30, సెప్టెంబర్ 2024, సోమవారం

హైందవం వర్ధిల్లాలి 16*

 *హైందవం వర్ధిల్లాలి 16*

(స్వధర్మ ప్రోత్సాహం అభిలషణీయమే)




 *ధర్మ మరియు దేశ ద్రోహులను నిరోధించాలి*:- గత  అధ్యాయాలలో ధర్మ మరియు దేశ ద్రోహ  వాస్తవాలను గమనించాము. దేశ ద్రోహుల ఆగడాలకు అంతముండుటలేదు. రోజులు గడిచినా కొద్దీ కొత్త కొత్త శాంతి భద్రతల సమస్యలు. మన దేశంలో హిందువులు మాత్రమే గాకుండా అనేక మతాల వారు అంటే ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, భౌద్దులు, జైనులు, యూదులు, జోరాష్ట్రీయన్లు, బహాయీలు, పార్సీలు నివాసమేర్పర్చుకునిఉన్నారు. 


అవుతే, దేశవాసులందరు ద్రోహులు కారు. అన్ని మతాలకు చెందిన వారిలో దేశాభిమానులు ఉన్నారు. *అందరు కూడా దేశ ప్రతిష్ట మరియు రక్షణకై ఉద్యుక్తులు కావాలి*.   ముఖ్యంగా హిందువులు మరియు ముస్లింలు కుల, మత, వర్గ వివక్షత లేకుండా ప్రధాన పాత్ర పోషించాలి. ఇతర దేశాల్లో ప్రజలు కట్టుదిట్టమైన క్రమశిక్షణతో ఉంటారు. *ముందు దేశం తదుపరి మాత్రమే ఇతరత్రా*. కాని, భారత దేశంలో అధికులు *ముందు తాము, తదుపరి మతము, ఆ చివరన దేశము*. ఇది ముమ్మాటికీ  గర్హనీయమైన వ్యవస్థ. 


దేశాభిమానులందరు దేశ ద్రోహుల పట్ల జాగరూకులై, ఏమరుపాటు లేకుండా అప్రమత్తతో దేశ రక్షణ మరియు శాంతి భద్రతల పట్ల మెళుకువగా ఉండాలి. 


ఏ ప్రాంతపు వాసులు ఆ ప్రాంతపు పరిసరాలపై నిఘా ఉంచాలి. కొన్ని దేశ ద్రోహ మరియు దేశ విచ్ఛిన్నకర అవకాశాలను పరిశీలిద్దాము.  రైలు పట్టాలపై అడ్డంకులు అనగా సిమెంటు దిమ్మెలు, బండ రాళ్ళు, ఇనుము కడ్డీలు, గ్యాస్ సిలిండ్లర్లు పెట్టి రైల్వే వరుస ప్రమాదాలకు దుండగులు పాల్పడుతున్నారు,  

జాతి జనుల మధ్య విభేదాల సృష్టి, తీవ్ర మరియు ఉగ్ర వాద సంస్థల ఆగడాలు,  నక్సల్ మరియు మావోయిస్టుల బెడద, మత కలహాలు, స్వప్రయోజనాల కోసం అల్లర్లు సృజించు వారు, పరదేశస్థులు  దొంగ చాటుగా సరిహద్దులు అతిక్రమించడం. ఇటువంటి అసాంఘిక మరియు దేశ ద్రోహ చర్యలపై స్థానికులు డేగ కన్ను ఉంచాలి మరియు ఆ వివరాలన్నీ అక్కడి ప్రభుత్వ యంత్రాంగానికి అందజేసి *నేరస్తులను కలిసికట్టుగా చట్టానికి అప్పజెప్పాలి*. ఎక్కడ ఏమైనా నాకెందుకు అన్న ప్రజల నిర్లిప్తతనే ఇటువంటి అరాచకాలకు ఊతము. 


అన్నిటికన్నా మనదేశంలో ఎక్కడ లేని విచిత్ర వాతావరణం నెలకొని ఉన్నది.  మసీదుల మరియు చర్చిల వద్ద పోలీసు కాని భద్రతా దళాలు గాని ఉండవు. కాని హిందూ మందిరాల వద్ద, హిందూ పండుగల ఊరేగింపుల వద్ద భారీ బందోబస్తు ఉంటుంది. దేశ వాసులు గమనించాలి  ఎవరి నుండి ఎవరికి ప్రమాదము, ఎవరు శాంతి కాముకులో ఎవరు హింసావాదులో. 


*దేశ రక్షణ మరియు శాంతి భద్రతల వ్యవహారం ప్రభుత్వాలది మాత్రమే కాదు దేశ వాసుల పూచికత్తు గూడా*.  దేశంలో ఇన్ని ఇబ్బందులు చూసిన తర్వాత గ్రహణకు వచ్చే *మొదటి* విషయమేమిటంటే *అన్నిటికంటే ముఖ్యమైన మరియు ప్రధాన బాధ్యత ప్రజలు సచ్చీలురను  ధనం ఎరజూపని, ఉచితాలంటూ ఆశజూపని సంక్షేమం , అభివృద్ధి మాత్రమే కోరుకునే వారిని దేశ నాయకులుగా ఎన్నుకోవాలి*. ఈ దేశంలోనే మరొక వింత... ప్రశ్నించే వారిని, వాస్తవాలు వెల్లడించే వారిని వేధించే నాయకులు ఉంటారు.  కనుక ఐకమత్యంగా ఉంటేనే చట్టబద్ధమైన విధంగా

సామూహికంగా ఆ దుర్మార్గులను ఎదుర్కొనే  కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్ళవచ్చు.

ఈ దేశ ధర్మాలను, సంప్రదాయాలను ప్రోత్సహించాలని అనుసరించడం ద్వారా అనుసరింప జేయడం చేస్తారని ఈ విషయమై సభ్యులు గట్టిగా నమ్ముతున్నారని విశ్వసిస్తున్నాను. *కావున మన  హిందు ధర్మానికి, సంస్కృతికి ఊపిరులూదడానికి ప్రతి పౌరుడు కంకణం కట్టుకోవాలి*.


ధన్యవాదములు.

*(సశేషం)*

కామెంట్‌లు లేవు: