కాల మహాత్మ్యమున్ దెలుపగాగల స్వామి యనంతపద్మనా
భాలయమూర్తి ఏడుపయినందపుటేడు జగంబులేలు శో
భా లసితుండుసృష్టి నడుపంగల కూర్మియునేర్పుతాల్మితో
క్రాలెడువేల్పు సంపదల రాజిలచేయగ నంజలించెదన్.
పదిపైనాల్గున ప్రీతియోమదిని పౌర్ణమిముందె జయంతియౌను తా
పదునాల్గున్ భువనాళినేలు మరి యాపధ్నాల్గున్న తోరంబదే
యొదవున్ తద్వ్రతమందుభక్ష్యతతియున్నొప్పారు పధ్నాలుగే
సదయుండైన యనంతపద్మవిభు విశ్వాసంబుతో గొల్చెదన్.
రాయప్రోలు సీతారామశర్మ భీమవరం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి