్యాస్తమయం : 06:17


వర్జ్యం : రాత్రి 08:09 నుండి 09:47 వరకు .


దుర్ముహూర్తం : పగలు 10:10 నుండి 10:59 తిరిగి మధ్యాహ్నం 03:02 నుండి 03:51 వరకు.


అమృతఘడియలు : మధ్యాహ్నం 03:14 నుండి 04:52 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.


యమగండం: ఉదయం 06:00 నుండి 07:30 వరకు.



శుభోదయ:, నమస్కార:

*శ్రీ అమృతేశ్వరి ఆలయం*

 🕉 *మన గుడి : నెం 435*





⚜ *కర్నాటక  :  కోట _ ఉడిపి* 


⚜ *శ్రీ అమృతేశ్వరి ఆలయం*



💠 కోట శ్రీ అమృతేశ్వరి ఆలయం  ఉడిపి జిల్లాలోని కుందాపుర తాలూకాలో ఉంది.


💠 ఈ దేవతను చాలా మంది పిల్లలకు తల్లిగా పిలుస్తారు.  


💠 ఆలయం లోపల  లింగాలు వాటంతట అవే ఉద్భవిస్తాయి.

అక్కడ పుట్టిన లింగాలు పెరుగుతూనే ఉంటాయి.అమృతేశ్వరి దేవి ఆ లింగాలకు తల్లి అని చెబుతారు. 


💠 సుదూర ప్రాంతాల నుండి సంతానం లేని జంటలు ఇక్కడ ప్రార్థనలు చేస్తారు.

అమృతేశ్వరి దేవి వారి కోరికలు తీరుస్తారు అని స్థానిక నమ్మకం


💠 ఉడిపిలోని శ్రీ అమృతేశ్వరి ఆలయం ఒక అద్భుతం కంటే తక్కువ కాదు. 

పార్వతీ దేవి యొక్క భక్తుడు చేసిన తపస్సు ఫలితంగా, ఈ ఆలయం ఒక అద్భుతానికి ప్రతీక. 

భక్తికి సంతోషించిన పార్వతీదేవి ఆమె కోరికలను తీర్చింది. భక్తుడు ఎప్పటికీ యవ్వనంగా ఉండమని, శివుడిలాంటి పిల్లలను కనమని కోరాడు. 


💠 భక్తుడికి ఇచ్చిన వరం ఫలితంగా దేవి ఆమెను తనలో కలుపుకుంది.

 ఈ విధంగా, ఆలయంలో అమ్మవారి రెండు రూపాలను పూజిస్తారు. 

అద్భుతం ఏమిటంటే, ఆలయం అంతటా భూమి నుండి అనేక "లింగాలు" విస్ఫోటనం చెందాయి. 

ప్రతి "లింగం" భగవంతుని వంటి బిడ్డను సూచిస్తుంది. 

ఈ దృగ్విషయం ఇక్కడ మాత్రమే చూడవచ్చు మరియు మరెక్కడా కనిపించదు


💠 రామాయణం సమయంలో , రావణుడి వారసుడు గారాసురుడు తన భార్య కుంభముఖి మరియు రావణుడి చెల్లెలు శూర్పణఖతో కలిసి దండకారణ్యంలో నివసించాడు . 

ఒకరోజు మహర్షి ఏకముఖ వితంతువు అతిప్రభే తన కొడుకు భవసుతతో కలిసి తీర్థయాత్రకు వెళుతుండగా, శూర్పణఖనే కూడా భవసుత సౌందర్యంతో ప్రేమలో పడింది.

 దీంతో కోపోద్రిక్తురాలై నీవు మోహానికి లోనైన వ్యక్తి వల్ల నీ మరణము సంభవిస్తుందని అని శూర్పణఖను శపించి అక్కడ ప్రవహిస్తున్న అగాధంలోకి దూకింది . 

శంఖపురంలో గారాసురుడు లింగాన్ని నిర్మించగా , దాని పక్కనే కుంభముఖి అమ్మవారి విగ్రహాన్ని నిర్మించి పూజించారు. 

వారి భక్తికి ప్రతిరూపమైన దేవత ఏదైనా కోరుకున్నప్పుడల్లా, ఆమె తన డిమాండ్‌ను మరచిపోయి ఇంకేదో అడుగుతుంది. 

దేవత వరం ఇచ్చి అదృశ్యమవుతుంది, ఆ తర్వాత ఒప్పించిన కుంభముఖి తాను ఏ తప్పు చేయలేదని విలపిస్తుంది. తరువాత దేవి కూడా తన తప్పును మన్నించి చాలా మంది పిల్లలకు తల్లిగా మారి ప్రస్తుత కోట ప్రాంతంలో స్థిరపడింది.


💠 ఆలయ ప్రాంగణంలో నిరాడంబరమైన దుస్తులు ధరించడం తప్పనిసరి.

ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించే ముందు చెప్పులు తప్పనిసరిగా తీసివేయాలి.

మారేడు చెట్లు

 *మారేడు చెట్లు కాపాడుకో మహేశ్వరా!!!*

అనంతసాహితి: శ్రీక్రోధి నామ సంవత్సర గణపతి నవరాత్రులు! -05


ఉమాపుత్రాయ నమః అంటూ బిల్వపత్రంతో బొజ్జగణపయ్యకు పూజ చేస్తాం. కనుక బిల్వపత్రాలు వినాయకుడి పరమైపోయాయి. అమ్మవారు జూదం పేరుతో నెలవంకను, నందీశ్వరుడినీ లాక్కుంటే, పూజపేరుతో బిల్వదళాలు వినాయకుడు లాక్కున్నాడు. 

ఇప్పుడు వినాయకుడి నుంచీ మారేడు చెట్లను మ్లేచ్ఛులు లాక్కుంటున్నారు. దోచుకుపోతే దోచుకుపోయారు అనుకుంటే భారతదేశంలోనే మారేడు చెట్లు అంతరిస్తున్నాయని ఐక్యరాజ్య సమితి ఘోషిస్తోంది. ఈ వివరాలు ఏంటో తెలుసుకుందాం. 

వైద్యానికి పనికివచ్చే వనమూలికల ఎగుమతిలో ప్రపంచంలోనే రెండో స్థానంలో భారతదేశం ఉందని గర్వపడాలో ఏడవాలో తెలియని స్థితికి మనం చేరుకున్నాం.

మ్లేచ్ఛుల చరిత్ర ప్రకారం 5 వేల ఏళ్ళ నుంచీ బేల్ చెట్టు అనే మారేడును మనం కొలుస్తున్నాం, వైద్యంలో వినియోగిస్తున్నాం. 

ఐక్యరాజ్యసమితి 21 వేల వృక్షజాతులు వైద్యంలో ముఖ్యమైనవి అని జాబితా తయారు చేసింది. ప్రపంచంలో 400పుష్పజాతి మూలకుటుంబాలు ఉంటే వీటిలో 315 జాతులు భారతదేశంలో దొరుకుతాయని ఐరాసా అంటోంది. ప్రపంచంలో వనాలనుంచీ వైద్యఔషాథాలు సేకరించిన చరిత్రలో భారతదేశానిదే ప్రథమస్థానం. అయితే ఇక్కడ విచారకరమేమంటే మారేడు చెట్లు అంతరిస్తున్న వృక్షజాలం జాబితాలో ఐరాసా చేర్చడం. అంతేకాదు బిల్వవృక్షానికీ చెదపురుగులు తినే చైనాకు ఏ మాత్రం సంబంధం లేకపోయినా, చైనా కూడా బిల్వచెట్లు అంతరిస్తున్నాయని అంటోంది. 


వేదకాలం నాటి అద్వితీయమైన వృక్షదేవత ఏగెల్ మార్మెలోస్. దీన్ని మారేడు, బిల్వం అని పిలుస్తారు. ఇది మహేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైంది. వేదకాలం నుంచీ ఉన్న వృక్షదేవతల్లో ఇది ప్రథమమైంది. నెత్తిన మూడు మారేడు దళాలు, పురిసెడు గంగనీరు పోస్తే బోళా శంకరుడు సంతోషిస్తాడని అష్టైశ్వర్యాలు ఇస్తాడని ప్రవచనకారులు చెబుతారు. కానీ మారేడు చెట్టు అంతరిస్తోందని చెప్పరు. ఎందుకంటే వారికి ఆ సంగతి తెలియదు.


మారేడు దళాలకు అద్భుతమైన శక్తులు ఉన్నాయి. శివలింగాన్ని తాకిన మారేడు దళాలు శివశక్తిని తమలో నిక్షిప్తం చేసుకుంటాయి. కాస్మిక్ కిరణాలు ఉన్న మారేడు దళాలు ఎవరి దగ్గర ఉంటే వారు అత్యంత శక్తివంతులు అవుతారు.

నిజానికి శివునికి అభిషేకం చేయడంలో కూడా ఆంతర్యం అదే. నీటికి కూడా కాస్మిక్ కిరణాలు దాచుకునే గుణం ఉంది. కనుక వీటిని శివలింగం మీద పోయడం వలన శివశక్తి నీటిలో చేరి అది భూమికి శుభం చేకూరుస్తుందని, ఆ నీరు తీర్థంగా సేవిస్తే, మారేడు దళాలు ప్రసాదంగా స్వీకరిస్తే శివశక్తి సంప్రాప్తిస్తుందని అంటారు. ఇవి భక్తి విశ్వాసానికి శాస్త్రీయతకూ చెందిన అంశాలు.


ఇక వైద్యానికి వస్తే మారేడు చెట్టులో పనికి రాని పదార్థమే లేదు. ఆకులు, కొమ్మలు, బెరడు, కలప, వేళ్ళు, పళ్లు, గింజలు అన్నీ వైద్యానికి పనికి వచ్చేవే. పచ్చకామెర్ల వంటి ఆంగ్లవైద్యానికి తెలియని చికిత్సలు కూడా ఇది చేసేది. మలేరియా, అనేక చర్మవ్యాథులు, పుళ్ళు, పొట్టలో పుళ్ళు, ఎలర్జీల వల్ల చర్మంపై వచ్చే మచ్చలు, దద్దుర్లు వంటివి, బిపి, సుగర్ వంటి రోగాలకు చికిత్స చేస్తుంది. నేడు పీడాకారం ఆంగ్లవైద్యవిధానం వచ్చాక బిల్వ చెట్టును వైద్యంలో సంపూర్తిగా ఉపయోగించడం లేదు. నిజానికి బిల్వ చెట్టు ఉపయోగాలు చూసి ఆధునిక వైద్యులు కూడా ప్రతిరోజూ ఆశ్చర్యపోతూనే ఉన్నారు.


ఇది భారతదేశలోనే పుట్టిన మహా ఔషథరాజం. మహాభిషజుడు అయిన మహేశుడే తనకు అత్యంత ప్రీతి పాత్రమైంది బిల్వం అన్నాడంటే దీని వైద్య మహిమ మనం ఊహించలేం. కేన్సర్ కూడా తగ్గించే శక్తి ఉంది. అల్కలాయిడ్స్ (ఏగెలిన్, ఏగెలెనైన్, మార్మెలైన్) కౌమెరిన్స్, పోలిసచ్చారైడ్స్ వంటివి ఉన్నాయి. బిల్వం వల్ల చక్కెర వ్యాధి నయం అవుతుందని ఏజెలైన్ 2 లనే కాంపౌండును అధ్యయనం చేసి అంటున్నారు. అంతేకాక, హై పెర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీ లో బిల్వం వాడితే అధిక ప్రయోజనాలున్నాయట. బిల్వంలోని మర్మెలోసిన్ కేన్సర్ మందుల్లోని విషాలు తొలగిస్తుందని మలబద్ధకాలు రానివ్వదని, గుండెకు, మెదడుకు మంచిదని తేలుస్తున్నారు.


మారేడు పళ్లను ఉత్తరాదిన జ్యూస్ గా సేవిస్తారు. ధాయిలాండ్ లో, ఇండోనేషియాలో చింతచిగురు మాదిరిగా మారేడును కూర చేసుకొని తింటారు. ప్రపంచం అంతా బిల్వ చెట్టును కేవలం తినే వస్తువుగా లేకపోతే వైద్యవస్తువుగానో చూస్తోంది.

కేవలం భారతదేశంలో మాత్రమే దీన్ని వేదకాలంనాటి వృక్షరాజంగా చూస్తున్నారు. అయితే అత్యంత దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఇది ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న వృక్షజాతిలో బిల్వ చెట్టు ప్రథమస్థానంలో ఉంది. భారతదేశంలో కూడా ఇది కనపడడం చాలా కష్టమైపోతోంది. ఒకప్పుడు బిల్వవనాలు ఉండేవి. కానీ నేడు అడవుల్లో కూడా దొరకడం లేదు. పూర్వం ప్రతి ఇంటిలో బిల్వచెట్టు ఉండేది. నేడు ఊరికి ఒకటి ఉండడం కష్టం అయింది.


వినాయక చవితి వస్తోంది. దసరాలు వస్తున్నాయి. తరువాత శివరాత్రీ వస్తుంది. అందరూ బిల్వ పత్రాలకోసం వెంపర్లు ఆడతారు. కానీ బిల్వ చెట్టు పెంచని భక్తుడికి బిల్వ పత్రాలు స్వామికి అర్పించే అర్హత ఎక్కడ ఉంది?


బిల్వ చెట్లు అంతరిస్తున్నాయన్నది ఐక్యరాజ్యసమితి సాక్షిగా చెబుతున్న నగ్నసత్యం. కావాలంటే మీకు దగ్గరలో ఉన్న ఆయుర్వేద వైద్యుడినో ప్రభుత్వ ఉద్యానవనమాలినో అడిగి తెలుసుకోండి. వీరిలో ఏ ఆయుర్వేద వైద్యుడైనా బిల్వ చెట్ల కొరతలేదు అంటే ఆ వైద్యుడికి ఏమీ తెలియదని లెక్క. వారి దగ్గరకు వెళ్లకండి. ఇదేమాట ఏ ప్రభుత్వ ఉద్యానవనాధికారి లేదా వనమాలి అయినా అంటే వాడంత పనికిమాలిన వాడు మరొకడు లేడని ప్రజల సొమ్ము క్షవరం చేసే ప్రభుత్వఉద్యోగిగా గుర్తించండి.


ఐక్యరాజ్యసమితి చెబుతోంది నమ్మండి. లేదా మీ అంతట మీరే ఒక చిన్న పరీక్ష చేసి చూడండి. వినాయకచవితికి ఒక మారేడు చెట్టు దర్శించి దానికి నమస్కరించండి. దళాలు కోయకండి. ఈ చెట్లు ఎంతగా అంతరించిపోయాయో మీకే తెలుస్తుంది. ఈ పరీక్ష హైదరాబాద్ వాసులకు కాదు చెబుతోంది. అరణ్యప్రాంతం ఉన్న మెదక్, కర్నూలు జిల్లాల్లోని పల్లెవాసులకు పెడుతున్న పరీక్ష. అంగుళం భూమిని లక్షలు పోసి కొంటున్న పగోజి తూగోజి వాళ్లు ఆలోచించాల్సిన అవసరం లేదు.


సరదాగా సెలవు రోజున ఈ పరీక్ష చేసి చూడండి. మీకు సిగ్గువేస్తే వెంటనే బిల్వచెట్లు నాటండి. శివాపరాధం నుంచీ బయటపడమని చెప్పడం లేదు. మీ ఆరోగ్యాలు ఆయుర్వేదం ద్వారా రక్షించుకోమని చెబుతున్నాము. ఎందుకంటే నేడు మారేడు చెట్టు నుంచీ వచ్చే ఆయుర్వేద మందులు రేపు దొరకవు. ఇది ఐరాస హెచ్చరిక.



స్వామి అనంతానంద భారతి

అనంతసాహితి ఆశ్రమం

కార్తికేయుని

 *సీసము*

కల్యాణ మొనరించు కార్తికేయుని గాను

   సంతానమొసగేటి శైవ రూపి

అనుజ సుబ్రహ్మణ్యునక్కున చేర్చుకు

  తల్లి దండ్రియు మామ తాను కలిసి

పంచాయతన మూర్త పరివార భూతుడై

   అగ్రహారమునందు నలరు విభుడు

మా యభీష్టముదీర్చు మాగణ నాథుని

   నవరాత్రి పూజలు పావనములు.

*ఆ.వె.*

కోరి కొలిచి నంత కొండంత కష్టాల

నార్చి బ్రోచు విభుడు నార్తబంధు

నమ్మి మొదలు మ్రొక్క నెమ్మిగ తోడుండు

సుముఖమూర్తి కివియె ప్రముఖ నతులు.

*అందరికీ కల్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర సహిత శ్రీ అభీష్ట గణపతి పంచాయతన మూర్తి నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు*


*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*