9, ఏప్రిల్ 2026, గురువారం

ఈ ప్రశ్నకు బదులేది 17

ఈ ప్రశ్నకు బదులేది 17

ఈరోజు మన ప్రశ్న  మహాభారతం కు సంబంధించింది.


  పంచ  భీములు ఎవరు? 


 భీముడు వారిని ఎప్పుడెప్పుడు సంహరించాడు


అర్జునుడికి ఎవరు ఏ సందర్భంలో పెట్టిన శాపము అజ్ఞాతవాసంలో ఉపయోగకరంగా మారింది


 సవివరంగా వివరించగలరు.


ఇంకొక ప్రశ్నతో మళ్ళీ కలుద్దాం.


ఇట్లు 

మీ 

చేరువేల భార్గవ శర్మ

గమనిక :: మీ జవాబులను కామెంట్ రూపంలో తెలుపగలరు

పంచాంగం


 

10ఏప్రిల్ 2026🪷* *దృగ్గణిత పంచాంగం*

  * *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

     *🌹శుక్రవారం🌹*

*🪷10ఏప్రిల్ 2026🪷*

  *దృగ్గణిత పంచాంగం*  

                      

           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*చైత్రమాసం - కృష్ణ పక్షం* 


*తిథి : అష్టమి* రా 11.15 వరకు ఉపరి *నవమి*

*వారం    : శుక్రవారం* (భృగువాసరే)

*నక్షత్రం  : పూర్వాషాఢ* ఉ 11.28 వరకు ఉపరి *ఉత్తరాషాఢ*

*యోగం : శివ* సా 06.31 వరకు ఉపరి *సిద్ధ*

*కరణం  : బాలువ* ఉ 10.21 *కౌలువ* రా 11.15 ఉపరి *తైతుల*

*సాధారణ శుభ సమయాలు:* 

                *-ఈరోజు లేవు-*               

అమృత కాలం  : *ఉ 06.08 - 07.54*

అభిజిత్ కాలం  : *ప 11.44 - 12.34*

*వర్జ్యం    : రా 08.12 - 09.56*

*దుర్ముహూర్తం  :ఉ 08.25 - 09.15 మ 12.34 - 01.23*

*రాహు కాలం  :ఉ 10.36 - 12.09*

గుళికకాళం      : *ఉ 07.29 - 09.02*

యమగండం    : *మ 03.10 -04.49*

సూర్యరాశి : *మీనం*                      

చంద్రరాశి : *ధనస్సు/మకరం*

సూర్యోదయం :*ఉ 06.04*  

సూర్యాస్తమయం :*సా 06.31*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం      :*ఉ 05.56 - 08.25*

సంగవ కాలం       :*08.25 - 10.54*

మధ్యాహ్న కాలం    : *10.54- 01.23*

అపరాహ్న కాలం  :*మ 01.23- 03.53*

*ఆబ్ధికం తిధి  :చైత్ర బహుళ అష్టమి*

సాయంకాలం   :*సా 03.53- 06.22*

ప్రదోష కాలం      :*సా 06.22- 08.40*

రాత్రి కాలం     :*రా 08.40 - 11.45*

నిశీధి కాలం     :*రా 11.45 - 12.32*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.23 - 05.09*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

         *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


🪷*శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం🪷*


*దేవమాతా సురేశానా* 

*దేవగర్భాఽంబికా ధృతిః*

           

             *🪷ఓం శ్రీ🪷* 

*🌷మహాలక్ష్మీ దేవ్యై నమః🌷*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

*శ్రీ మహావిష్ణు పురాణం*

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*గురువారం 9 ఏప్రిల్ 2026*


      *శ్రీ మహావిష్ణు పురాణం*

`` *52వ భాగం*``


*అనసూయ కోరిక పై సుమతి శాపం ఉపసహరించుట: మరణించిన కౌశికుని త్రిమూర్తులు బ్రతికించుట*```


సూర్యుని గమనం ఆగిపోవడంతో ముల్లోకాలు అంధకారంలోనే ఉన్నాయి. పద్నాలుగు భవనాల ప్రజలు భయంతో ఉన్నారు. సృష్టి సంతులనం తప్పింది. ఆందోళన చెందిన ఇంద్రుడు "సుమతి శాపం వలన ఇలా జరిగింది" అని తెలుసుకుని దేవతలతో కలసి వేగంగా భూమి మీద సుమతి ఉన్న ప్రదేశానికి వచ్చారు.


సతీ సుమతికి నమస్కరించి ఇంద్రుడు "అమ్మా! సుమతీ! నీ శాపంతో సూర్యుడి చలనం ఆగిపోయింది. సృష్టి నిలిచి పోయింది. పద్నాలుగు లోకాలు అంధకారంలోఉండిపోయాయి. అల్లకల్లోల పరిస్థితులువచ్చాయి. సృష్టి సమతుల్యత తప్పుతోంది. శాపం ఉపసంహరించుకుని సూర్యోదయం అయ్యేటట్టు చేయి తల్లీ!" అని కోరాడు.


సుమతి "మాండవ్య మహాముని శాపం వలన నా భర్త కౌశికుడు సూర్యోదయం కాగానే మరణిస్తాడు. ముని శాపం ఆపితే నా శాపం ఉపసంహరిస్తాను" అని చెప్పింది. 


ఇంద్రుడు ఆమెతో "నీకు తెలియదా తల్లీ! మహామునుల శాపాలు ఆపే శక్తి నారాయణుడికి కూడా లేదు. నీవే కరుణించి సూర్యోదయం కానివ్వాలి" అని వేడుకున్నాడు.


"నా భర్త ప్రాణాలు కాపాడలేని ఈ దేవతలు,లోకాలు ఏమైనా పర్వాలేదు. నేను సూర్యోదయం కానివ్వను. నా భర్తను చనిపోనివ్వను" అని తెగేసి చెప్పింది. 


ఇంద్రాది దేవతలు ఏమి చేయాలో తోచక బ్రహ్మ దేవుని వద్దకు వెళ్లి జరిగింది చెప్పి ఆపద నుండి గట్టెక్కే మార్గం చెప్పమని అడిగారు. 


బ్రహ్మదేవుడు ఆలోచించి "పతివ్రత శాపం నుంచి రక్షించగలిగే శక్తి మరో మహా పతివ్రతకే ఉంటుంది. మీరు వెళ్ళి మహాపతివ్రత అయిన అత్రి మహర్షి భార్య అనసూయాదేవిని శరణు వేడండి. తగిన మార్గం లభిస్తుంది" అని ఇంద్రునికి చెప్పాడు.


ఇంద్రాది దేవతలు పరుగున అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్లి అనసూయను శరణు వేడారు. అనసూయ వారికి అభయమిచ్చి దేవతల వెంట బయలుదేరి సుమతి వద్దకు వచ్చింది. సుమతి అనసూయాదేవికి నమస్కరించింది. అనసూయ సుమతితో "తల్లీ! నీ పరిస్థితి నాకు తెలుసును. నీ మాంగల్యానికి ఏమి హానీ జరుగకుండా నేను అభయం ఇస్తున్నాను. సూర్యోదయం కాకపోవడంతో లోకాలన్ని తల్లడిల్లి పోతున్నాయి. నన్ను నమ్మి నీ శాపం ఉపసంహరించు! లోకానికి శాంతి ప్రసాదించు!" అని పలికింది.


సుమతి అనసూయ పాదాలకు నమస్కరించి "తల్లీ! నీవు నా సౌభాగ్యం నిలబెట్టగల సమర్థు రాలివి. నీ మాట ప్రకారం నా శాపం ఉపసంహరిస్తున్నాను. సూర్యోదయం అవుగాక" అని ప్రకటించింది.  


తక్షణమే సూర్య రథం కదిలింది. చీకట్లు తొలగి సూర్యోదయం కాసాగింది. ముల్లో కాలలో వెలుగు కిరణాలు వ్యాపించాయి. మాండవ్య ముని శాపం ప్రకారం కౌశికుడి తల వెయ్యి ముక్కలై నారాయణ నామస్మరణ చేస్తూ మరణించాడు.


త్రిమూర్తులు ముగ్గురూ అనసూయ, సుమతి ముందు ప్రత్యక్షమైనారు. బ్రహ్మదేవుడు "సతీమ తల్లులారా! మీ వలన లోకాలకు శాంతి లభించింది. అనసూయాదేవి మాట గౌరవిస్తూ కౌశికుడికి ప్రాణదానం చేస్తున్నాను" అన్నాడు.  


విష్ణువు చిరునవ్వుతో "కౌశికుడు నిరంతరం హరి నామస్మరణ చేసే నా భక్తుడు. పూర్వజన్మ కర్మల ఫలం వలన కుష్ఠురోగం, అకాల మృత్యువు పొందాడు. సుమతి పాతివ్రత్యంతో పాపాలు తీరి పునర్జీవుతుడు అవుతున్న కౌశికునికి దివ్య దేహసౌందర్యం, ఆయురారోగ్య భోగభాగ్యాలు ప్రసాదిస్తున్నాను" అని వరమిచ్చాడు.


కౌశికుడు దివ్య సుందర శరీరంతో పునర్జీవితుడు అయ్యాడు. కౌశికుడు సుమతి ఆనందాశ్రువు లతో త్రిమూర్తులకు ప్రణమిల్లారు. 


మహాదేవుడు వారిని "అమ్మా! సుమతీ! ఈ కల్పాంతం వరకు మీరు చిరంజీవులై సుఖసంతోషాలతో గడిపి శ్రీహరి పాదసన్నిధి చేరుకుంటారు"అని

ఆశీర్వదించాడు.


త్రిమూర్తులు అనసూయను ప్రశంసిస్తూ "తల్లీ! భూలోకంలోనే కాదు సమస్త విశ్వములో నిన్ను మించిన పతివ్రత లేదు. నీ పాతివ్రత్య మహిమ సకల లోకాలకు వ్యాపిస్తుంది. మీ మనోభిష్టం త్వరలో నెరవేరి మిమ్మల్ని తరింపచేసే పుత్రులు మీకు కలుగుతారు" అని ఆశీర్వదించి అదృశ్యమయ్యారు.


నారదుడు సరస్వతి లక్ష్మి మహేశ్వరికి సతీ సుమతి కథ వివరించి "మాతల్లారా! నాకు మీ నాథులైన త్రిమూర్తులు పలికిన మాటల్లో ఒక్కటి అర్థం కాలేదు. సూర్యోదయం ఆపిన సతీ సుమతి మహా పతివ్రత. ఆవిడ శాపాన్ని ఉపసహరించి తను గొప్పదనం తెలియజేసింది. ఆమెను మీ నాథులు ప్రశసించడం సరియైనదే. కానీ అక్కడకు ఇంద్రుడు పిలిస్తే వచ్చిన అనసూయాదేవిని మీ నాథులు విశ్వంలో సర్ అనసూయను మించిన పతివ్రత లేదు అని పొగిడారు.


త్రిమూర్తుల భార్యలు, త్రిలోక మాతలు మీరు పతివ్రతా శిరోమణులు అన్న విషయం విస్మరించారా లేక వేరే ఉద్దేశం ఉందా? అసలు అనసూయాదేవి పాతివ్రత్యాన్ని ఎవరు ఎప్పుడు పరీక్షించారు? లేదు కదా? ఎంత మహాపతివ్రతలైనా మీ నుంచే అంశలుగా జన్మిస్తారు కదా! మరి అనసూయాదేవి మీ కన్నా మహా పతివ్రతా? అంటూప్రశ్నించాడు.


సరస్వతి లక్ష్మి మహేశ్వరిలు ఒకరి నొకరు చూసుకున్నాడు. నారదుడు అడిగింది నిజమే కదా! తమను మించిన మహా పతివ్రతలు ఎవరున్నారు సృష్టిలో! తమ పతులే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. అనసూయ తమ కన్నా మహా పతివ్రత అని త్రిమూర్తులే పరీక్షించి తేల్చాలి."ఈ పరీక్ష అనసూయకి కాదు మన భర్తలైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి" అని ఉమాదేవి చెప్పడంతో సరస్వతి లక్ష్మి అవునన్నారు. నారదుడు తన వచ్చిన పని అయ్యిందని నారాయణ నారాయణ అనుకుంటూ వెళ్లి పోయాడు.


బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ నివాసాలైన సత్యలోకం వైకుంఠం, కైలాసం రాగానే సరస్వతి లక్ష్మిదేవి ఉమాదేవి భర్తలను అనసూయాదేవి పాతివ్రత్యం పరీక్షించి తమ కన్నా మహా పతివ్రత అని నిరూపించ మని చెప్పారు. త్రిమూర్తులు ముగ్గురు భార్యల కోరిక తీర్చ డానికి అత్రి మహర్షి ఆశ్రమానికి బయలుదేరి వెళ్లారు.


             *(సశేషం)*

*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

కంటి రోగాలకు

 *కంటి రోగాలకు చక్కటి పరిష్కారం "చక్షుషీ విద్యా ప్రయోగం"*


*కంటి రోగాలను తగ్గించుటలో చక్షుషీ విద్యా ప్రయోగం మహత్తరమైనదని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. సంధ్యావందనము తరువాత సూర్యుని ఎదురుగా తూర్పు వైపు కూర్చుని గాయత్రి మంత్రం 24 సార్లు చదివిన తరువాత ఈ క్రింది మంత్రముతో ఒక చెంచా నీరు భూమికి సమర్పిస్తూ వినియోగించాలి*.


*తస్యశ్చాక్షుషీ విద్యాయా ఆహిర్భుధ్న్య ఋషి గాయత్రీ ఛందః సూర్యో దేవతా, చక్షు రోగ నివృత్తయే వినియోగః*


*తరువాత క్రింది మంత్రాన్ని 12 సార్లు జపించాలి*.


*ఓం చక్షుః చక్షుః స్థిరో భవ ! మాం పాహి పాహి! త్వరితం చక్షు రోగాన్ శమయ శమయ ! మమ జాత రూపం తేజో దర్శయ దర్శయ యధాహం అంధోనస్యాం తథా కల్పయ కల్పయ కళ్యాణం కురు కురు యాని మమ పూర్వ జన్మో పార్జితాని చక్షుః ప్రతిరోధక దుష్కృతాని సర్వాణి నిర్మూలయ నిర్మూలయ ఓం నమః చక్షుస్తేజో దాత్రే దివ్యాయ భాస్కరాయ ఓం కరుణా కరాయామృతాయ ! ఓం నమః సూర్యాయ ఓం నమో భగవతే సూర్యాయాక్ష తేజసే నమః ! ఖేచరాయనమః మహాతేనమః ! రజసే నమః ! అసతో మా సద్గమయ ! తమ సోమా జ్యోతిర్గమయా ! మృత్యోర్మా అమృతంగమయ!*


*ఇలా 12 సార్లు చదివిన తరువాత పంచ పాత్ర లోని జలాన్ని అర్ఘ్య రూపంలో సూర్యునికి సమర్పించాలి*.


*1,2 చుక్కలు జలాన్ని రెండు చేతి వేళ్ళకు రాసుకుని కళ్ళు తుడుచుకోవాలి*.


From 


Dr Nerella Rajasekhar, 

Chaitanyapuri


ప్రాముఖ్యమైన విషయం



  చాలా ప్రాముఖ్యమైన విషయం 👍

ఇప్పుడు ఆధునిక వివాహాల్లో జరుగుతున్న సాధారణ తప్పులు మరియు వాటిని శాస్త్రోక్తంగా ఎలా సరిచేయాలి అనేది స్పష్టంగా చూద్దాం.

❌ ఆధునిక వివాహాల్లో ప్రధాన తప్పులు

1️⃣ ముహూర్తాన్ని పట్టించుకోకపోవడం

👉 చాలామంది:

ఫంక్షన్ హాల్ టైమ్ ప్రకారం పెళ్లి

రాత్రి ఆలస్యంగా ముహూర్తం మార్చడం

📌 సమస్య: శాస్త్రపరమైన శుభకాలం పాటించకపోవడం

✅ పరిష్కారం:

పండితుడితో ఖచ్చితమైన ముహూర్తం నిర్ణయించాలి

ఆ సమయానికే ప్రధాన కర్మలు చేయాలి

2️⃣ మంత్రాలు లేకుండా షార్ట్ కట్

👉 “టైమ్ లేదు” అని:

మంత్రాలు తగ్గించడం

కర్మలు వదిలేయడం

📌 సమస్య: వివాహం యజ్ఞం → అది అసంపూర్ణం అవుతుంది

✅ పరిష్కారం:

కనీసం ముఖ్య కర్మలు తప్పక చేయాలి:

✔ కన్యాదానం

✔ మంగళసూత్రం

✔ సప్తపది

3️⃣ ఆర్భాటం ఎక్కువ – శాస్త్రం తక్కువ

👉 ఫోకస్:

డెకరేషన్

ఫోటోగ్రఫీ

ఫ్యాషన్

📌 సమస్య: అసలు ఉద్దేశ్యం మరిచిపోవడం

✅ పరిష్కారం:

శాస్త్ర కర్మలకు ప్రాధాన్యం ఇవ్వాలి

వేడుకలు తర్వాత చేయవచ్చు

4️⃣ సావధాన లేకుండా హడావిడి

👉 ముహూర్తంలో:

మాట్లాడటం

ఫోటోలు

గందరగోళం

📌 సమస్య: కర్మలో ఏకాగ్రత లేకపోవడం

✅ పరిష్కారం:

“శుభముహూర్తే సావధాన”ను నిజంగా పాటించాలి

ఆ సమయంలో నిశ్శబ్దం & శ్రద్ధ అవసరం

5️⃣ శాస్త్రం అర్థం లేకుండా చేయడం

👉 కేవలం “ఆచారం”గా చేస్తారు

📌 సమస్య: భావం తెలియదు → విలువ తగ్గుతుంది

✅ పరిష్కారం:

ముందుగా కర్మల అర్థం తెలుసుకోవాలి

పండితుడు వివరించాలి

6️⃣ అశుద్ధ ఆచరణ

👉

సరైన వస్త్రధారణ లేకపోవడం

పవిత్రత పాటించకపోవడం

📌 సమస్య: యజ్ఞ స్వరూపం దెబ్బతింటుంది

✅ పరిష్కారం:

సంప్రదాయ దుస్తులు

శుచిత్వం పాటించాలి

7️⃣ ఆలస్యం & టైమ్ మిస్

👉

వరుడు/వధువు లేట్

కర్మలు వాయిదా

📌 సమస్య: ముహూర్తం దాటిపోతుంది

✅ పరిష్కారం:

ముందుగా పూర్తి ప్లానింగ్

సమయపాలన కచ్చితంగా

8️⃣ మద్యం / అశాస్త్రీయ వాతావరణం

👉 కొన్ని ఫంక్షన్లలో:

మద్యం

గందరగోళం

📌 సమస్య: పవిత్రత కోల్పోతుంది

✅ పరిష్కారం:

వివాహాన్ని యజ్ఞంగా చూడాలి

శాంతి వాతావరణం ఉండాలి

🕉️ శాస్త్రోక్తంగా చేయాలంటే 5 సూత్రాలు

✔ 1. ముహూర్తం పాటించాలి

✔ 2. ప్రధాన కర్మలు పూర్తిగా చేయాలి

✔ 3. శ్రద్ధ (సావధాన) ఉండాలి

✔ 4. అర్థంతో చేయాలి

✔ 5. పవిత్రత కాపాడాలి

📌 సులభ సారాంశం

👉 ఆధునిక వివాహం సమస్య:

ఆర్భాటం ↑ – ఆధ్యాత్మికత ↓

👉 సరైన మార్గం:

సంప్రదాయం + సరళత + శ్రద్ధ

✨ చివరి మాట

👉 వివాహం = ఫంక్షన్ కాదు

👉 అది ఒక జీవిత యజ్ఞం

👉 ఒకసారి సరిగా చేస్తే → జీవితాంతం ఫలితం ఉంటుంది

శరీరే జర్జరీ భూతే,

  *శ్లోకం* :

శరీరే జర్జరీ భూతే, వ్యాధిగ్రస్తే కళేబరే |

ఔషధం జాహ్నవీతోయం, వైద్యో నారాయణో హరిః || 

 *తాత్పర్యం:* 

శరీరం ముసలితనంతో లేదా అనారోగ్యంతో వ్యాధిగ్రస్తమై, బలహీనపడి (జర్జరీ భూతే) కళేబరంలా (మృతతుల్యంగా) మారినప్పుడు, అటువంటి సమయాన పవిత్రమైన గంగాజలమే (జాహ్నవీ తోయం) గొప్ప ఔషధం. అప్పుడు సర్వరోగ నివారకుడైన శ్రీమన్నారాయణుడే (హరి) నిజమైన వైద్యుడు.

నిద్రా విద్రావక ద్రావణం"*

 

*"నిద్రా విద్రావక ద్రావణం"*

("టీ" కి మా గురువుగారు పెట్టిన పేరు)


శా॥

నిద్రాభంగకరీ మనస్సుఖకరీ! మాధుర్యరూపోజ్జ్వలీ

ప్రాతస్సంగవమధ్యకాలరుచిమచ్ఛేషద్వయే శ్రీకరీ

చిత్తభ్రాంతిశమంకరీ ధృతికరీ ద్రావాకృతీ భూరి *"టీ"*

క్షీరశ్శర్కరపత్రచూర్ణవిలసద్యేకాక్షరీ నౌమి తే॥

*~శ్రీశర్మద*


పగటి కాలములు ఐదు 

ప్రాతఃకాలము 

సంగవకాలము 

మధ్యాహ్నము 

అపరాహ్నము 

సాయంకాలము

పంచాంగం 09.04.2026 Thursday,

  ఈ రోజు పంచాంగం 09.04.2026 Thursday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాస కృష్ణ పక్ష సప్తమి తిథి బృహస్పతి వాసర పూర్వాషాఢ నక్షత్రం పరిఘ యోగః భద్ర తదుపరి బవ కరణం.


రాహుకాలం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.

 

యమగండం: ఉదయం 06:00 నుండి 07:30 వరకు.

  


శ్రాద్ధ తిథి: సప్తమి 


 

నమస్కారః , శుభోదయం

ఆర్యా శతకం - 1*

 *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*ఆర్యా శతకం - 1*


*శ్లోకము - 77*


*ప్రత్యఙ్ముఖ్యా దృష్ట్యా ప్రసాదదీపాంకురేణ కామాక్ష్యాః।*

*పశ్యామి నిస్తులమహో పచేలిమం కమపి పరశివోల్లాసమ్॥*


*భావము :*


*అమ్మా! నీ దయ ఒక దీపశిఖ వంటిది. ఆ దీపపు వెలుగులో, ముజ్జగములలో సాటిలేని, పరిపూర్ణస్వరూపమైన పరదేవతను నేను తిలకించ గలుగుతున్నాను.*


🙏🙏🙏 *శ్రీమాత్రే నమః* 🙏🙏🙏

భగవద్గీత

 -------------------- భగవద్గీత. -------------------

తృతీయోధ్యాయ: కర్మ యోగము.


 

ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః ।

మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః ।। 42 ।।



ప్రతిపదార్థ:



ఇంద్రియాణి — ఇంద్రియములు; పరాణి — ఉన్నతమైనవి; ఆహుః — అనబడును; ఇంద్రియేభ్యః — ఇంద్రియముల కంటే; పరం — ఉన్నతమైనవి; మనః — మనస్సు; మనసః — మనస్సు కంటే; తు — కానీ; పరా — ఉన్నతమైనది; బుద్దిః — బుద్ధి; యః — ఏదైతే; బుద్ధే — బుద్ధిని మించి; పరతః — మరింత ఉన్నతమైనది; తు — కానీ; సః — అది (ఆత్మ).



తాత్పర్యము : 



స్థూల శరీరం కన్నా ఇంద్రియములు ఉన్నతమైనవి, ఇంద్రియముల కన్నా మనస్సు ఉన్నతమైనది. మనస్సు కన్నా ఉన్నతమైనది బుద్ధి, మరియు బుద్ధి కన్నా మరింత ఉన్నతమైనది ఆత్మ.



  వివరణ:


ఒక తక్కువ స్థాయి అస్తిత్వాన్ని, దాని యొక్క ఉన్నతమైన అస్తిత్వంచే నియంత్రించవచ్చు. భగవంతుడు మనకు ఇచ్చిన పరికరముల వివిధ స్థాయిలను, శ్రీ కృష్ణుడు విశదీకరిస్తున్నాడు. ఈ శరీరం స్థూల పదార్థంతో తయారయింది; దానికన్నా ఉన్నతమైనవి ఐదు జ్ఞానేంద్రియములు (రుచి, స్పర్శ, చూపు, వాసన, మరియు శబ్దముల అనుభూతిని గ్రహించేవి); ఇంద్రియముల కన్నా మించినది మనస్సు; మనస్సు కన్నా ఉన్నతమైనది విచక్షణా శక్తి కలిగిన బుద్ధి; కానీ ఈ బుద్ధి కన్నా మించినది దివ్య ఆత్మ.


ఈ అధ్యాయపు చిట్టచివరి శ్లోకంలో చెప్పబడినట్టుగా, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి మరియు ఆత్మల ఆధిపత్య క్రమం యొక్క జ్ఞానాన్ని, మనము కామాన్ని కూకటి వేళ్ళతో పీకివేయటానికి ఇక ఇప్పుడు ఉపయోగించుకోవచ్చు.

గురువారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

09-04-2026 గురువారం రాశి ఫలితాలు


మేషం


దూర ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు భాదిస్తాయి. బంధు మిత్రులతో ఆకస్మిక వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలు అంతగా కలిసిరావు. 

---------------------------------------


వృషభం


స్ధిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు కలసి వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించిన ఆశించిన లాభాలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అనుకూలత కలుగుతుంది.

---------------------------------------


మిధునం


సోదరులతో ఆస్తి వివాదాలు తొలగి ఊరట చెందుతారు. వాహన వ్యాపారస్తులు నూతన లాభాలు అందుకుంటారు. అవసరానికి సన్నిహితుల సాయం అందుతుంది. కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

---------------------------------------


కర్కాటకం


వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాల సూచనలున్నవి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలలో కొంత చికాకు తప్పదు. ఇంటా బయట అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగమున అదనపు బాధ్యతలుంటాయి. ఆర్థికంగా కొంత నిరాశ తప్పదు.

---------------------------------------


సింహం


తల్లి తండ్రుల ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. బంధువులతో వివాదాలు కలుగుతాయి. ఉద్యోగమున అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించక నిరాశ పెరుగుతుంది.

---------------------------------------


కన్య


నూతన పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తిచేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ యత్నాలలో విజయం సాధిస్తారు. సంఘంలో స్నేహితుల నుండి ఊహించని ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆర్ధిక పురోగతి సాధిస్తారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు.

---------------------------------------


తుల


ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది. బంధుమిత్రుల నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారమునకు పెట్టుబడులు సకాలంలో అందవు. వృత్తి ఉద్యోగాలలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు.

---------------------------------------


వృశ్చికం


అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారములు పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల సహాయ సహకారాలు అందుతాయి.

---------------------------------------


ధనస్సు


వృత్తి వ్యాపారమున నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. సోదరులతో స్ధిరాస్తి వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.

---------------------------------------


మకరం


సన్నిహితుల నుండి విలువైన విషయాలు సేకరిస్తారు. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఉద్యోగ విషయమై ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది.

---------------------------------------


కుంభం


కీలక వ్యవహారాలలో స్వంత నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధన లాభాలుంటాయి. స్ధిరాస్తి సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పనికి తగిన గుర్తింపు లభిస్తుంది.

---------------------------------------


మీనం


కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల నుండి మాటలు పడవలసి వస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభానికి ఆటంకాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. తగినంత ఆదాయం లభించదు. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది.

---------------------------------------

ఆయుర్వేద మూలికలు

 ప్రతి గృహము నందు ఉండదగిన ఆయుర్వేద మూలికలు మరియు ఆవరణలో ఉండవలసిన చెట్లు -


ఇప్పుడు నేను మీకు తెలియచేసే మూలికలు మరియు చెట్లు అందుబాటులో ఉండే విధముగా చూసుకోనవలెను . అలాగే మీ గృహావరణలో నేను చెప్పబోయే చెట్లను పెంచుకోవడం చాల మంచిది . ఒకవేళ మీ గృహవరణలో స్థలం లేకున్నచో మీకు దగ్గర ప్రదేశాలలో ఖాళీస్థలం ఉన్నచో ఈ చెట్లను పెంచడం మంచిది . వీటివల్ల ఎన్నో గొప్పగొప్ప ఔషధ యోగాలు ఉన్నాయి .


గృహము నందు ఉండదగిన మూలికలు -


నిమ్మకాయ , అల్లం , జీలకర్ర , సైన్ధవ లవణం , ఉప్పు , వాము , కురసాని వాము , ఇంగువ , సున్నము , బెల్లము , తేనె , ఆవునెయ్యి , నువ్వులనూనె , కుంకుడు కాయలు , వాము పువ్వు , పుదీనాపువ్వు , పచ్చ కర్పూరం , కర్పూరం , తెల్ల ఆవాలు , ఆవాలు , ఆముదము , యాలుక్కాయలు , లవంగాలు , దాల్చిన చెక్క , గసగసాలు , సీమగొబ్బి విత్తనాలు , మిరియాలు , ధనియాలు , సుగంధపాల , గంధపుచెక్క , కస్తూరి , దుప్పికొమ్ము , అక్కలకర్ర , అతిమధురము , యష్టిమధుకము , కరక్కాయ , పిప్పళ్లు , పెద్ద ఉశిరిక పప్పు , పటిక , శొంటి , పటికబెల్లము , నీరుల్లి , వెల్లుల్లి , దుంపరాష్ట్రము , మోడీ , మోదుగ మాడలు , రుద్రాక్షలు , అరటిపండ్లు , తమలపాకులు , పసుపు , వాము , తేనె మైనం మొదలైనవి .


గృహ అవరణలో పెంచదగిన చెట్లు -


నిమ్మ , నారింజ , వేప , వెలగ , ములగ , ఉత్తరేణి , తెల్ల గురువింద , నందివర్దన , మందార , తెల్ల జిల్లేడు , నల్ల ఉమ్మెత్త , అవిశ , అరటి , పనస , తెల్ల ఈశ్వరి , మారేడు , ఉడుగ , దిరిశన , తుమ్మ , గరిక , తుమ్మి , చంద్రకాంత , గన్నేరు , తోటకూర , గోంగూర , బచ్చలి , చిత్రమూలం , సరస్వతి , చిర్రి , మోదుగ , నల్లేరు , కాడజెముడు , దూలగొండి , వెంపలి , పుదినా , వాము , తులసి , కొబ్బరి , జీడిమామిడి , కానుగ , పిప్పిలి , టేకు , వెదురు , జాజి , గులాబి , మల్లె , దానిమ్మ , పెద్ద ఉశిరిక , మేడి మొదలైన ఔషధ చెట్లు గృహ ఆవరణలో లేక గృహానికి చుట్టుపక్కల ప్రదేశాలలో తప్పక పెంచవలెను .


పైన చెప్పినటువంటి ఔషధాలు మరియు ఔషధ చెట్ల గురించి నేను రాసిన మూడు ఆయుర్వేద గ్రంథాలలో విపులంగా వివరించాను.




ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .



వేద ఆశీర్వచనం

  *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1948 స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణము - వసంత ఋతువు - చైత్ర మాసం - కృష్ణ పక్షం - సప్తమి - మూల -‌‌ గురు వాసరే* (09.04.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.




 

.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

---------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

జానకీ వల్లభా

 🌸శ్రీరామ స్తుతి🙏


సీ. జానకీ వల్లభా ! జగదభి రామయ్య !

               సజ్జన సేవితా !  సాధు పోష !

     సేతుబంధన రామ ! సేవిత కపిబృంద !

              పతితపావననామ ! పరమపురుష !

     నీలమేఘశ్యామ ! నిరుపమ గుణధామ !

               నిను నమ్మి యుంటిని  నిచ్చ లందు  

     నీ శరధాటికి నిక్కమ్ము  జలనిధి 

               భయమంది లంకకు బాట చూపె

తే.జప తపమ్ముల నొనరించ శక్తి లేదు 

    వేరు దైవంబె  నెఱుగ నే విమల చరిత !

    నీవే దిక్కని నమ్మితి నీరజాక్ష !

    దశరథాత్మజ ! రఘురామ ! ధర్మ తేజ !



       జయలక్ష్మి  పిరాట్ల