3, జులై 2021, శనివారం

వృద్ధుడు

 ♥️♥️  వృద్ధుడు  ♥️♥️

----------------------------------------

 వృద్ధుడు మూలన పడేస్తే వ్యర్తుడు.

ముంగిట్లో కూచోబెడితే ఇంటిని కాచే ఈశ్వరుడు.

బతుకు బాటలో గతుకుల్ని ముందుగా హెచ్చరించి కాపాడే సిద్ధుడు.

వృద్దులు సారధులైతే యువకులు విజయులవు తారు.

అనుభవాల గనులు. ఆపాత బంగారాలు.

వదిలేస్తే వృద్ధుడు మంచానికి బద్ధుడు.

చేయూతనిస్తే ప్రతి వృద్ధుడు ఒకబుద్ధుడు.

నిర్లక్ష్యంగా చూస్తే కేవలం మూడుకాళ్ళముసలివాడు.

తగిన గుర్తింపునిస్తే విజయాన్ని చ్చే త్రివిక్రముడు.

నాటిబాలుడే నేటి వృద్ధుడు తనని పట్టించుకోనున్న నువ్వు పచ్చగా ఉండాలని పరితపించే ఉదాత్తుడు.

పలకరిస్తే చాలు పాలకడలిలా పొంగే పసివాడు.

పైపైన చూస్తే జుట్టు తెల్లబడిన ఫలితకేషాలవాడు.

అంతర్గతంగా తలపండిన పండితుడు.

                               "విష్ణు "

కామెంట్‌లు లేవు: