ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
30, సెప్టెంబర్ 2024, సోమవారం
పద్యసౌరభం
.
*పద్యసౌరభం*
సీ॥
మదిలోన దలబోసి మమతనంతయు గూర్చి
లేఖినిం గదిలించ లేమవోలె
పదముల నొయ్యార ముదయించ నడయాడు
ప్రాసలు శ్లేషల పరిహసించు
యమకగమకవృత్తి యాశ్చర్యముల జూప
నుపమాదు లర్థాల నూరడించు
సౌందర్యమును జూపు ఛందాల నందమౌ
సరససాహిత్యాన సరసమాడు
తే॥గీ॥
హృద్యవిన్యాసమాకన్యకిష్టసఖియ
అర్థసంపద శబ్దాల నాడి పాడు
భట్టుమూర్తికి గుట్టుగా పట్టిబడిన
పద్య మెంచగ సాధ్యమ్మె? పండితులకు
*~శ్రీశర్మద*
శ్రీ పరబ్రహ్మ ఆలయం
🕉 *మన గుడి : నెం 456*
⚜ *కేరళ : పదనిలం : అలెప్పి*
⚜ * శ్రీ పరబ్రహ్మ ఆలయం*
💠 పదనిలం పరబ్రహ్మ దేవాలయం ( పటనిలం పరబ్రహ్మ క్షేత్రం ) భారతదేశంలోని కేరళలోని అలప్పుజా జిల్లాలోని మావేలికర తాలూకాలోని పదనిలం వద్ద ఉంది .
ఇది పూర్వపు ట్రావెన్‌కోర్ రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలలో ఒకటి .
పదనిలం నూరనాడ్ ప్రాంతంలోని సాంస్కృతిక కేంద్రం .
ఈ ఆలయం ఓంకారం అని కూడా పిలువబడే భగవంతుడు పరబ్రహ్మకు అంకితం చేయబడింది .
💠 పదనిలం ఆలయం స్వయంభూ అని నమ్ముతారు. దాని అసలు చరిత్ర మరియు అక్కడ ఆరాధన ఎలా మొదలైందన్న వాస్తవాలు తెలియవు.
💠 పొరుగు రాజుల దాడి నుండి రాజ్యాన్ని రక్షించడం కోసం కాయంకుళం రాజ్యానికి చెందిన సైనిక దళాలు ఆలయానికి సమీపంలోనే విడిది చేశాయని నమ్ముతారు.
ఆ కాలంలో, గ్రామంలో కొంతమంది నాయకులు మరియు వారి మద్దతుదారులు ఉన్నారు. వారిలో నూరుకోడి ఉన్నితాన్లు, కడక్కల్ కురుప్పన్లు, వెట్టతాసన్లు మరియు వెట్టడికల్ కురుప్పన్లు ఉన్నారు.
💠 కాయంకులం రాజా నాలుగు శతాబ్దాల క్రితం తన సైన్యాన్ని ఉపసంహరించుకున్నాడు. దీంతో గ్రామంపై ఆధిపత్యం కోసం పెద్దల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఆ విధంగా వారు యుద్ధం ప్రారంభించి దక్షిణ మరియు ఉత్తరంగా విభజించబడ్డారు.
దక్షిణం వైపు నూరుకోడి కరుప్పన్లు మరియు కడకల్ కురుప్పన్లు ఉన్నారు. అవతలి వైపు వెట్టతాసన్లు మరియు వెట్టడికల్ కురుప్పన్లు ఉన్నారు. ఇరవై రెండు కారకల్లు తమ తమ పక్షాలకు మద్దతు ఇచ్చారు. ఆ యుద్ధంలో ఇరువైపులా అనేక మంది సైనికులు పెద్దఎత్తున మరణించారు. వాటిని ఆలయ సమీపంలో పాతిపెట్టారు .
💠 శివరాత్రి :
ఆలయంలో ప్రధాన పండుగ.
స్థానికంగా కెట్టుకలా అని పిలువబడే ఎద్దుల పెద్ద దిష్టిబొమ్మలను ఆలయంలోని 15 భూభాగాల నుండి ఆలయానికి లాగుతారు . వీటిలో కొన్ని 50 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు కలిగి ఉంటాయి.
కేరళలో జరిగే అతి పెద్ద పండుగలలో ఇది ఒకటి .
💠 నూరనాడ్ ప్రాంతంలో చాలా మంది వ్యక్తులు ఈ భారీ దిష్టిబొమ్మల తయారీలో నిమగ్నమై ఉన్నారు.
ఈ గ్రామాన్ని సాంస్కృతిక ప్రాధాన్యత దృష్ట్యా నందికేశ గ్రామంగా గుర్తించాలని కేరళ ప్రభుత్వం ముందు ప్రతిపాదన ఉంది .
శివరాత్రి రోజు ఉదయం సుబ్రహ్మణ్య స్వామికి కావడియట్టం చూసేందుకు వేలాది మంది ఆలయానికి వస్తారు . అన్ని ప్రాంతాల నుండి కావడి విడివిడిగా వచ్చి ఆలయంలో కలుస్తారు.
💠 కెత్తుల్సవం పండుగలో అత్యంత అద్భుతమైన దృశ్యం మరియు సాయంత్రం జరుగుతుంది. గ్రామంలోని ప్రత్యేక ప్రాంతాల నుండి కెత్తుల్సవం సాయంత్రం 4 గంటలకు ఆలయానికి వస్తారు, పూజలు మరియు కార్యక్రమాలు అర్ధరాత్రి మాత్రమే ముగుస్తాయి.
🔆 *ఆలయ ప్రత్యేకతలు*
💠 హిందూయేతరులు ఆలయంలోకి ప్రవేశించడానికి అనుమతించబడతారు మరియు శివరాత్రి కెట్టుకజ్చాతో సహా ఆలయానికి సంబంధించిన అన్ని వేడుకల్లో కూడా పాల్గొనవచ్చు. మత ఐక్యత పదనిలం యొక్క ట్రేడ్‌మార్క్ మరియు ఇది భారతదేశ నిజమైన సంస్కృతిని సమర్థిస్తుంది .
💠 గంధపు చెక్కకు బదులుగా విభూతి (పవిత్ర బూడిద) భక్తులకు ఇవ్వబడుతుంది .
ఆలయంలో సరైన విగ్రహం లేదు.
ఓం యొక్క రాతి చిత్రం మాత్రమే మరియు చెట్ల ఆకులతో ఏర్పడిన సహజ పైకప్పు క్రింద ఉంచబడుతుంది.
వృశ్చికమాసంలో మొదటి 12 రోజులు పరబ్రహ్మ భగవానుని భజన చేయడానికి భక్తులు ఆలయ ప్రాంగణంలో బస చేయవచ్చు.
ఈ ప్రయోజనం కోసం ఆలయ ఆవరణలో ప్రత్యేక గుడిసెలు తయారు చేస్తారు మరియు భక్తులు ఈ రోజుల్లో పవిత్ర జీవితాన్ని గడుపుతారు. గుడిసెల సంఖ్య ఏడాదికేడాది పెరిగిపోతోంది.
💠 ఈ ఆలయం శబరిమల ధర్మ శాస్తా ఆలయంలోని ఇడతావళంలో ఒకటి.
ఈ ఆలయం వివిధ ప్రాంతాల నుండి వచ్చే అయ్యప్ప భక్తులకు విశ్రాంతి స్థలాన్ని అందిస్తుంది.
అనేక పంబ ప్రత్యేక సర్వీసు బస్సులు పదనిలం మీదుగా ప్రయాణిస్తున్నాయి.
శబరిమల భక్తులకు ఆలయ అధికార యంత్రాంగం ఎండిన అల్లం కాఫీ మరియు తేలికపాటి ఆహారాన్ని అందిస్తోంది .
💠 ఆలయంలోని ఇతర పండుగలు:
వృశ్చిక మహోత్సవం, ఇది మలయాళ నెల వృశ్చికం మొదటి 12 రోజులలో జరుపుకుంటారు .
పండుగ ముగింపు రోజును పంత్రాండ్ విలక్ అంటారు .
ప్రతి సంవత్సరం వృశ్చిక మహోత్సవం సందర్భంగా, ఆలయ నిర్వాహకులు వారి వారి రంగాలలో చేసిన కృషికి ప్రముఖ వ్యక్తులకు పరబ్రహ్మ చైతన్య అవార్డును అందజేస్తారు.
💠 ఈ ఆలయంలో అనేక వివాహాలు కూడా జరుగుతాయి, ఎందుకంటే ఈ ఆలయంలో వివాహం శుభప్రదంగా పరిగణించబడుతుంది.
💠 కాయంకుళం మరియు పందళం పట్టణాల నుండి ప్రైవేట్ మరియు KSRTC బస్సులు ఉన్నాయి .
ఈ ఆలయం కాయంకుళానికి తూర్పున 17 కి.మీ మరియు పందళానికి నైరుతి దిశలో 7 కి.మీ దూరంలో ఉంది
గీత జయంతి
ఓం నమో వెంకటేశాయ డిసెంబర్ 11 గీత జయంతి ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో నిర్వహించే భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలు :
ఈ సంవత్సరం శ్రీమద్ భగవద్గీత ఆత్మ సంయమ యోగం, 6వ అధ్యాయం పై పోటీలు నిర్వహింపబడును. అదేవిధంగా 18 అధ్యాయాలు పూర్తిగా వచ్చిన వారికి కూడా పోటీలు నిర్వహించబడును.
1. 6వ అధ్యాయం: ఆత్మ సంయమ యోగం పోటీలు
6, 7 మొదటి గ్రూపు గాను
8, 9 రెండవ గ్రూపు గాను విభజించి 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగం పై పోటీలు నిర్వహించబడును.
2. అదేవిధంగా 18 అధ్యాయాలు 700 శ్లోకాలు పోటీలు
6 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల లోపు వారికి మూడవ గ్రూపుగా,
18 సంవత్సరాలు వయసు దాటి ఉన్నవారు నాలుగో గ్రూపుగా విభజించి పోటీలు నిర్వహించబడును.
అందరికి కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ లు ఇవ్వబడును. కావున తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం నేర్పించి పోటీలలో పాల్గొనే విధంగా తయారు చేయగలరు అని కోరుకుంటున్నాము.
ఇట్లు
Cvk ప్రసాద్
టిటిడి, కార్యక్రమ నిర్వహకులు
ఉమ్మడి కృష్ణా జిల్లా
ప్రదోష వేళ శివ పూజా
*ప్రదోష వేళ శివ పూజా మహిమ*
*ప్రదోష కాలం లో చేయు శివ పూజ శివుడికి ఇష్టమైనది ..ఇది త్వరితగతిన శివానుగ్రహము కలిగిస్తుంది.*
ప్రదోష వేళలో సకల దేవతలు తమ పరివారం తో కైలాసం చేరి నన్దికేశ చండికేశ ప్రమద గణాలతో చేసే ఆనంద తాండవంను తన్మయత్వంతో అనుభవిస్తారు
సూర్యాస్తమయం నుంచి 2 గంటల 24 నిమిషాల సమయాన్ని ప్రదోష కాలం అని కొందరు, సూర్యాస్తమయమయ్యాక మూడు గడియలు "ప్రదోషోరజనీముఖమ్" రాత్రికి ఆరంభ కాలమే ఈ ప్రదోష సమయం అని కొందరు.ప్రదోష సమయం ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది.
ప్రదోషమంటే అది ఒక కాల విశేషము. ప్రదోషమంటే పాప నిర్మూలన అని అర్థము. ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయములో చంద్రుడి కదలికల వలన ఏర్పడునది ప్రదోషము. అనగా, చంద్రుడి గతి వలన, ఏర్పడే తిథుల సంధులలో సూర్యాస్తమయము అయితే, అప్పుడు ప్రదోషము అంటారు. కాబట్టి ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయమునకు తిథి మారితే, అప్పుడు ప్రదోషము కలిగే అవకాశము ఉంది.
త్రయోదశినాడు కలిగే ప్రదోషాన్ని ’మహా ప్రదోషం’ అంటారు.
మనము రోజూ ఎన్నో పాపకర్మలు చేస్తుంటాము. వాటి ఫలము వలన మనకు మనమే కొన్ని ప్రతిబంధకాలను తెచ్చుకుని, మన పురోభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిమితం చేసుకుంటున్నాము. మన పాపకర్మ ఫలమును నిర్జీవం చేయాలంటే, దానికి తగ్గ పుణ్య కర్మలు చేయాలి. ఈ త్రయోదశీ ప్రదోషము మనకు దేవుడిచ్చిన వరము.
ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో రెండు రూపాల్ని ప్రదర్శిస్తూ ఎడమభాగాన పార్వతి రెండవ భాగమున పరమేశ్వరరూపంగా "అర్థనారీశ్వరుడుగా" దర్శనమిచ్చేకాలం
ఈ ప్రదోషకాలం అని చెప్పబడినది.
పరమ శివుడు సదా ప్రదోషకాలంలో, హిమాలయాలలో, కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాలలో నాట్యం చేస్తూ ఉంటాడు.ఆనందముగ ఉన్నప్పుడు మాత్రమే కాదు దుష్ట సంహారం చేసేటప్పుడు కూడా స్వామి నాట్యం చేస్తు ఉంటాడు అనేది విదితం. గజాసురుణ్ణి సంహారించేటప్పుడు,అంధకాసుర సంహారంలోను శివుడు చేసిన నృత్యం భైరవరూపంలో మహా భయంకరంగా ఉంటుంది. నిరాకారంలో ఉన్న శివుడు ఆనందంకోసం రూపాన్ని ధరించి ఆనంద తాండవ నృత్యం చేస్తాడని నృత్తరత్నావళి ద్వారా మనకు తెలుస్తోంది.
త్రయోదశి ఆదివారం వస్తే రవి ప్రదోషం అని,త్రయోదశి సోమవారమొస్తే దాన్ని సోమప్రదోషమనీ, త్రయోదశి మంగళవారం వస్తే భూమ ప్రదోషమని, త్రయోదశి బుధవారం వస్తే బుధ ప్రదోషమని, త్రయోదశి గురువారం వస్తే గురు ప్రదోషమని, త్రయోదశి శుక్రవారం వస్తే శుక్ర ప్రదోషమని, త్రయోదశి శనివారమొస్తే దాన్ని శని త్రయోదశి అనీ,శని ప్రదోషమని పిలుస్తారు. అన్ని త్రయోదశులలోనూ శివపూజ తప్పనిసరి.
ప్రదోష సమయం రోజు వస్తున్న త్రయోదశి నాడు వచ్చే ప్రదోష సమయం చాలా పవిత్రమైనది.ఈ సమయంలో ప్రదోష వ్రతాన్ని ఆచరించి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి శివారాధన చేస్తూ శివునికి అభిషేకాలు చేస్తే చాలా మంచిది. త్రయోదశి వ్రతాన్ని ప్రదోష వ్రతం అని అంటారు. ప్రతినెలలో వచ్చే రెండు త్రయోదశుల్లోనూ.. (శుక్లపక్ష, కృష్ణపక్ష త్రయోదశులు) త్రయోదశి వ్రతం చేయాలి. శుక్లపక్ష సోమవారం నాడు, లేదా బహుళపక్ష శనివారం నాడు త్రయోదశి కలసివచ్చినప్పుడు గనుక త్రయోదశి వ్రతం చేస్తే ఫలితం మరీ విశేషంగా ఉంటుంది. ప్రదోష కాలంలో ఈశ్వరుని ఆలయంలో జరిగే అభిషేకాలను దర్శించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. ముఖ్యంగా ఈశ్వరునికి జరిగే అభిషేకంతో పాటు నందీశ్వరునికి జరిగే అభిషేకాన్ని వీక్షించే భక్తులకు పుణ్యఫలం సిద్ధిస్తుందని నమ్మకం. శనివారం నాడు ప్రదోష సమయాన శివ ఆరాధన చేసినట్లయితే కర్మ దోషాలు తొలగి సుఖశాంతులు పొందవచ్చును. శని కర్మకారకుడు, శివుడు సంహార కారకుడు కావున శని ప్రదోష సమయాన శివారాధన చేయడం ఉత్తమం.
శివప్రదోష స్తోత్రము:-
కైలాస శైల భవనేత్రిజగజ్జనిత్రీం
గౌరీం నివేశ్య కనకాంచిత రత్నపీఠే
నృత్యం విధాతు మభివాంఛతి శూలపాణౌ
దేవాః ప్రదోష సమయేను భజంతి సర్వే
వాగ్దేవీ ధృతవల్లకీ శతమభోవేణుందధత్పద్మజః
తాలో న్నిద్రకరో, రమా భగవతీ గేయ ప్రయోషాడ్వితా
విష్ణుస్సాంద్ర మృదంగ వాదనపటుర్దేవాస్సమం తాత్‌స్ఖితా
సేవంతే తమనుప్రదోష సమయే దేవంమృడానీపతిమ్
గంధర్వ యక్ష పతగోరగ సిద్ధ సాధ్య
విద్యాధరామర వరాప్సర సాంగణాశ్చ
యేన్యే త్రిలోక నిలయాస్సహభూతవర్గాః
ప్రాప్తే ప్రదోష సమయే హరపార్శ్వసంస్థాః
హర హర మహాదేవ
*🚩 డైలీ విష్ 🚩*
ఆధ్యాత్మికం ఆనందం
సరదాగా
🔔 *సరదాగా* 🔔
*వాకింగ్ లో రకాలు*
1. డాక్టర్ నుండి వార్నింగ్ రాక ముందే ఉదయాన్నే చేసే నడకను "మార్నింగ్ వాక్" అంటారు.
2. డాక్టర్ నుండి వార్నింగ్ వచ్చిన తర్వాత ఉదయాన్నే చేసే నడకను "వార్నింగ్ వాక్" అంటారు.
౩. వేరే వాళ్ళ ఆరోగ్యం, ఫిట్నెస్ చూసి చేసే నడకను "బర్నింగ్ వాక్" అంటారు.
4. ప్రకృతి సౌందర్యం (కాలనీ లోని అందాలను) చూడటానికి చేసే నడకను "స్టేరింగ్ వాక్" అంటారు.
5. ఉదయాన్నే భార్య/భర్త తో కలిసి చేసే నడకను "డార్లింగ్ వాక్" అంటారు.
6. ఎవరెవరు వచ్చారో దిక్కులు చూస్తూ చేసే నడకని "టర్నింగ్ వాక్" అంటారు.
7. రోడ్డు మీద ఏం వస్తున్నా చూసుకోకుండా నడవటాన్ని ''మర్''_నింగ్ వాక్ అంటారు.
8. ఉదయాన్నే నడకకని బయటపడి నడవకుండా ఎవరితోన్నా సోదేసుకుని తిరిగిరావటాన్ని "షో వాక్" అంటారు.
9. "డ్రీమ్ వాకర్" అంటే ఎలా ఉంటాడో తెలుసా నడవాలి అనుకుంటాడు, కానీ మంచం దిగడు.
🙏🏻🙏🏻🙏🏻🙂🙂🙂🙏🏻🙏🏻🙏🏻
ఆత్మహత్యలు కులాన్నే నాశనం చేస్తాయా?
*ఆత్మహత్యలు కులాన్నే నాశనం చేస్తాయా?*
*అక్టోబర్ 1 చతుర్దశి ఆత్మహత్యలు, హత్యల్లో చనిపోయినవారి ప్రత్యేకరోజు!*
*ఇది చదవక పోతే మీరు జీవితంలోనే పెద్దతప్పు చేసినట్టే!!!*
------------------------------------------
‘‘పిల్లనిచ్చేటప్పుడు, తెచ్చుకునేటప్పుడు వారి వంశంలో ఎవరైనా ఆత్మహత్యలు చేసుకున్నవారున్నారా? అని తెలుసుకోవాలి. అటువంటి మరణాలుంటే, అలా ఆత్మహత్యలు చేసుకున్న రక్తసంబంధీకులున్నా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆసంబంధాలు చేసుకోకూడదు. ఇది పురాణాలే కాదు ఆధునిక వైద్యులు కూడా అంగీకరించిన సత్యం.‘‘ అని గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్యగారు మహాముఖ్యమైన పెళ్ళిసంబంధాల్లో పాటించిన సూత్రం.
---------------------------------------------------
మేము పూర్వాశ్రమంలో పాత్రికేయవృత్తిలో ఉండగా ఒక వైద్య పరిశోధనా వివరాలు మమ్మల్ని చాలా ఆశ్చర్యపరిచాయి. దాదాపు దశాబ్దం క్రితం (2011లో) న్యూరోసైకోఫార్మకోలజీ అంతర్జాతీయ పత్రికలో ప్రచురితం అయిన ఈ పరిశోధనా వివరాలు విదేశీ వార్తా సంస్థలు నివేదించాయి. ఈ పరిశోధన సారాంశం ఏమంటే ఆత్మహత్యలు వంశపారంపర్యంగా సంక్రమిస్తాయని వార్త. ఇది మమ్మల్ని ఎంతో ఆశ్చర్యపరచడమే కాకుండా గురుదేవుల వాణి గుర్తుకు వచ్చి భారతీయ ధర్మశాస్త్రాలపై మమకారం పెరిగింది. మహాలయపక్షాల సందర్భంగా ఈ వివరాలు తెలుసుకుందాం.
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాదీ కనీసం పది లక్షలకు పైగా ఆత్మహత్యల వలన చనిపోతున్నారని 2011 లెక్కల ప్రకారం తెలుస్తోంది. ఈ సంఖ్యలో ఆత్మహత్యలకు ప్రయత్నించి చావు తప్పించుకున్నవారిని చేర్చలేదు. అది కోట్లలో ఉంటుంది. ప్రపంచంలో వివిధ కారణాలతో చనిపోయిన జాబితాలో ఆత్మహత్యలు 10 స్థానంలో ఉన్నాయి.
అమెరికా, ఇంగ్లాండు వంటి అగ్రరాజ్యాలకు ఏ సమస్యాలేదు. వారికి ఉన్నది ఆత్మహత్యలే ప్రధాన సమస్య. కనుకనే ఇంగ్లండులో వీథికి నలుగురు మానసిక వైద్యులు ఉంటారని అతిశయోక్తిగా చెబుతారు.
నిజానికి పుస్తకాలు చదవడం అడుగంటుతున్న కాలంలో చిన్నపిల్లల చేత వారి బరువు కన్నా బరువైన నవల పరంపర చదివించిన జె కె రోలింగ్ కూడా ఆత్మహత్యా ప్రయత్న బాధితురాలే. కొన్ని కారణాల వలన ఆమె మానసిక వ్యాకులతకు లోనై ఆత్మహత్య ఆలోచనలకు లోనయ్యాయని తానే స్వయంగా ఒక ఇంటర్వూలో చెప్పింది. అయితే ఒక మానసిక వైద్య నిపుణుల చికిత్స వలన బయటపడి చరిత్రలో నిలిచిపోయే జానపద నవలలు వ్రాసింది.
మొత్తం 3,352 మందిపై అధ్యయనం చేశారు వీరిలో 1,202 మంది వంశానుగతంగా ఆత్మహత్యచేసుకున్నవారి వారసులున్నారు. ఈ అంతర్జాతీయ పరిశోధనా వివరాల ప్రకారం ఆత్మహత్యలు అనేక కారణాల వలన చేసుకుంటారు. అయితే ఇది వంశానుగతంగా కూడా వస్తూ ఉంటుంది. అంటే ఎవరైనా ఒక వంశంలో ఆత్మహత్య చేసుకుంటే ఆ వంశంలోని వారు ఆత్మహత్యలు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని బట్టీ ఆ వంశంలోని వారంతా ఆత్మహత్యలు చేసుకుంటారని కాదు. కేవలం ఆ వంశంవారికి ఆత్మహత్యల వలన ప్రమాదం చాలా ఎక్కువగా పొంచి ఉందని అర్థం.
ఇది వైద్యశాస్త్ర పరిశోధనల్లో నిరూపణ కావడమే కాకుండా వ్యక్తుల్లో ఆత్మహత్యలకు ప్రేరేపించే జన్యువును కూడా గుర్తించడం జరిగింది. సాధారణంగా ఆత్మహత్యలకు చుట్టుపక్కల వాతావరణం, తాగుడు మత్తుమందులు వంటి కొన్ని అలవాట్లు వంటివి ప్రధాన కారణాలు. ఇవే కాకుండా మీడియా కూడా ప్రధాన కారణం.
అమెరికా మీద అల్ ఖైదా దాడి చేసి జంటభవనాలను కూల్చివేసినప్పుడు 100 అంతస్తులపై నుంచీ కొందరు దూకేశారు. వారు భూమిని చేరేలోపలే చనిపోవడం అటుంచి, ఆ దృశ్యాలను పదేపదే చూపవద్దని అక్కడి మానసికవైద్యులు కోరడంతో నిలిపివేశారు. అయితే మన దౌర్భాగ్య మీడియాలకు ఒక నీతి నియమం లేని కారణం చేత పదేపదే ఆత్మహత్య వార్తలను చూపిస్తూ ఉంటుంది. అంతేకాక ఆత్మహత్య బెదిరింపు వార్తలు కూడా ప్రముఖంగా చూపిస్తుంది. జవాబుదారీతనం లేని మీడియా దివాలా కోరుతనానికి ఇది నిదర్శనం.
ఆత్మహత్య చేసుకున్నవారున్న వంశాలను గురుదేవులు వేదపురాణస్మృతుల ఆధారాలతో హెచ్చరించడానికి ప్రబలమైన కారణాలున్నాయి.
ఆత్మహత్య చేసుకున్నవారు అరవై వేల సంవత్సరాలు వెలుగు లేని చీకటి కూపంలో పడిపోతారు. అందులో రక్తం చీము సముద్రాలు ఉంటాయి.
ఎవరైనా బంధువులు ఆత్మహత్య చేసుకుంటే వారి మృతికి అశౌచం పట్టవలసిన అవసరలేదు. ఏ విధమైన మైల రాదు. స్నానం కూడా చేయాల్సిన అవసరం లేదు. ఆత్మహత్య చేసుకున్నవారికి అంత్యేష్టి అనే పెద్దదినకర్మలు ఉండవు. ఊరవతలకు ఈడ్చుకుపోయి దహనం చేయడమే, అది కూడా ఎందుకు అంటే శవం వాసన వస్తుంది కనుక చేయడమే. అంతకు మించి మరేమీ కాదు. ఆత్మహత్య చేసుకున్నవారికి ఏ విధమైన ధర్మోదకాలు బంధువులు ఇవ్వాల్సిన అవసరం లేదు. కనీసం కన్నీరు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు.
మహాఘోరమైన అంశమేంటే ఆత్మహత్య చేసుకున్నవారి శవాన్ని మోసినవారు, దహనం చేసినవారు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఆ ప్రాయశ్చిత్తం మహోఘోరమైన తప్తకృచ్చవ్రతం ఆచరించాలి. శవంతో పాటు నాలుగు అడుగులు వేసినవారు కూడా ఇదే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి.
ప్రాయశ్చిత్తంలో మూడు రోజులు నీటిని మాత్రమే భోజనం చేయాలి. తరువతి మూడు రోజులు పాలు, తరువాతి మూడురోజులు పెరుగు, ఆ తరువాత మూడు రోజులు గాలి మాత్రమే తినాలి. ఈ విధంగా ఆత్మహత్య చేసుకున్నవారి శవాన్ని తాకినా, దహనం చేసినా, కలిసి నడిచినా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి.
మానవ జన్మ ఎత్తిన తరువాత సహజ మరణం ద్వారా మాత్రమే దేహాన్ని వదిలిపెట్టాలి. అయితే కొన్ని దుర్మరణాలు, అకాల మరణాలు సంభవించడం, ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం శాస్త్రం వ్యతిరేకించలేదు. ఇలా అర్థాంతరంగా తనువు చాలించిన వారికి ప్రాయశ్చిత్తం చెప్పి వారికి ఉత్తమ గతులు కలిగేందుకు నారాయణ బలి వంటివి చెప్పింది. అయితే ఆత్మహత్య మాత్రం మహాపాపంగా వేద, పురాణాదులు స్పష్టంగా చెప్పాయి.
సహజంగా మరణించినవారు, దుర్మరణాల్లో మరణించినవారు సపిండీకరణకర్మల ద్వారా దేవత్వాన్ని పొందుతారు. అయితే ఆత్మహత్య చేసుకున్నవారు మాత్రం శాశ్వత ప్రేతత్వం పొందుతారు. ఎందుకంటే వారికి ఏ విధమైన పూర్వ ఉత్తర క్రియలు ఉండవు. శవం ఎక్కువ సేపు ఉంటే వాసన వస్తుంది కనుక మరుభూమికి తీసుకుపోయి దహనం చేయడం మాత్రమే ఉంది. ఇంతకు మించి వారికి ఏ విధమైన సంస్కారాలు ఉండవు. శాస్త్రాలు స్పష్టంగా వీరికి పిండప్రదాన, తిలతర్పణాలు ఉండవు అని చెప్పింది.
అయితే, ఈ విధంగా ప్రేతత్వం పొందిన వారు తమ రక్తసంబంధీకుల ఇంటి చూర్లు పట్టుకొని వేళ్ళాడుతూ ఉంటారు. వీరు ప్రేతత్వ బాధలు భరించలేక తమ వంశస్తులు నాశనం కావాలని శాపాలు పెడుతూ ఉంటారు. కనుక ఒకరు ఆత్మహత్య చేసుకుంటే వారి ప్రేతత్వం వంశానికి పరిసమాప్తి కలిగినా శాంతించదు.
ఇటువంటి పెను ప్రమాదం ఆత్మహత్యల వల్ల కలుగుతోంది కనుకనే పితృకార్యాల్లో కొన్ని సడలింపులు ఇచ్చాయి. ఆత్మహత్యలు చేసుకున్నవారి శోకతీవ్రత తగ్గడానికి జ్యోతిర్లింగ క్షేత్రాలు, బీహారు గయ, పాద గయ (పిఠాపురం), పంచారామాలు, కురుక్షేత్రం వంటి దివ్య స్థలాల్లో పితృపక్షాల్లో నారాయణ బలి వంటివి చేయమని సూచిస్తారు. గయలో కూప శ్రాద్ధం చేస్తారు. అంటే అందరి పిండాలనూ గదాధరుని పాదాలపై ఉంచితే, ఈ విధంగా మరణించిన పాతకుల పిండాలు బావిలో పారేస్తారు. అయితే దీని వలన సంపూర్తి ప్రాయశ్చిత్తం జరుగదు. కేవలం కొంత ఉపశమనం మాత్రమే కలుగుతుంది. ఈ విధంగా ఆత్మహత్యలు చేసుకున్నవారు వంశంలో ఉంటే ఆ వంశంలోని వారు అంతా షణ్ణవతుల్లో, ముఖ్యంగా పితృపక్షాల్లో మిగిలిన పితృదేవతలను అర్చించి వారి ఆశీర్వాదాలు పొంది తీరాలి.
ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన అంశం ఇదే.
లక్షలాది యుగాల క్రితం వేదం నుంచీ పుట్టిన కర్మకాండప్రక్రియల్లో ఆత్మహత్యల గురించి చెప్పింది నేడు ఆధునిక వైద్యశాస్త్రం సమర్థించడం. ఆత్మహత్యలు వంశపారంపర్యంగా సంభవించే అవకాశం ఉందని నిరూపించడం.
కనుకనే ధర్మశాస్త్రాలు ఇటువంటి వాటి పరిహారాల కోసం పితృదేవతల ఋణాన్ని తీర్చుకోవాలని మొట్టమొదట చెప్పింది. దీని వల్ల ఉపశమనాలు కలుగుతాయి. ఆత్మహత్య చేసుకున్నవారు బ్రతికున్న తమ వంశం వారినే కాకుండా, చనిపోయిన తమ తాతముత్తాలను కూడా నాశనం చేస్తారు. వారికున్న దేవత్వాన్ని చెరుపుతారు. ఇటువంటి భయంకరమైన పితృసంక్రమణమైన దోషాలు పోయి బ్రతికి బట్టకట్టడానికి ఏడాదిలోని 360 రోజుల్లో 100 రోజులు పెద్దలకోసం కేటాయించాలి. ఇది నేడు సాధ్యపడదు కనుకనే గోసేవను గురుదేవులు సూచించారు.
ఆత్మహత్యలు చేసుకున్నవారిని పూర్వకర్మలు నిషేధిస్తే ఆ వంశాలను కేవలం గోవులే కాపాడగలవు. అవి సాక్షాత్తూ వేద స్వరూపాలు. ముక్కోటి దేవతల జీవరూపం. కనుక మహాపాతకమైన పాపమరణం పొందినవారు, అకాల మృత్యువులు పొందినవారు, వంశంలో పూర్వకార్యాలు చేసే పిల్లాపాపలు లేకుండాపోయినవారు ఉపశమించడానికి గోసేవ చేయాలి. ఇటువంటి వారి నుంచీ వచ్చే పితృదోషాలు, శాపాల నుంచీ సంసారాన్ని కాపాడుకోవాలంటే ప్రత్యక్షంగా గోసేవ చేయాలి.
మామూలు రోజుల్లో చేసినా, చేయకున్నా మహాలయాల్లో చేసే పిండోదకాలు, తిలతర్పణాలు, బ్రాహ్మణులకు కనీసం స్వయంపాకదానం, అథమపక్షంలో ఆవుకు గ్రాసం వేయడం అపరమితంగా మేలు చేస్తుంది. కనుక పౌర్ణమి నుంచీ అమావాస్య వరకూ వీటిని నిర్వహించాలి.
పితృదేవతార్చనలకు పరమావధి గోసేవ కనుక గురుదేవులు పితృగోసాధనను ఉపదేశించారు. ఈ రోజుల్లో మాతా పితృ సురభీ స్వధా స్తోత్రాలు చదువుకొని గోమతీ విద్యను అభ్యసించాలి. రెండు పూట్లా గోమతీ విద్యను చదువుకొని చేతనైనంత గోసేవను చేయాలి. ఈ స్తోత్రాలు 7842224469కి వాట్సప్ చేసి పొందవచ్చు.
ప్రత్యక్షంగా వీటిని చేయలేని వారు మాతా పితృ సురభీ స్వధా స్తోత్రాలు పఠించి, కారుణ్యాల జాబితా ప్రకారం పెద్దల పేర్లు గోత్రాలు చదువుకొని వారికి నమస్కారం చేసుకోండి. ఇప్పటికే ఈ స్తోత్రపఠనం చేస్తున్నవారు తమ సాధనలో రెండో సోపానంగా గోమతీ విద్యను కూడా ప్రారంభించండి. గోమతీ విద్యను 7842224469కి వాట్సప్ చేసి పొందవచ్చు.
అనంతగోసేవనిధిని ఉపయోగించు కోవాలనుకునే వారు భారత ప్రభుత్వ భీం ఫోన్ ఆప్, మీ బ్యాంకు ఆప్ ల ద్వారా క్రింది వాటిని ఉపయోగించి పంపవచ్చు. సామూహికంగా గోగ్రాసం మేము వేస్తాము.
-------------------
సంక్షిప్తంగాః
ఆత్మహత్య చేసుకున్నవారికి సహజమరణం వారి మాదిరి యాతనా శరీరం ఏర్పడి తిలతర్పణ పిండాలు స్వీకరించలేరు. కేవలం గాలి రూపంలో ఉండిపోతారు. ప్రేతపిశాచరూపంతో ఆకలిదప్పికలు తట్టుకోలేక తమ వారి రక్తమాంసాలు హరించి నాశనం చేస్తారు. వీరిని కాపాడేదే కేవలం గోమాత మాత్రమే, ఆత్మహత్యలు చేసుకున్నవారు వంశంలో ఉంటే ప్రతీరోజు వారి పేరుమీద గోసేవ చేస్తే ఆవుల అనుగ్రహం వలన కొంత శాంతి ఉంటుంది.
నారాయణ బలి వంటివి చేస్తే తరువాత తరాలకు పిండార్హత కలుగుతుంది. అంతకు ముందుతరాల పిండస్థానం నాశనం కాదు. అంతేకానీ ఆత్మహత్యలవారికి స్వర్గం లభించదు. భూమి ఉన్నంత వరకూ వారు చింతచెట్టుమీద వేళ్ళాడుతూ ఉండాల్సిందే.
=====
తిలతర్పణాల ఏర్పాట్లు ఉపయోగించుకోండి!!!
దోషాలు కష్టాలు దుఃఖాలు తొలగించే గజచ్ఛాయాయోగం రెండుసార్లు వస్తోంది!
శ్రీక్రోధి నామ సంవత్సర పితృపక్షోత్సవాల సందర్భంగా అనంతసాహితి ఈ ఏడాది కూడా తిలతర్పణాల ఏర్పాట్లు చేయబోతోంది. దీనిని అంతా సద్వినియోగం చేసుకోవాలని ఆహ్వానిస్తోంది. శ్రీక్రోధి విశేషంగా రెండు గజచ్ఛాయా యోగాలను తీసుకువచ్చింది. అందులో ఒకటి సెప్టెంబర్ 30 కాగా మరొకటి అక్టోబర్ 2వ తేదీని వస్తోంది. అక్టోబర్ 2న అమావాస్య కావడం విశేషం కాగా సెప్టెంబర్ 30 పితరులకు ఇష్టమైన మఘా నక్షత్రం ఉంది. ఈ శుభసందర్భాలను పురస్కరించుకొని పితృదేవతార్చనా ప్రచారంలో భాగంగా తిలతర్పణాలను ఏర్పాటు చేస్తున్నాము. ఇందులో ఈ విధంగా పాల్గొనవచ్చు.
1) ప్రత్యక్షంగా పాల్గొనడం: హైదరాబాద్ లో ఉన్నవారు తమ పెద్దలకు తిలతర్పణాలు, బ్రాహ్మణులకు స్వయంపాకం ( బియ్యాలు), యతీశ్వరభిక్ష, గోసేవ చేయదలిస్తే వచ్చి స్వయంగా పాల్గొనవచ్చు. అమావాస్యనాడు సామూహిక, వ్యక్తిగతగోదానంలో ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు.
2) అప్రత్యక్షంగా: హైదరాబాద్ లో లేనివారు , ప్రత్యక్షంగా రాలేని వారికి తమకు బదులుగా ఇక్కడ ఏర్పాటు చేసినవారు తిలతర్పణాలు ఇస్తారు. బ్రాహ్మణ, యతీశ్వర భిక్షలు గోసేవ వారి పేర్లపై చేయడం జరుగుతుంది. అంతేకాక, సామూహిక గోదానం, వ్యక్తిగత గోదానం కూడా వారిపేర్లపై అప్రత్యక్షంగా జరుగుతుంది.
3) అమావాస్య నాడు గోదానం: గజచ్ఛాయాయోగాన్ని పురస్కరించుకొని గోదానంలో ప్రత్యక్షంగా లేదా అప్రత్యక్షంగా పాల్గొనవచ్చు.
ఈ అవకాశం ముందుగా నమోదు చేసుకున్నవారికి మాత్రమే. ఇందులో పాల్గొనాలనుకునే వారు తమ గోత్రనామాలు 29 సాయంత్రం 6 లోపల 7842224469కి వాట్సప్ చేసి నమోదు చేసుకోవాలి. అప్రత్యక్షంగా ప్రత్యామ్నాయ వ్యక్తుల చేత చేయించుకునేవారు తమ పెద్దల గోత్రనామాలు 29 లోపల పంపాలి. ముందస్తు నమోదు లేనిచో ఏర్పాట్లు చేయడం కుదరదు. వ్యక్తిగత గోదానంలో ఒక ఆవును వారికి కేటాయించడం జరుగుతుంది. సామూహిక గోదానంలో అందరూ కలసి ఒకే ఆవును దానం చేస్తారు.
దయచేసి అందరూ కార్యుణ్యాల జాబితాను సిద్ధం చేసుకొని రావాలి. ఇది లేకుంటే 7842224469కి వాట్సప్ చేసి పొందవచ్చు.
రావలసిన చిరునామా, సమయం, తీసుకురావలసిన వస్తువుల జాబితా నమోదు అనంతరం పంపుతాము.
ఇది ధర్మప్రచారంలో భాగంగా చేస్తున్నది కనుక తమకు తోచినది అనంతసాహితి విరాళంగా ఇచ్చి పాల్గొనవచ్చు.
తమ విరాళాలు, గోత్రనామాలు ఈ కింది విధంగా పంపంవచ్చు.
మేము నిర్వహిస్తున్న గోసేవానిధికి క్రింది విధంగా పంపవచ్చు. అనంతసాహితి సంస్థ నిర్వహిస్తున్న గోసేవానిధికి గోగ్రాస నిమిత్తం సెల్ ఫోన్ ద్వారా పంపవచ్చు. మేము సామూహికంగా గోగ్రాసం వేస్తాము.భారత ప్రభుత్వ భీం ఫోన్ ఆప్, మీ బ్యాంకు ఆప్ ల ద్వారా క్రింది వాటిని ఉపయోగించి పంపవచ్చు.
for paytm, Phonepay, googlepay, Gpay
9247821505
7842224469
ఈ పితృదేవతా పంచాంగాన్ని ఒక రోజు ముందుగా ఆరోజు విశేషాలతో ఇస్తాము. ప్రతిరోజూ వచ్చే ఈ సమాచారం కోసం మా అనంతసాహితి ప్రచార బృందాల్లో చేరడానికి 7842224469కి వాట్సప్ చేసి వివరాలు పొందండి.
ముఖ్యగమనిక: అనంతసాహితి సాధికార నెంబర్లు ఈ నాలుగు మాత్రమే. (9247821505, 7842224469, 9652224469, 9642224469)వేరు నెంబర్లు మీ దృష్టికి వస్తే దయచేసి మాకు తెలుపప్రార్థన. వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడానికి అనంతసాహితి సర్వసన్నద్ధతతో ఉంది. మీరు గోసేవానిధికి ద్రవ్యం పంపి మాకు 7842224469 వాట్సప్ ద్వారా మీ గోత్రనామాలు తప్పని సరిగా పంపండి.
========================
చతుర్దశి అక్టోబర్ 1 నాడు ఎవరికి చేయాలి?
కరోనా వంటి కారణాలతో అకాలమృత్యువుపొందినవారు, ఎవరైతే అర్థాంతరమృత్యువు పొందారో, వారికి వారు చనిపోయిన తిథిలో పితృపక్షంలో చేయరాదని ఒక ప్రమాణం. అంటే ఆత్మహత్య కాకుండా కర్మాగారంలో, బస్సుల్లో, రైళ్ళలో అగ్నిప్రమాదంలో చనిపోయినవారు, ప్రమాదంలో నీటిలో చనిపోయినవారు, ఎవరి చేతనైనా హత్యకు గురైనవారు, దొంగల చేతిలో చనిపోయినవారు, సామూహిక మారణహోమాల్లో చనిపోయినవారు, పాముకాటు, కొమ్ములపోటుతో, చిరుత వంటి క్రూరజంతువుల వలన చనిపోయినవారు..... ఇటువంటి ఆత్మహత్యేతర కారణాల వల్ల హఠాత్తుగా చనిపోయినవారికి కేవలం చతుర్దశీ తిథి నాడు మాత్రమే చేయాలి. వారు చనిపోయిన తిథిలో చేయరాదు.
ఆత్మహత్యలు చేసుకున్నవారికి:
ఆత్మహత్య చేసుకున్నవారికి కూడా అకస్మాత్తుగా చనిపోయినవారితో చేయవచ్చని కొన్ని గరుడాది పురాణాలు చెబుతున్నాయి. కనుక ఆత్మహత్యలు చేసుకున్న వారికి కూడా చతుర్దశి మంచిదే. పరమేశ్వరుని దయ కలుగాలని ప్రార్థించి వారికి కూడా చేయవచ్చు. నిజానికి ఆత్మహత్య చేసుకున్నవారికి పిండోదకార్హత లేదు. అయితే వారికి మాని వేసినా ప్రమాదమే కనుక నోటితో లేదని చెప్పే బదులు చేతితో చేయడమే. ముట్టేది ముడుతుంది.
ఆత్మహత్యలు చేసుకున్నవారు ఉంటే ఆ కుటుంబం మాత్రమే కాదు, వారి బంధువులు, గోత్రం వారు, కులం వారు కూడా నాశనం అవుతారని అంతా తెలుసుకోవాలి.
=========================
ప్రతీరోజూ ఈ క్రిందినామాలు ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు స్మరించుకోవాలి.
కాశీ కాశీ కాశీ
గంగా గంగా గంగా
తిలాన్ తిలాన్ తిలాన్
స్వధా స్వధా స్వధా
గయా గయా గయా
=============================
శ్లో: గుహనాథా చ గణేశ గౌరీశ
గంగా గో గయా గాయత్రీ పాహి మాం !
గీతా గురుర్దేవ నవమ్భవతి
అనంతరామోక్త ధర్మ సాధనం!!
‘‘ గుహనాథుడైన కుమారస్వామి, గణేశుడు, గౌరీశుడు,గంగాదేవి, గోవులు, గయా క్షేత్రం, గాయత్రీ మంత్రం, భగవద్గీతా, గురుదేవులను నేను శరణువేడుతున్నాను. ఈ 9 గకారాలలో హిందూ ధర్మ సంగ్రహం ఉందని ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్యగారు చెప్పారు. దీన్ని ప్రతి నిత్యం చదువుకొని అర్థం చేసుకొని మనన ధ్యానం చేస్తే హిందూధర్మం అనుభవంలోకి అతి తేలిగ్గా వస్తుంది.‘‘
===========================
ముఖ్యంగా పితృపక్షాల్లో స్వధా నామజపాన్ని ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు చేయాలి. నామజపం చేయడంలో తప్పులేదు. అయితే దాన్ని మంత్రంగా చేయడం వేరు అనే సత్యాన్ని గ్రహించండి. మంత్రాన్ని గురువు నుంచీ పొందితేనే చేయాలి. నామాన్ని తెలిస్తే చాలు ఎవరైనా స్మరించవచ్చు. స్వధా స్తోత్రం, పితృస్తోత్రం, మాతృస్తోత్రం చదువుకోవాలి. ఇవి కావలసిన వారు 7842224469 కు వాట్సప్ మెసేజ్ చేసి పొందవచ్చు.
=====================
స్వామి అనంతానంద భారతి
అనంతసాహిత ఆశ్రమం
*శివ అంటే అర్థం*
🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸
*శివ అంటే అర్థం*
🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸
*శివ అంటే కల్మషం లేని వాడు అని అర్ధం. శివుడు ఆద్యంతాలు లేని వాడు. అతిశయించిన వాడు. రూపాతీతుడు. అందుకే..*
*వందే శంభు ఉమాపతింసురగురుం*
*వందే జగత్కారణం।*
*వందే పన్నగ భూషణం.శశిధరం*
*వందే పశూనాం పతిమ్।*
*వందే సూర్య శశాంక వహ్నినయనం*
*వందే ముకుందప్రియమ్।*
*వందే భక్త జనాశ్రయంచవరదం*
*వందే శివం శంకరమ్..।*
*అని ఆది శంకరుల వారు కీర్తించారు. శివ అంటే కల్మషం లేని వాడు అని అర్ధం. సత్వరజస్తమో గుణములేవీ అంటని వాడు. శివుడు జనన మరణాలకు అతీతుడు.*
*ఓం నమః శివాయ।*
🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸
పురాణేతిహాసాలు
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*పురాణేతిహాసాలు - శ్రవణ ప్రయోజనం*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*ఒక ఊరిలో ఎవరో రామాయణ ప్రవచనం చెప్తున్నారు.*
*ఒక అతను శ్రద్ధగా విని అర్ధరాత్రి ఇంటికి వచ్చాడు.*
*"రామాయణం నీకేం అర్ధమైంది?" అని అడిగింది భార్య....*
*"నాకేం అర్ధం కాలేదు" అన్నాడు అతను.*
*ప్రవచనం జరిగిన పది రోజులూ ఇదే తంతు. ప్రవచనం నుండి రాగానే నీకేమర్ధమయింది అని భార్య అడగడం, నాకేం అర్ధం కాలేదని అతను చెప్పడం. భార్యకి కోపం నషాళానికి అంటింది.*
*ఇదిగో ఆ గుండ్రాయి తీసుకు పోయి దాన్తో నీళ్ళు పట్రా అంది. అతను వెళ్ళి గుండ్రాయిని నీళ్ళల్లో ముంచాడు. గుండ్రాయిలో నీళ్ళు నిలబడవు కదా అలాగే తీసుకొచ్చాడు... భార్య మళ్ళీ తెమ్మంది.... మళ్ళీ వెళ్ళాడు.... అలా పది సార్లు తిప్పింది.*
*చూసావా......ఆ గుండ్రాయితో నీళ్ళు తేలేకపోయావు..... అలాగే పది రోజులు రామాయణం విన్నా నీకు ఏమీ అర్ధం కాలేదు. "నువ్వా గుండ్రాయితో సమానం" అని ఈసడించింది.*
*అప్పుడు అతను అన్నాడు "గుండ్రాయి నీళ్ళు తేలేక పోయిన మాట నిజమే కానీ పదిసార్లు నీళ్ళల్లో మునగడం వల్ల మాలిన్యం అంతా పోయి అది శుభ్రపడింది కదా.....అలాగే రామాయణం నాకేమీ అర్ధం కాకపోయినా పది రోజుల్నుండీ వినడం వల్ల మనసు తేలిక పడ్డట్టు హాయిగా వుంది. మనసు ప్రశాంతంగా వుంది" అన్నాడు.*
*భర్తకి అర్ధం కావల్సిన దానికన్నా ఎక్కువే అర్ధం అయిందని భార్యకి అర్ధం అయింది !*
*నవవిధ భక్తి మార్గాల్లో శ్రవణం ఒకటి...విన్నా చాలు.*
*జై శ్రీరామ్।*
*ఓం నమః శివాయ॥*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
గణపతి జ్ఞానం*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*గణపతి జ్ఞానం*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*"అనుకూలత - ప్రతికూలత" అనేవి కాల లక్షణాలు. ప్రతికూలతను తొలిగించి అనుకూలతను కలిగించే కాలరూప ఈశ్వరచైతన్యమే విఘ్నేశ్వరుడు. మంచి పనులకు విఘ్నాలను తొలగించి, చెడు పనులకు విఘ్నాలను కలిగించే విఘ్న నియామకుడు 'వి-నాయకుడు'.*
*ప్రథమదేవుడు, ప్రధానదేవుడు గణపతి. ఏ కార్యానికైనా - అది భౌతికరంగం కావచ్చు, ఆధ్యాత్మిక సాధన కావచ్చు - వాటి అవరోధాలను తొలగించి సిద్ధినీ, బుద్ధి(సమృద్ధి)నీ ప్రసాదించే దివ్యశక్తినే "గణపతి"గా ఉపాసించడం వేదసంప్రదాయం.*
*శివుడు జ్ఞానమూర్తి - శక్తి ఆనందస్వరూపిణి. జ్ఞానానందాలు విడిగా ఉండవు. ఈ శివశక్తుల ఏకతత్త్వమే గణపతి- అంటే- జ్ఞానానంద సమాహార స్వరూపం. జ్ఞానానంద శక్తి నుండి ఉత్సాహం, కార్యశీలత వంటి దివ్యశక్తులు కలుగుతాయి. ఇవి ఎలాంటి విపరీతాలనైనా తొలగించి, సిద్ధిని ప్రసాదిస్తాయి.*
*కార్యం ప్రారంభించేటప్పుడు భయం, సంశయం, సంకోచం, ఉద్వేగం వంటివి లేకుండా, ఉత్సాహంగా, "తప్పక సిద్ధి లభిస్తుంది" అనే సకారాత్మక భావనతో కూడిన ఆనందాన్ని "ఆమోదం" అనవచ్చు. సిద్ధి కలిగాక లభించే ఆనందాన్ని "ప్రమోదం" అని భావించవచ్చు. ఆనందపు ఈ రెండు భావాలే గణపతి శక్తులు.*
*'పూర్ణ'త్వానికి సంకేతాలుగా మోదకాలు, ఉండ్రాళ్ళు, లడ్డు..వంటివి గణపతికి నైవేద్యాలుగా - ఆయన వలన మనకి ప్రసాదాలుగా లభిస్తాయి. పరిపూర్ణానందతత్త్వమే గణపతి స్వరూపం... ఆ అనుభవమే మనకు ప్రసాదం.*
*వేదాంతపరంగా.. బ్రహ్మజ్ఞానాన్ని గ్రహించకుండా అడ్డుకునే 'వక్ర'మైన మహాశక్తే 'విఘ్నం'. దానిని తొలగించి, తన పరతత్త్వాన్ని ప్రత్యక్షం చేసే విఘ్ననాశకుడు, మాయకి నాయకుడు విఘ్నేశ్వరుడు.*
*శివశక్తుల సమైక్య తత్త్వం, ప్రకృతీ - పురుషుల ఏకత్వం వినాయకముర్తి. శరీరం తల్లి సమకూర్చింది, గజశిరస్సు తండ్రి అమర్చినది. ఈ రెండింటి కూర్పు శివశక్త్యాత్మకం. నరశరీరం జగత్తుకి సంకేతం. గజశిరస్సు పరమేశ్వర తేజస్సుకు ప్రతీక.*
*ప్రపంచంలో శబ్ద, స్పర్శ, రూప, గంధాలను ఇంద్రియ గణాలద్వారా స్వీకరించి, హృదయమనే చిన్న కలుగులో రహస్యంగా అనుభవించే జీవుడే మూషికం. 'ముష్' అనే ధాతువును 'చోరత్వం' అని అర్థం. దీనిని అధిష్ఠించిన మహోన్నత అపరిమిత పరమాత్మ చైతన్యమే - మూషిక వాహనారూఢుఢైన గణపతి.*
*భిన్నత్వంలో ఏకత్వమే గణపతి (గణేశ) తత్త్వం. ఏకం సత్, ఏకం పరబ్రహ్మ, ఏకం దైవత్వం - అని వేదాంతం ప్రవచించినట్లుగా అన్నిటా వ్యాపించిన ఏకచైతన్యమే గణేశుడు. విశ్వమే అనేకగణాలతో కూడిన మహాగణం. విశ్వనాయకుడే మహాగణపతి.*
*గం గం గణేశాయ నమః।*
*ఓం నమః శివాయ॥*
*శుభమస్తు. అవిఘ్నమస్తు.*
*శుభోదయం. శుభదినం.*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
పూర్తి శ్లోకాలు*
🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
*వాడుకలోని సంస్కృత వాక్యాలు*
*వాటి పూర్తి శ్లోకాలు*
🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
*అతి సర్వత్ర వర్జయేత్**
🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
*పూర్తి శ్లోకం :~*
*అతి దానాత్ హత: కర్ణ:*
*అతి లోభాత్ సుయోధన:*
*అతి కామాత్ దశగ్రీవో*
*అతి సర్వత్ర వర్జయేత్॥*
*తాత్పర్యము:~*
*మితిమీరిన దానం వలన కర్ణుడు చంపబడ్డాడు. విపరీతమైన లోభం వలన సుయోధనుడు చంపబడ్డాడు. మితిమీరిన కామం వలన దశకంఠుడైన రావణాసురుడు చంపబడ్డాడు. అతి అనేది అన్నిచోట్లా వర్జింపబడవలసినదే!*
*వ్యాఖ్య :~*
*తన పుట్టుకతోనే ఉన్నటువంటి సహజ కవచకుండలాలని తీసివేస్తే అది తన చావుకి కారణం అవుతుందని తెలిసికూడా, వచ్చినవాడు శత్రువని తెలిసి కూడా తన దాన గుణాన్ని అనుసరించి కవచకుండలాలు దానం చేసిన కర్ణుడికి చివరకి మహాభారత యుద్ధంలో అదే అతని చావుకి కారణం అయింది. హద్దులు మీరిన దాన గుణం మంచిది కాదు. అందుకే, తన్నుమాలిన ధర్మ పనికి రాదు అనిపెద్దలు చెపుతారు.*
*ఐదు ఊళ్ళిచ్చినా చాలు పాండవులకి అని శ్రీకృష్ణుడు పాండవుల పక్షాన రాయబారానికి వస్తే తన అహంకారపూరితమైన లోభత్వం వలన నిరాకరించాడు దుర్యోధనుడు. చివరకి అదియే మహాభారత యుద్ధానికి దారి తీసి అసంఖ్యామైన జన నష్టానికి దారి తీసింది. తను, అంటే దుర్యోధనుడు కూడా మరణించాడు. విపరీతమైన లోభం కూడా వినాశనానికి హేతువు అవుతుంది.*
*వనవాసంలో ఉన్న రాముని భార్యని ప్రతీకారచర్యతో అపహరించి ఆమె అందానికి దాసుడై మితిమీరిన కోరికతో వివాహమాడమని బలవంతంగా నిర్బంధిస్తాడు. అదే అతని చావుకి కారణమైంది. శ్రీరాముని చేతిలో సంహరింపబడ్డాడు. హద్దులు దాటిన కోరికలు పతనానికి దారి తీస్తాయి.*
*కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనే అరిషడ్వర్గాలు మనిషి పతనానికి వినాశనానికి మూల కారణమని అనేక ఉదాహరణలు మన దేశ చరిత్రలోను ప్రపంచ చరిత్రలోనూ మనం గమనిస్తూ ఉన్నాము. ప్రస్తుత ప్రపంచంలో కూడా వాటిని ప్రతి నిత్యమూ ఏదో మూల అటువంటివి జరుగుతూ ఉండడం చూస్తూనే ఉన్నాం. తస్మాత్ జాగ్రత!*
*వీటి అన్నిటినుండీ మనిషి తనని తాను సంరక్షించుకునేందుకు మంచి విద్య, మంచి వాతావరణంలో పిల్లల పెంపకం చాలా ముఖ్యం. ఇది తల్లిదండ్రుల మరియు సమాజం యొక్క బాధ్యత.*
*అందుచేతనే, అతిసర్వత్ర వర్జయేత్ అనేది మన నిత్యజీవితంలో విస్త్రుతంగా ఉపయోగించే నానుడి అయింది.*
*అదియే ఈ సుభాషితంలోని ఉద్దేశం.*
*ఇదే అర్థంవచ్చే మరొక శ్లోకంకూడా ప్రచారంలోవుంది.*
*అతిదానాత్ బలిః బద్ధః*
*హ్యతిమానాత్ సుయోధనః |*
*వినష్టో రావణో లౌల్యాత్*
*అతి సర్వత్ర వర్జయేత్ ” ||*
*మితిమీరిన దానం వల్ల బలిచక్రవర్తి బంధించబడ్డాడు. మితి మీరిన స్వాభిమానం దుర్యోధనుణ్ణి నాశనంచేసింది. అదుపుతప్పిన (స్త్రీ)లోలత్వం రావణాసురుడిని రాలిపోయేలాగ చేసింది. (అందువల్ల) అతి దేనిలోనైనా పనికిరాదు”.*
*శ్రీ గురుభ్యో నమః।*
🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
*ఓం శాంతిః శాంతిః శాంతిః!*
*సర్వేజనా సుఖినోభవంతు!!*
*ఓం తత్సత్!!*
*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*
*ఓం నమః శివాయ!!!*
🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐
*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*
🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐
జీవితంలో అసలైన తోడు ఎవరు?* అమ్మనా?
💯💯💯💯💯💯💯💯💯
*నీ ఈ జీవితంలో అసలైన తోడు ఎవరు?*
అమ్మనా?
నాన్ననా?
భార్యనా?
భర్తనా?
కొడుకా?
కూతురా?
స్నేహితులా?
బంధువులా ?
సడ్డకులా?
బామ్మర్దులా ?
లేదు. ఎవరూ కాదు.!
నీ నిజమైన తోడు *నీ శరీరమే!*నీ శరీరం నీకు సహకరించని రోజున నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా, ఎంతమంది డాక్టర్ లున్నా, జనాలు ఉన్న ఏమి చెయ్యలేరు సాగనంపడం తప్ప*
ఒక్కసారి నీ శరీరం స్పందించడం ఆగిపోతే ఎవ్వరూ నీ దగ్గర ఉండరు గాక ఉండరు!!!
నువ్వు అవునన్నా, కాదన్నా, ఇది కఠిన నిజం.!!!
*నీవూ నీ శరీరం మాత్రమే జననం నుండి మరణం దాకా కలిసి ఉంటారు.* నీవు వాస్తవానికి ఆత్మ.
*ఈ శరీరమే నీ అసలైన ఇల్లు.*
ఏదైతే నీ శరీరం కోసం బాధ్యతగా చేస్తావో అదే నీకు తప్పక తిరిగి వస్తుంది.
*నీవెంత ఎక్కువ శ్రద్ధగా శరీరాన్ని చూసుకుంటావో, నీ శరీరం కూడా నిన్ను అంతే శ్రద్ధగా చూసుకుంటుంది.*
నీవేమి తినాలి?
నీవేమి చేయాలి?
ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి?
నీవెంత విశ్రాంతి తీసుకోవాలి?
అనేవి మాత్రమే నీ శరీరం స్పందనను నిర్ణయిస్తాయి.
గుర్తించుకో !
*నీ శరీరమొక్కటే నీవు జీవిస్తున్న చిరునామా!*
నీ శరీరమే నీ ఆస్థి, సంపద.
వేరే ఏదీ కూడా దీనికి తుల తూగదు.
నీ శరీరం నీ బాధ్యత...
డబ్బు వస్తుంది. వెళ్తుంది.
బంధువులు, స్నేహితులు శాశ్వతం కాదు.
*గుర్తుంచుకో.!*
నీ శరీరానికి ఎవరూ సహాయం చేయలేరు. ఒక్క నీవు తప్ప...!
ఊపిరితిత్తులకు- *ప్రాణాయామం.*
మనసుకు- *ధ్యానము*
శరీరానికి- *యోగా.*
గుండెకు- *నడక.*
ప్రేగులకు- *మంచి ఆహారం.*
ఆత్మకు- *మంచి ఆలోచనలు.*
*సమాజం కోసం*- *మంచి పనులు.*
_*👆ఒకటికి రెండు సార్లు చదవండి. ఈ మంచి సందేశాన్ని అందరికీ పంపండి🙏*_
ప్రధాన మంత్రి
ఒక ధనవంతుడు ప్రధానమంత్రి కాగలడు
*నెహ్రూ* దీనిని నిరూపించారు.
ఒక పేదవాడు కూడా ప్రధాన మంత్రి కాగలడు
*లాల్ బహదూర్ శాస్త్రి జీ* దీనిని నిరూపించారు.
వృద్ధుడు ప్రధానమంత్రి కాగలడు
*మొరార్జీ దేశాయ్* దీనిని నిరూపించారు.
ఒక యువకుడు ప్రధాని కాగలడు
*రాజీవ్ గాంధీ* దీనిని నిరూపించారు.
ఒక మహిళ ప్రధానమంత్రి కావచ్చు
ఇది *ఇందిరా గాంధీ* గారు నిరూపించారు.
నిరక్షరాస్యుడు కూడా ప్రధాని కాగలడు
*చరణ్ సింగ్* నిరూపించాడు.
రాజకుటుంబానికి చెందిన వ్యక్తి ప్రధానమంత్రి కావచ్చు *V.P. సింగ్ గారు* నిరూపించాడు.
విద్యావంతుడు, బహుముఖ ప్రజ్ఞావంతుడు ప్రధానమంత్రి కాగలడు
దీనిని *పి.వి.నరసింహారావు గారు* నిరూపించారు.
కవి ప్రధాని కాగలడు
*అటల్ బిహారీ వాజ్‌పేయి గారు* దీనిని నిరూపించారు.
ఎవరైనా ప్రధాని కావచ్చు
ఇది *HD దేవెగౌడ* గారు నిరూపించారు.
దేశానికి ప్రధాని అవసరం లేదు *డాక్టర్ మన్మోహన్ సింగ్* నిరూపించారు.
ప్రధాని లేకుండా దేశాన్ని పాలించవచ్చు
*సోనియా గాంధీ* దీనిని నిరూపించారు.
*కానీ ఒక టీ అమ్మేవాడు కూడా ప్రధానమంత్రి కాగలడు* మరియు *వీరందరి కంటే మెరుగైన పని చేయగలడు* మరియు *భరతమాత జెండాను ప్రపంచమంతటా ఎగురవేయగలడు* అని *నరేంద్ర మోదీ జీ* 500 వందలసంవత్సరాలనుండి ఎదురుచూస్తున్న అయోధ్యను స్వాధీనం చేసుకుని రామమందిరాన్ని కట్టి ప్రతిష్ఠించాడు.కాశ్మీర్ ను తిరిగి పూర్తిగా భారత్ లో కలపడమేకాక త్వరలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకునే దిశగా అడుగులేస్తున్నాడు.త్వరలో కాశీలో జ్ఞానవాపీ,మథురలో కృష్ణమందిరం మనఖాతాలో వేస్తాడు.
ఈ రోజు ప్రపంచం లోని కొన్ని దేశాలు, మన దేశం లో ఉన్న చాలా మంది ఒక వ్యక్తిని గద్దె దించడానికి కుయుక్తులు పన్నడంలో నిమగ్నమై ఉన్నారు.
*కొంచెం ఆలోచించు...*
*అమెరికా, చైనా లాంటి దేశాల మెడలు వంచగలిగే మొనగాడు, గత కొన్ని దశాబ్దాలుగా పక్కలో బల్లెం లా ఉండే పాకిస్థాన్ ను ఈ రోజు ఆకలి కేకలతో అలమటిస్తూ అడక్కుతినే స్థాయికి దిగజార్చిన మొనగాడు మోడీ* మోడీని చేజార్చుకుంటే మోడీకి ఏమీనష్టం లేదు.నష్టమంతా దేశానికి మరియు హిందువులకు మాత్రమే. ఆయన ఒక మహర్షి.
కాబట్టి, మిత్రులారా ! అతను ఖచ్చితంగా భారతదేశాన్ని ప్రపంచ గురువుగా తీర్చిదిద్దగలడు!
*"మన దేశానికి మోడీ అవసరం"*
"నేను ఉచితంగా ఆహారం ఇస్తాను" - *రాహుల్ గాంధీ*
"నేను ఉచితంగా నీరు ఇస్తాను" - *కేజ్రీవాల్*
*"నేను ఉచితంగా భోజనం ఇవ్వను, నేను నీరు కూడా ఉచితంగా ఇవ్వను నేను చాలా ఉద్యోగ అవకాశాలు సృష్టించాలనుకుంటున్నాను, భారతదేశంలోని యువతను క్రియాశీలురు గా చేస్తాను, తద్వారా నా దేశంలో ప్రతి ఒక్కరూ గర్వంగా తమ స్వశక్తి తో కడుపు నింపుకుంటారు మరియు ఇతరుల దాహాన్ని కూడా తీర్చగలరు" - నరేంద్ర మోదీ*
*సమస్య కేజ్రీవాల్‌లోనో, రాహుల్ లోనో లేదు, ఉచిత సామాగ్రి లభిస్తే లాడెన్‌కు కూడా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్న భారతదేశ ప్రజలలో ఉంది.*
*మీరు దేశం కోసం ఏదైనా చేయాలనుకుంటే, ఈ సందేశాన్ని మీకు తెలిసిన వారందరికీ పంపండి. త్వరలో దేశం మొత్తం కనెక్ట్ అవుతుంది.*
*జస్ట్...కొంచెం ఫార్వర్డ్ చేయండి.. దీనికి 2-3 సెకన్లు మాత్రమే పడుతుంది...*
*జై హింద్....జై భారత్*
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
తిరుమల ఆలయంలో
అక్టోబర్ 1న తిరుమల ఆలయంలో బ్రహ్మోత్సవ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
శ్రీవారి ఆలయంలో అష్టదళ పాదపద్మారాధన, విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు
విఐపి బ్రేక్ దర్శనం సిఫార్సు లేఖలు సెప్టెంబర్ 30న ఆమోదించబడవు
తిరుమల, 28 సెప్టెంబర్ 2024:
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12 వరకు జరగనున్న దృష్ట్యా, అక్టోబర్ 1న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించబడుతుంది.
ఆ రోజు అష్టదళ పాద పద్మారాధన సేవను టిటిడి రద్దు చేసింది.
తమిళంలో, కోయిల్ అంటే 'పవిత్ర పుణ్యక్షేత్రం', ఆళ్వార్ అంటే "భక్తుడు", తిరు అంటే "శ్రేష్ఠo", మంజనం అంటే "స్నానం". కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటే గర్భగుడి మరియు ఆలయ ప్రాంగణాన్ని భక్తులు శుద్ధి చేసే కార్యక్రమం.
ఈ సమయంలో అన్ని దేవతా మూర్తులను మరియు ఇతర వస్తువులను గర్భగుడి నుండి బయటికి తెచ్చి, కర్పూరం, గంధం, కుంకుమ, పసుపు, కిచ్చిలి గడ్డ మొదలైన వాటితో కూడిన "పరిమళం" అనే సుగంధ మిశ్రమంతో శుభ్రం చేస్తారు. శ్రీవారి ప్రధాన మూర్తికి కూడా ఒక తెల్లని వస్త్రాన్ని కప్పి ఉంచుతారు.
ఈ మొత్తం కార్యాచరణ ఉదయం 6 నుండి 10 గంటల వరకు ఒక మహా యజ్ఞం లా జరుగుతుంది. తర్వాత ప్రధాన దేవతపై ఉన్న వస్త్రాన్ని తొలగించి, లోపల దేవతలు, దీపం మరియు ఇతర పూజ వస్తువులను మరల లోనికి తీసుకొస్తారు . అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, నైవేద్యం సమర్పిస్తారు.
ఈ యావత్ కార్యక్రమం ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహించబడుతుంది.
సంవత్సరానికి నాలుగు సార్లు ఈ వైదిక కార్యక్రమం నిర్వహిస్తారు. ఉగాది, ఆణివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి మరియు వార్షిక బ్రహ్మోత్సవాలు ముందు వచ్చే మంగళవారం నాడు ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీ .
గురు నారాయణ భవిష్యవాణి వారి ఉచిత నిత్య రాశి ఫలితాలు మీ రాశి ఫలితాలు
మీరు ఏ సమస్యల్లో ఉన్నా మీ జాతకం/హస్తరేఖలు చూసి మీ సమస్య లకు పరిష్కారం చేయగలం సమర్ధులం పూజ/గ్రహజపం/హోమం ద్వారా ఖచ్చితంగా పరిష్కారం చేయగలం ఇప్పుడే ఫోన్ చేయండి "జ్యోతిష్య రత్న" జరిగిన విషయం లు చెప్పి మీ భవిష్యత్తు చెప్పగలం వివాహం నకు జాతకం లు సరిపోల్చుట కూడా చూడబడును మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి 7981622895 గత 35 సంవత్సరంల నుండి ఇదే ఫీల్డ్ లో ఉన్నాం మా దగ్గర సిద్ధి పొందిన మంత్రాలు ఉన్నాయి మా గురువు ల ద్వారా మాకు వచ్చాయి. విద్య ఉద్యోగం వివాహం సంతానం కారాగృహ విముక్తి అనారోగ్యం రాజకీయ పదవులు ఋణ విమోచనం వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి రోగ నివారణ శత్రువులు నుంచి రక్షణ గృహ నిర్మాణం ఇలా ఏదైనా పరిష్కారం చేయగలం సమర్ధులం హోమం ద్వారా ఖచ్చితంగా మీ కోరికలు తీరేలా చేయిస్తాం మీ కోరికలు తీరకపోతే మీ ధనం వాపసు ఇస్తాం షరతులు వర్తిస్తాయి మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి
సకల శుభ పౌరోహిత్యం కార్యక్రమాలు చేయించబడును
వి ఐ పి బ్రేక్ దర్శనం రద్దు
టీటీడీ అక్టోబర్ 1న విఐపి బ్రేక్ దర్శనాన్ని (ప్రోటోకాల్ విఐపిలు మినహా) రద్దు చేసింది. కనుక సెప్టెంబర్ 30న ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. భక్తులు దీనిని గమనించి టీటీడీ కి సహకరించవలసిందిగా మనవి.
-----------------
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది
*శ్రీ కాళహస్తీశ్వర శతకము*
💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🙏 *శ్రీ కాళహస్తీశ్వర శతకము* 🙏
*జలకంబుల్ రసముల్ ప్రసూనములు వాచాబంధముల్ వా*
*ద్యము ల్కలశబ్దధ్వను లంచితాంబర మలంకారంబు దీప్తు*
*ల్మెఱుం గులు నైవేద్యము మాధురీమహిమగాఁ గొల్తు*
*న్నిన్నున్ భక్తి రంజిల దివ్యార్చన గూర్చి నేర్చిన క్రియన్ శ్రీకాళహస్తీశ్వరా!!!*
*శ్రీ కాళహస్తీశ్వర శతకము - 50*
*తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! కావ్యరసములే స్నానముగా, పద్యములే పూలుగా, అర్థమే భేరీకాహళవాద్యములుగా, అలంకారములు వస్త్రములుగా, కవితాసౌందర్యమే దీపములుగాశ చేతనయినట్టుగా నీ కైంకర్యము చేసెదను స్వామీ*
✍️🌷🌺🌹🙏
సుదర్శన శతకము*
*సుదర్శన శతకము*
*తెలుగు పద్యాను వాదము 15*
*రచన:*
*పద్య కవితా శిల్పకళానిధి*
*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*
*మిట్టాపల్లి*
*సేనా సేనామ్*
*తే గీ. చక్రజ్వాలల ధాటికి సాగలేక*
*ఇనుమడించె మూడు గుణాలు నింద్రునందు*
*భయము కలిగించె సైన్యాన్ని వశము చేసి*
*రణమునందన నాయక ప్రాణములను*
*రాక్షసులు నుండి లోకాన్ని రక్ష చేసె*
*జన్మజన్మల కర్మల సంచితమ్ము*
*తొలగజేయును పాపాలు దూరమగును*
*గర్వసహితులౌ వైరుల సర్వమణచి*
*చండ శాసన చెయుమో చక్ర రాజ*
*ఓం నమో భగవతే సుదర్శనాయ*
*💐🌹🙏🙏*
*శ్రీ చెట్టికులంగర భగవతి ఆలయం*
🕉 *మన గుడి : నెం 455*
⚜ *కేరళ : మావెల్లిక్కరా : అలెప్పి*
⚜ *శ్రీ చెట్టికులంగర భగవతి ఆలయం*
💠 చెట్టికులంగర భగవతి ఆలయం అలప్పుజ జిల్లాలోని మావెలిక్కర తాలూకాలో ఉంది.
ఇది కేరళలోని అత్యంత ప్రసిద్ధ దేవి ఆలయాలలో ఒకటి,
💠 భద్రకాళి, పరమాత్మ శక్తి దేవి అవతారం, రాక్షస రాజు దారుకుడిని చంపడానికి శివుని మూడవ కన్ను నుండి జన్మించింది.
'భద్ర' అంటే మంచిది మరియు 'కాళి' అంటే కాలదేవత. కాబట్టి భద్రకాళి శ్రేయస్సు మరియు మోక్షం కోసం పూజిస్తారు.
దేవి సృష్టికర్త, రక్షకుడు, విధ్వంసకం, ప్రకృతి, శక్తి మరియు కుండలినీ శక్తిగా పరిగణించబడుతుంది.
💠 ఈ ఆలయంలో అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటంటే బగవతి దేవత ఒక రోజులో మూడు రూపాల్లో దర్శనమిస్తుంది.
ఉదయం మహా సరావతిగా, మధ్యాహ్నం మహాలక్ష్మిగా, సాయంత్రం భద్రకాళిగా దర్శనమిస్తుంది.
కొడంగల్లూర్ దేవి ఆలయంలో కూడా ఈ ప్రత్యేకమైన పరివర్తనను చూడవచ్చు, అందుకే చెట్టికులంగర దేవిని కొడంగల్లూర్ దేవి కుమార్తెగా భావిస్తారు.
🔆 చరిత్ర
💠 పరశురాముడు 108 దుర్గా ఆలయాలు, 108 శివాలయాలు, అనేక శాస్తా దేవాలయాలు, 108 కలరీలు (దేవుని ముందు సంప్రదాయ యుద్ధ కళలు నేర్చుకునే స్థలం), శక్తి కేంద్రాలు మొదలైనవాటిని స్థాపించాడని పరశురాముడు కేరళ యొక్క ఆవిర్భావ సిద్ధాంతాన్ని చాలా మంది అనుచరులు గట్టిగా నమ్ముతారు.
ఐదు అంబాలయాలను స్థాపించాడు.
💠 ఈ ఆలయాన్ని 823లో మకర మాసంలోని ఉత్రిత్తతి రోజున పద్మపాదాచార్య (ఆది శంకరుల ప్రధాన శిష్యుడు) ప్రతిష్ఠించారు.
💠 పండుగలు : ఈ ప్రసిద్ధ బగవతి ఆలయంలో ప్రధాన పండుగలు కుంభ భరణి ఉత్సవం, పరాయిడుప్పు పండుగ, ఎతిరప్పు ఉల్సవం మరియు అశ్వతీ ఉల్సవం.
భరణి ఉత్సవాల సమయంలో నిర్వహించబడే ఈ దేవాలయంలోని అతి పెద్ద కార్యక్రమాలలో కుతియోట్టం ఒకటి.
కుతియోట్టం అనేది ఒక కళారూపంలో ప్రదర్శించబడే నరబలికి ప్రతీక.
కుతియోట్టం పాటలతో కూడిన ఈ నిర్మాణాత్మకమైన మరియు చక్కటి నృత్యరూపకం కలిగిన కళారూపం ఇప్పటికీ కేరళలో పాటిస్తున్న అరుదైన ద్రవిడ జానపదం.
💠 కేరళలో అనేక దేవాలయాలలో, "పరాయిడుప్పు" కాలం పండుగ కాలం. చెట్టికులంగర దేవాలయంలోని దేవతను మలయాళ మాసం మకరంలోని మకాయిరియం నక్షత్రం నాడు పరాయిడుప్పు కోసం ఊరేగింపుగా తీసుకువెళ్లినప్పుడు ఇదంతా ప్రారంభమవుతుంది.
మీనం చివరి వరకు పండుగలు కొనసాగుతాయి.
కుంభ భరణి చెట్టికులంగరలో ప్రధాన పండుగ కుంభ భరణి. ఇది ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ఉంటుంది.
మలయాళ క్యాలెండర్ కొల్లవర్షం ప్రకారం తేదీ నిర్ణయించబడుతుంది.
💠 చెట్టికులంగర భరణిని కుంభ మాసంలో మరియు భరణి నక్షత్రం ఉన్న రోజున జరుపుకుంటారు కాబట్టి దీనికి కుంభ భరణి అని పేరు వచ్చింది.
ఈ ఉత్సవంలో కుతియోట్టం మరియు కెట్టుకజ్చా ప్రధానమైనవి.
💠 ఈతిరేల్పు ఉల్సవం :
ఇది ఆలయ వార్షికోత్సవం.
కుంభ భరణి తరువాత 13వ రోజున ఆలయంలో వార్షిక ఉత్సవం 13 రోజుల పాటు నిర్వహించబడుతుంది.
పండుగ యొక్క ప్రతి రోజు 13 మంది కారా నివాసితులు నిర్వహిస్తారు.
ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆచారాలు జరుగుతాయి.
💠 అశ్వతీ ఉల్సవం :
ఉత్సవాలలోని విశిష్టమైన ఆచారాలు ప్రజలకు మరియు వారి ప్రియమైన భగవంతుడికి మధ్య విడిపోయే సమయంలో దృఢమైన బంధాన్ని మరియు మానవ దుఃఖాన్ని స్పష్టంగా తెలియజేస్తాయి.
మీనోమ్ మాసంలో అశ్వతి రోజున జరిగే ఈ పండుగ సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ పండుగ కొడంగల్లూర్‌లోని తన తల్లిని దర్శించుకోవడానికి ప్రయాణంలో దేవతకి పంపే పండుగగా భావించబడుతుంది.
💠 'కుతీర' (గుర్రాలు), ఐదు తేరు' (రథాలు) మరియు భీముడు మరియు హనుమంతుల చిహ్నాలుగా పిలువబడే ఆరు ఆలయ కార్ల యొక్క నేర్పుగా చెక్కబడిన మరియు అలంకరించబడిన రూపాలను కెట్టుకజ్చా ప్రదర్శిస్తుంది.
కుతిరాస్కుతిరాస్ సుమారు 70 నుండి 105 అడుగుల ఎత్తును కలిగి ఉంటాయి మరియు అవి నాలుగు భాగాలుగా ఉంటాయి - ఆదిక్కూట్టు, కతిరకల్, ఎడక్కోడారం, ప్రభద మరియు మెల్క్కూదరం, ఒకదానిపై ఒకటి వరుసగా.
💠 చెట్టికులంగర శ్రీ భగవతి ఆలయం నుండి అలప్పుజ బస్ స్టేషన్ (45.4 కి.మీ).
హైందవం వర్ధిల్లాలి 16*
*హైందవం వర్ధిల్లాలి 16*
(స్వధర్మ ప్రోత్సాహం అభిలషణీయమే)
*ధర్మ మరియు దేశ ద్రోహులను నిరోధించాలి*:- గత అధ్యాయాలలో ధర్మ మరియు దేశ ద్రోహ వాస్తవాలను గమనించాము. దేశ ద్రోహుల ఆగడాలకు అంతముండుటలేదు. రోజులు గడిచినా కొద్దీ కొత్త కొత్త శాంతి భద్రతల సమస్యలు. మన దేశంలో హిందువులు మాత్రమే గాకుండా అనేక మతాల వారు అంటే ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, భౌద్దులు, జైనులు, యూదులు, జోరాష్ట్రీయన్లు, బహాయీలు, పార్సీలు నివాసమేర్పర్చుకునిఉన్నారు.
అవుతే, దేశవాసులందరు ద్రోహులు కారు. అన్ని మతాలకు చెందిన వారిలో దేశాభిమానులు ఉన్నారు. *అందరు కూడా దేశ ప్రతిష్ట మరియు రక్షణకై ఉద్యుక్తులు కావాలి*. ముఖ్యంగా హిందువులు మరియు ముస్లింలు కుల, మత, వర్గ వివక్షత లేకుండా ప్రధాన పాత్ర పోషించాలి. ఇతర దేశాల్లో ప్రజలు కట్టుదిట్టమైన క్రమశిక్షణతో ఉంటారు. *ముందు దేశం తదుపరి మాత్రమే ఇతరత్రా*. కాని, భారత దేశంలో అధికులు *ముందు తాము, తదుపరి మతము, ఆ చివరన దేశము*. ఇది ముమ్మాటికీ గర్హనీయమైన వ్యవస్థ.
దేశాభిమానులందరు దేశ ద్రోహుల పట్ల జాగరూకులై, ఏమరుపాటు లేకుండా అప్రమత్తతో దేశ రక్షణ మరియు శాంతి భద్రతల పట్ల మెళుకువగా ఉండాలి.
ఏ ప్రాంతపు వాసులు ఆ ప్రాంతపు పరిసరాలపై నిఘా ఉంచాలి. కొన్ని దేశ ద్రోహ మరియు దేశ విచ్ఛిన్నకర అవకాశాలను పరిశీలిద్దాము. రైలు పట్టాలపై అడ్డంకులు అనగా సిమెంటు దిమ్మెలు, బండ రాళ్ళు, ఇనుము కడ్డీలు, గ్యాస్ సిలిండ్లర్లు పెట్టి రైల్వే వరుస ప్రమాదాలకు దుండగులు పాల్పడుతున్నారు,
జాతి జనుల మధ్య విభేదాల సృష్టి, తీవ్ర మరియు ఉగ్ర వాద సంస్థల ఆగడాలు, నక్సల్ మరియు మావోయిస్టుల బెడద, మత కలహాలు, స్వప్రయోజనాల కోసం అల్లర్లు సృజించు వారు, పరదేశస్థులు దొంగ చాటుగా సరిహద్దులు అతిక్రమించడం. ఇటువంటి అసాంఘిక మరియు దేశ ద్రోహ చర్యలపై స్థానికులు డేగ కన్ను ఉంచాలి మరియు ఆ వివరాలన్నీ అక్కడి ప్రభుత్వ యంత్రాంగానికి అందజేసి *నేరస్తులను కలిసికట్టుగా చట్టానికి అప్పజెప్పాలి*. ఎక్కడ ఏమైనా నాకెందుకు అన్న ప్రజల నిర్లిప్తతనే ఇటువంటి అరాచకాలకు ఊతము.
అన్నిటికన్నా మనదేశంలో ఎక్కడ లేని విచిత్ర వాతావరణం నెలకొని ఉన్నది. మసీదుల మరియు చర్చిల వద్ద పోలీసు కాని భద్రతా దళాలు గాని ఉండవు. కాని హిందూ మందిరాల వద్ద, హిందూ పండుగల ఊరేగింపుల వద్ద భారీ బందోబస్తు ఉంటుంది. దేశ వాసులు గమనించాలి ఎవరి నుండి ఎవరికి ప్రమాదము, ఎవరు శాంతి కాముకులో ఎవరు హింసావాదులో.
*దేశ రక్షణ మరియు శాంతి భద్రతల వ్యవహారం ప్రభుత్వాలది మాత్రమే కాదు దేశ వాసుల పూచికత్తు గూడా*. దేశంలో ఇన్ని ఇబ్బందులు చూసిన తర్వాత గ్రహణకు వచ్చే *మొదటి* విషయమేమిటంటే *అన్నిటికంటే ముఖ్యమైన మరియు ప్రధాన బాధ్యత ప్రజలు సచ్చీలురను ధనం ఎరజూపని, ఉచితాలంటూ ఆశజూపని సంక్షేమం , అభివృద్ధి మాత్రమే కోరుకునే వారిని దేశ నాయకులుగా ఎన్నుకోవాలి*. ఈ దేశంలోనే మరొక వింత... ప్రశ్నించే వారిని, వాస్తవాలు వెల్లడించే వారిని వేధించే నాయకులు ఉంటారు. కనుక ఐకమత్యంగా ఉంటేనే చట్టబద్ధమైన విధంగా
సామూహికంగా ఆ దుర్మార్గులను ఎదుర్కొనే కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్ళవచ్చు.
ఈ దేశ ధర్మాలను, సంప్రదాయాలను ప్రోత్సహించాలని అనుసరించడం ద్వారా అనుసరింప జేయడం చేస్తారని ఈ విషయమై సభ్యులు గట్టిగా నమ్ముతున్నారని విశ్వసిస్తున్నాను. *కావున మన హిందు ధర్మానికి, సంస్కృతికి ఊపిరులూదడానికి ప్రతి పౌరుడు కంకణం కట్టుకోవాలి*.
ధన్యవాదములు.
*(సశేషం)*
వేద ఆశీర్వచనం.
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే*
*కలియుగాబ్ది 5125*
*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం - వర్ష ఋతువు - భాద్రపద మాసం - కృష్ణ పక్షం - త్రయోదశి - మఘా / పుర్వాఫల్గుణి - ఇందు వాసరే* (30.09.2024)
ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు
*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.
.🙏🙏
భవదీయుడు
దశిక ప్రభాకరశాస్త్రి
9849795167
-----------------------------------------------
*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*
పద్యసౌరభం
.
*పద్యసౌరభం*
సీ॥
మదిలోన దలబోసి మమతనంతయు గూర్చి
లేఖినిం గదిలించ లేమవోలె
పదముల నొయ్యార ముదయించ నడయాడు
ప్రాసలు శ్లేషల పరిహసించు
యమకగమకవృత్తి యాశ్చర్యముల జూప
నుపమాదు లర్థాల నూరడించు
సౌందర్యమును జూపు ఛందాల నందమౌ
సరససాహిత్యాన సరసమాడు
తే॥గీ॥
హృద్యవిన్యాసమాకన్యకిష్టసఖియ
అర్థసంపద శబ్దాల నాడి పాడు
భట్టుమూర్తికి గుట్టుగా పట్టిబడిన
పద్య మెంచగ సాధ్యమ్మె? పండితులకు
*~శ్రీశర్మద*
పండితులు లేని దేశంలో
శ్లోకం:☝️
*యత్ర విద్వజ్జనో నాస్తి*
*శ్లాఘ్యస్తత్రల్పధీరపి |*
*నిరస్తపాదపే దేశే*
*ఏరణ్డోఽపి ద్రుమాయతే ||*
- హితోపదేశః । 3.70॥
అన్వయం: _యత్ర విద్వజ్జనో విద్వాన్ నాస్తి తత్ర అల్పధీః అల్పజ్ఞోఽపి శ్లాఘ్యః । నిరస్తపాదపే వృక్షహీనే దేశే ఏరణ్డోఽపి ద్రుమాయతే వృక్షాయతే ।_
భావం: పండితులు లేని దేశంలో మంద బుద్ధులు కూడా ప్రశంసనీయులుగా చలామణీ అవుతారు. ఉదాహరణకు, ఏ చెట్టు లేని ప్రదేశంలో (చిన్న చిన్న ముళ్లతో ఉన్న) ఆముదం మొక్కను కూడా మహావృక్షంగా లెక్కిస్తారు.
పంచాంగం 30.09.2024 Monday,
ఈ రోజు పంచాంగం 30.09.2024 Monday,
స్వస్తి శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాస కృష్ణ పక్ష త్రయోదశి తిధి ఇందు వాసర: మఘ నక్షత్రం శుభ యోగ: వణిజ కరణం. ఇది ఈరోజు పంచాంగం.
త్రయోదశి సాయంత్రం 04:49 వరకు.
మఘ ఉదయం 06:18 వరకు .
సూర్యోదయం : 06:09
సూర్యాస్తమయం : 06:02
వర్జ్యం : మధ్యాహ్నం 03:17 నుండి సాయంత్రం 05:05 వరకు.
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12:30 నుండి 01:17 వరకు తిరిగి మధ్యాహ్నం 02:52 నుండి 03:40 వరకు.
అమృతఘడియలు : రాత్రి 02:04 నుండి 03:52 వరకు.
రాహుకాలం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.
యమగండం: పగలు 10:30 నుండి 12:00 వరకు.
శుభోదయ:, నమస్కార: