30, సెప్టెంబర్ 2024, సోమవారం

ఆత్మహత్యలు కులాన్నే నాశనం చేస్తాయా?

 *ఆత్మహత్యలు కులాన్నే నాశనం చేస్తాయా?*

*అక్టోబర్ 1 చతుర్దశి ఆత్మహత్యలు, హత్యల్లో చనిపోయినవారి ప్రత్యేకరోజు!*

*ఇది చదవక పోతే మీరు జీవితంలోనే పెద్దతప్పు చేసినట్టే!!!*

------------------------------------------

‘‘పిల్లనిచ్చేటప్పుడు, తెచ్చుకునేటప్పుడు వారి వంశంలో ఎవరైనా ఆత్మహత్యలు చేసుకున్నవారున్నారా? అని తెలుసుకోవాలి. అటువంటి మరణాలుంటే, అలా ఆత్మహత్యలు చేసుకున్న రక్తసంబంధీకులున్నా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆసంబంధాలు చేసుకోకూడదు. ఇది పురాణాలే కాదు ఆధునిక వైద్యులు కూడా అంగీకరించిన సత్యం.‘‘ అని గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్యగారు మహాముఖ్యమైన పెళ్ళిసంబంధాల్లో పాటించిన సూత్రం.

---------------------------------------------------


మేము పూర్వాశ్రమంలో పాత్రికేయవృత్తిలో ఉండగా ఒక వైద్య పరిశోధనా వివరాలు మమ్మల్ని చాలా ఆశ్చర్యపరిచాయి. దాదాపు దశాబ్దం క్రితం (2011లో) న్యూరోసైకోఫార్మకోలజీ అంతర్జాతీయ పత్రికలో ప్రచురితం అయిన ఈ పరిశోధనా వివరాలు విదేశీ వార్తా సంస్థలు నివేదించాయి. ఈ పరిశోధన సారాంశం ఏమంటే ఆత్మహత్యలు వంశపారంపర్యంగా సంక్రమిస్తాయని వార్త. ఇది మమ్మల్ని ఎంతో ఆశ్చర్యపరచడమే కాకుండా గురుదేవుల వాణి గుర్తుకు వచ్చి భారతీయ ధర్మశాస్త్రాలపై మమకారం పెరిగింది. మహాలయపక్షాల సందర్భంగా ఈ వివరాలు తెలుసుకుందాం.


ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాదీ కనీసం పది లక్షలకు పైగా ఆత్మహత్యల వలన చనిపోతున్నారని 2011 లెక్కల ప్రకారం తెలుస్తోంది. ఈ సంఖ్యలో ఆత్మహత్యలకు ప్రయత్నించి చావు తప్పించుకున్నవారిని చేర్చలేదు. అది కోట్లలో ఉంటుంది. ప్రపంచంలో వివిధ కారణాలతో చనిపోయిన జాబితాలో ఆత్మహత్యలు 10 స్థానంలో ఉన్నాయి.


అమెరికా, ఇంగ్లాండు వంటి అగ్రరాజ్యాలకు ఏ సమస్యాలేదు. వారికి ఉన్నది ఆత్మహత్యలే ప్రధాన సమస్య. కనుకనే ఇంగ్లండులో వీథికి నలుగురు మానసిక వైద్యులు ఉంటారని అతిశయోక్తిగా చెబుతారు.


నిజానికి పుస్తకాలు చదవడం అడుగంటుతున్న కాలంలో చిన్నపిల్లల చేత వారి బరువు కన్నా బరువైన నవల పరంపర చదివించిన జె కె రోలింగ్ కూడా ఆత్మహత్యా ప్రయత్న బాధితురాలే. కొన్ని కారణాల వలన ఆమె మానసిక వ్యాకులతకు లోనై ఆత్మహత్య ఆలోచనలకు లోనయ్యాయని తానే స్వయంగా ఒక ఇంటర్వూలో చెప్పింది. అయితే ఒక మానసిక వైద్య నిపుణుల చికిత్స వలన బయటపడి చరిత్రలో నిలిచిపోయే జానపద నవలలు వ్రాసింది.


మొత్తం 3,352 మందిపై అధ్యయనం చేశారు వీరిలో 1,202 మంది వంశానుగతంగా ఆత్మహత్యచేసుకున్నవారి వారసులున్నారు. ఈ అంతర్జాతీయ పరిశోధనా వివరాల ప్రకారం ఆత్మహత్యలు అనేక కారణాల వలన చేసుకుంటారు. అయితే ఇది వంశానుగతంగా కూడా వస్తూ ఉంటుంది. అంటే ఎవరైనా ఒక వంశంలో ఆత్మహత్య చేసుకుంటే ఆ వంశంలోని వారు ఆత్మహత్యలు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని బట్టీ ఆ వంశంలోని వారంతా ఆత్మహత్యలు చేసుకుంటారని కాదు. కేవలం ఆ వంశంవారికి ఆత్మహత్యల వలన ప్రమాదం చాలా ఎక్కువగా పొంచి ఉందని అర్థం.


ఇది వైద్యశాస్త్ర పరిశోధనల్లో నిరూపణ కావడమే కాకుండా వ్యక్తుల్లో ఆత్మహత్యలకు ప్రేరేపించే జన్యువును కూడా గుర్తించడం జరిగింది. సాధారణంగా ఆత్మహత్యలకు చుట్టుపక్కల వాతావరణం, తాగుడు మత్తుమందులు వంటి కొన్ని అలవాట్లు వంటివి ప్రధాన కారణాలు. ఇవే కాకుండా మీడియా కూడా ప్రధాన కారణం.


అమెరికా మీద అల్ ఖైదా దాడి చేసి జంటభవనాలను కూల్చివేసినప్పుడు 100 అంతస్తులపై నుంచీ కొందరు దూకేశారు. వారు భూమిని చేరేలోపలే చనిపోవడం అటుంచి, ఆ దృశ్యాలను పదేపదే చూపవద్దని అక్కడి మానసికవైద్యులు కోరడంతో నిలిపివేశారు. అయితే మన దౌర్భాగ్య మీడియాలకు ఒక నీతి నియమం లేని కారణం చేత పదేపదే ఆత్మహత్య వార్తలను చూపిస్తూ ఉంటుంది. అంతేకాక ఆత్మహత్య బెదిరింపు వార్తలు కూడా ప్రముఖంగా చూపిస్తుంది. జవాబుదారీతనం లేని మీడియా దివాలా కోరుతనానికి ఇది నిదర్శనం.


ఆత్మహత్య చేసుకున్నవారున్న వంశాలను గురుదేవులు వేదపురాణస్మృతుల ఆధారాలతో హెచ్చరించడానికి ప్రబలమైన కారణాలున్నాయి.

ఆత్మహత్య చేసుకున్నవారు అరవై వేల సంవత్సరాలు వెలుగు లేని చీకటి కూపంలో పడిపోతారు. అందులో రక్తం చీము సముద్రాలు ఉంటాయి. 

ఎవరైనా బంధువులు ఆత్మహత్య చేసుకుంటే వారి మృతికి అశౌచం పట్టవలసిన అవసరలేదు. ఏ విధమైన మైల రాదు. స్నానం కూడా చేయాల్సిన అవసరం లేదు. ఆత్మహత్య చేసుకున్నవారికి అంత్యేష్టి అనే పెద్దదినకర్మలు ఉండవు. ఊరవతలకు ఈడ్చుకుపోయి దహనం చేయడమే, అది కూడా ఎందుకు అంటే శవం వాసన వస్తుంది కనుక చేయడమే. అంతకు మించి మరేమీ కాదు. ఆత్మహత్య చేసుకున్నవారికి ఏ విధమైన ధర్మోదకాలు బంధువులు ఇవ్వాల్సిన అవసరం లేదు. కనీసం కన్నీరు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. 

మహాఘోరమైన అంశమేంటే ఆత్మహత్య చేసుకున్నవారి శవాన్ని మోసినవారు, దహనం చేసినవారు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఆ ప్రాయశ్చిత్తం మహోఘోరమైన తప్తకృచ్చవ్రతం ఆచరించాలి. శవంతో పాటు నాలుగు అడుగులు వేసినవారు కూడా ఇదే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి.

ప్రాయశ్చిత్తంలో మూడు రోజులు నీటిని మాత్రమే భోజనం చేయాలి. తరువతి మూడు రోజులు పాలు, తరువాతి మూడురోజులు పెరుగు, ఆ తరువాత మూడు రోజులు గాలి మాత్రమే తినాలి. ఈ విధంగా ఆత్మహత్య చేసుకున్నవారి శవాన్ని తాకినా, దహనం చేసినా, కలిసి నడిచినా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి.



మానవ జన్మ ఎత్తిన తరువాత సహజ మరణం ద్వారా మాత్రమే దేహాన్ని వదిలిపెట్టాలి. అయితే కొన్ని దుర్మరణాలు, అకాల మరణాలు సంభవించడం, ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం శాస్త్రం వ్యతిరేకించలేదు. ఇలా అర్థాంతరంగా తనువు చాలించిన వారికి ప్రాయశ్చిత్తం చెప్పి వారికి ఉత్తమ గతులు కలిగేందుకు నారాయణ బలి వంటివి చెప్పింది. అయితే ఆత్మహత్య మాత్రం మహాపాపంగా వేద, పురాణాదులు స్పష్టంగా చెప్పాయి.


సహజంగా మరణించినవారు, దుర్మరణాల్లో మరణించినవారు సపిండీకరణకర్మల ద్వారా దేవత్వాన్ని పొందుతారు. అయితే ఆత్మహత్య చేసుకున్నవారు మాత్రం శాశ్వత ప్రేతత్వం పొందుతారు. ఎందుకంటే వారికి ఏ విధమైన పూర్వ ఉత్తర క్రియలు ఉండవు. శవం ఎక్కువ సేపు ఉంటే వాసన వస్తుంది కనుక మరుభూమికి తీసుకుపోయి దహనం చేయడం మాత్రమే ఉంది. ఇంతకు మించి వారికి ఏ విధమైన సంస్కారాలు ఉండవు. శాస్త్రాలు స్పష్టంగా వీరికి పిండప్రదాన, తిలతర్పణాలు ఉండవు అని చెప్పింది.


అయితే, ఈ విధంగా ప్రేతత్వం పొందిన వారు తమ రక్తసంబంధీకుల ఇంటి చూర్లు పట్టుకొని వేళ్ళాడుతూ ఉంటారు. వీరు ప్రేతత్వ బాధలు భరించలేక తమ వంశస్తులు నాశనం కావాలని శాపాలు పెడుతూ ఉంటారు. కనుక ఒకరు ఆత్మహత్య చేసుకుంటే వారి ప్రేతత్వం వంశానికి పరిసమాప్తి కలిగినా శాంతించదు.


ఇటువంటి పెను ప్రమాదం ఆత్మహత్యల వల్ల కలుగుతోంది కనుకనే పితృకార్యాల్లో కొన్ని సడలింపులు ఇచ్చాయి. ఆత్మహత్యలు చేసుకున్నవారి శోకతీవ్రత తగ్గడానికి జ్యోతిర్లింగ క్షేత్రాలు, బీహారు గయ, పాద గయ (పిఠాపురం), పంచారామాలు, కురుక్షేత్రం వంటి దివ్య స్థలాల్లో పితృపక్షాల్లో నారాయణ బలి వంటివి చేయమని సూచిస్తారు. గయలో కూప శ్రాద్ధం చేస్తారు. అంటే అందరి పిండాలనూ గదాధరుని పాదాలపై ఉంచితే, ఈ విధంగా మరణించిన పాతకుల పిండాలు బావిలో పారేస్తారు. అయితే దీని వలన సంపూర్తి ప్రాయశ్చిత్తం జరుగదు. కేవలం కొంత ఉపశమనం మాత్రమే కలుగుతుంది. ఈ విధంగా ఆత్మహత్యలు చేసుకున్నవారు వంశంలో ఉంటే ఆ వంశంలోని వారు అంతా షణ్ణవతుల్లో, ముఖ్యంగా పితృపక్షాల్లో మిగిలిన పితృదేవతలను అర్చించి వారి ఆశీర్వాదాలు పొంది తీరాలి.


ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన అంశం ఇదే.


లక్షలాది యుగాల క్రితం వేదం నుంచీ పుట్టిన కర్మకాండప్రక్రియల్లో ఆత్మహత్యల గురించి చెప్పింది నేడు ఆధునిక వైద్యశాస్త్రం సమర్థించడం. ఆత్మహత్యలు వంశపారంపర్యంగా సంభవించే అవకాశం ఉందని నిరూపించడం.


కనుకనే ధర్మశాస్త్రాలు ఇటువంటి వాటి పరిహారాల కోసం పితృదేవతల ఋణాన్ని తీర్చుకోవాలని మొట్టమొదట చెప్పింది. దీని వల్ల ఉపశమనాలు కలుగుతాయి. ఆత్మహత్య చేసుకున్నవారు బ్రతికున్న తమ వంశం వారినే కాకుండా, చనిపోయిన తమ తాతముత్తాలను కూడా నాశనం చేస్తారు. వారికున్న దేవత్వాన్ని చెరుపుతారు. ఇటువంటి భయంకరమైన పితృసంక్రమణమైన దోషాలు పోయి బ్రతికి బట్టకట్టడానికి ఏడాదిలోని 360 రోజుల్లో 100 రోజులు పెద్దలకోసం కేటాయించాలి. ఇది నేడు సాధ్యపడదు కనుకనే గోసేవను గురుదేవులు సూచించారు.


ఆత్మహత్యలు చేసుకున్నవారిని పూర్వకర్మలు నిషేధిస్తే ఆ వంశాలను కేవలం గోవులే కాపాడగలవు. అవి సాక్షాత్తూ వేద స్వరూపాలు. ముక్కోటి దేవతల జీవరూపం. కనుక మహాపాతకమైన పాపమరణం పొందినవారు, అకాల మృత్యువులు పొందినవారు, వంశంలో పూర్వకార్యాలు చేసే పిల్లాపాపలు లేకుండాపోయినవారు ఉపశమించడానికి గోసేవ చేయాలి. ఇటువంటి వారి నుంచీ వచ్చే పితృదోషాలు, శాపాల నుంచీ సంసారాన్ని కాపాడుకోవాలంటే ప్రత్యక్షంగా గోసేవ చేయాలి.


మామూలు రోజుల్లో చేసినా, చేయకున్నా మహాలయాల్లో చేసే పిండోదకాలు, తిలతర్పణాలు, బ్రాహ్మణులకు కనీసం స్వయంపాకదానం, అథమపక్షంలో ఆవుకు గ్రాసం వేయడం అపరమితంగా మేలు చేస్తుంది. కనుక పౌర్ణమి నుంచీ అమావాస్య వరకూ వీటిని నిర్వహించాలి.


పితృదేవతార్చనలకు పరమావధి గోసేవ కనుక గురుదేవులు పితృగోసాధనను ఉపదేశించారు. ఈ రోజుల్లో మాతా పితృ సురభీ స్వధా స్తోత్రాలు చదువుకొని గోమతీ విద్యను అభ్యసించాలి. రెండు పూట్లా గోమతీ విద్యను చదువుకొని చేతనైనంత గోసేవను చేయాలి. ఈ స్తోత్రాలు 7842224469కి వాట్సప్ చేసి పొందవచ్చు.



ప్రత్యక్షంగా వీటిని చేయలేని వారు మాతా పితృ సురభీ స్వధా స్తోత్రాలు పఠించి, కారుణ్యాల జాబితా ప్రకారం పెద్దల పేర్లు గోత్రాలు చదువుకొని వారికి నమస్కారం చేసుకోండి. ఇప్పటికే ఈ స్తోత్రపఠనం చేస్తున్నవారు తమ సాధనలో రెండో సోపానంగా గోమతీ విద్యను కూడా ప్రారంభించండి. గోమతీ విద్యను 7842224469కి వాట్సప్ చేసి పొందవచ్చు. 


అనంతగోసేవనిధిని ఉపయోగించు కోవాలనుకునే వారు భారత ప్రభుత్వ భీం ఫోన్ ఆప్, మీ బ్యాంకు ఆప్ ల ద్వారా క్రింది వాటిని ఉపయోగించి పంపవచ్చు. సామూహికంగా గోగ్రాసం మేము వేస్తాము.

-------------------

సంక్షిప్తంగాః

ఆత్మహత్య చేసుకున్నవారికి సహజమరణం వారి మాదిరి యాతనా శరీరం ఏర్పడి తిలతర్పణ పిండాలు స్వీకరించలేరు. కేవలం గాలి రూపంలో ఉండిపోతారు. ప్రేతపిశాచరూపంతో ఆకలిదప్పికలు తట్టుకోలేక తమ వారి రక్తమాంసాలు హరించి నాశనం చేస్తారు. వీరిని కాపాడేదే కేవలం గోమాత మాత్రమే, ఆత్మహత్యలు చేసుకున్నవారు వంశంలో ఉంటే ప్రతీరోజు వారి పేరుమీద గోసేవ చేస్తే ఆవుల అనుగ్రహం వలన కొంత శాంతి ఉంటుంది.

నారాయణ బలి వంటివి చేస్తే తరువాత తరాలకు పిండార్హత కలుగుతుంది. అంతకు ముందుతరాల పిండస్థానం నాశనం కాదు. అంతేకానీ ఆత్మహత్యలవారికి స్వర్గం లభించదు. భూమి ఉన్నంత వరకూ వారు చింతచెట్టుమీద వేళ్ళాడుతూ ఉండాల్సిందే.

=====

తిలతర్పణాల ఏర్పాట్లు ఉపయోగించుకోండి!!!

దోషాలు కష్టాలు దుఃఖాలు తొలగించే గజచ్ఛాయాయోగం రెండుసార్లు వస్తోంది!

శ్రీక్రోధి నామ సంవత్సర పితృపక్షోత్సవాల సందర్భంగా అనంతసాహితి ఈ ఏడాది కూడా తిలతర్పణాల ఏర్పాట్లు చేయబోతోంది. దీనిని అంతా సద్వినియోగం చేసుకోవాలని ఆహ్వానిస్తోంది. శ్రీక్రోధి విశేషంగా రెండు గజచ్ఛాయా యోగాలను తీసుకువచ్చింది. అందులో ఒకటి సెప్టెంబర్ 30 కాగా మరొకటి అక్టోబర్ 2వ తేదీని వస్తోంది. అక్టోబర్ 2న అమావాస్య కావడం విశేషం కాగా సెప్టెంబర్ 30 పితరులకు ఇష్టమైన మఘా నక్షత్రం ఉంది. ఈ శుభసందర్భాలను పురస్కరించుకొని పితృదేవతార్చనా ప్రచారంలో భాగంగా తిలతర్పణాలను ఏర్పాటు చేస్తున్నాము. ఇందులో ఈ విధంగా పాల్గొనవచ్చు.

1) ప్రత్యక్షంగా పాల్గొనడం: హైదరాబాద్ లో ఉన్నవారు తమ పెద్దలకు తిలతర్పణాలు, బ్రాహ్మణులకు స్వయంపాకం ( బియ్యాలు), యతీశ్వరభిక్ష, గోసేవ చేయదలిస్తే వచ్చి స్వయంగా పాల్గొనవచ్చు. అమావాస్యనాడు సామూహిక, వ్యక్తిగతగోదానంలో ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు.

2) అప్రత్యక్షంగా: హైదరాబాద్ లో లేనివారు , ప్రత్యక్షంగా రాలేని వారికి తమకు బదులుగా ఇక్కడ ఏర్పాటు చేసినవారు తిలతర్పణాలు ఇస్తారు. బ్రాహ్మణ, యతీశ్వర భిక్షలు గోసేవ వారి పేర్లపై చేయడం జరుగుతుంది. అంతేకాక, సామూహిక గోదానం, వ్యక్తిగత గోదానం కూడా వారిపేర్లపై అప్రత్యక్షంగా జరుగుతుంది.

3) అమావాస్య నాడు గోదానం: గజచ్ఛాయాయోగాన్ని పురస్కరించుకొని గోదానంలో ప్రత్యక్షంగా లేదా అప్రత్యక్షంగా పాల్గొనవచ్చు.


ఈ అవకాశం ముందుగా నమోదు చేసుకున్నవారికి మాత్రమే. ఇందులో పాల్గొనాలనుకునే వారు తమ గోత్రనామాలు 29 సాయంత్రం 6 లోపల 7842224469కి వాట్సప్ చేసి నమోదు చేసుకోవాలి. అప్రత్యక్షంగా ప్రత్యామ్నాయ వ్యక్తుల చేత చేయించుకునేవారు తమ పెద్దల గోత్రనామాలు 29 లోపల పంపాలి. ముందస్తు నమోదు లేనిచో ఏర్పాట్లు చేయడం కుదరదు. వ్యక్తిగత గోదానంలో ఒక ఆవును వారికి కేటాయించడం జరుగుతుంది. సామూహిక గోదానంలో అందరూ కలసి ఒకే ఆవును దానం చేస్తారు.


దయచేసి అందరూ కార్యుణ్యాల జాబితాను సిద్ధం చేసుకొని రావాలి. ఇది లేకుంటే 7842224469కి వాట్సప్ చేసి పొందవచ్చు.


రావలసిన చిరునామా, సమయం, తీసుకురావలసిన వస్తువుల జాబితా నమోదు అనంతరం పంపుతాము.

ఇది ధర్మప్రచారంలో భాగంగా చేస్తున్నది కనుక తమకు తోచినది అనంతసాహితి విరాళంగా ఇచ్చి పాల్గొనవచ్చు. 

తమ విరాళాలు, గోత్రనామాలు ఈ కింది విధంగా పంపంవచ్చు.

మేము నిర్వహిస్తున్న గోసేవానిధికి క్రింది విధంగా పంపవచ్చు. అనంతసాహితి సంస్థ నిర్వహిస్తున్న గోసేవానిధికి గోగ్రాస నిమిత్తం సెల్ ఫోన్ ద్వారా పంపవచ్చు. మేము సామూహికంగా గోగ్రాసం వేస్తాము.భారత ప్రభుత్వ భీం ఫోన్ ఆప్, మీ బ్యాంకు ఆప్ ల ద్వారా క్రింది వాటిని ఉపయోగించి పంపవచ్చు. 

for paytm, Phonepay, googlepay, Gpay


9247821505

7842224469

ఈ పితృదేవతా పంచాంగాన్ని ఒక రోజు ముందుగా ఆరోజు విశేషాలతో ఇస్తాము. ప్రతిరోజూ వచ్చే ఈ సమాచారం కోసం మా అనంతసాహితి ప్రచార బృందాల్లో చేరడానికి 7842224469కి వాట్సప్ చేసి వివరాలు పొందండి. 


ముఖ్యగమనిక: అనంతసాహితి సాధికార నెంబర్లు ఈ నాలుగు మాత్రమే. (9247821505, 7842224469, 9652224469, 9642224469)వేరు నెంబర్లు మీ దృష్టికి వస్తే దయచేసి మాకు తెలుపప్రార్థన. వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడానికి అనంతసాహితి సర్వసన్నద్ధతతో ఉంది. మీరు గోసేవానిధికి ద్రవ్యం పంపి మాకు 7842224469 వాట్సప్ ద్వారా మీ గోత్రనామాలు తప్పని సరిగా పంపండి.

========================

చతుర్దశి అక్టోబర్ 1 నాడు ఎవరికి చేయాలి?

కరోనా వంటి కారణాలతో అకాలమృత్యువుపొందినవారు, ఎవరైతే అర్థాంతరమృత్యువు పొందారో, వారికి వారు చనిపోయిన తిథిలో పితృపక్షంలో చేయరాదని ఒక ప్రమాణం. అంటే ఆత్మహత్య కాకుండా కర్మాగారంలో, బస్సుల్లో, రైళ్ళలో అగ్నిప్రమాదంలో చనిపోయినవారు, ప్రమాదంలో నీటిలో చనిపోయినవారు, ఎవరి చేతనైనా హత్యకు గురైనవారు, దొంగల చేతిలో చనిపోయినవారు, సామూహిక మారణహోమాల్లో చనిపోయినవారు, పాముకాటు, కొమ్ములపోటుతో, చిరుత వంటి క్రూరజంతువుల వలన చనిపోయినవారు..... ఇటువంటి ఆత్మహత్యేతర కారణాల వల్ల హఠాత్తుగా చనిపోయినవారికి కేవలం చతుర్దశీ తిథి నాడు మాత్రమే చేయాలి. వారు చనిపోయిన తిథిలో చేయరాదు. 

ఆత్మహత్యలు చేసుకున్నవారికి:

ఆత్మహత్య చేసుకున్నవారికి కూడా అకస్మాత్తుగా చనిపోయినవారితో చేయవచ్చని కొన్ని గరుడాది పురాణాలు చెబుతున్నాయి. కనుక ఆత్మహత్యలు చేసుకున్న వారికి కూడా చతుర్దశి మంచిదే. పరమేశ్వరుని దయ కలుగాలని ప్రార్థించి వారికి కూడా చేయవచ్చు. నిజానికి ఆత్మహత్య చేసుకున్నవారికి పిండోదకార్హత లేదు. అయితే వారికి మాని వేసినా ప్రమాదమే కనుక నోటితో లేదని చెప్పే బదులు చేతితో చేయడమే. ముట్టేది ముడుతుంది.

ఆత్మహత్యలు చేసుకున్నవారు ఉంటే ఆ కుటుంబం మాత్రమే కాదు, వారి బంధువులు, గోత్రం వారు, కులం వారు కూడా నాశనం అవుతారని అంతా తెలుసుకోవాలి.

=========================

ప్రతీరోజూ ఈ క్రిందినామాలు ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు స్మరించుకోవాలి.

 కాశీ కాశీ కాశీ

గంగా గంగా గంగా

తిలాన్ తిలాన్ తిలాన్

స్వధా స్వధా స్వధా

గయా గయా గయా


=============================

శ్లో: గుహనాథా చ గణేశ గౌరీశ 

 గంగా గో గయా గాయత్రీ పాహి మాం !

గీతా గురుర్దేవ నవమ్భవతి

 అనంతరామోక్త ధర్మ సాధనం!!

   ‘‘ గుహనాథుడైన కుమారస్వామి, గణేశుడు, గౌరీశుడు,గంగాదేవి, గోవులు, గయా క్షేత్రం, గాయత్రీ మంత్రం, భగవద్గీతా, గురుదేవులను నేను శరణువేడుతున్నాను. ఈ 9 గకారాలలో హిందూ ధర్మ సంగ్రహం ఉందని ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్యగారు చెప్పారు. దీన్ని ప్రతి నిత్యం చదువుకొని అర్థం చేసుకొని మనన ధ్యానం చేస్తే హిందూధర్మం అనుభవంలోకి అతి తేలిగ్గా వస్తుంది.‘‘

===========================

ముఖ్యంగా పితృపక్షాల్లో స్వధా నామజపాన్ని ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు చేయాలి. నామజపం చేయడంలో తప్పులేదు. అయితే దాన్ని మంత్రంగా చేయడం వేరు అనే సత్యాన్ని గ్రహించండి. మంత్రాన్ని గురువు నుంచీ పొందితేనే చేయాలి. నామాన్ని తెలిస్తే చాలు ఎవరైనా స్మరించవచ్చు. స్వధా స్తోత్రం, పితృస్తోత్రం, మాతృస్తోత్రం చదువుకోవాలి. ఇవి కావలసిన వారు 7842224469 కు వాట్సప్ మెసేజ్ చేసి పొందవచ్చు. 

=====================

స్వామి అనంతానంద భారతి

అనంతసాహిత ఆశ్రమం

కామెంట్‌లు లేవు: