3, జులై 2026, శుక్రవారం

నేను చూసిన భగవానుడు

 నేను చూసిన భగవానుడు


 నిన్న మేము మైసూరులోని శ్రీ వేణుగోపాల స్వామి వారి మందిరానికి వెళ్ళాము.


మనం నిత్యజీవితంలో ఎన్నో దేవాలయాలకు మందిరాలకి వెళుతూ ఉంటాం అయితే ఈ దేవాలయమునకు ఉన్న ప్రత్యేకత ఏమిటో నేను మీకు కులం క్యూస్షన్ గా వివరిస్తాను.


ముందుగా ఈ దేవాలయం ఎక్కడ ఉందంటే కావేరి నది తీరాన ఉన్నది.విశాలమైన ప్రాంగణము చుట్టూరా కాంపౌండ్ వాల్ మీద పెన్సింగ్తో ఉన్నది. దేవాలయం ముందర చాలా ఖాళీ స్థలం ఉన్నది అక్కడ మనము కార్లు వ్యానులు బస్సులు ఏవైనా కూడా చక్కగా పార్కు చేసుకోవచ్చు.


పార్కింగ్కు ఎటువంటి రుసుము లేదు.అక్కడ మైక్ లో ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నాడు, ఏంటంటే మీ చెప్పులు చెప్పుల స్టాండులో పెట్టుకొని చెప్పులు లేకుండా దేవాలయంలోకి ప్రవేశించండి అని.


అక్కడ చెప్పుల స్టాండు చూసాము అక్కడ ఎవరైనా ఉన్నారా అంటే ఎవ్వరు లేరు చెప్పులు ఉచితంగా అక్కడ పెట్టుకోవచ్చు ఒక రూపాయి కూడా చెప్పులు స్టాండ్ లో తీసుకోలేదు.అక్కడినుంచి నడుచుకుంటూ ప్రాంగణంలో అడుగెడితే అక్కడ ఒక మండపం ఉన్నది ఆ మండపం వద్ద కొంచెంసేపు మేము విశ్రాంతి తీసుకున్నాము, ఎండ విపరీతంగా ఉన్నది.


మధ్యాహ్నం రెండు గంటల సమయం చిన్నగా నడుచుకుంటూ అక్కడ బయట ప్రాంగణం దాటి న వెంటనే చుట్టూరా అద్దాలతో ఉన్నటువంటి ఒక పెద్ద హాలు కనబడ్డది, అద్దాలు మాత్రమే ఉన్నాయి ఆ హాల్లో అది దాటి దాని లోపలికి వెళ్లి కే అక్కడ కొంత ఖాళీ స్థలం దాటి వెళితే రెండవ ప్రాకారము లోపలికి వెళ్దాము.


రెండో ప్రకారములోపడ ముందు విజ్ఞేశ్వరుడుతో మొదలుకొని చుట్టూరా పార్వతీదేవి శంకరుడు శ్రీరామచంద్రుడు మొదలగు దేవతామూర్తులు నవగ్రహాలు ఋషులు మొదలైనటువంటి మూర్తులతో చిన్న చిన్న దేవాలయాలు మనకు దర్శనం ఇస్తాయి.


అవన్నీ చూసుకొని ఒక ప్రదక్షణ లాగా తిరిగి మరల లోపలికి ప్రవేశిస్తే అక్కడ ఒక చిన్న మండపాము లాగా ఉండి అక్కడ కూర్చోటానికి వసతి ఉన్నది.




అది దాటుకొని లోపలికి వెళితే అక్కడ స్వామి వారి కోవెల ఉన్నది కోవెలలోపడా మనకు ఎడమవైపు ఒక మూర్తి ఎదురుగా ఒక మూర్తి దర్శనమిస్తారు.




ఎదురుగా ఉన్న మూర్తి గోపాలకృష్ణమూర్తి వేణు గానం చేస్తున్నట్లుగా ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడి మూర్తి చూసినా కొద్ది చూడాలనిపించేటువంటి ఆనందమయం.




ఆ మమూర్త ముందర పూజలు చేసే పూజారులు ఎవరు లేరు కానీ ఒక దీపారాధన చేసినటువంటి దీపారాధనతో కూడిన పళ్ళెం ఉన్నది అక్కడ కానుకలు వేయకూడదు అని మైక్ లో చెప్పారు కేవలం దర్శనము చేసుకొని 




 బయటకు వచ్చి కాసేపు విశ్రాంతి తీసుకొని బయట ప్రాంగణము దాటి వస్తే అవతల ఒక రాతిరథము కనబడుతుంది.




అందరూ అక్కడ ఫోటోలు దిగారు, మేము కూడా ఫోటోలు దిగాము




 ఇక్కడ విశేషమేంటంటే ఈ దేవాలయంలో మీరు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు.




కేవలము భక్తితో స్వామివారిని దర్శించుకుని రావచ్చు ఎక్కడ పార్కింగ్ ఫీజు చెప్పుల స్టాండ్ ఫీజు దైవ దర్శనం ఫీజు పూజా ఫీజు అర్చన ఫీజు టెంకాయ ఫీజు ఏవి కట్టవలసిన అవసరం లేదు.




దేవాలయములో కానుకలు నిషిద్ధం అని మైకులు లో పలుమార్లు చెబుతున్నారు.




పూలు పండ్లు ఏవి కూడా లోపలికి తీసుకొని రావలసిన పనిలేదు.




నిజమైన భక్తి అంటే భగవంతుడికి మనస్సుని అర్పించడమే కదా అంతకుమించినది ఏమీ ఉండదు అని చెప్పటానికి ఈ దేవాలయం తార్కాణము ఇటువంటి దేవాలయాలు మరిన్ని అభివృద్ధి చేస్తే భక్తులకి సౌకర్యంగా ఉండటమే కాకుండా హిందూ ధర్మము సుస్థిరముగా ఉంటుంది అనటానికి ఎటువంటి సందేహము లేదు. తరువాత మేము కావేరీ నది తీరానికి వెళ్లి కాసేపు ఉండి వచ్చాము.




నిన్న మా ట్రిప్పు చాలా ఆనందంగా గడిచింది




ఓం శాంతి శాంతి శాంతిః 


మీ


 చేరువేల భార్గవ శర్మ

వాలి ఆక్షేపణలకు

 ....☘️1 వాలి రాములు వారితో నన్ను చెట్టు చాటు నుండి చంపినావుఅది అధర్మం కదా అని అన్నప్పుడు రాములు వారి సమాధానం చూడండి🙏




 *వాలి ఆక్షేపణలకు రాముని సమాధానం*


"వానరరాజా! ధర్మం గురించి సంశయం వస్తే పెద్దలను అడిగి తెలుసుకుని ఆపైన మాట్లాడాలి. ఇలా పరుషంగా మాట్లాడకూడదు.


 సత్పురుషులు ఆచరించే ధర్మం చాలా సూక్ష్మమైనది. విశేషించి నేర్చుకుంటే తప్ప తెలుసుకోవడం చాలా కష్టమైనది.


చపలశ్చపలైః సార్ధం వానరైరకృతాత్మభిః, జాత్యస్ధ ఇవ జాత్యక్షైర్మన్తయన్ ప్రేక్షసే ను కిమ్.


పుట్టుగుడ్డివాడు మరికొందరు పుట్టుగుడ్డివాళ్ళతో ఆలోచించి ఏం చూడగలడు? అలాగే చపలుడివైన నువ్వు మరి కొందరు చపలురితో ఆలోచించి ధర్మం గురించి ఏం తెలుసుకోగలవు?


ధర్మార్ధకామాల గురించి, లోకమర్యాదను గురించి తెలుసుకోకుండా నీ యిష్టం వచ్చినట్లు ప్రవర్తించావు. ఫలితం అనుభవించ వలసివస్తే నన్ను నిందిస్తున్నావు. నిన్ను చంపడం అధర్మమని వాపోతున్నావు. ఎందుకు చంపానో చెప్పమంటున్నావు..


 *నిన్ను చంపడం ధర్మమే.* అది ఎలాగో విను.


నీ దేశం వేరు, నాదేశం వేరు అన్నావు. నా దేశంలో ఏ అపరాధమూ చెయ్య లేదన్నావు. కొండలతోనూ, మహాపర్వతాలతోనూ, మైదానాలతోనూ, చిట్టడవులతోను, ఘోరారణ్యాలతోనూ; జనపదాలతోనూ, నగరాలతోనూ కూడిన చతుస్సముద్ర పరివేష్టితమైన యీ భూమండలమంతా మహాపరాక్రమవంతులైన మా ఇక్ష్వాకువంశీయులదే. ఇదంతా మా రాజ్యమే. *మనుష్యులను, మృగాలను, పక్షులను నిగ్రహించడం, అనుగ్రహించడం మా అధికారంలో ఉన్నాయి.* నువ్వు మా రాజ్యంలోని అరణ్యంలో నివసిస్తున్నావు. మారాజ్యంలో అమలులో ఉన్న ధర్మాన్ని పాటించాలి.


ఈ రాజ్యంలో ధర్మం అవిచ్ఛిన్నంగా ఉండేలా పితృపితామహుల నుంచీ మేము కాపాడుతున్నాం. ఇప్పుడు ఈ రాజ్యాన్ని ధర్మాత్ముడైన భరతుడు పరిపాలిస్తున్నాడు. తన రాజ్యంలో అధర్మం ఎక్కడా తలెత్తకూడదని భరతుడు ఆదేశించాడు. మేమే కాదు. అనేకమంది రాజులు భరతుడి ఆదేశానుసారం ధర్మపరిరక్షణ చేస్తున్నారు. మేమిద్దరమూ రాజాజ్ఞను పాటిస్తూ అరణ్యాలలో తిరుగుతున్నాము.


 *శ్రేష్ఠమైన మాధర్మాన్ని మేము పాటిస్తూ భరతుడి ఆజ్ఞ ప్రకారం ఎవరైనా ధర్మాతిక్రమణం చేసారా అని పరిశీలిస్తాం.* అదీ మాకు తోచినట్లు కాదు. శాస్త్రానుసారంగా ధర్మవిచారణ చేస్తాం. ధర్మాన్ని అతిక్రమిస్తే శిక్షిస్తాం. *నువ్వు ధర్మాతిక్రమణం చేసావు. రాజదండనకు గురయ్యావు.* 


ధర్మమార్గంలో ఉన్న ప్రతి వ్యక్తి తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది. జన్మనిచ్చిన తండ్రి, విద్యనిచ్చిన గురువు, అన్నగారు ఈ ముగ్గురూ తండ్రులే అని తెలుసుకోవాలి.


అలాగే కన్నకొడుకు, గుణవంతుడైన శిష్యుడు, తమ్ముడు ఈ ముగ్గురూ తనకుమారులే అని భావించాలి.


కామంతో కళ్ళు మూసుకుపోయి వరుసకు కూతరైనతమ్ముడి భార్యనుగాని పొందేవాడిని శిక్షించాలని శాస్త్రం చెప్తోంది. నువ్వు తమ్ముడు భార్యని తీసుకొని వెళ్ళావునువ్వు ధర్మమార్గం తప్పావు. మేము రాజాజ్ఞప్రకారం ధర్మాన్ని నిలబెట్టాలి. అందువలన నీకు ఈ శిక్ష విధించక తప్పదు. ఇది మా కర్తవ్యం.


ఇక సుగ్రీవుడితో మైత్రి విషయానికి వస్తే, అతడు నువ్వు చేస్తున్న పాపకార్యం గురించి నలుగురిమధ్య చెప్పాడు. అది విని నీకు మరణదండన అమలు చేస్తానని ప్రతిజ్ఞ చేసాను. ఆ ప్రకారమే నిన్ను వధించాను.


ఒక సంన్యాసి నువ్వు చేసిన పాపం వంటిదే చేస్తే, సంన్యాసి కదా అని మా పూర్వుడైన మాంధాత చక్రవర్తి అతణ్ణి శిక్షించకుండా వదిలేసాడు. అతణ్ణి వదలినందుకు ఆ పాపం మాంధాతకు చుట్టుకుంది.


ఇక నిన్ను చాటుగా ఉండి చంపానన్నావు. వానరరాజ్యానికి రాజువైనా *నువ్వు వానరుడివే. మానవులు జంతువులను వలలతోను, ఉచ్చులతోను, చిత్రమైన శబ్దాలు చేసి, ఇంకా అనేక కపట ఉపాయాలతోను బంధిస్తారు. ఇది తప్పు కాదు.* *రాజులైతే ఏకంగా మాటువేసి వేటాడుతారు. నువ్వు నాతో ఎదురుగా నిలిచి యుద్ధం చేసినా, మరొకడితో యుద్ధం చేస్తున్నా నువ్వు వానరుడివే. నిన్ను చాటుగా ఉండి చంపవచ్చు.*


జీవులు తమంత తాముగా సంపాదించలేని ధర్మాన్నీ, పవిత్రమైన జీవితాన్నీ రాజులే ఇస్తారు. . జీవులు తమంత తాముగా సంపాదించలేని ధర్మాన్నీ, పవిత్రమైన జీవితాన్నీ రాజులే ఇస్తారు.. *అనేక తరాలుగా అనుసరిస్తున్న ధర్మమార్గంలో నియమంగా నడిచే నన్ను దూషించడం నీకు తగదు.”*


రాముడి మాటతో వాలికి కనువిప్పు కలిగింది.


“ *రామా! నువ్వు చెప్పినదే సత్యం, ధర్మస్వరూపాన్ని ఇంత స్పష్టంగా నువ్వు తప్ప ఇంకొకరు తెలుసుకోలేరు. కార్యాకార్యాలను విశ్లేషించడంలో నీకు ఎవరూ సాటిరారు. కార్యం చేసినవారిని రక్షిస్తావు. అకార్యం చేసిన వారిని శిక్షిస్తావు."* అతడి గొంతు క్షీణించడం మొదలు పెట్టింది. వణుకుతున్న గొంతుకతో మెల్లగా రాముణ్ణి ప్రార్ధించాడు.🙏....



సేకరణ.

పునర్జన్మ

  సనాతన ధర్మం - పునర్జన్మ

                 

ఒకసారి మన సనాతన ధర్మంపై, వేదాంత శాస్త్రంపై మక్కువ ఉన్న ఒక విదేశీయుడు పరమాచార్య స్వామివారిని దర్శించాలని కంచి మఠానికి వచ్చాడు.


అతను కొన్ని సందేహాలను అడగాలని అనుకున్నాడు. వెంటనే అతనికి స్వామివారి నుండి పిలుపు వచ్చింది. సమయం వృధా చెయ్యకుండా తన సందేహాలను స్వామివారి ముందుంచాడు…


”స్వామిజి, నేను మీ సనాతన ధర్మం యొక్క అన్ని సిద్ధాంతాలను అర్థం చేసుకున్నాను, వాటిని గౌరవిస్తాను కూడా. కాని ఈ ‘ఒకే ఆత్మ పాప పుణ్యాల ఫలం వల్ల మళ్ళీ జన్మించడం క్రిందటి జన్మ కర్మఫలం ఈ జన్మకు రావడం’ అనే ఈ పునర్జన్మ సిద్ధాంతం నాకు అర్థం కావడం లేదు. మీరు ఈ విషయంలో నాకు కొంచం చెప్పగలరా?” అని అడిగాడు.


”ఎందుకంటే మా ధర్మం ప్రకారం. ఈ జన్మలో చేసిన పాపపుణ్యాల ఫలితం ఈ జన్మలోనే అనుభవిస్తాము. అంటే మేము నిజాయితీగా ఉంటే దేవుడు మాకు మంచి చేస్తాడు.   కపటంతో ప్రవర్తిస్తే మాకు చెడు ఫలితాలను ఇస్తాడు” అని చెప్పాడు.


అప్పుడు మహాస్వామి వారు అతని దగ్గర ‘కారు ఉన్నదా అని అడిగి ఈ కాంచీపురంలోకి వెళ్ళి కొంచం సమాచార గణాంకాలను సేకరించుకు రాగలవా?’ అని అడిగారు.


అతను వెంటనే ఒప్పుకున్నాడు. కాని తన ప్రశ్నకు ఎందుకు వెంటనే సమాధానం చెప్పలేదు, అని అనుకున్నాడు.


”సరే స్వామిజి, ఏమి చెయ్యమంటారో సెలవివ్వండి” అని అడిగాడు.


అందుకు మహాస్వామి వారు, “కాంచీపురంలోని ఒక పది ప్రసూతి వైద్యశాలలకు వెళ్ళు. అక్కడ గత రెండు రోజులలో పుట్టిన పిల్లల వివరాలు, వారి ఆరోగ్యం, తల్లితండ్రుల పేర్లు, వారి స్థితి, వారి విద్యార్హతలు, పుట్టిన సమయం వంటివి తెలుసుకుని రా” అని చెప్పారు.


ఆ విదేశీయుడు, “సరే ఇదేమి పెద్ద పని కాదు,” అని తన కారులో వెళ్ళిపోయాడు. 


సాయత్రం లోపల కావల్సిన వివరాలతో మహాస్వామి వారి ముందుకు వచ్చాడు. ఆ వివరాలను స్వామి వారికి చెప్పాడు.


“ఈ రెండు రోజులలో పది ఆస్పత్రులలో 15 మంది పిల్లలు పుట్టారు. 7గురు మగపిల్లలు, 8మంది ఆడపిల్లలు. వారిలో ముగ్గురికి పోషకాహార లోపం ఉంది. ఇద్దరు ధనికులైన తల్లితండ్రులకు ప్రథమ సంతానం. వారు అత్యంత ఖరీదైన ఆస్పత్రులలో పుట్టారు. నలుగురు పిల్లలు రోజుకూలి చేసుకునే వారికి పుట్టారు. వారికి అప్పటికే పిల్లలు ఉన్నారు” అని చెప్పుకొచ్చాడు.


స్వామివారు అతన్ని చూసి, కొన్ని ప్రశ్నలు వెయ్యడం మొదలుపెట్టారు…

”వీరు పుట్టిన ఈ రెండు రోజులలో వారు నిజాయితీగా ఉందడమో లేదా కపట బుద్ధితో ప్రవర్తించడమో చేసారని నువ్వు అనుకుంటున్నావా?”


“లేదు వారు కనీసం తమ తల్లిని కూడా గుర్తించలేని చంటిపిల్లలు. కాబట్టి ఈ జన్మలో వాడికి పాపము పుణ్యము అనేది ఏమి లేదు.” అని చెప్పాడు.


మహాస్వామి వారు ”మీ సిద్ధాంతము ప్రకారం ఈ పిల్లలందరూ ఏ పాపము పుణ్యము చెయ్యలేదు కాబట్టి అందరూ ఒకేలాగా ఉండాలి. కాని లేరు. కొంత మంది అరోగ్యం బాగులేదు. కొంత మంది ధనవంతుల పిల్లలు, కొంతమంది కూలివాని పిల్లలు. ఒకేరోజు, ఒకే అక్షాంశం, రేఖాంశం ఒకే ఊరిలో పుట్టిన పిల్లలైనా ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితిలో ఉన్నారు. ఇదే పునర్జన్మ సిధ్ధాంతం” అని చెప్పారు.


ఆ విదేశీయుడు ఈ మాటలను విని స్థాణువైపోయాడు. ఇక్కడే పునర్జన్మ సిద్ధాంతం నిజం అనేది తేటతెల్లమవుతోంది. ఈ పిల్లలందరూ వారి వారి పూర్వజన్మ పాపపుణ్యాల ఫలితంగానే ఈ జన్మలో ఇలా పుట్టారు.


ఆ విదేశీయుడిని చూసి సనాతనధర్మ సాకారరూపం చిరునవ్వు నవ్వుతోంది.


సనాతన ధర్మానికి పుర్జన్మ సిద్ధాంతం ప్రాణం. దాన్ని నమ్ముతాను అని చెప్పడానికే నుదుట బొట్టు పెట్టుకోవడం.


పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం.

భగవద్గీత

 --------------------------భగవద్గీత. ------------------------

                       పంచమోధ్యాయః

                కర్మ సన్యాస యోగము

 


ఇహైవ తైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః ।

నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రహ్మణి తే స్థితాః ।। 19 ।।



ప్రతిపదార్థ:


ఇహ-ఏవ — ఈ జన్మ లోనే; తైః — వారిచే; జితః — జయింపబడును; సర్గః — సృష్టి (జగత్తు); యేషాం — ఎవరైతే; సామ్యే — సమభావము నందు; స్థితం — ఉందురో; మనః — మనస్సు; నిర్దోషం — దోషరహితమై; హి — నిజముగా; సమం — సమ దృష్టి యందు; బ్రహ్మ — భగవంతుడు; తస్మాత్ — కాబట్టి ; బ్రహ్మణి — పరమ సత్యము నందు; తే — వారు; స్థితాః — స్థితులై ఉందురు.


 

తాత్పర్యము : 



సమదృష్టి యందు సంపూర్ణ మనస్సుతో స్థితులైనవారు, ఈ జన్మలోనే జనన-మరణ చక్రమును జయిస్తారు. వారు భగవంతుని యొక్క దోషరహిత గుణములను కలిగిఉంటారు కాబట్టి పరమ సత్యము నందే స్థితులై ఉంటారు.



వివరణ:


శ్రీ కృష్ణుడు 'సామ్యే' అన్న పదం వాడాడు, అంటే, ఇంతకు క్రితం శ్లోకం లో చెప్పినట్టు, అన్ని ప్రాణుల యందు సమ భావమును కలిగినవాడు, అని. అంతేకాక, సమ-దృష్టి అంటే, ఇష్టాయిష్టాలకు, సుఖ-దుఃఖాలకు, కీర్తి-అపకీర్తిలకు అతీతంగా ఉండటం కూడా. ఈ విధంగా ఉండగలిగిన వారు, పదేపదే వచ్చే జనన-మరణ సంసారాన్ని దాటేస్తారు.


మనల్ని మనం ఈ శరీరమే అనుకున్నంతవరకు, ఈ సమత్వ దృష్టి అనేదాన్ని పొందలేము, ఎందుకంటే, శారీరక ఆహ్లాదము మరియు కష్టముల పరంగా కోరికలు, ద్వేషాలు అనుభవంలోనికి వస్తూనే ఉంటాయి. యోగులు శారీరక దృక్పథానికి అతీతంగా ఎదిగి, ప్రాపంచిక బంధాలని త్యజించి, మనస్సుని భగవంతుని యందే లగ్నం చేస్తారు. రామాయణం (రామచరితమానస్) ఇలా పేర్కొంటున్నది:


 


సేవహిఁ లఖను సీయ రఘుబీరహి, జిమి అబిబెకీ పురుష సరీరహి


‘ఒక అజ్ఞాని తన శరీరానికి సేవ చేసినట్టుగా, లక్ష్మణుడు సీతారాములకు సేవ చేసాడు.’


 


ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క మనస్సు ఈ ఆధ్యాత్మిక దృక్పథంలో స్థితమై ఉంటుందో, శారీరక సుఖ-దుఃఖాలపై మమకారాసక్తులకు అతీతుడై, సమత్వ బుద్ధి స్థితిని చేరుకుంటాడు. స్వార్థ పూరిత శారీరక కోరికలని త్యజించటం ద్వారా వచ్చే ఈ నిశ్చలతత్త్వం, వ్యక్తిని ప్రవర్తనలో భగవంతునిలా చేస్తుంది. మహాభారతం ఇలా పేర్కొంటున్నది: యో న కామయతే కించిత్ బ్రహ్మ భూయాయ కల్పతే, ‘కోరికలను త్యజించిన వాడు ఈశ్వరుడిలా అవుతాడు.