ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
7, ఫిబ్రవరి 2023, మంగళవారం
శుభోదయం
🙏 *శుభోదయం* 🙏
నేను ఒక పని గురించి ప్రయాణం చేసే క్రమంలో బస్ ఎక్కాను...
బస్ బయలుదేరింది... కాసేపు ఫోన్స్ మాట్లాడేసి, పిల్లలకు జాగ్రత్తలు చెప్పేసి, సీట్ లో అడ్జస్ట్ అయి, రిలాక్స్ అయ్యాను... ఫ్రీ అయ్యావా అంటూ నా మనసు నన్ను అడిగింది.. హా... ఇంక కాసేపు రిలాక్స్ అవుతాను అన్నాను దానితో.... అంతకన్నా ఎక్కువ నాతో దానికి మాటలేం ఉంటాయి కానీ, వెళ్తున్న పని గురించి ఆలోచించడం మొదలు పెట్టాను... ఒక ఐదు నిమిషాలు అయ్యాక అనిపించింది.. రిలాక్స్ అవ్వాలి అనుకుంటూ ఈ ఆలోచనలు ఏంటి అని... అప్పుడు, ... లేదు.. ఇక ఈ ఆలోచనలు ఆపేసేయ్యాలి అనుకుని... కళ్ళు మూసుకున్నా...
కళ్ళముందు ఉన్న ప్రపంచం మాయమై పోయి, నాకు నేను కనిపిస్తున్నాను.. ఈ శరీరం తో పాటు నేను ట్రావెల్ చేస్తున్నాను...
*ఎవరు ఎవరిని చూస్తున్నారు?* నాతో పాటు అదృశ్యం గా ఉండి ప్రయాణం చేస్తున్నది ఎవరు? ఆ ఎవరు అన్న దానికి జవాబే *నేను* కదా... అదే కదా నా ఉనికి...
ఉంది అని తెలుస్తుంది... కానీ కనబడటం లేదు... మనసు దానిని గుర్తిస్తుంది . కానీ రూపం లేదు... ఇవన్నీ నాలో కలిగే ఆలోచనలు.. కాదు కాదు... అనుభూతులు... బయటి ప్రపంచంతో అనుబంధం ఎలా అనుభవం లోకి వస్తుందో, అలాగే నాలో కలిగే ఈ అనుభూతులు కూడా తెలుస్తున్నాయి... బాహ్యము లోని విషయాలు శరీరానికి అనుభవం అయితే, అంతరం లోని విషయాలు *నేను* కి అనుభూతి...
నాకు నేను ఎప్పుడూ తోడు .. ఈ దేహం ప్రాణం పోసుకున్న దగ్గరినుంచి ఈ దేహం దహనం అయిపోయే వరకు నాకు నేను ఎప్పుడూ తోడు .. *నాకు నేను అంటే??* ఈ దేహంగా ఉన్న నేనుకి ఆత్మగా ఉండే నేను తోడు అని అర్థమయ్యింది... ఇది ద్వైతం... ఒకటి దేహం రెండు ఆత్మ.. ద్వైతం లేదు కదా..అంతా అద్వైతమే కదా మరి ఈ ద్వైత భావన ఏంటి? అని అనిపించింది...
దేహము నేను కాదు.. దానికి భిన్నంగా నేను ఉన్నాను.. ఇది నా ఉనికి అనుకున్నప్పుడు, ఆ దేహభావన మాయమై పోతుంది.. కానీ నా ఉనికి మాయం కాదు... అందులో ఏ మార్పూ ఉండదు...
ఒక్కటి గమనించగలుగు తున్నాను.. అదేంటంటే, కళ్ళు మూసుకున్నప్పుడు మాత్రమే ప్రత్యక్షమయ్యే నేను, ఇప్పుడు కళ్ళు తెరిచి ఉన్నా కూడా నాకు తెలుస్తుంది... నాతో అంటే ఈ దేహంతో పాటు ఉంటుంది.. ఈ దేహం చేసే పనులన్నీ గమనిస్తుంది... ఒక సీసీ కెమెరా లాగా... సీసీ కెమెరా ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది... మరి నేను సంగతి?? ఇది ఆఫ్ అయిపోయేది కాదు... ఈ నేను పుట్టింది కాదు.. గిట్టడం ఉండదు.. ఈ *నేను ఉంది*. అంతే... అప్పుడే ఆ క్షణమే అదే నా ఉనికి అనే సత్యం తెలుసుకున్నాను....
🙏🙏🙏🙏🙏🙏
పంచ భూతాలు - తత్త్వాలు*
*పంచ భూతాలు - తత్త్వాలు*
ఆమె మనసు నిర్మలమైన ఆకాశంలాంటిది; అతను స్వచ్ఛమైన గాలిలాంటివాడు; ఆమె నిప్పులాంటి మనిషి; ఆమె గలగలా పారే నీరులాంటిది; ఆమె సహనం “భూమాత”లాంటిది; ఇట్లా ఎంతో మంది గుణగణాలను, అనేకమంది” పంచభూతా”లతో పోలుస్తూవుంటారు. ఇందులోని విశేషత ఏంటి? ఈ పంచభూతాల తత్త్వం ఏంటి? నా మనసులోని భావాలను మీతో చెప్పాలనుకున్నా. ఆలకించండి:
ఈ విశ్వమంతా పంచభూతాలతో కూడి వున్నది. *ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి అనేవి పంచభూతాలు.* జీవులందరుకూడా ఈ పంచభూతాల సమ్మేళనమే. ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క ప్రత్యేక, విశేషమైన గుణం, ఆ గుణానికి ఒక తత్త్వం ఆధారమై వుంటుంది. ఈ గుణాలు కానీ, వాటి తత్త్వాలు కానీ, కాల,మాన పరిస్థితులకు అనుగుణంగా మారవు. మారేదల్లా, ఈ గుణాలు కలిగిన మానవుల మనసు మాత్రమే. ఇప్పుడు, కొంచెం వివరణలోకి వెళ్ళ్దాం.
*ఆకాశతత్త్వం:-* ఆమె మనస్సు నిర్మలమైన ఆకాశంలాంటిది అని అంటారు. అతని హృదయం ఆకాశమంత విశాలమైనది అని అంటాం. అతని గుణాలు ఆకాశంలాగా మహొన్నతమైనవి అని అంటాం. ఏమిటీ ఆకాశతత్త్వం? మన వేదాల పరంగాగానీ, ఇప్పటి ఆధునిక భౌతికశాస్త్ర పరంగాగానీ చెప్పబడింది ఒక్కటే. అది, ఈ విశ్వమంతా ఆకాశంనుండి పుట్టిందని. అటువంటి ఈ ఆకాశానికి హద్దులు లేవు. వైశాల్యంలొగానీ, ఎత్తులొగానీ ఆకాశానికి పరిమితులులేవు. సూర్యగ్రహాది మండలాలను; నక్షత్ర మండలాలను, ఇంకా ఎన్నో తెలియని మండలాలను తనలొ నింపుకున్నదీ ఆకాశం. జీవులకు కావలసిన ప్రాణవాయువుని అందిస్తుంది. ఎన్నిటికైనా, ఎంతవాటికైనా తనలో స్థానమిచ్చి, ఇంకా తనలో చోటు ఇచ్చేందుకు తయారుగావున్న ఈ ఆకాశం బహు వినమ్రతతొ కనిపిస్తుంటుంది. శ్రమతొ అలసిన మనసు, నిర్మలమైన ఆకాశంవైపు చూడగానే ఎంతో శాంతన పొందుతుంది. మరి, మన మనసుకూడా ఈ గుణాలను పుణికి పుచ్చుకుంటే బాగుంటుంది కదా!!
*వాయుతత్త్వం:-* అడిగినా, అడగకపోయినా, వాయువు ప్రాణకోటికి అవసరమైన ప్రాణవాయువును అందిస్తుంది. అది చొరబడలేని ప్రదేశమే లేదు. నీటిలొ కూడా కరిగి, నీటి అడుగుకు చేరుకోగలదు. ఎంత చల్లటి గాలి ఈ గాలి; ఎంత కమ్మని గాలి ఈ గాలి అని పాటలుకూడా పాడుకుంటుంటాం. కానీ, గమనించాలిసిన ముఖ్య విషయమేమిటంటే, గాలి, తనకు తానుగా ఎటువంటి గుణాలను ఆపాదించుకోదు. తాను ఎప్పుడూ ఒకే రకంగా వుంటుంది. ఒక చోటనుంచి, మరొక చోటకు పయనిస్తుంటుంది. ఉదా:- ఒక మల్లె పూతోటపైనుంచి గాలి పయనిస్తుందనుకోండి. ఆ మల్లెల పరిమళాన్ని తనలొ నింపుకొని, తనతో కలుపుకొని, ముందుకు తీసుకువెళ్ళ్తుంది. అంతమాత్రాన గాలి మల్లెలగాలి అయిపోదు. పరిమళం ఎంత దూరం రాగలిగితే, అంత దూరం తీసుకుపోతుంది. ఆ తరువాత, పరిమళం యొక్క ప్రయాణం ఆగాల్సిందేకానీ, గాలి పయనం మాత్రం కొనసాగుతూనే వుంటుంది. ఎటువంటి వాసనలు లేకుండా. అదేవిధంగా దుర్గంధం వెదజల్లుతున్న చెత్త మీదుగా గాలి పయనిస్తుందనుకోండి. చుట్టుపక్కలున్న వారు ఆ గాలిని భరించలేక “చెత్తగాలి, చెడుగాలి” అని ఆడిపోసుకోవచ్చు. గాలి చెడుది కాదు; వాసన మాత్రమే చెడుది. చెత్తలోని చెడు వాసన కొంత దూరమే ప్రయాణించి, ఆగిపోతుంది, కానీ, గాలి మాత్రం ముందుకు సాగుతూ వుంటుంది. అక్కడవారికి, ఆ గాలి మంచి గాలే మరి! అంటే, మంచి, చెడు సాంగత్యం లేదా పొత్తు వలన, తాత్కాలికంగా, గాలి మంచి గాలి/ చెడు గాలి అని పేరు పడిందే కానీ, గాలి ఎప్పుడూ స్వచ్ఛమైనదే. మరి, ఇతరులకు ప్రాణ సహాయం చేసే గుణం, అవసరమైన చోటెక్కడకైనా చొచ్చుకుపోయే గుణం, మంచి, చెడులతొ తనకు బంధంలేకుండా, స్వచ్ఛతతో మనగలిగే గుణాలు, మన మనసులోకి నింపుకుంటే బాగుంటుందికదా!!
*అగ్నితత్త్వం:-* నిజం నిప్పులాంటిది అంటాం. అంటే, నిజాన్ని ఎప్పటికీ దాచివుంచలేం. అట్లాగే, నిప్పును ఎప్పటికి కప్పిపెట్టలేం. నిప్పుని గురించి ఎక్కువగా చెప్పనక్కరలేదు. ఎక్కువసేపు పట్టుకుంటే మన చేయి కాలుతుంది. అగ్నికి, ఒక గొప్ప గుణం వున్నది. తనలోకి ప్రవేశించిన దేనినైనా అది భస్మీపటలంచేస్తుంది. ఏ వస్తువైనా నామరూపాల్లేకుండా పోవాల్సిందే. కానీ, తను మాత్రం దేదీప్యమానంగా వెలుగుతూనే వుంటుంది. ఎటువంటి మాలిన్యాన్ని అంటించుకోదు; కానీ, మాలిన్యాన్ని మంచి నుంచి వేరుచేస్తుంది. అగ్నిని మనం ఎంత ప్రేరేపిస్తే, అది మనకు అంతగా దోహదపడుతుంది. ఉదా:- ముడి బంగారాన్ని అగ్నిలొవేసి, కాలిస్తే, మలినాన్ని తొలగించి, స్వచ్ఛమైన బంగారాన్ని మనకు అందిస్తుంది; వనమూలికలను అగ్నిలొ వేసి కాలిస్తే, వాటిని మండించి, పరిసరాల్ని శుచి చేస్తుంది. మరి, నిప్పులాంటి ఈ గుణాన్ని మన మనసుకు అంటించితే, మన మనసు మేలిమి బంగారమే అవుతుంది కదా!!
*జలతత్త్వం:-* జలం, పుట్టుకతోనే స్వచ్ఛమైనది. ఎట్లా అంటారా? నీరు ఆవిరై, మేఘాలలొ నిభిఢీకృతమై వుంటుంది. తిరిగి, భూమిపైకి చేరే నీరు, కొండలపై పడి, క్రిందకి జారుతూ, కొండలపైవున్న ఔషధ మొక్కలు, లవణాల ద్వారా మరింత శుభ్రపడి, నదులలోకి చేరుకుంటుంది. దాహార్తితో వున్న వారి దప్పికను తీర్చే గొప్ప సుగుణం దీని ప్రత్యేక గుణం. రైతన్నలకు ప్రత్యక్ష దైవం. హనుమంతుడిలాగా, తన స్వయం శక్తి తనకు తెలియనది. ఎవరైనా కోరుకుంటే, తనలో నిభిఢీకృతమైవున్న “బఢబాగ్ని” (విద్యుచ్ఛక్తి) ని బయటకు తీసుకువస్తుంది. అప్పుడు కూడ సహాయపడే గుణమే దానిది. ఏరులు వాగులై, వాగులు చెరువులై, చెరువులు నదులై; నదులు సముద్రాలైనా, జలం తన పరిధులను దాటదు. సముద్రంలొ అలలు అకాశాన్ని అంటినా, తీరాన్ని దాటకుండా తన హద్దులను గుర్తెరిగే వుంటుంది. మరి, దాహార్తితో వున్న వారి దప్పిక తీర్చే గుణంలాంటి గుణం మన మనసు కూడా అలవర్చుకుంటే. మన మనసు జల,జలమని స్వచ్ఛంగా పారదా?!
*భూతత్త్వం:-* అమ్మ తరువాత, అమ్మ స్థానం పొందినవి భూమిమీద రెండే రెండు. ఒకటవది: భూమాత; రెండవది: గోమాత. అమ్మ, తన బిడ్డని పొట్టలో నవమాసాలూ మోస్తుంది. తన బిడ్డ వదిలిన మల,మూత్రాలను తన కడుపులొ వుంచుకుంటుంది. తన బిడ్డకు కావాల్సినవన్నీ ఇచ్చి, పండంటి బిడ్డకు జన్మ నిస్తుంది. పెంచి పోషించిన తనను పెద్దవుతున్న బిడ్డ లెక్క చేయకపోయనా, బిడ్డ చేసిన తప్పులను తన కడుపులోనే వుంచుకొని, తన బిడ్డకు ఉజ్జ్వల భవిష్యత్తును ఇవ్వటానికి కృషి చేస్తుంది అమ్మ. అదేవిధంగా, భూమాత, తన కడుపుని చీల్చినా, తనవారే గదా అని, తనలో దాగివున్న నీటిని, వజ్ర, వైఢూర్యాలను, ఖనిజాలను తన బిడ్డలకు ఇస్తుంది. గింజలు నాటితే. పోషకాలు అందించి, పంటలు పండించి, తన బిడ్డలకు ఆహారాన్ని తయారుచేసి ఇస్తుంది. తనలో నదులను, సముద్రాలను, బడబాగ్నిని అదుముకొని, తన బిడ్డలకు హాని కలుగకుండా చూస్తుంది. తనపై ఎంత భారాన్ని వేస్తున్నా, సహించి, తన బిడ్డలకు ఆధారంగా వుంటుంది. ఇంతటి సహన శక్తి కలది కాబట్టే, ఆమెను భూమాత అన్నారు. మరి, అంతటి సహన శక్తి అనే గుణం మన మనసుకు తోడైతే, యుద్ధాలకు, వైషమ్యాలకు తావెక్కడుంటుంది?
ఉపసంహారం:- పరిశోధకులు, రచయుతలు, విజ్ఞానులైన మన ప్రాచీన ఋషులు వేదాల ద్వారా ఎంతో జ్ఞానాన్ని మనకు అందించారు. ప్రతి విషయాన్ని, అర్ధం కావటంకోసం, ఎన్నో ఉపమానాలు, కధలు చెప్పి, తత్త్వ జ్ఞానాన్ని మనకు తెలియచేశారు. ఆ తత్త్వ రహస్యాల్ని మనం తెలుసుకొని, మననం చేసుకుంటూ, ఆచరణలొ పెట్టినట్లైతే మానవుడే మాధవుడవుతాడు అని చెప్పటానికి సంశయించే అవసరం లేదనుకుంటాను.
🙏🙏🙏🙏🙏
భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు
🙏 *ఓం నారాయణ- ఆదినారాయణ* 🙏
*గ్రంథం:* సర్వసమర్థుడు , భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు
*రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్
*అవధూత లీల పారాయణ మహత్యం*
పి.సీతారామాంజనేయులు, భవానీపురం, విజయవాడ వారి అనుభవాలు..
నేను సుమారు 11 మాసాలనుంచి సరిఅయిన ఉద్యోగంలేక, అనారోగ్యంతో (కిడ్నీ వ్యాధితో), నేను చేస్తున్న ఉద్యోగంలో కూడా జీతం సరిగ్గా రాక, సుమారు 87,000/- రూపాయలు కంపెనీ నాకు బాకీ పడింది. అది రాక, ఉద్యోగం చేయక, మానసిక మనస్పర్ధలతో ఉండగా శ్రీభరద్వాజ సత్సంగ మండలి, భవాని పురం రాజా మాష్టారిగారి 2 సత్సంగాలకు హాజరయ్యి శ్రీ గురుచరిత్ర పారాయణాన్ని 2. ఏకాహాలు, 5 సార్లు సప్తాహాలు పూర్తి చేశాను. ఆ సత్సంగ సభ్యులు అయినటువంటి శ్రీ శ్రీనివాస్ గారి సలహా మేరకు రెండువేల రూపాయలు అప్పు తెచ్చుకొని గొలగమూడి శ్రీ వెంకయ్యస్వామి వారిని 12-02-2002 న మొదటిసారిగా దర్శించాను.
13వ తారీఖున (13-02-2005) ఓంగోలులోనే శ్రీ భరద్వాజ మాష్టారిగారి సమాధిని దర్శించి శ్రీ వెంకయ్యస్వామి వారి "అవధూత లీల" 3 సప్తాహాలు వరుసగా చదువుతాను అనుకొని నాకు కంపెనీ బాకి ఉన్న డబ్బులు రావాలి, మంచి ఉద్యోగం రావాలని స్వామివారిని కోరుకుని, 13-02-2005 న విజయవాడ చేరి 14-02-2005 నుంచి అవధూతలీల పారాయణ ప్రారంభించాను. చిత్రంగా ఆరోజు కిడ్నితో చాలా బాధపడి 3 రాళ్ళు బయటికి వచ్చాయి. దానికి నేను ఏ మందులు వాడలేదు.
పారాయణ మాత్రము చేతనే నాకు అట్టి భాగ్యమును శ్రీ వెంకయ్యస్వామి వారు ఇచ్చినారు. అట్లాగే అవధూత లీల 2 సప్తాహాలు పారాయణ అయిన వెంటనే పాత కంపెనీ వారు పిలచి 20,000/- (ఇరవై వేల రూపాయలు) ఇస్తామని ఉద్యోగం చేయమని. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి మీరు డీలరుగా ఉండి, వ్యాపారాన్ని సాగించమని దానికిగాను జీతంగా కాక, 12% కమీషన్తో వారి వ్యాపారంలో నాకు మార్కెటింగ్ అవకాశం కల్పించారు. 12-02-2005 నుంచి 12-05-2005 వరకు సుమారు అరవై వేల రూపాయలు నాకు వచ్చాయి. నా మానసిక ఆర్థిక పరిస్థితులు *కేవలం శ్రీ స్వామి వారి చరిత్ర పారాయణ వలన మెరుగయ్యాయి*, ఆ మహానీయనికి ఎప్పటికి ఋణపడిఉంటాను.
🙏 *ఓం నారాయణ -ఆది నారాయణ*🙏
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీ మాష్టారు గారి బోధల లో కొన్ని ముఖ్యమైనవి
తైలధారవలె చేయు నామస్మరణతో మాత్రమే మన పాపాలు కడిగివేయ (దహించి) బడతాయి. అందుకని స్నానం చేసేటప్పుడు, పళ్ళుతోముకొనేటప్పుడు, బట్టలుతికేటప్పుడు, అన్నం వండేటప్పుడు, తినేటప్పుడు, రోడ్డున నడిచేటప్పుడు, మలమూత్రవిసర్జనప్పుడు, ఇల్లు సర్ధుకునేటప్పుడు నామ స్మరణ తప్పకుండా చేయాలి.
గురుస్తుతి నిద్రలేచినప్పుడు మరియు నిద్ర కుపక్రించే టప్పుడు వీలైనంతసేపు సద్గురువు మనకిచ్చిన అనుభవాలను మననం చేయాలి.
ఖాళీ సమయాల్లో పచ్చిసెనగలు/బియ్యం నామస్మరణతో ఏరి వాటిని ధునికి సమర్పించాలి.
ప్రదక్షిణ మందిరంలోకుదరకపోతే ఇంట్లో కుర్చీలో పటం పెట్టుకొని ప్రదక్షిణ చేయాలి.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్లోకం:☝️
*గుణేషు యత్నః క్రియతాం*
*కిమాటోపైః ప్రయోజనం ll*
*విక్రియంతే న ఘంటాభిః*
*గావః క్షీరవివర్జితాః ll*
(మహాభారతం)
భావం: మన వ్యకిత్వాన్ని మరియు సామర్థ్యాలను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించాలి. కేవలం బాహ్య ప్రదర్శన వల్ల ఉపయోగం ఏమిటి? వట్టిపోయిన పశువులను కేవలం మెడకు కట్టిన గంటలను ప్రదర్శించి విక్రయించలేము కదా.
ఉరు తున్న విద్య కావలి
:
పిల్లలు కు ఉరు తున్న విద్య కావలి, (బావి లో నీరు తోడుతున్న నీరు ఊరుతుంది )అలాంటి విద్య కావలి. భగవద్గీత శ్లోకాలు, Morls (విలువ లు )కావాలి అప్పుడు సంస్కారం ఏర్పడి తుంది. కాని"" మనం కేవలం డబ్బు తో కొనుక్కునే విద్య నేర్పిస్తున్నాము "". భవిష్యత్ లో ప్రమాదం జరుగుతుంది. (కేవలం ""లాభం, నష్టం తో కూడు కొన్న విద్య నెరుపు తున్నాం )అది దాని వల్ల పెద్ద అయినా తరువాత "తల్లి తండ్రి ని చూడాలి అంటే లాభం నష్టం లు చూస్తారు ". తరువాత దేవుడు,ని మతం ని మార్చుతారు ". అది మనకు అవసరం మా?(ప్రతి మనిషి పుట్టినది భగవద్గీత రహస్యం ములు తెలుసుకోవాడానికే అని మీకు తెలుసా? ఇది గమనించగలరు )అందుకే శరీరం సంపాదన మాత్రమే కాకూడదు.
: శ్లోకం:☝️
*యథా రాత్రిః సమయః*
*కథయతే న కథితమ్ ।*
*తథా మనః సమయే*
*సతి న సతి కర్తవ్యమ్ ॥*
భావం: అసలు ఏమీ మాట్లాడకుండానే, మనస్సు ఏమీ ఆలోచించకుండానే, ఏ పనీ చెయ్యకుండానే రాత్రి గడిచిపోతుంది.
సమయం నిరంతరం సాగిపోతూ వుంటుంది కనుక మన జీవితాలను మెరుగుపరచని విషయాలపై సమయాన్ని వృథా చేయకుండా, ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవడంపై దృష్టిపెట్టాలని భావం.
[: *నేను 3 దోషములు/పాపములను చేశాను. నన్ను క్షమించు” అని ప్రాధేయ పడ్డారు శ్రీ ఆది శంకరాచార్యులు వారు.*
శ్రీ ఆది శంకరాచార్యుల వారు , శిష్యులతో కాశి విశ్వేశ్వర ఆలయాన్ని దర్శించారు.
గంగా నదిలో స్నానము చేసి, దర్శనానికి ఆలయము లోపలకి వెళ్లి, విశ్వేశరుని ఎదుట
“నేను 3 దోషములు/పాపములను చేశాను. నన్ను క్షమించు” అని ప్రాధేయ పడ్డారు.
ఇది విన్న శిష్యులు “ఆచార్యులవారు, ఏమి పాపము లు చేశారని ప్రాయశ్చిత్త పడుతున్నారు ?” అని అనుకున్నారు.
ఒక శిష్యుడు, ఏమిటి ఆ పాపము నేను తెలుసుకోవాలి అని ఆచార్యుల వారిని అడిగాడు. దానికి శ్రీ ఆది శంకరాచార్య ఇలా సమాధానము చెప్పారు.
1. “నేను భగవంతుడిని సర్వాంతర్యామి, సర్వవ్యాపి అని వాక్కుతో స్తుతించాను. సృష్టి అంతా నిండి ఉన్న ఆ విశ్వేశ్వరుడిని చూడడానికి మటుకు కాశి నగరానికి వచ్చాను. అంటే మనసా వాచా కర్మణా నేను నమ్మిన సత్యాన్ని నిత్య జీవితంలో ఆచరించలేక పోయాను.
అది నేను చేసిన మొదటి దోషం.
2. తైత్త్రియ ఉపనిషద్ లో “యతో వాచో నివర్తన్తే , అప్రాప్య మనసా సః ” భగవంతుడు మన బుద్ధికి ఆలోచనకి అందని వాడు” ఇది తెలిసి కూడా శ్రీ కాశి విశ్వనాధ అష్టకం వ్రాశాను. ఇది నేను చేసిన రెండవ తప్పు.
3. నిర్వాణ శతకం లో
“న పుణ్యం న పాపం, న సౌఖ్యం న దుఃఖం. న మంత్రో న తీర్తం, న వేదా న యజ్ఞః
అహం భోజనం, నైవ భోజ్యం న భోక్త. చిదానందరూపం శివోహం శివోహం“ అని వ్రాశాను.
అర్థము :
నాకు పాప పుణ్యములు, సుఖ దుఃఖములు లేవు. మంత్ర జపములు తీర్థసేవలు , వేద యజ్ఞములు లేవు. భోజన పదార్థము, భోజనము, భోక్త (భుజించేవాడు) నేను కాదు!నేను చిదానంద స్వరూపుడను, శివుడను, శివుడను!
ఇంత వ్రాసికుడా నేను తీర్థయాత్రలు చేస్తున్నాను అంటే నేను వ్రాసినవి, చెప్పినవి నేనే పాటించటంలేదు. అందుకనే నేను చేసిన ఈ మూడు తప్పులని మన్నించమని ,ఆ భగవంతుడిని క్షమాపణ కోరుకుంటున్నాను.
నీతి :
మన ఆలోచన, తీరు, మాటా అన్ని ఒకే లాగా ఉండాలి అని శ్రీ ఆది శంకరాచార్యుల వారి కథ మనకి తెలియజేస్తోంది.
*బయట ప్రపంచం మన పని తీరుని మట్టుకే చూస్తుంది. భగవంతుడు మాత్రం మన పని వెనక సంకల్పాన్ని , ఉద్దేశాన్ని కూడా చూస్తాడు.*
*“మనస్ ఏకం , వచస్ ఏకం , కర్మణ్యేకం!”*
ఈ సూక్తి శ్రీ ఆదిశంకరాచార్యుల వంటి ఎందరో మహాత్ములు, స్వయంగా తమ జీవితంలో త్రికరణ శుద్ధితో, ఆచరించి మనకు చూపించిన యధార్ధమైన మార్గము🙏
: శ్లోకం:☝️కవి ప్రశంస
*ఉదయంతు శతాదిత్యాః*
*ఉదయంత్విందవః శతం l*
*న వినా కవివాక్యేన*
*నశ్యత్యాభ్యంతరం తమః ll*
భావం: వంద సూర్యబింబాలు ఉదయించవచ్చు, నురు పూర్ణ చంద్రోదయాలు కావచ్చు. కానీ మానవ హృదయాల్లోనున్న అజ్ఞానాన్ని కవివాక్కు మాత్రమే పోగొట్టగలదు.ఏక కాలికమైన అంశాన్ని సార్వకాలికం చేసేవాడు కవి. వ్యక్తిగతమైన అంశాన్ని సమాజగతం చేసేవాడు కవి. క్షణికమైన దానిని శాశ్వతం చేసే వాడు కూడ కవే. బ్రహ్మానందంతో ఇంచుమించు సమానమైన ఆనందాన్ని తన కావ్యం ద్వారా పాఠకునికందిచే వాడు కూడా కవే!🙏
: 🙏 *శుభోదయం* 🙏
ఎప్పుడైనా నలుగురికి పెట్టే చెయ్యి కావాలి మనది అనీ,...
మన చెయ్యి ఎప్పుడూ ఇచ్చే చేయిగా పైన ఉండాలి కానీ, తీసుకునేది గా కింద ఉండకూడదు అని....
మన పెద్ద వాళ్ళు మనతో చెప్పడం మనకు తెలుసు...
దీని యొక్క అంతరార్థం ఏమిటి అనేది నాకు ఇప్పుడు బోధ పడింది...
*ఇచ్చేది ఎప్పుడూ శక్తిమంతమే .. తీసుకునేది ఎప్పుడూ బలహీనమే...*
మనము అంటే జీవులం.... శరీర ధారులం... ఈ
జీవము లేదా ప్రాణము ఒక ఉపాధిని ధరించింది కాబట్టి జీవధారులం...
అది ఒక ఉపాధిలో ఉంది కాబట్టి జీవాత్మ .. నిజానికి ఆ ప్రాణానికి, ఆ జీవానికి ఆకారం లేదు .అదే పరమాత్మ...
పరమాత్మ నిరాకారుడు... అశరీరి.. సర్వ శక్తిమంతుడు... సర్వవ్యాపకుడు... అవ్యక్తుడు..
జీవి శరీరి... వ్యక్తమై, ఒక రూపంతో ఉంటాడు ఒక దేహంతో ఉంటాడు కాబట్టి వ్యక్తి అంటున్నాము...
*ఇక్కడే కొంచం జాగ్రత్తగా గమనిస్తే ..*.
ఈ రూపానికి ఒక లక్షణం ఉంది... దేన్నైనా ఆకర్షించే లక్షణం.. అంటే తీసుకునే లక్షణం..
*దేహము అంటే శరీరం అని కదా అర్థం... మరి దేహి అంటే??*
*దేహి అంటే యాచకుడు .. తీసుకునే వాడు, పుచ్చుకునే వాడు..*
*దాత ఇచ్చేవాడు..*
మామూలుగా అయితే *మనమంతా యాచకులమే... దాత పరమాత్మ మాత్రమే*...
ఇక్కడే మన పెద్దలు దాతగా ఎందుకు ఉండాలన్నారు అనే దాంట్లో అంతరార్థాన్ని గ్రహిస్తే...
*నేను - అహం.* ను .ఈ శరీరముగా భావిస్తే ఆకారం దాల్చుతుంది... అది అహంకారం...
అప్పుడు అది యాచకత్వ లక్షణం కలిగి ఉంటుంది...
*నేను - అహం* ను ఈ శరీరం కాదని భావిస్తే నిరాకారంగా మారుతుంది.. అప్పుడే శక్తిగా చైతన్యంగా నన్ను నేను తెలుసుకోగలను.. అప్పుడు అది దాతృత్వ లక్షణంతో ఉంటుంది ..
*శక్తి అంటే బలం అని అర్థం*
*ఆర్థికంగా బలంగా ఉంటే నలుగురికీ సహాయం చేయగలం...*
*కండ బలం ఉంటే, ఆపదలో కాపాడ గలం..* *మానసిక బలం ఉంటే, ఇతరులకు ధైర్యాన్ని ఇవ్వగలం...*
*ఇక్కడ ఏం అర్థం అయ్యింది?*
*ఇక్కడ ఇవ్వడం మాత్రమే ఉంది .. తీసుకోవడం లేదు...అంటే అది దాత లక్షణం .*
*మనము శక్తి మంతులం కావాలి.. నిరహంకారిగా ఉండాలి.. దాతగా మారాలి*
*అహం* కు ఈ శరీరం జోడించి, అహంకారిగా ఉండ కూడదు..
*అహం* ను ఆత్మగా గుర్తించి శక్తి మంతులం కావాలి...
అప్పుడు యాచకత్వ లక్షణం ఉండదు కాబట్టి నేను దాతను అవుతాను.. దాతృత్వం పరమాత్మ లక్షణం......
*అహంకారంతో జీవాత్మగా ఉండొద్దు .. "అహం" గా పరమాత్మగా ఉండాలని మన పెద్దవాళ్ళు చెప్పిన మాటలోని అంతరార్థం..*.
*ఇది కదా ఈ జీవి యొక్క పరమార్థం...*
అందరి చేయి పైనే ఉండాలని కోరుకుందాం ..
*తథాస్తు...తథాస్తు... తథాస్తు..*.
🙏🙏🙏🙏🙏🙏🙏
: 🙏 *ఓం నారాయణ- ఆది నారాయణ* 🙏
*గ్రంథం:* సర్వసమర్థుడు , భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు
*రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్
*పిలిచిన పలికే దైవం*
కనగర్ల ధర్మ లక్ష్మి గారు, భీమడోలు, ప||గో॥ జిల్లా, శ్రీ స్వామివారి మహిమను ఇలా వివరిస్తున్నారు.
మా ఇంటి పక్క నివసించే చెల్లాయమ్మగారు ఒకరోజు చాలా విచారంగా కూర్చోనున్నారు. నేను కారణమడిగితే తన బర్రెకు రొమ్ము దగ్గర కురుపు లేచి చాలా బాధ పడుతుందని, పడుకోలేక లేవలేక కష్టపడుతుందని, తన కుమారుడు రోజూ వేయించే 350/ ఇంజెక్షన్ ఈ రోజతడు లేని కారణంగా వేయించలేకున్నానని ఎంతో దీనంగా చెప్పింది. వెంటనే నేను ఆ బర్రెకు శ్రీ వెంకయ్యస్వామి వారి దారం కట్టి, విభూతి పెట్టి ఏమీ బాధపడవద్దు తప్పక తగ్గుతుందని ధైర్యం చెప్పి వచ్చాను.
ఆ రాత్రి నన్నెవరో తరుముకుంటునట్లు స్వప్నమొచ్చింది. నిద్ర లేచి ఆలోచించాను... శ్రీ స్వామివారు ఆ బర్రె జబ్బును తరుముతున్నారని తోచి శ్రీ స్వామి వారిని ఇలా ప్రార్ధించాను. "స్వామి నాకు కాదు మీరు కనిపించవలసినది, ఆ బర్రెగల చెల్లాయమ్మగారికి కనపడండి" అని చెప్పుకున్నాను. అదే రాత్రి నేను పూల చీర కట్టుకొని చెల్లాయమ్మ గారింట్లోకి వెళ్ళినట్లు ఆమెకు స్వప్నమొచ్చిందట. ఆమె నిద్రలేచి తలుపులన్నీ వేసి ఉంటే ధర్మలక్ష్మి ఇంట్లోకెట్లా వచ్చిందబ్బా అని ఆలోచించి పడుకున్నది. తెల్లవారికి ఆ బర్రెకు కురుపు కాదు గదా కురుపున్నచోట మచ్చ కూడా లేకుండాపోయింది.
ఆ కరుణామయుడు బర్రెకు నయం చేయడమే గాక, స్వామి తమరు చెల్లాయమ్మ గారికి కనిపించండి అని నేను చెప్పుకోగానే నా రూపంలో ఆమెకు స్వప్న దర్శనమిచ్చారు. పిలువగానే పలికే సద్గురుమూర్తిని తగినట్లు సేవించే భాగ్యమెమ్మని ప్రార్ధిస్తున్నాను..
🙏 *ఓం నారాయణ - ఆది నారాయణ*🙏
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*ఆపద వచ్చాక ...వారిని ప్రార్థించడం... ఆపద తొలగించుకోవడం.. చాలా హీనమైన మార్గము*
*అసలు వారి చరిత్ర పారాయణ , పూజ, ధ్యానం చేసుకుంటుంటే ....మనకు ఆపద రాకముందే ....దాని నుండి ఎలా తప్పుకోవాలో వారు ఆదేశిస్తారు.*
*ఒక్కొక్కసారి అలాంటి ఆదేశం లేకుండా మనమే ఆ ఆపద తప్పుకునేటట్లు ప్రవర్తించేలా చేస్తారు.*
*ప్రారబ్ధం బలీయంగా ఉంటే... ఆ ప్రారబ్దాన్ని స్వప్నాలలో అనుభవింప చేయడం కూడా కలదు*
*కనుక వారిని ఆశ్రయించడంలో ఉన్నంత మేలు , ఇతరత్రా ఏ విధంగానూ లేదని నా స్వానుభవం తెలుపుతుంది.*
*అన్నదానం గొప్పదే అయిన అది ఆకలి తీర్చగలదు... కానీ హృదయ పరివర్తన కలిగించలేదు*
*రాగద్వేష అసూయాది భావాల్లో గాని, సాటి వ్యక్తుల పట్ల, సంఘటనల పట్ల... మన యోచనా రీతిని గాని కించిత్ కూడా అన్నదానం మార్పును తేలేదు*
*కానీ సత్సంగము ...మనుషులలో పరివర్తన తెచ్చి , ధర్మ ప్రవృత్తి కలిగించి ...జన్మ పరంపరలనే మారుస్తుంది . అందుకనే అట్టి విద్యాదానం ముల్లోకాలు దానమిచ్చినంతటి గొప్పదని భారతంలో వ్యాసుడు రాశాడు*
*సాయిని ప్రచారం చేయి ....నీకు కలిగిన అనుభవాలు ఇతరులతో చెప్పు.... సాయి లీలామృతం ఇతరులకు ఇవ్వు ....దాని ఫలితం చాలా గొప్పది. ఎన్నో యాగాలు చేసిన ఫలితం వస్తుంది. నీవు చేయవలసిన ప్రచారం ఇదే.*
*మట్టి మట్టిలో,శ్వాస వాయువులో కలిసిపోతాయి....ఈ అవకాశం మరలా రాదు*
*ఈ వచ్చిన సదవకాశాన్ని... ఆస్తిపాస్తులు వెనకేసుకొనే - పిడకలేరుకునే పనికి స్వస్తి చెప్పి.... సద్గురువుని తెలుసుకునే కృషి చెయ్యి*
వారిని గురించి తెలుసుకున్నాక వారిని త్రికరణ శుద్ధిగా సేవించు* *ధనం అశాశ్వతం...భగవంతుడు ఇచ్చింది తరగదు...మానవులిచ్చింది నిలువదు.*
*సాయి మందిరం చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేశామన్నది లెక్కవేసుకోవడం కాదు... ఆ ప్రదక్షిణలలో.. ఎన్ని ప్రదక్షిణలు చేసినంతసేపు మన మనస్సు వారి దివ్య పాదారవిందములపై నిలిచిందో చూసుకో..*
*ప్రదక్షిణల సంఖ్య కాకుండా, టైం పెట్టుకుని... నీ మనసు శ్రీ స్వామివారి చుట్టూ ఏ మారకుండా తిరిగేటట్టు చూడు*
*దత్త స్వరూపులు .. పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు*
🙏🌹🙏🙏🙏🙏🙏
సాధకుడికి ఉండవలసిన లక్షణాలు మూడు
🙏 శుభోదయం 🙏
దేన్నైనా సాధించాలంటే సాధకుడికి ఉండవలసిన లక్షణాలు మూడు..
*నిర్మలత్వం,*
*నిర్భయత్వం,* *నిశ్చలత్వం....*
*నిర్మలత్వం* అంటే శుద్ధమైన, సకారాత్మక ఆలోచనలతో, మనసును పూర్తిగా స్వచ్ఛంగా ఉంచడం.... పాజిటివ్ ఆలోచనలతో మనసును ప్రశాంతంగా ఉంచడం...అన్నమాట..
*నిర్భయత్వం* అంటే సంకల్పాన్ని సిద్ధింప చేసుకోవడంలో ఓటమి భయం లేకుండా, ఎలాంటి స్తితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండటం...
ఒక రకంగా ఇది రిస్క్ చేయడానికి కూడా వెనుకాడని తత్వం....అన్నమాట....
*నిశ్చలత్వం* అంటే సంకల్ప సాధనలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా, ఎన్ని అవమానాలు, నిరుత్సాహ పరిచే మాటలు ఎదురైనా, తొణక కుండా, ఏ మాత్రం పట్టించుకోకుండా లక్ష్య సాధన వైపు ప్రయాణించడం.... అంటే ఎవరైనా ఏమైనా అనుకొనీ, డోంట్ కేర్ అన్నట్టుగా ఉండటం అన్నమాట....
ఈ మూడు లక్షణాలనూ అలవరచుకుని ప్రతి సాధకుడూ వారి వారి సంకల్పాలను సిద్ధింప చేసుకుందురు గాక....
*తథాస్తు...తథాస్తు...తథాస్తు...*
సద్బోధ
*సద్బోధ*
➖➖➖
*నమ్మకం, విశ్వాసం, ప్రేమ తత్వం కృతజ్ఞతా భావం క్షమాగుణం సేవా భావాన్ని కలిగి యుండడం అనేది గొప్ప అధ్యాత్మిక ధ్యాన మార్గం..! పైవన్నీ సరైన సాధన మార్గం ద్వారా మాత్రమే సాధ్యం..! కష్ట సుఖాలు అనేవి పూర్వ జన్మ మంచి చెడు కర్మలు మీద ఆధారపడి ఉంటాయి. మంచి కర్మలు చేసుకున్నవారు అధ్బుతంగా జీవిస్తూ సరైన సాధన ద్వారా ఇంకా ఇంకా మరికొంత మంచి కర్మలు చేస్తూ అపూర్వంగా ఎదిగిపోతారు.*
*చెడు కర్మలు ఆధారంగా జన్మ తీసుకున్నవారు రకరకాల సమస్యలతో బాధపడుతున్నవారు సరైన సాధన ద్వారా చెడు కర్మలు దగ్దం చేసుకొని ఆనందకరమైన జీవితాన్నీ అనుభవిస్తారు.*
*ఏది కావాలన్నా ఏది పొందాలన్నా ఏది చేయాలన్నా సరైన సాధన మాత్రమే మూల సూత్రం అని ఎందరో మహానుభావులు చెప్పారు.*
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
లోకాః సమస్తాః సుఖినోభవన్తు!
*సద్బోధ*
➖➖➖
*"ఇతరులు తప్ప, తాను మాత్రం తప్పు చేయను" అనుకోవడం..*
*ఎందరో తనకళ్ళముందు మరణించడం చూస్తున్నా "తాను మాత్రం దీనికి అతీతుడను" అకోవడం..*
*ఇది అజ్ఞానం - భ్రమ - పరమాత్ముని లీలలను అర్థం చేసుకోక పోవడం.. కృతజ్ఞతా భావం లేక పోవడం."తానే జ్ఞాని "అనే అహంకారం, తుచ్చమైన సంపదలు - శరీరం పై మమకారం మనిషి వినాశనానికి కారణం అవుతున్నాయి.*
*దేవాలయదర్శనం, సద్గురువుల సేవ రామాయణం మొదలైన భాగవత గ్రంథాలు శ్రవణం చేయడం చదవడం, నిరంతర ఆధ్యాత్మిక చింతనం - సాత్విక ఆహారం మొదలైన ఉత్తమ సాధన ప్రక్రియలద్వారా మాత్రమే - ఉత్కృష్టమైన ఈమానవజన్మను సార్థకం చేసుకొనగలుగుతాం...*
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷
లోకాః సమస్తాః సుఖినోభవన్తు!
: *శ్రీ స్వామిమలై-సుబ్రహ్మణ్య స్వామి*
*ఆ క్షేత్ర విశేషాలు:*
*తమిళనాడు రాష్ట్రంలో తంజావూరు జిల్లాలో కుంభకోణం సమీపంలో ‘స్వామిమలై’ ప్రసిద్ది చెందిన దేవాలయం.*
*’స్వామి మలై’ అంటే దేవుని పర్వతం అని అర్థం.*
*తమిళనాడులో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి వారికి ఉన్న ఆరు ముఖ్యమైన క్షేత్రాలలో ఈ ఆలయానికి ఒక గొప్ప విశేషం ఉంది.*
*సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడు తన కుమారుని తెలివితేటలకు మురిసిపోయి పుత్రోత్సాహం పొందిన స్థలమిది.*
*సుబ్రహ్మణ్వేశ్వరుడు తన తండ్రిని శిష్యునిగా చేసుకుని తను గురువుగా ప్రణవ స్వరూపమైన ఓంకారానికి అర్థం చెప్పిన పవిత్ర ప్రదేశమిది.*
*ఆ పరమేశ్వరుడు ఈ జగత్తుకే స్వామి. ఆ స్వామికి స్వామియై, నాథుడై ఉపదేశించాడు కనుక ఇక్కడ కుమార స్వామికి ‘స్వామి నాథుడ’నే పేరు వచ్చింది. ఈ స్థలానికి ‘స్వామిమలై’ అనే పేరు వచ్చింది.*
*అతి పురాతనమైన ఈ ఆలయాన్ని ‘కార్త వీర్యార్జునుడు’ కట్టించాడు. గర్భగుడి బయట మనం ఆయన విగ్రహాన్ని దర్శించవచ్చు.*
*ఈ చిన్న కొండపైకి ఎక్కాలంటే విశాలమైన 60 రాతి మెట్లు ఎక్కాలి. ఈ అరవై మెట్లు అరవై తమిళ సంవత్సరాలకి ప్రతీకలని, ఆ సంవత్సరాధిదేవతలు ఈ రూపంగా స్వామిని సేవిస్తున్నారనీ అంటారు.*
*ప్రతి మెట్టు దగ్గర గోడపై ఆ సంవత్సరం పేరును తమిళంలో వ్రాసి ఉంటుంది.*
*ఈ మెట్లు ఎక్కే నడక దారిలో 32 మెట్లు ఎక్కగానే కుడివైపుకు చూస్తే అక్కడ కుమారస్వామి తన తండ్రికి ఉపదేశం ఇస్తున్న అద్భుత శిల్పం కనబడుతుంది. అలాగే ఈ గుడికి క్రింది భాగంలో శివపార్వతులు మంటపాలున్నాయి.*
*పాండ్య రాజైన వరగుణుడు ఒకసారి మధుర నుండి పుణ్యక్షేత్రమైన తిరువిదైమరుదూర్ కు వెళ్తూ ఈ ఆలయంలో ఒక రాత్రి గడిపాడు.*
*ఆయన కులదైవమైన మీనాక్షి సుందరేశ్వరుని ఆరాధించడానికి ఈ మంటపాలనేర్పరచాడు.*
*ఈ ఆలయంలో ద్వజ స్థంభం వద్ద ఉన్న వినాయకుడి ఆలయం కూడా చాలా మహిమ కలది. ఇక్కడ కుమారతరై, నేత్ర పుష్కరిణి అనే రెండు పుష్కరిణులు ఉన్నాయి.*
*కొంగు ప్రాంతం నుండి వచ్చిన పుట్టుగుడ్డి అయిన ఒక భక్తుడు ఈ రెండు పుష్కరిణులలో స్నానం చేసి స్వామి సన్నిధానానికి వస్తుంటే ఈ వినాయకుడి గుడి దగ్గరకు వచ్చే సరికి ఆయనికి కన్నులు కనిపించడం వల్ల ఈ వినాయకున్ని నేత్ర వినాయగర్ అని పిలుస్తారు.*
*పురాణ కథనం ప్రకారం ఈ దేవుని సన్నిధికి వచ్చి నిశ్చల భక్తితో పూజించే వారి పాపాలన్నీ సూర్యుని ముందు పొగమంచులాగా కరిగిపోతాయి.*
*ఈ దేవాలయంలో వివాహం చేసుకున్న వారికి సత్ప్రవర్తన, సత్సంతానం కలుగుతాయంటారు.*
*ఈ స్వామి దర్శనార్థం అనేక మంది భక్తులు సందర్శిస్తుంటారు.*
*దేశ, విదేశాల నుండి కూడా భక్తులు ఆ ఆలయానికి వస్తుంటారు. భక్తులు కోర్కెలు తీరిన తర్వాత స్వామి వారికి పాలకావడి, పూల కావడి వంటి ముడుపులు చెల్లిస్తుంటారు.*
*సాయంత్రంలో స్వామి వారిని దర్శించుకోవాలనుకుంటే ఆ సమయంలో అభిషేకం చేస్తారు. పసుపు అభిషేకం చేసిన తర్వాత స్వామి కన్నులు, ముక్కు, నోరు, తుడుస్తారు.*
*అప్పుడు స్వామి వారి సౌందర్యం చూడటానికి రెండు కళ్ళు సరిపోవు, ఆ అపురూప సౌందర్యం వర్ణించడానికి మాటలు చాలవు.*
*60అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయం ప్రకృతి సౌందర్యం మధ్య కనువిందు చేస్తూ వుంటుంది.*
రాగద్వేషాలు
*రాగద్వేషాలు!!..*
ఈరోజుల్లో ఇది లేని వారు ఎవరూ వుండరేమో కదా!!...
మన అందరి అనుమానం ఏమంటే, సంసారంలో ఉంటూ రాగద్వేషాలకు అతీతంగా ఉండటం కుదురుతుందా!!... అని, చాలామందికి ఎదురయై ప్రశ్న!!...
ఐతే.. కుదురుతుంది!!... ఎలా??...
*సాధన ద్వారా మాత్రమే సాధ్యం !!...*
ఎవరితోనైనా ఉండగలగటం.. ఎవరినైనా వదిలి ఉండగలగటం రాగద్వేషాలకు అతీతమైన స్థితి!!...
ఈరోజు చాలామందికి ఒక అనుమానం, నేను చాలా పూజలు చేస్తున్నాను, భజనలు చేస్తున్నాను, తీర్థయాత్రలు చేస్తూ, యజ్ఞ యాగాదులలో పాల్గొనీ ఎన్నో చేస్తున్నాను, మరి నాకు ఏమీ మంచి జరగడం లేదు?... అని!!...
అయితే ఆచరణలోకి తెచ్చుకోలేని మంచి మాటలు ఎంతకాలం విన్నా ఉపయోగం లేదు.
కాబట్టి మంచి విషయాలను శ్రద్ధగా వినటం, విన్న విషయాలను సదా మననం చేసుకోవటం, మననంలో ఉన్న విషయాలను తదేక భావన ద్వారా ఆచరణలోకి తెచ్చుకోవటం సాధన!!...
అప్పుడే మనం అనుసరించే భక్తి, భజన, పూజ, ధ్యానం, యోగం ఏదైనా.. మానవుడుని ఈశ్వరుని తెలుసుకునేలా చేస్తాయి.
అందువల్ల సాధకులు ఆ దిశగా పయనించటం ద్వారా పరమ సత్యాన్ని చేరుకొంటారు!!...
*_🌷శుభమస్తు🌷_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏
ఎడ్యుకేట్ ఇట్!
*Sunday Story ఎడ్యుకేట్ ఇట్!*
➖➖➖✍️
*రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన… చిలుక కథ…*
*ఒక చిలుక ఉండేది. చక్కగా పాడేది. స్వేచ్ఛగా ఎగిరేది. కానీ చదవలేక పోయేది. అది రాజు గారి తోటలోని చిలుక.*
*ఒకరోజు అది రాజు గారి కంట్లో పడింది. వెంటనే మంత్రిని పిలిచి 'ఎడ్యుకేట్ ఇట్' అని ఆదేశించాడు. దాన్ని ఎడ్యుకేట్ చేసే బాధ్యతను రాజు గారి మేనల్లుడి మీద ఉంచాడు మంత్రి.*
*ఎలా ఆ చిలుకను ఎడ్యుకేట్ చేయటం? విద్యావేత్త లు కూర్చుని తీవ్రంగా ఆలోచించారు. చిలక్కి చదువు చెప్పాలంటే... మొదట అది కుదురుగా ఉండాలి. అంటే.... అది ఎగురకూడదు. వెంటనే ఒక మంచి పంజరం చేయించారు. చిలుకను అందులో కూర్చోబెట్టారు.*
*కోచింగ్ ఇవ్వటానికి ఒక పండితుడు వచ్చాడు. చిలుకను చూశాడు. ' ఈ చిలక్కి ఒక పుస్తకం సరిపోదు' అన్నాడు.గుట్టల కొద్దీ పుస్తకాలు వచ్చేశాయి గంటల కొద్దీ చదువు మొదలైంది.*
*పంజరం చూడ్డానికి వచ్చిన వాళ్లేవరూ ' అబ్బా... భలే చిలుక' అనటం లేదు. ' అబ్బా... ఏం పంజరం!' అంటున్నారు. లేదంటే ' అబ్బా ... ఎంత చదువు!' అంటున్నారు. రాజు గారిని మెచ్చుకుంటున్నారు.మంత్రిగారిని ప్రశంసిస్తున్నారు.రాజుగారి మేనల్లుడిని, పంజరం తయారుచేసిన కంసాలిని, చదువు చెప్పటానికి వచ్చిన పండితుడిని ' ఆహా... ఓహో ' అని కీర్తిస్తున్నారు.*
*రాజు గారు మంత్రి గారికి మళ్ళీ ఒకసారి చెప్పారు... ఎన్ని లక్షల వరహాలు ఖర్చైన పర్వాలేదు. చిలక్కి బాగా చదువు రావాలని. మంచి మేనర్స్ కూడా రావాలని.*
*’అలాగే ' అని లక్షల వరహాలు దఫా దఫాలుగా కోశాగారం నుంచి తెప్పించారు మంత్రిగారు. సెమిస్టర్లు గడుస్తున్నాయి.*
*ఓ రోజు రాజుగారికి చిలకెలా చదువుతుందో చూడాలనిపించింది. వెంటనే ఏర్పాట్లు జరిగాయి. 'చిలుకను చూడడానికి రాజుగారు వస్తున్నారహో ' అని తప్పెట్లు, తాళాలు ,పెద్ద పెద్ద శబ్దాలు చేసే బూరలతో ఒకటే హోరు.*
*రాజు పరివారం అంతా రాజు కన్నా ముందే చిలుక దగ్గరికి చేరిపోయింది. అయితే పంజరం లోని చిలుకను ఎవరు పట్టించుకోవటం లేదు. ఎవరూ దాని వైపు చూడటం లేదు.పండితుడు ఒక్కడే చూస్తున్నాడు. ఆయనైనా చిలుక సరిగా చదువుతుందా లేదా అని చూస్తున్నాడు తప్ప, చిలకెలా ఉందో చూడటం లేదు. చిలుక బాగా నీరసించి పోయింది. మానసికంగా బాగా నలిగిపోయి ఉంది.*
*ఆ రోజైతే .... రాజుగారి సందర్శన ధ్వనులకు చిలక సగం చచ్చిపోయింది. తర్వాత కొద్దిరోజులకే పూర్తి ప్రాణం విడిచింది! ఆ సంగతి ఎవరికీ తెలీదు. తెలిసిన వాళ్ళు ఎవరికి చెప్పలేదు. ముఖ్యంగా రాజుగారికి చెప్పలేదు.*
*రాజుగారు మళ్ళీ మేనల్లుడిని పిలిచి, ' చిలుక ఎలా చదువుతోంది? ' అని అడిగాడు.*
*'చిలుక స్టడీస్ కంప్లీట్ అయ్యాయి' అన్నాడు మేనల్లుడు.*
*రాజుగారు సంతోషించారు. తన కృషి ఫలించిందన్నమాట.*
*'ఇప్పటికీ అల్లరి చిల్లర గానే ఎగురుతోందా?'*
*'ఎగరరదు!’*
*'ఏ పాట పడితే ఆ పాట పాడుతోందా? '*
*'పాడదు'*
*'సరే, చిలుకను ఒకసారి నా దగ్గరికి తీసుకురా'*
*తీసుకొచ్చాడు మేనల్లుడు. చిలుక నోరు తెరవడం లేదు.ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు.చిలుక కడుపు ఉబ్బెత్తుగా ఉంది. చిలుక అసలు కదలనే కదలటం లేదు.*
*"ఆ కడుపులోనిది ఏమిటి!" అని అడిగారు రాజు గారు.*
*'జ్ఞానం మామయ్య ' అని చెప్పాడు మేనల్లుడు.*
*'చిలుక చనిపోయినట్లు ఉంది కదా ' అన్నారు రాజుగారు.*
*చిలుక చదివిందా లేదా అన్నదే నా బాధ్యత. చచ్చిందా బతికిందా అని కాదు అన్నట్లు చూశాడు రాజుగారి మేనల్లుడు.*
నూరేళ్ళ క్రితం విశ్వకవి రవీంద్రనాధ్ టాగూర్ రాసిన చిలుక కథ ఇది.ఇప్పటి కార్పోరేట్ విద్యాసంస్థలకు సరిగా సరిపోతుంది కదా ...✍️
సామాన్యుడి ఆవేదన
*అయినా నేను ఇంకా పన్ను చెల్లించాలా?ఎందుకు?*
*నేను 30 రోజులు పనిచేశాను. జీతం ఇచ్చారు*
*జీతం ఇచ్చారు, ఆదాయపు పన్ను అన్నారు. ఇచ్చాను. ప్రొఫెషనల్ ట్యాక్స్ అన్నారు, ఇచ్చాను*
*మొబైల్ కొనుగోలు పై పన్ను అన్నారు, ఇచ్చాను.రీఛార్జ్ చేశా, పన్ను ఇచ్చా, డేటా పన్ను ఇచ్చా, విద్యుత్తు పన్ను ఇచ్చా, ఇంటి పన్ను ఇచ్చా, టీవీ బిల్లు పై పన్ను, పిల్లల ఫీజుల పై పన్ను అన్నీ ఇచ్చాను. కారు కి పన్ను అన్నారు. పెట్రోలు పై పన్ను అన్నారు, చెల్లించా, ‘సేవ’ అన్నారు- పన్ను అన్నారు, రోడ్డుపై పన్ను అన్నారు, ‘టోల్ పై’ పన్ను అన్నారు, ఆపై లైసెన్స్ మేడ్ ‘ట్యాక్స్’ వచ్చింది. ఇచ్చాను. అన్నీ కిక్కురుమనకుండా అన్నీ ఇచ్చాను.*
*తప్పు చేస్తే పన్ను- చెల్లించా, రెస్టారెంట్‌లో తిన్నా - పన్ను చెల్లించా, పార్కింగ్ పన్ను చెల్లించా, నీరు తీసుకున్నా-పన్ను చెల్లించా, రేషన్ కొనుగోలు చేశా- పన్ను చెల్లించా, బట్టలు కొనుగోలు చేశా- పన్ను చెల్లించా,పుస్తకాలు తీసుకున్నా- పన్ను ఇచ్చా, మరుగుదొడ్డికి వెళ్లా- పన్ను చెల్లించా, మందులు తీసుకున్నా- పన్ను చెల్లించా, గ్యాస్ ఇచ్చారు-పన్ను చెల్లించా. వందల కొద్దీ వస్తువులు తీసుకుని పన్ను కట్టి, ఫీజులు, బిల్లులు, వడ్డీలు కట్టి, ఎక్కడో ఫైన్లు, లంచాల పేరుతో డబ్బులు చెల్లించి, పొరపాటున ఏ డ్రామా నో ఆడి, ఇంతా అంతా ‘ఆదా’ చేసి మరీ మీకు పన్ను కట్టా.*
*కానీ ఆ జీతం నుండి ఎన్నిసార్లు పన్ను చెల్లించాలి ? ఎవరయినా జవాబు చెప్తారా?*
*మేము జీవితాంతం పని చేసి, పన్నులు కట్టిన తర్వాతకూడా, సామాజిక భద్రత లేదు, ఉచిత వైద్య సౌకర్యం లేదు, ఉచిత ప్రజా రవాణా లేదు, అధ్వాన్నమైన రోడ్లు, వీధి దీపాలు వెలగవు, గాలి కాలుష్యం, నీరు కాలుష్యం, పండ్లు, కూరగాయలు విషపూరితమైనవి, ఆసుపత్రుల చికిత్సలు అందనంత ఖరీదైనవి,*
*ప్రతి సంవత్సరం పెరిగే ద్రవ్యోల్బణం కూడా మమ్మల్ని దెబ్బతీస్తుంది, అకస్మాత్తుగా వచ్చే ఖర్చులు, ప్రమాదవశాత్తు ఊహించని విపత్తులు, వాటిల్లో ప్రతిచోటా కూడా మీకు పన్నులు మాకు అప్పులు.*
*కానీ ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోయాయి?*
*అవినీతిలోకి, ఎన్నికల్లోకి, సోమరిపోతులని తయారుచేయడానికి సంక్షేమం పేరిట ఇచ్చే ఉచితాలకి, ధనవంతుల సబ్సిడీల్లోకి, మాల్యా లాంటివారు దోచుకొని పారిపోవటానికి, ధనికుల ప్రకటించే మోసపూరిత ‘దివాలాలు’ పూడ్చటానికి, స్విస్ బ్యాంకుల్లోకి, నాయకుల బంగ్లాలు, కార్లు, జీతాలు సౌకర్యాలకి, ఎమ్మెల్యేలను కొనడంలోకి, మాకు కథలు చెప్పి జండూ బామ్ రాయడానికి ఖర్చు పెట్టారు.*
*ఇప్పుడు ఎవరైనా చెప్పండి, దొంగ ఎవరో?*
*మనమంతా కూడా ఈ దేశస్థులమే అయినాసరే, ఎంతకాలం అయినా ఇలాగే జీవితాన్ని కొనసాగిస్తాము.కదా!*
ఇది ఓక సామాన్యుడి ఆవేదన