25, ఫిబ్రవరి 2023, శనివారం

బ్రాహ్మణ్

 “బ్రాహ్మణ్ ద గ్రేట్”


 దేశం అంతటా బ్రాహ్మణులను గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇది ఇలా ఉండగా మధ్య ప్రదేశ్‌ ఐఏఎస్‌కి చెందిన నియాజ్ ఖాన్ గారు బ్రాహ్మణ్ ద గ్రేట్ అనే పుస్తకాన్ని రాసారు.. ఇంకా విడుదల కాలేదు... 


మునేష్వర్ కుమార్, నవభారత్ టైమ్స్ పాత్రికేయుడు- దేశంలో బ్రాహ్మణుల గురించి చర్చ జరుగుతోంది. మోహన్‌జీ భాగవత్ గారి వ్యాఖ్యల తరువాత వివాదం మరింత పెద్దదైంది. ఈ మధ్యలో మీరు బ్రాహ్మణ్ ద గ్రేట్ అనే పుస్తకాన్ని రాసారు. ఇది ఎందుకు రాసారు, ఇందులో ఏమి ఉంది.   


నియాజ్ ఖాన్- మోహన్‌జీ ఈ మధ్యనే ట్వీట్ చేసారు. నేను బ్రాహ్మణులకి సంబంధించి చాలా కాలంగా రిసర్చ్ చేస్తున్నాను. ఈ మధ్యలో భాగవత్‌జీ వ్యాఖ్య రావడం యాధృచ్ఛికం మాత్రమే. ఇంక పుస్తకంలోని విషయమేమిటంటో, నేను వేదాలను అధ్యయనం చేసాను. పురాణాలను అధ్యయనం చేసాను. ఉపనిషత్తులను చదివాను. ప్రత్యేకంగా కౌటిల్యుని జీవిత చరిత్రని అధ్యయనం చేసాను. అది చాలా ప్రేరణ కలిగించింది. 3000 వేల సంవత్సరాల చరిత్రని తిరగేసినప్పుడు బ్రాహ్మణులు నిరంతరత దేశంలో చాలా సుధృడంగా ఉంది. పూజ, ఆధ్యాత్మిక విద్య, ఇతర సంస్కారాల అందిచడంతో పాటు ఉపాధ్యాయులగా పని చేసారు. అవసరమైన దేశానికి సహకరించారు. దేశ సీమలకి కూడా బలాన్ని చేకూర్చారు. నాకు ఇది ఒక ప్రత్యేకమైన విషయం అనిపించింది. 3000 సంవత్సరా గొప్ప చరిత్ర కలిగిన ఈ కమ్యూనిటీపైన ఒక పుస్తకం రాయాలని అనిపించింది. ఈ ప్రేరణతోని బ్రాహ్మణ్ ద గ్రేట్ అనే పుస్తకం రాబోతోంది.


పాత్రికేయుడు- మీరు ఏ ఏ వేదాలను అధ్యయనం చేసి విషయ సేకరణ చేసారు.


ని.ఖా- వేదాలు నాలుగు ఉన్నాయి. అవి చాలా విస్తృతమైనవి. వాటిని చదవాలంటే 6 నెలలకి పైగా సమయం పడుతుంది. నేను ప్రముఖంగా హోలీ వేదాస్ పుస్తకాన్ని చదివాను. దాంట్లో అనేక మంత్రాలు ఉన్నాయి. నాలుగు వేదాలకి సంబంధించిన ఇది మంచి పుస్తకంగా. వీటితో పాటు దక్షిణ, ఉత్తర భారత దేశానికి బ్రాహ్మణులకి సంబంధించి అధ్యయనం చేసాను. ఉపనిషత్తుల విజ్ఞాన్ని గురించి చదివాను. దధీచి గురించి చదివాను. బారత దేశంలోని అందరు మహాపురుషల గురించి, ప్రత్యేకంగా చాణుక్యుడి గురించి చదివాను. ఇలా విస్తృతంగా, లోతుగా అధ్యయనం చేసిన తరువాత గత 50-70 సంవత్సరాల వెనక బ్రాహ్మణుల స్థితి ఎలా ఉంది, 3000 సంవత్సరాల క్రితం ఎలా ఉంది, స్వాతంత్ర్యం వచ్చాక వీరి స్థితి ఎలా ఉంది అనే విషయాన్ని తులనాత్మకంగా అధ్యయనం చేసాను. ఇవి అన్నీ అధ్యయనం చేసాక ఈ నవల రాసాను. 


పాత్రికేయుడు- బ్రాహ్మణులు బ్రహ్మద్వారా సృష్టించబడ్డారని మీరు ఒక ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ తరువాత అనే ప్రశ్నలు లేవనెత్తబడ్డాయి. మీరు బ్రాహ్మణలని ఎందుకు సమర్ధిస్తున్నారనే వ్యాఖ్య కూడా వచ్చింది. 


ని.ఖా.- నేను చార్ల్స్ డార్విన్ (Charles Robert Darwin),  హార్బర్ట్ స్పెన్సర్ (Herbert Spencer) ద్వారా ప్రతిపాదించిన పరిణామ సిద్ధాంతం  (Theory of evolution) ప్రకారం కాలంతో పాటు ఏ జీవరాశి అయితే మనగలుగుతుందో అది మాత్రమే భూమి పై జీవించి ఉంటుంది. దీని ఆధారంగానే బలం ఉన్నవాడే జీవిస్తాడు (Survival of the fittest) అనే సిద్ధాంతం వచ్చింది. ఈ విధంగా 3000 సంత్సరాల చరిత్రని తిరగేస్తే అనే భూకంపాలు, తుఫాన్లు వచ్చాయి. విదేశాల నుండి వచ్చి పరిపాన చేసారు. బ్రాహ్మణుల వ్యవస్థ, పరంపర కొనసాగుతూ వచ్చింది. వేదాలు,  వారి సామాజిక గతి నడుస్తూనే ఉంది. ఎన్ని విషయ పరిస్థితులు వచ్చిన బ్రాహ్మణులు జీవిస్తూ వచ్చారు. కేవలం జీవించడం కాదు, దేశ గౌరవాన్ని ముందుకి తీసుకు వెళ్ళారు. ఆధ్యాత్మిక క్షేత్రంలో బలాన్ని అందిచారు. సీమా క్షేత్రాలకు బలాన్ని చేకూర్చగలిగారు. గొప్ప సంస్కృతిని నిలిపి ఉంచారు. ఈ దృశ్యా చరిత్రలో వీళ్ళ ఐక్యూ చాలా వ్యాపకమైనది. చాలా పెద్దది. ఈ సందర్భంగానే నేను ఆ ట్వీట్ సాహిత్యపరమైనది. దాని ద్వారా చరిత్ర తిరగేస్తే వీళ్ళు గోప్పగా రాణించారని, వారికి ఇచ్చిన పనిని  గొప్పగా నిర్వర్తించారని చెప్పాను.

పాత్రికేయుడు- మీరు వేదాలు ఇతర గ్రంథాల గురించి ప్రస్తావించారు. ఈ మధ్యనే దేశంలో రామచరిత్ మానస్, మరి కొన్ని పుస్తకాలకి సంబంధించి అనేక వాదోపవాదాలు వస్తున్నాయి. దానిని గురించి మీరేమంటారు.


ని.ఖా.- నేను ఇటువంటి వివాదాలలో పడదలుచుకోలేదు. నా విషయం భిన్నమైనది. నా అధ్యయనం బ్రాహ్మణుల ఐ.క్యూ., పుట్టుకతో వచ్చిన గుణాలు వాళ్ళ పనితీరుకి సంబంధించినది. దేశంలోని వర్ణ వ్యవస్థ, అసృస్యత, ద్వేషం లాంటి విషయాలపై నేను ఏ మాత్రం వెళ్ళదలుచుకోలేదు. నేను వీరిని ప్రపంచంలో ఒక గొప్ప మేధావి వర్గంగా ఉండినారని అనుకుంటున్నాను. ప్రపంచంలో అనేక ఆవిష్కరణలకి సంబంధించి తెల్లవారిని గురించబడతారు. అరబ్ యొక్క యహూదీ (జ్యూస్‌ అనబడతారు) లను తీసుకుంటే ప్రపంచంలో విజ్ఞానం ప్రథమ స్థానంలో వారిని పరిగణిస్తారు. బ్రాహ్మణులు కూడా మన దేశంలో ప్రథమ (1st Class) స్థాయి ప్రతిభని చూపించారని నాకు అనిపిస్తుంది.  అందువలన నా విషయ వస్తువు ఈ గ్రంథాలకి సంబంధించినది కాక, నేను అవి చదవదలుచుకోలేదు.. నేను కేవలం అధ్భుతమైన ప్రతిభ చూపిన గొప్ప గొప్ప సాధు, సంత్‌లు, ఋషులు, జ్ఞానులు, ఆచార్యులు లాంటి వారు ఉండిన, దేశం కోసం ఎంతో చేసినటువంటి ఆ వర్గం యొక్క కర్మ పై నా పుస్తకం ఆధారపడి ఉంది తప్ప, నేను ఈ వివాదాలలో పడదలుచుకోలేదు.


పాత్రికేయుడు- ధార్మిక పుస్తకాల వివాదమంతా బ్రాహ్మణులపైననే ప్రశ్నలు సంధించబడుతున్నాయి.. వర్ణ వ్యవస్థ ప్రశ్నిచంబడుతోంది... రామ్ చరిత్ మానస్ చౌపాయిల తప్పుడు వ్యాఖ్యానం జరుగుతోందా.. కొందరు ఈ చౌపాయీలను తప్పుగా వ్యాఖ్యానిస్తున్నారని కూడా అన్నారు.. మీరు ఏమంటారు.


ని.ఖా.- ఏ ధర్మిక పుస్తకాన్ని తీసుకుని చదివిని కేవలం ఆ పుస్తకంలో సంతృప్తిపడడం కష్టము. ఏ శాస్త్రాన్ని తీసుకున్నా, ఏ పుస్తకాన్ని తీసుకున్నా ప్రతీ వ్యక్తి సంతృప్తి చెందడు. వివాదానికి దారి తీస్తుంది. ఒకొక్క వ్యక్తి ఒక్కో రకంగా వ్యాఖ్యానిస్తాడు. కాబట్టి నేను వీటి లోతులవైపుకి వెళ్ళను. నేను వర్ణ వ్యవస్థని సమర్ధించను. ద్వేషాన్ని సమర్ధించను. నా పుస్తకంలో ఎటువంటి ద్వేషము కనిపించదు. నాకు తెలిసి మన దేశంలో ఒక గొప్ప జాతిగా (బ్రాహ్మణ) ఉండేది. వారిది భాగస్వామ్యము ప్రథానమైన. వాళ్ళ ఐ.క్యూ.ని చూస్తే వాళ్ళు ఇప్పటికీ అనేక రంగాలలో గొప్ప పనితీరుని కనబరుస్తున్నారు. వాళ్ళ మేథని దేశం కోసం మరింత గొప్పగా వాడుకుంటే... నేడు వాడుకుంటున్నారు కూడా.. మరింత లాభాన్ని పొందవచ్చు. మరొక విషయం నేను అనుకునేది.. వర్ణ వ్యవస్థ ఏర్పడినప్పుడు, అది ఎవరి పట్లు ద్వేషంతో కూడినది కాక సమాజం సౌఖ్యంగా కొనసాగడానికి ఏర్పడిన పని విభజన మాత్రమే. కాలంతో పాటు ద్వేషం విస్తరించింది. కానీ చాణుక్యుడు లాంటి గొప్పవాడు, చంద్రగుప్త మౌర్యుడులాంటి గొప్ప రాజుని నిర్మాణం చేసాడు. విశాలమైన, సమర్ధవంతమైన భారత నిర్మాణం చేసాడు. బ్రాహ్మలు ద్వేషానికి బదులు దేశం యొక్క ఏకత్వం కోసం పని చేసారు. అందరి కోసం పని చేసారు. ప్రేమ పంచారు. వాళ్ళా ఆశీర్వాదం అందరికి ఉంటుంది. బ్రాహ్మణుడు అంటే ఏకత్వానికి పేరు. అక్కడ ద్వేషానికి స్థానం లేదు. నేను ఒక కులానికి చెందిన వాడిని కాబట్టి, మరొకరిని తక్కువ అనుకునే వారికి నేను సమర్థకుడిని కాను. బ్రాహ్మణుడు దేశం యొక్క ఏకత్వానికే ఉన్నాడు. వాళ్ళు సమర్ధ భారత్‌ని నిర్మిస్తారు. నేను అస్పృశ్యత, వర్ణ వ్యవస్థ, ఎక్కువ-తక్కువని నేను ఎంత మాత్రం సమర్ధించను. విశ్వసించను. భారతీయలమైన మనం అందరము ఒక్కటే.


పాత్రికేయుడు- పుస్తకం వచ్చాక అందులో ప్రత్యేకత ఏమి ఉంటుంది. పాఠకుడికి ఆకర్షణ ఏమిటి.

ని.ఖా.- పాఠకులు దీనిని సమీక్ష చేస్తారు. ఇద ఒక రకమైన ఫిక్షన్. ఇది ఒక కాల్పనిక కథ. కానీ ఇది భారత దేశాన్ని దర్శింపజేస్తుంది. ఇది ఒక మంచి ప్లాట్ కలిగి ఉంది. మంచి నవల. మంచి కథ ఉంది. స్వాతంత్ర్యం తరువాత పరిస్థితులు ఎలా మారాయనే విషయాలు కళ్ళు తెరిపించేలా ఉంటాయి. ఏ విధంగా భౌతికవాదంతో మన పర్వావరణ ముడిపడింది. ఏ విధంగా భౌతికవాదం మన సమాజాన్ని బలహీనం చేస్తోంది. పశ్చిమం ఏ విధంగా మనల్ని ఆధారపడేలా చేసింది. మన సంస్థలు, సంస్కృతి ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నాయి. బ్రాహ్మణుడితో పాటు నేడు దేశం యొక్క స్థితి ఎలా ఉంది, మన బలము, బలహీనతలు ఏమిటి, భారత దేశాన్ని ఏ విధంగా బలసంపన్నం చేయగలము, ఏ విధంగా బ్రాహ్మణులను మంచి పాత్రని కల్పించి, దేశం ముందు ఉన్న సమస్యలను ఏ విధంగా అధిగమించవచ్చు ఇవి అందులో ఉన్నాయి. పుస్తకం వచ్చిన తరువాత దానిని ఆమూలాగ్రం చదవనంత వరకూ రచయిత ఒక కథనంతో, నవలగా, పిక్షన్‌ని నిర్మించుకుని ఏ ఉద్దేశ్యాన్ని, సందేశాన్ని చేరవేయాలనుకుంటున్నాడో అది అర్థం కాదు. కానీ నిశ్చితంగా చెప్పేదేమిటంటే, భారత్ దర్శనమిస్తుంది, భారత్ సాధించినది తెలిసవస్తుంది. స్వాతంత్ర్యం తరువాత ఏ పరిస్థితులు ఏర్పడ్డాయి, ఏ ఏ సంఘర్షణ చేయవలసి వస్తోంది లాంటి విషయాలు తెలుస్తాయి. బ్రాహ్మణులను కేంద్రంలో పెట్టుకుని నవల యొక్క కథ ముందుకి సాగుతుంది.


పాత్రికేయుడు- మీరు బ్రాహ్మణులే ఎందుకని కథావస్తువుగా ఎంచుకున్నారు. 


ని.ఖా.- ఇవాళ కాకపోతే రేపు ఎవరో ఒకరు రాస్తారు. తెల్లవారు చాలా శక్తిమంతులు. చాలా జ్ఞాన వంతులు ఓలంపిక్‌లో గోల్డు మెడలులన్నీ వాళ్ళే సాథించగలుగుతారు. బుకర్ ప్రైజ్‌లు, ఆస్కార్లు అన్నీ వారికే వస్తుంటాయి. వైజ్ఞానికల విషయం కూడా అలాంటిదే. నేను బ్రాహ్మణుల గురించి మాట్లాడుతున్నానంటే వాళ్ళది కూడా ఒక గొప్ప చరిత్ర ఉంది. పూర్తి చరిత్రలో చాణుక్యుడులాంటి వ్యక్తి, అతడు వ్యూహకర్త, ఆర్థికవేత్త, రాజకీయవేత్త, ఆచూర్యు ఇలా అనేక గుణాలతో నిండిన వాడు. చాణుక్యుడు లాంటి మరొక వ్యక్తి భారత్‌లో పుట్టడేమో. చాణుక్యుడు నిజాయితీకి కొలబద్దలాంటి బ్రాహ్మణుడు. దధీచి, పరశురాముడు వీళ్ళ చరిత్ర చాలా గొప్పది. భారత్‌ ఇప్పటికీ వీళ్ళని తలుచుకుంటుంది. చరిత్రలో వీళ్ళు గొప్ర పదర్శన చేసి చూపించారు. అది మరిచిపోలేనిది. నేను వాటినే గుర్తు చేసుకుంటున్నాను. వాళ్ళు ప్రత్యేకము. చరిత్రని మార్చగలిగారు. సంరక్షణ చేయగలిగారు. దేశ సీమలను బలసంపన్నం చేసారు. అవసరమైనప్పుడు కత్తి దూసారు. శాస్త్రాలను అధ్యయనం చేసారు. భారతీయులను కలిపారు. సంస్కృతిని రక్షించారు. అటువంటి అద్భుతమైన ప్రదర్శన చేసిన వర్గం తప్పకుండా కథావస్తువు. గొప్ప కథ.


పాత్రికేయుడు- ఒక సమయంలో మీరు మీ పేరుని మార్చుకోవాలని అనుకున్నారు. దేశంలో దీనిపై విస్తృతంగా చర్చ కూడా జరిగింది. 


ని.ఖా.- నేను ప్రతీకాత్మకంగా ఒక ట్వీట్ చేసాను. 50 మంది లేదా 100 మంది కలిసి ఒక బలహీనుణ్ణి చుట్టు ముంటిట కొట్టడంలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. ముస్లిము అయినా క్రైస్తవుడైనా అందరమూ భారతీయులమే ఎవరు లించింగ్‌కి గురిఅయినా ఒక భారతీయుడి ప్రాణం పోతుంది అనే సందేశాన్ని నేను నా ట్వీట్ ద్వారా ఇచ్చాను. దేశంలో ఒక ధర్మాన్ని ఆధారం చేసుకుని ఇటువంటి సంఘటనలు జరగకూడదనేదే నా అభిప్రాయం. ఇటువంటి సంఘటనల గురించి ఆలోచించాలని, వీటిని ఆపుచేయాలనే ఉద్దేశ్యంతో ఆ ట్వీట్ చేసాను. ఆ ట్వీట్ ద్వారా జాగరణ తెద్దామని అనుకున్నాను.


పాత్రికేయుడు- నియాజ్ ఖాన్ కశ్మీర్ ఫైల్స్, పఠాన్ ఈ రెండింటిని వ్యతిరేకిస్తారెందుకని.


ని.ఖా.- మీరు కశ్మీర్ ఫైల్స్ ని ఒక సారి చూడండి... బ్రాహ్మణుల..

పాత్రికేయుడు- మీపైన ప్రభుత్వానికి కూడా చాలా కోపం వచ్చిదిం...


ని.ఖా.- నేను బ్రాహ్మణులను నా సంపూర్ణ సమర్ధనని తెలియజేసాను. నేను అన్నది కాశ్మీర్ ఫైల్స్ చాలా ధనం సంపాదించింది. వాళ్ళ (బ్రాహ్మల) కథపైన డబ్బు సంపాదించారు కాబట్టి వాళ్ళ పిల్లలకి విద్యాభ్యాసానికి, ఇళ్ళ నిర్మాణానికి ఆ డబ్బుని వ్యయం చేయాలని అన్నాను. బ్రాహ్మల బాధని చూపించారని నేను సినిమాని అభినందించాను. నేను ముస్లిమ్ ఏంగల్‌లో మాట్లాడేసరికి దానిని ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారు. వాస్తవానికి బ్రాహ్మణుల బాధయే నా భావనగా వ్యక్తమైంది. నాకు ఎటువంటి దురుద్దేశ్యము లేదు. కానీ ని.ఖా. అనే ఒక ప్రత్యేకమైన వాడు మాట్లాడాడు అనే దృశ్యా తప్పుగా ప్రజలలోకి వెళ్ళింది. అలా ఒక దాన్ని పట్టుకుని మరొక దానిని వదిలేయడం వలన నాకు విరుద్ధంగా ప్రచారం జరిగింది. వాస్తవానికి నాకు సినిమాపై మంచి భావనే ఉంది. బ్రాహ్మలు నిజంగా చాలా బాధని అనుభవించారు. అందుకే సినిమా బాగా ఆడింది, డబ్బు వచ్చింది. కాబట్టి బ్రాహ్మలకి సహాయం అందించడానకి ఆ డబ్బు వెచ్చించడం నైతిక బాధ్యత అనేది నా ఉద్దేశ్యం. 


పాత్రికేయుడు- మీ పుస్తకం విపణిలోకి రావడానికి ఇంకా ఎంత కాలం పడుతుంది.


ని.ఖా.- 10-15 రోజులలో వస్తుంది. బహుశా మార్చిలో. అమెజోన్, కిండల్‌లో కూడా లభిస్తుంది. 


పాత్రికేయుడు- పుస్తకావిష్కరణకి ఎవరిని పిలుస్తున్నారు..


ని.ఖా.- ఎవరిని పిలవాలనేది ఇంకా అంతిమ నిర్ణయం అవ్వలేదు.

పాత్రికేయుడు, ని.ఖా.- కృతజ్ఞతలు..


https://www.youtube.com/watch?v=Rxy4omX515I&ab_channel=NBTMP-Chhattisgarh

లింగార్చన

 శివునికి సంబంధించిన ప్రశ్న, జవాబుల రూపంలో  🙏🙏🙏


1.లింగార్చన అనగా నేమి?

జ. మనలో లింగశరీరమనగా సూక్ష్మ శరీరం అనగా అంతఃకరణాలు కనుక మనసారా చేసే అర్చనే " లింగార్చన "అంటారు.


2) లింగం అనగానేమి? 

జ) *లీనం గమయతీతి లింగం.* 

*దేనియందు సమస్తమూ లయమునొంది మరల పుట్టుచున్నదో అదే లింగమ్. ఈ చరాచరాత్మక విశ్వమే లింగము / లింగస్వరూపం.*

అదే పరమాత్మకుగుర్తు.( ఒక దేశానికి జెండా ఎలా ఒక  గుర్తో, అలా పరమాత్మ కి గుర్తు లింగము.)ఆ చైతన్యమే" లింగం ". ఆచైతన్యాన్ని జ్యోతి అంటారు. అదే జ్యోతిర్లింగం.


3. బేరార్చన అనగానేమి?

జ) బేరము అనగా " విగ్రహరూపం " విగ్రహరూపంలో అర్పించడమే" బేరార్చన "


 4) శివునికి మహాదేవ, దేవదేవ అని ఎందుకు పేరు?

జ |సర్వదేవతాశక్తి శివునిదే. అంతేకాక మనం తప్పు చేస్తే దేవతలు శిక్షిస్తారు. దేవతలు తప్పు చేస్తే శివుడు శిక్షిస్తాడు.

అందుకు దేవదేవుడు, మహాదేవుడు,


5) బాణం అనగా నేమి?

 జ) పానవట్టం లేని లింగంను బాణం అంటారు 


6. దానికాపేరు ఎలా వచ్చింది?

జ )బాణాసురుడు మహా భక్తుడు. అతని పేరు మీదుగా ఆ పేరు వచ్చింది. అతను నర్మదా తీరంలో తపస్సు చేసినప్పుడు శివుడు అనుగ్రహించి, ఇక్కడ నదిలో లభించే  లింగములకు నీ పేరుతో వ్యవహారింపబడతాయని వరం ఇచ్చాడు.అందుకు ఆ పేరు. 


7) అవి ఎక్కడ దొరుకుతాయి?

జ) నర్మదా నదిలో


8) శబ్దలింగమనగా నేమి?

జ) అక్షరాలకి మూలమైన *ఓంకారమే శబ్ద లింగం.


9) సూర్యుడు ప్రత్యక్ష దైవం. ఎందుకు?

జ ) రుద్రకళలు 11. అవే ఏకాదశ రుద్రులు. అలా 5 చోట్ల ఉంటాయి. అనగా 5×11=55. ఈ 55 రుద్రకళలు సూర్యునిలో

ఉండటం మూలానా సూర్యుడు ప్రత్యక్షదైవమయ్యాడు.


( జిజ్ఞాసువుల కోసం :- ఆ 5 చోట్లు - ఆధిభౌతిక ప్రపంచం లోని 11 రుద్రకళలు), 

(b) ఆధ్యాత్మ (శరీరంలో వ్యాపించిన 11

రుద్రకళలు), 

(c) ఆధిదైవిక ( సృష్టిలోని 11 ప్రకృతి దేవతలు వారే అధిదేవతలు), 

(d) అధియజ్ఞ ( యజ్ఞమునందు ఆరాధింపబడే 11 రుద్రకళలు), (ఆ) అధ్యంతరిక్ష అనంతంగా వ్యాపించిన అంతరిక్షంలోని 11) రుద్రతేజోకళలు ఈ 55

కళలు ఒకేచోట ఉంటే లింగం ఉంటారు. అవి సూర్యునిలో ఉన్నాయి కనుక ఆ సూర్యలింగమే ప్రత్యక్ష దైవం.


10) రుద్రాభిషేకం ఎందుకు?

జ ) 55 రుద్రకళలను కలిపి లింగంలో ఆవాహన చేయడానికే రుద్రాభిషేకం

11) గ్రహస్థితి సరిగ్గా లేకపోతే ఏo చెయ్యాలి?

జ ) రుద్ర మంత్రాలలో 55 రుద్రకళలుంటాయి. వాటితో అభిషేకం చేసినప్పుడు, శక్తివంతమై, మన గ్రహస్థితినే

మారుస్థాయి.


12.శివాలయాలలోనే నవగ్రహాలుంటాయి ఎందుకు ?

జ) గ్రహాలని ఆయా స్థానంలో  పెట్టినవాడు శివుడు. శివుని పట్టుకుంటే గ్రహ బాధలుండవు. అందుకు శివాలయాల్లోనే నవగ్రహాలుంటాయి. గ్రహాలన్నీ *శివానుగ్రహాలే* .


13)అన్ని లింగార్చనల్లోకి శివుడికి ఇష్టమైనదేది?

జ ) ఆధ్యాత్మ లింగార్చన.

హృదయమునందు జ్యోతి రూపంలో ఉన్న లింగాన్ని ఆరాధించుట.


14. లింగోద్భవ కాలం లో బ్రహ్మ అసత్యం పలికాడు. అయినా బ్రహ్మకు , శివుడు వరం ఎందుకు ఇస్తాడు?

జ. విష్ణువు శివుని వద్దకు వెళ్లి, ఈశ్వర చిహ్నం గా బ్రహ్మ కి 5 ముఖములు ఇచ్చావు. అంతేకాక మొదటగా వచ్చిన  దైవం అయిన బ్రహ్మను క్షమించమన్నాడు. బ్రహ్మ కూడా శరణు జొచ్చాడు.


15. మరి  అప్పుడు శివుడు ఏం వరం ఇచ్చాడు ?.

జ.  బ్రహ్మ కు యజ్ఞములలో గురుస్థానము ఉండేట్టు వరమిచ్చాడు.


16. కామధేనువు కు శిక్ష  ఏమిటి?

జ. ముఖంతో అసత్యం పలికినందుకు ఆ భాగానికి పూజ లేదని, పృష్ఠ భాగం సత్యం పలికినందుకు అదే ఆరాధనీయ

స్థానమని చెప్పాడు.


17. మొగలి పువ్వు ను సంస్కృతంలో ఏమంటారు?

జ. కేతకీ


18. దానికి శివుడు వేసిన శిక్ష ఏమిటి ?

జ. పూజకు పనికి రావని.


19. మొగలి పువ్వు ఏమని వేడెను?

జ. పరమశివుని వైన నిన్ను చూశాక కూడా నాకు ఇంకా దోషాలుంటాయా స్వామి అని ఆర్తి గా అడిగింది. 


20.శివుడు ఎలా స్పందించాడు?

జ. సంతుష్టుడైన శివుడు నీవు పూజకు పనికిరావు కానీ స్త్రీ సిగలో అలంకారం లాగా, దేవతలకు ఛత్రం లాగా ఉండి

సార్ధకత పొందుతావన్నాడు.


కెర్లెపల్లి బాలసుబ్రమణ్యము

పుంగనూరు ఇలాంటి మరిన్ని పోస్ట్‌లను చూడటానికి మరియు All India Arya Vysya Sangam చేరడానికి, ఇక్కడ క్లిక్ చేయండి

https://kutumbapp.page.link/?isi=1598954409

భీష్మ నిర్యాణం

 ముసలి వారిని అంత్య క్షణాలలో ఉన్న వారిని ఏ విధంగా చూడాలి అనే విషయం మహా భారతం లో చెప్పారు. దానినే ఇవాళ ఆధునిక వైద్యనిపుణులు చెప్తున్నారు.


ఆధునిక ప్రపంచ వైద్యులను విస్మయ పరిచే అంశం భీష్మ నిర్యాణంలో ఉంది

ప్రపంచంలో మొదటి ఆధునిక అంత్యదశ సేవాశ్రమం అనే హాస్పీస్ ను 1967లో ఇంగ్లండుకు చెందిన నర్సు ఏర్పాటు చేసిందని అంటున్నారు.

దీనికి ముందర క్రీస్తు శకం 11వ శతాబ్దంలో క్రైస్తవంలోని రోమన్ కేథలిక్కు వర్గానికి చెందినవారు ఏర్పాటు చేశారనే వారు కూడా ఉన్నారు.

కానీ వీటన్నింటికన్నా ముందర మహాభారతంలో భీష్మనిర్యాణ ఘట్టంలో అంత్యదశ సేవల గురించి అద్భుతమైన వివరణ ఉంది.

అదేమిటో చూద్దా౦

భీష్ముడు కురుక్షేత్ర యుద్ధంలో 10 రోజులు పోరాడి ఒళ్ళు అంతా బాణాలు గుచ్చుకోగా నేలకు ఒరిగిపోయాడు.

అయితే ఆయన వెంటనే చనిపోలేదు క‌దా.

58 రోజులు అ౦ప‌శ‌య్య‌ (బాణశయ్య) మీద బ్రతికారు. ఆ 58 రోజుల్లో భీష్ముడిని పాండవులు చూసుకున్న తీరులో ఆధునికులు కూడా నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నింటినో తెలుసుకోవ‌చ్చు.

భీష్మ నిర్యాణంపై ఆంధ్రవ్యాసుల వారు చెప్పిన వివరాలు చూద్దాం..

‘‘మనం చాలా తప్పు చేస్తున్నాము. సీనియర్ సిటిజన్ల పేరుతో 60 ఏళ్ళు కాగానే ముస‌లాళ్ళుగా ముద్రవేసి వారిని పట్టించుకోవడంలేదు.

కానీ విదేశాల్లో వృద్ధుల నుంచీ ఎన్నో రహస్యాలు తెలుసు కుంటున్నారు.

జీవితంలో వారు గడించిన అనుభవాలను విదేశీయులు సేకరించి వారివారి రంగాలకు మెరుగులు దిద్దుకుంటున్నారు.

మనం వాళ్ళలాగా ఆలోచి౦చ‌లేక‌ పోతున్నాం. ముసలాళ్ళు ఒక బరువు అనుకుంటున్నాము.

ఎంతో విలువైన అనుభవసారాన్ని కోల్పోతున్నాము !

ప్రతీ వృద్ధుని దగ్గరా తాను పనిచేసిన రంగంలో విశేషమైన అనుభవ జ్ఞానం ఉంటుంది.వారి వ‌ద్ద‌ ఆ అనుభ‌వాల‌ను సేక‌రి౦చ‌గ‌ల‌గాలి. నిజానికి దీనివల్ల వృద్ధులకు కూడా తమను సమాజం నిర్లక్ష్యం చేస్తోంది అనే భావన పోతుంది. మనకు దాని వల్ల వివిధ రంగాలకు కావలసిన అనుభవ జ్ఞానం వస్తుంది.

ఈ విజ్ఞానం ఎన్ని కోట్ల రూపాయలు ఖ‌ర్చు చేసి పరిశోధనలు చేసినా దొరకదు.

కేవలం వృద్ధుల దగ్గర మాత్రమే ఆ అనుభ‌వ‌ జ్ఞానం ఉంటుంది.

దీనికి అద్భుతమైన ఉదాహరణ మహాభారతంలో ఉంది.

18 రోజుల యుద్ధంలో

18 అక్షౌహిణుల సైన్యం నాశనం అయ్యాక, దుర్యోధనుడు కూడా చనిపోయాక, ధర్మరాజు పట్టాభిషేకం ద్వారా చక్రవర్తి అయ్యాడు.

ఈ సమయంలో ధ‌ర్మ‌రాజుకు వ్యాసుడు, కృష్ణుడు అద్భుతమైన సలహా ఇస్తారు.

అప్పటికి భీష్ముడు ఇంకా జీవించే ఉన్నాడని ధర్మరాజుకు గుర్తు చేస్తూ అపారమైన జ్ఞాన సంపద ఆ కురు వృద్ధుడి దగ్గర ఉందని ఆయన గతిస్తే ఆయనతో పాటే ఆ మహావిజ్ఞానం అంతరిస్తుందని, కనుక వెళ్ళి తాతను సేవించి తెలుసుకోమని సలహా ఇస్తారు.

వారి సలహా వల్ల భారతంలోనే అతి పెద్ద పర్వం "శాంతి పర్వం" పుట్టింది.

అందులో *భీష్ముడు చెప్పిన విషయాలు సకల శాస్త్ర సారాలు.* విష్ణుసహస్ర నామం కూడా అందులోదే.

కనుక వృద్ధులను సేవించడం వలన సమాజానికి ఏ౦ ప్రయోజనం ఉంటుందో భారతం తెలుపుతోంది.

ఆంధ్రవ్యాసుల వారి మార్గ దర్శకత్వంలో మరింత లోతుగా పరిశోధన చేస్తే అద్భుతమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.

1. భీష్ముడు క్రింద పడగానే వేలాది కన్యలు వచ్చి ఆప్రదేశాన్ని శుభ్రంచేసి గంధపు పొడి, పేలాలుచల్లి, పూవులతో అలంకరించారని రాసారు.(వాళ్ళే ఇప్ప‌టి న‌ర్సులు)

2. భీష్ముడి దగ్గరకు ఎవరెవరు వచ్చారో వ్యాసుడు వివరంగా చెప్పాడు. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది.

తూర్యాణి శతసంఖ్యాని తథైవ నటనర్తకాః శిల్పినశ్చ తథాఽఽజగ్ముః కురువృద్ధం పితామహం ॥_

భీష్ముడి దగ్గరకు సంగీత వాయిద్యాలను వందల సంఖ్యలో తీసుకొని గాయకులు, నటులు, నర్తకులు, శిల్పులు (ఇంజనీరింగు విభాగంవారు) వచ్చారని వ్యాసుడు చెప్పాడు. ఇది చాలా ఆశ్చర్యం కలిగించే అంశం.

రోగి వేరు అంత్యకాలంలోని వ్యక్తి వేరు. చికిత్స ఉన్నంత కాలమే ఒక వ్యక్తి రోగి అవుతాడు. చికిత్స లేనప్పుడు అతడు పేషె౦టు కాడు. అతడికి చేయాల్సిన వైద్యం అంత్యకాల సేవ. అది వేరే ఉంటుంది.

అదే ఆరోజు పా౦డ‌వులు భీష్ముడికి చేశారు. అంత్యకాలంలో ఉన్న భీష్ముడికి ఆనందం కలిగించడం కోసం నటులు, నర్తకులు, గాయకులు, సంగీతకారులు వచ్చారు. నేడు కూడా ఆసుపత్రులలో సైతం టివిలు, మ్యూజిక్ సిస్టంలు ఉంచుతున్నారు. ఇక పాలియేటివ్ కేర్ సెంటర్లలో అయితే అంత్యకాలంలో వారు ఆడుకోవడానికి ఆటవస్తువులు కూడా ఉంచుతున్నారు._

ఇక్కడ అతిముఖ్యమైన అంశం ఏమిటంటే భీష్ముడి దగ్గరకు వారంతా వచ్చారు. అంతేకానీ వారు ఎవరు సంగీత వాయిద్యాలను వాయించారని కానీ, నటులు, నాట్యకారులు నాట్యం చేశారని కానీ చెప్పలేదు. దీనికి కారణం భీష్ముడు తాను మానవ భోగాలకు అతీతుడను అయ్యాను అనినందువల్ల. అయితే వేల సంవత్సరాల క్రితం భారతంలో పాలియేటివ్ కేర్ పురుడుపోసుకుందని చెప్పడానికి ఇది రెండో అతి ముఖ్యమైన శ్లోకం భీష్మపర్వంలో ఉంది.

3. దీని తరువాత అతి ముఖ్యమైంది శాంతిపర్వంలో ఉంది.

"భీష్ముడి మరణశయ్య దగ్గరకు భూమి మీద నివ‌సి౦చిన‌ మ‌హారాజులే కాదు.. ముల్లోకాల్లో ఉన్న మహర్షులు, యతులు, పరమహంసలు, దేవతలు అ౦ద‌రూ వచ్చారు.

వారిలో నారదాది సంగీత విద్వాంసులు ఉన్నారు.

శ్రీకృష్ణుడు వచ్చి భీష్ముడి బాధలు పోగొట్టగానే వ్యాస మహర్షితో కూడిన సమస్త రుషి గణాలూ రుగ్, యజుస్, సామగానాలు చేశారు. అన్ని రుతువులకు చెందిన పుష్పాలు ఏక కాలంలో విరిసి కురిశాయి. దేవతలు, అప్సరసలు వచ్చి సంగీత వాయిద్యాలు మ్రోగించి గానం చేశారు. పవిత్రమైన, ప్రశాంతమైన, స్వచ్ఛమైన చల్లటి గాలి వీచింది. ఆ ప్రాంతంలో ఉన్న సమస్త జంతు పక్షిజాతి సుఖాన్ని ఆనందాన్ని అనుభవించాయి. భీష్మునికి అత్యంత ఆనందదాయకమైన వాతావరణం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణుడు సూర్యాస్తమయం చూసి రేపు వస్తానని వెళ్ళాడు.

ఇక్కడ ఇచ్చిన ప్రతి వర్ణన అంత్యదశసేవల్లో చాలా ముఖ్యమైంది. దీనిలో, రెలిజియస్ హీలింగ్, యోగా, మ్యూజిక్ థెరపీ, పుష్పవైద్యం వంటివి ఉన్నాయి.

అన్నిటికీ మించి పేషంటుకు ఉన్న విజిటర్స్ సమయాన్ని మహర్షులు కూడా గౌరవించి అస్తమయం అవుతుండడంతో మరలా రేపు వస్తానని కృష్ణుడు, ధర్మరాజు, భీష్ముడు వద్ద శలవు తీసుకొని వెళ్ళిపోయారు. ధర్మరాజు, కృష్ణుడు కూడా వెళ్ళిపోయారు.

4. ఇక్కడ అతి ముఖ్యమైన వర్ణన వ్యాసుడు చేస్తాడు. పాండవుల రథాలు వెళ్ళిన తీరు మహానదిని తలపించిందని చెప్పాడు.

తతో రథైః కాంచనచిత్రకూబరై ర్మహీధరాభైః సమదైశ్చ దంతిభిః।

హయైః సుపర్ణైరివ చాశుగామిభిః పదాతిభిశ్చాత్తశరాసనాదిభిః

యయౌ రథానాం పురతో హి సా చమూ

స్తథైవ పశ్చాదతిమాత్రసారిణీ।

పురశ్చ పశ్చాచ్చ యథా మహానదీ

తమృక్షవంతం గిరిమేత్య నర్మదా॥

ఈ వర్ణన చదవకపోతే తరువాత ధర్మరాజుకు ఉన్న మహత్తరమైన విజ్ఞానం మనకు అర్థం కాదు.

5. మర్నాడు ధర్మరాజు ఉదయాన్నే భీష్ముని దర్శనానికి వెళుతూ అర్జునుడిని పిలుస్తాడు. పిలిచి ఇలా అంటాడు.

‘‘అర్జునా ఈ రోజు ఏవిధమైన మందీ మార్బలం, సైన్యం లేకుండా నేను సోదరులతో మాత్రమే వెళ్లదలచాను. మన అశ్వగజరథ సైన్య పరివారం వెళ్ళివస్తూ ఉండడం వలన అంపశయ్యమీది భీష్ముడికి ఇబ్బంది కలుగకూడదు. కనుక సైన్యాన్ని, భటులను వద్దని చెప్పు. ఈ రోజు నుంచీ నేను భీష్ముడి దగ్గర ముఖ్యమైన రహస్యాలు తెలుసుకోబోతున్నాను. కనుక అనవసరమైనవారు అక్కడకు రావ‌డం నాకు ఇష్టంలేదు‘‘ అన్నాడు.

ఇది నేటికీ ఆచరించదగిన ముఖ్య విషయం. ఎవరైనా గొప్ప వ్యక్తి చనిపోవడమో, జబ్బుపడడమో జరిగితే ముందుగా ట్రాఫిక్కు పోలీసుల గుండెలు ఆగిపోతాయి. వచ్చేవారు పలకరించడానికి వస్తున్నారా ? లేక తమ హోదాలు వెలగబెట్టుకోవడానికి వస్తున్నారో తెలియని సందర్భాలు కోకొల్లలు. భారీగా వాహనాలు రోడ్ల మీద పార్కుచేసి ట్రాఫిక్కు స్తంభింప చేయడంతో మొదలుపెడితే గన్ మెన్లు హోదా చూపించుకోవడం, బుగ్గకార్ల హడావుడి ... ఇదంతా చూస్తే ఎంత ఇబ్బ౦దిగా ఉంటుందో ఒక సారి ఎవరికి వారు గమనించుకుంటే మంచిది.

శ్రీకృష్ణుడు కూడా శైబ్య, సుగ్రీవ, వలాహక, మేఘపుష్ప అనే తన రథాశ్వాలను శబ్దం లేకుండా వెళ్ళమని ప్రార్థించాడట. పశువులైన ఆ గుర్రాలు మహావేగంతో పయనించినా భూమి మీద అతి సుకుమారంగా వెళ్ళాయని వ్యాసుడు చెప్పాడు. నేడు ఆసుపత్రుల దగ్గరకు వాహనాలలో వెళ్ళేవాళ్ళు ఆ గుర్రాలను చూసి నేర్చుకోవ‌ల‌సి౦ది ఎ౦తో ఉ౦ది.

ఆసుపత్రి ఏరియా దయచేసి హారన్ మ్రోగించవద్దు అనే బోర్డు ఎవరూ పట్టించుకోరు. లోపల మరణావస్థలో ఉన్నపేషంట్ల వినికిడి అవయవాలు మహాబాధ పెడతాయని ఎప్పటికి తెలిసి వస్తుందో నేటి వాహన చోదకులకు ?

మహాభారతం నేడు కూడా ఎందుకు అనే ప్రశ్నకు ఈ శ్లోకాలు చాలు. ఎంత నిర్లజ్జగా మనం నేడు బ్రతుకుతున్నామో తెలియడానికి.

వేల సంవత్సరాల క్రితం మరణ శయ్య మీద ఉన్న‌ వ్యక్తి దగ్గరకు ఎలా వెళ్ళాలో చెప్పిన మరో గ్రంథం ప్రపంచంలో మరొకటి లేదు.

వ్యాసుడు చెప్పిన‌ లక్షా పదివేల శ్లోకాల్లో ఏం ఉందో చదువుకుంటే మనిషిగా మనం ఎంత ప‌సి (పశు) ప్రాయంతో జీవిస్తున్నామో తెలుస్తుంది. నేటి ప్రభుత్వాల కారణంగా మాత్రు భాష‌ అడుగంటి భారతంలో ఏం ఉందో చదివి తెలుసుకోలేక బ్రతుకుతున్నాము.

ఏ అమెరికా, ఇంగ్లండు వారో హాస్పీస్ సేవలు మా దగ్గరే పుట్టాయి అంటే నిజమే కాబోలు అనుకునే జాతి తయారైంది. ఇక‌నైనా క‌ళ్ళు తెరుద్దాము. మన౦ కాక‌పోయినా మ‌న‌ వార‌సుల‌కైనా భాష‌ ప‌ట్ల‌...స‌నాత‌న‌ సా౦ప్ర‌దాయ‌ల‌ ప‌ట్ల‌.

గ్ర౦థ‌ ప‌ఠ‌న౦ ప‌ట్ల‌ ప్రేమాభిమానాలు క‌లిగేలా చ‌దువు చెప్పాలి

బాల్య౦ ను౦డే ప౦చ‌త౦త్ర౦.. భార‌త‌ రామాయ‌ణ‌ గాథ‌లు చెప్పాలి

ద‌య‌చేసి పాఠ‌శాల‌ చ‌దువే కాదు. పాత‌కాల‌ పురాణాల‌ ప‌ట్ల‌ అవ‌గాహ‌న‌ క‌లిగి౦చ౦డి. గ్ర౦థ‌ ప‌ఠ‌న౦ స౦స్కారాన్ని నేర్పుతు౦ది. న‌డ‌వ‌డిక‌ నేర్పుతు౦ది. మ౦చి మ‌నిషిగా తీర్చిదిద్దేది పుస్త‌క‌ ప‌ఠ‌న‌మే సుమా.

నేటి బాల‌లే రేప‌టి రాజులు ! క‌ష్ట౦ తెలిసిన‌వారే సుఖ‌ప‌డ‌గ‌ల‌రు....

స‌ర్వేజ‌న‌ సుఖినో భ‌వ౦తు