ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
4, అక్టోబర్ 2024, శుక్రవారం
వ్యసనపరుడుVYASANA PARUDU
వ్యసనపరుడు
హైందవం వర్ధిల్లాలి 20*
*హైందవం వర్ధిల్లాలి 20*
సభ్యులకు నమస్కారములు.
ధర్మ ప్రచారకులు, ప్రవచనకారులు, ఆశ్రమాధిపతులు, పీఠాదిపతులు, హిందూ నాయకులు హైందవ జాగరణకై ప్రజాలలోకి రావాలి. :- i ) రామాయణ మహా కావ్యంలోని ఒక ఘట్టం చూద్దాం. జనక మహారాజు సభలోకి అష్టావక్రులవారు ప్రవేశించినప్పుడు, ఆ సంవాదంలో అష్టావక్రుల వారినుద్దేశించి, ద్వారపాలకుడంటాడు బాలుడివి వృద్ధుడులాగా చాలా జ్ఞాన సంపదతో మాట్లాడుతున్నావు అని. అష్టావక్రుల వారి సమాధానం *న జ్ఞాయతే కాయ వృద్ధ్యా నివృద్ధిః, యథా ష్టీలా శాల్మలే: సంవృద్ధా, హ్రస్వోల్పకాయః ఫలితో వివృద్ధ:, యశ్చా ఫలస్థస్య న వృద్ధభావః*. అర్థం :- శరీరం పెరిగినంత మాత్రాన జ్ఞానం పెరుగదు. బూరుగు విత్తనం పెరిగేకొద్దీ సారం లేనిదే అవుతుంది. చిన్న చెట్టైనా పండ్లు, కాయలు ఎక్కువగా ఉంటే అదే పెద్ద చెట్టు. అంతే కాని పెద్దదయినా ఫలాలు లేని చెట్టు వ్యర్థమే. *నీతి:- వయస్సు పైబడిన వారు, వృద్ధులు అయినా జ్ఞాన శూన్యులు వ్యర్తులే*.
మన సమాజంలో అధిక జనాభాకు ఇది (క్రియాశీల జ్ఞాన శూన్యతకు) చక్కటి దృష్టాంతము. యుక్త వయస్సు, మధ్య వయస్సు పర్యంతం తమ అభివృద్ధికి, తమ వారసుల అభివృద్ధికి నిరంతరం, అహర్నిశలు శ్రమించి, వారి వారి లక్ష్యాలు సాధించి, ఒక స్థాయికి చేరినా, మిగతా జీవిత కాలం, *ఏ సమాజ సహకారము, సహాయము గైకొని ఇంత వృద్ధి చెందారో* ఆ సమాజ మరియు దేశ హితం కొరకు పాటుపడదామన్న కనీస స్పృహ పెంచుకోరు, పాటించరు. స్వలాభానికై ఇంకా సంపాదిద్దాము. ఉదయం లగాయతు సాయంత్రం వరకు సంసార తాపత్రయాలతోనే కాలక్షేపం చేద్దాము అను స్వార్థ ధృక్పథంతో ఉంటారు. *వయస్సు పైబడిన వారైనా ఇటువంటి వారు "సుసమాజం" దృష్టిలో వ్యర్థులే*.
మన ప్రాంతము, మన దేశము, మన సంస్కృతి, మన ధర్మము పట్ల మమకారము, ఈ జాతీయత పట్ల అభిమానము, సేవానిష్ఠ లేని వారు మరియు నివసించుచున్న నేల పట్ల మాతృ భక్తి లేని నీతిభాహ్యులు *గుడ్డి కన్ను తెరిచినా ఒకటే మూసినా ఒకటే చందాన జీవితం వెళ్ళదీస్తుంటారు*. ఈశ్వరా రక్షించు మమ్ములను.
మన భారత ప్రజలలో వర్గ, భాషా, ఆహార, ఆహార్య, సంస్కృతి, సంప్రదాయ మరియు తదితర అనేకానేక వైవిధ్యాలు, భిన్నత్వాలు కల్గిఉన్నా *అందులో నిహితమై ఉన్న సమన్వయాన్ని, ఏకత్వాన్ని, ఆసేతు హిమాచలం (కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు) మళ్ళీ ఒకసారి పునరుద్దరించడానికి* ప్రవచనకారులు, ఆశ్రమాధిపతులు, పీఠాధిపతులు, ధర్మప్రచారకులు, హిందూ నాయకులు ప్రజల మధ్యకు రావాలి. *ఈ సత్సంకల్పానికి రచయితలు, కవులు, గాయకులు, సామాజిక వైతాళికులు తోడు నిలవాలి*. *కావున మన హిందు ధర్మానికి, సంస్కృతికి ఊపిరులూదడానికి ప్రతి పౌరుడు కంకణం కట్టుకోవాలి*.
ధన్యవాదములు
*(సశేషం)*
*శ్రీ ఆది శంకరాచార్య చరితము 31
*శ్రీ ఆది శంకరాచార్య చరితము 31 వ భాగము*
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
ఆ తరువాత శార్ఞపాణి అనే వైష్ణవ శ్రేష్ఠుడు శంకరులతో మాటాడ నెంచెను.
శార్ఞపాణికి తత్త్వబోధ:
తెలియనంత వరకు ఎవరి మతం వారికి గొప్పదిగా కన్పించుట సహజం. శార్ఙ్గపాణి వైష్ణవమత మందు గొప్ప వాడని ప్రసిద్ధి పొందియున్నాడు. ఆయన తన మత విధానమును శ్రీ శంకర పాదులకు వినుపించ నెంచి లేచి, 'స్వామీ! విష్ణుమూర్తి యొక్క శంఖచక్రాలు ముద్రలు గా ధరించి, సదా "ఓం నమో నారాయణాయ" అనే మహా మంత్రాన్ని స్మరణ చేయుచుం దుము. విష్ణుభక్తులకు వైకుంఠ నివాసము తప్పక ప్రాప్తించును. కనుక ఈ సంసార బంధము నుండి విముక్తి నొంది ఇప్పుడే వైకుంఠమునకు వెడలుచున్నాను. శంఖచక్రాది చిహ్నధార ణలకు పురాణము ల యందు ప్రమాణము లున్నవి. ఏ వైష్ణవుడు శంఖచక్రాది చిహ్నము లను ధరించుకొని కంఠమున తులసి, పద్మబీజ మాలలను అలంకరించుకొని ఊర్థ్వ పుండ్రధారణ చేసికొని యుండునో అట్టివానిని చూచినంత మాత్రాన శ్రీ మహావిష్ణు వును దర్శించినట్లే యగును' అని తన అభిమతాన్ని వ్యక్తం చేశాడు.
ఆచార్యస్వామి శార్ఞపాణి పలుకులు ఆలకించి 'భక్తుడా తగు ప్రమాణంగల మాట లకు విలువ కలుగును. చక్రాంకితములు వేద విహితములు కావు. అందువలన అది ప్రమాణ రహితము. వ్రతాల నాచరించ కుండా శరీరం తప్తం కాదు. తప్తంకాని శరీరం గల వానికి మోక్షం రాదని శ్రుతి తెలుపు చున్నది. పాపాలు పోవలెనన్న శరీరాలు శుష్కించి తీర వలెను. వ్రతాదుల వలన శరీరం తప్తం కానిచో ధ్యానం చేయవలెను. పురాణ ములు కేవలం ప్రమాణ ములుగా ఎంచకుడు. శంఖ చక్రాంకితములు తక్షణం విడిచి పెట్ట తగి యున్నవి. మోక్షం కావ లయునన్న బ్రహ్మజ్ఞానం కలుగ వలెను, అని శ్రుతి ఎలుగెత్తి చాటు చున్నది. పుణ్యం క్షీణించిన స్వర్గాది పుణ్యలోకవాసం అంతమై తిరిగి మానవుడై జన్మించునని శ్రుతి తెలుపుచున్నది. చిహ్న ధారణలను శ్రుతి స్మృతులు అంగీకరిం చుటలేదు. బృహ న్నారదీయమందు గాని, పురాణముల యందుగాని చిహ్న ధారణ నిషేధమనియే విధించబడినది. చిహ్న ధారణతో నేను విష్ణువుతో సమాన మనుకొనుట భావనా రాజ్యము వంటిది. వేదములు వల్లించక బాహ్మణ చిహ్నములైన శిఖా యజ్ఞోపవీతం మొదలయినవి ధరించి నంత మాత్రాన జ్ఞానార్జనచేయనిచో బ్రాహ్మణుడు కాజాలడు. బ్రహ్మజ్ఞానార్జన చేయు వానినే బ్రాహ్మణు డందురు. భ్రష్ఠుడైన బ్రాహ్మణుడు తిరిగి బ్రాహ్మణుడు కాగలడా! బ్రహ్మజ్ఞానం వల్లనే ముక్తి ప్రాప్తించునని శ్రుతివాక్యములు ఢంకాధ్వని చేయు చున్నవి. కనుక ప్రతీ క్షణం తత్త్వవిచారణ చేయుచుండుడు. అంతట జీవేశ్వరాభేదం దృఢమై జీవుడే శివుడగుచున్నాడు. 'శివోహం' అని నిరంతరం మననం చేసికొను వానిని ఆ శివుడే వానిని శివునిగ చేయును. వాసన క్షయించి భేద బుద్ధి నశిస్తుంది. ఈ విధంగా శివగీత పలుకుచున్న’ దని వచించారు.
శార్ఙ్గపాణి శ్రీ ఆచార్య స్వామి వెలువరించిన తత్త్వబోధవిని సాష్టాంగ వందనములర్పించి కృతార్ధుడనైతి' నని తన నిశ్చయాన్ని వ్యక్తం చేశాడు.
వైఖానసుడు:
శ్రీ ఆచార్యస్వామి గావించు మతప్రబోధ మెటులున్నను తాము బహుకాలమునుండి ఆచరించు విధానము ను తిరస్కరించుటను సహించలేక వైఖానసు లలో ప్రముఖుడైన వ్యాస దాసుడు శ్రీశంకరపాదులను సమీపించి, 'స్వామీ! మాకు శీమన్నారాయణ మూర్తియే పరమదైవం. కావున మా పక్షమును కాదనుటకు బ్రహ్మతరం కాదు. 'తద్విష్ణో: పరమం పదమ్' మొదలయిన శ్రుతి వాక్యములు శ్రీమన్నా రాయణ మూర్తికే అగ్రస్థానమిచ్చినట్లుగ తెలుపుచున్నవి. అదియును గాక ఆయనలోనుండి బ్రహ్మ, రుద్రుడు పుట్టుచున్నా రని 'నారాయణాద్బహ్మా జాయతే రుద్ర ఏవచ' శ్రుతి వెలువరించినది కనుక నారాయణ మూర్తినే సేవించ వలసి యున్నది.
ఆయన సర్వాంతర ర్యామియై వెలయు చున్నాడు. విష్ణుభక్తుల లక్షణములు మొదలగు నవన్నియు వైఖానస మతమందు విపులంగా తెలుపబడి యున్నవి. శంఖ చక్రాది విష్ణు చిహ్నములను ధరించి ఊర్థ్వపుండ్రములను పెట్టుకొన్నవాడే విష్ణు భక్తుడని తెలియ బడును.' అని వివరించెను.
వ్యాసదాసుడు వివరించిన విధానము నాలకించి అందు గల లోపములను సవరించనెంచి, 'వ్యాస దాసా! ఈ లోకాలను సృష్టించు వాడు బ్రహ్మా? విష్ణువా? నారాయణ మూర్తి సృష్టి చేయు వాడగుచో పరిపాలించు వాడెవడు? ఇందులో వివాద మెంతేని గలదు. ఇది అటుండ నిమ్ము. సృష్టిస్థితిలయ కారకులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అను మువ్వురున్నారు.వీరలేమగుదురు? ఇది కూడ అటుండనిమ్ము, నారాయణమూర్తి యనినా విష్ణు వనినా ఒకటేకదా! విష్ణుపద మనగా నిత్యముక్తి. అది కేవలం తత్త్వజ్ఞాన ముండిననే లభ్య మగును. జ్ఞానం వినా ముక్తికి మరియొక మార్గం కానరాదు. నీవు విష్ణుభక్తుడవే యగుచో ఆయన ప్రీతి కొరకు వైదికకర్మలను ఆచరిం చుమా! శంఖచక్రాంకితా లనుచు కాల్చుకొన్నంత మాత్రాన ముక్తి రాదు. ఆగమాచారాలు బ్రాహ్మణత్వమును నాశనం చేయుటకు కారణమగుచున్నవి. అట్టివి లేకుండిన యోగ్యత కలిగి యుండేది.' అని శ్రీశంకరపాదులు తెలియజేశారు.
శ్రీ ఆచార్యస్వామి చెప్పినది విని సంశయ గ్రస్తుడై మరల, 'పూర్వకాలంలో దత్తాత్రేయ యోగీంద్రుల వారు పంచముద్రలు ధరించియున్నారు కదా! ఆయనది మోక్షమార్గమే కదా! అందు వలననే మేమందరం ఆయన మార్గాన్ని అనుసరించుచున్నాము. పురాణ ములలో శంఖ చక్ర ధారణ చెప్పబడి యున్నది. ఇన్నిట చక్రాంకితములు యోగ్యమై యున్నవి. ఇవిలేనిచో వైష్ణవ మతమునకే హాని సంభవించును. కావున భగవంతుని చిహ్నము లను ధరించడం విధి!' అన్నాడు వ్యాస దాసుడు.
శ్రీశంకరపాదులు వ్యాసదాసుడు తెలిపిన విషయము మరల ఆలకించి, వ్యాసదాసా! నీ అవివేకమును ఏమనవలెను! బాలకు లు కూడ ఈ చక్రాంకిత ములు లాభము లేద నుచున్నారు.
మహాతత్త్వవేత్త, పరమ యోగీంద్రులు అయిన దత్తాత్రేయులు ముద్రాంకితములు పొందియుండలేదు. చక్రాంకితములు ధరించినటుల ఎందునా కానరాదు. పురాణ ములయందు గలద నుట ఉచితము కాదు. ఇప్పుడైనను నీ మూఢ భక్తిని విడనాడి సుఖముగానుండుము. భక్తుడా! ప్రహ్లాదుడు, గజరాజు, ధ్రువుడు, హనుమంతుడు, ద్రౌపది, గోపికలు, గోపకులు, వీరందరికీ చక్రాంకితములు చేసిన గురువు ఎవరు? అట్టి ఊహలు విడవాడి 'బ్రహ్మాస్మి' అనే అద్వైత భావమును పొంది సుఖంగా మోక్షమును పొందుమా!
చక్రాంకితములు తప్పు కాదందువా, కపోల తలముల యందు శేషునిముద్రలు, కంఠమున గరుత్మంతు ని ముద్ర, భుజముల యందు, జ్ఞానేంద్రియ సమీపమున చక్రాంకిత ములు ధరించరేల? అచ్చట ప్రమాద మనియా!' అని వ్యక్తం చేశారు.
‘యతివర్యా! తమ అనుగ్రహంతో వివేక ముదయించినది. నేనింక చక్రాంకితాలు ధరించబోను. చిన్న తప్పును తెలిసికొన జాలక, ముందుకు పోజాలకుంటిని. ఇట్టి పరమ రహస్యమును తెలిసికొనలేక పోవడం ఇంత వరకు మాకొక గొప్ప అవరోధమే ఏర్పడింది. దానిని తృణప్రాయంగా తొల గించినందుకు కృతజ్ఞుడను. మిమ్ములను 'జగద్గురువు' లనియే పిలువవలెను. కరుణించుడు!' అని వ్యాసదాసుడు శ్రీ శంకరపాదులకు కృతజ్ఞతలు అర్పించాడు.వ్యాసదాసునకు ముక్తిమార్గం చూపనెంచి శ్రీశంకరాచార్య స్వామి, 'వ్యాసదాసా! 'నేనే బ్రహ్మను. బంధములు లేని వాడను’ అని సదా భావన చేయు చుండుమా! అట్లు చేయ లేనిచో ‘బ్రహ్మైవాహం న సంసారీ ముక్తోహమ్' అని యైనను నిరంతర మూ మననం చేయు చుండుమా! ఇట్లాచరించినచో బంధముల నుండి విడివడి పరమాత్మను తెలిసికొనగలవు. అట్లు తెలిసికొనడమే ముక్తి. ముక్తినొందుడు మరో దారిలేదు” అని ఉపదేశించారు.
కర్మహీన శాఖీయులు:
కర్మహీనులని పిలువ బడే శాఖయొకటి వైష్ణవమతమందు గలదని ఇదివరలో తెలుపబడినది. ఆ శాఖకు చెందిన నామ తీర్ధుడను ప్రముఖుడు సభలోనుండి లేచి శ్రీశంకరాచార్యులను సమీపించి, 'యతివర్యా! నమస్కారములు! మా మత ధర్మములు వినండి! విష్ణుమూర్తి మతమగుటచే దీన్ని కాదనుటకు ఆదిశేషు నికి కూడ శక్యం కాదు. కారణమేమన, జగమంతావిష్ణుమయం. శిష్యునికి ముక్తిని ప్రసాదించు నిమిత్తం గురువు విష్ణుమూర్తిని ప్రార్థించాడు.'నాశిష్యుని తమపాదారవిందముల కడకు చేర్చుకొను’ డని ఆ ప్రార్థన విని శ్రీపరమేశ్వరుడు అట్లు తన పాదసన్నిధికి చేర్చుకొన్నాడు.
‘యతివర్యా! నాకు తిరిగి జననం లేదు. మీరందరూ సర్వలోక ప్రభువైన విష్ణువును పూజించుడు. ముక్తి తప్పకరాగలదు.' అని నివేదించాడు.
శ్రీ శంకరాచార్యస్వామి కర్మహీనుని పద్ధతి విని అతనిని బాగుచేయ నెంచి, 'నామతీర్ధ! కర్మ చేయని వాడవు! జీవన్ముక్తుడ వైతివా! ఇది ఎంతనింద్యము! ఇది మంచి, అది చెడ్డది అనే తేడా నీకు లేనందున నీది పిశాచ వృత్తి! వేద విహితమైన విధికర్మల నాచరిస్తూ తత్ఫలితాన్ని ఈశ్వరా ర్పణ చేసినచో అయ్యది జ్ఞానమార్గ మగును, ఫలాపేక్ష తో కర్మచేసినప్పుడు అది కర్మమార్గము. అన్ని విధాలా కర్మభ్రష్ఠుడవే యగుచున్నావు. అందువల్ల శ్రుతి స్మృతులు నీకు శిక్షను విధించుచున్నవి. ఏవిధంగా జూచినను నీవు విష్ణుభక్తుడవు కానేరవు. స్వధర్మము నాచరించువాని లక్షణాలు చెప్పెదను, విను. విష్ణుభక్తుడు సదా ధర్మమును చలించకుండ ఆచరిం చవలెను. ఇష్టుడు, అయిష్టుడు అను భేదం లేకుండ సమబుద్ధితో నుండవలెను. అట్లు ఆచరించుచు పరిశుద్ధ మైన అంతఃకరణ బుద్ధితో నుండవలెను.
'శ్రుతులలోను, స్మృతు లలోను ఏది చెప్పబడి యున్నదో, అదినాఆజ్ఞ' ఆ శ్రుతిస్మృతులకు వ్యతిరేకముగ ప్రవర్తిం చు వాడు నాకు ద్రోహి. అతడెంతటి భక్తుడైనా నరకమును పొంద వలసినదే!' అని పరమేశ్వరుడు వచించినట్లు ప్రబల మైన ప్రమాణములు ఉన్నవి. 'బ్రాహ్మణం కర్మ కుర్వీత' అనే వాక్యము ననుసరించి బ్రాహ్మణు లైన వారందరు కర్మ విధిగా ఆచరించ వలసినదే. బ్రాహ్మణుల కెక్కడా కర్మత్యాగం చెప్ప బడి యుండ లేదు. పైగా దేవాంతర పూజను విడువ గూడదు. 'అగ్నిర్దేవో ద్విజాతీనాం' అని శాసించడంవల్ల బృహ్మ చారి మొదలయిన వారందరు కర్మత్యాగం చేయరాదని తేలినది. త్రికాలముల యందు సంధ్యావందనం విధిగా ఆచరించ వలెను. అట్లు చేయనందువలన వచ్చు దోషం పోగొట్టు కొన వలయునన్న మూడు కృచ్ఛవ్రతము ల నాచరించవలెను. విప్రునకు కర్మ చేయడం తో శూద్రత్వం పోయి ద్విజత్వము వచ్చునని శాస్త్రము వచించు చున్నది. రెండు పుట్టుకలు అందొకటి శూద్రత్వము, రెండవది బ్రాహ్మణత్వము కలది గనుకనే బ్రాహ్మణులను ద్విజులన్నారు. కర్మ చేయనివాణ్ని ద్విజుడు అనడం మహాదోషం.
‘నకర్మణా నప్రజయా' అను శ్రుతి వాక్యము న్నది గదా యనెద వేమో అది ద్విజుల కొరకు చెప్పబడి యుండలేదు. సన్న్యాసం పొందిన యతుల కొరకై
పరిత్యాగం చెప్పబడినది అని వివరించి చెప్పిరి.
శ్రీ శంకరులు వచించిన ధర్మం బుర్రకెక్కి సంతుష్టుడై నామ తీర్థుడు జగద్గురు వులకు సాష్టాంగ వందనము లర్పించి అప్పటి నుండి కర్మలు చేయడం ప్రారంభిం చాడు. మిగిలిన వారందరు ధర్మసూత్రా లను గ్రహించి జ్ఞాన మార్గమందు సంచరిం చడం ప్రారంభించి అద్వైతులయ్యారు. శిష్యులతో అచ్చట నుండి సుబ్రహ్మణ్య క్షేత్రమునకు శ్రీఆచార్య స్వామి పయన మయ్యారు.
*కాలడి శంకర కైలాస శంకర*
*శ్రీ ఆది శంకరాచార్య చరితము 31 వ భాగముసమాప్తము*.
🌺🌺🌺🌼🌼🌼🌺🌺🌺
*శ్రీ ఆది శంకరాచార్యచరితము 30
*శ్రీ ఆది శంకరాచార్యచరితము 30 వ భాగము*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
పరమేశ్వరుని తెలియ జేయుటకు మాటలు చాలవు, మనసున భావించుటకు శక్యం కాదు. అట్టి పరమాత్మ సచ్చిదా నంద స్వరూపమై ప్రకాశించుచున్నది. శివుణ్ని ఉపాసించుటకు యోగ్య మైన విభూతి, రుద్రాక్షలను ధరించ వచ్చును. ప్రమాణ రహితము లైనవి విడనా డండి.'అని ఉపదేశించారు.
అంతలో మరియెక లింగధారి లేచి, 'స్వామీ! లింగధారణ నిషేధమను చున్నారు. అద్దానిని మే మెన్నటికీ సహించ జాలం. తామట్లనవలదు. ధారణకు ఆధారములు ప్రబలంగా నున్నవి. ఒకప్పుడు దేవత లకు త్రిపురాసురులకు గొప్ప పోరు సంభవించి నది. అందు దేవతలు అసమర్థులయ్యారు. అప్పుడు వాళ్ళందరు సమావేశమై త్రిపురాసురులను సంహరించుటకు ఉపాయమాలోచించారు. అగ్ని చంద్ర, విష్ణువులను ప్రతిష్ఠించారు. ఆ ముగ్గురి చేత ఒక బాణాన్ని సృష్టింపజేశారు. అది బహు బరువుగను, బలముగను తయారైంది. అట్టి దాన్ని ఎత్తడం వాళ్ళకసాధ్యమైంది. దాన్ని ఎత్తేవారెవరా యని ఆలో చించగా రుద్రుడందులకు సమర్ధుడని నిర్ణయించి వారందరు పరమశివుని ప్రార్థించారు. వారి మొరాల కించి రుద్రుడు ప్రత్యక్షమై తానొక వరమును కోరు కొందుననగా దేవతలం గీకరించారు. 'పశువులకు పతిని కావాలి' అని రుద్రుడు వ్యక్తం చేశాడు. అప్పుడు దేవతలందరు పశువులైనారు. రుద్రుడు పశుపతి యైనాడు. దేవత లప్పుడు భక్తితో పశుపతి చిహ్నాలను ధరించారు. అంతట పరమశివుడు మేరువును విల్లుగను, వాసుకిని నారిగను, భూమిని రథముగను, సూర్యచంద్రులను చక్రము లుగను వేదాలనుగుఱ్ఱము లుగను, బ్రహ్మను రథ సారధిగను నియమిం చాడు. అట్టి సమయ మందు దేవతలు స్తోత్రం చేయుచుండ పరమశివుడు రాక్షనులను సంహరించాడు. కనుక లింగం మొదలై నవి ధరించడం భావ్యమే కదా! పరమశివుని సేవకు లగుట చేత వారి యందు మాకుండేభక్తిని పురస్క రించుకొని వారిని గౌరవిం చుటకు శివచిహ్నాలను ధరించి యున్నాము. ఇది తప్పా? ప్రభువులు ధరించే ఆయుధాలు వారి యెడ నుండే భక్తికొలది సేవకులు ధరించడం లోకాచారమై యున్నది కదా!' అని శ్రీ శంకరాచార్యులకు వివరించాడు.
లింగధారి చెప్పినదంత యు శ్రీశంకర పాదులు చక్కగా విని 'భక్తాగ్రగణ్యా! నీ వాడు మాటలకు విలువ లేదు. త్రిపురాసుర వధలో దేవతలు లింగధా రులయ్యారన్న విషయం ఏ గ్రందమందును కానరాదు. అది ఎంత మాత్రము నిజంకాదు. విభూతి, రుద్రాక్షలు ధరించారంటివి. అది సమంజసముగ నున్నది. ప్రమాణ రహిత మైనది సత్యమనుటకు ఆస్కారమేది? కనుక లింగ ధారణ నిరాధారము,నిష్ప్రయోజనమును. భక్తి, శ్రద్ధ,ధ్యానం మొదలైనవాని వల్ల ఆత్మను తెలిసికోమని సత్యోపనిషత్తు తెలుపు చున్నది. శూలం మొదలైన చిహ్నధారణ జ్ఞానార్జనకు హేతువని ఎక్కడా చెప్పి యుండలేదు. ముక్తికి మార్గం జ్ఞానార్జన పరమ శరణ్యం. చిహ్నధారణ శరీరమునకు బాధ కలుగ డంతప్ప వేరు ప్రయోజనం కానరాదు.
రాజచిహ్నములను సేవకులు ధరించడం లోకాచారమైనచో మాత్రం చామరం మొదలైనవి ధరించుటలేదే! అట్టివి సేవ కులు ధరించ వచ్చునా? కనుక పరాత్పరుని చిహ్నా లను ధరించడం బరువు చేటు! భక్తాగ్రగణ్యా! పరమ శివునకు పన్నగములు భూషణములుగా నున్నవి కదా! భక్తులు పాములను ధరించరేల? త్రాటిని జూచి పామనుకొని భయపడే మానవులు నాగధరులగు దురా! కావున పరమేశ్వర చిహ్నాలను ధరించడం భక్తులకు పాడి గాదు. ఇవి పామర చేష్టలు! అవి విడనాడి వేదోక్తమైన కర్మల నాచరించుడు! మీ మీ చిహ్నములను పరమేశ్వరు న కర్పణ చేయుడు. 'నేనే ఇదంతా చేస్తున్నాను' అను బుద్ధిని వీడి ఆత్మ సంయమనం అలవాటు పరచుకొనుడు. దానివలన కలిగే జ్ఞానంతో ముక్తిని బడయగలరు!' అని శ్రీ ఆచార్యస్వామి వివరించారు.
అంతట విపక్షశూలుడను లింగధారి శ్రీ శంకరాచార్య స్వామి వచించినది సత్య మని నమ్మి నిష్కల్మష హృదయుడై వారి పాదము లపైబడి శరణు వేడు కొన్నాడు. బంధుమిత్రుల తో అద్వైతము నవలం బించుటకు విపక్షశూలుడుకృతనిశ్చయుడైనాడు. ఆవిధంగా శ్రీశంకరాచార్య స్వామి కాంచీపుర మందు శివమతస్థులనందరినీ అద్వైతులను గావించి అచ్చోటు వీడి కొలది దినములలో అనంతశయ న క్షేత్రం చేరుకొన్నారు.
అనంతశయన క్షేత్రము:
శ్రీశంకరాచార్య స్వామి అనంతశయన క్షేత్రం ప్రవేశించి అందు వేంచేసి యున్న అనంత పద్మనాభ స్వామిని దర్శించుచు విష్ణుభక్తుల లోపాలను సవరించుచు ఒక నెలరోజు లపాటు నివసించారు. తిరువనంతపురము, త్రివేండ్రము అని అనంత శయన క్షేత్రమునకు పేరులు. ఈనాడు అది కేరళ రాష్ట్రమునకు రాజధానీనగరమై ప్రకాశించుచున్నది. ఆనాడ చ్చట నున్నవారందరు విష్ణుభక్తులు. వారలు ఆచార వ్యవహారములను బట్టి ఆరు రకములుగా నున్నారు. వైష్ణవులు, భక్తులు, భాగవతులు, పాంచరాత్రులు, వైఖాన సులు, కర్మహీనులు అనునవి వైష్ణవశాఖలు. శ్రీ శంకరాచార్య స్వామి వచ్చారన్న వార్త వినుటతో వారందరుచూడవచ్చిరి. శ్రీ ఆచార్యపాదులు వారలతో కుశల ప్రశ్నలు గావించారు. వారలలో విష్ణుశర్మ లేచి శంకరాచార్యులతో,
'స్వామీ! వాసుదేవుడు శ్రీ రామావతారము, కృష్ణావ తారము ఎత్తియున్నారు. మేమందరం మూఢుల మైనను వాసుదేవుని ఉపాసించుటవలన పవిత్రులమై విష్ణు సాలోక్య ము పొందుచున్నారము. పూర్వమందు కౌండిన్య మహర్షికి సాక్షాత్కరించిన అనంతపద్మనాభుని మిగుల భక్తితో సేవించు చుంటిమి. ప్రతి నిత్యము మేము చేయుచున్న పని అదియే.
మాలో కర్మఠులు, బృహ్మగుప్తులు, జ్ఞానులు మొదలయిన వారందరం ఇచ్చోటనే ఉండి కర్మలు చేస్తూ జ్ఞానార్జన చేయుచు న్నాము.' అని విన్నవిం చాడు.
శ్రీఆచార్యస్వామి, విష్ణుశర్మ పలుకులు విని జ్ఞాన లక్షణము ఎట్టిదో వివరిం చమన్నారు. "స్వామీ! పరాత్పరుని ప్రమేయం లేనిదే గడ్డి పరకైనను కదలలేదు. అట్టి పరాత్పరు ని పాదపద్మములే శరణని విశ్వసించి మౌనం వహించి యుండడమే స్థిరమైన జ్ఞాన" మని విష్ణుశర్మ శంకరులకు జవాబిచ్చాడు.
శ్రీ ఆచార్యపాదులు వాని అజ్ఞానమునకు జాలినొంది, 'నాయనా! బ్రాహ్మణుడు జన్మచేత శూద్రుడు. కర్మ చేత ద్విజుడగు చున్నాడు. ద్విజుడు మూడు వేళలా సంధ్యావందన మాచరించ వలెను. త్రికాలముల యందు అగ్నిని పూజిం చాలి. ఇట్టి కర్మలు బ్రాహ్మణుడు విధిగా చేయవలెనని శ్రుతి ఘోషించుచున్నది. సంధ్యా వందనం చేయనిచో ప్రత్యవాయ దోషం సంభ విస్తుంది. వేదవిహితము లైన కర్మల నాచరించిన సకలశుభములు పొందు చున్నాడు. అట్లాచరించని వాడు సకల దుఃఖములకు లోనగుచున్నాడు. ఇది మనువు శాసించినది. మనువు శాసించిన నిత్య కర్మలను ఆచరించని వాడు జీవకోటి యున్నంత వరకు నరకమును పొందు చున్నాడు. యతులు కర్మలు చేయనక్కర లేదని తలంచకు. స్నానం, జపం, తపం, దేవతార్చన వారల కు విహితములు, సర్వ సంగ పరిత్యాగులయిన సన్న్యాసులకే కర్మలు విధించ బడినప్పుడు ఇతరుల విషయం వేరుగ వచించవలెనా? బ్రాహ్మణు డు విధికర్మల నాచరించని నాడు వాని బ్రాహ్మణ్యం మంట గలసిపోతుంది. ఏ కొంతకాలమైనను కర్మను విడనాడినచో భ్రష్టుడై యమయాతనలకు లోను గావలసినదే' అని విష్ణు శర్మాదులకు ఉపదేశం చేశారు.
*పంచాయతన పూజ:*
శ్రీశంకరపాదులు విష్ణుభక్తు లను మంచి మార్గమందు ఉంచనెంచి, ‘మానవులై జన్మించి నందుకు జ్ఞానము నార్జించుకొని ముక్తి నొందు టయే పరమావధి. దాని నెట్లు పొందవలెనో తెలిసి కొనుడు. పరమేశ్వరుడు, విష్ణువు, ఆదిత్యుడు, పార్వతి, గణపతి అనువా రైదుగురు దేవతలు, వీరం దరు ఉత్తమోత్తములు. మీరందరు ఈ పంచదేవతా పూజను ప్రారంభించుడు. ఏ కోరికలు మనసు నందు తలంచక బ్రహ్మార్పణ బుద్ధితో అర్చించు కొనుడు. తద్వారా మీ మీ అంత:క రణలు పరిశుద్ధమై మీకును, పరాత్పరునకును అభేదముదయించును. అందులో మీకు గల అజ్ఞానం మాయమై 'నేనేపరమాత్మను' అనే నిశ్చయజ్ఞానం కలుగును. అదియే మోక్షము. అట్టి ముక్తి కలుగుట కనేక కారణము లున్నవి. చెప్పెదను ఆలకించుడు.
జీవేశ్వరాభేదం దృఢంగా నమ్మునప్పుడే లింగదేహం నశించును. ఆ స్థితిలో సంకల్పములు మొలక లెత్తుటకు ఆస్కారం కాన రాదు. అట్టి నిస్సంకల్ప స్థితిలో మాయా వరణలు తొలగుటతో ఆత్మ దేదీప్య మానంగా ప్రకాశించును. దానినే శాశ్వతానందస్థితి లేక శాశ్వతమైన ముక్తి యందురు.' అని తత్త్వము నొకించుక ఉపదేశించారు.
శ్రీఆచార్యస్వామి వెదజల్లిన తత్త్వ రహస్యబీజములు విష్ణుశర్మాదులలో నాటు కొని మొలకలెత్తినవి. నాటినుండి వారందరు పంచాయతన పూజ ప్రారంభించి, ఆయన శిష్యవర్గమంతా శంకరులు చెప్పినచొప్పున చేయుచు, నిత్యం మృత్తికాస్నానము లాచరించుచు, భస్మ చందనములతో త్రిపుండ్ర ములను ధరించుచు, నియమనిష్ఠలు గలిగి ప్రవర్తించుచు జ్ఞానార్జన చేసికొనిరి.
బృహ్మగుప్తుడను వైష్ణవ మతకర్మఠుడు పేరొందిన భక్తుడు. విష్ణుభక్తులకు శంకరులు బోధించిన దంతయు శ్రద్ధగానాలకించి శ్రీశంకరపాదులను సమీపించి, 'యతిశ్రేష్ఠా! నమస్కారములు! మేమందరము స్మృతులలో తెలిపిన ప్రకారము కర్మల నాచరిం చుచున్నాము. అట్లు సత్కర్మల నాచరించుచు పద్మనాభస్వామి వారి క్షేత్ర మందు నివసించు చున్నాము' అని నివేదించుకొన్నాడు.
శ్రీశంకరాచార్యులు బృహ్మ గుప్తుని విధానమును విని, మీరందరు నిర్మలమైన మనసుతో పరమేశ్వరా ర్పణ భావంతో భక్తిశ్రద్ధలు గలిగి పంచాయతనపూజ సల్పుకొనుడు. జీవుడు, ఈశ్వరుడు అను భేద భావం లేకుండ జేసి కొనుచు సూక్ష్మ దేహానికి లోనుగాక, అజ్ఞానమును పారద్రోలి శాశ్వతానందము ను పొందుడు! అని వెలువరించుటతో బ్రహ్మ గుప్తాదులు సంతసించి, అనేక నమస్కారము లర్పించి నిర్మల చిత్తుల య్యారు. ఆ నాటి నుండి వారు అద్వైతులై స్థిరమైన ఆనందమును పొందు మార్గము నవలంబించారు.
పిమ్మట భాగవత శాఖకు చెందినవారు శ్రీ ఆచార్య పాదునితో ముచ్చటించ నుద్యుక్తులయ్యారు.
భాగవతశాఖకు చెందిన విష్ణుభక్తు డొకడు శంకరు లకు నమస్కరించి, 'వేదములలో ఎన్నివిధాల పుణ్య మార్జించు కొను విధానములు తెలుపబడి యున్నవో అవన్నియు విష్ణుమూర్తిని స్తుతించుట వలననే కలుగుచున్నవి. అందువల్లనే మేమందరం విష్ణువును కీర్తించడమందే నిమగ్నులమై శంఖం, చక్రం మొదలయిన చిహ్నాలను అంకితం చేసికొని కంఠాన తులసిమాలలు అలంక రించుకొని ఊర్థ్వపుండ్రాలు ధరించుచున్నాము. కావున ముక్తి మా అరచేతులలో నున్నది. ఇంక మాకు చింతా చీకూ అన్నది లేదు.' అని తన మతధర్మములను వివరించాడు.
శ్రీఆచార్యస్వామి భాగవతుని విధానము విని, 'భక్తులారా! విష్ణువు నాలుగు రకముల మూర్తులుగలిగియున్నాడు. అందొకటి గగనము వలె నున్నది. అది చెప్పుటకు గాని, తలంచుటకు గాని శక్యం కానిది. దీనినే పరామూర్తి యందురు. అట్టి మూర్తికి ఏవిధమైన చిహ్నములు లేవే! అతడు కేవలం నిర్గుణుడు, నిర్వికారుడు, సర్వవ్యాపి.
అట్టివాని రూపమును ఏవిధముగ ధరించగలరు? రెండవమూర్తి వ్యూహమ ను పేరుతో వెలయు చున్నది. ఇది సర్వాత్మ స్వరూపముగా నున్నది. అట్టి రూపము నెట్లు ధరించు కొనగలరు? ఒక వేళ సమర్థత గలదందురా, అట్లయిన ఆయన యొక్క ఒక చిహ్నము చేత శిరస్సు మొదలుకొని పాదాల వరకు కాల్చుకొనుడు! అప్పుడు మీకు తప్పక ఈ శరీరం విడచిన తరువాత వైష్ణవత్వమును పొంద గలరు. ఇది దుస్సాధ్యం గదా! మూడవమూర్తి మీనాది అవతారమూర్తు లు. దీనికే విభూతి యనిపేరు. ఈ చేప మొదలయినవి లోహంతో తయారు చేసుకొని దానిని కాల్చి శరీరం మీద గుర్తులు పెట్టుకొనుడు. నాల్గవ మూర్తి అర్చామూర్తి. ఇవి రాళ్ళతో తయారు కాబడును. శిలారూపాన్ని మీమీ శరీరాలయందు చిహ్నాలుగా ధరించెదరా? శంఖచక్రాలపేరుతో కాల్చు కోవడమేల? లోహాదులతో తయారైనవే ధరించిన సమంజసంగా నుండు నేమొ! భాగవతులారా! శంఖచక్రాంకితాలు పాషండమతమునకు చెందియున్నవి. పరాత్ప రుని ప్రీతికొరకు సత్కర్మల నాచరించుడు. కర్మఫలితం పరాత్పరునకు అర్పణ చేయండి. అట్లాచరించిన పరిశుద్దులగుదురు. అద్వైత తత్త్వ వేత్త యగు పరమగురువు నాశ్రయించి వారి తత్త్వోప దేశాలను పొందుడు. అప్పుడు కర్మ బంధములు తొలగి మోక్షమును బడయగల' రని గంభీరోపన్యాస మిచ్చారు.
*కాలడి శంకర కైలాస శంకర*
*శ్రీ ఆది శంకరాచార్యచరితము*
*30 వ భాగముసమాప్తము*
💕💕💕💕💕💕💕💕💕💕💕💕
శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 25
*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 25 వ భాగము*
🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦
ఆనందగిరి ఒకనాడు గురువుల కౌపీనములు శాఠీలు శుభ్ర పరచుటకు తుంగా తీరానికి వెళ్ళాడు. పని పూర్తి కాలేదు. ఈ లోగా కూడా వచ్చిన సహ శిష్యుడు ఆనందగిరిని తొందర చేశాడు పాఠానికి వేళ అవుతోందని. తన పని అయ్యే దాకా వేచి ఉండమని ఆనందగిరి కోరినా ఆ శిష్యుడు ఉండక విడచి వెళ్ళాడు. అక్కడ భాష్య పాఠాన్ని ఆరంభించడానికి శంకరుడు, శిష్యులు ఆసీనులై ఉన్నారు. గురువులు ఆనందగిరి లేకపోవడం చూచి అతని కోసం వేచి ఉందామని పాఠం మొదలు పెట్టలేదు. "ఆనందగిరి తుంగభద్రా నదికి శాఠీలు శుభ్ర పరచడానికి వెళ్ళాడు. అతడు వచ్చుటకు ఆలస్య మగుతుంది” అని శిష్యులు గురువు గారిని పాఠం ప్రారంభిం చమని కోరారు. పద్మపాదుడు తన మాట గురువు మన్నించునని ఎంచి “గురుదేవా! ఆనంద గిరికి ఈ పాఠములు అత్యంత అవసరమా? ఈ గోడ ఎంతో అతడంత. మీకు తెలియని విషయమా!” అని విన్నవించాడు. వారి అందరి అజ్ఞానము, అహంకా రము చూచిన శంకరాచార్యునకు వారికి కనువిప్పు కలిగించాలని నిశ్చయిం చారు. వారి అపార కరుణా సంపత్తితో ఆనందగిరిని ఆ క్షణంలో మార్చివేశారు. అతని లోని అంధకారం మటుమాయ మైనది. పదునాలుగు విద్యలలో ఒక్క క్షణంలో నిష్ణాతు డయ్యాడు! తత్త్వ విచారము కరతలా మలక మయింది. గురుదేవుని స్మరిస్తూ తొందరగా అడుగులు వేస్తూ ఆశ్రమం చేరుకొన్నాడు. వచ్చీ రాగానే ఈ శ్లోకాలు వినిపించాడు:
*"భగవన్ను దధౌ మృతి జన్మ జలే,*
*సుఖదుఃఖ ఝషే పతితం* *వ్యధితమ్ కృపయా శరణాగత ముద్ధర మా,మనుశాధ్యుపసన్న మనన్యగతిమ్||*
"ఈ విధంగా పలికి గురువు సన్నిధానంలో నిలబడి తనకు తెలిసిన తత్త్వ రహస్యాన్ని నివేదిం చాడు. అది విని నిర్విణులయిన శిష్య గణం తాము ఎంత తక్కువ శ్రేణిలో ఉన్నారో అర్థం చేసి కొని గురుకరుణ దీటు లేనిదని ఆనందగిరిని గౌరవాదర దృష్టితో చూశారు. తోటక వృత్తములతో వేద తత్వాన్ని అంత చక్కగా విశ్లేషించిన ఆనందగిరికి 'తోటకాచార్యుడు' గా నామకరణం చేశారు శంకరస్వామి!
*శ్రీ శంకరాచార్యుల శిష్యులు నలుగురు:*
పద్మపాదుడు, హస్తామలకుడు, సురేశ్వరాచార్యుడు, తోటకాచార్యుడు.
ఒకరిని మించిన వారొకరు. శ్రీమహావిష్ణువు చతుర్భుజాలతో ధర్మార్థకామమోక్షములనే నాలుగు పురుషార్థాలను ధరిస్తాడంటారు. శ్రీశంకరాచార్యుడు నాలుగు వేదాలను నాలుగు భుజాలుగా ధరించాడు. నిష్కామకర్మ యోగము, ధ్యానయోగము, భక్తియోగము, జ్ఞానయోగము అనునవి సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యము లనే నాల్గు మోక్షాలను ఇచ్చేవి. చతురాననునకు సనక, సనందన. సనత్కుమార, సనత్సుజాతులనే నలుగురు కుమారులు. శంకరులకు నాలుగు మహావాక్యాలను పాలించే నలుగురు శిష్యులు నాలుగు బాహువులుగా భాసిల్లారు.
*‘నైష్కర్మ్యసిద్ధి'*
శృంగగిరిలో ఉండగా సురేశ్వరాచార్యుడు శంకరాచార్యస్వామి దగ్గరకు చేరి పాదాభి వందనము చేసి "స్వామీ! నాకొక ఉద్గ్రంథమును వ్రాయాలని కోరిక ఉన్నది. మీఆజ్ఞ సెలవియ్యండి” అని చెప్పాడు. శంకరుని హృదయము ద్రవించి తాను రచించిన సూత్ర భాష్యములకు వార్తికములు వ్రాయ మన్నాడు. దానితో సురేశ్వరాచార్యుని ఆనందానికి పట్టపగ్గము లు లేవు. ఈ వార్త విన్న శిష్యులు ఆ నిర్ణయానికి సుముఖులుగా లేరు. సూత్రభాష్యాలకు వార్తికాలు వ్రాయడ మంటే మాటలా? అసలు ఆ భాష్యాలను అర్థం చేసికొనడమే అసాధ్యం. ఇక వార్తికాలు రచించగల సామర్థ్యము మాటలతో వస్తుందా? తమలో తాము చర్చించుకొని శంకరులను చేరి ఈ విధంగా విన్నవించారు: "స్వామీ! సురేశ్వరా చార్యుడు నిన్న మొన్నటి వరకు కర్మలో మునిగి యుండి పరమాత్మ తత్త్వాన్ని కాదన్నవాడు. వాద సమరంలో మీచే విజితుడై మార్గాంత రము లేక విధిగా సన్న్యాసస్వీకారము చేసినవాడు. పూర్వ వాసనలు ఊరక పోగలవా? మా అందరి అభిప్రాయము సురేశ్వరుని పాలబడిన అధ్యాత్మ తత్త్వమునకు ముప్పే గాని మేలు జరగదని భావిస్తున్నాము. తరువాత మీ దయ” అని వినయంగా విన్నవించుకొన్నారు.
శంకరులు ఆలోచనలో పడ్డారు. ఈలోగా హస్తామలకాచార్యుడు వచ్చి గురువులకు వందనము చేసి ఇట్లా చెప్పాడు: “జగద్గురో! పద్మ పాదుడు బ్రహ్మచర్యాశ్రమములో నుండి నేరుగా మీ దగ్గరకు వచ్చి శిష్యుడై వేదవేదాంగాలను క్షుణ్ణంగా ఆకళించుకొని సర్వమూ తెలిసిన వాడు. వార్తిక రచన అతని చేతిలో కడు సమర్థంగా జరుగ గలదు. మీరు ఎరుగనిది లేదు. ఒకవేళ అతడు కాదను కుంటే తోటకాచార్యుడే ఇందుకు సర్వసమర్థుడు” అని విన్నవించి వెళ్ళి పోయాడు. తరువాత వచ్చిన పద్మపాదుడు శంకరులను కలసి వందనము చేసి, వార్తిక రచనకు హస్తామలకుని పేరు సూచించి అతడు వ్రాస్తే 'బంగారమునకు పరిమళం అబ్బినట్లుం టుంది' అన్నాడు. శంకరాచార్యుడు ఆ మాట విని "పద్మపాదా! నీవన్నది నిజం.నీకు తెలుసును. అతడు బాహ్యప్రపంచం తో సంబంధం లేని వాడు. పుట్టిననాటి నుండి జడుడై యున్నపుడు అతని తండ్రి నా కడకు వచ్చి వానికి జ్ఞానభిక్ష ప్రసాదించమని అర్థించాడు" అనగా పద్మపాదుడు “గురువర్యా! అంతటిలో అతనికి అంత జ్ఞానం ఎలా లభించింది? ఆశ్చర్యం గా ఉంది.” అని శంకరుని ప్రశ్నించాడు. అప్పుడు శంకరాచార్య స్వామి హస్తామలకుని పూర్వగాథ పద్మపాదు నికి ఈ విధంగా తెలియజేశారు.
“ఒకప్పుడు యమునా నదీ తీరాన సిద్ధు డొకడు పరమాత్మ తత్త్వమందే విహరించే వాడు ఉండేవాడు.
రెండేండ్ల ప్రాయము కల తన కొడుకుని తీసికొని ఒకామె నదీతీరానికి వచ్చింది. చంకలో నున్న బిడ్డను సిద్ధుని దగ్గర ఉంచి బిడ్డను చూస్తుండమని సిద్ధునికి చెప్పి నదిలోనికి స్నానానికి దిగింది. సిద్ధునకు ప్రాపంచిక స్పృహ లేదు కాబట్టి ఆమె మాటలు చెవికి వినబడ్డా సిద్ధుని మనస్సుకు అందలేదు. తప్పటడుగులు వేసు కొంటూ పిల్లవాడు మెలమెల్లగా నీటి లోనికి జారి మునిగి పోయాడు. ప్రాణాలు పోయిన తరువాత నీళ్ళపై తేలింది పిల్లవాని శవం. తల్లి స్నానం చేసి వచ్చేలోగా జరిగిపోయిన ఘోరం చూసి తల్లి లబో దిబో అని ఏడ్వడం మొదలు పెట్టింది. సిద్ధుని ముందు శవాన్ని ఉంచి ఎలాగైనా బ్రదికించమని దీనంగా వేడుకొంది. ఈ లోగా సిద్ధునికి తెలివి వచ్చింది. చూచి జాలి పడ్డాడు. కాని ఏమి చేయగలడు? చచ్చిన బిడ్డను బ్రతికించడం సాధ్యమైన పనియేనా! ఏమీ చేయలేక తల్లి దు:ఖం పోగొట్టుదా మన్న సంకల్పంతో ఒక నిర్ణయానికి వచ్చాడు. యోగశక్తితో బాలుని మృతకళేబరంలో ప్రవేశించాడు. పిల్లవాని కి ప్రాణం వచ్చి లేచి కూర్చున్నాడు. ఆ బాలుడే మన హస్తామలకుడు" అని చెప్పి మరల ఇలా అన్నారు శంకరులు: “అలాంటి వాడు హస్తామలకుడు. అతడికి లోకంతో పరిచయం పూర్తిగా మృగ్యమే! వార్తికాలు వ్రాయడానికి పనికి రాడే! పైగా మండన మిశ్రుడు సామాన్య పండితుడు కాడే! ఇక వేరొకడు కానరాడ య్యెనే!" అప్పుడు శిష్యులు శంకరునితో "స్వామీ! ఇది మహా కార్యము. మీరు తొందర పడకండి" అని వేడు కొన్నారు. సరే నన్నారు గురువు. ఆ తరువాత సురేశ్వరుని కలిసికొని శంకరుడు 'సూత్రభాష్యాన్ని వ్రాయడం మానుకో. దానికి బదులు నీ స్వతంత్ర రచనగా ప్రపంచానికి పనికివచ్చే ఒక ఉద్గ్రంధాన్ని వ్రాయి' అని ఆదేశించారు. వార్తిక రచనకు అవరోధం కలిగినా ఒక మహా గ్రంధాన్ని రచించమన్న గురుదేవుని ఆజ్ఞ శిరసా వహించి ఆ పనికి ఉపక్రమించాడు సురేశ్వరుడు. అనతి కాలంలో పూర్తి చేసి గురుదేవునికి చూపాడు. శంకరుడు ఆ రచనను ఆమూలాగ్రం పరిశీలించి మెచ్చి శిష్యులకు చూడమని ఇచ్చారు. ఆ గ్రంధం సామాన్యమైనది కాదని, ఆధ్యాత్మిక తత్వాన్ని విపులీకరిస్తూ ముక్తిపథానికి యుక్తియుక్తముగా చక్కని బాట వేసిన గ్రంధమని కొనియాడ బడుచున్న ఆ గ్రంధమే 'నైష్కర్మ్యసిద్ధి' అన్న సార్థక నామంతో ఈ నాటికీ యతి లోకానికి శిరోధార్యమై ఉన్నది.
ఈ గ్రంధం తరువాత సురేశ్వరాచార్యుడు తనకు సూత్రభాష్యా లకు వార్తికాలు రచించే అవకాశం దక్క నీయ లేదన్న కోపంతో 'ఎంతటివాడైనా బ్రహ్మసూత్రాలకు వార్తిక గ్రంధరచన చేసినచో అది నశించు గాక!' అని శపించాడు. తర్వాతి కాలంలో శంకరుని ఆదేశాను సారమే బృహదారణ్య కోపనిషత్తుకు, తైత్తిరీయ ఉపనిషత్తుకు శంకరులు వ్రాసిన భాష్యాలకు వార్తికాలు వ్రాశాడు.
పద్మపాదుడు సూత్ర భాష్య టీకా గ్రంధాన్ని వ్రాసి శంకరాచార్యులకు సమర్పించాడు. మొదటి భాగానికి 'పంచపాదిక' అని, రెండవ భాగానికి ‘వృత్తము' అని పేరు పెట్టాడు.
పంచపాదికను ఆమూలాగ్రం గురువుకు చదివి వినిపించాడు. ఈ భాగానికి చిరతరకీర్తి కలుగుతుందని శంకరులు అనుగ్రహించారు. దానితో ఆవిధంగా సురేశ్వరుని శాపం పరిహరింప బడింది. శంకరుడు హస్తామల కాచార్యుని పిలిచి అతనిని కూడా అద్వైత ప్రచారమునకు అనువైన గ్రంధాలను వ్రాయమని ప్రోత్స హించారు.
ఒకనాడు సురేశ్వరుని పిలిచి “సురేశ్వరా! నీవు మరల ఈ లోకంలో 'వాచస్పతి' అనే పేర జన్మించి భామతీ వ్యాఖ్యానము అను పేర సూత్ర భాష్యమునకు వార్తిక గ్రంథమును వ్రాస్తావు. అది వేదాంతులకు చాలా ఆదరణీయ మవుతుంది".
*ఆర్యాంబ అవసానదశ:*
శ్రీశంకరుని తల్లికి వృద్ధాప్యం వచ్చింది. శరీరపాటవం తప్పు కొన్నది. నిత్యకృత్య ములు స్వయంగా చేసుకోలేకపోతోంది. జ్ఞాతులు ఆమెను ఎంతో భక్తితో చూచుకొంటున్నారు. వేళకు తప్పకుండా స్నానం చేయించి మంచి బట్టకట్టి భోజనం తినిపిస్తు న్నారు.పుణ్యకథలు వినిపిస్తున్నారు. మలమూత్ర విసర్జనలు మంచం దగ్గరే జరుగుచున్నవి. తన స్థితి తెలిసి కొని ఇక ఎక్కువ రోజులు జీవించనని ఒకనాడు మనస్సులో తలచు కొంది తనయుడు ఇచ్చిన మాట. 'నన్ను తలచిన మరు క్షణం నీ దగ్గర ఉంటానమ్మా! అని శంకరుడు చెప్పిన సంగతి. నాకు ఏ కొరతా లేకుండా అన్నీ అమరుస్తున్నారు నాయనా! నీ చేతులలో వెళ్ళిపోవాలన్న కోరిక తప్ప నాకే కోరికా లేదు' ఇలా మంచం మీదనే ఉండి చీకటి పడిన తరువాత తలపోసింది. అదే తలపుతో ఆ రాత్రి చాలా సేపు నిద్ర పట్టక తెల్లవారు ఝామున కునుకు పట్టింది. ఆ రాత్రి శృంగగిరిలోనున్న శంకరాచార్యునికి నిద్ర రాలేదు. కోడి కూసిన సమయంలో తల్లికి ఇచ్చిన మాట స్పృహకు వచ్చింది. తన తల్లికి అవసాన సమయం వచ్చిందని గ్రహించాడు. ఆలస్యం చేయకూడదనుకొన్నాడు. ఒక్కసారిగా యోగశక్తితో వాయుమార్గాన వచ్చి తల్లిపాదాల దగ్గర వాలాడు. కళ్ళు తెరచి చూడగానే కనిపించిన శంకరుని చేరదీసికొని ఆమాత కౌగిలించు కొన్నది. "అమ్మా! నీ కోరిక ప్రకారం నేను వచ్చాను. నీకుకావలసి వన్నీ తీరుస్తాను. బెంగ వలదు” అని తల్లికి ధైర్యం చెప్పాడు శంకరుడు. అతని మాటలలోని ఆంతర్యం ఎరిగిన ఆర్యాంబ నాయనా! ఎన్నాళ్ళకు నిన్ను చూస్తున్నాను! నిన్ను చూడాలన్నదే నా కోరిక. తండ్రీ! ఈ శరీరం పని చేయడం లేదు. శక్తి ఉడిగింది. లేవలేకు న్నాను.
ఈ కాయంఎన్నాళ్ళుమన్నుతుంది? ఇంక విడిచి వేయాలి. నీ చేతులతో దీనిని బూడిద చేయి. జ్ఞానబోధ చేసి అందర్నీ తరింప జేస్తున్నావట. నాకుకూడ పుణ్య లోకాలకు పోవాలని ఉన్నది. ఆ భాగ్యం నీ వల్లనే చేకూరుతుంది” అని పలికింది ఆర్యాంబ.
శంకరుడు సంగాన్ని వీడినా సత్యాన్ని వీడ లేదు. లోకంలోని వారందరినీ తల్లులుగా భావించిన శంకరుడు ఆర్యాంబను జగన్మాత గా భావించాడు. తన తల్లికి పునరావృత్తి రహితమైన పరమపద సిద్ధి కలిగించడం తన ధర్మం. అప్పుడు పరాత్పరుని గూర్చి ధ్యానం చేశారు. అపుడు పరమేశ్వరుడు సపరివారుడై వచ్చాడు ఆమెను తీసికొనే సంకల్పంతో. అప్పుడు ఆర్యాంబ “నాయనా! వీళ్ళు మరోలా ఉన్నారు. నాకు విష్ణులోకానికి వెళ్ళాలని ఉంది” అని కోరుతుంది. వెంటనే శంకరుడు శ్రీకృష్ణుని మదిలో నిల్పుకొని ప్రార్థించాడు. ఆర్యాంబకు అప్పుడు లభించింది శ్రీమహావిష్ణు దర్శనం.చతుర్భుజుడై శంఖ చక్ర గదా శార్ఞ ఖడ్గధారియై వైజయంతీ మాల కంఠాన మెరయగా శేషతల్పుడై మహాలక్ష్మీ సహితుడైన శ్రీహరి! పార్శ్వముల నుండి భూదేవి, నీలాదేవి వింజామరలు వీస్తున్నారు. ఆర్యాంబ తన అభీష్టసిద్ధిగా వైకుంఠవాసురాలైంది. జగజ్జననికి చేసిన వాగ్దానములో మిగిలినది దహన సంస్కారము. "శంకరా! నీవు యతివి. నీకు కర్మ చేయనర్హత లేదు. కావలసిన వారము మేము ఉన్నాము కదా! విద్యుక్తంగా మేమే ఆ కార్యం నిర్వహిస్తాము. నీవు తొలగు అని జ్ఞాతులు, బంధువులు నివారించ ప్రయత్నం చేశారు.వారికి సమాధానంగా “నారాయణ స్వరూపులారా! సన్న్యసించుటకు ముందే నేను ఈమెకు వాగ్దానము చేసి యున్నాను. అది నా ధర్మము. పైగా ఈ జగన్మాత కోరిక కూడా. లేకున్నచో జరిగే ధర్మ అతిక్రమణమే నివారింపదగినది. నన్ను నమ్మి ఈ నా విధి నిర్వహణ ధర్మానికి తోడవ్వండి” అని వారందరికీ నచ్చజెప్పాడు. కాలడి లోని ఇంటి వెనుక దొడ్డి భాగములో చితి పేర్చి, దానిపై తల్లి భౌతిక కాయాన్ని అమర్చి, తల్లి కుడి భుజమును మధించాడు. అందు నుండి అగ్ని పుట్టు కొచ్చినది. యధావిధిగా అగ్ని సంస్కారము పూర్తి అయింది. కాలడి వాసులు మొదటిలో వైరుధ్యం చూపినా తరువాత నేటికీ ఈ పద్ధతినే పాటిస్తున్నారు.
*కాలడి శంకర కైలాస శంకర*
*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము*
*25 వ భాగము సమాప్తము*
🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷
*శ్రీ ఆది శంకరాచార్య చరితము29
_*శ్రీ ఆది శంకరాచార్య చరితము29 వ భాగము*_
🫑🫑🫑🫑🫑🫑🫑🫑🫑🫑🫑🫑
పాశుపతుడు చెప్పిన దంతా శ్రద్ధగా విని, 'శివభక్తులారా! నేచెప్పు నది శ్రద్ధగావినుడు! లోకాలకు మూలకారణ మైన వాడు ఒక్కడే. ఆయన కన్నగొప్పవాడు వేరొకడు లేడు. వేదము అటులనే చెప్పుచున్నది. అంతవరకు నాకు సమ్మతమే. వేదమందు ఏది యుండిన దానిని విధిగా నమ్మువాడను. నాకు నచ్చని విషయ ములు మీలోనున్నవి. పరాత్పరుని గూర్చి మీరు పలికిన విషయాలతో నాకేమి విరోధము లేదు. కాని మీరందరు లింగము, శూలము, డమరుక మొదలయిన బాహ్య చిహ్నాలను ధరిస్తు న్నారు. పైగా అట్లు ధరించినందువలన మోక్షం వస్తుందను చున్నారు. అందుకు వేదప్రమాణములు కానరావు. శాస్త్రము నెరిగిన వారెవరూ వేదంలో లేని విషయా లను, ఆచారాలను అంగీకరించరు. బ్రాహ్మణ దేహములను సమస్త దేవతలు ఆశ్రయించుకొని యుండెదరు. అట్టి దేహాలను కాల్చి లింగమని, శూలమని ధరించడం మంచిది కాదు.
పరమశివభక్తులారా! వేద వేదాంగాలు చదివిన బ్రాహ్మణుని యందు నాభికి పైన సోమపులు, దిగువను అసోమపులు నివసిస్తూ ఉంటారు. శిరస్సు, శిఖ, నుదురు, ముక్కు, చెవులు, కపోలము, నాలుక, గడ్డము, కంఠము, భుజములు, భుజాగ్రములు, అర చేతులు, వక్షము నడుము, తొడలు, మోకాళ్ళు, మడమలు, పాదములు వీని యందు బ్రహ్మాది దేవత లు, మునీశ్వరులు ఆశ్రయించుకొని యుందురు. స్నానము ఆచరించు నప్పుడు, ఆహార పానీయములు సేవించునప్పుడు వారు సదా సంతుష్టి నొందు చుందురు.' అని బ్రహ్మ అరుణ కేతువునితో చెప్పియున్నాడు. ఇది సత్యమని కూడ వచించాడు. అట్టి పరమ పావనమైన శరీరం కాల్చి ముద్రలు వేయడం ఎంతటి ఘోరాతి ఘోరమో యోచించ లేకున్నారు. అట్లు కాల్చుట వలన ఆయా స్థానాలలో నుండు దేవతలు శపించెదరు. వారు ఆ స్థానాల లోపల ఉండ వీలుండదు గదా! అట్టివాడు అగ్నిలో నున్న కాష్ఠము వలె కాలిపోవుచున్నాడు. కాల్చుకొన్న వానిని చూచినచో సచేలస్నాన మాచరించాలి. లేదా సూర్యదర్శనంచేయాలి. అప్పుడు గాని పాపం పోదు.
భక్తులారా! బ్రహ్మము అనే వేదాన్ని రక్షించే వాడు గనుక వాణ్ని బ్రాహ్మణుడన్నారు. అలాటి వేదాన్ని దేవత లందరు ఆశ్రయించు కొని యున్నారు. అట్టి బ్రాహ్మణుడు నాశనమై నచో లోకాలు సర్వనాశనం కాకుండ నుండగలవా? తాను వేరు, పరమాత్మ వేరు, అనే భావంతో చేసే ఉపాసన దూష్య మైనది. అట్టిమార్గంలో ముక్తిలేదు. దానికి శ్రుతి ప్రమాణము నున్నది. కర్మ నాచరించుచు, అశాశ్వతమైన జగత్తు ను తెలిసికొని, విరక్తుడై ఆత్మయందు అభిలాష గలవాడై యుండ వలెను. కర్మ నొక్క దాన్ని చేసినంత మాత్రాన మోక్షమెన్నటికి రాదు. విరాగియై వేదాలను తెలుసుకొని, ఇతర చింతనలను పూర్తిగ విడనాడి తత్త్వజ్ఞానము నార్జించుటకు పరమ గురువును ఆశ్రయించ వలయునని శ్రుతి నిష్కర్షగాతెల్పుచున్నది కావున మీరు ధరించే చిహ్నాలను తక్షణం విడనాడి కేవలం జ్ఞానం కోసం పాటు పడండి. తద్వారా ముక్తి లభించును. ముక్తి సుళువుగా లభ్య మయ్యేది కాదు. తత్త్వ విచారణ చేయుట వలన యోగము కలుగును. దాని వలన శోకమోహములు నశించును. అప్పు డాతడు స్థిరమైన ఆనందమును పొందు చున్నాడు. వేదాలు వల్లించినను, దాని అర్ధమును గ్రహించి నను బుద్దిచేత గాని, శాస్త్రాలు చదువుట చేతగాని, మోక్షం లభ్యమయ్యేది కాదు. పరాత్పరుని అనుగ్రహం సంపాదించు కొనవలెను. అట్టివాడు పరమాత్మను తెలిసికొని ముక్తుడు కాగలడు. సర్వాంతర్యామిని తెలిసికొనిన ధీరుడు ముక్తిని బడయ గలడు. అతనికి దుఃఖము లేవీ అంటవు. అతడే నిత్య మైన ఆనందమును పొందగలడు. ఆకసాన్ని చాపచుట్టవలె చుట్ట పెట్ట గలవాడు దుఃఖాన్ని పొందలేడు. ఇది అట్లున్నప్పుడు అజ్ఞానికి దుఃఖం ఎట్లు తొలగును? ఎటు చూచినా మోక్షం కావలయునన్న జ్ఞానం కలిగి తీరవలెను. అందులకు గురుకృపా కటాక్షం కావలెను.' అని శ్రీ శంకారాచార్య స్వామి పాశుపతుల లోపాలను సవరించారు.అట్టి సమయమందు వీరనాయకుడను శివభక్తు డొకడు లేచి,,,,
శ్రీ ఆచార్యస్వామిని సమీపించి అంజలి ఘటించి వినమ్రుడై, "స్వామీ! నీవే శరణ్యం! వేరొక దారి కానరాదు. కరుణించు పరాత్పరా! ఇంతదనుక కూపాంధ కారంలోబడి జ్ఞాన మార్గం తెలియక కొట్టుమిట్టాడుచున్నాము. తమ వాక్సుధా రసమును ప్రసాదిం చుడు. భేదభావం నశించి అద్వైతజ్ఞాన ముదయించినది. నేనే ఆ పరమశివుడను! నా పూర్వపుణ్య పరిపాకంతో తమ దర్శనభాగ్యం లభ్య మైంది. తాము శివునికన్న పరమైన పరమాత్మ స్వరూపం కలిగి యున్నారు.” అని బహువిధముల స్తోత్రం చేశాడు. అంతట ఆ పరమభక్తునకు శ్రీ శంకరాచార్యస్వామి అభయ ప్రదానం చేశారు. వీరనాయకుని బంధుజనులు,మిత్రులు అద్వైతమందు ప్రవేశ పెట్టబడి నారు. అంతలో లింగధారి యొకడు శ్రీశంకరులను ఎదుర్కొనుటకు ఉద్యుక్తుడైనాడు.
*లింగధారులకు తత్త్వ బోధ:*
పాశుపతుడైన వీర నాయకుడు శ్రీ శంకరా చార్యస్వామికి పాదా క్రాంతుడగుట లింగ ధారులు సహించలేక పోయారు. (శైవులలో లింగధారులొక అంత శ్శాఖ) వాళ్ళలో నుండి తేజోవంతుడొకడు కోప మాపుకోలేక లేచాడు. అతని మెడలో లింగం వ్రేలాడుచున్నది. రుద్రాక్ష మాలలు చాలా అలంక రించుకొన్నాడు.విభూతి రేఖలు మెండుగా ధరించు కొన్నాడు. మీద పడునట్లు ఉరకలు వైచుకొనుచు శ్రీ శంకరాచార్య స్వామిని సమీపించాడు. చూపరుల కాతడు రుద్రుని బోలి యున్నాడు.
'వంచకుడా! ఎంత పని చేస్తున్నావు! లోకాన్ని మోసం చేయుటకై మాయ వేషం వేసికొని పరమ పవిత్రము, పరమ ప్రమాణము అయిన మా శివ మతస్థుని నాశనం చేయుటకు పూను కొంటివా? ఎవ్వడవు నీవు చెప్పు? ఎంతటి మోసగాడివి! నీకంటె వంచకుడు వేరొకడు లేడే! ఎంత పని చేస్తున్నావు!’ 'విను! బ్రాహ్మణ్యం కంటే వైష్ణవ మతం గొప్పది. అంత కన్న శైవమతం గొప్పది. ఇది నారద మహర్షికి బ్రహ్మ వెలువరించిన విషయము. ఇది నీ వెరుగవా? ఇట్టి పరమ ప్రమాణ ముండగా వీరనాయకుణ్ని గంగలో కలిపివేశావే! ఇంత కన్న ఘోరం మరి యొకటి గలదా! వీరనాయకు డనిన సామాన్య వ్యక్తి కాడే! సర్వజ్ఞుడు! నీ కేమైన మతి మంద గించిందా? 'నమస్తే' అని వేదమే మహేశ్వరుడే పరమాత్ముడు సుమా! పరమశివుడందరి ముఖాల్లోను, శిరస్సుల లోను, కంఠముల లోను, హృదయముల లోను నివసిస్తూ సర్వాంతర్యామియై వెలయు చున్నాడే! 'సహస్రశీర్షాపురుష: సహస్రాక్ష స్సహస్ర పాత్' అని పురుష సూక్తము అంటున్నది. ఉపనిషత్తులలో గూడ పరమాత్మ పరమేశ్వరు డనియే స్పష్టం చేయ బడింది.'నిత్యానిత్యోహమ్’ (నిత్యము, అనిత్యము నేనై యున్నాను అని వేదము ఉచ్ఛరించు చున్నది. పరమాత్మ నిత్యము. జగత్తు అనిత్యము. ఈ రెండు ఆయనే గనుక నిత్యా నిత్యుడయ్యాడు, ఇది అధర్వవేద మందు స్పష్టంగా పలుకబడు చున్నది.
మహర్షులు పరమ శివుణ్ని అనేకవిధాల ధ్యానించి, పరమశివుడే ధ్యానింపదగిన వాడని నిర్ణయించినట్లు,
శివ రహస్యమందున్నది. కావున మహర్షులు సాక్షులైనారు. శుక మహర్షికి పరమశివుడు జ్ఞానోపదేశం చేసి యుండుటచే శుక మహర్షి మరి యొక సాక్షి. మార్కండేయుని తీసికొని పోవుచున్న యమదూతలను పరమశివుడు శిక్షించగా యమధర్మరాజు స్వయంగా వచ్చి యుండెను. అప్పుడు పరమ శివుడు మార్కం డేయుని రక్షించాడు. అందువలన యమ ధర్మరాజు, మార్కండే యుడు సాక్షులు, విష్ణుమూర్తి వరాహ రూపం దాల్చి పరమశివుని పాదముల అంతును, బ్రహ్మ హంసరూపుడై శిరస్సు అంతమును కనిపెట్ట దరిగానరైరి. వారిరువురు సాక్షులే గదా! కనుక 'ధ్యానింప తగినవా'డని మహర్షులు, 'జ్ఞానదాత' అని శుకమహర్షి, 'భక్తరక్షకు' డని మార్కండేయ యమధర్మరాజులు, 'ఆది మధ్యాంత రహితు' డని బృహ్మవిష్ణువులు తేల్చి యున్నారు. అట్టి గొప్పగొప్ప సాక్ష్యాధార ములుండగా పరమ శివుడు కేవలం పరమాత్మ అనుటకు అనుమానమేల?
శంకరాచార్యా! ముద్రలు కూడదంటావు! తప్తలింగాది ముద్రలు ధరించుకొని, రుద్రాక్ష మాలలు అలంకరించు కొని, విభూతిపూసికొని కృష్ణాజినాన్ని ధరించి, రుద్రపూజ చేస్తూ రుద్రాధ్యాయాన్ని జపంచేస్తూన్న వానికి సర్వపాపాలు పటా పంచలై,పరమపవిత్రుడై పరమశివ స్వరూపము నే పొందుచున్నాడు. రుద్రకాండలో ఈ విషయ మంతయు గలదు చూడుమా! కావున శివచిహ్నాలను ధరించడం కూడును! పైగా ఇవి ముక్తికి హేతువులని చెప్ప బడింది. అనంతమైన ధర్మార్థకామ మోక్షాలు పొందవలెనన్న పాశు పత వ్రతమును ఆచరించాలి.”
లింగధారి వెలిబుచ్చిన ధర్మాలన్నీ శ్రీ శంకర పాదులు ఆకర్ణించారు. దూషణ భూషణలతో నిమిత్తం లేని వారాయన. తప్పులను సరిదిద్దడమే వారి ధ్యేయం. కఠినంగా పలికిన లింగధారి యెడ ప్రేమ కలిగి,
‘శివభక్తులారా! తత్త్వాన్ని యథాతధంగా తెలిసికొనుడు. మీరు చెప్పిన విషయా లలో 'తప్త చిహ్న ధారణ' అనుదానికి ప్రమాణం కానరాదు. తప్త తనువనగా కాల్చబడిన శరీరమని మీ యభిప్రాయము. అది సరిగాదు. “తప్త:” అనగా తపింపబడిన 'తను' వనగా శరీరం గలవాడు. అని చెప్పుకోవలెను. 'అతప్తతనువు' అనగా కృచ్ఛచాంద్రాయణాది వ్రతాలుచేయడం వలన శరీరం కృశిస్తుంది. ఆలా కృశించని శరీరం గలవానికి పరమపదం ప్రాప్తించ’దని అర్ధం చెప్పు కొనవలయును. మీ రనుకొన్నట్లు అర్థం చెప్పుకొన్నచో బృహ న్నారదీయ గ్రంథానికి వైరం వస్తుంది. పైకి కనుపించే వేషాలన్నీ డంబాచారములు అనబడును. అవి కేవలము భ్రాంతి వంతములై యున్నవి.
'శరీరం కాల్చుకొనుట వలన మహాపాపు డగును. ఎట్టి పుణ్య కార్యాలాచరించిన వాడైనను పాపాన్ని పోగొట్టుకొనలేడు. కాల్చుకొనిన చిహ్నాలను ధరించినవాడు అధము డగుచున్నాడు. ఎట్టి ఆచారవంతు డైనను వేదవేదాంగాలు క్షుణ్ణంగా వచ్చినవాడు అయినను కాల్చిన లింగము శూలము మొదలైన చిహ్నము లను ధరించిన పతనాన్ని పొంద వలసిందే అని బ్రహ్మ నారదునకు ఉపదేశం చేసి యున్నాడు.
ఒకప్పుడు గాయత్రీ దేవికిని బ్రాహ్మణుల కును గొప్ప తగవు లాట కలుగగా, అందు మహాదేవికి తీవ్రమైన కోపం కలిగి మీరందరు పాషండులగుదురు గాక! వైదికాచార భ్రష్టులగుదురు గాక! తంత్ర శాస్త్రాన్ని ఆచరింతురు గాక! నీచులై జన్మింతురు గాక! కలియుగ ప్రవేశంతో కర్మభ్రష్టు లగుదురు గాక! వివేకహీను లగుదురు గాక!' అని శపించి, కలియుగం ముప్పది వేల ఏండ్లు గడచిన తర్వాత మీరంతా సర్వ నాశనమై మరల జన్మించి సత్యవ్రతులై తత్త్వజ్ఞానులగుదురు గాక' యని శాపవిమో చనము అనుగ్రహిం చినది. కావున మీరలు తప్తతనువులంటూ శరీరాలను కాల్చు కోకండి.
*కాలడి శంకర కైలాస శంకర*
*శ్రీ ఆది శంకరాచార్య చరితము*
*29 వ భాగము సమాప్తము*
🌺🌺🌺🌺🌹🌺🌺🌺🌺🌺🌺🌺
శ్రీ ఆది శంకరాచార్య చరితము 27
*శ్రీ ఆది శంకరాచార్య చరితము 27 వ భాగము*
🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭
*మధ్యార్జునేశ్వరము:*
శ్రీ ఆచార్యస్వామి కేరళ దేశములో ఉన్నారు. దక్షిణదేశ మందున్న కార్యక్రమం వెనుకబడి యున్నది. ఎంతో మంది శిష్యులు చేరు కున్నారు. పద్మపాదుడు హస్తామలకుడు, తోటకాచార్యుడు కాక శాస్త్రనిష్ణాతులైన వారెందరో శిష్యులు అయ్యారు. వారిలో చిద్విలాసుడు, బుద్ధివృద్ధుడు, భానుమరీచి, విరించిపాదుడు, విష్ణుగుప్తుడు, శుద్ధకీర్తుడు, శుద్ధానందుడు, నమిత్రానుడు మున్నగు వారున్నారు. సుధన్వ మహారాజు పరివారం వెంటబెట్టు కొని యున్నాడు. రామేశ్వర యాత్రకై బయలు వెడలి మార్గ మధ్యమందున్న మధ్యార్జునమనే శివక్షేత్రము చేరుకు న్నారు. ఈ క్షేత్రము మహామహిమతో గొప్ప పుణ్యస్థలమై విరాజిల్లుతోంది. అచ్చోట గల స్వామి వారిని దర్శించిన మాత్రాన సమస్త విద్యలు లభించును. సమస్త పాపములు హరించును. అన్ని కోరికలు నెరవేరును. అట్టి మహేశ్వరుని శ్రీశంకరులు దర్శించు కొన్నారు. అక్కడి భక్తులందరూ ద్వైత మతావలంబులు. ద్వైతమే సరియైన తత్త్వమని గట్టిగా నమ్మినవారు. అద్వైత మతవ్యాప్తి వారికి సుతరామూ కిట్టదు. అందుచే మంచి పట్టుదలతో ఉన్నారు. ఈ శంకరుని వాదాన్ని పూర్తిగా త్రోసిపుచ్చి తమ భావాన్నే స్థిరంగా నిలబెట్టాలన్న గట్టి పట్టుదలతో ఉన్నారు అక్కడి పండితులు. శ్రీశంకరాచార్యస్వామి రాగానే వారితో తీవ్ర మైన వాదాలకుదిగారు.
శ్రీ శంకరాచార్యస్వామి ఆ వాద ప్రక్రియను క్రమ బద్ధం చేసి క్రమంగా వారి సందేహాలకు అన్నిటికి తగిన సమాధానాలు ఇచ్చి, వారు లేవదీసిన అభ్యంతరాలను త్రోసి పుచ్చి, సప్రమాణంగా, సహేతుకంగా, నిర్ద్వం ద్వంగా అద్వైత తత్త్వ పరమార్థాన్ని నచ్చ జెప్పారు. దానితో సరిపుచ్చక ప్రత్యక్ష ప్రమాణము కన్న మిన్న లేదన్న భావంతో స్థానిక దేవతా మూర్తి దిక్కు మొగమై, ఇలా అర్థించారు:
"పరమేశ్వరా! జ్ఞాన స్వరూపా! జ్ఞానదాతా! ఈ వచ్చిన విద్వన్ము ఖ్యులు ఇంకా సంశయా త్ములై ఉన్నారు. ద్వైతమో అద్వైతమో ఏది నిజమో పోల్చు కోలేక. ఏది సత్యమో భగవన్వాక్కుగా వినా లనిఉంది. అనుగ్ర హించు తండ్రీ!”.
వెను వెంటనే ఆ దేవాలయములో నున్న లింగముపై ఒక దివ్య కాంతి పుంజము ఉద్భవించి, అందున్న పరమేశ్వరుడు చిద్విలాసవదనుడై కుడి చేయి పైకెత్తి “అద్వైతమే సత్యము! అద్వైతమే సత్యము! అద్వైతమే సత్యము!” ముమ్మారు గర్జించి అదృశ్యుడయ్యాడు. కని విని ఎరుగని ఆ అనుభూతి వారందరిని విభ్రాంతుల్ని చేసింది. శంకరాచార్యునికి జోహారులర్పించి వారి అనుగ్రహం కోరారు. శిష్యగణంతో శ్రీశంకరా చార్యులు బయలుదేరి కొన్ని రోజులకు రామేశ్వరం చేరుకొన్నారు.
*శాక్తేయులు:*
రామేశ్వరములో శక్తి నుపాసించు వారిని శాక్తేయులందురు. వీరిలో వామాచారులని ఒక తెగయున్నది. వారి ఉపాసనలో మద్యము, మాంసము, ముద్ర, మైధునము అను మకార పంచకమును ఉపయోగిస్తారు. శాక్తే యులలో కొందరు వామాచారులు కాని వారున్నారు. లక్ష్మీ ఉపాసకులు, సరస్వతీ ఉపాసకులు, భవానీ ఉపాసకులు, సారస్వతులు అను పలు తెరంగులుగా నున్నారు శాక్తేయులు. వీరందరూ వారి ఇష్ట దేవిని పరాశక్తిగా భావించెదరు. రామేశ్వరప్రాంత మందు శాక్తేయులు కొల్లలుగానుండిరి. వారందరు శ్రీ శంకరా చార్యులు వచ్చారన్న వార్త విని ఒక చోట సమావేశమైనారు. ఆ సమావేశ మందు. 'శంకరాచార్యులు, ఎన్నెన్నిమతాలనో కాదను చున్నారట! ప్రతీ మతమందును తప్పులున్నాయని పలుకు చున్నారట! మన మతాన్ని కూడ నిర్మూలనం చేయాలనే సంకల్పం తోనే మన తావుకు వచ్చారట! ఆయన మతమే గొప్పదట! ఆతడు మన మతాన్ని జయించడం కాదు, మనమే ఆయన కడ కేగి జయించాలి. లేనిచో అడవిలో కాచిన వెన్నెలవలె మన మతం నిరర్ధకం కాగలదు. మనలో మనకున్న మనస్పర్ధలు కట్టిపెట్టి శత్రువును జయించ డంలో ఐకమత్యం వహించాలి. ఆయన కూడ సరస్వతిని ఆరాధించేవాడట. కనుక యతికి అన్య మార్గం లేదు. చూడగా మన మతమును కాదన జాలడు.' అని తీర్మానించుకొన్నారు.
అంతట శాక్తేయులు ధీమాతో బయలుదేరి రామేశ్వరములో
శ్రీ శంకరాచార్యులను దర్శించి సాష్టాంగ వందనాలనుఅర్పించారు. శంకరాచార్యస్వామి నారాయణ స్మరణలు పలికి కుశలప్రశ్నలు వేశారు. అంతట వారలలో నొకడు లేచి, ‘యతివర్యా! లోకంలో బహుమతాలను మీరు కాదను చున్నారట. మాకు అందులకు సంతోషమైంది. మా మతము అట్టిది కాదు. ప్రతీవారు ఆచరించి గౌరవించతగ్గ మా మత మందు మోక్షోపాయ మున్నది' అని విన్న వించిన తరువాత,
'స్వామీ! సకలభూత ములకు తల్లియనునది గలదు. ఆ తల్లిని ఆదిశక్తి యందురు. ఆమె పరమేశ్వరుని కంటె అతీతమైనది లోకాలన్నీ ఆదిశక్తి వల్లనే ఉత్పన్నమగు చున్నవి. ఆమె శక్తిని వర్ణించ ఎవరితరము గాదు. సర్వాధార భూతురాలై అందరి చేతను పూజింప తగి యున్నది. అట్టి పరాశక్తి అంశనే భవానీదేవి యందురు. భవానీ సేవా తత్పరులమై ఆమె అనుగ్రహానికి పాత్రులమై బంగారంతో చేయబడిన ఆమె పాద చిహ్నాలను కంఠమున, భుజముల యందు ధరించుచున్నాము. ఆమెను ఉపాసించిన వారు జీవన్ముక్తు లగుచున్నారు.' అని మరి యొక శాక్తేయుడు శ్రీశంకరులకు వివరించాడు.
అంతలో వేరొకడు లేచి. 'పరాత్పరా! విద్య- అవిద్య ఈ రెండును తెలిసినవాడే జ్ఞాని. అట్టి వాడు మరణము నొందక మోక్షమునే బడయుచున్నాడు. ఆదిశక్తి యొక్క కటాక్షంతో ముక్తి కలుగు చున్నది. కోరిన వారికి ఆమె మోక్షము నిచ్చును. ఓంకారము నుండి అకార, మకార, ఉకారములు ఉద్భవిం చినట్లే లక్ష్మి, భవానీ, సరస్వతులు మువ్వురు ఆదిశక్తినుండి ఉద్భవిం చారు. ప్రకృతి, పురుషుడు వేరు గారు. వారిరువురు ఒక్కటే. సదేవ సౌమ్యాది వేద వాక్యాలు ఇందుకు ప్రమాణములే కదా! ఈ సకల చరాచర ప్రపంచ మునకు సర్వదేవత లకు ప్రభువైన పరాత్పరునకు పరా పరమై జ్ఞానస్వరూపిణి యై చంద్రకాంతి వలె వెలుగునిస్తూంది. యతివర్యా! ఆమహాశక్తి భర్తను తన స్వాధీన మందుంచుకొన్నది. ఆమెయే భవానియై వెలసింది. తామును చాల గొప్పవారే! కావున మాదేవి చిహ్నాలనే ధరించి ఆమెనే ఉపాసించుడు!' అని వచించాడు.
శ్రీ శంకరాచార్యులు వారల విధానము నాలకించి వారల లోపాలను సరిదిద్ద నుద్యుక్తులయ్యారు.
*భవానీ ఉపాసకులు:*
చిన్నచిన్న లోపములు జ్ఞానాన్ని మరుగుపరచి అంధకారంలో బడ ద్రోయును. చిన్న తప్పునకు పెద్దశిక్ష కూడదని శ్రీ శంకరాచార్యులకు కరుణ కలిగి శాక్తేయుల లోపాలను సరిదిద్దుటకు తలంచి భవానీ ఉపాస కుల నుద్దేశించి:
“మీరు పలికిన పలుకులు నిజమే! కాని, సకలశాస్త్రముల లోను ప్రకృతికి పరాపర మైన పరమాత్మ యొక్క బోధనల వలన ముక్తి కలుగుచున్నదని నిశ్శంకగా నిర్వచించ బడినది. మోక్ష మనగా మరేమీకాదు, అజ్ఞాన ము నుండి బయట పడుటయే. అనగా ఆత్మను తెలిసికొనుట. ఆత్మను పరమాత్మగా భావించమని శ్రుతి స్మృతులు ప్రమాణములై యున్నవి. అజామిత్యాది మంత్ర ములలో ఉత్పత్తి లేని మాయా స్వరూపమును వివరించి ఆత్మతత్త్వా న్ని మోక్షం కొరకు విపులముగ తెలియ జేసిరి. కనుక ప్రకృతి కంటె విలక్షణ మైనది పరమాత్మయని తెలిసి కోవలెను. అట్టి పరమాత్మను ఆత్మగా తెలిసికొనుటయే స్థిర మైన ముక్తియని శ్రుతులు ఘోషించు చున్నవి. ప్రకృతి పర మైన పురుషుని చక్కగా తెలిసికొన్నచో ముక్తి కలుగునని సాంఖ్యులు నిర్వచిం చారు. కనుక ఆలాటి పరమాత్మ జ్ఞానంవల్ల ఈ ప్రకృతిలో నున్న అంటు ఊడి పోయి స్థిరమైన ఆనందమును పొంది ముక్తులగు చున్నారు. ఇదియే యదార్థమైన మార్గము. పరమాత్మకు,పరమాత్మ జ్ఞానం కలవారికి భేదం లేదని ‘బ్రహ్మవిద్బ్ర హ్మైవభవతి’ అని శ్రుతివాక్యము. పరమాత్మ తత్త్వము నెరుగని వాడు ఎన్నటికీ పరమాత్మ కాజాలడు. కనుక మీరందరు ఆత్మతత్త్వాన్ని ఆకళింపు జేసికొనుడు. భవానీదేవిని ఆరాధిం చుటవలన చిత్తశుద్ది మాత్రమే కలుగును. ఆ యమ్మ అద్వైతమునే బోధించును. భవానీ దేవినుపాసించుట వలన ముక్తికలుగదు. కనుక భవానీదేవి చిహ్నాలను విడనాడి ముముక్షువులు కండు' అని భవానీ ఉపాసకుల లోపాలను సరిదిద్దిరి.
శాక్తేయులు, శంకరులు వెలువరించిన తత్త్వమును సావధానంగా విని తమ లోపాలను తెలిసి కొని ఆశ్యర్యపడి తమతమ బాహ్యచిహ్నా లను విసర్జించారు. పిమ్మట లక్ష్మీ ఉపాస కుడు శ్రీ ఆచార్యస్వామికి తమ మత ప్రభావము ను వినిపించుటకై లేచాడు.
*లక్ష్మీ ఉపాసకులు:*
భవానీ ఉపాసకులు తమ లోపాలను సరిదిద్దుకొను విధాన ము లక్ష్మీ ఉపాసకులు విన్నారు. తమ మత ధర్మములను వినవల సినదని కోరగా శంకరులు అంగీక రించిరి.
శంకరస్వామీ! మహా లక్ష్మియే జగజ్జనని, ఆమెయే మొదట వేదములో చెప్పబడి నది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మొద లైన వారందరు ఆమెలో పుట్టి ఆమె యందు లయమగు చున్నారు. ఆమె సృష్టి, స్థితి, లయాలకు కారకు రాలు. కనుక మోక్షం కావాలని కోరు వారు అందరు ఆ జగజ్జననినే ఆరాధించాలి.
యతీశ్వరా! పద్మబీజ మాలను, తులసిమాల ను కంఠాన ధరించి, బాహువుల యందు పద్మ చిహ్నాలను,తలను, ముఖమున మంగళ కరమైన కుంకుమను అలంకరించుకొని ఎవరు ఆ మహాలక్ష్మిని ఉపాసించెదరో వాళ్ళకు మోక్షం హస్తామలకం వలె నుండును. తామున్ను మహాలక్ష్మి నే ఉపాసించుడు' అని ఒక లక్ష్మీఉపాసకుడు తెలియ జేసెను.
శ్రీ శంకరులు లక్ష్మీ ఉపాసనా విధానము విని, మీ మతంలో ఎంతో గొప్పతనము లేకపోలేదు. కాని అందొక సత్యాన్ని మాత్రం గ్రహించవలసి ఉన్నది. వినండి! లక్ష్మి ప్రధానమైన పరమాత్మ కానేరదు. సర్వం సృష్టించినవాడు, అద్వితీయుడు, తనకు తానే పుట్టినవాడు, స్వయంప్రకాశం గల వాడు అయిన పరమాత్మ నిర్వికారుడై, నిరంజనుడై, సర్వాంతర్యామియై వెలుగొందుచున్నాడు. ఆ పరమాత్మే నీవై యున్నావు. ఆ పరమాత్మ సదా ఆనంద స్వరూపుడు. జడవస్తువైన ప్రకృతికి ముక్తినిచ్చుటకు సామర్థ్యం ఎన్నడూ ఉండదు. ఈ ప్రకృతికి లోనుకాకుండ, ఆ పరమాత్మను నేనే అని ధ్యానం చేస్తూ మననం చేస్తూంటే, అట్టి సంకల్పం దృఢమైన ప్పుడు ముక్తి తేలికగా లభిస్తుంది.అనిత్యమైన దేవతలను ఆరాధించిన ఊరక పోదు. వారివారి అధీనమందుండే లోకాలను పొందగలరు. కాని ఆ లోకమందు నివాసం మాత్రం శాశ్వతం కానేరదు. చేసికొనిన పుణ్యం క్షీణించుటతో పుణ్య లోక నివాసం సంపూర్తి యగును. అప్పుడు ఒక్క క్షణమచట నుండ వీలుండదు. అంతట మరల మనుజుడై పుట్ట వలసినదే. కనుక అశాశ్వతమైన పదవుల కొరకు ప్రాకులాడక లక్ష్మీదేవీ చిహ్నాలను విడనాడి పరమాత్మ తత్త్వాన్ని విచారణ చేసి జ్ఞానము నార్జించు కొనుడు!' అని శ్రీ శంకరాచార్యులు తత్త్వ రహస్యాన్ని వెలువ రించారు.
శ్రీ శంకరాచార్యులు వెలిబుచ్చిన తత్త్వ విచారణ లక్ష్మీ ఉపాసకులు విని. ‘జగద్గురో! మా లోపాలను తెలిసికొని మమ్ములను పునీతులు చేశారు. మేమంతా ధన్యులం! మాలోపం చిన్నదైనా అది మాకు పెద్దఅడ్డమై ఇంతవరకు అంధకారంలో ముంచింది. మాపాలిట అవతారమూర్తివై ప్రత్యక్షమైనారు. మీ యెదుటనే మా బాహ్య చిహ్నాలను విడనాడు చున్నాము. మమ్ము శిష్యులుగా స్వీకరిం చుడు.' అని వేడు కొన్నారు. అంతలో సారస్వతులు లేచి వారి గొప్పలను వెల్లడించ నుద్యుక్తులైరి.
*కాలడి శంకర కైలాస శంకర*
*శ్రీ ఆది శంకరాచార్య చరితము*
*27 వ భాగము సమాప్తము*
🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇
*శ్రీ ఆది శంకరాచార్య చరితము 26
*శ్రీ ఆది శంకరాచార్య చరితము 26 వ భాగము*
💙💙💙💙💙💙💙💙💙💙💙💙
పద్మపాదుని తీర్థయాత్రలు:
పద్మపాదాచార్యునికి శృంగగిరిలో ఉండగా తీర్థయాత్రలుచేయాలనే అభిలాష కలిగింది. శ్రీశంకరాచార్యుని అనుమతి కోసం వారిని అడిగాడు. శంకరుడు యాత్రలో అనుసరించ వలసిన పద్ధతులు, జాగ్రతలు వివరంగా బోధించారు పద్మపాదు నికి. ఉత్తర దిశగా పయనిస్తూ మధ్య మధ్య మధ్య గల పుణ్యతీర్థములలో గ్రుంకులిడుతూ దేవుళ్ళను, మహాత్ము లనూ దర్శించుకొంటూ సాగుతోంది పద్మ పాదుడు, కూడా వచ్చిన సహశిష్యుల ప్రయాణం.
శ్రీకాళహస్తికి చేరుకొన్నా రు. శ్రీ (సాలె పురుగు), కాళ (పాము), హస్తి (ఏనుగు) ఈశ్వరుని అర్చించి ముక్తిని పడసిన మహాక్షేత్ర మది. పంచమహా భూతములు, పంచ లింగములుగా మారినవి. జలలింగము జంబు కేశ్వరములోను, అగ్నిలింగము అరుణా చలములోను, ఆకాశ లింగము చిదంబ రమున, వాయు లింగము శ్రీకాళహస్తిలోను, పృథివీలింగము కంచిలోను వెలసి యున్నవి.ఈ క్షేత్రంలో అగస్త్యముని తపస్సు చేయగా బ్రహ్మమెచ్చి, స్నాన పాన యోగ్య మైన సువర్ణముఖరీ నదిని ప్రసాదించిరని ప్రతీతి. ఆ నది నగరం ప్రక్కగా ప్రవహిస్తుంది. గర్భగుడిలోనికి గాలి చొరదు. మూల విరాట్టుకు పైభాగమున ఒక జ్యోతి వెలిగించ బడి ఉంటుంది. అది సదా కదలుతూనే ఉంటుంది. అది వాయులింగ మనుటకు చిహ్నము. అచ్చట ఈశ్వరునికి, జ్ఞాన ప్రసూనాంబకు మ్రొక్కి కాంచీ క్షేత్ర దర్శనానికి బయలుదేరారు. పృథివీలింగము వెలసిన పుణ్యక్షేత్రము కంచి. ఇందున్న ఈశ్వరుని ఆమ్రాధీశ్వరు డని, ఏకాంబరేశ్వరు డని పిలుస్తారు. మామిడి చెట్టు క్రింద వెలసిన లింగం కావున ఆమ్రాధీశ్వరు డను పేరు వచ్చింది. ఆ చెట్టు నీడనే పార్వతీదేవి తపస్సు చేసిందట. అమ్మవారిని కామాక్షి అంటారు. ఈ చోట నూట ఎనిమిది శివక్షేత్రములు, పదునెనిమిది విష్ణుక్షేత్రములు కలవట. కామాక్షి అమ్మవారికి మూడు కన్నులుండుటచే త్రినేత్రిణి అని పిలుస్తారు. మధ్య కన్ను అగ్ని, మిగిలిన రెండు కళ్ళూ సూర్యచంద్రులు.
కంచి నుండి బయలుదేరి పుండరీక క్షేత్రము వెళ్ళారు. శివుడు నాట్య మాడు తున్నపుడు జటాజూటము విసరగా అందుండి గంగ హద్దు మీరి క్రిందపడిందని దానిని 'శివగంగ' అంటారు. పద్మపాదు డు ఆ పవిత్రమైన శివగంగలో స్నానం చేసి నటరాజస్వామిని దర్శించుకొన్నాడు. తరువాతి క్షేత్రము కావేరీ తీరమున గల శ్రీరంగము. శ్రీరంగనాధ స్వామిని దర్శించుకొని వెళ్ళుతుండగా దారిలో వారికి పద్మపాదుని మేనమామ ఊరు తగిలింది.
పద్మపాదుడు వస్తున్నాడని మేనమామ బంధు మిత్రులతో సహా అమితానంద భరితుడై చూడవచ్చెను. చాల కాల మయింది పద్మ పాదుని చూచి. వారు చాలా సంతోషంతో “యతి వర్యా! మిమ్ములను ఇంత కాలానికి చూడగలి గాము. మీరు సన్న్యాసము స్వీకరించి నారని మాకు తెలిసింది. మీ ఆశ్రమమే గొప్పది. మీరు సదా విరాగులై దైవ చింతనతో ఇహదు:ఖాలకు దూరంగా స్వేచ్ఛగా ఉంటారు. మేము ఆలుబిడ్డల పోషణతో ఈ జంఝాటంలో పడి కొట్టు మిట్టాడుతూ ఉంటాము. మా పాపముల నుండి కాపాడి మాకు జ్ఞానము ప్రసాదించ గల దిట్టలు మీరు. మమ్ము కరుణించండి. మాకు జ్ఞానం ప్రసాదించండి" అని వేడుకొన్నారు.
టీకాగ్రంధము:
మేనమామ పద్మపాదుని తన ఇంటికి భిక్ష ఇవ్వడానికి తీసికొని వెళ్ళాడు. శిష్యులతో సహా భిక్ష ముగించుకొన్న తర్వాత మేనమామ పద్మ పాదుని వద్ద నున్న గ్రంథాన్ని చూచి అది యేమి గ్రంథమని అడిగాడు. పద్మపాదుని మేనమామ మహా విద్వాంసుడు కర్మిష్ఠి. మీమాంసా మత స్థుడు. ఆ పుస్తకాన్ని చూడగానే అది చాలా ప్రభావవంతమైన అద్వైతతత్త్వ ప్రతిపాద క మని గ్రహించాడు. అది శ్రీశంకరాచార్యులు వ్రాసిన భాష్యమునకు పద్మపాదుడు వ్రాసిన టీకాగ్రంథము. మేనమామకు అప్పుడు ఒక దుర్బుద్ధి పుట్టినది. ఈ గ్రంథము వ్యాప్తి చెందితే తమ మతానికి తీరని దెబ్బ తగులు తుంది. దీనిని వెలుగు లోనికి రానీయకుండా అంతం చేయాలి. లేని సంతోషము ఉత్సాహం తెచ్చుకొని తానా గ్రంథం చదవాలని ఆసక్తిగా ఉందని తనకు ఇవ్వమని అడిగాడు మేనమామ. సరే నని సేతుయాత్ర ముగించు కొని వచ్చేవరకు భద్రంగా కాపాడమనీ మరీమరీ మేనమామ ను హెచ్చరించి వెళ్ళాడు పద్మపాదుడు. పద్మపాదుడు అక్కడి నుండి సేతుక్షేత్రం దర్శించడానికి బయలు దేరాడు. లంకా పట్టణాన్ని ముట్టడించి రావణ సంహార నిమిత్తమై శ్రీరామ చంద్రుడు వారిధిపై వారధి నిర్మించిన పుణ్యభూమి అది. సేతునిర్మాణం అయ్యాక వానరసేనతో లంకపై దండెత్తి వెళ్ళిన స్థల మది. అచ్చట రామలింగేశ్వరాలయము, దర్భ శయనం చూడవలసినవి. సముద్రాన్ని ఎట్లు దాటాలని ఆలోచన చేసిన చోటది. శ్రీరాముడు దర్భలపై శయనించిన చోటు. తిరిగి వెనుకకు ప్రయాణ మయ్యాడు పద్మపాదుడు శిష్యుల తో కూడి. తన మేనమామ ఊరు చేరుకొన్నాడు. అనుకున్న కుట్ర ప్రకారం గ్రంథాన్ని దగ్ధం చేసేశాడు. అనుమానం రాకుండా ఆ గ్రంథం ఉంచిన ఇల్లును కూడా గ్రంథంతో బాటు దగ్ధం చేశాడు. ఎంతో శ్రమపడి వ్రాసిన గ్రంథమది. దానికి చింతించడం గతజల సేతుబంధనం కదా మరల వ్రాయవచ్చు ననుకొన్నాడు. కపట భావాలతో గ్రంథం కాలిపోయినందుకు విచారం నటిస్తున్న మేనమామతో ఇలా అన్నాడు: “నారాయణా! చింతించకు. నీవేమి చేయగలవు? దైవవిధి అలా ఉంది. మరల వ్రాసుకొందునులే” అని ఊరుకో బెట్టాడు. మళ్ళీ గ్రంథాన్ని యధా తథంగా వ్రాయడం మొదలు పెట్టాడు. అది చూచిన మేనమామ అచ్చెరువంది మరింత క్రూరంగా ఆలోచన చేశాడు. ఇంటికి భిక్షకు పిలిచి మందులు కలిపిన భోజనం పెట్టాడు. ఆ భిక్ష తర్వాత పద్మపాదుని మేధ దెబ్బ తిన్నది. గ్రంథరచన ఆగి పోయింది.
*పద్మపాదుడు గురువు కడకు రాక:*
శ్రీ శంకరాచార్యుడు కేరళ దేశములో ఉన్నాడని తెలిసిన పద్మపాదుడు హుటా హుటిని వారి కడకు శిష్యసమేతంగాచేరాడు. శంకరాచార్యుడు కూడ తన ప్రియశిష్యుని రాకకు ఎదురు చూస్తున్నారు. వారు పద్మపాదుని చూడగానే ఆనంద పడ్డారు. యాత్రావిశేషాలు గురువు గారికి విన్నవించాడు:
“గురుదేవా! వివిధమైన పుణ్యతీర్థాలలో స్నానమాడి, ఆయా పవిత్రక్షేత్రములలోని దేవతామూర్తులను దర్శించి పులకితుడ నైనాను. మీ కరుణా కటాక్షములే నన్ను ఈ యాత్రలను ఎంతో సఫలీకృతం చేశాయి. ఎందరో ద్వైతవాదుల తోను, వైష్ణవ శైవ తీవ్ర మతస్థులతోను తలపడ వలసిన సమయాలలో మీ శుభాశీస్సులే నన్ను సరియైన దారిలో నడిపించాయి. నాపై మీకు గల అపారదయ తో నాకు ముమ్మారు సూత్రభాష్యం పాఠం చెప్పారు. ఆ భాష్యపాఠాలే నాకు పరమతవాదుల తోడి చర్చా యుద్ధాలలో శార్జ్ఞ కోదండము వలె ఉపయుక్తమైంది. కాణాదులతోను, వైశేషిక దార్శనికుల తోను బాహాబాహీ పోరు తటస్థించింది. కాపీలులతో కలియబడ వలసి వచ్చింది. ఇక సాంఖ్యులు ప్రశ్న పరంపరలు కురిపిం చారు. ఆ విధమైన చతుర్ముఖబంధనం నిర్మించినా, మీ కరుణతో ప్రస్థాన త్రయమనే వజ్రాయుధం తో నిర్భయంగా పోరు సలిపి జయశ్రీని చేపట్టితిని. ఇది అంతయు మీ సేవా ఫలము. మీ దివ్యాను గ్రహము. ఈ విజయ పరంపర అంతయు మీదే. ఇదే మీకు వినమ్రుడనై మీకు పాదాక్రాంతుడనై అర్పిస్తున్నాను" అని విన్నవించాడు పద్మ పాదుడు. మరల మాట్లాడుతూ “దారిలో నా మేనమామ ఊరు చేరినపుడు వానితోను, ఆ పురవాసులతోను సంభాషించాను. మా మేనమామ కర్మమార్గ గామి. ప్రసిద్ధుడైన ప్రభాకరుని శిష్యుడు. అతనిని కూడ ఒప్పించి అద్వైత మతస్థుణ్ణి చేశాననిపించింది. దురదృష్ట వశమున నేను తమ దయతో వ్రాసిన టీకా గ్రంథము వాని ఇంటితో బాటు దగ్ధమైపోయింది. తరువాత అతని వైఖరి మాటలను బట్టి నాకు అనుమానము కలిగింది. గ్రంధం దగ్ధం అవ్వడం అతడు కావాలని చేసిన దుశ్చర్యయే అని తట్టింది. తరువాత ఆతడు నాకు ఇచ్చిన భిక్ష తీసికొనిన వెంటనే నాకు జడత్వము కలిగి రచనకు భంగ మేర్పడింది. నా లోపమేమైనా చేసిన పాపమో దీనికి హేతువు కావచ్చు. అవతారమూర్తీ! శరణు!" అని గురువులకు జరిగిన ఉదంతాన్ని నివేదించాడు.
శ్రీపద్మపాదాచార్యులు చెప్పినది విన్న శ్రీశంకరస్వామి అతనితో ఈ విధంగా పలికారు: “పద్మపాదా! దైవవిధి దాట నెవ్వరి తరము? అందువల ననే కర్మలు జాగ్రత్తతో ఆచరించమన్నారు. వానియందెట్టి లోపమున్నను తత్ఫలితము అనుభవించక తప్పదు. ఇదంతయు మనస్సు లో నిడుకొనియే సురేశ్వరుని అందుకు నియమించితిని. ఎవరి కర్మ ఎవరి కెఱుక? బుద్ధిమంతుడు కడచిన కష్ట పరిస్థితికి వగవడు. నీవు దిగులు పడకు. ఇదివరలో నాకు ఐదు పాదాలు చదివి వినిపించావు. జ్ఞాపకమున్నది. నేను చెబుతా వ్రాసుకో!" అని స్వామి అద్భుత మేధాశక్తితో ఉన్నది ఉన్నట్లుగా ఒక్క అక్షరం విడువకుండా టీకా గ్రంధములోని పంచ పాదుకలను తిరిగి వ్రాయించారు.
*కేరళ రాజు:*
శ్రీ శంకరుడు పూర్వాశ్రమంలో పిన్న వయస్సులో ఉండగా కేరళదేశపు రాజు స్వామిని దర్శించుటకు వచ్చాడు. ఆ తరుణంలో శంకరునికి రాజు తాను వ్రాసిన మూడు నాటకములను చదివి వినిపించాడు. ఈ విషయం మనం మొదట్లో ముచ్చటించు కొన్నదే. రాజు రచించిన నాటకాలు శంకరునకు నచ్చాయి. ఆనాటకాలు కారణాంతరముల వల్ల దగ్ధమై పోయాయి. శ్రీ పద్మపాదుని దగ్ధమై పోయిన గ్రంథాన్ని స్వామి తిరిగి తన జ్ఞాపకశక్తితో వ్రాయించారన్న వార్త విని కేరళ రాజు కూడ ఆశతో స్వామిని దర్శించాడు. రాజశేఖ రుడు వందనములు అర్పించి నిలబడి యుండెను. శంకరుడు కుశలప్రశ్నలు తర్వాత 'నీ నాటకములు బాగా ప్రచారములో ఉన్నవా? అని రాజును అడిగారు. రాజశేఖ రుడు ఖిన్నుడై అంజలి ఘటించి, "స్వామీ! దైవవిధి అటులున్నది కాబోలు. అగ్నిలో బడి నా నాటకములు కాలి పోయాయి. తమ అనుగ్రహం ఉంటే తిరిగి అవి దక్కునేమో!” అని ప్రార్థించాడు.
ఒకసారి ఎన్ని ఏండ్ల పూర్వమో విన్న ఆ రాజు రచించిన మూడు నాటకాలను తన అపూర్వమైన జ్ఞాపక బలంతో జ్ఞప్తికి తెచ్చుకొని రాజుతో తిరిగి వ్రాయించారు. అచ్చెరువుతో శంకరులకు వందనములు అర్పించి ‘తమ దాసుణ్ణి నన్ను శాసించండి' అని వేడుకొన్నాడు రాజశేఖరుడు. జనానురంజకంగా ధర్మపాలన చేయమని రాజుకు చెప్పారు యతీంద్రులు.
*కాలడి శంకర కైలాస శంకర*
*శ్రీ ఆది శంకరాచార్యచరితము*
*26 వ భాగము సమాప్తము*
🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳
05-10-2024) రాశి ఫలితాలు
రేపు (05-10-2024) రాశి ఫలితాలు
గురు నారాయణ భవిష్యవాణి వారి ఉచిత నిత్య రాశి ఫలితాలు మీ రాశి ఫలితాలు
మీరు ఏ సమస్యల్లో ఉన్నా మీ జాతకం/హస్తరేఖలు చూసి మీ సమస్య లకు పరిష్కారం చేయగలం సమర్ధులం పూజ/గ్రహజపం/హోమం ద్వారా ఖచ్చితంగా పరిష్కారం చేయగలం ఇప్పుడే ఫోన్ చేయండి "జ్యోతిష్య రత్న" జరిగిన విషయం లు చెప్పి మీ భవిష్యత్తు చెప్పగలం వివాహం నకు జాతకం లు సరిపోల్చుట కూడా చూడబడును మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి 7981622895 గత 35 సంవత్సరంల నుండి ఇదే ఫీల్డ్ లో ఉన్నాం మా దగ్గర సిద్ధి పొందిన మంత్రాలు ఉన్నాయి మా గురువు ల ద్వారా మాకు వచ్చాయి. విద్య ఉద్యోగం వివాహం సంతానం కారాగృహ విముక్తి అనారోగ్యం రాజకీయ పదవులు ఋణ విమోచనం వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి రోగ నివారణ శత్రువులు నుంచి రక్షణ గృహ నిర్మాణం ఇలా ఏదైనా పరిష్కారం చేయగలం సమర్ధులం హోమం ద్వారా ఖచ్చితంగా మీ కోరికలు తీరేలా చేయిస్తాం మీ కోరికలు తీరకపోతే మీ ధనం వాపసు ఇస్తాం షరతులు వర్తిస్తాయి మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి
సకల శుభ పౌరోహిత్యం కార్యక్రమాలు చేయించబడును
మేషం
05-10-2024
స్థిరాస్తి వివాదాలు చికాకు కలిగిస్తాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పవు. వృత్తి ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. నూతన రుణాలు చేస్తారు. చేపట్టిన పనులలో ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి.
వృషభం
05-10-2024
ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గృహమున వివాహది శుభకార్యములు జరుగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం నుండి ఉపశమనం లభిస్తుంది.
మిధునం
05-10-2024
ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. దీర్ఘ కాలిక సమస్యలు నుండి బయటపడతారు. చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది.
కర్కాటకం
05-10-2024
పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి.
సింహం
05-10-2024
చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తప్పవు. అనారోగ్య సమస్యలు వలన వ్యాపారములు కొంత మందగిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. రుణదాతల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. బంధు మిత్రులతో అకారణ మాటపట్టింపులు కలుగుతాయి.
కన్య
05-10-2024
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్నపటికీ అంచనాలు అందుకుంటారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. నూతన పనులు ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. దైవ చింతన పెరుగుతుంది.
తుల
05-10-2024
సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. స్థిరస్తి క్రయ విక్రయలు లాభసాటిగా సాగుతాయి. సోదరుల నుంచి ఆకస్మిక ధనలాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు.
వృశ్చికం
05-10-2024
ఇంటా బయట బాధ్యతలు చికాకు పరుస్తాయి. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. ముఖ్యమైన పనులు శ్రమతో కానీ పూర్తికావు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఋణ ఒత్తిడి వలన మానసిక సమస్యలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
ధనస్సు
05-10-2024
వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. దూరపు బంధువులు నుండి అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు పరుస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.
మకరం
05-10-2024
రాజకీయ వర్గం వారి నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి ధనలాభ సూచనలున్నవి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట బాధ్యతల నుండి కొంత ఉపశమనం పొందుతారు.
కుంభం
05-10-2024
ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వ్యయప్రయాసలతో కానీ కొన్ని పనులు పూర్తికావు. బంధు మిత్రులతో మీ మాటతో విభేదిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు తప్పవు.
మీనం
05-10-2024
ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. విలువైన గృహాపకరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నలలో అవరోధాలు తొలగుతాయి. నూతన కార్యక్రమాలు కార్యరూపం దాలుస్తాయి. సమాజంలో పెద్దల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ధన పరంగా ఆశించిన పురోగతి పొందుతారు.
దుర్గాదేవి అంశతో గంగాదేవి
శ్రీభారత్ వీక్షకులకు శరన్నవరాత్రి శుభాకాంక్షలు 🌹 ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజుల పాటు దేవీ భాగవతం పారాయణ చేస్తారు. నవరాత్రులలో చేసే ఈ పారాయణం విశేష ఫలితాలనిస్తుందని చెబుతారు. దేవీ భాగవతం లో ఆ దుర్గామాత కు సంబంధించిన ప్రత్యేక అంశాలను తీసుకుని శ్రీభారత్ వీక్షకులకు రోజూ అందిస్తున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా. తిరుమల నీరజ గారు. ఈ కథలు వింటే పారాయణం చేసినట్లే. ఈ ఎపిసోడ్ లో దుర్గాదేవి అంశతో గంగాదేవి ఎలా ఆవిర్భవించిందో, ఎటువంటి మహిమలు చూపిందో వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏
శ్రీమత్సుందరకోమలాలకమిళిందాయత్తగండస్థలీం
శ్రీమత్సుందరకోమలాలకమిళిందాయత్తగండస్థలీం
బాలార్కారుణబింబకందళలసద్వాత్సల్యలీలాముఖీం
అంబాం పావనశంకరోరునిలయాం విశ్వైకభర్త్రీం శివాం
ధ్యాయేఽహం హిమశైలపుత్రిమనిశం సౌభాగ్యదాత్రీశ్వరీమ్
*~శ్రీశర్మద*
35. " మహాదర్శనము
35. " మహాదర్శనము " --ముప్పై ఐదవ భాగము --కొత్తదనము
35.ముప్పై ఐదవ భాగము -- కొత్తదనము
యాజ్ఞవల్క్యుడు ఇప్పుడు ఉద్ధాలకుల దగ్గర ఉంటున్నాడు .
ఉద్ధాలకులు , " ఎంతైనా నువ్వు అన్య శిష్యుడవు . కాబట్టి నేను నీకు బోధించుట విహితము కాదు . దానికోసము ఒక పని చేయి . నువ్వు , నీకు అర్థము కాని ఏ విషయము నైననూ తీసుకొని రా. దానిని మనము మన బుద్ధికి అనుసారముగా , శాస్త్రానుసారముగా విచారము చేయుదము . " అన్నారు .
యాజ్ఞవల్క్యుడు అన్నాడు , " మీరు చెప్పినది శాస్త్ర సమ్మతమైనది . దానిలో సందేహమేమీ లేదు , అయితే , తమరు చెప్పినట్లు చేస్తే , సమానులైన అంతేవాసులలో ( సహ పాఠులైన శిష్యులలో ) దొరకునంత విద్య దొరకుతుందే తప్ప , గురువుల నుండీ దొరకు సంప్రదాయ శుద్ధమైన బీజవిద్య దొరకదు కదా , దానికేమి చేయుట ? "
ఉద్ధాలకులు తలయూపినారు : " నిజము , దానికి ఇలాగ చేయి , సంప్రదాయమును గురుముఖముగా అర్థము చేసుకొనుట ఒక విధము . అలా కాక , సమానులనుండీ , తనకన్న గొప్పవారినుండీ నేర్చుకున్న దానిని దేవతలకు అర్పించి , వారినుండీ ఆమోద ముద్ర ఒత్తించుకొనుట ఇంకొక విధము . ఇప్పుడు నా శంక మొదటిది సాధ్యము కాదని. అది పోనీలే , రెండవ దానిని చేయి . నాదగ్గర విచార వినిమయము వలన పొందిన దానినంతా దేవతా ముద్ర ఒత్తించుకొని సంప్రదాయ శుద్ధముగా చేసుకో . ఇలాగే , వెనుక ఒక మన్వంతరములో వేదములన్నీ ఖిలములై పోయినాయి . వాటిని సప్తఋషులు తపస్సు చేత మరలా సంపాదించినారు . నువ్వు కూడా అలాగే చేయి . నువ్వు అప్పుడే ప్రాణ దేవుడినీ , అగ్ని దేవుడినీ ఒద్దిక చేసుకొని మెప్పించినావు . ఇక మిగిలినది ఆదిత్యుడొక్కడే .! వాడిని అనుసంధానము చేయి . అతడు ప్రత్యక్ష దేవుడు . చాలా త్వరగా మచ్చిక అగును . అతనిని మెప్పించుకో . వాడి ముద్ర పడితే , అచేతనము కూడా చేతనమగును . "
" ఔను "
" అలాగంటే , నీకు అనుభవసిద్ధమైనదా , ఈ మాట ? "
" ఔను "
" ఎలాగ ? "
" నేను ఈ ఆశ్రమమునకు వచ్చుటకు రెండు దినముల ముందర మా పెరటి తోటలో ఒక ఉసిరి చెట్టు ఉన్నట్టుండి ఎండిపోయినది . మా అమ్మ , చెట్టు బుడములో చెదలు పట్టినాయేమోనని మనుషులను పెట్టి తవ్వించి చూచినది . చెదలు కనిపించలేదు . మా తండ్రి గారు అటు వచ్చి , ’ ఈ చెట్టు ఎండిపోయినది ఎందుకో తెలియదు , ఎవరైనా మంత్ర సిద్ధులుంటే దీనిని పునరుజ్జీవనము చేయవచ్చు . " అన్నారు . మా అమ్మ , ’ అదెలా ? ’ అన్నారు . వారు , " అభ్యూహన మంత్రములు అని ఉన్నాయి . ఆ మంత్రములు తెలిసినవారు పఠించి , నీటిని అభిమంత్రించి ప్రోక్షిస్తే ఇది మరలా చిగురించును " అన్నారు . పక్కనే ఉన్న నేను అది విన్నాను . ఆ రాత్రి యజ్ఞేశ్వరుని అనుసంధానము చేసి , తండ్రిగారి మాటలను చెప్పినాను . ఆతడు నవ్వి , ’ ఏమిటి , మహర్షులకు అచేతనమును చైతన్య పరచు పిచ్చి పట్టుకుందా ? అని , ’ అది కూడా న్యాయమే , ఇవన్నీ క్షుద్ర సిద్ధులు . అయినా వీటిని పొందితేనే కదా , మనసుకు తాను వెళుతున్న దారి సరైనదా కాదా అని సమాధానము దొరికేది ? కానిమ్ము , నేను చెప్పితినని ప్రాణదేవుడిని ప్రార్థించు . అతడు తరువాత విషయము తెలుపును . ’ అని అనుజ్ఞ ఇచ్చి అంతర్ధానమాయెను . "
ఉద్ధాలకులు , అగ్ని దేవుడు యాజ్ఞవల్క్యుడిని ’ మహర్షి ’ యని సంబోధించినాడు అని విన్నవెంటనే జాగృతులైనారు . కానీ మధ్యలో మాట్లాడుట సరికాదని ఊరకే ఉన్నారు . ఇప్పుడు మాట ఒక ఘట్టమునకు వచ్చినట్లై , దానిని అడుగవలెనని అనిపించినది . అయినా , అది అంత ప్రధానమైన మాట కాదు అని , దానిని వదలి , ఆడుతున్న మాటనే కొనసాగించినారు , " ఆ పిమ్మట? "
అయితే మాటలో మొదటికన్నా గౌరవము ఎక్కువ కనపడుతున్నది . అప్పుడు , నోటిమాటగా ’ సమానులు ’ అన్నవారు , ఇప్పుడు కార్యతః దానిని ఒప్పుకున్నవారి వలె మాట్లాడినారు .
యాజ్ఞవల్క్యుడు అన్నాడు , " అనంతరము యజ్ఞేశ్వరుడి ఆజ్ఞ ప్రకారము ప్రాణదేవుడిని అనుసంధానము చేసినాను . ప్రాణదేవుడు దర్శనమిచ్చి , " నువ్వు యజ్ఞేశ్వరుని దయ వలన మహర్షియైనావు . నువ్వు అడిగినది ఇచ్చుటకు దేవతలు సిద్ధముగా ఉన్నారు . అలాగని చెప్పి , తోచిన ప్రతియొకటీ కోరవద్దు . ఇప్పటి మాట గురించి చెబుతాను , విను . నేను దేహగతుడనై ప్రాణము అనిపించుకున్నట్లు గానే , ఈ భువనమునంతటినీ ఆవరించి యున్నాను . కాబట్టి , తెలిసినవారు నన్ను ’ ముఖ్య ప్రాణుడు ’ అంటారు . ప్రాణము వలన ముఖ్య ప్రాణమును గుర్తించునదే ప్రాణోపాసన. నువ్వు నన్ను ముఖ్య ప్రాణుడిగా అర్చించి , అభ్యూహన మంత్రము చేత ఆ వృక్షమును అభిమంత్రించు . ఏమేమవుతుందో అదంతా గమనించు " అని , అభ్యూహన మంత్రమును ఉపదేశించినాడు .
ఉద్ధాలకులు తలాడించినారు . వారికి ఉపనయన సంస్కారము గుర్తుకొచ్చినది . " అప్పుడు ప్రాణము కోసము బ్రహ్మచర్యమును ఉపదేశించేవారు . ఈతడు దానిని సాధించి , ప్రాణ దేవుడిని ప్రసన్నము చేసుకున్నాడు . ఇంతటి వాడిని వదలిపెట్టుటకు వైశంపాయనులు కన్నీరు పెట్టుకోవడములో అతిశయమేముంది ? హూ ... నాకు కూడా కొంత అదృష్టము ఉండబట్టే ఈతడు నా వద్దకు వచ్చినాడు . మాకు తెలిసినదంతా ఈతనికి నేర్పి , ఈతనిని బ్రహ్మవిద్వరిష్ఠునిగా చేయవలెను " అనిపించినది .
" ఆ మీద ? "
తెల్లవారినాక సూర్యుడు బారెడు పొద్దు ఎక్కినాక , అమ్మను పిలుచుకొని వచ్చి , ’ అమ్మా , నీ అనుమతి అయితే ఈ మాను మరలా చిగురిస్తుంది ’ అన్నాను . ఆమె నా మాటను నమ్మలేకపోయింది . ’ కానీవయ్యా, నీ నోటి చలవ వలన నాకు అంతటి శక్తి వస్తే ఎందుకు వద్దనాలి ? ఈ మాను చిగురించనీ ’ అన్నది . నేను వెంటనే కమండలము లోని నీరు తీసుకొని , అభ్యూహన మంత్రముతో అభిమంత్రించి ఆ చెట్టుపై చల్లి , మిగిలిన నీటిని చెట్టుమొదట్లో పోశాను . ఉత్తర క్షణమే మనసుకు ఏదో అనిపించి తలయెత్తి చూసినాను . అక్కడక్కడా చిగిరించడము కనిపించింది . అమ్మకు చూపినాను . ఆమె దానిని నమ్మలేక , ఒక సారి కన్నులు నులుముకొని , మరలా చూచినది . అంతలో చిగురు బాగా పెరిగి ఎర్రటి కెంపు వర్ణమునకు వచ్చినది . పరుగెత్తి వెళ్ళి తండ్రిగారిని పిలుచుకొని వచ్చినది . వారు అది చూసి , ’ ఇది ఎవరి పనితనము ? ’ అన్నారు . అమ్మ నన్ను చూపించింది .
వారు విస్మితులై , ’ ఎలాగ చేశావు ? మంత్ర సిద్ధియా ? ’ అన్నారు . వారికి జరిగినదంతా చెప్పి , " మీరు నిన్న అభ్యూహన మంత్రము అని చెప్పితిరి . దాని వలననే ఇదంతా అయినది ’ అన్నాను . వారు తలఊపుతూ , ’ ఆలంబీ , వీర పుత్రుడిని పొంది వంశమును ఉద్ధారము చేసినావు ’ అని ఆమెను అభినందించి , ’ అయ్యా, నువ్వు మహర్షి తుల్యుడవైనావు . ఇక మేము ఏమైనా నీకు స్మారకులమే ( సాక్షులము ) గానీ శిక్షకులమగుటకు లేదు . ఇక ఏమి చేయవలెనన్నది ఇంక మీదట దేవతల వలన తెలుసుకొని కృతకృత్యుడవు కమ్ము . అయితే , ఇదిగో , నాకు ఒక వరమునివ్వు . మనది కర్మఠుల వంశము . సత్కర్మ అనేది ఈ వంశపు సొత్తు . దానిని వదలవద్దు . దానిని దాటి ముందుకు పోతే మేము తట్టుకోలేము . కానీ , మేము వద్దనము , ముందుకు వెళ్ళు , కానీ వీలైనంత వరకూ కర్మమును వదలవద్దు . అదే నాకివ్వగలిగిన వరము . అవుతుందా ? " అన్నారు . వారి వాణిని విని నాకు కళ్ళనిండా నీరు వచ్చినది . వారికి నమస్కారము చేసి , ’ కర్మములన్నీ సాంగములగు వరకూ నేను బ్రహ్మ విద్యకు వెళ్ళను . ఈ మాటను దేవతలే నిలబెట్టనీ ’ " అని చేతులు జోడించినాను .
ఉద్ధాలకులు ఆశ్చర్యపోయినారు . వెనకటి కాలపు మహర్షి ఎవరో ఒకరు వచ్చి తమ సముఖములో కూర్చొని మాట్లాడుచున్నట్టు అనుభూతి కలిగినది . అయిననూ , ఎదురుగా కూర్చున్నవాడు వయో మానములో చిన్నవాడని , దానిని చూపించకయే అన్నారు , " అలాగైన , తండ్రి గారికి మాట ఇచ్చినావు ? "
" ఔను , కానీ దానికి ఏమి చేయవలెనో తెలియదు . ఇప్పుడు ప్రచారములో నున్న యజుర్వేదమును వినియోగించను యని ఆ దినము ప్రతిజ్ఞ చేసినాను . సంహితయే లేనప్పుడు , ఇక బ్రాహ్మణము ఎక్కడిది ? ఇదే చింతయయినది . "
" యోచించవద్దు , ఆ సంహితా బ్రాహ్మణములను వదలు . నీకు ప్రసన్నులైయున్న యజ్ఞేశ్వరుడు , ప్రాణ దేవుల దయ వలన ఇంకొక జోడి సంహితా బ్రాహ్మణములను పొందు. ఉపనిషత్తులు ఎవరి సొంతమూ కాదు , వాటిని ఎవరి వద్దనుండీ అయినా పరిగ్రహించ వచ్చును . "
" అలాగయిన , సంహితయొక్క మంత్రములు , దాని అర్థమును వివరించు బ్రాహ్మణము-ఈ రెంటినీ కొత్తగా పొందవలెను అనే కదా తమరు చెప్పేది ? "
" ఔను , అప్పుడే అన్నాను కదా ? నువ్వు దేవతలనుండీ పొందుటకు ప్రయత్నించు . అప్పుడది కొత్తదవుతుంది . సరే , ఇప్పటికే ఈ దినము ఆలస్యమైనది . మరలా దీని గురించి మాట్లాడదాము "
యాజ్ఞవల్క్యుడు అనుజ్ఞ అని లేచినాడు . నమస్కారము చేసి వెళ్ళిపోయినాడు . ఉద్ధాలకులు బాహ్యంగా ఆతని నమస్కారమును గ్రహించి , అంతరంగములో ఆతడికి వారే నమస్కారము చేసినారు .
Janardhana Sharma
ఉమ్మెత పూవుచంద్రునకుసాటి యగునా?
[03:
ఉమ్మెత పూవుచంద్రునకుసాటి యగునా?
వారక ఈశ్వరుండు తలపై ధరియించిన యంత మాత్రము న
వ్వారిజ వైరి తోడ సరివత్తువె యుమ్మెత పూవ నీ పసనన్
వారిధు లుబ్బునో దెసలు వన్నెలు దీరునొ చంద్రకాంతముల్
నీరవునొ చకోరముల నెవ్వగ తీరునో తాపమారునో
అర్థము:--- ఎవరో శివ భక్తుడు ఈశ్వరుని తలపైన ఉమ్మెత్త పూవును వుంచాదాడట. దానితో ఉమ్మెత్త పువు నేనూ చంద్రుడిలా శివుని తలపై వున్నాను నేను చంద్రుని లాంటి వాడినే యని గర్వ పడిందట.
అధికారంతో కుయుక్తులతో గద్దె నెక్కిన వారిని యీ పూవు తో పోలుస్తున్నాడు కవి. కాసేపు శివుని తలపై ఉన్నంత మాత్రాన చంద్రునితో నీవు సమాన మౌదునని అనుకుంటున్నావా?చంద్రుని కాంతితో సముద్రములు వుప్పొంగినట్లు నీ కాంతి తో పొంగుతాయా? దిశలన్నీ వెన్నెలతో వెలిగినట్లు నీ తెల్లదనం తో వెలుగు తాయా?
వెన్నెలను పానము చేసి తమ దప్పికనూ,తాపాన్నీ చకోర పక్షులు తీర్చుకుంటాయి. మరి నీవు ఆ చకోరాల దాహాన్ని తీర్చ గలవా?చంద్ర కిరణాల స్పర్శ తోచద్రకాంత శిలలు చేమ్మగిల్లినట్టు నీ తెల్లని రంగుతో చేమ్మగిల్లుతాయా?
అలాగే సంఘం లో అధికారస్థానమే గొప్పది కాదు. దాన్ని నిలబెట్టుకునే సామర్థ్యము కూడా కావాలి. ప్రజలకు సేవ చెయ్య గలగాలి,.ప్రజల మనస్సులో స్థానం సంపాదించు కోగాలగాలి,
అధికారం లో వున్నవాళ్ళు తమకు స్నేహితులని గొప్పలు చెప్పుకుని తమ పబ్బాలు గడుపుకునే వారు,అక్రమంగా అధికారాన్ని చేజిక్కించుకునే వాళ్ళు ఈ పద్యములోని ఉమ్మెత్త పూవు వంటి వారే. ఆ అధికారము పోయినప్పుడు పూవు వలే వడలి రాలిపోతారు.
శివుని మీద వున్న ఉమ్మెత్త చంద్రుడు కానట్టే చట్ట సభల్లో, విద్వత్ సభల్లోకూర్చున్న మూర్ఖుడు యీ ఉమ్మెత్త పువు వంటి వాడే. ఈ నాటి రాజకీయాలకు సరిపోయే పద్యమిది.🙏🙏🌷🌷🌷🌷🌷👏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
అవధానం
అవధానం నిర్వహించడంఆషామాషీవ్యవహారంగాదు.దానికి కొన్ని ప్రత్యేకతలు కలిగి ఉండాలి. అని దివాకర్ల వారు చెప్పిన పద్యం.
" అసమానంబగు పాండితీగరిమ సద్యస్ఫూర్తి హాస్యోక్తి వి
న్యసనం బాసుకవిత్వ సంపద పురాణోక్తి ప్రబోధక్రియా
భ్యసనం బద్భుత ధారణామహిమ అత్యావశ్యకంబుల్ సుదీ
రసికుల్ మెచ్చ వధాన కార్యము సభారమ్యంబుగా జేయఁగన్
నేటి యవధానులందరకు నిది మార్గదర్శకమే!
స్వస్తి!
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷💐💐💐🌷🌷💐a
33. " మహా దర్శనము
33. " మహా దర్శనము " --ముప్పై మూడవ భాగము--అగ్ని దేవుని కృప
33. ముప్పై మూడవ భాగము-- అగ్ని దేవుని కృప
దేవరాతుడు కొడుకుకు ఇప్పుడు తానే యజుర్వేదమును మరలా నేర్పిస్తున్నాడు . అలాగే బ్రాహ్మణోపనిషత్తులు కూడా అయినవి . కుమారుడు ఋగ్వేదము కోసము బుడిలులను ఆశ్రయించినాడు . సామవేదము కోసము ఉద్ధాలకుని వద్దకు పంపవలెను అని ఆచార్యుని అభిమతము . అయితే కొడుకు అగ్నిదేవుని అనుమతి లేనిదే దేనినీ చేయడు .
ఇలాగ ఒక సంవత్సరమైనది . తండ్రి ఎక్కడైననూ యాగము నడచి తనను అధ్వర్యుడిగా పిలిస్తే , తన వెంట కొడుకును కూడ పిలుచుకొని వెళ్ళును . అక్కడ యాజ్ఞవల్క్యుడు తండ్రికి తన వయసు మీరి సహాయము చేయును . అయినా ఎవరి దగ్గరా వినయమును వదలి మాట్లాడలేదు . ఆ భీమ కాయుడు అలాగు వినయముగా ఉండుట చూసి , " ఇదేమిటిది , మహా సర్పము పుష్పహారమైనట్లు ఉన్నాడే ! ఆచార్యుని అదృష్టము ఎంత గొప్పది ! ఇక ఇతడు అధ్వర్యుడై నిలబడు కాలము ఇంకెంతో దూరం లేదు ! " అంటారు . కొందరు తెలియని వారు కుతూహలము చేత , " నీకు శిక్షణ అయినది ఎక్కడయ్యా ? " అంటారు . యాజ్ఞవల్క్యుడు ముసి ముసి నవ్వులు నవ్వుతూ తండ్రిని చూపించును . ఇంకా కొందరు పెద్దవారు , " ఎక్కడైనా గానీ , నువ్వు దీర్ఘ కాలము సుఖముగా ఉండవయ్యా ! " అంటారు . యాజ్ఞవల్క్యుడు ఆ ఆశీర్వాదమును నమస్కార పూర్వకముగా గ్రహణము చేయును .
ఇప్పుడు ఇంటి వెనుక తోటలో యాజ్ఞవల్క్యుని కోసము ఒక గుడిసె ఏర్పడింది . అక్కడ కుమారుడు పయోవ్రతములో ఉన్నాడు . హవిస్సును పాలతో పాటు ఒకసారి భుజించి , మరొక పూట పాలు మాత్రము సేవిస్తాడు . మొదటి జాములో చెరువు నీటి స్నానము , సూర్యోదయము వరకూ జపము . సూర్యోదయము అగుచుండగనే అర్ఘ్య ప్రదానము . మరలా జపము . సూర్యోపస్థానము , దాని తరువాత అగ్ని కార్యము . అనంతరము వచ్చి తలిదండ్రులకు , యజ్ఞేశ్వరునికీ నమస్కారము చేసి మరలా వెనుకకు గుడిసెకు వెళ్ళును . తల్లి భోజనమును తెచ్చి ఇచ్చును . కుమారుడి వీణ మాత్రము అక్కడే ఉంటుంది . అతడు మంత్ర పునశ్చరణ లో లేనపుడు వీణను వాయించును . ఇప్పుడు బుడిలుల ఇంటికి కూడా వెళ్ళుట లేదు . ఒక దినము రాత్రి ఆలంబిని అకస్మాత్తుగా పెరటి తలుపు తీసి బయటికి వచ్చింది . యాజ్ఞవల్క్యుని గుడిసెలో ప్రదీపమును వెలిగించినట్టు దేదీప్యమానముగా వెలుగు నిండిఉంది . అక్కడక్కడా గుడిసె కంతల నుండీ మిణుగురు పురుగులు ఎగురునట్లు కాంతి వెదజల్లుతోంది . యాజ్ఞవల్క్యుని గుడిసె కడకు వెళ్ళినది . ఆలంబిని గాభరాపడు జాతి కాదు , అయినా, " కొడుకేమైనాడో , గుడిసెకు నిప్పు అంటుకున్నదా ? " అని గాభరా పడింది . అయితే పొగ లాంటిదేమీలేదు . మంట కనిపించుట లేదు . కాబట్టి ఏదో విలక్షణముగా ఉండవలెననుకొని శబ్దము చేయకుండా వెళ్ళి గుడిసెలోకి వంగి చూచినది . యాజ్ఞ వల్క్యుడు పద్మాసనములో ధ్యాన ముద్రలో కూర్చున్నాడు . అతడి శరీరము నుండీ ఏదో మంట వలె లేస్తున్నది . అయినా ముఖములో ఏ మార్పూ లేదు . కొంచము దూరములో ఆరేసిన బట్టలు దండెము మీద తమ పాటికి తామున్నాయి . ఆశ్చర్యమేమంటే , తాను వాకిలి వద్దకు వచ్చినా ఆ మంటల శాఖము లేదు . మంట , కట్టెలు వేసినపుడు కనిపించు మంట వలె నాలుకలు చాచుట లేదు . నేతి దీపపు మంటవలె ఘనముగా , చాంచల్యము లేకుండా మండుచున్నది .
ఆలంబిని ఒక్క ఘడియ లాగే నిలచి చూచినది . ఔను , మంట చంచలముగా లేదు . నేరుగా రత్న ప్రభ వలె కనబడుతున్నది . ఆమెకు అర్థము కాలేదు . ఏమైనా కానీ యని , యజ్ఞేశ్వరుని స్మరించి చేతులు జోడించి " నేను వెళ్ళి వారిని పిలుచుకొని వస్తాను . వారికి కూడా ఈ దర్శనము కానీ ! " యని ప్రార్థించి , అక్కడినుండీ వెడలినది .
దేవరాతుడు మంచి నిద్రలో ఉన్నాడు . నిద్రలో ఉన్నపుడు లేపుట ఎలా అని ఆమె కొంత సేపు వేచింది . చివరికి సన్నగా చేతులతో చప్పట్లు కొట్టింది . దేవరాతునికి మెలకువయై ’ ఎవరది ’ అన్నాడు . ఆలంబిని చిన్నగొంతుతో , ’ నేను , మెలకువ అయిందా ? ’ అని అడిగింది .
దేవరాతుడు ’ ఏమిటి విశేషము ? ’ అని ఆమె వైపుకు తిరిగినాడు.
ఆలంబిని తాను తోటలో చూచినది చెప్పింది . దేవరాతునికి ఆశ్చర్యమైనది . అందులోనూ , యాజ్ఞవల్క్యుడు ఆసన ముద్రా ధారణ చేసి కూర్చున్నాడని విని ఇంకా ఆశ్చర్యమై , ’ పదవే , వెళ్ళి చూసి వద్దాము ’ అని దారిలో బచ్చలి ఇంటికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని శుద్ధాచమనము చేసి గుడిసెకు వెళ్ళినాడు .
ఔను , యాజ్ఞవల్క్యుడు ధ్యాన ముద్రలో పద్మాసనములో కూర్చున్నాడు . అతడి చుట్టూ లేత నీలి వర్ణములో , ప్రకాశమానముగా నున్ననూ , కళ్ళకు మిరుమిట్లు గొలపక , కంటికి ప్రియమూ , హితమూ అయినట్టి జ్యోతి యొకటి అతడిని ఆవరించి యుంది . అతడే ఒక దీపమై ఉంటే ఎలాగ నిరాటంకముగా వెలిగెడివాడో అలాగ వెలుగుచున్నది . దేవరాతుడు చేతులు జోడించి నిలుచున్నచోటే ప్రదక్షిణ నమస్కారములను , మనసులోనే పంచోపచారమును చేసి , యజ్ఞేశ్వరుని పూజించి , దీని రహస్యమేమో అనుజ్ఞ కావలెనని ప్రార్థించినాడు . చటుక్కున మనసులో మెరసింది , " || ఆర్ద్రం హి జ్యోతిర్జ్వలతి || " తడిసిన వెలుగు జ్వలించుచున్నది . "
దేవరాతుడు మరలా నమస్కారము చేసి , మనః పూజను అర్పించినాడు. అతని విచికిత్సా బుద్ధి విచారము చేయసాగినది , " ఆర్ద్ర జ్యోతి యంటే ఆపోజ్యోతి . అది ఏమైననూ ధ్యానములో ఉన్న వాడికి మాత్రమే కనిపిస్తుంది . ఇలాగ దేహము నుండీ బయటికి వెడలి కూడా కనిపించునా ? ఔను , వెనకెప్పుడో వినియున్నాడు , ధ్యానపు ఒక అవస్థలో ఇలాగ జ్యోతి కనిపిస్తుందని . అంటే , యాజ్ఞవల్క్యుడు జ్యోతిరూపమగు అవస్థకు వచ్చినాడా ? ఉండనీ , తెల్లవారు వరకూ ఏమీ చేయుట వద్దు " అని సిద్ధాంతానికి వచ్చి నాడు . అయినా , తాను జనకుడిని యను మోహము వదలక , ఆ మంట వలన కొడుకుకు ఏ ఇబ్బందీ రాకూడదని నిర్ధారణ చేసుకొనుటకు మరలా వంగి చూస్తూ , మరలా దానివలన ఏమీ ఇబ్బంది లేదని మనసుకు నిర్ధారించుకొని, అక్కడినుండీ భార్యతో పాటు వెనుతిరిగినాడు .
దారిలో భార్యకు అంతా చెప్పినాడు , " ఉపనయన కాలములో గాయత్రీ మంత్రమును ఉపదేశించినపుడు ఆచార్యుడు శిష్యునికి ఈ జ్యోతిని చూపించును . దానిని కుమారుడు తన స్వంత ప్రయత్నము చేత పెంచుకొని ఎల్లపుడూ చూచుచుండవలెను. ధ్యానము పెరిగి జ్యోతిరూపమగు స్థితి వచ్చినపుడు ఇలాగే జ్వాలలు వెడలును అని విన్నాను . నేనెక్కడా చూడలేదు . చూద్దాము , రేపు కుమారుడినే అడిగితే సరిపోతుంది . "
ఆలంబిని ఆగి ఆగి అన్నది , " ఇటువంటి సందర్భములలో మీరు బుడిలులను అడుగుచుంటిరి కదా ? "
" ఇప్పుడు బుడిలులు ఉన్న స్థితిలో వారిని అడుగునట్లు లేదు "
" అదీ నిజమే , అయితే....."
" తెల్లవారే వరకూ ఆగు . ఇంతవరకూ మనము స్వతంత్రులై యున్నాము , దానివలన మనకు తోచినట్టు చేయుచుండినాము . ఇప్పుడు కుమారుడు స్వతంత్రుడు . మనము చూసినది అతని ఒక పరిస్థితి. అందుకే , వాడినే అడిగితే సరి అన్నాను . "
ఆలంబినికి అర్థమైనది . ఎప్పుడు తెల్లవారుతుందా అని కుతూహలముతో కాచుకుని ఉంది.
సూర్యోదయమైనది . తెల్లవారు జాములోనే లేచిన ఆలంబిని ప్రాతః కర్మలన్నిటినీ ముగించుకొని , అగ్ని పరిచర్య కూడా కానిచ్చి , పెరుగు చిలుకుతున్నది . అప్పుడు కొడుకు వచ్చి , " అమ్మా , నమస్కారము చేస్తాను " అన్నాడు . ఆలంబిని వెనుతిరిగి , " వారిని చూచి వచ్చినావు కదా ?? " అన్నది .
కొడుకు నవ్వుతూ అన్నాడు , " చూచినాను , నమస్కారము చేసిన తర్వాత దగ్గర కూర్చోబెట్టుకొని అడిగినారు . నిన్నటి అనుభవము ఇది రెండో సారి అయినది . అలాగ అగునపుడు నాకు సగము సగము బాహ్య జ్ఞానము ఉంటుంది . అయితే , బయట జరిగేది తెలిసిననూ , ఆ క్రియకు ప్రతిక్రియ ఏమీ చేయలేను . నువ్వు వచ్చినది తెలుసు . తండ్రిగారు వచ్చినది తెలుసు . మీరిద్దరూ చిన్నగా మాట్లాడుకుంటున్నది కూడా విన్నాను . కానీ మీమాటకు సమాధానముగా ఏమీ చెప్పలేకనే కూర్చున్నాను . "
" అంటే , నేను వచ్చినపుడూ , తర్వాత వారిని పిలుచుకొని వచ్చినపుడు నీకు ఒంటిపై జ్ఞానముండినదా ? కళ్ళు తెరచే ఉండినావా ? మేము పక్కనే ఉన్నదంతా నీకెలా తెలుసు ? "
" నువ్వు వచ్చినపుడు మెలకువ అయినది . తరువాత తండ్రిగారిని పిలుచుకొని వచ్చినావే , అప్పుడు కూడా మెలకువ అయింది . అప్పుడే చెప్పినాను కదా ? కళ్ళు తెరచే ఉన్నావా అన్నావు. నేను కళ్ళు తెరచుకోలేదు , నిజమే . ఈ కన్నులు , అంటే , ముక్కుపైన , కనుబొమల కింద ఉన్న కన్నులు రెప్పలు మూసుకొనే ఉండినవి . కానీ అప్పుడు నాకు ఒళ్ళంతా కన్నులై ఉండెను . ఈ చుట్టుపక్కల ఉన్నదంతా , నా వీపు వెనకాల ఉన్నదంతా కూడా కనిపించుతుండినది . ఇంకొక విశేషమేమంటే , నా కళ్ళకి , అంటే చూపుకు గోడ కూడా అడ్డము కాలేదు . నువ్వు వాకిలి తెరచుకొని తోటలోపలికి వచ్చినది మొదలు అంతా కనిపించుతుండినది . సరేనా ? "
" అదేమిటా మంటలు లేస్తున్నట్లుండినవి ? ఆ నీలిమంట నిన్ను కాల్చలేదా ? "
" అది కాల్చే మంట కాదు . అది కాల్చి ఉంటే , మీ కొడుకునై ఈ దినము వచ్చి చూచేవాడినా ? చూడు , వేదములో , ’ చూపు పెద్దదగుటకు కన్నులు ఆకాశమంత కావలెను ’ అని చెప్పియున్నది . అట్లే అయినది , అంతే . ఆ దినము , ఉపనయనము రోజు , సూర్య మండలమునుండీ సావిత్ర కిరణమును పట్టి హృదయము లోపల నింపుకొనుటను నేర్పించినారు . అక్కడ ఆశ్రమములో ఉన్నపుడు దానిని చేస్తూ ఉండిననూ అది కన్నులను ఆకాశమంత చేసియుండలేదు . ఇప్పుడో వారము కింద అది జరిగినది . నిన్న రాత్రి అయినది రెండోసారి . అంతే ! అది సరే , నేనొక మాట చెప్పనా ? "
" చెప్పు " తల్లి పెరుగు కుండను మరచిపోయి , కవ్వమును గోడకు ఆనించి , తానూ గోడకు ఆనుకొని నిలుచుంది .
" నిన్న యజ్ఞేశ్వరుని దర్శనము పూర్తిగా చేసుకున్నాను . ఇంతవరకూ ఐతే ఎదురుగా ఉన్న అగ్ని కుండములో పైకి వచ్చే జ్వాలల మధ్యలో మాత్రమే చూచేవాడిని . నిన్న రాత్రి అదేమీ లేకుండా జ్వాలా మాలా విభూషితుడైన యజ్ఞేశ్వరుడి దర్శనమైనది . నేను పూజ చేసి , ఇదేమిటిలాగ దర్శనమిచ్చినావు అని అడిగినాను . యజ్ఞేశ్వరుడు నవ్వి , " నేను ఎల్లపుడూ మీ ఎదురుగ్గానే ఏదో ఒక రూపములో ఉండనే ఉంటాను . మీరు చూడకపోతే నాదేమి తప్పు ? పగటి పూట ఆదిత్యుడనై వెలుగువాడిని నేనే ! పగలూ రాత్రీ యనక నిలిచినచోట నిలువకుండా వీస్తున్న గాలిని కూడా నేనే ! ఇప్పుడు నీ ఎదురుగా నిలచినట్లు ఈ రూపములో ఎల్లపుడూ నేను లేకుంటే , నేననే వాడిని లేనే లేనట్లా ? " అని అడిగినాడు .
" నేను మరలా అడిగినాను , " మీరు , దేవతలు , మాకన్నా గొప్పవారు . మీ రహస్యములను మీరే చెప్పకపోతే మాకెలా తెలుస్తుంది ? " . దానికి యజ్ఞేశ్వరుడు పకాలుమని నవ్వుతూ అన్నాడు , " అది కూడా నిజమే , సరే , ఇప్పుడు చూడు , నేను ప్రసన్నుడనైన దానికి గుర్తుగా , నీ దృష్టి పెద్దదగును . నీదృష్టికి ఏ అడ్డూ ఉండదు . నువ్వు మధ్యాహ్నములలో సూర్య దర్శనము చేస్తావు కదా , దానివలన నాడులలో నిండియున్న కశ్మలము నాశనమగును . నాడి శుద్ధి అయితే , మొదటగా కలిగేది నా దర్శనము . నా దర్శనపు గుర్తుగా నా సాత్త్విక తేజము నీ నాడినాడులలోనూ ప్రసరించును . నీకు ఇంతవరకూ గోచరము కాకుండానే ప్రసారమగుచున్న ప్రాణ శక్తి , ఇప్పుడు ఇంద్రియ గోచరమగు నీలజ్యోతియై దేహమునుండి బయటికి వ్యాపించును. ఇప్పుడు ధ్యానములో కూర్చుంటే మాత్రమే కనిపించు ఆ జ్యోతి , నీకు జ్యోతి స్థితి సహజమైనపుడు ఆదిత్య దర్శనమగును . నువ్వు మధ్యాహ్నము పూట ఆదిత్యుని ఉపస్థానము చేయుచున్నట్లే , ఇక పైన విరామము దొరికినపుడల్లా ఆ ఆదిత్య మంత్రమును జపము చేస్తూ రా. ఇక కొన్ని రోజుల కోసము నువ్వు ఇల్లు వదలి వెళ్ళు ’ అన్నాడు. ఎక్కడికి పోవాలన్నది చెప్పలేదు "
" ఇదంతా వారికి చెప్పినావా ? "
" చెప్పినాను "
" ఏమన్నారు ? "
" సరే , నేను పరిగణించినట్లే అయినది . అయితే , నేను సావిత్ర మంత్రము అయితే చాలు అనుకున్నాను . యజ్ఞేశ్వరుని అనుజ్ఞయే అయిన తర్వాత , ఇక చెప్పేదేముంది ? కానీ , ఆదిత్య మంత్రమును జపిస్తూ ఉండు , తర్వాత ఇల్లు వదలి , ఉద్ధాలకుల ఆశ్రమమునకు వెళ్ళిరా ’ అన్నారు . "
" ఇంక చెప్పడానికేముందీ ? ఉద్ధాలకుల ఆశ్రమమునకు వెళితే అక్కడ నువ్వు చదివేది యేముంది ? వారు సామవేదులు కదా ? "
" చూడమ్మా , సామములో హింకార సామము , హుంకార సామము అని రెండు ఉన్నాయి . వాటిలోని మంత్రాలను విస్తారము చేసి వ్యూహమును కట్టుటను సామము తోనే నేర్వవలెను . అదీకాక, ఉద్ధాలకులు బ్రహ్మిష్ఠులు . వారికి ఉపనిషత్తులపైన శ్రద్ధ ఎక్కువ. కాబట్టి , వారి ఉపనిషత్తైన ఛాందోగ్యోపనిషత్తునూ , మన ఉపనిషత్తులైన తైత్తిరీయ , కఠోపనిషత్తులనూ నేర్చుకుంటే సరిపోవును . అంతే కాక, ఇంకొక రహస్యము . తైత్తిరీయము మహా సంహితలనూ , పంచాత్మ సంక్రమణ విద్యను వివరిస్తుంది . కఠోపనిషత్తు శ్రేయోరూపమైన ఆత్మ విద్యను వివరిస్తుంది . ఛాందోగ్యము అవస్థాత్రయ పరీక్షణమును ముఖ్యముగా వివరిస్తుంది . ఈ మూడు విద్యలూ నేర్చులోపల నేను ముసలి వాడనైపోతాను . "
" అప్పటికి నేనేమౌతానో ఎవరెరుగుదురు ? ....."
సరిగ్గా అప్పుడే బుడిలుల ఇంటినుండీ వార్త వచ్చింది , " బుడిలులకు ఆఖరి క్షణాలు వచ్చినాయి . ఆచార్య దంపతులతో పాటూ యాజ్ఞవల్క్యుడు కూడా రావలెనంట . "
ఆచార్యుడు గబగబా వచ్చి , భార్యా కొడుకులను చూసి , " నువ్వూ ఇక్కడే ఉన్నావా ? మంచిదైంది , పదండి , మనము ముగ్గురూ రావలెనని చెప్పి పంపినారు . యాజ్ఞవల్క్యా, నువ్వు ముందర నడు. నీ వెనకే మేమిద్దరమూ వస్తాము . బుడిలులకి నువ్వంటే చాలా ప్రేమాభిమానాలు . " అన్నాడు .
యాజ్ఞవల్క్యుడు సరేనని ఉన్నవాడున్నట్లే బయలుదేరినాడు .
Janardhana Sharma
భోజనమునకు ఉపయోగించదగిన పాత్రలు
భోజనమునకు ఉపయోగించదగిన పాత్రలు మరియు ఆకు విస్తళ్ళు -
* బంగారు పాత్ర యందు భోజనము మంగళప్రదమైనది . జఠరాగ్ని వృద్ది చెందును .వీర్యవృద్ధి కలుగచేయును . మంచి చూపును ఇచ్చును . పైత్యవికారాలను అణుచును . శరీరానికి గొప్ప మేలు చేయును .
* వెండిపాత్ర యందు భుజించిన పిత్తం ఎక్కువగును . శ్లేష్మాన్ని హరించును . వాతాన్ని చేయును . అరుచి ( ఏమి తిన్నా రుచి లేకుండా ఉండు సమస్య ) పోగొట్టును . శరీరానికి కాంతిని ఇచ్చును . వెండి ప్లేట్ మధ్యలో బంగారముతో తాపడం చేయించి అందులో భుజించుట కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చును .
* కంచు పాత్రలో భుజించిన రక్తపైత్యము హరించును . హృదయానికి బలాన్ని ఇచ్చును . బుద్ధిని పెంచును . శరీరము నందు జఠరాగ్ని పెంచును . శరీరానికి కాంతిని కలుగచేయును . ఎముకల వృద్ది అగుటకు తోడ్పడును . ఎముకల బలానికి సహాయపడును .
* స్టెయిన్ లెస్ స్టీల్ , ఇనుము పాత్ర యందు భుజించిన శోధన ( Asitis ) , పాండురోగము ( Anemia ) సమస్యలను పోగొట్టును . కామిల వ్యాధి ( కామెర్లు ) నివారణ అగును . వీర్యవృద్ధి , జఠరాగ్ని పెంచును . ఈ పాత్రలను శుభ్రపరుచుట సులభము .
* అల్యూమినియం పాత్ర యందు వండుట మరియు భోజనం చేయుట అత్యంత ప్రమాదకరం . ఈ పాత్రల యందు వండు సమయము నందు దీని యందలి విషము కొంచం కొంచం వండిన ఆహారాల యందు కలిసి రక్తదోషాలు ఏర్పడి చర్మరోగాలు వచ్చుటయే కాక , జఠరాగ్ని మందగించి శరీరము విషతుల్యమై అనేక రోగాలు సంప్రాప్తించును .
ఆకు విస్తర్ల యందు భోజనం చేయుట వలన ఉపయోగాలు -
* అరటి ఆకు యందు భోజనము మిక్కిలి పరిశుభ్రముగా ఉండును . వాతాన్ని హరించును . బలము , ఆరోగ్యము వృద్ధిచెందును . శరీరకాంతి , సంభోగశక్తి పెంపొందించును . ఆకలిని మరియు దంతకాంతిని కలిగించును . పైత్యమును శాంతిప చేయును . శ్లేష్మవికారాలు , వొళ్ళు నొప్పులు తగ్గును . శరీరము నందలి క్రిములు నాశనం అగును . ఉదరము నందలి పుండ్లు ( peptic ulcers ) తగ్గించును .
* మోదుగ ఆకు విస్తరి యందు భుజించుట వలన గుల్మరోగము ,మహోదరము , క్రిమిరోగము , రక్తసంబంధ రోగములు , పిత్తరోగములు నివారణ అగును . బుద్దిని పెంచును . మోదుగ చంద్ర సంబంధ వృక్షము . చంద్రుడు మనః కారకుడు అందుచే ఈ విస్తరి యందు భుజించటం చేత సాత్విక గుణములు కలుగును .
* మర్రి ఆకుల విస్తరి యందు భుజించటం వలన క్రిమిరోగ నివారణ అగును. వ్రణములు , పైత్యం పొగొట్టును . కుష్ఠు రోగమును హరించును . నేత్రదోష నివారణ చేయును . వీర్యవృద్ధి కలిగించును .
* రావి ఆకు విస్తరి యందు భుజించిన పిత్తము , శ్లేష్మము నివారణ అగును . అగ్నివృద్ధి కలిగించును . జననేంద్రియ దోషములు నివారణ అగును . విద్యార్జనకు కావలసిన ఆసక్తిని కలుగచేయును .
* పనస ఆకుల యందు భుజించిన అగ్నివృద్ది , పిత్తహర గుణములు ఉండును .
* తామర ఆకు విస్తరి యందు భుజించిన విషహరముగా ఉండును . సరస్సులో ఉన్న ఆకు భుజించుటకు పనికిరాదని " అహ్నిక ప్రకాశం" అను గ్రంథములో ఉన్నది .
* వక్కపెట్ట భోజనమునకు వాడుట కొన్ని ప్రదేశాలలో ఉన్నది. తిన్నతరువాత పళ్ళెము వలే కడిగి మరలా భుజించటం కూడా ఉన్నది . ఇది అగ్నివృద్ది చేయును . దీని నుంచి వాతపిత్తరోగములు హరించును .
మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
నవరాత్రులలో సువాసిని
_*నవరాత్రులలో సువాసిని , కుమారి పూజ విధానం*_
పసుపుకొమ్మలను సేకరించి , నిమ్మరసంలో మూడు రోజులు నానబెట్టి , ఎండలో ఆరబెట్టి , కుంకుమరాళ్లను కలిపి , దంచి , జల్లించి , సేకరించినది ఉత్తమమైనది. ఇటువంటి కుంకుమతో అమ్మను ఆరాధించిన అన్నికోర్మెలు నెరవేరతాయి.
కుంకుమను స్త్రీలు ప్రత్యక్షంగా ధరించవచ్చు. పురుషులు ముందుగా చందనమును ధరించి , ఆపైన కుంకుమను ధరించాలి. ఈవిధంగా ధరించనియెడల పురుషత్వము నశిస్తుంది. అదేవిధంగా పసుపును పురుషులు శరీరానికి పూసుకొనరాదు. పూసుకొనిన యెడల పురుషత్వము నశిస్తుంది.
*సువాసినీ పూజ ఏవిధంగా చేయాలి ?*
సలక్షణాలతో ఏవిధమైన అవయవలోపంలేని సౌమ్యమైన , ముతైదువను ఎంచుకొని., అమ్మవారిగా భావించి., షోడశ ఉపచారములతో శ్రీసూక్త విధానంగా సహస్ర , త్రిశతీ , అష్ణోత్తర , ఖడ్గమాల నామములతో అర్చించి , మంగళహారతి ఇచ్చి , ఆభరణ , పుప్ప , హరిద్ర , కుంకుమ చందనాదులతో సత్కరించి , ఆ సువాసినితో ఆశీర్వచనము తీసుకొనిన సువాసినీపూజ పూర్తియగును
ఈ సువాసినీపూజ శ్రీచక్రనవావరణార్చన అనంతరం దేవీనవరాత్రులలో నిర్వహించాలి.
శక్తి అనుసారం ఒక ముతైదువకుగానీ , ముగురికిగానీ , ఐదుగురికిగానీ , ఏడుగురికిగానీ , తొమ్మిదిమందికిగానీ , పద్దెనిమిదిమందికి గానీ , ఇరవై ఏడుమందికి గానీ , యాభై నాలుగుమందికి గానీ , నూట ఎనిమిది మందికిగానీ , ఐదువందల యాభై ఎనిమిదిమందికి గానీ , వెయ్యిన్నూట పదహారు మందికిగానీ సువాసినీపూజ చేయవచ్చును.
బ్రాహ్మణ ముతైదువలకు సువాసినీపూజ చేసిన భక్తి , జ్ఞాన , వైరాగ్యములు , విద్యాభివృద్ధి కలుగును.
క్షత్రియ ముతైదువలకు సువాసినీపూజ చేసిన ధైర్య సాహసములు వృద్దియగును. ముతైదువలకు సువాసినీ పూజ చేసిన అప్టెశ్వర్య భోగభాగ్యములు వృద్దియగును.
శూద్ర ముతైదువలకు సువాసినీపూజ చేసిన సత్సంతానప్రాప్తి కలుగును. మన యొక్క కామ్యమునుబట్టి సువాసినులను ఎంచుకొని , ఆహ్వానించి , ఆరాధించి , ఆశీస్సులు పొందవలయును.
*కుమారీపూజ ఏవిధంగా చేయాలి ?*
అమ్మవారికి ప్రియమైన అర్చనలలో కుమారీ అర్చన విశేషమైనది. శ్రీదేవీ నవరాత్రులలో
మొదటిరోజు ఒక సంవత్సరం కలిగిన కన్యను బాలగా ,
రెండవ రోజు రెండు సంవత్సరాలు కలిగిన కన్యను కుమారిగా
మూడవరోజు మూడు సంవత్సరాలు కలిగిన కన్యను త్రిమూర్తిగా ,
నాల్గవరోజు నాలుగు సంవత్సరాలు కలిగిన కన్యను కళ్యాణిగా,
ఐదవరోజు ఐదు సంవత్సరాలు కలిగిన కన్యను రోహిణిగా ,
ఆరవరోజు ఆరు సంవత్సరాలు కలిగిన కన్యను కాళికగా ,
ఏడవరోజు ఏడు సంవత్సరాలు కలిగిన కన్యకను చండికగా ,
ఎనిమిదవరోజు ఎనిమిది సంవత్సరాలు కలిగిన కన్యకను శాంభవిగా ,
తొమ్మిదవరోజు తొమ్మిది సంవత్సరాలు కలిగిన కన్యకను దుర్గగా ,
గురు నారాయణ భవిష్యవాణి వారి ఉచిత నిత్య రాశి ఫలితాలు మీ రాశి ఫలితాలు
మీరు ఏ సమస్యల్లో ఉన్నా మీ జాతకం/హస్తరేఖలు చూసి మీ సమస్య లకు పరిష్కారం చేయగలం సమర్ధులం పూజ/గ్రహజపం/హోమం ద్వారా ఖచ్చితంగా పరిష్కారం చేయగలం ఇప్పుడే ఫోన్ చేయండి "జ్యోతిష్య రత్న" జరిగిన విషయం లు చెప్పి మీ భవిష్యత్తు చెప్పగలం వివాహం నకు జాతకం లు సరిపోల్చుట కూడా చూడబడును మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి 7981622895 గత 35 సంవత్సరంల నుండి ఇదే ఫీల్డ్ లో ఉన్నాం మా దగ్గర సిద్ధి పొందిన మంత్రాలు ఉన్నాయి మా గురువు ల ద్వారా మాకు వచ్చాయి. విద్య ఉద్యోగం వివాహం సంతానం కారాగృహ విముక్తి అనారోగ్యం రాజకీయ పదవులు ఋణ విమోచనం వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి రోగ నివారణ శత్రువులు నుంచి రక్షణ గృహ నిర్మాణం ఇలా ఏదైనా పరిష్కారం చేయగలం సమర్ధులం హోమం ద్వారా ఖచ్చితంగా మీ కోరికలు తీరేలా చేయిస్తాం మీ కోరికలు తీరకపోతే మీ ధనం వాపసు ఇస్తాం షరతులు వర్తిస్తాయి మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి
సకల శుభ పౌరోహిత్యం కార్యక్రమాలు చేయించబడును
పదవరోజు పది సంవత్సరాలు కలిగిన కన్యకను సుభద్రగా
భావించి షోడశఉపచారాలతో శ్రీసూక్త విధానంగా సహస్ర , త్రిశతీనామ , అష్ణోత్తర శతనామ , దేవీఖడ్గమాలా నామాదులతో , హరిద్ర , కుంకుమ పుష్పాదులతో అర్చించి , మంగళహారతులిచ్చి , ఆభరణ , పుష్ప , చందనాదులతో సత్కరించి వారియొక్క ఆశీర్వచనము తీసుకొనిన సకలశుభములు కలుగును.
04-10-2024) రాశి ఫలితాలు
రేపు (04-10-2024) రాశి ఫలితాలు
గురు నారాయణ భవిష్యవాణి వారి ఉచిత నిత్య రాశి ఫలితాలు మీ రాశి ఫలితాలు
మీరు ఏ సమస్యల్లో ఉన్నా మీ జాతకం/హస్తరేఖలు చూసి మీ సమస్య లకు పరిష్కారం చేయగలం సమర్ధులం పూజ/గ్రహజపం/హోమం ద్వారా ఖచ్చితంగా పరిష్కారం చేయగలం ఇప్పుడే ఫోన్ చేయండి "జ్యోతిష్య రత్న" జరిగిన విషయం లు చెప్పి మీ భవిష్యత్తు చెప్పగలం వివాహం నకు జాతకం లు సరిపోల్చుట కూడా చూడబడును మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి 7981622895 గత 35 సంవత్సరంల నుండి ఇదే ఫీల్డ్ లో ఉన్నాం మా దగ్గర సిద్ధి పొందిన మంత్రాలు ఉన్నాయి మా గురువు ల ద్వారా మాకు వచ్చాయి. విద్య ఉద్యోగం వివాహం సంతానం కారాగృహ విముక్తి అనారోగ్యం రాజకీయ పదవులు ఋణ విమోచనం వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి రోగ నివారణ శత్రువులు నుంచి రక్షణ గృహ నిర్మాణం ఇలా ఏదైనా పరిష్కారం చేయగలం సమర్ధులం హోమం ద్వారా ఖచ్చితంగా మీ కోరికలు తీరేలా చేయిస్తాం మీ కోరికలు తీరకపోతే మీ ధనం వాపసు ఇస్తాం షరతులు వర్తిస్తాయి మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి
సకల శుభ పౌరోహిత్యం కార్యక్రమాలు చేయించబడును
మేషం
04-10-2024
ఆప్తుల నుండి అవసరానికి ధన సహకారం అందుతుంది. పాత రుణాలు నుండి విముక్తి లభిస్తుంది. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపార పరంగా నూతన పెట్టుబడులు లభిస్తాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
వృషభం
04-10-2024
చుట్టుపక్కల వారితో ఆస్థి వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులలో ఆత్మ విశ్వాసంతో పని చేసి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి.
మిధునం
04-10-2024
ఋణ ఒత్తిడి అధికమై మానసిక శిరో భాధలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. దైవ సేవా కార్యక్రమాలలో ఆప్తులతో పాల్గొంటారు. సంతాన విద్యా విషయంలో ఊహించని విషయాలు తెలుస్తాయి. స్థిరాస్తి ఒప్పందాలు అతికష్టం మీద పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.
కర్కాటకం
04-10-2024
మిత్రులకు మీ అభిప్రాయాలు నచ్చవు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేయలేరు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలుంటాయి. ఇంటా బయట ఒత్తిడి వలన మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాల్లో సహోద్యోగులతో సమస్యలు కలుగుతాయి. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి.
సింహం
04-10-2024
ఆర్ధిక ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అందరితో సఖ్యతగా వ్యవహారిస్తారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. వాహన యోగం ఉన్నది. జీవిత భాగస్వామితో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
కన్య
04-10-2024
ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.
తుల
04-10-2024
ముఖ్యమైన విషయాలలో స్వంత నిర్ణయాలు కలిసిరావు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వృత్తి ఉద్యోగమున విలువైన పత్రములు విషయంలో జాగ్రత్త వ్యవహరించాలి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
వృశ్చికం
04-10-2024
కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది. చేపట్టిన పనులు అనుకూలంగా సాగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
ధనస్సు
04-10-2024
కీలక వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుని లాభాలు అందుకుంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇతరుల నుండి ఆశించిన సహాయం అందుతుంది సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
మకరం
04-10-2024
చెయ్యని పనికి ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి. అనవసర వస్తువులపై ధనవ్యయం చేస్తారు. ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆప్తులతో మాట పట్టింపులు కలుగుతాయి.
కుంభం
04-10-2024
సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సంతానం విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.
మీనం
04-10-2024
ప్రయాణాలలో మార్గ అవరోధాలు తప్పవు. ధన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. ఊహించని రీతిలో ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయట ప్రతి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది