3, జులై 2021, శనివారం

ఆయువు ఉన్ననేమి

 ఆయువు ఉన్న తరి  కాయంబుకు 

పెను గాయములు పెక్కుతగిలిననేమి  జీవము పోదు 

కాలమ్ము ఆసన్నమైన కాలుజారి పడినను 

అశువులు బాయుట  తధ్యము భార్గవ 

మరచిపోయిన తెలుగు

 *మనం మరచిపోయిన తెలుగు*

అరసున్న [ *c*], బండి ‘ *ఱ* ‘లు ఎందుకు? 

*అరసున్న* బండి ‘ *ఱ* ‘లు నేటిభాషలో దాదాపుగా వాడుకలో లేవు.ఐతే ఇవి తెలుగు భాషకి ప్రత్యేకమైనవి. ద్రావిడభాషాలక్షణాన్ని నిరూపించేవి. అంతేకాదు కావ్యభాషలోను, లక్షణశాస్త్రంలోను వీటి ప్రాముఖ్యం చాలావుంది. వాడకపోతే పరవాలేదు గానీ వీటిగురించి తెలుగువాడు తెలుసుకోవాలిగదా! మన భాషాసంపదలో ఇవీ భాగస్వాములే అని గ్రహించాలి గదా!

 అరసున్న, ఱ ల వల్ల *అర్థభేదం* ఏర్పడుతొంది.

పదసంపదకి ఇవి తోడ్పడతాయి.

ఎలాగో చూడండి:

*ఉదా*:-

అరుఁగు = వీది అరుగు 

అరుగు = వెళ్ళు, పోవు

అఱుగు = జీర్ణించు

ఏఁడు = సంవత్సరం

ఏడు = 7 సంఖ్య

కరి = ఏనుగు

కఱి = నల్లని

కాఁపు = కులము

కాపు = కావలి

కాఁచు = వెచ్చచేయు

కాచు = రక్షించు

కారు = ఋతువుకాలము

కాఱు = కారుట (స్రవించు)

చీఁకు = చప్పరించు

చీకు = నిస్సారము, గ్రుడ్డి

తఱుఁగు = తగ్గుట, క్షయం

తఱుగు = తరగటం(ఖండించటం)

తరి = తరుచు

తఱి = తఱచు

తీరు = పద్ధతి

తీఱు = నశించు, పూర్తి(తీరింది)

దాఁక = వరకు

దాక = కుండ, పాత్ర

నాఁడు = కాలము

నాడు = దేశము, ప్రాంతము

నెరి = వక్రత

నెఱి = అందమైన

నీరు = పానీయం

నీఱు = బూడిద

పేఁట = నగరములో భాగము

పేట = హారంలో వరుస

పోఁగు = దారము పోఁగు

పోగు = కుప్ప

బోటి = స్త్రీ

బోఁటి = వంటి [నీబోఁ టి]

వాఁ డి = వాఁడిగాగల

వాడి = ఉపయోగించి

వేరు = చెట్టు వేరు

వేఱు= మరొకవిధము

మడుఁగు,మడుగు మొదలైనవీ ఉన్నాయి.

బెంగాల్_హింస - కలకత్తా హై కోర్ట్ -

 #బెంగాల్_హింస - కలకత్తా హై కోర్ట్ -  మమత ప్రభుత్వం


మేము నియమించిన జాతీయ మానవ హక్కులు కమిటీ రిపోర్ట్ పరిశీలించిన మీదట


మాకు అర్ధం అయింది ఏమిటంటే?


* ఫిర్యాదుదారులు మాకు చెప్పినవి నిజంగానే జరిగినట్లు ఉన్నాయి.

* ఎన్నికల తరువాత విపరీతమైన హింస జరిగింది. రాష్ట్రప్రభుత్వం పట్టించుకోలేదు

* మేం అడిగినా కూడా హింస ఏదీ జరగలేదు అనే బుకాయింపు ధోరణితోనే తోనే రాష్ట్రప్రభుత్వం ఉంది.

* ఈ హింస లో చాలా మంది హత్య చేయబడ్డారు

* చాలా మంది స్త్రీలు అత్యాచారాలకు గురి అయ్యారు

* మైనర్ ఆడపిల్లలను కూడా విడిచిపెట్టలేదు

వారిని అతి దారుణంగా హింసించి అత్యాచారాలు చేశారు

* చాలా మంది ఆస్తులు ధ్వంసం చేయబడ్డాయి

* భయంతో చాలా మంది తమ ఇళ్లు ఆస్తులు వదులుకుని పక్క రాష్ట్రాలకు కూడా వలసపోయారు.

* అలా వలసపోయిన వారు మళ్లీ తమ ఇళ్లకు వచ్చి తమ సాధారణ కార్యకలాపాలు నిర్వర్తించుకునే అవకాశం కలిగేటట్లు రాష్ట్ర ప్రభుత్వం వారికి నమ్మకం కానీ భరోసా గాని కల్పించే చర్యలు ఈ రోజు దాకా తీసుకోలేదు.

* చాలా సంఘటనల్లో పోలీసులు ఫిర్యాదులు స్వీకరించలేదు. కొన్నింటిలో ఫిర్యాదుదారులపై తిరిగి కేసులు బనాయించారు.

* ఫిర్యాదుదారులు వారి ప్రాణాలకు, ఆస్తులకు భవిష్యత్ లో ప్రమాదం అని చెప్పి రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ కి కానీ NHRC మెంబర్లకు కానీ వారి పేరు చెప్పడానికి , జరిగిన హింస చెప్పడానికి కూడా భయపడే పరిస్థితులు ఉన్నాయి.

* రాష్ట్రంలోని వివిధ విభాగాలు NHRC కమిటీ మెంబర్లకు సమాచారం ఇవ్వడం పట్ల ఆసక్తి చూపలేదు

* హింస వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు

రాష్ట్ర ప్రభుత్వం ఏ సహాయం అందించలేదు. ఆఖరుకు రేషన్ సరుకులు కూడా ఇవ్వడం లేదు

* ముందస్తు సమాచారం ఇచ్చినా కూడా NHRC కమిటీ సభ్యులపై దాడి జరిగింది. పోలీసులు తగు రక్షణ కల్పించడంలో విఫలం చెందారు.


అని కలకత్తా హై కోర్టు మమత ప్రభుత్వాన్ని ఆక్షేపించింది.


అన్ని ఫిర్యాదులు స్వీకరించి, కేసులు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని, హింసకు గురి అయిన వారికి భద్రత కల్పించి వైద్య సదుపాయం అందించాలని అంతేకాక ముందుగా హెచ్చరించినా కూడా  కమిటీ సభ్యులపై దాడి అరికట్టడం లో విఫలమైన కలకత్తా సౌత్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ పైన పోలీసు అధికారులపై కోర్టు ధిక్కరణ నోటీసులు ఇచ్చింది.


తదుపరి వాయిదా జులై 13న.


ఈ పైన చెప్పిన సంఘటనల్లో ఒక్క 10 శాతం

ఉత్తరప్రదేశ్ యోగి ప్రభుత్వం లో జరిగి ఉంటే ఫేస్ బుక్ మేధావులు ఈ సరికే తోడేళ్ళులా యోగి మీద పడి పోస్టులతో హిసించేవారు. కానీ దారుణంగా జరుగుతున్న ఈ హింస తమ సెక్యూలర్ ప్రభుత్వం లో జరుగుతోంది, చస్తున్నది చావడానికి అన్ని అర్హతలు అంటే మతతత్వ బిజెపి కి మద్దత్తు ఇవ్వడం వంటివి సంపాదించిన హిందువులు చస్తున్నారు కాబట్టి నోళ్లు కుట్టేసుకున్నారు..


రోజూ ప్రాధమిక హక్కులు, మానవ హక్కులు, చట్టాలు అంటూ ఊక దంపుడు ఉపన్యాసాలు ఇచ్చే వీరు ఇన్ని రోజులుగా జరుగుతున్న ఈ దారుణాలపై ఎందుకు మౌనం వహిస్తున్నారు?


ఒక్కటే కారణం..బిజెపి అన్నా ఆరెస్సెస్ అన్నా నరనరానా ద్వేషం. వీరి ద్వేషం ఎంతలా పెరిపోయింది అంటే ఏ పాకిస్తాన్ వాడో చైనా వాడో వచ్చి ఏ మోడీ నో యోగినో లేపేస్తే సంబరాలు చేసుకునేంత ఉన్మాదంగా తయారు అయ్యారు ఈ ఉదారవాదులు.


హిందువులకు పై వారి వల్ల కంటే ఈ సెక్యూలర్ ముసుగులో ఉండే హిందూ ద్వేషులే ప్రమాదం.


...చాడా శాస్త్రి...

*"రామ" మంత్రం*

 *"రామ" మంత్రం*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*రామనామ ప్రభావం*



*ప్రతీ భగవన్నామంలో ఒక నిగూఢ అంతరశక్తి, మహిమ వుంటుంది. మనకున్న ఏడుకోట్ల మహామంత్రాలలో రెండక్షరాలా "రామ" మంత్రం శ్రేష్టమైనదని మనుస్మృతి తెలుపుతుంది. ఇది హరిహరతత్వంబు కలిసిన మహామంత్రం. 'ఓం నమోనారాయణాయ' అనెడి అష్టాక్షరి మంత్రములో "రా" అను అక్షరం జీవాక్షరం. (ఎందుకంటే ఈ మంత్రంలో 'రా' తొలగించినచో  ఓం నమో నాయణాయ  అన్నది అర్ధం లేనిదవుతుంది) 'ఓం నమశ్శివాయ' అనెడి పంచాక్షరి మంత్రంబులో "మ" అనునది జీవాక్షరం.(ఎందుకంటే ఈ మంత్రంలో 'మ' తొలగించినచో ఓం నశ్శివాయ అంటే  శివుడే లేడని అర్ధం) ఈ రెండు జీవాక్షరముల సమాహారమే "రామ". శివకేశవుల సంఘటిత శక్తియే 'రామ'మంత్రం.*



*అందుచే రామమంత్రం సర్వశక్తివంతమైన, శ్రేష్టమైన ముక్తిప్రసాద మంత్రముగా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి.100 కోట్ల శ్లోకాలతో రామాయణం వాల్మికిచే రచింపబడినది. అది త్రైలోక్యవాసుల సొత్తు. దానిని పరమశివుడు అందరికి పంచెను. 33 లక్షల 33 వేల 333 శ్లోకముల వంతున పంచగ 1 శ్లోకం మిగిలి పోయింది. దానిని కూడా పంచమని మునులు కోరారు. ఆ శ్లోకంలో 32 అక్షరములు ఉన్నవి. దానిని దశాక్షరి రూపమున ముగ్గురికి పంచగా రెండక్షరములు మిగిలినవి. ఆ రెండక్షరములు శివుడు తనకై తీసుకున్నాడని కధనం. ఆ రెండక్షరములే "రామ."*

                                                                                                           


*"రామ" అను రెండక్షరములు మనోహరమైనవి. మధురమైనవి. అమృత సమానం. ఈ రెండు అక్షరములు ముక్తి అను అమృతమును ఇచ్చును. సులభమైన ఈ నామం ఇహమందు సుఖమును, సంపదలను ఇస్తే, పరమునందు విష్ణుసాయుజ్యం ఇస్తుంది. లౌకికముగా భవభూతి, పారమార్ధికముగా ఆత్మానుభూతి రామనామం వలన కల్గుతుంది.*



*రాశబ్దోచ్చారణే జాతే వక్ర్తాత్పాపం విగచ్ఛతి | మకార శ్రవణే జాతే భస్మీభావం గమిష్యతి || (ఉమాసంహిత)*


*('రా' అను శబ్దం ఉచ్చరించగానే పాపం వదనము నుండి బయటపడును. పిదప 'మ'కారము వినుటతోడనే భస్మమైపోవును.)*



*రామేతి రామచంద్రేతి రామభద్రేతి వా మనుమ్ | యావజ్జీవం జపన్ మర్త్యో జీవన్ముక్తో న సంశయః ||*

 *(ఉమాసంహిత)(రామ, రామచంద్ర, రామభద్ర, అను ఈ మంత్రాలలో దేనినైనను జీవితాంతం వరకు జపించు మనుజుడు జీవన్ముక్తుడు కాగలడు. ఇందులో సంశయం లేదు) కృశాను (అగ్ని) 'ర'అక్షరం అగ్నిబీజాక్షరం. భాను (సూర్యుడు) 'అ'అక్షరం సూర్యబీజాక్షరం. హిమారక (చంద్రుడు) 'మ'అక్షరం చంద్రబీజాక్షరం. ఈ మూడు బీజాక్షరములు కలసి "రామ" శబ్దమయ్యెను. అగ్నిగుణం దహించుట. అగ్నిబీజాక్షరమగు  'ర' శుభాశుభ కర్మలను దహించి మోక్షమును ఇచ్చును. సూర్యుని వలన అంధకారం నశించును. అటులనే సూర్య బీజాక్షరం 'అ' మోహాందకారమును పోగొట్టును. చంద్రుడు తాపమును హరించును. అటులనే చంద్రుని బీజాక్షరం 'మ' తాపత్రయమును హరించును. ఉత్పత్తి కర్తయగు బ్రహ్మవంటివాడు చంద్రుడు. పోషణ కర్తయగు విష్ణువువంటివాడు సూర్యుడు. సంహార కర్తయగు శివుని వంటివాడు అగ్నిదేవుడు. ఈ త్రిమూర్తి స్వరూపుడు శ్రీరాముడు.*



*రామ మంత్రము ఎటువంటిదంటే - పుట్టుట, గిట్టుట అనెడి అలలు గల సంసారమను సముద్రం దాటించునదియును, బ్రహ్మవిష్ణురుద్రాదుల చేత పొగడదగినదియును, బ్రహ్మహత్యాది మహాపాపములను నశింపజేయునదియును, కామక్రోధలోభ మోహమదమాత్సర్యాలాది దుర్గుణములను సంహరించునదియును, నేను జీవుడనేడి అజ్ఞానం తొలగించునదియును, పరబ్రహ్మం (చైతన్యం) నేననెడు దివ్యజ్ఞానం వలన కలిగిన నిరాతిశయానందమును వర్ధిల్లు జేయునదియును, వేదముల కడపటిభాగమైన జ్ఞానకాండం చేత విచారింపదగినదియుయగును.*


*( శ్రీ సీతా రామాంజనేయ సంవాదం)*


*రా శబ్దోశ్చారణాదేవ ముఖాన్నిర్యాంతి పాతకాః | పునః ప్రవేశ భీత్యాచ మకారస్తూ కవాటవత్ ||*



*(నోరు తెరిచి "రా" అని చెప్పునప్పుడే పాపములన్నియు నోటినుండి బయటికి వెళ్లిపోవుచున్నవి. మరల అవి లోపలకు ప్రవేశించకుండా "మ"కారం తో నోటిని మూసి బంధించు చున్నది) "రా" అక్షరం ఉచ్చరించుటవలన నోరు తెరవబడి పాపములు పోయి ముఖం మధురముగా ఉండును. "మ" అక్షరం ఉచ్చరించుటవలన నోరు మూతపడి సంతోషం కలుగును. "రా" అక్షరం బ్రహ్మస్వరూపుడునగు ఆదికూర్మముతో సమానం. "మ" అక్షరం జీవస్వరూపుడగు ఆదిశేషువుతో సమానం. "రా" అక్షరం ఛత్రం వలెను, "మ" అక్షరం కిరీటం వలెను సర్వ వర్ణములకంటే అధికముగా ప్రకాశించును. ఇటువంటి రామనామమును జపించిన సిద్ధత్వమును పొందుదురు. "రా" అగ్ని బీజాక్షరం కావున దానిని స్మరించిన మాత్రమున సకలపాపములు భస్మము కావించుననియు, "మ" అమృత బీజాక్షరం కావున దానిని స్మరించిన యెడల సత్యముగా మోక్షం ఇచ్చుననియు ఋషులు తెలిపారు.*



*"రా" అనగా పరబ్రహ్మం, "మ" అనగా చిచ్ఛక్తి. "రా" అనగా క్షేత్రజ్ఞుడు, "మ" అనగా జీవుడు. "రా" అనగా శివుడు, "మ" అనగా శక్తి. "రా" అనగా విష్ణువు, "మ" అనగా  లక్ష్మి. "రా" అనగా బ్రహ్మం, "మ" అనగా సరస్వతి. "రా" అన్న మాత్రమున యముడు గజ గజ వణుకును, "మ" అన్న మాత్రమున అతని పాశం తెగిపోవును. రామ అన్న భవబంధములు నశించును. రామ అన్న సమస్త సంపదలు కల్గును. రామ అన్న సర్వార్ధములు సిద్ధించును.రామ అన్న బ్రహ్మహత్యాది పాతకములెల్ల నివర్తియగును. రామ అన్న సకల సంశయములు నివృత్తి యగును. రామనామం స్మరణం చేసేవారికి మోక్షం కరస్థమై రామమయమై ఉన్నది. రామ మంత్రముకంటే అధికమైన యజ్ఞంగాని, తపంగాని, వ్రతంగాని, మంత్రంగాని, మరియొకటి లేదు.* 

          

                                      *తారక మంత్రం:-*


*తారకం సర్వవిషయం సర్వధా విషయమక్రమం చేతి వివేకజం జ్ఞానం||*


*(పతంజలి యోగం) వివేక జన్య జ్ఞానం తారకం. ఆత్మానాత్మ వివేకజ్ఞానముచే కలిగెడు శుద్ధమైన ఆత్మజ్ఞానమునకు తారకమని పేరు. సంసార సాగరము నుండి తరింపజేసేది కాబట్టి ఇట్టి వివేకజ్ఞానమునకు తారకం అంటారు. రామ మంత్రం ఒక్కటియే తారకమంత్రమైనది.తా..రకం అనగా తన యొక్క స్వరూపం. తన స్వరూపం తాను తెలిసి కొనినచో ఏ చింతయు లేక మనస్సు నెమ్మది పొందును. పరమాత్ముడైన శ్రీరామునితో ప్రత్యగాత్మ స్వరూపుడైన తాను వియ్యమగుటయే యోగమనబడును.*



*రామ ఏవ పరబ్రహ్మ రామ ఏవ పరం తపః| రామ ఏవ పరం తత్వం శ్రీరామో బ్రహ్మతారకం||*



*శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే | సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ||*


*(నేను సదా రామనామమును ధ్యానించెదను, అది విష్ణు సహస్ర నామములకు సమానమైనది. నీవును ఆ నామమును జపించుమని శివుడు పార్వతీదేవికి ఉపదేశించెను.) తారక మంత్రమునే శివుడు సదా జపించెను. జీవుడు ముక్తి పొందవలెనని తలచి కాశీలోని మరణకాలమున ఈశ్వరుడే తారకమంత్రం స్వయముగా జీవుల దక్షిణ చెవియందు ఉపదేశించును. రామ అను శబ్దమును మరా అని జపించి దోపిడిదొంగ రత్నాకరుడు వాల్మికి మహాముని అయ్యెను. సహస్రనామములతో సమానమని శివుని వచనమును విని, పార్వతీ రామనామమును పఠించి శివుని సాంగత్యం నొందెను.*



*తన వచనముల యందామెకు గల విశ్వాసం జూచి, సంతచించి ప్రసన్నుడై పార్వతికి శివుడు తన శరీరములో ఎడమభాగమును ఇచ్చెను. రామనామ స్మరణతో రాయి రూపంలో ఉన్న అహల్య రామస్పర్శకు నోచుకొని పునీతురాలైనది. రామ అను తారకమంత్రము చేత సకల పాతకములు నశించును. పార్వతీదేవికి పరమేశ్వరుడు, వాల్మికికీ నారదుడు, భరద్వాజునకు వాల్మికి, వ్యాసులకు పరాశరులు, శుకులకు వ్యాసుడు ఉపదేశించినది తారకమంత్రమే. తారకమంత్రము కంటే ఉత్తమమంత్రం లేదు.*



 *ఈ మంత్రమును త్రికరణశుద్ధిగా అనుష్టించినవారు భవసాగరమును నిస్సంశయమముగా తరింపగలరు. నిరంతంను ప్రాణావాయువు లోపల వెలుపల సంచరించు నప్పుడెల్లను తదేకధ్యానముతో తారకమంత్రమును మననింపుచు ఉన్నను కాలక్రమేణ ఈ మహామంత్ర ప్రభావంచే ముక్తిని పొందుదురు. రామ అన్నది ఒక్క నామమే కాదు, మంత్రం కూడా. రామ మంత్రం మనిషిని తరింపజేసేది కావునా అది తారకమంత్రమైంది.*


🕉️🌞🌏🌙🌟🚩

క్షమాపణల గంధపుగిన్నె

 క్షమాపణల గంధపుగిన్నె 

----------------------------


అప్పుడప్పుడు

ఆవేశం హద్దులు దాటిపోయి

ఆలోచనకు కళ్ళు మూసుకపోయి

మాటలకు ముళ్ళు మొలుస్తుంటాయి

కళ్ళాలు వదులైపోయి

చేతలు అదుపు తప్పిపోతుంటాయి


తనదైనా పరాయిదైనా

ఎదుటిపక్షం మాత్రం ఆ క్షణంలో

ఎడాపెడా ఇబ్బంది పడిపోతుంది


మనసులకే కాదు 

మనుషులకూ గాయాలవుతుంటాయి

కష్టమో నష్టమో 

కనులముందు అకస్మాత్తుగానో

మెల్లమెల్లగా ఆ తరువాతానో వాటిల్లుతాయి


తప్పు, తలుపు తెరుచుకుని

సంబంధాల వాకిట్లోకొచ్చి

తలదించుకుని మౌనంగా నిలబడుతుంది


అయినంత మాత్రాన సరిపోతుందా...?

ఎంత ప్రయత్నించినా, ప్రాధేయపడినా

కాలం వెనక్కి తిరిగి నడవదుగా

జరిగిన సంఘటన మాయంకాదుగా 

కలిగిన ఇబ్బంది తొలగి, దూరం అయిపోదుగా


అందుకే 

క్షమాపణల గంధపుగిన్నె 

ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి

మనం చేసిన గాయాలపై

అలాఅలా చల్లి చల్లబరుస్తూనే ఉండాలి...


మనసులను ... మాటల మాధ్యమంతోనూ

మనుషులను ... వినయపు చేతల చర్యలతోనూ


              ..,. శ్రీధర్ చౌడారపు (03.07.2021)

"మృగా త్సింహ: పలాయతే"

క్రమాలంకారం 

ఈ రోజు క్రమాలంకారం గూర్చి తెలుసుకుందాం. నాలుగు పాదాలు గల పద్యంలో ఫై మూడు పాదాలలో ప్రశ్నలను పేర్కొని ఆ ప్రశ్నల జవాబులుగా నాలుగవ పదాన్ని కలపటాన్ని క్రమాలంకారం అంటారు. ఏ క్రమంలో పైన ప్రశ్నలు ఉన్నాయో వాటీ జవాబులు చివరి పాదంలో అదే క్రమంలో ఉంటాయి అన్న మాట.  అవధాని  ఎంతో తెలివి తేటలతో, సమయస్ఫూర్తితో ఉంటే మాత్రమే ఎలాంటి ప్రయోగాలు చేయగలడు. 

ముందుగా సూక్షంగా అలంకారాలు అంటే ఏమిటో తెలుసుకుందాం.  కావ్యమునకు అందమును చేకూర్చే దాన్ని అలంకారము  అంటారు.,అలంకారములు మూడు రకములు. అవిశబ్దాలంకారములు: శబ్దం  ప్రధానముగా కవితకు బాహ్యసౌందర్యమును కలిగించేవి .

  1. అర్థాలంకారములు: అర్థము వలన కవితకు అంతఃసౌదర్యమును కలిగించేవి .
  2. ఉభయాలంకారములు: శభ్దార్థాల రెంటి వలన కవితకు అందమును సమకూర్చేవాటిని ఉభయములు అంటారు. ఇంకా వివరంగా మరొక సారి ముచ్చటించుకుందాం. 
ఇప్పుడు క్రమాలంకారంలో పూరించిన ఒక సంస్కృత శ్లోకాన్ని పరిశీలిద్దాం. 
సమస్య ఇది 
"మృగా త్సింహ: పలాయతే"  ఈ సంస్కృత వాక్యానికి అర్ధం మృగమైన సింహం పలాయనం అయ్యింది అని అర్ధం. నిజానికి సింహం మృగ రాజు ఎట్టి పరిస్థితిలో పలాయనం (పారిపోదు) కాదు. 
దీనికి కవిగారు ఎలా పురాణ చేశారో పరికించండి. 
చూడండి శ్లోకం-


కస్తూరీ జయతే కస్మాత్కోహన్తి కరిణాం కులమ్

కిం కుర్యా త్కాతరో యుద్దేమృగా త్సింహ: పలాయతే


దీనిలో మూడు ప్రశ్నలు ఉన్నాయి.

మొదటి మూడు పాదాలలో మూడు ప్రశ్నలు,

చివరిపాదంలో సమాధానం ఉన్నది

కావున దీనిని అంతర్లాపిక అనే ప్రహేలిక అని కూడా అంటారు. 

ఇప్పుడు ప్రతి ప్రశ్నను తిలకించండి. .


1. కస్తూరీ జాయతే కస్మాత్?

   (కస్తూరి దేన్నుండి పట్టును?)

2. కో హన్తి కరిణాం కులమ్?

   (ఏది ఏనుగుల సమూహాన్ని చంపును?)

3. కిం కుర్యా త్కాతరో యుద్ధే ?

   (యుద్ధంలో పిరికివాడు ఏమి చేస్తాడు?)


ఈ ప్రశ్నలకు సమాధానం - మృగా త్సింహ: పలాయతే


1. కస్తూరీ జాయతే కస్మాత్?

   (కస్తూరి దేన్నుండి పట్టును?)

    -   మృగాత్(మృగము)

    కస్తూరి మృగము నుండి పుట్టును

2. కో హన్తి కరిణాం కులమ్?

   (ఏది ఏనుగుల సమూహాన్ని చంపును?)

   - సింహ:(సింహము)

   సింహము ఏనుగుల కులాన్ని చంపుతుంది

3. కిం కుర్యా త్కాతరో యుద్ధే ?

     (యుద్ధంలో పిరికివాడు ఏమి చేస్తాడు?)

     - పలాయతే (పారిపోతాడు)

     పిరికివాడు యుద్ధంలో పారిపోతాడు.

అగ్రహారము

 🚩అగ్రహారము!

#అగ్రహారము బ్రాహ్మణులు నివసించే వీధి లేదా గ్రామం.

అగ్రహారం అన్న పేరున్న గ్రామంలో పూర్వం వంశపారంపర్యంగా

 బ్రాహ్మణులే వ్యవసాయభూములకు అధిపతులుగా ఉండడం గమనించవచ్చు. అగ్రహారాన్ని సంపన్నులు లేదా పరిపాలకులు బ్రాహ్మణులకు దానమిచ్చేవారు. అగ్రహారాన్ని రాజులు దానం చేసేప్పుడు ఆయా భూములపై పూర్తిగా పన్ను లేకుండా కానీ, కొంత పన్ను మినహాయింపుతో కానీ ఇవ్వడం కద్దు.

సర్వాగ్రహారము అంటే పూర్తిగా పన్ను లేకుండా ఇచ్చిన గ్రామం.

శ్రోత్రియాగ్రహారము అనేది విద్యల కోసం ఇచ్చిన గ్రామం.

జోడి అగ్రహారము, లేదా బిల్మకా అగ్రగారము లేదా, కట్టుబడి అగ్రహారము రాబడిని బట్టి హెచ్చుతగ్గులతో ఉండే అద్దెకు ఇచ్చిన గ్రామం.

అగ్రహారికుడు అంటే అగ్రహారానికి చెందిన బ్రాహ్మణుడు.

పన్ను రాయితీతో గానీ, పన్ను లేకుండా గానీ ఉన్న గ్రామభూములు కలవాడిని అగ్రహారమనుభవించేవాడు అంటారు.

ఈ అగ్రహారములకు ఎ విధమైన బాధ కలుగకుండగ చేసి రాజులు వానికి సర్వస్వతంత్రములను కల్పించెడివారు. వీనిపై ఏవిధమైన పన్నులను విధింపబడకుండినవి. ఇందలి భూమిపై వచ్చు ధాన్యమంతయూ అగ్రహారీకులదే. రాజకీయోద్యోగులకు ఇందు ప్రవేశము లేకుండెడిది. అందలి పండితులను అన్యాపేక్షలేక సర్వకార్యములను నిర్వహించుకొనుచుండిరి. ఇటులన్నివిధములను నేటి విశ్వవిద్యాలయములను మించిన స్వాతంత్ర్యము కలిగి ఈ అగ్రహారములు అనన్య దృష్టితో వైదిక విద్యను వ్యాపింపజేయుచుండిరి.

With the courtesy of SRI VINJAMURI VENKATA APPAARAO GARU..

Former Delhi Chief Minister Sheila Dikshit died

 Former Delhi Chief Minister Sheila Dikshit died due to daughter's (love) jihad, devious son-in-law looting everything and running away with niece!!*

 *****

 * All Hindus and their daughters of India who are associated with BJP or so called secular parties, must read this article so that something can be learned from the life of Sheila Dikshit.

 *****

 In her last days, Sheila Dikshit was deeply hurt and upset by the deceit and betrayal meted out to her daughter Latika's Muslim husband, Mohammad Imran, who took the money and wealth of both mother and daughter, leaving Latika and ran away with her niece.  Then she became very worried and depressed about the future of her daughter Latika.*

 * Sheila Dixit's daughter Latika married Imran Mohammad in 1996, who ran away after 20 years in 2016 by taking all his money, land and house fraudulently in his name.  In the year 2016, Imran was also arrested on Latika's FIR.  Latika alleged that Imran has a relationship with another woman, that is why he beats her up.  This is a matter of concern for any mother and in old age the attachment towards children and money increases a lot.

 * According to the discussion in the political corridors of Delhi, the account of Sheila Dikshit's lifetime earnings was kept by her Muslim son-in-law, taking all the money, leaving Sheela's daughter and running away with her niece.  The matter went to the police, but due to the threat of blackmailing by the Muslim son-in-law to reveal the secret of earnings, Sheila Dixit thought it right to remain silent.

 Now you can understand that leaving someone's daughter and taking a young niece, a Muslim son-in-law should run away, even if he takes away his life's earnings from above, then no matter how powerful the victim is, he will be badly hurt.  And the tension will also come.  Being so hurt and depressed is the house of great illness.  This disease became the cause of Sheila Dikshit's death.

 * The first foolishness was done by a Hindu Brahmin but Congress's secular powerful Chief Minister Sheila Dikshit's daughter Latika by blindly trusting a jihadi in marriage, the second foolishness was done by experienced Chief Minister mother Sheela by blindly trusting Muslim son-in-law and handing over her earnings account  And the third biggest foolishness was committed by Sheela's niece on sister's unfaithful Muslim husband by running away with him in complete blindness.  What will happen if all this doesn't happen to blind people like this?*

 From this very serious incident, all the Sanatan brothers, their families and daughters should learn how a Muslim by betraying a very powerful family destroyed and corrupted their identity in love-jihad.  Keep them at home and not for the ghat!*

 * * The biggest unfortunate aspect and experience of this incident is that when a small Muslim with such a big conspiracy even with the mighty Chief Minister of a state, his daughter and niece, destroying his life, his personal, spiritual,  Family, social, political prestige is tarnished, yet he and his party and friendly leaders cannot do anything against him, then what will a common man be able to do?!!*

 *((((All of you are requested to send this message to all groups. Make each Hindu and their girls aware of the horrors and consequences of secularism, (love) jihad.)))


 https://indianexpress.com/article/india/india-news-india/former-delhi-cm-sheila-dikshits-son-in-law-denied-bail-by-delhi-court-4382476/

ప్రయాణం చాలా చిన్నది.

 *జీవితమనే మన ఈ ప్రయాణం చాలా చిన్నది.*


ఒక వృద్ధమహిళ బస్సులో ఎక్కి కూర్చుంది. తరువాతి స్టాప్ వద్ద, tv ఒక బలమైన, క్రోధస్వభావం గల యువతి పైకి ఎక్కి, వృద్ధురాలి పక్కన కూర్చుని, ఆమెను తన సంచులతో కొట్టినంత పని చేసింది. 


వృద్ధురాలు మౌనంగా ఉండిపోవడాన్ని చూసిన యువతి తన సంచులు  తగిలినందుకు కోపం  రాలేదా అని అడిగింది.?


వృద్ధ మహిళ ఒక చిరునవ్వుతో ఇలా సమాధానమిచ్చింది: లేదు,  *ఎందుకంటె ఈ మన యాత్ర చాలా చిన్నది.* కాబట్టి, నేను తరువాతి స్టాప్‌లో దిగబోతున్నాను కాబట్టి, అసభ్యంగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు.


ఈ సమాధానం బంగారు అక్షరాలతో వ్రాయడానికి అర్హమైనది: "అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు. *ఎందుకంటె ఈ మన యాత్ర చాలా చిన్నది.*


ఈ ప్రపంచంలో మనముండే సమయం చాలా తక్కువ అని మనలో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి.  *పనికిరాని వాదనలు, అసూయ, ఇతరులను క్షమించకపోవడం, అసంతృప్తి* మరియు చెడువైఖరి ద్వారా సమయం మరియు శక్తి హాస్యాస్పదంగా వృధా అవుతాయి.


మీ హృదయాన్ని ఎవరైనా విచ్ఛిన్నం చేశారా?  ప్రశాంతంగా ఉండు. "అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు. *ఎందుకంటె ఈ మన యాత్ర చాలా చిన్నది.*


ఎవరైనా మీకు ద్రోహం చేశారా, బెదిరించారా, మోసం చేశారా లేదా అవమానించారా?  విశ్రాంతి తీసుకోండి. ఒత్తిడి కి గురికావొద్దు."అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు. *ఎందుకంటె ఈ మన యాత్ర చాలా చిన్నది.*


కారణం లేకుండా ఎవరైనా మిమ్మల్ని అవమానించారా?  దాన్ని వదిలేయండి. దాన్ని విస్మరించండి. "అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు. *ఎందుకంటె ఈ మన యాత్ర చాలా చిన్నది.*


మీకు నచ్చని ఒక పొరుగువాడు వ్యాఖ్యానించాడా? గట్టిగా ఊపిరి తీసుకో. అతన్ని / ఆమెను విస్మరించండి.  మన్నించి మరచిపోండి.  "అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు. *ఎందుకంటె ఈ మన యాత్ర చాలా చిన్నది.*


ఎవరైనా మనకు ఏదైనా సమస్య కలగచేసినా,"అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు. *ఎందుకంటె ఈ మన యాత్ర చాలా చిన్నది.*


ఈ మన యాత్ర యొక్క పొడవు ఎవరికీ తెలియదు.  దాని స్టాప్ ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు.  "అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు. *ఎందుకంటె ఈ మన యాత్ర చాలా చిన్నది.*


స్నేహితులు మరియు కుటుంబ సభ్యులను అభినందిద్దాం.

మనం గౌరవంగా, దయగా, క్షమించేలా ఉందాం.

తద్వారా, మనం కృతజ్ఞత మరియు ఆనందంతో నిండిపోతాము. చివరికి గుర్తుంచుకోవాల్సింది. "అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు. *ఎందుకంటె ఈ మన యాత్ర చాలా చిన్నది.*


మీ చిరునవ్వును అందరితో వెంటనే పంచుకోండి. "అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు. *ఎందుకంటె ఈ మన యాత్ర చాలా చిన్నది.*


*ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియదు.. ఇది మున్నాళ్ళ ముచ్చటే.. విర్రవీగనవసరం లేదు.

*సర్వేజనాస్సుఖినో భవంతు🙏

four types of intelligence:

 According to psychologists, there are four types of intelligence: 


1) Intelligence Quotient (IQ)

2) Emotional  Quotient (EQ)

3) Social Quotient (SQ)

4) Adversity Quotient (AQ)


1. Intelligence Quotient (IQ): this is the measure of your comprehension ability- to solve maths; memorize things and recall subject matters.


2. Emotional Quotient (EQ): this is the measure of your ability to maintain peace with others; keep to time; be responsible; be honest; respect boundaries; be humble, genuine and considerate.


3. Social Quotient (SQ): 

This is the measure of your ability  to build a network of friends and maintain it over a long period of time.


People that have higher EQ and SQ tend to go farther in life than those with high IQ but low EQ and SQ. Most schools capitalize in improving IQ level while EQ and SQ are played down.


A man of high IQ can end up being employed by a man of high EQ and SQ even though he has an average IQ.


Your EQ represents your character; your SQ represents your charisma. Give in to habits that will improve these three Qs but more especially your EQ and SQ.


EQ and SQ make one manage better than the other. 


Pls don't teach children only to have higher IQ , but also to have higher EQ and SQ.


Now there is a 4th one :

A new paradigm


4. The Adversity Quotient (AQ): 

The measure of your ability to  go through a rough patch in life and come out without losing your mind.


AQ determines who will give up in face of troubles and may abandon their families. 

In the current context of Corona, many professionally successful people are going thru bouts of Depression. Because they haven't seen and thus are unprepared for Adversity.


To parents:

Expose children to other areas of life than academic. They should adore manual work, sport and art .


Develop their EQ, SQ and AQ. They should become multifaceted human beings able to do things independently of the parents.


Finally, do not prepare the road for the children. Prepare the children for the road.

భగవంతుని కి కృతజ్ఞత

 ,


                 *_నేటిమాట_*

03rd July, 2021       

_*మనం అనుభవిస్తున్న అదృష్టానికి - భగవంతుని కి కృతజ్ఞత ఎందుకు తెలపాలి???*_

నీకున్న ఉద్యోగ అర్హతలే ఇతరులకూ ఉన్నాయి, అయితే నీకు ఉద్యోగము వచ్చింది....!

ఇతరులకు రాలేదు....! *కృతజ్ఞత కలిగి ఉండు.*


నీవు చేసిన ఏ ప్రార్థనకైతే దేవుడు జవాబిచ్చాడో...

అదే ప్రార్థన అనేకులు ఇంకా చేస్తూనే ఉన్నారు.....!

జవాబు రాలేదు....! *కృతజ్ఞత కలిగి ఉండు*


ఏ దారిలో అయితే నీవు ప్రతిరోజూ క్షేమంగా ప్రయాణం చేస్తున్నావో.... అదే దారిలో...అనేకులు మరణించారు...!

*కృతజ్ఞత కలిగి ఉండు.*


 ఏ స్థలంలో అయితే దేవుడు 

నిన్ను దీవించాడో, అక్కడే... అనేకులు దేవున్ని పూజిస్తూనే ఉన్నారు, ఇంకా దీవెన రాలేదు..!

*కృతజ్ఞత కలిగి ఉండు*


ఆసుపత్రిలో  ఏ పడక  మీద ఉండి నీవు బాగుపడి ఇంటికెళ్ళావో......

అదే పడకపై ఉండి అనేకులు మరణించారు....!

*కృతజ్ఞత కలిగి ఉండు*


ఏ వర్షమైతే నీ పొలానికి మంచి 

పంటలనిచ్చిందో...అదే వర్షం, ఇతరుల  పొలాలను నాశనం చేసింది...

*కృతజ్ఞత కలిగి ఉండు.*


*కృతజ్ఞత  కలిగి ఉండు...*

ఎందుకంటే నీవేదైతే కలిగి ఉన్నావో

 అది *నీ శక్తి* కాదు,

*నీ బలం* కాదు,

*నీ అర్హతలు* కాదు....

*కేవలం దేవుని అనుగ్రహం* అని గుర్తుంచుకో...


నీకు కలిగిన ప్రతీది ఇచ్చేవాడు *ఆయనే.*

ప్రతీ విషయంలో *దేవునికి* కృతజ్ఞత కలిగి ఉండండి...


నీకు ఏదైనా సమయం లో సాయం చేసిన వారికి కృతజ్ఞతలు చెప్పడం మరిచిపోకు...


కృతజ్ఞత ఆశించడం వాళ్ళ తప్పు కాదో తెలియదు కానీ చెప్పడం మాత్రం నీ బాధ్యత విజ్ఞత... 


*ఒక్కసారి ఆలోచించు...*

కోట్లు సంపాదించే వాళ్లు మన వాళ్ళు ఎక్కడ ఉన్నా , నీకు నెలకు ఎన్ని పైసలు పంపినా, పక్కన (గంజి) నీళ్లు అందించే వాడే గొప్పోడు....


అందుకనే అప్పుడప్పుడు "మనీ"తో కాకుండా "మనిషి"తో కూడా మాట్లాడుతుండడం మంచిది...

చెప్పలేం ఏ అవసరం ఎలా వస్తుందో.! 

ఎన్ని కోట్లు ఉన్నా ఎప్పుడు ఎవరి సాయం తీసుకోవలసి వస్తుందో ఎవరికీ తెలియదు..


                            *_🌸శుభమస్తు🌸_*

                   🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

వృద్ధుడు

 ♥️♥️  వృద్ధుడు  ♥️♥️

----------------------------------------

 వృద్ధుడు మూలన పడేస్తే వ్యర్తుడు.

ముంగిట్లో కూచోబెడితే ఇంటిని కాచే ఈశ్వరుడు.

బతుకు బాటలో గతుకుల్ని ముందుగా హెచ్చరించి కాపాడే సిద్ధుడు.

వృద్దులు సారధులైతే యువకులు విజయులవు తారు.

అనుభవాల గనులు. ఆపాత బంగారాలు.

వదిలేస్తే వృద్ధుడు మంచానికి బద్ధుడు.

చేయూతనిస్తే ప్రతి వృద్ధుడు ఒకబుద్ధుడు.

నిర్లక్ష్యంగా చూస్తే కేవలం మూడుకాళ్ళముసలివాడు.

తగిన గుర్తింపునిస్తే విజయాన్ని చ్చే త్రివిక్రముడు.

నాటిబాలుడే నేటి వృద్ధుడు తనని పట్టించుకోనున్న నువ్వు పచ్చగా ఉండాలని పరితపించే ఉదాత్తుడు.

పలకరిస్తే చాలు పాలకడలిలా పొంగే పసివాడు.

పైపైన చూస్తే జుట్టు తెల్లబడిన ఫలితకేషాలవాడు.

అంతర్గతంగా తలపండిన పండితుడు.

                               "విష్ణు "

పురాకృతం...చివరి భాగం*

 *పురాకృతం...చివరి భాగం*


   కాశీలో శివుడు అక్కడ చనిపోయిన వాళ్లకు వెంటనే ముక్తిని ప్రసాదిస్తానని వరం అనుగ్ర హించాడు.  కాశీ  క్షేత్రపాలకుడైన కాలభైరవుడి ని  శివుడు ఆ ప్రాంతంలో చనిపోయిన వాళ్ళను ఆట్టే బాధపెట్టకుండా వాళ్ల  పాప ఫలం పూర్తి చేసి తన వద్దకు తీసుకు రమ్మని చెప్పాడట. బాధపడకుండా పాప ఫలం పోయేది ఎలాగా. అన్ని మతాలలో కూడా భగవంతుడు కరుణా మయుడు భగవంతుడి ముందు మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడి క్షమాపణ చెప్పి శరణాగతి వేడిన వాడిని క్షమిస్తాడు అంటారు. అలా చేస్తే చేసిన పాపాలకు  ఫలం అనుభవించనక్కరలేదా  అనే ప్రశ్న వస్తుంది. అప్పుడుకూడా అనుభ వించాలిసిందే. తప్పదు.  భగవంతుడు కరుణిస్తే ఆ పాప ఫలం ఎలా వెళ్ళిపోతుందో అర్థం చేసు కోవడానికి ఈ ఉదాహరణను గమనించాలి.

 

Inter పరీక్ష ఒక 100 మంది రాశారు అనుకుందాం. అందులో దాదాపు 20 మంది పరీక్ష తప్పుతారు. ఒక 70 మంది 35 నుంచి 59 మార్కులు తెచ్చుకుంటారు. పదిమంది ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతారు అనుకుందాము. తప్పిన వాళ్లలో 16 మంది ఏడుస్తూ అవమానంతో ఇంట్లో కూర్చుంటారు.  ఇద్దరు అవమానం భరించలేక ఇంట్లో నుంచి పారిపోతారు. ఒకడు ఆత్మహత్య కూడా చేసుకుంటాడు. మొత్తం 20 మందిలో మిగిలిన వజ్రపు తునక బంగారు కొండ ఒకడుంటాడు. వాడు సూటిగా కాలేజీ ఫస్ట్ వచ్చిన పిల్లవాడి దగ్గరికి పోయి నువ్వు కాలేజీ ఫస్ట్ వచ్చావు కాబట్టి పార్టీ ఇస్తావా ఇవ్వవా అని పీడించి వాడి డబ్బులతో వాడితో పాటు హోటలుకు సినిమాకు కూడా పోతాడు. వాడి అమ్మా నాన్నా బాధపడతారేమో. వాడు మాత్రం హాయిగా ఉంటాడు. 


ఇప్పుడు చూడండి పరీక్ష తప్పడం అందరికీ ఒకటే శిక్ష. అది ప్రారబ్దం. దానికి ఎవరు ఎట్లా బాధపడ్డారు అనేది వాళ్ళ మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది. కష్టం వచ్చినప్పుడు యోగీ సంసారీ ఒకే లాగా స్పందించరు. శారీరిక బాధలకు కూడా రమణ మహర్షి శంకరా చార్యులు అందరి లాగా బాధ పడలేదు కదా. కష్టాలు బాధ పెట్టవు. వాటికి మనం స్పందించే తీరులో బాధ ఉంటుంది. బాధ మనసుకే కానీ శరీరానికి కాదు కదా. 


స్థల పురాణం ప్రకారం కాశీలో మరణించిన వాళ్లకు కాలభైరవుడు కౌన్సిలింగ్ ఇచ్చి కష్టాలకు బాధలకు చలించ కుండా మానసిక స్థైర్యం కల్పించి ప్రారబ్దాన్ని పూర్తి చేయిస్తాడు. అది కూడా,  అతి తక్కువ కాలంలోనే. భగవంతుడు కాల స్వరూపుడు. కాలం మీద ఆయనకు పూర్తి అధికారం ఉంటుంది.  కాశీ  గడియారం (local time) ప్రకారం పది నిమిషాలు గడిచే లోపల మన గడియారం ప్రకారం 10 జన్మలు పూర్తవుతాయి. తక్కువ కాలంలో అన్ని శిక్షలు అనుభవిస్తాము. కానీ ఆ సినిమాకు వెళ్ళిన పిల్లవాడి లాగా సుఖంగా అనుభవిస్తాము. 


మనం ఏ రూపంలో భగవంతుడి ని పూజిస్తే ఆయన ఆ రూపంలోనే కాలభైరవుడు చేసే పనినే ఎక్కడైనా ఎప్పుడైనా చేసి చూపిస్తాడు. భగవంతుడు సర్వసమర్ధుడు అనినమ్మకం ఉండాలి. పాపాత్ములను క్షమించడానికి ఉద్ధరించడానికి భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు అని గ్రహించి చేసిన వాటికి క్షమాపణలు చెప్పుకుని మళ్లీ పొరపాట్లు చేయకుండా... వైరాగ్యంతో జ్ఞాన, భక్తి, కర్మ మార్గాలలో ప్రయాణం చేసి భవబంధాల నుంచి బయట పడాలి.


*అంతే కానీ కష్టాలు వచ్చినప్పుడల్లా మనం మతం మార్చుకుంటూ పోతే... పూర్వ జన్మ కర్మ మనల్ని వదిలిపెట్టి పోదు.... మన తోపాటు ప్రారబ్దం కూడా ఆ మతం లోకి కూడా వెంట వస్తుంది...తస్మాత్ జాగ్రత్త!!*


*పవని నాగ ప్రదీప్*

పూర్ణం గూర్చి వేదం వివరణ

 ౦ పూర్ణం గూర్చి  వేదం వివరణ. పూర్ణాత్ పూర్ణమిదం....జీవ మనుగడ కూడా. ఆక్సిజన్ సమస్త జగత్తుకు మూలం. యిది ప్రాణ వాయువు. పంచభూతాత్మమకమైన జగత్తుకు మూలం. దీనికి కూడా చాలా ఉపాదులు కలవు. వృక్షములు, అగ్ని రూపంలో గల సూర్య శక్తి వలననే నీరు. నీరు కూడా జీవ మనుగడకు మూలం. నిప్పు, నీరు రెండును దేహమునకు మూలము. యింత అనంతమైన జీవ రాశికి ఆక్సిజన్ ప్రకృతి పరంగా మాత్రమే తప్ప కృత్తిమంగా తయారు చేయలేదు శాస్తీయవిఙ్ఞానం.వకవేళ తయారు చేసినా దానికి మూలమైన ప్రకృతిని  నాశనం చేసి చెయ్యాలి. ప్రకృతిని ఆరాధన చేయుట మనిషి ఆవిర్భావం నుండి మూల సూత్రంగా తెలిసియున్నది. ప్రాణవాయువును మనకు మనమే శుద్ది చేయుట ప్రకృతి నుండి నేర్చుకోవాలి.అది ఆది అంతము లేనిది. అది ప్రాణం. వాయురూపంలో.అది అందరికీ తెలిసిన సత్యమే. అందుకు వృక్ష సంపద యే మూలం. మనకు అడ్డుగాయున్నాయని దేనినైనా నాశనం చేయు ప్రవృతి రాక్షస లక్షణము. మన కోరికలకు ప్రకృతిని నాశనం చేయుట కూడా అంతే. ప్రకృతిని ఆరాధనయే దైవారాధన.మనిషి పుట్టుకకు ముందే మానవ జీవనమునకు కావలసినవి సృష్టించుట జరిగినది. అవి పుట్టిన తరువాత అనుభవిస్తున్నారు. సృష్టించిన కర్తలు కృతఙ్ఞతలు కలిగియుండుచయే మానవ ధర్మం.అందుకు విరుద్దంగా నడుచుట అధర్మం రాక్షస ప్రవృత్తి. అందుకు మనకన్నా అవి అన్నియు ముందే సృష్టి జరిగినవి. కావున వాటిని గౌరవించదగినవి. కృతజ్ఞతతో చూడబడింది. ఏ మతం గాని ఏదైవంగానీ ప్రకృతిని జయించుట అనగా దాని పట్ల కృతఙ్ఞతలు చూపుటయే దైవం. ముఖ్యంగా మనిషి ఎలా జీవించాలో నేర్పినది వేదం.అనగా అది వివరించినది అవగాహన చేసుకొని తెలుట ఙ్ఞానం. అనగా సృష్టి జరగక ముందే వీటి క్రియేటివిటీకి సంబంధించిన మూల సూత్రములు విశ్వ వ్యాప్తమై యున్నవి. అఙ్ఞానంవలన వలన మనం సృష్టి చేసేము అనుకుంటున్నాను. యిప్పటికి చాలా విషయములు ప్రకృతికి సంబంధించిన వస్తువులలో చాలా భాగం మూల బీజ లక్షణములు ప్రకృతి పరంగా శాస్త్ర పరంగా తెలియదు.అయినప్పటికీ వాటిని అనుభవిస్తూనే వుండుట మాన జీవనంలో భాగమై యున్నవి. నిత్య జీవితంలో మన నడక ప్రతీదీ వక ఉపనిషత్ సారమే. వేద సారమే ప్రతీ చర్య, నడక కూడా.చర్యకు ప్రతి చర్య వుండుట సత్యం. లేనియెడల చర్య అసత్యం. చర్య లేదని వప్పుకొనుట అఙ్ఞానంవలన. ఎందుకంటే అది ఎవరో వకరి వల్ల ప్రేరేపిత మైనది. దీనినే *ప్రేరేయత్ తస్యయత్  భర్గ తత్ వరేణ్యం ఉపాస్మహే.అది నువ్వే కావచ్చు ప్రధాన సూత్ర ధారుడువి.ఏదైతే మన చర్య వలన తెలియుచున్నదో దానినే మనం ఉపాసన చేయుట. అది ఏదైనా కానీ. అనంతమైన ఙ్ఞానం తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూనే వుందాం.

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*శ్రీ స్వామివారు..శ్రీ సాయిబాబా విగ్రహం..*


1996వ సంవత్సరం లో అమ్మా నాన్న గార్లు శిరిడీ వెళ్ళిరావాలని నిర్ణయించుకున్నారు..అంతవరకూ వాళ్ళు ఎన్నడూ శిరిడీ వెళ్ళివుండలేదు..తమతో పాటు తమకు తోడుగా రమ్మని నాన్నగారు నన్ను అడిగారు..సరే నని చెప్పి మా ఆవిడనూ పిల్లలనూ కూడా తీసుకొని శిరిడీ కి బైలుదేరాము..మాకూ అదే మొదటిసారి శిరిడీ ప్రయాణం..ఈ శిరిడీ ప్రయాణానికి ఒక ప్రత్యేకత ఉన్నది..శ్రీ సాయిబాబా చరిత్రను మా అమ్మ నిర్మల ప్రభావతి గారు వ్రాద్దామని నిర్ణయించుకున్నారు..అందుకు ముందుగా శిరిడీ వెళ్లి, శ్రీ సాయినాథుని దర్శనం చేసుకొని..ఆ సాయిబాబా ఆశీస్సులు పొందాలనీ..శ్రీ సాయిబాబా నడయాడిన శిరిడీ క్షేత్రాన్ని చూసిరావాలనీ..ఒక బలమైన కోరిక ఆవిడ మనసులో కలిగింది..ప్రయాణపు ఏర్పాట్లు చేసుకొని..అందరమూ ఒంగోలు నుంచి రైల్లో బైలుదేరాము..


శిరిడీ లో రెండురోజుల పాటు వున్నాము..శ్రీ సాయి సమాధి ని దర్శించి తరించాము..అమ్మ మనసులో శ్రీ సాయి చరిత్ర "శ్రీ శిరిడీ సాయినాథ భాగవతము" అనే పేరుతో రూపుదిద్దుకున్నది..తిరుగు ప్రయాణం నాటికి ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన తుఫాన్ కారణంగా మేమిక్కిన రైలు ఒంగోలు రాకుండా..తిరుపతి మీదుగా వెళ్లే ఏర్పాటు చేసినందున.. మేము తిరుపతి లో ఆగిపోవాల్సివచ్చింది..ఎలాగూ తిరుపతి వచ్చాము కదా అని ఆ వేంకటేశ్వరుడి దర్శనం కూడా చేసేసుకున్నాము..అలా యాత్ర ముగించుకొని మొగలిచెర్ల చేరాము..


మా చిన్నాన్న గారు శ్రీ పవని శ్రీనాథరావు గారు శ్రీ సాయిబాబాకు  భక్తులు..ఆయన నాన్నగారిని కలిసి..

"అన్నయ్యా..మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిర ప్రాంగణంలో.. శ్రీ సాయిబాబా మందిరం కట్టిద్దాము..చిన్నదైనా పర్వాలేదు..అందుకు నేను సహకారం అందిస్తాను..శ్రీ సాయిబాబా కూడా అవధూత కదా.." అన్నారు..అమ్మా నాన్న ఇద్దరూ సరే నన్నారు..శ్రీ స్వామివారి మందిర ప్రాంగణం లోనే నైరుతీ మూల శ్రీ సాయిబాబా మందిరం నిర్మించాలని నిర్ణయించారు..అనుకున్న విధంగానే నిర్మాణం జరిగిపోతున్నది..


శ్రీ సాయిబాబా విగ్రహం రెండు అడుగుల ఎత్తున ఉండేది కావాలని..జైపూర్ వద్ద మంచి విగ్రహాలు దొరుకుతాయనీ..నన్ను వెళ్లి తీసుకురమ్మని చెప్పారు..ముందుగా మొగలిచెర్ల కు వచ్చి..శ్రీ స్వామివారి సమాధి వద్ద నమస్కారం చేసుకున్నాను..జైపూర్ చేరుకున్నాను..జైపూర్ చేరిన తరువాత తెలిసింది..ఇప్పటికిప్పుడు విగ్రహం కావాలంటే దొరకదు..ముందుగా ఆర్డర్ ఇచ్చి..కొన్నాళ్ల తరువాత తయారైన విగ్రహాన్ని తీసుకొని రావాలని చెప్పారు..మాక్రానా లో విచారించాను..అదే చెప్పారు..ఎలా చెయ్యాలా అని ఆలోచిస్తూ..జైపూర్ లో ఆరోజు ఆగిపోయాను..


ఆరోజు రాత్రి.."స్వామీ దత్తాత్రేయా నీదే భారం.." అనుకున్నాను


ప్రక్కరోజు ఉదయం నేను బస చేస్తున్న హోటల్ కు దగ్గరలోనే.."మూర్తియోంకా బజార్" అని వున్నదని.. అక్కడ కూడా విగ్రహాలు వుంటాయని..హోటల్ తాలూకు మేనేజర్ నాతో చెప్పాడు..చెప్పడమే కాదు..నన్ను ఆటోలో ఎక్కించుకొని..ఆ ప్రదేశం లో దించి వెళ్ళాడు..ఇది నేను ఊహించలేదు..ఆ వీధి లో చాలా మంది శిల్పులు విగ్రహాలు చెక్కుతున్నారు..రకరకాల దేవీ దేవతల విగ్రహాలు తయారవుతూ ఉన్నాయి..


"విగ్రహం బాగుంది కానీ..మనం అడిగింది మూడు అడుగుల ఎత్తు కదా?..ఇది రెండు అడుగులే ఉన్నది.." అని తెలుగులో మాటలు వినిపించాయి..చివ్వున ప్రక్కకు చూసాను..ఇద్దరు మాట్లాడుకుంటున్నారు..నన్ను నేను పరిచయం చేసుకొని..విషయం అడిగాను..వాళ్ళు కూడా శ్రీ సాయిబాబా విగ్రహం కొరకు ఇంతకుముందు వచ్చి ఆర్డర్ ఇచ్చివున్నారట..కాకుంటే వీళ్ళు చెప్పింది మూడడుగుల ఎత్తు..వాళ్ళు చేసింది రెండు అడుగుల ఎత్తు..చక్కటి బాబా విగ్రహం..చిరునవ్వుతో నన్నే చూస్తున్నట్లు అనిపించింది..వాళ్ళను అడిగాను..సంతోషంగా ఒప్పుకున్నారు..ధర కూడా మాట్లాడారు..మరో రెండు గంటల్లో శ్రీ సాయిబాబా విగ్రహం రవాణాకు సిద్ధం చేశారు..అంతా కలలా జరిగిపోయింది..ఆ దత్తాత్రేయుడే దగ్గరుండి చేయించాడేమో అనుకున్నాను..


1997వ సంవత్సరం డిసెంబర్ నెలలో మొగలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరం ప్రాంగణం లో శ్రీ శిరిడీ సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠ కన్నుల పండుగలా జరిగింది..


(మాతల్లిదండ్రులు శిరిడీ కి వెళ్లడం అదే మొదటిసారి..చివరి సారి కూడా..అలాగే మా దంపతులము మరలా 2019 జూలై వరకూ దాదాపు 23 సంవత్సరాల కాలంపాటు శిరిడీ వెళ్లే అవకాశం కలుగలేదు..ఎప్పుడైనా ఒక్కసారి శిరిడీ వెళ్లాలని నిర్ణయించుకున్నా..ఆరోజుకు మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరం లో అత్యవసర పని ఏర్పడి..అక్కడే గడపాల్సి వస్తుంది..మావరకూ అన్ని దత్తక్షేత్రాలూ ఇక్కడే..శ్రీ స్వామివారి సన్నిధి లోనే ఉన్నాయనే భావన బలంగా మనసులో నాటుకుపోయింది..)


మరో అనుభూతి తో రేపు కలుద్దాము..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్:523114..సెల్..94402 66380 & 99089 73699).