21, ఫిబ్రవరి 2022, సోమవారం

ప్రశ్న పత్రం సంఖ్య: 39

 ప్రశ్న పత్రం సంఖ్య: 39 

 కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

క్రింద ఇచ్చిన ప్రశ్నలకు 4 జవాబులు వున్నాయి ఒక జవాబు మాత్రం ఎంచుకోండి.

1) సవ్యసాచి అని ఈ వీరుని ఒక పేరు

i ) భీముడు ii ) అర్జనుడు  iii )నకులుడు iv ) ధర్మరాజు . 

2) "పులికాపు" అనగా ఏమిటి

i ) ఇత్తడి విగ్రహాలను పుల్లని పదార్ధంతో శుభ్రపరచటం ii ) ఇత్తడి విగ్రహాలను నిర్మా సబ్బుతో శుభ్రపరచటం iii ) ఇత్తడి విగ్రహాలను చల్లని పదార్ధంతో శుభ్రపరచటం iv ) ఇత్తడి విగ్రహాలను ఇటిక పొడితో శుభ్రపరచటం

3) నాలుగు వేదాలను ఆలా విభజించిన మహర్షి ఎవరు    

i ) వేదవ్యాసుడు ii ) అత్రి మహర్షి iii ) పరాశరుడు  iv ) అంగీరసుడు

4) సంపెంగ పుష్పము ఒక 

i ) అందమైన పుష్పము ii ) అందము వాసన వున్న పుష్పము iii ) ఇది ఎర్రని పుష్పము iv ) సువాసన వున్న పుష్పము

5) దేవతల గురువు ఎవరు. 

i ) వసిష్ఠుడు    ii ) విశ్వామిత్రుడు  iii ) శుక్రాచార్యుడు*   iv ) అత్రి మహర్షి 

 6) స్వచ్ఛమైన నీరు ఒక .

i ) మంచి విద్యుత్ వాహకం ii ) విద్యుత్ వాహకం కాదు iii ) విద్యుతికి నీటికి సంబంధం లేదు iv ) కొన్ని సార్లు విద్యుత్ వాహకంగా పనిచేస్తుంది. 

7) బంగారము ఒక

మంచి విద్యుత్ వాహకం ii ) విద్యుత్ వాహకం కాదు iii ) విద్యుతికి బంగారానికి సంబంధం లేదు iv ) కొన్ని సార్లు విద్యుత్ వాహకంగా పనిచేస్తుంది.

8) మొట్టమొదటి ఉపనిషత్ అని దేనిని అంటారు.

i ) కేన  ii ) ఈశావాసిపనిషత్ iii ) ముండకోపనిషత్ iv ) బృహదారణ్యక

9) ఈ దేముడికి గుడులు లేవు

i ) పరమేశ్వరుడు ,   ii ) బ్రహ్మ iii ) విష్ణు iv ) వేంకటేశ్వరుడు

10) తెలంగాణాలో రైతులకు ఆర్ధిక సహాయకరంగా ప్రెవేశపెట్టిన పథకం

i ) రైతు సహాయం ii ) రైతు బంధు iii ) రైతు భరోసా iv ) రైతులకోసం 

11) హిమాలయాలలో పుట్టిన నది ఇది

i )కృష్ణ  ii ) గోదావరి    iii ) తుంగభద్రా    iv ) గంగానది 

 12) ప్రపంచంలో హిందూమత ప్రాశస్త్యాన్ని చాటిన శ్రీ రామకృష్ణ శిష్యుడు

i ) వాచాలుడు  ii ) గోవిందుడు  iii ) వివేకానంద  iv ) మండనమిశ్రుడు

13) సూర్యునిలో ఈ గ్యాసు ఉంటుంది.

i ) అమ్మోనియం ii ) కార్బండైయాక్సిడ్ iii )హైడ్రోజన్   iv ) సల్ఫర్ డీఆక్సీడ్ 

14) మన గృహవరణలో ఈ మొక్కను తప్పకుండ పెంచుకుంటాము 

i ) చామంతి   ii )తులసి   iii ) గన్నేరు  iv ) బంతి

15) విమానం తక్కువ బరువు ఉండటానికి ఈ లోహంతో చేస్తారు

i ) ఇనుము  ii )  అల్యూమినియం iii ) స్టీలు  iv ) రాగి

16) భూమి ఒక పెద్ద

i ) నీటిముద్ద  ii )అయస్కాంతము    iii ) రాయి    iv ) ఉపగ్రహం

17) మనందరికీ మేనమామ ఎవరు

i ) శుక్రుడు ii ) బుధుడు   iii ) చంద్రుడు iv ) అంగారకుడు 

18) ఇది కాళిదాసు వ్రాసిన ఒక నాటకము

i ) మృత్యకటకము  ii ) మేఘసందేశము iii ) కన్యాశుల్కము  iv ) ఆముక్తమాల్యద 

19) ప్రస్తుతం మైక్రోవేవులను ఈ పరికరాలలో వాడుతున్నారు

i ) సెల్ ఫోను ii ) కాలింగ్ బెల్ వు iii ) గడియారాలు  iv )   ఎయిర్ కండీషనర్లో 

20)  చిలికి చిలికి 

i ) వడగళ్ల వాన అయ్యింది ii ) గాలి వాన అయ్యింది iii ) మజ్జిగ అయ్యింది  iv ) కోవా అయ్యింది 

ప్రశ్న పత్రం సంఖ్య: 38

 ప్రశ్న పత్రం సంఖ్య: 38 కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

క్రింద ఇచ్చిన ప్రశ్నలకు 4 జవాబులు వున్నాయి ఒక జవాబు మాత్రం ఎంచుకోండి.

1) మహిళలు పేరంటానికి వెళ్ళితే కాళ్లకు ఇది రాస్తారు

i ) కుంకుమ ii ) పసుపు iii )సున్నిపిండి iv ) ఆముదం. 

2) "పగలు" అనే పదానికి రెండు అర్ధాలు వున్నాయి

i )పగలు మరియు రాత్రి ii ) విరోధాలు మరియు పట్టపగలు iii ) పగలు మరియు పొగలు iv ) పట్టపగలు తలపాగా 

3) నాలుగు వేదాలలో ఒక్క వేదానికి మాత్రం రెండు భాగాలు వున్నాయి అది  

i ) సామవేదం    ii ) ఋగ్వేదం  iii ) అధర్వణ వేదం iv ) యజుర్వేదం

4) రామాయణంలో క్రింది పాత్ర లేదు 

i ) ద్రౌపతి ii ) లక్ష్మణుడు iii ) హనుమంతుడు iv ) సుగ్రీవుడు

5) మృత సంజీవిని విద్య కచునికి ఉపదేశించినది ఎవరు 

i ) వసిష్ఠుడు    ii ) విశ్వామిత్రుడు  iii ) శుక్రాచార్యుడు   iv ) అత్రి మహర్షి 

 6)కన్యాశుల్కం నాటకాన్ని వ్రాసింది ఎవరు.

i ) పానుగంటి నరసింహారావు   ii ) గురుజాడ అప్పారావు iii ) శ్రీనాధుడు  iv ) పోతనామాత్యుడు 

7) పంచ లోహాలతో ఇది లేదు

 i ) అల్యూమినియం ii ) ఇనుము iii ) రాగి iv ) వెండి

8) ఋక్కు అనునది________ సంబందించినది

i ) వేదానికి ii ) ఉపనిషత్తుకు   iii ) రామాయణానికి iv ) పురాణానికి

9) ప్రబంధానికి ఎన్ని ఆశ్వాసాలు ఉంటాయి 

i ) మూడు  ,   ii ) ఆరు  iii ) నాలుగు    iv ) ఐదు 

10) మనిషి చేతి గీతాలను చూసి జాతకాన్ని చెప్పే దానికి ______అని పేరు

i ) పామిస్ట్రీ ii ) హరోస్కోప్ iii ) ఎపిమర్సు  iv ) కుండలిని 

11) శ్వేతాంబరులు అనగా

i ) జైన మతపు ఒకశాఖ వారు ii ) బౌద్ధ మతస్తులు    iii ) శిక్కు మతస్తులు   iv ) హిందూ మతంలో ఒక శాఖ వారు 

 12) అరణి అనునది క్రింది దాని పని చేస్తుంది 

i ) అగ్గిపెట్ట ii ) నశ్యపు బుడ్డి iii ) రోలు పొత్రం iv ) పాన్ పెట్టె

13) సూర్యుని కాంతిలో ____ రంగులు ఉంటాయి

i ) ముప్ఫయి  ii ) ఆరు  iii )ఏడు  iv ) తొమ్మిది 

14) మన గృహవసారాలకు వాడుకునే విద్యుత్తు

i ) A.C  ii ) D.C  iii ) static electricity iv ) stored Electricity

15) ఇనుము, అల్యూమినియం రెంటిలో తక్కువ వేడిలో కరిగేది ఏది.

i ) ఇనుము  ii )  అల్యూమినియం iii ) రెండు కూడా iv ) తక్కువ వేడిలో కరిగేది ఏది లేదు

16) ఆంధ్ర కవితా పితామహుడు ఎవరు

i ) శ్రీ శ్రీ ii ) అల్లసాని పెద్దన   iii ) తెనాలి రామకృష్ణ   iv ) భట్టు మూర్తి

17) ప్రయాణికుల జెట్ విమానంకు ముందర ప్రొపెల్లర్

i ) ఉంటుంది  ii ) ఉండదు  iii ) ఉంటె ఉంటుంది లేకుంటే ఉండదు iv ) తప్పనిసరిగా ఉంటుంది. 

18) విద్యుత్ మోటార్ ఈ శక్తితో తిరుగుతుంది

i ) విద్యుత్ అయస్కాతం శక్తితో ii ) రాగి తీగతో చేసిన కాయిలుతో iii ) స్థిర అయస్కాంత శక్తితో 

19) అంబుజం  అని దేనిని అంటారు

i ) తామర పువ్వు ii ) చేమంతి పువ్వు iii ) గులాబీ పువ్వు iv )   బంతి పువ్వు 

20)  తబలా అనునది ఒక 

i ) చర్మ వాయిద్యం ii ) తంత్రీ వాయిద్యం iii ) వాయు వాయిద్యం iv ) విద్యుతు వాయిద్యం. 

అర్థ పరిణామం

 తెలుగులో అర్థపరిణామం అనే ఒక విభాగం.. ఉందండి... ఇందులో అర్థ గ్రామ్యత అనేది ఒకటుంది కదండి.., ఈ పదం ఆ విభాగంలో ఉంది.



అర్థ పరిణామం

    



భాషలోని వర్ణాలు, ధ్వనులు, వాక్య నిర్మాణం, వ్యాకరణ నిర్మాణం మారినట్లుగానే అర్థాలు కూడా మారడం సహజం. నన్నయ భారతంలో ‘కంపు’ అనే పదాన్ని వాసన అనే అర్థంలో వాడారు. నేటి భాషలో అది చెడు వాసన అనే అర్థంగా మారింది. ప్రతి పదానికీ చరిత్ర ఉంది. ఒక మాటకు ఒకే అర్థం కాకుండా అనేకార్థాలుంటాయి. కొత్త కొత్త భావాలు, ఆలోచనలు, అవసరాలు వచ్చినప్పుడు ఉన్న పదాలనే కొత్త సందర్భాల్లో వాడటం వల్ల కొత్త అర్థాలు ఏర్పడటం సహజం. పాతకాలంలో ఇల్లు అంటే పూరిల్లు అనే అర్థం ఉండేది. ఆధునిక కాలంలో ఇల్లు అంటే పెంకుటిల్లు, డాబా, మేడ, అపార్ట్‌మెంట్ అనే అర్థాల్లో రూఢమైంది.


అర్థ పరిణామానికి హేతువులు

అర్థ పరిణామానికి స్థూలంగా ప్రధానమైన ఐదు కారణాలను పేర్కొనవచ్చు. అవి..



నాగరికతలో మార్పు రావడం

చారిత్రక కారణాల వల్ల కొన్ని పదాలు ప్రసిద్ధిలోకి వచ్చి అర్ధాంతరంలో ఉపయోగించడం వల్ల

అలంకారిక ప్రయోగం

పరిసరాల్లో మార్పు రావడం

భావాభివ్యక్తిలో మార్పు

ఇవేకాకుండా ప్రకరణార్థాలు, నానార్థాలు, శ్లేషార్థాలు, పలుకుబడులు, జాతీయాలు, వ్యాకరణార్థాలు, పర్యాయపదాల వల్ల అర్థాల్లో మార్పు వస్తుంది.

అర్థ పరిణామ భేదాలు

భాషావేత్తలు.. అర్థ వ్యాకోచం, అర్థ సంకోచం, అర్థ సౌమ్యత లేదా అర్థ గౌరవం, అర్థ గ్రామ్యత లేదా అర్థాపకర్ష, లక్ష్యార్థాలు, కేవల సంకేతార్థాలు, వస్తు పరిణామం, అలంకారిక ప్రయోగం, లోక నిరుక్తి వంటి బేధాలను పేర్కొన్నారు. వాటిని పరిశీలిద్దాం..

అర్థ వ్యాకోచం లేదా అర్థ విస్తృతి

ఒక పదం పాతకాలంలో పరిమితార్థంలో ఉండి, తర్వాత కాలంలో విశాలార్థంలో విస్తృతం కావడాన్ని అర్థ వ్యాకోచం లేదా అర్థ విస్తృతిగా పేర్కొనవచ్చు. ఆంగ్లంలో దీన్ని Extension of the meaning అంటారు. అర్థ వ్యాకోచానికి కొన్ని ఉదాహరణలు..

చెంబు: రాగి లోహంతో చేసిన దాన్నే ప్రాచీన కాలంలో చెంబు అనేవారు. నేడు ఏ లోహంతో చేసినా చెంబు అంటున్నారు. ప్రత్యేకార్థం నుంచి విస్తృతార్థంలో ఇత్తడి చెంబు, ప్లాస్టిక్ చెంబు, వెండి చెంబు అని వ్యవహరిస్తున్నారు.

నూనె: ప్రాచీన కాలంలో నువ్వుల నుంచి తీసినదాన్నే నూనెగా పరిమితార్థంలో వ్యవహరించేవారు. ప్రస్తుతం వేరుశెనగ, కొబ్బరి, సన్‌ఫ్లవర్ నుంచి తీసిన వాటిని కూడా నూనెగానే సామాన్య అర్థంలో వాడుతున్నారు.

అష్టకష్టాలు: ప్రాచీన కాలంలో ఎనిమిది రకాలైన కష్టాలను పేర్కొన్నారు. అవి..

1) దేశాంతర గమనం (విదేశాలకు వెళ్లడం)

2) భార్యా వియోగం

3) ఆపదల్లో బంధు దర్శనం

4) శత్రుస్నేహం 5) నీచ ఉచ్ఛిష్ట భోజనం

6) పరాన్న భోజన ప్రతీక్షణం

7) అప్రతిష్ట

8) దారిద్య్రం

నేడు వీటినే అసంఖ్యాకమైన కష్టాలు అనే అర్థంలో వాడుతున్నారు.

అవధాని: ప్రాచీన కాలంలో అవధానం చేసే వ్యక్తినే అవధాని అనేవారు. నేడు బ్రాహ్మణుల పేర్ల చివర అవధాని చేరుతోంది. ఇక్కడ అర్థ విస్తృతి జరిగింది.

కమ్మలు: ప్రాచీన కాలంలో తాటి ఆకులతో చేసి చెవులకు ధరించే ఆభరణాలనే కమ్మలనేవారు. నేడు చెవులకు ధరించే బంగారం, వెండి, ప్లాస్టిక్ ఆభరణాలన్నింటినీ విస్తృతార్థంలో కమ్మలంటున్నారు.

అర్థ సంకోచం

ప్రాచీన కాలంలో విస్తృతార్థంలో ఉండి నేడు పరిమితార్థానికి వచ్చిన పదాలను అర్థ సంకోచం అంటారు. అర్థం కుంచించుకుపోవడమే అర్థ సంకోచం.

ఉదాహరణ:


ప్రాచీన కాలంలో స్త్రీ, పురుషులిద్దరూ ధరించే వస్త్రాలను చీర, కోక అనేవారు. ఇప్పుడు కేవలం స్త్రీలు ధరించే వస్త్రాలు అనే అర్థంలో పరిమితమయ్యాయి.

పూర్వం అవ్వ అనే పదాన్ని స్త్రీ అనే సామాన్య అర్థంలో వాడేవారు. ఇప్పుడు కేవలం వృద్ధ స్త్రీ అనే అర్థానికే పరిమితమైంది.

పని, ప్రయత్నం అనే అర్థంలో ప్రాచీనకాలంలో ఉద్యోగం అనే పదం వాడేవారు. నేడు కేవలం ప్రభుత్వ, ప్రైవేటు, పారిశ్రామిక సంబంధమైన సంస్థల్లో చేసే ఉద్యోగం అనే అర్థంలో పరిమితమైంది.



అర్థ సంకోచం జరిగిన కొన్ని పదాలు: వ్యవసాయం, మృగం, ఆరాధ్యుడు, సంభావన, నెయ్యి, సాహెబ్, జంగమ, కర్మ.

అర్థ సౌమ్యత లేదా అర్థ గౌరవంలేదా అర్థోత్కర్ష

పూర్వకాలంలో నిందార్థంలో వాడిన పదాలు కాలక్రమంలో విశిష్టార్థ బోధకాలై వాటికి అర్థ గౌరవం కలిగినప్పుడు వాటిని అర్థ సౌమ్యత లేదా అర్థ్ధోత్కర్ష అంటారు.


ఉదాహరణలు:

సభికులు: ప్రాచీన కాలంలో జూదగాళ్లు అనే అర్థంలో వాడేవారు. నేడు సభలోని వారు అనే గౌరవార్థంలో వాడుతున్నారు.


వైతాళికులు: పూర్వం రాజును నిద్రలేపే వారు అనే అర్థంలో వాడేవారు. ప్రస్తుతం సంస్కర్తలు, మూఢాచారాలపై అవగాహన కలిగించేవారు అనే గౌరవార్థంలో వాడుతున్నారు.


ముహూర్తం: గతంలో నిమిష కాలం, అల్పకాలం అనే అర్థంలో వాడేవారు. ప్రస్తుతం పవిత్రమైన శుభకార్యాలు నిర్వహించే కాలం అనే అర్థంలో రూఢమైంది.

మర్యాద: ‘హద్దు’ అనే అర్థంలో ఉండేది. నేడు గౌరవం అనే అర్థంలో వాడుతున్నారు.

అదృష్టం: కనిపించనిది అనే అర్థం ఉండేది. నేడు సంపద, భాగ్యం అనే అర్థంలో ఉంది.

అంతస్తు: మేడ పై భాగం అనే అర్థంలో పూర్వం వాడేవారు. ప్రస్తుతం పరువు, ప్రతిష్ట అనే అర్థ గౌరవాన్ని సంతరించుకుంది.

ఆంగ్లంలో Knight అనే పదం Servant అనే అర్థంలో పాతకాలంలో ఉండేది. ప్రస్తుతం ప్రజ్ఞాశాలి అనే అర్థంలో వాడుతున్నారు.

Nice అనే పదం Stupid అనే అర్థంలో ఉండేది. నేడు అందమైన అనే అర్థంలో వాడుతున్నారు.

అర్థ గ్రామ్యత లేదా అర్థాపకర్షలేదా అర్థ న్యూనత

ప్రాచీనకాలంలో గౌరవార్థంలో ఉండి కాలక్రమంలో నిందార్థంలో ప్రయోగిస్తున్న పదాలను అర్థ గ్రామ్యత లేదా అర్థాపకర్ష అంటారు.

కంపు: ఒకనాడు సువాసన అనే అర్థం ఉండేది. ప్రస్తుతం దుర్వాసన అనే అర్థంలో వాడుతున్నారు.


*ఛాందసుడు*: పూర్వకాలంలో వేద పండితుడు అనే అర్థంలో వాడేవారు. ప్రస్తుతం అమాయకుడు, లోకజ్ఞానం లేనివాడు అనే నిందార్థంలో వాడుతున్నారు.

కర్మ: పూర్వం పని అనే అర్థంలో వాడేవారు. ప్రస్తుతం పితృకర్మ అనే అర్థానికి పరిమితమైంది.


అర్థాపకర్ష జరిగిన కొన్ని పదాలు: కళావంతులు, కైంకర్యం, పూజ్యం, ఘటం మొదలైనవి.🙏🙏🙏🙏

స్వర్గస్థితానామిహ

 శ్లోకం:☝️

  *స్వర్గస్థితానామిహ జీవలోకే*

*చత్వారి చిహ్నాని వసంతి దేహే l*

  *దానప్రసంగో మధురా చ వాణీ*

*దేవార్చనం బ్రాహ్మణతర్పణం చ ll*

    - చాణక్య నీతి


భావం: దానము, ప్రియ భాషణము, దైవభక్తి, బ్రాహ్మణ సంతర్పణ (లోక కళ్యాణము కోరే బ్రాహ్మణులను ఆదరించడం) అనే నాలుగు గుణాలూ స్వర్గాహులైన జీవులకు ఉండే చిహ్నాలు / లక్షణాలు అని చాణక్యుని అభిప్రాయము.🙏

వ్యక్తిత్వంలో వజ్రం

 వ్యక్తిత్వంలో వజ్రం - మన జాతికి దొరికిన రత్నం


డ్రైవరు కాకుండా నలుగురు ప్రయాణిస్తున్న ఆ కారు దిల్లీ వైపు వెళ్తోంది. ఆ నలుగురూ ఒక మీటింగ్ కు హాజరవ్వాలి. ఇంతలో ఒక టైరు పంచరు ఆయ్యింది. అందరూ దిగారు. డ్రైవరు మరో టైరును బిగించేపని చూస్తున్నాడు , ముగ్గురిలో ఒకరు సిగరెట్టు వెలిగించాడు , ఒకాయన సెల్ ఫోన్ తీసి మాట్లాడుతున్నాడు , మరొకాయన వెంట తెచ్చుకొన్న ఫ్లాస్కులోని కాఫీ తాగుతున్నాడు. రెండు నిమిషాయలయ్యాక ఆ ముగ్గురికీ నాల్గవ వ్యక్తి గుర్తుకొచ్చాడు , అపుడు ఆ ముగ్గురూ ఆయన వంక చూసి ఆశ్ఛర్యపోయారు. ఎందుకంటే ఆయన తన చొక్కా స్లీవ్ పైకి అనుకొని , టై ను భుజం వెనక్కి వేసుకొని , జాకీ , స్పానర్ తీసుకొని డ్రైవర్ కు సహాయపడుతున్నాడు. ఈ ముగ్గురూ అవాక్కయ్యారు.  కారణం ఆ నాల్గవ వ్యక్తి  రతన_టాటా.  '' సార్ , మీరు ? '' '' అవును ,  మనం మీటింగ్ కు వెళ్ళాలి , టైరు మార్చడానికి డ్రైవర్ కు 15 ని. సమయం పడుతుంది , కానీ నేను సహాయపడితే 8 నిమిషాల్లో అతను ఆ పని పూర్తీచేస్తాడు. మనకు 7 ని. కలిసొస్తాయి కదా ? ''  అన్నారు రతన్ టాటా. [ Respect to Time is Respect to Life ] 


TATA Group ఎందుకు ఆ స్థాయికి ఎదిగిందో దాని అధినేత అయిన రతన్ టాటాను చూస్తే తెలుస్తుంది ! 


బాల్యంలో  ఆయన తల్లి తండ్రులు విడిపోయారు , అవ్వ పెంచిపెద్ద చేసింది. 


యవ్వనంలో ఆయన girl friend  మోసం చేసింది. 


ఆతరువాత కంపెనీ కి విపరీతమైన నష్టాలు , సవాళ్ళు ఎదురయ్యాయి. 


కానీ ఆయన తన మంచితనాన్ని , దయను , లక్ష్యాన్ని , నిజాయితీని , సమయపాలనను , క్రమశిక్షణను , కఠోర పరిశ్రమను మరచిపోలేదు. TATA సంస్థను ఆయన ఏ స్థాయికి తీసుకొచ్చారో క్రింద వివరాలు చదివితే తెలుస్తుంది : 


టాటా సంస్థ అయిన TCS  యొక్క స్టాక్ మార్కెట్ విలువ పాకిస్తాన్ దేశపు మొత్తం స్టాక్ మార్కెట్ విలువతో సమానం.  


భారతదేశపు GDP కి TATA సంస్థ ఒక్కటే 4 % కాంట్రిబ్యూట్ చేస్తుంది. 


ప్రతి ఏటా  అస్సాం , ఒడిషా , హిమాచల్ ప్రదేశ్ , గోవా లు కలిపి ఎంత tax కడతాయో అంత tax ను ఒక్క TATA సంస్థనే దేశానికి చెల్లిస్తుంది. [ 50000 + కోట్లు ]  


నవంబరు 26 , 2008 లో పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా మన ముంబై నగరంలోని TATA సంస్థ యొక్క TajHotel మీద ఆత్మాహుతి దాడి చేసి వందలమందిని చంపిన సంఘటనలో, చనిపోయిన ప్రతి వ్యక్తి కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలిసి  ఒక్కొక్కరికీ 25 నుండీ 50 లక్షల దాకా సహాయం అందించారు రతన్ టాటా ; ఆ సమయం లో తమ హోటల్ లో డ్యూటీలో వుండి మరణించిన  , గాయపడిన ప్రతి పోలీసు , ప్రతి ఇతర ఉద్యోగి కుటుంబం లో ఒక్కొక్కరికి తన సంస్థలో ఉద్యోగం ఇచ్చాడు , వాళ్ళ పిల్లల చదువు , పెళ్ళిళ్ళ  బాధ్యత ను తానే తీసుకొన్నాడు ; అంతకంటే ఆశ్చర్యమేమంటే ఆ దాడి సమయంలో దేవిక అనే చిన్న పాప హోటల్ కు వచ్చివుంటుంది , ఆమెను గది బయటపెట్టి ఆమె తండ్రి , మామయ్య toilet లోకి వెళ్ళివుంటారు , అప్పుడే ఆ దాడి జరిగింది , వాళ్ళిద్దరూ మరణించారు. ఆ చిన్న పాప బ్రతికింది , తరువాత ఆనాడు హోటల్లో చిన్నపిల్లలు , స్త్రీలు , వృద్ధులు అని చూడకుండా కాల్పులు జరిపి వందలమందిని చంపిన నరరూప రాక్షసుడు అజ్మల్ కసబ్ ను గుర్తుపట్టింది ఆ చిన్న పాపనే. ఆ చిన్న పాపను ఆసుపత్రిలో చేర్పించి , కోలుకొనేలా చేసి , ఆమె చదువుకు ఏర్పాట్లు చేసి , ఉద్యోగం కూడా తన కంపెనీలోనే ఇస్తానని చెప్పి , ఆమె పెళ్ళి బాధ్యతను కూడా కూడా రతన్ టాటా నే తీసుకొన్నారు. మరో ఆశ్చర్యమేమంటే  ఆ దాడి సమయంలో రోడ్డు మీద వెళుతున్న , అక్కడ చిన్న చిన్న వ్యాపారాలు [చేపలు పట్టడం ,  పావ్ బాజీ , పానీపూరి , భేల్ పూరి , పాన్ బీడా , చాయ్ దుకాణాల ]  నడుపుకొనేవారికెవ్వరికీ TATA సంస్థతో ఏ సంబంధాలు లేకపోయినా , వారందరికీ నష్టపరిహారం అందించారు రతన్ టాటా. అన్నిటికంటే పెద్ద ఆశ్చర్యమేమంటే ఈ అన్ని పనులనూ రతన్ టాటా దాడి జరిగిన తరువాత కేవలం 20 రోజుల్లో పూర్తీచేసేసారు. అందుకే ఆయన గురించి ఒక స్నేహితుడు ఇలా వ్రాసాడు :  Don't mess with him ; if you give him Deep Insults , he will transform them into Deep Results.  


నా దృష్టిలో రతన్ టాటా సూటు బూటు వేసుకొన్న స్వామి వివేకానంద. ఇద్దరూ బ్రహ్మచారులే. మొదటి వ్యక్తి '' ధ్యానంతో '' దేశాన్ని మార్చాడు, రెండవ వ్యక్తి '' ధనంతో ''  దేశాన్ని సేవిస్తున్నాడు.