1, సెప్టెంబర్ 2020, మంగళవారం

*ఆచార్య సద్భావన*



జీవితంపై స్వార్థం తీవ్రమైన బరువుని మోపుతుంది. మనలో స్వార్థమనే భూతం ఉంటే దాని వలన మనలోని జీవుడు అల్లాడిపోతాడు. స్వార్థం ఉన్నప్పుడు మనకు ఉన్నత భావాలు కలగనందున జీవనభారం అధికంగా అనిపిస్తుంది. మనిషిని సంకుచితత్త్వం ఎప్పుడూ బాధిస్తూనే ఉంటుంది. అందువలన అదే పనిగా మన గురించి మనం ఆలోచించవద్దు. జీవితంలో చేయవలసిన విలువైన పనులు ఎన్నో ఉన్నాయి. మన మదిని, హృదిని భగవంతుని వైపు తిప్పగలిగితే ఆయనే తన పట్ల మనకు గల విశ్వాసాన్ని మరింతగా దృఢపరుస్తూ, సంతోషాన్ని, నిస్వార్థాన్ని, అచంచల భక్తిని ప్రసాదిస్తాడు.

అందుకై మనం భగవంతుని ఈ విధంగా ప్రార్థించాలి.

*శ్రీమన్నారాయణా!*
సర్వులను ప్రేమించే పరమాత్మా మా జీవితాలకు అర్థం, పరమార్థం కలిగించుము, నీ కారుణ్య ప్రేమ వీక్షణపు వెల్లువతో మమ్మల్ని చుట్టుముట్టుము, మమ్మల్ని స్వార్థపు కోరల నుండి తప్పించి దూరంగా ఉంచుము, మాలో మరింత విశ్వ ప్రేమను కలిగించి, మా భక్తి విశ్వాసాలను పెంపొందించుము.
సర్వేజనా సుఖినోభవంతు.

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

కామెంట్‌లు లేవు: