27, డిసెంబర్ 2023, బుధవారం

Petrol station in sea


 

Kartika pournami in bankock


 

అఖండ బ్రహ్మాకార స్థితి


 

భోజన నియమాలు

 ఆయుర్వేదం నందు వివరించబడిన భోజన నియమాలు  - 


     "అన్నం పరబ్రహ్మ స్వరూపం"  కావున నియమనిష్టలతో భోజనం చేయవలెను . ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువంటి నియమ నిబంధలు పాటించకుండా మనుషులు తమ ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు.  మనం చేసే ప్రతిపని కొన్ని నియమానుసారాల ప్రకారం చేసినప్పుడే ఆ పని సత్ఫలితాన్ని ఇస్తుంది. ఇటువంటి నియమనిబంధనలు మన పూర్వీకులు ఎంతో దూరదృష్టితో ఆలోచించి కొన్ని , తమ అనుభవ పూర్వకంగా కొన్ని ఏర్పరిచారు. వాటిని పాటించటం వలన మనకి మంచి ఆరోగ్యం , ఆయష్షు కలుగును. కొన్ని పురాతన గ్రంథాలు పరిశీలించి వాటిలో మీకు కొన్ని తెలియచేస్తున్నాను .


  భోజన నియమాలు  - 


 *  భోజనం చేయటానికి ముందే స్నానం ఆచరించి దేవతార్చన చేసి మంచి మనసుతో మంగళకరమైన వస్తు దర్శనం చేయవలెను . సూర్యుడు , అగ్ని, గోవు మొదలగు మంగళకరం అయిన వాటిని దర్శించుకొనవలెను . ఆ తరువాత చల్లని నీటితో బాగుగా కాళ్లు , చేతులు , ముఖం పరిశుభ్రం చేసుకుని తెల్లని వస్త్రం ధరించవలెను 

ఎందుకనగా యోగశాస్త్రం నందు మనుషుని యొక్క శ్వాస గతి  12 అంగుళములు అనియు భోజనకాలం నందు మనుష్యుని యొక్క శ్వాసగతి 20 అంగుళములు అని తెలుపబడినది. అతిశ్వాస ఆయుఃయుక్షీణం .శ్వాసగతి తగ్గిన యొడల ఆయుర్వృద్ధి అగును. కావున భోజనకాలం నందు హస్త, పాద , ముఖప్రక్షాళన చేయనిచో శ్వాసగతి ఎక్కువ అగును. అందుకే చల్లని నీటితో ప్రక్షాళన చేసుకుని ప్రశాంత మనస్సుతో భోజనశాల కు చేరవలెను .


 *  తడిసిన పాదములతో భోజనం చేయవలెను దీనివల్ల ఆయుర్వృద్ధి కలుగును. తడిసిన పాదములతో శయనించిన ఆయష్షు క్షీణించును. దీనికి ముందు పితృదేవతలను , అతిధులను , శిశువులకు , గర్భిణి స్త్రీలకు , పెంచుకున్న పశుపక్ష్యాదులకు మొదట ఆహారం మొసంగి తృప్తిపరుచుట మరువకూడదు . 


 *  ఆహారము మనస్సుకి, తృప్తిని , బలం, ఆయష్షు , తేజస్సు , ఉత్సాహం , జ్ఞాపక శక్తి , రోగనిరోధక శక్తి కలిగించును.


 *  ఆయష్షు కోరువాడు భోజనం తూర్పుముఖంగా , యశస్సు కోరువాడు దక్షిణముఖంగా కూర్చొని భుజించవలెను .


 *  ఉత్తరాభిముఖంగా కూర్చుని భుజించిన యెడల విద్యుత్ శక్తి నరముల ద్వారా అత్యంత తీవ్రంగా ప్రవహించును. అందువలన ఉత్తరాభిముఖంగా కూర్చుని భుజించరాదు . 


 *  పితృదేవతలు దక్షిణదిశ యందు ఉండుటచే దక్షిణదిశకు అభిముఖంగా కూర్చుని భుజించటం వలన యశస్సు లభించును.


 *  భోజనం పగలు దినములో ఎనిమిదో వంతు కాలం అనగా ఉదయం 9 గంటల నుంచి 12 గంటల మధ్య చేయవలెను . 


 *  ఉదయం 9 గంటలలోపు భుజించినచో ధాతువులు పూర్తిగా జనించవు . 12 గంటల తరువాత భుజించినచో బలం క్షీణించును. కావున ఉదయం 9 నుంచి 12 గంటల మధ్యనే భుజించవలెను . 


 *  రాత్రి భోజనం 8 గంటల లోపు ముగించవలెను . అదికూడా తేలికైన సులభంగా జీర్ణం అయ్యే విధంగా ఉండును.రాత్రి సమయాన మన శరీరంలో మెటబాలిజం రేటు బాగా తగ్గును. కావున తిన్న ఆహారం శక్తిగా మారక కొవ్వుగా మారును . రోగులు ముఖ్యంగా 

ఆస్తమా రోగులు 7 గంటలకే ఆహారాన్ని భుజించవలెను .


 * భోజన విషయంలో సమయపాలన గురించి నీతిశాస్త్రం  చెప్తున్న విషయం మీకు తెలియచేస్తున్నాను . " నీకోసం వందమంది కాచుకుని కూర్చున్నను సమయం అయితే వారిని విడిచి భోజనం చేయాలి . వెయ్యి మంది కూర్చున్నను వదిలివెళ్ళి స్నానం చేయవలెను . లక్షమంది వద్దన్నా వెళ్లి దానం చెయ్యాలి . కోటిమంది కాదన్నా వెళ్లి భగవంతుడి ధ్యానం చేయాలి " అన్నది నీతిశాస్తం వివరించింది.


 *  మలమూత్రములు బాగుగా వెడలి , హృదయం నిర్మలమై , వాతాది దోషములు చక్కగా ప్రవర్తించుచు లోగడ భుజించిన ఆహారం జీర్ణమైనట్టు త్రేపులు వచ్చి బాగుగా ఆకలిపుట్టి , వాతం క్రిందివైపు పయనించి సంచరిస్తూ జఠరాగ్ని బాగా ప్రజ్వరిల్లుతూ ఇంద్రియములు వినిర్మములై శరీరం తేలికగా ఉన్నప్పుడు కాలం అతిక్రమించకుండా నియమం ప్రకారం ఆహారం భుజించవలెను .


 *  ఆకాలంలో అతిస్వల్పంగా భుజించినను అది విషంగా మారి రోగాలకు కారణం అవుతుంది. ఎల్లప్పుడు సకాలంలోనే భుజించవలెను .


 *  ఉదయం , సాయంకాలం నందు మాత్రమే మనుష్యులు భోజనం చేయాలని వేదం చెప్తుంది .ఆయుర్వేదం ప్రకారం "ఏకభుక్త్తోమహాయోగి , ద్వీభుక్తో మహాభోగి, త్రిభుక్తో మహారోగి " అనగా రోజుకి ఒకసారి భోజనం చేసేవాడు మహాయోగి , రోజుకి రెండు సార్లు భోజనం చేసేవాడు మహాభోగి , రోజుకి మూడుసార్లు భోజనం చేసేవాడు మహారోగి అని అర్థం .కావున రోజుకి రెండుసార్లు మాత్రమే భోజనం చేయడం శ్రేష్టం అని మన సాంప్రదాయం చాటుతుంది. 


 *  రెండు భోజనాల మధ్య ఫలహారం అనగా పండ్లు తినవచ్చు. జీర్ణక్రియ అయ్యే సమయంలో మరలా భుజించరాదు . అది రోగాలకు ముఖ్యకారణం . అప్పుడప్పుడు జీర్ణ అవయవాలకు విశ్రాంతి ఇవ్వవలెను.లేనిచో అవి బలహీనం చెందును 


 *  చిన్నపిల్లలకు అన్నకోశం పెరిగి ఉండదు కనుక వారు శరీరంకి కావలసిన ఆహారం ఒక్క మారు తీసుకొనలేరు . వారు ఆటపాటలతో ఎగురుచుందురు. వారు ఒకటికి రెండు సార్లు తినినను తప్పులేదు . కష్టం చేయు శ్రామిక వర్గం వారు జఠరాగ్ని ఎక్కువుగా ఉండును. కావున వారు మూడొవసారి భోజనం చేయవచ్చు . 


 *  మీరు తినవలసినంత మాత్రమే తినవలెను .ఎక్కువ తిన్నచో  అజీర్ణం రోగం కలుగును. ఒకపూట ఎక్కువుగాను ఒకపూట తక్కువుగాను సేవించుటయు ఒక దినం తిని మరుదినం నిరాహారంగా అనగా ఏమి తినకుండా ఉండరాదు. 


 *  మానవుడు తన పొట్ట యందలి స్థలముని నాలుగు భాగాలుగా విభజించి అందు రెండు భాగములు ఘనద్రవ రూపములు భక్ష్యములు 

అనగా నమిలి తినదగినవి , భోజ్యమనగా నమలాక చప్పరించి తినతగినవి . లేహ్యం అనగా నాలుకతో చప్పరించి తినదగినట్లు కొంచెం ద్రవరూపంగా ఉండునది , పేయం అనగా మిక్కిలి ద్రవరూపం అయి త్రాగదగినది ఈ విధంగా నాలుగు రకాల ఆహారముల చేత ఒక భాగం నీటిచేత నింపి మిగిలిన ఒక భాగం వాయు సంచారం కొరకు అనగా జీర్ణక్రియ జరుగుటకై వదిలినచో ఆహారం బాగుగా జీర్ణం అగును.


 *  ప్రత్యేక పర్వదినములలో తీపి , నెయ్యి, నూనె పదార్దములు , సెనగ పిండితో తయారగునవి ఉపయోగించినప్పుడు మిగతా 

భోజనం తగ్గించి చివర పెరుగును వాడకుండా ముఖ్యంగా చారు, మజ్జిగలతో భోజనం ముగించుట ఉత్తమం . 


 *  భోజనం చేయుటకు తూర్పు ముఖం అలా వీలుకానిచో దక్షిణాభిముఖంగా ఉన్నతంగా , సమప్రదేశమున పీట లేక చాప మీద కూర్చొనవలెను. ఆకులమీద , ఇనుపమేకులు వేసిన పీటల మీద కూర్చుని భోజనం చేయకూడదు . ఇత్తడి మేకులు వేసిన పీటల మీద కూర్చుని తినటం ఆచారం .


 * ఒక వస్త్రంని మాత్రమే ధరించి భోజనం చేయరాదు . కావున ఉత్తరీయం పైన కప్పుకొనవలెను . దానివలన శరీరం నకు బాహ్యవాయువులు తగలక సురక్షితంగా ఉండును.అది పట్టువస్త్రం అయితే మరింత మంచిది . తలపాగా ధరించి భోజనం చేయరాదు . టేబుల్ మీద భోజనం శాస్త్ర విరుద్ధం . 


 *  ఆహారం భుజించు సమయం నందు అధికంగా మాట్లాడకుండా , అతిగా నవ్వకుండా మనుజుడు తన శరీరం నకు అనుకూలం అయిన మరియు తేలిక అయిన స్నిగ్ధగుణము , ఉష్ణగుణము కలిగి ద్రవప్రమాణం అయి మధుర , ఆమ్ల , లవణ, కటుతిక్త కషాయములు అను ఆరు రసములు గల ఆహారంను మిక్కిలి తొందరగా కాకుండా మిక్కిలి మెల్లగా కాకుండగా భుజించవలెను .


 *  ఆకలిగొన్నవారు, రోగులు , హీనులు , దరిద్రులు , బిక్షగాండ్రు వీరి యొక్కయూ కుక్క, కోడి మొదలగు వాని యొక్క దృష్టి భోజన కాలము న తగలకూడదు.కావున భొజనశాలకు వీరిని దూరంగా ఉండునట్లు చేయవలెను . 


 *  బంగారు పాత్ర యందు భోజనం మంగళకరం మనోదోషములు పొగొట్టును. జఠరాగ్నిని వృద్ధిపరుచును. మంచి చూపుని ఇచ్చును.


 *  వెండిపాత్రల యందు శ్లేష్మాన్ని హరించును  మూత్రరోగముని హరించును . ఆరోగ్యకరం . వెండి పళ్లెం మధ్యలో బంగారం తాపడం చేయుంచుట మంచిది . 


 *  కంచుపాత్రలో భోజనం చేయుట నోటివెంట రక్తం పడు రోగముని నయం చేయును . శుభ్రంగా మరియు రుచికరంగా ఉండి నేత్రరోగములు హరించును . బుద్దిని పెంచును. అగ్నివృద్ధి పెంపొందించి శరీరానికి కాంతి ని ప్రసాదించును. ఎముకలు వృద్ది అగుటకు తోడ్పడును.  హృదయ రోగములను నిగ్రహించును.


  *  స్టీల్ పాత్రలో భోజనం చేసిన పాండురోగం తగ్గును. కామెర్ల వ్యాధిని హరించును . 


 *  అల్యూమినియం పాత్రయందు వండిన భోజనము వండుచున్న మరియు తినుచుండిన అతిసార వ్యాధి కలుగును. 


 *  గాజు పాత్రలో ఆహారం తీసుకోవడం వలన  ఉపయోగం ఏమియును లేదు . కేవలం దోషాలు మాత్రం కలగవు. ఆమ్లములు ఇందు ప్రభావం చూపించలేవు . 


 *  అరటి ఆకు నందు భోజనం మిక్కిలి పరిశుభ్రం అయి శ్రేష్ఠంగా ఉండును. శరీరకాంతి , సంభోగశక్తిని పెంచును. ఆకలి దంతకాంతిని పెంచును. క్రిమినాశనకారి , ఉదరం నందు పుండ్లను తగ్గించును . 


 *  మోదుగ ఆకుల యందు భుజించుటచే గుల్మరోగం , మహోదరం , క్రిమిరోగం , రక్త, పిత్త రోగాలు నయం అగును.మోదుగ చంద్రుడికి సంబందించిన వృక్షం . సాత్త్విక గుణాలు కలిగించును.


 *  మర్రి ఆకుల యందు భుజించటం వల్ల క్రిమిరోగం నివారణ అగును. నేత్రదోష నివారణ జరుగును.


 *  రావియాకు విస్తరి యందు భుజించిన పిత్త నివారణ జరుగును. అగ్నివృద్ధిని కలిగించును. జననేంద్రియ దోషాలు నివారణ అగును. విద్యార్జనకు మనస్సు పుట్టించును.


 *  పనస ఆకుల యందు భుజించిన అగ్నివృద్ది, పిత్తాన్ని హరించును .


 *  తామరాకు లో భోజనం విషహరంగ ఉండును. సరస్సులో ఉన్న తామరాకు పనిచేయదు . 


  

  ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ క్రింద ఇచ్చిన నెంబర్ నందు సంప్రదించగలరు .


    కాళహస్తి వేంకటేశ్వరరావు 


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

నవగ్రహా పురాణం

 .        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *118వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*కేతుగ్రహ చరిత్ర - 4*


తన ప్రయాణం ముగించిన కేతువు చంద్రుడికి సమీపంలో ఉన్న ఒక తెలిమబ్బు చాటుకు నక్కాడు. దొంగచాటుగా , చంద్రుణ్ణి గమనిస్తున్నాడు.


చంద్రుడు లోపల నుంచి ఉబికి వస్తున్న ఆందోళనను , త్రిమూర్తులు ఆదుకుంటారన్న ఆలోచనతో అణగద్రొక్కుతూ , గగనయానం సాగిస్తున్నాడు. క్రిందటి రాత్రి చవిచూసిన బీభత్సానుభవం ఎంత మరిచిపోవాలనుకున్నా , ఆయనకు గుర్తు వస్తూనే ఉంది !


*"నిర్భయంగా నీ నిశావిహారాన్ని కొనసాగించు ! 'కేతువు నీ సమీపానికి రాకుండా త్రిమూర్తులు..."* చంద్రుడు చెవులలో ప్రతిధ్వనిస్తున్న నారదుడి ధైర్య వచనాలను మ్రింగివేస్తూ , కేతువు భీకరాట్టహాసం దిక్కుల్ని కుదిపివేస్తూ వినిపించింది.


చంద్రుడు భయం భయంగా చూశాడు. తెల్లటి మేఘం చాటు నుండి వికృతంగా కనిపిస్తోంది కేతువు ముఖం , నివురు చాటున నిప్పులా !


మబ్బుల చాటు నుండి వెలికి వచ్చి , చంద్రుడి వైపు దూసుకు వెళ్ళబోయిన కేతువు - తటాలున ఆగాడు. తన ఎదురుగా , ఉన్నతమైన , విశాలమైన , అలంఘ్యమైన గోడలా నిలుచున్నారు. త్రిమూర్తులు ! ముగ్గురి ముఖాల మీదా వెన్నెలను వెక్కిరిస్తున్న దివ్యమందహాసాలు !


*"కేతూ ! నీ జన్మ రహస్యం నీకు తెలీదు ! రాక్షసాంశతో , మృత్యుపుత్రుడిగా జన్మించిన దేవతామూర్తివి నీవు ! సూర్య చంద్రులతో , ఇతరులతో బాటు గ్రహదేవతగా వెలుగొందే వేలుపుగా నిన్ను అభిషేకిస్తాం !"* కేతువు ఆవిర్భావానికి కారకుడైన బ్రహ్మ ఉపోద్ఘాతంగా అన్నాడు.


*"మేఘహాసుడి ద్వారా నేను ప్రసాదించిన వరాలనూ , శక్తులనూ సూర్య చంద్రులను కబళించే అవాంఛనీయ చర్యతో వృధా చేయవద్దు , కేతూ !"* శివుడు మందలిస్తున్నట్టు అన్నాడు.


*“నా సుదర్శన చక్రధారతో నీకు శిరచ్ఛేదం కావడం యాదృచ్ఛికం ! పరమేశ్వరుల వరం ఆ నష్టాన్ని రూపు మాపి , నీకు రూపాన్ని ప్రసాదించింది ! పగతో , ప్రతీకార జ్వాలతో రగిలిపోవడం నీ భవిష్య పదవికి తగదు ! నిరంతరాయంగా సూర్యచంద్రులను కబళించే ఆలోచనను విరమించు..."*


*“మాట మాటకు అడ్డు వస్తున్నందుకు మన్నించండి !"* కేతువు వినయంగా అన్నాడు. *“సూర్యచంద్రుల మీద ప్రతీకారం చేస్తూనే ఉండిపోతామంటూ చేసిన ప్రతిజ్ఞ ఏం కావాలి ? నా తల్లికీ ధర్మపత్నికి ఇచ్చిన మాట ఏం కావాలి ?"*


*"నీ ప్రతిన నెరవేరేలా , వెసులుబాటు కల్పించడానికి మేం సిద్ధంగా ఉన్నాం ! నీ అన్న రాహువు అభ్యర్థించి , అనుమతి పొందిన ప్రకారం నిర్ణీత కాల వ్యవధితో , నియమిత సమయాలలో - లోకాలకు కీడు వాటిల్లని విధానంలో నువ్వు సూర్యచంద్రులను కబళిస్తూ తృప్తి చెందవచ్చు !"* శ్రీమహావిష్ణువు అన్నాడు.


*"సంధి పూర్వకమైన ఈ విధానం మా ముగ్గురికీ ఆమోదమే కేతూ !"* పరమేశ్వరుడు నవ్వుతూ అన్నాడు.


*“అంగీకరించు , ఆనందించు !"* బ్రహ్మ నచ్చచెప్తున్నట్టు అన్నాడు.


*"మీ ఆజ్ఞను శిరోధార్యంగా స్వీకరిస్తున్నాను. అమావాస్య దినాన సూర్యుడినీ , పౌర్ణమి రాత్రులలో చంద్రుడినీ - వంతుల ప్రకారం మేమిద్దరమూ గ్రహణం చేసే ప్రాతిపదికతో ముందుకు సాగుతాము !"* కేతువు వినయంగా అన్నాడు.


*“తథాస్తు !”* త్రిమూర్తులు ఏక కంఠంతో అన్నారు.


కేతువు ముగ్గురికీ భక్తితో ప్రణామాలు చేశాడు. చంద్రుడి వైపు ఒకసారి చిరునవ్వు నవ్వి , విజయ గర్వంతో వెనుదిరిగాడు. త్రిమూర్తులు అంతర్థానమయ్యారు. చంద్రుడు నూతనోత్సాహంతో వెన్నెల వెదజల్లసాగాడు.


**************************


ఆశ్రమం ముందు నిలుచున్న రాహువూ , మేఘహాసుడూ , సింహికా , దనూదేవీ , సింహిదేవీ , కేతువు పత్ని చిత్రలేఖా కేతువుకు ఆప్యాయంగా స్వాగతం చెప్పారు. చిరునవ్వులతో ,


దగ్గరగా వచ్చిన కేతువును ఆలింగనం చేసుకుంటూ బిగ్గరగా నవ్వసాగాడు రాహువు , కేతువు తన విజయ వికట - అట్టహాసంతో అతనితో శ్రుతి కలిపాడు ! ఇద్దరి నవ్వులూ జంట కారుమేఘాల రాపిడితో పుట్టిన భీకరమైన ఉరుముల ధ్వనుల్ని మరిపించాయి. కేతువు నవ్వులో అతని విజయగాథ ధ్వనిస్తోంది ! రాహువు స్వరంలో అభినందన ప్రతిధ్వనిస్తోంది !


రాహువు కేతువుల నవ్వులు అక్కడున్న వాళ్ళందరినీ అంటు వ్యాధిలా ఆవహించాయి. క్షణంలో కశ్యపాశ్రమ ప్రాంగణం ఆ ఏడుగురి నవ్వుల బృందగానంతో దద్దరిల్లిపోయింది !


కశ్యప ప్రజాపతీ , అదితీ , వినతా , కద్రువా , దితీ , ఇతర పత్నులూ లోగిలిలోకి పరుగు పరుగున వచ్చారు. పిచ్చి పట్టిన వాళ్ళలాగా పగలబడి నవ్వుతున్న రాహువూ , కేతువూ , మేఘహాసుడూ , దనూదేవీ , సింహికా , రాహుపత్ని సింహిదేవీ , కేతుపత్ని చిత్రలేఖా వాళ్ళను గమనించే స్థితిలో లేరు !


*"దనూ...సింహికా !"* అదితి చెల్లెళ్ళను పిలిచింది.


దనూదేవీ , సింహికా నవ్వులు ఆపి , చూశారు. ఒకరి తరువాత ఒకరుగా - అందరూ నవ్వు ఆపేశారు. కశ్యపప్రజాపతికి అంతా అయోమయంగా ఉంది. చంద్రుడిని కబళించడానికి వెళ్ళిన కేతువు ఇక్కడే ఉన్నాడు. ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు ! వీళ్ళు ఎందుకు నవ్వుతున్నారు ?


*"పితామహా..."* మేఘహాసుడు వినయంగా అంటూ కశ్యప ప్రజాపతి సమీపానికి వచ్చాడు. నవ్వు తెప్పించిన కన్నీళ్ళతో అతడి చెంపలు మెరుస్తున్నాయి.


*"ఎందుకు నాయనా అలా నవ్వుతున్నారు ?"*


*“నా తండ్రి గారిలాగే , పినతండ్రిగారు , కూడా త్రిమూర్తుల నుండి వరాలు మూటగట్టుకుని వచ్చారు , పితామహా !”* మేఘహాసుడు చిరునవ్వుతో అన్నాడు.


*"నిజమా ! ఏయే వరాలు సొంతం చేసుకున్నావు , కేతూ ?”* కశ్యపుడు అడిగాడు. కేతువు తన విజయగర్వానికీ , ఆనందానికీ , వినయం జత చేస్తూ తనకూ త్రిమూర్తులకూ మధ్య జరిగిన ఒడంబడిక గురించి వివరించాడు.


*"అంటే , చాలా తక్కువ పర్యాయాలు , తక్కువ వ్యవధానం పాటు మీరిద్దరూ సూర్యచంద్రులను గ్రహణం చేస్తారన్నమాట !'* అదితి అంది.

 

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*ప్రథమ స్కంధము*


*కుప్పించి యెగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పిగొనగ*

*ఉఱికిన నోర్వక ఉదరంబులో నున్న జగముల వ్రేగున జగతి కదల*

*చక్రంబు చేపట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటము జార*

*నమ్మితి నాలావు నగుబాటు సేయకు మన్నింపుమని క్రీడి మఱల దిగువ*


శ్రీకృష్ణుడు రథంలో సారధిస్థానం నుండి ఒక్క పెట్టున కుప్పించి పైకి లేచాడు. ఆ ఊపులో అతని కుండలాల కాంతి గగనాన్నంతా క్రమ్మివేసింది. అదే వేగంతో క్రిందికి దూకాడు. బొజ్జలో ఉన్న లోకాల బరువునకు వెలుపలి జగత్తు కంపించిపోయింది. తల నరకటానికి చక్రాన్ని చేతిలో అమర్చుకొని తనపైకి వస్తున్నాడు. ఆ వడికి ఉత్తరీయంగా వేసుకొన్న పచ్చని పట్టుబట్ట జారిపోతున్నది. ‘స్వామీ! నిన్నేనమ్ముకొన్నాను. నా బలవిక్రమాలను నవ్వులపాలు చేయబోకు. నా పరువు కాపాడు’ అని ఇంద్రుడు మెచ్చి బహూకరించిన కిరీటం తలమీద మిలమిలలాడుతున్న అర్జునుడు వెనుకకు త్రిప్పటానికి బలమంతా ఉపయోగించి లాగుతున్నాడు. అయినా ఏనుగుమీదికి దూకే సింహంలాగా మెరసిపోతూ ‘ఉండు, అర్జునా! నన్ను వదలిపెట్టు. ఈనాడు భీష్ముణ్ణి చంపుతాను. నిన్ను కాపాడుతాను’ అంటూ నా బాణాల జడివానను తప్పించుకుంటూ నా మీదికి వస్తూ ఉన్నాడు. ఆ విధంగా వచ్చి, నన్ను చంపాలని నేను కోరుకుంటున్న ఆ స్వామియే నాకు దిక్కు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతం🪷

 🌺🪷🌺🪷🌺🪷🌺🪷🌺🪷

*🪷శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతం🪷*

.                  *భాగం - 2*

🌺🪷🌺🪷🌺🪷🌺🪷🌺🪷

*ఓం సర్వ జగద్రక్షాయ గురు దత్తాత్రేయ*

.  *శ్రీ పాద శ్రీ వల్లభ పరబ్రహ్మాణేినమః*



*🌹శంఖరబట్టు మొదటి* 

                 *మజిలీ🌹*

              🌹🌹🌹🌹

                                 

అంబ అనుగ్రహం తో శంఖరబట్టు ప్రయాణం సాగించుచూ మరుత్వమలై అను గ్రామము చేరుకున్నారు.

హానుంతులవారు సంజీవిని పర్వతమును తీసుకొని పోవుచుండగా చిన్న ముక్క జారిన దనియు అదియే ఈ మరుత్వమనే పర్వతమని తెలుసుకున్నారు.ఆ పర్వతం చాలా అందంగా చూడచక్కని గుహలు తో నిండి వున్నది.అలా ఆ గుహలు పరికించగా ఒక గుహ ముందు పెద్దపులి నిలబడి యున్నది.దానిని చూసి శంఖరబట్టుకు 

పై ప్రాణములు పైనేపోయి శ్రీ పాదుల వారి నామస్మరణ చేసుకుంటూ గట్టిగా పైకి అరిచేడు. ఆ పెద్దపులి శాంతంగా నిశ్చలంగా వున్నది. అదే గుహనుండి ఒక మహతపస్వి బయటకువచ్చెను.

అంతట ఆ వృధ్ధ తపస్వి దీవించి శ్రీపాదులవారు కరుణాకటాక్షాలు వుండబట్టే శంఖరబట్టు ఈ సిద్ద,తపో భూమికి రాగలిగేడని ఆ తపస్వి శంఖరబట్టు రాకకోసమే నిరీక్షింస్తున్నట్లు చెప్పి శ్రీ పాదవల్లబుని దర్శనము త్వరగా చేసుకోమ్మని ఆ మహపురుషుని చరిత్ర వ్రాయమని చెప్పి అక్కడ వున్న పెద్దపులి మహా జ్ఞాని అని నమస్కరించుకోమని చెప్పేరు.సిద్దపురుషుడు చెప్పిన ప్రకారము ఆ పులికి నమస్కరించ గానే ఆపులి ఓంకారం చేసి శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అని ఆలపించి ఒక కాంతి ఏర్పడి కాంతిలో మహాపురుషుని గా అదృశ్యమయ్యేరు.

ఆ వృద్ద తపస్వి ఆదేశం  మేరకు శంఖరభట్టు గృహలో ప్రవేశించి ఆయన చేసిన హోమాది పూజలు గాంచినాడు. ఆ వృధ్ధ తపస్వి మరలా ఆశ్వీరదించి శంఖరబట్టు అడిగిన మీదట  ఆపులి యొక్క పుట్టు పూర్వోత్తరాలు చెప్పనారాబించేరు.

రేపు మరిన్ని విషయాలతో

జై గురుదేవదత్తా🙏


*సర్వం శ్రీ పాద వల్లభ చరణారవిందమస్తు🙏*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🪷🌺🪷🌺🪷🌺🪷🌺🪷

శ్రీమద్భగవద్గీత

 🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷

.           *🌹శ్రీమద్భగవద్గీత🌹*

.           *ప్రధమ అధ్యాయము* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

.         *అర్జున విషాద యోగము*

.                  *శ్లోకము 2*

🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷


*సంజయ ఉవాచ*


*దృష్ట్వా తు పాణ్డవానీకం*

*వ్యూడం దుర్యోధనస్తదా |*

*ఆచార్యముపసంగమ్య*

*రాజా వచనమబ్రవీత్ ||*


*భాష్యము:*

ధృతరాష్ట్రుడు పుట్టుకతో అంధుడు. దురదృష్టవశాత్తు అతనికి ఆధ్యాత్మికదృష్టి సైతము లోపించెను. ధర్మవిషయమున తన పుత్రులు తనతో సమానముగా అంధులని అతడు ఎరిగియుండెను. పుట్టుక నుండియు ధర్మాత్ములైన పాండవులతో వారు ఒక ఒడంబడికకు రాలేరని అతడు నిశ్చయముగా తెలిసియుండెను. అయినను తీర్థక్షేత్రమైన కురుక్షేత్ర ప్రభావమును గూర్చి అతడు సందేహాస్పదుడై యుండెను. యుద్ధరంగమందలి పరిస్థితిని గూర్చి ప్రశ్నించుటలో అతని అంతరార్థమును సంజయుడు అవగతము చేసికొనగలిగెను. 


కనుకనే సంజయుడు ఆ నిరాశ చెందియున్న రాజును ఉత్సాహపరచనెంచి, పవిత్రస్థలముచే పవిత్రులైన అతని పుత్రులు రాజీకి సిద్ధపడుట జరుగబోదని ఆశ్వాసము నొసగెను. పాండవసేనాబలమును గాంచిన పిమ్మట అతని తనయుడైన దుర్యోధనుడు నిజ్జస్థితిని ఎరుకపరచుటకు శీఘ్రమే సైన్యాధిపతియైన ద్రోణాచార్యుని చెంతకు చేరేనని సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియజేసెను. దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడినను పరిస్థితి యొక్క తీవ్రత ననుసరించి స్వయముగా సైన్యాధిపతి వద్దకు వెడలవలసివచ్చెను. కనుకనే రాజకీయవేత్త యనుటకు అతడు చక్కగా తగియున్నాడు. కాని పాండవ సేనా వ్యూహమును గాంచిన పిమ్మట అతడు పొందిన భయమును ఆ రాజనీతి నిపుణత మరుగపరచలేకపోయెను.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

పెద్దల పరిహాసాలు

 శు భో ద యం 🙏


పెద్దల పరిహాసాలు 


                                     మన యిళ్ళలో  పెళ్ళిళ్ళు  జరిగినపుడు  పెళ్ళికి వచ్చినవారు  ఒకరితో నొకరు యెన్నిపరిహాసాలో!  యెన్నెన్ని

వినోదాలో! చెప్పటానికి వీలా? అలాటి సందర్భంలో  ఒకవేళ  జగత్పాలకులైన  త్రిమూర్తులే  అలాంటి  వ్యవహారం నడిపితే యెలాఉంటుంది?  దానిని  ఊహించే  శ్రీమతి  గంటికృష్ణవేణమ్మగారు  తాము విరచించిన  "గిరిజా కళ్యాణము"- అనేకావ్యలో  ఒక

చక్కని ఘట్టం చిత్రించారు. గిరిజా కళ్యాణానికి  విష్ణుమూర్తి  సకుటుంబంగా  విచ్చేశాడు. వివాహం జరిగాక  భోజనాలు జరుగుతున్న సందర్భం. శివుడు విస్తరిలో ఉన్నపదార్ధాలను అటునిటు కదుపుతున్నాడట!


                 అప్పుడు విష్ణువు  శివుడు ఒకరినొకరు  వేళాకోలా లాడుకొన్నారట! ఎలా?  ఇదిగో ఇలా---


      విష్ణువు  శివునితో--   "  విసము తిన్న నోట  కసవయ్యెఁగాబోలు 


                                        భక్షణంబులెల్ల   పార్వతీశ!


                                       అట్టి దివ్యమైన  ఆహారములు  లే

            

                                      వటంచు   పల్కె  విష్ణుఁ డభవు తోడ ..


                           విష్ణువు  శివునితో  యిలా అంటున్నాడు. "  ఏమయ్యా!  ఈబూరెలూ ,గారెలూ, అవీ  నీకు నచ్చినట్లు  లేదే? 

కాలకూటం తిన్న నోటికి  యీభక్ష్యాలన్నీ  గడ్డిలాగ  రుచిలేనివై కనబడుచున్నవేమో? ఏంచేస్తాం?  అన్నాడు.


                                దానికి  సమాధానంగా శివుడు ఇలా అంటున్నాడు.


              "  నిక్కము  నీవుపల్కినది   నీరజనాభ!  ఇటెందు మ్రుచ్చిలన్


                 చిక్కదు  వెన్న !  తెత్తు మన  చిక్కవు  యెంగిలి కాయలెందు, నీ


                 కెక్కడ  దెత్తుమయ్య? అవి ;  ఇప్పు డటంచు  శివుండు  నవ్వగా


                 నక్కడ  పంక్తి  భోజనము నందు  ఫకాలున   నవ్విరందరున్ "!


                         నిజమేనయ్యా  విష్ణూ! నువ్వుచెప్పింది.  ఇక్కడెక్కడా  దొంగతనంచేద్దామన్నా   వెన్న దొరకదు.  తెద్దామన్నా  యెంగిలి కాయలుదొరకనే దొరకవు.  ఎక్కడనుండి  తేగలం మరి !  అని  శివు డనగానే  బ్రహ్మ, ఇంద్రాది దేవతలు  ఫకాలున  నవ్వారట !


                        మనదృష్టిలో  యిది పరిహాసమేయైనా  కవిదృష్ట్యా  ఇది  నిందాస్తుతి!

  

                                              దీని  అంతరార్ధం యేమిటంటే- లోకాలను నాశనంచేసే  కాలకూట  విషాన్ని  కంఠాన ధరించి, అందరినీ కాపాడిన వాడు శివుడని  విష్ణువు ప్రస్తుతించితే ,వెన్నదొంగిలి నెపంతో గోపికలనుధ్ధరించినవాడనీ,, శబరి యెంగిలిపండ్లను తిని భక్తపరాధీనుడైన వాడు విష్ణు వనీ  శివుడు విష్ణువును ప్రశంసించాడు..


                                       బాగుంది కదూ?


                                                                                       స్వస్తి!🙏🙏🙏🌷🌷🌷🌷💐💐🌷🌷🌷🌷🙏🙏🙏🙏🌷🌷

Chendan wood


 

Places to visit in hyderabad


 

Uthamulaku


 

Indowood


 

Railway in America


 

బుధవారం / రాశిఫలాలు*

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️

 •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*27-12-2023 / బుధవారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో సొంత నిర్ణయాలతో ముందుకు సాగుతారు. వృత్తి, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన సమాచారం అందుతుంది.

---------------------------------------

వృషభం


వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు అధికమౌతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. చేపట్టిన పనుల్లో తొందరపాటు పనిచేయదు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------

మిధునం


స్థిరస్తి కొనుగోలు చేస్తారు. సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సంతాన విద్య ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమౌతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

---------------------------------------

కర్కాటకం


కుటుంబసభ్యులతో స్వల్పవివాదాలు ఉంటాయి. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

---------------------------------------

సింహం


వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నూతన మిత్రుల పరిచయం ఉత్సాహనిస్తుంది.  దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. మిత్రుల నుండి శుభవార్తలు వింటారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి.

---------------------------------------

కన్య


ఆస్తి విషయాలలో ఒప్పందాలు వాయిదా పడుతాయి. కుటుంబ సభ్యులతో  శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. పాతమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------

తుల


చిన్ననాటి మిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి.

---------------------------------------

వృశ్చికం


ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. విద్యార్థులకు కొంత నిరుత్సాహం తప్పదు ధనపరంగా ఇబ్బందులు తప్పవు. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది.

---------------------------------------

ధనస్సు


వృత్తి, వ్యాపారాలలో అనుకూల పరిస్థితులుంటాయి. కొత్త పనులు చేపడతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. అధికారుల నుండి విమర్శలు తప్పవు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

---------------------------------------

మకరం


వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. నిరుద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

---------------------------------------

కుంభం


ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో ఊహించని మార్పులు ఉంటాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆర్ధిక సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి.

---------------------------------------

మీనం


కుటుంబంలో చికాకులు తప్పవు. వృత్తి, వ్యాపారాలలో ఊహించని మార్పులుంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో నిరుత్సాహం తప్పదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి. కొందరి ప్రవర్తన చికాకు పరుస్తాయి.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

Karmala valana kaadu

 


Dubai to Sharjah ferry