1, సెప్టెంబర్ 2020, మంగళవారం

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*



*అష్టమ స్కంధము - ఇరువదియవ అధ్యాయము*

*వామనుడు విరాట్ రూపమున రెండడుగులతో పృథ్విని, స్వర్గమును ఆక్రమించుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*20.17 (పదిహేడవ శ్లోకము)*

*వింధ్యావలిస్తదాఽఽగత్య పత్నీ జాలకమాలినీ|*

*ఆనిన్యే కలశం హైమమవనేజన్యపాం భృతమ్॥7077॥*

అప్పుడు బలిచక్రవర్తి యొక్క భార్యయైన వింధ్యావళి ఒక బంగారు కలశముతో వచ్చెను. ఆమె ముత్యాలహారములచే అలంకృతయై ఉండెను. ఆమె పాద ప్రక్షాళనకు యోగ్యమైన సుగంధపూరిత జలములను కలశముతో తీసికొని వచ్చెను.

*20.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*యజమానః స్వయం తస్య శ్రీమత్పాదయుగం ముదా|*

*అవనిజ్యావహన్మూర్ధ్ని తదపో విశ్వపావనీః॥7078॥*

బలిచక్రవర్తి స్వయముగా మిగుల సంతోషముతో భగవానుని పాదయుగమును కడిగెను. లోకపావనమైన ఆ పాద తీర్థమును తన శిరస్సుప చల్లుకొనెను.

*యాచత్యేవం యది స భగవాన్ పూర్ణకామోఽస్మి సోఽహం దాస్యామ్యేవ స్థిరమితి వదన్ కావ్యశప్తోఽపి దైత్యః|*

*వింధ్యావల్యా నిజదయితయా దత్తపాద్యాయ తుభ్యం చిత్రం చిత్రం సకలమపి స ప్రార్పయత్ తోయపూర్వమ్॥5॥*

"ఆచార్యా! శ్రీమన్నారాయణుడే నన్ను యాచించినచో నేను నిజముగా కృతార్థుడనైతిని. అందువలన తప్పక అతనికి దానమిచ్చి తీరెదసు" అని తన దృఢనిశ్చయమును ప్రకటించెను. అంతట శుక్యాచార్యుడు బలిని శపించెను. ఐనప్పటికిని బలిచక్రవర్తి తన భార్యయైన వింధ్యావళి తెచ్చిన జలముచే నీ పాదములను కడిగి తన సర్వస్వమును సంకల్ప పూర్వకముగా దానము చేసెను. ఇది చాలా విచిత్రము.

*నిస్సందేహం దితికులపతౌ త్వయ్యశేషార్పణం తత్ వ్యాతన్వానే ముముచుః ఋషయః సామరాః పుష్పవర్షమ్|*

*దివ్యం రూపం తవ చ తదిదం పశ్యతాం విశ్వభాజామ్ ఉచ్చైరుచ్చైరవృధదవధీకృత్య విశ్వాండభాండమ్॥*

ఈ విధముగా రాక్షసేశ్వరుడైన బలిచక్రవర్తి ఎట్టి సందేహములేక నీకు భూమిని దానము చేయగా, దేవతలు, మునీంద్రులు, ఆనందముతో పుష్పవర్షమును కురిపించిరి. అప్పుడు అందరు చూచుచుండగనే నీ దివ్యరూపము క్రమక్రమముగా బ్రహ్మాండభాండము కంటె ఎత్తుగా ఎదిగినది. *(శ్రీమన్నారాయణీయము, దశకము 31-5,6)*

*20.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*తదాఽసురేంద్రం దివి దేవతాగణాః గంధర్వవిద్యాధరసిద్ధచారణాః|*

*తత్కర్మ సర్వేఽపి గృణంత ఆర్జవం ప్రసూనవర్షైర్వవృషుర్ముదాన్వితాః॥7079॥*

ఆ సమయమున ఆకాశమునందున్న దేవతలు, గంధర్వులు, విద్యాధరులు, సిద్ధులు, చారణులు మొదలగువారు బలిచక్రవర్తియొక్క దివ్య కార్యమును, సరళత్వమును, సత్యనిష్ఠను ప్రశంసించిరి. వారు అతనిపై సంతోషముతో పుష్పవర్షమును కురిపించిరి.

*20.20 (ఇరువదియవ శ్లోకము)*

*నేదుర్ముహుర్దుందుభయః సహస్రశో గంధర్వకింపూరుషకిన్నరా జగుః|*

*మనస్వినానేన కృతం సుదుష్కరమ్ విద్వానదాద్యద్రిపవే జగత్త్రయమ్॥7080॥*

అప్పుడు వేలకొలది దుందుభులు ఒక్కసారిగా మ్రోగెను. గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు *బలీ! నీవు ధన్యుడవు* అనుచు ఇట్లు కీర్తించిరి. ఉదారశీలుడైన బలి ఇతరులకు దుష్కరమైన కార్యమును గూడ ఆచరించెను. యాచించిన వాడు శత్రువు అని తెలిసియు, ముల్లోకములను దానము చేసెను.

*20.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*తద్వామనం రూపమవర్ధతాద్భుతమ్ హరేరనంతస్య గుణత్రయాత్మకమ్|*

*భూః ఖం దిశో ద్యౌర్వివరాః పయోధయస్తిర్యఙ్ నృదేవా ఋషయో యదాసత॥7081॥*

అదే సమయమున అత్యంత అద్భుతమైన సంఘటన జరిగెను. అనంతుడైన భగవానుని యొక్క త్రిగుణాత్మకమైన వామన రూపము పెరుగసాగెను. ఆ విరాడ్రూపములో పృథ్వి, ఆకాశము, దిక్కులు, స్వర్గము, పాతాళము, సముద్రములు, పశుపక్ష్యాదులు, మానవులు, దేవతలు, ఋషులు మున్నగువారు అందరును అంతర్భాగమైరి.

*శార్దూల విక్రీడితము*

ఇంతింతై, వటుఁడింతయై
......మఱియుఁ దా నింతై నభోవీథిపై
నంతై తోయదమండలాగ్రమున 
......కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై
......నంతై మహర్వాటిపై
నంతై సత్యపదోన్నతుం డగుచు
......బ్రహ్మాండాంత సంవర్ధియై.

*తాత్పర్యము*

బలిచక్రవర్తి మూడడుగుల మేర భూమి ధారపోయగానే గ్రహించిన వామనుడు చూస్తుండగానే ఇంత పొట్టి బ్రహ్మచారీ, ఇంత ఇంత చొప్పున ఎదగటం మొదలెట్టాడు; అంతట్లోనే అంత పొడుగు ఎదిగాడు; అలా ఆకాశం అంత ఎత్తు పెరిగాడు; అదిగో మేఘాలకన్నా పైకి పెరిగిపోసాగాడు; పాలపుంత, చంద్రమండలం అన్నీ దాటేసాడు; అదిగదిగో ధ్రువ నక్షత్రం కూడ దాటేసాడు; మహర్లోకం మించిపోయాడు. సత్యలోకం కన్నా ఎత్తుకి ఇంకా ఎత్తుకి పెరిగిపోతూనే ఉన్నాడు. మొత్తం బ్రహ్మాండభాడం అంతా నిండిపోయి వెలిగిపోతున్నాడు; ఆహా ఎంతలో ఎంత త్రివిక్రమరూపం దాల్చేసాడో శ్రీమన్నారాయణ మహా ప్రభువు.

*20.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*కాయే బలిస్తస్య మహావిభూతేః సహర్త్విగాచార్యసదస్య ఏతత్|*

*దదర్శ విశ్వం త్రిగుణం గుణాత్మకే భూతేంద్రియార్థాశయజీవయుక్తమ్॥7082॥*

ఋత్విజులు, ఆచార్యులు, సదస్యులు మొదలగు వారితో కూడిన బలిచక్రవర్తి సమస్త ఐశ్వర్యములకును నిలయమైన భగవంతుని త్రిగుణాత్మకమైన ఆ శరీరమందు పంచభూతములను, ఇంద్రియములను, వాటి విషయములను, అంతఃకరణమును, జీవులతోగూడిన త్రిగుణమయమైన సంపూర్ణజగత్తును తిలకించిరి.

*20.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*రసామచష్టాంఘ్రితలేఽథ పాదయోర్మహీం మహీధ్రాన్ పురుషస్య జంఘయోః|*

*పతత్త్రిణో జానుని విశ్వమూర్తేరూర్వోర్గణం మారుతమింద్రసేనః॥7083॥*

బలిచక్రవర్తి విరాట్ స్వరూపుడైన ఆ భగవంతుని పాదతలములందు, రసాతలమును, చరణములయందు పృథ్విని, పిక్కలయందు పర్వతములను, మోకాళ్ళయందు పక్షులను, ఊరువులయందు మరుద్గణములను చూచెను.

*20.24 (ఇరువది నాలూగవ శ్లోకము)*

*సంధ్యాం విభోర్వాససి గుహ్య ఐక్షత్ప్రజాపతీన్ జఘనే ఆత్మముఖ్యాన్|*

*నాభ్యాం నభః కుక్షిషు సప్తసింధూనురుక్రమస్యోరసి చర్క్షమాలామ్॥7084॥*

ఇదేవిధముగా ఆ త్రివిక్రముని వస్త్రముల యందు ఉభయసంధ్యలను, గుహ్యమందు ప్రజాపతులను, జఘనమున బలితో గూడిన దైత్య ప్రముఖులను, నాభియందు ఆకాశమును, ఉదరమునందు సప్తసముద్రములను. వక్షఃస్థలమునందు నక్షత్ర సమూహమును బలిచక్రవర్తి దర్శించెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని ఇరువదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుఫ🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319

కేశవ నామాలు

కేశవ నామాలు సంకల్పబలాన్నిచ్చే దివ్య మంత్రాలు. హిందూ సంప్రదాయంలో ప్రధానమై, నిత్యం స్మరించే ఈ దివ్య నామాలను ఒక మేలుకొలుపు పాటగా పాడుకోవడం ఆనాటి స్త్రీలలో చాలామందికి ఆనవాయితీ.


1. కేశవ యని నిన్ను వాసిగ భక్తులు

వర్ణించు చున్నారు మేలుకో,

వాసవ వందిత వసుదేవ నందన

వైకుంఠ వాసుడా మేలుకో || కృష్ణా మేలుకో ||


2. నారాయణా నిన్ను - నమ్మిన భక్తుల

కరుణ బ్రోతువు వేగ మేలుకో,

శరణన్న రక్షణ బిరుదు నీకున్నది

శశిధర సన్నుతా మేలుకో || కృష్ణా మేలుకో ||


3. మాధవ యని నిన్ను యాదవులందరు

మమత జెందుతున్నారు మేలుకో,

చల్లని చూపుల తెల్లని నామము

నల్లని నాస్వామి మేలుకో || కృష్ణా మేలుకో ||


4. గోవింద యని నిన్ను గోపికలందరు

గొల్లవాడందురు మేలుకో,

గోపీమనోహర గోవర్ధనోద్ధార

గోపాలబాలుడా మేలుకో || కృష్ణా మేలుకో ||


5. విష్ణు రూపముదాల్చి విభవము దర్శించి

విష్ణు స్వరూపుడ మేలుకో,

దుష్టసంహారక దురితము లెడబాపు

సృష్టి సంరక్షక మేలుకో || కృష్ణా మేలుకో ||


6. మధుసూదన నీవు మగువ తోడుత గూడి

మరచి నిద్రించేవు మేలుకో,

ఉదయార్క బింబము ఉదయించు వేళాయె

వనరుహ లోచన మేలుకో || కృష్ణా మేలుకో ||


7. త్రివిక్రమా యని శక్రాదులందరు

విక్రమ మందురు మేలుకో,

శుక్రాది గ్రహములు సుందరరూపము

చూడగోరుచున్నారు మేలుకో || కృష్ణా మేలుకో ||


8. వామన రూపమున భూదాన మడిగిన

పుండరీకాక్షుడా మేలుకో,

బలిని నీ పాదమున బంధన జేసిన

కశ్యప నందనా మేలుకో || కృష్ణా మేలుకో ||


9. శ్రీధర గోవింద, రాధా మనోహర

యాదవ కులతిలక మేలుకో,

రాధాపధూమణి రాజిల్క నంపింది

పొడచూతువుగాని మేలుకో || కృష్ణా మేలుకో ||


10. హృషీకేశ యీ భువియందు ఋషులందరు

వచ్చి కూర్చొన్నారు మేలుకో,

వచ్చినవారికి వరములు కావలె

వైకుంఠ వాసుడా మేలుకో || కృష్ణా మేలుకో ||


11. పద్మనాభ నీదు పత్ని - భాగాదులు

వచ్చి కూర్చున్నారు మేలుకో,

పరమ తారకమైన పావన నామము

పాడుచు వచ్చిరి మేలుకో || కృష్ణా మేలుకో ||


12. దామోదరా యని దేవతలందరు

దర్శించ వచ్చిరి మేలుకో,

భూమి భారము మాన్ప బుధుల బ్రోవను రావె

భూకాంత రమణుడా మేలుకో || కృష్ణా మేలుకో ||


13. సంకర్షణ నీవు శత్రుసంహార మొనర్ప

సమయమై యున్నది మేలుకో,

పంకజాక్షులు నీదు పావన నామము

పాడుచు వచ్చిరి మేలుకో || కృష్ణా మేలుకో ||


14. వాసుదేవా నీకు భూసుర పత్నులు

భుజియింప దెచ్చిరి మేలుకో,

భూసురంబుగ యాగసంరక్షణ కొరకు

వర్ణింపు చున్నారు మేలుకో || కృష్ణా మేలుకో ||


15. ప్రద్యుమ్న రూపుడ అర్జున వరదుడ

దుర్జన సంహార మేలుకో,

అబ్జవంశమునందు ఉద్భవించియు కుబ్జ

నాదరించిన దేవ మేలుకో || కృష్ణా మేలుకో ||


16. అనిరుద్ధ యని నిన్ను అబ్జభవాదులు

అనుసరింప వచ్చె మేలుకో,

అండజవాహన అబ్ధిసంహరణ

దర్భశయన వేగ మేలుకో || కృష్ణా మేలుకో ||


17. పురుషోత్తమా యని పుణ్యాంగనలంతగ

పూజలు జేతురు మేలుకో,

పురుహూతవందిత పురహర మిత్రుడ

పూతన సంహార మేలుకో || కృష్ణా మేలుకో ||


18. అధోక్షజ మిమ్ము స్మరణ జేసినవారి

దురితము నెడబాప మేలుకో,

వరుసతోడుత మిమ్ము స్మరణ జేసినవారి

వందన మొసగెద మేలుకో || కృష్ణా మేలుకో ||


19. నారసింహ నిన్ను నమ్మిన భక్తుల

కరుణబ్రోతువు వేగ మేలుకో,

శరణన్న రక్షణబిరుదు గల్గిన తండ్రి

శశిధరసన్నుతా మేలుకో || కృష్ణా మేలుకో ||


20. అచ్యుతా యని నిన్ను సత్యముగ వ్రతవిధులు

కొనియాడవచ్చిరి మేలుకో,

పచ్చని చేలమూ అచ్చంగ దాల్చిన

లక్ష్మీమనోహర మేలుకో || కృష్ణా మేలుకో ||


21. జనార్ధనా నీవు శత్రుసంహార మొనర్చ

సమయమైయున్నది మేలుకో,

పంకజాక్షులు నీదు పావననామము

పాడుచువచ్చిరి మేలుకో || కృష్ణా మేలుకో ||


22. ఉపేంద్రా యని నిను సువిదలందరు గూడి

యమునతీర మందున్నారు మేలుకో,

గోపీకాంతలు నీదురాక గోరుచున్నారు

మురళీనాదవినోద మేలుకో || కృష్ణా మేలుకో ||


23. హరి యని నిన్ను కొనియాడ గోపికా

జనులంత వచ్చిరి మేలుకో,

అష్టభార్యలు నీదు రాకగోరుచున్నారు

వనమాలికాధర మేలుకో || కృష్ణా మేలుకో ||


24. శ్రీకృష్ణా యని నిన్ను గోపాల బాలురు

బంతులాడ వచ్చిరి మేలుకో,

కాళీయ మర్ధన కౌస్తుభ మణిహార

కంససంహరణా మేలుకో || కృష్ణా మేలుకో ||


25. శ్రీరామ యని మునులు స్థిరభక్తితో మిమ్ము

సేవించుచున్నారు మేలుకో,

తాటకీసంహార ఖరదూషణాంతక

కాకుత్థ్సకులరామా మేలుకో || కృష్ణా మేలుకో ||


26. తెల్లవారవచ్చె దిక్కులు తెలుపొందె

నల్లని నాస్వామి మేలుకో,

వేళాయె గోవులమందకు పోవలె

గోపాల బాలుడా మేలుకో || కృష్ణా మేలుకో ||

హిందూ ధర్మం.





ప్రపంచంలో ఒకే ఒక ధర్మం భగవంతుడిని తెలుసుకునే విధానాన్ని తెలిపింది. అదే మన హిందూ ధర్మం. మనం హిందువులుగా జన్మించటం మన పూర్వ జన్మ పుణ్య ఫలం. ఇప్పుడు హిందూ మతం మీద ఇతర మతస్తుల దాడి చేస్తూవుంటే మన హిందువులు హిందుత్వం మీద అవగాహనా రాహిత్యం వల్ల వారు ఇతర మతస్తులు చెప్పేది నిజమని నమ్ముతున్నారు. అందునా కొందరు బ్రాహ్మలు హిందుత్వం మీద కావలసిన జ్ఞానం లేక హిందూ వైదిక్ విజ్ఞానం మీద సరైన అవగాహన లేకపోవటంతో మన హిందుత్వాన్ని ప్రశ్నించే విధంగా తయారవుతున్నారు. అదే బ్రాహ్మలు వారి విధి విహిత నిత్య నియమిష్టిక కర్మలను సకాలంలో చేస్తూ ఉంటే వారు ఈ విధంగా విమర్సించరు. మనం మన పూర్వికులు మనకు సూచించిన మార్గాన్ని తూచా తప్పకుండ ఆచరించటమే మనం చేయవలసిన విధి. మన సంస్కృతి సాంప్రదాయాల ప్రాముఖ్యత, వాటి విశిష్టత సాటివారికి వివరించి ఈ సమాజాన్ని ధర్మ బద్దంగా గడపేటట్లు చేయటం బ్రాహ్మణుల విధి. కానీ కొంతమంది మన సంప్రదాయాల జ్ఞానాన్ని తెలుసుకొనే దానికి ఎక్కువ శ్రర్ధ చూపక ఇతరుల మాయ మాటలకు లోనయి మన సంస్కృతిని మన ధర్మాన్ని చివరికి మన దేముళ్ళని మన వారే విమర్శిస్తున్నారంటే మనం ఇప్పుడు యెంత ప్రమాదకార స్థితిలో ఉన్నామో తెలుస్తున్నది. . 

రాముడు, క్షత్రియుడు, శ్రీకృష్టుడు యాదవుడు, హనుమంతుడు మర్కటం అని అంటమే కాక యితర మత సన్యాసులను దేముడిగా అభివర్ణిస్తూ వారు మన ధర్మానికి గ్లాని చేయటమే కాక యితరులను కూడా ధర్మము నుండి వైదొలిగేటట్లు చేస్తూ వారి మతమే మంచిదని ప్రచారం చేస్తున్నారు. సహస్రనామాలు, శతనామాలు కల్పించి మన సంప్రదాయాలను తుంగలో తొక్కుతున్నారు. ఈ ప్రమాదాన్నుంచి మన సనాతన ధర్మాన్ని కాపాడవలసిన భాద్యత మన అందరిమీద వున్నది.

మనం ఏమి చేయాలి.

1) ప్రతి హిందువు మన సనాతన హిందూ ధర్మాన్ని గౌరవించాలి. ఇతరులు గౌరవించేట్లు ప్రయత్నించాలి.

2) మనం యితర మతాల వారిని చులకనగా చూడవద్దు. కానీ మన ధర్మాన్ని కానీ మన హిందుత్వాన్ని కానీ ఏ మతస్తుడైన చులకన చేసి మాట్లాడిన కువిమర్శ చేసిన ఊరుకోకూడదు. వారికి ధీటైన సమాధానం చెప్పాలి. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి ప్రతి హిందూ తన నిత్యా దైనందిత కార్యక్రమాలలో భాగంగా శ్రీ కృష్ణ భాగవానుడు మానవాళి మనుగడకు అర్జనునికి ఉపదేశించిన " భగవత్ గీతను" పారాయణ చేయటం అలవాటుగా చేసుకోవాలి. భగవత్ గీత ఎవరైతే చదివి ఆకళింపు చేసుకుంటారో వారు హిందుత్వం మీద పట్టు కలిగి వుంటారు. భగవానుడు మానవుడు ఎలా ఉండాలి, ఏమి చేయాలి యెట్లా చేయాలి అనే అన్ని విషయాలను ప్రతి మానవుడు అర్ధం చేసుకునేట్లు బోధించారు. భగవత్ గీత హిందువులందరికి పారాయణీయ గ్రంధము మరియు గీతా సారం అమృత తుల్యం. ప్రతి వాడు ఆచరించాలి. కృష్ణ భగవానుడు యాదవుడు అనే భావం మానుకోవాలి స్వామి సాక్షాత్ విష్ణు దేముడి అవతార పురుషుడిగా మాత్రమే భావించాలి.



3) రాముడిని క్షత్రియుడిగా చూడటం మానుకోవాలి. రాముడు ఒక ఆదర్శ పురుషుడు. రామాయణం కూలంకుషంగా చదవాలి రామాయణమును విమర్శించకుండా అందులో వున్న జ్ఞానాన్ని ఆకళింపు చేసుకోవాలి.



4) శ్రీమత్ మహా భారతం ఈ ఇతిహాసం మనం సమాజంలో ఎటువంటి మనస్తత్వాలు కలిగిం మనుషులను నిత్యం ఎదుర్కొంటున్నామో అవి అన్ని ఇందులో వున్నాయ్. ఏ మానవుడు శ్రీమత్ మహా భారతంను క్షుణ్ణంగా పఠించి అవగాహన చేసుకుంటాడో అతడు తన జీవితాన్ని ఎటువంటి వడిదుడుకులు లేకుండా సాఫీగా నడుపుకోగలడు.



5) వేదాలు అవి మాములు మనుషులు పాటించేటటువంటి సామాన్యుమైన విషయాలు కావు. కాబట్టి సాధ్యమైనంత వరకు వేదపండితుల ద్వారా మాత్రమే మనం వేదాల మహోన్నతిని తెలుసుకోగలం. ఒక పండితుడు కేవలం ఒక వేదం మాత్రమే చదవగలరు అంటే అవి యెంత ఉత్కృష్టమైనగో గమనించండి.



6) మనకు అష్టా దశ పురాణాలూ అంటే 18 పురాణాలు వున్నాయ్ అవి చదవ వచ్చు కానీ చాలా సమయం కావాలి. పౌరాణికుల ద్వారా మనం పురాణాలగూర్చి తెలుసుకోవాలి.



7) స్వర్గం, నరకం, పాపం, పుణ్యం ఇవి అన్ని సామాన్యు మానవుల సాధారణ జ్ఞ్యానం. అన్నిటికి మించిన బ్రహ్మ జ్ఞానం మన హిందూ ధర్మంలో వుంది. అది మనకు ఉపనిషత్తుల వల్ల లభ్యమవుతుంది. ప్రతి మానవుడు, ఏ కులజుడైన, స్త్రీ, పురుష తారతమ్యం లేకుండా పొందవలసిన జ్ఞానం. ఎవరైతే బ్రహ్మ జ్ఞానం పొందుతారో వారు జీవన్ముక్తులు. కోటికి ఒక్కరికి మాత్రమే బ్రహ్మ జ్ఞానం పొందాలనే ఉద్దేశం కలుగుతుంది అటువంటి వారిలో కోటికి ఒక్కరు మాత్రమే ఆ అనంత జ్ఞానం పొందగలుగుతారు అని మనకు శ్రీ కృష్ణ భగవానుడు గీతలో తెలిపారు.



హిందువులు విగ్రహారాధకులు అనే భావాన్ని ఇతర మతస్తులు చేస్తున్నారు. దయచేసి తెలుసుకోండి హిందువులు విగ్రహారాధకులు కారు, కానీ విగ్రహారాధకులు అదేమిటని మీరు అడగ వచ్చు. విగ్రహ ఆరాధన మనకు ఆరాధన పరంపరలో ఒక ప్రాధమిక స్థాయి. దీనిని వివరించా ప్రయత్నిస్తా. మనం చిన్నప్పుడు లెక్కలు నేర్చుకోవటానికి మన గురువులు మన వేళ్ళ మీద గణించటం నేర్పుతారు. ఆలా నేర్చుకొని తరువాత మనం వేళ్ళు లెక్కించకుండా లెక్కలు చేయ గలుగుతాము. ఇప్పుడు చెప్పండి లెక్కలు చేయటానికి చేతి వేళ్ళు అవసరమా. కాదు కానీ లెక్కలు నేర్చుకోటానికి మాత్రమే చేతి వేళ్ళు ఆసరాగా ఉపయోగ పడుతాయి. అదే మాదిరిగా అంటకారణ శుద్ధి కోసం మాత్రమే మనం విగ్రహారాధన చేయాలి. కానీ విగ్రహారాధనే పరమావధిగా భావించకూడదు. ఆలా భావిస్తే మనం ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించలేము.

ఒక సాధకునికి విగ్రహారాధనతో అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుందో అప్పుడు తనంతట తానె విగ్రహారాధన మాని జ్ఞ్యాన మార్గాన్ని అనుసరిస్తారు. ఈ విధంగా మనం సాధన చేయాలి.

బ్రహ్మ జ్ఞానాన్ని పొందటానికి మనకు అనేక వేదాంత గ్రంధాలు వున్నాయ్. అందులో ప్రముఖమైనవి ఉపనిషత్తులు.



హిందూ ధర్మ ఆపరమైన జ్ఞాన సంపద కలిగిన ఏకైక ధర్మం ఈ ప్రపంచంలో వున్నది. హిందువులకు వున్న జ్ఞాన సంపద మరే మతస్తులకు లేదు. హిందుత్వం గూర్చి తెలియని అమాయకులను చూసి యితర మతస్తులు మాయ మాటలు చెప్పి మత మార్పులు చేస్తున్నారు. కాబట్టి హిందూవులమైన మనమందరము ముందుగా హిందువా మహోన్నత జ్ఞానాన్ని గూర్చి తెలుసుకొని యితరులకు భోదించాలి. మనం వేరే మతస్తులం మన మతంలోకి రమ్మని పిలవము. అదే విధంగా మనం వేరే మతాల్లోకి వెళ్ళకూడదు.

హిందూ ధర్మం సమాధులను పూజించే విధానాన్ని కండిస్తుంది. అదే మన విధానం ఐతే మనం శ్రీరాముడి, శ్రీ కృష్ణుని ఇంకా అనేక సాధువుల, సత్పురుషుల సమాదులని ఆలయాలుగా చేసి పూజించేవారము. దయచేసి ఎవరైనా సమాధి పూజ, సమాధి మందిరం అని మిమ్మలిని ప్రలోభ పెడితే ప్రలోభపడొద్దు.

జై హిందు

ఓం శాంతి శాంతి శాంతిః

సర్వే జన సుఖినోభవంతు,

పాపం-పుణ్యం-దేముడు


ప్రతి జీవి ఎవరి కర్మ వారే అనుభవించాలి. కర్మ ఫలితాన్ని మంచిదైన, చెడుదైన దానిని మార్పు చేసే శక్తి ఏ మానవుడికి లేదు. దీనిని ఒక చిన్న ఉదాహరణతో వివరిస్తాను.
మీరు ఒక బ్యాంకులో అకౌంటు కలిగి వున్నారు అనుకోండి ఆదే బ్యాంకులో మీరు అప్పు తీసుకున్నారనుకోండి. అప్పుడు మీకు బ్యాంకులో రెండు అకౌంట్లు వున్నాయి ఒకటి డిపాజిట్ అకౌంట్ రెండు లోన్ అకౌంట్. ఇప్పుడు మీరు లోనే అకౌంటులో తక్కువ డిపాజిట్ అకౌంట్లో ఎక్కువ డబ్బులు వున్నాయనుకోండి అప్పుడు మీరు ఇచ్చిన చెక్కు బ్యాంకు వారు తీసుకొని మీకు డబ్బులు ఇస్తారు. అదే మీ లోనే అకౌంట్లో ఎక్కువ డిపాజిట్ అకౌంట్లో తక్కువ డబ్బులు ఉంటే మీ చెక్ బౌన్స్ చేసి ముంది మీ లోన్ తీర్చమని మీకు బ్యాంకు మేనేజర్ సూచిస్తాడు. కట్టక పొతే మీ ఆస్తిని అమ్మి డబ్బు వసులు చేస్తాడు.
ఇప్పుడు మన కర్మ గూర్చి మాట్లాడుదాము. మీ డిపాసిట్ అకౌంట్లో వున్న డబ్బులు మీరు చేసుకున్న పుణ్యం అనుకోండి. మీ లోన్ అకౌంట్లో డబ్బులు మీరు చేసుకున్న పాపం అనుకోండి. బ్యాంకు మేనేజర్ భగవంతుడు అనుకోండి. ఇప్పుడు మీకు మీ కర్మ ఫలితం ఎలా అనుభవిస్తారో తెలుస్తుంది. పుణ్యం చేసిన వారు దేముడిని కోరుకునే కోరిక వెంటనే నెరవేరుతుంది. అంటే వారి చెక్కు హానర్ అవుతుంది అని అర్ధం. మరి మీ అకౌంట్లో పాపం ఎక్కువుంటే మీ ప్రార్ధన నెరవేరదు ఎందుకంటె మీ పాపం ఎక్కువ వున్నది. ముందు అది కట్టాలి అని మేనేజర్ (దేముడు) నిన్ను పాప ఫలాన్ని అనుభవించేటట్లు చేస్తాడు. అయితే పాపఫలితాని అనుభవించకుండా తప్పించుకునే మార్గం వుంది అదే ఇప్పుడు మనం పుణ్య కార్యాలు చేయటం. పుణ్య కార్యాలు ఎక్కువ చేస్తే మీ డిపాజిట్ అకౌంట్లో జమ పెరుగుతుంది. అప్పుడు మీ చెక్ ఆనర్ అవుతుంది అదే మీరు దేముడిని కోరుకున్న కోరిక నెరవేరుతుంది. దేముడు కేవలం బ్యాంకు మేనేజరులాంటి వాడు అయన ఎవరిని ప్రేమించడు, ద్వేషించాడు. అందుకే దేముడు త్రిగుణాతీతుడు. అందరు వారు వారు చేసుకున్న కర్మను మాత్రమే అనుభవించాలి.

*కణ నాట్యమే

*కణ నాట్యమే- నటరాజు పరమ శివుడి తాండవం:*

( *ఇదే సైన్స్ పుస్తకం ఒక భారతీయుడు రాసివుంటే మన దేశం లో కొన్ని లక్షల మంది వెటకారంగా, అపహష్యంగా మాట్లాడేవారు... పాపం వారికి ఆ అవకాశం లేదు*)

 శివ తాండవం అంటే ఏమిటో తెలియచేయాలంటే అది అనుభవించిన వాడే చెప్పగలడు. అట్టి అనుభవానికి జాతి, కుల, మత, దేశ కాల నియమాలు లేవని తెలియ చేయడానికే ఒక పాశ్చాత్యుని అనుభవం ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.

*డా. ఫ్రిట్జ్ ఆఫ్ కాప్రా అమెరికాలో నివసించే భౌతిక శాస్త్రవేత్త.* డెబ్బయ్యవ దశకంలో ఉన్న కాప్రా వయోవృధ్ధుడే కాదు; అభివృధ్ధుడు, ఙ్ఞాన వృధ్ధుడు కూడా. ఙ్ఞానికి, చైతన్యానుభవానికి దేశ కాలాలు అడ్డుకావని చెప్పడానికి ఒక సజీవ ఉదాహరణ డా.కాప్రా. అతడు తన *'తావో ఆఫ్ ఫిజిక్స్'* అనే గ్రంథం ఉపోద్ఘాతంలో పొందుపరిచిన అనుభవం ఇది:

"ఐదు సంవత్సరాల క్రితం కలిగిన అద్భుతమైన అనుభవం నన్ను ఒక కొత్త మర్గంలో నడిపించి, ఈనాడు ఈ గ్రంథ రచనకు ప్రేరణగా నిలిచింది.

ఒకనాటి ఎండాకాలం సాయంకాలం సముద్రపు ఒడ్డున వచ్చి పోయే అలలను చూస్తూ, నా శ్వాసనిశ్వాసల లయబద్ధతను గమనిస్తూ కూర్చొని ఉన్నాను. ఉన్నట్టుండి నా అంతరంగానికి ఈ చుట్టూ ఉన్న వాతావరణమంతా ఒక గొప్ప నృత్యంలో భాగంగా నాట్యం చేస్తున్నట్టు గోచరించసాగింది.

ఒక శాస్త్రవేత్తగా ఈ ఇసుక, రాళ్ళు, నీరు, గాలి - అన్నీ కదుల్తున్న అణు, పరమాణువుల చేత చేయబడినవని తెలుసు. అలాగే భూమి యొక్క వాతావరణమంతా పదార్థ రాశి నిర్మింపబడడానికి అణుపరమాణువుల మధ్య జరిగే నిరంతర సంగ్రామాన్ని ఒక భౌతిక శాస్త్రవేత్తగా గ్రాఫ్లు ,బొమ్మలు, సూత్రాల ద్వారా మాత్రమే ఎరిగి ఉన్నాను.

కానీ ఈనాడు చల్లని ఈ సాయం సంధ్య నా పుస్తక ఙ్ఞానికి ప్రాణం పోసింది.

శక్తి తరంగాలు ఆకాశం నుండి దిగిరావడం నేను చూశాను.

లయబద్ధంగా ఆ శక్తి తరంగాలు పదార్థ రాశిగా మారడం, తిరిగి శక్తిగా లయించిపోవడం నేను చూశాను.
పదార్థంలోని పరమాణువులను నేను దర్శించగలిగాను.ప్రతి పదార్థములోని అణువులకు, చలనం ఉన్నది. ఉప పరమాణు క్షేత్రము (sub atomic field)లోనే కాకుండా, పరమాణు క్షేత్రములో కూడా "కణ తాండవం" జరుగుతూ ఉంటుంది. కానీ అది మన మామూలు కనులకు కనబడదు. పరమ సూక్ష్మ స్థాయిలో ఇది జరుగుతూ ఉంటుంది.భూ వాతావరణాన్ని, కాస్మిక్ కిరణాలు, నిరంతరం మర్దిస్తున్నాయని, అందులో ఉన్న అతి శక్తి కణాలు, గాలి లోకి చొచ్చుకొని వచ్చినపుడు , బహుళ సంఘాతాలకు గురి అగునని నాకు తెలుసు. భౌతిక శాస్త్ర పరిశోధనల వలన ఈ విషయం నాకు తెలుసు. అయితే ఈ పరిజ్ఞానమంతా, ఇప్పటి వరకు, గ్రాఫుల ద్వారా, చిత్రాల ద్వారా, గణిత-భౌతిక శాస్త్ర సిద్ధాంతాల ద్వారా మాత్రమే తెలుసు కున్నాను. సముద్ర తీరాన కూర్చొన్నపుడు, నా గత అనుభవాలన్నీ జీవం పోసుకున్నాయి. బాహ్య ఆకాశము నుండి అవతరించు, ఆవర్తనములను (సుడులు), అందులోని కణములు లయాత్మకంగా స్పందిస్తూ పొందు సృష్టిని, నాశనాన్ని చూశాను. మూల కాల పరమాణువులు, నా శరీరంలోని పరమాణువులు....ఈ విశ్వ శక్తి నాట్యంలో పాల్గొనడం నేను చూసాను. ఆ లయను నేను అనుభవించాను. ఆ ధ్వని విన్నాను. అదియో హిందువులు పూజించు "నటరాజు - శివుని నాట్యమని" ఆ క్షణంలో తెలుసుకున్నాను. ఇట్టి శివ తాండవములో పాల్గొనని నక్షత్రముండునా? పరమాణువు ఉండునా? చలించని తరంగ ముండునా?

    *అనుక్షణం తాండవిస్తూ, అట్టి కదలికల వలన శబ్దాన్ని ఉత్పన్నం చేయు పరమాణు సమూహములే, కంటికి కనిపించే "చరాచర జగత్తు"*

ఆ నృత్యం యొక్క క్రమం మారితే, దాని శబ్దం మారుతుంది. ప్రతి పరమాణువు కూడా తన గానాన్ని తానే పాడుతుంది. ఆ శబ్దము స్థూల-సూక్ష్మ రూపాలను ఉత్పన్నం చేస్తుంది. ఆ శబ్దమే.....శబ్ద బ్రహ్మముగా....అదే సృష్టి స్థితి లయలకు కారణాలుగా భావించి, దాని రూపమైన సంగీతాన్ని.....ఆధ్యాత్మిక సాధనగా గైకొనిన కబీరు, గురునానక్, త్యాగరాజు మొదలగు ఆత్మ వేత్తలు చెప్పిన దానికి, నేటి భౌతిక శాస్త్ర సిద్ధాంతాలు ఎంతో సన్నిహితంగా ఉన్నాయి.

నా శరీరంతో సహా సర్వంలోనూ ఉన్న ఆ అణుపరమాణువులు ఒక మహా శక్తి తరంగ నృత్యంలో భాగాలుగా నర్తించటం చూశాను.

*ఆ లయను నేను గుర్తించాను.*

*ఆ శబ్దాన్ని నేను విన్నాను.*

ఆ క్షణంలో నేను అనుభూతి చెందింది హిందువులు నటరాజుగా పూజించే పరమశివుని తాండవంగా తెలుసుకొని పరవశంతో నన్ను నేను మరచిపోయాను.

సజల నయనాలతో కాలం తెలియని అలౌకిక స్థితికి తీసుకెళ్ళిన ఆ అనుభూతిని, కాదు అనుభవాన్ని ఏమని వర్ణించగలను?!!

ఈ అనుభవమే నా గమ్యాన్ని, గమనాన్ని మార్చే దిక్సూచి అయింది. నా అడుగులు తూర్పు దేశాలలోని అద్భుత విద్య వైపు కదిలేలా చేసింది. ఎందరో మహనీయులను దర్శించే అవకాశం కలిగించింది".

     వివిధ గ్రంథాల్లో, శివ తాండవాన్ని, కవితాత్మక వర్ణనగా, కవిత్వం రూపంగా మాత్రమె కాదు. సర్వ రూపములు ఈశ్వరుడే....అంటే పరబ్రహ్మమే. కావున తాండవం అనగా నిత్యం స్పందించే (vibration) విశ్వమే శివుడు (ఈశ్వరుడు).ఆధునిక భౌతిక శాస్త్రం చెప్పినట్లు, ఈ తాండవం నిత్యం జరుగునదేఅంటాడు fritze of Capra.

   *ఇలా విశ్వం యొక్క సృష్టి-స్థితి-లయలను, Fritze of Capra నటరాజు నృత్యంతో పోలుస్తాడు. నటరాజు కుడి చేతిలో డమరుకం, ఎడమ చేతిలో అగ్ని ఉంది. డమరుకం, నూతన అణువుల సృష్టికి సంకేతం. అగ్ని , పాత అణువుల విలీనానికి సంకేతం. మరొక కుడి చేతిలో అభయ ముద్ర, మరొక ఎడమ చేతితో వరద ముద్ర నెపంతో, తన పాదాలను ఆశ్రయించమని సూచిస్తున్నాడు. ఆయన గ్రంథం Tao of Physics మొదటి ముద్రణ ముఖ చిత్రంగా, నటరాజు పరమ శివుణ్ణే ఎన్నుకున్నాడు.*

 *మన పురాణ వర్ణనలు, వేదోక్త భావనలు, ఉపనిషత్తుల జ్ఞాన సంపద.....పాశ్చాత్య శాస్త్రవేత్తలకు క్రొంగొత్త భావనలు అందిస్తూ ఉంటే, భారతీయులలో భావ దాస్యం గల కొంతమంది మన సాహిత్యాన్ని పుక్కిటి పురాణాలుగా చెబుతున్నారు. ఎంత హైన్యం? ఎంత దైన్యం?*

ఈ భావ దాస్యం నుండి ఎప్పుడు బయట పడదాం.ఆలోచించండి

రోగనిరోధక శక్తి

*ఓం శ్రీ గణేశాయ నమః*
*ఓం గురుభ్యో నమః*

*రోగనిరోధక శక్తి పెరగటానికి మార్గం:-*

*ఇక అఖండ శక్తి వంతమైన నామం రామ నామాన్ని నిరంతరం స్మరణ చేసుకోవాలి.*

*నిత్యం ఉదయం ప్రాణాయామం, కపాల్భాత్ చేసుకోవాలి.*

*మిరియాలు,* *లవంగాలు,ఇలాయిచి,సొంటి,*
*తులసి ఇవి దంచి పొడి చేసుకోవాలి దీనిని గోరువెచ్చని సగం గ్లాసు నీటిలొ ఒక సగం చేమ్చె పొడి వేసుకొని తాగాలి రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత నే పరికడుపుననే స్వీకరించాలి.*

*ఇక వేపాకు దంచి, నిమ్మరసం కొద్దిగా గోమయం ఈ మూడు గోరు వెచ్చని నీటిలొ కలిపి రసం తయారు చేసుకోవాలి. ఇది సానిటైజర్ కన్న అంతులేని రెట్లు ఎక్కువగా పనిచేస్తుంది.*

*రోజు గోరు వెచ్చని నీరే తాగాలి.*

*ఇక ఆ పరమాత్ముడు సర్వ వేళలో మనల్ని తన వెంట నడిపిస్తాడు.*

*ధన్యవాదః🙏🕉️🔯*

మూల శ్లోకాలు#

* సంస్కృత వాక్యాలకి మూల శ్లోకాలు#*

మనం తరుచుగా వినే కొన్ని సంస్కృత వాక్యాలకి మూల శ్లోకాలు తెలుసుకోవాలని అనిపించడం సహజం కదా!

 అలాంటి వాటిని కొన్నింటిని మీకోసం సిద్ధం చేశారు. చూడండి:

ముందుగా మనం తరుచుగా వినే మూల వాక్యాలు ఇవీ:

👉 *ధర్మో రక్షతి రక్షిత:*
👉 *సత్య మేవ జయతే*
👉 *అహింసా పరమో2ధర్మ:*
👉 *ధనం మూలమిదం జగత్*
👉 *జననీ జన్మ భూమిశ్చ*
👉 *స్వర్గాదపి గరీయసి*
👉 *కృషితో నాస్తి దుర్భిక్షమ్*
👉 *బ్రాహ్మణానా మనేకత్వం*
👉 *యథా రాజా తథా ప్రజా*
👉 *పుస్తకం వనితా విత్తం*
👉 *పర హస్తం గతం గత:*
👉 *శత శ్లోకేన పండిత:*
👉 *శతం విహాయ భోక్తవ్యం*
👉 *అతి సర్వత్ర వర్జయేత్*
👉 *బుద్ధి: కర్మానుసారిణీ*
👉 *వినాశ కాలే విపరీత బుద్ధి:*
👉 *భార్యా రూప వతీ శత్రు:*
👉 *స్త్రీ బుద్ధి: ప్రళయాంతక:*
👉 *వృద్ధ నారీ పతి వ్రతా*
👉 *అతి వినయం ధూర్త లక్షణమ్*
👉 *ఆలస్యం అమృతం విషమ్*
👉 *దండం దశ గుణం భవేత్*
👉 *ఇవీ మన చెవిని పడుతూ ఉండే మూల వాక్యాలు. కదా?*

*ఇప్పుడు వీటి పూర్తి పాఠాలు చూదామా ?*

ధర్మ ఏవో హతో హంతి
"ధర్మో రక్షతి రక్షిత:"
తస్మా ధర్మో న హంతవ్యో
మానో ధర్మో హ్రతోవ్రధీత్

🔥ధర్మాన్ని మనం ధ్వంసం చేస్తే , అది మనల్ని ధ్వంసం చేస్తుంది. దానిని మనం రక్షిస్తే, అది మనల్ని రక్షిస్తుంది. అందు చేత ధర్మాన్ని నాశనం చేయ కూడదు. ఎవరికి వారే తమంత తాముగా నశించి పోవాలని కోరు కోరు కదా !

🔥 సత్యమేవ జయతే నా2నృతం
సత్యేన పంథా వితతో దేవయాన:
యేనా క్రమం తృషయో హా్యప్త కామా
యత్ర త త్సత్యస్య పరమం నిధానమ్

🔥సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం వలన దేవతల మార్గం కనిపిస్తుంది. సత్యం వలన మహర్షులు కోరికలు లేని వారై పరమేశ్వరుని పొంద గలుగు తున్నారు. ఈశ్వరుడు సత్య స్వరూపుడు.

🔥 అహింసా పరమో ధర్మ:
తథా2 హింసా పరం తప:
అహింసా పరమం ఙ్ఞానం
అహింసా పరమార్జనమ్
🔥అహింస గొప్ప ధర్మం. గొప్ప తపం. మంచి ఙ్ఞానం. గొప్ప సాధన

🔥 ధనమార్జాయ కాకుత్స్థ !
ధన మూల మిదం జగత్
అంతరం నాభి జానామి
నిర్ధనస్య మృతస్య చ

🔥ఓ రామా ! ధనాన్ని సంపాదించాలి. ఎందు కంటే ధనంతో తోనే లోకమంతా ఉంది. ఈ విషయం లోని ఆంతర్యం గమనించాలి. ధనం లేని వాడు మృతునితో సమానం.

🔥 అపి స్వర్ణ మయీ లంకా
న మే రోచతి లక్ష్మణ !
జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపి గరీయసి.

🔥సోదరా, లక్ష్మణా ! ఈ లంక బంగరు మయ మయిన దైనప్పటికీ నాకు నచ్చదు. ఇక్కడ ఉండ లేను. ఎందుకంటే, తల్లి, పుట్టిన ఊరు స్వర్గం కంటె గొప్పవి కదా !

🔥 కృషితో నాస్తి దుర్భిక్షమ్
జపతో నాస్తి పాతకమ్
మౌనేన కలహం నాస్తి
నాస్తి జాగరతో భయం.

🔥చక్కగా వ్యవసాయం చేస్తే కరవు అనేది ఉండదు. జపతపాలు చేస్తే పాపం పోతుంది. మౌనంగా ఉంటే ఎవరితోనూ విరోధమే ఉండదు. జాగురూకతతో ఉంటే దేనికీ భయపడే పని లేదు.

🔥 గజానాం మంద బుధ్ధిశ్చ సర్పాణా మతి నిద్రతా
బ్రాహ్మణానా మనేకత్వం త్రిభిర్లోకోపకారకమ్

🔥ఏనుగుల మంద బుద్ధి తనం, పాముల అతి నిద్రా గుణం, బ్రాహ్మణులలో ఉండే అనైక్యత ... వీటి వల్లన లోకోపకారం జరుగుతోంది కదా !

🔥 రాఙ్ఞ ధర్మిణి ధర్మిష్ఠా, పాపే పాప పరా: సదా
రాజాను మను వర్తంతే, యథా రాజా తథా ప్రజా !

🔥రాజు ధర్మ పరుడయితే రాజ్యం ధర్మ పథంలో నడుస్తుంది. పాప వర్తనుడయితే రాజ్యం పాప పంకిల మవుతుంది. ఎప్పుడూ ధర్మా ధర్మాలు రాజుని అనుసరించి నడుస్తాయి. రాజు ఎలా ఉంటే, ప్రజలూ అలాగే నడచు కుంటారు.

🔥 పుస్తకం వనితా విత్తం
పర హస్తం గతం గత:
అధవా పునరా యాతి
జీర్ణం భ్రష్ఠా చ ఖండశ:

🔥పుస్తకం, స్త్రీ , ధనం ఇవి మన వద్ద ఉన్నంత సేపే . ఇతరులు చేతిలో పడితే మరి వాటి పని అంతే. తిరిగి వస్తాయను కో వద్దు. ఒక వేళ వచ్చినా. సర్వ నాశన మయి పోయిన స్థితిలో మనకి తిరిగి దక్కుతాయి సుమీ. ( స్త్రీని జాగ్రత్తగా చూసుకోవాలి అనే భావం ఇక్కడ గ్రహించాలి)

🔥 శత నిష్కో ధనాఢ్యశ్చ
శత గ్రామేణ భూపతి:
శతాశ్వ: క్షత్రియో రాజా
శత శ్లోకేన పండిత:

🔥వంద నిష్కలు ( ధన విశేషం) ఉన్న వాడే ధనవంతుడు అనిపించు కుంటాడు. వంద గ్రామాలకు అధిపతి అయిన వాడే భూపతి అవుతాడు. వంద గుఱ్ఱాలు కల వాడే రాజు అనిపించు కుంటాడు. వంద శ్లోకాలు వచ్చిన వాడే పండితుడు.

🔥విద్వత్త్వం చ నృపత్వం చ
నైవ తుల్యం కదాచన
స్వ దేశే పూజ్యతే రాజా
విద్వాన్ సర్వత్ర పూజ్యతే.

🔥పండితుడికీ, రాజుకీ పోలికే లేదు ! ఎందు కంటే, రాజు తన దేశంలో మాత్రమే పూజింప బడతాడు. కాని, పండితుడు లోకమంతా గౌరవించ బడుతాడు.

🔥 శతం విహాయ భోక్తవ్యం
సహస్రం స్నాన మాచ రేత్
లక్షం విహాయ దాతవ్యం
కోటిం త్యక్త్వా హరిం భజేత్

🔥వంద మందిని విడిచి పెట్టి అయినా భుజించాలి. వేయి మందిని విడిచి పెట్టయినా స్నానం చేయాలి. లక్ష మంది నీ వెంట రాక పోయినా దానం చేయాలి. కోటి మందిని విడిచి పెట్టయినా శ్రీహరిని సేవించు కోవాలి.

🔥 అతి దానాత్ హత: కర్ణ:
అతి లోభాత్ సుయోధన:
అతి కామాత్ దశగ్రీవో
అతి సర్వత్ర వర్జయేత్
( ఇది మరోవిధంగా కూడా ఉంది)

🔥విచ్చల విడిగా దానం చేయడం వలన కర్ణుడు చెడాడు. మిక్కిలి స్వార్ధ గుణం చేత దుర్యోధనుడు చెడాడు. అతి కామం చేత రావణుడు నాశనమయ్యాడు. కనుక అంతటా అతిని విడిచి పెట్టాలి. ఎప్పుడూ అతి పనికి రాదు. ఓవరాక్షను వికటిస్తుంది.

🔥 సత్యాను సారిణీ లక్ష్మీ
కీర్తి: త్యాగాను సారిణీ
అభ్యాసాను సారిణీ విద్యా
బుద్ధి: కర్మాను సారిణీ.

🔥లక్ష్మీ దేవి ఎప్పుడూ సత్యాన్ని అనుస రించే ఉంటుంది. ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ సంపద ఉంటుంది. అలగే, కీర్తి త్యాగాన్ని అనుసరించి ఉంటుంది. త్యాగ గుణం లేనిదే కీర్తి ప్రతిష్ఠలు రమ్మంటే రావు. అభ్యాసం లేనిదే విద్య అలవడదు. నిత్యం చదవనిదే చదువు ఎలా స్తుంది ? అభ్యాసం కూసు విద్య కదా. ఇక, బుద్ధి కర్మను అనుసరించి ఉంటుంది. చెడి పోయే రాత మనకి ఉంటే మన బుద్ధి చెడు త్రోవలోను, బాగు పడే రాత ఉంటే మన బుద్ధి మంచి దారిలోను ప్రవర్తిస్తుంది. బుద్ధి మన కర్మలను అనుసరించి ఉంటుంది సుమా !

🔥న నిర్మితో వై నచ దృష్ట పూర్వో
న శ్రూయతే హేమ మయం కురంగ:
తథా2పి తృష్ణా రఘు నందనస్య
వినాశ కాలే విపరీత బుద్ధి:

🔥బంగారు లేడి ఉన్నదని ఎన్నడయినా విన్నామా ? ఎప్పుడయినా ఎక్కడయినా అయినప్పటికీ రాముడు తన చెలి కోరిందని ముందు వెనుకలు యోచించ కుండా బంగారు లేడిని తెస్తానని వెళ్ళాడు. వినాశ కాలం దాపురించిన నాడు ఇలాంటి విపరీత బుద్ధులే పుడుతూ ఉంటాయి. చెడ్డ కాలం వచ్చి నప్పుడు తర్కం పని చెయ్యదు. బుద్ధి మందగిస్తుంది.

🔥 ఋణ కర్తా పితా శత్రు:
మాతా చ వ్యభిచారిణీ
భార్యా రూపవతీ శత్రు:
పుత్ర: శత్రురపండిత:

🔥 అప్పు చేసి, మనకి ఆస్తి కాకుండా అప్పు మిగిల్చే తండ్రి మనకి శత్రువుతో సమానం. వ్యభిచరించే తల్లి శత్రువు. రూపవతి అయిన భార్య శత్రువు. పండితుడు కాని కుమారుడు శత్రువు.

🔥 ఆత్మ బుద్ధి: సుఖం చైవ
గురు బుద్ధిర్విశేషత:
పర బుద్ధి ర్వినాశాయ
స్త్రీ బుద్ధి: ప్రళయాంతక:

🔥 మనకి తోచినది చేయడం అన్నిటి కన్నా మేలు. పెద్దల సలహా ప్రకారం నడచు కోవడం ఇంకా మంచిది. కాని పరుల (శత్రువుల అని కూడా అర్ధం చెప్పు కోవచ్చును) ఆలోచనల మేరకు నడచు కోవడం నాశనం కొని తెచ్చు కోవడమే. ఇక, ఆడువారి ఆలోచనల బట్టి నడుచు కుంటే ప్రళయమే సుమా !

🔥 అసమర్ధస్య సాధూనాం
నిర్ధనస్య జితేంద్రియ:
వార్ధక్యో దేవతా భక్తి:
వృద్ధ నారీ పతివ్రతా.

🔥అసమర్ధుని మంచితనం, ధనం లేని పేద వాని ఇంద్రియ నిగ్రహం, ముసలి తనంలో దైవ భక్తి, వయసు ఉడిగిన ఆడుదాని పాతి వ్రత్యం ఒక్కలాంటివే.

🔥 ముఖం పద్మ దళాకారం
వచ శ్చందన శీతలం
హృదయం కర్తరీ తుల్యం
అతి వినయం ధూర్త లక్షణమ్

🔥ముఖమేమో, పద్మం లాగా ఉంటుంది. మాటలేమో చందనం వలె చల్లగా ఉంటాయి. కాని, దుర్జనుని మనసు మాత్రం కత్తెర పిట్టలాంటిది. అతి వినయం చూపడం చెడ్డ వాడి లక్షణం సుమా.

🔥 సిద్ధ మన్నం ఫలం పక్వం
నారీ ప్రథమ యౌవ్వనం
కాలక్షేపం నకర్తవ్యం
ఆలస్యం అమృతం విషమ్

🔥వండిన అన్నాన్ని భుజించడానికీ, పండిన పండును కొరుక్కు తినడానికీ, యౌవ్వన వతి పొందును స్వీకరించడానికీ ఆలస్యం చేయ రాదు సుమా ! ఆలస్యం చేస్తే అమృతం కూడా విషమై పోతుంది. అన్నం చల్లారి పోవడం, పండు కుళ్ళి పోవడం, యౌవ్వనం తరగి పోవడం జరుగుతాయి. ఆలస్యం చేయడం వల్ల అమృతం కూడా విషతుల్యమవుతుంది.

🔥 విశ్వా మాత్రా హి పశుషు, కర్ద మేషు జలేషుచ
అంధే తమసి వార్ధక్యే, దండం దశ గుణం భవేత్.

🔥పక్షులు, కుక్కలు, శత్రువులు, పాములు, పశువులు వీటిని అదుపు చేయడానికి వరుసగా, బురదలో, నీటిలో, చీకటిలో, గ్రుడ్డితనంలో , ముసలి తనంలో సాయంగా ఉండేది చేతి కర్ర. అందు వల్ల దండానికి (కర్రకి) దశగుణాలు ఉన్నాయి సుమీ !🔥

*ఇవీ మూల వాక్యాలకి పూర్తి పాఠాలు.*

*పూర్వులు చెప్పిన దానిని మార్చరాదు*

ఇది గుర్తుంచుకోండి



  *కరోనా వ్యాధి అనేది దగ్గు, జలుబు కంటే పెద్ద వ్యాధి కాదు.*

  *యునైటెడ్ స్టేట్స్లో ఒక ఖైదీకి మరణశిక్ష విధించినప్పుడు, కొంతమంది శాస్త్రవేత్తలు ఈ ఖైదీపై కొన్ని ప్రయోగాలు చేయాలని భావించారు.*
*ఉరి తీయడానికి బదులుగా విషపూరితమైన కోబ్రా నీపై దాడి (attack) చేయడం వలన నీవు చంపబడతావని ఆ ఖైదీని భయపెట్టి చెప్పడం జరిగింది.*

  *ఒక పెద్ద విషపూరిత పాము అతని ముందుకు తీసుకురాబడింది, వారు ఖైదీ యొక్క కళ్ళు మూసివేసి, కళ్ళకు గంతలు కట్టి, అతన్ని కుర్చీకి కట్టేసారు. అతన్ని పాముతో కరిపించలేదు, గానీ రెండు భద్రతా పిన్స్ తో (Two safety pins) గుచ్చారు అంతే, ఆ ఖైదీ రెండు సెకన్లలోనే మరణించాడు.*

  *ఆ ఖైదీ శరీరంలో పాము విషాన్ని పోలిన విషం ఉందని పోస్ట్‌మార్టం ద్వారా వెల్లడైంది.*

  *ఇప్పుడు ఈ విషం ఎక్కడ నుండి వచ్చింది, లేదా ఖైదీ మరణానికి కారణమేమిటి?*
 *ఆ విషం మానసిక రుగ్మతల ఒత్తిడి కారణంగా తన సొంత శరీరమే ఉత్పత్తి చేయబడిన విషం.!*

 *మానసిక భయాందోళనల ఒత్తిడికి గురియై మరణించడం జరిపించారు.*

  *మీ శరీరం మీరు తీసుకునే ప్రతి నిర్ణయం సానుకూల స్పందన లేదా ప్రతికూల స్పందనలు బట్టి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. (The energy results depends up on our body produces the hormones positive energy or negative energy accordingly). తదనుగుణంగా మీ శరీరం హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది.*

  *90% అనారోగ్యాలకు మూలకారణం ప్రతికూల ఆలోచనల (Negative thoughts) వలన ఉత్పన్నమయ్యే అనారోగ్యాలే.*

  *ఈ రోజు మనిషి తన తప్పుడు ఆలోచనలతో తనను తాను కాల్చుకుని తనను తాను నాశనం చేసుకుంటున్నాడు.*

  *5 సంవత్సరాల నుండి 80 సంవత్సరాల వయస్సు ఉన్న రోగులు పాజిటివ్ నుండి కరోనా ప్రతికూలంగా ఉన్నారు.*

  *గణాంకాలపైకి వెళ్లవద్దు ఎందుకంటే సగానికి పైగా ప్రజలు బాగానే ఉన్నారు, మరియు మరణాలు కరోనా వ్యాధి వల్ల మాత్రమే కాదు, వారికి ఇతర అనారోగ్యాలు ఉన్నాయి, కాబట్టి వారు భరించలేక మరణించారు.*

  *కరోనా చేత ఇంట్లో ఎవరూ చనిపోలేదని గుర్తుంచుకోండి, రోగులందరూ ఎక్కువగా ఆసుపత్రులలోనే మరణించారు. ఆసుపత్రిలో వాతావరణం మరియు మనస్సులో భయం ఉండటమే కారణం.*

  *ఎల్లప్పుడూ మీ ఆలోచనలను సానుకూలంగా (Positive గా) ఉంచండి, సంతోషంగా ఉండండి.*

  *కరోనా వ్యాధి అనేది దగ్గు, జలుబు కంటే పెద్ద వ్యాధి కాదు.*

🌹💐🌹🌷🌹💐🌹

టోల్ గేట్ లలో ఇచ్చే రసీదు

.టోల్ గేట్ లలో ఇచ్చే రసీదు తప్పకుండా తీసుకొని వుంచుకోవాలి.
ఎందుకో తెలుసా ..
1. ఆ యొక్క జాతీయ రహదారి లో వెళ్తున్నప్పుడు మీకు అనుకోకుండా ఆరోగ్య సమస్య ఎదురైతే , ఆ రసీదు వెనుక వున్న నెంబర్ కి కాల్ చేస్తే 10 నిమిషాలలో మీ వద్దకు అంబులెన్స్ వస్తుంది.
2. మీ యొక్క వాహణం టైరు పంచర్ కావటం,లేదా ఆగిపోవటం జరిగినట్లైతే కాల్ చేసిన 10 ని.లలో మీకు సహాయం అంఫుతుంది.
3. అనుకోకుండా మీ వాహనం లో పెట్రోల్,డీజిల్ అయిపోయి నట్లయితే వారు 5 లేదా 10 లీ. పెట్రోల్/డీజిల్ తెస్తారు అందుకు డబ్బులు చెల్లించాలి.
ఈ సదుపాయలన్ని మనం కట్టే టోల్ గేట్ ఛార్జీలలో వర్తిస్తుంది.
ఈ విషయాలు తెలువక చాలామంది ఇబ్బందులు పడటం, రసీదులను లైట్ గా తీసుకొని పారవేయడం చేస్తుంటారు.
ఈ విషయం మన మిత్రులు,కుటుంబ సభ్యులకు తెలియ చేసుకుందాం.👌👌

వైరస్‌కంటే భయం మా చెడ్డది!*



*కరోనా కన్నా భయంతోనే పోతున్న ప్రాణాలు*

గాంధీలో 800 మంది రోగులకు మానసిక సమస్యలు
బాధితుల్లో ఆగ్రహం, ఆదుర్దా, నైరాశ్యం, భయాందోళనలు
కోలుకున్న తర్వాత కూడా పలు మానసిక రుగ్మతలు
తగ్గుతున్న రోగనిరోధక శక్తి
ధైర్యంతోనే మహమ్మారిపై గెలుపు సాధ్యం: వైద్యులు

*దెయ్యం కంటే భయం మా* చెడ్డదండీ’’.. ఓ తెలుగు సినిమాలో డైలాగ్‌ ఇది. ప్రపంచవ్యాప్తంగా జడలు విప్పుకొని విజృంభిస్తున్న కరోనా అనే దెయ్యం విషయంలోనూ ఇది నూటికి నూరుపాళ్లు వర్తిస్తుంది. భయపడుతూ బతికే మనిషికి అల్సర్‌ కూడా ప్రాణాపాయమే. తెగించి ఎదుర్కొనేవాడికి కేన్సర్‌పై కూడా విజయం సాధ్యమే. కరోనా రోగుల్ని పక్కన పెడితే.. పక్కింటివాడికి కరోనా వచ్చిందని తెలిస్తే, రానివాళ్లే గడగడలాడిపోతున్నారు. లేని ఆదుర్దాను తెచ్చుకుని వెంటనే కరోనా పరీక్షలకు పరిగెత్తేవారికి కొదవే లేదు. ఇటీవల ఓ వ్యక్తి ఇదే తరహాలో నమూనాలను పరీక్షలకు ఇచ్చాడు. ఫలితాలు రాక ముందే.. తనకు పాజిటివ్‌ వస్తుందేమోనన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. మరో ఘటనలో.. కరోనా బారిన పడిన ఓ టీవీ జర్నలిస్టు, వైరస్‌ తీవ్రత మరీ ఎక్కువగా లేకపోయినా విపరీతమైన ఆందోళనకు లోనుకావడంతో కన్నుమూశారు.

*నా జీవితం ఇక్కడితో* ముగిసినట్లేనా..? నా భార్యాపిల్లలు, కుటుంబం పరిస్థితి ఏమిటో! ఇలాంటి ఎన్నో ప్రశ్నలు కరోనా రోగుల్ని అల్లకల్లోలం చేస్తుంటాయి. శరీరం ఓవైపు వైర్‌సతో పోరాడుతుంటే.. మానసికంగా వారు తమ ఆందోళనలతో, భయాలతో పోరాటం చేయాల్సి వస్తోంది. ఈ పోరాటంలో అలిసిపోయిన వారు కన్నుమూయడమో, మానసిక రుగ్మతలపాలు కావడమో జరుగుతోంది. అందుకే.. కరోనా చికిత్సతో పాటే వీరికి మానసిక ధైర్యాన్నివ్వాల్సిన అవసరం ఉంది. కరోనా సోకిన వారిని చూసేందుకు.. నాలుగు మంచిమాటలు చెప్పేందుకు కూడా మనుషులు కరువే. ఇది రోగుల మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తోంది. నీకు ఏం కాదు. మేమంతా ఉన్నాం. ఈ కష్టం తాత్కాలికమే అని ధైర్యం చెప్పేవారు లేక రోగులు కుంగిపోతున్నారు. ఈ పరిస్థితే వారిలో అనేక రుగ్మతలకు, నైరాశ్యానికి దారి తీస్తోంది.

*800 మందికి మానసిక రుగ్మతలు*

*కరోనా పాజిటివ్‌గా నిర్ధారణై గాంధీ* ఆస్పత్రిలో చేరిన వారిలో దాదాపు 800 మంది మానసిక సమస్యలతో సతమతమయ్యారని అక్కడి వైద్యులు తెలిపారు. వారి ప్రకారం.. ఒక్కో రోగిదీ ఒక్కో తరహా ఇబ్బంది. చాలామంది రోగులు చిత్ర విచిత్రంగా ప్రవర్తించారు. తమకు కరోనా రావడంతో.. తమ కుటుంబాన్ని కూడా అంటరానివాళ్లుగా చూస్తారనే భయాందోళనలు వారిలో కనిపించాయి. మరికొంతమందిలో.. కరోనా నయం అవుతుందో లేదోనన్న ‘ఇరిటబిలిటీ డిజార్డర్‌’ కనిపించిందని పేర్కొన్నారు. ఈ తరహా రోగుల్లో ఒక్కసారిగా చురుకుదనం తగ్గిపోవడం, అపనమ్మకం, నైరాశ్యానికి లోనుకావడం వంటి లక్షణాలు తలెత్తాయని తెలిపారు. ప్రతి విషయానికి చిరాకు పడటం, అందరిపై కసురుకోవడం, కోపంగా మాట్లాడడం, మందులు వేసుకోకపోవడం వంటి సమస్యలను వీరిలో పరిశీలించామని చెప్పారు. 

*కరోనా తగ్గినా.. సైకోసిస్‌తో ముప్పు*

*కరోనా వచ్చిన ఓ మహిళ మూడు* రోజుల క్రితం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయి ఇంటికి చేరింది. మరుసటి రోజు నుంచే ఆమె, తనను ఎవరో చంపడానికి వస్తున్నారంటూ ఇంటి తలుపులు మూసుకోవడం, వాషింగ్‌ మిషన్‌లో దాక్కోవడం వంటి చిత్రమైన చేష్టలను చేస్తోంది. భయపడిన ఆమె భర్త వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. పరీక్షల అనంతరం.. ఆమె ‘సైకోసిస్‌’ అనే రుగ్మతకు లోనైందని వైద్యుడు తెలిపారు. ఇలాంటి స్థితిలో ఉన్నవారు, ఒక్కోసారి తమకు తామే ప్రమాదకరంగా మారతారు. 

*రోగ నిరోధక శక్తి తగ్గుతుంది*

 *వైర్‌సను శరీరం ఎదుర్కొనేందుకు* రోగ నిరోధక శక్తి అత్యావశ్యకం. ఎప్పుడైతే రోగి ముందుగానే కరోనాకు భయపడి కుంగిపోతాడో.. అప్పుడే అతడిలోని రోగ నిరోధక శక్తి కూడా వైర్‌సపై పోరాటంలో నెమ్మదించే అవకాశం ఉంటుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. మానసిక భావనలకు తగ్గట్టుగా శరీరం స్పందిస్తుందనడంలో సందేహం లేదని, ధైర్యంగా ఎదుర్కొంటే కరోనాపై విజయం సాధ్యమేననేది వారి మాట. కుమిలిపోతే కరోనా నుంచి బయటపడగలమా? భయపడితే ప్రాణాల్ని కాపాడుకోగలమా? ఈ ప్రశ్నలను కరోనా బాధితులు తమకు తాము వేసుకుని, ధైర్యాన్ని కూడదీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కౌన్సెలింగ్‌ ఇస్తే రోగుల్లో ధైర్యం పెరగవచ్చు. రోగులు వందల సంఖ్యల్లో ఆస్పత్రులకు వస్తుండటంతో వారిలో ధైర్యం నింపేందుకు వైద్యులు సమయం కేటాయించలేకపోవడం సమస్యగా మారింది.

*రోగులతో మాట్లాడేది 5నిముషాలే* అయినా, వారికి ఏం కాదని, కరోనా తగ్గిపోతుందని భరోసా ఇస్తే పరిస్థితి కొంచెం మెరుగవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు మానసిక నిపుణులు, మరో ఇద్దరు సీనియర్‌ రెసిడెంట్స్‌, తొమ్మిది మంది పీజీలు కరోనా రోగుల మానసిక రుగ్మతలకు చికిత్సలు అందిస్తున్నారు. రోగులందరూ ఏదో ఒక మానసిక సమస్యతో బాధపడుతుండటంతో ఒక్కో వైద్యుడు రోజుకు 20కంటే ఎక్కువమంది రోగులకు మానసిక చికిత్స అందించడం కష్టంతో కూడుకున్న పని. దీన్ని అధిగమించాలంటే.. డిప్యుటేషన్‌పై వైద్యులను రప్పించడం, ఒప్పంద ప్రాతిపదికన మానసిక వైద్యులను నియమించుకోవడం వంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

*కాగ్నిటివ్‌ బిహేవియర్‌ థెరపీ చేస్తున్నాం*

*పాజిటివ్స్‌కు కాగ్నిటివ్‌* బిహేవియర్‌ థెరపీతో రోగుల ఆలోచన విధానాన్ని మారుస్తున్నాం. మానసిక స్థితిని నియంత్రణలో ఉంచుకోవడానికి మైండ్‌ టెక్నిక్‌ అభివృద్ధి చేస్తున్నాం. గతంలో వారు గడిపిన సంతోష క్షణాల్ని గుర్తు చేసుకునేలా చేస్తున్నాం. ఇష్టమైన వ్యక్తులకు ఫోన్‌ చేసి మాట్లాడించి వారిలో ఒత్తిడి తగ్గిస్తున్నాం. *ప్రాణాయామం, శ్వాస సంబంధిత* వ్యాయామం చేయిస్తున్నాం. శ్రావ్యమైన సంగీతం వినిపిస్తున్నాం. ఎక్కువగా సమస్య ఉన్న వారికి ఫార్మో థెరపీ ఇస్తున్నాం.

*డా. అజయ్‌, గాంధీ ఆస్పత్రి*

వీడియో కన్సల్టేషన్‌ కల్పించాలి

మానసిక వైద్యులు ప్రతి రోగి వద్దకూ వెళ్లి కౌన్సెలింగ్‌ చేయడం కష్టం. అందుకే ప్రతి అంతస్తుకు వీడియో కన్సల్టేషన్‌ సదుపాయం కల్పించాలి. రోగుల ప్రవర్తనను వైద్యుడు వీడియో ద్వారా పరిశీలించి, కౌన్సెలింగ్‌ ఇచ్చేలా ఈ ఏర్పాటు ఉండాలి.

 *డా. హరిణి, , కేర్‌ ఆస్పత్రి*

*కరోనా భయంతో వృద్ధ దంపతుల ఆత్మహత్య*

*హైదరాబాద్‌లోని ఎంఎస్‌ మక్తాలో* కరోనా సోకిందనే అనుమానంతో వెంకటేశ్వర నాయుడు (65), వెంకటలక్ష్మి (60) దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వెంకటేశ్వరనాయుడు ఉమ్మడి ఏపీఎ్‌ఫడీసీలో డ్రైవర్‌గా పనిచేసి విరమణ పొందారు. నలుగురు పిల్లలకూ వివాహం చేశారు. వీరుంటున్న సమీపంలోనే కుమారుల్దిదరు నివాసముంటున్నారు. వెంకటేశ్వర నాయుడుకు జ్వరం వచ్చిన రెండ్రోజులకు వెంకటలక్ష్మి కూడా అస్వస్థతకు గురయ్యారు. స్థానిక అస్పత్రిలో చికిత్స తీసుకున్నా జ్వరం తగ్గలేదు. తమకు కరోనా వచ్చి ఉంటుందని అనుమానించారు. విషయం తెలుసుకొని ఇంటికి వచ్చిన కుమారులను లోపలికి రావొద్దని తిప్పి పంపారు. శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగి చనిపోయారు.

హెచ్చరిక...జాగ్రత్త

హెచ్చరిక జాగ్రత్త
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవద్దు.
ఇప్పుడు అందరి జేబులు కాళీ అయ్యాయి దానితో దొంగదోవలో డబ్బులు సంపాయించటం ఎలాగ అనేదానిపైనే చాలామంది కృషిచేస్తున్నారు. దానికోసం వాళ్ళ తెలివితేటలూ అన్ని ప్రదర్శిస్తున్నారు. ఇది ఈ రోజు కొత్తగా వచ్చింది ఏమి కాదు పూర్వమునుండి ఇతరులను దోచుకోవటానికి చేసే పన్నాగాలు ఎన్నో వుండేవి మనకు తెలిసిన వారు కూడా ఎంతోమంది మోసపోయినట్లు మనకు తెలుసు.
ఈ రోజు ఒక వాట్స్ ఆప్ మెసేజ్ చూసి ఇది వ్రాస్తున్నాను. అది ఏమిటంటే
Providing Free Laptop For Youth
Click Below to Book Your Free Laptop Now
👉 https://xxxxxxx/zzzzzz

మనం ఇటువంటి మెసేజులు చూడంగానే ముందుగా ఆశ కలుగుతుంది. వెంటనే అది నిజామా కాదా అనే ఒక ఆలోచన కూడా కొంతమందికి కలుగుతుంది. కానీ ఎవ్వరమూ కూడా మనకు ఫ్రీగా ఎందుకు ఇస్తారు అని ఆలోచించం. ఎందుకంటె అది మన బలహీనత. ఈ బలహీనతనే కాష్ చేసుకుంటున్నారు ఎప్పటినుండో నేరగాళ్లు. ఇప్పుడు అందరి దగ్గర డబ్బులు లేనందుకు ఇదే మంచి అదను అని వాళ్ళు విర్రవీగుతున్నారు. ఇటీవల మనం టీవీలో కూడా ఇటువంటి అనేక మోసాలను చూసాము.
ఎటిఎం నుండి దొంగతనంగా డబ్బులు డ్రా చేసే ముఠా మొన్నీమధ్యనే పట్టుపడింది.
ఉచిత గిఫ్టులు: మనం ఏదో పనిమీద వున్నప్పుడు ఒక ఆడ గొంతు ఫోన్ చేస్తుంది అందులో మీకు మేము నిర్వహించిన ఫలానా లాటరీలో మీ నుమ్బెరుకి అష్ట లక్షిమి పెండిట్ వచ్చింది. దాని ఖరీదు 8 వేలు. మీరు 2 వేలు కడితే మీకు వెంటనే పార్సల్ చేస్తాము.
మీకు ఫలానా లాటరీ వచ్చింది మీ మెయిలు కు అని ఇలా ఎన్నో ఎన్నెన్నో.
నేను బ్యాంకు మేనేజరును నీ ఏటీఎం కార్డు నెంబర్ చెప్పు, ఓటీపీ చెప్పు అని ఇలా ఎన్నో, ఎన్నెన్నో.
మన భారతీయులను మభ్యపెట్టి దోచుకోటానికి కొంతమంది విదేశీయులు కూడా పూనుకుంటున్నారని మనం అప్పుడప్పుడు వార్తలు చూస్తున్నాం.
ప్రస్తుతం మనం ఇంకొక మెసేజ్ చూస్తున్నాం. అదే ఏమిటంటే చివరకు కేంద్ర ప్రేభుత్వం ప్రతి సిటిజనుకు 2వేలు ఇవ్వటానికి ఒప్పుకుంది త్వరగా మీ వివరాలు అన్ని తెలియచేయండి అని వస్తున్నది ఇందులో ఇంకొక విచిత్రం ఏమిటంటే మన దేశపు మూడు సింహాలు గుర్తు వున్నది. అది చుస్తే ఎవరైనా నిజమే అని అనుకుంటారు.
నాకు తెలిసిన కొన్ని మోసాలు మన జాగ్రత్త కోసం ఇక్కడ వ్రాస్తున్నాను.
చాలా సమస్తరాలక్రింద జరిగిన ఒక సంఘటన:
ఒక మధ్యతరగతి మహిళ భర్త ఆఫీసుకి వెళ్లిన తరువాత హైద్రాబాదులో కూరగాయలు కొనటానికి వెళ్ళింది. ఆమె కూరలు కొని ఇంటికి తిరిగి వస్తూవుంటే దారిలో ఒక బంగారు గొలుసు రోడ్డుమీద కనపడ్డది. అది చూసి ఆమె తీసుకోపోయంది. ఆమె చెయ్ దానిమీద పడటమే ఆలస్యం ఇంకొక స్త్రీ అక్కడికి వచ్చి ఇది నేను చూసాను నాది అని దానిని తీసుకొనే ప్రయత్నం చేసింది. ఇద్దరి మధ్య వాగ్వివాదం మొదలయింది. ఆమె ఆ నగను రెండుగా చేసుకొని తీసుకుందాం అని అన్నది. అంతలో ఒక మగ మనిషి ఎక్కడినుండి వచ్చాడో వచ్చి మీరిద్దరూ కొట్లాడుకోకండి దీనిని తుంచి తీసుకుంటే ఎవరికి ఉపయోగ పడదు దాని బాపతు మీరు ఒకరికి డబ్బులు ఇవ్వండి అన్నాడు. నా దగ్గర డబ్బులు లేవు అని తరువాత వచ్చిన స్త్రీ అన్నది. దానిని ఆటను అమ్మ మీ దగ్గర యెంత డబ్బు వుంది అన్నాడు. 3వేలు అని మధ్యతరగతి మహిళ అన్నది అది చాలా తక్కువ ఆయన ఏమిచేస్తాం ఇవ్వండి అని ఆ స్త్రీ తీసుకుంది. చాల ఖరీదయిన బంగారం గొలుసు కేవలం 3 వేలకే వచ్చిందని పాపం ఆమె సంతోషం పెద్దది. కానీ చివరకు సాయంత్రం భర్త ఇంటికి వచ్చిన తరువాత కంసాలి వానివద్దకు వెళ్లిన తరువాత కానీ వాళ్లకు తెలియలేదు అది 100,150 కి దొరికే గిల్టు నగ అని.
ఇటువంటి మోసాలు ఎన్నో రోజు జరుగుతున్నాయి. అందులో కొన్ని మనకు తెలుస్తున్నాయి కొన్ని తెలియటంలేదు. ఎదుటి వారి దురాశను పావుగా వాడుకొని మోసాలు చేసే వాళ్ళు అనేకమంది వున్నారు. ఇప్పుడు చాలామంది కంప్యూటర్ క్నాలెడ్జ్ వున్నవాళ్లు ఉద్యమంగా ఈ మోసాలు చేస్తున్నారు. స్త్రీలు కూడా ఇప్పుడు మోసాలకు పాలుపడుతున్నారు. తస్మాత్ జాగ్రత్త.
నేను అందరిని కోరేది ఏమంటే ఎక్కడ ఏది ఉచితంగా రాదు. కేవలం ఎలుకల బోనులోనే ఆహరం ఉచితంగా వస్తుంది.
మిత్రులు వాళ్లకు వున్న అనుభవాలు కూడా ఇక్కడ పంచుకుంటే మన వాళ్లకు కొంత గుణపాఠంలాగా ఉంటుంది.
దయచేసి ఈ మెసేజీని మీకు తెలిసిన ఇతర గ్రూపులకు కూడా ఫార్వర్డ్ చేయండి సాటివారిని కొంతైనా మోసాలనుండి రక్షించండి.

దేవాలయాలలో దేముడు ఉంటాడా?



దేవాలయంలోని విగ్రహంలో దేముడు వున్నాడని మనమందరము గుడికి వెళ్లి విగ్రహాన్ని మొక్కు తున్నాము. ఇప్పుడు మనం తెలుసుకోవలసింది ఏమంటే విగ్రహం రాతితో చేసిందే, అదే విధంగా గుడి మొత్తం రాతితో చేసిందే ఐతే విగ్రహం దేముడు ఎలా ఐయ్యాడు, గుడి మెట్లు దేముడు ఎందుకు కాలేదు. ఈ ప్రశ్నకు చాలామంది సమాధానం చెప్పలేక పోటంతో హిందువులకు మన ఆచారాలమీద, సాంప్రదాయాలమీద నమ్మకం సన్నగిల్లుతుంది.

ప్రతి దానిని కూలంకుషంగా పరిశీలిస్తే మనకు ప్రతి హిందూ విధానానికి సమాధానం తెలుస్తుంది.

మీకు ఈ విషయాన్నీ మీకు తెలిసిన ఉపమానంతోటే వివరిస్తాను. ఈ రోజు మనందరికీ ఫోన్ అంటే తెలియనివారు లేరు, అంతే కాక ఫోన్ వాడనివారు లేరు. కాబట్టి మీకు ఫోనునె ఉదాహరణగా తీసుకొని ఈ విషయాన్ని వివరిస్తాను.

మనం ఫోన్ చేసిన వారు పెద్దవారు ఐతే ఫోనులో గౌరవంగా నమస్కారం చేసి వినయంగా మాట్లాడుతాము అదే చిన్న వాళ్ళు ఐతే ప్రేమతో మాట్లాడుతాము. అలాగే మనం ఎవరితో మాట్లాడితే వారు మన ముందరవుంటే ఏరకంగా ప్రవత్తిస్తామో అలానే ప్రవర్తిస్తాము. నిజానికి మనం మాట్లాడేది ఫోనుతో కాని అవతలి వ్యక్తితో కాదు. ఈ విషయం మనందరికీ తెలుసు. కానీ మనం మాట్లాడిన మాటలు అవతలి వాడు వింటున్నాడని మనకు నమ్మకం. దానికి ప్రమాణం అవతలి వ్యక్తి నీతో ఫోనులో మాట్లాడటమే. నిజానికి నీ చేతిలో వున్న ఫోన్కి అవతలి వ్యక్తికీ ఎలాంటి సంబంధం లేదు. కానీ మీ ఇద్దరికీ ఫోన్ సంబంధాన్ని కలుపుతున్నది. అంటే ఫోన్ ఒక సాధనగా మీ మధ్య వున్నది. మీరు ఒకరికి ఒకరు ఎదురుపడితే ఫోన్లో మాట్లాడుకొనవసరం లేదు. ఇప్పుడు ఫోన్ నిర్మాణాన్ని పరిశీలిద్దాం. ఫోన్ ఒక ప్లాస్టిక్ పదార్ధంతో కొన్ని లోహపు తీగలతో మరియు ఇతర ఎలక్ట్రానిక్ I.C.లతో నిర్మితమైనది. నీ ఫోనులో వున్న వస్తువులు విడిగా బైట కూడా దొరుకుతాయి కానీ అవి విడివిడిగా ఫోన్ చేసే పని చేయలేవు. ఆ విడిభాగాలను ఒక సర్క్యూట్ ప్రకారం అమర్చి షోల్డర్స్ చేసి నిర్మించితేనే ఫోన్ తయారు అవుతుంది. అంతేకాదు ఫోనుకు ఒక సిం కార్డుకూడా ఉండాలి అప్పుడు అది పలుకుతుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే.

ఇప్పుడు మన హిందు దేవాలయాన్ని ఫోనుతో పోలుద్దాం. దేవాలయం ఒక ప్రత్యేక నిర్మాణం అది ఆగమశాస్త్ర విధానంలో నిర్మిస్తారు. మానవులు నివసించే గృహాలకి దేవాలయ నిర్మాణానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. గర్భగుడి నిర్మాణం చాలా ప్రత్యేకత కలిగి ఉంటుంది. ఈ నిర్మాణానికి గోపురం ప్రముఖమైనది. గోపురం కొనికల్ ఆకారంలో వుంది చాలా ఎత్తుగా ఉంటుంది. దాని మధ్య భాగంలో విగ్రహం ప్రతిష్టిస్తారు. ఆ విగ్రహంపై ఆకాశంలోని కాస్మిక్ శక్తి పూర్తిగా గోపురంద్వారా ప్రసరించి కేంద్రీకరించబడుతుంది. కాబట్టి ఎప్పుడైతే భక్తుడు ఆ విగ్రహాన్ని దర్శిస్తాడో విగ్రహంలో వున్న కాస్మిక్ ఎనర్జీ భక్తునిపై రిఫ్లెక్ట్ అవుతుంది. దత్ ద్వారా భక్తునికి మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇక మన ఫోనులో ఉన్నట్లు సిం కార్డు దేవాలయంలోకూడా ఉంటుంది. దీనినే యంత్రం అంటారు. ఈ యంత్రం ఆగమశాస్త్ర రీత్యా స్వర్ణ, రజిత, తామ్ర ఫలకాలలో ఏదో ఒక ఫలకం మీద నిర్మించి విగ్రహ ప్రతిష్ట సమయంలో తగు విధంగా పూజించి విగ్రహం క్రింద ప్రతిష్టిస్తారు. ఆ యంత్రం భక్తునికి భగవంతునికి మధ్య మీ ఫోను కనక్క్షన్ మాదిరి పనిచేస్తుంది. భక్తుని కోరికలు భగవంతునికి చేరి ఈ విగ్రహం ద్వారా భక్తుని కోరికలు ఈడేరుతాయి. అందుకే భక్తులు అనేక వందల కిలోమీటర్ల దూరమునుండి వచ్చి ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించుకొని వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటున్నారు. ప్రసిద్ధ దేవాలయాలకు భక్తుల రద్దీ రోజు మనం చూస్తున్నాం.

పూజించటం ఎలా. షొడశోపచార పూజ అంటే ఏమిటి మళ్ళి ఇంకోసారి తెలుసుకుందాం.

సనాతన హిందూ ధర్మంలో పూర్వం ప్రజలు పెద్దవాళ్ళు చెప్పింది ఎదురు ప్రశ్న వేయకుండా అనుకరించేవారు. అందుకే వారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండేవారు. ఇప్పుడు మన గ్రహచారం ఏమంటే చాలామంది హిందువులకు హిందూ ధర్మం మీద అవగాహన లేదు. అది అటుంచి ఇతరులు హిందువులఫై దాడి చేయటానికి వాళ్ళకి తెలిసింది కొంత తెలియనిది కొంత పైత్యం కలిపి ఇష్టమొచ్చినట్లు విమర్శిస్తున్నారు. అది అట్లా ఉంటే కొందరు హిందువులు నాస్తికులుగా మారి హిందూ ధర్మాన్నే ప్రశ్నిస్తున్నారు. ఇది చాలా విచారించదగ్గ విషయం. అందుకే ప్రతి వారికి హిదు సంప్రదాయాల విశిష్టత తెలియ చేయాలనే ఉద్దేశంతో ఈ రచనలు సాగిస్తున్నాను. బుధ జనులు ఈ వివరణలను పరికించి, పరిశీలించి, చేసే సాద్ విమర్శలకు సాదర స్వగతం. వితండ వాదం చేసేవారి విమర్శలు నిషేధం.

గజేంద్ర మోక్షం

గజేంద్ర మోక్షం లో అంతరార్ధం
పూర్వజన్మలవల్ల, కర్మలవల్ల ప్రోగుచేసుకున్నవాసనలవల్ల ఏర్పడిన బంధాలతో ఇంద్రియ భోగలాలసత్త్వములతో కూడిన 'అహం' (నేను అన్నదేహాత్మభావన) మొసలి కాగా దానిచే పట్టుబడ్డ మానవుడే గజేంద్రుడు.
జనన మరణ చక్రంలో అనేకసార్లు పడి పరిభ్రమిస్తున్నమానవుడు ముక్తి పొందాలంటే అందుకు తనశక్తి మాత్రమే చాలదు. పరమాత్మ అనుగ్రహశక్తి పరిపూర్ణంగా కావాలి. ఆ అనుగ్రహంకై ఈ సంసార బంధాల నుండి, ఇంద్రియభోగలాలసల నుండి విముక్తి కల్గించమని ఆ పరమాత్మనే ప్రార్ధించాలి. ఈ భవసాగరంలో పడిన నన్ను రక్షించమని పరితపిస్తూ రక్షించేంతవరకు వేడుకోవాలి. పరమాత్మ పలికేంతవరకు ప్రార్ధన ఆపకూడదు - అచ్చంగా గజేంద్రుడులా!
తన పరివారంతో మోహంతో కూడి ఒక పెద్ద కొలనులో జలక్రీడలు సాగిస్తున్న గజేంద్రుడు, సంసార సాగరంలో ప్రాపంచిక పరివారంతో మనస్సుతో కూడి కదలాడుతున్న మానవునికి దర్పణం. గజేంద్రుడు మకరేంద్రుడు బారిన పడిన రీతిలో భవసాగరంలో క్రీడిస్తున్న మానవుడు ఆంతర్యామినే మరచి 'అహం' అనెడి మకరం నోటిలో చిక్కుకొని దుఃఖితుడవుతున్నాడు. గజేంద్రుడు తనని తాను రక్షించుకోవడానికి ప్రయత్నం ప్రారంభించినట్లుగానే మానవుడు కూడా అహం అన్న భావం నుండి బయటపడడానికి సాధన అన్న ప్రయత్నం చేయాలి. జలంనందు మొసలికి బలం ఎక్కువ. ప్రాపంచిక సంసారంలో ఇంద్రియభోగలాలసత్త్వంను అలవర్చుకున్న 'అహం' కు కూడా పట్టు ఎక్కువే. ఈ అహం నుండి విడివడాలంటే తన సాధనాబలంతో పాటు ఈశ్వర అనుగ్రహం కావాలని గజేంద్రునిలాగా గ్రహించి త్రికరణశుద్ధిగా ఆ అనంతున్ని అర్ధించాలి.
గజేంద్ర మోక్ష ఘట్టంలో మొదట గజేంద్రుడు తన శత్రువైన మొసలిని తానుగా జయించడం కష్టమని తెలుసుకొని అందుకు పరమాత్మ మాత్రమే సహాయపడగలడని గ్రహించి పరమేశ్వరుని అనుగ్రహంకై ప్రార్ధించి, అటు పిమ్మట పలుకుటలేదని నిందాస్తుతి చేసి, అంతలోనే పరమభక్తితో వివేక విశ్వాసాలతో నీవు తప్ప ఎవరూ లేరని తనని తాను  శరణాగతి చేసుకోగానే ఆ అనంతుడు సుదర్శనచక్రంను ప్రయోగించి మకరసంహారం చేసి దర్శనమిచ్చాడు. ఆలానే మానవుడు కూడా తనకి తానుగా ఈ ప్రారబ్ధవాసనలను అద్దుకున్న 'అహం'భావనను జయించడం కష్టమని గ్రహించి పరమాత్మునికి భక్తివిశ్వాసాలతో ప్రార్ధించి,  ఈ జన్మల పరంపరలో పడి అలసిపోతున్నాను, ఈ భవసాగరంలో ఈదలేను, ఈ జనన మరణ చక్రభ్రమణం నుండి నను రక్షింపుము, ఈ వాసనాబంధాలను తీసేయమని, వీటి అన్నింటనందు విముక్తి కల్గించమని (సమస్త ప్రపంచ దృశ్య సంసార భావనా పరిత్యాగమే విముక్తి) వేడుకుంటూ, క్రమేనా కోరిక, కర్మ, అహం సమర్పణ చేస్తూ శరణాగతి స్థితికి వస్తే - అప్పుడు సుదర్శనచక్రమనేజ్ఞానముతో అజ్ఞానఅహంభావనను సంహరించిన పిదప  ఆత్మసాక్షాత్కారం అవుతుంది.
జన్మ పరంపరలనుండి విముక్తి పొందడమే ముక్తి.
'తస్మాత్ భావా భావౌ పరిత్యజ పరమాత్మ ధ్యానేన ముక్తో భవతి' సమస్తమును త్యజించగా చివరకు ఆత్మ ఒక్కటే మిగిలివుంటుంది. అదియే ముక్తి. అదియే మోక్షం.
ఈ ముక్తి మరణాంతరం వచ్చేది కాదు, బ్రతికుండగానే సాధించాల్సిన స్థితి. దీనిని తెలియజెప్పే కధనమే "గజేంద్ర మోక్షం". గజేంద్రుడు చేసిన ఈశ్వర స్తుతి ఎంతో గొప్ప ఆధ్యాత్మిక ప్రబోధం.

ఒక బిచ్చగాడు

ఇందులో ఎంతో మర్మముంది ( మీకు తెలియనిది కాదు కానీ....)... గ్రహించడానికి ప్రయత్నం చేస్తూ చదవండి.💐🙏🙏🙏


ఒక గ్రామంలో ఒక బిచ్చగాడు ఇంటికి వెళ్లి బిచ్చమెత్తుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఒక ఇంటి వద్ద *భవతీ భిక్షాం దేహి మాతా అన్నపూర్ణేశ్వరీ* అని అడిగాడు.
ఆ ఇంటి యజమాని పండితుడు. అతను అరుగుమీద కూర్చుని పారాయణ చేసుకుంటూ ఉన్నాడు. ఆ ఇల్లాలికి వినిపించ లేదేమో అని బిచ్చగాడు గట్టిగా మళ్లీ భవతీ భిక్షాం దేహి మాతా అన్నపూర్ణేశ్వరి అని అన్నాడు. *పండితుడికి కోపం వచ్చింది* నేనిక్కడి ఉంటుండగా నాతో మాట్లాడకుండా నాకు చెప్పకుండా ఇంత నేను సంపాదిస్తుంటే ఆమెను పిలిచి బిచ్చం అడుగుతాడా. వీటికి తగిన శాస్తి చేస్తాను అని అనుకుని వెంటనే ఏమేవ్ *మూడు జన్మల ముష్టివాడు* వచ్చాడు బిచ్చం వెయ్యి అని గట్టిగా అరిచాడు. ఆ గొంతు పోల్చుకున్న ఆమె భర్తకి కోపం వచ్చిందని గ్రహించి వెంట వెంటనే బియ్యం తీసుకొచ్చి బిచ్చగాడి పాత్రలో వేసి ఆవిడ వెంటనే లోపలకు వెళ్లిపోయింది. కానీ బిచ్చగాడు మాత్రం కదల్లేదు. అతని చేతిలో కర్ర కూడా ఉంది. అప్పుడు పండితుడికి అనుమానం అలజడి మొదలయ్యింది. అకారణంగా నేను అన్న మాటలు వీడికి బాధ కలిగించాయి. వీడిపుడు ఏంచేస్తాడు తిడతాడా లేదా ఇంకా ఏం చేస్తాడా అని లోలోపల బాధ పడుతూ చూస్తున్నాడు. ఇంతలో బిచ్చగాడు ఏమండీ అని పిల్చాడు. ఆ అంటూ చిన్న అహంకారాన్ని ప్రదర్శించాడు పండితుడు. ఏం లేదు మీరు నన్ను మూడు జన్మలు ముష్టి వాడన్నారు అది ఎలాగా అన్నాడు అదా దానికే ఉంది. తెలుసుకోవాలనుకుంటున్నావా అయితే ఇలా కూచో అన్నాడు. ఫరవాలేదు చెప్పండి నిలబడతాను అన్నాడు.
*శ్లోకం* :
*అదత్త దానాచ్చ భవేత్ దరిద్రః*
*దరిద్ర దానాచ్చ కరోతి పాపం*।
*పాప ప్రభావాత్ పునర్దరిద్రః*
*పునర్దరిద్రః పునరేవ పాపీ*॥
అని శ్లోకం చదివాడు. వెంటనే బిచ్చగాడు అయ్యా మీరు చదివిన శ్లోకానికి అర్థం నాకు తెలియదు. నాకు అర్ధమయ్యేటట్లు మాటల్లో చెప్పండి అన్నాడు. నువ్వు గత జన్మలో ఎవరికీ ఏమీ ఇవ్వలేదు. అంటే రెండు కారణాలు. నీకు లేకపోయి వుండొచ్చు. ఉండి కూడా దానం చేయక పోయుండచ్చు. లేకపోతే గతజన్మలో నువ్వు ముష్టి వాడివి కాబట్టి ఆ ఫలితంగా నువ్వు ఈ జన్మలో కూడా ముష్టి వాడుగా అయిపోయావు. అంటే రెండు జన్మలు ముష్టివాడివి. అర్థమైంది మరి చెప్పొద్దన్నాడు బిచ్చగాడు. ఎందుకు ?
ఈ జన్మలో కూడా ఇవ్వడానికి నాదగ్గర ఏమీ లేదు కాబట్టి వచ్చే జన్మ కూడా. అని గొణుక్కుంటూ వెళ్లిపోయాడు. మర్నాడు అదే సమయానికి ఆ బిచ్చగాడు పండితుని ఎదురుగా నిలబడి ఇందులోంచి బయటపడే మార్గం ఏమీ లేదా. నేనిలాగే జన్మజన్మలకు బిచ్చగాడి గానే ఉండిపోవాలా? అని అడిగాడు.
*జ్ఞానం సమయం వ్యక్తిత్వ విలువలు తెలిసిన పండితుడు* ఇలా కూచో అన్నాడు. పెద్దవారి మీదగ్గర నేను కూర్చోవడం అన్నాడు. పర్వాలేదు కూచో *జిజ్ఞాసా పరులకు శాస్త్రం చెప్పొచ్చు చెప్పాలి* కూడా అందుకే ఈ శాస్త్రాలన్నీ అన్నాడు. కూర్చున్నాడు బిచ్చగాడు. ఇప్పుటికైనా దానం చేయడం మొదలుపెట్టాలి అన్నాడు నేను దానం ఎలా చేస్తాను నాదగ్గర ఏముంది గనుక. అన్నీ ఉన్నాయి లేకపోవడమనేది లేదు. నీలో దాన గుణం ఉంటే చాలు. నీ దగ్గర ఉన్నదే దానం చెయ్. ఈరోజునుంచి నీ కడుపుకి ఎంత కావాలో అంత మాత్రమే బిచ్చమెత్తుకుని అందులో సగం దానం చేస్తుండు. *తనకు అవసరమున్నాసరే అందులోంచి మిగిల్చి ఇవ్వడమేదానం తాలూకు ముఖ్యోద్దేశ్యం*. తను వాడుకోగా మిగిలినది ఇవ్వడం కాదు. బిచ్చగాడికి విషయం అర్థమైంది. వెంటనే ఆరోజు నుంచి ఓ నియమం పెట్టుకున్నాడు. తనకి ఎంత అవసరమో అంతే అడుక్కుని అందులోంచి సగం దానం చేయాలి. ఇది ఎలా తెలుస్తుంది దాని కోసం తన చేతిని భిక్షాపాత్రగా చేసుకుని అందులో పట్టినంత మాత్రం తీసుకుంటూ అందులో సగం దానం చేస్తూ సగం మాత్రమే తిన్నాడు. దాంతో బిచ్చగాడికి బిచ్చమెత్తుకునే ఇళ్ల సంఖ్య తగ్గిపోయింది. తిరగడం కాలం కూడా తగ్గిపోయింది. అతనికి ఒక గుర్తింపు లాంటిది వచ్చింది. కొద్ది రోజుల్లోనే ఇతను ఎవరి దగ్గర పడితే వారి దగ్గర బిచ్చమెత్తుకోడు ఇతను మన ఇంటికొస్తే ఈ రోజు బాగుణ్ణు. అనేటటువంటి భావాలు జనాల్లో కూడా వచ్చాయి. అంతేకాదు మొన్న వాళ్ళింటి కెళ్ళాడు. నిన్న వీళ్ళింటికి ఒచ్చాడు. ఇవ్వాళ మనింటికి తప్పకుండా వస్తాడని వాళ్లు ఆ బిచ్చగాడి కోసం మరికొంచెం పవిత్రంగా ఇవ్వాల్సిన పదార్థాల్ని సిద్ధం చేసేవాళ్లు. అందరికీ ఇచ్చే బిచ్చం కంటే ఇతనికి వేసే బిచ్చం చాలా ప్రశస్తంగా ఉండేది. సాత్వికంగా ఉండేది. మంచి ఆహారం లభించేది. పుచ్చకున్న దాంట్లో ఇతడు దానం చేయడం అందరూ చూశారు. అతనిలో ఏదో గొప్పతనం ఉందని చెప్పి పది మంది బిచ్చగాళ్లు చుట్టూ చేరి నువ్వే మా గురువన్నారు. ఇతడికది అంగీకారం లేదు. ఇదే నియమం పెట్టుకుని నేనెందుకు కాశీ వెళిపో కూడదు అని అనిపించింది. బయలుదేరాడు వెడుతున్నప్పుడు కూడా ఇదే నియమాన్ని పాటించాడు. తన చేతుల్లో ఎంత పడితే అంత ఆహారం తీసుకోవడం అందులోనున్న సగం దానం చేయడం. మిగిలినదే తినడం *అంటే అర్థాకలి* తన *ఆకలి కడుపుని* భగవదర్పణంగా జీవనం సాగిస్తున్నాడు. మొత్తం మీద

*కాశీ పట్టణాన్ని చేరాడు*. అతను ఇదేనియమాన్ని అక్కడ కూడా పాటిస్తూ ఓ చెట్టుకింది ఎక్కువసేపు కూచునేవాడు. ఆతడు అందరిలాగా ఒక అరగంట కూర్చుని ఏదో వస్తే తీసుకుని వెళ్లిపోవడం ప్రసక్తి లేదు. లేదా సాయం ధర్మం చేయండి దానం చేయడానికి వంటి మాటలు కూడా అతని నోట ఎప్పుడూ వినిపించేవి కాదు. ఎప్పుడూ ఏదో ఒక ధ్యానంలో ఉంటూ ఉండేవారు. అతిని దగ్గర పడిన డబ్బులు లేదా బియ్యం ఇవన్నీ కూడా ఆతను వెళ్లాక ఎవరో తీసుకునే వాళ్లే తప్ప అతడు ఏనాడు అవి ఆశించలేదు. ఇలా కొన్నాళ్లు గడిచేసరికల్లా అతని మీద పదిమంది దృష్టి పడింది. *అతనొక సాధకుడని*కారణ జన్ముడనీ* అతనికి ఏం చేసినా మంచి జరుగుతుంది అని చెప్పి అతని పేరుతో ఒక వేద పాఠశాల ఒక సత్రం కూడా నిర్మించారు. ఆ సత్రం పేరు కరపాత్ర సత్రము. అతని పేరును *కరపాత్ర స్వామీజీ* అని ప్రజలే ఆపేరు పెట్టారు . కరమే పాత్రగా కలిగినటువంటి వాడి అని పేరుపెట్టారు. ఇలాగ వేద విదులు వేదాభ్యాసం చేస్తున్నారు పిల్లలకు వేదం శాస్త్రం పురాణం ఇతిహాసాలు చెప్తున్నారు. సత్రాల్లో బస చేస్తున్నారు వచ్చే పోయే వాళ్లు కూడా భోజనం చేస్తున్నారు. కానీ ఇతని కీవిషయాలు ఏవీ తెలియవు. ఇతడు మాత్రం రోజుకు నదికి వెళ్లి స్నానంచేసి ధ్యానం చేయడం మధ్యహ్నం బిచ్చమెత్తుకోవడం తనకు వచ్చినదాంట్లో సగం దానం చేస్తుండం యథాతథంగా జరుగుతోంది. కొన్నాళ్లయింతర్వాత అక్కడ అతని దగ్గర కూర్చునే వాళ్లు నిలబడే వాళ్ళు చూసేవాళ్ళు దండంపెట్టుకునే వాళ్లు పెరిగారు. వారి కోసం అన్నట్టుగా అక్కడ నీడని కల్పించడం పందిళ్లు వేయడం మొదలుపెట్టారు. పెద్ద తీర్థ యాత్రగా మారిపోయింది. ఇంకొన్నాళ్లయినాక ఓ సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఈయన్ని పెద్దగా పిలవాలని అనిపించి ఆ సభ బాధ్యత అంతా వాళ్లే భరిస్తూ *కరపాత్ర స్వామీజీ* ని పిలిచారు. అందులో మాట్లాడుతున్న పెద్దవాళ్లందరూ కూడా నాకు ఈయన 15 ఏళ్లుగా తెలుసు. వీరిని చూసిన తరువాత నాలో చాలా మార్పు అంతేకాదు కొన్ని కుటుంబాలు వాళ్లయితే మేమీయనకి దండం పెట్టిన తర్వాత మొక్కుకున్న తర్వాత మా పిల్లకి పెళ్లయిందన్నవారు, మాకుఉన్న అప్పులన్నీ తీరాయి కష్టాలు తీరాయి అన్నవాళ్లు మాకు ఏ ఇబ్బందులు లేకుండా అయిపోతున్నాయి పరమేశ్వరుని దర్శిస్తే ఎంత పుణ్యమో అంత పుణ్యమూ వీరిని దర్శిస్తే నాకు జరిగిందని ఇలా అనేక రకాలుగా చెబుతున్నారు. కానీ ఒకటి మాత్రం అందరూ చెప్తున్నది ఈయనే గురువు నాకు. మా గురువు గారు కాశీ వెళ్లమని చెప్పారు. అందుకే ఇక్కడ వేదాదులు అధ్యయనం చేశాను. ఇలా అనేక మంది అనేక విషయాలు చెప్తున్నారు.
 మన *కరపాత్ర స్వామీజీకి* అర్థం కాని విషయాలు రెండు. ఇంతకీ 1) *కరపాత్ర స్వామిజీ* ఎవరు. *ఇన్నాళ్లు కాశీలో వుండి వారిని దర్శించుకోలేక పోయాను* ఎంత దౌర్భాగ్యుణ్ణి.
2) *నాకు గురువు ఎవరు* ఈ రెండు ప్రశ్నలను ఆయన బాధిస్తున్నా అక్కడికొచ్చే వారికి ఏమిచెప్పాలో తెలియక భగవదనుగ్రహంతో ఏవో చెప్పేసి నాకు భిక్షా సమయమయింది నేను వెళ్లాలి అన్నాడు. ఆయన్ని ఎవరూ అడ్డుకోలేదు. అతడు సరాసరి భిక్ష ఐన తర్వాత ఒక్కసారి తన గురువు ఎవరు ఆలోచించుకున్నాడు. ప్రశ్నించుకుంటూ ఉంటే తనకొక విషయం తట్టింది. *తనలో మార్పునకు కారణమైన వ్యక్తే గురువు* అని నిర్ణయించుకున్నాడు.
 అంతే వెంటనే తను ఎక్కడైతే మొట్టమొదట బిక్షాటన చేసుకున్నాడో ఆ గ్రామం గూర్చి బయలుదేరాడు. దారిలో ఇతన్ని గుర్తించిన వాళ్లు కలసి చూసి వచ్చిన వాళ్లు అక్కడ వేదం చదువుకున్న వాళ్లే కాదు ఆ సత్రంలో భోంచేసిన వాళ్లు అందరూ ప్రతి గ్రామంలోని గుర్తించి ఇతనికి స్వాగతం పలకడం అయనకేదో ఇవ్వడం అతను ఆ ధనాన్ని ఆ గ్రామంలోనే ఖర్చుపెట్ట మని చెప్పి పెద్దలకు ఇచ్చేస్తుంటే తానేమీ తీసుకోకపోవడం ఈయన ఖ్యాతి ఆనోట ఆనోట ప్రతి గ్రామానికి చేరింది. అందరూ ఇతని కోసం ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు అతను తన మొదటి గ్రామానికి వచ్చాడు ఆ గ్రామంలో వాళ్ళు కూడా చాలా ఆనందంతో *కరపాత్ర స్వామిజీ* వారు వచ్చేరు అని చెప్పి ఆయనకి ఆగ్రామంలో ఉంటున్న పండితుడిని పిలిచారు. ఆయనకూడా వెంటనే అంగీకరించాడు. *పండితుడువెళుతూనే పాద నమస్కారం చేసాడు* ఆయనకి మంత్రపూర్వకంగా తీసుకొచ్చి వేదిక మీద కూచోబెట్టారు. ఆయన గురించి నేను చూశానంటే నేను చూశాను నేనక్కడ సత్రంలో పనిచేశాను అక్కడ వేదపండితులు శాస్త్ర పండితులు శాస్త్రములు అని నేర్చుకుంటారు నేనక్కడున్నాను వీరిని మళ్లీ ఇక్కడ చూడ్డానికి చాలా ఆనందంగా ఉందంటే ఆనందంగా ఉంది. ఇలా చాలామంది మాట్లాడారు. స్వామీజీ కూడా మాట్లాడటం ఐపోయిన తరువాత నాకు *భిక్షా సమయం* అయింది నేను వెళ్లిపోతానని చెప్పాడు. *పండితుల వారు మా ఇంటికి భిక్షకి దయచేయండి* అని పిలిచారు. వెంటనే ఆయన అంగీకరించాడు. వాళ్ళింటికి వెళ్ళాడు. ఇద్దరు లోపల కూర్చున్నారు. ఆయన నియమం ముందే ఎరిగిన *ఆతల్లి అతనికి సంప్రదాయ ప్రకారంగా కరతల భిక్ష పెట్టింది.* ఆవిడ ఆభిక్ష పెడుతున్నప్పుడు ఆమెకుఏదో మాతృత్వం తొణికిసలాడింది. ఇదేం గమనించని స్వామీజీ భిక్షకోసం దోసిలి చాపాడు. ఆవిడకు ఎందుకో అనుమానం వచ్చింది చూస్తున్నప్పుడే కొంత అనుమానము ఇలా అడిగే సరికి ఇంకా అనుమానం వచ్చింది. సరే అని ఆయన నియమాన్

ని భంగ పరచకూడదని కరతలంలో భిక్ష పెట్టింది.
అమ్మా నేను ఇది ఎవరికైనా దానం చేసుకోవచ్చు కదా అని అడిగాడు స్వామిజీ. అయ్యో అదెంత మాట అన్నది ఆ ఇల్లాలు. వెంటనే *పండితుడు* *స్వామీజీ ఆభాగం నాకు ప్రసాదంగా ఇవ్వండని చెయ్యి పట్టాడు*. స్వామిజీ ఇచ్చేశాడు.
ఆ ఇంటి అన్నపూర్ణ వడ్డిస్తోంది. గృహ యజమాని ఐన పండితుడు అతిథి ఐన స్వామీజీ ఇద్దరు కూడ భోజనం చేస్తున్నారు. ఆ సమయంలో స్వామిజీ అ అడిగాడు. పండితుల వారు *నన్ను గుర్తు పట్టారా* అని. అబ్బే నేనెప్పుడూ కాశీమహానగరం రాలేదండీ నాకు అంత అవకాశం రాలేదు అన్నాడు.
సరే నేనెవరో చెప్తా వినండి అన్నాడు పండితుడు. వద్దండీ *శాస్త్ర ప్రకారమూ ఏరుల(నదుల), శూరుల, మహనీయుల మహాత్ముల జన్మ రహస్యం అడగ కూడదు*. సరే మీరు అడగలేదు నేనే చెప్తున్నాను వినండి. *నాగురుదేవులు మీరు*. అన్నాడు స్వామి. అబ్బే నేను పండితుడను. అంత వరకే అన్నాడు.
అయ్యా ముందు వినండి. *నేను ఎవరో కాదు మీమూడు జన్మల ముష్టివాణ్ణి* అని చెప్పాడు. పండితుడు ఒక్కసారిగా భోజనం మానేసి నిశ్చేష్టుడయ్యాడు. ఆ ఇల్లాలైతే ఏకంగా కన్నీరు పెట్టుకుంటూ వచ్చి స్వామి పాదాలపై పడి *పతి భిక్ష పెట్టమని ప్రార్థించింది*. అంత మాటలొద్దు అమ్మా. ధర్మం చెప్పేవాడు *నిష్కర్షగా* చెప్పాలి. ఆనాటికే కాదు ఈనాటికీ నేను సామాన్యుడినే. కానీ *ఆ రోజు పండితుల వారు అంత తీవ్రంగా అంత కఠినంగా* చెప్పకపోతే నాలో మార్పు వచ్చేది కాదు. నేను ఈనాడు ఈస్థితికి వచ్చే వాణ్ణి కాదు. అంచేత మీరే *నాగురువు అంటూ నమస్కరించారు స్వామీజీ*. లేదు లేదు మీరే నాకు జ్ఞానోపదేశం చేశారు. నేను *మహా అహంకారిని పండితుడని గర్వం ఉండేది* నా గర్వాన్ని పోగొట్టారు కాబట్టి మీరే నాకు గురువు అన్నాడు పండితుడు. అహంకారాలు పోయాయి గనక
ఇద్దరి భావాలు ఒకటయ్యాయి. ఇద్దరూ హాయిగా పరమానందానుభూతిని పొందారు.
 *బెనారస్ యూనివర్శిటీ (కాశీ విశ్వ విద్యాలయం) లో*ఇప్పటికీ ఈ కరపాత్ర
 స్వామీజీ పేరుతో అవార్డ్ ఇస్తున్నారు*.

మళ్ళీ జన్మంటూ ఉంటే.....



నాపేరు శారద. మేము ఉండేది విశాఖపట్టణం జిల్లాలోని సింహాచలం. మా నాన్నగారు సోమయాజులు గారు దేవాదాయశాఖలో గుమాస్తా. నాకు ఒక అన్నయ్య, ఇద్దరు అక్కలు. మా నాన్నగారు మా నలుగురికి చక్కటి విద్యాబుధ్ధులు నేర్పించే ప్రయత్నం చేసారు. మా అన్నయ్యకు చదువు వంటబట్టలేదు. వరాహలక్షీనృసింహ స్వామి వారి దేవస్థానంలో (సింహాచలం దేవస్థానం) మానాన్నగారు తన పలుకుబడి ఉపయోగించి మా అన్నయ్యకు అటెండర్ ఉద్యోగం వేయించారు. నా ఇద్దరు అక్కలు ఇంజినీరింగ్ పూర్తి చేసారు. నేను ఇంటర్మీడియేట్ చదువుతున్నాను.

మా పెద్దక్కకు పూనేలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న వ్యక్తితోనూ, నా చిన్నక్కకు నొయిడాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న వ్యక్తితోనూ వివాహం జరిపించారు. నా అన్నయ్యకు సంబంధాలు చూస్తున్నారు. నేను ఇంటర్మీడియేట్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నాను.

మా నాన్నగారికి అకస్మాత్తుగా పక్షవాతం వచ్చింది. వలంటరీ రిటైర్‌మెంట్ తీసుకోవలసి వచ్చింది. నాన్నగారికి వచ్చిన రిటైర్మెంట్ డబ్బులో సగం డబ్బుతో ఒక ఇల్లు కొన్నారు. మిగిలిన డబ్బు నాన్నగారి వైద్యానికి, అన్నయ్య పెళ్ళికి, ఇంట్లో అవసరమైన సామాన్లు కొనటానికి దాదాపుగా ఖర్చు ఐపోయింది. నాన్నగారికి వస్తున్న పెన్సన్ తోనే ఇల్లు గడుస్తుంది. అన్నయ్యకు వివాహం ఐనప్పటినుంచి ఒకే ఇంట్లో ఉంటున్నా, తన ఉద్యోగం, తన భార్య, తన సంపాదన తప్ప, అమ్మానాన్నలను నన్ను అంతగా పట్టించుకోవటం లేదు. నా చదువు అటకెక్కింది. నాకు వివాహం ఎలా జరిపించాలి అని రోజూ అమ్మానాన్న తీవ్రంగా ఆలోచిస్తున్నారు.

సింహాచలం లో నివాసం ఉంటున్న మా నాన్నగారి చిన్ననాటి స్నేహితుడు సోమనాథ శాస్త్రి గారు విషయం తెలిసి సతీసమేతంగా మా నాన్నగారిని పరామర్శించటానికి మా ఇంటికి వచ్చారు. ఆమాటా ఈమాటా మాటాడుకున్న తరువాత ఒక పైసా కట్నం తీసుకోకుండా నన్ను తమ ఇంటి కోడలిని చేసుకుంటాము అన్నారు. మాకు ఇబ్బందిగా ఉంటే పెళ్ళి ఖర్చులు కూడా తామే భరిస్తాము అని చెప్పారు. సోమనాథ శాస్త్రి గారు జ్యోతిష పండితులు. వారికి ఒక కొడుకు, ఒక కూతురు. వారి కూతురుకి ఈమధ్యనే సింహాచలం దేవస్థానంలో అర్చకునిగా పనిచేస్తున్న వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించారు. వారి కొడుకు రామకృష్ణ శాస్త్రి. చిన్న వయసులోనే వాస్తు, జ్యోతిష్యం, మంత్రశాస్త్రములపై మంచి పట్టు సాధించాడు. బారసాల మొదలుకుని సహస్రచంద్రదర్శనం వరకూ ఏకార్యక్రమమైన చక్కగా శాస్త్రప్రకారం నిర్వహించగలడు అని మంచిపేరు కొద్దికాలంలోనే తెచ్చుకున్నాడు. చాలా నిరాడంబరుడు. ఎక్కడికైనా నడిచి కాని, సైకిల్ మీద కాని, బస్సుల మీద కాని వెళ్తాడు. పూర్వీకులు సంపాదించిన ఆస్థి తన తండ్రిగారి వాటాకు ఓ ఐదెకరాల పొలం వచ్చింది. రాకమృష్ణశాస్త్రి ఆపొలం లో స్వయంగా పంటలు పండిస్తున్నాడు.

మా నాన్నగారు నా ఇద్దరు అక్కలకు, అన్నయ్యకు ఈవిషయం చెప్పారు. వారు ఎంతమాత్రం సమ్మతించలేదు. నన్ను అడిగారు. నేను సరే అన్నాను. ఎందుకు సరే అంటున్నావు కారణాలు చెప్పగలవా అని అన్నయ్య, అక్కయ్యలు నన్ను అడిగారు. అక్కయ్యలిద్దరూ దూరంగా ఉంటున్నారు, నేను అమ్మానాన్నలకు దగ్గరగా ఉండొచ్చు అని, ప్రస్థుత పరిస్థితులలో నాన్నగారు డబ్బు ఖర్చు పెట్టలేరని, నాన్నగారి చిన్ననాటి స్నేహితుని ఇంటికి కోడలిగా వెళ్తున్నాను కాబట్టి అవసరమైతే నా అత్తింటివారు అన్నివిధాల సహాయ సహకారాలు అందిస్తారని చెప్పాను. అలా నా వివాహం జరిగింది.

వివాహం జరిగి అత్తారింటికి వచ్చిన నాకు పుట్టింటికంటే ఆనందంగా ఉంది. అత్తమ్మ, ఆడపడుచు చాలా మంచివారు. రెండు మూడు రోజులకు ఒకమారైనా నన్ను పుట్టింటికి పంపుతున్నారు. మావారికి వరాహ పుష్కరిణిలో స్నానం ఆచరించి, భైరవకోనకు వెళ్ళి, భైరవస్వామివారిని దర్శించుకోవటం నిత్యకృత్యం. ఒకరోజు రాత్రి నిద్రపోయేముందు ఏవండోయ్ శ్రీవారూ! రోజూ మీరొక్కరే వెళ్తారా? నన్ను తీసుకుని వెళ్ళరూ అని అడిగాను. సరేనోయ్, రేపు ఉదయం 5 గంటలకు సిధ్ధంగా ఉండు, వెళ్దాం అన్నారు.

తెల్లారి నిద్రలేచి అత్తమామలకు చేయాల్సిన ఏర్పాట్లు చేసి ఐదు గంటలకల్లా సిధ్ధంగా ఉన్నాను. శ్రీవారు తయారై వచ్చారు. సైకిల్ ఎక్కి కూర్చేవే అన్నారు. హాండిల్ కి సీట్ కి మధ్య ఉన్న పైప్ మీద కూర్చున్నా. శ్రీవారు సైకిల్ తొక్కటం ప్రారంభించారు.

ఇంటి నుంచి పుష్కరిణి కి వెళ్ళటానికి పట్టిన సమయం దాదాపు 8 నిముషాలు. ఈ సమయంలో మాశ్రీవారికి, నాకు జరిగిన మధుర సంభాషణలు ఎన్నటికీ మరువలేను. పుష్కరిణిలో స్నానమాచరిస్తున్నప్పుడు నాకు శ్రీవారు జాగ్రత్తలు చెబుతూ ఉంటే నేను మావారి మీదకు నీళ్ళు విసురుతూ, మావారు నా తల మీద చెయ్యి వేసి నన్ను ముంచుతూ ఎంతగానో ఆనందించాము. స్నాన, సంధ్యాదులు ముగించుకున్నాక తిరిగి సైకిల్ ఎక్కి కూర్చున్నాను, కబుర్లు చెప్పుకుంటూ భైరవకోనకు వెళ్ళి దర్శనం చేసుకుని ఇంటికి తిరిగి వచ్చాము. ఇంతకుముందు ఎన్నో మార్లు వరాహపుష్కరిణికి, భైరవకోనకు వెళ్ళినప్పటికీ ఈరోజు పొందిన ఆనందం ఎన్నటికీ మరువలేను. మావారిని నాకొక సైకిల్ కొని ఇస్తే కొన్ని కొన్ని పనులకు వెళ్ళటానికి అలానే నా పుట్టింటికి వెళ్ళటానికి నాకు సౌకర్యంగా ఉంటుందని అడిగాను. ఓ మంచిరోజు చూసి నాకు సైకిల్ కొని ఇచ్చారు.

రోజులు గడుస్తున్నాయి. మాకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. ఇంటి పనులు చూసుకుంటూ, పిల్లల పెంపకంలో శ్రధ్ధవహిస్తూ బిజీ ఐపోయాను. నా పెద్దకొడుక్కి సరస్వతీవిద్యామందిర్ లో చేర్పించాము. రోజూ నేనే సైకిల్ మీద తీసుకుని వెళ్ళి స్కూల్ దగ్గర దించి తిరిగి వస్తున్నాను. ఇలా ఉండగా మా నాన్నగారు చనిపోయారు. అక్కయ్యలిద్దరూ వచ్చారు. చాలా బాధగా ఉంది. రాత్రికి ఆకలి వేస్తుంది. కాని భోజనం చేయాలని లేదు. పెద్ద బావ గారు వచ్చారు. పెద్దక్క కుటుంబం అంతా బయటకు వెళ్ళారు. పెద్దబావ గారు రెస్టారెంట్ కు తీసుకుని వెళ్ళారట. అక్కడ మా పెద్దక్క బాధతో ఏమీ తినలేదట. మా పెద్దబావ గారు, వారి పిల్లలు తినేసి వచ్చారట. చిన్నబావ గారి బంధువులు సింహాచలం లో ఉన్నారు. వారింటికి చిన్నక్క కుటుంబం వెళ్ళింది. చిన్నక్క కూడా చాలా బాధ పడుతుంది. ఒకటి రెండు మార్లు భోజనం చెయ్యమని చిన్నక్కను అడిగి తను తినటానికి ఇష్టపడకపోగా మిగిలినవారంతా తిన్నారట.

నేను మా ఇంటికి వచ్చాను. స్నానం చేసి వచ్చి కూర్చున్నాను. ఆడపడుచు అప్పటికే వచ్చి వంట చేసి అత్తమ్మకు, మామగారికి, పిల్లలకు బోజనం పెట్టేసింది. శారదా బోజనం చేస్తావా? ఎప్పుడు తిన్నావో, ఏమిటో అంది. నువ్వు, మా తమ్ముడు మీరిద్దరే బోజనం చెయ్యాలి అంది. నా భర్త నాకోసం భోజనం చెయ్యకుండా ఉన్నారా అని ఆశ్చర్యం వేసింది. ఇంతలో నా శ్రీవారు, పిల్లలు, అత్తమ్మ-మామ గారు అంతా నేను-నా ఆడపడుచు ఉన్న గదిలోకి వచ్చారు. శారదా! బాధపడుతూ కూర్చుని తినకుండా ఉంటే నీరసం ఐపోతావే, తిను అంటూ అత్తమ్మ ప్రేమగా నా తలపై నిమిరి అన్నం ముద్దచేసి నా నోట్లో పెట్టింది., తరువాత నా ఆడపడుచు, నా పిల్లలు ఒక్కరొక్కరే ఏదో ఒకటి చెబుతూ నాకు అన్నం తినిపిస్తుంటే, లక్షలు కోట్లు సంపాదిస్తున్నా కనీసప్రేమాభిమానాలు లేని కుటుంబంలో ఉన్న నా ఇద్దరు అక్కలకంటే నేను ఎన్నోరెట్లు ధనవంతురాలినా అనిపించింది. మావారు, మా మామగారు రోజూ నా పుట్టింటికి వస్తూ అక్కడ జరపాల్సిన కార్యక్రమాలు జరిపిస్తున్నారు. 10 వ రోజు కార్యక్రమం పూర్తి అయ్యాక అక్కయ్యలిద్దరు వెళ్ళిపోయారు.

మావారికి మంచి పేరుప్రఖ్యాతులు రోజు రోజుకూ వస్తున్నాయి. నేను రోడ్డు మీదకు వెళ్ళినప్పుడళ్ళా ఎవరో ఒకరు పలానా పురోహితుని భార్య అని నన్ను గుర్తిస్తూ పలకరించి మాటాడుతున్నారు. నా ముగ్గురు పిల్లలను అంతా ముద్దుచేసేవారే. ఎవరింట్లో శుభాకార్యం జరుగుతున్నా మొట్టమొదట పిలిచేది మా అత్తమ్మను, నన్నే. మావారి సంపాదన కూడబెట్టి ఇల్లు పెద్దగా కట్టించుకున్నాము. ఇప్పుడు మా ఇంటికి ఏసమయంలో నైనా ఓ పదిమంది అనుకోని అతిథులు వస్తే వారికి వసతి, బోజన సౌకర్యాలు ఏర్పాటు చేసే స్థాయికి చేరుకున్నాము. మా ముగ్గురు పిల్లలూ ఇప్పుడు స్కూల్ కి వెళ్తున్నారు.

ఉదయం లేచి అత్తమామలకు కావలసినవన్నీ ఏర్పాటు చేసాను. శ్రీవారు పౌరోహిత్యానికి వెళ్ళారు. సైకిల్ కి ముగ్గురు పిల్లల పుస్తకాల సంచీలు తగిలించి, నా కూతురుని సైకిల్ మీద కూర్చుండబెట్టి సైకిల్ నడుపుతున్నాను. నా ఇద్దరు కొడుకులూ నడుస్తూ నా వెంట వస్తున్నారు. నా పిల్లలు చదువుతున్న స్కూల్ సరస్వతీ విద్యా మందిర్ ఎదురుగా ఉన్న రామాళయం వచ్చింది. పాపను సైకిల్ మీద నుంచి దించాను. పిల్లలు ముగ్గురూ తన పాదరక్షలు విడిచి రామాళయం లోనికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి తమ పాదరక్షలు ధరించి ఎవరి పుస్తకాల సంచీ వారు తీసుకుని స్కూల్ లోనికి వెళ్ళి పోయారు. సైకిల్ స్టాండ్ వేసి రామాళయం లోనికి వెళ్ళి స్వామీ! సీతా, లక్ష్మణ, హనుమత్సమేత శ్రీరామచంద్రా! నాకు ప్రసాదించిన ఈ అదృష్టం చాలు. నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే ఒక పురోహితునికి కూతురుగా, ఒక పురోహితునికి భార్యగా, ఒక పురోహితునికి తల్లిగా. ........... జన్మించేటట్టు అనుగ్రహించు అని అర్ధించి, దేవాళయం బయటకు వచ్చి, నా సైకిల్ తీసుకుని ఇంటివైపు బయలుదేరాను.

ఒక చిన్న కథ

*🍁అందరికీ నచ్చే ఒక చిన్న కథ🍁*

👉🏼వెన్నెల అనే అందమైన అమ్మాయికి పెళ్ళి కుదిరింది..
చదువు, అందం , ఆస్తి, సాంప్రదాయం అన్ని ఉన్న అమ్మాయి కనుక మగపెళ్ళివారు చూడగానే ఒప్పుకున్నారు.

ఆ అమ్మాయి పెళ్ళి కొడుకుతో మాట్లాడాలి అన్నది...సరే ఇద్దరూ కూర్చున్నారు...
వెన్నెల అన్నది " పెళ్ళికి నాది ఒకే ఒక షరతు "
అతను కుతూహలంగా చూసాడు. "అది ఏమిటంటే మీరు ఏమాట మాట్లాడాలనుకున్నా సరే,
 అంటే విపరీతమైన కోపం వచ్చినా, టెన్షన్ వచ్చినా,విసుగ్గా వున్నా,ఏదైనా అసలు నచ్చకపోయినా సరే కానీ గొంతు పెంచి మాట్లాడకూడదు. *మీరు ఏం మాట్లాడాలనుకున్నా సరే మెల్లగా అనాలి అంతే ! అలా కాకుండా గొంతు పెంచి అరిస్తే నేను పుట్టింటికి వచ్చేస్తాను* ఆ పై నన్ను ఏమీ అనకూడదు" అన్నది.

అతనికి కొంచెం వింతగా అనిపించినా తిట్టవద్దు అనలేదు కదా కొంచెం గొంతు తగ్గించమంటున్నది ఫర్వాలేదు అనుకున్నాడు.
పెళ్ళి అయిపోయింది, వెన్నెల పెట్టిన షరతు అత్తగారింట్లో తెలిసినా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు.
పొద్దున్నే ఇద్దరికీ ఆఫిస్ హడావిడి " వెన్నెలా కాఫీ అడిగి ఎంతసేపయింది ???" హాలులో కూర్చుని అరిచాడు" దానికి ఆమె మెల్లగా మిమ్మల్ని కలుపుకోమన్నాను కదా" అన్నది వెన్నెల.
" నేనా ? కాఫీ కలుపుకోవాలా??ఇంక పెళ్ళి చేసుకున్నది దేనికి ??? అని "మెల్లగా అన్నాడు
వెన్నెల నవ్వేసింది "

మీరు పెళ్ళికి ముందు షరతు పెట్టాల్సింది నా కాఫీ ఎప్పుడూ నువ్వే పెట్టాలని" అతను కూడా నవ్వేసాడు.

రెండు నెలల తరువాత వెన్నెల, తన క్లోజ్ ఫ్రెండ్ పెళ్ళికి బంగారు నెక్లెస్ గిఫ్ట్ ఇవ్వాలని తెచ్చింది. అంత ఖరీదైన బహుమతి తనకి చెప్పకుండా తేవడంతో అతని కోపం తారాస్థాయికి చేరుకుంది.
"సంపాదిస్తున్నానని అంత పొగరా? కనీసం నాకు చెప్పకుండా" అని
ఎంత పెద్దగా అన్నాడో అతనికే తెలియలేదు.

ఒక్కక్షణం మౌనంగా వుండి, వెన్నెల అన్నది "ఇదే మాటని మళ్ళీ చెప్పండి,మెల్లగా"
 ఒక్క నిమిషం ఆగి అతను అన్నాడు, నిజమే ! నీ ఫ్రెండ్
పెళ్ళి కాదనను కానీ నాకు ఒక్క మాట చెప్పిఉండాల్సింది సరేలే అన్నాడు. అప్పుడు
వెన్నెల, తను నా పెళ్ళిలో డైమండ్ రింగ్ ఇచ్చింది తెలుసా అన్నది శాంతంగా.

ఓ..కే.. ఇకనుంచి మీ ఫ్రెండ్స్ విషయంలో నేను జోక్యం చేసుకోను అన్నాడు అతను.

వారి వివాహం అయి ఒక సంవత్సరం అయింది,గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు. బంధువులు, మిత్రులు వచ్చారు. అందులో ఎవరో ఒకరు అతనిని ప్రశ్నించారు.
*"మీ వైవాహిక జీవితం విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి అయింది కదా ! మీ ఆనంద రహస్యం ఏమిటి ?? అని"*

దానికి అతడు *"ఏమీ లేదు, నా భార్య నా గొంతు నొక్కేసింది అంతే !"* అన్నాడు.

అందరూ నవ్వారు.
అంటే ఏమిటి ? ఎవరో కుతూహలంతో అడిగారు..
అతను వివరించాడు ఈవిధంగా 
అందరికీ ఉపయోగపడే సూత్రం చెబుతాను వినండి...

*ఏ భావావేశమైనా గొంతు పెంచి మాట్లాడవద్దు. గొడవలు వాటంతట అవే సమసి పోతాయి* ఇక వాదన పెరగదు. కోపం తారాస్థాయికి చేరుకోదు. నా భార్య నా గొంతులో సైలెన్సర్ బిగించిందిఅంతే జీవితం సాఫీగా సాగిపోతున్నది అన్నాడు.

అందరూ ఆమెను అభినందించారు. అతను ఆమెను గర్వంగా చూసాడు.

ఇప్పుడు నీతి ఏమంటే.,

చాలా వరకూ సమస్యలు పరుష పదజాలంతో రావు, వాటిని పలికే స్థాయితో వస్తాయి.
"ఈ కూర ఇట్లా తగలడిందేమిటి ?" అనే మాటని పెద్దగా అనండి... అలాగే చిన్నగా అని చూడండి 😂
తేడా మీకే అర్థం అవుతుంది.

పెద్దగా అరవటంవలన మన బి.పి.పెరుగుతుంది మనసులో అశాంతి, ఎదుటివారితో దూరం పెరుగుతుంది వారి మనసుని గాయపరుస్తాము, అది వారు ఏనాడూ మర్చిపోరు.
అదే గొంతు మార్చి కలిగే లాభాలు చూడండి, మీకే అర్థం అవుతుంది .👍🏼

*👉🏼ధర్మస్య విజయోస్తు🙌🏼*
*👉🏼అధర్మస్య నాశోస్తు🙌🏼*
*👉🏼ప్రాణిషు సద్భావనాస్తు🙌🏼*
*👉🏼విశ్వస్య కళ్యాణమస్తు🙌🏼*

*రామనామ మహిమ*



           
*రామనామాన్ని గురించిన చక్కని కథ ఒకటి ఉంది*

త్రేతాయుగంలోనే రాములవారు రాజ్యం చేస్తున్నప్పుడు ఒక రామభక్తుడు ఉండేవాడు. నిరంతర ‘శ్రీ రామ’ నామ జపం చేసేవాడు. ఎక్కడ రామనామం, రామకథ చెప్పబడుతుందో అక్కడే హనుమ ఉంటారు కదా! అలా ఒకరోజు ఆ భక్తుని వెనక అదృశ్యంగా అతనితోపాటే తిరుగుతూ అరమోడ్పు కన్నులతో రామనామ పారవశ్యంలో మునిగితేలుతున్నారు హనుమ.

ఐతే కొంత సమయానికి ఆ భక్తునికి లఘుశంక తీర్చుకోవలసి వచ్చింది. ఆ సమయంలో కూడా రామనామ జపం సాగిస్తూనే ఉన్నాడు. అది చూసిన హనుమంతులవారికి పట్టరాని ఆగ్రహం వచ్చి తన తోకతో ఆ భక్తుని వీపుమీద ఒక్క దెబ్బ కొట్టారు. ఆ భక్తుడు ఆ నొప్పికి తాళలేక ‘రామా’ అని ఆర్తితో అరిచాడు. అలా అనగానే ఆశ్చర్యంగా ఆ నొప్పి తగ్గిపోయింది.

అదే సమయంలో ఇటువంటి వాడి చుట్టూనా నేను రామనామం కోసం తిరిగింది, అని హనుమ అక్కణ్ణుంచి తిరిగి రాజ ప్రసాదానికి చేరుకున్నారు.

రాజ ప్రాసాదంలో అంతా ఒకటే కోలాహలంగా ఉంది. రాములవారికి ఆరోగ్యం బాలేదు. ఉన్నట్టుండి విరుచుకు పడిపోయారు. వారిని శయనాగారంలోకి తీసుకెళ్ళి పడుక్కోపెట్టారు. ఎవ్వరినీ లోపలకి పంపట్లేదు. కేవలం సీతమ్మ, లక్ష్మణ భరత శత్రుఘ్నులే ఉన్నారు. రాముల వారు హంసతూలికా తల్పం మీద వెల్లకిల్లా పడుక్కుని ఉన్నారు. వారి వీపుమీద ఒక పెద్ద వాత ఉన్నది.

సీతమ్మ ఆ వాత వల్ల కలిగిన నొప్పి, మంట తగ్గడానికి రకరకాల ఔషధాలతో కలిపిన నవనీతం రాస్తూ ఉన్నది. హనుమ వచ్చారని తెలియగానే లక్ష్మణాదులు సీతమ్మ "లోపలికి ప్రవేశపెట్టండి ఆయనే మళ్ళీ ఏ హిమాలయాలకో వెళ్ళి ఏ మూలికో తీసుకొచ్చి రాములవారి నొప్పి తగ్గించగలరు" అని చెప్పగా హనుమను లోపలకి అనుమతించారు. లోనికి వచ్చి రాములవారిని చూసిన హనుమ ఆగ్రహోదగ్రుడై అసలెవరు ఈ పని చేసింది, ఎవరు కొట్టారు స్వామిని అంటూ నరసింహావతారం ఎత్తి రుద్రుడై తాండవం చేయసాగారు.

అప్పుడు నొప్పితో ఉన్న శ్రీరాములవారు ’నువ్వే కదా హనుమా ఆ భక్తుని నీ తోకతో కొట్టావు. అతడు ఆ నొప్పి భరించలేక రామా అని అరిచాడు. ఒకవేళ అతని నొప్పి నేను తీసుకోకపోతే నీ దెబ్బకి బ్రతకగలిగేవాడా? నేనే ఇంత బాధపడుతున్నాను’ అని అనగా, హనుమ జరిగిన అనర్థాన్ని తెలుసుకుని క్షమించమని రామపాదాలని ఆశ్రయించి నమస్కరించి, స్వామీ మీ నొప్పికి మందుకూడా తెలిసింది అని ఒక్క క్షణంలో ఎగిరి ఆ భక్తుని దగ్గరికి వెళ్ళి ఆ భక్తుని జరిగింది సూక్ష్మంగా చెప్పి, ఆ భక్తుని నిరతిశయ భక్తికి మెచ్చి, అతనిని తీసుకుని వెంటనే స్వామి వద్దకు వచ్చి, అమ్మవారు వ్రాస్తున్న ఔషధపు నవనీతాన్ని తాను కొద్దిగా తీసుకుని, ఆ భక్తునికి కొద్దిగా ఇచ్చి శ్రీరాములవారికీ సీతమ్మకూ నమస్కరించిన తరవాత రామ నామ గానం చేస్తూ, ఇద్దరూ కలిసి ఆ వాతకు ఆ వెన్నపూస పూత పూయగా రాములవారి నొప్పి మంట వారి వీపు మీద వాత అన్నీ పోయాయి.

ఇక హనుమ ఆ భక్తుని ఆనందంతో ఆలింగనం చేసుకుని "చూసావా నాయనా రామ నామ మహిమ! ఏ రామనామం భక్తుడు పలకడం వల్ల శ్రీరాముడు ఆ భక్తుని కష్టం తీసుకుని తానే బాధ పడ్డాడో, అటువంటి రాముని బాధనుకూడా పోగొట్టగలిగేది కూడా రామభక్తుల నోటియందుండే రామనామమే" అని చెప్పి అతనిని ఆశీర్వదించి పంపారు.

*సర్వేజనా సుఖినొభవంతు.*

ఇది సేకరణ🙏🙏🙏🙏🙏🙏🙏🙏

బ్రాహ్మణత్వము

బ్రాహ్మణత్వము గురించి భీష్ముణ్ణి...ధర్మరాజు ఇలా అడిగాడు...!💐శ్రీ💐

పితామహా ! బ్రాహ్మణులు కాక ఇతరులు తాము చేసే గుణకర్మల వలన బ్రాహ్మణత్వము పొందవచ్చునా ! అని తన సందేహం వెలిబుచ్చాడు.

భీష్ముడు ధర్మనందనా ! బ్రాహ్మణత్వము పొందడం చాలా దుర్లభం.ఎన్నోజన్మలు ఎత్తిన తరువాత కాని బ్రాహ్మణజన్మ లభించదు.

ఈ విషయము గురించి నీకు ఒక ఇతిహాసము చెప్తాను విను. పూర్వము మతంగుడు అనే విప్రకుమారుడు ఉండే వాడు. అతడు తండ్రి ఆదేశానుసారము ఒక యజ్ఞానికి వెడుతున్నాడు.

దారిలో అతడు ఒక గాడిదపిల్లను కర్రతో గట్టిగా కొట్టాడు. ఆ గాడిద పిల్ల ఏడుస్తూ తనతల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతి చెప్పింది. ఆ గాడిద తన కూతురుతో అమ్మా ! ఇతడు చంఢాలుడు, క్రూరుడు అందుకే నిన్ను అలా కొట్టాడు అని చెప్పింది.

గాడిద మాటలను అర్ధము చేసుకున్న విప్రకుమారుడు ఆ గాడిద ఊరికే అలా అన లేదు. గాడిద మాటలలో ఏదో అంతరార్ధము ఉంది. లేకుంటే అలా ఎందుకు అంటుంది? అనుకున్నాడు. విప్రకుమారుడు ఆ గాడిద వద్దకు వెళ్ళి తన జన్మరహస్యము చెప్పమని అడిగాడు.

గాడిద విప్రకుమారా ! నీ తల్లి కామంతో ఒక క్షురకుని వలన నిన్ను కన్నది. కనుక నీవు బ్రాహ్మణుడివి కాదు అని చెప్పింది. ఆపై అతడికి యజ్ఞముకు వెళ్ళడానికి మనస్కరించక ఇంటికి తిరిగి వెళ్ళి తండ్రితో తండ్రీ ! నేను బ్రాహ్మణ స్త్రీకి క్షురకుడికి పుట్టాను కనుక నేను బ్రాహ్మణుడను కాను.

ఆ గార్ధభము ఏదో శాపవశాన ఇలా జన్మ ఎత్తి ఉంటుంది. లేకున్న ఈ నా జన్మరహస్యము ఎలా తెలుస్తుంది?. తండ్రీ ! నేను తపస్సు చేసి బ్రాహ్మణత్వము సంపాదిస్తాను అని చెప్పి మతంగుడు తపస్సు చేయడానికి అడవులకు వెళ్ళాడు.

మతంగుడు కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి ఇంద్రుడిని ప్రసన్నము చేసుకున్నాడు. ఇంద్రుడు ప్రత్యక్షమై కుమారా ! నీవు తపస్సు ఎందుకు చేస్తున్నావు ? నీ కోరిక ఏమిటి అని అడిగాడు. మతంగుడు దేవా ! నాకు బ్రాహ్మణత్వము ప్రసాదించండి అని అడిగాడు.

ఇంద్రుడు కుమారా ! బ్రాహ్మణత్వము మహత్తరమైనది. ఇతరులకు అది లభ్యము కాదు కనుక మరేదైనా వరము కోరుకో అని అన్నాడు. మతంగుడు అయ్యా ! నా కోరిక తీర్చడం మీకు కుదరదు కనుక మీరు వెళ్ళండి. నా తపస్సు కొనసాగిస్తాను అన్నాడు.

ఇంద్రుడు వెళ్ళగానే మతంగుడు తన తపస్సు కొనసాగించి ఒంటి కాలి మీద మరొక నూరేళ్ళు తపస్సు చేసి ఇంద్రుడిని ప్రత్యక్షం చేసుకున్నాడు.

ఇంద్రుడు కుమారా ! నీ పట్టు విడువక ఉన్నావు! శూద్రుడు ఇలాంటి తపస్సు చేస్తే చస్తాడు జాగ్రత్త అని బెదిరించి అసలు బ్రాహ్మణత్వము ఎలా సిద్ధిస్తుందో నీకు తెలుసా !

ఇంతకంటేపది రెట్లు తపస్సు చేస్తే కాని ఒక చంఢాలుడు శూద్రుడు కాలేడు.
దాని కంటే నూరు రెట్లు తపస్సు చేస్తే కాని శూద్రుడు వైశ్యుడు కాలేడు.
దాని కంటే వేయిరెట్లు తపస్సు చేసిన కాని వైశ్యుడు క్షత్రియుడు కాలేడు.
దాని కంటే పది వేల రెట్లు తపస్సు చేసిన కాని క్షత్రియుడు దుర్మార్గుడైన బ్రాహ్మణుడు కాలేడు.
దానికంటే లక్షరెట్లు తపస్సు చేస్తే కాని దుర్మార్గుడైన బ్రాహ్మణుడు ఇంద్రియములను, మనస్సును జయించి, సత్యము అహింసలను పాటించి, మాత్సర్యము విడిచి పెట్టి సద్బ్రాహ్మణుడు కాలేడు.

అటువంటి సద్బ్రాహ్మణత్వము ఒక వంద సంవత్సరాల తపస్సుకు వస్తుందా ! చెప్పు అన్నాడు. ఒక వేళ బ్రాహ్మణ జన్మ పొందినా దానిని నిలబెట్టుకొనుట కష్టము.

 ఒక్కొక్క జీవుడు అనేక జన్మల తర్వాత కాని బ్రాహ్మణజన్మ ఎత్తలేడు. అలా ఎత్తినా అతడు దానిని నిలబెట్టుకోలేడు. ధనవాంఛ, కామవాంఛ, విషయాసక్తితో సదాచారములను వదిలి దుర్మార్గుడు ఔతాడు.

తిరిగి బ్రాహ్మణజన్మ రావడానికి ఎన్నో ఏళ్ళు పడుతుంది. అటువంటి బ్రాహ్మణజన్మ కొరకు నీవు తాపత్రయపడి నీ వినాశనము ఎందుకు కొని తెచ్చుకుంటావు. నీ కిష్టమైన మరొక వరము కోరుకో ఇస్తాను తపస్సు చాలించు అన్నాడు.

మారుమాటాడని మాతంగుడి మొండి తనము చూసి విసుగు చెంది ఇంద్రుడు వెళ్ళి పోయాడు. మాతంగుడు తిరిగి తన తపస్సు కొనసాగించాడు. కాలి బొటనవేలి మీద నిలబడి శరీరం అస్థిపంజరము అయ్యేవరకు తపస్సు చేసాడు.

అతడి శరీరము శిధిలమై పడిపోతుండగా ఇంద్రుడు పట్టుకున్నాడు. ఏమిటి నాయనా ఇది? పెద్ద పులిలా నిన్ను మింగగలిగిన బ్రాహ్మణత్వము నీకెందుకు? చక్కగా వేరు వరములు అడిగి సుఖపడు అన్నాడు.

మాతంగుడు అంగీకరించగానే ఇంద్రుడు నీవు చంఢదేవుడు అనే పేరుతో అందమైన స్త్రీల. పూజలందుకుని వారి వలన నీ కోరికలు ఈడేర్చుకుంటావు అని వరాలు ప్రసాదించాడు.
కానీ బ్రాహ్మణ జన్మను ప్రసాదించలేదు.
(భారతంలోని అనుశాసనిక పర్వంలోని కథ).

అటువంటి ఉత్కృష్టమైన, పరమ పవిత్రమైన బ్రాహ్మణ జన్మను కాపాడుకోవలసిన అవసరం మన బ్రాహ్మణులదే.
జై బ్రాహ్మణ్...జై జై బ్రాహ్మణ్..స్వస్తి..!!

లోకా సమస్తా సుఖినో భవంతు..!!💐
                         💐శ్రీ మాత్రే నమః💐

జగన్మాత – జగత్పిత



వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే,
జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ.

మహాకవి కాళిదాసు రఘువంశం అనే కావ్యానికి మొదట ఈ మంగళ శ్లోకం రచించాడు. జగత్తుకు అనగా ప్రపంచానికి పార్వతీపరమేశ్వరులు తలిదండ్రులవలె ఉన్నారు, అని ఆ మహాకవి అన్నాడు. ఇదేవిధంగా భగవత్ పాదులవారున్నూ మాతా చ పార్వతీదేవీ పితాదేవో మహేశ్వరః, బాంధవా శ్శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్. అని ఒకచోట సెలవిచ్చారు.

ఆవు అనే పదము ఉన్నది. ఇందు రెండు అక్షరాలు ఉన్నవి. ఈ రెండక్షరాలనూ వినంగానే మనస్సులో ఒక రూపం పొడగట్టుతుంది. ఆ పదము నిర్దేశించే వస్తువుయొక్క రూపం జ్ఞప్తికి వస్తుంది. ఈ రెండక్షరాలూ ఒక గుర్తు లేక సంకేతం. ఆవు అనగానే గోవు జ్ఞప్తికి వస్తుంది, లేదా ఆవును చూడంగానే దానికి సంకేతమైన ఆవు అనే మాట మనస్సుకు తట్టుతుంది. వీనికి అవినాభావసంబంధం. అనగా ఒక దానిని మరియొకటి విడనాడని చెలిమి ఉన్నట్టున్నది. ఈ విషయాన్నే నామరూపాలని పేర్కొంటారు. వీనిలో ఒక దానినుండి మరొక దానిని వేరుచేయలేము. ఒకటి వాక్కు మరొకటి దాని అర్థము. ఈ వాగర్థాలు ఎలా సంపృక్తాలై ఉన్నవో అనగా ఒక దానిని మరొకటి వదలక చేరి ఉన్నవో, అట్లే పార్వతీపరమేశ్వరులు ఒకరి నొకరు వదలక, ప్రపంచానికి తలిదండ్రులై ఉన్నారనిన్నీ, వారికి నా వందనములనిన్నీ కాళిదాస మహాకవి మంగళాచరణం చేస్తున్నాడు. ఇదే అర్థ నారీశ్వర తత్త్వం. ఇటు చూస్తే అంబికా అటు చూస్తే అయ్యా లేక పార్వతీ పరమేశ్వరులు. సంస్కృత భాషాభ్యాసం చేసే వారందరూ ఈ శ్లోకం చదివి మరీ నమస్కరిస్తారు.

మనకు రూపు ఇచ్చేవారు మన తల్లిదండ్రులు దేహానికి కారణభూతులు తండ్రి. పుష్టి గలిగించే ఆహారమిచ్చి పోషించేది తల్లి. దేహానికి పుష్టి గలిగించే వస్తువు ఆహారము కొరత లేకుండా ఆత్మకు పుష్టి ఇచ్చేవారు ఎవరు? ఆత్మ అనగా ప్రాణం, ప్రాణానికి పుష్టి ఏది? ఆనందం, జ్ఞానం.

దేహము ఏనాడు ధరించామో ఆనాటి నుండీ ప్రాణానికి కష్టాలే. అనగా ఈ కష్టాలంతా కారణం జన్మ లేక దేహధారణ. ఇంకో జన్మ ఎత్తితే మరిన్ని కష్టాలు. కన్న తండ్రి ఏదో సంపాదించి ఇంత నిలువ చేసి పోయినాడని దేహానికి శ్రమ లేదనుకొన్నా ఆత్మకు ఎన్నో కష్టాలు, శ్రమలు, అవమానాలూ, దుఃఖాలు, దేహానికి గాని ఆత్మకుగాని ఏ విధమైన కష్టమూ ఉండగూడదని అనుకుంటే జన్మలేకుండాపోవాలి, జన్మ ఎత్తామో ఆనందం తక్కువ దుఃఖం ఎక్కువ.

దుఃఖ స్పర్శలేకుండా ఆరుగాలంలోనూ ఆనందంగా వుండేటట్టు చేసేది ఆత్మ. అందరి ఆత్మలకున్నూ పుష్టినీ, ఆనందాహారాలనూ ఇచ్చునది పరాశక్తీ పరమేశ్వరుడూ, ఆత్మ జగన్మాత, ఆయన జగత్పిత. వారికి శరణుపొందితేనే గాని జన్మ లేకుండా పోదు. జన్మ లేకుండా పోవడమంటే అవధి లేని ఆనందమే. జన్మ కలిగిందంటే ఆనందానికి ఒక కొరత అని అర్థం. ప్రాణానికి లేక ఆత్మకు, ఆహారం అంటే పుష్టి, ఏమిటీ అని ఆలోచిస్తే ఎప్పుడూ ఆనందంగా వుండడమే. ఈ ఆనందం ఇవ్వగలవారు తల్లిదండ్రులే. కొందరూ ఈశ్వరోపాసనా, కొందరు దేవ్యుపాసనా, మరికొందరు యిరువుర కూడిక ఐన శివశక్త్యుపాసనా చేస్తారు.

అయితే వీరి వద్దకు పోవలసిన అవసరం? జబ్బుతో తీసుకుంటున్న మనిషి వైద్యుని దగ్గరకు వెళతాడు. డబ్బులేని వాడు యాచనకో చేబదులుకో శ్రీమంతుని వెతుక్కుంటూ వెడతాడు. ఒక్కొక్క పని కోసం ఒక్కొక్కరి దగ్గరకు వెళ్ళవలసి వుంటుంది. మనకు అది లేదూ, ఇది లేదూ అనేకొరతా, ఫలానావాడు అవమానించాడు అనిన్నీ లేక తగిన మర్యాద చేయలేదు అనే దుఃఖమున్నూ జన్మతో వచ్చింది. ఈ కొరతలను పోగొట్టుకోవలెనంటే, మనసుకు ఒక పూర్ణత్వం సిద్ధించాలంటే పార్వతీ పరమేశ్వరుల వద్దకు వెళ్ళాలి.

మనస్సుకు ఎప్పుడూ ఏదో ఒక చింత. దీనికి కారణం ఏమిటీ? జన్మ. డబ్బులేని వాడు యాచనకు శ్రీమంతుని కడకు వెళ్ళినట్లే ''జన్మ ఇక మనకు వద్దు'' అని అనుకొన్నవాడు జన్మలేనివాని కడకు వెళ్ళాలి. అతని అనుగ్రహమాత్రాన జన్మరాహిత్యం సులభంగాసిద్ధిస్తుంది. జన్మ లేకపోతే చింతలేదు. అందువల్ల చావు పుట్టుకలులేని పార్వతీపరమేశ్వరుల కడకు మనము వెళ్ళాలి.

మనకందరికీ చావు పుట్టుకలున్నవని తెలుసు. పుట్టుకకు కారణం కామం. చావునకు కారణం కాలుడు. కామకారణంగా కలిగిన వస్తువు కాలగ్రస్తమై నశించిపోతూంది. కామ వీక్షణంతో మోడు కూడా చిగిరిస్తుంది. కాలదర్శనంతో ఎండిపోయి జీర్ణిస్తుంది. ''కాలో జగద్భక్షకః''. కాలంవచ్చిందంటే సూర్యచంద్రాదులున్నూ చూపులేకుండా పోతున్నారు.

కామం లేకపోతే పుట్టుక లేదు. కాలం లేకపోతే చావు లేదు. ఈ రెండింటినీ జయించాలంటే పరమేశ్వరుని వద్దకు వెళ్ళాలి. అసామాన్యమయిన ఇట్టి వరం అనుగ్రహించగల ఆ వర ప్రసాది ఎటువంటి వాడు?

''కాముని కంటితో నీఱుచేశాడట
కాలుని కాలితో తన్ని వేశా డట''

మన్మథుణ్ణి చూచి నంతమాత్రాన దగ్ధంచేసినవాడికీ, కాలుని కాలితో తన్నిన కాలకాలునికీ చావుపుట్టుకలులేవు. ఆయన అనుగ్రహం గనుక సంపాదించుకుంటే మనకు కూడా పుట్టటం గాని గిట్టటంగాని ఉండదు.

పరమేశ్వరుడు ఒక్కడు ఉంటే సరిపోదూ మరి అంబిక అవసరమేమిటీ? పార్వతీ పరమేశ్వరులు వాగర్థాలు కదా, ఈశ్వరుడు కామునినిగ్రహించిందినొసలికంటితో. అర్థనారీశ్వర ప్రకృతులగు వీరికి మూడోకన్ను ఉమ్మడి. దానిలో ఆయనకు సాబాలూ ఆమెకుసాబాలూ, కాలుని తన్నినది ఎడమకాలితో, ఆకాలు అంబికది. అందుచేత కామ విజయానికీ కామనిగ్రహానికీ అమ్మవారి అనుగ్రహంకూడా ఉండాలి. జన్మవద్దనుకుంటే మనం ఈ పురాణదంపతుల నిద్దరినీ చేర్చి ఉపాసనచేయాలి. ఏకశరీరులై ఉన్నందున మన పని చాలా తేలికయింది. వారి అనుగ్రహం ఉంటేచాలు చావుపుట్టుకల సంత మనకుండదు.

సంగీతంద్వారా భగవదుపాసనచేసినవారిలో ముత్తయ్య దీక్షితులు, త్యాగయ్య, శ్యామశాస్త్రి అనే మువ్వురు గాయక శ్రేష్ఠులు ఉన్నారు. దీక్షితుల వారు నవావరణ కీర్తనలను వీణమీద పాడి అమ్మవారిని ఆరాధించేవారు. శ్రీచక్రార్చన చేసేవారు. సంగీతమందు అభిరుచి ఉన్నవారికి ఈ విషయం తెలిసి ఉంటుంది. దీక్షితులవారు ఒకనాడు ఆలాపన చేస్తూ అందే మునిగిపోయి ఉన్నారు. ఆనాడు కార్తిక అమావాస్య ''శ్రీ శ్రీమీనాక్షీ మే ముదం దేహి'' అనే చరణం పాడుతున్నారు. పాట చివర ''పాశమోచనీ'' అని ఉంటుంది. 'ముదం దేహి పాశమోచని' అని పాడుతూండగా వారిశ్వాస అట్టే ఆగిపోయింది. మరణబాధే లేదు. సంకీర్తనచేస్తూ తన్మయులైపోయారు. ఎప్పుడూ దేనిని తలుస్తూ ఉన్నారో ఆ వస్తువే అయిపోయారు. మరణమనేది లేక ఆనందంలో లయం పొంది జనన మరణాలులేని స్థితినిపొందారు.

చావుపుట్టుకలు రెండున్నూ దుఃఖం కలిగించేవే. జనన నివృత్తిని వెతకికొంటూ ప్రపంచానికి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులను తలచుచూ ''జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ'' అని మనము వారికి శరణాగతి చెయ్యాలి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం

*అన్నదానం.మహిమా..*

   
     
*కోటి గోవుల దాన ఫలితంతో సమానం!* 🙏🙏🙏🙏🙏

విదర్భ రాజ్యాన్ని సుదేవుడి కుమారుడు శ్వేతుడు పాలించేవాడు. గొప్ప తపస్సంపన్నుడైన శ్వేతుడు ధర్మబద్ధంగా పాలించి తపశ్శక్తితో దైవత్వాన్ని పొందాడు. అతడు మరణించిన తర్వాత విష్ణువు సేవకులు వచ్చి స్వర్గానికి తీసికెళ్లారు. అక్కడ భోగభాగ్యాలు అనుభవిస్తూ సంతోషంగా ఉన్నాడు. కానీ, అన్ని సుఖాలున్నా ఆకలిబాధ మాత్రం అతడిని వెంటాడింది. స్వర్గంలో ఉండేవారికి ఆకలి తెలియదు. ఆకలివేస్తే తినడానికి కూడా ఏమి ఉండదు. కానీ శ్వేతుడికి స్వర్గ లోకంలో కూడా క్షుద్బాధ తప్పలేదు. ఈ బాధ తట్టుకోలేక ఒక రోజు బ్రహ్మ దగ్గరకు వెళ్లి.. నేను గొప్ప తపస్సు చేసి దైవత్వాన్ని పొంది స్వర్గానికి వచ్చాను. కానీ నాకు ఆకలి బాధ తప్పలేదు. స్వర్గంలో ఉన్న మిగలిన వారికి ఆకలి ఉండదు కాబట్టి ఇక్కడ తినడానికి ఏమీ దొరకడంలేదు. ఈ బాధ తప్పే ఉపాయం చెప్పండి స్వామి అని వేడుకున్నాడు.

శ్వేతుడి మాటలు విన్న బ్రహ్మ.. రాజా! నువ్వు తపస్సు చేసి దైవత్వాన్ని పొంది స్వర్గానికికి వచ్చావు. కానీ, ఎవ్వరికీ లేని ఆకలిబాధ నీకు కలగడానికి కారణం నువ్వు ఎవరి ఆకలి బాధను తీర్చలేదు. ఎవరికైనా కనీసం పట్టెడు అన్నం పెట్టలేదు. దాహంతో అలమటించిన వారికి చుక్క నీరు కూడా ఇవ్వలేదు. దానాల్లో కెల్లా అన్నదానం గొప్పది. అది నువ్వు చేయలేదు. అందుకే ఇది నిన్ను ఇప్పుడు బాధిస్తోంది.. దాన్ని నువ్వు తెలుసుకుంటున్నావని అన్నాడు.

దీనికి మార్గం లేదా? బ్రహ్మదేవా.. నన్ను రక్షించండని శ్వేతుడు వేడుకున్నాడు. నువ్వు భూలోకం వెళ్లి నీ పార్దివకాయం ఎక్కడుందో వెతికి, దానిని రోజూ కొద్ది కొద్దిగా తిని ఆకలి బాధ తగ్గించుకో... నువ్వు ఎంత తిన్నా ఆ భాగం మళ్లీ పెరుగుతుంది. అది ఎప్పటికి తరగదని అన్నాడు బ్రహ్మ. అలా నేను ఎంతకాలం తినాలని మళ్లీ సందేహంతో అడగ్గానే అగస్త్య మహర్షి నీ దగ్గరకు వచ్చి పలకరించేవరకు తింటూనే ఉండాలని విధాత బదులిచ్చాడు.

బ్రహ్మ చెప్పినవిధంగా శ్వేతుడు భూలోకం వెళ్లి తన శవాన్ని వెతికి రోజూ ఆకలి తీరాక తిరిగి వస్తున్నాడు. మర్నాడు వెళ్లేసరికి ఆ భాగం మళ్లీ అలాగే ఉంటుంది. అది కూడ కుళ్లిపోకుండా, మనిషి నిద్రపోతున్నట్టే ఉంటుంది. ఒకరోజు శ్వేతుడు ఆ శవాన్ని కోసుకుని తింటుండగా అటువైపుగా వచ్చిన అగస్త్య మహర్షి అది చూసి ఆశ్చర్యపోయాడు. అక్కడకు వచ్చి శ్వేతుడిని పలకరించాడు. అంతట ఆగస్త్య మహర్షిని చూసి మహాత్మా! నా జన్మ ధన్యమైంది.. నా ఆకలి బాధ తీరింది. ఈ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో అనుభవంతో తెలుసుకుని చేసిన తప్పును అర్ధం చేసుకున్నాను" అని నమస్కరించి స్వర్గానికి తిరిగి వెళ్లిపోయాడు.

దీనిని బట్టి ఆకలి అన్నవారికి అన్నం పెట్టడం, దాహం అన్నవారికి నీళ్ళివ్వడం ప్రతి మనిషి చేయాల్సిన కనీస ధర్మం. అన్ని దానాలకన్నా అన్నదానం గొప్పది. 1000 ఏనుగులు, కోటి ఆవులు, లెక్కకు మిక్కిలి బంగారం, వెండి, భూములు, జీవితం మొత్తం ఓ వంశానికి సేవ చేయడం, కోటి మంది మహిళలకు వివాహం చేసినా అన్నదానానికి సాటిరావు.
 🙏🙏🙏🙏🙏

కలియుగం తీరు

⚜️ శ్రీ కృష్ణ భగవానుడు చెప్పిన కలియుగం తీరు⚜️

#ఒకసారి ధర్మరాజు లేని సమయంలో మిగిలిన నలుగురు పాండవులు శ్రీకృష్ణుని కలియుగం ఎలా ఉంటుంది అని అడిగారు.
శ్రీకృష్ణుడు నవ్వి చూపిస్తాను చూడండి అన్నాడు. నాలుగు బాణాలు నాలుగు దిక్కులకు వేసి తలో దిక్కు వెళ్లి ఆ బాణాలను తెమ్మన్నాడు. నలుగురు పాండవులు తలో దిక్కుగా ఆ బాణాలను #వెదుక్కుంటూ వెళ్లారు.⚜️🌷🌹

#అర్జునుడికి బాణం దొరికింది. ఇంతలోనే ఒక మధుర గానం
#వినిపించి అటు తిరిగాడు. ఒక కోయిల మధురంగా పాడుతూ బ్రతికున్న ఒక కుందేలును పొడచుకు తింటోంది. అర్జునుడు నివ్వెర పోయాడు. తిరిగి #కృష్ణుడి దగ్గరకు బయలు దేరాడు.🍁🍀

#భీముడికి బాణం దొరికిన చోట నిండుగా నీళ్లున్న నాలుగు బావుల మధ్య ఒక ఎండి పోయిన బావి కనిపించింది. ఆశ్చర్య పోయాడు. కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు.🌸🌷🌹

#నకులుడికి బాణం దొరికిన చోట ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగ దూడను గాయాలయ్యేంత విపరీతంగా నాకుతోంది. చుట్టూ వున్న జనం అతి కష్టమ్మీద ఆవు దూడలను విడదీశారు. నకులుడికి #ఆశ్చర్యమేసింది. వెనుదిరిగాడు.🌷🌸🌷

#ఇక సహదేవుడికి బాణం దొరికిన చోట ఒక పర్వతం పై నుండి ఒక పెద్ద గుండు దొర్లుతూ దారిలో ఉన్న చెట్లను పడవేస్తూ వచ్చి ఒక చిన్న మొక్క దగ్గర ఆగిపోయింది. సహదేవుడికి అర్థం కాలేదు. #నలుగురూ కలిసి శ్రీకృష్ణుని తమ సందేహాలు అడిగారు. ఆయన చెప్పనారంభించాడు. కలియుగంలో గొప్ప జ్ఞానులైన వారు కూడా కుందేలును కోయిల పొడుచుకు తిన్న రీతిగా #భక్తులను దోచుకుంటారు.⚜️🌷🌹

#కలియుగంలో అత్యంత ధనికులు కూడా పేదలకు పైసా సాయం చేయరు.🍀🌹
#కలియుగంలో ఎలాగైతే ఆవు దూడకు గాయాలయ్యేంతగా
#నాకిందో తలిదండ్రులు తమ పిల్లలను గారం చేసి వాళ్ల జీవితాల్ని నాశనం చేస్తారు.🌷🌹🍀

#కలియుగంలో జనులు మంచి నడవడి కోల్పోయి కొండ మీద నుంచి గుండు దొర్లినట్లుగా పతనం అవుతారు. భగవన్నామమనే చిన్న మొక్క తప్ప #ఎవరూ కాపాడ లేరు.🌷⚜️🌷⚜️

🙏⚜️🌷ధర్మో రక్షిత రక్షితః ⚜️🌷

పరిస్థితులు

🌺పరిస్థితులు ఎల్లప్పుడు *మారుతూనే* ఉంటాయి చక్కని *బంధం* మంచి *స్నేహం* ఎప్పటికి *మారవు*.

   🌺 *అర్థం* చేసుకోకుండా ఎవరినీ ఎంచుకోకు *అపార్థం* చేసుకుని ఎవరినీ *దూరం* చేసుకోకు.

    🌺 అన్ని కోల్పోయిన *ఆత్మ విశ్వాసాన్ని* మాత్రం కోల్పోకు ఇదొక్కటే ఉంటే *చాలు* నువ్వు ఎన్ని *కోల్పోయిన* అన్ని తిరిగి *సంపాదించవచ్చు*.

 🌺 *సంతోషం* అనేది *పది వేలు* ఖర్చుపెట్టి *పది ఊర్లు* తిరిగితే రాదు *మన* అనుకునే వారితో *పది నిమిషాలైనా* మనసువిప్పి మాట్లాడితే *నిజమైన* సంతోషం దొరుకుతుంది.

క్రోధమే

క్రోధమే యముడు.
లోభమే వైతరణీ నది.
తృప్తే నందనవనం.
శాంతియే కామధేనువు.
సకల సద్గుణాలను హరించేది క్రోధమే.
కాబట్టి క్రోధాన్ని పరిత్యజించు.
-

*శ్రీ వామన మహా పురాణం

_*శ్రీ వామన మహా పురాణం - 18 వ అధ్యాయం*_

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

బ్రహ్మర్షే ! ఆశ్వయుజ మాసంలో జగన్నాధుని నాభి నుండి పద్మం పుట్టంగానే యితర దేవతలు నుంచి కూడా ఆయా పుష్పాదులుధ్భవించాయి. కామదేవుని కరాగ్రాన్నుంచి సుందరమైన కదంబం పుట్టింది. ఆమన కాపుష్పమంటే ఎంతో ప్రీతి. యక్షేశ్వరుడైన మణిభద్రు నుంచి వటవృక్షం పుట్టింది; ఆయనకా వృక్షమంటే ఎంతో ప్రేమ, పరమ శివుడు తన హృదయాన్నుంచి ఉద్భవించిన ఉమ్మెత్తను ఎప్పుడూ ప్రేమిస్తాడు. బ్రహ్మ శరీర మధ్య భాగాన్నుంచి అవతరించిన మరకతవర్ణపు ఖదిరవృక్షాన్ని విశ్వకర్మనుంచి పుట్టిన కంటకీవృక్షాన్ని ఆయాదేవతలు ప్రేమిస్తారు. పార్వతి ఆరచేతి నుంచి కుంద (మల్లె) పొద, గణాధిపుని చెంపల నుండి సింధువారకం, యముని దక్షిన పార్శ్వం నుండి పాలాశం, దక్షిణోత్తరాలనుండి నల్లమేడి, రుద్రునిదేహంనుండి క్షోభం కలిగించే వృషవిటపం కుమారస్వామినుండి బంధుజీవనం, సూర్యునినుండి ఆశ్వత్థ (రావి) చెట్టు, కాత్యాయనివల్ల జమ్మిచెట్టు, మహాలక్ష్మి చేతినుండి బిల్వ (మారేడు) వృక్షం ఉద్భవించాయి. నాగుల అధిపతినుంచి రెల్లుదుబ్బు, వాసుకి విశాలమైన తోకనుండి వీపునుండి తెల్ల, నల్లగరిక (దూర్వా), సాధ్యుల హృదయాలనుంచి హరిచందన వృక్షములు ఉద్భవించాయి. తమనుండి కలిగిన వృక్షాదులు ఆయా దేవతలకు ప్రీతిపాత్రాలయినాయి.

అలాంటి రమణీయమైన శుభ సమయాన, శుక్ల పక్ష ఏకాదశినాడు తమ కొరతలు తీరుటకై విష్ణుదేవుని పూజింపవలె. శరదృతువు ప్రవేశించే వరకు పుష్పపత్రఫల, గంధాదులతోను, వర్ణరస ముఖ్య ఓషదులతోను శ్రియఃపతిని చక్కగా పూజించాలి. నేయి తిలలు బియ్యం యవలు, బంగారం, వెండి మొదలయినవి, మణులు, ముత్యాలు పవడాలు, వివిధ వస్త్రాలు. తీపి పులుపు మొదలయిన షడ్రసోపేతాలయిన వస్తువులను ఆఖండాలుగా (తుంచకుండా) సేకరించి మహాత్ముడగు కేశవునకు నివేదనం చేయాలి. ఈ విధంగా సంవత్సరం పూర్తిఅయిన వెంటనే ఆ గృహంలో సర్వసమృద్ధులు వర్షిస్తాయి. నారదా! ఉపవాసంచేసి మరునాడుదయం జితేంద్రియుడై సంవత్సరకాలం నిర్విఘ్నంగా జరిగేందుకు ఈ చెప్పిన విధంగా స్నానం చేయాలి. సువాసనగల తెల్ల ఆవాలుగాని నువ్వులుగాని పిండిచేసి దేహానికి నలుగు పెట్టుకొని స్నానంచేయాలి. విష్ణుదేవుని నేతితో ఆభిషేకించాలి. నేతితోనే హోమంచేసి తన శక్తిననుసరించి ఘృతదానంచేయాలి. తదనంతరం పద్మ నాభుని కుసుమాలతో మొదట పాదాలను తర్వాత దేహమంతటను అర్చించాలి. రకరకాలయిన పరిమళ ధూపలువేయాలి. ఆ విధంగా ఆ సంవత్సరం పరమపవిత్ర మౌతుంది. ఆనంతరమాజగన్నాథుని స్వర్ణరత్నాలతోను చీని చీనాంబరాలతో నలంకరించి మిష్టాన్నం రుచ్యములైన చోష్యహవిష్యాదులు నైవేద్యం చేయాలి. మునిశ్రేష్ఠా! ఇలా సమర్పించిన తర్వాత నా జగత్పతిని ఈ విధంగా సమంత్రకంగా కీర్తించాలి.

''ఓ పద్మనాభ! పద్మావతీ! మహాద్యుతీ! నీకు నమస్కారము! వికసించిన తామర రేకుల వంటి కన్నుల వాడా! నీవేవిధంగా పరిపూర్ణుడవై సర్వత్రా నిండియున్నావో అలాగే నేను ఆచరించు ధర్మార్థ కామ మోక్షాలు, ఆఖండంగా పరిపూర్ణత్వాన్ని కలిగియుండునట్లు అనుగ్రహించుము కేశవా!''ఈ విధంగా ఉపవాసియై ఇంద్రియ నిగ్రహంతో ఆ సంవత్సర వ్రతం నిర్వహిస్తే గృహస్థు సర్వ విషయాలలోనూ పూర్ణత్వాన్ని సిద్ధింప చేసుకుంటాడు. ఈ విధంగా వ్రతమాచరించినచో దేవతలందరు సంతోషించెదరు. అలాంటి వ్రతం చేసినవానికి చతుర్విద పురుషార్థాలు పూర్ణంగా సిద్దిస్తాయి. వారణా ! అర్థార్థులైన వారలకు నిర్ణయించబడిన వ్రతాలను నీ కెరిగించితిని. ఇక సర్వమంగళకరమైన విష్నుపంజర స్తోత్రం వినిపించెదను.

*శ్రీ విష్ణు పంజర స్తోత్రమ్‌ :*

నమోనమస్తే గోవింద చక్రంగృహ్య సుదర్శనమ్‌ | ప్రాచ్యాంరక్షస్వమాంవిష్ణో త్వామహం శరణంగతః

గదాంకౌమోదకీంగృహ్య పద్మనాభామితద్యుతే | యామ్యాంరక్షస్వమాం విష్ణో త్వామహం శరణం గతః.

హలమాదాయసౌనందం నమస్తే పురుషోత్తమ | ప్రతీచ్యాంరక్షమే విష్ణో భవంతం శరణంగతః

ముసలంశాతనంగృమ్యపుండరీకాక్ష రక్షమామ్‌ | ఉత్తరస్యాం జగన్నాథ భవంతం శరణంగతః

శార్జమాదాయచధనురస్త్రం నారాయణం హరే | నమస్తేరక్షరక్షోఘ్న ఐశాన్యాం శరణం గతః

పాంచజన్యంమహాశంఖ మంతర్బోధ్యం చ పంకజమ్‌ | ప్రగృహ్యరక్షమాంవిష్ణో ఆగ్నేయ్యాం యజ్ఞసూకర.

చర్మసూర్యశతంగృహ్య ఖడ్గం చంద్రమసంతధా | నైర్‌ ఋత్యాంమాంచ రక్షస్వ దివ్యమూర్తే నృకేసరిన్‌.

వైజయంతీంప్రగృహ్యత్వం శ్రీవత్పం కంఠభూషణమ్‌ | వాయవ్యాంరక్షమాందేవ అశ్వశీర్ష నమోస్తుతే.

వైనతేయం సమారుహ్య అంతరిక్షేజనార్దన | మాంత్వరంరక్షాజిత్‌ సదా నమస్తే త్వపరాజిత.

విశాలాక్షంసమారుహ్య రక్ష మాంత్వం రసాతలే | ఆకూపార నమస్తుభ్యం మహామోహ నమోస్తుతే.

కరశీర్సాంఘ్రిపర్వేషుతథా೭ష్టబాహుపంజరమ్‌ | కృత్వారక్షస్వమాందేవ నమస్తే పురుషోత్తమ.

ఏతదుక్తంభగవతావైష్ణవం పంజరం మహత్‌ |
పురా రక్షార్థమీశేన కాత్యాయన్యా ద్విజోత్తమ.

నాశయామాస సా యత్ర దానవం మహిషాసురమ్‌ |
 సమరం రక్తబీజం చ తథాన్యాన్‌ సురకంటకాన్‌.

గోవిందా ! నీకు నమస్కారం. నీకు శరణాగతుడను. సుదర్శన చక్రం ధరించి విష్ణో! నీవు నన్ను తూర్పన రక్షించుము. అమిత తేజస్వియైన పద్మనాభా! కౌమోదకి గదను ధరించి నన్ను దక్షిణ దిశన రక్షించుము. విష్ణో ! నీకు శరణాగతుడను. నీకు నమస్కారము. పురుషోత్తమా! నమస్కారము. సౌనందహలాన్ని ధరించిన విష్ణూ! పశ్చిమ దిక్కున నన్ను రక్షించుము. నీకు శరణాగతుడను ! పుండరీకాక్ష ! ఉత్తమమైన నీ ముసలాయుధంతో ఉత్తరాన నన్ను రక్షింపుము. జగన్నాథా ! నీకు శరణాగతుడును. ఓ రాక్షస నాశకా ! శార్‌ఙ్గ ధనస్సును నారాయనాస్త్రాన్ని ధరించి నన్ను ఈశాన్య దిశన రక్షింపుము. నీకు శరణాగతుడను. ఓ విష్ణూ యజ్ఞ పురుషా ! పాంచజన్య శంఖాన్ని అంతర్బోధ్య కమలాన్ని ధరించి నన్ను ఆగ్నేయ దిక్కున రక్షింపుము. ఓ నరసింహ ప్రభూ ! దివ్యమూర్తీః సూర్యశతమనే డాలును చంద్రమస ఖడ్గాన్ని ధరించి నైరృతి దిక్కున నన్ను రక్షింపుము. వైజయంతీమాలను శ్రీవత్సాంకాన్ని ధరించిన ఓ హయగ్రీవ ప్రభూ ! వాయవ్య దిశన నన్ను రక్షించుము. నీకు నమస్కారము. జనార్దనా! గరుడ వాహనారూఢుడవై నన్ను అంతరిక్షంలో రక్షింపుము. అజితా అపరాజితా! నీకు సదానమస్సులు! విశాలక్షాన్ని అధిరోహించిన నన్ను పాతాళంలో రక్షించుము! అకూపారా! మహామోహ! నీకు నమస్కారము! అష్టబాహు పంజర రూపాన నా శరీరంలోని చేతులు, తల, పాదాలు, మడమలు మొదలగు వానిని రక్షింపుము. పురుషోత్తమ దేవా! నీకు నమస్కారము! ఈ విధంగా ఈ విష్ణు పంజర స్తోత్రం పూర్వం శివుడు రక్ష కొరకై కాత్యాయనికి చెప్పాడు. ఓ బ్రహ్మణోత్తమా! దీని ప్రభావం వల్ల ఆ మహాదేవి మహిషాసురునీ, నమరుడు, రక్తబీజుడు తదితరు లెందరో దానవులను సుర కంటకులను నాశనం గావించింది.

*నారదుడనెను -*
దేవకంటకులైన మహిషదైత్యునీ నమర, రక్తబీజులను వధించిన ఆకాత్యాయని ఎవరు ? ఆ మహిషుడెవడు ? అతడు పుట్టిన వంశమేది? ఆనమర రక్తబీజులెవరి కుమారులు ? మహర్షే ! ఈ విషయాలన్నీ నాకు వివరంగా చెప్పండి.

*పులస్త్యుడిట్లనెయె -*

ఓమునీ ! ప్రాచీనకాలాన జరిగిన పాపాపహారి అయిన కథ చెబుతున్నా వినుము. సమస్తమైన వరాలు ప్రసాదించ దుర్గయే యా కాత్యాయని. పురాసమయాన, జగత్తు నంతా సంక్షోభింపజేసే యిద్దరు రాక్షసులు, మహాబలశాలురు ఉండేవారు. వారు రంభుడు కరంభుడు. అపుత్రకులైన వారు పుత్రప్రాప్తి కొరకు పంచనదీ జలాలలో మునిగి చాలా ఏండ్లు తపస్సు చేశారు. వారిలో కరంభుడు జలమధ్మంలో, రంభుడు అగ్ని మద్యంలో ఉండి, మాలవట యక్షుని గూర్తి తపించారు. కరంభుడు నీటిలో మునిగిపోగా యింద్రుడు మకర రూపానవాని కాళ్ళు పట్టుకొన లాగికొని పోయి తన కోరిక మేరకు వధించెను. సోదరుని చావునకు కోపించి రంభుడు తన తల నరికి అగ్ని లోవేల్చ సంకల్పించెను. తన జుట్టు ఒక చేతపట్టుకొని రెండవ చేతితో మెరిసిపోతున్న ఖడ్గం గ్రహించి తల నరుకుకొనబోగా రంభుని అగ్ని వారించి యిట్లనెను - రాక్షసేశ్వరా ! తన్ను తాను చంపుకొనుట మంచిదికాదు. పరహత్యాపాతకం కంటే ఆత్మ హత్యాపాతకం భయంకరమైనది. దుస్తరమైనది. చచ్చిన వానినెవడూ పట్టించుకోడు. నీ కోరికయేదో చెప్పుము. నేను నెరవేర్చగలను. అప్పుడు రంభుడు - ''ఓ అగ్నీ! నాకు వరమివ్వదలచుచో నీకంటే తేజస్వి, దేవతల కజేయుడు, నరదైత్యుల కవధ్యుడు వాయువునకు వలె బలవంతుడు, కామరూపుడు సర్వాస్త్రకోవిదుడు, త్రిలోక విజయం సాధించ గలిగిన పుత్రుని దయచేయుమ'' నియెను. అందుకు అగ్ని ''తప్పకుండా లాగే జరుగగలదు. నీకు, ప్రియురాలైన వనితయందు అలాంటి పుత్రునికను''మని వచించెను.

*ఇతి శ్రీ వామనమహాపురాణ అష్టాదశోధ్యాయః*

అగ్నిదేవుని యాదేశాను సారం, అనేక మంది యక్షులతో పరివేష్టితుడైయున్న మాలవట యక్షుని చూచుటకై ఆదానవుడు వెళ్ళిపోయెను. ఆ ప్రదేశాన గజాశ్వ మహిషములు గోవులు మేకలచే పరివృతుడై యుండియు అనన్య చిత్తుడైన పద్మనిధి నివసించుచుండెను. వాటి మధ్య ఉన్నటు వంటి మూడేండ్ల వయస్సు గలిగి అందముగానున్న ఆడు మహిషాన్ని చూచి ఆదానవుడు మోహితుడాయెను. ఓ మునీ ! విధి విధానం వల్ల ఆ ఆడుమహిషం గూడ ఆరాక్షసునితో సంగమించుట కై త్వరగా ఆతనిని సమీపించగా వాడు దానితో రమించెను. వెంటనే అది గర్భం ధరించగా దానిని తీసికొని అతడు పాతాళంలో తన భవనానికి జేరెను. అతడు చేసిన అకార్యానికి తోడి రాక్షసులాతనిని బరిత్యజించగా అతడచ్చోటు వదలి తిరిగి మాలవటం చేరెను. ఆ మహిషి గూడ పతిని అనుగమించి ఆ యక్షమండలమునకు వెళ్ళెను. వారక్కడ ఉండగా నా నల్లని మహిషి ఒకనాడు చక్కని అందమైన దున్నపోతును ప్రసవించెను. అది కామరూపి. ఒకనాడా మనిషి ఋతుమతి అయి ఉండగా మరొక మహిషం (మగది) దానిని చూచి మోహంతో వెంబడించగా నాశ్యామ తన శీలమును రక్షించుకొనుట కై భర్తయైన రాక్షసుని సమీపించెను. మోర ఎత్తుకొని వెంటబడిన ఆ దున్నపోతు మీదకు ఆ రాక్షసుడు కత్తిదూసి లంఘించెను. అంతట నా దున్నపోతు తన కొమ్ములతో రాక్షసుని గుండెల్లో కుమ్మగా హృదయం చీలిపోయి వాడు మరణించెను. తన భర్త మరణించడంతో నా మహిషి యక్షులను శరణుజొచ్చెను. యక్షులచేత నివారింపబడిన ఆ దున్నపోతు మోహాతిరేకంతో చేయునది లేక సమీపంలో ఉన్న ఒక దివ్య సరస్సులోబడి చనిపోయి ఒక రాక్షసుని రూపం ధరించెను. ఆ బలపరాక్రమ సమన్వితుడైన రాక్షసుడే నమరుడుగా ఖ్యాతి చెందాడు. అతడు ఆ యక్షుల మరుగున జేరి అక్కడ నున్న జంతువుల నెల్లను బార ద్రోలెను. అంతట మాలవటాది యక్షులు చనిపోయిన రాక్షసుని చితిపై చేర్చగా నాశ్యామ మహిషి తనపతితో చితాగ్నిలో బడిపోయెను. అంతట నా చితాగ్ని మధ్యం నుండి రౌద్రాకారుడగు పురుషుడొకడు బయలుదేరి ఖడ్గపాణియై ఆ యక్షులనందరను వెళ్ళగొట్టెను. ఆ వీరుడు రంభనందనుడైన మహిషుని వదలి మిగిలిన మహిషములనన్నింటిని వధించెను. ఓ మహామునీ! ఆతడే రక్తబీజుడు. వాడు యింద్రరుద్ర సూర్య మరుత్తులతో సహా దేవతలనందరను జయించాడు. ఆ రాక్షస వీరులంతటి పరాక్రమవంతులు. అయితే వారందరిలోను మహిషాసురుడు గొప్పవాడు. శంబరుడు, తారకుడు మొదలయిన వారలనందరను జయించినాడు. వారందరు నాతనిని తమ ప్రభువుగా అభిషేకించారు. ఆతని ధాటికి నిలువలేక లోకపాలకులందరు సూర్యచంద్రాగ్నులతో సహా తమతమ స్థానాలు వదలి పారిపోయారు. ధర్మానికి స్థానం అంటూ లేకుండా పోయింది.

*ఇది శ్రీ వామనమహాపురాణంలో పదునెనిమిదవ అధ్యాయం సమాప్తం.

అద్వైతతత్త్వము



భగవానుడు భారతయుద్ధంలో పార్థసారథియై అర్జునుని రథం తోలాడు. అర్జునుడు దయార్ద్రచిత్తుడై శోకగ్రస్తుడు కాగా భగవంతు డతణ్ణి ఈ చందంగా మందలించాడు.

క్లైబ్యం మాస్మ గమః పార్థ నై తత్త్వయ్యుపపద్యతే,
క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్యోత్తిష్ఠ పరంతప.

పరంతప్సశత్రువులకు మంటెత్తించే శక్తిగల ఓ అర్జునా! క్లైబ్యం మాస్మ గమ్సఃమగటిమిని కోలుపోకు. గుండెలు జారిపోనీకు. కయ్యం పోవడానికి సిద్ధపడే వచ్చావ్. ఇపుడు వెనుదీయడ మెందుకు?

'యుద్ధం పాపం, కయ్యానికి నడుంకట్టిన నా గురువులు పెద్దలు అన్నలుతమ్ములు వీరి నందరిని నే నెట్లా చంపేది? కనుక యుద్ధం చేయను' అని అతడు దుఃఖముచేత వికలుడై రథమ్మీద కూలబడ్డాడు. అప్పుడు శ్రీకృష్ణుడు పయిని చెప్పినట్టులుగా మందలించాడు.

ఇంకా ఈ రీతిగా బోధింపడానికి పూనుకొన్నాడు. నీవు భీష్ము డనిన్నీ ద్రోణు డనిన్నీ కర్ణు డనిన్నీ ఎవరిని అంటావో వారొకనా డుంటే మర్నాడు పోయేవారే. శరీరాలకు భీష్ముడు ద్రోణుడు అనే పేరు లేదు. ఆత్మ ఖండింపబడదు. అగ్ని ఆత్మను కాల్పలేదు, 'పావకః ఏనం న దహతి' నీరు దీనిని తడపలేదు, 'ఆపః ఏనం న క్లేదయంతి.' గాలి దానిని ఎండిపోయేట్లు శోషించేట్లు చేయలేదు. ''మారుతః న శోషయతి''

అచ్చేద్యోయమదాహ్యూయ మక్లేద్యోశోష్యేవ చ,
నిత్య స్సర్వగతఃస్థాణు రచలోయం సనాతనః.

దీనిని ఖండింపనూ మండింపనూ ఎండింపనూ తడిముద్దగాచేసి పారేయనూ వీలుకాదు. ఇది శాశ్వతమైనది. పాము కూసాన్ని వదిలిపెటుతుంది. ఇంకో కూసం వస్తుంది. ఆలాగే ఒక శరీరం పోతే ఇంకో శరీరం వస్తుంది. పోయేది శరీరమే. ఆత్మమాత్రం నిత్యం. ఆత్మ అనేది భీష్ముడు ద్రోణుడు అని నీవు చెప్పేవారి శరీరంలో ఉండి తెలిసికొనే చైతన్యమే. పోయేది వచ్చేది దేహమే. దేహం పోతే యేం? ఇంకో దేహం వస్తుంది. విదేహస్థితిలో ఉండేది ఆనందమే. అదిలేక ఆత్మ, 'అయం నిత్యః సర్వగతః స్థాణుః అచలః సనాతనః' అతడు నిత్యుడు, అనగా మూడు కాలాలలోనూ ఉండేవాడు. సర్వగత్సఃఎక్కడబడితే అక్కడ ఉండే వ్యాపకుడు. స్థాణ్సుఃస్థిరమయినవాడు, నిలుకడ అయినవాడు. అచల్సఃచలనము లేక కదలు లేనివాడు. సనాతన్సఃఎల్లయపుడును ఉండెడివాడు. అందుచేత ఈ భీష్మద్రోణాదులు నీ బాణాదులచే చచ్చిపోతారని అనుకొని గడబిడ పడకు. అని శ్రీకృష్ణుడు అర్జునునికి జ్ఞానోపదేశం చేశాడు.

అర్జునుని ప్రశ్న ఏమిటి? పూజింపదగిన భీష్మద్రోణాదులను నేను బాణాలచే ఎట్లా బాధిస్తాను? అన్నలూ బావమరదులూ ఆచార్యులున్నూ కదా నాకు శత్రువులు. వారిని చంపి జయము పొందితే కలిగే లాభం ఏమిటి? రాజ్యం ఒకటేకదా? కావలసినవారు చుట్టపక్కాలు గురువులు గురుపుత్రులు ఇందరూ చచ్చిపోతేగాని రానిరాజ్యం వస్తేనేం పోతేనేం? గురువులను చంపకుండా బిచ్చమెత్తి అయినా పొట్ట పూడ్చుకోవచ్చును. కాని 'నెత్తురుతో తడిపిన అర్థకామాదులను అనుభవించడం ఎట్లా? అని అర్జునుడు తన మనసులోని వ్యథను వెళ్ళబెట్టాడు. 'నెత్తుట తడిసిన' కూడు అంటానికి ఆంగ్లంలో 'బ్టడ్ స్టెయిన్ డ్' అని అంటారు. అర్జునుడు 'దేహమే ఆత్మ' అని అనుకొని ప్రశ్నించాడు. శ్రీకృష్ణుడు తగినచందంగా ప్రత్యుత్తరం చెప్పదలచి-ఓయీ! నీవు ద్రోణుడూ భీష్ముడూ అనేది వారి దేహాలనా లేక వారి ఆత్మలనా? శరీరం నాశనంకావచ్చు, పుట్టిన వస్తువేనాడో గిట్టవలసిందే. ఏదయినా విత్తునాటితే ఈనాడు మొలకెత్తి పెరిగి ఏనాడో మళ్ళా గిట్టవలసినదే. మనం చూస్తూండగానే ఎండి పడిపోతుంది. అలాగే శరీరం కూడా పడిపోతుంది. లోపల ఉండే ఆత్మ అవినాశి. దానికి చావు పుట్టుకలులేవు.

అవినాశి తు తద్విద్ధియేన సర్వమిదం తతమ్,
వినాశ మవ్యయస్యాస్య నకశ్చిత్కర్తు మర్హతి.
- గీత. 2-17

ఏ వస్తు వీ ప్రపంచ మంతా నిండి ఉందో ఆ వస్తువు నాశరహితమయిన దని తెలిసికో. మార్పు లేని వస్తువును నాశనం చేయడ మనేది కాని పని. దేనిచేత ఈ ప్రపంచమంతా నిండి తొణికిసలాడుతూందో దానికి నాశమనే మాటలేదు.

ఏ వస్తువు లోకమంతా నిండి ఉంది అని అంటే అంతటికీ అంతర్యామియైన వస్తు వీశ్వరుడే అని చెప్పవలసి వస్తుంది. ఆతడే నాశం లేనివాడు నిత్యుడు చావుపుట్టులు లేనివాడు. శరీరం లోపలా వెలుపలాఉండే దతడే. అతడే లోపల ఉండి 'నేను నేను' అని తోచే అహంభావంతో కూడియున్న వాడు. ఆయన తప్ప వేరే వస్తువు మరిలేదు. సర్వగతమయిన అట్టి వస్తువుకు నాశంలేదు. అందుచేత వారినీ వీరినీ నాశనం చేస్తున్నానే అనే సందేహం అక్కరలేదు. వీరి ఆత్మ అవినాశి. నశించేది దేహమే. ఆత్మ అన్ని శరీరాలలోనూ ఉండే వస్తువే. అదే యీ భీష్మ ద్రోణాదుల శరీరంలోనూ ఉంది. నీవు చంపేది వారి దేహాలను. వారి ఆత్మలను నీవు నాశనం చేయలేవు' ఈతత్త్వం నీవు తెలిసికో అని భగవానుడు అర్జునుడు ఉపదేశం చేశారు.

ఒక స్విచ్ నొక్కితే అన్ని దీపాలూ వెలుగుతై. ఆ దీపాలు కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి' వీనికన్నిటికీ మూలమయిన శక్తి ఒక్కటి. ఒక దీపం పగిలిపోయినంతమాత్రాన మూలశక్తి మాయమవుతుందని ఎవరయినీ అనగలరా? ఇట్లే జ్ఞానమయంగా అన్ని చోటులా అఖండంగా వ్యాపించియున్న శక్తి శరీరాలనుండి బుద్ధిరూపంగా వ్యాపించి వుంది. మహామతుల ఆత్మ మహాత్మగా అల్పమతుల ఆత్మ అల్పాత్మగా అవుతూంది. అట్టి వస్తువు నీచే ఎట్లా చంపబడుతుంది. నేను చంపుతాను అని అనుకోవడము తప్పే. కనుక నీ ధర్మం చెయ్.

దేహినో స్మిన్ యథా దేహే కౌమారం ¸°వనం జరా,
తథా దేహాంతర ప్రాప్తిః ధీర స్తత్ర న ముహ్యతి.
- గీత. 2-13

జీవుడు వేరువేరుగా అన్ని శరీరాలలోనూ ఉన్నాడు. అంతటా వ్యాపకంగా ఏకశరీరంగా లేకపోయినా అనేక భేదాలుగా ఉన్న శరీరాలలో ఉన్నా, ఈ శరీరంలో కౌమారమూ ¸°వనమూ వార్ధకమూ అనే మార్పులు కలగడం లేదా? అలాగే చచ్చి మరొక శరీరం పొందడము గూడా ఒక మార్పే, శరీరం నశించినప్పుడు తాను నశించడం లేదని తెలిసికొన్న జ్ఞాని ఇదంతా చూచి భ్రమపొందడంలేదు.

జాతస్య హి ధ్రువో మృత్యుర్ ధ్రువం జన్మ మృతస్య చ,
తస్మా దపరిహార్యేర్ధే న త్వం శోచితు మర్హసి.
- గీత. 2-27

పుట్టినవాడు గిట్టటం నిక్కం. అలాగే చచ్చినవాడున్నూ పుట్టటమున్నూ నిక్కమే. కనుక తప్పించుకోరాని విషయం పట్ల మనకు శోకం ఎందుకు? ఏ కారణంవల్ల నయినానేమి ఎన్నడూ వీరందరూ చచ్చిపోవలసినవారే, అందుచేత వారి కొరకు నీవు నీధర్మం ఎందుకు పోగొట్టుకోవాలి! అలాఐతే నీకు ధర్మచ్యుతి కలుగుతుంది. ధర్మయుద్ధానికి మించిందేదీ లేదు. నీవు చంపబడతావా వీరస్వర్గం సంపాదిస్తావు-'హతో వా స్వర్గం ప్రాప్యసి', జయం పొందుతావా రాజ్యమేలుతావ్. 'జిత్వా వాభోక్ష్యసే మహీమ్'. ఎట్లా అయినా శ్రేయమే. ఇట్లా కాక యుద్ధవిముఖుడవయితే ధర్మం నెరవేర్పలేక ధైర్యం చాలక పారిపోయాడనే వాదు నీ వెంటనే ఉంటుంది.

అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయామ్,
సంభావితస్య చాకీర్తిర్మరణా దతిరిచ్యతే.
- గీత. 2-34

అదియుగాక జను లందరూ నీ అపకీర్తిని చాలాకాలం ఘోషిస్తూనే ఉంటారు. ఎన్నిక అయినవానికి అపకీర్తి చావుకంటె ఎక్కువ శోకం కలిగిస్తుంది. పోనీ నీవు యుద్ధం చేయక పరుగెత్తిపోతే వీరి శరీరాలు శాశ్వతాలా? అట్టిది లేదే! కనుక శరీరాలనుగూర్చి నీవు చింతపడక కయ్యానికి నడుంకట్టు. శ్రీకృష్ణభగవాను లిట్లా-''తస్మాద్యుధ్యస్వ భారత'' కనుక యుద్ధం చెయ్! అని ముగించారు.

భగవంతు డొకపుడు అద్వైతసరళిలో మాటాడతారు. మరొకవుడు మీమాంసకుల రీతిగా చర్చ చేస్తారు. ఇట్లా ఇన్ని విధాలుగా చర్చ చేస్తే మనం దేన్ని పట్టుకోవాలి? వారే ఇలా ఇంకో శ్లోకం చెప్పారు -

యావా నర్థ ఉదపానే సర్వత స్సంప్ణుతోదకే,
తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః

ఈ శ్లోకానికి అర్థం ఏమిటి అని పరిశీలిస్తే మొదట మొదట మనకు ఏ అర్థమూ గోచరించదు. ఉదపాన మంటే తాగే నీరు. బావులలో గుంటలలో చెరువులలో మనకు తాగేనీళ్లు దొరకుతయ్. వీనివల్ల మనకు ఏప్రయోజనం కలుగుతుందో నీటి వెల్లువలు వచ్చినా ఆ ప్రయోజనమే కలుగుతుంది. మంచి బ్రాహ్మడికి ఎరుకవల్ల ఎంత ప్రయోజనం కలుగుతుందో అన్ని వేదాలవల్ల అంతే ప్రయోజనం కలుగుతుంది.

ఆదిశంకరు లవతరించి దిగ్విజయం చేసే కాలంలో శాంతమూ ఆనందమూ కలిగించే నిజతత్త్వం ఇలా అందరీకీ ఉపదేశించారు-'ఆత్మకంటె వేరయిన వస్తు వేదీ లేదు. ఆత్మకు భిన్నంగా ఇంకో వస్తువు ఉన్న దనే మిథ్యాజ్ఞానమే దుఃఖానికి కారణం. నేను వేరు ఆత్మ వేరు అనే తలపే అజ్ఞానం' అని.

వారి పరంపరనుండి వచ్చిన సదాశివబ్రహ్మేంద్రసరస్వతి ఆచార్యులవారు చెప్పిన అద్వైతతత్త్వమనే-'సర్వంబ్రహ్మమయ మ్మనిచెప్పారు. ''చూచే వస్తువు చూడబడే వస్తువూ'' ఈ రెండూ ఒకటే అని శంకరులు దిగ్విజయం చేశారు. శంకరులు కాశిలో ఉపదేశం చేస్తున్న కాలంలో వ్యాస భగవానులే ముసలివేషంలో వచ్చి వాదించి శంకరులవారి కీర్తిని నలుగురికీ తెలిసేటటులు చేశారని ఒక కథ. శంకరులను శంకరుల అవతార మనే చెపుతారు. ఆ రీతిగానే వ్యాసాచార్యులవారు మహావిష్ణువనియే ప్రతీతి - ''శంకర శ్శంకర స్సాక్షాత్.'' - 'వ్యాసాయ విష్ణురూపాయ'.

శంకరులు విద్యాభ్యాసకాలంలో శాస్త్రాల నన్నింటినీ ఎంత సూక్ష్మంగా విచారించారో ఆ సంగతి శంకరదిగ్విజయంలోని ఈ దిగువ ఉదాహరించిన శ్లోకం చెపుతుంది.

అన్వీక్షిక్త్యెక్షి తంత్రే
పరిచిత రతులా కాపిలే కాపి లేభే.
పీతం పాతంజలాంభః
పరమపి విదితం భాట్టఘట్టార్ధతత్త్వమ్.
యత్తైః సౌఖ్యం తదస్యాం
త రభవ దమలాద్వైతవిద్యానుఖేస్మిన్
కూపే యోర్థ స్ప తీ ర్థే
సుపయసి వితతే హంతనాంతర్భవేత్కిమ్?

అన్వీక్షికి అంటే దండనీతి. 'రాజు ఎట్లా పరిపాలించాలి' అనే యీలాటి విషయాలను చర్చ చేసే శాస్త్రం.

'అన్వీక్షికీ ఐక్షి' శంకరులవారు ఈ శాస్త్రం చూచినంత మాత్రాన తెలిసికొన్నారు. లోకమంతా ఆయనకడకు వచ్చి అణగిందని వారికి కలిగిన దండనీతిప్రావీణ్యం దీనివల్ల అవగతం అవుతుంది.

'తంత్రే పరిచితి రతులా కాపిలే కాపి లేభ్సేఅదేరీతిగా వారికి సాంఖ్యాది శాస్త్రాలలోనూ పరిచయం చాలా ఎక్కువ. మహాభాష్యంకూడా వారికి మంచినీళ్ళ ప్రాయం.'
పీతం పాతంజలాంభః. (మహాభాష్యము పాతంజలమే యోగదర్శనమూ పాతంజలమే.)

'పర మపి విదితం భాట్ట ఘట్టార్థతత్త్వమ్స్‌మీమాంసాశాస్త్రమంతా వారి కాకళింపు.

'యత్తైస్సౌఖ్యం తద స్యాంత రభవ దమలాద్వైత విద్యాసంఖేస్మిన్' చాలా ఏండ్లు శ్రమ చేసినా లభ్యం కాని శాస్త్రజ్ఞానం శంకరులకు సులభంగా లభించింది. అమలమయిన దద్వైతం. ఇన్ని శాస్త్రాలూ తత్త్వాలూ తెలిసికోవడంవల్ల కలిగే ఆనందమే. అద్వైతతత్త్వంద్వారా ఏర్పడే ఆనందసాగరంలో మునుకలు 'కూపే యో2ర్థః సతీర్థే సుపయసి వితతే హంత నావిర్భవేత్విమ్?' - ఒక బావివల్ల కలిగే ప్రయోజనం కావేరీజలంచేత కలగ దని చెప్పగలమా? బావి నీరూ దప్పి పోగొటుతుంది. అమృతంవంటి సెలయేటి నీరూ దప్పి పోగొటుతుంది. చిన్న బావివల్ల ఏ పనులు జరుగుతవో ప్రవాహజలంవల్ల అధిక తరంగా జరుగుతై. ఆ మహానదిలో ఈ చిన్న చిన్న వస్తువుల ప్రయోజనమంతా అణగిఉంది. నదులులేని ఊళ్ళలో బావులఉపయోగంమిక్కుటం. నదులు పారే తావులలో బావులు తవ్వేవారెవ రుంటారు? ఆలాగే సమస్తవస్తువులవల్ల కలిగే ఆనందం అమలమైన అద్వైతంలో ఇమిడిఉంది. పయి నుదాహరించిన శ్లోకం చదివి
ఈయావా నర్ధ ఉదపానే తావత స్సంప్లుతోదకే,
తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజాసతః.

అనే గీతాశ్లోకం చదివితే సులభంగా అర్థం తెలుస్తుంది.

సాంఖ్య యోగం కర్మానుష్ఠానం మొదలయిన వాని వల్ల కలిగే ఫలితా లన్నీ అద్వైతజ్ఞానంవల్ల కలుగుతై.
బ్రాహ్మణుడు అంటే వేదం తెలిసికొన్నవాడు. వేదానికి కూడా బ్రహ్మమని పేరు. వేదాధ్యయనం చేసిన వాణ్ణి బ్రాహ్మణు డని సాధారణంగా అన్నా ఉపనిషత్తుల రీత్యా సాక్షాద్ బ్రహ్మస్వరూపం ఎల్లెడలా చూచి అనుభవంలోకి తెచ్చుకొన్నవానికే బ్రహ్మణు డని పేరు. ఇట్టి అఖండ బ్రహ్మాకారవృత్తితో ఉండేవానికి వేదాలవల్ల ఏమి ప్రమోజనం? ఖండఖండాలుగా ఇవన్నీ ఉన్నా కడపటి ఇవన్నీ బ్రహ్మజ్ఞానంలో కలిసిపోయేవే.

ఈలాగే శరీరం వస్తుంది. పోతుంది. ఆత్మ అవినాశి. ఇది అచలం. సనాతనం. పుట్టిన వస్తువెల్లా ఏనాడో ఓనాడు గిట్టవలసినవే. అందుచేత నశ్వరాలైన భీష్మద్రోణాదుల శరీరాలనే భీష్మద్రోణాదులనుకొనివారితో యుద్ధం చేయను అని అనడం అవివేకం. అందుచేత నీవు కలతపడక నీ ధర్మం నీవు నిర్వర్తించు! అని భగవంతుడు అర్జునునకు బోధచేస్తాడు. అంబికాకటాక్షంవల్ల మూకకవికిన్నీ ఇట్టి జ్ఞానం కలిగింది.

శివ శివ పశ్యంతి సమం
శ్రీ కామాక్షీ కటాక్షితాః పురుషా,
విపినం భువనం మిత్ర మమిత్రం
లోష్ఠం చ యువతి బింబోష్ఠమ్.

ఇటులు ఆ మూగవాని నోటినుండి వచ్చింది. 'పండితా స్సర్వత్ర సమదర్శనః' సమ మంటే ఇక్కడ సమత్వంకాదు. ఏకత్వం అని అర్థం. వివిధాలయిన రూపాలలో ఏకత్వం చూడడం సమదృష్టి కలవానికే సాధ్యం.

సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థిత మీశ్వరమ్.
న హిన స్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిమ్.
- గీత. 13-28

అంతటా సమానంగాఉండే ఈశ్వరుని చూస్తున్న వ్యక్తి తన్ను తాను హింసించుకోడు. అట్టివాడే సమదృష్టి కలవాడు.

చక్కెరతో ఎన్నో రకాల బొమ్మలను తయారుచేస్తారు. అవి అనేక ఆకారాలతో ఉన్నా అన్నీ చక్కెర-తయారీవే. చక్కెరకు తీపితప్ప వేరే రుచి ఏముంది? ఆలాగే అన్ని వస్తువులలోనూ ఉన్న పరమాత్మను చూచే వానికి ఆనందం తప్ప వేరే ఏముంది?

ఈ సమ్యగ్ దర్శనం కలుగవలెనంటే అంబికా కాటాక్షం-అమ్మ అనుగ్రహం ఉండాలి. ఆమెను మన మేమీ తిరిపె మెత్తకుండా వుంటే ఆమెయే తనకు తానుగా కటాక్షిస్తుంది. జ్ఞానాగ్ని ఏమాలిన్యాన్నయినా భస్మం చేస్తుంది. ఏ వస్తువు చూచినా సరే దానిలో పరమాత్మరూపం చూచేవానికి దుంఖమూలేదు, వినాశమూలేదు. అతనిలో అన్ని తత్త్వాలూ అడగిపోతై. ఆస్థితి శ్రీకామాక్షీకటాక్షమే.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ........కంచిపరమాచార్యవైభవం....