వ్యాజస్తుతికి ఉదాహరణ ప్రాయమైన పద్యం
-----------------------------
*ఆలి నొల్లక యున్న వానమ్మ మగని
నందు లోపల నున్న వానక్క మగని
నమ్మి నాతని చెరచు దానమ్మ సవతి
సిరులు మీకిచ్చు నెప్పట్లు కరుణతోడ.
వివరణ:
ఆలి నొల్లని వాడు--భీష్ముడు ,
వాని అమ్మ--గంగ,
మగని--గంగ మగడు సముద్రుడు,
నందు లోపల నున్న వాడు-మైనాకుడు,
వాని అక్క--మైనాకుడు అక్క పార్వతి,
అక్క మగడు--పార్వతి భర్త శివుడు,
వాని నమ్మిన వాడు--రావణాసురుడు,
వాడి పేరు చెరచినది--సీత,
దానమ్మ--సీత అమ్మ భూదేవి,
సవతి--భూదేవి సవతి *శ్రీదేవి అంటే లక్ష్మీదేవి*
*అనగా ఆ లక్ష్మీదేవి మీకు సిరులను,సంపదలను ప్రసాదించుగాక అని ఆశీర్వాదాలు*
-----------------------------
*ఆలి నొల్లక యున్న వానమ్మ మగని
నందు లోపల నున్న వానక్క మగని
నమ్మి నాతని చెరచు దానమ్మ సవతి
సిరులు మీకిచ్చు నెప్పట్లు కరుణతోడ.
వివరణ:
ఆలి నొల్లని వాడు--భీష్ముడు ,
వాని అమ్మ--గంగ,
మగని--గంగ మగడు సముద్రుడు,
నందు లోపల నున్న వాడు-మైనాకుడు,
వాని అక్క--మైనాకుడు అక్క పార్వతి,
అక్క మగడు--పార్వతి భర్త శివుడు,
వాని నమ్మిన వాడు--రావణాసురుడు,
వాడి పేరు చెరచినది--సీత,
దానమ్మ--సీత అమ్మ భూదేవి,
సవతి--భూదేవి సవతి *శ్రీదేవి అంటే లక్ష్మీదేవి*
*అనగా ఆ లక్ష్మీదేవి మీకు సిరులను,సంపదలను ప్రసాదించుగాక అని ఆశీర్వాదాలు*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి