14, మార్చి 2024, గురువారం

Panchaag


 

కలలు కనడం

 కలలు కనడం మానవ సహజం. చిన్న, పెద్ద అని తేడా లేకుండా అందరికీ కలలు వస్తాయి. మానసిక స్థితికి ప్రతిరూపాలే కలలు. పడుకోనేటప్పుడు సంతోషంగా ఉంటే ఒకలాగా, విషాదంగా ఉన్నప్పుడు పడుకుంటే వచ్చే కలలు మరొక విధంగా ఉంటాయి. మనకి కలలు వచ్చినప్పుడు వాటిలో అనేక దృశ్యాలు మనకు కన్పిస్తాయి. కలలో ఎటువంటి దృశ్యాలు కనపడితే ఎలాంటి ఫలితాలు వస్తాయి???


ఎలాంటి కలలు రావడం మంచిది కాదు?

మెరుపు మెరిసినట్లు, ఉరుములు ఉరిమినట్లు, పిడుగు పడినట్లు, తల దువ్వుకుంటున్నట్లు, ఇంట్లో నక్షత్రం ప్రకాశిస్తున్నట్లు, కట్లు ఉన్న కాళ్లతో నడిచినట్లు, కాలు విరిగినట్లు కలలు రావడం మంచిది కాదు.


ఎలాంటి కలలు రావడం వల్ల మంచి జరగదు?

కుక్క తమను చూచి మొరిగినట్లు, నక్క, కోతి కనిపించినా, పక్షిగుడ్లను పగులగొట్టినట్లు, తడిసి ఉన్న గోడపై నడిచినట్లు, పిల్లిని చంపినట్టు, జంతువులు కరిచినట్లు, తేనెటీగలు కుట్టినట్లు, ఎగురుతున్నట్లు, గాడిద పైకి ఎక్కినట్లు, మృతులను చూసినట్లు, గుడ్లగూబలు అరిచినట్లు, చెట్టు ఎక్కి అన్నం తిన్నట్టు కలలు వస్తే నిజ జీవితంలో మంచి జరగదు.


అగ్నిపురాణం ప్రకారం… కలలో బొడ్డు తప్ప ఇతర శరీరావయవాలలో గడ్డి, చెట్లు మొలవటం, నెత్తి మీద పెట్టుకున్న కంచుపాత్రలు పగిలిపోవటం, క్షవరం చేయించుకొన్నట్టు కనిపించటం, ఒంటికున్న వస్త్రాలు పోయినట్టుగా కనిపించటం, మలిన వస్త్రాలు ధరించటం, నూనె, బురద పూసుకోవటం, పైనుంచి కింద పడటం లాంటివి మంచిదికాదు.


ఎలాంటి కలలు నష్టహేతువులు?

అంతేకాదు సర్పాలను చంపటం, ఎర్రటి పూలతో నిండిన వృక్షాలను, సూకరం, కుక్క, గాడిద, ఒంటె కనిపించటం, ఆ జంతువులపై ఎక్కినట్టుగా ఉండటం శుభప్రదం కాదు. పక్షి మాంసాన్ని తినటం, తైలాన్ని తాగటం, మాతృ గర్భంలో ప్రవేశించటం, చితిపైకి ఎక్కటం, ఇంద్రధనస్సు విరిగినట్టుగా కనిపించటం అశుభాన్ని సూచిస్తుంది. ఆకాశం నుంచి సూర్యచంద్రులు పడిపోవటం, అంతరిక్షంలోనూ, భూమండలంలోనూ ఉత్పాతాలు జరిగినట్లు కనిపించటం, దేవతా బ్రాహ్మణ రాజగురువులకు కోపం వచ్చినట్టు కల రావటం నష్టహేతువులు.


ఇవేగాక…. పరిచయం లేని స్త్రీతో వెళ్ళుతున్నట్లు, దిగంబరంగా ఉన్నట్లు, ఆవు పేడతో ఇల్లు అలికినట్లు, పిల్లలు మరణించినట్లు, సూర్యాస్తమయం, మబ్బుల వెనుకనున్న సూర్యుడు, సూర్యకిరణాలు తమ పక్క మీద పడినట్లు, ఎర్రని పూలు, గాడిదలు నడుపుతున్న బండి ఎక్కినట్లు, ఊబిలో కూరుకుపోయినట్లు, ప్రత్తి చెట్లు, పూలు పూయని చెట్లు, చుట్టూ గ్రద్దలు ఎగురుతున్నట్లు, ముఖముపై పక్షులు పొడిచినట్లు, బంగారం లేదా వెండి ముద్దలు, పంది, నక్క, పులి, గాడిద, దయ్యములు మొదలగు వాటిపై ఎక్కి వెళుతున్నట్లు, క్రింద పడిన ఆకులు, వక్కలను ఏరుకున్నట్లు, గడ్డము, మీసం గొరిగించుకున్నట్లు, నారింజ, దబ్బ, నిమ్మ, పనసకాయలు తినినట్లు స్వప్నాలు రావడం మంచిది కాదు.


ఎలాంటి కలలు రావడం వల్ల కోరికలు నెరవేరుతాయి?

ఒక్కోసారి పూలతోటల్లోను … పండ్ల తోటల్లో తిరుగుతున్నట్టుగా, ఆకాశంలో ఎగురుతున్నట్టుగా, పాములు – తేళ్లకి మధ్యలో ఉన్నట్టుగా కనిపించడం వలన శుభకార్యాల్లోనూ … దైవకార్యాల్లోను పాలుపంచుకునే అవకాశం లభిస్తుంది. సంతానం లేనివారికి సంతానం కలగడం వంటి కొన్ని కోరికలు నెరవేరుతాయి.


ఎలాంటి కలలు రావడం వల్ల మంచి జరుగుతుంది?

ఇక కలలో పాలు … తేనె వంటివి కూడా ఒక్కోసారి కనిపిస్తూ వుంటాయి. ఇవి కనిపించడం వలన …సేవించినట్టు అనిపించడం వలన అంతా మంచే జరుగుతుంది. ఇవి ఒలికిపోయినట్టుగా కనిపిస్తే మాత్రం తలపెట్టిన కార్యాల్లో నిరాశ ఎదురవుతూ వుంటుంది. కలలో పాలు, తేనె కనిపిస్తే ఎంత మంచి జరుగుతుందో, నూనె కనిపిస్తే అంత కీడు జరుగుతుంది. అంతే కాదు పాము కాటు వేసి రక్తం కళ్ళచూసినట్లు కన్పిస్తే మంచి ఫలితం లభిస్తుంది.


ఎలాంటి కలల వల్ల శత్రువులు నశిస్తారు?

ఇక గాల్లో ఎగురుతున్నట్టుగా వచ్చే కల మంచి అనుభూతిని ఇస్తుంది. కానీ ఈ విధంగా కల రావడం వలన మరణ వార్త వినవలసి వస్తుంది. పాములు – తేళ్లు వున్నచోటుకి వెళుతున్నట్టుగా కలవస్తే, కోరి శత్రుత్వాన్ని కొని తెచ్చుకోవడం జరుగుతుంది. ఆ పాములను … తేళ్ళను చంపినట్టుగా కల వస్తే … త్వరలోనే శత్రువులు నశిస్తారు.

రాశి ఫలితాలు

 13-03-2024

సౌమ్య వాసరః బుధవారం 

రాశి ఫలితాలు

***********


మేషం

ఉద్యోగస్తులకు అదనపు పనిబారం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలిసిరావు. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. నిరుద్యోగప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఆర్ధిక పరిస్థితి మందగిస్తుంది. ఇంటాబయట ఊహించని సమస్యలు పెరుగుతాయి.

---------------------------------------

వృషభం

దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి నుండి బయటపడతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి

---------------------------------------

మిధునం

ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. ఇంటాబయట సమస్యలు పెరుగుతాయి. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. మానసిక అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి

---------------------------------------

కర్కాటకం

సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది. సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు సేకరిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

---------------------------------------

సింహం

బంధు మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలు పరుస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పనిఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది.

---------------------------------------

కన్య

 కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రులతో ఊహించని మాటపట్టింపులుంటాయి.

---------------------------------------

తుల

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించవు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులకు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలలో నిలకడ ఉండదు. వృత్తి వ్యాపారాలలో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి.

---------------------------------------

వృశ్చికం

కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సమాజంలో మీమాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.

---------------------------------------

ధనస్సు

గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. మానసిక ప్రశాంతత కలుగుతుంది. కీలక వ్యవహారాలలో స్వంత ఆలోచనలో ఆచరణలో పెడతారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి అవుతాయి.

---------------------------------------

మకరం

వ్యాపార ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. బంధు వర్గంతో విభేదాలు కలుగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

---------------------------------------

కుంభం

వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు అంతగా కలిసిరావు. ఋణ ఒత్తిడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.

---------------------------------------

మీనం

ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ పొందుతారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. పాత మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

---------------------------------------


Note:-

శ్రీ పద్మావతి శ్రీనివాస వివాహ సమాచార సంస్థ

*(రి.జి.నెం.556/2013) *వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

వారి 

బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక

*పరిచయం - పరిణయం*

26/05/2023(ఆదివారం) రోజు వనస్థలిపురం లో

ఏర్పాటు చేయటం జరిగినది. రిజిస్ట్రేషన్ లు జరుగుతున్నాయి ఇతర వివరాలకై సంప్రదించండి.

98487 51577 / 80195 66579.

*******************

బ్రహ్మాండం మధ్యలో

 శ్లోకం:☝️

*బ్రహ్మా యేన కులాలవన్ని యమితో*

   *బ్రహ్మండ భాండోదరే*

*విష్ణుర్వేన దశావతారగహనే*

  *క్షిప్తో మహాసంకటే |*

*రుద్రో యేన కపాలపాణిపుట కే*

  *భిక్షాటనం సేవతే*

*సూర్యో భ్రామ్యతి నిత్యమేవ గగనే*

  *తస్మై నమః కర్మణే ||*


భావం: కుండను పోలిన బ్రహ్మాండం మధ్యలో ఉండి సృష్టి చేయవలసిందిగా బ్రహ్మకు నియమపాలన విధించబడింది. ఆయన ఆ కర్మకు కట్టుబడక తప్పదు. 

అదేవిధంగా కర్మవశంచేతనే విష్ణువు పది అవతారాలు ఎత్తవలసి వచ్చింది. కష్టమే అయినా ఆయనా కర్మాధీనుడే.

ఇక రుద్రుడు పుర్రెను చేతబట్టుకొని శ్మశానాల్లో తిరుగాడే కర్మ శివునిది.

అయితే అలుపేలేక నిరంతరం తిరిగే కర్మ సూర్యునిది. 

ఈ కర్మ యావత్తూ దేని అధీనంలో ఉన్నదో, దానికివే నమస్సులు.


బ్రహ్మ, విష్ణు, రుద్ర, సూర్యులు కూడా కర్మకు

 ఏవిధంగా కట్టుబడి ఉన్నారో కవి దీనిలో చెబుతున్నాడు.🙏

పంచాంగం

 ఈ రోజు పంచాంగం 13.03.2024 Wednesday,

 

స్వస్తి శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: ఉత్తరాయణం శిశిర ఋతు ఫాల్గున మాస శుక్ల పక్ష: చతుర్ధి తిధి సౌమ్య వాసర: అశ్విని నక్షత్రం ఇంద్ర యోగ: వణిజ తదుపరి భద్ర కరణం. ఇది ఈరోజు పంచాంగం.


చవితి రాత్రి 01:29 వరకు.

అశ్విని సాయంత్రం 06:29 వరకు.

సూర్యోదయం : 06:29

సూర్యాస్తమయం : 06:22


వర్జ్యం : మధ్యాహ్నం 02:49 నుండి 04:17 వరకు తిరిగి రాత్రి 03:29 నుండి తెల్లవారుఝామున 05:00 వరకు.


దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12:02 నుండి 12:49 వరకు.


అమృతఘడియలు : మధ్యాహ్నం 11:54 నుండి 01:22 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.


యమగండం: ఉదయం 07:30 నుండి 09:00 వరకు.



శుభోదయ:, నమస్కార:

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━  

*14-03-2024 / గురువారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━  

మేషం


ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. చేపట్టిన పనులు మిత్రుల సహాయ సహకారాలతో పూర్తిచేస్తారు. వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు అమలు చేసి లాభాలు పొందుతారు. దూర ప్రయాణాలు కలసివస్తాయి. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

---------------------------------------

వృషభం


కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు చికాకు పరుస్తాయి. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం దూర ప్రయాణాలు వలన శ్రమ అధికమౌతుంది.

---------------------------------------

మిధునం


నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సంతాన శుభకార్య విషయమై కుటుంబ సభ్యులతో చర్చలు జరుగుతాయి. పాత ఋణాలు తీర్చగలుగుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

---------------------------------------

కర్కాటకం


భాగస్వామ్య వ్యాపారాలు మందగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందవు. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభించదు. నిరుద్యోగులకు లభించిన అవకాశములు సద్వినియోగం చేసుకోవాలి.

---------------------------------------

సింహం


దూర ప్రాంతాల వారి నుండి అందిన సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది. బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి. వ్యాపార వ్యవహారాలు సజావుగా సాగుతాయి.

---------------------------------------

కన్య


చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. భూ క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు.

---------------------------------------

తుల


సంతానం విద్యా ఉద్యోగ విషయాలలో సంతృప్తినిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన స్థానాలు ఉంటాయి. దూర ప్రాంతాల బంధుమిత్రుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారమున ఉన్న సమస్యలు అదిగమించి ముందుకు సాగుతారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.

---------------------------------------

వృశ్చికం


ఉద్యోగమున అధికారులతో అప్రమత్తంగా వ్యవహారించాలి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. భూ క్రయవిక్రయాలలో తొందరపాటు మంచిది కాదు. మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది.

---------------------------------------

ధనస్సు


దీర్ఘకాలిక రుణ ఒత్తిడి నుండి బయటపడతారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి.

---------------------------------------

మకరం


చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి కొంత ఉపశమనం పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలిగి హోదాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. ఆప్తుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి.

---------------------------------------

కుంభం


దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.

---------------------------------------

మీనం


వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహారించాలి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత బాధిస్తుంది. చేపట్టిన పనులలో ఆటంకాలుంటాయి. ఋణ ఒత్తిడి పెరుగుతుంది. వాహన కొనుగోలు ప్రయత్నాలు మందగిస్తాయి.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━ 

🍀 *శుభం భూయాత్* 🍁

శ్రీరామ స్తుతి

 🌸శ్రీరామ స్తుతి🙏 



‌సీ. రమణీయ గుణభూష ! రఘురామ ! శ్రీరామ !

              రాజీవలోచన !  రామభద్ర !

     ముల్లోక సంపూజ్య ! మునిజన మానసా !

              ఘోరపాప విరామ !   గుణగణాఢ్య !

     దైత్య వన కుఠార ! దశరథాత్మజ రామ !

              రవికుల సంభవా !  రమ్య తేజ !

     శరణు శ్రీరామ ! నీ  చరణమే శరణమ్ము

               నరవిందదళ నేత్ర ! యమల చరిత !

తే. మనసు విభ్రాంతి చెందగా మాయ వలన 

      కాంతు లీనెడి నీ రూపు కాంచ నైతి

      నీదు నామమ్ము జపియించి  నిష్ఠ తోడ 

      నిన్ను జేరంగ దలచితి నిగమవేద్య!


         జయలక్ష్మి

వేమన పద్యములు🌹*

 🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

. *🌹వేమన పద్యములు🌹* 

. *అర్థము - తాత్పర్యము*

. *Part - 54*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹


*💥వేమన పద్యాలు-- 157*


*అన్నమన్న మనుచు నరుతురు మూఢులు* 

*యాయువొంది నప్పు డన్నమేల ?*

*నన్న మేలలేదు యాయువుబొందిన*

*యెన్ని కరువులైన యిలను వేమా !*


*🌹తాత్పర్యము --*

అన్నమో రామచంద్రా అని మూఢులు అరుస్తూ ఉంటారు.

ఆయుర్దాయముంటేనే గదా అన్నము మీద ధ్యాసమళ్లును.

ఎన్ని కరువు కాటకాలు వచ్చినా ఆయువు ఉన్నచో ఏదో ఒకటి తిని కాలము గడుపవచ్చును.


*💥వేమన పద్యాలు -- 158*


*అన్నమునకు నంటు యయిన నాత్మకునంటు* 

*యాత్మను పెనగొన్న యన్నమంటు*

*యాత్మ శుద్ధియన్న మన్నశుద్ధియు నాత్మ*

*మిన్ను మన్ను మాడ్కి మెరయు వేమా !*


*🌹తాత్పర్యము --*

అన్నం అంటు కాదు.

ఆత్మ అంటు గాదు.

అన్నం అంటుదైతే ఆత్మ కూడా అంటుదే అగును కదా !

అన్నశుద్ధి ఆత్మశుద్ధి ఒక్కటియే.

మిన్ను , మన్నువలె అన్నం , ఆత్మ ఈ రెండూ ఉంటాయి.


*💥వేమన పద్యాలు -- 159*


*అన్నమిడుటకన్న నధిక దానంబులు* 

*యెన్ని చేయనేమి యెన్నబోరు*

*యన్న మెన్న జీవనాధార మవునయా*

*విశ్వదాభిరామ వినురవేమా !*


*🌹తాత్పర్యము --*

అన్నదానం మహాపుణ్య ఫలప్రదం.

అన్నమే జీవనాధారమని గమనింపుము.


*పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ శుభరాత్రి* 


*సర్వేజనా సుఖినోభవంతు*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*గురు పాదాల విలువ*

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


           *గురు పాదాల విలువ*

                   ➖➖➖✍️


*భారతదేశం నుంచి అమెరికాకి వచ్చి ఓ నది ఒడ్డున ఆశ్రమం నిర్మించుకొని నివసిస్తున్న ఓ స్వామీజీ దగ్గరకి, హిందూ మతంపై ఆసక్తి గల ఓ అమెరికన్‌ వచ్చి, హిందూ మతం గురించిన ఎన్నో పుస్తకాలు తీసుకెళ్ళి చదివాడు.*


*ఆ పుస్తకాలని తిరిగి ఇచ్చేసాక స్వామీజీతో ఇలా చెప్పాడు…*


*“హిందూ మతంలో నాకంతా నచ్చింది, ఒక్కటి తప్ప.”*


*“ఏమిటది? అందులో నీకేం లోపం కనబడింది? ".*


*“పాద నమస్కారాలు. శిష్యులు గురువుగారి పాదాలనాశ్రయించడం. పాదాలు శరీరంలో అధమస్థానంలో ఉంటాయి. శరీరంలో బురద, మురికి, మట్టి లాంటివి అధికంగా అంటేది పాదాలకే. అలాంటి పాదాలకి ఓ పవిత్ర స్థానం ఇవ్వడం నాకు నచ్చలేదు. గురువు శరీరంలోని ఏదో ఓ అవయవం మీద గౌరవాన్ని ప్రదర్శించాలనుకున్నప్పుడు, అది ఉన్నత స్థాయిలోని శిరస్సు పట్ల ప్రదర్శిస్తే బావుండేది అనిపిస్తోంది. గురువు కాలి బొటనవేళ్ళ నించి గంగా యమునలు ప్రవహిస్తూ ఉంటాయని, ఆ నీటిని శిష్యుడు తల మీద చల్లుకుంటే పవిత్రమౌతాడని చదివాను. కానీ అదంతా ఊహతో కూడిన కల్పన తప్ప అందులో నిజం ఎక్కడుంది?" అడిగాడా అమెరికన్‌ సీరియస్‌గా.*


*స్వామీజీ చిన్నగా నవ్వి ..... “అలా నదివద్దకి వెళ్ళి మాట్లాడుకుందాం పద.”*


*ఇద్దరూ నది ఒడ్డుకి వెళ్ళారు. అక్కడ కొందరు జాలర్లు నదిలో చేపలు పడుతున్నారు.*


*నీళ్ళల్లో నిలబడి వలని దూరంగా విసురుతున్నారు. వలలో చేపలు పడ్డాక, వాటిని పట్టుకుని బుట్టలో వేసుకుని మళ్ళీ వలని దూరంగా విసురుతున్నారు.*


*“జాలర్ల వలలో ఏ చేపలు పడుతున్నాయి? వారి పాదాల వద్ద ఉన్నవా? లేక దూరంగా వున్న చేపలా?” ప్రశ్నించాడు స్వామీజీ.*


*“దూరంగా ఉన్నవే” చెప్పాడు అమెరికన్‌ వినమ్రంగా.*


*“భగవంతుడు ఆ జాలరి వంటివాడు. అతని చేతిలోని వల మాయ. దేవుడు విసిరే వలలో గురు పాదాలను ఆశ్రయించిన చేపలు అనే శిష్యులైన భక్తులు మాయకి చిక్కరు. దాంతో మోక్షాన్ని పొందుతారు.*


*గురు పాదాలను ఆశ్రయించకుండా, వాటికి దూరంగా వుండే జీవులు మాయలో చిక్కుకుని జనన మరణ చక్రంలో పడి కొట్టుకుంటూంటారు." వివరంగా చెప్పారు స్వామిజీ.*


*గురువు పాదాల మహిమను వర్ణించ శక్తి సామర్ధ్యములు ఎవ్వరికీ లేవు.*


*న గురోరధికం తత్త్వం న గురోరధికం తపః |*

*తత్త్వఙ్ఞానాత్పరం నాస్తి తస్మై శ్రీగురవే నమః||*


🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

గురువారం, మార్చి 14, 2024

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


గురువారం, మార్చి 14, 2024

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

ఉత్తరాయణం - శిశిర ఋతువు

ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం

తిథి:చవితి ఉ6.38 వరకు తదుపరి పంచమి తె5.02 వరకు

వారం:గురువారం(బృహస్పతివాసరే) 

నక్షత్రం:భరణి రా10.15 వరకు

యోగం:వైధృతి తె3.08  

కరణం:భద్ర ఉ6.38 వరకు తదుపరి బవ సా5.50 ఆ తదుపరి బాలువ తె5.02 

వర్జ్యం:ఉ8.29 - 10.00

దుర్ముహూర్తము:ఉ10.11 - 10.58

మరల మ2.56 - 3.43

అమృతకాలం:సా5.39 - 7.11

రాహుకాలం:మ1.30 - 3.00

యమగండ/కేతుకాలం:ఉ6.00 - 7.30

సూర్యరాశి: కుంభం

చంద్రరాశి: మేషం 

సూర్యోదయం:6.14

సూర్యాస్తమయం:6.06


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

*మిట్టాపల్లి*

⚜ శ్రీ బనశంకరీ దేవి ఆలయం

 🕉 మన గుడి : నెం 255


⚜ కర్నాటక  : బాదామి


⚜ శ్రీ బనశంకరీ దేవి ఆలయం 



💠.ఈ విశ్వంలోని చరాచర

సృష్టి,స్థితి ,లయ గతులకు మూలాధారమైన  ఆది పరాశక్తి  బన శంకరి అనే పేరు కూడా వున్నది.


💠 బనశంకరీ దేవి ఆలయం (లేదా బనశంకరి ఆలయం) భారతదేశంలోని కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాలో బాదామి సమీపంలోని ఒక  పుణ్యక్షేత్రం.


💠 అసలు ఆలయాన్ని 7వ శతాబ్దపు బాదామి చాళుక్య రాజులు నిర్మించారు, వీరు బనశంకరి దేవిని తమ దేవతగా ఆరాధించారు.


💠 తిలకారణ్య అరణ్యంలో ఉన్నందున ఈ ఆలయాన్ని ° శాకంభరి°' 'బనశంకరి లేదా వనశంకరి' అని పిలుస్తారు. 

ఆలయ దేవతను శాకంబరి (కన్నడ) అని కూడా పిలుస్తారు, ఇది పార్వతి దేవి అవతారం.


⚜ స్థల పురాణం ⚜


💠 దుర్గామాసురుడు అనే రాక్షసుడు స్థానిక ప్రజలను ,దేవతలను నిరంతరం వేధించేవాడని స్కాంద పురాణం మరియు పద్మ పురాణాలు చెబుతున్నాయి . దుర్గామాసురుని నుండి రక్షించమని  వేడుకున్న దేవతల ప్రార్థనలకు సమాధానమిస్తూ  దేవత శాకంబరీ రూపంలో సింహవాహిని అయిన ఆ దేవి అష్ట భుజాలతో, లక్ష్మీ, సరస్వతుల అంశతో యాగ గుండంలో ఆవిర్భవించి  దుర్గమాసురుని వధించి  ప్రజలను కాపాడింది. 


💠 లోక శ్రేయస్సుకోసం బన శంకరిగా అక్కడే వెలసింది.కాలక్రమేణా ఆలయమూ నిర్మించబడింది.

ఈ ఆలయంలో కొలువై యున్న ఆదిపరాశక్తిదేవి  త్రినేత్రి, బాలవ్వ, బనతవ్వా, చౌడమ్మ,స్రవంతి,

వనదుర్గ, శాకాంబరీ  అనే పేర్లతో

పిలువబడుతున్నది.


💠 ఆలయం చుట్టూ ఉన్న అడవులలో కొబ్బరి, అరటి మరియు తమలపాకు మొక్కలు మరియు చెట్లు ఉన్నాయి. 

అందువల్ల, తీవ్రమైన కరువు సమయంలో, దేవత ప్రజలు జీవించడానికి కూరగాయలు మరియు ఆహారాన్ని అందించిందని, అందుకే దేవతకు " శాకంబరి| అని పేరు పెట్టారని కూడా చెబుతారు


💠 అసలు ఆలయాన్ని 7వ శతాబ్దానికి చెందిన బాదామి చాళుక్య రాజులు నిర్మించారు , వీరు బనశంకరి దేవిని తమ దేవతగా ఆరాధించారు.

మరాఠీ దళపతి పరశురామ్ ఆగలే ఈ ఆలయాన్ని పునరుధ్ధరించాడు.


💠 ఈ ఆలయాన్ని మొదట ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించారు . పునర్నిర్మించిన నిర్మాణం విజయనగర నిర్మాణ శైలిలో ఉంది. 

ఆలయం నలువైపులా ఎత్తైన గోడతో చుట్టబడి ఉంది. 


💠 ప్రధాన నిర్మాణంలో ముఖ మంటపం, అర్ధ మంటపం (గర్భగృహం ముందు ప్రవేశ ద్వారం/గది) మరియు విమానం (గోపురం) పైభాగంలో ఉన్న గర్భగుడి ఉన్నాయి .


💠 ఆలయ ప్రధాన గర్భగుడిలో బనశంకరి దేవత విగ్రహం ఉంది. 

నల్లరాతి శిల్పం, సింహరాశిపై కూర్చున్న దేవత తన పాదాల క్రింద రాక్షసుడిని తొక్కినట్లు వర్ణిస్తుంది. 

దేవి ఎనిమిది చేతులు కలిగి ఉంది మరియు త్రిశూలం, డమరుకం, కపాలపాత్ర,యుద్ధ గంట, వేద గ్రంధాలు, ఖడ్గము ఖేతము (కత్తి మరియు డాలు) మరియు రాక్షసుడు యొక్క కత్తిరించిన తలని కలిగి ఉంది.


💠 అమ్మవారితో పాటు భీముడు , భ్రమరి , శతాక్షి మరియు గణేశ విగ్రహాలు ఉన్నాయి .


💠 ముందుగా  పాద మండపంలో వున్న దేవి పాదాలను పూజించి ఆ తర్వాతే ప్రధాన ఆలయంలోనికి ప్రవేశించాలి.


💠 కర్ణాటకలో ప్రసిద్ది చెందిన ఉత్సవాలలో

ఒకటి పుష్యమాస రధోత్సవం. తెప్పోత్సవంతో పాటు  బనశంకరి జాతర వైభవంగా జరుగుతుంది.

ఈ ఉత్సవం సాంస్కృతిక కార్యక్రమాలు, పడవ ఉత్సవం మరియు రథయాత్రను కలిగి ఉంటుంది , ఆలయ దేవతను రథంలో నగరం చుట్టూ ఊరేగిస్తారు.


💠 పండుగ సందర్భంగా ఆలయాన్ని, పట్టణాన్ని వందలాది రకాల ఆకులు, పూలతో అలంకరిస్తారు. 

బంధాష్టమి రోజున ప్రారంభమయ్యే జాతరలో, పల్లెడ హబ్బా లేదా కూరగాయల ఉత్సవము లేదా పండుగ కూడా జరుగుతుంది. ప్రారంభంలోనే 108 రకాల ఆహార పదార్థాలను (స్థానిక భాషలో ' బాజీ ' అని పిలుస్తారు) కూరగాయలతో తయారు చేస్తారు.


💠 ఈ ఉత్సవం తేప్పోత్సవము (పడవ పండుగ) అనే మరో ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా గుర్తిస్తుంది . 

ఈ సందర్భంగా తల్లితండ్రులు తమ పిల్లలకు శుభం కలగాలని కోరుతూ అమ్మవారి అనుగ్రహంతో కొత్తగా పుట్టిన పిల్లలను చెరువు చుట్టూ తీసుకెళ్లేందుకు అరటి కాడలతో తయారు చేసిన పడవలను ఉపయోగిస్తారు. 


💠 ఆలయానికి ఎదురుగా నాలుగు ప్రక్కలా పెద్ద పెద్ద మండపాలతో, సువిశాలమైన మెట్లతో " హరిద్రతీర్ధం" అనే పేరుతో బ్రహ్మాండమైన పుష్కరిణి వున్నది.


💠 నవరాత్రి రోజుల్లో నవచండికా యాగం జరుగతుంది.


💠 ఈ ఊరు బెంగుళూరు నుండి 447.కి.మీ. దూరంలో వున్నది.