18, డిసెంబర్ 2021, శనివారం

 పదాల పరమార్థాలు పెరుమాళ్లకెరుక...

 

     ‘‘మీ అక్షరాలు ముత్యాలు మాస్టారూ’’ అన్నాడో శిష్యుడు గురువుగారిని కాకాపట్టడానికి. ‘‘నా నీళ్లు ముత్యాలా? ఇదెక్కడి దిక్కుమాలిన పోలికరా శుంఠ...!’’ అంటూ వెంటనే వాతపెట్టారు ఆ మాస్టారు. చేతిరాత గురించి చెబుతుంటే గురువుగారు నీళ్లంటున్నారేంటని కుర్రాడు తెల్లముఖమేశాడు. మాస్టారి మాటల్లోని మర్మమేంటో పాపం అతనికి ‘అర్థం’ కాలేదు. 

‘అక్షరం’ అంటే సాధారణంగా అకారాది వరుసలోని వర్ణమే అనుకుంటాం. నిజానికి ‘పరబ్రహ్మ, ఆకాశం, కాలమానం, ఓంకారం, నీరు, ప్రకృతి, తపస్సు, యజ్ఞం’... ఇన్ని అర్థాలు ఉన్నాయి ఆ పదానికి. క్షరం (నాశనం) లేనిది ఏదైనా అక్షరమే. ఆ విషయాన్ని మరచిపోయి దాన్ని వర్ణానికి పరిమితం చేసేశాం. 

      పలుకుబడి, అవసరం, ప్రాధాన్యాలను బట్టి కొన్ని పదాల వాడుక ఎక్కువగా ఉంటుంది. ప్రజల అవగాహన, పదప్రయోగ అవసరం, భావ స్పష్టత, ప్రాచుర్యాన్ని బట్టి ఆ పదాల వినిమయం జరుగుతుంటుంది. వినియోగించకపోతే ఎంత గొప్ప వస్తువైనా మూలన పడిపోతుంది. పదాల పరిస్థితీ అంతే. ఏదో సందర్భంలో, ఏదో అవసరార్థం ఏర్పడ్డ పదం... దాని అవసరం తీరిపోయాక మరుగున పడుతుంది. అలాంటి స్థితిలో ఆ స్థానాన్ని మరొక అర్థం ఆక్రమిస్తుంది. అలా ఆక్రమించిన భావాలు కొన్ని సందర్భాల్లో స్థిరపడిపోతాయి. అలా స్థిరపడటాన్ని భాషలో ‘నిపాత’లు అంటారు. నిపతించడం అంటే పాతిపెట్టడం, స్థిరపరచడం. అంటే ఓ పదానికి వాడుకలో ఉన్న అర్థంతోపాటు ఇతర అర్థాలు ఇంకెన్ని ఉన్నా, వినియోగంలో లేకపోవడంతో మరుగున పడిపోతాయన్న మాట. ‘అక్షరం’ విషయంలోనూ అదే జరిగింది. అన్నట్టు, తెలుగులో ఇలాంటి పదాలు చాలా ఉన్నాయి. వాటిలో చాలా వరకూ సంస్కృతం నుంచి వచ్చినవే. 

      భద్రాచలం, పట్టిసాచలం, శేషాచలం... లాంటి పదాల్లో అచలమంటే ఏంటి? పర్వతం. అదొక్కటేనా దానికి అర్థం? దానికి ఇంకా ‘లోకం, వస్త్రపుటంచు, మేకు’ తదితర అర్థాలున్నాయి. అలాగే, చలనరహిత స్థితిలో ఉన్నది ఏదైనా అచలమే అవుతుంది. సరే, ‘ఉదధి’ దగ్గరికి వద్దాం. ‘మేఘం’ పర్యాయపదాల జాబితాలో ఇది ఉంటుందా? అబ్బే... ఎందుకుంటుందండీ, ‘ఉదధి’ అంటే సముద్రం కదా అంటారా! అదే పొరపాటు. కడలితో పాటు మేఘమూ ఉదధే. ఎందుకంటే... ఉదకాన్ని ధరించేది ఉదధి. మరి మేఘానికీ ఆ మురిపెం ఉంది కదా! 

భలే శిరోజాలు

‘మీ శిరోజాల సంరక్షణకు మా కొబ్బరి తైలాన్నే వాడండి’ అంటూ గతంలో ప్రకటనలు హోరెత్తేవి గుర్తుందా? వాటిని చూసిన పెద్దలు కొందరు... ‘వీళ్లేంటి పేలు పెంచుకోమని చెబుతున్నార’ని ముక్కున వేలేసుకునేవారట! విషయం ఏంటంటే... ‘శిరస్సులో పుట్టింది’ శిరోజం. అంటే, జట్టుతోపాటు పేను, చుండ్రు లాంటివి కూడా శిరోజాలే. కానీ, వ్యవహారంలో జుట్టు అనే అర్థమే స్థిరపడిపోయింది. ‘తైలం’ కూడా అంతే. తిలలు అంటే నువ్వులు. వీటి నుంచి తీసిన పదార్థమే ‘తైలం’. ‘నువ్వుల నూనె’ అని మాత్రమే దీనికి అర్థం. కానీ వేరుశనగ, ఆముదం, కొబ్బరి, ఆవ, అవిశ, విప్ప... తదితరాల నుంచి తీసే నూనెలనూ తైలాల కిందే జమకడుతున్నాం. మొత్తంగా తైలాన్ని నూనెకు పర్యాయపదం చేశాం. 

      ఉమ్మెత్త, సంపెంగ, నల్లచందనం, మోదుగ, బంగారం- వీటన్నింటి మధ్య ఓ సంబంధం ఉంది గుర్తుపట్టారా? ఏంటంటే... ‘కనకం’! ఈ పదానికి పైవన్నీ అర్థాలే. కానీ, మనం ఒక్క బంగారాన్నే వాడుతున్నాం. ‘రావణ కాష్ఠం’ అని మనకో జాతీయం ఉంది. ఆ లంకాధీశుడి చితి ఎప్పటికీ మండుతూనే ఉంటుందన్న నమ్మకంలోంచి ఇది పుట్టింది. అదలా ఉంచితే, అసలు ఈ కాష్ఠమంటే ఏంటి? కర్ర. దాంతో పాటు ‘పద్దెనిమిది రెప్పపాట్ల కాలం’ అని కూడా బ్రౌణ్య నిఘంటువు చెబుతోంది. కానీ, ఈ పదం ‘చితి’ అన్న అర్థంలోనే వాడుకలో ఉంది. పార్థివదేహాన్ని కట్టెలతోనే దహనం చేస్తారు కాబట్టీ, అదీకాక అశరీర సంస్కారాలన్నింటికి ఉపయోగించేవి కర్రలే కాబట్టి ఈ అర్థమొక్కటే జనం నోళ్లలో నానుతోంది. 

అదే పక్షి... అదే గాలి

ఖగమంటే పక్షి మాత్రమేనా? గ్రహం, బాణం, గాలి... ఇవేవీ ఖగాలు కావా? అవీ అవుతాయి. ఎందుకంటే... పద వ్యుత్పత్తి ప్రకారం ఆకాశంలో సంచారం చేసేది ఏదైనా ఖగమే. కానీ ఏం లాభం? మనం ‘పక్షి’తోనే సరిపెట్టుకుంటున్నాం. మరి ‘గోత్రం’ సంగతేంటి? వంశం పేరు, పేరు, గొడుగు, అడవి, బలం, వరిచేను కోసిన పొలం అనే అర్థాలున్నాయి. అయితే, అవి నిఘంటువులకే పరిమితమయ్యాయి. వాడుకలో మాత్రం గోత్రమంటే వంశం చిరునామానే! 

      తిరుమల వెంకన్న బంగారు చీరలు కట్టుకునేవాడట! నమ్మకపోతే అన్నమయ్యను అడగండి... ‘పసిడిచీరవాడు...’ అంటూ తన్మయత్వంతో పాడేస్తాడు. వాస్తవానికి ‘చీర’ అంటే వస్త్రం. పురుషులు ధరించేదైనా, స్త్రీలు ధరించేదైనా సరే. కానీ, ఇప్పుడది స్త్రీలకే సొంతమైంది. పాపం... ‘జలజం, పంకజం’ కూడా ఇలాంటివే. ‘జలమందు, బురదయుందు పుట్టేవి’ ఏవైనా జలజాలు, పంకజాలే! చేప, నత్తగుల్ల, జలగ, ముత్యం, పద్మం, కలువ లాంటివేవైనా కావచ్చు. అయితే, అదేం విచిత్రమో కానీ పై రెండు పదాలకీ ‘తామర/ పద్మం’ అనే అర్థాన్నే స్థిరం చేశారు. 

      పళ్లని ఆహారంగా స్వీకరించడమే ‘ఫలహారం’ కదా. పళ్లు కాకుండా ఇతర ఉపాహారాలు (అల్పాహారం) తీసుకున్నా ‘ఫలహారం చేశాం’ అంటున్నామెందుకు? అదే మరి నిపతించడమంటే! ఇక ‘శిల్పం’ అంటే ‘శిలతో తయారైంది’ అని అర్థం. అంటే ఒక ఆకృతి, లేదా బొమ్మ అని భావం. కాలక్రమేణా ఏ పదార్థంతో తయారు చేసిన బొమ్మలనైనా శిల్పాలు అనడం ఆనవాయితీ అయింది. మొత్తమ్మీద శిల్పం అంటే ‘బొమ్మ’ అనే అర్థం ఖాయమైంది. 

ఆదర్శాలూ... అవరోధాలూ...

కాలప్రవాహంలో కొన్ని పదాలకు ఏమాత్రం చుట్టరికం లేని అర్థాలు స్థిరపడిపోతాయి. ఆ పదం అసలు అర్థానికీ, వ్యవహారంలో ఉన్న అర్థానికి నక్కకూ నాకలోకానికి ఉన్నంత తేడా ఉన్నా మనం పట్టించుకోం. ఇలాంటి వాటికి ‘వివక్ష’ చక్కటి ఉదాహరణ. ‘వేరు చేసి చూడటం’ అనే అర్థంలో స్థిరపడింది కానీ, నిజానికి వివక్ష అంటే ‘మాట్లాడాలి అనే కోరిక’. ‘వక్తం ఇచ్ఛా వివక్షా’... ఇది వ్యుత్పత్తి. దీనికి, ‘మా మీద వివక్ష ప్రదర్శిస్తున్నారు’ అనే మన సాధారణ ప్రయోగానికి ఏమన్నా సంబంధముందా? చెప్పుకుంటూ వెళ్తే భాషలోని చిత్రాలు అన్నా ఇన్నా!! 

      ‘లక్ష్యసాధనలో అవరోధాలను అధిగమించడానికి పట్టుదల ముఖ్యం’ అంటూ పాఠాలు చెప్పేస్తాం కదా. దేనికి పట్టుదల కావాలి? అంతఃపురంలో అడుగుపెట్టడానికా? నిజానికి అవరోధ మంటే ‘అంతఃపురం’. ‘రాణివాసపు స్త్రీలు ఉన్నందున ఇతరుల ప్రవేశాన్ని నిషేధించిన ప్రదేశం’ అని అసలు అర్థం. కానీ, ఇది మనకు ‘అడ్డంకి’గానే తెలుసు! అలాగే, ‘ఆకాంక్ష’ను ‘కోరిక’ అనే అర్థంలో స్థిరపరిచేశారు. కానీ క్రియను బట్టి కర్త, కర్మలను తెలుసుకోవడం, విశేష్యాన్ని బట్టి విశేషణాన్ని తెలుసుకోవాలనే కోరిక కలిగి ఉండటం మాత్రమే ‘ఆకాంక్ష’ అవుతుంది. వ్యాకరణం చదివిన వారికి ఇది తెలిసిందే. 

      మనకు తెలిసినంత వరకూ ఆదర్శానికీ, అద్దానికీ ఏమైనా సంబంధం ఉందా? లేదు. నిజానికైతే ఉంది. ‘నీడ కనబడేందుకు ఉపయోగపడేది’ (అద్దం) అని ‘ఆదర్శం’ అసలు అర్థం. కానీ, ‘అనుసరించదగినది’ అనే అర్థంలోనే వ్యవహారంలోకి వచ్చేసింది. ఇక ‘ఆహుతి’ అంటే దేవతా ప్రీత్యర్థం అగ్నిహోత్రంలో హవిస్సును వేయడం. అలా వేసి సాదరంగా ఆహ్వానిస్తే దేవతలు వస్తారని నమ్మకం. అలా వచ్చేవారే ‘ఆహూతులు’! ఈ అర్థం పక్కకెళ్లి, ఏ సందర్భంలోనైనా ‘పిలిస్తే వచ్చేవారు’ అందరూ ఆహూతులవుతున్నారు ఇప్పుడు! దట్టమైన, భయంకరమైన అడవిని ‘కికారణ్యం’ అనడం రివాజు. ఈ పదం పంజాబీ భాషలోంచి వచ్చింది. ‘కికార్‌’ అంటే ‘నల్లతుమ్మ’ అని ఆ భాషలో అర్థం. ఆ చెట్లు అధికంగా ఉండే అరణ్యమే ‘కికారణ్యం’. అంటే నల్లతుమ్మ చెట్లున్న అడవి. ఈ విషయం తెలిసో తెలియకో మనం కాకులు దూరని కారడవులన్నింటినీ ‘కికారణ్యాలు’ అనేస్తున్నాం. 

      ఇలా పదం వేరు, పరమార్థం వేరైన పదాలు ఎన్నో కనిపిస్తాయి. కానీ, ‘పదుగురాడు మాట పాటియై ధరచెల్లు’ కాబట్టి వాడుకలో ఉన్న అర్థాలతోనే సర్దుకుపోవాలి. అయితే... మాటకట్లు తయారు చేసేవారు, చిత్ర రచనలు చేసేవారికి మాత్రం ఇలాంటి పదాలు బాగా ఉపయోగపడతాయి. ఆ సంగతి అలా ఉంచితే... మనం యథాలాపంగా వాడేసే పదాల వెనుక ఎంతటి కథ ఉందో తెలుసుకోవడం మాత్రం ఆసక్తికరం. భాషను పూర్తిగా ‘అర్థం’ చేసుకోవడానికి ఆ ప్రయత్నం అవసరం కూడా.

(అయ్యగారి శ్రీనివాసరావు -

 విజయనగరం)

*కర్మ కర్మణా నశ్యతి కర్మ!*

 *✍️...నేటి చిట్టికథ*


*గంగలో స్నానమాచరిస్తున్న లక్షలాది మందిని చూసిన ఒక ఋషి కి ఒక సందేహం వచ్చింది!*


*వెంటనే గంగానదినే అడిగాడట!*


*అమ్మా! ఎందరో ఎన్నో పాపాలు చేసి నదిలో మునకలేస్తున్నారు. వారి వారి పాపం వదిలేస్తున్నారు. మరి ఇందరి, ఇంత పాప భారం ఎలా మోస్తున్నావు? తల్లీ! అని.*


*అందుకా తల్లి "నాయనా నేనెక్కడ ఆ పాపభారం మోస్తున్నాను? అవి అన్నీ తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు సముద్రంలో కలిపేస్తున్నాను" అని బదులిచ్చిందట.* 


*అయ్యో అన్ని పుణ్య నదులు ఇంతేకదా! పాపా లన్నీ సముద్రంలోనే కలిపేస్తే ఆ సముద్రుడు ఎలా భరిస్తున్నాడో?అనుకొని!*


*సముద్రాన్నే అడిగాడు!*


*ఎలా మోస్తున్నావు? ఈ పాపభారాన్ని!?! అని!*


*దానికా సముద్రుడు!* 


*నేనెక్కడ భరిస్తున్నాను?! ఆ పాపాలను వెంట వెంటనే ఆవిరిగా మార్చి, పైకి మేఘాల లోనికి పంపిస్తున్నాను' అని బదులిచ్చాడట.* 


*అరే!!! ఎంతో తేలికగా కదిలి పోయే మేఘాలకు ఎంత కష్టం వచ్చింది! అని అనుకుంటూ!* 


*ఓ మేఘ మాలికల్లారా ఎలా భరిస్తున్నారు? ఈ పాప భారాన్ని! అని అడగగా!!!*


*అవి పకపకా నవ్వి!  మేమెక్కడ భరిస్తున్నాం? ఎప్పటి కప్పుడే మీ మీదే కురిపించేస్తున్నాం వర్ష రూపేణా'! అని బదులివ్వగా...*


*ఓహో!!!* 

*ఆ పాపాలన్నీ మన మీద పడి మనమే అనుభవిస్తున్నా మన్నమాట!*


*అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా! ఎవరూ కూడా! కర్మ ఫలితాలు వదిలించు కోలేమని!!!! గ్రహించాడు అక్కడ స్నాన మాచరిస్తున్న ఋషి!*

                 

*ఇదం తీర్ధమిదం తీర్ధం భ్రమన్తి తామసా జనాః ఆత్మతీర్ధం నజానన్తి కధం మోక్షః శృణు ప్రియే.*


*పరమశివుడు పార్వతీ దేవికి ఉపదేశించిన శ్లోకమిది!.*


*ఈ తీర్ధంలో స్నానమాచరించిన పుణ్యం కలుగును! ఆ తీర్ధంలో స్నానమాచరించిన మోక్షం కలుగును!* 

*అని... తీర్ధ స్నానమునకై పరుగు లెత్తెడు మానవులు "భ్రమకు లోబడిన వారు"!*


*ఆత్మ జ్ఞాన తీర్ధంలో స్నాన మాచరించని వారికి మోక్ష మెటుల కలుగును?!? అని ఈ శ్లోకం అర్థం.*


*కర్మ కర్మణా నశ్యతి కర్మ!*


*అంటే ..*

*కర్మ అనేది కర్మతోనే* *నశిస్తుంది.*

🔹🔸🔹🔸🔷🔷🔸🔹🔸🔹

ప్రసవించిన స్త్రీకి చేయవలసిన ఉపచారములు -

 ప్రసవించిన స్త్రీకి చేయవలసిన ఉపచారములు  - 


 

 *  బాలింతలకు ప్రసవించిన 8 వ దినము నుండి క్రమక్రమంగా శరీరమునకు బలము చేకూర్చు ఔషధములు , ఆహారములు వాడుట మంచిది. బాలింతలకు 12 దినములు గడుచునంత వరకు మాంసం పెట్టకూడదు. 


 *  గర్భం నందు శిశువు తల్లి ఆహారం పంచుకొని పెరుగుట చేత ప్రసవవేదన అనుభవించుట చేత , ప్రసవకాలమున అధిక రక్తస్రావం జరుగుటవలన బాగా అలిసిపోవడం వలన బాలింతరాలుకు  వ్యాధులు తొందరగా వచ్చును.అందుకొరకు తొందరగా బలం చేకూర్చుటకు ప్రత్యేక ఔషదాలు ఇవ్వవలెను. దశమూలారిష్టం టానిక్ గాని ద్రాక్షరిష్టం టానిక్ గాని , సౌభాగ్యశొంటి అను లేహ్యం కాని భోజనమును తరువాత వాడవలెను. దీనివలన మంచి జీర్ణశక్తి కలుగును. 


 *  బాలింతలకు పథ్యమైన ఆహారాన్ని మాత్రమే ఇవ్వవలెను . దేహశ్రమ , పురుషసంపర్కం , కోపం చల్లనిపదార్ధాలు వీటిని విడిచిపెట్టవలెను. అన్నివిధముల పరిశుభ్రముగా ఉండవలెను . నెయ్యి వంటి పదార్థం కలిసిన పథ్యమైన ఆహారం మితముగా భుజించవలెను. ప్రతిదినము తలంటుస్నానం చేయవలెను . ఈ నియమాలు బాలింత శ్రద్దగా ఒక నెలరోజుల పాటు అనుసరించవలెను. 


 *  బాలింతరాలు తలంటు స్నానం నందు మూడుమాసముల వరకు బలాధన్వంతర తైలం వాడుట మంచిది. దీనివలన నరములకు బలం కలుగును. 


 *  స్త్రీకి గర్భధారణ నిల్చిపోయి 6 సంవత్సరములు అయిన పిదప మరలా గర్భదారణ జరిగి ప్రసవం ఏర్పడినట్లైతే ఆ శిశువుకు ఆయుర్ధాయం తక్కువ ఉండునని శుశ్రుతుడు చెప్పెను. 


 *  బాగా పాతబడిన బియ్యాన్నే ఆహారముగా ఇవ్వవలెను. 


 *  కందికట్టు , ధనియాలపొడి , శొంఠిపొడి , వెల్లుల్లి పాయ కారం , నువ్వులనూనె , నువ్వులపొడి , ఇంగువ , పాతబెల్లం , తాంబూలం పాత ఉశిరిక పచ్చడి , పాతనిమ్మ పచ్చడి , పొట్లకాయ , మునగకూర , బీరకాయ , కందకూర 

ఆవుపాలు , వేడినీటి స్నానం , ఎక్కువ విశ్రాంతి ఇవన్ని తప్పకుండా ఆచరించాలి . 


 *  ప్రసవించిన 15 రోజుల వరకు ఒంటిపూట భొజనం చేయాలి . బొప్పాయిపండు తినవచ్చు. రొట్టె , కాఫీ పుచ్చుకోవచ్చు. కాచి గోరువెచ్చగా ఉన్న చల్లార్చిన నీటిని తాగవచ్చు . 


 *  మాంసాహారం తీసుకునేవారు ఎండుచేపలు , కాల్చిన మాంసం , ఆవునెయ్యిలొ వేయించిన మాంసం , ఎండబెట్టిన మేకమాంసం , మేకమాంసానికి అల్లం , ఉప్పు , కొద్దిగా గరం మసాలా రాసి ఎండించి చిన్నచిన్న ముక్కలుగా తరిగి ఆవునెయ్యిలొ వేయించి తినవచ్చు . 


  బాలింతలు తినకూడని ఆహార పదార్దాలు  -


 

 *  ఎట్టి పరిస్థితులలో కొత్తబియ్యం అన్నం తినకూడదు. 


 *  చద్దిఅన్నం , పలుకుగా ఉన్న అన్నం తినరాదు.


 *  పచ్చి చేపలు , కొత్త చింతపండు , పులుసుకూరలు , మజ్జిగ , పెరుగు ముట్టుకోకూడదు. 


 *  చల్లటి పదార్దాలు ముట్టరాదు. 


    పైన చెప్పిన నియమాలు పాటించని బాలింతలకు సూతికా వ్యాధులు సంభవిస్తాయి. ఒక్కోసారి ఈ చిన్న వ్యాధులు 13 రకాల సన్నిపాత జబ్బులుగా మారి ప్రాణాలు హరిస్తాయి 

  

 గమనిక  - 


      అతి త్వరలో నా మూడొవ గ్రంథం మీ ముందుకు రాబోతుంది. ఈ గ్రంధము నందు మనకి తెలిసిన మొక్కల యొక్క రహస్య యోగాలు ఎన్నింటినో మీ ముందుకు తీసుకువస్తున్నాను . 


              కాళహస్తి వేంకటేశ్వరరావు 


                అనువంశిక ఆయుర్వేదం 


                    9885030034

BIO-CLOCK

 *😁 BIO-CLOCK 😁*


మనం ఉదయం ఎక్కడికన్నా ప్రయాణం చేయ్యల్సి వస్తే తెల్లవారుజామున 4:00 గంటలకు అలారం సెట్ చేసి నిద్రపోతాము. 

కానీ కొన్నిసార్లు మనం అలారం లేకపోయినా అనుకున్న టైంకి నిద్ర లేస్తాము. 

ఇదే *బయో-గడియారం*. 


చాలామంది 80-90 సంవత్సరాల వయస్సులో చనిపోతారని సాధారణంగా నమ్ముతారు. 


50-60 సంవత్సరాల వయస్సులో అన్ని రోగాలు వస్తాయని మనసులో గాఢంగా నమ్మబల్కోని చాలామంది తమ సొంత బయోక్లాక్‌ ను ఏర్పాటు చేసుకున్నారు. అందుకే సాధారణంగా 50-60 వద్ద ప్రజలు అనారోగ్యం పాలవుతారు  *మనం మనకు తెలియకుండానే బయోక్లాక్‌* ను మానసికంగా తప్పుగా సెటప్ చేస్తాము. 


చైనాలో చాలా మంది ప్రజలు 120 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవిస్తారని నమ్మి అలా మానసికంగా సంసిద్దులై వారి బయోక్లాక్ ను అలా ఏర్పాటు చేసుకున్నారు.


*కాబట్టి ..!*


1. మనము మన బయో-గడియారాన్ని మానసికంగా పాజిటివ్ ఆలోచనలతో సర్దుబాటు చేసి, రోజు క్రమం తప్పకుండా *ధ్యానం* చేస్తే తద్వారా మనం *కనీసం* 120 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవించవచ్చు.


2. 40 నుండి 90 సంవత్సరాల వయస్సులో ఎటువంటి వ్యాధి వచ్చే అవకాశం లేదని మనం నమ్మాలి. వృద్దాప్యం అనేది 120 సంవత్సరాలకు మొదలు అవుతుందని బలంగా నమ్మాలి.


3. వెంట్రుకులకు సహజ సిద్ధమైన రంగు ( తెల్లజుట్టు ఉంటే) వెయ్యండి, యవ్వనంగా కనిపించే ప్రయత్నం చేయండి. *ముఖ్యంగా డ్రెస్ విషయంలో కూడ యువతి, యువకుల మాదిరి డ్రెస్ వేసుకునే ప్రయత్నం సాధ్యమైనంత వరకు చేయండి. తద్వారా మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. యెట్టి పరిస్థితులలో వృద్ధాప్యంగా కనిపించడానికి మన మనసుని అనుమతించవద్దు*.


4. మనం తీసుకునే భోజనం కల్తీ అనీ, కలుషితం, అనుకుంటూ నెగటివ్ థాట్స్ తో తీసుకోవద్దు. *ధ్యాన శక్తి వల్ల నేను తీసుకునే ఆహారం పరమ పవిత్రమైనది గా మారింది, ఇది నాకు నిత్య యవ్వనాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని నిండు 120 ఏళ్ల జీవితాన్ని ఇస్తుంది అని పరిపూర్ణంగా నమ్మండి.* లేదంటే ఋణాత్మక ఆలోచనల వల్ల మన శరీరంలో నెగటివ్ ఎంజైములు విడుదలై మన జీర్ణ వ్యవస్థను, మన శరీర నిర్మాణాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది.


5. ఎప్పుడూ చురుకుగా ఉండండి. నడవడానికి బదులుగా వీలైతే జాగింగ్ చేయండి. 


5. *వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం పెరుగుతుందని నమ్మండి*. (ఇది నిజం కూడ).


6.ఆనందానికి, వ్యాధికి పడదు. ఒకటి ఉన్నచోట ఇంకొకటి ఉండదు. కనుక ఆనందంగా ఉండండి తద్వారా ఆరోగ్యంగా ఉండండి. *(ప్రతిరోజు హాస్య భరిత సినిమాలు చూడండి మనసులో కాకుండా పైకి నవ్వండి*).


7. ప్రతి సమస్యకు కారణం మన మనస్సు. మన ఆలోచనా విధానం. ముఖ్యంగా మన మాట, సరదాకు కూడ నాకు Old age వస్తుంది అనే మాటను అనకండి. 


*ధర్మరాజుకు యువరాజుగా పట్టాభిషేకం జరిగింది కూడా 105 సంవత్సరాల వయసులోనే అని గ్రహించండి.*


కాబట్టి మీ మానసిక బయో క్లాక్ ని 

మీ తక్కవ ఆయుర్దాయం కోసం సెట్ చేసుకోమాకండి. ఇకనైనా మీ ఆలోచనా దృక్పధాన్ని మార్చుకోండి.


          👍👍👍👍👍👍

దత్త జయంతి

 మార్గశిర పౌర్ణమి దత్త జయంతి


       ( 18-12-2021)


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷



శ్రీమహావిష్ణువు ఇరవై ఒక్క అవతారాల్లో దత్తావతారం ఆరోదని భాగవత పురాణం చెబుతోంది. 


దత్తరూపం అసామాన్యమైంది. త్రిమూర్తుల లక్షణాలు, త్రిమూర్తుల తత్త్వాలు మూర్తీభవించి, ఆవిర్భవించినదే దత్తావతారం. 


మార్గశిర శుద్ధ పూర్ణిమనాడు అత్రి, అనసూయ దంపతులకు త్రిమూర్తుల వరప్రభావం వల్ల దత్తుడు జన్మించాడు.


 ‘దత్తం’ అంటే ఇచ్చినవాడని. అత్రి కుమారుడు కావడంతో ఆత్రేయుడైనాడు. దత్తాత్రేయుడు ఉపనయనం అయిన వెంటనే అరణ్యానికి వెళ్లి తపస్సు ద్వారా పరిపూర్ణమైన జ్ఞాన సముపార్జన చేశాడు. ఇరవై నలుగురిని తన గురువులుగా భావించి, సేవించాడు.


 కార్తవీర్యుడు, పరశురాముడు, యదువు, అలర్కుడు, ప్రహ్లాదుడు వంటి పలువురు లోకప్రసిద్ధులకు ఆధ్యాత్మిక విద్య బోధించాడు. అవధూత గీత, జీవన్ముక్త గీత, అవధూతోపనిషత్తు మొదలైన గ్రంథాలు రచించాడు.


దత్తుడు గొప్ప అవధూత. మహాజ్ఞాని. చిరంజీవి. యుగయుగాలకు ఆయన ఆదర్శమూర్తి.


 లోకగురువైనాడు. ప్రాపంచిక విషయాలను వదిలి ఏకాంతవాసం చేశాడు. జాతి శ్రేయస్సుకోసం జ్ఞానబోధ చేశాడు. దత్తాత్రేయుడు ఆదిగురువైన పరబ్రహ్మ స్వరూపుడు. 


శిష్యకోటి హృదయాల్లో అఖండ జ్ఞానదీపం వెలిగించిన వైరాగ్యరూప విలక్షణమూర్తి. ఆయన బోధలు లోకకల్యాణ కారకాలు. భూమి నుంచి సహనశీలత, గాలినుంచి స్వేచ్ఛ, ఆకాశం నుంచి నిస్సంగత్వం నేర్చుకోవాలని ఉద్బోధించిన మార్గనిర్దేశకుడు. అగ్నినుంచి నిర్మలత్వాన్ని, సముద్రం నుంచి గాంభీర్యాన్ని, కపోతంనుంచి నిర్మోహత్వాన్ని గ్రహించాలన్నాడు. కొండచిలువలా భ్రాంతిలో పడకూడదన్నాడు. స్పర్శకు దూరంగా ఉండటం మిడత నుంచి, ఏనుగు నుంచి పట్టుదల, చేపనుంచి త్యాగచింతన నేర్చుకోవాలి. మానావమానాలకు సమస్పందన అలవరచుకోవాలి. సాలెపురుగు నుంచి సృష్టి స్థితిలయకారకుడు పరమాత్మేనని తెలుసుకోవాలి. సీతాకోక చిలుకలా ఆత్మానందాన్వేషణ అలవరచుకోవాలి. చంద్రుడి నుంచి వృద్ధిక్షయాలు శరీరానికే కాని ఆత్మకు కావని గ్రహించాలి. ఆర్తులను కాపాడే చింతనను నీటినుంచి గ్రహించాలి. చీమలా జిహ్వ చాపల్యానికి లోనుకారాదని తెలుసుకోవాలి. ఇవన్నీ తనకు గురువులుగా ప్రకటించిన జ్ఞానానందమయుడు- జగద్గురువు దత్తాత్రేయ స్వామి!


దత్తాత్రేయుడు సతీమదాలస ముద్దులపట్టి అలర్కుడికి యోగవిద్య నేర్పాడు. ఓంకారోపాసనా విధానాన్ని ప్రబోధించాడు. పరశురాముడికి శ్రీవిద్యను, ప్రహ్లాదుడికి ఆత్మజ్ఞాన రహస్యాన్ని ప్రసాదించాడు. త్రిమూర్తుల అనుగ్రహ అవతారం కావడంతో, దత్తుడిరూపం మూడు శిరసులతో సందేశాత్మకమై ప్రకాశిస్తోంది.


దత్తుడు పదహారు అంశలు కలవాడని ‘దత్తపురాణం’ చెబుతోంది. శ్రీపాదవల్లభులు, శ్రీనృసింహ సరస్వతి, శ్రీ అక్కల్‌కోట మహరాజ్‌, శ్రీమాణిక్య ప్రభువు,గజానన మహరాజ్‌, శ్రీకృష్ణ సరస్వతీ మహరాజ్‌, వాసుదేవానంద సరస్వతీ మహరాజ్‌ దత్తావతారాలుగా వెలసినట్లు దత్తచరిత్ర చెబుతోంది. దత్తపురాణ గ్రంథాన్ని దీక్షగా పారాయణం చేస్తారు.


మత్స్య పురాణం, స్మృతి కౌస్తుభంలో దత్తచరితం విస్తృతంగా ఉంది. ఈ పూర్ణిమనాడు కొన్ని ప్రాంతాల్లో చంద్రపూజ చేస్తారని నీలమత పురాణం వివరిస్తోంది. 


ఈ రోజున ఆగ్నేయ పురాణ గ్రంథం దానం చేస్తే సతతం మేలు కలుగుతుందని పురాణోక్తి. కొన్ని ప్రాంతాల్లో ఈ పౌర్ణమి ‘కోర్ల పూర్ణిమ’గా ప్రసిద్ధి చెందింది. మహామార్గశీర్ష పేరుగల ఈ పున్నమిరోజున నరకపూర్ణిమావ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి కథనం.


మహారాష్ట్రలో దత్తజయంతిని భక్తిశ్రద్ధలతో వైభవంగా జరుపుకొంటారు. దత్తుడు ‘ఉగ్రదేవత’ అని గర్గసంహిత చెబుతోంది. దత్తుడికి గురువారం అత్యంత ప్రీతికర దినమని చెబుతారు. ఆ స్వామికి ఇష్టమైన వృక్షం మేడివృక్షం. 


ప్రేమ, అహింస, భూతదయ, త్యాగశీలత, ఆత్మజ్ఞానం మనుషులకు రక్షణ కవచాలన్న దత్తాత్రేయుడి సందేశాలు సర్వదా ఆచరణీయం.



🌹🌷🌹🌷🌹🌷🌹🌷



.

శివాజీ గురించి

 స్కూల్లో చరిత్రలో శివాజీ గురించి పెద్దగా నేర్చుకోలేదు. చాలామంది అతని గురించి ఏమనుకుంటున్నారో చూసి ఆశ్చర్యపోయాను :


 *"కాబూల్ నుండి కాందహార్ వరకు నా తైమూర్ కుటుంబం మొగల్ సుల్తానేట్‌ను సృష్టించింది. ఇరాక్, ఇరాన్, టర్కిస్తాన్ మరియు అనేక దేశాలలో నా సైన్యం క్రూరమైన యోధులను ఓడించింది. కానీ భారతదేశంలో శివాజీ మాకు బ్రేకులు వేశారు. నేను శివాజీకి నా గరిష్ట శక్తిని వెచ్చించాను, కానీ తీసుకురాలేకపోయాను. అతని మోకాళ్లకు.*


 *యా అల్లాహ్, నువ్వు నాకు శత్రువును, నిర్భయమైన మరియు నిటారుగా ఉన్నవాడిని ఇచ్చావు, దయచేసి అతని కోసం స్వర్గానికి మీ తలుపులు తెరిచి ఉంచండి ఎందుకంటే ప్రపంచంలోని అత్యుత్తమ మరియు విశాల హృదయం ఉన్న యోధుడు మీ వద్దకు వస్తున్నాడు."*


 -ఔరంగజేబ్ (శివాజీ మరణానంతరం నమాజ్ చదువుతూ)


 *"ఆ రోజు శివాజీ నా వేళ్లు నరికేయలేదు కానీ నా అహంకారాన్ని కూడా నరికేశాడు. నా కలలో కూడా ఆయనను కలవాలంటే భయం."*


 --షాహిస్తా ఖాన్.


 *"నా రాజ్యంలో శివాజీని ఓడించే వాడు లేడా??"*


 - విసుగు చెందిన బేగం అలీ ఆదిల్షా.


 *"నేతాజీ, బ్రిటిష్ వారిని తరిమికొట్టడానికి మీ దేశానికి హిట్లర్ అవసరం లేదు. మీరు బోధించాల్సింది శివాజీ చరిత్ర మాత్రమే."*


 -అడాల్ఫ్ హిట్లర్


 *"శివాజీ ఇంగ్లండ్‌లో జన్మించి ఉంటే, మనం భూమిని మాత్రమే కాకుండా మొత్తం విశ్వాన్ని పాలించి ఉండేవాళ్ళం."*


 -లార్డ్ మౌంట్ బాటన్


 *"శివాజీ ఇంకో పదేళ్లు బ్రతికి ఉంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశం ముఖం చూసి ఉండేవారు కాదు."*


 -- ఒక బ్రిటిష్ గవర్నర్


 *_భారతదేశానికి స్వాతంత్ర్యం కావాలంటే ఒక్కటే మార్గం, 'శివాజీలా పోరాడండి'."*


 --నేతాజీ


 *"శివాజీ అనేది కేవలం పేరు కాదు, భారతీయ యువతకు ఇది శక్తి వనరు, ఇది భారతదేశాన్ని స్వేచ్ఛగా మార్చడానికి ఉపయోగపడుతుంది."*


 - స్వామి వివేకానంద.


 *"శివాజీ అమెరికాలో జన్మించి ఉంటే, మేము అతనిని SUN అని నామకరణం చేస్తాము."*


 - బరాక్ ఒబామా


 ఉంబర్‌ఖైండ్ యొక్క ప్రసిద్ధ యుద్ధం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో పేర్కొనబడింది:


 *"ఉజ్బెకిస్తాన్ నుండి వచ్చిన 30,000 మంది కరతలాబ్ ఖాన్ సైన్యాన్ని కేవలం 1000 మంది శివాజీ మావలలు ఓడించారు. స్వదేశానికి తిరిగి రావడానికి ఒక్క ఉజ్బెకీ కూడా ప్రాణాలతో మిగిలిపోలేదు."*


 శివాజీ అంతర్జాతీయ ఖ్యాతి పొందిన రాజు. తన కెరీర్‌లో 30 ఏళ్ల వ్యవధిలో కేవలం ఇద్దరు భారతీయ యోధులతోనే పోరాడాడు. మిగతా వారంతా బయటి వ్యక్తులు.


 అబూ తాలిబాన్ మరియు టర్కిస్తాన్ రాజుగా తన కలలో కూడా శివాజీకి భయపడే షాహిస్తా ఖాన్.


 బెహ్లోల్ ఖాన్ పఠాన్, సికందర్ పఠాన్, చిదర్ ఖాన్ పఠాన్ అందరూ ఆఫ్ఘనిస్తాన్ యొక్క యోధ సర్దార్లు.


 దిలేర్ ఖాన్ పఠాన్ మంగోలియా యొక్క గొప్ప యోధుడు. వీరంతా శివాజీ ముందు దుమ్ము దులుపుకున్నారు.


 సిద్ధి జౌహర్ మరియు సలాబా ఖాన్ ఇరానియన్ యోధులు, వీరు శివాజీ చేతిలో ఓడిపోయారు.


 సిద్ధి జౌహర్ తర్వాత సముద్ర దాడికి ప్లాన్ చేశాడు. ప్రతిస్పందనగా శివాజీ ఒక నౌకాదళాన్ని, మొదటి భారతీయ నౌకాదళాన్ని పెంచారు. అయితే ఆ పని పూర్తి కాకముందే శివాజీ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు.  


 Google *"శివాజీ, మేనేజ్‌మెంట్ గురువు."* ఇది బోస్టన్ విశ్వవిద్యాలయంలో పూర్తి సబ్జెక్ట్.


 ఇంకా, భారతీయులమైన మనకు ఆయన గురించి చాలా తక్కువ తెలుసు..... పాపం.... కనీసం మన భావి తరానికి కూడా ఈ గొప్ప భారతీయుని గురించి తెలిసేలా చేద్దాం.


 దయచేసి కనీసం విస్తృతంగా ప్రసారం చేయండి.🙏🙏🙏

చక్కని సందేశం

 చక్కని సందేశం. 


*భగవద్గీతను ఎందుకు చదవాలి?చదివితే ఏమి అవుతుంది ?*

  


    ఒక పెద్దాయన రైతు... కొండలపైన ఉన్న 

తన పొలంలో యువకుడైన తన మనవడితో ఉంటున్నారు. 


   రోజూ పొద్దున్నే లేచి వంటింట్లో ఉన్న

బల్ల దగ్గర భగవద్గీత చదువుతూ కూర్చుంటాడు. 


   మనవడికి తాత చేసే పనులంటే చాలా ఇష్టం…తనూ అన్ని పనులూ తాతగారిలా చెయ్యాలనుకుంటాడు…


   పొద్దున పూట తాతలానే తానూ 

భగవద్గీత చదవటానికి ప్రయత్నిస్తున్నాడు కానీ అతని వల్ల అవ్వటం లేదు…


    ఒకరోజు ’తాతా.. నువ్వు చదివినట్టు 

నేనూ భగవద్గీతను  చదవాలని ప్రయత్నిస్తే…ఎంత చదివినా అర్ధం కావటం లేదు…కష్టం మీద కొంచెం అర్ధం చేసుకున్నా…పుస్తకం ముయ్యగానే మర్చిపోతున్నాను. అసలు భగవద్గీతను  ఎందుకు చదవాలి? 

ఏంటి ప్రయోజనం’ అని తాతని 

అడిగాడు మనవడు.


   పొయ్యిలో బొగ్గు పెడుతున్న తాతగారు మనవడివైపు తిరిగి..తన చేతిలోని ఖాళీ అయిన బొగ్గు బుట్టని మనవడికి ఇచ్చి..

‘కింద నది నుండి ఈ బుట్ట నిండా నీళ్ళు తీసుకుని రా..’ అని చెప్పారు.


‘సరే తాతా..’ అని మనవడు బుట్ట తీసుకెళ్ళి నదిలో బుట్టను ముంచి కొండ పైకి ఇంటికి వచ్చేటప్పటికి నీళ్ళు బుట్ట నుండి కారిపొయ్యాయి…


అది చూసి తాతగారు…’ఓరి మనవడా ఇంకొంచెం వేగం పెంచు...

ఇంటికి రావటంలో’ అని సలహా చెప్పారు! 


  సరే అని ఈ సారి ఇంకొంచెం వేగంగా బుట్టలో నీళ్ళు నింపి ఇంటికి వచ్చాడు మనవడు. ‘బుట్ట ఖాళీ తాతా! బుట్టలో 

నీళ్ళు ఎలా నిలుస్తాయి?  నేను గిన్నె తీసుకెళ్తాను అన్నాడు మనవడు.’ 


  తాత చెప్పాడు…’లేదు లేదు బుట్టతోనే 

నీళ్ళు తేవాలి..బహుశా నువ్వు ఇంకొంచెం ఎక్కువ శ్రమ పడాలి అనుకుంటా…

ఇంకొంచెం శ్రద్ధగా ప్రయత్నిస్తే పని 

అవ్వచ్చు.’ అని మనవడిని 

ప్రోత్సహించారు…


   మనవడు ఈ సారి ఇంకా వేగంగా నదిలో బుట్టను ముంచి..బుట్టలో నీళ్ళు నింపి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడు…బుట్టలో నీళ్ళు నిలవలేదు…మళ్ళీ వెంటనే ఇంకోసారి కూడా ప్రయత్నించాడు…అయినా ఫలితం మాత్రం అదే…తాతగారు మనవడి కష్టం అంతా కిటికీలోంచి చూస్తూనే వున్నారు….


   ఖాళీ బుట్టతో ఆయాసపడుతూ నించున్న మనవడితో నవ్వుతూ చెప్పారు..’ఒకసారి బుట్ట వైపు చూడు మనవడా…’అని…!


   మనవడు బుట్టను చూసాడు…నల్లని బొగ్గుల బుట్ట ఇప్పుడు చాలా శుభ్రంగా, తెల్లగా ఉంది…!


   తాతగారు చెప్పారు…’భగవద్గీత చదివితే మనకు జరిగేది ఇదే…మనకు అర్ధం అవ్వనీ అవకపోనీ…గుర్తు ఉండనీ ఉండకపోనీ…చదివే సమయంలో మనకు తెలియకుండానే..మన ఆలోచనల్లో..మన దృక్పధంలో    మంచి మార్పు వస్తూ ఉంటుంది…ఆ మార్పు మనకి వెంటనే తెలియదు కూడా…సందర్భాన్ని బట్టీ..అవసరమైన సమయంలో.. ఆ మంచి మార్పు…ఉపయోగపడుతుంది…భగవద్గీత చదవటంలో కృష్ణుడు మనకు చేసే మేలు అదే…మన మనస్సులను శుభ్రపరచటం…ఏది ఏమిటో…ఏది ఎందుకో…సరైన అవగాహన మనకి తెలియచేయటం…

ఇవన్నీ అనుభవపూర్వకంగా..

ఎవరికి వారే తెలుసుకోగలుగుతారు…’

అని చెప్పి మనవడి ప్రశ్నకు సహేతుకంగా, ఉదాహరణతో సహా వివరించారు 

తాతగారు.✍️

 ॐ గీతా జయంతి 


                        సందేశం - 3 


భగవద్గీత అందించే శాంతి సందేశం 


1 పరమాత్మ 


    పరబ్రహ్మము 

    విభజింపబడనిదియైనను ప్రాణులయందు విభజింపబడినదానివలె ఉన్నదీ, 

    ప్రాణులను సృష్టించేదీ, పోషించేదీ, లయింపజేసేదీ అని తెలుసుకోదగినది. 


    Brahman is though undivided, It exists as if divided in beings; 

    It is to be known as the supporter of beings; 

    It devours and It generates. 


అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితమ్ I 

భూతభర్తృ చ తజ్జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ ॥ 13 - 17 


2. భగవంతుని స్థానం 


    ఎవడు సమస్త భూతములందును నన్ను చూచుచున్నాడో, మఱియు 

    నన్ను సమస్త భూతములందును గాంచుచున్నాడో, 

    అట్టివానికి నేను కనబడకపోను, 

    నాకతడు కనబడకపోడు. 


    He who sees Me everywhere and sees everything in Me, 

    he never becomes separated from Me, 

    nor do I become separated from him.


యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి I 

తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి ॥ 6 - 30  


3. ద్వేష ఫలం 


    సమస్త ప్రాణులలో గల ఆత్మయగు నన్ను ద్వేషించువారును, 

    క్రూరులును, 

    అశుభ(పాప) కార్యములను జేయువారును అగు మనుజాధములను నేను 

    జననమరణరూపమలగు ఈ సంసారమార్గములందు 

    అసురసంబంధమైన నీచజన్మలందే ఎల్లప్పుడు త్రోసివైచదను. 


    Entering into demonical wombs and deluded, 

    birth after birth, 

    not attaining Me, 

    they thus fall, O Arjuna, into a condition still lower than that


తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ I 

క్షిపామ్యజస్ర మశుభా నాసురీష్వేవ యోనిషు ॥ 16 - 19 


          ॐ శాంతిశ్శాంతిశ్శాంతిః 


    — రామాయణం శర్మ 

            భద్రాచలం

బాపు గారి జయంతి

 సత్తిరాజు లక్ష్మీనారాయణ, బాపు గారి జయంతి నేడు. ఇతగాడు సృష్టించిన బొమ్మలు, పుట్టించిన బామ్మలు మన తెలుగింట ఇప్పటికీ కళకళలాడుతూనే వున్నారు.


అందాలబొమ్మల బాపుకి అపరాహ్ణవేళ అక్షర నైవేద్యం...


‘గుండ్రంగా రాయడం రాక ఇలా వంకరటింకరగా లాగించేస్తున్నాడు...ఏం తెలివి?’ అనేసుకుని నోట్లో కొంగులూ, కండువాలూ కుక్కేసుకున్నార్ట!


ఆ అక్షరాలు చూడ్డానికి అదోలా వుంటాయి. కాసేపు చూస్తే ‘ఏదోవుందిందులో!’ అనిపించేస్తుంది. ఆనక పుస్తకం మూసేసాక మళ్ళీ తెరిచి చూడాలనిపిస్తుంది. 


మనం పెట్టే కొమ్ములూ, దీర్ఘాలన్నింటినీ కొత్తరకంగా తగిలించే తెలివి. పేరంతా రాసేసిన తరవాత చూస్తే ఊరేగింపుకి తయారైన దేవుడిపల్లకీలా వుంటుంది. ఆ నిండుదనం గోదారినించీ, ఆ అందం చందమామనించీ తెస్తాడు. 


ఇహ బొమ్మలు....


ఒక స్త్రీ బొమ్మంటే సామాన్యశాస్త్రం పుస్తకంలో ఆడమనిషి బొమ్మలా అందరూ వేస్తున్నరోజుల్లో ఇతగాడు చుక్కలముగ్గెట్టినంత చులాగ్గా వేసేసి చూపించాడు. 


రావాకుల్లా పరుచుకున్న రెండుకళ్ళూ, 

మకరధ్వజాల్లా కనుబొమ్మలూ,  

చదరంగంలో శకటులా ధీటైన ముక్కు, 

చిన్న చెగోడీలా నోరూనూ! 

చూడగానే ముద్దిస్తున్నట్టూ, ముద్దొస్తున్నట్టూ అనిపించేస్తుంది ఎవరికైనా! 


ఇహ మెడా, జడా సంగతి సరేసరి! జుట్టంతా పొందిగ్గా అల్లి, పాపిడితీసి, నాగుబాములా పేద్ధ జడేసేసేవాడు. చివర్న ఓరెండు గంటలు కట్టేవాడు. నడుం మీద ఆట్టే ఆసక్తి చూపెట్టేవాడు కాదు. ఎంచేతంటే...అసలది వుంటేగా? అలాగ్గీసేవాడు. 


ఈ యవ్వారాలన్నీ పూర్తయ్యేసరికి మగపిల్లలందరికీ గుండెల్లో గుబులు మొదలయ్యింది. ‘పెళ్ళిచేసుకోరా నాయనా!’ అని బామ్మలూ, అమ్మానాన్నలూ అడిగితే శివకాశి టపాకాయల్లా ‘బాపూబొమ్మం’టూ బ్రాండొకటి చెప్పేవారు. అలాంటి పిల్లలే కావాలంటే ఎక్కణ్ణించొస్తారు? ఆఖరికి అదొక గోల్డ్ స్టాండర్డ్ అయి కూర్చుంది.


ఇహ ఈ రమణున్నాడే! గొప్ప కబుర్లపోగు. ఏవో కథలూగట్రా రాస్తూండేవాడు. ఆయనగారి మనసులో ఏం వుందో ఈయనకి తెలిసిపోయేది. ఈయనగారి కలంలో ఏం వుందో ఆయనకి అర్ధమైపొయ్యేది. 


బుడుగూ, సీగానపెసూనాంబ....అనేసి రెండుపేర్లు అనుకుని ‘ఓం విఘ్నేశ్వరాయ’ అని ముందస్తుగా రాసి మొదలెట్టగానే ఈయనేసిన రెండు బొమ్మలూ రూపం తెచ్చేసుకున్నాయి. ఆనక వాళ్ళనాన్న గోపాళం, రాద, బాబాయ్, రెండుజెళ్ళసీత, పక్కింటి లావుపాటి పిన్నిగారు, ఆవిడ మొగుడు...అందరికన్నా అందంగా... వత్తులపెట్లో డబ్బులు దాచుకునే బామ్మ..వీళ్ళందరి బొమ్మలూ వేషాలేసుకుని పుస్తకమ్మీదకి వచ్చేసాయి. 


మనకింక తడుంకునే పన్లేదు. ‘బుడుగంటే ఎలా వుంటాడూ?’ అని నీ బుర్రనీ, పుస్తకాన్నీ చించుకోవాల్సిన అవసరం లేకుండా తాళ్ళలాగేసి, ఓ బుగ్గల బూరిగాణ్ణి మన ముందు నిలబెట్టేసాడు. రెండు కొత్తిమీర కట్టల్లాంటి జళ్ళేసి సీగాననీ లాక్కొచ్చేసాడు. వాళ్ళెంత నచ్చేస్తారంటే అందరూ చూస్తుండగా వందసార్లూ, ఎవరూ చూడకండా మరో వందసార్లూ పుస్తకాన్ని ముద్దెట్టేసుకునేంత!


వీళ్ళిద్దరితోనే అయ్యిందేఁవిటి? 


‘రామపట్టాభిషేకం పటం ఇంటోవుంటే శుభం! బాపూదయితే ఇంకా శుభం!’....


ఇది మన తెలుగింటి నానుడి! నేనన్నది అతిశయోక్తేమో గానీ అతిమాత్రం కాదు.


ఓమారు ఆ చివర్నించి ఈ చివరిదాకా చూడండి...


సీతారాములేమో మొహమాటంగాను, లక్ష్మణ భరత శత్రుఘ్నులేమో ‘హమ్మయ్య! అన్నయ్యొచ్చేసాడు! ఇహ మనకేం ఫరవాలేద’న్నట్టుగాను, వసిష్టుల వారేమో ‘ఈరోజుకోసం ఎన్నాళ్ళనించి చూస్తున్నానో తెలుసా?’ అన్నట్టుగాను, ఇహ హనుమంతుడయితే ‘నాకోసమే అప్పుడాగిపోయింది పట్టాభిషేకం. నేలేననే! అదీ అదృష్టఁవంటే!’ అనుకునేంత గాఢభక్తితోను...


చూస్తూనే వుండిపోయి, చుట్టుపక్కలేం జరుగుతోందో కూడా మర్చిపోతావు. ఆ క్షణంలో ఓ అప్పారావొచ్చి ‘ఓ ఫైవ్ లాక్స్ అప్పిస్తావోయ్?’ అనడిగినా ఇచ్చి పడేస్తావ్! అంత విషయం వుందక్కడ!


ఈయన బొమ్మ వుందంటే పుస్తకానికి పసుబ్బొట్టు పెట్టినంత అందం. గుమ్మానికి మావిడాకు కట్టినట్టు, కొత్తబట్టలు కొనుక్కున్నట్టు. పత్రికలవాళ్ళు పండగలన్నిటికీ ఈయన్నే వెయ్యమనేవారు ముఖచిత్రాన్ని.


అంతవరకూ ప్రతివారం వచ్చే వాణిశ్రీలూ, జమునలూ, జయప్రద, సుధ, చిత్రలూ మాయమై పోయేవారు. వాళ్ళందరికన్నా అందంగా ఓ పిల్ల దిగేది. ఆ పుస్తకాన్ని లోపలి కథల కోసం కొందరూ, బయట బొమ్మ కోసం కొందరూ ఏళ్ళ తరబడి దాచుకునేవారు.


అమరావతి కథలకి ఈయన గీసిన బొమ్మల్ని చూసారా? సత్యంగారి ఆత్మ బాపు బొమ్మల్లో కనబడుతుంది. ఆయనేఁవనుకుని రాసాడో తెలీదుగానీ ‘రాగిచెంబులో చేపపిల్ల’, ‘భోజన చక్రవర్తి’, ‘ముద్దులల్లుడు’ కథలకి బొమ్మలొకసారి చూడండి. 


పుస్తకంలేదా మీయింటో? అదేమరి! మీరేం తెలుగువాళ్ళూ? కథని చదివి, జీర్ణంచేసేసుకుని, రక్తంలోకీ, మనసులోకీ ఎక్కించుకుని ఆనక బుర్రకి పనిచెప్పి ఓబొమ్మగీస్తే....కథంతా ఒక్క బొమ్మలో తెలిసిపోతుంది! అంత పనిమంతుడు మన బాపు!


మిథునఁవైతే ఇహ లాభంలేదని ఏకంగా మొత్తం తన దస్తూరీలోనే రాసిపడేసాడు. ఒకసారి దూరంనించి చూస్తే పళ్ళెంలో పారిజాతాల్లా వుంటాయి అక్షరాలన్నీ! ఏరి వాసన చూడాలన్నంత అందంగా!


ఎంత మందికో కథలకీ, నవలలకీ బొమ్మలేసాడు. సినిమా పుస్తకాల్లో రేలంగిరిజల్నీ, జమునాసావిత్రుల్నీ కళ్ళకి కట్టేసేవాడు.


అంతర్జాతీయ స్థాయి అందాలబొమ్మల అపురూప చిత్రకారుడు...


అమర లోకంలో రంభావూర్వశులు రోజూ వాళ్ళ బొమ్మలెయ్యమని సలపాదిస్తూ వుండే వుంటారు. 


నీ బొమ్మల్ని చూస్తూ పెరిగాం. నీ బొమ్మల్ని చూస్తుండగానే నువ్వెళిపోయావు. మనసులో నీ బొమ్మ మాత్రం పది కాలాలపాటు పదిలంగా అలానే వుంటుంది.


నివాళులు!


జగదీశ్ కొచ్చెర్లకోట


#mahanubhavulu