1, జనవరి 2023, ఆదివారం

ఇంత త్వరగానా

 #మరణం : ఒక మనిషి చనిపోయాడు. దేహంలోంచి ఆత్మ బయటకు వచ్చింది. చుట్టూ చూశాడు. చేతిలో పెట్టెతో యమధర్మరాజు తన దగ్గరకు వచ్చాడు. చనిపోయిన మనిషికీ భగవంతుడుకి మధ్య సంభాషణ ఇలా సాగింది. 


యమధర్మరాజు : మానవా.. నీ శరీరం పడిపోయింది. ఇక ఈ జన్మ ముగిసింది. నాతో పద.


మనిషి: అయ్యో ఇంత త్వరగానా? నేను భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను స్వామీ!


యమధర్మరాజు : తప్పదు నాయనా! నీవు నాతో రావాల్సిన సమయం వచ్చింది. నడు.


మనిషి: నాకోసం తెచ్చిన ఆ పెట్టె ఇటివ్వండి. ఏం తెచ్చారో చూస్తాను


యమధర్మరాజు : నీకు చెందినవి ఉన్నాయి.


మనిషి: నావా? అంటే నా బట్టలు, డబ్బులు, భూమి పత్రాలు అవా?


యమధర్మరాజు : అవెప్పటికీ నీవి కావు. అవన్నీ భూమివే. అక్కడే ఉంటాయి


మనిషి: పోనీ నా జ్ఞాపకాలున్నాయా దాన్లో?


యమధర్మరాజు : కాదు. జ్ఞాపకాలనేవి కాలానికి చెందినవి. కాలగర్భంలోకి వెళ్లిపోతాయి


మనిషి: అయితే నా ప్రతిభ, ప్రజ్ఞ ఉండి ఉంటాయి!


యమధర్మరాజు : అవి పరిస్థితులవి నీవి కావు 


మనిషి: నా స్నేహితులున్నారా అందులో?


యమధర్మరాజు : వారు కేవలం నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే


మనిషి: హూం..నా భార్య, బిడ్డలునా?


యమధర్మరాజు : వారు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొన్న పాత్రధారులు


మనిషి: అయితే నీవద్ద ఉన్న పెట్టెలో నా శరీరం ఉండుండాలి!


యమధర్మరాజు : తప్పు. నీ శరీరం థూళికి చెందినది. మట్టిలో పడుతుంది.


మనిషి: స్వామీ అయితే నా ఆత్మా?


యమధర్మరాజు : ఆత్మ నీదెలా అవుతుంది. అది నాది.


మనిషి: ఆ పెట్టె ఇటివ్వు స్వామి అని తీసుకుని తెరిచి చూశాడు. కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. ఆపెట్టె ఖాళీగా ఉంది.


మనిషి కాలం చెస్తే తనతో తీసుకువచ్చేది ఏదీ ఉండదు అని చెప్పేందుకే దేవుడు ఈ ఖాళీ పెట్టె తెచ్చాడని అర్థం అయింది. బతికున్నంత కాలం నా వాళ్లు, అవన్నీ నావే, ఇవన్నీ నాకే అని ఆశతో, ఆరాటంతో పరుగుతు పెడుతూ పరమాత్మ స్మరణ మరిచాను అని దుఖిఃతుడయ్యాడు.


మనిషి: స్వామీ చివరగా అడుగుతున్నాను. నాది అనేది ఏమైనా ఉందా అసలు?


యమధర్మరాజు : ఉంది. నీవు జీవించినంతకాలం ప్రతి క్షణం నీదే.


 ఆ క్షణాల్లో నీవు ఆర్జించే మంచి, చెడు యొక్క పర్యవసానాలు నీకే చెందుతాయి. అందుకే ప్రతిక్షణం మంచిని పంచాలి, పెంచాలి, భగవన్మామం స్మరించాలి. పశ్చాతాపులను క్షమించాలి. 


 తోటివారి నుంచి మనకి సంక్రమించే చెడును విసర్జించాలి, మానవసేవ-మాధవసేవలను గుర్తించి జీవించాలి.

దేవుడున్నాడు

 *దేవుడున్నాడు!*

            

*ఒక ఊరిలో ఒక భక్తుడు ఉండేవాడు. అతను సామాన్య మానవుల వలె దేవుడిని నమ్మేవాడు...*


*అంటే పూలు, పళ్ళు, దీపం ధూపం, నైవేద్యం, ఏమైనా స్తోత్రాలు చదివితే చాలు దేవుడు ప్రసన్నుడై వరాలిస్తాడని నమ్మేవాడు..*


*అతనికి అలా ఏమీ లభించలేదు దానితో కొంచెం అసంతృప్తి మనసులో ఉండేది.*


*ఒకసారి ఒక గొప్ప జ్ఞాని అయిన ఒక సాధువు వాళ్ళ ఊరికి వచ్చాడు.*


*ఏదైనా మంత్రజపం సద్గురువు ద్వారా దీక్ష తీసుకుని చేయాలని ఎవరో చెప్పగా అతను విన్నాడు..*


*ఆ జ్ఞాని వచ్చారని తెలియగానే ఎంతో ఆశగా వెళ్ళి , దర్శనం చేసుకుని , తన కోరిక వెల్లడించాడు.....*


*సాధువు అంతా శాంతంగా విని, "నేను అలా ఎవరికీ దీక్ష ఇవ్వను కానీ             నీ తపన చూస్తుంటే.........."  భక్తుడు ఆనందభరితుడై సాష్టాంగ నమస్కారం చేసాడు..*

 

*"కానీ జప  విధానం  కొంచెం కష్టం. నీవు చేయగలవో........... లేదో...." *


*"ఎంత కష్టమైనా నేను చేయగలను.. మంత్రం ఫలిస్తే చాలు" అన్నాడు భక్తుడు ఆనందంగా....*


*"ఐతే విను ... నేను చెప్పే మంత్రం పఠించనవసరం లేదు కానీ రోజుకి తొమ్మిది సార్లు ఎవరితోనైనా అనాలి .... అలా తొమ్మిది రోజులు...*


*ఆ పంచాక్షరీ మంత్రం ఏమిటంటే........ "దేవుడున్నాడు" *


 *భక్తుడు అయోమయంగా చూసాడు.. సాధువు చెప్పిన ఒక్క ముక్క కూడా అర్ధం కాలేదు....ఇన్ని లక్షల,...కోట్ల జపం విన్నాడు కానీ ఇదేమిటి ?*

*పైగా పంచాక్షరీ మంత్రంట ఏమిటది !*

*దేవుడున్నాడనే కదా రోజూ పూజలు చేస్తున్నది ...*

*మళ్ళీ ప్రత్యేకంగా  చెప్పేదేమిటి....?* *అదీ ఇంకొకరితో ....తనను పిచ్చివాడి  క్రింద జమ కడ్తారేమో!!!!!!*


*సాధువు ఒకటే మాట చెప్పాడు "నన్నేమీ ప్రశ్నించ వద్దు...! మంత్రం ఫలించాలంటే తొమ్మిది రోజులు నేను చెప్పినట్లు చేసి, ఆపై నాకు కనిపించు ..."* 



*భక్తుడు విచారంగా ఇంటికి వెళ్ళాడు. సమయం సందర్భం లేకుండా ఎవరితోనైనా "దేవుడున్నాడు" అని ఎలా అనటం ?*


*ఇంతలో అతని భార్య వచ్చి, పక్కింటి వాళ్ళ గురించి ఏదో చాడీలు చెప్పబోయింది.*


*ఇతను అప్రయత్నంగా అన్నాడు... "దేవుడున్నాడు"*


*అంతే! ఆమె ఒక్క క్షణం తత్తరపడి మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. ఇతనికి చాలా ఆనందం వేసింది.. వెంటనే అతనికి ఏదో అర్థం అయినట్లు, కానీ ఇంకా సరిగా కానట్లు వింత భావన కలిగింది.* 


*ఆ పై ఇంక ఏ  మంచి కనిపించినా "దేవుడున్నాడు" మిమ్మల్ని చల్లగా చూస్తాడు అనే అర్థంతోనూ,  ఏదైనా చెడు కనిపిస్తే "దేవుడున్నాడు" అన్నీ గమనిస్తున్నాడనే అర్థంతోనూ , అన్యాయం జరుగుతోందని ఎవరైనా అంటే.. "దేవుడున్నాడు" శిక్షిస్తాడనే అర్థంతోనూ, పూజలు అనే విషయం వస్తే "దేవుడున్నాడు" అని భక్తివిశ్వాసాలు వ్యక్తపరుస్తూ అనేవాడు.*


*తొమ్మిది రోజులు గడిచాయి.*

*అంతా నెమరువేసుకుంటూ సాధువు దగ్గరికి వెళ్ళాడు...*

*సాధువు అన్నాడు…"నువ్వు ఎప్పుడు, ఎవరితో రోజుకి ఎన్నిసార్లు అన్నావనే వివరాలు నాకనవసరం. నువ్వు అలా అంటూ గ్రహించిదేమిటో నాకు చెప్పు.”* 


*భక్తుడు తెల్లబోయాడు..అయినా వెంటనే తేరుకుని అన్నాడు...*

*"నాకు తెలిసింది ఏమిటంటే... దైవం సర్వాంతర్యామి. అంతటా వున్నాడు... సర్వజ్ఞుడు...... అతనికి తెలియనిది....మనం దాచగలిగేది ఏమీ లేదు.. నిష్పక్షపాతంగా న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తాడు.. దయాసాగరుడు. ఆనందస్వరూపుడు…. అతనిని మధ్యలో ఆపి సాధువు అన్నాడు….         "ఇప్పుడు చెప్పు... నువ్వు దైవం నుంచి ఏం ఆశిస్తున్నావు?"*


*భక్తుడు తన్మయత్వంతో   కళ్ళు మూసుకుని అన్నాడు "ఎటువంటి పరిస్థితుల్లోనూ నా మనసులోనుండి 

 "దేవుడున్నాడు" అనే భావం చెదరకుండా స్థిరంగా  ఉండేలా చూస్తే చాలు!*


#*నీతి:*

*కర్మఫలం, స్వర్గం- నరకం, పాపభీతి.. త్యాగం... కరుణ, సానుభూతి.. ప్రేమ.. సేవ ..మానవత్వం.. సత్యం.. ధర్మం... మొదలైన ఉదాత్తమైన భావాలకి ఆలంబన , ఆధారం.. "దేవుడున్నాడు" అని మనసారా విశ్వసించటమే !!*


*ఈ పంచాక్షరీ మంత్రాన్ని నిత్యం జపించండి ....‌ తరించండి.!*


*మనకు  చదువులు చెప్పి  మన అభ్యున్నతికి ఎంతగానో తోడ్పడే మన గురువులు ప్రత్యక్ష దైవాలు!*🕉️🚩🕉️

అశోక చక్రవర్తి

 *మన దేశంలో "అశోక చక్రవర్తి" జయంతి ఎందుకు జరుపుకోరు??* 


ఎంత ఆలోచించినా "సమాధానం" దొరకలేదు! మీరు ఈ "ప్రశ్నలను" కూడా పరిగణించండి!🤔🤔🤔 అశోక చక్రవర్తి *తండ్రి పేరు - బిందుసార్ గుప్తా* తల్లి పేరు - సుభద్రణి ప్రపంచవ్యాప్తంగా ఉన్న చరిత్రకారులు "గొప్ప" అనే పదాన్ని పెట్టిన "చక్రవర్తి" 


ఎవరిది - "చక్రవర్తి" యొక్క రాజ చిహ్నం "అశోక చక్రం" భారతీయులు తమ జెండాలో ఉంచారు. 


"చక్రవర్తి" రాజ చిహ్నం "చార్ముఖి సింహం"ను భారతీయులు "జాతీయ చిహ్నం"గా పరిగణిస్తారు మరియు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు మరియు "సత్యమేవ జయతే"ని స్వీకరించారు.


 అశోక చక్రవర్తి పేరు మీద ఉన్న సైన్యం యొక్క అత్యున్నత యుద్ధ గౌరవం "అశోక చక్రం". ఇంతకు ముందు లేదా తర్వాత ఇలాంటి రాజు లేదా చక్రవర్తి లేరు"... "అఖండ భారత్" (నేపాల్, బంగ్లాదేశ్, మొత్తం భారతదేశం, పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్) యొక్క విస్తారమైన భూభాగాన్ని ఒంటరిగా పాలించిన చక్రవర్తి. అశోక చక్రవర్తి కాలంలో "23విశ్వవిద్యాలయాలు"స్థాపించబడ్డాయి.ఇందులో తక్షశిల, నలంద, విక్రమశిల, కాందహార్ మొదలైనవి ప్రముఖమైనవి.ప్రపంచనలుమూలల నుంచి విద్యనభ్యసించడానికిఇక్కడికి వచ్చేవారు. -"చక్రవర్తి" పాలనను ప్రపంచంలోని మేధావులు మరియు చరిత్రకారులు భారతీయ చరిత్రలో అత్యంత "స్వర్ణ కాలం"గా పరిగణిస్తారు. "చక్రవర్తి" భారతదేశం యొక్క పాలనలో "విశ్వ గురువు". ఇది "బంగారు పక్షి". ప్రజలందరూ సంతోషంగా మరియు వివక్ష లేకుండా ఉన్నారు. వీరి హయాంలో అత్యంత ప్రసిద్ధ హైవే "గ్రేడ్ ట్రంక్ రోడ్" వంటి అనేక హైవేలునిర్మించబడ్డాయి. 2,000 కిలోమీటర్ల మొత్తం "రోడ్డు"కి ఇరువైపులా చెట్లు నాటబడ్డాయి. "సరైస్" నిర్మించబడ్డాయి. మానవుడు మానవుడే.., జంతువుల కోసం కూడా తొలిసారిగా "వైద్యగృహాలు" (ఆసుపత్రులు) ప్రారంభించ బడ్డాయి.చంపడం ఆగిపోయింది అలాంటి *"గొప్ప చక్రవర్తి అశోక్"* జన్మదినాన్ని తన దేశమైన భారతదేశంలో ఎందుకు జరుపు కోలేదు?? లేదా సెలవు ప్రకటించలేదు? ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవాల్సిన పౌరులు తమ చరిత్రను మరచిపోవడం బాధాకరం, తెలిసిన వారు ఎందుకు జరుపుకోకూడదో తెలియడం లేదు?? *"గెలిచినవాడు చంద్రగుప్తుడు"* అని కాకుండా *"గెలిచినవాడు అలెగ్జాండర్"* ఎలా జరిగింది?? చంద్రగుప్త మౌర్యుని ప్రభావం చూసి అలెగ్జాండర్ సైన్యం యుద్ధానికి నిరాకరించిందని అందరికీ తెలుసు. చాలా ఘోరంగా నైతికత దెబ్బతింది మరియు అలెగ్జాండర్ "వెనుక తిరగవలసి వచ్చింది". *ఈ "చారిత్రక తప్పిదం"ని సరిదిద్దడానికి మనమందరం కలిసి ప్రతిజ్ఞ చేద్దాం.🙏 🏻* *కనీసం ఐదు గ్రూపులుగా పంపాలి* *కొందరు పంపరు* *అయితే మీరు తప్పకుండా పంపుతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను🙏*👍🏻 *🙏

జరత్కారుడు

 జరత్కారుడు


సూర్యభగవానుడు కూడా ఎవరి అనుమతి లేకపోతే ఉదయించడో, అస్తమించడో ఆ మహర్షి పేరు జరత్కారుడు. ఆయన తపోశక్తి, సాధనా విధానాలు అనితర సాధ్యాలు. శరీరాన్ని తపస్సు చేత కృశింపచేసుకున్న కారణం చేత ఆయన్ను జరత్కారుడు అంటారు. కేవలం ఎముకలు, నరాలు మాత్రమే ఉండే మహర్షి నిరంతరం భూప్రదక్షిణ చేస్తూ సూర్యాస్తమయం నాటికి ఏ గ్రామం చేరితే అక్కడ ఆగి ఉదయాన్నే మరలా ఆప్రదేశం విడిచిపెట్టేవాడు. అలా పరివ్రాజక జీవితాన్ని అనుసరిస్తున్నాయన ఒకరోజు విచిత్రమైన వ్యక్తులను చూశాడు.


అంతులేని లోతైన గొయ్యి  ఒక చెట్టు ప్రక్క ఉంది. ఆ చెట్టు నుంచీ ఒక బలమైన వేరు గొయ్యికి అడ్డంగా ఉంది. ఆ వేరుకు తలకిందులుగా గొయ్యిలోకి వేళాడుతూ   కొందరు తపస్సు చేసుకుంటూ కనిపించారు. ఇదే వింత అనుకుంటే ఆ వేరును ఒక ఎలుక కొరికేస్తూ  ఉండడం మరో వింత. ఇప్పటికే చాలా మటుకు వేరును ఎలుక కొరికేసింది. మరికొంత భాగం కొరికేస్తే త్వరలోనే వారంతా అంతు కనిపించని గొయ్యిలో పడిపోతారు. అది భయంకరమైన చీకటిగా ఉంది.


ఇదంతా చూసిన జరత్కారుడు మహాశ్చర్యంతో అది ఏ విధమైన తపస్సో తెలుసుకోవాలని వారిని ‘‘మీరెవరు? ఈ మహాప్రమాదమైన తపస్సు ఎందుకు చేస్తున్నారు?‘‘ అని ప్రశ్నించాడు.


దానికి వారు సమాధానంగా ‘‘మేమంతా పితృదేవతలం. మా వంశంలో ఒకడు పెళ్ళీ పెటాకులూ లేకుండా దేశదిమ్మరిగా తిరుగుతున్నాడు. వాడు సంతానం లేకుండా  చనిపోతే మేమంతా ఈ తామసనరకంలో పడిపోతాము. ఈ చీకటి గొయ్యే నరకం. ఆ చెట్టువేరు మా వంశంలోని పనికిమాలిన వాడి ఆయుస్సు. దాన్ని కొరుకుతున్నవాడు యమధర్మరాజు‘‘ అని చెప్పారు.


అది విని గతుక్కుమన్న మహర్షి ‘‘వివాహం సంతానం లేకుండా ఉన్న ఆ వ్యక్తి పేరు ఏమిటి?‘‘అని అడిగాడు.


దానికి వారు‘‘ఆ ... ఉన్నాడులే మా వంశంలో ఒక పనికిమాలిన వాడు జరత్కారుడు అనే పేరుతో‘‘అని అన్నారు.


వారి సమాధానం విని మహాదుఃఖం పొంది జరత్కారుడు ‘‘పితృదేవతల్లారా! నా తాత ముత్తాతల్లారా! మీ దుర్గతి పోగొట్టాలంటే నేను ఏం చేయాలో చెప్పండి‘‘ అని వేడుకొన్నాడు.


‘‘నాయనా! నువ్వే జరత్కారుడని మాకు తెలుసు.  నీవు ప్రాపంచిక వైరాగ్యం వల్ల చేస్తున్న మహాతపస్సు మాకు సంతోషదాయకమే అయినా, నీవు పితృఋణం తీర్చుకోలేదు. పెళ్ళి చేసుకొని  పిల్లలను కనకపోతే మేము తిలోదకాలు లేకుండా శాశ్వతనరకంలో పడిపోతాము. కనుక వెంటనే పెళ్ళి చేసుకొని వంశతంతువు(తీగ) కొనసాగించు‘‘ అని చెప్పారు.


వ్యక్తిగతంగా బ్రహ్మచారిగా ఉండి ఎంత ఉన్నతి ఏ రంగంలో సాధించాము అనేది ప్రధానం కాదు. జన్మనిచ్చిన తల్లి తండ్రులకు నువ్వులూ నీళ్ళూ ఇచ్చే మనుమలను ఇవ్వని జన్మ వృథా.  అటువంటి వారికి మురిక్కాలువలోని పురుగులకూ తేడాలేదు. సూర్యగతిని కూడా శాసించగలిగే తపో సంపన్నుడైన జరత్కారుడికి కూడా పితృఋణవిముక్తి తప్పలేదు. ఆయనతో పోలిస్తే సామాన్య మానవులకు ప్రత్యేకంగా చెప్పేది ఏముందీ? 


ప్రపంచం మీద కోపం కలిగినా, ద్వేషం కలిగినా, వైరాగ్యం కలిగినా వివాహం చేసుకొని సంసారతీగను కొనసాగించి, వారికి తమ కాళ్ళ మీద నిలిచే శక్తి వచ్చే వరకూ గృహస్థాశ్రమ జీవితంలో ఉండి తీరాలి. కుటుంబ జీవనంలోని ప్రేమ ఆప్యాయతలు మనో హృదయబాంధవ్యాల వలన మనకు కలిగిన ప్రపంచ ద్వేషం, కోపం, వైరాగ్యం తగ్గి సామాన్యులం అయ్యే అవకాశం రావడం మాత్రమే కాక నిజమైన వైరాగ్యం త్వరగా పరిణతి చెంది మోక్షకారణం అవుతుంది. 


అయితే వేదవేదాంత అధ్యయనం చేసి సామాన్య సంసారం మీద ఏహ్యభావం పొంది గృహస్థాశ్రమం స్వీకరించని శిష్యుడిని కూడా గురువులు ‘‘ ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సీహి‘‘ అని హెచ్చరిస్తారు. కానీ ఈ జీవితానికి భూ మండలం మీద ఉన్న సమస్త స్త్రీలూ నాకు అమ్మలే అనే ప్రమాణం చేసి సన్యాసం స్వీకరించి తన గురువునే సేవిస్తూ ఉండే వారికి మాత్రమే సశాస్త్రీయంగా మోక్షం లభిస్తుంది. ఈ విధంగా సన్యాసం స్వీకరించకుండా బ్రహ్మచర్యం వహించడం శాస్త్ర విధి రహితం. మహాపాపాత్మకమైన జీవితం. 


వివాహం ఎందుకు? అనే ప్రశ్నకు అత్యత్భుతమైన వివరణే ఈ జరత్కారుని జీవితం అని వ్యాసమహర్షి తన మహాభారత ప్రారంభంలో వ్రాశారు.


సకల సాధనలకూ గృహస్థాశ్రమమే మహాశ్రేయోమార్గమని రమణమహర్షి వంటి వారు కూడా చెప్పారు.  


                                  🕉🕉🕉

కోధానికి లోనుకాని మహానుభావుడికి

 శ్లోకం:☝️

*పుణ్యం చిత్తం వ్రతతపోనియమోపవాసైః*

 *క్రోధః క్షణేన దహతీంధనవద్ధుతాశః ।*

*మత్వేతి తస్య వశమేతి న యో మహాత్మా* *తస్యాభివృద్ధిముపయాతి నరస్య పుణ్యం॥*


భావం: అగ్ని ఇంధనాన్ని క్షణంలో దహించివేసినట్టు; బహుకాలం వ్రతము, తపస్సు, నియమాలు, ఉపవాసాల ద్వారా సంపాదించుకున్న పుణ్యాన్ని క్రోధం క్షణంలో నాశనం చేసివేస్తుంది. ఇది తెలుసుకుని కోధానికి లోనుకాని మహానుభావుడికి పుణ్యం వృద్ధిచెందితుంది.

గతానికి వీడ్కోలు

: *గతానికి వీడ్కోలు  - స్వగతంలో వేడికోలు*



గడిచినదంతా గతం    ఇకపై అసంగతం 

గడుస్తున్నది వర్తమానం    రేపటికిది గతం 

గడువబోయేదంతా వర్తమానం  అంగీకృతం 

ఆశల తీరాలలో పూబాటల సమాహితం 


నిన్నటి పొరపాట్లు పునరుక్తైతే అలవాట్లు 

పొరపాట్లను సవరిస్తే జీవితానికి దిద్దుబాట్లు 

దిద్ధుబాట్లే చక్కని నడతకు కట్టుబాట్లు 

కట్టుబాట్లే లేకపోతే అందరిచేతా చీవాట్లు 


మనది కానిచోట అవసరమైతే అర్థించటం 

మనదైనచోట అర్థవంతంగా ఉండటం 

ఘనచరిత్రకోసం సమర్థవంతంగా ఉండటం 

మమతల తోటలలో అనర్థాలను త్రుంచటం 


మారిన సంవత్సరంతో మారాలి మనసులు 

మనసులలో తొలగాలి నాటుకొన్న లొసుగులు 

నూతనత్వపరిమళంతో విరబూయాలి సొగసులు 

అనుభవాలు హరివిల్లై విరిస్తే ఆనందపు సొబగులు 

*~శ్రీశర్మద* 

1-1-2023.

 *నా భారతీయుల్ ఘనుల్*


శార్దూలము:

ప్రాచ్యాచారము గల్గి హైందవసుధాపానమ్ముతో దీప్తమై 

వాచ్యాహార్యములందు శుద్ధమతులై వాల్లభ్యము న్వెల్గుచున్ 

రోచ్యప్రాభవసద్గుణానుభవచిద్రూపోజ్జ్వలాత్మీయతన్ 

నైచ్యాఽప్రాచ్యమనోజదూరగుణులౌ నా భారతీయుల్ ఘనుల్ 

మత్తేభము:

ఘనులై విద్వదపారసారమతులై కారుణ్యకాసారులై 

మునులై విద్యలకాలవాలమణులై మోహారులై ధీరులై 

అనిలో తగ్గని వీరశూరగుణులై అర్యాహసంహర్త్రలై 

కనగా సౌమ్యత వెల్గు భారతజనుల్ కైమోడ్పు కర్హుల్ సుమా! 

*~శ్రీశర్మద* 

1-1-2023.