14, అక్టోబర్ 2024, సోమవారం

మొబైలు వాడని తల్లి కావాలి*

  *మొబైలు వాడని తల్లి కావాలి*


ఈ సంఘటన మీ హృదయాలను కదల్చివేయగలదు. 


అది ఒక పాఠశాలలోని ఐదవ తరగతి గది. విద్యార్థులందరు పది సంవత్సర వయస్సుగల పిల్లలే. ఏమీ తెలియని చిన్నారి దశ. ఇప్పుడిప్పుడే కొద్దిగా లోకం పోకడకు అలవాటు పడుతున్నారు. ఆ తరగతి ఉపాధ్యాయిని వాళ్ళందరికి మీ మీ తల్లులను మీరు ఎలా ఎలా ఇష్టపడుతున్నారు అని కాగితంలో ఒక చిన్న ఫేరా వ్రాయమని పురమాయించారు. 


అందరూ వాళ్ళకు తోచిన విధంగా వ్రాయడం మొదలుపెట్టారు. ఒక విద్యార్థిని వ్రాసిన కథనం ఇదిగో.


*నాకు ఎప్పుడూ నాతో బాటే ఉండే ఆఫ్ లైన్ (offline) అమ్మ కావాలి. మా అమ్మ ఎల్లవేళలా ఆన్ లైన్ (online) లోనే ఉంటున్నారు. నాతో మెలిగే సమయం కన్నా వారు మొబైలుతోటే ఎక్కువ సమయం వెచ్చిస్తారు. నేనూ ఒక మొబైలులా పుట్టి ఉంటే ఎంచక్కా మా అమ్మకు తోడుగా ఉండేదాన్నో. తను ఎక్కడికి వెళ్ళినా తనతో బాటే నన్ను తీసుకెళ్ళేది కదా*. 


*అందువలన నాకు ఈ మొబైలు వాడకాలు, సాంకేతిక పరిజ్ఞానం లేని నిరక్షరాస్యులైన అమ్మనే కావాలి. అంటే ఎల్లకాలం నాతోనే గడిపే ఆఫ్ లైన్ అమ్మ అన్నట్టు*. 


*మా ఎప్పుడూ జీన్సులు, టీ షర్టులు, చూడిదార్లు, లెగ్గింగులు, నైటీలు ధరించకూడదు. చోటూ వాళ్ళ అమ్మలాగా ఎల్లవేళలా ఎంతో హుందాగా కనబడే చీరలోనే కనబడాలి. నా ఒడిలో తల బెట్టి నన్ను ఎప్పుడూ ముద్దులతో ముంచెత్తాలి*. 


*మొబైలు వాడని అమ్మలే వారి వారి కుటుంబానిపై, తండ్రిపై, పిల్లలపై ఎక్కువ సమయాన్ని కేటాయించగలరు*.


*ఆఫ్ లైను తల్లైతే ఇంట్లో ఎటువంటి వివాదాలు, తగాదాలు తలెత్తవు. అమ్మలు చాలా ఓర్పుతో ఉంటారు కాబట్టి ఇలాంటి కలహాలను ప్రోత్సహించరు. అందరికీ అందుబాటులో ఉంటూనే వారి కార్యక్రమాలను కూడా ఎంతో నేర్పుతో కొనసాగించగలరు*.


*మా ఇంట్లో ఎప్పుడెప్పుడు కరెంటు పోతుందానని ఎదురుచూస్తూనే ఉంటాను. ఎందుకంటే కరెంటు పోతే వైఫై పనిచేయదు కాబట్టి ఇక మొబైలును పక్కన బెట్టి మా అందరితోనూ పిచ్చాపాటి మాట్లాడడమే*. 


*ఆఫ్ లైన్ అమ్మ అయితే నాకు ఎంచక్కా పడుకొనే ముందు రామాయణ మహాభారత కథలు చెప్పగలదు కదా. అవి వింటూ నేను నిద్రలోకి జారిపోయేదాన్ని. కాని ఇప్పుడైతే పరుపు మీద పడుకొంటేనే చాలు ఇక విడియో గేమ్స్ ఆడుకోవడమే. నాకైతే ఇవన్నీ రోత రోతగా ఉందన్నట్టు*. 


ఆ విద్యార్థిని  ఇంత పెద్ద వ్యాసం వ్రాయడాన్ని గమనించి ఉపాధ్యాయిని తరగతిలో అందరికి వినబడేటట్టు దాన్ని చదివారు. విద్యార్థులు అందరూ అది విని, చిన్న పిల్లలు కదా, ఘొల్లున ఏడ్వడం మొదలెట్టారు. అందరిని ఆ వ్యాసం అంతలా కదిలించింది. 


అమ్మలందరికీ విన్నపం ఏంటంటే, మీరందరు ప్రస్తుత తరానికి చెందినవారే. ఎంతో చదువుకొని, సాంకేతిక పరిజ్ఞానంతో ఎంతో నిత్యనూతనంగా మెలిగేవాళ్ళే. కాని మీ చిన్నారి పిల్లల గురించి ఆలోచించండి. వారు ఎలా మీ లాలింపుల గురించి ఎదురుచూస్తున్నారో. ఈ రోజుల్లో చరవాణి వాడిని యువతీయువకులు కనబడరు, నిజమే. కాని అదే జీవితం కాదు, లోకం కాకూడదు. మీ కుటుంబానికి కూడా మీరు సమయాన్ని కేటాయించాలి. మీ పిల్లలే భావిభారత పౌరులు. వాళ్ళందరిని చక్కదిద్దే బృహత్తర కార్యక్రమం మీ పైనే ఉంది. మీ ఆలనాపాలనలు వారికి ఎంతో ముఖ్యం. వారందరిని ఈ చిన్నారి దశలోనే తీర్చిదిద్దాలి. ఒక్కసారి పెరిగిన తర్వాత వారు మీపై ఎక్కువ ఆధారపడరు కదా. 


మీరే వారందరికి స్ఫూర్తినిచ్చి వారి భవిష్యత్తుకు చక్కటి పూలబాట వేయాలి. తల్లులే కాదు, తండ్రులకు కూడా ఈ గురుతర బాధ్యతలు వర్తిస్తాయి సుమా. 


కుటుంబ వ్యవస్థ క్షీణించకుండా పిల్లలందరూ అస్తవ్యస్తంగా మెలగకుండా ఉండడానికి తల్లిదండ్రులు వారి వారి బాధ్యతలను గుర్తించి కుటుంబాలను చక్కదిద్దుకుంటారని ఆశిస్తూ ఈ సందేశం అందరికీ అంకితం.

సోమవారం*🕉️ 🌹 *14, అక్టోబర్, 2024*🌹

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       🕉️ *సోమవారం*🕉️

🌹 *14, అక్టోబర్, 2024*🌹

      *ధృగ్గణిత పంచాంగం*                 


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - శరత్ఋతౌః*

*ఆశ్వీయుజ మాసం - శుక్లపక్షం*


*తిథి     : ఏకాదశి* ఉ 06.41 *ద్వాదశి* రా 03.42 తె వరకు

*వారం: సోమవారం*(ఇందువాసరే)

*నక్షత్రం  : శతభిషం* రా 12.43 వరకు ఉపరి *పూర్వాభాద్ర*


*యోగం  : గండ* సా 06.01 వరకు ఉపరి *వృద్ధి*

*కరణం  : భద్ర* ఉ 06.41 *బవ* సా 05.15 ఉపరి 

*బాలువ* రా 03.42 తె ఆపైన *కౌలువ*


*సాధారణ శుభ సమయాలు* 

 *ఉ 06.00 - 07.00 సా 04.00 - 06.00*

అమృత కాలం  :*సా 06.09 - 07.37*

అభిజిత్ కాలం  :*ప 11.30 - 12.17*


*వర్జ్యం          : ఉ 09.25 - 10.52*

*దుర్ముహూర్తం  : మ 12.17 - 01.04 & 02.38 - 03.25*

*రాహు కాలం : ఉ 07.28 - 08.56*

గుళికకాళం      : *మ 01.22 - 02.50*

యమగండం    : *ఉ 10.25 - 11.53*

సూర్యరాశి : *కన్య* 

చంద్రరాశి : *కుంభం*

సూర్యోదయం :*ఉ 06.00* 

సూర్యాస్తమయం :*సా 05.47*

*ప్రయాణశూల  : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం    :  *ఉ 06.00 - 08.21*

సంగవ కాలం   :      *08.21 - 10.42*

మధ్యాహ్న కాలం :*10.42 - 01.04*

అపరాహ్న కాలం:*మ 01.04 - 03.25*

*ఆబ్ధికం తిధి:ఆశ్వీయుజ శుద్ధ ద్వాదశి*

సాయంకాలం :  *సా 03.25 - 05.47*

ప్రదోష కాలం   :  *సా 05.47 - 08.13*

రాత్రి కాలం      :  *రా 08.13 - 11.29*

నిశీధి కాలం     :*రా 11.29 - 12.18*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.22 - 05.11*

________________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*

  

    🕉️ *శ్రీ శివ తాండవ స్తోత్రం*🕉️


జటా భుజంగ పింగళ స్ఫురత్ఫణా మణిప్రభా

కదంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే 

మదాన్ధ సిన్ధుర స్ఫురత్త్వ గుత్తరీయ మేదురే

మనో వినోద మద్భుతం బిభర్తు భూత భర్తరి 


🕉️ *ఓం నమః శివాయ*🕉️


🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

జమునకుc గ్రింది భాగమునc జల్లదనంబట జూచితే కవీ!*

 *జమునకుc గ్రింది భాగమునc జల్లదనంబట జూచితే కవీ!*

ఈ సమస్యకు నాపూరణ. 



అమలిన భక్తి భావముల నార్ధ్రత పైకొన తన్మయత్వమున్


సుమముల నెంచి నన్నిటను సుందర మూర్తుల మోములన్నిటిన్


కమలపు సామ్యమున్ దెలిపి  కావ్యము లల్లరె గొప్పదైన కం


జమునకుc గ్రింది భాగమునc జల్లదనంబట జూచితే కవీ!


అల్వాల లక్ష్మణ మూర్తి.

హైందవం వర్ధిల్లాలి 28*

 *హైందవం వర్ధిల్లాలి 28*


సభ్యులకు నమస్కారములు.


*మహిళా గౌరవం.  అశ్లీలతలకు తావివ్వని విధంగా సముచిత, సమున్నత స్థానం స్త్రీల కివ్వాలి, గౌరవించాలి* :-  

సృష్టిలో సమాన భాగస్తురాలు స్త్రీ అను విషయము జగద్విదితమే. స్త్రీమూలకమే ఈమానవ సృష్టి అనునది కూడా విశ్వ సత్యమే.*వారిని గౌరవించడం మానవ లక్షణం*. ఎవరి విషయంలో నైనా మర్యాదలు పాటించాలి అను అంశము *ముఖ్యంగా* స్త్రీల విషయము వచ్చినప్పుడు *ఈ యువతరాన్ని (30 ల లోపు) మినహాయించి*   మిగతా వారు హైందవ ధర్మములు, సంస్కృతి,  సంప్రదాయములు తెలిసిన వారెవరైనా పురాణ, ఇతిహాస గ్రంథాలను, అందులోని  సన్నివేశాలను మననం చేసుకుంటారు. బృహత్సంహిత లోని ఒక చరణం పరిశీలిద్దాము. *గుణాదికాస్తా మనునాత్ర చోక్తం, ధార్ ష్ట్యేన పుంభీః ప్రమదా నిరస్థాః*. అర్థం:- స్త్రీలు పురుషులకంటే ఏ మాత్రము తక్కువ కారు, సరికదా ఒక్కొక్క దగ్గర వారు పురుషుల కంటే శక్తిమంతులు, గొప్పవారు కూడా. ఇతిహాస గ్రంథాలలోనే మరియొక మాట గూడా గమనించాము. స్త్రీని అవమానించిన రావణుడు, ధృతరాష్ట్రుడు సమూలంగా నశించారు. యుగాలు మారినా వారి అపకీర్తి మాసిపోలేదు. *ఈ కలియుగపు  ఆల్ఫాయుష్కులు స్త్రీలనవమానించి మనుగడ సాగించగలరా.* చట్టపు కబంధ (ఎంత దూరమైనా వెళ్లగల) హస్తాలు, విధిగా కాలం విధించే  ప్రతిక్రియల వలన దుర్గతులు తప్పవు, ఇది తథ్యము. 


ప్రస్తుత జెట్ మరియు రాకెట్ యుగంలో ఇంకా మను స్మృతులు, సంహితలు అవసరమా అని యువతరం చమత్కరిస్తూ, హేళనచేస్తూ ఉంటుంది.  మంచి ఎక్కడున్నా, ఎవరు చెప్పినా  స్వీకరిద్దామని  గత వ్యాసాలలో  యోచనచేశాము.


*సమాజం స్త్రీల  రక్షణ మరియు గౌరవార్థం కొన్ని మార్గ దర్శక సూత్రాలు  పాటించాలి*. సమాజమంటే పురుష సమాజమే కాదు స్త్రీ సమాజం కూడా. కళాశాలలో రాగింగ్ సంస్కృతికి స్వస్తి చెప్పాలి. గృహాలలో అత్త  మామలు కోడళ్లను, కొడుకులు కోడళ్ళు అత్తమామలను, తల్లి  తండ్రులను క్షోభ పెట్టరాదు. పెద్దవారు చిన్నవారి పట్ల ప్రేమాభిమానాలు, చిన్న వారు పెద్ద వారి పట్ల భక్తి గౌరవాభిమానాలు చూపెట్టాలి. పట్నాలు, నగరాలకు వచ్చిన, వస్తున్న గ్రామీణ అమాయక యువతులను కాపు కాసి, మభ్య పెట్టి గల్లంతు చేసే దుష్టులను, దుండగులను చట్టానికి అప్పజెప్పాలి. ఆడపిల్లలను మాయం చేసేవారు, వేశ్యా గృహాలకు తరలించే  నీతి తప్పిన మూఠాలున్న, ఇటువంటి   సమాజంలో ఇంకా ఎన్నెన్నో అరాచకాలు. *ఇంకా వివరమైన సోదాహరణ ప్రయత్నము కూడదనిపిస్తుంది*. 


ఇవన్నీ తెలువని వారెవరు ఇంత పొడిగింపు అవసరమా అని సభ్యులకు తలంపు రావచ్చును. తరం మారుతున్నది. పెద్ద తరం (50 నుండి 80) వారికి ఇవన్నీ అనుభవేకవేద్యమే, కాని యువతరం (15 నుండి 50 వరకు)  వారికి గూడా ఈ సమాజ, సహజ బాధ్యతలు తెలిసి ఉండాలి.


హిందూ సమాజం ముఖ్యంగా భారతీయ సమాజం నిస్సత్తువగా, నిర్లిప్తంగా, అచేతనంగా ఉండవద్దు, ఆ భావనలను ఇప్పటికైనా త్రుంచివేయాలి. *కనీసం ఇతర మతస్తుల ఏకీ భావం చూసైనా నేర్చుకుందాము*.ఆ జాతిలో ఏ  ఒక్కరికీ అపకారం, అన్యాయం జరిగినా  *ఆ జనాలు*  గుంపులు గుంపులుగా వచ్చి చేరుతారు, *వారిని ఆదుకుంటారు*.   ఇతర జాతులు హిందువులను  హింసించినా దోపిడి, దౌర్జన్యం  చేసినా  హిందు ఆడపిల్లలపై, గృహిణులపై అఘాయిత్యాలు చేసినా హిందువులు  వెంటనే స్పందించాలికదా.  చేవ, చైతన్యం, స్పందన లేని మతం హిందు మత మొక్కటే అను అపప్రథ విశ్వ మంతా వ్యాపించకముందే ముందే  మేల్కొందాము. హిందువులలో విద్యాధికులు, ,మేధావులు

అధికారులు, సమాజ సంస్కర్తలు, ప్రజా నాయకులు, మహిళా సంఘాలు ఇంకా ఎన్నెన్నో సాంఘిక స్పృహ కల్గిన బృందాలు, సంస్థలు దేశభక్తిని  నింపేవి దేశ ప్రజను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాయి కూడా. *వీటన్నిటి కర్తవ్యం నిరంతరం సమాజమును ఎప్పటికప్పుడు గమనిస్తూ, అమాయకులను ఆపదల నుండి రక్షించు చర్యలు చేపడ్తూ ఉండాలి. బలహీనులైన వారిని  స్త్రీ మరియు పురుష బేధం లేకుండా ఆదుకోవాలి.* కావున  *ఐక్యతతో* మన హిందూ ధర్మానికి, సంస్కృతికి ఊపిరులూదడానికి ప్రతి పౌరుడు కంకణం కట్టుకోవాలి. 


ధన్యవాదములు.

*(సశేషం)*

మూడు నియమాలు -2, Mudu Niyamaalu


 

శివ మహిమ

 శివ  మహిమ-- ధూర్జటి !


             మ:  తన యిల్లా లఖిలైక  మాత ,  తన  సంతానంబు  భూతవ్రజం ,


                     బను లాపంబులు  వేదముల్ , తన  విహారాగారముల్  మౌనిహృ


                      ద్వనజంబుల్ , తన  సేవకుల్  కమలజాత  శ్రీధరుల్గాఁ  జెలం


                       గిన  దేవోత్తము  నమ్మహాత్ముఁ  దరమే  కీర్తింపఁగా   నేరికిన్ ?


                             శ్రీ కాళహస్తీశ్వర మాహాత్మ్యము- అవతారిక -10 వపద్యము:  మహాకవి  ధూర్జటి .


                                     శ్రీ కృష్ణరాయ సార్వ భౌముని భువన విజయమునలంకరించిన యష్టదిగ్గజ కవులలో  నొకడు ధూర్జటి!


పరశివ తత్వము ననుసరించెడి శైవుడు. అయిన నేమి యతడు మానసికముగా నద్వైతి. శివకేశవుల యెడ నారాధనా భావముగలవాడు. శ్రీ కాళహస్తీశ్వర శతకము. శ్రీ కాళహస్తీశ్వర మాహాత్మ్యము  ఇతని రచనలు. రెండును పరమేశ్వరాంకితములే!

ఇదియాతని స్వతంత్రతకు నిదర్శము. రాయల కొలువున నున్నను రాచరికమును తూర్పారబట్టిన ఘనుడు ధూర్జటి.


                 " రాజుల్ మత్తులు  వారిసేవ  నరకప్రాయంబు"- అంటూ రాజసేవ యెంత  దుర్భరమైనదో వివరించినాడు.


                ప్రస్తుత పద్యము శ్రీ కాళహస్తీశ్వర మాహాత్మ్యమున  అవతారిక లోనిది. తన గ్రంధమునకు కృతిపతియగు పరమశివుని

గూర్చి సభక్తికముగా చేసిన విన్నపమిది.  స్వామీ  సర్వశక్తి సమన్వితుడవే , నిన్నేమని ప్రస్తుతించనయ్యా! అదినాతరమా! అంటూ

పరమ శివునకు గల ప్రత్యేకతలను  యీవిధముగా ప్రకటించుచున్నాడు.


             తనయిల్లా లఖిలైకమాత !  లోకమాత  యైన  జగజ్జననినియగు  పార్వతీమాత  నీకు భార్య. 


                  లోకంలో  అందరూ అనేమాట - "యిల్లాలివల్ల యింటికి పేరని'  పార్వతి జగజ్జనని . 'ఆకీట బ్రహ్మ పర్యంతం' యీసృష్టకంతకూ

ఆమెయే జనని ,అంటే విశ్వజనని."యాదేవీ సర్వ భూతేషు ప్రాణరూపేణ సంస్థితా  నమస్తస్యై  నమస్తస్యై  నమస్తస్యై నమోనమః" అంటున్నాయి పురాణాలు. కాబట్టి సర్వలోక సంరక్షణాభారమును మోసేతల్లి నీయిల్లాలు. ముగురమ్మల మూలపుటమ్మ. ఆయమ్మకు అనుశాసకుడవీవు స్వామీ ! నీవైభవమేమని చెప్పను?


                     ఇక  నీ సంతానమా  సర్వ భూత సముదాయము. ఇక్కడ భూతమనగా పిశాచమని భావింపరాదు. ప్రకృతిని నడిపించు శక్తులుగా  భావించాలి. ఫలితార్ధం . సర్వప్రకృతిని శాసింపగల వారు నీసంతానం.తద్వారా ప్రకృతియంతా నీవశంస్వామీ!

నీకు గనక కోపంవస్తే లోకాలన్నీ  మాయమే! 


         "  అనులాపంబులు   వేదముల్"-        


   నీ నోట పలికే మాటలన్నీ  వేదములే!  నీవు వేద ప్రచోదకుడవు. నీయనుగ్రహము వలననే వేద విజ్ఙానమంతా  లోకంలో వ్యాపిస్తోంది. శబ్దానికి అనుశాసనం ముఖ్యం. అంటే నియమం. అదివ్యాకరణంవల్ల కలుగుతుంది. ఆవ్యాకరణం మాహేశ్వర ప్రోక్తం. సంస్కృత వ్యాకరణమంతా  మాహేశ్వర సూత్రముల ననుసరించియే నడుస్తుంది. 


                          "తన విహారాగారముల్  మౌనిహృద్వనజంబుల్:"  నీవు నిరంతరం  మహామునుల హృదయకమలాలలో విహరిస్తూఉంటావు స్వామీ! నిన్ను దర్శించాలంటే మునులకే సాధ్యం మావంటి వారికది యెలా సాధ్యమౌతుంది? మాలో సద్భక్తిని గలిగించు. మమ్ము గూడా మునులను చేయి మాహృదయాలలోగూడ విహరించు. అంతవరకూ నీదర్శనం మాకుసాధ్యమా?స్వామీ!


                 తన సేవకుల్  కమలజాత  శ్రీధరుల్"- ఇక  నీ సేవకులా  బ్ర హ్మ , విష్ణువులు.వారు సామాన్యులా? సకలజగత్ సృష్టికర్త బ్రహ్మ. సకల లోక పోషకుడు విష్ణువు.వీరిద్దరూ నీసేవకులు. నీయాజ్ఙకులోబడి సృష్టి బ్రహ్మ నిర్వహిస్తే , నీయానతో పరిపోషణ విష్ణువు కొనసాగిస్తాడు. అంతా నీవశం.


                           ఇలాంటి సర్వ శక్తి సమన్వితుడవైన నిన్ను  యేమని వినుతించ గలను? స్వామీ!


                                        నేనశక్తుడను. స్వామీ నమస్కారమయ్యా! పరమేశ్వరా! నమస్కారము!


                                                                      అంటున్నాడు ధూర్జటి!


                                                      ఓం  నమః  శివాయ!  ఓం నమః  శివాయ!


                                                                             స్వస్తి!🙏🙏🌷🌷🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

45. " మహాదర్శనము

 45. " మహాదర్శనము "--నలభై ఐదవ భాగము-- దేహము దేవాయతనమైనది


45. నలభై ఐదవ భాగము--   దేహము దేవాయతనమైనది 



        ఆచార్యులు కనురెప్ప పాటు కాలము అలాగే అవాక్కై నిలుచున్నారు . వారు మౌనముగా నున్ననూ , వారి విప్పారితములైన కన్నులు , పైకిలేచిన కనుబొమలూ , తెరుచుకున్న నోరూ వారి ఆశ్చర్యమును తెలుపుచునవి . మరలా అంతలోనే సహజావస్థకు వస్తూ , " సర్వ దేవతలనూ పిలుచుకొని వచ్చిన కుమారునికి అర్ఘ్య పాద్యాదులకు సర్వమునూ సిద్ధము చేయండి . నేను ఇప్పుడే వస్తాను" అని బచ్చలింటి వైపుకు వెళ్ళినారు . దేవి ఆలాపిని కుమారునికి ఒక కృష్ణాజినమును ఇచ్చి కూర్చోబెట్టి , తాను అర్ఘ్యపాద్యాదులను సిద్ధపరచుటకు వెళ్ళినది . మైత్రేయి కూడా అత్త వెంటనే వెళ్లినది .


       " సర్వదేవతలనూ పిలుచుకొని వచ్చినాడు " అన్న ఆచార్యుల మాట కుమారునికి అర్థము కాలేదు . ’ ఇంకేమిలే , వారే వస్తారు , అదేమిటో చెప్పెదరు ’ అని ఎక్కడో మనసుతో కూర్చున్నాడు . 


         అతను కూర్చున్న వెంటనే వెనుకటి వృత్తి అతడిని ఆవరించి ఎక్కడికో లాగుకు వెళ్ళింది . ఎవరో వచ్చి , ’ కావలెనంటే భవిష్యమును చెప్పెదను . ఆచార్యుల మాటకు అర్థమును చెప్పెదను ’ అన్నారు . " నువ్వు ఎవరు ? " అని అడిగితే , " నేనే నీ మనసు . మనస్సర్వము ,  ఇక పైన ఏమి కావాలన్ననూ నువ్వు పుస్తకము తీసి చదువునట్లే చూసుకోవచ్చు . ఏ అడ్డమూ ఉండదు . నీకు కాల పురుషుని దర్శనమైనందు వలన నీకు ఇతరుల వలె దేశ కాల వర్తమానముల అడ్డము లేదు ." అన్నారు . కుమారుని కుతూహలము రేకెత్తలేదు , ఆచార్యుల వాక్కుకు వ్యాఖ్యానము అవసరము లేదు , అలాగే , మైత్రేయి యొక్క భవిష్యత్తులో ఆసక్తి కలుగలేదు . ఆచార్యదంపతులు ఆవేళకు అటు ఇటు నుండి వచ్చినారు . ఆచార్యులు చేతులు తుడుచుకుంటూ వచ్చి , భార్యను అడిగి నీరు తీసుకొని శుద్ధాచమనము చేసినారు . ఆమె తాను తెచ్చిన పాద్య , అర్ఘ్య , ఆచమనములను కుమారునికి ఇచ్చినారు . కుమారుడు ఎందుకు , ఏమి అని అడుగకుండానే వారి అర్పణలను అనుజ్ఞయని  గ్రహించినాడు . ఇంకొకసారి పాలు , పండ్లు ఇచ్చినారు . ఎప్పటివలె అయితే కుమారుడు వద్దనవలసినది . అయితే ఇప్పుడు ఆ ఫలహారమును ఆదరముతో స్వీకరించినాడు . అంతా అయిన తరువాత ఆచార్యుడు కుమారుని వద్ద వేరొక కృష్ణాజినము పైన కూర్చున్నాడు . ఆచార్యాణీ , మైత్రేయీ అక్కడే ఒక్కొక్క ఆసనములను వేసుకొని కూర్చున్నారు . 


ఆచార్యులే మొదట మాట్లాడినారు  వారి మాటలో వారి సంతోషము వ్యక్తమగుచున్నది . 


" ఏమిటయ్యా యాజ్ఞవల్క్యా, ఇప్పుడు నిన్ను కుమారా అన వలెనా,  ఆచార్యా అనవలెనా ? "


కుమారునికి గాభరా అయినది . " ఇంకా స్నాతక వ్రతము కాలేదే ? "


         " స్నాతక వ్రతము క్రమముగా విద్యా గ్రహణాదులను చేసినవాడికి . కానీ యాజ్ఞవల్క్యా , సర్వ దేవతా సాన్నిధ్యమును పొందిన నీకు స్నాతక వ్రతము వలన ప్రయోజనమేమి ? నువ్వు పుట్టినపుడే నువ్వు ఇలాగవుతావని మాకు తెలిసి యుండినది . అదీకాక, నిన్ను సమర్చించే కాలమూ ఒకటి వస్తుందని మాకు నమ్మకము కూడా ఉండినది . అందువలననే , దైవ యోగము వలన నువ్వు వైశంపాయనుల ఆశ్రమము నుండీ వచ్చినపుడు , మేము అన్యశిష్యుడిని పరిగ్రహించము అని అన్నది . ఇప్పుడు నీకు ఆదిత్యుడు గురువైనందు వలన ఏమేమయినదో , చూచితివా ? మేము అనేక వర్షముల కాలము గురుసేవ కష్టమును అనుభవించి నేర్చిన పంచాత్మ సంక్రమణ విద్య నీకు పదునైదు దినములలోనే కరగతమైనది . బ్రహ్మ విద్యా సంప్రదాయములన్నిటా బహు విస్తారమయినదీ , ఇహములో నానా ఫలములను ఇచ్చునదీ , అన్నిటి కన్నా ఎక్కువగా సర్వజ్ఞ పదవిని ఇచ్చునదీ అయిన ఈ విద్యను నీవలె సాధించినవారు ఇంతవరకూ ఎవ్వరూలేరు . ఇకముందు మేము ఏదైనా తెలుసుకోవలె నంటే నీనుండీ తెలుసుకొను నట్లయినది . అంటే , నువ్వు మాస్థాయిని చేరినావు . మేము ఆచార్యులు అయితే , నువ్వు అత్యాచార్యుడవైనావు . అన్నిటికన్నా మిక్కిలిగా , నీకు గుణమంటే కుతూహలము లేదు . రేపు ఏమి జరుగుతుందో అన్నది ఈ దినమే తెలుసుకోవలె నన్న ఆత్రము లేదు . ఇది సర్వజ్ఞత్వపు గుర్తు . భలే , అద్భుతముగా సాధించినావు , భలే ! భలే! " 


      కుమారుడు లేచి వారికి నమస్కారము చేసినాడు . " తమరు అనుజ్ఞ ఇచ్చినదంతా విన్నాను . కానీ నాకు ఏమీ అర్థము కాలేదు . దయచేసి నాకు అర్థమగునట్లు అనుజ్ఞ కావలెను  . " 



        ఆచార్యుడు తన సంతోషమును ప్రకటముగా చూపిస్తూ అన్నాడు , " నీ ఈ వినయము శ్రేయస్సాధనము . నీకైనా, ఎవరికైనా , పరమ విభూషణము . నీ ఈ వినయమునకు వశము కాని వారెవరు ? కాబట్టి నీకు అర్థం కాలేదన్నావు కదా, ఒక్కొక్కటీ విడమరచి చెప్పెదను , విను . మేము అనేక వర్షముల కాలము గురుసేవ కష్టమును అనుభవించి నేర్చిన పంచాత్మ సంక్రమణ విద్య నీకు పదునైదు దినములలోనే కరగతమైనది అన్నాను , అది అబద్ధము కాదు .  కానీ మీకెలా తెలిసింది అంటావేమో , చూడు , పంచాత్మ సంక్రమణ విద్యను సాధించినవానికి కాకపోతే ఇతరులకు పంచభూత దర్శనము కాదు . నీకు పంచభూత దర్శనమైనది అనుదానిని నీ కన్నుల ప్రశాంత తేజస్సు చెప్పుచున్నది . అలాగ ఆ భూత దర్శనము కాకుండా ఈ ప్రపంచ దృశ్యపు నానాత్వము చెరిగిపోదు . ఈ దృశ్య నానాత్వము చెరిగిపోకుంటే , ఇంద్రియ లోలత్వము , ఇంద్రియ సహజమైన చాపల్యము తప్పవు . అవి తప్పకపోతే మనసు శాంత సంకల్పము కాదు . మనసు శాంత సంకల్పము కాకపోతే దేవతలు ఆ దేహమున వచ్చి విలసిల్లరు . దేవతలు విలసిల్లని దేహము దేవాయతనము కాదు . దేహము దేవాయతనము కాకుంటే, కాల పురుషుడు ప్రసన్నము కాడు . ఆతడు ప్రసన్నుడు కాకుంటే, చింత , కలవరము , కుతూహలము , ఆత్రము , తొందరపాటు తప్పవు . తెలిసిందా ? "                


" ఇప్పుడు నాలో ఇదంతా జరిగినదంటారా ? "


       " అయినది అనుదానిని నువ్వు చూసుకోలేదు . ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఆకుల చాటున కనుమరుగైన ఫలముల వలె నున్నవి . నీకు కాల పురుషుని దర్శనము కాలేదా ? "


       కుమారుడు ఒప్పుకున్నాడు . ఆచార్యుడు కొనసాగించెను," అయ్యా, ఆ దేవతల ఆట ఏమని చెప్పేది ? నీకు కావలసినదంతా అయింది . అయితే అయినట్టు నీకింకా బోధ కాలేదు . ఆ దినము నువ్వూ నేనూ కూర్చున్నపుడు పంచాత్మ సంక్రమణ విద్యను ఆదిత్యుడు నీకు అనుగ్రహించినాడు . మెట్టు మెట్టుగా ఆ దినము నీకు ఈ ఐదు కోశములూ దారినిచ్చినవి . నీకది జ్ఞాపకమున్నది కదా ? "


        కుమారుడు ఔనన్నాడు . దాని తర్వాత ఏమేమి నడచినదో చూడు . నీకు పంచభూతముల దర్శనమైనది కదా ? , భూతభూతములకూ వేరే వేరే గతులున్నవి అన్నది తెలిసింది కదా ? ఆ గతులలో దేనికీ దొరకక, ఆకాశము వరకూ వెళ్ళి అక్కడ ప్రాణ దర్శనము చేసి వచ్చినావు కదా ?  ఈ ప్రపంచములో శబ్దమంతయూ ఆహతముగా ఉన్నపుడు , పరమాకాశములో అనాహతమైన ఓంకారమును దర్శించినావు. ఇంతటి అదృష్టము ఎవరికి కలుగును ? ఇప్పుడు నీకేమయినదో తెలుసా ? దృశ్యముగా నున్నదంతా శ్రావ్యమై , శ్రావ్యముగా ఉన్నదంతా ఒకే ఒక ప్రణవపు సంకేతమైనది యని బోధయగుచున్నది కదా ? నువ్వు కావాలన్నా , వద్దన్నా , నీకు కలిగిన ప్రణవ దర్శనపు ఫలము నిన్ను వదలలేదు . కాదా ? "


కుమారుడు ఔనని ఒప్పుకున్నాడు . 


" ఇప్పుడు చెప్పు , దృశ్య నానాత్వము ఇంకా ఉందా ? "


        కుమారుడు తన అనుభవమును అబద్ధమనుటెలా ? తాను అనుభవిస్తున్నదానిని కాదని చెప్పుటెలా ? ఆచార్యుడు తనకైన అనుభవమును , తనకు కలుగుతున్న బోధను అద్దములో కాదుకదా , కళ్ళారా చూచినదానికన్నా ఎక్కువగా వర్ణిస్తున్నది చూచి ఆశ్చర్యమైనది . మరుక్షణమే ఆ ఆశ్చర్యము తిరోధానమై మనసు అంది " ఇదేమీ ఆశ్చర్యము కాదు . ఆచార్యులు జ్ఞాన చక్షువులున్నవారు . అటువంటివారికి ఏ అడ్డమూ లేక, వెనుక ముందు ఉన్న వాటిని మాత్రమే కాదు , దేశాంతర , దేహాంతర కాలాంతరములలో జరిగినదానిని చూచి చెప్పగల శక్తి ఉంటుంది . నీకు కూడా ఆ శక్తి ఉంది . దానిని ఉపయోగించమని నేను అప్పుడే చెప్పితిని , నువ్వు వద్దంటే నేను ఊరకున్నాను . "


       ఆచార్యుడు మరలా అడిగినాడు , " ఈ దృశ్య నానాత్వము చెరగి పోయి నందువల్లనే ఇప్పుడు నీ ఇంద్రియములు స్థిరమైనాయి . ఇప్పుడు ’ ఈ ఇంద్రియములు వేరు వేరు కాదు . అన్నీ ఒకటే ’ యంటే నువ్వు ఔను అనే స్థితికి వచ్చినావు . చూచుటకు కళ్ళే అవసరము లేదు , కాలితో కూడా చూడవచ్చును అంటే , నువ్వు చూడకున్ననూ ’ అది సాధ్యమే ’ అను స్థాయికి వచ్చినావు . దాని వలన గోళకమే దృక్ అన్న భ్రాంతి అణగి , దృక్ , దృశ్యము , దర్శనము అన్న త్రిపుటము అణగిపోయినది . దాని ఫలమేమిటో తెలుసా ? మనసు ఇంద్రియములలో పారి బయటికి వస్తున్నది తప్పినందువల్ల , బయటికి వెళ్ళుట అను ఆలోచనయే తప్పిపోయి , మనసు శాంత కల్పమైనది . " 


  " చిత్తము , "


        " మనస్సు శాంత కల్పమగుచున్నపుడు బుద్ధి కర్తృత్వ రహితమై  , తన చేష్టలను వదలినది . దాని వలన లోకములో నీవలన కార్యములు చేయించుటకు దేవతలే రావలసి వచ్చినది . అనగానేమి ? నీ దేహములోనున్న ప్రాణమండలము ప్రాణముగా నుండుట తప్పి , అగ్నీషోమీయ మండలమైనది . అగ్ని కుండము నుండీ విస్ఫులింగములు వెదజల్లునట్లే , కావలెనన్నపుడు , ఆవశ్యకత వచ్చినపుడు అక్కడ దేవతలు సిద్ధమై తమ తమ కార్యములను లోపములు లేకుండా నిర్వహించునట్లాయెను . దానివలన నీదేహము దేవాయతనమైనది . సరియా ? "


" వింటున్నాను , సరియే  " 


       " ఇదంతా అయినదానికి గుర్తుగా నీకు కాలపురుషుని దర్శనమైనది . కాల పురుషుని దర్శన ఫలముగా నువ్వు సర్వజ్ఞుడైనావు . సర్వజ్ఞ చిత్తము నీలో ఏర్పడింది . నీ చింత, ఆందోళన వంటివన్నీ అస్తమించినాయి , తప్పా ఒప్పా ? "


     కుమారుడు ఒప్పే అన్నాడు . ఆ ’ ఒప్పు ’ అన్న రెండు అక్షరముల మాటలోనే ఆచార్యుడు చెప్పిన సర్వమూ తన అనుభవమునకు వచ్చినది యన్నది అతడు ఒప్పుకొను నట్లుండినది . 


       " ఈ చింత , ఆందోళన వంటివి నీ దేహపు లోపల ఉండిఉంటే , నీకు కూడ  మాకు లాగే ఎన్నో సంవత్సరములు పట్టేది . కానీ దేవతలు గొప్ప మనసుతో వారి కృపాఫలము నీకిచ్చి , ఇదంతా ఒకే పక్షములో అగునట్లు చేసినారు . ఆ పక్షములో కూడా నువ్వు బహిర్ముఖుడవు కాలేదు . దేహము వైపు నీ గమనమే లేదు . దేహము తన సుఖదుఃఖములను , మూత్ర పురీషములను గురించి ఏమనుటకూ అవకాశము దొరకలేదు . ఆ దేహమునకు , చంకలో బిడ్డను ఎత్తుకొనుటే చాలయిపోయిన తల్లి వలె , దేవతల వైపుకు తిరిగి , దేవతలతో సంభాషణ జరుపుతున్న నిన్ను తట్టుకొనుటే చాలయిపోయింది . అదీకాక, అధికారము చూపతగిన నువ్వు మిత్రుడి వలె వ్యవహరించి , అన్నమయ కోశమును పూజాదులతో గౌరవించినందు వలన , అది ’ నీ పని నేను  చేయను ’ అని మొండికేసి పట్టు పట్టుటకూ సాధ్యము కాలేదు . ఇప్పుడు నువ్వు జాగృత్తికి వచ్చి ఈ దేహములో వ్యాపారము చేస్తున్న దానికి గుర్తుగా , దేహమును నిర్మించిన భూతములన్నీ శుద్ధియయిన దానికి గుర్తుగా, నీ దేహములో మనోహరమైన కమల గంధము ఉత్పన్నమైనది . " 


      కుమారుడు మౌనముగా వారు చెప్పినదంతా ఒప్పుకున్నాడు . ఆచార్యుడు అన్నాడు : " ఇప్పుడు చెప్పు , నువ్వు సర్వజ్ఞుడవు కాకున్నా , సర్వజ్ఞ కల్పుడవైనావు . అలాగనిన ఏమిటా ? విను . శాంత కల్పమై నిర్విషయమైన మనసు అంతర్ముఖమైనపుడు తానున్నానా , లేనా అని అర్థము కానట్లు , నిద్రించినట్లు ఉండును . మనసు ఈ అవస్థలో ఉన్నపుడు ఏదైనా తెలుసుకోవలెను అనిపిస్తే , ఆ సంకల్పము దేవ కార్యార్థమై వచ్చినందు వలన , దేవతలు పరుగెత్తి వచ్చి , అక్కడ ఆ జ్ఞానము కలుగుటకు కావలసిన అనుకూలములను కల్పిస్తారు . ఇప్పుడు చూడు , నిన్ను ఇక్కడికి పిలుచుకురాలేదా ? కాబట్టి , అలాగ ’ ఇప్పుడు నేను సర్వజ్ఞుడనో కాదో ’ యని చూచుకోవలసిన అగత్యమే లేదు కాబట్టి నువ్వు ఆ విషయములో ఉదాసీనుడవైనావు . అయితే , అక్కడున్న సామగ్రి అంతా చూచినాక , ’ ఇంటిని చూడగా ఇల్లాలెటువంటిదో తెలియునట్లు ’ ఆ దేహి యొక్క యోగ్యత అవగతమగును . కాబట్టి, ఇప్పుడు నీకున్నవి రెండు దారులు . నిన్ను నువ్వే పరీక్ష చేసుకొనుట , లేదా నన్ను నమ్ముట. ఈ రెండింటిలో ఏదైనా ఒకదానిని పట్టుకో . కుమారుడు యోచించినాడు . : ’ సర్వజ్ఞుడనని నన్ను అందరూ పొగుడుటవలన , నాకు కలుగు పురుషార్థము ఏమిటి ? నన్ను నేను పరీక్ష చేసుకుంటే మాత్రం కలిగేదేమి ? కాబట్టి , ఆచార్యుల మాట చాలు . అంతేగాక , వారు అబద్ధము చెప్పి సాధించేదేముంది ? అని విచారము చేసుకొని , " తమరి మాటే చాలు , పరీక్ష అవసరము లేదు " అన్నాడు . 


" అయితే సరే . ఇప్పుడు చెప్పు , ఇంతటి నిన్ను మేము మా సమానుడవంటే తప్పేమి ? " 


కుమారుడు ఆ మాటకు ఉత్తరమునివ్వలేదు . నవ్వుతూ తలవంచినాడు . 


       " నువ్వు స్నాతకుడవు కాలేదని ఒక కుంటి సాకు వెదకుతున్నావు . అదిలోకపు పద్దతి . దానిని విడు , నీ ముందరి దారి గురించి చెప్పు . ఇప్పుడు నువ్వు మరలా ఆదిత్యుని గూర్చి తపస్సు చేయి . అతని వలన ఏమి కాగలదు అనునది నువ్వూ నిర్ణయించుకోగలవు , నాకూ తెలుసు . కాబట్టి దాని విషయమై నేను ఏమీ చెప్పను . ఆదిత్యుని అనుగ్రహమైన తరువాత కొంత కాలము గృహస్థుడవై సుఖముగా ఉండు . ముందేమవుతుందో చూద్దాము . " 


" తమరి అనుజ్ఞ. ఆదిత్యోపాసనను చేస్తూనే ఉన్నాను . వదలలేదు . ఇకముందు దానిని బలపరచెదను . " 


       " చూడు , మరచిపోయినాను . బుడిలుల కుమారుడు కాత్యాయనుడు కూతురి పెళ్ళికి కాలాతీతమగుచున్నది ; వచ్చు మాఘాదిపంచకములో వివాహమగునట్లు ప్రయత్నము చేయవలెను అని మీ తండ్రి దగ్గర ప్రస్తావించినాడట. వారు నాకు సమాచారము పంపినారు . ఏమి సమాధానము పంపించేది ? " 


" తమరు అప్పుడే అనుజ్ఞ ఇచ్చినట్లు మొదట ఆదిత్యానుగ్రహ సంపాదన. అనంతరము వివాహము ." 


" సరే కానిమ్ము " 

Janardhana Sharma

44. " మహాదర్శనము

 44. " మహాదర్శనము "--నలభై నాలుగవ భాగము --మైత్రేయి


44. నలభై నాలుగవ భాగము---  మైత్రేయి



         కుమారుడు మైత్రేయి గురించి వినియున్నాడు . ఈమె బ్రహ్మవాదిని కావలెనని ఆలాపిని దేవికి కోరిక . ఎక్కడో ఒకచోట , పెళ్ళిచేసుకొని ఆకుచాటు పిందెవలె ఉండనీ అని ఆమె తల్లిదండ్రుల ఇష్టము. అయినా తమ్ముడు అక్కగారి మాటంటే బహుళముగా గౌరవించెడి వాడు కాబట్టి స్వతంత్రించలేదు . అతడి భార్య కూడా భర్తమాటకు ఎదురాడునట్టిది కాదు కాబట్టి ఆమె కూడా పెళ్ళి చేసే తీరవలెను అని మొండికేయలేదు . ఇలాగ మైత్రేయికి , తల్లిదండ్రులు కూతురికి వివాహము జరిపించు వయసు దాటిపోయినది . బంధువులు కూడా ఆలాపిని మాత మనసు తెలిసినవారు కాబట్టి వయసు మీరిన ఆడపిల్ల ఇంట్లో ఉన్నదని ఆక్షేపించలేదు . మైత్రేయికి కూడా వివాహపు విషయములో అంత ఆసక్తి లేదు . 


         మైత్రేయి చాలా మంచి అమ్మాయి . కొండెక్కించి పొగడవలసినంత రూపవతి కాకున్ననూ పెదవి విరచునట్లు కూడా లేదు . ముఖములోని సౌమ్యత మనసులోని శాంతికి గుర్తుగా కనిపిస్తుండుటచే ఆమె సౌందర్య లావణ్యములు అంతగా గమనములోకి రావు . ఆమె తెలుపే అయిననూ ఆ తెలుపు గోడకు వేసిన సున్నపు తెలుపు కాదు . ఆ ముఖానికి పసుపు రాస్తే , పసుపు , తెలుపూ రెండూ కలసి ఏదో మనోహరముగా కనిపిస్తుంది . కనులలో చాంచల్యము లేక , స్థిరమైన దేనినో వెతుకుట కోసమే పుట్టినవి అన్నట్లున్నాయి . ఆ విశాలమైన వదనములో పైన కురులూ , కింద కనుబొమలూ పొందికగా ఉండి జీవన లక్ష్యమును రాసి పెట్టి నట్లుంటుంది ఆ ముఖము . నాసికా దండము చక్కగా ఉండి అంతఃకరణపు సరళతనూ , ముక్కుసూటి తనమునూ ప్రతిబింబించునట్లున్నవి . బుగ్గలు మరీ కోమలముగా ఉండి బాలభావమును ప్రతిబింబించునట్లేమీ లేవు , అలాగని తమ బిగిని పోగొట్టుకొని వేలాడుతూ వయసు మీరిన ప్రౌఢత్వము చూపునట్లేమీ లేవు . 


          వక్షస్థలము మాత్రము ఎత్తుగా ఉండి ఆ దేహపు యౌవనపు ప్రాదుర్భావమును సూచిస్తున్నది . దేహానికి యౌవనము వచ్చి బాల్య  , కౌమారపు హెచ్చుతగ్గులు వదలినట్లుంది . ఆమె నిలుచున్న భావము , ప్రౌఢ యొక్క స్థిర భావమూ కాదు , యౌవనపు పదార్పణ చేస్తున్న పదారేళ్ళ చంచల భావమూ కాదు . మొత్తానికి చూస్తే , శరీరముకన్నా మనసు ఎక్కువగా పెరిగినట్లున్న గుర్తులు కొట్టవచ్చినట్లు కనిపిస్తాయి . మనోహరములైన పువ్వులను పూసిననూ దానివలన గర్వమును రానివ్వని చెట్టు వలె , ఆమె తాను యౌవనవతి నన్న లక్ష్యమే లేని దాని వలె నిగర్వియై ఉన్నది . 


         కూమారునికి ఆశ్చర్యము. " ఏడు దినములుగా  కూర్చున్నచోటే కూర్చున్నారు " అని విన్నది నమ్మలేక పోయినాడు . జాగృత్తులోని ఒక్కనిమిష కాలములో , కలలోని ఏడెనిమిది దినములంత దీర్ఘమైన కాలమును అనుభవించుట మామూలే , కానీ దానికి విపరీతముగా , జాగృత్తులోని ఏడు దినములను సవితృదేవునితో మాట్లాడుచూ గడిపితినంటే నమ్ముట ఎలా ?  


" మీకు ఆకలి కాలేదా ? " మైత్రేయి అడిగినది . 


" ఇప్పుడవుతున్నది " 


" అలాగయితే పాలు తీసుకోండి " మైత్రేయి పాలతో నిండిన చిన్న చెంబును ముందు పెట్టింది . 


" బ్రాహ్మణ దేహము , స్నానము లేదు "


" ఆకలి ఎక్కువగా ఉందా ? తక్కువగా ఉందా ? "


" ఎక్కువగా ఉందనే చెప్పవలెను . మేరువును తిని సముద్రాన్ని తాగవలె నన్నట్లుంది "


" అలాగయితే నా మాట వినండి , మంత్ర స్నానము చేసి పాలు తాగండి . అది సరే , ఒక మాట . మీరు నిద్రలో ఉంటిరా ? "


" లేదు "


" అలాగైతే ఏడు దినములు మెలకువగా ఉండి ఎలా కన్నులు మూసుకున్నారు ? "


         కుమారుడు ఒక ఘడియ అనుభవమును చెప్పుటయా వద్దా అని ఆలోచించినాడు . మైత్రేయి బ్రహ్మవాదిని యవగలదని అతడికి తెలుసు . మెడ చూసినాడు  అక్కడ మంగళసూత్రము లేదు . సరే , చెరగు మాటున యజ్ఞసూత్రము ఉండవలెను ." ఇటువంటిదాని దగ్గర దాచిపెట్ట వలసిన అవసరము లేదు " అనుకొని తన అనుభవమును చెప్పినాడు . 


       మైత్రేయి అదంతా ఒళ్ళంతా చెవులు చేసుకొని విన్నది . చివరికి చిన్నగా నవ్వి , " మీయంతటి వారికే దేహాభిమానము పోలేదన్న తరువాత , అదెంత భద్రముగా ఉండవలెను , ఆ అభిమానము ! "  అన్నది .


యాజ్ఞవల్క్యునికి ఆమె మాట విని సంకోచము వంటి బిడియమైనది , " అదేమిటి ? అలాగంటావు ? " అని అడిగినాడు . 


        మైత్రేయి అన్నది , " మీరు ఉండినది దేవతా సాన్నిధ్యములో . అంతేకాక , ఉన్నచోటినుండీ లేవలేదు . శరీరమున్ననూ కూర్చుండుట తప్ప ఇంకేమీ చేయలేదు . ఇటువంటప్పుడు మీకు మైల అన్న భ్రాంతి ఎలా వచ్చింది ? నేను బ్రాహ్మణుడిని అంటే , బ్రాహ్మణాభిమానము తల్లిదండ్రుల నుండీ వచ్చిన దేహమును అనుసరించి వచ్చినది . కాబట్టి అలాగ అన్నాను." 


        మైత్రేయి వాదన యాజ్ఞవల్క్యుని మనసుకు నచ్చింది . " నువ్వు చెప్పినది సరిగ్గా ఉంది . బ్రాహ్మణుడు అగ్ని వలెనే ఎల్లపుడూ శుచియైననూ లౌకికాగ్నిని సంస్కారముతో వైదికాగ్నిగా చేసినట్లు చేయవలెను . కానీ ఇంతవరకూ దేవతా సాన్నిధ్యములో ఉండుట చేత ఇప్పుడు సంస్కారము అవసరములేదు : పాలు ఇవ్వు . త్రాగి ఆలాపినీ దేవి వారి దర్శనార్థము నేనూ వస్తాను " అన్నాడు .


         పాలు బాగా ఎర్రగా కాగి రుచిగా నుండినవి . వైశ్వానరుని తృప్తి పరచి యాజ్ఞవల్క్యుడు మైత్రేయితో పాటూ దేవివారి దర్శనార్థమై బయలుదేరినాడు . ఇటు  ఒక మడి వస్త్రాన్ని కట్టుకొని , ఒక ఉత్తరీయమును కప్పుకొని వెళుతున్న యాజ్ఞవల్క్యుడు , అటు అతనికి సమీపముననే చీరతో ఒళ్ళంతా కప్పుకొని పైన ఒక ఉత్తరీయమును కప్పుకొని వెళుతున్న మైత్రేయి. ఇద్దరూ వెళుతుంటే ఆశ్రమపు వీథి అంతా నిండినట్లున్నది . 


       కొంత దూరము వెళుతుండగా , మైత్రేయి ఏదో గంధమును ఆఘ్రాణించినట్లు ముక్కు పుటాలను వెడల్పు చేసి చూస్తున్నది . ఆమె వాసన ఎగబీల్చు ధ్వని అన్యమనస్కుడైన యాజ్ఞవల్క్యుని గమనమునకు వచ్చి , అతడు ఏమిటని అడిగినాడు . 


మైత్రేయి అడిగినది , " ఈ చుట్టుపక్కల ఎక్కడైనా కమలముల చెరువుందా ? "


" నాకు తెలిసి ఎక్కడా లేదు "


" మరి , ఎక్కడినుండీ ఈ పద్మ గంధము వస్తున్నది ? "


యాజ్ఞవల్క్యుడు నిలచి చూచినాడు . ఔను , పద్మ గంధము వస్తున్నది . ఇంకా పరీక్షగా చూసి నవ్వుతూ , ’ ఔను , వస్తున్నది ’ అన్నాడు . 


" ఎక్కడి నుండీ ? తెలుసా ? "


" అదంతా ఋషిమూలము , నదీమూలముల వలె అన్వేషణ చేయరాదు . " 


" అంటే , మీ ఒంటినుండే ? " 


" ఒకవేళ ఔనన్నాననుకో , నా ముల్లె ఏమీపోదుగా ? " 


మైత్రేయి ఉన్నపాటునే నిలచిపోయింది , " నిజంగానా ? " అడిగింది . 


యాజ్ఞవల్క్యుడు తలాడించాడు . ’ ఔను ’ అని నోటితో చెప్పలేదు , అంతే ! 


మైత్రేయి సంతోషపడింది . " యోగులు , ఇది భూతజయపు ఆరంభము అంటారు . పృథ్వి పక్వమైనదాని గుర్తుగా ఈ సువాసన వస్తుందంట ! " అన్నది . 


యాజ్ఞవల్క్యుడు తానూ అలాగే విన్నానని అన్నాడు . 


      దారిలో మరలా ఎవరూ ఒకరినొకరు మాట్లాడించలేదు . మైత్రేయికి , " ఇటువంటివాడితో ఎల్లపుడూ చర్చిస్తూ ఉంటే ? " అని యోచన. యాజ్ఞవల్క్యునికి , " ఇలాగ ఉపచారము చేయు వారొకరుంటే నేనెంత తపస్సు చేయవచ్చునో " అని యోచన. 


       దేవి ఇంటి తలవాకిటికి వచ్చి మేనకోడలిని నిరీక్షిస్తూ నిలుచున్నది . అంతలో వారిద్దరూ మలుపు తిరిగి కంటికి కనబడ్డారు . ఆమెకు , " వీరిద్దరూ దంపతులైతే ! " అనిపించింది . వెంటనే , " నేనే ఈమెను బ్రహ్మవాదిని కమ్మని ప్రేరేపించినదానను . ఇప్పుడు ఈ వయసైన తర్వాత వివాహమంటే నవ్వుతారు " అనుకున్నది . దానితోపాటు , ’ యాజ్ఞవల్క్యునికి కన్య ఒకతె నిర్ణయింపబడినది కదా ! ఇంకేమిటి , మనసే ఇటువంటి తగని సంబంధాలను కల్పిస్తుంది , ఆకాశమునకు నిచ్చెన వేసే యోచనయే తప్ప ఈ ప్రారబ్ధానికి వేరే పనిలేదా ? ’ అనుకున్నది . ఆవేళకు వారిద్దరూ వచ్చినారు . 


        కుమారుడు ప్రణామము చేసినాడు . అత్తకు కోడలు , అతడి శరీరమంతా సుగంధాయమైనది సైగతోనే తెలిపింది . అయినా ఆమెకు హాస్య ప్రవృత్తి ముంచుకొచ్చి , " ఏమిటమ్మా ! అందరూ అన్నట్టే అయింది . ఆడది బ్రహ్మ విద్య దారిలో నున్న విఘ్నము అన్న మాట నిజము చేసినావు . పదునైదు దినములనుండీ లోకపు సంగతే పట్టక కనులు మూసుకొని కూర్చున్న వాడిని బహిర్ముఖుడిగా చేసి, అది చాలదన్నట్టు పట్టి తెచ్చినావే ! " అన్నది .


       మైత్రేయి కూడా హాస్యమును ఒప్పుకుంటూ , " అదేమి పెద్ద విషయములే , అలాగ విఘ్నముగా మారునది కావలెనన్న, విఘ్నమును దాటించునది కూడా కాగలదు . వీరు ఏడు దినములనుండీ సమాధిలో నున్నది తెలుసు , నువ్వు పదునైదు దినములంటావే ? " అన్నది.


        " ఔను , ఈ దినము చవితి . పోయిన శుద్ధ చవితి నాడు కన్నులు మూసి కూర్చున్నాడు ఈ పుణ్యాత్ముడు ! రెండు దినములు , పాలను పిల్లవాళ్ళతో పంపించినాను . వారు పిలచి , అరిచి , ’ ఏమిచేసినా యాజ్ఞవల్క్యుడు కళ్ళే తెరచుట లేదు , కావాలని అలాగే కూర్చున్నాడు " అన్నారు . ఇలాగ కాదని , మరుసటి దినము నుండీ నేనే పాలు తీసుకొని వెళ్ళుచుంటిని . నువ్వు వచ్చినది దశమినాడు . ద్వాదశినుండీ నువ్వు తీసుకొని వెళ్ళుచున్నావు . " 


          యాజ్ఞవల్క్యుడు ఏమో అడుగవలెనని తలయెత్తినాడు. ఆమె నవ్వుతూ అన్నది : " ఇది నాకేమీ కొత్తది కాదు . మా వారు ఎక్కడికో వెళ్ళినారు అని నేను అప్పుడపుడు చెపుతుంటాను కదా ? అదేమనుకున్నావు ? వారు కూడా నీవలెనే సమాధిలో కూర్చుంటారు . అప్పుడు ఒళ్ళంతా కళ్ళుగా వారిని కాపలా కాయుట అభ్యాసమై పోయినది . అందుకే నీ స్థితిని తెలుసుకొని , ఎవరివల్లా నీకు ఇబ్బంది , ఆటంకము కాకూడదని , ఎవరూ ఆవైపుకు వెళ్ళకూడదు అని విధాయకము చేసి నేనే నీకు పాలు తెస్తుంటిని . ఏమే ? నీకు నేను చెప్పలేదేమే ? వారుగా కనులు తెరిచి పాలు తీసుకుంటే సరే , నువ్వు అరిచి పిలచీ లేపవద్దు అని ? " 


         " ఈపూట కూడా నువ్వు చెప్పినట్లే చేసినాను అత్తమ్మా , అడుగు ! నేనుగా వారిని పిలవలేదు . ఏదో ఒక ఘడియ నిలుచొని ఉందామా అనిపించి నిలుచున్నా. అంతలో వారే కనులు తెరచినారు "


" సరే , మనసులోని భారము దిగిపోయింది . ఏమి, యాజ్ఞవల్క్యా ? పంచాత్మ సంక్రమణ విద్యను సాధించినావా ? " 


" అదింకా నాకు సరిగ్గా తెలీదు , కానీ ...." 


       " చింతించవద్దు. అమ్మాయి కూడా బ్రహ్మవాదిని అగును . ఈ దినము కాకపోతే రేపైనా ఈ అనుభవములన్నిటినీ పొందగలదు . అమ్మాయి ఉందని చింత లేదు , చెప్పు . " 


       " నేను పంచాత్మ సంక్రమణ విద్యను సాధించవలెను అనే కూర్చున్నాను . అయితే , నాకు గుర్తున్నంతవరకూ , నాకయినది పంచ భూత దర్శనాదులు ." అని అతడు ఆమెకు క్లుప్తముగా తనకయిన అనుభవమునంతా చెప్పినాడు . 


       ఆమెకు యాజ్ఞవల్క్యుని పతికి చూపించవలెనని ఆశ కలిగింది . అయితే వారు ఇప్పుడే విశ్రాంతికి వెళ్ళినారు . వారిని లేపితే ఏమో  లేపకుంటే ఏమో అని ఆలోచన. ఏమి చేయవలెనో తోచక ఆమె ఇలాగే సతమతమవుచుండగా పక్క గది తలుపు తెరుచుకుంది . ఉద్ధాలకులే స్వయముగా బయటికి వచ్చినారు . " ఓహో ! యాజ్ఞవల్క్యుడా ! " అని ఆశ్చర్యముతో అలాగే నిలుచున్నారు . 


ఆలాపినికి అది ఆశ్చర్యమైనది . వారు ఆశ్చర్య చకితులగుటను ఆమె ఎప్పుడూ కలలో కూడా చూచియుండలేదు . 




Janardhana Sharma

కొడుకుల్ పుట్ట రటంచు

 శు భో ద యం🙏


కొడుకుల్ పుట్ట రటంచు నేడ్తు రవివేకుల్ 

జీవన భ్రాంతులై

కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్ వారిచే నేగతుల్

వడసెం బుత్రులు లేని యా శుకునకున్ బాటిల్లెనే దుర్గతుల్!

చెడునే మోక్షపదంబ పుత్రకునకున్ శ్రీ కాళహస్తీశ్వరా!


పిల్లలు లేకపోతే నరకం అన్నది నిజం కాదు.

వేదోక్త కర్మలు చేసేవారు, జ్ఞాన సంపాదన చేసేవారు ధార్మికంగా బతికి శాస్త్రోక్త పద్ధతిలో విధి నిషేధాలు పాటిస్తూ... సాధన చేసేవారూ, పిల్లలున్నా, 

లేకున్నా వారి వారి సత్కర్మల వాళ్ళ ఉద్ధారం అవుతారు.


పాపులు, దుష్కర్మలు చేసినవారు, వారికి పుణ్యం లేకపోతే వారి పిల్లల పుణ్యం తోనో, వారి పిల్లలు ఇచ్చిన ధర్మోదకాలతోనో, శ్రాద్ధ కర్మల తోనో, పిండ ప్రదానాల తోనో ఉద్ధారం అయ్యే అవకాశం వుంది. అంతే తప్ప పిల్లలు లేరని నరకం లేదు.


మనకు భగవద్భక్తి లేక సాధన చేయక పోతే దానికి తోడు పితరుల సద్గతి కోసం పాటుపడే పిల్లలు లేకపోతే నరకమే. 


తన జ్ఞానం వల్లనే, తను చేసిన విహిత కార్యాల వల్లనే, సాధన వల్లనే...

సద్గతి అదే శాస్త్రం...


శాస్త్రం 12 రకాల పుత్రుల గురించి చర్చిస్తుంది...


పుత్రులు ఆరు రకాలు.


1. ఔరసుడు, 

2. దత్తకుడు, 

3. కృత్రిముడు, 

4. గూఢోత్పన్నుడు, 

5. అపవిధ్ధుడు, 

6. క్షేత్రజుడు. 


వీరికి రాజ్యములో కాని ఆస్తిలో కాని భాగం ఉంటుంది. 


ఇంకొక రకమైన పుత్రులు ఆరుగురు ఉన్నారు. వారు...


1. కానీనుడు, 

2. సహోఢుడు, 

3. క్రీతుడు, 

4. పౌనర్భవుడు, 

5. స్వయందత్తుడు, 

6. జ్ఞాతుడు. 


వీరు కూడా పుత్ర సమానులే కాని, 

వీరికి రాజ్యాధికారము కాని, 

ఆస్తిలో భాగము కాని లేదు. 


మనుమడు, 

కూతురు,

కొడుకు కూడా పుత్రుల లెక్కలోకి వస్తారు. 


అందుకే మన తర్పణ విధులలో ఇటు తండ్రి వైపు మూడు తరాల వారికి, 

అటు తల్లి వైపు మూడు తరాల వారికి పిండాలు పెడతాము, తర్పణాలు వదులుతాము. 


కాబట్టి ఒకరికి...

కొడుకు లేడు.

అని బాధ పడ వలదు.


యోగ్యులైన కూతురు కొడుకులు తర్పణాలు విడిచినా...

అవి ఆ తండ్రికి అందుతాయి.


ఈ ప్రాపంచిక జీవనమును జీవన ప్రవృత్తి నను సరించి ఆలోచింతురు. 


తమకు పరలోకమున ఉత్తమ,గతులు లభించుటకు...

పుత్రులు కావలయు నను కొందరు... 


తమకు పుత్రులు కలగని వారు...

అయ్యో మాకు పుత్రులు కలుగ లేదు, 


మాకు ఎట్లు ఉత్తమ,గతులు కలుగును.

అని ఏడ్చు  చుందురు. 


కౌరవ రాజగు ధృతరాష్ట్రునకు నూరుమంది...

పుత్రులు కలిగినను వారి మూలమున అతడు...

ఏ ఉత్తమ లోకములు పొంద గలిగెను? 


బ్రహ్మచారిగనే యుండి సంతతి యే లేకున్న శుకునకు దుర్గతి ఏమయిన కలిగెనా?


కనుక పుత్రులు లేని వానికి మోక్షపదము లభించక పోదు...


పుత్రులు కల వారికి ఉత్తమ,గతులు కాని మోక్షము కాని సిధ్ధించక పోవచ్చును.


పుత్రులు లేని వారికి,ని అవి రెండు ను సిద్దించనూ వచ్చును.


కావున కొడుకులు లేరు.

అని ఎవరూ బాధ పడ వలదు.


మన పుణ్యం మనం సంపాదించు కోవాలి.

మన ఉద్ధారం కోసం...

మనమే పాటు పడాలి.


మనకు ఆ వేంకటేశుని దయవలన 

ఉత్తమ సాధన చేసే అవకాశం సద్వినియోగమై మనం  ఉత్తమ,గతులు సాధించు గాక...


ఉధ్ధరేధాత్మనాత్మానాం


ఎవరి ఆత్మను వారే ఉధ్ధరించుకోవాలి.


సేకరణ!🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం  - శరదృతువు - ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం  -  ఏకాదశి & ద్వాదశి - శతభిషం -‌‌ ఇందు వాసరే* (14.10.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

సుఖంగా జీవించండి

 నచ్చినవి వండుకొని సుఖంగా జీవించండి 😊



*“క్షమించాలి ఇదినిజం..!”*

                


👉అది యూరప్,అమెరికా వాళ్ళ అసహాయత..!

ఇది మన అనంతమైన అజ్ఞానం!✅

 


*1.  తాజా ఆహారం అందుబాటులో లేక,    వండుకోవడానికి సమయం కేటాయించుకో లేక,    ఎప్పుడో నెలల క్రితం చేసిన రుబ్బిన పిండిని కేన్ లో వేసుకుని నిలవ పెట్టీ పెట్టీ    దానితో రోజూ Pan కేకుల్నీ, ఆర్నెల్ల క్రితం చేసిన పిజ్జాలమీద,    బంకలు సాగే కూరలు వేసుకుని తినాల్సిన  ఖర్మపట్టడం అమెరికా, యూరప్  వాళ్ళ నిస్సహాయత..!


👉 56 రకాల భోజన వంటకాలను పక్కనపెట్టి     ఎవడో ఏనాడో వండి పెట్టిన    రొట్టెని కాలవలో పారెయ్యకుండా,  ఫ్రిజ్  లో మురగబెట్టి పెట్టీ మోడ్రన్ స్టైల్ పేరుతో ఆ పిజ్జాల్ని వేడిచేసి ₹. 400 / - పెట్టి  మరీ తినడం, ‘మన అజ్ఞానం..!!’

          -క్షమించాలి ఇదినిజం..!!!✅



*2. ఎనిమిది నెలలు ఎముకలు కొరికే చలి తట్టుకోలేక,   కోట్లూ సూట్లూ వేసుకోవడం ‘వారి నిస్సహాయత..!’


👉వేసవి వేడిలో చెమటలతో ఉక్కపోసి వళ్ళంతా జిడ్డుజిడ్డుగా అతుక్కుంటూ చిర్రెత్తిపోతున్నా కూడా పెళ్లి రోజు       వెర్రిగా    కోట్లూ సూట్లూ వేసుకుని  తిరగడం ‘మన అజ్ఞానం..!!’

        -క్షమించాలి ఇదినిజం…!!!✅



*3. తాజా భోజనం    వండేవాళ్ళు లేక ఫ్రిజ్ వాడడం,   అమెరికా, యూరోప్ వాళ్ళ నిస్సహాయత..!


👉 ప్రతిరోజూ తాజా కూరగాయలు వస్తున్నా, వారం రోజులు కూరగాయలు ఫ్రీజ్ లో     కుక్కి కుక్కి   అవి  మురుగుతున్నవాటిని వండుకు తినడం, ‘మన అజ్ఞానం..!!’

       -క్షమించాలి ఇదినిజం..!!!✅



*4 . ఔషధ మొక్కల జ్ఞానం లేక, మూలికలతో పరిచయం లేక, 

వారు జీవ జంతువుల మాంసం తో కెమికల్స్ తో     ఏవేవో మందులు తయారు చేయడం,  వాటి సైడ్ ఎఫెక్ట్స్ కి  వేరేవేరే రోగాల పాలవ్వడం ‘వారి నిస్సహాయత..!’


👉 మరి ఆయుర్వేదం లాంటి గొప్ప చికిత్సా విధానం     తెలిసినప్పటికీ, పట్టించుకోకుండా...         కెమికల్  మందులు ఉపయోగించడం, సైడ్ ఎఫెక్ట్ లతో కొత్తరోగాలు తెలిసితెలిసి తెచ్చుకోవడం..   ‘మన అజ్ఞానం..!!

         -క్షమించాలి ఇదినిజం..!!!✅



*5. సరిపడ ధాన్యం లేక    పంటలు పండక   పళ్ళూ కాయలూ  దొరకకా  పాముల్ని, కప్పల్నీ, కుక్కల్ని, నక్కల్ని కూడా చంపి తినడం.. ‘వాళ్ళ నిస్సహాయత...!’


👉 మరి 1600 రకాల ఆహార ధాన్యాలు లభిస్తున్నా    వాళ్ళల్లా తినడానికి ప్రయత్నించడం ‘మన అజ్ఞానం..!!’

       -క్షమించాలి ఇదినిజం!!!✅



*6. కొబ్బరి నీళ్ళూ,  మామిడి రసాలు, బత్తాయి పళ్ళూ, సపోటా, అంబలి, చల్ల, మజ్జిగ, పాలు మొదలైనవి లేకపోవడం లేదా తెలియకపోవడం వల్ల పురుగుల మందులు వేసిన శీతల పానీయాలు తాగడం ‘వారి నిస్సహాయత...!’

👉 అవన్నీ కాక ఎన్నో రకాల ప్రాకృతిక పానీయాలు అందుబాటులో ఉన్నా... పురుగుల మందులు వేసిన శీతల పానీయాలు అనే విషాన్ని తాగడం ఆధునికంగా అభివృద్ది చెందామని భావించండం ‘మన అజ్ఞానం..!!’

          -క్షమించాలి ఇదినిజం!!!✅



*7. వాళ్ళ పంపుల్లో నీళ్ళు గడ్డకడుతుంటే టాయిలెట్ కి వెళ్ళిన  తరవాత కడుక్కోలేక టిష్యూ పేపర్లతో తుడుచుకొని (PMతో)తిరగడం, 

చలి వలన స్నానం చెయ్యలేక సెంటేసుకుని పడుకోవడం.. 

 ‘వాళ్ళ నిస్సహాయత...!’

👉 సుబ్బరంగా మనకు నీళ్ళొస్తున్నా కడుక్కోకుండా  తుడుచుకొని, సెంటేసుకుని (PM)తో తిరగడం .. ‘మన అజ్ఞానం..!!’

        -క్షమించాలి ఇదినిజం!!!✅



*8. ఎలాంటి ముందుచూపూ లేక, మరుగుదొడ్ల నీళ్ళని నదుల్లో  కలుపుకోవడం మళ్ళీ వాటినే శుభ్రం చేసుకుని తాగడం ‘వాళ్ళ బుద్దిహీనత!

👉 అన్నీ తెలిసి తెలిసి వాళ్ళని గుడ్డిగా అనుసరించి అదే అభివృద్ది అనుకుని మనం కూడా మన నదుల్ని మురికి కూపాలు చేసుకుని మంచినీటి కోసం ఏడవడం ‘మన అజ్ఞానం!!

         -క్షమించాలి ఇదినిజం!!!✅



*9. తోటలూ మొక్కలూ లేక ఎక్కడో ఎవరి దగ్గరో బానిసలా బతికడం కాయలూ పళ్ళూ కొనుక్కు తెచ్చుకోవడం. సరియైన కుటుంబ వ్యవస్థ లేకపోవటం వల్ల, నా అనే వాళ్ళు లేక, అశాంతిగా ఒంటరిగా జీవించడం ‘వాళ్ళ నిస్సహాయత...!

👉 చక్కగా పల్లెల్లో ఫాం హౌసుల్లాంటి ఇళ్ళల్లో, చక్కని ఉమ్మడి కుటుంబ వ్యవస్థతో,  పెరట్లో బోలెడన్ని మొక్కలేసుకుని, చెట్టుకి పండిన కాయలూ పళ్ళూ తిన్నన్ని తిని పక్కవాళ్ళకిచ్చి సంతోషంగా, అందరితో కష్ట సుఖాలను పంచుకుంటూ, ఆనందంగా, ఆరోగ్యంగా జీవించే మనం...

ఆ అమెరికా, యూరోప్ వారిని అనుకరించడం... ఇలా కొట్టుకు చస్తూ, ఏడుస్తూ బతకడం... ‘మన అజ్ఞానం!!

         -క్షమించాలి ఇదినిజం!!!✅



*10. చెట్లు పెంచుకోవడానికి   ఏ ఎరువెయ్యాలో తెలియక రసాయనిక మందులేసుకోవడం కడుపులో ఎసిడిటీలు, కేన్సర్లూ  తెచ్చుకోవడం ’వాళ్ళ నిస్సహాయత...!

👉 ఇంట్లో వుండే ఎద్దులూ, ఆవులు, గేదెలు, కోళ్ళు, మేకల మల మూత్రాలను బయో ఫెర్టిలైజర్స్ గా, ఆర్గానిక్ పెస్టిసైడ్స్ గా వాడుకుంటూ హాయిగా ఆరోగ్యంగా బతికిన మనం...

వాటిని వదిలి అమెరికా, యూరోప్ వాళ్ళ మోజులో పడి వాళ్ళని అనుసరించి, మనం కూడా 

ఆ క్రిమిసంహారక మందులే వాడుతూ, ఇమ్యూనిటీ నాశనం చేసుకుంటూ ఆ రోగాలే తెచ్చుకోడం ‘మన అజ్ఞానం!!

          -క్షమించాలి ఇదినిజం!!!✅


*11. ఒక్కోసారి ఆరునెలల పాటు వాళ్లకు సూర్యుడు కూడా కనిపించడు కనక వాషింగ్ మెషిన్ లో ఉతికేసిన బట్టలు సూర్యరశ్మిలో ఎండబెట్టే అవకాశం లెక డ్రైయ్యర్లో ఆరబెట్టుకుంటూ వాటికున్న ఎరోబిక్ ఎనరోబిక్ బాక్టీరియాల్లో కొన్ని చావకపోయినా హానికరమైన కెమికల్స్ వేసుకుని బతకడం ‘వాళ్ళ నిస్సహాయత...!

👉 హాయిగా ఎంతో ఆరోగ్యాన్నిచ్చే సూర్యరశ్మి నిండుగా వున్నా వాషింగ్ మెషిన్లో ఉతికిన బట్టల్ని అందులోనే ఆరబెట్టుకోవడం మన బుద్దిహీనత ‘మన అజ్ఞానం!!

         -క్షమించాలి ఇదినిజం!!!✅


*12. గడ్డకట్టేసిన నీటితో  స్నానం చెయ్యలేక శానిటైజేషన్ పేరుతో మురికి చేతులపైనే పురుగులమందులు జల్లుకుంటూ...

అవే బట్టలతో ఇల్లంతా తిరగడం, మంచాల మీద పడుకోవడం... వాటివల్ల మాటిమాటికీ రోగాలు తెచ్చుకోవడం మందులు మింగడం ‘వాళ్ళ నిస్సహాయత...!

👉హాయిగా నీళ్ళొస్తున్నా స్నానం చెయ్యకుండా స్టైల్ పేరుతో కుక్కకంపు కొట్టే సెంట్లు కొట్టుకుంటూ తిరగడం ‘మన అనంతమైన అజ్ఞానం!! -మరోసారి మళ్ళీ క్షమించాలి. ఇదినిజం!!!✅


*13. దూరంగా నిలబడి ఆహ్వానించడం, నమస్కరించడం, 

చెప్పులు వేసుకుని ఏ ఇంట్లోకి వెళ్ళక పోవడం,

కాళ్ళు చేతులూ కడుక్కోవడానికి బకెట్ తో నీళ్ళివ్వడం మన సంస్కారం.  మన పెద్దలు మనకు నేర్పిన అత్యుత్తమ సంస్కారం. దాన్ని వదిలేసి ఇవ్వాళ ఏడవడం ‘మన అజ్ఞానం.!!      

         -క్షమించాలి ఇదినిజం!!!✅


*14. విపరీతమైన చలికి తట్టుకోలేక ఇంటాబయటా అవే సాక్స్ అవే బూట్లతో తిరగడం ‘వాళ్ళ నిస్సహాయత.

👉ఇంట్లోకి వచ్చేముందు చెప్పులు గుమ్మం బయటే వదిలెయ్యడం, బయట తిరిగిన బట్టల్ని బాత్ రూములొ  తడిపేసి స్నానం చేసి ఇంట్లోకి రావడం మన పద్దతి. అలాంటి పద్దతుల్ని చాదస్తం పేరుతో... ఆలోచన లేకుండా వదులుకోవడం ‘మన అజ్ఞానం!!

      -క్షమించాలి ఇదినిజం!!!✅


 

మనం ఎంతో ఆత్మీయత గుండెల్లో పొంగితే కానీ చేతులు పట్టుకోలేం, హత్తుకుని కౌగిలించుకోలేం. తల మీదో బుగ్గల మీదో ముద్దులు పెట్టుకోలేం కానీ అవి అమెరికా వాళ్ళకి అత్యంత సహజం..

కానీ నేడు దాన్ని వద్దంటోంది ప్రపంచ ఆరోగ్య మానవాళి... అంతా 

భారతీయుల్ని చూసి  క్వారంటైన్ జ్ఞానం నేర్చుకుంటోంది, నేర్చుకోమంటోంది.


కనీసం ఇప్పటికైనా మనం మన మడి ఆచారాలను మళ్ళీ పాటించడం ప్రారంభించకుంటే అది ‘మన అజ్ఞానం!!

       -క్షమించాలి ఇదినిజం!!!✅


జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ అజ్ఞానం అంతా వాళ్ళని చూసి మనకుగా మనం తెచ్చిపెట్టుకున్న అజ్ఞానం...

 

మన బానిస మనస్తత్వ అజ్ఞానం...


విదేశీ వ్యామోహ అజ్ఞానం...


కరోనా లాంటి వైరస్ లను కొంపమీదకు తెచ్చిపెట్టుకునే అజ్ఞానం...


అమెరికాలో యాపిల్ ఫోన్ అంత మంచిఫోన్ మరొకటి లేదు.

అన్నది ఎంత నిజమో...


అమెరికా, యూరోపియన్ ప్రజలు తినేంత అనారోగ్యకరమైన ఆహారం...

వాళ్ళ కున్నన్ని ఆర్టిఫిషల్ అలవాట్లు కూడా ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేవు. అన్నది కూడా అంతే నిజం..!


ఆధునీకరణ, ఫ్యాషన్, మొదలగు పేర్లతో ఋషులు మనకు అందించిన

దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా...

ప్రాకృతిక జీవనాన్ని  వదిలేసుకోవడం మన అజ్ఞానం!

🙏 *క్షమించాలి ఇదినిజం*🙏

 

Bottom LIne.

*వేటిని స్వీకరించాలో వాటినే స్వీకరిద్దాం...!


కానీ గుడ్డిగా...

మోజుతో...

వెర్రిగా...

అనాలోచనతో...

అనుకరిస్తే...

పోతాం! 


ఏం వచ్చి పోతాం?


కరోనా లాంటివి వచ్చి పోతాం!. 


🙏🙇🙏🙇🙏🙇🙏

శ్రీ మూకశంకర విరచిత మూక పంచశతి

 శ్రీ మూకశంకర విరచిత మూక పంచశతి

శ్రీకామాక్షి పరదేవతా వైభవ వర్ణన

పాదారవిందశతకం

🙏🌸🙏🙏🙏🌸🙏

 

శ్లోకము:-

చిరాద్దృశ్యా హంసైః కథమపి సదా హంససులభం నిరస్యంతీ జాడ్యం నియత జడమధ్యైక శరణమ్ |

అదోషవ్యాసంగాత్ సతతమపి దోషాప్తిమలినం పయోజం కామాక్ష్యాః పరిహసతి పాదాబ్జయుగలీ ||30||

 

 

భావము:

యతులకు ఉపాస్యం అయిన దేవీ చరణములు పద్మాలను నిరసిస్తున్నాయి. పద్మాలు హంస సులభాలు. దేవీ చరణములు సులభాలు కాదు. పద్మాల్య్ జడయుక్తాలు. దేవీ చరణాలు జడ రహితాలు - నిర్ధోషాలు. పద్మాలు ఎలాగూ దేవీ చరణములకు సరిపోవు. శ్రీ చరణాలు విశిష్టములు.

 

*********

 

అమ్మ చరణములను తాబేటి పెంకుతో పోలుస్తూ *కూర్మపృష్ట జయిష్ణు ప్రపదాంవితా* అని లలితా నామాలలో చెప్పిన వశిన్యాది దేవతల అభిప్రాయాన్ని శ్రీ శంకరులు వ్యతిరేకిస్తూ..... అమ్మ పాద వైభవం తెలియ చేస్తున్న *సౌందర్యలహరి* శ్లోక భావాన్ని కొద్దిగా తెలుసుకుందాం....

 

పదం తే కీర్తీనాం - ప్రపద మపదం దేవి విపదాం

కథం నీతం సద్భిః - కఠినకమఠీకర్పరతులాం||

కథం వా పాణిభ్యా ముపయమనకాలే పురభిదా

యదాదాయ న్యస్తం - దృషది దయమానేన మనసా ||88||

**********************************

*భావము:*

అమ్మా..నిన్ను ఆశ్రయించిన వారికి సత్కీర్తులను కలిగించుచు, సకల ఆపదలను తొలగించుచు, మంచికి పుట్టిల్లుగా,చెడులు అనేవి దరిచేరలేని శుభవాకిళ్లుగా వెలుగొందుచుండేవి, నీ పాదముల పైభాగాన ఉండు నీ మీగాల్లు, అటువంటి నీ పాదమును నీ వివాహ వేళ, రాతియందు వధువు పాదము పెట్టించుట అను ఒక తంతుయందు దయాపూర్ణమైన మనసు కల నీ భర్తయైన శివుడు తన చేతితో నీ పాదములు పట్టుకుని రాతియండు ఉంచుటకు ( వధువుచే సన్నికల్లు తొక్కించుట) చాల సందేహించినాడు.ఎందుకనగా అతి మృధులమైన నీ పాదములు ఆ కఠిన రాతి స్పర్శ తో ఎక్కడ కందిపోవునో అని.మరి అంత సున్నితమైన ఆ సుకుమార పాదాన్ని, ఆ పాదంపై నున్న మీగాలుని ( అరికాలు పై భాగం) కొందరు సత్కవులు ( లలితలో వశిన్యాది దేవతలు) కఠినంగా ఉండే ఆడ తాబేలు వీపు చిప్పతో ఉపమానం చెబుతూ ఎలా వర్ణించగలిగారమ్మా!

{ లలితాసహస్రంలో *కూర్మపృష్ట జయిష్ణు ప్రపదాంవితా* అని అమ్మకు ఒక నామం.దీనికి తాబేటి చిప్పను జయించినటువంటి ప్రపదం ( అరికాలి పై భాగం)తో శోభిల్లుదానా అని అమ్మను వశిన్యాది దేవతలు వర్ణించారు. దానినే ఇక్కడ శ్రీ శంకరులు అంత మృధువైన నీ పాదములను అలా వర్ణించుట సరికాదని నిష్కర్షగా చెప్పినారు. ఇక్కడ శ్రీ శంకరులకు అమ్మమీద ఉన్న అమిత మాతృభావ లాలిత్య భక్తి మనకు కనబడుతుంది. నాతల్లి యొక్క అంత మృధుపాదాలు పట్టుకుని అంత కఠినంగా వర్ణిస్తారా...అసలు ఆ మాట అనడానికి వారికి ( వశిన్యాది దేవతలు) మనసెలావచ్చిందని ఆదిశంకరులు కరుణతో విలవిలలాడిపోయారు.అదికదా భక్తి అంటే. అమ్మ మీగాళ్లు అంత మృధువుగా ఉన్నవి.}

 

🔱 ఆ తల్లి 

పాదపద్మములకు నమస్కరిస్తూ 🔱 🙏🌸🌸🌸🌸🌸🙏

పంచాంగం 14.10.2024 Monday,

 ఈ రోజు పంచాంగం 14.10.2024 Monday,


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం శరదృతు ఆశ్వీయుజ మాస శుక్ల పక్ష ఏకాదశి తదుపరి ద్వాదశి తిధి ఇందు వాసర: శతభిషా నక్షత్రం గండ యోగ: భద్ర తదుపరి బవ తదుపరి బాలవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


ఏకాదశి ఉదయం 06:40 వరకు తదుపరి ద్వాదశి రాత్రి 03:40 వరకు.

శతభషం  రాత్రి 12:39 వరకు .


సూర్యోదయం : 06:12

సూర్యాస్తమయం : 05:52


వర్జ్యం : పగలు 09:22 నుండి 10:49 వరకు.


దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12:25 నుండి 01:12 వరకు తదుపరి మధ్యాహ్నం 02:45 నుండి 03:32 వరకు.


అమృతఘడియలు : సాయంత్రం 06:06  నుండీ రాత్రి 07:33  వరకు.


రాహుకాలం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.


యమగండం: పగలు 10:30 నుండి 12:00  వరకు.



శుభోదయ:, నమస్కార:

Panchang


అది నువ్వె

 https://youtu.be/Mw8lY7QznKc?si=e35r25QE0UUp1MF2

https://youtu.be/FX42rgTU_9Y?si=_17LveyZ5BlKZ6sM