12, జూన్ 2023, సోమవారం

⚜ శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయం

 🕉 మన గుడి : 







⚜ కడప జిల్లా : పొలతల


⚜ శ్రీ  మల్లేశ్వరస్వామి ఆలయం


💠 పొలతలగా ప్రసిద్ధి చెందిన మహిమాన్వతమైన ఆలయంగా !

సీతమ్మరాకను అన్వేషిస్తు రామలక్ష్మణులు వచ్చి పూజలు నిర్వహించిన క్షేత్రంగా !

సాంబశివ అన్నయ్య, బండెన్న అంటూ పరమశివుని స్మరిస్తున్న క్షేత్రంగా !

నూటొక్క కోనేర్లు గల ఏకైక ఆలయంగా శేషాచల దట్టమైన పర్వతశ్రేణుల్లో పచ్చని చెట్లు, సేలయేళ్ల మధ్య ఈ పొలతల క్షేత్రం వెలసింది.


💠 ఈ క్షేత్రంలో మల్లేశ్వరస్వామి, పార్వతీదేవి, సుబ్రహ్మణ్యస్వామి, వినాయకుడు, అక్కదేవతలు, బండెన్నస్వామి ఆలయాలు ఉన్నాయి.


⚜ ఆలయ చరిత్ర ⚜


💠 పూర్వం లోకకళ్యాణార్థం శివపార్వతులు సంచరిస్తు పొలతల క్షేత్రానికి రాగా అచ్చట ఆహ్లాదకరమైన వాతావరణం, సుగంధభరితమైన సువాసనలు వెదజల్లుతూ వుండేవని, వీటిని ఆస్వాదించేందుకు శివపార్వతులు అచ్చట పాదాలు వుంచినా లోపలికి దిగబడుచుండెను. 

ప్రస్తుత దేవాలయం వున్నచోట అడుగుపెట్టగా ఓంకార నామంతో శబ్ధం వెలువడి ఆయన పాదములకు గట్టి శిలలు స్పర్శించగా ఆ స్థలం తమకు అనుకూలంగా వుందని శివపార్వతులు నిశ్చయించుకున్నారని, ఆ క్షేత్రాన్ని పులి తలలాగా  ప్రదేశం గట్టిగా వుండడంతో పులి తలగా ప్రసిద్ది చెందిందని కాలక్రమేణా పులితలగా రూపాంతరం చెంది నేడు పొలతలుగా మారింది.


💠 ఈ క్షేత్రంలో సీతమ్మరాకను అన్వేషిస్తు ఇచ్చట రామలక్ష్మణులు కొలనులో స్నానం చేసి శివుని దర్శించి పునీతులైనారని పురాణాలు చెప్తున్నాయి. 

తర్వాత పాండవులు వనవాస కాలంలో అర్జునుడు కందమూలములతో, మల్లెపూలతోను పూజించినందున మల్లికార్జును ప్రసిద్ధి పొందారని పురాణాలు చెబుతున్నాయి. 


💠 దాదాపు 800 సంవత్సరాల క్రితం పొలతల గ్రామం దాన్ని చుట్టుపక్కల ఏడు చిన్న ఊర్లు వుండేవని, ప్రజల జీవనం పంటసిరి, పాడిసిరితో సాగేదని పెద్దలు చెబుతుంటారు. ఈ ఊర్లకు చెందిన ఆవుల మందను కాసే ధార్మిక మానవుడు రామయ్య. ఆయనకు ఒక శిష్యుడు. ఆయన పేరు పిలకత్తు.

 తాము కాసే ఆవుల మందలో ఒక ఆవు శూలుకట్టడం కానీ, ఈనడం కానీ లేకుండా చాలా ప్రత్యేకంగా ఉండేది. ఆ విషయం గుర్తించి దాని రాక పోకలపై దృష్టి పెట్టాడు పిలకత్తు. 


🔅 అక్కదేవతలు 🔅


💠 పూర్వం ఈ ప్రాంతం సమీపంలో భూతప్రేత విశాచాలు సంచరిస్తూ ప్రజలను భయపెడుతుండేవని, జనకమహర్షి ఆ బాధల నుండి తమను రక్షించాలని అక్కడి భక్తులు కోరగా ఆయన శివున్ని ప్రార్థించాడని, శివుడు తన జటాజుటం నుండి ఏడుగురు అక్కదేవతలను ఉద్భవింపచేశారు. 


💠 మొదటగా సూర్యకన్య, చంద్రకన్య, అగ్నికన్య, పెద్దవీరమల్లమ్మ, మంత్రాల మహేశ్వరి, నానమునెమ్మ, చిన్నవీరమల్లమ్మ, వీరబండెన్నస్వాములు ప్రత్యక్షమయ్యారు. వీరిని భూతప్రేత పిశాచాలు పీడించేవారి నుండి ప్రజలను కాపాడేందుకు తూర్పుభాగాన సాంబశివుని మధ్యభాగంలో అక్కదేవతలు బొచ్చికోనలో బండెన్నస్వామి ఇప్పటికీ తపస్సు చేసుకుంటున్నారని భక్తుల విశ్వాసం. 


💠 మహాశివరాత్రి సందర్భంగా భూతప్రేతలు పట్టిన మహిళలు ఈ క్షేత్రాన్ని దర్శించితే భూతప్రేతలు పారిపోతాయని భక్తుల నమ్మకం. బండెన్నను ఓ కన్య మోహించగా ఆయన ఆగ్రహించి ఆమెను భస్మం చేసినట్లు పురాణగాధలు చెబుతున్నాయి. అప్పటి నుండి బండెన్నస్వామిని స్త్రీలు దర్శించడం నిషిద్ధంగా మారింది. ఇవి శైవక్షేత్రమైనప్పటికీ బండెన్న స్వామి వద్ద కోళ్లు, మేకలు ఇవ్వడం విశేషం.


💠 మొదటిపూజ అక్కదేవతలైన కన్నేలకు, పిమ్మట తనకు ఆ తరువాత పులిబండెన్నకు పూజలు జరుగుతాయని చెప్పి పరమశివుడు వరం ఇచ్చాడు.

అదేవిధంగా నేడు కూడా తొలి పూజలు అక్కదేవతలకు జరుగుతున్నాయి.


💠 పొలతల ప్రాంత ప్రజలు తరచు దివిటి దొంగల బారిన పడేవారు. దివిటీ దొంగలు సర్వం దోచుకుని వెళ్లేవారు. అంతేగాక కలరా వ్యాధితో చాలామంది మృత్యువాత పడ్డారు. 

ఈ కారణాలతో పొలతల ప్రాంతంలోని ప్రజలు గ్రామాలు వదలిపెట్టి వెళ్లడం ప్రారంభించారు. 

దీంతో చాలాకాలం మల్లికార్జున స్వామికి ధూప దీప నైవేద్యాలు కరువయ్యాయి. 


💠 ఇదిలా వుండగా కాక వేంపల్లె తూర్పున గండి కొట్టేందుకు లో ఆంజనేయ క్షేత్రం ఉంది. 

ఆ క్షేత్రానికి 3 మైళ్ల దూరంలో ఏక దంతనాయుడు కోట ఉండేది. ఆ కోటలో దొంగతనాలు చేసి జీవించే 50 కుటుంబాల వారు జీవించేవారు. వీరు పరాక్రమవంతులు. వీరిని ఏకల వీరులు అని కూడా పిలిచేవారు. 


💠 ఇక్కడికి వచ్చే స్త్రీ , పురుషులు తమ కోర్కెలు తీరాలని ముడుపులు కడుతుంటారు. ఇక్కడ స్వామికి కొబ్బరికాయ కొట్టినా ఇక్కడే వదలిపెట్టి వచ్చే సంప్రదాయం ఉంది.


💠 మహాశివరాత్రి, కార్తీకమాస, వారోత్సవాలకు జిల్లా నుంచే కాక ఇతర రాష్టాల్ర నుంచి వేలాది వాహనాల్లో భారీగా భక్తులు తరలివస్తారు. 

ప్రతి సోమవారం జిల్లాతోపాటు దూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పొలతల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటూ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 


💠 ప్రతి రోజు ఉదయం స్వామివారికి గణపతి పూజ, మహాన్యాస రుద్రాభిషేకం, మహామంగళ హారతి, అమ్మవారికి కుంకుమార్చన, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తురు. 


💠 భక్తులు కోనేర్లలో స్నానాలాచరించి మల్లేశ్వరస్వామిని, పార్వతీదేవి, వినాయకుడు, సుబ్రహ్మణ్యంస్వామి, అక్కదేవతలు, బండెన్నస్వామిని దర్శించుకుంటారు.

వృద్ధాప్యం


*అనుభవాల పాఠం…*


                   *వృద్ధాప్యం*

                  ➖➖➖✍️

 


*మనిషి జన్మ చాలా చిత్రమైనది. శిశువు జన్మించినపుడు అందరికీ ఆనందాలు వెదజల్లుతాడు. అదేవిధంగా చనిపోయినప్పుడు అందరికీ కన్నీళ్ళు మిగిల్చి అనంతవాయువుల్లో కలిసిపోతాడు.*


*శరీరం మాత్రం తన ఆకృతిని కోల్పోయి కాలిపోవడమో, భూగర్భంలో కలిసిపోవడమో జరుగుతుంది. ఇది సృష్టి ధర్మం. మనందరికీ తెలిసిన నగ్నసత్యం.*


*ఉపనిషత్తులలో కూడా మానవ జీవితాన్ని ఆసక్తికరంగా వర్ణించారు. బాల్యాన్ని ఉదయంతోను, మధ్యాహ్నం యవ్వనంతోను, సాయంకాలాన్ని వృద్ధాప్యంతోను, రాత్రిని మరణంతోను వర్ణించారు.*


*బాల్యం ఎంత ఆనందంగా గడుస్తుందో, అంతే బాధాకరంగా వృద్ధాప్యం నడుస్తుంది.*


*ఈ వృద్ధాప్యం అనేది మనిషి జన్మలో అతి ముఖ్యమైంది.*


*ఆరు పదుల జీవితం కొందరికి వెలుగులు, మరికొందరికి చీకటి వెలుగులు పంచి పెడుతుంది. 60 సంవత్సరాల వయస్సువరకు మనిషి జన్మ ఓ విధంగా నడిస్తే ఆపై వచ్చే దశనే వృద్ధాప్యం అంటారు.*


*హాయి హాయిగా గడిచే జీవితంలో అనూహ్య మార్పులు చోటుచేసుకొంటూ వచ్చి చివరికి మనిషిని మ్రగ్గిన పండులా మార్చి రాలిపోయేలా చేస్తుంది వృద్ధాప్యం.*


*అన్ని కష్టాలు 60 నుండే ఆరంభం అవుతాయి. ఆరోగ్య, మానసిక, సాంఘిక సమస్యలు ప్రతిమనిషిలోనూ తలెత్తుతాయి. ఆర్థిక పరిస్థితులు చాలా గొప్పగా వున్నా ఈ సమస్యలు మాత్రం అందరిలో వస్తాయి. ఎంతో అందంగా కాపాడుకొంటూ వచ్చిన మానవ దేహం రిపేరుకొచ్చేస్తుంది. శరీరంలోని ఒక్కో అంగం నిస్సత్తువ అవుతూ వస్తుంది. కొందరికి ముందుగా పంటి సమస్యలు, కంటి సమస్యలు తలెత్తుతాయి. ఇవన్నీ కొందరిలో 60 సం.లనుండి ఆరంభం అయితే, మరికొందరికి 65 సం.లో ప్రారంభమవుతాయి. కొందరు వేగంగా వెళ్లిపోతారు. ఇంకొందరు కాస్త నెమ్మదిగా నడుస్తూ వెళ్లిపోతారు. అందరూ చేరే గమ్యం ఒక్కటే!  కర్మ సిద్ధాంతాలతో మిగిలినవారు సరిపుచ్చుకుంటారు. ఇది జీవనతరంగం.*


*అన్నేళ్ళ ఆనందాలన్నీ ఆవిరైపోయి శేషజీవితం విషాదంతో ముగుస్తుంది. భగవంతుడు ఒక్కసారిగా మనిషికి వృద్ధాప్యంలో కష్టాల్ని ఆరంభిస్తాడు. ఎన్నో ఎన్నెన్నో సమస్యలు ఒకదానికొకటి తోడై బాధిస్తాయి. ఆలోచనలు పెరుగుతాయి. కానీ క్రమంగా ఆలోచించేశక్తి సన్నగిల్లుతుంది. ఎంత గింజుకున్నా కొన్ని గుర్తుకురావు. మనకు కావాల్సిన వ్యక్తుల్నే మనం గుర్తించలేము.  ఒక్కోసారి ఆత్మీయుల పేర్లనుకూడా మరచిపోతాం. మందుబిళ్ళలు వేసుకొన్నా అవి మనకు పూర్వ శక్తిని తీసుకురాలేవు.  కొందరికైతే శరీరంలో శక్తి పూర్తిగా నశిస్తుంది.  నడుం నొప్పులు, కీళ్ళనొప్పులు ఇంకా ఇంకా ఎన్నెన్నో.. బాధలు అపరిమితం. ఒక్కోసారి అసహనం, కోపం కూడా వృద్ధాప్యాన్ని వెక్కిరిస్తాయి. చక్కెర వ్యాధిగ్రస్థుల బాధలైతే మరీ వర్ణనాతీతం. ఈదశలో కొందరికి సరైన ఆదరణ కన్పించదు. వాళ్ళ జీవితం మరీ దుర్భరం. ఒంటరి బ్రతుకు. సాంఘికంగా, ఆర్థికంగా మానసికంగా అన్నీ సమస్యలే. భార్యలు కోల్పోయిన భర్తలు, భర్తల్ని కోల్పోయిన భార్యల పరిస్థితి మరింత విచారకరం.*


*కొందరు వృద్ధాప్యంలో బాగా డిప్రెషన్‌కు గురవుతారు. ఒక్కోసారి వాళ్ళు ఏం చేస్తున్నారో వారికే తెలియదు. అందరిపై పెత్తనం చెలాయించాలని చూస్తారు. పిల్లల్ని తమ అదుపు ఆజ్ఞలో ఉంచాలనుకొంటారు. అన్ని విషయాల్లో తాము చెప్పిందే శాసనం కావాలనుకొంటారు. కొంతమంది వృద్ధాప్యంలో మంచానబడి కదలలేని స్థితిలో అచేతనంగా దుర్భర జీవితాన్ని గడుపుతుంటారు. అలాంటివారిని చూసి రెండు కన్నీటిబొట్లు విడవడం తప్ప ఏం చేయలేం.*


*చాలామంది వృద్ధులు తమ ఇంటికే పరిమితమై జీవిస్తుంటారు. వీళ్లలో ఆత్మన్యూనతా భావన ఎక్కువగా ఉంటుంది. ఎవరితోనూ కలవాలనుకోరు. ముఖ్యంగా తమకన్నా చిన్న వయసున్న వారితో. కొందరిలో మతిమరుపు ఎక్కువకావడం చాలా అనర్థాలకు కారణవౌతాయి. రాను రాను చెవుడు కూడా తోడుకావడం మరింత బాధాకరం అన్పిస్తుంది. ఆ వయస్సులో కూడా కొందరిలో ఏదో చేయాలన్న తపన.  కానీ ఏమీ చేయలేని నిస్సహాయత.*


*కొంతమంది పిల్లలు వృద్ధుల్ని నిర్లక్ష్యంగా చూస్తారు. మానవ సంబంధాలకన్నా ఆర్థిక సంబంధాలే ప్రాధాన్యత సంతరించుకొన్న ఈ జన జీవనంలో వృద్ధుల్ని తమకు భారంగా కూడా భావిస్తారు. ఇలాంటివారికి సమాజంలోని కొందరైనా చేయూతనివ్వాలి.*


*వృద్ధుల్ని పిల్లల్లా చూసుకోవాలి. ఆఖరి దశలో వీరిలో పిల్లల ప్రవర్తనే ఎక్కువ చోటుచేసుకుంటుంది. తమని కూడా చిన్నపిల్లల్లా చూసుకోవాలనుకుంటారు. వాళ్ళ చిన్న చిన్న కోర్కెలు తీర్చాలి. క్రమం తప్పక చికిత్సలు అందజేయాలి.* 


*వీలైనన్ని సీనియర్ సిటిజన్స్ క్లబ్‌లు, వృద్ధాశ్రమాలు ప్రభుత్వమే నెలకొల్పాలి. ముఖ్యంగా వీరికి అన్ని మందులు ఉచితంగా అందజేయాలి. విధిగా ప్రతి ఆసుపత్రిలో వృద్ధులకు ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పి సబ్సిడీపై చికిత్స జరిపించాలి.*


*మానసికంగా కూడా వీళ్ళకు మనోధైర్యాన్ని నింపాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఆ దిశగా కొన్ని సదుపాయాలను కల్పించాయి. టాక్స్ బెనిఫిట్స్, డిపాజిట్లకు అదనపు వడ్డీతోపాటు విమాన, రైలు, బస్సు ప్రయాణ ఛార్జీల్లో రాయితీలిస్తున్నాయి. బ్యాంకుల్లో కొత్తగా 65 సం.లు దాటిన వృద్ధులకు ప్రత్యేక సహాయం ఏర్పాట్లు చేశారు.*

*వృద్ధులు కూడా జీవిత సత్యాన్ని గ్రహించి ఉన్నంతకాలం హాయిగా, ఆనందంగా ఎలాంటి దురాలోచనలు చేయకుండా బ్రతకడం నేర్చుకోవాలి.*


*జననం తథ్యమని.. మరణం తప్పదని గుర్తెరగాలి. తొలి జీవితాన్ని కడవరకూ కోరుకోవడం అత్యాశే. అందరికీ ఆదర్శంగా బ్రతకాలి.  కనీసం ఇపుడైనా వయస్సులో అహంకారంతో ఎవరినైనా బాధించి ఉంటే గుర్తు తెచ్చుకుని వీలైతే వారికి క్షమాపణలు చెప్పడం లేదా పశ్చాత్తాపం చెందడం లాంటివి కూడా చేస్తే మంచిది.*


*దైవచింతన కూడా కొంతవరకు వీరికి మనశ్శాంతిని అందిస్తుంది. ఇంట్లోనే హాయిగా ఆత్మవిశ్వాసంతో, ఆనందంతో జీవించండి.. ప్రతి ఒక్కరూ కాబోయే వృద్ధులే!  అనుభవాల పాఠం వృద్ధాప్యం.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺

        *అన్నము అంటే ఏమిటి?*

                 ➖➖➖✍️



భగవద్గీతలో శ్రీ కృష్ణుడు అర్జునునితో అంటాడు...

 శ్లో: "అన్నాద్భవన్తి భూతాని 

పర్జన్యా దన్నసంభవః 

యజ్ఞాద్భవతి పర్జన్యో 

యజ్ఞః కర్మసముద్భవః "


తాత్పర్యం :- ప్రాణులు అన్నము వలన కలుగు చున్నవి. అన్నము మేఘము ( వర్షము ) వలన కలుగు చున్నది. మేఘము ( వర్షము ) యజ్ఞము వలన కలుగు చున్నది. ఇట్టి యజ్ఞము కర్మ వలన కలుగు చున్నది.


అన్నం పరబ్రహ్మ స్వరూపం! అన్నదానం చేయడమే తప్ప అన్నం అమ్ముకునే సంస్కృతి మనది కాదు. అన్నదానం గురించి తెలుసుకోవడానికి ముందు అన్నము గురించి తెలుసుకుందాం ...


మనలో చాలామందికి ”అన్నము” అంటే తెలియదు. బియ్యాన్ని ఉడికించి చేసిన పదార్ధాన్నే అన్నము అంటారని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి ప్రతి మనిషికి పంచ కోశములు అని అయిదు కోశములు ఉంటాయి.

అవి: 1. అన్నమయ, 2. ప్రాణమయ, 3. మనోమయ, 4. విజ్ఞానమయ, 5. ఆనందమయ కోశములు. 


అన్నమయ కోశము స్థూల శరీరానికి సంబంధించినది. ఈ అన్నమయ కోశములో ప్రవేశించే అన్నము ప్రాణశక్తిగా మారుతున్నది. కనుక అన్నమయ కోశాములోనికి వెళ్ళే ఆహారమే అన్నము అని అర్ధం. 

అంతేకాదు… తైత్తిరీయోపనిషత్తులో అన్నము వలననే భూత జాతములు జనించుచున్నవి. అన్నము వలననే జీవించుచున్నవి. తుదకు అన్నము నందే(భూమి) నశించుచున్నవి లేక లయించుచున్నవి అని చెప్పబడి ఉంది. 


మనము ఏది తిన్నా అది అన్నమే అవుతుంది.    కేవలం బియ్యం ఉడికించినది మాత్రమే కాదు, అని అర్ధం చేసుకోవాలి.


అన్నదానం అంటే ఏమిటి?

అన్నమే అన్నకోశములో ప్రవేశించి ప్రాణంగా మారు తున్నందువలన అన్నదానం అంటే ప్రాణాన్ని దానం చేయడమే. అంతేకాదు ఒక ప్రాణం నిలవడానికి కావలసినవన్నీ అన్నమే. కనుక అన్నదానం చేయడం శ్రేష్టం అని, అన్ని దానములకెల్ల అన్నదానం మిన్న అని, శాస్త్రాలు చెప్తున్నా యి. ఏదైనా దానం చేసేప్పుడు విచక్షణ అవసరం కానీ అన్న దానానికి మాత్రం ఈ నియమం లేదు. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం అంటే వాళ్ళ ప్రాణాన్ని నిలపడమే కనుక అది అత్యంత శ్రేష్టం అయినది.


ఇంట్లోని పిల్లలు భోజనం సరిగా తినకుండా వెదజల్లితే పెద్దలు వారిని మందలిస్తారు. అంతే కాకుండా దాన్ని అలా పారవేయరాదని అన్నం పరబ్రహ్మస్వరూపం అని వారితో అంటారు. 


అసలు ఇలా ఎందుకు అంటారు అని పిల్లలు అడిగితే దీనికి నూటికి నూరు శాతం సరైన కారణం చెప్పరు, చెప్పలేరు కూడా. 


ప్రతి జీవికి కావాల్సిన ఆహార పదార్థాలను పుట్టుకతోనే ఈ భూమి మీద భగవంతుడు కల్పిస్తాడు. 


కాబట్టే ఎవరైనా జన్మించిన తర్వాత నారు పోసిన వాడు నీరు పోయకపోడు అని భగవంతుని గురించి పెద్దలు చెబుతుంటారు. 


అంటే అమ్మ కడుపులో నుంచి బయటకు రాకముందే మనకు ఇంత ఆహారం అని, ఇన్ని నీళ్లని నిర్ణయిస్తాడు. 


గత జన్మలో చేసిన పాప పుణ్యాలను లెక్కించి వాటికి అనుగుణంగా మనకు సమకూర్చి ఎవరి కడుపున పుట్టాలో కూడా నిర్ణయిస్తాడట.


ఆయన సమకూర్చిన అన్న, పానీయాలు ఎప్పుడు నిండుకుంటాయో ఆ జీవికి ఈ భూమి మీద నూకలు చెల్లిపోయినట్లే. 


అందుకే మీరు తినగా ఉన్న ఆహారాన్ని, తాగే నీటిని వృథా చేయకుండా అవసరమైన వారికి దానంగా ఇవ్వడం వల్ల పుణ్యఫలం పెరుగుతుందట. 


అలాగే భవిష్యత్తులో మనకు నచ్చిన ఆహారం మరింత లభించి దీర్ఘాయుష్షు కలుగుతుందట. 


అలా కాకుండా సృష్టికర్త ఇచ్చిన ఆహారాన్ని వృథాచేస్తే   నీ ఆయువు క్షీణించి పోతుందట.


ఏ తల్లి అయినా తన బిడ్డల ఆయుః క్షీణాన్ని తట్టుకోలేదు. అందుకే అన్నంపారబోయవద్దని ఒకటికి పదిసార్లు చెబుతుంది. అవసరమైతే దండిస్తుంది కూడా. 


ఇదంతా వివరంగా చెప్పలేక అన్నం పరబ్రహ్మస్వరూపం అని మాత్రమే చెబుతారు. 


అందుకే అన్ని దానాల్లో కన్నా అన్నదానం మిన్న. ఎవరికైనా కోట్లు ఇచ్చినా సంతృప్తి చెందరు కడుపు నిండా భోజనం పెడితే చాలు అంటారు.


అన్నం ఎటువంటి లోటు లేకుండా దొరకడం అంటే సాక్షాత్తు ఆ కాశీ అన్నపూర్ణ అమ్మవారి అనుగ్రహం తప్పనిసరి కావాలి. 


ఆ అమ్మను నిత్యం కొలిచేవారికి అన్నపానాదులకు ఎటువంటి లోటు ఉండదు. 


ప్రతి నిత్యం భోజనం చేసేటప్పుడు ఆ అమ్మను కృతజ్ఞత పూర్వకంగా ధ్యానం చేసుకుని విశ్వంలో మనతోపాటు ఉండే అనేకానేక జీవులకు బలిభుక్కులు సమర్పించి భోజనం చేసినవారికి, అతిథి అభ్యాగతి సేవ, ఆపన్నులకు, ఆకలితో బాధపడేవారికి అన్నప్రసాదాన్ని అందించే వారికి ఆ తల్లి అనుగ్రహం ఉంటుందని శాస్త్ర ప్రవచనం.


అన్నదానం కోటి గోవుల దాన ఫలితంతో సమానమైనది. ఏది లోపించినా బ్రతకగలం. కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం. "దానాలన్నింటిలోకెల్లా అన్నదానం మిన్న" అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని పెద్దలు చెప్తారు. 


మనిషి ఆశకు అంతులేదు... అదుపు అంతకన్నా ఉండదు, ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా... ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. కానీ అన్నదానంలో మాత్రం దానం తీసుకున్నవారు ఇంక చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు. ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్నవారిని మనం సంతృప్తిపరచలేకపోవచ్చు కాని అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్నవారిని పూర్తిగా సంతృప్తి పరచవచ్చును. అన్నదానాన్ని ఒక యజ్ఞంలా భావించి చేసేవారు కూడా ఉన్నారు. ఆకలిగొని ఉన్నవారికి అన్నదానం చేయలేకయినా అన్నం పెట్టే ఇంటినైనా చూపించమని పెద్దలు చెప్తారు.


పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు కాశీ యాత్రకు బయలుదేరాడు. ఆరోజుల్లో ప్రయాణ సాధనాలు, సరైన రహదారి వ్యవస్థ ఇంతగా లేనందున కాశీచేరడానికి వారున్న ప్రాంతాలను బట్టి కొన్ని నెలలు ప్రయాణించాల్సి వచ్చేది. 


యాత్రికులు మధ్యలో గ్రామాల్లో రాత్రుళ్లు బస చేస్తూ వెళ్లేవారు. ఈ బ్రాహ్మణుడు ఏదో ఆలస్యం కారణంగా చీకటి పడే సమయానికి తాను వెళ్లవలసిన గ్రామానికి చేరుకోలేకపోయాడు. 


చీకటి పడింది. ఏమి చేయాలో తోచలేదు. అయితే అదృష్టవశాత్తు ఒక కోయవాని ఇల్లు కనబడింది. అక్కడ ఆశ్రయం కోరాడు. ‘శంబరుడు’ అనే             ఆ కోయవాడు ఆశ్రయం ఇవ్వడానికి ఒప్పుకొని తన వద్ద ఉన్న వెదురు బియ్యం, తేనె తినడానికి ఇచ్చాడు. 


తన కుటీరం చిన్నదైనందున దానిలో పడుకోమని, తాను బయట కాపలాగా ఉంటానన్నాడు. 


అర్ధరాత్రి ఒక పులి అతనిపై అదను చూసి దాడిచేసి, చంపివేసి, దేహాన్ని తీసుకుపోయింది. 


బ్రాహ్మణుడు బిక్కచచ్చిపోయాడు. కోయవాని మరణానికి చింతించి, తన దారిన తాను వెళ్లాడు. కాశీ చేరాడు. దైవదర్శనం చేసుకున్నాడు.


ఈ బ్రాహ్మణునికి ఎప్పటినుంచో అన్నదానం అంత గొప్పదా అన్న అనుమానం ఉండేది. తన ఇష్టదైవమైన విశ్వేశ్వరుడు ఆ సందేహం తీరిస్తే బావుండునని అనుకున్నాడు. 


ఆరోజు రాత్రి విశ్వేశ్వరుడు అతనికి కలలో కనిపించి, నువ్వు తిరుగు ప్రయాణంలో ఒక రాజ్యం మీదుగా వెడతావు. అక్కడి రాజుకు ఒక పుత్రుడు జన్మించి ఉంటాడు. ఆ శిశువును ఏకాంతంగా ఆశీర్వదించు అని చెప్పాడు. ఎందుకో చెప్పలేదు. 


బ్రాహ్మణుడు అలాగే చేశాడు. రాజకుమారుణ్ణి ఏకాంతంగా ఆశీర్వదించేందుకు వెళ్లాడు. చంటి పిల్లవాడైన ఆ రాజకుమారుడు, ఈ బ్రాహ్మణుణ్ణి చూసి నవ్వి, “ఓయీ బ్రాహ్మణా! నన్ను గుర్తుపట్టావా? నేను కోయవాణ్ణి. శంబరుణ్ణి. నీకు ఒక్క రాత్రి అన్నదానం చేయడం వల్ల ఈ జన్మలో నాకు రాజయోగం సిద్ధించింది!” అన్నాడు. 


మరుక్షణం అతనికి మళ్లీ పూర్వజన్మ జ్ఞానం నశించి మామూలు శిశువుల మాదిరి ఆడుకోవడం మొదలెట్టాడు. 


బ్రాహ్మణుని సంశయం తీరింది. అది ఎలా ఉన్నా అన్నదాన మహిమ ఎంతటి గొప్పదో ఈ కథ చెబుతుంది.✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🍀సద్గురు వాణి..!


*ఇతరులలోని మంచిని మాత్రమే చూడండి!*

                ➖➖➖✍️



*రామాయణంలో ఒక గొప్ప సంఘటన జరిగింది. అంతకు మునుపే, రాముని జీవితంలో దురదృష్ట కరమైన సంఘటనలు చాలా జరిగాయి. అతని రాజ్యం చేజారిపోయింది, అరణ్యవాసం అనుభవించవలసి వచ్చింది, ఇంకా చాలా కఠినమైన జీవితం గడపలసి వచ్చింది.  అతని భార్యను రావణాసురడు అపహరించాడు. ఆమె  మీద తనకు ఉన్న ప్రేమ ,  అనురాగాల వల్ల దక్షిణభారతం చివరి వరకూ వచ్చి, ఒక సైన్యంను ఏర్పరచుకుని, సముద్రం దాటి, లంకకు చేరి, యుద్ధం ప్రకటించి, రావణాసురుని ఓడించి, అతనిని వధించాడు.*


*రావణాసురుడికి పదితలలు ఉండేవని మనకు తెలుసు. రాముడు రావణాసురుడిని చంపటానికి వాటినన్నింటినీ నరకవలసిందే.*


*యుద్ధం గెలిచిన తరువాత రాముడు “నాకు హిమాలయాలకు పోయి తపస్సు చేయాలని ఉంది , ఎందుకంటే నేను గొప్ప పాపం చేశాను. నేను ఒక పరమ శివ భక్తుడిని, ఒక అసాధారణమైన పండితుని, ఒక గొప్ప రాజుని, ఒక ఉదారస్వభావిని వధించాను” అన్నాడు.*


*మిగిలిన వారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అతని తమ్ముడైనటువంటి లక్ష్మణుడు, “మీరు ఏమంటున్నారు? అతను మీ భార్యను అపహరించాడు”అన్నాడు.* 


*అప్పుడు రాముడు, “అతనికి ఉన్న పదితలలలో చాలా గొప్ప విజ్ఞానం, భక్తి కలది మరియు ఉపాసన చేసినది అయిన ఒకతల ఉంది. దానిని వధించినందుకు నేను చింతిస్తున్నాను” అన్నాడు.*


*ప్రజలు చేసే తప్పు ఏమిటంటే, ఒక గుణాన్ని గుర్తించే బదులు, వారు ఆ మనిషినే పూర్తిగా ఖండిస్తారు.*


*అందరికీ పది లేదా అంతకన్నా ఎక్కువ తలలే ఉన్నాయి. ఒక రోజు  మీ తల అంతా అత్యాశతో నిండి ఉంటుంది. మరొక రోజు అసూయతో, ద్వేషంతో, ప్రేమతో, మోహంతో, అందంతో లేదా వికారంగా ఉంటుంది. లేదా ఒకే రోజు మీలో ఇవన్నీ ఉండవచ్చు. మీరు ఒకరిని ఒక క్షణం అసూయతో చూసినట్లయితే అతను అసూయాపరుడు అని నిర్ధారణకు వస్తారు. కానీ నిజంగా, అనేక సమయాలలో, అనేక రకాల తలలు ప్రతివారిలో పని చేస్తూ ఉంటాయి. ప్రతివారికీ ప్రేమతో నిండిన తల, అలానే అందంతో, ఉదారస్వభావంతో  లేదా కరుణతో నిండిన తల ఉంటాయి. ప్రజలు చేసే తప్పు ఏమిటంటే, ఒక గుణాన్ని గుర్తించే బదులు, ఆ మనిషినే వారు పూర్తిగా ఖండిస్తారు.*


*రాముడు చెప్పేది ఏమిటంటే రావణాసురుడు ఎంత ఘోరమైన పనులు చేసినా, అతని యందు  బ్రహ్మాండమైన సంభావ్యత కలిగిన ఒక అంశం ఉంది . ఈ ప్రాథమిక సూత్రాన్ని ఆచరించండి- ‘మీరు ఎవరిలోనైనా ఏదైనా తప్పు చూసినట్లైతే ఆ తప్పును ఖండించండి, కానీ ఆ మనిషిని కాదు. మీరు ఈ జ్ఞానాన్ని మీ జీవితంలోకి తీసుకొచ్చినప్పుడు, మీరు అనవసరమైనటువంటి  వాటినుంచి విముక్తులవుతారు. మీరు ఇతరులకు ఇలా చేస్తే, మీకూ అదే జరుగుతుంది.’*


*“ప్రేమ అనేది ఒకరంటే ఒకరికి తెలియని స్త్రీ, పురుషుల మధ్య జరుగుతుంది” అని ఎవరో అన్నారు. అది కేవలం అల్పమైన, ప్రతి క్షణం నిర్దారణలు చేసే, జ్ఞానం లేని వారి జీవితంలోనే యదార్ధం. లేకపోతే మీకు ఎవరి గురించి ఎంత ఎక్కువగా తెలిస్తే మీకు వారి పట్ల, అంత ఎక్కువ ప్రేమ, కరుణ కలుగుతాయి. మీకు వారి కష్టనష్టాలు అన్నీ తెలిసినట్లయితే, వారూ మీలాంటి మానవత్వం ఉన్న మనిషే అని తెలుసుకుంటారు.*


*రాముడు తన భార్యను అపహరించి, ఇంకా ఎన్నో ఘోరమైన పాపాలు చేసిన వానిని వధించినందుకు తపస్సు చేస్తానన్నాడు. ఇంత జరిగినా, రాముడు అతని యందున్న ఒక అందమైన తలను చూడగలిగాడు. అతను  ఒక్క గొప్ప జ్ఞానం కలవాడు. అందుకే రాముడిని అందరూ ఆరాధిస్తారు, పూజిస్తారు. అతను జీవితంలో ఎన్నో వాటిలో ఓడినప్పటికీ, అతని ఓటమి ఎన్నడూ అతని గుణాలను, జ్ఞానాన్ని మార్చలేకపోయింది. జీవితం అతనికి ఏమి చేసినా వాటికి అతను లొంగలేదు.*


*దయచేసి మీ చుట్టూ ఉన్నవారందరితో ఈ పని చేయండి.  భరించలేనివారు అనుకునే వారిలోనూ మీరు ఒక  రవ్వంతైనా తియ్యదనాన్ని గుర్తించండి.*


*మీరు రాముని ఈ గుణాన్ని సంవత్సరమంతా గుర్తుంచుకోవాలని నా కోరిక.  మీరు ఈ చిన్ని జ్ఞానాన్ని గ్రహించినట్లైతే, మనిషిని ఖండించే బదులు ఆ గుణాన్ని గుర్తించగలిగితే గురు పౌర్ణిమ వచ్చి దక్షిణాయానికి వెళ్ళకముందే మీరు మంచి పంట పండించుకోగలరు. ఒక గులాబి మొక్కలో గులాబి పూలకన్నా ముళ్ళు ఎక్కువుగా ఉంటాయి, అయినా మనం దానిని రోజా మొక్కే అంటాము, ఎందుకంటే మనం దానిలోని అందాన్ని గుర్తించాం కాబట్టి.   ఒక మామిడి చెట్టులో పండ్లకన్నా ఆకులే ఎక్కువ ఉంటాయి, అయినా మనం దానిని మామిడి చెట్టే అంటాము, ఎందుకంటే మనం ఆ పండ్లలోని మాధుర్యాన్ని గుర్తించాం కాబట్టి.*


*ప్రతి మనిషిలోను కనీసం ఒకటైనా తియ్యని అంశం ఉంది . మనం దానిని ఎందుకు చూడకూడదు? దయచేసి ఈ పని చేయండి – మీరు భయంకరమైన వారిగా భావించే వారిలోనూ ఒక  రవ్వంతైనా తియ్యదనాన్ని గుర్తించండి. మీరు ఇతరులలో అది ఎప్పుడు గుర్తిస్తారో అప్పుడు మీలో కూడా అది గుర్తించబడుతుంది. అదేవిధంగా, మీరు ఇతరులలో భయంకరమైనవి చూస్తున్నట్లైతే, మీ విషయంలోనూ అదే జరుగుతుంది. దీని అర్ధం మీరు అన్నింటికీ అంధులు కావాల్సిన అవసరం లేదు. మీరు మామిడి చెట్టుకు ఉన్న ఆకులను చూస్తారు, గులాబి మొక్కకు ఉన్న ముళ్ళను చూస్తారు కానీ ఆ మామిడి పళ్ళను, గులాబి పూలను మాత్రమే గుర్తిస్తారు. మీరు చేయవలసినది అంతే. పదండి, ఈ  ఆశయాన్ని సాధిద్దాం.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀



            *చిన్నపిల్లల దేవుడు*

                ➖➖➖✍️


```

అప్పటి రోజుల్లో చిన్నపిల్లలు ఆడుకునే ఆటల్లో కూడా మన సంప్రదాయం కొట్టొచ్చినట్టు కనబడేది. సామాజిక జీవితాలను నాశనం చేసే ఇప్పటి పిల్లల ఆటలు వచ్చిచేరిన సమయం కాదది.


మరి అలాంటి సమయంలో ఎన్నో దేవాలయాలతో, ఎన్నో ఆలయ ఉత్సవాలతో, నిరంతరం దేవతల ఊరేగింపులతో ఉండే కుంభకోణం పిల్లలకు ఆటవిడుపు ఏమిటి? వారికి ఆటలు ఏవి?


నిజమైన స్వామి ఊరేరిగింపుల్లో ఉండే సందడి ఆటల్లో కూడా ఉండేది.


ఒక బుట్ట నిండుగా బంకమట్టి తెచ్చి, నలుగురూ చేతులు వేసి కలిపి, స్వామిని సిద్ధం చేసేవారు. వెన్న కుండ, గరుడ వాహనం, అశ్వ వాహనం ఇలా మొత్తం సరంజామా సిద్ధం చేసేవారు.


ఇక పూలకు కొదువ లేదు. కావేరీ తీరంలో ఎన్నో పూల చెట్లు వున్నాయి.


ఇక మంత్రాలా, అందుకోసం వేదపాఠశాల నుండి శిక్షణ పొందాలా? శివాయ నమః, విష్ణువే నమః, సుబ్రహ్మణ్యాయ నమః, వినాయకాయ నమః.


ఇలా ఒక స్వామివారిని ఊరేరిగింపుగా తీసుకునివచ్చారు, కుంభకోణంలోని శ్రీమఠం వీధిలోనికి. స్వామి వచ్చి శ్రీమఠం ముందు నిలబడ్డారు. ఎవ్వరూ ఊహించని సంఘటన. పరమాచార్య స్వామివారు బయటకు వచ్చారు. అది చిన్నపిల్లల ఆట అని తేలికగా తీసుకోలేదు స్వామివారు.


ఆ చిన్నపిల్లల దేవునికి దండ నమస్కారం చేశారు; రెండు చేతులు జోడించి నమస్కరించారు. కొబ్బరికాయ, అరటిపళ్లతో నైవేద్యం చెయ్యమని మఠం వారికి చెప్పారు. పిల్లలకు అరటిపళ్లు, పటికబెల్లం పంచమని ఆదేశించారు. తరువాత చెయ్యెత్తి వారిని ఆశీర్వదించి, స్వామి ఉత్సవం ముందుకు వెళ్లడానికి అనుమతిచ్చారు.


ఆ పిల్లలకు ఎంతటి సంతోషమో!!!


ఆ చిన్నపిల్లల భక్తిని గౌరవించి, అది వారిలో ఇంకా పెరగడానికి స్వామివారు చేసిన పని ఎంతో అపూర్వమైనది.


పరమాచార్య స్వామివారు రోజూ ఏకాగ్రతతో ఎంతోసేపు, విస్తారంగా పూజ చేస్తారన్న విషయం మనందరికీ తెలిసినదే. అలాగే, స్వామివారు ఇతరులు చేసే పూజను కూడా గౌరవిస్తారు.


శ్రీమఠానికి వచ్చే భక్తులలో, రోజూ పంచాయతన పూజ చేసేవారు ఎందరో వున్నారు. స్వామివారు వెళ్ళి ఆ పూజలను చూసి, భగవంతుణ్ణి ప్రార్థిస్తారు.


స్వామివారు బయటకు వెళ్లినప్పుడు ఎక్కడైనా వినాయకుని మందిరం కనబడితే - అది చిన్నదైనా, పాడుబడినదైనా లేదా ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మించకపోయినా, ఆ గణపతులకి తప్పక కొబ్బరికాయ సమర్పించాల్సిందే.```


--- శ్రీమఠం బాలు, కాంచీపురం. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 1


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


https://t.me/paramacharyavaibhavam


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀28.

రామాయణం...

ఒకసారి చదివినంత మాత్రాన మన సమస్త పాపాలని తీసేస్తుంది...



            వాల్మీకి రామాయణం:

                   28 వ  భాగం:

                  ➖➖➖✍️


కొంతసేపటికి దశరథుడికి తెలివి వచ్చాక కైకేయి ఇలా అంది … “ఏమయ్యా! ఇక్ష్వాకు వంశములో జన్మించానంటావు, సత్య-ధర్మములు పాటిస్తున్నానంటావు, రెండు వరాలు ఇచ్చానన్నావు, ఆ రెండు వరాలు నేను అడిగే సరికి నీకింత కష్టం కలిగిందా. ఎవరైనా వచ్చి రాముడేడని అడిగితే దండకారణ్యానికి పంపించానని చెప్పలేను అని అంటున్నావు కదా, మరి ఆనాడు నేను నీకు రెండుసార్లు ప్రాణబిక్ష పెడితే బతికినవాడివి, అలాంటి బతుకిచ్చిన కైకేయికి రెండు వరాలివ్వడం మానేసి అమాయకురాలిని చేసి వంచించినవాడ అని లోకం పిలవదా. వరాలు ఇవ్వడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నావు.

నీ వంశంలోని వాళ్ళు ఉత్తమ గతులకి వెళ్ళాలా, ఒకనాడు డేగ రూపంలో ఉన్న ఇంద్రుడు, పావురం రూపంలో ఉన్న అగ్నిని తరుముతూ రాజు దగ్గరికి వచ్చారు. ఆ పావురం రాజు కాళ్ళ మీద పడితే, రాజు ఆ పావురానికి శరణిచ్చాడు. ఆ పావురానికి శరణిచ్చావు బాగానే ఉంది, మరి నా ఆహారం సంగతేంటని అడిగాడు డేగ రూపంలో ఉన్న ఇంద్రుడు, ఆ రాజు యొక్క ధర్మనిష్ఠ తెలుసుకుందామని.  నీకు పావురం మాంసం కావాలి కనుక ఆ మాంసం నేనిస్తాను అని, పావురాన్ని తక్కెటలో ఒక పక్క పెట్టి, మరొకపక్క తన శరీరం నుండి కోసిన కొంత మాంసాన్ని పెట్టి, ఆ మాంసాన్ని ఇచ్చినవాడు నీ వంశంలో పుట్టిన శిబి చక్రవర్తి. అలాగే ఒకనాడు అలర్కుడి దగ్గరికి ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి నిలబడితే, నీకేమి కావాలో కోరుకోమన్నాడు రాజు. అయితే నీ కళ్ళని ఇచ్చేస్తావా అన్నాడు ఆ బ్రాహ్మణుడు. ఇస్తానన్నాడు కాబట్టి తన రెండు కళ్ళని తీసి ఇచ్చాడు అలర్కుడు. అలాంటి వంశంలో పుట్టి రెండు వరాలు భార్యకి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా తప్పించుకు తిరగడానికి నీకు సిగ్గుగా లేదా.


దుర్మతే! ధర్మాన్ని వదిలేసి, రాముడికి పట్టాభిషేకం చేసేసి నువ్వు కౌసల్యతో రోజూ కులుకుదామని అనుకుంటున్నావా. నీ బతుకేంటో నాకు తెలీదనుకున్నావా. నాకు రెండు వరాలు ఇచ్చి తీరాల్సిందే. నువ్వు రాముడికి పట్టాభిషేకం చేస్తే, కౌసల్య రాజమాత అయితే, నేను కౌసల్యకి నమస్కారం చేస్తానని అనుకుంటున్నావా, ఒక్కనాటికీ అది జెరగదు. నేను ప్రాణాలైనా విడిచిపెడతాను కాని ఒక్కనాటికి కౌసల్యకి నమస్కారం చెయ్యను. నా రెండు వరాలు నాకు ఇవ్వాల్సిందే " అని అన్నది.


అప్పుడు దశరథుడు " ఒకవేళ ఇదే నీ పట్టుదల అయితే, నువ్వు నేలమీద పడి ముక్కలయిపో, నువ్వు నిలువునా మండిపో, సర్వనాశనమయిపో నీ కోరిక మాత్రం నేను తీర్చను, ఎందుకంటే నువ్వు ధర్మబద్ధమైన కోరిక కోరలేదు. లోకమంతా ఎవరిని రాజుగా కోరుకుంటుందో, ఎవరిమీద లోకమంతా ఒక అపవాదు వెయ్యలేదో అటువంటి మహాత్ముడిని ఎటువంటి కారణం లేకుండా అరణ్యాలకి పంపమంటున్నావు. నువ్వు నాశనమయిపోయినా సరే, నేను మాత్రం నీ కోరిక తీర్చను" అన్నాడు.


అలా కైకేయితో ఏడ్చి ఏడ్చి మాట్లాడుతూ దశరథుడు అప్పటికి 15 సార్లు స్పృహతప్పాడు. అలా ఏడుస్తూ కైకేయతో..."రాముడు దండకారణ్యానికి వెళితే ఎంత కష్టమొస్తోందో, ప్రజలు ఎంత తల్లడిల్లిపోతారో నువ్వు ఊహించలేకపోతున్నావు. నేను అదృష్టవంతుడిని అయితే, అసలు రాముడిని అరణ్యాలకి వెళ్ళు అన్న మాట అనకుండా ఇప్పుడే మరణించాలని కోరుకుంటున్నాను. మరొక్కసారి నీ పాదాలు పట్టుకుంటాను" అని మళ్ళి కైకేయి పాదాల మీద పడబోగా, ఆవిడ మళ్ళి తప్పుకుని ఇలా అన్నది..


త్వం కత్థసే మహా రాజ సత్య వాదీ ద్ఋఢ వ్రతః |

మమ చ ఇమం వరం కస్మాత్ విధారయితుం ఇచ్చసి ||


"సత్యం, ధర్మం అని అంటావు, సత్యానికి ధర్మానికి కట్టుబడ్డానంటావు, రోజూ ఇన్ని ప్రగల్భాలు చెప్తావు. రెండు వరాలు నేను అడిగితే ఇంత బాధపడుతున్నావు, మాట తప్పుతున్నది నువ్వు కాదా " అని అడిగింది.


అలా ఆ రాత్రి దశరథుడు ఎంత బతిమాలినా కైకేయి ఒప్పుకోవడంలేదు. ఏడ్చి ఏడ్చి ఆయన కళ్ళన్నీ ఉబ్బిపోయాయి. జుట్టు చెరిగిపోయింది. నీరసం వచ్చింది. అప్పుడాయన...

" ఓ రాత్రి!, నాకు నువ్వన్నా ఒక వరం ఇవ్వు. ఈ రాత్రిని ఇలాగే ఉండని, తెలవారనివ్వమాకు. తెల్లవారితే రాముడితో నేను ఏమి మాట్లాడను, అందుకని నువ్వు ఇలాగే ఉండిపో. వద్దులే నువ్వు తొందరగా వెళ్ళిపో, ఎందుకంటే ఇలా చీకటిగానే ఉంటె నేను ఇక్కడే ఉండాల్సివస్తుంది, నేను అంతసేపు ఈ కైకేయిని చూస్తూ ఉండలేను, కాబట్టి నువు తొందరగా తెలవారిపో " అంటూ తాను ఏమి మాట్లాడుతున్నాడో తెలియని ఉన్మాద స్థితికి వెళ్ళిపోయాడు.


మెల్లగా తెల్లవారుతోంది.  అప్పుడు కైకేయి "ఇప్పుడు తెల్లవారుతోంది, రాముడు నీ ఆశీర్వాదం కోసం వస్తాడు. రాముడిని చూసిన తరువాత పుత్రవాత్సల్యంతో మాట మార్చినా, భరతుడికి రాజ్యం ఇవ్వకపోయినా, రాముడిని అరణ్యాలకి పంపకపోయినా విషం తాగి ఇదే గదిలో చనిపోతాను " అని అంది.


అప్పుడు దశరథుడు.....


యః తే మంత్ర క్ఋతః పాణిర్ అగ్నౌ పాపే మయా ధ్ఋతః |

తం త్యజామి స్వజం చైవ తవ పుత్రం సహ త్వయా ||


"నువ్వు నన్ను ఇంత బాధపెట్టావు కాబట్టి, ఏ రాముడిని చూసి చనిపోతాను అంటే ఆ వరం కూడా ఇవ్వలేదు కనుక, మంత్రపూర్వకంగా ఏ అగ్ని సమక్షంలో నీ పాణిగ్రహణం చేశానో, అటువంటి నిన్ను ఇప్పుడే విడిచిపెడుతున్నాను. ఇక నువ్వు నాకు భార్యవి కావు. నువ్వు నీ కొడుకు కలిసి రాజ్యం ఏలుకొండి. ఎవడికోసమైతే నువ్వు ఇంత దారుణానికి దిగాజారవో ఆ కొడుకుని కూడా వదిలేస్తున్నాను. భరతుడు నా శరీరాన్ని ముట్టుకోకూడదు" అన్నాడు.


అలా తెల్లవారగానే పట్టాభిషేకానికి చెయ్యాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు, బ్రాహ్మణులూ, జానపదులు, సామంతరాజులు మొదలైన వాళ్ళందరూ రాజు కోసం ఎదురుచూస్తున్నారు. అప్పుడు సుమంత్రుడు దశరథ మహారాజుని కలుద్దామని లోపలికి వెళ్ళి, మాతలి ఇంద్రుడిని ఎలా నిద్రలేపుతాడో, సూర్యుడు సమస్త లోకాలని ఎలా తన కిరణముల చేత నిద్రలేపుతాడో నేను నిన్ను అలా నిద్రలేపుతున్నాను, కాబట్టి ఓ మహారాజ నిద్రలేచి బయటకి రా అని అన్నాడు. 


యువరాజ పట్టాభిషేకం కోసం అందరూ బయట వేచి ఉన్నారు, ఏమి చెయ్యమంటారు అని సుమంత్రుడు దశరథుడిని అడుగగా, దశరథుడు మాట్లాడలేక, కన్నుల నుంచి నీటి ధారలు పడిపోతుండగా మరోసారి స్పృహ తప్పి పడిపోయాడు. రాజు ఇలా పడిపోయాడు ఏమిటని సుమంత్రుడు కైకేయిని అడుగగా... "ఏమిలేదయ్య సుమంత్రా! రాముడికి పట్టాభిషేకం అన్న సంతోషంలో ఆయనకి రాత్రి నిద్రపట్టలేదు, ఇప్పుడే నిద్రపట్టింది. అందుకని అలా పడిపోయాడు. నువ్వు గబగబా వెళ్ళి రాజు పిలుస్తున్నాడని చెప్పి రాముడిని తీసుకురా" అంది కైకేయి.


అక్కడే ఉన్న వశిష్ఠుడు మరియు ఇతర సామంతరాజులు “దశరథ మహారాజు ఇంకా బయటకి ఎందుకు రావడం లేదు మాకు దర్శనం ఎందుకు ఇవ్వడం లేద”ని అడుగగా సుమంత్రుడు మళ్ళి లోపలికి వెళ్ళి దశరథుడిని స్తోత్రం చెయ్యబోగా, 

"రాముడిని తీసుకు రమ్మన్నానుగా, తొందరగా వెళ్ళి రాముడిని తీసుకురా" అని దశరథుడు అన్నాడు. 


వెంటనే సుమంత్రుడు రాముడిని తీసుకురావడానికి బయలుదేరాడు.


ఆ రాముడి అంతఃపురం ప్రజలందరితో నిండిపోయి ఎంతో శోభాయమానంగా ఉంది. రాముడు స్నేహితులతో, బ్రాహ్మణులతో, జానపదులతో ఆ ప్రదేశం కళకళలాడుతోంది. సీతమ్మ చేత అలంకారం చెయ్యబడ్డ రాముడు ఎంతో చక్కగా ఉన్నాడు. సుమంత్రుడు వచ్చి “దశరథ మహారాజు మిమ్మల్ని రమ్మంటున్నారు” అని చెప్పగా రాముడు సుమంత్రుడితో కలిసి బయలేదేరాడు. రాముడితో పాటు లక్ష్మణుడు బయలుదేరాడు, వాళ్ళతో మిగతా జనసమూహం అంతా బయలుదేరింది. 


దశరథుడి అంతఃపురానికి చేరుకోగానే మిగతావారందరూ బయటనే ఉండిపోయారు, రాముడు లక్ష్మణుడు లోపలికి వెళ్ళారు. 


జీవచ్చవంలా ఉన్న తన తండ్రిని చూసి రాముడు ఆశ్చర్యపోయాడు. రాముడిని చూడగానే దశరథుడు మూర్చపోయాడు. 


అప్పుడు రాముడు ఇలా అన్నాడు...."అమ్మా! నేను నాన్నగారిని ఎప్పుడూ ఇలా చూడలేదు, ఎందుకమ్మా నాన్నగారు ఇలా ఉన్నారు. నావల్ల ఏమన్నా పొరపాటు జరిగుంటే చెప్పమ్మా దిద్దుకుంటాను, ఒక్క నిమిషం నా వల్ల నాన్నగారు బాధ పడినా, ఆ జీవితం నాకు వద్దు. నాకు నిజం చెప్పవా, కౌసల్యని కాని, సుమిత్రకి కాని ఏదన్నా సుస్తీ చేసిందా, నాకు సత్యం చెప్పు తల్లీ" అన్నాడు.


అప్పుడు కైకేయి "ఏంచేస్తే మీ నాన్నకి ఈ శోకం పోతుందో చెప్తాను. తీరా చెప్పాక ఇది నాకు కష్టం అని నువ్వు అనకూడదు. అది నీకు కష్టమే అయినా నువ్వు ఆ పని చేస్తే మాత్రం మీ నాన్న మళ్ళీ సంతోషంగా ఉంటాడు. అలా నాకు మాట ఇవ్వు రామా, నీకు చెప్తాను" అన్నది.


ఈ మాట రాముడితో కైకేయి చెప్తుంటే విన్న దశరథుడు "ఛీ" అని తలవంచుకున్నాడు.


అప్పుడు రాముడు...

తత్ బ్రూహి వచనం దేవి రాజ్ఞో యద్ అభికాంక్షితం |

కరిష్యే ప్రతిజానే చ రామః ద్విర్ న అభిభాషతే ||


"అమ్మా! రాముడికి రెండు మాటలు చేతకావమ్మా, రాముడు ఎప్పుడూ ఒకే మాట చెప్తాడు. నువ్వు అడిగినది కష్టమైనా సుఖమైనా చేసేస్తాను" అన్నాడు.


అప్పుడు కైకేయి "ఏమిలేదు రామా, మీ నాన్న సత్యవంతుడు అని పూర్వం రెండు వరాలు ఇచ్చాడు కదా అని, పధ్నాలుగు సంవత్సరాలు నువ్వు నారచీరలు కట్టుకొని, జటలు కట్టుకున్న తలతో ఒక తపస్వి ఎలా ఉంటాడో అలా నువ్వు అరణ్యావాసం చెయ్యాలని, అదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలని అడిగాను, అప్పటినుంచి మీ నాన్న ఇలా పడిపోయి ఉన్నాడు. అందుకని రామా, ఈ రెండు కోరికలు నువ్వు తీరుస్తే మీ నాన్న సంతోషిస్తాడు. కాని నువ్వు ఆ కోరికలు తీరుస్తావో తీర్చవో అని మీ నాన్న బెంగాపెట్టుకొని అలా ఉన్నాడు" అంది.


అప్పుడు రాముడు "నాన్నగారు అడగడం నేను చెయ్యకపోవడమా, తప్పకుండా చేసేస్తాను. నేను పధ్నాలుగు సంవత్సరాలు అడవులకి వెళ్ళడానికి, భరతుడికి పట్టాభిషేకం చెయ్యడానికి నాన్నగారు ఇంత బెంగ పెట్టుకోవాలా,


అహం హి సీతాం రాజ్యం చ ప్రాణాన్ ఇష్టాన్ ధనాని చ |

హ్ఋష్టః భ్రాత్రే స్వయం దద్యాం భరతాయ అప్రచోదితః ||


భరతుడికి కావాలంటే రాజ్యం ఏమిటి, నా ప్రాణాలు ఇస్తాను, ధనమంతా ఇస్తాను. భరతుడికి యువరాజు కావాలన్న కోరిక ఉందని నాకు తెలియక నేను యువరాజు పట్టాభిషేకానికి సిద్ధపడ్డాను. తమ్ముడికి పట్టాభిషేకం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. తప్పకుండా తమ్ముడికి పట్టాభిషేకం చేసెయ్యండి. ఈ విషయం చెప్పడానికి నాన్నగారు అంత బాధ పడ్డారని తెలిసి నేను బాధపడుతున్నాను. ఆయన నన్ను అగ్నిలో దూకమన్నా దుకేస్తాను" అన్నాడు.


అప్పుడు కైకేయి "రామా! మీ నాన్న ఒక శపధం చేశాడు, అదేంటంటే ‘నువ్వు ఈ అయోధ్యా నగరం నుంచి వెళ్ళేదాకా స్నానం చెయ్యను, భోజనం చెయ్యను’ అని అన్నాడు. కాబట్టి మీ నాన్నగారు సంతోషంగా ఉండాలంటే నువ్వు వెంటనే వెళ్లిపోవాలి" అంది.


అప్పుడు రాముడు....


న అహం అర్థ పరః దేవి లోకం ఆవస్తుం ఉత్సహే |

విద్ధి మాం ఋషిభిస్ తుల్యం కేవలం ధర్మం ఆస్థితం ||


"అమ్మా! రాముడు ధనం కోసం, రాజ్యం కోసం ప్రాకులాడేవాడు కాదు, నేను ఋషిలాంటివాడిని, నాకుపితృవాక్యపరిపాలనం తప్ప ఇంకేమి వద్దు. అయినా నువ్వు నన్ను పిలిచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోయేవాడిని కదా, ఇంత చిన్నవిషయానికి రెండు వరాలు అడిగావా అమ్మా, మీరు బెంగపెట్టుకోకండి, నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. కాని ఒక్కసారి నాన్నగారి పాదాలకి, మీ పాదాలకి నమస్కారం చేసి వెళ్ళిపోతాను" అన్నాడు.


ఇలా తండ్రి మాటని దాటనటువంటి కొడుకు పుట్టినందుకు ఇప్పుడు నాకు బాధగా ఉందని దశరథుడు మరోసారి స్పృహతప్పి పడిపోయాడు. 


తాను వెళితే తప్ప తండ్రి భోజనం చెయ్యడని రాముడు వెంటనే దశరథుడికి, కైకేయికి పాదాభివందనం చేసి అక్కడినుంచి వెళ్ళిపోయాడు. 


రాముడి వెనకాల తోక తొక్కిన నల్లత్రాచు వెళ్లినట్టు లక్ష్మణుడు ఆగ్రహంగా వెళ్ళాడు. ఇంత జరిగినా రాముడి కాంతి తగ్గలేదు, ఆయన మనసులో ఎటువంటి వికారము లేదు, రాజ్యం పోయిందన్న బాధ లేదు, తండ్రి తొందరగా అన్నం తిని స్వస్థత పొందాలనుకొని గబగబా కౌసల్య మందిరానికి ఆశీర్వాదం కోసం వెళ్ళాడు.


కౌసల్య దేవి రాత్రంతా శ్రీమహావిష్ణువుని పూజించినదై ధ్యానం చేసుకుంటూ ఉండగా చూసిన రాముడు తడబడుతున్న అడుగులతో లోపలికి ప్రవేశించాడు.✍️

రేపు...29వ భాగం...

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀

వృద్ధాప్యం

 

*అనుభవాల పాఠం…*


                   *వృద్ధాప్యం*

                  ➖➖➖✍️

 


*మనిషి జన్మ చాలా చిత్రమైనది. శిశువు జన్మించినపుడు అందరికీ ఆనందాలు వెదజల్లుతాడు. అదేవిధంగా చనిపోయినప్పుడు అందరికీ కన్నీళ్ళు మిగిల్చి అనంతవాయువుల్లో కలిసిపోతాడు.*


*శరీరం మాత్రం తన ఆకృతిని కోల్పోయి కాలిపోవడమో, భూగర్భంలో కలిసిపోవడమో జరుగుతుంది. ఇది సృష్టి ధర్మం. మనందరికీ తెలిసిన నగ్నసత్యం.*


*ఉపనిషత్తులలో కూడా మానవ జీవితాన్ని ఆసక్తికరంగా వర్ణించారు. బాల్యాన్ని ఉదయంతోను, మధ్యాహ్నం యవ్వనంతోను, సాయంకాలాన్ని వృద్ధాప్యంతోను, రాత్రిని మరణంతోను వర్ణించారు.*


*బాల్యం ఎంత ఆనందంగా గడుస్తుందో, అంతే బాధాకరంగా వృద్ధాప్యం నడుస్తుంది.*


*ఈ వృద్ధాప్యం అనేది మనిషి జన్మలో అతి ముఖ్యమైంది.*


*ఆరు పదుల జీవితం కొందరికి వెలుగులు, మరికొందరికి చీకటి వెలుగులు పంచి పెడుతుంది. 60 సంవత్సరాల వయస్సువరకు మనిషి జన్మ ఓ విధంగా నడిస్తే ఆపై వచ్చే దశనే వృద్ధాప్యం అంటారు.*


*హాయి హాయిగా గడిచే జీవితంలో అనూహ్య మార్పులు చోటుచేసుకొంటూ వచ్చి చివరికి మనిషిని మ్రగ్గిన పండులా మార్చి రాలిపోయేలా చేస్తుంది వృద్ధాప్యం.*


*అన్ని కష్టాలు 60 నుండే ఆరంభం అవుతాయి. ఆరోగ్య, మానసిక, సాంఘిక సమస్యలు ప్రతిమనిషిలోనూ తలెత్తుతాయి. ఆర్థిక పరిస్థితులు చాలా గొప్పగా వున్నా ఈ సమస్యలు మాత్రం అందరిలో వస్తాయి. ఎంతో అందంగా కాపాడుకొంటూ వచ్చిన మానవ దేహం రిపేరుకొచ్చేస్తుంది. శరీరంలోని ఒక్కో అంగం నిస్సత్తువ అవుతూ వస్తుంది. కొందరికి ముందుగా పంటి సమస్యలు, కంటి సమస్యలు తలెత్తుతాయి. ఇవన్నీ కొందరిలో 60 సం.లనుండి ఆరంభం అయితే, మరికొందరికి 65 సం.లో ప్రారంభమవుతాయి. కొందరు వేగంగా వెళ్లిపోతారు. ఇంకొందరు కాస్త నెమ్మదిగా నడుస్తూ వెళ్లిపోతారు. అందరూ చేరే గమ్యం ఒక్కటే!  కర్మ సిద్ధాంతాలతో మిగిలినవారు సరిపుచ్చుకుంటారు. ఇది జీవనతరంగం.*


*అన్నేళ్ళ ఆనందాలన్నీ ఆవిరైపోయి శేషజీవితం విషాదంతో ముగుస్తుంది. భగవంతుడు ఒక్కసారిగా మనిషికి వృద్ధాప్యంలో కష్టాల్ని ఆరంభిస్తాడు. ఎన్నో ఎన్నెన్నో సమస్యలు ఒకదానికొకటి తోడై బాధిస్తాయి. ఆలోచనలు పెరుగుతాయి. కానీ క్రమంగా ఆలోచించేశక్తి సన్నగిల్లుతుంది. ఎంత గింజుకున్నా కొన్ని గుర్తుకురావు. మనకు కావాల్సిన వ్యక్తుల్నే మనం గుర్తించలేము.  ఒక్కోసారి ఆత్మీయుల పేర్లనుకూడా మరచిపోతాం. మందుబిళ్ళలు వేసుకొన్నా అవి మనకు పూర్వ శక్తిని తీసుకురాలేవు.  కొందరికైతే శరీరంలో శక్తి పూర్తిగా నశిస్తుంది.  నడుం నొప్పులు, కీళ్ళనొప్పులు ఇంకా ఇంకా ఎన్నెన్నో.. బాధలు అపరిమితం. ఒక్కోసారి అసహనం, కోపం కూడా వృద్ధాప్యాన్ని వెక్కిరిస్తాయి. చక్కెర వ్యాధిగ్రస్థుల బాధలైతే మరీ వర్ణనాతీతం. ఈదశలో కొందరికి సరైన ఆదరణ కన్పించదు. వాళ్ళ జీవితం మరీ దుర్భరం. ఒంటరి బ్రతుకు. సాంఘికంగా, ఆర్థికంగా మానసికంగా అన్నీ సమస్యలే. భార్యలు కోల్పోయిన భర్తలు, భర్తల్ని కోల్పోయిన భార్యల పరిస్థితి మరింత విచారకరం.*


*కొందరు వృద్ధాప్యంలో బాగా డిప్రెషన్‌కు గురవుతారు. ఒక్కోసారి వాళ్ళు ఏం చేస్తున్నారో వారికే తెలియదు. అందరిపై పెత్తనం చెలాయించాలని చూస్తారు. పిల్లల్ని తమ అదుపు ఆజ్ఞలో ఉంచాలనుకొంటారు. అన్ని విషయాల్లో తాము చెప్పిందే శాసనం కావాలనుకొంటారు. కొంతమంది వృద్ధాప్యంలో మంచానబడి కదలలేని స్థితిలో అచేతనంగా దుర్భర జీవితాన్ని గడుపుతుంటారు. అలాంటివారిని చూసి రెండు కన్నీటిబొట్లు విడవడం తప్ప ఏం చేయలేం.*


*చాలామంది వృద్ధులు తమ ఇంటికే పరిమితమై జీవిస్తుంటారు. వీళ్లలో ఆత్మన్యూనతా భావన ఎక్కువగా ఉంటుంది. ఎవరితోనూ కలవాలనుకోరు. ముఖ్యంగా తమకన్నా చిన్న వయసున్న వారితో. కొందరిలో మతిమరుపు ఎక్కువకావడం చాలా అనర్థాలకు కారణవౌతాయి. రాను రాను చెవుడు కూడా తోడుకావడం మరింత బాధాకరం అన్పిస్తుంది. ఆ వయస్సులో కూడా కొందరిలో ఏదో చేయాలన్న తపన.  కానీ ఏమీ చేయలేని నిస్సహాయత.*


*కొంతమంది పిల్లలు వృద్ధుల్ని నిర్లక్ష్యంగా చూస్తారు. మానవ సంబంధాలకన్నా ఆర్థిక సంబంధాలే ప్రాధాన్యత సంతరించుకొన్న ఈ జన జీవనంలో వృద్ధుల్ని తమకు భారంగా కూడా భావిస్తారు. ఇలాంటివారికి సమాజంలోని కొందరైనా చేయూతనివ్వాలి.*


*వృద్ధుల్ని పిల్లల్లా చూసుకోవాలి. ఆఖరి దశలో వీరిలో పిల్లల ప్రవర్తనే ఎక్కువ చోటుచేసుకుంటుంది. తమని కూడా చిన్నపిల్లల్లా చూసుకోవాలనుకుంటారు. వాళ్ళ చిన్న చిన్న కోర్కెలు తీర్చాలి. క్రమం తప్పక చికిత్సలు అందజేయాలి.* 


*వీలైనన్ని సీనియర్ సిటిజన్స్ క్లబ్‌లు, వృద్ధాశ్రమాలు ప్రభుత్వమే నెలకొల్పాలి. ముఖ్యంగా వీరికి అన్ని మందులు ఉచితంగా అందజేయాలి. విధిగా ప్రతి ఆసుపత్రిలో వృద్ధులకు ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పి సబ్సిడీపై చికిత్స జరిపించాలి.*


*మానసికంగా కూడా వీళ్ళకు మనోధైర్యాన్ని నింపాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఆ దిశగా కొన్ని సదుపాయాలను కల్పించాయి. టాక్స్ బెనిఫిట్స్, డిపాజిట్లకు అదనపు వడ్డీతోపాటు విమాన, రైలు, బస్సు ప్రయాణ ఛార్జీల్లో రాయితీలిస్తున్నాయి. బ్యాంకుల్లో కొత్తగా 65 సం.లు దాటిన వృద్ధులకు ప్రత్యేక సహాయం ఏర్పాట్లు చేశారు.*

*వృద్ధులు కూడా జీవిత సత్యాన్ని గ్రహించి ఉన్నంతకాలం హాయిగా, ఆనందంగా ఎలాంటి దురాలోచనలు చేయకుండా బ్రతకడం నేర్చుకోవాలి.*


*జననం తథ్యమని.. మరణం తప్పదని గుర్తెరగాలి. తొలి జీవితాన్ని కడవరకూ కోరుకోవడం అత్యాశే. అందరికీ ఆదర్శంగా బ్రతకాలి.  కనీసం ఇపుడైనా వయస్సులో అహంకారంతో ఎవరినైనా బాధించి ఉంటే గుర్తు తెచ్చుకుని వీలైతే వారికి క్షమాపణలు చెప్పడం లేదా పశ్చాత్తాపం చెందడం లాంటివి కూడా చేస్తే మంచిది.*


*దైవచింతన కూడా కొంతవరకు వీరికి మనశ్శాంతిని అందిస్తుంది. ఇంట్లోనే హాయిగా ఆత్మవిశ్వాసంతో, ఆనందంతో జీవించండి.. ప్రతి ఒక్కరూ కాబోయే వృద్ధులే!  అనుభవాల పాఠం వృద్ధాప్యం.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀

అష్టాక్షరీ మహామంత్ర విశిష్టత!*

 అష్టాక్షరీ మహామంత్ర విశిష్టత!* 

                ➖➖➖✍️


*“ఓమ్ నమో నారాయణాయ”* 


*అనే అష్టాక్షరీ “ఓమ్” – ఆత్మ స్వరూపాన్ని, “నమః” – అనే అక్షరాలు – బుద్ధిని, మనస్సుని,*

 *“నారాయణాయ” – అనే అక్షరాలు పంచేంద్రియాలను “జీవుని” తెలియజేస్తున్నాయి.*


*అష్టాక్షరీ మంత్రం ‘వ్యాపక మంత్రం’. ఆకాశతత్త్వంపై ఆధారపడి ఉంది.*


*ఆ కారణంగా ఈ మంత్రాన్ని జపించేప్పుడు, ఉపాసకుని మనస్సంతా ఈ మంత్రమే వ్యాపించి ఏకాగ్రతను కలిగిస్తుంది.*


*జలాలకు నారములని పేరు. పరమాత్మ ఆ ‘అనంతజలరాశి’లో శయనిస్తాడు కనుక ఆయనకు ‘నారాయణ’ అనే నామం వచ్చింది. *


*ఇంకా,*

*“న” కార పదోచ్చారణ మాత్రేనైవ నాకాధిప భోగం లభతే*

*“ర” కార పదోచ్ఛారణేవ రామరాజ్య భోగం లభతే*

*“య” కార పదోచ్ఛారణేవ కుబేరవత్ ప్రకాశతే*

*“ణ” కార పదోచ్చారణేవ వైరాగ్యం లభతే*


*“న” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత ఇంద్ర భోగాలు లభిస్తాయి.*


 *“ర” అనే అక్షరాన్ని ఉచ్చరించటం చేత రామరాజ్యంలోనున్న భోగాలు లభిస్తాయి.*


*“య” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత కుబేరునివలె సర్వసంపదలతో ప్రకాశిస్తారు.*


*“ణ” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత ఐహిక సుఖాల పట్ల విముఖత కల్గి, దైవచింతన పట్ల ఆసక్తి కల్గి, మోక్షాన్ని పొందేందుకై మార్గం లభిస్తుంది.*


*ఇంతటి శక్తివంతమైన “నారాయణ” అను శబ్దానికి ‘ఓమ్ నమో నారాయణాయ’ (అష్టాక్షరీ మహా మంత్రం)ను జపించటంచేత ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవచ్చు.*


*ఈ మహా మంత్రంలో, మహోన్నతమైన శక్తి ఉంది.*


*ధ్యాయేన్నారాయణందేవం*

*స్నానాదిఘ చ కర్మసు,*

*ప్రాయశ్చిత్తం హి సర్వస్వ*

*దుష్కృత స్వేతివైశ్రుతిః!*


*స్నానపానాదిగల సమస్తకర్మలలో “నారాయణుని” స్మరించు కొన్నట్లయితే, సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగి మంచి మార్గంలో పయనించడానికి వీలవుతుంది.*


*ఆలోక్య సర్వ శాస్త్రాణీ విచార్యచ పునః పునః*

*ఇదామేకం సునిప్పన్నం ధ్యేయో నారాయణ సదా!!*


*సమస్తములైన శాస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలించి చూడగా, నిరంతర ‘నారాయణ’ ధ్యానమొక్కటే, సర్వదా, ధ్యేయంగా కనబడుతోంది.*


*ఆమ్నా యాభ్య  సనాన్యారణ్య రుదితం వేదవ్రతా న్యవ్వహాం*

*మేద శ్ఛేద ఫలాని పూర్తవిధయస్సర్వే హుతం భస్మని*

*తీర్థా నామవగాహనాని చ గజస్నానం వినా యతృద*

*ద్వంద్వామ్భోరుహ సంస్మృతీర్విజయతేదేవస్స నారాయణః*


*‘శ్రీ మన్నారాయణుని’ స్మరించకుండా చేసిన వేదాభ్యాసం అరణ్యరోదన వంటిది.*


*ఎన్ని ధర్మ కార్యాలను చేసినా బూడిదలో పోసిన పన్నీరువలె వ్యర్థమవుతుంది, ఎన్ని తీర్థసేవనలు చేసినా గజస్నానమే అవుతుంది (వ్యర్ధమే).*


*శ్రీమన్నామ ప్రోచ్చ్యనారాయణాఖ్యం                   కేన ప్రాపుర్వాం ఛితం పాపినోపి,                             హనః పూర్వం వాక్రు వృత్తాన తస్మిన్.                        తేన ప్రాప్తం గర్భవాసాది దుఃఖమ్*


*‘శ్రీమన్నారాయణ’ నామాన్ని ఉచ్చరించువాడు ఎంతటి పాపి అయినా, దైవకృపతో మోక్షాన్ని పొందుతాడు.*✍️

🙏“ఓమ్ నమో నారాయణాయ”🙏

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏



మొలలు వ్యాధి

 *సాఫ్టవేర్ ఎంప్లాయిస్ లో పైల్స్/#మొలలు వ్యాధి నివారణ అవగాహనా కోసం నవీన్ నడిమింటి ఆయుర్వేదం సలహాలు* 


*పైల్స్/#మొలలు*


        మొలలు కదలకుండా ఒకే ప్రదేశంలో కూర్చుని చేసే ఈ మధ్యలో కాలం లో సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ఉన్నవారికి తరచుగా వచ్చే సమస్య పైల్స్‌. అందుకు కారణం సరియైనా ఆహార నియమాలు పాటించకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిళ్లు, మలబద్ధకం వంటి వాటితోనే ఈ సమస్య ఏర్పడుతుంది.


పైల్స్ రావటానికి ముఖ్యంగా నీరు తక్కువగా త్రాగడం, మద్యం అతిగా సేవించుటం, ఫాస్ట్‌ ఫుడ్స్‌, వేపుళ్లు అతిగా తినడం, మాంసాహరం తరుచుగా తినటం వాటి వల్ల వస్తాయి.వివరాలు కు లింక్స్ లో చూడాలి 

https://m.facebook.com/story.php?story_fbid=2595844524013750&id=1536735689924644


*#ఇక_పైల్స్_వచిన_వారిలో_ఉండే_లక్షణాలు*


మల విసర్జన సాఫీగా జరుగదు. తీవ్రమైన నొప్పి, రక్తస్రావం, మంట వుంటాయి. అప్పుడప్పుడు రక్తం పడుతుంది. మల విసర్జన అనంతరం కూడా కొందరిలో నొప్పి మంట రెండు గంటల వరకు ఉంటుంది. విరోచనం కాకపోవడం వీరికి బాధ కలిగిస్తుంది. సుఖ విరోచనం కాకపోవడంతో చిరాకుగా కోపంగా ఉంటారు. మల విసర్జన సమయంలో మొలలు (పైల్స్‌) బయటకు పొడుచుకొని వచ్చి బాధిస్తాయి.మనుషులు చురుకుగా ఉండలేరు. ఎక్కడికంటే అక్కడికి ప్రయాణాలు చేయలేరు.


*పైల్స్/#మొలలు_నివారణకు నవీన్ సలహాలు  (Navee  tips for piles)*


దానిమ్మ: హెమరాయిడ్స్ కు మరో చక్కటి హోరెమడీ ఎర్రని పండ్ల తొక్క బాగా సహాయపడుతుంది. కొన్ని నీళ్ళలో దానిమ్మ తొక్కను వేసి బాగా ఉడికించి, వడగట్టి రోజుకు ఒకటి రెండు సార్లు తాగుతుండాలి.


అల్లం -నిమ్మరసం జ్యూస్: పైల్స్ కు డీహైడ్రేషన్ కూడా ఒక ప్రధానకారణం. అందువల్ల అల్లం, నిమ్మరసం, తేనె కలిపిన జ్యూస్ ను ప్రతి రోజూ రెండు సార్లు తాగాలి.


*ముల్లంగి రసం :*

పైల్స్ కు ఒక గ్లాసు ముల్లంగి రసం చాలా అద్భుతంగా చేస్తుంది. ముందుగా 1/4కప్పుతో ప్రారంభించి, రోజు రోజుకూ అరకప్పు రసంను పెంచుకుంటూ పోవాలి


*పచ్చి ఉల్లిపాయ:* పైల్స్, మలంలో రక్తం పడటం వంటి సమస్యలను నివారించడానికి పచ్చి ఉల్లిపాయ బాగా పనిచేస్తుంది. పచ్చి ఉల్లిపాయను తినడం లేదా జ్యూస్ తాగడం వల్ల రక్తం పడటాన్ని తగ్గించి అనల్ పెయిన్ ను తగ్గిస్తుంది. ఫిగ్(అంజీర పండు): అంజీర పండు రాత్రంతా నీటిలో నానపెట్టి ఉదయం పరగడుపును తింటే మలబద్ధకం పోయి పైల్స్ వ్యాధి నయమైపోతుంది. ఆ నీటిని సగభాగం ఉదయం, సగభాగం సాయంత్రం తాగినా కూడా మంచి ఫలితం ఉంటుంది.


*వ్యాయామం:* మలబద్దకం నివారించడానికి మరియు శరరంలో క్రమంగా రక్త ప్రసరణ జరగడానికి రెగ్యులర్ వ్యాయామం బాగా సహాయపడుతుంది. అతిగా వ్యాయామం చేయడం లేదా ఎక్కువ బరువులను మోయడం వల్ల కూడా హెమరాయిడ్స్ అధికంగా కావచ్చు. కాబట్టి సాధారణ వ్యాయమం మరియు వాకింగ్ వంటివి అలవాటు చేసుకోండి.


*పసుపు:* పసుపుల అనేక వైద్య లక్షణాలు కలిగి ఉంది. మీరు సహజంగా పైల్స్ ను నివారించాలనుకుంటే పసుపుకొమ్మ లేదా పసుపును నీటిలో వేసి ఆ నీటిని బాగా తాగాలి.


అరటి పండు అరటి పండు: అరటిపండు తింటే మలబద్ధకం నివారిస్తుంది. ప్రతిరోజూ ఉదయం లేదా ప్రతి భోజనం తర్వాత అరటిపండు తినండి.


సోయా బీన్స్ సోయా బీన్స్: బఠాణీ జాతి అయిన బీన్స్, కిడ్నీ బీన్స్, సోయా బీన్స్, బ్లాక్ బీన్స్, పీచు అధికంగా వుండే కాయ ధాన్యాలు పైల్స్ రోగులకు మంచివి. ఇవి తేలికగా జీర్ణమై పేగులు శుభ్రపడేలా చేస్తాయి.


*టాయిలెట్ పొజిషన్:* టాయిలెట్ పొజిషన్ సరిగ్గా ఉండాలి. కూర్చొనే విధానం కరెక్ట్ గా ఉన్నప్పుడు. ఇబ్బంది పడనవసరం లేదు. టాయిలెట్ స్టెప్ మీద కరెక్ట్ గా కాలు(పాదాలు)పెట్టి కూర్చొని ముందుగా వంగడం వల్ల రెక్టమ్ మీద ప్రెజర్ తగ్గుతుంది.


*పైల్స్_తగ్గేందుకు_తీసుకోవలసిన_జాగ్రత్తలు (Home remedies for piles)*


పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి (కనీసం రోజుకు 4నుండి 5లీటర్లు).


ప్రతిరోజు వ్యాయామం చేయాలి. రోజూ మల విసర్జన సాఫీగా జరుగునట్లుగా చూసుకోవాలి.


మద్యం, ఫాస్ట్‌ ఫుడ్స్‌, వేపుళ్లు, మాంసాహరం, చిరుతిళ్లు మానేయాలి. మానసిక ఒత్తిడి నివారణకు బాగా వివ్రాంతి తీసుకోవడం, నిత్యం యోగా, మెడిటేషన్‌ చేయాలి.


డాక్టర్ ను సంప్రధించి సరైన చికిత్సని తీసుకోవల్సి ఉంటుంది. అంతే కాకుండా కొన్ని ఇంటి చిట్కాలను ఉపయోగించి కూడా సహజ పద్దతుల్లో పైల్స్ ను నివారించుకోవచ్చు.


ఉదాహరణకు కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను తీసుకోవడం వల్ల సులభంగా జీర్ణం అయ్యి, పాసేజ్ ను సులభతరం చేస్తుంది. అందుకు ఫైబర్ అధికంగా ఉండే లెగ్యూమ్, అరటి, సిట్రస్ మరియు ఫింగ్ వంటి ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి. ఇలా పైల్స్ ను నివారించవచ్చు.

*#ఆర్షమొలలు*


*1. అర్శోహర చూర్ణముతో మొలల(molalu) వ్యాధి నివారణ:*


తోక మిరియాలు – 20 గ్రాములు

యాలకులు – 4

మెత్తటి పొడిని తయారుచేసి, కొద్దిగా తీసుకొని రెండు పూటలా చన్నీటితో సేవింపవలెను.

గుణము:

మూల వ్యాధి ( పైల్స్) నశించును.

2. మిరియాలుతో మొలల వ్యాధి నివారణ:

మిరియాలు – 10 గ్రాములు

శొంఠి – 20 గ్రాములు

చిత్రమూలము – 80 గ్రాములు

అడవికంద -16 గ్రాములు

తీసుకొని, విడివిడిగా చూర్ణములను తయారుచేసుకొని,

పాతబెల్లము 500 గ్రాములు పాకము బట్టి, అందు పైన తెలిపిన చూర్ణములన్నింటినీ వేసి, బాగుగా కలిపి, కొంచెం నెయ్యి కూడా చేర్చి, లేహ్యముగా తయారు చేసి, ప్రతి దినమూ 2 పూటలా ఉసిరికాయంత తినా


-అర్శ మొలలు-

*#మొదటి పద్ధతి:*

ఆవు వెన్న మరియు నువ్వులు(Sesamum indicum L.) సమానముగా కలిపి ఒక వారంరోజుల పాటు ప్రతిరొజూ రెండు పూటలా సేవిస్తూ ఉంటే మూల వ్యాధి తగ్గుతుంది.


*#రెండవ పద్ధతి:*

ఒక టీ స్పూను ఆవు నెయ్యిని, ఒక గ్లాసు ఆవు పాలలో కలిపి ప్రతినిత్యం త్రాగుతూ ఉంటే మొలలు ఊడి పడిపోవును.


*ధన్యవాదములు 🙏*

మీ నవీన్ నడిమింటి  

       *సభ్యులకు విజ్ఞప్తి*         **************************

           ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

*కేశవ నామాలు-గణిత భూమిక.*

 *కేశవ నామాలు-గణిత భూమిక.*


విష్ణుమూర్తికి24పేర్లున్నాయి.వాటిని కేశవనామాలంటారని మనకు తెలుసు.


ఇవి 24మాత్రమే ఎందుకు ఉన్నాయి?వీటికి కాలచక్రానికి,గణితానికి ఏమైనా సంబంధం వున్నదా?


ఈ *24 కు గణిత పరమైన భూమిక ఏమిటి*?

చూద్దాం.


విష్ణుమూర్తిని చతుర్భుజుడు అంటాం.అంటే నాలుగు చేతులు గలవాడని కదా?

ఈ నాలుగు చేతుల్లో శంఖం,చక్రం, గద,పద్మాలను ధరించి మనకు దర్శనమిస్తాడు.


నిశితంగా పరిశీలిస్తే, ఈ నాలుగు ఆయుధాల యొక్క అమరికలలో వచ్చే మార్పుల వల్ల ఖచ్చితంగా 24 వేరువేరు రూపాలు విష్ణువునకు ఏర్పడతాయి. 

ఈ 24 రూపాలనే కేశవనామాలంటారు.


*1.కేశవ నామాలలో మొదటి నామం కేశవ.*


కేశవ రూపంలో స్వామి కుడివైపు ఉన్న రెండు చేతులతో 

*పద్మము, శంఖము*

ధరించి ఎడమ వైపు ఉన్న రెండు చేతులతో 

*గద,చక్రం* 

ధరించి ఉంటాడు.


*2.విష్ణువు యొక్క మరొక నామము మాధవ.*


ఈ రూపంలో కుడి వైపు రెండు చేతులతో

*గద,చక్రం* ధరించి,ఎడమవైపు ఉన్న రెండు చేతులతో

*పద్మము,శంఖము* ధరించి ఉంటాడు.


*3.మధుసూధన రూపంలో* 


కుడివైపు చేతులతో *చక్రం, శంఖము* 

మరియు ఎడమవైపు చేతులతో

*గద,పద్మము* ధరించి ఉంటాడు.


*ఈవిధంగా ప్రతి పదిహేను రోజులకు*(పక్షానికొకసారి) 


*పౌర్ణమికి, అమావాస్య కు* తన ఆయుధాలను చేతులు మార్చుకుంటూ ఉంటాడు శ్రీ మహా విష్ణువు.


*ఈ మార్పులు లేదా అమరికలను* మనం గణిత శాస్త్ర పరిభాషలో *ప్రస్తారాలు(permutations)* 

అంటాం.

అనగా 4 వస్తువులను 4! 

(4 factorial) విధాలుగా అమర్చవచ్చు.


4! = 4×3×2×1=24


*శంఖాన్ని* 'శ' తోను,

*చక్రాన్ని* 'చ' తోను,

*గదను* 'గ' తోను,

*పద్మాన్ని* ' ప'తోను సూచిస్తే,


*ఆ 24 అమరికలు* క్రింది విధంగా వుంటాయి.


*1) శచగప 2) శచపగ*

*3) శపచగ 4) శపగచ*

*5)శగచప 6)శగపచ*

*7)చపగశ 8)చపశగ*

*9)చగపశ 10)చగశప*

*11)చశగప 12)చశపగ*

*13)గపశచ 14)గపచశ*

*15)గచశప 16)గచపశ*

*17)గశపచ 18)గశచప*

*19)పచగశ 20)పతశగ*

*21)పశగచ 22)పశచగ*

*23)పగశచ 24)పగచశ.*


[పైవన్నీ *ఒక క్రమంలో* ఉన్నట్లు పరిశీలించి ఉంటారు.]


ఈ 24 నామాలు పెద్దలందరికీ తెలిసినా‌...


మరోసారి క్రింద ఉదహరిస్తున్నాను.

      

*కేశవ,నారాయణ*

*మాధవ,గోవింద*

*విష్ణు,మధుసూధన*

*త్రివిక్రమ,వామన*

*శ్రీధర,హృషీకేశ*

*పద్మనాభ,దామోదర*

*సంకర్షణ,వాసుదేవ*

*అనిరుధ్ధ,ప్రద్యుమ్న,*

*పురుషోత్తమ,అధోక్షజ*

*నారసింహ,అచ్యుత*

*జనార్ధన,ఉపేంద్ర*

*హరి శ్రీకృష్ణ.*


ఈ నాలుగు ఆయుధాలను అన్ని విధాలుగాను మార్చుకోవటానికి 

*24 పక్షాలు* అంటే

*12 నెలలు*

అనగా *ఒక సంవత్సరం* పడుతుంది*

దేహం తండ్రి ప్రసాదం

 దేహం తండ్రి ప్రసాదం


దేహం తండ్రి ప్రసాదం’ అని వేదం స్పష్టంగా చెప్పింది.

‘పురుషే హవా అయిమదితో గర్భో…’ అని మొదలయ్యే ఐతరేయ మంత్రం- శుక్రం రూపంలో, అంటే వీర్యంగా పురుషుడు స్త్రీ యందు ప్రవేశించడం వల్ల దేహధారణ జరుగుతుందని వివరించింది.


తండ్రి బింబం అయితే, తనయుడు ప్రతిబింబమని దీని అర్థం.


తండ్రి మాటను నిలబెట్టడం కోసం రాముడు చేసిన అపూర్వ త్యాగాన్ని రామాయణం విస్తారంగా చర్చించింది.


తండ్రి యయాతికి తన యౌవనాన్నే ధారపోసిన పూరుడి కథను భాగవతం వర్ణించి చెప్పింది.


తండ్రి కోసం భీషణ ప్రతిజ్ఞ చేసి చివరికంటా బ్రహ్మచర్యం పాటించిన భీష్మ పితామహుడి గాథను భారతం వివరించింది.


‘పుత్ర శబ్దానికి – తన మంచి పనులతో ప్రీతి కలిగించేవాడు, పితృభక్తి గలవాడు మాత్రమే అర్హుడు’ అని మన పెద్దలు నిర్వచించారు.


‘ భార్య, భర్త అనే రెండు తాళ్లు ముడివేస్తే, ఆ ముడి- సంతానం’ అంటాడు భర్తృహరి. దాన్నే ‘ సుతాకారపు ముడి ’ అని చెబుతారు.


అది పేగు బంధం. ఆ బంధం శిథిలమైతే బతుక్కి అర్థం ఉండదు.


వృద్ధులైన తల్లిదండ్రులను కావడిలో స్వయంగా మోస్తూ తీర్థయాత్రలకు తిప్పిన శ్రవణ కుమారుడు …


అనుక్షణం తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాచుకున్న ప్రవరాఖ్యుడు …


అమ్మ ఆర్యమాంబకు ఇచ్చిన మాట కోసం సన్యాస దీక్ష నుంచి దిగివచ్చి అమ్మకు అంత్యక్రియలు నిర్వహించిన శంకరులు …


ఇలాంటివారే పుత్ర శబ్దానికి అర్హులు.


అంతేకాని- వృద్ధులైన అమ్మానాన్నలను సేవించడం కంటే, వృద్ధాశ్రమాల్లో పెట్టి పోషించడం సౌకర్యంగా ఉంటుందనుకునేవాళ్లు, పుత్రులు అనిపించుకోరు.


అమ్మను ఇంట్లో ఉంచుకుందాం దేనికైనా ‘పని’కొస్తుందని, అమ్మానాన్నలను విడదీసేవారికి ‘తల్లిదండ్రులు’ అనే పదం గురించి బొత్తిగా తెలియదని అర్థం.


ఆ పదం సమాసరీత్యా ద్వంద్వమే కానీ, స్వభావరీత్యా ఏకవచనమే!


కాబట్టే విగ్రహవాక్యం – ‘ తల్లియును తండ్రియును ’ అంటూ ఏకవచనంలో చెప్పాలంది వ్యాకరణ శాస్త్రం . ‘వారు ఇద్దరు కారు, ఒక్కరే’ అనే భావనను మనలో పెంపొందించడానికే – భారతీయ తత్వచింతన అర్ధనారీశ్వర తత్వాన్ని ప్రతిపాదించింది.


కుటుంబ వ్యవస్థకు, గృహస్థుధర్మ నిర్వహణకు ఆధారపీఠాలుగా నిలిచిన నాలుగు మూల స్తంభాల్లో ‘ మాతృదేవోభవ’ ‘పితృదేవోభవ ’లను మొదటి రెండుగా చెబుతారు.


వీటిలో అమ్మకు- పెరట్లో తులసి మొక్క గూట్లో కాంతులీనే ప్రమిద దీపం ప్రతీక!


ఇంటి వాకిటా వికాసాన్ని వెదజల్లే వీధిగడప దీపం నాన్నకు ప్రతీక!


“లోకంలో అమ్మలపై వచ్చినంత కవిత్వం నాన్నల గురించి రాకపోవడంలో విచిత్రం ఏమీ లేదు.”


అమ్మ ప్రేమ పారదర్శకం, నాన్న ప్రేమ గుంభనం కావడమే దానికి కారణం. అమ్మది ఆప్తవాక్యం, నాన్నది గుప్తధనం!


అమ్మ ప్రేమలో వైశాల్యం ఎక్కువ. నాన్న ప్రేమకు లోతెక్కువ.


ఆత్మీయత, వాత్సల్యం వంటి విషయాల్లో ఇద్దరి స్వభావాలూ ఒక్కటే అయినా- నాన్న అంత తొందరగా బయటపడడు కాబట్టి, అమ్మతో ఉన్నంత చనువు నాన్నతో లేకపోవడం లోక సహజం!


అమ్మ జన్మదాత, నాన్న జీవనదాత. పిల్లలకు రక్షణ, పోషణ విషయంలో నాన్నే ఆలంబన.


శ్రమ విషయంలో కొడుకు తనకన్నా తక్కువ కష్టాలతో గట్టెక్కాలని, స్థాయి విషయంలో తనకన్నా చాలా ఎత్తుగా ఉండాలని తపన పడని తండ్రి ఉండడు. దానికోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడటం నాన్న లక్షణం !!

మా బెజవాడ

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

మా బెజవాడ 

ఎంత మారి పోయింది 

ఒకప్పటి బెజవాడలా లేదిది.

ఊరు మారిపోయింది .

దాని కన్నా వేగంగా ఊర్లో జనం మారిపోతున్నారు.

అన్నీ మార్పులే.

డా.బసప్పున్నమ్మ గారి ఆసుపత్రి ముందు ఉండే వాణీ నికేతన్ ఎప్పుడో కొట్టేసారు.

పక్కనే ఉండే సోడా కొట్టు ఇపుడెక్కడుందో తెలీట్లా. 

వరసెట్టి షాపులు కట్టేసేరక్కడ

గోడలమీద అంటించే సినిమా పోస్టర్లు తగ్గిపోయి,

ఇపుడు రాజకీయ పోస్టర్లొచ్చీసినియ్.

మా నాయకుడు మా నేత అంటూ ఒకటే కులాల గోల. పెరిగింది 

బందరులాకుల దగ్గరుండే కలప దుంగల కొట్టు తీసేసి అపార్టుమెంటు కట్టేసేరు.

పటమటలంక స్కూల్ బిల్డింగు పాతదైపోయింది,

రూపే మారిపోయింది.

దాంతో దానెనక ఉండే గ్రౌండులో కట్టిన స్కూలు “ఒక స్కూలు” లానే ఉంది తప్ప ఇదివరకట్లా కళ మాత్రం లేదు. 

పాత బస్టాండ్ లో మాత్రం పార్కు లాగా కట్టారు పర్లేదు బాగానే ఉంది . ఊరెళ్ళితే ఏరా అని పిలడానికి మనతో చదివినోడెవడూ ఊర్లో లేడు. 

ఉన్న ఆ కొంత మంది మాత్రం ఫోనుచేస్తేనే.. హలో అంటారు.

వాట్సప్ లో చూస్తుంటారు. 

అంతెందుకు సినిమాహాల్లో సమోసా కొనే వాళ్ళ కన్నా, 

కారన్ను, కోకుని, మోజుతో కొనేవాళ్ళే ఎక్కువ.

కొంతలో కొంత ఆనందం ఏంటంటే ఇంకా ప్రతివాడు చూసేది “సినిమానే..”

బెజవాడ జనం కూడా అలానే ఎళ్తన్నారు సినిమాకి. 

ఆనాటి నుంచి..

ఈనాటి వరకు 

ఎన్టీఆరైనా~ఏన్ఆరైనా

కృష్ణైనా~శోబనైనా

చిరంజీవైనా~మురళీమోహనైనా 

బొమ్మ పడాల్సిందే..

చూసి తీరాల్సిందే..

ఇలా అన్ని రకాలు నడుస్తాయి.. కాకపోతే ఆనాడు ధియేటర్ల దగ్గర ఉండే సినిమా హాడావిడి ఇప్పుడు లేదు, ఆ నాటి రోజులే వేరు , ఆ కళే వేరు , ఆ ఉత్సాహం ....ఊహూం ...రాదేమో.... డీవీఎస్ కర్ణ......

దానవీరశూర కర్ణ రిలీజ్ అయి 40 ఏళ్లు అయ్యింది ఆరోజు దుర్గకళా మందిరం దగ్గర అభిమానుల హడావిడి చూడటానికి రెండు కళ్లు చాలవేమో అనిపించేలా ఉండేది ఎన్టీవోడి కటౌట్లతో తాలూకా సెంటర్లో హడావిడి అదీ, ఈ రోజు జీ.పీ.ఎస్.కె. శాతకర్ణి కి అంత కళ కనపడలేదు మరి , .

రెండో ఆటకు ఇంతకు ముందులా రాత్రయితే “కిరసనాయిలు దీపం బుడ్డితో" సైకిల్లు వేసుకెళ్ళక్కరలేదు.

మా బెజవాడంతా రాత్రైనా పట్ట పగల్లా విద్యుద్దీప కాంతులతో వెలిగి పోతోంది కానీ మనుషుల జీవితాల్లో వెలుగు రాలేదని పించింది. సైకిలు రిక్షాలు పోయి సర్వీసు ఆటోలొచ్చేసినియ్యి. బెజవాడ రిక్షాల విలువలు తీసేశాయి.

రోడ్ల నిండా జనం,

తిరుగే వాళ్లు ఎక్కు వైపోయారు. 

ట్రాఫిక్ పెరిగిపోయింది. 

అప్పట్లో..

సాయంత్రమయితే బీసెంటురోడ్డు ~రవీంద్రకూల్ డ్రింక్స్ , అజంతా హోటల్ ,సాంబారు ఇడ్లీ, గాంధీనగర్ లో వెల్ కమ్ హోటల్ టిఫిను , తోపుడు బళ్ల మీద సోడాలు 

తిరిగిరాని రోజులైపోయాయి

. మా 

సత్యన్నారాయణపురం రూపమే మారిపోయింది సత్యనారాయణపురం 

రైల్వే స్టేషన్ కాస్తా ఉపేంద్ర గారి పుణ్యామా అని 

బైపాసు రోడ్ అయిపోయింది, 

మేం చదువుకున్న కిష్టం మూర్తిగారి బడి ఆనవాళ్లు కూడా లేదు,

బాబూ రావు మేడ సెంటర్లో పాత కాలం నాటి విశ్వనాధంగారి హాస్పటల్ బిల్డింగ్ లో కొత్త కట్టడాలు వచ్చాయి. 

గేటు దగ్గర కొమ్మూరివేణు గోపాల రావు గారి హస్పటల్ బిల్డింగ్ పాతకాలపు చిహ్నం లా మిగిలి ఉంది, ఇటు వైపు సదాశివశాస్త్రి గారి ఆస్పత్రి వాళ్లబ్బాయి శ్రీనివాస్ నడిపిస్తున్నాడు.

శివాజీకేఫ్ , దుర్గావిలాస్ ,లో కమ్మటి టిఫిన్ ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల లో దొరకటంలా....ఘుమ ఘుమ లాడే ఆంజనేయ కాఫీ వర్క్స్ తీసేశారు, 

కార్టూనిస్టు రాజన్ తర్వాత నడిచిన రాజన్ కిళ్లీ షాపు తీశేశారు, అంబికాయిల్లు మిల్లు లేదు , కన్నాంబ మేడ లో అపార్ట్ మెంట్ వస్తోంది, కుక్కల మేడలేదు, మారుతీ వ్యాయామశాల లో వ్యాయామం చేసేవాళ్లు లేరు పేరు మాత్రం నిలిచి పోయింది,

మహేష్ టైలర్స్ బుడే టైలర్స్ అని ఇద్దరు ఫేమస్ టైలర్స్ ఉండే వాళ్లు వాళ్లు తీసేసి దశాబ్దాలు అయ్యిందిట,

గాంధీనగర్ లో కాలవొడ్డున ఉండే జ్యోతి కాలేజి మూతపడింది . ఈశ్వర్ మహల్ రాధా టాకీసు గా మారి పూర్తిగా కూలగొట్టబడింది, 

గాందీ నగరంలో సినిమా డిస్ట్రిబ్యూషన్ ఆఫీసుల హడావిడి లేదు, లక్ష్మీ ఫిలింస్, పూర్ణా పిక్చర్స్, విజయా ఫిలిమ్స్ ఇది వరకే మూసేశారనుకోండి కానీ ఆ సినిమా కళ ఇప్పుడు లేదు.

కేదారేశ్వర పేటలో సదాశివయ్య బిల్డింగ్ కూల్చేశారు, సిమెంట్ ఫ్యాక్టరీ లో లోటస్ ల్యాండ్ మార్క్ వచ్చింది, మామిడికాయ పాకలు ఊరు చివరకెళ్లాయి, అయోధ్య నగర్ ఐస్ ఫ్యాక్టరీ లేదక్కడ , 

కానీ, కొంచెం ముందుకెళ్ల్తే కంపు కొట్టుకుంటూ బుడమేరు అలాగే ప్రవహిస్తోంది .

రోడ్లు విశాలం అయ్యాయి కానీ మనుషులు, మనసులు మాత్రం ఇరుగ్గా ఉన్నాయని పించింది, అరేయ్....అని ఆప్యాయంగా పలకరించే వాడే కరువైపోయాడు, వయసురీత్యా వచ్చిన పెద్దరికమో తెలీదు, భాధ్యతల బరువు వల్లో తెలీదు, పొడి పొడి మాటల పలకరింపులే మిగిలాయి కనపడిన మిత్రులతోటి . 

అప్పుడు కార్లు పదుల సంఖ్యలో 

స్కూటర్లు వందల సంఖ్యలో ఉండేవి . 

ఇప్పుడు

మనుషులెంతమందో మోటారు సైకిళ్ళన్నున్నాయి 

కుటుంబానికి రెండు కార్లున్నాయి

సౌకర్యాలన్నీ అవసారలయ్యాయి 

మళ్ళీ మనం

బెజవాడ కొస్తే..

మన పంటకాలవని

100 అడుగుల రోడ్డు చేశారు

సాయంత్రమయిందంటే

అక్కడే..

చైనీసు నూడిల్స్,

రాజస్థానీ ఛాటు మసాలా అమ్మకాలు.

మధ్యలో మేమూ ఉన్నాం అని చెప్పుకోడం కోసం మిర్చీ బజ్జీ బళ్ళు.

లబ్బీపేట పొలాల్నీ ఆఫీసులు~షాపులు చేసేశారు.

లక్ష్మీ టాకీసు

జైహింద్ టాకీసు 

రామాటాకీసు 

విజయ టాకీసు సినిమా హాళ్ళయితే పదిహేనేళ్ళు పైనే అయిందట రూపుమారిపోయి. కావాలంటే

కొత్త మల్టీ ప్లెక్సుకి ఎళ్ళిపోతున్నారు 

బార్లు పెరిగిపోయాయి,

సోడా కొట్లు పోయి..

“సోడా మెషీన్లు” వచ్చేసేయి

అలా మెషినెట్టుకోలేనోళ్ళు మాత్రం

బండి మీద నిమ్మ సోడా చేసుకుని అమ్ముకుంటున్నారు

ఇపుడెంత ఎతికినా పుల్లైసు రావట్లేదు

కావాలంటే 'క్వాలిటీ' ఐసుక్రీము దొరుకుతుంది 

సత్యంకొట్టుకెళ్ళి ఒక “మట్టి పలక” ఇవ్వండి అందామంటే.. 

అయిబాబోయి

చాలా రోజుల తర్వాత సత్యంకొట్టు మాటిన్నాను ఎప్పుడో ఎత్తేశాడండి చెప్పాడాయన

కవితా స్కూలు ముందు జాంకాయలమ్మేటోళ్ళు రాట్లేదు.

లేస్ లేదా కురుకురే తింటన్నారు పిల్లలు.

ఇదేంట్రా ఊరిలాగయిపోయింది అంటే..

ఊరు మాత్రం ఎదగొద్దా??? 

మీరెళ్ళి హైదరాబాదులో ఉద్యోగాలు చేత్తే చాలా అని అడిగాడొకడు.

ఎదగాలి..

ఎందుకెదగొద్దు.

కానీ ఎదగడం అంటే

బిల్డింగులు,

మల్టీప్లెక్సులు,

స్వీటు కార్నులు

మాత్రమే కాదు.

మీరాటినే పట్టుకుని గొప్పనేసుకుంటే ఎలాగ.

మీకు బెజవాడంటే ఉంటున్న ఊరు మాత్రమే. 

కిష్ణ కట్టవెంబడి అమరావతి రోడ్డులో ఉన్న కిష్టాయపాలెంలో ఉన్న పోలయ్య తాత అవధూతను చూడడానికి విజయవాడ నుంచి సైకిలేసుకుని 15 , 20 కిలోమీటర్లు వెళ్లే వాళ్లం ఇప్పుడు ఆ రోడ్డులో బాబుగారి బంగళా వచ్చి సెక్యూరిటీ పెరిగిపోయింది. ఏమిటో ఆ రోడ్డెమ్మట వెళుతుంటే ఆ అరటి, ఉల్లి తోటలు .......ఆరోజులు మర్చిపోలేం 

మాలాగ వేరే ఊరెళ్ళి బతికేవోళ్ళకి మాత్రం బెజవాడంటే..

బోలెడన్ని జ్ఞాపకాలు,

అనుభవాలు,

ఇష్టాలు,

చదువుకున్న రోజులు, సైకిలేసుకుని తిరిగిన బెజవాడ రోడ్లు మిత్రులతో 

కబుర్లతో గడిపిన చాలా ప్రాంతాలు 

టిఫిన్లు పెట్టిన విజయ సూపర్ బజజార్లు

ఊరులో జ్ఞాపకాలు చెరిపేత్తున్నారు అన్నపుడు మాకూ అంతే బాధేస్తుంది. 

ఎంత మారిపోయింది

ఒకప్పటి మా బెజవాడ.....Paresh Turlapati.

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 88*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 88*


చాణక్యుడు అశ్వరూడుడై వేగంగా ప్రయాణం చేసి పర్వతక సోదరుడు వైరోచనుని విడిదికి చేరుకున్నాడు. వైరోచనుడు ఆర్యునికీ స్వాగతం పలికి "చంద్రగుప్తునితో పాటే మాకూ పట్టాభిషేకమన్నారుగా ? ఇప్పుడు ఊరేగింపు అతనికొక్కడికే పరిమితం చేయడం ఏమి న్యాయం ?" అని అడిగాడు నిష్టూరంగా.


"మా చంద్రుడూ సరిగ్గా ఇదే ప్రశ్న నన్ను అడిగాడు..." అంటూ చాణక్యుడు నవ్వి "ఊరేగింపు మాత్రమే కాదు. పట్టాభిషేక విషయంలోనూ, తన విజయానికి కారకులైన మీకే మొదటి గౌరవం దక్కాలని, ముందుగా తమర్ని అర్ధరాజ్యాభిషిక్తుడిని గావించిన తర్వాతే తన పట్టాభిషేకం జరగాలని మా చంద్రుడు మంకుపట్టు పట్టాడు. అదీ నిజమే. అసలు విజయానంతటికీ మూలకారకులు మీరూ మీ సైన్యసంపత్తులేకదా ! చంద్రుడి పట్టు న్యాయమే" అన్నాడు. 


చంద్రగుప్తుడికంటే ముందు తనకే అర్థరాజ్య పట్టాభిషేకం జరుపుతారన్న మాటకి వైరోచనుడు లోలోపలే సంబరపడిపోతూ "న్యాయం ఎవరు చెప్పినా న్యాయమే" అన్నాడు. 


చాణుక్యుడు నవ్వి "మరే ఇందులో వేరు అభిప్రాయానికి తావులేదు. కానీ ... " అర్థోక్తిలో ఆగాడు. 


"కానీ ....?" అనుమానంతో రెట్టించాడు వైరోచనుడు. 


"మరేం లేదు. ధర్మాచరణ మంటూ ఒకటి ఉంది కదా ! మగధలోని పెద్దలు ధర్మాచరణకే ప్రాధాన్యతను ఇస్తారు. ఆ ప్రకారం ఆలోచిస్తే చంద్రుడే మొదట సింహాసనం అధిష్టించాలి. అతడేమో ఒప్పుకోవడం లేదు. అందుకని..." 


"చెప్పండి...." రెట్టించాడు వైరోచనుడు.


చాణక్యుడు నవ్వి "మరేంలేదు. భద్రగజంపై చంద్రగుప్తుని ఊరేగింపు పెట్టిన ముహూర్తానికే బయలుదేరుతుంది. కానీ ఇక్కడే చిన్న మార్పు. ఏనుగుపై చంద్రుని బదులు అతని దుస్తులు ధరించి మీరు ఆసీనులై ఊరేగుతారు. ప్రజలు గుర్తించకుండా మీ ముఖం మీద పూలమాలలు వేస్తాం. మీరు చంద్రునిలా ఊరేగుతూ సభాస్థలికి చేరుకుంటారు. వెంటనే మీకు పట్టాభిషేకమూ జరిగిపోతుంది. ఆ తర్వాత మిమ్మల్ని సభాస్థలకి పరిచయం చేస్తాం. జరగాల్సిందేదో జరిగిపోయింది కాబట్టి మాగధ పెద్దలు నోరెత్తలేరు. ఆ తదనంతరం చంద్రునికి అర్ధరాజ్యాభిషేకం. అదీ మీ చేతుల మీదుగా..." అని చెప్పి ఆగి, ఊపిరి పీల్చుకొని "దీనికి తమరు పెద్ద మనసుతో అంగీకరిస్తేనే" అంటూ ముక్తాయింపు ఇచ్చాడు. 


ఊరేగింపుతో పాటు పట్టాభిషేకం ముందు తనకే జరుగుతుందని విన్నాక, వైరోచనుడు మరేం ఆలోచించకుండా "బలేవారే మీరు నిర్ణయం చేశాక దాన్ని వ్యతిరేకిస్తానా ? మీ ఇష్టప్రకారమే కానివ్వండి" అని చెప్పాడు సంతోషంగా. 


చాణక్యుడు లేచి "శుభం. అయితే పట్టాభిషేకం దుస్తులు పంపిస్తాను. ధరించి సిద్ధంగా ఉండండి" అని చెప్పి బయలుదేరాడు. 


వైరోచనుడు తన అంగరక్షక దళసేనానిని పిలిచి చాణక్యుని వ్యూహాన్ని అతనికి వివరించి "నేను భద్రగజం మీద ఊరేగుతాను. మీరు చంద్రగుప్తుని గౌరవార్థం అన్న వంకతో మన సైన్యాలతో నాకు ఇరుపక్కలా అనుసరించండి. అనుకున్న ప్రకారం మా పట్టాభిషేకం సజావుగా జరిగిందా సరే సరి. ఏదైనా ప్రమాదం వస్తే మీరు తెగబడి చాణక్య చంద్రగుప్తులను నరికి పారేయ్యండి. మేము సింహాసనాన్ని ఆక్రమించుకుంటాం" అని తన వ్యూహాన్ని విశదం చేశాడు. 


ఊరేగింపు అనుకున్న ముహూర్తానికి ప్రారంభమైంది. ముందు భాగంలో పాంచాల, అయోధ్య, కాశీ, మధుర రాజ్యాలు సైన్యాలు వాటివెనక మంగళ వాయిద్యాలతో పాటు వివిధ వాయిద్య బృందాలు, వారి వెనక కవి, గాయక, నృత్య కళాబృందాలు, ఆ వెనక వేదమంత్రోచ్ఛారణలు చేస్తూ వేద మంత్రోచ్చారణలు చేస్తూ వేదకోవిదులు, పురోహితులు, ప్రముఖులు, మంత్రులు, ఆ వెనక భద్రగజంపై ఆశీనుడై చంద్రగుప్తుడు-భద్రగజానికి ఇరువైపులా 'గౌరవ సూచకంగా' పర్వతక సేనలు, ఆ వెనక పిప్పలవన సేనలు, వాటి వెనక సింహపురి సేనలు, వాటి తర్వాత ఆంధ్ర, కళింగ సైన్యాలు అనుసరిస్తుండగా ఊరేగింపు నగర ప్రధాన వీధులగుండా సాగుతోంది. 


చంద్రగుప్తుని దుస్తుల్లో ముఖం ఆనవాలు తెలియకుండా పూలమాలలు ధరించి భద్రగజంపై ఊరేగుతున్న వైరోచనుడు తన అదృష్టానికి లోలోపలే మురిసిపోతున్నాడు. ఊరేగింపు కంటే ముందు చాణక్యుడు ఒక్కడే అశ్వారూడుడై ముందుకు సాగుతున్నాడు, ప్రజలు నినాదాలతో, చంద్రగుప్తునికి జేజేలతో నగర వీధులు మార్మోగిపోతుంటే.... చాణక్యుడి డేగ చూపులు దారి పొడవునా "దేనినో" అన్వేషిస్తూనే ఉన్నాయి.

 

ఊరేగింపు క్రమక్రమంగా ఉత్తర దిశకు తిరిగి ప్రధాన రాజమార్గంలో సుగాంగ ప్రాసాదం వైపు పయనించసాగింది. రాజభవనం సమీపిస్తుండడంతో ఊరేగింపు కోలాహలం మిన్నంటింది. 


ఆ సమయంలో చాణక్యుడి దృష్టి ఒక అద్భుతమైన ద్వారం మీద పడింది. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*



🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

ఈ రోజు పదము

 188వ రోజు: (ఇందు వారము) 12-06-2023

మన మాతృ భాష సేవలో ఈ రోజు పద్యము:


సరివారిలోన నేర్పున 

దిరిగెడు వారలకుగాక తెరవాటులలో 

నరయుచు మెలగెడి వారికి 

బరువేటికి గీడె యనుభవంబు కుమారా!


 ఓ కుమారా! తనతో సమానమైన వారితో నేర్పున నడుచుకొనిన గౌరవము, కీర్తి లభించును. అంతేకాక దుష్టుల తోనూ, దొంగలతోనూ, స్నేహం చేసినయెడల గౌరవము చెడి కీడు జరుగును. 


ఈ రోజు పదము. 

పిల్లి (Cat): ఓతువు, చీలిగాడు, త్రిశంకువు, పయ్యసము, పూతిక, బిడాలము, మండలి, మార్జాలము, విడాలము, వ్యాఘ్రాసము, శ్వషాహారము, హిహకము.

భజగోవిందం

 ॐ                 भज गोविन्दं

                    భజగోవిందం 

                 (మోహముద్గరః) 

            BHAJA GOVNDAM   

 

      (श्रीमच्छंकरभगवतः कृतौ 

       శ్రీమచ్ఛంకరభగవత్పాద కృతం 

           BY SRI ADI SANKARA)


                           శ్లోకం :20/31

                   SLOKAM :20/31

                    

శ్రీ ఆనందగిరి 


भगवद् गीता किञ्चिदधीता,

गङ्गा जललव कणिकापीता।

सकृदपि येन मुरारि समर्चा,

क्रियते तस्य यमेन न चर्चा॥२०॥

                    ॥भज गोविन्दं॥ 


భగవద్గీతా కించిదధీతా 

గంగా జలలవ కణికాపీతా |

సకృదపి యేన మురారి సమర్చా 

క్రియతే తస్య యమేన న చర్చా ||20|| 

                    ॥భజ గోవిందం॥ 


    ఎవరైతే భగవద్గీతని కొంచమైనా అధ్యయనం చేస్తారో, 

    గంగా జలాన్ని కొద్దిగా ఐనా తాగుతారో, 

    కొంచమైనా కృష్ణుణ్ణి పూజిస్తారో 

    అట్టివారికి యమునితో వివాదం ఉండదు. 


అనువాదం 


ఎవడు పఠించె గీతా శ్లోక భాగమైన 

ఎవడు తా గ్రోలెను గంగనో గరిటెడైన 

ఎవడు తా భజించె హరి నామ    

                           మొక్కసారి 

వాని కుండదు యముని గోలించు 

                            కేనియును. 


जिन्होंने 

  - भगवदगीता का थोडा सा भी अध्ययन किया है, 

  - भक्ति रूपी गंगा जल का कण भर भी पिया है, 

  -भगवान कृष्ण की एक बार भी समुचित प्रकार से पूजा की है, 


    यम के द्वारा उनकी चर्चा नहीं की जाती है॥२०॥  


Those who 

  - study Gita, even a little, 

  - drink just a drop of water from the holy Ganga, 

  - worship Lord Krishna with love even once,  

    he need no discussion with Yama, the God of death. 


https://youtu.be/ImWKhB_PMiw 


                          కొనసాగింపు 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

            భద్రాచలం

నాకే ఎందుకు ఇట్లా అవుతుంది

   


 నాకే ఎందుకు ఇట్లా అవుతుంది. 


ప్రతి మనిషి అనుకునే సాధారణమైన మాట "నాకే ఎందుకు ఇట్లా అవుతుంది" వాళ్ళందరూ చూడు యెంత సంతోషంగా, ఆనందంగా వున్నారో, అదేమిటోగాని నాకు మాత్రం జీవితంలో సంతోషమే కరువు అయ్యింది. ఎందులో వేలు పెట్టినా కానీ చుక్కెదురే పాడు జీవితం రోజు ఏడుపే నాకు మిగులుతుంది. ఇట్లా మనలో చాలామంది బాధపడుతుంటారు, బాధపడుతున్నారు అంటే అందులో ఆశ్చర్యం ఏమాత్రం లేదు. నిజమే ఎందుకు మనుషులలో ఇలాంటి భావనలు కలుగుతున్నాయి అంటే ప్రతి మనిషి కూడా ఒక అభిప్రాయంతో ఉంటాడు అదేమిటంటే తాను సుఖంగా లేడు ఎదుటివాడు సుఖంగా ఉన్నాడు అని అనుకుంటాడు. ఈ మానసిక స్థితి అటు పురుషులలోని ఇటు స్త్రీలలోను ఉంటుంది. 


మా అయన అస్సలు నా మాట వినడు అదే ఆ విమల వాళ్ళాయన ఎప్పుడు ఆమె కొంగు పట్టుకొని తీరుగుతాడు అంటుంది ఒక కమల . ఆమె దృష్టిలో తన భర్త తనకు స్వాధీనుడు కాడు కానీ విమల భర్త ఆమెకు స్వాదీనుడిగా ఉంటాడు అంటే తనకన్నా విమల అదృష్టవంతురాలు అని తన భావన. నీకు తెలుసా విమలా వాళ్ళాయన రోజు తాగి ఇంటికి వస్తాడట అని ప్రక్కింటి సరళ చెపితే ఆ అట్లనా అని ఆశ్చర్యపోయింది కమల అదికూడా రాత్రి పది పదకొండు గంటలకు. ఒక్కొక్కసారి తాగి రోడ్డుమీద పడితే తెలిసిన వాళ్ళు పట్టుకొచ్చి ఇంట్లో దింపుతారట ఆ అని మరల ఆశ్చర్యపోవటం తన వంతయింది నీకు తెలియదా అక్క అని పక్కింటి సరళ చెప్పేదాకా కమలకు విమల గూర్చి ఆమె తన భర్త విషయంలో పడే ఆవేదన గురించి తెలియదు, తనకు పగటిపూట ఎప్పుడో ఒకసారి తన భార్యను అనునయిస్తున్న అతనిని చూసి అనవసరంగా ఎక్కువగా వూహించుకున్నట్లు అర్ధం అయ్యింది. అక్కా బావ ఐతే ఎంచక్కా సాయంత్రం ఐదున్నరకల్లా ఇంట్లో ఉంటాడు నిన్ను పిల్లలను సినిమాలకు షికార్లకు తీసుకొని వెళతాడు. ఏ రోజయినా బావ ఆరింటికి ఇంటికి వచ్చాడా అక్కా అని అంటే అప్పుడు కానీ కమల ట్యూబులైటు వెలగలేదు యేమాటకు ఆ మాటే చెప్పుకోవాలి నిజానికి నా భర్త ఒక్క రోజు కూడా ఇంటికి ఆలస్యంగా రాడు నేనే ఎప్పుడు ఆయనను ఆడిపోసుకుంటాను అని మనసులో అనుకోని మంచి భర్తను తనకు ఇచ్చినందుకు ఆ భగవంతునికి కృతజ్ఞతలు చెప్పింది. ఒక్కసారి చూసి ఏ అభిప్రాయం ఎవరిమీద ఏర్పరచుకోకూడదని ఆమెకు అర్ధం అయ్యింది.


ఇదే విషయం పురుషులలో కూడా ఉంటుంది. మా ఆవిడ గయ్యాళి ఎప్పుడు నా మాటే చెల్లాలని అంటుంది నేను పడలేక పోతున్నారా అని ఒక రామారావు తన స్నేహితుడు కృష్ణమరావు తో అన్నాడు. దానికి కృష్ణమరావు మిత్రమా నీకు నాగభూషణం భార్య సంగతి తెలుసా అని అన్నాడు ఆ ఆమెకేమి అందంగా ఉంటుంది వాడు అదృష్ట వంతుడు అని అన్నాడు. . నీకు అదే తెలుసు ఆమె భర్త ఆఫీసుకు వెళ్ళగానే హ్యాండు బ్యాగు వేసుకొని షాపింగుకి బయలుదేరుతుంది. ఆమె చేసే షాపింగుకు నాగభూషణం సంపాదన అంతా ఉష్కాకి అవుతుంది నిజం చెప్పాలంటే నాగభూషణంకు ఒక కప్పు కాఫీ తాగటానికి కూడా జేబులో డబ్బులు వుండవు తెలుసా అని అన్నాడు అప్పుడు రామారావుకి తన భార్య పొదుపుతనం జ్ఞ్యాపకానికి వచ్చింది ఏది కొనాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి అది తప్పకుండా అవసరం ఐతేనే కానీ కొనదు. తననుకూడా దుబారా ఖర్చు చేయనీయదు. ఈ రోజు తాను తన సంపాదనతో ఒక సొంత ఇల్లు కొన్నాడంటే దానికి కారణం తన భార్య అని అనుకోని మనసులోనే భార్యను మెచ్చుకున్నాడు. నిజమే తానూ చాలా సార్లు విన్నాడు నాగభూషణం నోటి నుంచి నాకు ఈ నెల ఇంటి కిరాయి కట్టటానికి ఇబ్బందిగా వుంది కొంచం డబ్బులు సర్దు అని అడగటం. ఆలా తానుకూడా చాలా సార్లు నాగభూషణానికి ఇచ్చాడు. కొన్ని ఇచ్చాడు కొన్ని ఇవ్వలేదు. తనుకూడా అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు తెలిసిందిబాహ్య మెరుపులను చూసి బంగారం అని అనుకోకూడదని.


ఇలా వ్రాసుకుంటూ వెళితే నవలలకు నవలలు వ్రాస్తూ వెళ్ళవచ్చు. ఎందుకంటె మన సమాజంలో ప్రతి మనిషికి ఉండే సామాన్యమైన మనస్తత్వం ఒక్కటే అదే ఇతరులను పోల్చుకొని జీవించటం. ఇలా పోల్చుకునే విధానాన్ని వదిలి చుడండి తప్పకుండా మీరు సంతోషంగా ఉండగలరు. 


ఈ ప్రపంచంలో ఎవరి ఆర్ధిక పరిస్థితి వాళ్ళది ఎవరి మనస్తత్వం వాళ్ళది. ఏ ఒక్కరు కూడా వాళ్ళు అన్నదమ్ములే కావచ్చు లేక అక్కాచెల్లెళ్లు కావచ్చు ఇంకొకరి స్థితిగతులకు సమానంగా వుండరు నలుగురు పిల్లలు ఉంటే వకడు అందంగా ఉండవచ్చు ఒకడు అనాకారిగా ఉండవచ్చు ఒకడు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండవచ్చు మరొకడు ఏ పేరు లేకుండా తిండికి కూడా లేకుండా ఉండవచ్చు. అందుకేనేమో మనకు ఒక నానుడి వున్నది అదేమంటే " నేను వాళ్ళను కన్నాను కానీ వాళ్ళ రాతను కన్నానా" అని తల్లులు అంటూవుంటారు. ఇది ముమ్మాటికీ నిజం. 


ప్రతి మనిషి ఒకటి మాత్రం గుర్తుఉంచుకోవాలి అదేమిటంటే నాకు ఈ జన్మ భగవంతుడి ఇచ్చిన వరం. దీనిని నేను సద్వినియోగం చేసుకోవాలి అని సదా తలూస్తూవుండాలి అప్పుడే మదిలో చక్కటి భావాలు రేకెత్తుతాయి, జీవితం మంచి మార్గంలో పయనిస్తుంది. ఈర్ష్య, ద్వేషం, మొండితనం, అలసత్వం, సోమరితనం, ఇతరులమీద క్రుళ్ళుకోవటం, ఎదుటివాని ఎదుగలను చూసి అసూయపడటం మానుకోవాలి. ఈ ప్రపంచంలో భగవంతుడు ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. ఒక్కమాటలో చెప్పాలంటే దేనికి నీవు అర్హుడవో అదే నీకు లభిస్తుంది. ఈ విషయం తెలియక్ ప్రతివారు వారి అంతస్తుకు మించిన ఆలోచనలు చేసి అప్పులపాలు అయి చివరకు చతికిల పడతారు. సమాయణంలో ఇతరులముందు అబద్దపు డాంబికాలు (false prestage) పోయి అప్పులలో అనేక అవసరము వున్నా లేకపోయినా అనేక గృహయోపకారణాలను కొని నెలసరి వాయిదాలు సరిగా కట్టలేక చివరకు అప్పుల బాధలు పడలేక ప్రాణాలు తీసుకున్నవారు ఎందరినో మనం చూస్తూవున్నాము.  


నిజానికి మనిషి తనకు తానుగా తన స్థితి ఏమిటి సమాజంలో తన స్తానం ఏమిటి అని యోచించి తగిన విధంగా కట్టు, బొట్టు కలిగి మెసలుకోవాలి. నీవు పాత చొక్కావేసుకున్నావని సమాజం నిన్ను గౌరవించదని నీవు అనుకుంటే నీవు అప్పు చేసి డాంబికానికి పొతే చివరకు అప్పు తీర్చటానికి ఎవ్వరు నీకు సాయం చేయరు. కాబట్టి ప్రతి మనిషి తన ఆదాయం, ఖర్చు మీద సరైన జ్ఞ్యానం కలిగి తన ఆదాయానికి తగినట్లుగా తన ఖర్చులను నిర్ణయించుకోవాలి. ఈ రోజుల్లో ప్రతి మహిళా చక్కగా పురుషులతో సమానంగా విద్య బుద్దులు కలిగి వుంటున్నది కాబట్టి తన గృహ నెలసరి ఖర్చుల విషయంలో భార్య భర్తలు కలిసి వారికి ఏవి అవసరమో, ఏవి అవసరము లేవో చక్కగా విశ్లేషణ చేసి ఒక ప్రణాళిక బద్దంగా ఆదాయ వ్యయాలను నిర్ణయించుకొని ప్రతినెల మిగులు బడ్జెట్ వచ్చేవిధంగా ఏర్పాటు చేసుకొని మిగిలిన ద్రవ్యంతో శాశ్విత ఉపకరణాలు అంటే, మిక్సీ, గ్రైండర్, ఫ్రిడ్జి మొదలైనవి కొనుక్కుంటే సంసారం మూడు పూవులు ఆరు కాయలుగా ఉంటుంది. అదే భార్య ఒకటి భర్త ఒకటి అనుకుంటే జీవితం నరక సాదృశ్యం అవుతుంది. 


ఇక్కడితో ఈ కధనాన్ని ఆపితే అది సామాజిక పరమైన కధనంగా అనుకోవచ్చు కానీ ఇంకా కొంచం ముందుకు తీసుకొని వెళితే అప్పుడు దానిని ఆధ్యాత్మిక పరమైనదిగా అనుకోవచ్చు. అన్ని శాస్త్రాలు ఎక్కడ ఆగిపోతాయో అక్కడనుండి ఆధ్యాత్మికత మొదలౌతుంది. అది మన మహర్షులు మనకు బోధించిన అనన్య సామాన్యమైన జ్ఞ్యాన సంపద 


ఫై కథనాన్ని చదివితే మనకు తెలిసేది ఏమిటంటే పోటీ తత్త్వం వలన మనకు అనేక అనర్ధాలు కలుగుతాయి అని. కానీ భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే పోటీ తత్త్వం ఏమి చెడ్డ గుణం కాదు నిజానికి నిజమైన పోటీ తత్త్వం ప్రతి సాధకుడు కాలిగి ఉండాలి. అదేమిటి ఇది సమాజానికి ఎలా హితవు కీడు అని కదా మనం తెలుసుకున్నాము అని అనుకోవచ్చు. ఆ పోటీ తత్త్వం సాటి మానవులను చూసి ఉండకూడదు మరి ఎవరిని చూసి ఉండాలంటే అది భగవంతుని చూసి భగవంతునితో పోటీ తత్త్వం కలిగి నిత్యం భగవంతుని ఆరాధిస్తూ అయన గుణాలను పొంది చివరకు కైవల్యం చెందాలి అది ఎట్లానో ఇంకొక కాండికలో తెలుసుకుందాం. 


ఓం తత్సత్ 


ఓం శాంతి శాంతి శాంతిః 


ఇట్లు 


మీ భార్గవ శర్మ .


ఇంకా వుంది 

మీమీయిష్టదైవములను

 శు భోీ ద యం !!🙏

                చొప్పకట్ల.


శరణము దైవమే!

గురుడుగురుండు,వాలుశతకోటి,సుపర్వులువాహినీపతుల్,/సురభవనంబుకోట,మధుసూదనుడుంసైదోడు,దంతిది/క్కరపతి ,కాగనోడడె,సురేంద్రుడు;దాయలచేతనాజిలో,/ "శరణముదైవమే!పురుషశక్తి నిరర్ధకమెన్ని భంగులన్;

              --భర్తృహరి సుభాషితం!


     ఎన్ని సాధనసంపత్తులుంటే ఏమిటి?దైవశక్తిలేకపోతే అవన్నీ వృధా !

              దేవేంద్రుడు మహాబలవంతుడు.అతనిసాధనసంపత్తియా అనన్యసామాన్యం!

      "కష్టంవస్తే మంచి సలహాలుచెప్పటానికొకరుకావాలి.ఆయనకోగురువుగారున్నారు.ఆయనేగురువు(బృహస్పతి)ఆయనసలహాలుకూడా పనిచేయలే,దానవులతోయుద్దంజరిగినపుడు.(జాతకంలో గురుగ్రహం ఉఛ్ఛదశలోఉంటే ఆవ్యక్తికింకతిరుగుండదు.అలాఉన్నాయిక్కడ పరిస్థితివేరైనది)

        చేతనున్నఆయుధమా,అరిభంజకమైన వజ్రాయుధం.దానికి నూరంచులు.అంటే ఒక్కవేటుకు నూరుగురు ఠా!!

            సైనికులా అమృతపానంచేసినబలిష్ఠులు.వారుసేనానులు.

        అందరకీ అందరాని ఆకాశంలో కోట.ఆదుర్గంలోపలరాజధాని అమరావతి.

        అవసరపడితే సాయపడటానికి చక్రధారి సోదరున్నాడు.

       పట్టపుటేనుగా ఐరావతం.దిగ్గజం.

      ఇన్నిసాధనసంపత్తులున్నా,దేవేంద్రుడు దానవులచేతినోడి యడవులపాలవలేదా?

     అందుచేత దైవమనుకూలింపకున్న, మనసాధనసంపత్తులన్నియు వ్యర్థమే!

          "దైవమేదిక్కని మొక్కుటదప్ప కరోనా బారినుండి తప్పించుటకు వేరుపాయము పూజ్యమే!


        మిత్రులారా! మీమీయిష్టదైవములను ప్రార్ధించండి .మనసా వాచా కర్మణా .సత్కార్యములను చేయండి.మీపరిసరాలలోని దీనులను కాపాడండి.అసేవలే దైవప్రీతికి మూలమై మనలనందర రక్షింపగలవు.


లో కాః స మ స్తాః సు ఖి నో భ వ    న్తు!!🌷🌷🌷🌷🙏🙏🙏🙏🙏🌷🌷

, సుభాషితమ్

    _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లోకం𝕝𝕝


*జ్ఞానం ప్రధానం నతు కర్మ హీనం*

*కర్మ ప్రధానం నతు బుద్ధి హీనమ్l*

*తస్మా దుభాభ్యాం తు భవేత్ప్రసిద్ధి:*

*న హ్యేక పక్షో విహగః ప్రయాతిll*


తా𝕝𝕝

"జ్ఞానం ప్రధానమే కానీ, కర్మహీనమైన జ్ఞానం" నిరుపయోగము. "కర్మ ప్రధానమే" కానీ "జ్ఞానం లేని కర్మ కూడా నిష్ప్రయోజనమే". జ్ఞాన,కర్మ సముచ్ఛయము వలననే మానవుడు తరిస్తున్నాడు.... ఒక్క రెక్కతోనే పక్షి ఎగుర లేదు కదా!

 రాముడు ఎన్ని సంవత్సరాలు బ్రతికినాడు?


శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పిన లెక్కల ప్రకారం శ్రీరాముడు తన 12వ ఏట సీతాస్వయంవరంలో సీతను పెళ్ళాడి, మరో 12 సంవత్సరాల పాటు అయోధ్యలో సుఖభోగాలనుభవించి ఆతరువాత 14సంవత్సరాలు అరణ్యవాసం చేస్తూ 13సంవత్ససరాల 2నెలలకు సీతను పోగొట్టుకుని, సుగ్రీవుడినిచేరి వాలిని చంపి ఆపైన 6 నెలలు తరువాత వెతికి మరో 4నెలల తరువాత జాడతెలుసుకొని అప్పుడు రావణుని చంపి ఆతరువాత అయోధ్యచేరి తన 39వ ఏట పట్టాభిషిక్తుడై 11000 ఏళ్ళు రాజ్యంచేసి ప్రాయోపవేశంతో సరయూనది ద్వారా తన అవతారం చాలించాడు. వెరసి11039సంవత్సరాలు రాముడు ఈ భూమిపై నిలిచాడు.


శ్రీరాముని అవతారం ఎలా పరిసమాప్తం అయింది?


శ్రీరాముడు వైకుంఠమునకు తిరిగి రావాలని దేవతలు దూర్వాస మహర్షి ని పంపించారు. అప్పటికే సీతమ్మ భూమి లోకి వెళ్లి పోయింది. దూర్వసమహర్షి శ్రీరామునితో ఏకాంతం గా మాట్లాడాలి అన్నారు. ఎవ్వరు లోనికి రాకూడదు అని చెప్పగా లక్ష్మణుడుని కాపలా ఉంచి శ్రీరాముడు దూర్వాస మహామునితో లోపల ఉన్నారు. దేవతలు అత్యవసరమైన పని కల్పించారు. లక్ష్మణుడు లోపలకి వెళ్ళాడు. శ్రీరాముడు లక్ష్మణునికి దేశ బహిష్కరణ విధించారు. లక్ష్మణుడు శ్రీరాముని విడిచి బ్రతకలేడు కదా అందుకే సరయూనదిలో ప్రవేశించి దేహత్యాగం చేసాడు. శ్రీరాముడు లవకుశులకు పట్టాభిషేకం చేసి సరయూనదిలో ప్రవేశంచాడు. అయోధ్యానగరవాసులు కొందరు కూడా శ్రీరాముని తో సరయూనది లో ప్రవేశించారు. వారందరికీ శ్రీరాముడు వైకుంఠ వాసం ఇచ్చాడు. శ్రీరాముడు చతుర్భుజుడై వైకుంఠమును చేరాడు.

-సేకరణ


 మీ వయసెంత ?


ఆగండాగండి .. 

క్యాలండర్ వయసు చెప్పకండి . నేను ఫలానా సంవత్సరం పుట్టాను; కాబట్టి నా వయసు ఇంత అని చెప్పకండి . 

దాని వల్ల ప్రయోజనం పరిమితమే .


కావలిసింది మీ జైవిక వయసు . అంటే శరీర నిర్మాణ పరంగా మీ వయసు. 


క్యాలెండరు వయసు యాబై ప్లస్  ఉన్నా జైవిక వయసు ఇరవై ప్లస్ ఉండేవారు ఉన్నారు{ వున్నారా లేరా ?}  .

 అదే విధంగా క్యాలెండరు వయస్సు ముప్పై ఉన్నా జైవిక వయస్సు యాభై ఉండేవారు ఉన్నారు. 


‼️దీని వెనుక ఉన్న రహస్యం తెలుసుకోవాలనుకొంటున్నారా ?


ప్రతి మనిషి లో ఇరవై మూడు జతల క్రోమోసోములు ఉంటాయి . ప్రతి  క్రోమోజోమ్,  డిఎన్ఏ ఇంకా ప్రోటీన్ లతో తయారవుతుంది . డిఎన్ఏ లో జీన్స్ ఉంటాయి . ఈ జన్యువులే వ్యక్తికి వారసత్వంగా వచ్చిన జైవిక సూచికలు . కణాలు ఎలా పని చెయ్యాలో ఇవి నిర్ణయిస్తాయి . అంటే కంప్యూటర్ లో సాఫ్ట్వేర్ మాదిరి . మానవ శరీరం ఈ ప్రోగ్రాం ప్రకారం నడుస్తుంది . మొత్తం ప్రోగ్రాం పుట్టుకతో రాదు . మన జీవన శైలి కూడా ఈ ప్రోగ్రాం ను నిర్ణయిస్తుంది .


ప్రతి క్రామోజోమ్ కొసలో టెలోమేర్ అనే నిర్మాణం ఉంటుంది . అందులో జన్యువులు ఉండవు . ప్రతి మనిషి శరీరం లో ప్రతి కణం విభజితమౌతూ ఉంటుంది . ప్రతి రోజూ మన శరీరం లో కొన్ని వేలకణాలు మరణిస్తాయి . కొత్త కణాలు పుడతాయి . ఇది నిరంతర ప్రక్రియ .


కణం విభజితం అయ్యేటప్పుడు టెలోమెర్ లు పొట్టిగా మారుతుంటాయి . ఒక దశ లో టెలోమెర్ లు మరీ పొట్టిగా అయిపోతాయి . అప్పుడు కణవిభజన సాధ్యం కాదు . అప్పటినుంచి కొత్త కణాలు రావు . ఉన్నా కణాలే ముసలివిగా మారి పోతాయి . వృద్ధాప్యం .. రోగగ్రస్తతః అప్పటినుంచి మొదలవుతుంది .


కొంత మందికి పుట్టుకతో పొడవయిన టెలోమెర్ లు వస్తాయి .  అలాంటి వారు ఎక్కువ కాలం బతుకుతారు . 

రియల్ ఎస్టేట్ ఇంకా రాజకీయ రంగం లో కూడా పేరుగాంచిన ఒక తెలుగు సినిమా నటుడు వయస్సు 83 . ఇటీవల ఆయన తల వెంట్రుకలకు డై వేసుకోవడం మానేశారు . లేక పొతే యాభై వయసు వ్యక్తి లాగా కనబడుతారు . తన తల్లి కూడా వందేళ్ల దాక బతికినట్టు ఆయన ఇంటర్వ్యూ లో చెప్పారు . ఇలాంటి వారిలో పుట్టుకతో పొడవయిన టెలోమెర్ లు వస్తాయి . దీని వల్ల డెబ్భై-  ఎనభై ఏళ్ళు వచ్చినా కణవిభజన జరుగుతూనే ఉంటుంది . కొత్త కణాలు పుట్టుకొసూనే ఉంటాయి . వృద్ధ్యాప్యం చాలా లేట్ గా వస్తుంది . ఎనభై ఏళ్ళు  వచ్చినా ఆరోగ్యం గా వుంటారు .


✔️✔️ఆరోగ్య కరమయిన దినచర్య ద్వారా కూడా టెలోమెర్ లు పొట్టిగా కాకుండా చూసుకోవచ్చు .


1 . ప్రతి  రోజు శరీరానికి భౌతిక శ్రమ ఇవ్వాలి . సోఫా లో కూర్చుని రోజంతా గడిపే వారు .. రోజుకు కనీసం అరగంట నడవని వారు త్వరగా వృద్దులై పోతారు . వృద్ధాప్యం కాళ్లనుండి మొదలవుతుంది . తిన్న గా ముందుకు నడవకుండా ఎప్పుడైతే లోలకం లా కాస్త అటు ఇటు ఊగుతూ నడవడం మొదలెట్టారో .. అప్పుడే ప్రమాద గంటికలు మోగినట్టు .


2 . సుఖ నిద్ర . నిద్ర లో మన శరీరం , తనని తాని రిపేర్ చేసుకుంటుంది . పెద్దవారికి కూడా రోజుకు ఏడెనిమిది గంటల  నిద్ర అవసరం .


౩. ప్రోటీన్ లు .. ప్రోటీన్ లు కేవలం యువకులకు  అని చాల  మంది అనుకొంటారు . నలబై దాటాక ప్రోటీన్ అవసరం ఎక్కువవుతుంది . తగినంత ప్రోటీన్ తిని శరీరానికి భౌతిక శ్రమ కల్పిస్తే కండలు వస్తాయి . . శరీరం అనే భవనానికి ఎముకలు ఇటుకలయితే కండలు సిమెంట్ . 

కండలు లేక  పొతే చర్మం మడతలు పడి బలహీనం అయిపోతుంది . 

ఎముకల దారుఢ్యం కోసం తగినంత కాల్షియమ్ తీసుకోవాలి . నువ్వుల ద్వారా శరీరానికి కాల్షియమ్  అందించవచ్చు . 

ఇక్కడో విషయం . శరీరం లో డి విటమిన్ తగినంత లేకపోతే కాల్షియమ్ ను జీర్ణించుకొనే శక్తి ని కోల్పోతారు . 

కాబట్టి ఎండ లో అర గంట నడవడం . ఒక నువ్వుల ఉండ రోజూ తినడం చెయ్యాలి . 


4 . ఆనందకరమయిన జీవితం . యాభై దాటాక ఒంటరి జీవితం ప్రమాదకరం . మానసిక కుంగుబాటు...  అన్నిటికీ మించి డేమేన్తియా అంటే మతి  మరుపు వ్యాధి వచ్చేస్తుంది . నిద్ర పోతున్నప్పుడు మినహా ఎప్పుడూ ఏదో ఒక పనిలో పడాలి . ఎవరితోనో మాట్లాడుతూ ఉండాలి . 

ఏపీజే అబ్దుల్ కలాం రిటైర్ అయ్యాక దర్జాగా కాలుపై కాలు వేసుకొని కూర్చోలేదు . తన కిష్టమయిన ఉపాదాయ వృత్తి లోకి  వెళ్లారు . పాఠం చెబుతూనే మరణించారు . వెయ్యి కోట్లు  ఇచ్చినా రాని సుఖ మరణాన్ని పొందారు . అదీ జీవితం అంటే . 

ఒంటరిగా ఉండొద్దు . మనుమలు .. మనుమరాండ్రు .. దత్తత తీసుకొన్న పిల్లలు .. అనాధ  శరణాలయాలు .. పెంపుడు జంతువులు.. మనసుంటే వెయ్యి మార్గాలు .


వయయసొచ్చాక "రామ గోవిందా" అంటూ కాలం గడపాలి అని చాల మంది అనుకొంటారు . "రామ గోవిందా "అంటే దైవాన్ని స్మరించుకొంటూ అనే అర్థం వరకు అయితే ఓకే. కానీ దీని అర్థం అన్ని పనులు మాని ఇంట్లో ఒంటరిగా కూర్చోమని కాదు .

 ఉపనిషత్తుల్లో వానప్రస్థం తరువాత,  సన్యాస ఆశ్రమాన్ని నిర్దేశించారు . గృహస్థ ఆశ్రమం లో తనకోసం .. తన కుటుంబం కోసం పని చెయ్యాలి . సన్యాస  ఆశ్రమం లో సమాజమే తన కుటుంబం అనుకొని  . ధర్మాన్ని అంటే మంచి చెడు నలుగురికి చెబుతూ...  ఊరూరా తిరగాలి.ఇది ఉపనిషత్తులు చెప్పింది. 


" నాదేముంది .. అంతా అయిపొయింది " అనుకొని టీవీ ముందు వాట్సాప్ పై కాలక్షేపం చేసేవాడు సన్నాసి .


తానూ బతికినన్నాళ్లు తానూ తనతోబాటు అందరూ బాగుండాలి అనుకొని పని చేసేవాడు  సన్యాసి .


మీరేమి కాదలుచుకొన్నారు ? 


✔️✔️పని - ఒక దశలో భుక్తి కోసం . అటుపై ఆరోగ్యం కోసం .. సమాజం కోసం . పని మానొద్దు

[12/06, 1:32 pm] Sarmada Vdk Br Fn: ఒక ఆవు ఒకరోజు గడ్డి మేయడానికి అడవిలోకి వెళ్లిoది. పాపం దానికి సమయం తెలియలేదు ఇంతలో సాయంత్రం అయ్యింది చీకటిపడేలా ఉంది.


ఇంతలో ఒక పులి తనవైపు పరిగెత్తుకుంటూ రావడం ఆ ఆవు చూసింది. పులి నుంచి తప్పించుచుకోవడం కోసం ఆవు అటూ ఇటూ పరుగులెట్టి, పారిపోతోంది, పులి కూడా అంతే వేగంగా అవుని వెంబడిస్తోంది. చివరికి అవుకు ఎదురుగా ఒక చెరువు కనిపించింది, పులి నుంచి తప్పించుకునే కంగారులో ఆవు చెరువులోకి దూకేసింది, పులి కూడా ఆవుని పట్టుకోవాలని దాని వెనుకే ఆ చెరువులోకి దూకేసింది.


దురదృష్టవశాత్తు ఆ చెరువులో నీళ్ళు చాలా తక్కువ ఉన్నాయి, ఆవు ఈదుకుంటూ ఈదుకుంటూ చెరువు మధ్యలోకి వెళ్ళిపోయింది. అక్కడ చాలా లోతైన బురద ఉంది అందులో ఆవు పీకివరకూ కూరుకుపోయింది.


*అవుని వెంబడిస్తూ వచ్చిన ఆ పులి కూడా ఆ బురదలో చిక్కుకుని పీకల్లోతు లో మునిగి కేవలం తన ప్రాణాలు రక్షించుకోవడం కోసం అవుకి కొద్ది దూరంలో ఆగిపోయింది. ఇక అంతకుమించి ముందుకి వెళితే ఆ పులి పూర్తిగా బురదలో కూరుకుపోయి చనిపోతుంది.*


*ఈ స్థితిలో ఉన్న ఆ "ఆవు-పులీ" రెండూ ఒక దానికి ఒకటి ఎదురు ఎదురుగా కదలలేని స్థితిలో నిలబడిపోయాయి.*


*కొద్దిసేపయ్యాక, ఆవు పులితో ఇలా అంది,*

*"నీకెవరైన యజమాని గానీ గురువు గానీ ఉన్నారా.?? అని అడిగింది ". దానికి ఆ పులి గర్వంతో ఇలా అంది,*


*నేనే ఈ అడవికి రాజుని, స్వయంగా నేనే ఈ అడవి అంతటికీ యజమానిని, నాకు వేరే ఎవరు యజమాని ఉంటారు అంది గొప్పగా.. అప్పుడు ఆవు ఇలా అంది, నీ గొప్పదనం, నీ శక్తి ఇవేవీ కూడా ఇప్పుడు నిన్ను ఈ స్థితిలో రక్షించలేక పోయాయి కదా.., అంది.*


*అప్పుడు ఆ పులి, ఆవు తో ఇలా అంది, నీ పరిస్థితి కూడా నాలాంటిదే కదా, నువ్వు కూడా నాలాగే పీకల్లోతులో మునిగిపోయావు, చావుకు దగ్గరలో ఉన్నావు మరి ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారు.??  అంది.*


*అప్పుడు ఆవు చిరునవ్వుతో ఇలా అంది,*


*"చాలా తప్పు. నాకు ఒక యజమాని ఉన్నాడు, సాయంత్రం అయ్యేసరికి నేను ఇంటికి చేరకపోతే నన్ను వెతుక్కుంటూ, ఎంత దూరమైన వచ్చి నన్ను ఈ బురదనుంచి బయటకు లాగి క్షేమంగా ఇంటికి తీసుకెళతాడు." మరి నిన్ను ఎవరు బయటకు లాగుతారు .?? అంది.*


*ఇలా అన్న కొద్దిసేపటికి  ఆ ఆవు యొక్క యజమాని నిజంగానే వచ్చాడు. వచ్చీ రాగానే ఆ అవుని గట్టిగా పట్టుకుని అతి కష్టం మీద ఆ బురదగుంట నుంచి ఆ అవుని బయటకు లాగి, తన ఇంటికి తీసుకెళ్లాడు. వెళ్లేటప్పుడు ఆ ఆవు తన యజమాని కేసి ఎంతో కృతజ్ఞతా పూర్వకంగా చూసింది. కావాలంటే ఆ ఆవు, మరియు దాని యజమాని.. వాళ్లిద్దరూ కలిస్తే ఆ పులిని బయటకు లాగగలరు, కానీ అది వాళ్ళ ప్రాణాలకు ముప్పు అని గ్రహించి, ఆ పులిని బురదలో వదిలేసి వెళ్లిపోయారు.*


ఈ కథలో...


 *ఆవు* -  సర్వసమర్పణ చేసిన సాధకుని హృదయo.


 *పులి* -  అహంకారం నిండిఉన్న మనస్సు.


 *యజమాని* - సద్గురువు/పరమాత్మ.


 *బురదగుంట* - ఈ సంసారం/ప్రపంచం


మరియు,


 *ఆ ఆవు-పులి యొక్క సంఘర్షణ* : నలుగురిలో మనం మన ఉనికిని చాటుకోవడం కోసం చేసే జీవన పోరాటం.


 *నీతి :


*ఎవరిమీదా ఆధార పడకుండా జీవించడం అనేది మంచి ఉద్దేశ్యమే. కానీ,*


*"నేనే అంతా, నా వలనే అంతా జరుగుతోంది, నేను లేకపోతే ఏమీ లేదు.. నాకు ఎవరి అవసరం లేదు, రాదు." అనే భావన ఎన్నడూ మనలో కలుగరాదు.*


 దీనినే ' *అహంకారము* ' అంటారు. మన వినాశనానికి ఇదే బీజం అవుతుంది.


ఈ జగత్తులో *'సద్గురువు'*(పరమాత్మ)ను మించిన హితాభిలాషి , మన మంచిని కోరుకునే వారు వేరే ఎవరుంటారు.?? ఉండరు.


*ఎందుకంటే.?? వారే అనేక రూపాల్లో వచ్చి, ఆయా సమయాల్లో మనల్ని నిరంతరం అనేక ఆపదల నుంచి రక్షిస్తూ ఉంటారు.*


*అంతా నీ ఇష్టప్రకారమే జరుగనీ..!!*