23, మార్చి 2024, శనివారం

మన్రో గంగాళాలు

 మన్రో గంగాళాలు" అంటే  ఏవో తెలుసా


కడుపు నొప్పికి మంత్రం *శ్రీవారి పులిహోరే.


తిరుమలలో శ్రీవారికి ప్రతిరోజు నివేదించే నైవేద్యాలు ఇలాంటి గంగాళంలో మాత్రమే ఎందుకు నివేదింప బడుతున్నాయి. 


ఈ గంగాళం వెనక ఉన్న కథ ఏమిటి..


 1800 ప్రాంతంలో తిరుమలలో దాదాపు శ్రీవారి కైంకర్యాలకు, నైవేద్య నివేదనకు, భక్తులకు ప్రసాదాల వితరణ కోసం ప్రముఖంగా వెదురు బుట్టలు వాడేవారు. 


అపట్లో భక్తులకు హోటల్స్ లేవు కనుక.... తిరుమలలో భక్తులకు బుట్టల్లో ప్రసాదాలు పంచిపెట్టేవారు. అవే ఆనాటి భక్తులకు కడుపు నింపేవి. అక్కడక్కడా రామానుజా కూటముల ద్వారా కూడ అన్న సంతర్పణ కూడా జరిగినా ఆలయంలో పంచి పెట్టె ప్రసాదాలే ఆ నాటి భక్తులకు ప్రధాన ఆహారం.


 1800 ప్రాంతంలో అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ లో పని చేస్తూ బ్రిటిష్ ప్రభుత్వం వారి ఈస్ట్ ఇండియా కంపెనీ లో గవర్నర్ గా పని చేసిన అధికారి పేరు.. " THOMOS MUNRO "


దక్షిణ భారతదేశం మరియూ ప్రముఖంగా రాయలసీమ, కంచి ప్రాంతంలో ఆయన ఎలుబడి కింద ఉండేది.


 ఈయన నిక్కచ్చిగా క్రైస్తవ పద్ధతులు పాటించే విదేశీయుడు... మన హైందవ సనాతన ధర్మం పట్ల ఎటువంటి గౌరవ భావం లేనివాడు..


 ఉద్యోగ రీత్యా చాలా సార్లు తిరుమల వచ్చినా...ఒక్కసారి కూడా శ్రీవారి దర్శనం చేసుకోకుండా తిరిగి వెళ్లిపోయేవాడు.


 అప్పట్లో తిరుమలలో భక్తులకు గుడి బయట ప్రసాదాలు పెద్ద మొత్తంలో పంచిపెట్టేవారు( అవే వారికి భోజనాలు ).. అప్పట్లో శ్రీవారికి ప్రధాన ప్రసాదంగా పొంగలి, పులిహారా , దద్దోజనం మొదలైన వంటలు సమర్పించేవారు. (అప్పటికి లడ్డు ప్రధాన ప్రసాదం కాదు.)

ఆ ప్రసాదాలను భక్త్తులు ఎంతో భక్తితో అక్కడ నేల మీద  కూర్చుని నేరుగా చేతులతో తన్మయత్వంలో తినడం చూసి థామస్ మన్రోకి ఒకరకమైన అసహ్యం వేసింది...

స్వతహాగా విదేశీయుడు కావున... అలా నేరుగా చేతులతో ప్రసాదాలు తినడం చూసి అది ఆరోగ్యకరమైన పద్దతి కాదు అని , శుచి శుభ్రత లేకుండా అలా అందరూ కలిసి ఓకేదగ్గర నేరుగా ప్రసాదాలు చేతితో తినడం వల్ల లేనిపోని అంటు వ్యాధులు, కడుపు నొప్పులు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి అని. 


మన ఆలయ సంప్రదాయం, ప్రసాదాలు పట్ల ఒకింత చులకన భావం కలిగిన థామస్ మన్రో వెంటనే తన అధికారం ఉపయోగించి నేరుగా తిరుమలలో భక్తులు శ్రీవారి ప్రసాదాలు  తినకుండా ఆదేశాలు ఇచ్చాడు.. 


 శ్రీవారి లీల ప్రభావంతో  ఏ కడుపు నొప్పిని సాకుగా చూపించి ప్రసాదాలు థామస్ మన్రో రద్దు చేశారో...అదే  తీవ్రమైన కడుపు నొప్పి ఆయనకి వచ్చి ఎన్ని రకాలుగా వైద్యం చేయించినా తగ్గకుండా ఆతని ఆరోగ్యం క్షీణించి , పూర్తిగా అనారోగ్యంతో మంచం పట్టినాడు. 


 అనుకోని పరిస్థితుల్లో అతనికి మంత్రాలయం రాఘవేంద్రస్వామి వారి మీద ఎనలేని భక్తి శ్రద్ధ గురి కుదిరింది. అతను ఆ ఆలయంకి ఎన్నో కైంకర్యాలకు దన సహాయం చేసినా ఆయన కడుపు నొప్పి మాత్రం తగ్గక నరక యాతన అనుభవించేవాడు. 


 అతనిలో వచ్చిన ఆధ్యాత్మిక పరివర్తన కి, సనాతన ధర్మం పట్ల భక్తిని  గమనించిన మంత్రాలయ పీఠాధిపతులు ఆయన తిరుమల  శ్రీవారి పట్ల ,ఆయన ప్రసాదాల పట్ల చేసిన ఘోరమైన తప్పుని తెలియజేసి, శ్రీవారి క్షేత్ర మహిమని వివరించారు. శ్రీవారి ప్రసాదాల మహిమ తెలుసుకున్న థామస్ మన్రో..శ్రీవారి పులిహార నేరుగా తన చేతితో తిన్న వెంటనే కడుపునొప్పి మటుమాయం అయింది..


తప్పు తెలుసుకున్న థామస్ మన్రో... శ్రీవారికి కైంకర్యాల కోసం, నైవేద్యాలు సమర్పణ కోసం  చాలా గంగాళాలు సమర్పించాడు మరియూ తిరుపతి శ్రీవారి భక్తులకు మళ్ళీ మునుపటి లాగా ప్రసాదాలు పంచి పెట్టేలా వాటిని భక్తులు నేరుగా ఆలయం దగ్గరే  తినేలా తిరిగి ఉత్తర్వులు ఇచ్చాడు...... 


 ఎంత పశ్చాత్తాప పడినా, ఎన్ని గంగాళాలు దేవస్థానానికి సమర్పించినా శ్రీవారి దర్శనానికి మాత్రం నోచుకోలేకపోయాడు.

మనోవ్యధ తో   మంచం పట్టి నేరుగా నీ సేవలో  పాల్గొని అదృష్టం లేదా స్వామి అని ఎన్నో విధాల శ్రీవారిని ప్రార్థిస్తూ 1827 లో ప్రాణం వదిలాడు. 



 అతని భక్తికి మెచ్చిన శ్రీనివాసుడు ఆనాటి నుండి ఈనాటి వరకు తన అన్ని రకాల ప్రసాదాలను కేవలం ఆ గంగాళాలులోనే స్వీకరిస్తున్నాడు... ఈ గంగాళలను ఇప్పటికీ

*" మన్రో గంగాళాలు "*  అనే పేరుతో  దేవస్థాన పూజా కైంకర్యాల లో చలామణీలో ఉన్నాయి...

శ్రీవారి దర్శనానికి నేరుగా నోచుకోకపోయినా ఆయన పేరు మీదే ప్రసాదాల పాత్రలు ఉండేలా శ్రీవారు అతనికి ఎప్పటికీ తరిగిపోని చిరకీర్తిని కలిగించి ఒక రకమైన చిరకీర్తి  ప్రసాదించాడు. 


 తెలుసుకోవాలన్న శ్రద్ధ, భక్తి ఉండాలే గాని తిరుమలలో పరమాత్మ గూర్చే కాదు ఆ పరమాత్మునికి నివేదించే ప్రసాదాల లోనే కాక ఆ ప్రసాదాల పాత్రల వెనక కూడా ఎంతో విలువైన ఆధ్యాత్మిక మహిమలు, శ్రీవారు లీలలు, చరిత్ర  కలదు. 


భక్తితో శ్రీనివాసుని తెలుసుకునే ప్రయత్నం చేస్తే తిరుమలగిరిలో అడుగడుగున, ప్రతి గడప కి, ప్రతి చెట్టు కి ప్రతి ఒక్క చిన్న ప్రదేశం వెనక ఎంతో తెలుసుకోవాల్సిన ఆధ్యాత్మిక చరిత్ర దాగి ఉంది.

మూత్రపిండాలలో రాళ్లు

 మూత్రపిండాలలో రాళ్లు కరిగించడానికి  - 


        ఆకులు తీసిన ముల్లంగి కాడని దంచి రసం తీసి ఒక కప్పు మోతాదుగా ఒక చెంచా తేనే కలిపి రెండు పూటలా తాగుతూ ఉంటే మూత్రకోశంలోని రాళ్లు ముక్కలు ముక్కలు అయ్యి మూత్రం గుండా పడిపోతాయి. 


              అంతేగాక ఈ రసం తాగడం వలన మూత్రం బందం విడివడి మూత్రం ధారాళంగా జారి అవుతుంది.  క్రమక్రమంగా మదుమేహం , అతిమూత్రం కూడా తగ్గుతాయి . 


 గమనిక  - 


  ప్రతిరోజూ ఈ ఔషదం తో పాటు బార్లీ గింజల నీటిని కూడా తాగడం వలన ఇంకా తొందరంగా మీ సమస్య నుంచి బయటపడతారు.

 

  ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

శ్రీ కాళహస్తీశ్వరా

 శు భో ద యం🙏


శ్రీ కాళహస్తీశ్వరా!


"నీతో యుధ్ధముసేయనోపఁగవితా నిర్మాణశక్తిన్ నినున్/

బ్రీతుంసేయగలేను,నీకొఱకు తండ్రింజంపఁగాఁజాల,నా/

చేతన్ రోకటనిన్నుమొత్తవెఱతున్, జీకాకు నాభక్తి,యే/

రీతిన్ నాకిక నిన్నుజూడఁగలుగున్ ,శ్రీ కాళహస్తీశ్వరా!


కాళహస్తీశ్వర శతకము.

ధూర్జటి మహాకవి.


భావము:స్వామీ! కాళహస్తీశ్వరా! నీభక్తులందరూ అసాధ్యమైన కార్యములొనరించి నీమెప్పువడసినారు.తెలిసీతెలియనివాడనునాభక్తియెట్టిదో నాకేతెలియనిపామరుడనునీతో యుధ్ధమొనర్చుటనాతరమా?కవిత్వమును జెప్పినిన్నుమెప్పించు శక్తియు లేనివాడనే, నీకొరకు కన్నతండ్రినైనను జంపుసాహసములేదే,నాచేతిరోకటితో నిన్నుదంచలేనే?మరియెట్లుస్వామీ నీసన్నిధినిచేరుట.నాకాఉపాయమేదో ఉపదేశింపుమని కవియభవుని అడుగుచున్నాడు.


విశేషములు:

ఇందు నిందాస్తుతి యలంకారమున్నది.నిందించుచున్నట్లు పైకిగానవచ్చినను వ్యంగ్యముగా శివుని ,యతనిభక్తులను ప్రశంసించుటయే కవియొనరించినకార్యము.

1అర్జునుడు పాశుపతాస్త్రముకొరకై తపమొనర్చునపుడు మాయాకిరాతవేషధారియగుశివునితో యుధ్ధమొనరించును.ఆరీతిగా నీతో యుధ్ధము నేనుచేయలేనుస్వామీ!అనుచున్నాడు.(సమరమున అర్జునుడు శివునిపలురీతులనొప్పించెను)

2నత్కీరుడనే శివభక్తుడు శివునికవిత్వమునతప్పులుబట్టి తనకవితాశక్తితో శివుని మెప్పించినాడు.నాకు అటువలె కవితచెప్పుశక్తిలేదనుచున్నాడు.

3విచార,శర్మయనునాయనారు పశువులను మేపుటకుగొనిపోయి,భక్తిపారవశ్యమున మునుగ,పశులు పంటపొలమునబడినవి.ఇదేమిరాయని అడుగ వచ్చిన తండ్రిని తనఏకాగ్రతకుభంగముకల్గించెనని, కోపావేశమున గొడ్డలితోనరకును.అదిగో ఆనాయనారువలె తండ్రిని చంపలేననుచున్నాడు.


4చిరుతొండనంబియను శివభక్తుడు కపటజంగముకోర్కెదీర్చుటకై కొమరుని జంపి యతనిశిరోమాంసమునురోకటదంచి కూరవండి పెట్టినాడు.


ఈరీతిగా శివభక్తులు చేసినత్యాగములను నేనుచేయలేని యశక్తుడననుచు,"చీకాకునాభక్తి"-యనుచున్నాడు(.అనగా తనభక్తిస్వరూప స్వభావ ులేవో చెప్పుటకు వీలులేనిది)

అట్టిశక్తిహీనుడను నన్ను నీవే నీదరికి చేర్చుకొనవలె ననుచున్నాడు.

                     స్వస్తి!🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

ఆశీర్వాదం

 🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏


*అర్చకుని*

   *పురోహితుని*

      *బ్రహ్మణుడి*

🙌 *ఆశీర్వాదం విలువ*

         

🌷🙌🌷🙌🌷🙌🌷        


*ఒకరోజు ఒక కోర్టులో జడ్జి గారి ముందుకు ఒక కేసు వచ్చింది.*

     *ఫిర్యాదు దారుడు ఒకతను ఈ విధంగా ఫిర్యాదు చేశాడు.*

       

       ఒక పురోహితుడు  సంపాదించిన ధనానికి ప్రభుత్వానికి Tax కూడా చెల్లించడం లేదు,

       కావున తమరు విచారణ జరిపి అక్రమ సంపాధరణ దారుడిగా గుర్తించి తగిన విధంగా శిక్షించగలరని పిర్యాదు.

 

*జడ్జి :-* పురోహితుణ్ణి పిలిచి ఈ విధంగా ప్రశ్నించారు. మీరు మీ వద్ద ఉన్న ధనం అక్రమంగా సంపాధించారా లేక సక్రమంగా సంపాధించారా   అని

*పురోహితుడు:-* ఈ విధంగా సమాధానం ఇచ్చాడు

నేను సంపాదించినదంతయు సక్రమమే  ఇసుమంతయు అక్రమం కాదు అని

*జడ్జి :-* అంత సంపాదన సక్రమంగా ఎలా సంపాదించావో వివరించు

*పురోహితుడు :-* అయ్యా!

ఒక రోజు ధనవంతులైన దంపతులిద్దరు ఆత్మహత్య చేసుకోవడానికి చెరువు వద్దకు వచ్చారు నేను ఆ సమయంలో సంధ్యావంధనం చేస్తున్నాను. ఆ సమయంలో వారు చేసుకోబోయే అకృత్యాన్ని చూసి వారించాను ఆత్మ హత్య మహా పాపం అని వివరించి వారిని ఆ ప్రయత్నం నుండి విరామయింప చేసి సాంతన కలిగించాను. నా మాటపై విశ్వసంతో వెనుదిరిగి వెళ్లారు కొద్ది రోజుల తరువాత నాపై గౌరవంతో వద్దన్న వినకుండా కొంత ధనాన్ని ఇచ్చి ఆశీర్వదించండి అని వేడుకున్నారూ.

దానికి ప్రతిఫలంగా సంతానా సిద్ధిరస్తు అని ఆశీర్వాదం ఇచ్చాను. కొన్ని సంవత్సరాల తరువాత వారికీ కలిగిన సంతానాన్ని వెంటబెట్టుకొని ఆనందంతో నావద్దకు వచ్చి నా కుమారునికి మీ ఆశీస్సులు అందచేయండి అని ప్రాధేయపడ్డాడు. దానికి నేను ఆపిల్లవాడు బాగా చదివి ప్రయోజకుడు అవుతాడు నీకు మంచి కీర్తి ప్రతిష్టలు తీసుకొని వస్తాడు అని ఆశీర్వాదం ఇచ్చాను. ఆ సమయంలో ఆనందంతో మరికొంత ధనం ఇచ్చి వెళ్ళాడు.మరికొన్ని సంవత్సరాల తరువాత ఈ మధ్యనే అదనవంతుడు తన కుమారుడు ప్రయోజకుడాయ్యాడనే విషయం తెలియజేయడానికి నా ఇంటికి వచ్చి ఆశీర్వాదం అడిగాడు

నేను ఆదంపతులిద్దరిని ఆయురారోగ్య వృద్ధిరస్తు అని ఆశీర్వదించా.

అతను తన వద్ద ఉన్న ధనంలో కొంత ధనాన్ని ఇచ్చి ఆనందంగా ఇంటికి వెళ్ళాడు.

అయ్యా! ఈ విధంగా నేను ధనవంతుణ్ణి అయ్యాను. నేను సంపాధించింది సక్రమమైనదో లేక అక్రమమైనదో  తమరే తీర్పు ఇవ్వండి అని సెలవిచ్చారు.


-పై విషయం అంత సావధానంగా విన్న జడ్జి తీర్పు ఇచ్చాడు. ఆరోజున ఆత్మ హత్య చేసుకోవాలనుకున్న ఆదంపతులను ఈ పురోహితుడు వారించకుండా ఉంటే వారికీ తర్వాత జీవనం ఉండేది కాదు. కొన్ని రోజులకు వారు తప్పు తెలుకొని పశ్చాత్తాపంతో కృతజ్ఞత పూర్వకంగా కొంత ధనం ఇవ్వడం పూర్తిగా ఆమోదయోగ్యమైనది ఆ ధనం సక్రమమైనదే

కొన్ని రోజులకు వారు సంతానవంతులై పుత్రుడు పుట్టాడనే ఆనందంలో మరికొంత ధనం ఇచ్చాడు అధియును సక్రమైనదేగా

మరికొన్ని రోజులకు కొడుకు ప్రయోజకుడాయ్యాడనే సంతోషం తో కొంత ధనం ఇచ్చాడు ఇది కూడా సక్రమమే

మరియు ధనవంతుని శేష జీవితం ఆయురారోగ్యాలతో ఉంటుందని తెలుకొని ఆనందంగా జీవిస్తున్నాడు

ఈ విషయంలో ఎక్కడ పురోహితుని సంపాధన అక్రమమని తెలుపలేము అని తీర్పు వెల్లడించారు. ఈ సందర్భంలోనే జడ్జి గారు ఇలా అడిగారు


*జడ్జి:-* 

అయ్యా ఇంత ధనాన్ని మికిచ్చి పుణ్యాత్ములైన ధనవంతులు ఎవరో తెలుకోవాలనే ఉత్చాహం ఉన్నాను ఎవరో తెలుపగలరా అని.


*పురోహితుడు :-* 

ఆ పుణ్య దంపతులు మీ తల్లిదండ్రులే! అని తెలియచేసాడు.


దుఃఖంతో తను కూర్చున్న స్థానం నుంచి దిగి వచ్చి పురోహితునికి షాష్టాంగ నమస్కారం చేసారు జడ్జి.


🙌 *బ్రాహ్మణుడి ఆశీర్వాదం ఎంతో శక్తివంతమైనది.* 🙌


🌷🙌🌷🙌🌷🙌🌷🙌🌷సే క ర ణ: వేదుల జనార్ధన రావు.

మిగుల్చు కోరాదు

 🪔 *ॐ卐 _సుభాషితమ్_ ॐ卐* 💎 


శ్లో𝕝𝕝 

ఋణశేషోగ్ని శేషశ్చ     

శత్రుశేషస్తథైవ చ 

పునః పునః ప్రవర్ధంతే 

తస్మాచ్ఛేషం న రక్షయేత్!!


తా𝕝𝕝 ఋణశేషం, అగ్నిశేషం, శత్రుశేషం మరల మరల ప్రవృద్ధమౌతాయి. అందువల్ల ఆమూడింటినీ మిగుల్చు కోరాదు అని ఈ శ్లోకానికి అర్థం.

పంచాంగం 23.03.2024

 ఈ రోజు పంచాంగం 23.03.2024 Saturday,

 

స్వస్తి శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: ఉత్తరాయణం శిశిర ఋతు ఫాల్గున మాస శుక్ల పక్ష: త్రయోదశి తిధి స్థిర వాసర: పూర్వఫల్గుని నక్షత్రం శూల యోగ: తైతుల తదుపరి గరజి కరణం. ఇది ఈరోజు పంచాంగం.


త్రయోదశి ఉదయం 07:17 వరకు.

పూర్వఫల్గుని ఈ రోజు పూర్తిగా ఉంది.

సూర్యోదయం : 06:22

సూర్యాస్తమయం : 06:24


వర్జ్యం : మధ్యాహ్నం 01:28 నుండి 03:17 వరకు .


దుర్ముహూర్తం : ఉదయం 06:22 నుండి 07:58 వరకు.


అమృతఘడియలు : రాత్రి 12:19 నుండి 02:08 వరకు.


రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30 వరకు.


యమగండం: మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.



శుభోదయ:, నమస్కార: