15, సెప్టెంబర్ 2024, ఆదివారం

*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 13

 _*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము13వ భాగము*_

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️


*బదరీ ప్రయాణము:*


తపస్సాచరించాలన్నా, ధ్యానంలో నిమగ్నం కావాలన్నా, దేవతల ఉనికికైనా, బ్రహ్మనిష్ఠుల కైనా ఉత్తరదిశయే చాలా శ్రేష్ఠం. ఇది తెలిసిన శంకరాచార్యుడు భాష్య రచనకై బదరీ వనానికి బయలు దేరారు శిష్యులతో. తాపసు లనేకులు తపస్సు చేసి ధన్యులైన వనము బదరికావనము. ఒకప్పుడు సహస్ర కవచుడనే రాక్షసుడు లోకాల్ని కంటకావృతం చేస్తూంటే, వాణ్ణి సంహ రించడానికి నరనారాయణులు దుర్భర తపస్సు ఆచరించిన వనం అది. ఆ వనం నిర్మలం గాను, మనోహరం గాను, సకల శ్రేయస్సుల నిచ్చేది, మనోవాంఛలను సమకూర్చేది గాను ఉంటుంది. దారిలో ఉన్న ఎన్నో పుణ్యస్థలాలు చూస్తూ, పుణ్యతీర్థాలలో గ్రుంకు లిడుతూ మధ్య మధ్య గల ఋషి పుంగవులను దర్శిస్తూ ముందుకు పోతున్నారు శంకరాచార్యులు శిష్య బృందంతో.


ఆ మార్గం తిన్నగా లేదు. ఒకచో ఎగుడు దిగుడు, ఒకచో బురద, మరొకచో భరించరాని తాపము. పిమ్మట తట్టుకోలేని శీతము. చాల చోట్ల కంటకావృతము. పాము మెలికల్లా వంకరటింకరగా మెలికలు తిరిగిన దారి. ద్వంద్వాలకు అతీతు డైన ఆయనకు ఆమార్గము దుర్గమము కాదు. మధ్య మధ్యలో క్షుత్తు కలిగినపుడు మంచి మంచి ఫలాలు, చక్కటి నీరూ లభ్యము అయ్యేవి. మార్గాయాసం కలుగ కుండా మంచి మంచి మాటలు చెప్పుకొంటూ అక్కడక్కడ చెట్ల నీడలలో విశ్రమించే వారు. అలా చని చని కొన్ని వారాల తర్వాత బదరికావనం చేరేటప్ప టికి రాత్రి పోయి పగలు వచ్చినంత సంతోషాన్ని పొందారు శంకర శిష్యులు.


అక్కడ ఒక పెద్దదైన వృక్షాన్ని చూచుకొని దాని క్రింద ఆశ్రమాన్ని నిర్మించారు. దగ్గరలో తల ఒక పర్ణకుటీరం ఏర్పరచుకొన్నారు.


*బ్రహ్మసూత్ర భాష్య రచన యొక్క ఆవశ్యకత:*


కవులు వ్రాసే కావ్యాలు కొన్ని గుంభనంగా ఉండి అందరికీ వాటిలోని భావాలు తెలియవు. మరి కొన్ని శాస్త్రాలు సూత్ర రూపంలో ఉండ డంతో ఇంకా కష్టం వాటిని అర్థం చేసు కోవడం. సూత్రం చిన్నదిగా భావం బ్రహ్మాండంగా ఉంటుంది. సూత్రాలకు ఎన్నోముళ్ళు వేస్తారు. నేర్పుతో ఆముళ్లు విప్పితే భావం బయట పడుతుంది. సూత్రాలు ముందు వెనుకలతో సంబంధం కలిగి ఉంటాయి. జైమిని జ్యోతిష శాస్త్రాన్ని సూత్రాలలో ఇమిడ్చి వ్రాసాడు. ఒక్కొక్క సూత్రానికి భాష్యం వ్రాయాలనిన చాల పుటలు పడుతుంది. వేదాంతం లోని పరమార్థం కంటి కగపడే దాన్ని గురించి చెప్పునది కాదు. అందరికీ అవగాహన అయ్యేదీ కాదు. కొన్ని అర్హతలు సంపాదించు కొని ఉండాలి. వ్యాసరచితమైన బ్రహ్మ సూత్రాలను కొందరు మహనీయులు వేదాంత సౌధంగా వర్ణించారు.దాన్ని అధిరోహించ డానికి ఒకదాని తరువాత ఒకటి ఎక్కేలా మెట్లు కట్టాలి. అమాంతం ఎక్కబోతే అంధకార బంధురమే. క్రమం తప్పకుండా ఎక్కిన వారు ఆ ప్రాసాదం లోని జ్ఞాన కవాటం తెరవవచ్చు. వ్యాసుడు వ్రాసిన ఆ గ్రంథం వేదాంతమూ, ఉప నిషత్తులూ గుచ్చెత్తి తయారు చేసిన తత్త్వ పిండము. దాన్ని సరిగా అవగాహన చేసికొన లేక కొందరు చేసిన ధర్మ విరుద్ధమైన వ్యాఖ్యలు ప్రబలి దేశంలో ధర్మగ్లాని విస్తృతమై నాస్తికమతం చోటు చేసికొంది. పరిస్థితిని చక్కదిద్దగల దక్ష లేక బ్రహ్మసూత్రాలు అందు బాటులో లేకుండా పోయాయి.


*బ్రహ్మసూత్ర భాష్య రచన:*


తాను రచించిన బ్రహ్మ సూత్రములను తెలిసికొనే దెవ్వరన్న ప్రశ్నతో ప్రారంభించాడు వ్యాసుడు. ద్వారమే మూసి వేసినట్లు అందరికీ హక్కు లేదని మొదటే నిష్కర్షగా చెప్పేశాడు “అథాతో బ్రహ్మ జిజ్ఞాస" అన్న తొలిసూత్రంలోనే. ఆనాడు ఈ సూత్రాన్ని ఎవరికి తోచినట్లు వాళ్ళు అర్థం చెప్పారు.


'మంగళాచరణం చేసిన తర్వాత' అని కొందరు, 'సంపూర్ణ వేదాధ్యయనం తర్వాత' అని కొందరు, 'కర్మాచరణ ద్వారా జ్ఞానం కలిగిన తర్వాత' అని వేరొకరు అని వివరణ ఇచ్చారు.


*శంకరులు భావించినదిలా ఉంది:*


బ్రహ్మజ్ఞానార్జనకు పైచూపులు ఉపయోగిం చవు. లోపలి చూపులు ఉన్నవాడే అర్హుడు. లోపలి చూపులు సామాన్యంగా ప్రాప్తించేవి కావు.లోకము అనిత్యం అన్న సత్యం గ్రహించ గలగాలి. అప్పుడే పైచూపు నశిస్తుంది. చిత్తం పరిశుద్ధం అవుతుంది. చిత్తశుద్ధి మోక్షాపేక్షకుదారి ఇస్తుంది. అప్పుడు బ్రహ్మ విచారము అవశ్య కర్తవ్యమవుతుంది.


బ్రహ్మపదార్థమున్నదని తెలిసినా ఏది బ్రహ్మమనే విషయానికి వచ్చేట ప్పుడు తప్పటడుగులు పడతాయి. శరీరాన్నే దేవుడనీ, ఇంద్రియాలనే పరమాత్మ యనీ, విజ్ఞానమునే పరమాత్మ అనీ పలు తెఱగుల వాదాలు ఉన్నాయి. ఎట్టిది పరబ్రహ్మము? ఏది కాదు? ఈ ప్రశ్నలు విచారణ చేసి వ్యాస మహర్షి తన సూత్రముల ద్వారా సందేహ నివృత్తి చేశాడు. వ్యాసుని అభిమతమే సరియైన దని విజ్ఞుల నిర్ణయం. ఆ విషయం బహిర్గతం చేయడానికి వ్యాసుని మించిన వాడుండాలి.అందుకు నియమితుడైన వాడే శంకరాచార్యుడు. భాష్యంవ్రాస్తూ శంకరుడు ఏ రోజు భాష్యం ఆ రోజే శిష్యులకు బోధించేవాడు. ఈ వార్తలు విన్న దగ్గరలో ఉన్న మహర్షులు భాష్య పాఠాన్ని వినడానికి వచ్చేవారు. మూడు వారాలపాటు ఏకధాటిగా సాగి పూర్తయిన ఆ భాష్యం మునుల అనుమానాలను పటాపంచలు చేసింది.


*ఉపనిషత్తులకు భాష్యరచన:*


ఋషులు వేదాంత రహస్యాలను లోకం ముందు ఉంచా లన్న ఉద్దేశంతో ఉపనిష ద్రూపంలో చెప్పారు. పేరుబడిన ఉపనిషత్తులు నూట యెనిమిది. అందులో పదింటికి భాష్యం వ్రాస్తే చాలునని భావించాడు శంకరా చార్యుడు:


*“ఈశ కేన కఠ ప్రశ్న ముండక మండూక్య తిత్తిరి:*

*ఐతరేయంచ ఛాన్దోగ్యం బృహదారణ్యకం తథా”*


*ఈశోపనిషత్తు, కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, ప్రశ్నకోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు, తిత్తిరికోపనిషత్తు, ఐతరేయోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తు,* బృహదారణ్యక ఉపనిషత్తు వీటినే ఎన్నుకొన్నాడు తన భాష్యరచనకు. 


సంశయాలకు తావు లేకుండా క్రొత్తపోకడలను పొందుపరచి ఆ దశోప నిషత్తులకూ అందమైన భాష్యాన్ని రచించి అందించాడు. అద్వైతులకు శిరోధార్యమై వెలయుచున్నాయి ఆ భాష్యాలు.


పైన చెప్పిన భాష్యములు రెండు ముగించిన పిమ్మట శంకరాచార్యుల వారు భగవద్గీతకు భాష్యము వ్రాయడానికి ఉపక్రమించారు. కురు క్షేత్రంలో కౌరవ పాండవ యుద్ధము ఆరంభం అయ్యే సమయానికి అర్జునునకు జ్ఞానం లోపించి యుద్ధం చేయడానికి మనసొప్పక అస్త్రసన్న్యాసం చేశాడు. అది లోకానికి అపూర్వ మైనసందేశం ఇవ్వడానికి మంచి తరుణమని యెంచి శ్రీకృష్ణుడు సంపూర్ణమైన జ్ఞానబోధ చేశాడు అర్జునునకు. బాదరాయణుడు భారతాన్ని రచించే టప్పుడు ఈ భాగాన్ని అక్కడినుండి తీసి ప్రస్థానంలో చేర్చి భగవద్గీత అని పేరు పెట్టి యున్నాడు. 


బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తులు, భగవద్గీత : ఈ మూడింటిని కలిపి ప్రస్థానత్రయము అంటారు.

బ్రహ్మసూత్రాలు నూరినగాని పాకాన పడవంటారు. ఉపనిష త్తులు వినిన సరిపడు నందురు. గీతను ఆచరణ గ్రంథ మంటారు. అగాధ భావములు కలిగి గీత ముముక్షువులకు పెన్నిధిగా భాసిస్తున్నది. గీత తేలికయైన భాషలో ఉన్నా దాని భావాలను బహిర్గతం చేయడం అంత సుళువు కాదు. అప్పట్లో గీత లోని సత్యాన్ని గ్రహించుటకు పాఠకులు తికమక పడడం చూచి భగవద్గీతకు భాష్యం వ్రాయడానికి శంకరా చార్యులు పూనుకోవలసి వచ్చింది.


ఇవి కాక, మరి రెండు ఉపనిషత్తులు నృసింహతాపనీయ ఉపనిషత్తు, శ్వేతాశ్వతరోపనిషత్తు లకు కొందరి కోరికపై వ్యాఖ్య వ్రాశారు. పండ్రెండు మంత్రములతో కూడి మకుటమనిన మాండూక్యోపనిషత్తుకు గౌడపాదులు రెండు వందల పదిహేను కారికలు వ్రాసినా సుబోధకములు కాలేదని వారి కోరికతో శంకరులు భాష్యం వ్రాశారు. ఇది దశోపనిషత్తులలో చేరి యున్నది.


భాష్యత్రయ రచన ముగియడంతో బదరికా వనంవీడి శంకరా చార్యులు వారి శిష్యులు కాశీ పురి చేరుకున్నారు.


*హరహర శంకర కాలడి శంకర*


*శ్రీ శంకరాచార్యచరిత్రము*

*13 వ భాగము సమాప్తము* 

🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃

*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 12

 *శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 12 వ భాగము*

🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷


ఆ భాగీరధీ తీర పరిసరాలలో గల కదంబవనాలు, లతలతో పెనవేసికొన్న పొదలూ ముచ్చటగా చూచాడు. పొదలలో తపస్సు చేసు కుంటున్న మునులు కనబడ్డారు. గంగను దర్శించడంతో అందు స్నానమాడాలనిపించింది. ఆ నిమ్నగను స్తవం చేశాడు.. 


*"భగవతి భవలీలా మౌళి మాలే తవాంభః,*

*కణ మణు పరిమాణం ప్రాణినో యే స్పృశంతిఅమర నగర నారీ చామరగ్రాహిణీనాం,*

*విగత కలి కలంకాతంక పంకే లుఠంతి ||* 

*కాశీ ప్రాంతవిహారిణీ విజయతే గంగా మనోహారిణీ ॥*


గంగా దేవిని స్తుతించి స్నానం చేసి మెల్లిగా కాశీ పట్టణం చేరు కొన్నాడు శంకరా చార్యుడు. 


శంకరాచార్యుడు కాశీ పట్టణంలో అడుగు పెట్టగానే పురజనులు చాల అబ్బురంతో ఆ మహా తేజస్విని చూస్తూ చూస్తూ ఆయనను వెంటాడి వస్తున్నారు. బాల యతీంద్రుడు విశ్వేశ్వరుని ఆలయం ప్రవేశించాడు.

పురవాసులకు బాలశంకరుని వలె గోచరించి సాష్టాంగ ప్రణామాలు చేస్తున్నారు. అందులకు శంకరా చార్యుడు నారాయణ స్మరణ చేస్తున్నారు. శంకరాచార్యుడు విశ్వేశ్వరుని కడకు వెళ్ళి అంజలి ఘటించి స్వామిని శివభుజంగ ప్రయాత స్తోత్రముతో స్తవం చేసాడు.


*సనందుడు శిష్యుడగుట:*


కాశీవాసులే కాక చుట్టుప్రక్కల నివసించే వారెందరో శంకరాచార్యుని దర్శనం చేసికొని వెళ్ళుతున్నారు. ఒకరోజు ఒక బ్రాహ్మణ బాలుడు శంకరాచార్యుల దగ్గరకు వచ్చి సాష్టాంగ వందనం చేసి స్వామి కాళ్ళు రెండూ గట్టిగా పట్టుకొని వదల లేదు అభయం ఇచ్చేదాక. నెమ్మదిగా బాలకుడిని లేవ నెత్తి ఇలా పలకరించారు:


"బాలకా! నీ వెవ్వరు? ఎక్కడి నుండి వచ్చావు? నీకు ఏమి కావాలి? దేనికి అభయం అర్థిస్తున్నావు? వివరంగా చెప్పు.”


గురువర్యా! నేను కావేరీతీరంలోని చోళ దేశస్థుణ్ణి. పెద్ద రోగంతో వ్యథ పడుతున్న వాడిని. మీ ప్రభావము, ఆసేతు హిమాచలం వ్యాపించిన మీ కీర్తిని విని ఇప్పుడు మీరు ఈ కాశీపురంలో ఉన్నారని తెలిసి మిమ్మల్ని వెదుక్కుంటూ మీ పాదపద్మాలకు సేవ చేసి తరిద్దామని వచ్చాను. మీరే నాకు దిక్కు. మీ శరణు కోరి వచ్చిన వాణ్ణి కాదనక ఆశ్రయం ఇవ్వండి. లేకున్న నాకు విముక్తి లేదు” అని మొర పెట్టుకొన్నాడా బాలవిప్రుడు దీనాతి దీనంగా. 


ఆ విశిష్ట బాలుణ్ణి గమనించిన శంకరాచార్యుడు ఆదరంగా అతనిని చేరదీసి “నీ కేమీ భయం లేదు. నిశ్చింతగా ఉండు. నా అండదండలు నీకు ఎప్పుడూ ఉంటాయి. నీ ఆవేదనలు, నీ మనోవేదనలు బాధలు విశదీక రించు. భగవదను గ్రహంతో తీరని రుజలున్నాయా?” అని అడిగారు

శంకరయతి.


"స్వామీ! లోకంలో పలురకాల కర్మలు ఆచరిస్తున్నారు జనులు. పుణ్యకర్మలాచరించి పుణ్యమూ, పాపకర్మ లాచరించి పాపమూ గడిస్తాడు జీవి. కర్మఫలాల అనుభవా నికి తిరిగి తిరిగి జన్మలెత్తుతూంటాడు. మరి ఏ కర్మలు చేస్తే చావు పుట్టుక లు లేకుండా పోతాయో తెలియదు. ఆ సత్యం తమ వంటి మహాజ్ఞానులకు తెలియాలి. నన్ను ఈ భవ రోగమే తీవ్రంగా వేధిస్తోంది. ఈ రోగం నుండి విముక్తి ఒక్క మీ కరుణా కటాక్షం వల్లనే సాధ్యము అవుతుంది. నన్ను ఈ పరమ బాధా కరమైన భవరోగం నుండి తప్పించండి. తమ కృపా కిరణాల ను నాపై కొంచెం ప్రసరింపజేసి నన్ను అజ్ఞానాంధకారము నుండి తప్పించండి. వెలుతురు ప్రసాదిం చండి. నా భవరోగ చికిత్స మీ ఒక్కరి వల్లే సాధ్యం. మీరే దానికి భిషగ్వరులు. దయ చూపండి. నేను మీకు ఈ క్షణం నుండి అధీనుడను. నన్ను శాసించండి" అంటూ ప్రాధేయ పడ్డాడు చిఱుత ద్విజుడు. అంతా విన్న శంకరా చార్యుడు నిశ్చయించుకున్నాడు ఇతడు తనకు ముఖ్య శిష్యుడు కాదగినవాడని. హస్తమస్తకయోగం ద్వారా విప్ర కుమారుని మనస్సు ను కప్పిన అజ్ఞానపు తెరను తొలగించి క్రమ సన్న్యాసాన్ని ప్రసాదించాడు. మహావాక్యోపదేశం కావించి దండ కమండలాలు చేతికి ఇచ్చాడు. ఆ విధంగా శంకరుని హృదయసీమలో సుస్థిరనివాస మేర్పరచుకొన్నాడు. అప్పటి నుండి నిశ్చింతుడై ఉంటున్న అతనికి సనందుడు అనే పేరు స్థిర పడింది. ఆ తరువాత వరుసగా ఆనందగిరి, చిత్సుకుడు శంకరాచార్యుని శిష్యులయ్యారు. 


*కాశీలో ప్రచారము:*


కాశీపురంలో శంకరాచార్యుడు అనుదినమూ వేదాంతబోధలతో తత్త్వబోధలతో భక్తులకు, విద్వాంసు లకు, ముముక్షు మార్గ గాములకు ధర్మసత్యపథాల లోతుపాతులను వివరిస్తూ వారి సంశయాలను పటాపంచలు చేస్తున్నాడు. కమనీయమైన గళంతో గంభీరమైన వాక్కులతో ఎంతో మంది మానసాలను రంజింపజేస్తున్నాడు. పతంజలి వ్రాసిన వ్యాకరణ భాష్యాన్ని విపులపరుస్తూ శబ్దశాస్త్రావగాహన కల్పిస్తున్నాడు. వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్రామాయణంలో గల రసామృతాన్ని వీనుల విందుగా శ్రోతలకు పంచిపెడు తున్నాడు. అలాగే యోగశాస్త్ర రహస్యాలు వివరిస్తున్నాడు.

అలంకారశాస్త్రం లోని అందాలు చూపి అలరిస్తు న్నాడు. అష్టాదశ పురాణాలనూ, ఉపనిషత్సారాన్ని, వేదవిజ్ఞానాన్ని మధురమైన కదళీపాకంగా అందించుచున్నాడు ఆ శంకర యతి. పతంజలి, ప్రాచేత సుడు, కృష్ణద్వైపా యనుడు ఏకమై ఈ రూపంలో అవతరిం చారా అని ప్రఖ్యాతి గాంచాడు.


*చండాలోపాఖ్యానము:*


మిట్ట మధ్యాహ్నపువేళ. మార్గంలో ఒక ఆజానుబాహువు అప్పుడే కోసిన పచ్చిమాంసం మూట కట్టుకుని నెత్తిన వేసుకొని, మరి కొన్ని పచ్చి తోళ్ళు బుజాన వేళ్ళాడదీసుకొని వస్తున్నాడు. ఆతని తల మీది మూట నుండి ఇంకా నెత్తురు కారుతోంది.


ఒక ఆనపకాయ బుఱ్ఱలో కల్లు నింపిన కుండ చంక నుండి వ్రేలాడు తోంది. ఒక చేత దుడ్డు కఱ్ఱ. మద్యం మత్తెక్కేలా సేవించా డేమో త్రేనుపులు విపరీతంగా వస్తు న్నాయి. మధ్య మధ్య కుండ లోని కల్లు కొద్ది కొద్దిగా త్రాగుతున్నాడు. బలిసిన కుక్కలు నాలుగు అతని వెంట వస్తున్నాయి. ప్రచండ భాస్కరునికి జడిసి వీధులు నిర్మానుష్యంగా ఉన్నాయి. మాధ్యాహ్నిక కృత్యాలు నిర్వర్తించడానికై శిష్యసహితుడై గంగానదికి వెడుతున్న శంకరా చార్యునికి ఎదురు అయ్యాడు ఆ చండాలవేషధారి. అల్లంత దూరాన ఆ వ్యక్తిని చూచారు శంకరుని శిష్యులు. తమలో తాము కూడబలుక్కుంటు న్నారు వచ్చేవాడు చండాలుడా కాదా అని. సమీపానికి రాగానే తేల్చు కొన్నారు ఔనని. శిష్యులు ముందూ, వెనుక శంకరా చార్యుడూ వస్తున్నారు. గురువు మీది భక్తితో "దూరం గచ్ఛ! దూరం గచ్ఛ!” అన్నారా వ్యక్తితో. అపుడా వ్యక్తి శిష్యులతో "బాబూ! తామన్న మాట తెలిసింది లెండి. ముందు నా మాట ఇని మరీ యెల్లండి! మీరన్న మాట మీరు తెలిసే అంటున్నారా. నేను మాదిగోణ్ణి

అని ‘దూరం గచ్ఛ’ అంటున్నారా? అలాగయితే మీ మాట కట్టిపెట్టి నామాట ఇనండి. మీరు పొమ్మంటు న్నది ఈ కనిపించే బొందినా? లేక ఇందులో ఏదో ఆత్మ ఉందట దాన్నా? శరీరాన్ని పొమ్మంటే అర్థం లేదు. మీదీ మట్టి కాయమే నాదీ మట్టి కాయమే. మీది బంగారం నాది మట్టీ కాదు కదా! మీ శరీరం పవిత్రం అయితే నాదీ పవిత్రమే. ఆత్మ అంటారా. మీలో ఉండేదీ నాలోపల ఉండేదీ అది ఎక్కడ ఉన్నా ఒకటేనట! ఆ ముక్క కూడా మీ బాపనోరు చెప్పిందే. అశుద్ధం అంటారా! సూరిభగవానుడు మంచి నీళ్ళల్లోనూ కల్లులోనూ కనిపిస్తాడు గదా చూస్తే. రెండు చోట్లా కనిపించే సూరీడుకు ఒకచోట అశుద్ధం ఒకచోట శుద్ధం కాదు కదా! ఏమంటారు? చూస్తే మీరు బాపనోళ్ళులా లేరే! జందాలు లేవు. సన్నాసులా! అయినా ఈవిసయాలు మీకు తెలవక పోతే మీ గురువు నడగండి" అని నిష్కర్షగా అడిగాడు. 


*శంకరాచార్యునికీ సనందునికీ సంభాషణ:*


శంకరుడు: సనందనా! ఇతడు శివుడు కాడు కదా!. 


సనందనుడు: స్వామీ! నాకు ఆ అనుమానం మొదటే తోచింది.


వ్యక్తి : ఏంటి గుస గుసలు మహా సెప్పుకొంటన్నారు?


శంకరాచార్యుడు: స్వామీ! బ్రహ్మ జ్ఞానులకు నమస్కారము!


వ్యక్తి : సన్నాసులు మాకు దండాలు పెట్టడమా!


శంకరుడు: పుల్కసా! నీ వెవ్వరవు? నీ ఊరేది?


వ్యక్తి : సామీ! నేనొక మంత్రగాణ్ణి. లింగడంటారు కొందరు. కొందరు ముండడనీ అంటారు. నా పేరుకేం గానీ మా ఊరు మంత్రాలపల్లి. రాతురులు వల్లకాడే మకాం. నన్ను ఎప్పుడూ విడవని పెళ్ళాం ఉంది. నా బిడ్డడు బొజ్జడు. ఇవీ నా కొన్ని గుట్టు మట్లు.


శంకరుడు: మీ రెవ్వరైతే నేమి బ్రహ్మజ్ఞానికి నమస్కారం చేశాను. అది మీకు చెందుతుంది మీరు బ్రహ్మవేత్తలవడం చేత.


వ్యక్తి : అయితే మాలడన్నా బాపడన్నా ఒకటే అంటావు?


ఆ ప్రశ్నకు సమాధానంగా శంకరాచార్యుడు మనీషపంచకం ఈ క్రిందివిధంగా చదువుతారు:


*జాగ్రత్స్వప్న సుషుప్తిషు స్ఫుటతరా* 

*చణ్ణాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేషామనీషా మమ||*


పుల్కసునకు సమాధానంగా శంకరాచార్యుడు చెప్పిన మనీషా పంచకం యొక్క అర్థం ఇది:


“చైతన్యస్వరూపం మెళకువలోను, నిద్రలోను, స్ఫుటంగా ప్రకాశిస్తుంది. అట్టి అఖండరూపం పిపీలికాది బ్రహ్మ పర్యంతం సాక్షీ మాత్రంగా ఉంటుంది. అలాటి చైతన్య రూపాన్ని నేను” అనే గట్టి నమ్మకం గలవాడు మాలడైనా బ్రాహ్మ డైనా నాకు గురువు. ఇది నా నిశ్చయం. "నేను బ్రహ్మనై ఉన్నాను. లోకాలన్నీ చైతన్యంతో నిండి యున్నవి.సర్వమూ త్రిగుణాత్మక మైన అవిద్య వలన నా చే కల్పింప బడినది" అనే గట్టి నమ్మకం ఎవ్వానికి సుఖ తరమూ, నిత్యమూ, పరమూ, నిర్మలమూ అయిన పరమాత్మ యందు గట్టిగా నిలచునో అతడు మాలడైనా ద్విజు డైనా నా గురువు. ఇది నా నిశ్చయము. గురువునందు అత్యంత భక్తి శ్రద్ధలతో విశ్వమంతా నిశ్చితం గాదని నమ్మిన మనస్సుతో ఇదివరకు చేసినవి, ఇప్పుడు చేస్తున్నవి, చేయబోయేవి పాప కర్మలను దగ్ధం చేశాను. ప్రారబ్ధ భోగాలను సంవిన్మయాగ్నిలో హెూమం చేయ డానికి ఈ శరీరాన్ని అర్పించితిని. ఇదే నా నిశ్చయం. మృగాలు, నరులూ, దేవతలూ, 'నేను, నేను' అని దృఢం గానూ, స్పష్టంగానూ నమ్ముటకు ఏ చైతన్యం వలన అట్టి భావన కలుగుచు న్నదో ఏ చైతన్యం వల్ల ఇంద్రియాలు ప్రకాశిస్తున్నవో, మేఘావృత మయిన సూర్య మండలం దేనివలన ప్రకాశిస్తు న్నదో, అలాటి చైతన్యాన్ని ఏ మహానుభావుడు ఎల్లపుడు భావిస్తూ శాంతుడై ఉంటాడో అతడే నా గురువు. ఇది నా నిశ్చయం. ఏ సుఖ సముద్ర కణలేశాన్ని పొంది ఇంద్రుడు మొ. వారు ఆనందాన్ని పొందు చున్నారో ప్రశాంత చిత్తులైన తాపసులు దేన్నిపొంది ఆనంది స్తున్నారో అట్టి వాడు బ్రహ్మవేత్త కాదు. బ్రహ్మమే. అట్టి వాని పాదాలకు దేవేంద్రుడు కూడ నమస్కరిస్తాడు.


శంకరుడు: సనందనా! ఈతడు చండాలుడు కాదంటావా? పుల్కసా! నీవేదియో మాయ చేస్తున్నట్లు ఊహించవచ్చా? మర్యాదలన్నీ ఎఱిగినవానిలా ఉన్నావు. మేము ధర్మాన్ని నిలబెట్టే వాళ్ళం. 


అంతలో చండాల రూపధారి అదృశ్య మయ్యాడు.


శంకరుడు: సనందనా! ఈతడు ఈశ్వరుడే. మనలను మోసం చేస్తున్నాడు. ఇక్కడ ఎవ్వరూ లేరే?


సనందనుడు: స్వామీ! ఈ కాశీ పట్టణంలో విశ్వేశ్వరుడు ప్రచ్ఛన్నవేషధారియై సంచరిస్తాడని ప్రతీతి.


శంకరుడు: అట్లనా! ఈశ్వరా! పరీక్షకా! మాయ నీ అధీనం.


మాయావీ! మంత్రాయా! సోమాయా! గిరీశా! మహేశా! ముండాయా! శంకరా! గంగాధరా! దేహబుద్ధితో దాసుడను. తత్త్వశాస్త్రరీత్యా మీరే నేను. నేనే మీరు.


ప్రార్థనకు సంతోషించి పశుపతి నిజరూపం లో దర్శనం ఇచ్చాడు.


శివుడు: పరీక్ష ముగిసినది. సర్వజ్ఞుడవయ్యావు. లోకోద్దారకుడవు కమ్ము. వత్సా! వేదవ్యాసుడు అద్వైతమతప్రబోధనకై బ్రహ్మసూత్రాలు రచించాడు. అందు అద్వైతమే పరమ మతమని ఇతరము లు కాదని వెల్లడిం చాడు. అయినా ఆ బ్రహ్మసూత్రాల నిజమైన భావం తెలియక తప్పట డుగులు వేస్తున్నారు కొందరు. అందు చేత తగిన ఆధారాలతో ఆ సూత్రాలకు సరియైన భాష్యం అందించ వలసిన తరుణం ఇది. అందుకు తగ్గవాడవు నీవు ఒక్కడవే. శాస్త్రాలన్నీ క్షుణ్ణంగా ఆకళించుకొని గోవిందభగవత్పాదాచార్యులు కడ మహావాక్యోపదేశం పొంది బహు ముఖాల తీర్చి దిద్దబడిన మనీషివి.


భాస్కరుడు, భట్టపాదుడు, మండనమిశ్రుడు, నీలకంఠుడు, అభినవగుప్తుడు మున్నగువారు అద్వైతమతానికి వ్యతిరేకులై ఉన్నారు. వారిని జయించి చిరకాలం పాదుకొనేలా అద్వైతాన్ని స్థాపించు”.


*కాలడి శంకర కైలాస శంకర* 


*శ్రీ శంకరాచార్య చరిత్రము* 

*12 వ భాగము సమాప్తము*

❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 11

 _*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 11 వ భాగము*_ 

🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗


*శిష్యరికము:*


ఆదిశేషుని అవతారమైన పతంజలి మహా విజ్ఞానియై గొప్ప తపస్సాచరించి గౌడపాదుని శిష్యుడు అయ్యాడు. అట్టి గోవింద భగవత్ పాదుడు తన కడకు చేరిన శిష్యుని గుణగణాలను గ్రహించి నాడు. గురువుకు తగ్గ శిష్యుడు. శిష్యునికి తగ్గ గురువు. అటువంటి జంట కూడుట కడు దుర్లభం. అవతార మూర్తి అయిన శ్రీరామునికి వసిష్ఠుడు, శ్రీకృష్ణునికి సాందీపనిలాగ శంకరాచార్యునికి గోవిందభగవత్ పాదుడు గురువు       అయ్యాడు. మరిగురుసేవ శాస్త్ర సమ్మతంగా, నిష్కళంకంగా జరపాలి. అట్లా చేసినవాడు శంకరా చార్యుడు. సదా గురు స్మరణ, గురుభజన, గురుస్తుతి, గురుసేవ చేస్తూ గురు దర్శనము అయినపుడల్లా సాష్టాంగ వందన మాచరించేవాడు. గురువు కడ బిగ్గరగా మాట్లాడడం ఎరుగడు. అసత్యవాక్కు పలికి ఎరుగడు. కోపము మచ్చుకయినా లేదు. గురువును పలకరించునపుడు సంబోధించి మరీ మాట్లాడేవాడు. గురువు ఉపదేశించిన మహా మంత్రాన్ని నిరంతరం జపించు కొంటూ మననం చేసికొనేవాడు.  గురువునకు సకలోప చారాలూ తానే చేసేవాడు. తనువూ మనస్సూ సకలం గురువుకు సమర్పించి పరమభక్తితో చరించేవాడు. గురువు సకల పాపాలను పటా పంచలు చేయగల సమర్థుడు. కోపంతో గురుడు శపిస్తే దానికి నివృత్తి కల్పించడం బ్రహ్మ రుద్రుల తరం కాదని శంకరాచార్యునికి తెలుసును.గురువు గోవింద పాదుని ఆశయాలు మహోన్నత మైనవి. దానికి తగ్గట్టుగా తీర్చి దిద్దుతున్నాడు ఆ శిష్యశ్రేష్ఠుణ్ణి. అజ్ఞానపు చీకట్లను చీల్చిచెండాడ గల జ్ఞానప్రభాపూర్ణునిగా తయారు చేసికొన్నాడు శంకరాచార్యుని. అలా చేయడానికి నాలుగేండ్లు పట్టింది. దేశంలో విజయ దుందుభులు మ్రోగించగల శక్తి, దృఢసంకల్పము, వాత్సల్యభరిత మనోధృతి తన శిష్యునిలో కలవని నిశ్చయించుకొన్నాడు గోవిందభగవత్పాదుడు.


*నర్మద పొంగును కుండ లోనికి ఎక్కించుట:*


శంకరునికి పదిరెండేడులు ఇంకా నిండలేదు. ఆయన యశము దశదిశలా ప్రాకింది.శంకరాచార్యుని చల్లని చూపులకు మ్రోడులు చిగర్చనై ఉన్నాయి. గోవులకు చక్కని చిక్కని పసరాలను అందించడానికి ఉద్యుక్త మగు తున్నాయి పచ్చని పచ్చిక బయళ్ళు. పొలాలు సస్య శ్యామలం చేసి కొందామని ఉవ్విళ్లూరు చున్నారు కృషీ వలులు. భక్తుల హృదయాలను ఆనందింపజేయడానికి ఉద్యాన వనాలు పుష్ప సంతతిని వికసింప జేయాలని ఉబలాటపడు తున్నాయి. మేఘుడికీ ఆనందం పట్టలేకుండా ఉంది. బ్రహ్మాండం బ్రద్దలయ్యే అట్టహాసపు ధ్వనులతో విద్యుత్కాం తులతో వచ్చాడు. ఇంతలో అంతాకీకారణ్య మయింది.మార్గాలు దుర్గమ మయ్యాయి. చిన్ని తుంపరలతో మొదలై ఏనుగు తొండాల లాగ జలధారలు మారడంతో లోకం భీభత్సంలో మునిగింది. ఆసమయంలో  నర్మద ఒంటరియై విజృంభించి ఊళ్ళు మ్రింగడం మొదలు పెట్టింది. ఎందరో మనుష్యులను, పశువు లను ఆ భీకర ప్రవాహం పొట్టను పెట్టుకొంది. మిగిలిన వాళ్ళు భయ భ్రాంతులై గోవింద భగవత్పాదులకు నివేదించడానికి వచ్చారు. గురుదేవులు బదరి కా వనం వెళ్ళారన్న సంగతి విని నిర్వీర్యులై ఆశ్రమంలో చతికిలబడ్డారు. వచ్చిన వారి ఆర్తనాదాలు విన్న శంకరాచార్యుని మనస్సు కరుణతో ఉప్పొంగింది. నర్మదను అణగారేటట్టు చేయడమే ముఖ్య కర్తవ్యంగా భావించాడు. ఒక సరిక్రొత్త భాండాన్ని తెప్పించాడు. దాన్ని చేత్తో పట్టుకొని, నిమీలిత నేత్రాలతో, నర్మదఎదురుగా నిలబడి ఇలా స్తుతించాడు:

*“సబిందు సింధురస్థల తరంగ రంజితం,*

*ద్విషస్తు దాపజాతకారివారిసంయుతం*

*కృతాంతదూత కాలభూత భీతిహారినర్మదే,*

*త్వదీయ పాదపంకజం నమామిదేవి నర్మదే|*

అని స్తోత్రం చేసి కుండను నర్మదకు ఎదురుగా ఉంచాడు శంకరాచార్యుడు. వెంటనే పాముల వాని బుట్టలో పాము దూరినట్లు కిక్కురు మనకుండా ఆ భాండం లోనికి నర్మదా జలం దూరింది. అప్పుడా నది వేసవి నాటి నర్మదలా ప్రత్యక్షం కావడంతో అందరి కన్నులలో పున్నమి పొడ చూపింది. కలా! మాయా! అన్నట్లుగా ఒక్క క్షణం ఆశ్చర్య చకితు లయ్యారు వచ్చిన జనం. వేల  విధాల శంకరాచార్యుని స్తుతించి వందనాలు అర్పించారు. ఈ అద్భుత ఘటనను గోవింద భగవత్పాదులకు చెప్పారు వారు వచ్చాక. గురువు గారు పరమానంద భరితులయ్యారు.


*శంకరావతార గాథ:*


ఈ నర్మదా నదీ ఘటన వృత్తాంతం విన్న గోవింద భగవత్పాదునకు గతంలో తనకు సంఘటిలిన ఒక ఉదంతం స్మరణకు వచ్చింది. పూర్వం ఒకనాడు హిమాలయ గిరిపై అమరేంద్రుడు యజ్ఞం చేస్తున్నపుడు వేదవ్యాస మహర్షితో గోవిందభగవత్పాదుడు ఇట్లా మాట్లాడాడు. “మహాత్మా! మీరు వేదాలను విభజించి లోకోప కారం చేసారు. పదునెనిమిది పురాణాలు రచించాడు. యోగ శాస్త్రాన్ని వ్రాశారు. పతంజలి యోగశాస్త్రానికి భాష్యం చేకూర్చారు. ఇదీ కాక వేదసారంలో ఉపనిషత్తులను చవిగా కలిపి నారికేళపాకంగా అందించారు బ్రహ్మసూత్రాలనే పేరిట. అది వెలలేని గ్రంధరాజమై వేదాంత తత్త్వానికి శిరోభూషణమై విరాజిల్లు తోంది. కాని నేటి చిక్కేమంటే బహుళ ప్రచారంలో ఉన్నా ఏకాభిప్రాయం కుదరక భిన్నభిన్న దృక్పథాలు వెలువడి సత్యము కనుచూపులో కానకుండా పోతున్నది. ఆ సూత్రముల లోతుపాతులు తమకే తెలియును కదా! మీరే ఆ వ్యాఖ్య అందిస్తే ముముక్షువులు ధన్యులవు తారు” అని వ్యాసుని వేడు కొన్నాడు గోవింద భగవత్పాదుల వారు.


అందుకు సమాధానంగా ఆ మహర్షి ఈ విధంగా తెలియ పరచారు.


"ఆచార్య వర్యా! ఒకప్పుడీ ప్రస్తావన వచ్చినపుడు శివుడు చెప్పిన పరమ రహస్య మేమి టంటే, వ్యాసమహర్షికి దీటయిన ప్రతిభా సంపత్తులతో శివావతార సంభూతు డయినవాడు నీకు ప్రధానశిష్యుడై వస్తాడు. నర్మదానది భయంకరంగా పొంగిన తరుణంలో ఆ వెల్లువను కడవలోనికి ఎక్కిస్తాడు. అదే ఆనమాలు సుమా!" ఈ పలుకులు మనః ఫలకంలోనికి హఠాత్తుగా స్మరణకు వచ్చాయి. ముప్పిరి గొన్న ఆనంద బాష్పాలతో ఆ మహనీయ శిష్యుణ్ణి పారవశ్యాతిరేకంతో బిగిగా కౌగిలించు కొన్నాడు. విచిత్ర మేమిటంటే ఆ కౌగిలి మామూలు కౌగిలి కాదు. గోవింద భగవత్పాదాచార్యునినుండి దివ్యశక్తులు అన్నీ శంకరా చార్యునికి దత్తం చేయబడ్డాయి. తనకు జ్ఞప్తికి వచ్చిన కథను కూడా శిష్యునికి వినిపించాడు.


*కాశీప్రయాణము:*


గోవిందభగవత్పాదాచార్యుడు ఒకనాడు శంకరా చార్యుని పిలిచి ఆప్యాయంగా దగ్గరకు తీసికొని ఇలా సెలవి చ్చాడు: “ఆచార్యా! నీవు నా దగ్గఱ నేర్వ దగ్గది పూర్తి అయింది. నీవు ఇక్కడ ఉండ వలసిన పని లేదు. తిన్నగా కాశీ పట్టణానికి వెళ్ళి కైలాసనాథుని, అన్నపూర్ణా మాతనూ దర్శించుకో. వారు నీ రాకకు ఎదురు చూస్తూంటారు. అన్ని ఏర్పాట్లు సమకూరుస్తారు. 


విద్యలకు నిలయమై, పరమ పవిత్రమైనదా స్థలం. నీవు చేయవలసిన ప్రక్రియలకు అచటనే నాంది. అచ్చోట నుండే బ్రహ్మసూత్ర భాష్యకారుడవు కమ్ము. అపచారభ్రష్ట మగుచున్న అద్వైతమునకు ప్రస్థాపనము చేయవలసి ఉంది. నీకు చెప్పదగినది లేదు. త్వరపడుము" గుర్వాజ్ఞకు మించినది లేదని తెలుసును శంకరాచార్యునికి. గురువుకు సాష్టాంగ ప్రణామం చేసి అంజలి ఘటించి నిలబడ్డాడు వారి అనుమతి కోసం. దిగ్విజయం పొందమని ఆశీర్వదించి నారాయణ స్మరణలు అనుగ్రహించాడు గురువు. వెనుతిరుగక ధర్మసంస్థాపనార్థం వెళ్ళే వీరవర్యునిలా సాగి పోతున్న శిష్య శేఖరునికి అభయం ఇస్తూ 'జయోస్తు' 'జయోస్తు' 'జయోస్తు' అని దీవించాడు గురుడు మహదానందంగా. తనలో గల మహిమ నెరుగని బాలుడు, తన కార్యభారం అపార మని తెలియని బుద్ధిమంతుడు, మితిమీరిన ఆటంకాలు కలుగునని యెరుగని వీరుడు శంకరా చార్యుడు. గురు కార్యం నెరవేరుతుం దన్న ధైర్యంతో గుర్వాజ్ఞనే వజ్రా యుధంగా చేసి కొన్నాడు. తాను గురు సాన్నిధ్యాన్ని విడనాడినా ఆ గురువునే తన హృదయాంత రాళాలలో ప్రతిష్ఠించుకొని ముందుకు పోతున్నాడు.


*గంగావతరణ గాథ:*


శంకరాచార్యుడు గంగానదీ పరిసరాలకు చేరుకుంటు న్నప్పుడు దివినుండి భువికి తెచ్చిన భగీరథ ప్రయత్నం గుర్తుకు వచ్చింది. కపిల మహర్షి కోపాగ్నికి అరువది వేలమంది సాగరులు భస్మమై పోయారు. వారికి ఉత్తరగతులు కల్పించ డానికి సగరుడు, అంశు మంతుడు, దిలీపుడు విఫలురయ్యారు. వారి తర్వాత భగీరథుడు అకుంఠిత సంకల్పంతో అనితరసాధ్యమైన మహా ఘోర తపస్సు చేసి గంగను భువికి రమ్మని ప్రార్థించాడు. గంగ అతనితో “రాజా! నా ప్రవాహ వేగాన్ని భూమి తట్టుకోలేదు. ఒక్క ఈశ్వరునికే అది సాధ్యం" అని చెప్పింది. అపుడు తిరిగి పరమేశ్వరుని గూర్చి తపంచేసి మెప్పించి వేడుకొన్నాడు గంగను శివుని తల మీదుగా భువికి దించడం కోసం. ఈశ్వరుడు ఒప్పుకొన్నాడు. ఉఱకలు వేసికొంటూ మహావేగంతో వస్తున్న గంగ కాస్తా శివుని జటా జూటంలో చిక్కు కొంది. మరల భగీరథుడు పరమేశ్వరుని వేడు కొన్నాడు: "గంగాధరా! శంకరా! ఆర్తత్రాణ పరాయణా! కరుణా సాగరా! విశ్వదేవా! మహాదేవా! భక్తవత్సలా!” గంగను విడువు మని మనసా వేడుకున్నాడు భగీరథుడు.


ప్రసన్నుడైన పశుపతి గంగను దిగవిడచాడు పర్వతాల మీదుగా. అందుండి కన్నూ మిన్నూ కానక పరుగులెత్తిన ఆ దేవనది ఒకచోనున్న మునివాటికను ముంచడం మొదలు పెట్టింది. అది జహ్నుముని ఆశ్రమం. ఆయన కోపం గంగను మ్రింగింది. వెనుకనే పరుగెత్తి వస్తున్న భగీరథునికి మరల మరొక అంతరాయం వాటిల్లింది. పరితాపంతో అర్థించిన భగీరథుని గోడు విని కరుణించి మ్రింగిన గంగను కర్ణం ద్వారా విడిచిపెట్టాడు పవిత్రతకు భంగం లేకుండా. అక్కడి నుండి కదలి తూర్పు ముఖంగా పారి  పాతాళలోకం సొచ్చి సగరుల  భస్మ రాశులను ముంచింది జాహ్నవి. శంకరాచార్యునికి భాగీరథీ దర్శన మయ్యింది.


*కైలాస శంకర కాలడి శంకర* 


*శ్రీ శంకరాచార్య చరిత్రము* 

*11 వ భాగము సమాప్తము*

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 10

 _*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 10 వ భాగము*_ 

🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅


*కాలడిని విడనాడుట:*


ఒకనాడు బ్రహ్మచర్యాశ్రమం నాటి పలాశ దండాన్ని వదలి దాని స్థానే జ్ఞానదండం వహించాడు. రాత్రంతా పూర్ణ ప్రక్కన ఉన్న కృష్ణాలయంలో గడిపాడు. తెల్లవారు జామున లేచి, అరుణో దయవేళకే కాలకృత్యాలు తీర్చుకొన్నాడు. తన ప్రయాణానికి అంతరాయం ఉండదని, రవి రాకుండా బయలు దేరడానికి సిద్ధ మయ్యాడు. ఎలా తెలిసిందో ఊరు ఊరంతా వచ్చి ముట్టడించారు శంకరుని.  వచ్చినవాళ్ళలో ఉన్న తల్లిని చూచి సాష్టాంగ వందనంచేసి సెలవడిగాడు. ఆమె నోట మాట రాలేదు. మౌనం అర్థాంగీకారమని వచ్చిన వారందరి దగ్గతా సెలవు తీసికొని ఉత్తర దిశగా అడుగులు వేశాడు. ఊరివారు శంకరుని వెన్నంటే వస్తున్నారు.  ఊరు దాటినా వారు వదిలి పెట్టలేదు. శంకరుడు లేని ఊరిలో ఉండ గలమా! అనుకొంటున్నారు. జయజయ ధ్వానాలు మిన్ను ముట్టడంతో శంకరునికి అర్థమైంది ఊరందరూ తన వెంటే ఉన్నారని. అపుడు వారిని ఉద్దేశించి "తండ్రులారా! తల్లులారా! నేను దేశం విడిచి వెళ్ళిపోవడం లేదు. మీ మీ పనులు మానుకోకండి. ఇళ్ళకు వెళ్ళండి. నాపై నున్న ప్రేమను ఊరిపై పెట్టండి. దయ యుంచి మరలి వెళ్ళండి” అని ప్రార్థించాడు. విడువ లేక విడువ లేక మరలు ముఖాలు పెట్టారు ఆ ఊరి జనం. మనస్సులలో చింతా, విచారమూ అలముకొని కన్నీరుగా ప్రవహించాయి.


*గురువుకడకు ప్రయాణము:*


కోటిసూర్య తేజస్సుతో వెలిగి పోతున్న శంకర బాలయతిని ఎవరా అని సిగ్గుతో తొంగి చూస్తు న్నాడు బాలభాస్కరుడు. పల్లెలూ పట్టణాలూ దాటి వెళ్ళుతున్నాడు. దారిలో ఉన్న ఊరి ప్రజలు చాలా ఆసక్తిగా ఆశ్చర్యసంభూ తులై సందర్శించు కొంటున్నారు ఆ అవతార మూర్తిని. ఎలా ఉంది ఆ విగ్రహం! పసిమి చాయ తోడి పాల బుగ్గలు. దొండపండును మించిన అధరోష్ట్రము. శ్రీకారాలను మించిన దానిమ్మపండు రంగుకల వీనులు. పద్మ దళాలను పోలిన నేత్రాలు. లేత అరటి దూట వంటి కాలుచేతులు.బంగరు మేనిఛాయ. తళ తళ లాడే విభూతి రేఖలు. పాదపద్మాల నుండి పావుకోళ్ళకు జారుచున్న దానిమ్మ పుప్పొడి. చూచిన వారికి కన్నుల పండు వైంది. వీధులలో శంకరుడు నడచి వెడుతుంటే అరుగులపై కూచున్న వాళ్ళు చరచరా దిగి వచ్చి ఆ బాలయతికి వినయ విధేయ తలతో నమస్కారాలు  అర్పించే వారు. కొందరు ఆయన వెంట కొంత దూరం నడచి వెళ్ళేవారు. అప్రతిహత తేజంతో విరాజిల్లే ఆ బాల సన్న్యాసిని చూచి సంబర పడని వారు లేరు. మరికొందరు ఆ బాలుని తనివి తీరా పలకరించి అట్టిభాగ్యం తమకు లభించి నందుకు మురిసి పోయేవారు. అట్టివారికి శంకరుడు ఇచ్చే సందేశం ఎప్పుడూ ఇదే: “ధర్మం మఱువకుండా ఆచరించండి. సత్యాన్ని విడువకండి”.


ఊరి బయట బయళ్ళలో గోపాలబాలునిగా భ్రమించి ఆలమందలు మోరలెత్తి దగ్గఱగా సమీపించేవి. గోపాలురు ఆ వింత చూచి పరుగుపరుగున వచ్చి పడే వారు. వన్యమృగాలు బహుళంగా విహరించే కారడవిలోనుండి వెళ్ళడం శంకరునికి కష్టమనిపించ లేదు. అలా కొంత దూరం పోయాక మార్గం కంటకా వృతమయ్యింది. జాగ్రత్తగా అడుగులిడుతూ నడుస్తు న్నాడు. ఇరుపార్శ్వాలు దట్టమైన పొదలు అలుముకొని ఉన్నా ఆయన పురోగతికి అడ్డులేదు. వనంలోని మృగాలకు బాలయతి అర్థనారీశ్వరుడై కన్పట్టాడు. బహుదూరంగా ఉన్న సింహాలు తమ ఏలిక గిరిజయే వచ్చిందని శంకరుని వామ పార్శ్వం చేరాయి. మహానాగులు పడగ విప్పి ఛత్రం పట్టాయి. గజరాజులు ఘీంకారం చేస్తూ తొండాలెత్తి జేజేలు పలికాయి. పరమాత్మ చింతనలో ఉన్న ఆ అవతార పురుషుని మహిమలు ఎవరూహించ గలరు?


*నర్మదా నదీ ప్రాంతము:*


మన బాలశంకరుడు నర్మదానదీ ప్రాంతం చేరుకోబోతున్నాడు. లోకోత్తర మహాపురుషుడు అన్న వార్త తెలిసిన వాయుదేవుడు తన పరివారాన్ని ఆయత్తపరచి దారి పొడుగునా వృక్షరాజ ములచే వంగి వంగి నమస్కారాలర్పించ జేసాడు. పరిమళములు గుబాళించే పుష్ప వర్షాన్ని కురిపించి స్వాగతం పలికాడు. అందుండి సమీరుడు బాలయతిని ఒక నందన వనంలోనికి ప్రవేశ పెట్టాడు. కొంత విశ్రాంతి తీసికొన్న పిమ్మట మధురాతిమధురమైన ఫలాలను నివేదన చేశాడు. ప్రయాణపు బడలిక లేకున్నా ఆ పండ్లు తిని ఒకింత తడవు విశ్రమించాడు శంకరుడు. ముందు ముందు పోగా పోగా మునులు నివసించే జాడలు పొడగట్టాయి. మరి కొంత దూరం ఆ వైపుగా నడవగా ఆరవేసిన మునులు కట్టే బట్టలు కనబడ్డాయి. అక్కడ జంతువులు తమ తమ సహజ వైరం మరచి పరస్పర మైత్రీ భావంతో మెలగుచున్నాయి.


శంకరుడు రావడం చూచిన ఋషులు ఆడబోయిన తీర్థం ఎదురైంది అనుకొన్నారు. అతని లేబ్రాయమూ, దివ్యతేజమూ చూచి విభ్రాంతులయ్యారు. బాల్యంలోనే పరమవిరాగి అయిన అతని పూర్వభవ పుణ్యానికి విస్తుపోయారు. ఒక ముని ప్రశ్నించాడు: "బాలకా! ఎందుకో ఈ తావు చేరావు? ఎచటికి పోనుంటివి?” “మునివర్యా! గోవింద భగవత్పాదాచార్యుల కడకు నా ప్రయాణం" అని శంకరుని సమాధానం.


*శ్రీగోవింద భగవత్పాదాచార్యుల సన్నిధి:*


అప్పుడా ముని మారు మాటాడక తనతో రమ్మని దారి చూపుచూ ముందుకు నడుస్తున్నాడు.దగ్గరలో ఉంది ఒక గుహ. అక్కడికి చేరాక అందు దేదీప్య మానంగా వెలుగొందుచున్న గురువర్యుడు కానవచ్చాడు బాలయతికి. అది తన గురుని సన్నిధియే అని గ్రహించి శంకరుడు గుహ చుట్టూ ప్రదక్షిణచేస్తూ ఇలా ప్రార్థించాడు. 


“సద్గురుదేవా! జ్ఞానదాతా!

పరబ్రహ్మస్వరూపా! బ్రహ్మానందదాయకా! నిరంజనా! నిర్వికల్పా! సర్వధీసాక్షిభూతా! త్రిగుణాతీతా! దివ్యమూర్తీ! పూర్ణకృపానిధీ! ప్రసన్నాత్మా! యోగీశ్వరేశ్వరా! జ్ఞానస్వరూపా! నిరాకారా! చిదానందా! సచ్చిదానందా! జగద్గురో!”


అని ప్రధమ ప్రదక్షిణ చేసాడు. “విశ్వాతీతా! నిష్కళంకస్వరూపా! సమస్త జగదాధారమూర్తీ! దీనబాంధవా! ప్రణవ స్వరూపా! మహాప్రాజ్ఞా! త్రికాలజ్ఞా! ద్వంద్వాతీతా! సద్గురుమూర్తీ! ఆర్తత్రాణ పరాయణా!వందనములు” అని ప్రార్థిస్తూ రెండవ ప్రదక్షిణం. 


మూడవ ప్రదక్షిణం చేస్తూ ఇలా స్తుతించాడు గురువును: “నాదబిందుకళాత్మకా! జన్మకర్మనివారకా! భవతారకా! సర్వకారణ మహేశ్వరా! భూతాత్మా! భక్తవత్సలా! పురుషోత్తమా!”.


బిలద్వారానికి ఎదురుగా నిలబడి ఉన్నాడు శంకర యతి. ఆ ద్వారం చాలా చిన్నదిగా ఉంది. "స్వామీ! నిన్ను ఆశ్రయించ డానికి వచ్చిన దీనుడను. ఆత్మతత్త్వాన్ని బోధించి తరింప జేస్తూ అఖిలానందాన్ని ప్రసాదించుటకు అవతరించిన మహామహుడవు. శేషశయనునకు హాయి నిచ్చే ఆదిశేషుడవు. మమ్ము తరింపజేయుటకు వెలసిన కరుణామయుడవు. విశాల హృదయంతో వ్యాకరణశాస్త్రానికి భాష్యం అందించిన అప్రమే యుడవు. శరణని వేడిన శిష్యునిలో బంధింపబడి యున్న జుగుప్స, సంశయము, శీలము, కులము, బలము, భయము, మోహము, దయ అనబడే ఈ ఎనిమిది పాశాలను ఛేదించ గలవాడే సద్గురువని తెల్పి యున్నావు. అన్నింట మిన్న అయిన మిమ్ములను ఆశ్రయించ వచ్చాను”. అప్పుడు శంకరుడు ఈ విధంగా గుర్వష్టకం చదివాడు:


'శరీరం సురూపం తథా వా కలత్రం, 

యశశ్చారు చిత్రంధనం మేరు తుల్యమ్ మనశ్చేన్న లగ్నం గురో రంఘ్రి పద్మే, తతః కిం తతః కిం తతః కిం తతఃకిమ్


"గురుదేవా! వేరొకరి శరణుగానక మీ శరణు గోరి మీ చరణములు శిరమున దాల్చగోరి వచ్చిన వాడను. ఇదిగో మీ శిష్యుడు. అనుగ్రహించుడు. మీ యిచ్ఛ చొప్పున శాసించుడు" సవినయంగా నివేదించాడు శంకరుడు. ఆ పలుకులు వీనులకు విందులై ఈ తెఱంగున ఎవరూ వేడుకొన లేదే!' అని మదిలో తలపోసాడు శ్రీ గోవింద భగవత్పాదా చార్యులు.


*గురువుకు తానెవరో ఎఱిగించుట:*


చేతులు జోడించి బిలద్వారానికి ఎదురుగా వినయం ఉట్టి పడుతూ నిలబడిఉన్న ఆ బాలుణ్ణి “ఎవ్వడవు నీవు?” అని ప్రశ్నించారు గురువు. గురుడు కరుణామూర్తియై ఉన్నాడని తన పంట ఫలించిందని గ్రహించి ఈ క్రింది రీతిని చెప్పుకొంటున్నాడు.


“మనో బుద్ధ్యహజ్కార చిత్తాని నాహం, న జిహ్వా న చ ఘ్రాణ నేత్రమ్ న చ వ్యోమ భూమి ర్నతేజో న వాయు:, చిదానన్దరూపః శివోహం శివోహమ్–

ఈ అతుల విన్నపం విన్న శ్రీ గోవిందభగవత్పాదా చార్యులు పరమానంద భరితులై శంకరుని దగ్గరకు రమ్మని పిలిచారు.


*శంకరయతి శంకరాచార్యుడగుట:*


మన శంకరుని సన్న్యాస కర్మకాండ పూర్తి కావడానికి మరొక అంశం ఉంది. శిఖ, యజ్ఞోపవీతం విసర్జించాలి. ఆ పని కాస్తా గురువులు యధావిధిగా జరిపించారు. తక్కుగల కర్మకాండ యావత్తూ శాస్త్రోక్తంగా నిర్వర్తింపజేసి మహా మంత్రోపదేశం చేశారు. పిమ్మట మహావాక్యోప దేశం చేసారు. పూర్వాశ్రమంలో పెట్టిన పేరు విసర్జించాలి. అంతే కాదు విస్మరించాలి. జన్మించిన ఊరి పేరే కాక తల్లిదండ్రుల పేర్లు కూడా తలపరాదు. చెప్పరాదు. సన్న్యాసంతో అవన్నీ పోతాయి. ఈ ఆశ్రమం లోనిది క్రొత్త పుట్టుక. క్రొత్త పేరు ధరించాలి. శ్రీ గోవిందపాదులు ఆలోచించి శంకరాచార్యుడు అని నామకరణం చేసారు. శంకరుడంటే ఆనంద కరుడని. ఇది ఈ యతికి అన్వర్థనామం. తల్లిదండ్రులు పెట్టిన పేరు ఈ ఆచార్యరూపంలో ప్రసిద్ధి కెక్కినది. నేటి పీఠాధి పతులకూ ఇదే నామం. ఇక గురుపరంపరకు వస్తే పరాశరునకు వ్యాసుడు, వ్యాసునకు శుకుడు, శుకునకు గౌడపాదుడు, గౌడపాదునకు గోవింద భగవత్పాదుడు, గోవింద భగవత్పాదునకు శంకరాచార్యుడు శిష్యులైనారు.


*కైలాస శంకర కాలడి శంకర*


*శ్రీ శంకరాచార్య చరిత్రము* 

*10 వ భాగము సమాప్తము*

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

రాశి ఫలితాలు

  (16-09-2024) రాశి ఫలితాలు


గురు నారాయణ భవిష్యవాణి వారి ఉచిత నిత్య రాశి ఫలితాలు మీ రాశి ఫలితాలు

మీరు ఏ సమస్యల్లో ఉన్నా మీ జాతకం/హస్తరేఖలు చూసి మీ సమస్య లకు పరిష్కారం చేయగలం సమర్ధులం పూజ/గ్రహజపం/హోమం ద్వారా ఖచ్చితంగా పరిష్కారం చేయగలం ఇప్పుడే ఫోన్ చేయండి  "జ్యోతిష్య రత్న" జరిగిన విషయం లు చెప్పి మీ భవిష్యత్తు చెప్పగలం వివాహం నకు జాతకం లు సరిపోల్చుట కూడా చూడబడును మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి 7981622895 గత 35 సంవత్సరంల నుండి ఇదే ఫీల్డ్ లో ఉన్నాం మా దగ్గర సిద్ధి పొందిన మంత్రాలు ఉన్నాయి మా గురువు ల ద్వారా మాకు వచ్చాయి. విద్య ఉద్యోగం వివాహం సంతానం కారాగృహ విముక్తి అనారోగ్యం రాజకీయ పదవులు ఋణ విమోచనం వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి రోగ నివారణ శత్రువులు నుంచి రక్షణ గృహ నిర్మాణం ఇలా ఏదైనా పరిష్కారం చేయగలం సమర్ధులం హోమం ద్వారా ఖచ్చితంగా మీ కోరికలు తీరేలా చేయిస్తాం మీ కోరికలు తీరకపోతే మీ ధనం వాపసు ఇస్తాం షరతులు వర్తిస్తాయి మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి

సకల శుభ పౌరోహిత్యం కార్యక్రమాలు చేయించబడును



మేషం

 16-09-2024

ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. పనులు చకచకా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు.


వృషభం

 16-09-2024

ప్రయాణాలు మధ్యలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. ఆరోగ్య ఈ విషయంలో  కొంత శ్రద్ధ వహించాలి.  వృధా ఖర్చులు పెరుగుతాయి. దైవచింతన కలుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలు అంతగా అనుకూలించవు. వ్యాపారాలు అధిక కష్టంతో అల్ప ఫలితాన్ని పొందుతారు.


మిధునం

 16-09-2024

బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు  వేగవంతం చేస్తారు. గృహమున బాధ్యతలు చికాకు పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వ్యాపారమున ఆలోచించి ముందుకు సాగడం మంచిది. ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి.


కర్కాటకం

 16-09-2024

ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఎంతటి వారినైనా మీ మాట తీరుతో ఆకట్టుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపార వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి.


సింహం

 16-09-2024

ధార్మిక సేవా  కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి.  మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు బాధ పడతాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.


కన్య

 16-09-2024

నూతన ఉద్యోగయోగం ఉన్నది. కుటుంబ విషయంలో   ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన  వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఉద్యోగులకు నూతన  వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగాలలో ఆశించిన స్థానం చలనాలు కలుగుతాయి.


తుల

 16-09-2024

ఆకస్మిక ప్రయాణ నువ్వు చాలా ఉన్నవి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి ముఖ్యమైన  పనులు వాయిదా పడతాయి. మిత్రుల నుంచి రుణ ఒత్తిడి అధికమవుతుంది. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళంగా సాగుతాయి.


వృశ్చికం

 16-09-2024

ముఖ్యమైన  కార్యక్రమాలలో అవాంతరాలు కలుగుతాయి. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. అధిక శ్రమతో కానీ  గాని పనులు పూర్తి కావు. స్వల్ప  అనారోగ్య సమస్యలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.


ధనస్సు

 16-09-2024

సన్నిహితుల  నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన  పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రులతో సఖ్యత నెలకొంటుంది. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి.


మకరం

 16-09-2024

 వృత్తి వ్యాపారాలలో  శ్రమ తప్ప ఫలితం కనిపించదు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. బంధువుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. ఉద్యోగాలలో శ్రమ మరింత అధికం అవుతుంది.


కుంభం

 16-09-2024

బంధువుల నుండి అందిన శుభవార్తలు ఉత్సాహాన్నిస్తాయి. సోదరులతో భూవివాదాలు కొలిక్కి వస్తాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. దూరపు నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.


మీనం

 16-09-2024

నూతన ఋణ యత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి.

భార్య ఇంటికి ఆభరణం!!*

 భార్య ఇంటికి ఆభరణం!!* 

(నేడు ప్రపంచ వివాహ దినోత్సవం)

* భరించేది భార్య,

* బ్రతుకు నిచ్చేది భార్య,

* చెలిమి నిచ్చేది భార్య 

* చేరదీసేది భార్య 

* ఆకాశాన సూర్యుడు లేకపోయినా...

ఇంట్లో భార్య లేకపోయినా...

అక్కడ జగతికి వెలుగుండదు,

ఇక్కడ ఇంటికి వెలుగుండదు. 

* భర్త వంశానికి సృష్టికర్త 

* మొగుడి అంశానికి మూలకర్త,

*కొంగు తీసి ముందుకేగినా...

* చెంగు తీసి మూతి తుడిచినా...ముడిచినా..

తనకు లేరు ఎవరు సాటి 

* ఇలలో తను లేని ఇల్లు... కలలో....

ఊహకందని భావన...

* బిడ్డల నాదరించి...

* పెద్దల సేవలో తరించి

* భర్తని మురిపించి..

మైమరపించి...

* బ్రతుకు మీద ఆశలు పెంచి... 

* చెడు ఆలోచనలు త్రుంచి...

* భ్రమరం లా ఎగురుతూ...

* భర్త ను భ్రమల నుండి క్రిందకు దించుతూ...

* కళ్ళు కాయలు కాచేలా...

* భర్త జీవితాన పువ్వులు పూచేలా చేసిన

జీతం లేని పని మనిషి.

 

జీవితాన్ని అందించే మన మనిషి.

 ... 

ఏమిచ్చి తీర్చుకోగలం భార్య రుణం 

ఆమెకు భారం కాకుండా ఉండడం తప్ప.. 


ఒకరికి ఒకరు తోడు నీడ చిరకాలం. 


బిడ్డల బాధ్యతలు తీరాక వృద్ధాప్యంలో నూతన వసంతం తోడు నీడ బంధం. 


అదే భార్యకు మనమిచ్చే విలువైన ఆభరణం..!

జ్ఞానం మీద ఆధారపడి నడిచింది

 హరి ఓం. సనాతన ధర్మం లో కులాలు కాదు. వర్ణాలు.*హిందూ ధర్మం జాతిని అనుసరించి ఉద్భవించింది కాదు* హిందూ ధర్మం

జ్ఞానం మీద ఆధారపడి నడిచింది


జన్మించిన కులం వల్ల కాదు. 


(వజ్రసూచికోపనిషత్తు ప్రకారం ..) 

 🙏🙏🙏

1. ఋష్యశృంగుడు .. జింకలు పట్టుకునే జాతులకు పుట్టినవాడు.


2. కౌశికుడు .. గడ్డి కోసుకునే జాతికి చెందినవాడు.


3. జంబూక మహర్షి .. నక్కలు పట్టుకునే జాతివారు ..


4. వాల్మీకి .. ఓ కిరాతకుల జాతికి చెందిన వాడు. ఈతను రచించిన రామాయణం .. హిందువులకు పరమ పవిత్రమైన గ్రంథం. ఈయన్ని ఆదికవిని చేసి పూజిస్తారు.


5. వ్యాసుడు .. ఓ చేపలుపట్టే బెస్తజాతికి చెందినవాడు. హిందువులకు పరమపవిత్రమైన వేదములు .. ఈయన చేత విభజన చేయబడ్డవే. అందుకే ఇతణ్ణి వేదవ్యాసుడు .. అని పూజిస్తారు. 


6. గౌతముడు .. కుందేళ్లు పట్టేజాతికి చెందినవాడు.


7. వశిష్టుడు .. ఓ వేశ్యకు పుట్టినవాడు. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. ఈతని భార్య మాదిగ స్త్రీ అయిన అరుంధతీదేవి. ఈరోజుకు కూడా నూతన దంపతులచేత అరుంధతీవశిష్టులకు నమస్కారం చేసే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ప్రతి పూజలోనూ హిందువులచేత .. అరుంధతీవశిష్ఠాభ్యాం నమః .. అని పూజలందుకుంటున్నారు. 


వీరి కుమారుడు శక్తి. ఇతని భార్య ఓ మాదిగ వనిత .. ఛండాలాంగని. వీరికుమారుడే పరాశరుడు. ఈతను ఓ బెస్తవనిత మత్స్యగంధిని వివాహమాడి వ్యాసుణ్ణి కన్నారు. 


8. అగస్త్యుడు .. మట్టి కుండల్లో పుట్టినవాడు.


9. మతంగ మహర్షి.. ఒక మాదిగవాని కుమారుడు. బ్రాహ్మణుడయ్యాడు. ఈతని కూతురే .. మాతంగకన్య .. ఓ శక్తి దేవత. కాళిదాసుతో సహా ఎందరో మహానుభావులు ఈ మాతను ఉపాసించారు. ఉపాసిస్తూ ఉన్నారు. ఈమే శ్యామలాదేవి.


ఇంకా ..


1. ఐతరేయ మహర్షి ఒక దస్యుడి మరియు కిరాతకుడి కుమారుడు .. అంటే నేటి లెక్కల ప్రకారం SC or ST. జన్మ బ్రాహ్మణుడు కాదు. కానీ అత్యున్నతమైన బ్రాహ్మణుడు అయ్యాడు. అతను వ్రాసినవే ఐతరేయ బ్రాహ్మణం మరియు ఐతరేయోపనిషత్తు. ఐతరేయ బ్రాహ్మణం చాలా కష్టమైనది. ఇది ఋగ్వేదాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తారు.


2.  ఐలుష ఋషి ఒక దాసీ కుమారుడు. అతను ఋగ్వేదంమీద రిసెర్చ్ చేసి చాలా విషయాలు కనిపెట్టాడు. అతన్ని ఋషులందరూ ఆహ్వానించి తమకు ఆచార్యుణ్ణి చేసుకున్నారు ( ఐతరేయ. బ్రా. 2.19)


3. సత్యకామ జాబాల మహర్షి ఒక వేశ్య కుమారుడు. తండ్రి పేరే కాదు.. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. కానీ జ్ఞానం చేత బ్రాహ్మణుడు అయ్యాడు.


ఉన్నతవంశాలలో పుట్టినవారిని కూడా వారిధర్మం నిర్వర్తించకపోతే .. వారిని నిర్మొహమాటంగా బహిష్కరించారు ... వారిలో కొందరు


1. భూదేవి కుమారుడు .. క్షత్రియుడైన నరకుడు .. రాక్షసుడైనాడు.


2. బ్రహ్మవంశజులైన హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణుడు,.. బ్రాహ్మణులైనా .. రాక్షసులయ్యారు ..


3. రఘువంశ మూలపురుషుడైన రఘుమహారాజు కుమారులలో ఒకడు అయిన ప్రవిద్ధుడు .. రాక్షసుడైనాడు. 


4. త్రిశంకుడు క్షత్రియుడు. కానీ చండాలడు అయ్యాడు.


5. విశ్వామిత్రుడు క్షత్రియుడు.. బ్రాహ్మణుడైనాడు .. వీరి వంశస్తులే .. కౌశికస గోత్ర బ్రాహ్మణులయ్యారు. విశ్వామిత్రుని కుమారులు కొందరు శూద్రులయ్యారు.


6. నవ బ్రహ్మలలో ఒకడైన దక్ష ప్రజాపతి కుమారుడు పృషధుడు. బ్రహ్మ జ్ఞానం లేని కారణాన శూద్రుడిగా మారిపోయాడు ( విష్ణుపురాణం 4.1.14)


7. నేదిష్టుడు అనే మహరాజు కుమారుడు .. నాభుడు. ఇతనికి క్షాత్ర జ్ఞానం లేని కారణాన, వర్తక జ్ఞానం కారణాన వైశ్యుడిగా మారవలసి వచ్చింది  ( విష్ణుపురాణం 4.1.13). 


8. క్షత్రియులైన రథోతరుడు, అగ్నివేశ్యుడు, హరితుడు .. బ్రహ్మ జ్ఞానం వలన బ్రాహ్మణులైనారు. హరితుని పేరుమీదే .. ఇతని వంశబ్రాహ్మణులకు హరితస గోత్రం వచ్చింది (విష్ణుపురాణం 4.3.5).


9. శౌనక మహర్షి కుమారులు .. నాలుగు వర్ణాలకు చెందినవారుగా మారారు (విష్ణుపురాణం 4.8.1).


10. అలాగే గృత్సమదుడు, వీతవ్యుడు, వృత్సమతి ... వీరి కుమారులు కూడా నాలుగు వర్ణాలకు చెందినవారు అయ్యారు.

*ఇదీ మన సనాతన ధర్మం యెుక్క గొప్పతనం.*


🌹🙏🌹. సనాతన వాహిని సంఘము.

*జై కాశీ విశ్వనాథ్,

 *జై కాశీ విశ్వనాథ్, జై కాశీ విశ్వనాథ్, జై కాశీ విశ్వనాథ్*.


*సమస్త లోకా సుఖినో భవన్తు*


*నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాసి నుండి 9611678545*


*18-9-24(సెప్టెంబర్ 18 బుధవారం)భాద్రపద మాసం పౌర్ణమి మరియు చంద్ర గ్రహణం మరియు ఉమా మహేశ్వరవ్రతం చేసుకొను రోజు*


*ఈ పౌర్ణమి బుధవారం రావటం వలన బుద్దికి సంబందించి మరియు చంద్ర గ్రహణం వలన చంద్రుని అనుగ్రహం కోరకు కాశీలోని చంద్ర కూపం వద్ద ఉన్నా చంద్రేశ్వర్ మహాదేవ్ వద్ద లోక కళ్యాణార్ధం మీ చంద్రశేఖర్ మహాదేవ్ దంపతులు మరియు మీ అందరి మనసు, బుద్ది, గొప్ప తేజో వంతంగా కావటం కోరకు మీ కుటుంబం లో ని వారి నామ గోత్రముల తో చక్కగా ఈ చంద్రేశ్వర్ మహాదేవ్ కి పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం జరిపించబడును*


*పౌర్ణమి తిధి రోజున చంద్రుని కిరణాలలో అమృతం ప్రసరిస్తుంది.యెవరు చంద్రుని అనుగ్రహమునకు పాత్రులు అవుతారో వారికి దీర్ఘాయుషు, నిత్య యవ్వనంగా వుండే అవకాశం ఎక్కువగా ఉంది.*


*కాశీలో చంద్రేశ్వర్ మహాదేవ్ (చంద్రకూపం వద్ద) కాశీ లో47వేల కోట్ల శివ లింగములు ఉన్నవి అని స్కంధ పురాణంలోని కాశీ ఖండంలో చెప్పబడినది. ఐతే ఈ చంద్రేశ్వర్ మహాదేవ్ ఆ 47వేల కోట్ల శివ లింగములకు మనసుకు (బుద్ది) సంబందిచిన సిద్ధి, మోక్ష, స్వయంభూ, లింగము. అమ్మవారి శక్తులలో ఒకరు సిద్దిదేవి సాక్షాత్ ఈచంద్రేశ్వరుని వద్ద పీఠమును స్థాపించుకొని సిద్ది పీఠము అని పిలవబడుతోంది*


*ఏవరి మనసు నిర్మలంగా, పరిశుద్ధంగా ఉంటుందో వారికి 11 నిమిషములలోనే వారి గురు మంత్రం లేధా ఇతర సాధన మంత్రములు అతి శీఘ్రముగా సిద్ధించును. ఇది నా అనుభవ పూర్వకముగా చెప్పుచున్న మాట.*


*ఇక్కడ ఉన్న చంద్రకూపంలో (బావిలో) మనము చూచిన యెడల మన ప్రతి బింబము కనపడనిచో అలా యెవరికి జరుగునో వారు 6 నెలలోనే చనిపోవుదురు.*


*ఇటువంటి గొప్ప శక్తి గల చంద్రేశ్వరుని వద్ద మీ నామ గోత్రాలతో భాద్రపద మాస పౌర్ణమి రోజున పంచామృతాభిషేకం మరియు రుద్రాభిషేకంనకు(205రూ) ఖర్చు అగును.*


*ఇందులో భాగం కాదలచిన వారు మీ కుటుంబం లో ని వారి నామ గోత్రముల ను చక్కగా ఈ 9611678545 phone number కు మాత్రమే whatsapp చేయవలెను.*


*ఇందులో భాగం కాదలచినవారుGoggle pay Name Chandra sekhar mahadev 7702627429*


*Phone pay Name koppala Latha 7702627429 చేయవలయును.*


*భాద్రపద మాస పౌర్ణమి చంద్రేశ్వర మహాదేవ్ కి పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం వలన కలుగు గొప్ప ప్రయోజనములు.*


*1 అన్నీ అనారోగములు పోయీ దీర్ఘాయుషుగా జీవించుట.*


*2 యెన్నో జన్మల నుంచీ వాసన రూపంలో మన మనసు పట్టుకొని ఉన్నా యెన్నో #అనవసరమైన# ఆలోచనలు అన్నీ భస్మం కాగలవు.*


*ఇది ఒక్కటి చాలు మనం తరించడానికి.*


*3 మనసు, బుద్ది, నిర్మలమై నిత్య యవ్వనంగా, వ్యాది లేని యవ్వనంగా జీవించుట.*


*4 ఒక వేళ అపమృత్యు దోషములు ఉన్నా తొలగించబడును.*


*5 కాశీఖండంలో కాశీలో ఉన్న 47వేలకోట్ల శివలింగములు అన్నీ ఈశ్వరుని శరీరంలో అంగములుగా భావించబడి ఉంది.*


*6 కాశీఖండంలో కాశీలో ఉన్న 47వేలకోట్ల శివలింగములు అన్నీ ఈశ్వరుని శరీరంలో అంగములుగా భావించబడి ఉంది ఐతే ఈ చంద్రేశ్వర్ మహాదేవ్ ఆ కాశీ విశ్వనాధుని మనసుగా ప్రకటించబడినది.*


*8 అనగ యెవరికి చంద్రేశ్వర్ మహాదేవ్ అనుగ్రహం ఉంటుందో వారు సాక్షాత్తు కాశీవిశ్వనాధునికి అత్యంత అత్యంత  ప్రియమైనవారు. వారికి కలుగు శుభములు, ఆనందములు విశ్వంలోనే మరి ఎవ్వరికి కలుగవు.*


*జై కాశీ విశ్వనాథ్, జై కాశీ విశ్వనాథ్, జై కాశీ విశ్వనాథ్*.

అకలుషవాయువీచికలు

 చం.

అకలుషవాయువీచికలు, నత్యతినిర్మలసజ్జలంబులున్ 

బ్రకటితదాతృభావలగు భవ్యమహీరుహరాజి సౌఖ్యముల్ 

సకలజగంబువారలకు సన్మతినిచ్చుచునుండు పచ్చికల్ 

ప్రకృతి యొసంగు కానుకలు వానిని భావ్యమె కూల్చ మిత్రమా! 30.


హ.వేం.స.నా.మూర్తి.

నిత్యపద్య నైవేద్యం

 నిత్యపద్య నైవేద్యం-1611 వ రోజు

సంస్కృత సుభాషితం-అనువాద పద్యం-246. సేకరణ, పద్యరచన: సహజకవి, డా. అయినాల మల్లేశ్వరరావు, తెనాలి, 9347537635, గానం: గానకళారత్న, శ్రీ వెంపటి సత్యనారాయణ, తెనాలి

ప్రోత్సాహం: "గీతాబంధు" శ్రీ గోలి లక్ష్మయ్య, గుంటూరు


సుభాషితం:

న భోగ భవనే రమణీయం 

న చ సుఖ శయనే శయనీయంl

అహర్నిశం జాగరణీయం 

లోకహితం మమ కరణీయంll 


తేటగీతి:

అమిత భోగాలలో తేలియాడరాదు,

అధిక సుఖాలలో నోలలాడరాదు 

ఊర కేమరపాటుతో నుండరాదు 

శ్రేష్ఠ కార్యాలకై కృషి చేయవలయు.


భావం: భోగాలలో తేలియాడరాదు. సుఖాలలో ఓలలాడరాదు. ఏమరపాటుతో నుండరాదు. లోక హితానికై కృషి చేయవలెను.

శ్రీరామ స్తుతి🙏

 🌸శ్రీరామ స్తుతి🙏


సీ. భూమిజపతి రామ ! భూపాల ! సర్వజ్ఞ !

                సజ్జనులనుకాచు సాధుపురుష !

     మోహనరూపాన మోక్షఫలమునిచ్చు

                రఘురామ ! రావయ్య రమ్యతేజ!

     జనులపాపములను శరవేగమున బాపి

               రఘువరా ! రక్షించు  రాగమునను

     నీలమేఘశ్యామ ! నినుగన్న వారలన్

                పాలించి  బ్రోవుమా పరమ పురుష  !

తే . సర్వజీవులయాత్మల సంతసింప

       జగతి పాలన నొనరించు సర్వ వేద !

       భక్తకోటిభజింతురు ముక్తి కోరి

       దశరథతనయ రఘురామ ! ధర్మ తేజ !


             జయలక్ష్మి

బూవుంబోఁడి బెడంగుతో*

 🌹🦜🙏🏽🦜🌹

    14.09.2024

       శనివారం 


" *బూవుంబోఁడి బెడంగుతో* 

 *మగతనమ్ముంజిమ్ము టాశ్చర్యమే".* 

.................................................


 *శార్థూలమ్...( పంచపాది )*     

   

సేవాధర్మము సేయనెంచి సుదతిన్ 

సీమాంతరంబేగుచున్ 


భావావేశపు శత్రుమూకల సదా

వాల్జూపులన్ గెల్చుచున్ 


జావున్ దప్పని వైరి భాగము , విదే

శంబందు ధీశాలియై 


త్రావన్నీరము లేకపోయినను తా 

దాయాదిపై బోరుచున్ 


బూవుంబోఁడి బెడంగుతో 

'మగతనమ్ముంజిమ్ము' టాశ్చర్యమే !

....................................................

మగతనము... పౌరుషము, శౌర్యము, నిర్భీతి

🦄🐓🦜🦢🐘

పి.ఎల్.నాగేశ్వరరావు 

హైదరాబాదు

దత్తపదులతో రామాయణార్థంలో


: కాకవద్దు రావణన్న ఖతముజేయ బుట్టె భూ

లోకమందు తాతతాత రూపుడిప్డు రాముడై 

వీకమా!మడదిని విడుము వెలదిమిన్న సీతయే 

లేక పాపఫలము తప్పునే మనకిల వింటివా!

విభీషణుడు రావణునితో


: కాక తాత మామ పాప దత్తపదులతో రామాయణార్థంలో

వైద్యనాథ జ్యోతిర్లింగము.

 🌹🦜🙏🏽🦜🌹 

    14.09.2024 

       శనివారం 


అంశం..శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగము.


 *శార్థూలమ్..* *సవరణ* 


జ్యోతిర్లింగ స్వరూపమై వెలసి తా 

శోభిల్లి దేవ్ ఘర్ స్థలిన్


వ్రాతల్ వ్రాయుచు వైద్యనాథుడు మహిన్

భాగ్యమ్ములందించుచున్


మాతై పార్వతి బిడ్డలౌ మనుజులన్ 

మన్నించి దీవింపగా 


చేతుల్ మోడ్చి జపంబుసేసి

భవునిన్ సేవింప దర్శింపుడీ!!

.....................................................

🦄🐓🦜🦢🐘

పి.ఎల్.నాగేశ్వరరావు 

హైదరాబాదు

*శ్రీ కృష్ణాయను నామ మంత్ర రుచి*

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*శ్రీ కృష్ణాయను నామ మంత్ర రుచి*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*శ్రీ కృష్ణాయను నామ మంత్ర రుచి సిధ్ధించుట నాకెన్నటికో।*

*శ్రి గురు పాదాబ్జంబులు మదిలో స్థిరముగ నిలిచేదెన్నటికో।*


*మరవక మాధవు మహిమలు పొగడే మర్మము తెలిసేదెన్నటికో।*

*హరి హరి హరియని హరి నామామృత పానము జేసేదెన్నటికో!!*


*కమలాక్షుని నా కన్నులు చల్లగ గని సేవించేదెన్నటికో*

*లక్షణముగ శ్రీ లక్ష్మీ రమణుని దాసుడనయ్యేదెన్నటికో!!*


*పంచాక్షరి మంత్రము మదిలో పఠియించుట నాకెన్నటికో।*

*ఆది మూర్తి శ్రీ అమర నారేయణ భక్తుడనయ్యేదెన్నటికో!!*


*ఓం నమో నారాయణాయ॥*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

విభూది మహిమ*

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

        *విభూది మహిమ*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*విభుతి పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ విభుతి ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడు. నరక బాధలు లోనుకాకుండా చూస్తాడు. కాల్చిన పేడను (ఆవు పేడ) ఈ భస్మం లో ఉపయోగిస్తూ ఉంటారు. భస్మ ధారణ చేయకుండా చేసే జపతపాలు ఫలితాలను ఇవ్వవని శాస్త్ర వచనము.*


*మన శరీరములో 32 చోట్ల భస్మ ధారణ చెయ్యాలి అని శాస్త్రము చేప్తోంది, కాని ఈ కాలములో అలాగ చెయ్యటము వీలుపడని పక్షములో కనీసము శిరస్సు, రెండు చేతులు, గుండే, నాభి అనే ఐదు ప్రదేశాలలో భస్మాన్ని ధరించవచ్చు. త్రిపుండ్రాలుగా (ముడు గీతలు) అడ్డముగా భస్మ ధరణ చెయాలి. ఇలాగ చేస్తే జన్మ జన్మల పాపాలు నసించి పోతాయని పెద్దల వాక్కు.*


*ఈ భస్మ ధారణ చేయడానికి కొన్ని మంత్రాలు చెప్పబడ్డాయి శాస్త్రాలలో.*


*బ్రాహ్మణ, క్షత్రీయులు "మానస్తోకే మంత్రము " తో, వైశ్యులు " త్ర్యయంబక " మంత్రము తో , ఇతరులు శివపంచాక్షరి తో భస్మ ధారణ చెయాలి.*


*ముఖమున భస్మమమును ధరించిన నోటి పాపములు (తిట్టుట అభక్ష్యములను దినుట అను పాపములు), చేతుల పైన ధరించిన చేతి పాపములు (కొట్టుట మొ||) హృదయము పై ధరించిన మనః పాతకములను (దురాలోచనలు మొ||), నాభి స్థానమున ధరించుట వలన వ్యభిచారాది దోషములను, ప్రక్కలందు ధరించుట వలన పరస్త్రీ స్పర్శ దోషములను పోగొట్టును. పాపములను భార్త్సనము చేసి (బెదిరించి) పోగొట్టునది గాన భస్మము అను పేరు దీనికి పేరు గలిగెను.*


*భస్మముమీద పండుకొన్నను, తిన్నను, ఒడలికి పూసుకున్నను పాపములు భస్మీభూతములగును. ఆయువు పెరుగును. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవము గలిగించును. సర్పవృశ్చికాది విషములను హరించును. భూత పిశాచాదులను పారద్రోలును.*


*యాగాలు చేస్తున్నప్పుడు అరణిని మధించడం ద్వార వచ్చిన అగ్నితో గాని, మంత్ర పూర్వకముగా పిడకలను హొమ గుండములో వేసి హోమము చెయ్యాలి. అనంతరం శుభ్రమైన పాత్రలో విభుతిని నింపాలి.*


*మహిమాన్వితమైన విభుతిని వివిధ పద్ధతులలో తయారు చేస్తారు. ఆవుపేడను కింద పడనీయకుండా, చేత్తోపట్టుకుని, వేదమంత్రాల మధ్య హోమము చేసి తయారు చేసుకున్న భస్మాన్ని "శాంతికము " అని అంటారు.*


*షడాక్షరి మంత్రముతో హొమము చేసి తయారు చేసుకునే భస్మాన్ని "పౌష్ఠికం" అని అంటారు.*


*బీజాక్షరాలతో హొమము చేసి తయారు చేసిన భస్మాన్ని "కామదం" అని అంటారు..*


*భస్మం తయారు చేసుకునే ముందే ఆవుపేడను సేకరించి, చిట్టు, లేక పొట్టును కలుపుతూ ముద్ద చేసి, ఆ ముద్దను పిడకలుగా చేసి అతి శుభ్రమైన ప్రదేశములో ఎండబెట్టాలి.*


*హర హర మహా దేవ శంభో శంకర॥*


*ఓం నమః శివాయ॥*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

మోర్ ' గణపతి

 


శ్రీభారత్ వీక్షకులకు గణపతి నవరాత్రి శుభాకాంక్షలు 🌹 గణపతి స్వరూపాలెన్నో.. లీలలు ఇంకెన్నో.. గణపతి నవరాత్రుల సందర్భంగా  వినాయక క్షేత్రాలలోని మాహాత్మ్యాలను కళ్లకు కట్టినట్లు వివరిస్తున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా. తిరుమల నీరజ గారు. ఈ ఎపిసోడ్ లో " మోర్ ' గణపతి, సిద్ధి క్షేత్ర గణపతి, చింతామణి , గిరిజాత్మజ గణపతి, మరి కొన్ని విశేషాలు వివరించారు. మన పురాణాలలో గణపతి వైభవం ఎంత గొప్పదో, ఎన్ని క్షేత్రాలలో గణపతి వెలిశారో తెలుసుకోవడానికి ఇది గొప్ప అవకాశం. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

16. " మహా దర్శనము

16. " మహా దర్శనము "--పదహారవ భాగము ---అతి నాచికేతుడు


16.  పదహారవ భాగము  --అతి నాచికేతుడు


         బుడిలులు వాకిలి దగ్గరే కాచుకొనియున్నారు . స్నాతకుడైన కొడుకు అటువైపు నుండీ వచ్చుటకూ , ఆచార్యుడు ఇటునుండీ పోవుటకూ సరిపోయింది . ఇద్దరూ ఒకేసారి లోనికి వెళ్ళినారు .  బుడిలులు , ’ ఎంతైనా , ఆచార్యులు ఋత్విజులు కాదా ? వారు ఆలస్యము చేయుట ఉంటుందా ? చూడండి , సరిగ్గా సమయానికే వచ్చినారు... కదా ? " అన్నారు . ఆచార్యుడు , ’ ఏమైనాసరే , ఎటులనో , పెద్దవారి దగ్గర ఆలస్యముగా వచ్చినానని మర్యాద పోగొట్టుకొనుటకు బదులు , సరిగ్గా సమయానికి  వచ్చినానని పొగిడించుకున్నాను కదా " అని సంతోష పడినాడు .  


         స్నాతకుడు , వచ్చుదారిలో తన మిత్రుడొకరి ఇంటిలో వైశ్వేదేవమునకు ఆగినాడు . మిత్రుని తల్లిదండ్రులు తమ సంబంధములో నున్న పిల్లను చూచుకొని వెళ్ళు అన్నారు . కాత్యాయనుడు , ఏదేమైనా , పిల్లను చూచు పని తన తల్లిదండ్రులది అని ఎంత చెప్పిననూ వినక ఆ పిల్లను , తల్లిదండ్రులతో సహా అక్కడికే రప్పించినారు . వారి మాట ప్రకారము , నక్షత్రానుకూల్యత , వర సామ్యము రెండూ సరిపోయినాయి . అక్కడి కలాపముల నన్నిటినీ ముగించుకొని బయలు దేరు వేళకు ఆలస్యమైపోయి , ఇక్కడికి సకాలమునకు వచ్చుటకు కాలేదు . 


         బుడిలులు , కొడుకు వినయముగా నున్నాడని చాలా సంతోషించినారు . రాజ పురోహితుడు భార్గవుడు , ఆచార్యుడు దేవరాతుడూ ఆ సంతోషములో భాగస్తులైనారు . బుడిలులు , "  మేము ఆ అమ్మాయిని చూచుటకు వెళ్ళేది ఎప్పుడు ? " అన్నారు . భార్గవుడు , ’ ఎప్పుడేమిటి ? అమావాస్య ఇక నాలుగైదు దినములే ఉంది , అది గడచిన తరువాత వెళ్ళేదే " అన్నాడు .


        ఆచార్యులు , " ఔనౌను , శుభస్య శీఘ్రం . అయినంత వేగముగా మన ద్వివేదుల కడుపున ఒక బిడ్డ కలిగి , బుడిలులు పౌత్రవంతులు కావలెను అని మా కోరిక  " అన్నారు . 


        ఇలాగే ఒక్కొక్కరు ఒక్కొక సంతోషపు మాట ఆడుతుండగా లోపలినుండీ పిలుపు వచ్చినది . బుడిలులు వెళ్ళి చూచుకొని వచ్చి , " అందరూ కాళ్ళు చేతులు కడుగుకొని మడి కట్టుకోవలెను " అన్నారు . అందరూ లేచినారు . 


          భోజన శాలలో ఒక్కొక్క పీట ముందరా ఒక్కొక్క అగ్రపు అరిటాకు వేసి , రకరకాల ఫలహారములు వడ్డించి యున్నవి . నేతిలో వేయించిన ఫలహారములు , వేపుడులు , పళ్ళు , పానీయములూ , అన్నీ సిద్ధముగానున్నవి . వాటి సువాసన అతిథుల వద్దకు వెళ్ళి ,  వారి ముక్కు పట్టుకొని లాగితెచ్చు దిట్టతనము గల గృహస్థుడి వలె అంతటా వ్యాపించినది . అతిథులందరికీ అర్ఘ్య పాద్యములు తానే ఇచ్చినారు . భార్గవుడు తాను ఇంటివాడనని తప్పించుకున్నాడు . ఆచార్యుడు వద్దని ఎంత వేడుకున్నా , వదలక , ’ నీ యోగ్యత మా అందరికన్నా గొప్పదయ్యా , మహాపురుషుడి తండ్రివి నువ్వు . నీకు అన్ని మర్యాదలూ తక్కువే " అని వారే అతని కాళ్ళు కడిగి , పిలుచుకొని వెళ్ళి అగ్రస్థానములో కూర్చోబెట్టినారు . 


         కొందరు ఆచార్యునికి అగ్ర స్థానమును ఇచ్చుటను విరోధించుటకు సిద్ధమయినారు . అయితే అది ఇంకో చోటయితే సాధ్యమయ్యేదే కానీ , బుడిలుల ఇంటిలో అయ్యేది కాదు . బుడిలులకు ఎదురు చెప్పలేక వారు కిమ్మనకుండా కూర్చున్నారు . 


         నిరాటంకముగా ఫలహారములు అయినవి . అందరూ బయలుదేరినారు . భార్గవుడు ’ ఆచార్యా , ఆలస్యమగునేమోనని నేను ఇంటికి వెళ్ళకుండా బండిలో ఇట్లే వచ్చినాను . మనమిద్దరమూ కలసి వెళదామా ’ అని నిలిచాడు . 


ఆచార్యుడు , ’ భార్గవా , నేను బుడిలులను అడగవలసిన అంశము ఒకటుంది . అది ఆలస్యమైతే ? " అన్నాడు . 


భార్గవుడు , ’ అది రహస్యమై , నేను ఉండకూడదు అనునదైతే ఇప్పుడే బయలుదేరుతాను ’ అన్నాడు . 


         ఆచార్యుడు నవ్వుతూ , " ఇది మహారాజుల ఏకాంతము వంటిదే , మా వాడు ఉన్నాడు చూడండి , వాడు చిలుక అనుకొని తెచ్చిపెట్టుకుంటే రాబందుపిల్ల అయినట్టయింది, వాడూ , వాడి ప్రశ్నలూ మాకు సమాధానాలిచ్చుట అసాధ్యమైపోయింది . ’ ఇది ఈదినము వద్దయ్యా , ఇంకొక దినము ’ అంటే ఊరికే ఉండిపోయే వాడి వైఖరి చూడవలెను . మీకు ఆ దినమే చెప్పినాను కదా , ’ లోపల కడగకున్న మడ్డి , బయట కడగకున్న మసి ’   బాగానే ఉంది , అయితే లోపల కడుగుకొనేది ఎట్లా అని అడిగినాడు . దానికేమి చెప్పవలెను ?  మంత్ర జపము తో అని యంటే , ఇంకొక ప్రశ్నకు దారి , ’ అలాగంటే ఏమి  ? ’ అని తప్పక అడుగుతాడు . ఏమి చేయుట ? " 


         " మహా పురుషుడవగల కొడుకును ఎత్తుకున్నది చిన్న విషయ మనుకున్నావా ?  మీ అమ్మ , అమ్మమ్మలు మీకు పెట్టిన వస , వెన్నలను కక్కిస్తాడు " భార్గవుడు నవ్వుతూ అన్నాడు . 


          " ఈ దినమేమయిందో తెలుసా ? ఏదో ప్రశ్న అడగవలెనని వచ్చినాడు . నేను , మనసును గట్టిగా పట్టుకొని ’ మాఘ మాసము వరకూ ఉండు ’ అన్నాను . మీకన్నా , మాకన్నా ఎక్కువగా , అటులనా సరే అని ఊరకే ఉండిపోయాడు . కథ చెప్పు అన్నాడు . గువ్వ , కాకి కథలు చెప్పుటకు పోతే ఈ కథలతో మనవంటివారికి వచ్చేదేముంది అనేసినాడు . ! " 


" ఆ మన వంటి వారు అంటే ఎవరయ్యా అని అడగలేదా ? " 


" అడగ వలెననుకున్నా , కానీ ఎందుకో అడగలేదు . " 


" సరే , తర్వాత ? " 


         " సరే , నచికేతుని కథ చెప్పు అన్నాడు . నేను రెండవ వరపు సంగతి ప్రస్తావించునపుడు వాళ్ళమ్మ వాడిని పిలిచింది . వెళుతూ , " నేనూ ఒక నచికేతుడిని అవుతాను . ఆ కథ నాకు పెద్దదిగా ఇంకొక దినము చెప్పండి " అని పరిగెత్తి పోతాడా ? " 


         " ఏదేమైనా మీరు అద్భుతమైన బిడ్డను పొందినారు . ఆచార్యా , వాడు మీకు తెలియకుండానే మీకొక వరము నిచ్చినాడు . " 


" అలాగంటే ? " 


        " అగ్ని విద్య , బ్రహ్మ విద్య రెంటినీ సాధించినవాడు నచికేతుడు . తానూ అటుల కావలెనని చెప్పి , మీ హృదయ భారమును తీసివేసినాడు " 


" నిజమే , ఆ మాత్రమైనా అయింది " 


         ఆ వేళకు బుడిలులు వెళ్ళువారి నందరినీ వీడ్కొలిపి వచ్చినారు . కూర్చున్న ఇద్దరూ లేచి నిలుచుని వారిని ఆహ్వానించినారు . బుడిలులు వారిని కూర్చోండి అని చెప్పి , " చూడండి , నా భార్య , కొడుకు వస్తాడని ఈ దినము ఇంత సంబర పడింది , కోడలు వస్తుందంటే ఆకాశానికి ఎగురుతుందేమో తెలీదు " అన్నారు . 


వారి మాటకు నవ్వుతూ , " అట్లయిన , పిల్లను ఒప్పుకున్నారా ? " అని అడిగినారు . 


         " ఇంకేమి , ఒప్పుకున్నట్లే . ఆ అమ్మాయిని నేను కూడా చూచియున్నాను . సాముద్రికము బాగుంది . అమ్మాయి కూడా లక్షణముగా ఉంది ., సోదరులున్నారు . వయసు పదో , పదకొండో ఉంటుంది . వంశము రెండు వైపులా బాగుంది  , ఇంకేమి కావలెను ? " 


" అట్లన్న , వెళ్ళుటకు ముందే అంతా నిర్ణయమైనట్టే కదా ? " 


         " చూడు భార్గవా , ఎవరో ఒక అమ్మాయిని తెచ్చుకోవలసినదే కదా ? తెలిసిన వారిలో , చూచిన పిల్ల అయితే మేలు కదా ? రేపు అమావాస్య ముగియగానే వెళ్ళి చూచి రావలెను . మాఘమాసములో తలపై జీలకర్రా బెల్లమూ పెట్టించి అక్షింతలు వేసేది . ఏమి , ఆచార్యా ? " 


" సరే , తమకు నచ్చినపుడు ఇంకా చెప్పేదేముంటుంది ? " 


భార్గవుడు రాగం తీస్తూ , ’ నేనొక మాట అనవచ్చా ? "  అన్నాడు 


బుడిలులు అన్య మనస్కంగా ఉండి , " చెప్పవలసినది చెప్పియే తీరవలెను . అదేమిటో చెప్పు ? " అన్నారు 


భార్గవుడు , " పెళ్ళి ఖర్చులు ? " అన్నాడు 


         బుడిలులు , " అదేమిటది ? మగ పెళ్ళి వారికి ఖర్చులేముంటాయి ? ఉంటే ఒంటి నిండా నగలు , లేకుంటే ఒక మాంగల్యము . నేను ఒక ఉసిరికాయంత బంగారము ఉంచుకున్నాను . దానిలోనే మాంగల్యము , ముక్కు పుడక , గాజులు చేయిస్తే సరిపోతుంది " 


        " అట్లు కాదు , బుడిలులు మనందరికన్నా యేలాగు శ్రేష్ఠులో , అలాగు వారి కోడలు కూడా బంగారు , ఆభరణాలు పెట్టుకొని శ్రేష్ఠురాలుగా ఉండవలెను . " 


బుడిలులు నవ్వి , " అట్లు కావలెనంటే , నేను కనిపించిన వారికందరికీ చేతులు జోడించి , చేయి చాచవలెను . " 


         " అలాగేమీ అవసరము లేదు . ఎలాగూ , సమావర్తన సందర్భముగా ఎవరైనా కావలసినదంతా  అంటే , సుమారు వెలగ పండంత బంగారము మీ కుటుంబమునకు చదివిస్తారు . దాన్ని వారు కోడలికే ఇవ్వనీ , మీరు కూడా మీదగ్గరున్నది ఆమెకు ఇవ్వండి , " 


        దాని అర్థము గ్రహించి , బుడిలులు మొదట ఒప్పుకోనే లేదు . చివరికి , " నువ్వు నాకు దశరాత్రి జ్ఞాతి కాని పిండభాగివి . నువ్వు ఇచ్చేది తీసుకుంటే నా అపరిగ్రహ వ్రతమేమీ చెడిపోదు , కానీ లోకమేమనుకుంటుంది ? అది గమనించు . " అన్నారు . 


         " సరే , మరి , భార్గవుడు రాజభవనమునకు కన్నము వేసి కొల్లగొట్టి తెచ్చి ఇల్లు నింపుకున్నాడే అనుకునే జనాలు , బుడిలుల ఇంట పెళ్ళైతే  అంత పీనాసిగా ఉత్తచేతులతో వచ్చాడు అనుకోరా ?  అది గమనించండి " 


        " సరే , ఎంతైనా నువ్వు రాజ పురోహితుడవు . నీకు ఎదురు చెప్పి బతుకుటకు అవుతుందా? అలాగే చేయి . ఏమి ఆచార్యా ? అమావాస్య అవగానే మీరిద్దరూ నా వెంట వచ్చి ఒక లగ్న పత్రిక చేయించి రావాలి . " 


         భార్గవుడు అన్నాడు , ’ ఇప్పటికి  నేను రాకపోయినా ఆచార్యులు తప్పక వస్తారు . మీరు మాఘ మాసములో లగ్నము పెట్టుకొంటారేమో  ? నేను అప్పుడు వస్తాను . రాజభవనపు నిర్బంధము . నన్ను వదిలివేయండి . " 


" కాదయ్యా , పెళ్ళి ఖర్చులన్నీ నావే అనువాడు లగ్నపత్రికకు రాకుంటే బాగా ? " 


" నిజమే , కానీ నిర్బంధము మరి , నన్ను వదిలేయండి ." 


ఆచార్యుడు నోరు తెరిచాడు . : " అట్లయితే పెళ్ళికి నన్ను వదలి వేసినట్టే కదా ? " 


        " ఇది మరీ బాగుంది , నువ్వు యాజ్ఞవల్క్యుని తండ్రివి . నువ్వూ , నీ కుటుంబమూ కొడుకును పిలుచుకొని రాకపోతే ఈ ఇంటిని వదలి పెండ్లికి వెళ్ళేది ఎవరు ?  ఏమంటావు భార్గవా ? " 


’ సరైన మాట . అది సరే , ఆచార్యులు ఏదో మాట్లాడవలెనని వచ్చినట్టుంది . " 


          " నాకు అదీ తెలుసు . అతడికి ఒకటే ఆలోచన . ఆ పాపడిని పెంచుట ఎలా అని కొండంత ఆలోచన . ఈ దినము వద్దు , ఇంకొక రోజు రా. వివరముగా చెప్పెదను . ఒకమాటలో నన్నడిగితే , అది ఒక గంధ గజము . దానికి ఏ లోపమూ లేకుండా చూసుకోండి . ఆ బాలుడికి కావలసినది కూడు , గుడ్డ కాదు . వాడు చిన్నవాడు అని హాస్యము చేయవద్దు . వాడు అడిగిన దానికంతా దాపరికము లేకుండా చెప్పండి . వయసు చాలదు అని మోహపడకండి . " 


" ఈ దినమేమో నేను నచికేతుని అవుతాను అన్నాడంట " 


        " వీడు అతి నచికేతుడు కావలెనయ్యా ! కానిమ్ము , ఇంకో దినము మాట్లాడదాము . " ఆచార్యుడూ , భార్గవుడూ బుడిలులకు నమస్కారము చేసి ఆశీర్వాదము పొంది వెళ్ళిపోయినారు .  


         వారు వాకిలి దాటుతుండగనే వెనకాల నుండీ బుడిలులు వచ్చి , ’ ఆచార్యా , చౌలపు దినమే అక్షరాభ్యాసము కూడా కానీ . న్యాయంగా ఐదో సంవత్సరము వరకూ ఆగవలెను . కానీ మీ కొడుకు సామాన్యుడు కాడు . కాబట్టి ఎలాగో జరగనీ " అన్నారు . 


         ఆచార్యుడు మారుమాట లేకుండా, ఏ ఉద్వేగమూ లేకుండా , " యజమానులు చెప్పినది వేద వాక్యము . అక్కడ మా వాదమే ఉండదు " అని ఒప్పుకొన్నాడు . మరలా అడిగినాడు , " అట్లయితే మాఘమాసములో చేయవచ్చును కదా ? " 


         " తప్పకుండా ! మీ ఇంట్లో అక్షరాభ్యాసపు బొబ్బట్లు , మా ఇంట్లో దేవతా సమారాధన బొబ్బట్లు . రెండూ ముగించుకొని పెళ్ళికి బయలుదేరవచ్చు . ఏమంటారు రాజ పురోహితులవారు ? సరేనా ? " 


         భార్గవుడు నవ్వుతూ చేతులు జోడించి అన్నాడు , " తండ్రి మాటను జవదాటని కుమారులము , మాదేముంది ? మేము ఎప్పటికీ మీ పుత్రులము . తమరు విధాయకులు; మేము విధేయులము " 


బుడిలులు , " సరే వెళ్ళిరండి " అని వారిని బండి ఎక్కించి తాము వెనుతిరిగినారు . 


--Janardhana Sharma

ప్రతి ఫలం

 

 ప్రతి ఫలం 

కొన్ని సందర్భాలలో మనం చేసే చిన్న చిన్న పనులు కూడా ఎంతో గొప్ప ఫలితాన్ని ఇవ్వవచ్చుఇటువంటి దానికి నిదర్శనంగా శ్రీ ఆది శంకరుల ఒక వృత్తాంతం తెలుపుతారు

ఆది  శంకరుల వారు సన్యాసాశ్రమం సవీకరించిన తోలి రోజుల్లో అంటే ఇంకా స్వామి బాల్యంలోనే వున్నారు.  బిక్షాటన కొరకు ఒకసారి ఒక గుడిశముందు నిలబడి " భవతి బిక్షం దేహి" అని యాచించారట  కానీ గృహంలోనుంచి ఎంతసేపటికి ఎవ్వరు రాలేదు.   అయినా కానీ మన శంకరులవారు ఇంకా నిరీక్షిస్తూ ఆ గుడిసె ముందే ఉన్నారు.  కొంతసేపటికి ఒక పేదరాలు వణుకుతున్న చేతులతో స్వామికి లేదు అని చెప్పటానికి మనస్కరించక ఒక ఉసిరిక పండును మాత్రం ఆయన జోలెలో వేసిందట. ఆమె దైన్యతను గమనించిన శంకరాచార్యులవారు ఒకసారి ఆమె గుడిసెను సంపూర్ణంగా పరికించి చుస్తే మొత్తం ఇల్లంతా కాళీగా ఎటువంటి వస్తువులు లేకుండా  ఉండటం చూసి ఆమె కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నదని తెలుసుకున్నారు

ఆది శంకరాచార్యుల వారి  మనస్సు ఆర్ద్రతమైనదట. వెంటనే శంకరాచార్యులవారు మహాలక్షిని స్తుతిస్తూ స్తోత్రము చేశారటఆయన స్తోత్రానికి ప్రసన్నమైన అమ్మవారు ఆయనకు ప్రత్యక్షం అయి నాయనా ఎందుకు నన్ను పిలిచావు అని అడిగిందిదానికి శంకరులవారు అమ్మా ఇది నీకేమైనా న్యాయంగా ఉన్నదా సాద్వి మణి  దీనత్వం చూసి నీకు కొంచమైనా దయరాలేదా తల్లి అని వేడుకొన్నాడు. అప్పుడు అమ్మవారు నాయనా నేను ఏమి చేతును ఆమె గతజన్మలో పూర్తిగా పిసినారిగా వుంటూ ఎవరికి కూడా ఎటువంటి దానధర్మాలు చేయకుండా ఉండి పూర్తిగా పుణ్యరహితంగా ఉండటం వలన ఆమెకు జన్మలో దారిద్యం దాపురించింది అని అన్నది.   అమ్మా ఆమె పుణ్యము చేయలేదు సరే మరి ఆమె భర్త పుణ్యము వలన అయినా ఈమెకు కొంత ఊరట కలగాలి కదా తల్లి అని అన్నాడు. దానికి తల్లి నాయనా ఆమె భర్త ఈమెకన్నా ఎక్కువ పాపాత్ముడు . అందుకే వారిద్దరిని కలిపాడు పరమేశ్వరుడుఇద్దరు ఒకరిని మించిన వారు ఇంకొకరుకాబట్టి వారు దారిద్యాన్ని అనుభవిస్తున్నారు అని అన్నారు అమ్మవారు

నాయనా ప్రస్తుత పరిస్థితుల్లో వారి దారిద్యాన్ని బాపటం పరమేశ్వరుని వశం కూడా కాదు వారు అంత పాపాత్ములు అని తల్లి ఉన్నసంగతి ఉన్నట్లు చెప్పింది.  అప్పుడు ఆలోచించటం శంకరులవారి వంతయినది శంకరులు అంటే సాక్షాత్తు శంకరులేకదా మరి శంకరాచారులవారు ఊరుకుంటారాతల్లి నీవు చెప్పింది నిజమే కావచ్చు  సాద్విమణి పుణ్యము గత జన్మలో చేసి ఉండకపోవచ్చుమరి జన్మలో విషయం ఏమిటి తల్లీ అని అమ్మవారిని మరల వినమ్రుడై అడిగాడు జన్మలోకూడా ఆమె రకమైన దానం చేయలేదు అని లక్ష్మీదేవి  బదులిచ్చింది. అప్పుడు శంకరులవారు ఒక్కసారి ఆమె గుడిశ మొత్తం పరికించి చూడు తల్లీ అని వేడుకున్నాడుమొత్తం చూసిన మహాలక్షి ఏమున్నది నాయనా అని అన్నదితల్లీ నేను చెప్పేది కూడా అదే సాద్వీమణికి ఇవ్వటానికి ఏమిలేకపోయినా నాకు ఒక ఉసిరిక పండును దానం చేసింది తల్లీ మరి దానఫలితాన్ని ఇవ్వవా అని మరల వేడుకొన్నాడు. అప్పుడు శంకరుని తెలివికి మెచ్చుకొనిన లక్ష్మీ దేవి ఇంట బంగారపు ఉసిరికాయలను వర్షించిందట దానితో పేదరాలి పేదరికం అంతా మటుమాయం అయిపొయింది. 

ఆది శంకరులు లక్షి అమ్మవారిని ప్రసన్నురాలిగా చేసిన స్తోత్రం కనకధారా స్తోత్రముగా చాల ప్రసిద్ధి చెందింది స్తోత్రాన్ని భక్తితో రోజు పారాయణ చేసే భక్తులకు సిరి సంపదలు సమకూరుతాయని ప్రతీతి. త్రికరణ శుద్ధిగా అకుంఠిత దీక్షతో స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేస్తే తప్పకుండా మహాలక్షి ప్రత్యక్షం అవుతుంది కోరిన కోరికలు నెరవేరుతాయి అని అంటారు. .  

చూసారా సత్పురుషునికి చేసిన ఒక చిన్న దాన ఫలితంగా యెంత ఫలితం లభించిందో కదాకాబట్టి మనం ఎప్పుడూ సపాత్ర దానాన్ని చేయాలి. అంటే పాత్రనెఱిగి దానం చేయాలిదానం చేసేటప్పుడు దాన గ్రహీత మీరు చేసే దానానికి యోగ్యుడా కాదా అని నిర్ధారణ చేసుకొని మరి దానం చేయాలి. మీరు చేసిన దాన ద్రవ్యముతో దాన గ్రహీత ఏదైనా పాపపు కృత్యాలు చేస్తే మీకు దానఫలితంగా పుణ్య ఫలం రాకపోగా పాపంలో భాగం వస్తుంది. అంటే డబ్బులు ఇచ్చి మరి పాపాలను కొనుక్కోవటం అన్నమాట

మన పూర్వికులు అందుకేనేమో అన్నిదానాలలోకి అన్నదానం గొప్పది అని అన్నారు. అన్నదానం చేయటం  వలన రెండు విషయాలు అవగతం  అవుతాయి. ఒకటి అన్నం తిన్న దాన గ్రహీత ఇక నాకు చాలు అంటాడు అంటే అతను మీ దానంతో తృప్తి చెందుతాడు. కాబట్టి అతని తృప్తివలన మీకు దాని ఫలితంగా పుణ్యఫలం వస్తుంది.   ఇంకొక విషయం. మీరు పెట్టిన అన్నాన్ని మీ సమక్షంలోనే ఆరగిస్తాడు కాబట్టి ఎట్టి పరిస్థితిలో అన్న దానం వలన పాపం రాదుఏదానానికైనా పాత్రను యెరిగి దానం చేయాలి కానీ అన్నదానానికి మాత్రం ఆకలితోవున్న ఎవ్వరికైనా చేయవచ్చు. పుణ్య ఫలితం ఒకేవిధంగా ఉంటుందిఅన్నదానం కేవలం మనుస్యులకు మాత్రమే చేయాలనీ నియమం లేదు. పశుపక్ష్యాదులకు కూడా చేయవచ్చు. నిత్యం పక్షులకు అన్నం పెట్టె వారికి జన్మలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కటి జీవితం కలుగుతుంది. వారి పితృదేవతలు కూడా సంతోషిస్తారు.

కాబట్టి ప్రతివారు  ఇతర దానాలకన్నా అన్నదానమే శ్రేష్ఠము కావున అన్నదానాన్ని విరివిగా చేయటం శ్రేయస్కరం. . అన్నదానాన్ని ప్రోత్సహించండి. ఆలా అని రోజు ఒక్కరికే అన్నాన్ని పెట్టి మనుషులను పని పాట చేసుకొని సోమరులుగా తయారు చేయకూడదు.  

అన్నదానం తరువాత చెప్పుకోదగిన దానం విద్య దానం. ప్రతి విద్వంసుడు తాను సముపార్జించిన విద్యను పలువురికి దానం చేసి విద్యావంతులను చేయాలివిద్యావంతుడైన వాడు తన విద్యతో చక్కగా జీవితాంతం సంపాదించుకొని తానూ సుఖపడి పలువురిని సుఖపెట్టగలడుకాబట్టి విద్యాదానం చేయటం కూడా చాలా మంచి విషయం

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

మీ 

భార్గవ శర్మ