27, ఏప్రిల్ 2022, బుధవారం

క్రిముల ( WORMS ) గురించి

 క్రిముల ( WORMS ) గురించి సంపూర్ణ వివరణ -1 


        క్రిములు అనేవి అజీర్ణవ్యాధి వలన కలుగును. పాశ్చాత్య వైద్యులు ఆయుర్వేద శాస్త్రము నందు క్రిముల విషయము క్రిముల గురించి ఎక్కడా ఇవ్వలేదు , చెప్పబడలేదు అని , క్రిములకు ప్రాధాన్యత ఇవ్వబడి ఉండలేదని పొరపాటు అభిప్రాయముతో ఉన్నారు . ఆయుర్వేదం నందు క్రిమివ్యాధులకు కూడా అవసరం ఉన్నంత వరకు ప్రాముఖ్యత ఇవ్వబడినది. ఇప్పుడు మీకు ఆయుర్వేదం నందు క్రిముల గురించి ఏమి చెప్పారో మీకు సంపూర్ణముగా వివరిస్తాను. ఇదే విషయము పైన అంతకు ముందు నేను మీకు ఒక పోస్టులో కొంత వివరించాను. ఇప్పుడు మరిన్ని విషయాలు వివరిస్తాను. 


        ఆయుర్వేదం నందు క్రిములను రెండురకాలుగా విభజించారు. అవి 


            1 - బాహ్యక్రిములు . 


             2 - అభ్యంతరములు . 


     త్వక్కులు మొదలగువాని యందు , స్వేదము మున్నగు బాహ్యమలముల యందు శ్లేష్మము , రక్తము , పురీషములను అభ్యంతర మలముల యందు నాలుగు రకములుగా క్రిములు జనించుచున్నవి. 


          ముందుగా మీకు బాహ్యక్రిమి లక్షణం వివరిస్తాను. ఈ బాహ్యక్రిములు 20 రకములు కలవు. ఇవి నువ్వులంత పరిమాణమున ఆకారము కలిగి ఆరంగుతో వస్త్రములను ఆశ్రయించి ఉండును. వీటిని నల్లులు అని పిలుస్తారు . జుట్టులో ఉండు యూక , ఈళ్ళు అని రెండు రకములు ఉండును . వాటిలో మరలా అనేక భేదములు ఉండును. ఎర్రటి మచ్చలు , బొబ్బలు , దురదలను , కంతులను కలిగించును. వీటికి బాహ్యక్రిములు అని పిలుస్తారు .  


             ముందుగా అసలు ఈ క్రిమిసంబంధ వ్యాధులు రావడానికి గల కారణం తెలుసుకుందాము . ఎవరైతే మొదట భుజించిన ఆహారం జీర్ణము కాకుండా మరలా భుజిస్తారో , ఎల్లప్పుడు మధురపదార్ధములను ఎక్కువుగా తీసుకుంటారో , ద్రవపదార్ధముల సేవన మీద మిక్కిలి ప్రేమ కలిగి ఉందురో , బెల్లము కలిసిన తిండి అధికముగా తినుదురో , కసరత్తు చేయనివాడు , పగలు నిద్రించువారు , పరస్పర విరుద్ద ఆహారములను భుజించువారు ఈ క్రిమివ్యాధులకు లోనగుదురు.  


        మినపపిండి , ఆమ్ల లవణ రసములు గల ద్రవ్యములు , బెల్లము , కూరగాయలు అధికముగా తినువానికి పురీషము నందు క్రిములు పుట్టును . 


            మాంసము , మత్స్యము , బెల్లము , పాలు , పెరుగు , పులిసిన ( తరువాణి ) వస్తువులు నిత్యము సేవించువానికి కఫము నందు క్రిములు పుట్టును . 


      అజీర్ణకరమైన శాకములు , విరుద్ద ఆహారములు తీసుకొనుటచేత రక్తము నందు క్రిమిదోషాలు కలుగును  . 


          క్రిముల మన శరీరం నందు ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేక లక్షణాలు కలుగును. మనం ఆ లక్షణాలని గుర్తించి దోషములకు చికిత్స చేయవలెను .  ఇప్పుడు మీకు వాటి గురించి వివరిస్తాను . 


      జ్వరము , శరీరం రంగు మారు ట , శూల , హృదయము నందు జబ్బు , శరీరాకృశత్వము , భ్రమ , అన్నద్వేషము , అతిసారం అనునవి ఉండువానికి శరీరము నందు క్రిమి ఉన్నదని తెలుసుకొనవలెను . 


           తరవాతి పోస్టులో మరింత విలువైన సమాచారాన్ని ఇస్తాను . 


   

          మరింత సమగ్ర సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


   గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

క్రిముల ( WORMS ) గురించి సంపూర్ణ వివరణ - 2 . 


       అంతకు ముందు పోస్టులో క్రిముల గురించి కొంత వివరణ ఇచ్చాను. ఇప్పుడు మరికొంత వివరణ ఇచ్చాను.  


     ఇప్పుడు కఫజ క్రిమి గురించి వివరిస్తాను. కఫము చేత ఆమాశయము నందు క్రిములు పుట్టును . అవి వృద్ది నొంది శరీరము నందు పైభాగము నందును క్రింద భాగము నందును కూడా తిరుగుచుండును . వీటిలో కొన్ని లావుగా , పొడవుగా ఫిడేలు చర్మపు తీగవలే ఉండును. ఇవి ఆమాశయము నందు , చుట్టుపక్కల ఆశయముల యందు పొరను అంటిపెట్టుకుని ఉండును. కొన్ని ఎర్రల వలే ఉండును. మరికొన్ని సమముగా పొడవుగా ఉండును. కొన్ని సూక్ష్మాకారముగా ఉండును. మరికొన్ని శ్వేత రక్తవర్ణముగా ఉండును. 


       కఫజక్రిములు 7 రకాలుగా ఉండును. అవి 


  * ఆంత్రాదములు - 


         ఇవి శరీరం నందలి ప్రేగులను తినుచుండును. 


  * ఉదరావేష్టములు - 


         ఇవి కడుపున చుట్టుకుని ఉండును. 


 * హృదయాదములు - 


         ఇవి హృదయము నందు తిరుగుచుండును. 


 * మహాగుదములు - 


        ఇవి వెడల్పైన గుదములు కల్గి ఉండును. 


 * భుఱువులు . 


 * దర్భ కుసుమములు - 


          ఇవి రెల్లు పువ్వుల వలే ఉండును. 


 * సుగంధములు -  


         ఇవి సుగంధము కలిగి ఉండును. 


        కఫజ క్రిముల వలన హృదయము నందు అదురుట , నోట నీరుకారుట , ఆహారం జీర్ణం కాకుండా ఉండుట , అరుచి , మూర్చ , వాంతి , జ్వరము , కడుపుబ్బరం , కృశించుట , తుమ్ములు , పీనస వంటి సమస్యలు కలుగును. 


  రక్తజ క్రిమి లక్షణము - 


       రక్తమున జనించిన క్రిములు మిక్కిలి సూక్ష్మమైన ఆకారము కలిగి ఉండును. పాదము పొడవు , గుండ్రమైన ఆకారం కలిగి ఉండును. ఎరుపు రంగు కలిగి రక్తం ప్రవహించు సిరలు యందు ఉండును. వాటిలో చాలా వరకు సూక్ష్మ ఆకారం కలిగి ఉండటం వలన కంటికి కనిపించవు. 


       ఈ రక్తజ క్రిమి మొత్తం 6 రకాలుగా ఉండును. అవి 


 * కేశాదములు - 


          ఇవి తల వెంట్రుకలను నశింపచేయును . 


 * రోమ విధ్వంసకములు - 


         ఇవి శరీరం పైన రోమములను రాలిపోవునట్లు చేయును . 


 * రోమద్వికములు - 


        ఇవి రోమకూపములను ఆశ్రయించి ఉండును . 


 * ఉదుంబరములు 


 * సౌరసములు . 


 * మాతలు .  


        ఈ రక్తజ క్రిమి వలన ముఖ్యముగా కుష్టువ్యాధిని కలిగించును. ఈ మాతలను జంతుమాతలు అని అంటారు. 


      పురీషజ క్రిమి లక్షణాలు గురించి తెలుసుకుందాము . ఇవి పక్వాశయమున పుట్టి అధోమార్గమున సంచరించును. ఇవి వృద్ధినొంది ఆమాశయమునకు పోయి సంచరించునప్పుడు త్రేన్పులు వచ్చును. ఉపిరి బయటకి విడుచునప్పుడు మలము వలే దుర్గంధము బయటకి వెడలును . వీటిలో కొన్ని లావుగా , కొన్ని గుండ్రముగా , కొన్ని స్థూలంగా , కొన్ని శ్యామల పీత వర్ణముగా , కొన్ని తెలుపు , నలుపు రంగులు కలవిగా ఉండును. ఇవి 5 రకాలుగా ఉండును. అవి 


   * కకేరుకములు . 


   * మకేరుకములు . 


   * సౌసుదాములు . 


   * లేలిహములు . 


   * సశూలములు . 


      ఈ పురీషజ క్రిముల వలన పురీషము ఉండలు ఉండలుగా వెడలుట , శూల , మలబద్ధము , శరీరం కృశించుట , గరగరలాడుట , ఒళ్ళు తెల్లబారి ఉండటం వంటి గుణములు కలిగి ఉండును. ఇవి తమ స్థానములను వదిలి ఇతర స్థానముల యందు సంచరించునప్పుడు గగుర్పాటు , అగ్నిమాంద్యము , గుద స్థానము యందు దురద అను ఉపద్రవములు కలుగును. పాండు రోగము కూడా కలుగును. 


                             సమాప్తము 


            మరింత సమగ్ర సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


   గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                    9885030034

    

       ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                    9885030034

    

       ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  .  మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

*బ్రహ్మ ముహూర్తం

 *నేటిమాట*


*బ్రహ్మ ముహూర్తం అనేది ఎలా వచ్చింది?*


బ్రహ్మదేవుడు సృష్టికర్త.


అలాంటి బ్రహ్మ పేరుతో వచ్చే ఓ ముహూర్తానికి ఉన్నత స్థానముందనే విషయం తెలిసిందే. 


బ్రహ్మమహూర్తం అనేది ఎలా వచ్చిందంటే,


కశ్యప బ్రహ్మకు, వినతకు జన్మించినవాడు అనూరుడు.


ఈయన గరుత్మంతునికి సోదరుడు. 


అనూరుడు సూర్యుని కి రథసారథి.


ఒక సమయములో తల్లి వినత పుత్రుడిని చూసుకోవాలని కుతూహలంతో "అండం'' పగలగొట్టింది. 


అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు.


బ్రహ్మ అతన్ని సూర్యునికి సారథిగా నియమించి, నీవు భూలోకాన మొదటగా కనిపించిన కాలమునే బ్రహ్మ ముహూర్త కాలమంటారు. 


ఆ సమయమున ఏ నక్షత్రాలు, గ్రహలుగాని చెడుచేయలేవు అని అనూరునికి వరమిచ్చాడు. 


అందుకే బ్రహ్మ ముహూర్తకాలం అన్ని శుభకార్యాలకు ఉన్నతమైనదని పండితులు అంటున్నారు. 


ఈ బ్రహ్మ ముహూర్త కాలమున చదివే చదువు.. 

చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురోహితులు చెబుతున్నారు.


*శుభమస్తు*


🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

ఆదిశంకరుల " మనస్సు "

 **********************

ఆదిశంకరుల " మనస్సు " 

**********************

మునుపెన్నడూ లేనిది ఈ మధ్య కాలంలో " మనోభావాలు " అన్న పదం ఎక్కువ ప్రాచుర్యం లోకి వచ్చింది. దీనికి మీడియానే కారణము.

.

కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి, రోజుకి ఇరవై నాలుగు గంటలు ఖర్చుపెట్టి, వందలు, వేలాది మందిని వాడుకొని, కోట్లాదిమందికి ’ అజ్ఞానాన్ని ’ పంచిపెడుతున్నది. 

.

మనోభావాలు.. అన్న పదం లేదని కాదు, దాన్ని ఎలాగ అవగాహన లేకుండా తప్పుగా వాడుతున్నారో చెప్పే ప్రయత్నమిది .

*********************************************

మన మనసే మన ఆలోచనలకు, చర్యలకు మూలము. మనస్సు వల్ల అత్యంత ఘోరమైన దుఃఖము, అమితానందము కూడా కలుగుతాయి. కలగడమే కాదు, ఆ మనసే వాటిని అనుభవిస్తుంది కూడా! 

మనిషిని , సంబంధాలను, జీవితాన్ని ప్రభావితం చేసే మనసు మహత్వం అంతా యింతా కాదు.

ఆది శంకరుల జయంతి సందర్భంగా, ఆ మనసేమిటో, దాని వ్యవహారమేమిటో, దాని కథా కమామీషు ఏమిటో ఆది శంకరుల మాటల్లోనే తెలుసుకుందాము.

**********************

మన దేహము బయట మనకు కనిపించే అయిదు కర్మేంద్రియాలు మాత్రమే కాక, మనకు మరో అయిదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. అలాగే లోపల కూడా దేహాన్ని నడిపించే అంతఃకరణము ఉంటుంది. అది చేసే విధులను బట్టి దాన్ని వేర్వేరు పేళ్ళతో పిలుస్తారు. మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము---ఇవన్నీ ఆ అంతఃకరణము నామాంతరాలే. 

.

మన శరీరం లో అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము  అని ఐదు కోశాలు ఉన్నది తెలుసు కదా..

.

ఈ మూడవదైన మనోమయ కోశము,  అయిదు జ్ఞానేంద్రియాలు, మరియు మనస్సు వల్ల ఏర్పడింది. ఈ సమూహములో మనసే ప్రధానమయినది. అందుకే దీన్ని " మనోమయ కోశము " అన్నారు. 

.

నేను, నా ఆస్తులు, నా భార్యా పిల్లలు, నా గొప్పదనము--వంటి భావనలకు పుట్టిల్లు ఈ మనసే. ఈ మనోమయ కోశము, స్థూలంగా చూస్తే , అటువంటి భావనలతో ప్రాణమయ కోశములో విజృంభిస్తూ ఉంటుంది.

కొందరు ఈ మనసే ’ ఆత్మ ’ అని పొరపడతారు. కాని ఇది ఆత్మ కాదు. 

.

యజ్ఞము చేసేవారికి తాము అగ్నిలో ఇచ్చు ఆహుతుల వలన ఎలా స్వర్గ సుఖాలు, ఇష్టార్థాలు దక్కుతాయో, అలాగ ఈ మనోమయ కోశాగ్నిలో ఇచ్చు ఆహుతుల వలన సుఖదుఃఖాలు కలుగుతాయి.

.

యజ్ఞం లో ఎలా అయితే పిడకలు, కర్రలు    ఇంధనం గా ఇస్తామో, అనేక జన్మాంతర సంస్కారాలు ఈ మనోమయ కోశాగ్నికి ఇంధనం గా మారుతాయి.  

యజ్ఞం లో ఎలా అయితే నెయ్యి మొదలైన వాటిని ఆహుతులుగా ఇస్తామో, ఇక్కడ విషయాకర్షణలు  మొదలైనవి ఆహుతులుగా మారుతాయి. 

యజ్ఞం లో ఋత్త్విక్కులు ఉన్నట్టే, ఇక్కడా మన ఇంద్రియాలే ఋత్త్విక్కులు. ఈ మనోమయకోశపు యజ్ఞము  వల్లనే మనకు ఈ దృశ్యమానమైన మాయా ప్రపంచము కనబడుతుంది. 

.

ఈ మనస్సే, అవిద్య. లేదా, అజ్ఞానం. " నేను చేస్తున్నాను" అన్న కర్తృత్వ భోక్తృత్వాలను కలిగించి, సంసార బంధాలను కలిగిస్తుంది. ఈ అవిద్య నాశనమయితేనే బంధ విముక్తి కలుగుతుంది. మనస్సు విజృంభిస్తున్నంతకాలమూ బంధాలు పెరుగుతూనే ఉంటాయి. 

.

స్వప్నములో ఒక మిథ్యా ప్రపంచాన్ని చూపేది కూడా మనస్సే.

స్వప్నములో ఎలాగైతే మిథ్యా ప్రపంచాన్ని మనసు చూపిస్తుందో, మేలుకున్నపుడు కూడా ఇంకో మిథ్యా ప్రపంచాన్ని చూపిస్తుంది. ఈ బాహ్య ప్రపంచానికీ, మిథ్యా ప్రపంచానికీ తేడా లేదు. ఈ ప్రపంచాలు మనస్సు కలిగించే విక్షేపమే తప్ప అవి వాస్తవాలు కాదు. 

.

కాబట్టి మనస్సు ఎంతటి శక్తివంతమయినదో అంత ప్రమాదకారి, అంతటి చంచలమైనది కూడా.

.

సంకల్ప వికల్పాలను కలిగించేదే మనస్సు.

వాయువు చేత మేఘాలు ఆవరింపబడి, చీకట్లు కమ్ముకుని, అదే వాయువు చేత మేఘాలు తొలగింపబడి వెలుగు పరచుకున్నట్టే, సంసార బంధాన్ని కలిగించేదీ, తొలగించేదీ మనస్సే. అజ్ఞానాన్ని కలిగించేదీ, దాన్ని తొలగించేదీ మనస్సే. 

.

ఇంద్రియాల సహాయంతో మనసు దేహాన్ని బంధించినట్లే, అవే ఇంద్రియాల సహాయంతో బంధమోచనం కలిగిస్తుంది. 

వివేక వైరాగ్యాలు కలిగే కొద్దీ మనసు పరిశుద్ధమవుతుంది. 

విషయాకర్షణలను కలిగించేదీ మనసే, తొలగించేదీ మనసే. 

.

మనసే ప్రధానముగా కలిగిన మనోమయ కోశానికి ఒక ఆది [ జననం] , అంతం ఉన్నాయి. అంతే కాక అది మార్పు చెందుతూ సుఖ దుఃఖాలను పొందుతూ ఉంటుంది. 

మనస్సు కు ఇన్ని ధర్మాలున్నప్పటికీ, ఇన్ని ప్రభావాలున్నప్పటికీ అది గోచరము కానిది. 

***************************

మనసును నియంత్రణలో ఉంచుకున్నవాడు లోకాలను తైతక్కలాడించగలడు--అంటారు  శ్రీ దేవుడు నరసింహ శాస్త్రి గారు. 

మనసుకు అనేకులు అనేక నిర్వచనాలు చెప్పినారు. కానీ ఆదిశంకరులు వివరించిన మనసు ఆధారంగానే ఆ నిర్వచనాలు ఉంటాయి. 

.

ఆది శంకరులు కూడా కొత్తగా ఏమీ చెప్పలేదు. ఉపనిషత్తులలో ఉన్నదాన్ని మాత్రమే వారు సరళీకృతం చేసినారు. అయినా అది అర్థమయ్యేది కొందరికే.

.

ఎందరు ఎన్ని చెప్పినా అది సరళీకరణ కోసము మాత్రమే. 

మనకు ఏమి అర్థమయింది అన్నదాన్ని బట్టి వివిధ నిర్వచనాలు మనకు కొన్ని సరిగ్గాను, కొన్ని అసమగ్రముగాను కనిపించవచ్చు. 

అన్నిటినీ అర్థము చేసుకొని క్రోడీకరించుకొని, ఎవరికి వారు మనసును నిర్వచించుకోవచ్చును. 

.

ఎవరెలా నిర్వచించినా, మనసు అనేది ఒక ’ అవిద్య ’ అని,’ అజ్ఞానము ’ అనీ, బంధాలు, పాశాలు కలిగించేదీ, వదిలించేదీ మనసే అనీ, ప్రపంచమే మిథ్య అయినప్పుడు, మనసు అనేది కలిగించే భ్రాంతులను అర్థము చేసుకోకుండా , వాటికి లొంగి పోయి వైషమ్యాలు పెంచుకోవడము, ఆందోళనలు చేయడము, ఫిర్యాదులు, పగలు, ప్రతీకారాలు మొదలు పెట్టడము ఎంత హాస్యాస్పదమో తెలుసుకోవాలి. 

.

ప్రతీదానికీ ’ మనోభావాలు ’ అంటూ రోదిస్తూ వాతావరణాన్ని కలుషితం చేసేవారిని ’ చదువుకున్న మూర్ఖులు ’ అనక తప్పదు. 

సమస్యలు ఎన్ని ఉన్నా, ఇతరుల మాటలు, వ్యాఖ్యలే వాటికి కారణము అని భావించడము తప్పు. 

.

అయితే, ధర్మానికి సంబంధించినది ఏదైనా జరక్కూడనిది జరిగితే, అప్పుడు దాన్ని ఎదిరించాలి. అక్కడ కూడా ’ మనోభావాల ’ ప్రసక్తి రాకూడదు, రాదు. కేవలము ధర్మానికి గ్లాని కలిగితే అది విషమ పరిస్థితులకు దారి తీస్తుంది కాబట్టి ఎదిరించాలి. మనోభావాలు దెబ్బతిన్నాయని కాదు. 

అక్కడ సమస్య గుర్తించక, ఇంకేమనాలో తెలియక, అనేకులు ’ మనోభావాలు దెబ్బతిన్నాయి ’ అని సులభంగా అనేస్తుంటారు. 

.

// శ్రీ సద్గురు చరణారవిందో~ర్పితమస్తు //

[ ఆది శంకరుల " వివేక చూడామణి " నుండీ సంకలితము.. ]

శంకరుల బోధలు, నా " మనసు " కు అర్థమైనట్టు చెప్పే ప్రయత్నము చేశాను. ఇందులో మీకు నచ్చిన మంచి ఉంటే అదంతా శంకరుల అనుగ్రహమే. 

.

తప్పులుంటే అవి పూర్తిగా నావే. 

తప్పులు కనబడితే చెప్పండి, .. ]

గాయత్రీ దేవి*

 *గాయత్రీ దేవి*

                   ➖➖


పూర్వం ఒకప్పుడు ‘అరుణుడు’ అనే బలవంతుడైన రాక్షసుడు ఉండే వాడు. అతడు దేవతలను ద్వేషించేవాడు.


దేవలోకాన్ని పూర్తిగా జయించాలనే కోరికతో పదివేల సంవత్సరాలు గంగాతీరంలో నిరాహార దీక్షతో గాయత్రీ జపపరాయణుడై తీవ్రమైన తపస్సు చేశాడు. 


తపోదీక్షలో ఉన్న అరుణుని శరీరం నుండి దుస్సహమైన అగ్ని వెలువడింది. ఆ వేడిమికి లోకాలన్నీ తపించిపోయాయి.


దేవతలు కలతచెంది. బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు.  బ్రహ్మదేవుడు అతనికి ప్రత్యక్షమై 'వరం కోరుకో' అన్నాడు. అతడు తనకు మృత్యువులేని జీవనం కావాలన్నాడు. 


ప్రకృతి ధర్మమైన మరణం లేకుండా వరం ఇవ్వడం అసాధ్యమని బ్రహ్మదేవుడు చెప్పాడు. 'మరేదైనా వరం కోరుకో' అన్నాడు.


అంతట, ఆ రాక్షసుడు "చతురాననా! మరణం అనివార్యం అయితే యుద్ధరంగంలో కాని , శస్త్రాస్త్రాలచేత కాని, స్త్రీ పురుషులలో ఎవ్వరిచేత కాని, రెండు కాళ్ళు గల ప్రాణిచేత గాని, నాలుగు కాళ్ళు గల జంతువు చేతగాని, పంచభూతాల్లో ఏ ఒక్కదాని చేతగాని మరణం లేకుండా వరమి"మ్మని కోరాడు. 


బ్రహ్మ "తథాస్తు" అన్నాడు.


బ్రహ్మ దత్త వరగర్వంతో అరుణుడు రాక్షసగణంతో కలసి దేవలోకాన్ని ఆక్రమించడానికి సంసిద్ధుడయ్యాడు. 


ముందుగా ఒక దూడను ఇంద్రుని వద్దకు పంపి యుద్ధానికి సిద్ధపడమని కబురు చేశాడు. 


ఇంద్రుడు భయపడి బ్రహ్మ వద్దకు వెళ్ళి మొఱపెట్టుకున్నాడు.


బ్రహ్మ అతన్ని వెంటపెట్టుకుని వైకుంఠానికి రాగా, విష్ణువు బ్రహ్మేంద్రాదులతో కలసి కైలాసానికి వెళ్ళాడు.


ధ్యానముద్రలో ఉన్న శంకరుడు వారి

మొఱ విని, ఆ రాక్షసుడు గాయత్రీ జప పరాయణుడని, అతడు గాయత్రిని మానివేయడమో, మరచిపోవడమో చేస్తే తప్ప, అతన్ని వధించడం సాధ్యం కాదని చెప్పి, అందుకు తరుణోపాయం కోసం పరాశక్తిని ప్రార్థించ వలసిందిగా సూచించాడు.


బ్రహ్మేంద్రాది దేవతలు ఈశ్వరుని సూచనానుసారం పరాశక్తిని ఆరాధించారు.


మాయోపాయం చేత అరుణుని గాయత్రీ జపం మాన్పించడానికి తగిన ఆలోచన దేవగురువైన బృహస్పతికి స్ఫురించింది. 


ఈ స్ఫురణ దేవీ సంకల్పంగా గుర్తించి, బృహస్పతి అరుణుని వద్దకు వెళ్ళాడు. వచ్చిన బృహస్పతిని చూచి, అరుణుడు అతిథి సత్కారాలు చేసి,  "మునీంద్రా నేను రాక్షసుడను కదా! మీరు దేవగురువులు.  దేవతలు నాకు శత్రువులు.   నాతో మీకేమి పని? మీరాకకు కారణం ఏమిటి!’’  అని అడిగాడు. 


అందుకు బృహస్పతి నవ్వి, "రాక్షసరాజా! నీవిలా అనడం భావ్యం కాదు. మా ఆరాధ్య దైవమైన గాయత్రీ దేవతను నిరంతరం నీవు ధ్యానిస్తూ, ఆమె మంత్రాన్ని జపిస్తున్నావు. మేము జపించే మంత్రాన్నే నువ్వూ జపిస్తున్నావు. కనుక, ఆ రీత్యా మనం మిత్రులమే కాని, శత్రువులం కాదు!"   అని సమాధాన మిచ్చాడు. 


ఈ మాటలు విన్న అరుణుని లో దురభిమానము, దురహంకారము విజృంభించాయి. తనకు శత్రువులైన దేవతల ఆరాధ్య దైవమైన గాయత్రి తనకు అభీష్టం కాదని పలికి, గాయత్రీ మంత్రానికి ఉద్వాసన చెప్పాడు. 


వచ్చిన పని ముగిసిందని భావించిన బృహస్పతి, అరుణుని వద్ద సెలవు తీసుకున్నాడు.


గాయత్రీ మంత్రాన్ని మానివేసిన కారణంగా అరుణుడు తేజో విహీనుడు, దుర్భలుడు అయిపోయాడు, ఎందుకూ కొరగాని వాడయ్యాడు. 


ఆ సమయంలో బృహస్పతితో కలసి దేవిని ప్రార్థించగా, ఆమె వారికి సాక్షాత్కరించింది.


"వరాభయ కరా శాంత కరుణామృత సాగరా !

నానా భ్రమర సంయుక్త పుష్పమాలా విరాజితా||"

అయిన జగన్మాతను చూచి…

"నమో దేవి మహావిద్యే సృష్టి స్థిత్యంతకారిణి|

నమః కమల పత్రాక్షి సర్వాధారే నమో7స్తుతే||

భ్రమరై ర్వేష్టితా యస్మాత్‌ భ్రామరీ యా తత స్స్మృతా|

తసైయ దేవ్యై నమో నిత్యం నిత్యమేవ నమో నమః||

అని పలువిధములుగా ఆమెను ప్రార్థించగా, ఆ దేవి వారి బాధలను తీర్చాలని సంకల్పించింది.


అంతట పరాశక్తి తన మాయా విలాసంచేత భ్రమరాలను ప్రేరేపించింది. 


కోట్లాదిగా తుమ్మెదలు చెలరేగి, భూమ్యాకాశాలను కప్పివేసి, రాక్షసుల శరీరాలను ఆక్రమించి, చెవుల్లో భరించరాని రొదచేస్తూ ఒకరి మాట ఒకరికి చెప్పడానికి, వినడానికి అవకాశం లేకుండా, కాళ్ళు చేతులు కదిలించే అవకాశం కూడా లేకుండా చేశాయి.


దేవి అజ్ఞానుసారం అలా కోటాను కోట్ల భ్రమరాలు ఒక్కసారిగా విజృంభించి, అరుణుని, అతని అనుచర వర్గాన్ని యుద్ధం లేకుండానే, శస్త్రాస్త్రాలతో పని లేకుండా సంహరించాయి.


ద్విపాద, చతుష్పాద ప్రాణులవల్ల తనకు మరణం లేకుండా వరం కోరుకున్న ఆ దానవుడు షష్పది(ఆఱు పాదాలు గలది తుమ్మెద) వల్ల మరణించాడు.


తమను కనికరించి, రాక్షస బాధను నివృత్తి చేసిన ఆ జగన్మాతను ఆనాటి నుండి దేవతలందరూ ‘భ్రామరీ దేవత’గా పూజించి, ఆమె అనుగ్రహం పొందసాగారు.


ఈ కథ చెప్పి , వ్యాసమహర్షి గాయత్రీ మంత్రజప ప్రభావాన్ని వివిరించగా, జనమేజయుడు గాయత్రీ దేవతను గురించి ఇంకా వినాలనే జిజ్ఞాసను వ్యక్తం చేశాడు. వ్యాసమహర్షి కొనసాగించాడు.

గాయత్రీ పరాశక్తి స్వరూపము. ఆమెకు ఐదు ముఖాలు.

ఈ ఐదు ముఖాలూ సృష్టికి ఆధారమైన పంచభూతాలకు ప్రతీకలు. 

ఐదు శిరస్సులతో, పదిచేతులతో ఆ తల్లి ఆశ్రితులకు సరలైశ్వర్యాలను, అనంతమైన బుద్ధిశక్తిని ప్రసాదిస్తుంది.

గాయత్రీ దేవతకే ‘సంధ్యాదేవి’ అని కూడా పేరు.


ప్రాతఃకాలంలో గాయత్రిగా, మధ్యాహ్నం సావిత్రిగా, సాయంత్రం సరస్వతిగా ఆ శక్తి తన తేజో విశేషం చేత మూడు పేర్లతో మూడు రూపాలతో గోచరిస్తూ ఉంటుంది.


గాయత్రీ మంత్రానికి నాలుగు పాదాలు. ఒక్కొక్క పాదంలో ఎనిమిగి అక్షరాలు. మొదటి మూడు పాదాలూ ఋగ్యజుస్సామ వేదాల నుండి, నాల్గవ పాదం అధర్వ వేదం నుండి ఉద్భవించాయి.


 అందువల్లనే గాయత్రీ దేవతను వేదజననిగా ఆరాధిస్తూ ఉంటారు. 


మొదటి మూడు పాదాల్లో ఇరవైనాలుగు అక్షరాలతో ఉన్న మంత్రాన్నే ద్విజులు త్రిసంధ్యలలోనూ జపిస్తూ ఉంటారు. 


ఉదయ సంధ్య నక్షత్రాలు ఆకాశంలో కన్పిస్తూండగాను, మధ్నాహ్న సంధ్య, సూర్యుడు ఆకాశ మధ్యంలో ఉండగాను, సాయంసంధ్య సూర్యాస్తమయం కంటె ముందుగాను అచరించాలని పెద్దలు చెప్పారు.


 సర్వసహితమైన వేదమంత్రము ఈ గాయత్రి. ఈఉపాసనవల్ల ద్విజులు అనంతమైన సత్ఫలితాలను పొందగలరు. 


ఈ మంత్రాన్ని దేవాలయంలో, యాగశాలలో, తులసీవృక్ష సమీపంలో, నదీతీరాల్లో, పుణ్యక్షేత్రాల్లో జపించడం మరింత ఫలప్రదం.


"తస్మాత్‌ సర్వే ద్విజా శ్శాక్తాః న శైవా న చ వైష్ణవాః"

ద్విజులందరూ గాయత్రీ దేవతారాధనం చేసే వారే కనుక, వారు వైష్ణవులైనా, శైవులైనా- ముందుగా అందరూ శాక్తేయులు.


గాయత్రీ మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలూ సృష్టిలోని ఇరవై నాలుగు తత్త్వాలకు సంకేతాలు, కర్మేంద్రియాలు ఐదు. (కాళ్ళు, చేతులు, వాక్కు, మల, మూత్రావయవాలు) జ్ఞానేంద్రియాలు ఐదు, (చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు) , పంచప్రాణాలు(ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు), పంచభూతాలు(నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం), మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే నాలుగు(అంతఃకరణ చతుష్టయం) కలసి సృష్టిలోని ఇరవై నాలగు తత్త్వాలు.

జీవుడు ఇరవై అయిదవవాడు.


 ఇరవైనాలుగు అక్షరాల గాయత్రీ మంత్రానికి ముందు ఓంకారం చేర్చితే ఇరవై అయిదు అక్షరాలు అవుతాయి.


ఈ మంత్రంలో గల ఇరవై నాలుగు వర్ణాలలో ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క ఋషి. ఒక్కొక్క చంధస్సు, ఒక్కొక్క దేవత ఉన్నారు. 


ఇరవై నాలుగు, రంగులు, ఇరవై నాలుగు శక్తులు, ఇరవైనాలుగు ముద్రలూ గల గాయత్రీ మంత్రానికి వేదోక్తమైన సంప్రదాయాన్ని అనుసరించి, కవచము, హృదయము, శక్తి, బీజము, కీలకము ఉన్నాయి.


 ఉపాసనా మార్గంలో ఇవి చాలా ప్రధానమైనవి.


ముందుగా గాయత్రీ కవచాన్ని ధారణ చేసి, తర్వాత గాయత్రీ మంత్రాన్ని హృదయంలో భావన చేయాలి. 


గాయత్రీ హృదయానికి నారాయణుడే ఋషి. గాయత్రియే చందస్సు. పరాశక్తియే దేవత.

గాయత్రీ దేవతకు ఐదు ముఖాలు. నాలుగు దిక్కుల వైపు నాలుగు, ఐదవది ఊర్ధ్వముఖంగాను ఉంటాయి. ఆమెకు పదిచేతులు. 


కుడి ఎడమల రెండు చేతులలో రెండు పద్మాలను , మిగిలిన ఎనిమిది చేతులలో వరద, అభయ అంకుశ కళాది శక్తులనూ ధరించి ఉంటుంది. 


సాధకుడు ఇలా భావించి, సుఖాసనాసీనుడై దేవిని ఏకాగ్రతతో ధ్యానించాలి.


"ఓ జగన్మాతా! నీవే ఆదిశక్తివి. అనంత రూపాలు ధరించి, అంతటా వ్యాపించి, భక్తులను అనుగ్రహించే దయా స్వరూపిణివి. త్రిసంధ్యలకూ దేవతవైన నీకు నమస్కారము.


 సావిత్రి, సరస్వతి, వైష్ణవి, రౌద్రి అనే పేర్లతో వ్యవహరింపబడే దేవతవు నీవే. మహర్షులు నిన్ను ; ప్రాతఃకాలంలో బాలగా, మధ్యాహ్నం యువతిగా, సాయంత్రం వృద్ధగా ధ్యానిస్తూ ఉంటారు.


హంసవాహన అయిన బ్రాహ్మీ శక్తి, గరుడవాహన అయిన వైష్ణవీ శక్తి, వృషభవాహన అయిన సావిత్రీ శక్తి నీవే.


 భూమిపై ఋగ్వేదాన్ని, అంతరిక్షంలో యజుస్సామ వేదాలను గానం చేస్తూ నిన్ను దేవతలు ఆరాధిస్తూ ఉంటారు. నీ నేత్రాల నుండి, సాత్విక భావమైన స్వేదం నుండి, ఆనంద రూపమైన కన్నీటి నుండి పది అంశాంశ రూపాలను సాధకులు వరేణ్య, వరద, వరిష్ఠ, వరవర్ణిని, గరిష్ఠా, వరారోహ, నీలగంగా, సంధ్యా, భోగమోక్షదా అనే పేర్లతో వ్యవహరిస్తూ ఉంటారు.


మర్త్యలోకంలో భాగీరథి, పాతాళంలో భోగవతి, స్వర్గంలో గంగ అనే పేర్లతో వ్యవహరింపబడేది- నీవే.


 త్రిలోక వాసులనూ తరింప చేయడానికి నదీరూపంలో ప్రవహించే దేవతవు నీవే.


 భూలోకంలో శోక భారాన్ని వహిస్తూ, భువర్లోకంలో సిద్ధివై, సత్యలోకంలో సత్యస్వరూపిణివై నీవే ప్రవహిస్తూ ఉంటావు.


ఉపాసకుని శరీరంలోని ఇడ, పింగళ, సుషుమ్నాది దశవిధ ప్రాణ నాడులూ నీవే. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులు నీ స్వరూపాలే. 


హృదయ పద్మంలో ప్రకాశించే ప్రాణశక్తివి

నీవే. మూలాధారంలోని కుండలినీ శక్తి నీ రూపమే" అని సాధకులు ఆమెను ధ్యానిస్తారు.


ఈ విధంగా గాయత్రీ దేవతా వైభవాన్ని వివరించి, గాయత్రీ సహస్ర నామాలను, దీక్షావిధానాన్ని వ్యాసమహర్షి జనమేజయునకు వివరించాడు.


జనమేజయుని ఆసక్తిని, అర్హతను గమనించి మరికొన్ని విశేషాలను అందించాడు.


వేదము నుండి ఉద్భవించిన గాయత్రీ మంత్రాన్ని ద్విజులు గురుముఖతః విధి విధానంగా గ్రహించి, శ్రద్ధాభక్తులతో మంత్రానుష్ఠానం సాగిస్తే, సర్వశక్తులూ స్వాధీనమవుతాయి. భూత ప్రేత పిశాచాది దుష్టశక్తులు నశిస్తాయి. సప్తకోటి మహామంత్రాలకు గాయత్రియే మాతృక.


గౌతమ మహర్షి కొన్ని వేల సంవత్సరాలు గాయత్రీ మాతను ఉపాసించి, దేశంలో అనావృష్టి వల్ల కలిగిన కరువు కాటకాలను నివారింప చేశాడు.


"నమో దేవి మహావిద్యే వేదమాతః పరాత్పరే|

వ్యాహృత్యాది మహా మంత్ర రూపే ప్రణవ రూపిణి||

భక్త కల్పలతాం దేవీం అవస్థాత్రయ సాక్షిణీం|

తుర్యాతీత స్వరూపాం చ సచ్చిదానంద రూపిణీం|| "

అని గౌతముడు గాయత్రీ మాతను ప్రార్థించి, ఆమె పరిపూర్ణనుగ్రహానికి పాత్రుడయ్యాడు.


గాయత్రీ దేవతానుగ్రహం చేత గౌతమ మహర్షి సమృద్ధిగా అన్నపు రాసులనూ, షడ్రసోపేతమైన వంటకాలను, నానాలంకార వస్త్ర మాల్య భూషణాలను పొంది ఆశ్రయించిన వారిని ఆదుకుంటూ దేవలోక వంద్యుడయ్యుడు.


కనుక, జనమేజయ మహారాజా! గాయత్రీ రూపాన్నీ మనసులో భావించినా, ఆమెను పూజించినా, ఆమె మంత్రాన్ని జపించినా, సర్వారిష్టాలు తొలగి, సకల సంపదలూ లభిస్తాయి.


గాయత్రీ మంత్ర శక్తిని దుర్వినియోగం పరచి, లోకకంటకుడై ప్రవర్తించిన రాక్షసుడైన అరుణుడు దుర్గతి పాలయ్యాడు.


గాయత్రీ మంత్ర శక్తిని సద్వినియోగం చేసి, గౌతముడు దుర్భిక్షాన్ని తొలగించి, లోకాన్ని ఆదుకుని లోకపూజ్యుడయ్యాడు.


కనుక మంత్ర శక్తిని సంపాదించిన వారు దాన్ని సద్వినియోగం చేసి లోకహిత దీక్షతో ప్రవర్తించాలే గాని, స్వార్థంతో, అహంకారంతో, ఆ శక్తిని దుర్వినియోగం చేయరాదు.


ఈ విధంగా వ్యాసమహర్షి జనమేజయునకు గాయత్రీ వృత్తాంతాన్ని సవిస్తారంగా అందించాడు.

ఆవిర్భావ దినోత్సవం

 తెరాస@21.


ఓ స్వతంత్ర కాంక్షకు

ఆరు దశాబ్దాలు గడిచాయి.

ఓ భావోద్వేగానికి పదునాలుగు యేండ్లు,

ఓ స్వరాజ్య పాలనకు

ఏడు వసంతాలు.


ఎందరో బలిదానాలు

ఎన్నో తిరుగుబాట్లు 

ఎన్నెన్నో ఉద్యమాలు

తెలంగాణ పోరాటాలు.


ఎన్నో అవమానాలు

ఎన్నెన్నో ఈసడింపులు

మరెన్నో అసమానతల నడుమ ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధన...


తెలంగాణా రాష్ట్ర సమితికి

ఇరవై ఒక్క సంవత్సరాలు.

స్వీయ పాలన కోసం పోరాటం..


స్వతంత్ర రాష్ట్రం కోసం 

శాంతియుత పోరాటం.

అలుపెరుగని తెరాస పోరాట ప్రస్థానం...


రాజకీయ చైతన్యంతో

మలివిడత 'కారు' పోరు..

మా నీళ్ళు, మా నిధులు, మా నియామకాలు అంటూ

కదిలే తెలంగాణ సమాజం.


తెరాస పోరాటంలో

రాష్ట్ర ఏర్పాటు కోసం

తెలంగాణ వచ్చుడో

కేంద్రం పని పట్టుడో అంటూ...


నినాదాలు రగిలించే

సకల జనుల సమ్మె

రహదారిన వంటావార్పు

జనంలో స్వతంత్ర ఆకాంక్ష..


నిప్పు కణికలై ఎగసే

ఆత్మ బలి దానం జరిగే

శ్రీకాంత్ చారీ ఆత్మార్పణ

కే.సి.ఆర్ నిరాహార దీక్ష..


తెరాస ఉద్యమించేను

ప్రజలు పోరు సల్పేను

కేంద్రం కళ్ళు తెరిచేను

తెలంగాణా ప్రకటించేను.

 

తెరాస పోరుబాటన

తెలంగాణా వచ్చేను

స్వతంత్ర రాష్ట్రమయ్యేను

ప్రజల కల నిజమయ్యేను.



తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవం 

పురస్కరించుకుని యావత్ తెలంగాణా ప్రజానీకానికి శుభాకాంక్షలు..


అశోక్ చక్రవర్తి. నీలకంఠం.

9391456575.

మిఠాయి సత్యం

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

       *🌷మిఠాయి సత్యం🌷*          


మా ఊర్లో సత్యంగారనే షావుకారు (కోమటి) ఉండేవారు.  ఉదయం పదిగంటల నుంచి జంతికలు, చెగోడీలు, బజ్జీలు, బెల్లం మిఠాయి

ఉండలు చేసి అమ్మేవాడు.


ఎవరింట్లో‌ ఏ శుభకార్యాలయినా బూంది లడ్డు, మైసూరు పాక్, ఇలాంటివి  చేయించుకొనే వారు.  దానాదీనా ఆయనకి "మిఠాయి సత్యం గారు" అనే‌పేరు స్థిరపడి పోయింది.


ఎందుకు ఆయన గురించి చెపుతున్నా నింపే

ఆయన చదువుకోకపోయినా‌ మంచి ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నవాడు.  తరచుగా ఆథ్యాత్మిక ఉపన్యాసాలు, హరికథలు వినేవాడు.


ఓ రోజు ఓ స్వాములవారు భగవతత్వం గురించి చెబుతూ, అనేక రూపాల్లో ఉన్నా భగవంతుడు ఒక్కడే అని చెప్పి ఏమోయ్ సత్యం అర్థమైందా అని అడిగారు.


ఈ సత్యం గారు హరికథకులకు, స్వామీజీలకు, పౌరాణికులకు సపర్యలు చేస్తూ ఉండేవాడు.


అయ్! అర్థమయింది.  ఎలాగంటే నా బాషలో నే సెబుతా యినండి ఎలా అంటే:


*సెనగపిండి (మూలమనుకోండి)* 

1.సన్న గొట్టంలో సుడితే కారప్పూసండి.

2.లావుగొట్టంలో సుడితే జంతికలు

3.అదే‌సెనగపిండిని సట్రంలో కొట్టి,యేరు సెనగ, పుట్నాలు, అటుకులు, కర్వేపాకు యేపి

కలిపితే కారంబూంది అవుద్ది.

4.అదే సెనగపిండి సట్రంలో బూంది కొట్టి పంచదార పాకంలో వేసి ఉండకడితే లడ్డు ఔతుంది.

5.అదే సెనగపిండి వేయించి, పంచదార, నెయ్యి వేసి ఓ పాత్రలో పాకం పడితే మైసూరు పాక్ అవుతుంది.

6.అదే సెనగపిండి ‌పల్చగా కలిపి, మిరపకాయ ముంచి‌వేయిస్తే మిరపకాయ బజ్జీలు, అరటికాయ ముక్కలు ముంచివేస్తే అరటికాయ ‌బజ్జీలు.

7.అదే సెనగపిండి లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం, కలిపి‌వేయిస్తే పకోడీయండి.


ఒకే సెనగపిండికే ఇన్ని రూపాలున్నట్టే, మూలం శక్తి అయిన భగవంతుడు, మనకి శివుడుగా, యిష్ణువుగా, ఆంజనేయుడుగా, గణపతిగా ఎన్నో రూపాలు గా కనపడతాడండి ఆయ్.


మనం ఎలా కొలిచినా, పిలిచినా పలికే‌శక్తి‌‌ ఒహటేనండి.  ఆయ్! నాకరదమయినకాడికి

సెప్పేనండి అన్నాడు ‌సత్యంగారు.


ఆనాటి స్వామీజీ లు కనుక ఆయన తనకు అంతకు ముందే సభా నిర్వాహకులు కప్పిన ‌శాలువ‌ సత్యంగారికి కప్పి నిగర్వంగా ఓ ‌మాటన్నారు.


ఇన్ని ‌శాస్త్రాలు‌‌చదివిన నేను కూడా భగవత్ తత్వాన్ని నువు చెప్పినంత సులువుగా చెప్పలేను.


నీకు పరమేశ్వర కటాక్షం దొరికింది అన్నారు.

 *సభంతా చప్పట్ల మోత.* 

                 *** 

 *సేకరణ* :-  వాట్సాప్ పోస్ట్

ఫలితం

 *చిన్న ప్రయత్నం*

*పెద్ద ఫలితం*



మన ఇంట్లో పిల్లల చేత భగవద్గీత  గొప్పదనం గురించి చెప్పిస్తూ ఎవరికి వారు చిన్న వీడీయో తీసి మనకు తెలిసిన గ్రూప్ లలో పెడితే ,అదే వయసుగల పిల్లలు కనెక్ట్ అవుతారు.

పెద్ద వాళ్ళు చెప్తే చాదస్తం అనుకునే రోజులు.

తమ వయసు వాళ్ళు భగవద్గీత గొప్పదనం గురించి చెప్తుంటే, అందులో ఏముందో తెలుసుకుందాం అన్న ఆసక్తి వారిలో కలుగుతుంది.

అందువల్ల10 నుంచి 25 ఏళ్ల లోపు వారిచేత భగవద్గీత గొప్పదనం చెప్పించి ప్రచారం కల్పించే ఆలోచన చేయవచ్చు.

ముందుగా అది మన ఇంట్లో ఉండే పిల్లలు, ఇరుగుపొరుగు వారిచేత చెప్పించి రికార్డ్ చేసి ప్రచారం చేయచ్చు.

అది కేవలం 1 లేదా 2 నిమిషాలకు మించకూడదు.

ఆలోచించగలరు

🙏🙏

సంభవామి యుగే యుగే ॥"

 ॐ                సత్యసాయి ఆరాధన 


అవతారము - అవతార పురుషులు 


 "పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ I 

 ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ॥" 


1. సాధు, సజ్జనులను సంరక్షించుటకొఱకును, 

2. దుర్మార్గులను వినాశమొనర్చుట కొఱకును, 

3. ధర్మమును తిరిగి స్థాపించుట కొఱకును నేను ప్రతియుగమునందును అవతరించుదును. 

                   భగవద్గీత 4- 8 


     కాబట్టి అవతరించి, పరిస్థితులు చక్కబరచడానికి ప్రాధాన్యతలలో, 

 

మొదటిది - మంచిని కాపాడుట, 

రెండవది - చెడు తొలగించుట, 

మూడవది - దరిదాపులలో చెడు తిరిగి పుట్టకుండా, మంచియే ఉండునట్లు ధర్మస్థాపన చేయుట. 


1. కృతయుగంలో దైవ - రాక్షస లోకాలు వేరువేరుగా ఉండేవి.

    హిరణ్యకశిపుడు దేవలోకాలు ఆక్రమించుకుంటే, 

    ప్రహ్లాదుని కాపాడుతూ, 

     హిరణ్యకశిపుని తొలగించాడు. 

2. త్రేతాయుగంలో దైవ - రాక్షస దేశాలు వేరువేరు. 

    విభీషణుని కాపాడి, 

    రావణుని తొలగించాడు. 

3. ద్వాపర యుగంలో దైవ - రాక్షస కుటుంబాలు వేరువేరు. 

      పాండవులను కాపాడుతూ,  

      కౌరవులను తొలగింపజేశాడు. 

4. కలియుగంలో ప్రతి మనిషిలోనూ దైవ - రాక్షస ప్రవృత్తులుంటాయి. 

      మనలోని మంచి మనచేత గుర్తింపజేసి, 

      మనలోని చెడు తలంపు మనమే తొలగించి సంస్కరింపజేసేందుకే భగవంతుడు సంకల్పించుకొని అవతరిస్తాడు. 

      కలి ప్రభావంతో మళ్ళీ మామూలు పరిస్థితులు మారి, అవతార ఆవశ్యకత పదేపదే కలుగుతుంది. 

      అందుకనే అవతార పురుషులు అవతరించి, అవతారంగానే పరిస్థితులు చక్కదిద్దతారు. 

      అందులో భాగంగానే మన అనుభవంలోనున్న స్వామి. 



భగవాన్ సత్యసాయి అవతార  లక్ష్యం: 


          అందఱినీ ప్రేమించు - అందఱినీ సేవించు 

          LOVE ALL - SERVE ALL 


    మనం మానవులం. అంటే మనసుతో జీవించేవాళ్ళం. 

    మనస్సు సంకల్ప-వికల్పాలు చేస్తూంటుంది. దానిలో భాగంగా పరిపరి విధాలపోతుంది. 

     ఇది ఒక కోతి వంటిదంటారు ఆది శంకరులు శివానందలహరిలో. దానిని భక్తి అనే త్రాటితో కట్టేయమని ఆయన పశుపతిని ప్రార్థిస్తారు. 


వాసుదేవుడు


సకల జీవరాశిలో అంతర్యామిగా ఉంటూ, అన్నిటినీ వాటివాటి రూపాలలో ఉంచుతూ, సాక్షీభూతంగా ఉండేవాడు అని "వాసుదేవుడు" అనే నామానికి అర్థం. 

  (వసతి - వాసయతి - ఆచ్ఛాదయతి - సర్వమ్మితి వాసుదేవః) 


     మాయలో ఉంటే "దేహమే నేను", 

     మాయతొలగితే "ఆ వాసుదేవుడే నేను". 


     మనలోనే ఉండి మనమెవరో ఎఱింగించి, ఇతరులలోనున్న తనను మనం గుర్తించేలాగు అనుగ్రహించడమే ప్రస్తుత అవతార ఆవశ్యకత. 


      దానికి సేవలనే మార్గంగా ఎంచుకున్నారు. 

      తాను - విద్యా, వైద్యాదులన్నిట ఆదర్శవంతమైన సేవలని శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటుచేసి నిరంతరంగా నడిపించడం ఒక్క స్వామికే సాధ్యం. 


    "యద్యదాచరతి శ్రేష్ఠః ----" 

     - శ్రేష్ఠులు ఏది ఆచరిస్తారో దానినే ఇతరులు కూడా ఆచరిస్తారనే గీతావాక్యం నిజంచేయడానికి అదే నిదర్శనం కదా! 


        మనకి భౌతికంగా దూరమై దశాబ్దకాలమైనా, అవతార పురుషుడుగా, తన లక్ష్యం నెరవేర్చడానికి స్వామి మనందరిని కార్యోన్ముఖులను గావించడం అత్యంత ముఖ్యంగా గమనించవలసినది. 


   వ్యక్తులుగా, 

   సమితులలో బృందాలుగా, 

   కేంద్ర సంఘం నియమించిన బాధ్యతలలోనూ 

     

     మనం - మనలోని దైవాన్ని గుర్తెరిగీ,

     ఇతరులలోనున్న దైవాన్ని గుర్తించీ, 

     సేవ చేయడమే మన జీవితధ్యేయం - అనేది నిరంతర ప్రక్రియ. 


       దానికి మనమంతా పరికరాలం మాత్రమే! నడిపించేది దైవమే అని గుర్తెరగాలి. 


                   ॐ శ్రీ సాయిరాం 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం

సంబంధాలలో పరివర్తన

 _*💫సంబంధాలలో పరివర్తన 🎊*_

➖➖➖➖➖➖➖✍️


*_ఉదయం నుంచి మా ఇంట్లో పండుగ వాతావరణం నెలకొనిఉంది. మా అత్తగారి మొహంలో మెరుపుకు, వంటింట్లోంచి వస్తున్న వంటకాల సువాసనకు - రెంటికీ ఒకటే కారణం.!_*


*_ఆమె స్నేహితురాలు ఈరోజు భోజనానికి ఇంటికి వస్తున్నారు. ఇల్లంతా అలంకరించబడుతోంది._*


*_నిన్న సాయంత్రం మాట్లాడుకుంటున్నప్పుడు, ఆమె తన స్నేహితురాలు ఈ రోజు వస్తున్నట్లు చెప్పారు. అందుకని ఆవిడకి బహుమతి కొనడానికి మేం మార్కెట్‌కి వెళ్ళాం, అత్తయ్యగారు, తన స్నేహితురాలికి ఒక మంచి, ఖరీదైన చీరను కొన్నారు._* 


*_ఈ రోజు ఆమె మరొక స్థాయిలో ఉన్నట్లుగా అనిపిస్తున్నారు !_* 


*_అత్తయ్యగారు ఉదయాన్నే ఉత్సాహంగా లేచి, నా కంటే ముందే వంటగదిలోకి ప్రవేశించి, చాలా ప్రేమగా, ప్రయాసతో తాను ముందే అనుకున్న వంటకాలను ఒకదాని తర్వాత ఒకటి సిద్ధం చేయడం ప్రారంభించారు._*


*_ఆమె నిజంగా సంతోషంగా కనపడుతున్నారు, కానీ నేను.... నా ముఖం మీద నకిలీ చిరునవ్వుతో, బరువెక్కిన హృదయంతో ఆమెకు సహాయం చేస్తున్నాను._*


*_ఈరోజు మా అమ్మగారి పుట్టినరోజు. నా పెళ్లయ్యాక, మా అమ్మకి ఇది మొదటి పుట్టినరోజు. నేనేమో ఇక్కడ ఉన్నాను, నాన్నగారు ఆఫీస్ టూర్‌లో ఉన్నారు, మా సోదరుడు విదేశాలలో ఉన్నాడు. ఆమెతో ఎవరూ ఉండరు._*


*_నేను నా మనస్సును బలపరుచుకుని, ఎలాగైనా అమ్మ దగ్గరికి వెళ్లాలని నిన్న నిర్ణయించుకున్నాను. అదే నేను మా అత్తగారితో మాట్లాడబోయాను, కానీ నేను ఏమీ అనకముందే ఆమె తన స్నేహితురాలి గురించి చెప్తూ - మధ్యాహ్నం భోజనం, సాయంత్రం, అందరం ఆమెతో కలిసి ఫన్ సిటీకి వెళ్తామని చెప్పారు._*


*_అప్పుడు ఇంక నేను ఏం అనగలను ? నేను మౌనంగా ఉండి పనిలో పడ్డాను. ఆసక్తి లేకుండా, నేను ఇంటిని అలంకరించడం ప్రారంభించాను, నేను కూడా తయారయ్యి సిద్ధంగా ఉన్నాను._* 


*_కాసేపటికి, డోర్‌బెల్ మోగింది, అత్తయ్యగారు తన స్నేహితురాలిని స్వాగతించమని నన్ను పంపారు._*


*_నేను తలుపు తెరిచేసరికి, పెద్ద పుష్పగుచ్ఛం వెనుక దాగిఉన్న ముఖం చూసేసరికి, నా కళ్ళు పెద్దవిచేసి, తెల్లబోయాను !_*


*_అక్కడ నా ఎదురుగా మా అమ్మ నిలబడి ఉంది. అమ్మ నాకు పుష్పగుచ్ఛాన్ని ఇచ్చి, ఆశ్చర్యపరుస్తూ నన్ను పలకరించింది._*


*_నేను ఆశ్చర్యంగా, ఆనందంగా అమ్మ వైపు చూస్తూ నిలబడిపోయాను. "నా స్నేహితురాలికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పవా ?" అని మా అత్తగారు వెనుక నుండి అన్నారు._*


*_"అమ్మ... మీ స్నేహితురాలా ?"  ఆశ్చర్యంతో అడిగాను._*


*_"అరే, నేనేమీ అబద్ధం చెప్పలేదు ! మేం స్నేహితులుగా ఉండకూడదని ఎవరు చెప్పారు ?" అన్నారు అత్తయ్యగారు._*


*_"తప్పకుండా ఉండగలం ! ఇది తన కోడలిని కూడా కూతురిలా ప్రేమించే వారికి మాత్రమే సాధ్యం." అంటూ ఆవిడ వెళ్లి అమ్మని కౌగిలించుకుంది._*


*_ఆనందంతో నాకు నోట మాటరాలేదు, నా కళ్ళ నుండి కన్నీళ్లు కారుతున్నాయి. నేను అత్తయ్యగారి చేతులను నా చేతుల్లోకి తీసుకుని, వాటిని కళ్ళకద్దుకున్నాను, అరచేతులను ముద్దుపెట్టుకొని, ఆమెను కౌగిలించుకున్నాను._*


*_మా అమ్మ మమ్మల్ని చూస్తూ చెమ్మగిల్లిన కళ్లతో నవ్వింది._*


*_బాంధవ్యాల పండుగను ఎంతో ప్రేమగా జరుపుకుంటూ, ఒకవైపు మా అమ్మ - నాకు సంబంధాల ప్రాముఖ్యతను నేర్పితే, మరోవైపు, మా అత్తయ్యగారు - హృదయపూర్వకంగా వాటిని ఎలా కొనసాగించాలో నేర్పించారు._*


*_వాళ్ళిద్దరూ నన్ను చూసి నవ్వుతూ నిలబడ్డారు, నాకు కలిగిన అదృష్టానికి గర్వంతో ఇద్దరి మధ్య నిలబడి ఉన్నాను - నా కళ్లలో నీళ్లతో, ముఖంపై చిరునవ్వుతో._* ✍️


♾♾♾♾♾♾♾♾♾♾


*_"ఆత్మగౌరవంపై దృష్టి పెట్టే బదులు, ఇతరులకు గౌరవం ఇవ్వడం గురించి ఆలోచించాలి."…గురువర్యులు._*


*_అనుభూతి : నా జీవితంలోని ప్రతీ ప్రేమపూరిత సంబంధానికి నేను కృతజ్ఞతతో ఉన్నాను.._*🙏


🙏🇮🇳😷💉🎊🪴🦚🐍

తాయత్తు

 తాయత్తు ని మనం చాలా అవహేళన చేస్తున్నాము, వెక్కిరిస్తున్నాం. గతంలో పుట్టిన ప్రతి బిడ్డ ఊడిన బొడ్డు (Umbilical cord) ను ఈ తాయత్తులలో పెట్టి మొలతాడుకు కట్టేవారు., దానికే మరొక పేరు "బొడ్డు తాయత్తు" మందులు లేని, వైద్యానికి అందని ఎన్నో రోగాలు ఈ బొడ్డుని అరగతీసి నాకిస్తే తగ్గేవి. ఎవరి బొడ్డు వారికే పనికొచ్చేది కనుక దాన్ని వారికి అందుబాటులో ఉంచటంకోసం చాలా తేలికైన ఖర్చులేని పని ఒక తాయత్తు చేసి దానిలో పెట్టి ఎవరి బొడ్డుని వారి మొలకే కట్టేవారు. స్తోమత ఉన్నవారు, వెండితాయత్తులు చేయించుకునేవారు, లేనివారు ఏ రాగివో వాడుకునేవారు. ఏ మందుకు తగ్గని వ్యాధి ఎలా తగ్గిందంటే "తాయత్తు మహిమ" అనేవారు. ఈ "తాయత్తుమహిమ" అనే పదానికి అసలైన అర్థమిదే. ఆధునిక సైన్సుకూడా దీనినే నిరూపించి, ఈ స్టెం సెల్స్ క్యాన్సర్, జుట్టు ఊడిపోవటం, కిడ్నీ, రక్త సంబంధ వ్యాధులు, ఎముకల సమస్యలకి ఇలా ఎన్నో అంతుబట్టని, ఒక పట్టాన తగ్గని రోగాలకు కూడా పని చేస్తుందని ప్రచారం చేసుకుంటూ వాటిని భద్రపరచటానికి బ్యాంకులు తెరిచి కోట్ల వ్యాపారం చేస్తున్నారు. ఈవాళ ఒక బొడ్డుని భద్రపరచటానికి ఒక బ్యాంకు లాకర్ అద్దే సుమారు 20,000 రూపాయలుంది. ఆ అవసరం లేకుండా తాయత్తులో పెట్టుకుని మొలకు చుట్టుకుంటే అనాగరికమయింది. అవహేళన చేయబడుతుంది. వెక్కిరించబడుతుంది. అవునులే, బట్ట కట్టుకోవటమే అనాగరికమనప్పుడు మొలతాడు, దానికొక తాయత్తు మరింత అనాగరికమే అవుతుంది. అంత ఉపయోగమున్న బొడ్డుని, ఒకరిదొకరికి మారటానికి ఆస్కారం లేకుండా తాయత్తులో పెట్టి, ఖర్చులేకుండా మొలకు కట్టుకోవటం "అజ్ఞానం" ఒకరిది మరొకరికి మారే అవకాశమున్న లాకర్లో వేలు ఖర్చుపెట్టి దాచిపెట్టటం "విజ్ఞానం"


(సేకరణ)

రక్షింపుము

 శ్లోకం:☝️

*యా కుందేందు తుషార హార ధవళా*

*యా శుభ్రవస్త్రాన్వితా*

*యా వీణావరదండ మణ్డిత కరా*

*యా శ్వేతపద్మాసనా l*

*యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్*

*దేవైస్సదా పూజితా*

*సా మాం పాతు సరస్వతీ భగవతీ*

*నిశ్శేష జాడ్యాపహా ll*


భావం: మల్లెపూవువలె, చంద్రునివలె, మంచువలె, ముత్యమువలె స్వచ్ఛమైన ధవళ వస్త్రములను ధరించి శ్వేత పద్మమునందు ఆశీనురాలై, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మొదలైన దేవతలచే స్తుతింపబడుచు విద్యలకు దేవతయైన ఓ సరస్వతీ! మా మనస్సులనుండి అజ్ఞానమును పూర్తిగా తొలగించి రక్షింపుము.🙏

మావిడిపండంటే

 🥭🥭🥭🥭

వంటింటి వైపు రాగానే తియ్యటి వాసన! 


‘మావిడిపళ్లా?’ ఒక్కరుపు అరిచాను. అవునంది అమ్మ.. 😋 


... భలే తియ్యటి వాసన గదంతా! 

గోనెపట్టామీద గడ్డిలో అప్పుడే పుట్టిన చిన్ని కృష్ణుడి లా కనబడుతున్నాయి..😍


కొద్దిగా పండని పళ్ళు.. గోనెపట్టామీద గడ్డి పరిచి పళ్లన్నిటినీ పసిపాపల్లా పడుకోబెట్టి, పైన మరింత గడ్డి కప్పేసి వుంచేవారు.

మనం రోజులో పదిసార్లైనా ఆ గదిలోకెళ్లి వాటిని పరామర్శించి వచ్చేవాళ్లం. 


వారం తరవాత ఒకపండు కాస్త మెత్తబడగానే టెన్త్ క్లాస్ రిజల్ట్స్ పేపర్ పట్టుకుని చేసినట్టు ఇల్లంతా తిరిగేస్తూ హడావుడి చేసేవాళ్లం.


అసలా మావిడిపళ్ల 🥭 ఆకలి చాలా దారుణమైన ఆకలి. 

వదిల్తే అన్నీ తినెయ్యాలన్నంత! 


‘అది కడుపా ఖండవిల్లి మడుగా? ఎన్ని తింటావు? ఆనక అజీర్తి చేస్తుంది!’ అని అమ్మా, నాన్నగారు తిడుతున్నా సరే! 😇


వేసంకాలం ఊరగాయల రోజుల్లో కొత్తావకాయ కలపడానికి అమ్మానాన్నా చేసే హడావుడి గమ్మత్తుగా వుండేది.  నాల్రోజుల ముందునుంచీ ఊరంతా తిరిగి బారామాసి కాయలు ఎక్కడ దొరుకుతాయో చూసి కొనేవారు. 


కొన్ని కాయలు చూడ్డానికి నా అంత లావున్నా పులుపుండవు.  అందుకని ముందుగా ఓ కాయలోంచి చిన్నముక్క కోసిమ్మనాలి.

అది నోట్లో పెట్టుకున్న మరుక్షణం మనకి తెలీకండానే మన ఎడంకన్ను మూసుకుపోయి, 😉 మన నాలుకెళ్లి అంగుట్ని ‘ఠాప్’ మంటూ కొట్టాలి !


‘బాబోయ్, పులుపు రొడ్డు!’ 😖 అనేది అమ్మ. 


ఆవకాయంటే ఏడాదంతా మనల్ని ఆదుకునే ఎర్రని తల్లి కదా!  అంచేత కాయ గట్టిగా టెంకపట్టి, పుల్లగా వుంటేనే నిలవుంటుంది. 

ఇక అసలు విషయానికొద్దాం. 


వేడివేడన్నంలో అంత ఆవకాయ కలుపుకుని, పక్కన బాగా ముగ్గిన చెరుకురసం మావిడిపండొకటి పెట్టుకుని, ముద్దముద్దకీ  తింటూవుంటే వుంటుందీ... నాసామిరంగా! 

వేటూరి పాటని ఇళయరాజా చేత కొట్టించుకున్నంత ధీమాగా అనిపిస్తుంది


అసలు మావిడిపండెలా తినాలో పిల్లలకి మనం శిక్షణా తరగతులు నిర్వహించాలి. 

ఆమధ్య సమ్మర్లో ఓరోజు హొటల్లో భోంచేస్తోంటే అన్నంలోకి అరటిపండుకి బదులు మావిడిపండిచ్చాడు. 

నా పక్కన కూర్చున్నతను భోజనం అంతా అయిపోయాక పండుని ‘స్స్...స్స్...!’ అని ఓసారి గట్టిగా పీల్చి పక్కనబడేసి లేచి చెయ్యి కడిగేసుకున్నాడు. 😡

నాకు వాణ్ణి చంపెయ్యాలనిపించింది.


అసలు మనం తొక్కని పిండి తిన్న తరవాత దానిమీంచి రోడ్డురోలరెక్కించి తొక్కించినా ఒక్క బొట్టుకూడా రసం రాకూడదు..🤤

ఇక టెంకయితే మనల్ని ఏడుస్తూ వేడుకోవాలి... ‘చీకింది చాలు, ఇక ఆపరా బాబూ!’ అని! అంతలా వేధించాలి మావిడిపండుని!😝


అసలు వాణ్ణని ఏంలాభం?🤔  వాళ్లమ్మా నాన్నల్ని అనాలి. పిల్లలకి సంస్కారం నేర్పకపోయినా ఫరవాలేదు, పొద్దున్నే వచ్చే వాట్సప్ ఫార్వర్డ్స్ ఓ నాలుగు చదివితే అదే వస్తుంది. 

కానీ మావిడిపండు తినడం మాత్రం తప్పకుండా నేర్పాలి! 😀


తాతగారేం చేసేవారంటే చెరుకురసాలు, పందార కలిశలు పరకల లెక్కన తెచ్చేవారు. వాటన్నింటినీ గోలెంలో నిండా నీళ్లుపోసి అందులో పడేసేవారు. ఎవడికెన్ని తినాలనిపిస్తే అన్నీ తీసుకు తినెయ్యడమే!


వెంకటేశ్వరస్వామి గుళ్లో బోల్డంత నెయ్యి, జీడిపప్పూ వేసి చేసిన చక్రపొంగలి ప్రసాదం ఓ పెద్ద బేసిన్లో పెట్టేసి అక్కడెవరూ లేకుండా మనల్నే పెట్టుకు తినమంటే ఎలావుంటుంది? ఏలక్కాయ తొక్కలు కూడా మిగల్చం కదా? అచ్చం అలాగన్నమాట! 😋


అమ్మ, అమ్మమ్మ అరగంటకోసారి గోడ గడియారంలో గంటలు కొట్టినట్టు ‘అన్ని పళ్లు తినకండ్రా! సెగ్గడ్డలొస్తాయీ!’ అంటూ రాగాలు తీసేవారు. సెగ్గడ్డలొస్తే ఏదో చూర్ణఁవో, భస్మఁవో తెచ్చుకుని వేసుకుంటాం. రెండ్రోజుల్లో మాడిపోతాయి. 


మన చిన్నతనాల్లో మావిడిపళ్లు పరకలు, డజన్ల లెక్కన కొనేవాళ్లం కదా? 

ఆర్నెల్లకోసారి హైదరాబాద్ వెళ్లొచ్చి నాన్నగారు ‘అక్కడ మల్కాజిగిరిలో మావిడిపళ్లు కేజీల్లో కొలిచి అమ్ముతారు. కలికాలం! ఇంకా ఏంచూడాల్సొస్తుందో?’ అంటూ ఆశ్చర్యం, విచారం కలిపి బాధపడిపోయేవారు.


ఇక మావిడిపళ్ల వంశంలో తనదైన స్థానం ఉన్న ఏకైక రకం... బంగినపల్లి! రసాలైతే వయసైపోయినట్టు ఒళ్లంతా ముడతలుంటాయి. కానీ ఇవలా కాదు.  మంచి యవ్వనంతో మిసమిసలాడుతూ ఒక్క ముడతైనా లేకుండా నిగనిగలాడి పోతుంటాయి. 


పెరుగన్నంలో బంగినపల్లి ముక్కలేసుకుని పళ్లతో గీరుకు తినడం భోజనానికి ఒక పరిపూర్ణత చేకూరుస్తుంది. కొంతమంది బొప్పాయి పళ్లకి మల్లే తొక్కలు తీయించి, పనసపొట్టులా చిన్నచిన్న ముక్కలు కోయించుకు తింటారు.  

అంత రెడీమేడ్ గా తినడంకన్నా ఓ సీసాడు 'మాజా'  తాగడం బెటరు.

లేకపోతే సామర్లకోట స్టేషన్లో మావిడితాండ్ర అమ్మొచ్చినపుడు కొనుక్కుతినాలి. 

అంత మావిడిపళ్ల ముక్కల్ని గీరుకు తినలేనంత వ్యాపకాలేఁవిట్టా??😀


బజారెళితే నాన్నగారు చాలా పెద్దసైజు పళ్లు అరడజను కొనేవారు. ఆయనెప్పుడూ క్యాంపులే! అట్నించి వచ్చేటప్పుడూ బోల్డన్ని తెస్తూండేవారు. పాపం ఆయన తినేది తక్కువైనా సరే పిల్లలున్నారని తెచ్చిపడేసేవారు.


అంత పెద్ద పండునీ అమ్మ కత్తిపీటతో తరిగేది. పైపెచ్చు ఓ మాటనేది...


‘ఈ చెంప నీకు, ఆ చెంప అన్నయ్యకీ! సైడు ముక్కలు ఆడపిల్లలు తింటార్లే!టెంక మీరెలాగూ తినరు కాబట్టి నాకుంచెయ్యండి. అదిచాలు నాకు!’ 


అది బంగినపల్లి కంటే తియ్యని మనసు కదా!😊 అంచేత అలానే చేస్తుంది. ఈ ముక్క రాస్తోంటే కళ్లెందుకో నీళ్లతో నిండిపోతున్నాయి.


మావిడిపండంటే తీపే కాదు! 

తీపి జ్ఞాపకం కూడా! 

 💭 😍 🥭🥭🥭


మనవి : ఇది మామిడి పండ్ల మీద మమకారం తో ఎవరో మహానుభావులు వ్రాసిన కధనం... ఎవరో తెలీదు గానీ, చాలా బాగా రాసారు.. అన్నీ కళ్ళకి కట్టినట్టు.. పాత రోజులన్నీ గిర్రున వెనక్కి తిప్పినట్టు..😍 

 మీకు మామిడి పండ్లు 🥭 ఇష్టం అయితే, హాయిగా చదివి ఆనందించి, మీ చిన్ననాటి స్నేహితులకి, చుట్టాలకి పంపండి 🥰