12, జూన్ 2023, సోమవారం

, సుభాషితమ్

    _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లోకం𝕝𝕝


*జ్ఞానం ప్రధానం నతు కర్మ హీనం*

*కర్మ ప్రధానం నతు బుద్ధి హీనమ్l*

*తస్మా దుభాభ్యాం తు భవేత్ప్రసిద్ధి:*

*న హ్యేక పక్షో విహగః ప్రయాతిll*


తా𝕝𝕝

"జ్ఞానం ప్రధానమే కానీ, కర్మహీనమైన జ్ఞానం" నిరుపయోగము. "కర్మ ప్రధానమే" కానీ "జ్ఞానం లేని కర్మ కూడా నిష్ప్రయోజనమే". జ్ఞాన,కర్మ సముచ్ఛయము వలననే మానవుడు తరిస్తున్నాడు.... ఒక్క రెక్కతోనే పక్షి ఎగుర లేదు కదా!

 రాముడు ఎన్ని సంవత్సరాలు బ్రతికినాడు?


శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పిన లెక్కల ప్రకారం శ్రీరాముడు తన 12వ ఏట సీతాస్వయంవరంలో సీతను పెళ్ళాడి, మరో 12 సంవత్సరాల పాటు అయోధ్యలో సుఖభోగాలనుభవించి ఆతరువాత 14సంవత్సరాలు అరణ్యవాసం చేస్తూ 13సంవత్ససరాల 2నెలలకు సీతను పోగొట్టుకుని, సుగ్రీవుడినిచేరి వాలిని చంపి ఆపైన 6 నెలలు తరువాత వెతికి మరో 4నెలల తరువాత జాడతెలుసుకొని అప్పుడు రావణుని చంపి ఆతరువాత అయోధ్యచేరి తన 39వ ఏట పట్టాభిషిక్తుడై 11000 ఏళ్ళు రాజ్యంచేసి ప్రాయోపవేశంతో సరయూనది ద్వారా తన అవతారం చాలించాడు. వెరసి11039సంవత్సరాలు రాముడు ఈ భూమిపై నిలిచాడు.


శ్రీరాముని అవతారం ఎలా పరిసమాప్తం అయింది?


శ్రీరాముడు వైకుంఠమునకు తిరిగి రావాలని దేవతలు దూర్వాస మహర్షి ని పంపించారు. అప్పటికే సీతమ్మ భూమి లోకి వెళ్లి పోయింది. దూర్వసమహర్షి శ్రీరామునితో ఏకాంతం గా మాట్లాడాలి అన్నారు. ఎవ్వరు లోనికి రాకూడదు అని చెప్పగా లక్ష్మణుడుని కాపలా ఉంచి శ్రీరాముడు దూర్వాస మహామునితో లోపల ఉన్నారు. దేవతలు అత్యవసరమైన పని కల్పించారు. లక్ష్మణుడు లోపలకి వెళ్ళాడు. శ్రీరాముడు లక్ష్మణునికి దేశ బహిష్కరణ విధించారు. లక్ష్మణుడు శ్రీరాముని విడిచి బ్రతకలేడు కదా అందుకే సరయూనదిలో ప్రవేశించి దేహత్యాగం చేసాడు. శ్రీరాముడు లవకుశులకు పట్టాభిషేకం చేసి సరయూనదిలో ప్రవేశంచాడు. అయోధ్యానగరవాసులు కొందరు కూడా శ్రీరాముని తో సరయూనది లో ప్రవేశించారు. వారందరికీ శ్రీరాముడు వైకుంఠ వాసం ఇచ్చాడు. శ్రీరాముడు చతుర్భుజుడై వైకుంఠమును చేరాడు.

-సేకరణ


 మీ వయసెంత ?


ఆగండాగండి .. 

క్యాలండర్ వయసు చెప్పకండి . నేను ఫలానా సంవత్సరం పుట్టాను; కాబట్టి నా వయసు ఇంత అని చెప్పకండి . 

దాని వల్ల ప్రయోజనం పరిమితమే .


కావలిసింది మీ జైవిక వయసు . అంటే శరీర నిర్మాణ పరంగా మీ వయసు. 


క్యాలెండరు వయసు యాబై ప్లస్  ఉన్నా జైవిక వయసు ఇరవై ప్లస్ ఉండేవారు ఉన్నారు{ వున్నారా లేరా ?}  .

 అదే విధంగా క్యాలెండరు వయస్సు ముప్పై ఉన్నా జైవిక వయస్సు యాభై ఉండేవారు ఉన్నారు. 


‼️దీని వెనుక ఉన్న రహస్యం తెలుసుకోవాలనుకొంటున్నారా ?


ప్రతి మనిషి లో ఇరవై మూడు జతల క్రోమోసోములు ఉంటాయి . ప్రతి  క్రోమోజోమ్,  డిఎన్ఏ ఇంకా ప్రోటీన్ లతో తయారవుతుంది . డిఎన్ఏ లో జీన్స్ ఉంటాయి . ఈ జన్యువులే వ్యక్తికి వారసత్వంగా వచ్చిన జైవిక సూచికలు . కణాలు ఎలా పని చెయ్యాలో ఇవి నిర్ణయిస్తాయి . అంటే కంప్యూటర్ లో సాఫ్ట్వేర్ మాదిరి . మానవ శరీరం ఈ ప్రోగ్రాం ప్రకారం నడుస్తుంది . మొత్తం ప్రోగ్రాం పుట్టుకతో రాదు . మన జీవన శైలి కూడా ఈ ప్రోగ్రాం ను నిర్ణయిస్తుంది .


ప్రతి క్రామోజోమ్ కొసలో టెలోమేర్ అనే నిర్మాణం ఉంటుంది . అందులో జన్యువులు ఉండవు . ప్రతి మనిషి శరీరం లో ప్రతి కణం విభజితమౌతూ ఉంటుంది . ప్రతి రోజూ మన శరీరం లో కొన్ని వేలకణాలు మరణిస్తాయి . కొత్త కణాలు పుడతాయి . ఇది నిరంతర ప్రక్రియ .


కణం విభజితం అయ్యేటప్పుడు టెలోమెర్ లు పొట్టిగా మారుతుంటాయి . ఒక దశ లో టెలోమెర్ లు మరీ పొట్టిగా అయిపోతాయి . అప్పుడు కణవిభజన సాధ్యం కాదు . అప్పటినుంచి కొత్త కణాలు రావు . ఉన్నా కణాలే ముసలివిగా మారి పోతాయి . వృద్ధాప్యం .. రోగగ్రస్తతః అప్పటినుంచి మొదలవుతుంది .


కొంత మందికి పుట్టుకతో పొడవయిన టెలోమెర్ లు వస్తాయి .  అలాంటి వారు ఎక్కువ కాలం బతుకుతారు . 

రియల్ ఎస్టేట్ ఇంకా రాజకీయ రంగం లో కూడా పేరుగాంచిన ఒక తెలుగు సినిమా నటుడు వయస్సు 83 . ఇటీవల ఆయన తల వెంట్రుకలకు డై వేసుకోవడం మానేశారు . లేక పొతే యాభై వయసు వ్యక్తి లాగా కనబడుతారు . తన తల్లి కూడా వందేళ్ల దాక బతికినట్టు ఆయన ఇంటర్వ్యూ లో చెప్పారు . ఇలాంటి వారిలో పుట్టుకతో పొడవయిన టెలోమెర్ లు వస్తాయి . దీని వల్ల డెబ్భై-  ఎనభై ఏళ్ళు వచ్చినా కణవిభజన జరుగుతూనే ఉంటుంది . కొత్త కణాలు పుట్టుకొసూనే ఉంటాయి . వృద్ధ్యాప్యం చాలా లేట్ గా వస్తుంది . ఎనభై ఏళ్ళు  వచ్చినా ఆరోగ్యం గా వుంటారు .


✔️✔️ఆరోగ్య కరమయిన దినచర్య ద్వారా కూడా టెలోమెర్ లు పొట్టిగా కాకుండా చూసుకోవచ్చు .


1 . ప్రతి  రోజు శరీరానికి భౌతిక శ్రమ ఇవ్వాలి . సోఫా లో కూర్చుని రోజంతా గడిపే వారు .. రోజుకు కనీసం అరగంట నడవని వారు త్వరగా వృద్దులై పోతారు . వృద్ధాప్యం కాళ్లనుండి మొదలవుతుంది . తిన్న గా ముందుకు నడవకుండా ఎప్పుడైతే లోలకం లా కాస్త అటు ఇటు ఊగుతూ నడవడం మొదలెట్టారో .. అప్పుడే ప్రమాద గంటికలు మోగినట్టు .


2 . సుఖ నిద్ర . నిద్ర లో మన శరీరం , తనని తాని రిపేర్ చేసుకుంటుంది . పెద్దవారికి కూడా రోజుకు ఏడెనిమిది గంటల  నిద్ర అవసరం .


౩. ప్రోటీన్ లు .. ప్రోటీన్ లు కేవలం యువకులకు  అని చాల  మంది అనుకొంటారు . నలబై దాటాక ప్రోటీన్ అవసరం ఎక్కువవుతుంది . తగినంత ప్రోటీన్ తిని శరీరానికి భౌతిక శ్రమ కల్పిస్తే కండలు వస్తాయి . . శరీరం అనే భవనానికి ఎముకలు ఇటుకలయితే కండలు సిమెంట్ . 

కండలు లేక  పొతే చర్మం మడతలు పడి బలహీనం అయిపోతుంది . 

ఎముకల దారుఢ్యం కోసం తగినంత కాల్షియమ్ తీసుకోవాలి . నువ్వుల ద్వారా శరీరానికి కాల్షియమ్  అందించవచ్చు . 

ఇక్కడో విషయం . శరీరం లో డి విటమిన్ తగినంత లేకపోతే కాల్షియమ్ ను జీర్ణించుకొనే శక్తి ని కోల్పోతారు . 

కాబట్టి ఎండ లో అర గంట నడవడం . ఒక నువ్వుల ఉండ రోజూ తినడం చెయ్యాలి . 


4 . ఆనందకరమయిన జీవితం . యాభై దాటాక ఒంటరి జీవితం ప్రమాదకరం . మానసిక కుంగుబాటు...  అన్నిటికీ మించి డేమేన్తియా అంటే మతి  మరుపు వ్యాధి వచ్చేస్తుంది . నిద్ర పోతున్నప్పుడు మినహా ఎప్పుడూ ఏదో ఒక పనిలో పడాలి . ఎవరితోనో మాట్లాడుతూ ఉండాలి . 

ఏపీజే అబ్దుల్ కలాం రిటైర్ అయ్యాక దర్జాగా కాలుపై కాలు వేసుకొని కూర్చోలేదు . తన కిష్టమయిన ఉపాదాయ వృత్తి లోకి  వెళ్లారు . పాఠం చెబుతూనే మరణించారు . వెయ్యి కోట్లు  ఇచ్చినా రాని సుఖ మరణాన్ని పొందారు . అదీ జీవితం అంటే . 

ఒంటరిగా ఉండొద్దు . మనుమలు .. మనుమరాండ్రు .. దత్తత తీసుకొన్న పిల్లలు .. అనాధ  శరణాలయాలు .. పెంపుడు జంతువులు.. మనసుంటే వెయ్యి మార్గాలు .


వయయసొచ్చాక "రామ గోవిందా" అంటూ కాలం గడపాలి అని చాల మంది అనుకొంటారు . "రామ గోవిందా "అంటే దైవాన్ని స్మరించుకొంటూ అనే అర్థం వరకు అయితే ఓకే. కానీ దీని అర్థం అన్ని పనులు మాని ఇంట్లో ఒంటరిగా కూర్చోమని కాదు .

 ఉపనిషత్తుల్లో వానప్రస్థం తరువాత,  సన్యాస ఆశ్రమాన్ని నిర్దేశించారు . గృహస్థ ఆశ్రమం లో తనకోసం .. తన కుటుంబం కోసం పని చెయ్యాలి . సన్యాస  ఆశ్రమం లో సమాజమే తన కుటుంబం అనుకొని  . ధర్మాన్ని అంటే మంచి చెడు నలుగురికి చెబుతూ...  ఊరూరా తిరగాలి.ఇది ఉపనిషత్తులు చెప్పింది. 


" నాదేముంది .. అంతా అయిపొయింది " అనుకొని టీవీ ముందు వాట్సాప్ పై కాలక్షేపం చేసేవాడు సన్నాసి .


తానూ బతికినన్నాళ్లు తానూ తనతోబాటు అందరూ బాగుండాలి అనుకొని పని చేసేవాడు  సన్యాసి .


మీరేమి కాదలుచుకొన్నారు ? 


✔️✔️పని - ఒక దశలో భుక్తి కోసం . అటుపై ఆరోగ్యం కోసం .. సమాజం కోసం . పని మానొద్దు

[12/06, 1:32 pm] Sarmada Vdk Br Fn: ఒక ఆవు ఒకరోజు గడ్డి మేయడానికి అడవిలోకి వెళ్లిoది. పాపం దానికి సమయం తెలియలేదు ఇంతలో సాయంత్రం అయ్యింది చీకటిపడేలా ఉంది.


ఇంతలో ఒక పులి తనవైపు పరిగెత్తుకుంటూ రావడం ఆ ఆవు చూసింది. పులి నుంచి తప్పించుచుకోవడం కోసం ఆవు అటూ ఇటూ పరుగులెట్టి, పారిపోతోంది, పులి కూడా అంతే వేగంగా అవుని వెంబడిస్తోంది. చివరికి అవుకు ఎదురుగా ఒక చెరువు కనిపించింది, పులి నుంచి తప్పించుకునే కంగారులో ఆవు చెరువులోకి దూకేసింది, పులి కూడా ఆవుని పట్టుకోవాలని దాని వెనుకే ఆ చెరువులోకి దూకేసింది.


దురదృష్టవశాత్తు ఆ చెరువులో నీళ్ళు చాలా తక్కువ ఉన్నాయి, ఆవు ఈదుకుంటూ ఈదుకుంటూ చెరువు మధ్యలోకి వెళ్ళిపోయింది. అక్కడ చాలా లోతైన బురద ఉంది అందులో ఆవు పీకివరకూ కూరుకుపోయింది.


*అవుని వెంబడిస్తూ వచ్చిన ఆ పులి కూడా ఆ బురదలో చిక్కుకుని పీకల్లోతు లో మునిగి కేవలం తన ప్రాణాలు రక్షించుకోవడం కోసం అవుకి కొద్ది దూరంలో ఆగిపోయింది. ఇక అంతకుమించి ముందుకి వెళితే ఆ పులి పూర్తిగా బురదలో కూరుకుపోయి చనిపోతుంది.*


*ఈ స్థితిలో ఉన్న ఆ "ఆవు-పులీ" రెండూ ఒక దానికి ఒకటి ఎదురు ఎదురుగా కదలలేని స్థితిలో నిలబడిపోయాయి.*


*కొద్దిసేపయ్యాక, ఆవు పులితో ఇలా అంది,*

*"నీకెవరైన యజమాని గానీ గురువు గానీ ఉన్నారా.?? అని అడిగింది ". దానికి ఆ పులి గర్వంతో ఇలా అంది,*


*నేనే ఈ అడవికి రాజుని, స్వయంగా నేనే ఈ అడవి అంతటికీ యజమానిని, నాకు వేరే ఎవరు యజమాని ఉంటారు అంది గొప్పగా.. అప్పుడు ఆవు ఇలా అంది, నీ గొప్పదనం, నీ శక్తి ఇవేవీ కూడా ఇప్పుడు నిన్ను ఈ స్థితిలో రక్షించలేక పోయాయి కదా.., అంది.*


*అప్పుడు ఆ పులి, ఆవు తో ఇలా అంది, నీ పరిస్థితి కూడా నాలాంటిదే కదా, నువ్వు కూడా నాలాగే పీకల్లోతులో మునిగిపోయావు, చావుకు దగ్గరలో ఉన్నావు మరి ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారు.??  అంది.*


*అప్పుడు ఆవు చిరునవ్వుతో ఇలా అంది,*


*"చాలా తప్పు. నాకు ఒక యజమాని ఉన్నాడు, సాయంత్రం అయ్యేసరికి నేను ఇంటికి చేరకపోతే నన్ను వెతుక్కుంటూ, ఎంత దూరమైన వచ్చి నన్ను ఈ బురదనుంచి బయటకు లాగి క్షేమంగా ఇంటికి తీసుకెళతాడు." మరి నిన్ను ఎవరు బయటకు లాగుతారు .?? అంది.*


*ఇలా అన్న కొద్దిసేపటికి  ఆ ఆవు యొక్క యజమాని నిజంగానే వచ్చాడు. వచ్చీ రాగానే ఆ అవుని గట్టిగా పట్టుకుని అతి కష్టం మీద ఆ బురదగుంట నుంచి ఆ అవుని బయటకు లాగి, తన ఇంటికి తీసుకెళ్లాడు. వెళ్లేటప్పుడు ఆ ఆవు తన యజమాని కేసి ఎంతో కృతజ్ఞతా పూర్వకంగా చూసింది. కావాలంటే ఆ ఆవు, మరియు దాని యజమాని.. వాళ్లిద్దరూ కలిస్తే ఆ పులిని బయటకు లాగగలరు, కానీ అది వాళ్ళ ప్రాణాలకు ముప్పు అని గ్రహించి, ఆ పులిని బురదలో వదిలేసి వెళ్లిపోయారు.*


ఈ కథలో...


 *ఆవు* -  సర్వసమర్పణ చేసిన సాధకుని హృదయo.


 *పులి* -  అహంకారం నిండిఉన్న మనస్సు.


 *యజమాని* - సద్గురువు/పరమాత్మ.


 *బురదగుంట* - ఈ సంసారం/ప్రపంచం


మరియు,


 *ఆ ఆవు-పులి యొక్క సంఘర్షణ* : నలుగురిలో మనం మన ఉనికిని చాటుకోవడం కోసం చేసే జీవన పోరాటం.


 *నీతి :


*ఎవరిమీదా ఆధార పడకుండా జీవించడం అనేది మంచి ఉద్దేశ్యమే. కానీ,*


*"నేనే అంతా, నా వలనే అంతా జరుగుతోంది, నేను లేకపోతే ఏమీ లేదు.. నాకు ఎవరి అవసరం లేదు, రాదు." అనే భావన ఎన్నడూ మనలో కలుగరాదు.*


 దీనినే ' *అహంకారము* ' అంటారు. మన వినాశనానికి ఇదే బీజం అవుతుంది.


ఈ జగత్తులో *'సద్గురువు'*(పరమాత్మ)ను మించిన హితాభిలాషి , మన మంచిని కోరుకునే వారు వేరే ఎవరుంటారు.?? ఉండరు.


*ఎందుకంటే.?? వారే అనేక రూపాల్లో వచ్చి, ఆయా సమయాల్లో మనల్ని నిరంతరం అనేక ఆపదల నుంచి రక్షిస్తూ ఉంటారు.*


*అంతా నీ ఇష్టప్రకారమే జరుగనీ..!!*

కామెంట్‌లు లేవు: