30, సెప్టెంబర్ 2024, సోమవారం

పండితులు లేని దేశంలో

 శ్లోకం:☝️

*యత్ర విద్వజ్జనో నాస్తి*

 *శ్లాఘ్యస్తత్రల్పధీరపి |*

*నిరస్తపాదపే దేశే*

 *ఏరణ్డోఽపి ద్రుమాయతే ||*

 - హితోపదేశః । 3.70॥


అన్వయం: _యత్ర విద్వజ్జనో విద్వాన్ నాస్తి తత్ర అల్పధీః అల్పజ్ఞోఽపి శ్లాఘ్యః । నిరస్తపాదపే వృక్షహీనే దేశే ఏరణ్డోఽపి ద్రుమాయతే వృక్షాయతే ।_


భావం: పండితులు లేని దేశంలో మంద బుద్ధులు కూడా ప్రశంసనీయులుగా చలామణీ అవుతారు. ఉదాహరణకు, ఏ చెట్టు లేని ప్రదేశంలో (చిన్న చిన్న ముళ్లతో ఉన్న) ఆముదం మొక్కను కూడా మహావృక్షంగా లెక్కిస్తారు.

కామెంట్‌లు లేవు: