19, నవంబర్ 2020, గురువారం

అమ్మవారికి శ్రీవారి సారె

శ్రీ పద్మావతి అమ్మవారికి శ్రీవారి సారె


          తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన గురువారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను స‌మ‌ర్పించారు. ప్రతి ఏటా పంచమితీర్థం రోజున తిరుమల నుంచి సారె తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది.


           ఇందుకోసం ముందుగా శ్రీవారి ఆలయంలో ఉదయం 2.30 నుండి 4.30 గంటల వరకు పరిమళాన్ని(నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన మిశ్రమం) విమాన ప్రాకారంలో ఊరేగింపు నిర్వహించారు. ఆ తరువాత గర్భాలయంలో శ్రీవారి వక్షఃస్థల లక్ష్మీ అమ్మవారికి ఏకాంతంగా తిరుమంజనం చేప‌ట్టారు. ఉదయం 4.30 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్త్రాలు, ఆభరణాలతో కూడిన సారె ఊరేగింపు మొదలైంది. ఈ సారెను ఆలయ నాలుగు మాడ వీధుల గుండా ఊరేగించిన‌ అనంతరం తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యానికి తీసుకెళ్లారు.

బ్రాహ్మణ ధర్మం

 బ్రాహ్మణ ధర్మం

             

ఒకరు మనల్ని గౌరవిస్తున్నారన్నా నమస్కరిస్తున్నారన్నా ఆ ఘనత మనది కాదు.

ఆ గొప్పతనం మనం పాటిస్తున్న వైదిక సాప్రదాయంది,మనం నేర్చుకున్న వేదానిదీ.


ఎంత కాలం మనం ఆ వైదిక ధర్మానికి కట్టుబడి ఉంటామో,నియమ నిబంధనలతో,

మడి ఆచారాలతో, విప్ర ధర్మాలతో సంస్కార వంతమైన జీవనం గడుపుతామో,

అంతకాలంవరకే ఈ గౌరవ మర్యాదలు మనం పొందగలుగుతున్నాము.


ఏ వర్ణస్తులైనా వారి ధర్మాలని వారు వదిలేసినా వారు సంఘంలో గౌరవింపబడుదురేమో కాని,

బ్రాహ్మణుడు మాత్రం(అందునా వైదిక వృత్తిలో ఉన్నవారు మాత్రం) 

వాని ధర్మాలను వదిలిన మరుక్షణమే అతను భ్రష్టుడుగా పరిగణించ బడతాడు.

అందుచేతనే ఏ పురాణ కధలలోనైనా పాపకర్మలతో పతనమైన వారి గురించి చెప్పే సందర్భములో,

ఆ పాత్రను బ్రాహ్మణుడి గానే చూపించారు.


అందువల్ల ఈ గౌరవ పురస్కార సత్కారములు మనకే అనుకుని మురిసి పోయి గర్వించకుండా,

లోకమంతా గౌరవించుచున్నది మన శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్ఠాన సాంప్రదాయాన్ని మాత్రమే,

అను విషయం గుర్తించి,ఆ బాధ్యతను మనం సక్రమంగా శిరోధార్యంగా మోస్తున్నంత కాలమే,

ఈ ప్రపంచం లో మన మనుగడ,మన ఉనికి.

అలా కాక వాటిని విస్మరించిన నాడు వదిలేసిన నాడు లోకంలో మనంత హీనంగా చూడబడే వాడు ఇంకొకడు ఉండడు.


అందరూ అనుకుంటున్నట్లు బ్రాహ్మణీకం అనేది ఓ ఘనత ఏమాత్రం కాదు.

ఇది ఒక పులి మీద స్వారి వంటిది,జాగ్రత్తగా దాని మీద స్వారి చేసినంత వరకే (నియమంగా ఉన్నంత వరకే) నీ గౌరవం,

ఒక్క సారి దాని మీదనించి దిగావా (పతనమయ్యావా) అదే నీ అంతానికి కారణ మవుతుంది.


ఇది ఎవరికో నేను ఉపదేశిస్తున్నది కాదు, నాకు నేనే అంతర్ముఖుడనై చెప్పుకుంటున్న ఉపదేశం.


ఈ క్రింది కథ సారాంశం చూస్తే ఎందుకో ఇది మన గురించే చెప్పిన కధలా అనిపించింది.

ఈ కలియుగంలో ఈ నాస్తిక సమాజంలో, వైదిక ఆచార వ్యవహార ధర్మాలను పాటించటం నిజంగా అతి భారమే,

అందుకే ఆ బరువులు మోసే గాడిద పాత్రతో పోల్చుకోవటానికి మనమేమి బిడియపడక్కర్లేదు.

అది మోసిన దేవతా విగ్రహమే మన పవిత్రమైన వైదిక ధర్మం.అది మోసినంత కాలమే మనకి గౌరవం.

ఆ ధర్మాన్ని వదిలేస్తే మనకీ దానిలా ఈ సంఘంలో ఛీత్కార అవమానాలే.


*🌷ఓ సారి ఈ కధ మీరూ చదవండి🌷*


         *🌀జ్ఞానోదయం🌀*


ఒక ఊరిలో ఒక శిల్పి ఉండేవాడు.

అతను చాలా అద్భుతంగా బొమ్మలు చెక్కేవాడు. 

అలా చెక్కిన బొమ్మల్ని తన గాడిదపై తీసుకువెళ్ళి పక్క ఊరి సంతలో అమ్ముతుండేవాడు.

ఒక రోజు ఆ శిల్పి ఒక దేవత బొమ్మను చెక్కాడు.

బొమ్మ చాలా అందంగా, దైవత్వంతో ఉన్నట్టు ఉంది. 

ఆ బొమ్మను జాగ్రత్తగా గాడిద మీద పెట్టుకుని, పక్క ఊరికి తీసుకువెళ్తున్నాడు.


 దారిలో వెళ్ళేవారు ఆ దేవత బొమ్మను చూసి,

 నిజంగా దేవతలా భావించి దణ్ణం పెట్టుకుని వెళ్తున్నారు. 

అయితే ఇదంతా గాడిదకి మరొక రకంగా అనిపించింది.

 అందరూ తనని చూసి, తనకే నమస్కారం చేస్తున్నారనుకుంది. 

అలా నడుస్తూ వెళ్తున్న కొద్దీ అందరూ ఆగాగి నమస్కారాలు చేయడంతో గాడిదకి గర్వం పెరిగింది.


'ఇంత మందికి నేను పెద్ద మనిషిలాగా, గౌరమివ్వాలనిపించేలా కనిపిస్తున్నానా! 

అని ఆశ్చర్యపోయింది.


 'ఇక నేనెవ్వరి మాట విననవసరం లేదు'

 అనుకుంది.

 కొద్ది సేపయ్యాక దానికి కాళ్ళునొప్పి పుట్టాయి.

 అందుకని అది దారి మధ్యలో ఆగిపోయింది.

 గాడిద ఆగిపోయినా, దానిపైన దేవతకి ప్రజలు ఇంకా దండాలు పెడుతూనే పోతున్నారు. 

గాడిద ఆగిపోయిందేంటబ్బా అని శిల్పి గాడిదను ఎంత సముదాయించినా అది కదలలేదు. 


'ఊరి వాళ్ళంతా నాకు

 గౌరవమిస్తుంటే నేను గొప్పదాన్నే కదా! 

మరి గొప్పవాళ్ళు యజమానుల మాటని ఎందుకు వినాలి, '

అనుకుని అక్కడి నుండి కదలలేదు.


శిల్పికి విసుగు వచ్చి, దేవతా విగ్రహాన్ని గాడిదపై నుండి తీసి తన తలపైనే పెట్టుకుని ముందుకు సాగాడు.

" ఆ! పోతే పోయాడు" 

అనుకుని గర్వంతో కళ్ళు మూసుకుంది గాడిద.

 కొద్ది సేపటి తర్వాత కళ్ళు తెరచి చూస్తే, ఒక్కరు కూడా తన దగ్గర లేరు.

 అందరూ తన యజమాని వెనకే దండాలు పెట్టుకుంటూ వెళ్తున్నారు.

 ఇంతలో దారిలో అడ్డంగా ఉందని ఒకతను, గాడిద వీపుపై కర్రతో కొట్టాడు.

 దానితో గాడిదకి జ్ఞానోదయం అయింది.


 "అనవసరంగా నన్ను నేను గొప్పగా ఊహించుకున్నాను.

ఇంకాసేపు ఇక్కడే ఉంటే, నా వీపు పగిలిపోయేలా ఉంది, 

అనుకుని యజమాని దగ్గరకు పరుగెత్తింది.


🐿నీతి :


మనకు దక్కే మర్యాదలు మనం పాటిస్తున్న ధర్మానికే కాని మనకు కాదు.

అవి వ్యక్తిగతంగా మనకే అనుకుని  గర్వపడి విర్రవీగడం అవివేకం.

ఝాన్సి లక్ష్మి బాయి

 ఆమె బ్రతికింది 29 సంవత్సరాలే అయితేనేం ఆమె జీవితం ఓ ఒరవడి సాహసం సదా అవరోదాలు అవమానాలు వెంబడించినా ప్రాణం వున్నంతవరకు 1857 లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి స్వతంత్ర సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోశించిన వీరనారి ఝాన్సి లక్ష్మి బాయి గారి జయంతి నేడు🚩* 

*మనం అందరం ఒక సారి వారి త్యాగాలను స్మరించుకుందాం🙏* ...

ధార్మికగీత - 85*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                         *ధార్మికగీత - 85*   

                                   *****

      *శ్లో:- దర్శనే  స్పర్శనే  వా౽పి౹*

            *భాషణే  భావనే  తథా ౹*

            *యత్ర  ద్రవ త్యంతరంగం ౹*

            *స  స్స్నేహ:  ఇతి కధ్యతే ౹౹* 


                                   *****

*భా:- భగవంతుడు సృష్టిలో మనకు ప్రసాదించిన అమూల్య రత్నం మిత్రుడు. తల్లీ, తండ్రీ తరువాత మన హితోభిలాషి చెలికాడే. అతని స్నేహ మాధురీమహిమ నాలుగు విధాలు.  1. "దర్శనం":- బాల్య స్నేహితుడైన  కృష్ణుణ్ణి చూడగానే కుచేలుని ఉల్లం పల్లవించింది. హృదయం పరవశించింది. ఆపదలో ఆదుకోమని అడగడం కూడా మరిచిపోయేలా చేసింది. అదీ స్నేహమంటే. 2. "స్పర్శనం" :- ఆర్ఘ్యపాద్యాల సమర్పణలో మిత్ర కరస్పర్శనం వల్ల  కలిగిన   అనిర్వచనీయమైన ఆనందం వల్ల అంతరంగం ద్రవీభూతమైంది. జన్మ తరించిందనుకొన్నాడు కుచేలుడు. అదీ స్నేహం అంటే. 3. "భాషణం" :- పోరులో నీరుకారిపోతున్న సఖుడైన పార్థునికి  శ్రీకృష్ణుని గీతాభాషణం పునరుత్తేజితుణ్ణి చేసింది. భీరువుని వీరునిగా మార్చి, అమేయబలంతో వీరోచితంగా పోరాడేలాచేసి, ధన్యుణ్ణి చేసింది. అదీ స్నేహమంటే. 4. "భావన":- విపత్తులు, ఆపదలలో ఉన్నా సత్య ధర్మనిరతులై,  సత్కార్యాలు నిర్వహిస్తున్న పాండవులకు బంధువుగా కాక "మిత్రుడు" గానే అనుక్షణం కొండంత అండగా ఉండి, ఆదుకోవాలనే పవిత్ర భావన కలిగియుండడమే శ్రీకృష్ణుని ఉదాత్తత. అదీ స్నేహమంటే. ఈ విధంగా దర్శన, స్పర్శన, భాషణ, భావనల వల్ల హితుని మదిని, హృదిని ఆర్ద్రతతో ద్రవింపజేయగలగడమే  స్నేహ మనే పదానికి నిజమైన అర్థము,పరమార్థమని సారాంశము*.

                                *****

                 *సమర్పణ  :   పీసపాటి*    

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

మహాభారతము '81 ..

'మహాభారతము '81 ..


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


అరణ్యపర్వం.


తన శరీరమునుండి యెంత మాంసము కోసి త్రాసులో వేస్తున్నా, బుల్లి పావురము బరువుకంటే తక్కువగా త్రాసు చూపిస్తుంటే,  ఆశ్చర్యంతో పాటు, కొంత అనుమానం వచ్చింది,శిబిచక్రవర్తికి.  


తనను పరీక్షించాలని దేవతలు సృష్టించిన మాయ అన్నా అయివుండాలి, లేదా తనను పరాభవించాలని రాక్షసులు పన్నిన పన్నాగమైనా అయివుండాలని,  భగవన్నామ స్మరణ చేస్తూ, తనకు తానే అర్పించుకునే వుద్దేశ్యంతో, శిబిచక్రవర్తి,  తన శరీరమంతా తీసుకొమ్మని, డేగతో చెప్పి, ఆ త్రాసులో కూర్చున్నాడు.  తనను తాను అర్పించు కుంటున్న ఆ దృశ్యం చూసి సభికులు హాహాకారాలు చేశారు.  దేవతలు పైనుండి పుష్పవృష్టి కురిపించారు.  


అంతలో, 'ఉశీవరమహారాజా !  నీ ధర్మరక్షణా ప్రవ్రుత్తి అమోఘం.  నేను డేగరూపం లోవచ్చిన ఇంద్రుడను.  ఈ కపోతం  అగ్నిభట్టారకుడు.  ఒక చిన్నిపావురం కోసం నీవు పడిన ఆరాటం, నీ దేహత్యాగానికే సిద్ధపడిన మనోధైర్యం బహుధా ప్రశంశనీయం.  ఇట్టి త్యాగబుద్ధిగలవారు త్రిభువనాలలో యెవరూ లేరు.  నీ కీర్తి ఆచంద్రతారార్కం నిలిచిపోతుంది.  ఇదే మా ఆశీర్వాదం. ' అని ఇంద్ర అగ్నిదేవులు తమ నిజరూపాలతో ప్రసన్నులై,  ఆశీర్వదించి, అంతర్ధానమయ్యారు.  శిబిచక్రవర్తి, తన శరీరంలో మాంస విచ్చేదనకు చేసుకున్న గాయాలను కూడా పోగొట్టుకుని, తన అసలుదేహాన్ని పొందాడు.

 ' ధర్మజా !  ఈ శిబిచక్రవర్తి నివసించిన స్థలంలో కొద్దీ సేపు తిరిగి, దేవతల అనుగ్రహానికి మీరంతా పాత్రులు కండి. ' అని లోమశమహర్షి చెప్పాడు.


ఆ తరువాత,  వారంతా, శ్వేతకేతువు ఆశ్రమాన్ని దర్శించారు. ' ఉద్దాలకమహర్షి కుమారుడు శ్వేతకేతువు.  శ్వేతకేతువుకి, సరస్వతీ మాత, పిలిస్తే పలుకుతుందని, దర్శనమిస్తుందనీ అక్కడివారంతా అనుకుంటారు. శ్వేతకేతువుకీ, అష్టావక్రమహర్షికి, మేనమామా  మేనల్లుళ్ళ సంబంధం వున్నది. ' అని లోమశుడు చెప్పగానే, ఆయన చరిత్ర వినాలని వున్నదనీ, ఆ మహానుభావుడు అష్ట విధములైన వక్రములతో జన్మించిన కారణమేమిటనీ కుతూహలంగా ధర్మరాజు లోమశుని అడిగాడు.

అష్టావక్ర చరిత్ర లోమశమహర్షి చెప్పసాగాడు :  


ఉద్దాలకమహర్షి వద్ద కహోధుడు  అనే శిష్యుడు వుండేవాడు.  ఆతడు ఏకసంథాగ్రాహి.  .  అతని గురుభక్తికి, విద్య పట్లవున్న శ్రద్ధకు, మెచ్చి   ఉద్దాలకుడు  సర్వ  విద్యలు  కహోధునికి నేర్పి, తనకుమార్తె అయిన సుజాతను కూడా యిచ్చి వివాహం జరిపించాడు.


సుజాతకు కొంతకాలానికి గర్భం ధరించి,  గొప్ప తేజస్సుతో వున్న పిండాన్ని, గర్భంలో మోస్తూ వున్నది.   ఒకనాడు, సుజాత, కహోధుని  ప్రక్కనే వుండగా, కహోధుడు  శిష్యుల చేత వేదాలు వల్లెవేయిస్తున్నాడు.  ఆ సమయంలో కహోధునికి  వినబడేటట్లు, గర్భస్థశిశువు, ' తండ్రీ !  మీరెంతో శ్రమకోర్చి రేయింబవళ్లు, శిష్యులచేత శాస్త్రాలు వల్లె వేయిస్తున్నారు, కానీ, శిష్యులలో ఉచ్చారణ సరిగాలేదు. ఎక్కడో లోపం వున్నది. సరిదిద్దండి. '  అన్న పులుకులు సుజాత గర్భంలో నుండి కహోధునికి  వినిపించాయి.  తనకు పుట్టబోయే పిల్లవాడే యీవిధంగా మాట్లాడుతున్నాడని తెలుసుకుని, కహోధుడు  మొదటి క్షణంలో శిశువు పరిజ్ఞానానికి సంతోషించినా, శిష్యులు యీ విషయం విని వుంటారని,  తనను చులకన చేసినట్లుగా భావించి, ' బాలకా ! గర్భంలో వున్నప్పుడే యీ విధంగా పెద్దలతో వక్రభాష్యం చేస్తున్నావు.  నీకు సుందరమైన శరీరం కూడా వుంటే, నీ అహంకారం మరీ యెక్కువవుతుంది.  కాబట్టి అష్టావక్రునిగా జన్మింతువు గాక ! ' అని పుట్టబోయే కుమారుని శపించాడు, కహోధుడు.


సుజాతకు నెలలు నిండుతుండగా, పురిటిఖర్చులకై, ధనార్జన కోసం కహోధుడు, జనకమహారాజు ఆశ్రమానికి వెళ్ళాడు.  అక్కడ వంది అనే పండితుని జయించి ధనం సంపాదించవలెనని, అతనితో పండితచర్చ జరిపి, ఓడిపోయి, అక్కడి నిబంధనల ప్రకారం, జలప్రవేశం చేసి వుండిపోయాడు.  తనను విడిపించే పండితుడు వచ్చేవరకు, కహోధుడు జలంలో వుండిపోవలసిందే ! .  ఈ విషయం ఉద్దాలకునికి తెలిసి, సుజాతకు చెప్పాడు.  ఆమెకు  పుట్టబోయే బిడ్డకు యీ విషయం తెలియకుండా రహశ్యంగా వుంచమని చెప్పాడు.


కాలం యెవరికోసం ఆగదుకదా !  సుజాత మగబిడ్డను ప్రసవించింది.  తండ్రి శాపం కారణంగా ఎనిమిది విధాలైన వంకరాలతో బిడ్డ శరీరం తిరిగిపోయి వున్నది.  అతనికి అష్టావక్రుడు అని నామకరణం చేశారు.  తండ్రి సుఖం తెలియని అష్టావక్రుడు, తాతగారైన ఉద్దాలకునే తండ్రిగా , శ్వేతకేతువుని సోదరునిగా భావిస్తూ బాల్యం గడిపేశాడు.  ఆ విధంగా 12  సంవత్సరాలు గడిచాయి.  అష్టావక్రుడు అన్నిరకాలైన శాస్త్రాలలో నిష్ణాతుడయ్యాడు. ఉపనిషత్తులను అవపోశనపట్టాడు.  తర్క మీమాంసలలో తిరుగులేని పాండిత్యం సంపాదించాడు.  ఎంతటి విద్వంసుడినైనా ఢీ కొట్టగల సామర్ధ్యం తెచ్చుకున్నాడు.  


ఒకనాడు, అకస్మాత్తుగా, ఉద్దాలకుడు తన తండ్రికాదనీ, తన తండ్రి యెక్కడో ఉన్నాడనీ చూచాయగా తెలుసుకున్నాడు, అష్టావక్రుడు.  తల్లిని చెప్పమని బలవంత పెట్టాడు.  ఆమె విధిలేక జరిగినదంతా చెప్పింది అష్టావక్రునికి.  అష్టావక్రునికి ఆనాటినుండీ కంటిమీద కునుకు కరువయ్యింది.  నోటికి తిండి సహించడంలేదు.  మనసు పితృ రుణం తీర్చుకొమ్మనీ, తండ్రిని విడిపించుకుని తీసుకురమ్మని తొందర పెడుతున్నది. ఇక  ఆగలేక, శ్వేతకేతువుతో  ' జనకమహారాజు మిథిలానగరంలో అద్భుతమైన యజ్ఞం చేస్తున్నాడట. అనేకమంది అందులో పాలుపంచుకుంటున్నట్లు తెలిసింది.  మనమూ అక్కడకు వెళదాము.  పెద్దలద్వారా అనేక మంచివిషయాలు తెలుసుకుందాము. '  అని తొందరపెట్టి, శ్వేతకేతుతో కలిసి మిథిలానగరానికి బయలుదేరాడు అష్టావక్రుడు.


మిథిలానగరిలో అడుగుపెడుతున్న వారికి, ఎదురుగా వస్తున్న రాజుగారి ఊరేగింపు దర్శనమయ్యింది.  రాజదర్శనం అవుతున్నదని సంతోషంతో వారు ముందుకు వస్తున్నారు.  అంతలో... 


స్వస్తి.

వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు తెలుసుకుందాం.

తీర్థాల రవి శర్మ 

విశ్వ వ్యాప్త పిరమిడ్ ధ్యాన మందిరం హిందూపురం

9989692844

*కథ-

 🤷‍♀️పిల్లలకు🤷‍♂️ వినిపించ వలసిన ఒక మంచి 

                 *కథ-*

ఒక స్కూల్లో చిన్న పిల్లవాడు భోజనసమయంలో తన మిత్రులతో పాటు 

తాను తెచ్చుకున్న ఆహారాన్ని తినేవాడు. ఆ అబ్బాయి తాను తెచ్చుకున్న

అన్నాన్ని ఒక్క మెతుకు కూడా క్రింద పడకుండా, పదార్థాలను వృధా చేయకుండా తినేవాడు. అతని స్నేహితుల్లో చాలా మంది ఇంటి నుండి తెచ్చుకున్న అన్నాన్ని సరిగ్గ తినకుండా, క్రింద పైన వేసుకుంటూ తినేవారు.

మరికొందరైతే గొడవపడుతూ కోపంతో ఆహారాన్ని విసిరిపారేస్తుంటారు.

కానీ ఈ అబ్బాయి మాత్రం ఒక్క మెతుకు కూడా పారేయకుండా తినేవాడు.

ఒకవేళ తాను తెచ్చుకున్న బాక్స్ కు ఎక్కడైనా రెండు మెతుకులు అతుక్కుని

ఉన్నాకూడా వాటిని కూడా తినేవాడు. అది చూసి మిగతా పిల్లలు ఈ అబ్బాయిని

ఎగతాళి చేసేవారు. " అరే! వీడొక తిండిపోతు రా! ఒక్కమెతుకు కూడా  

వదలకుండా తింటాడు" అని ఎగతాళి చేసినా ఈ అబ్బాయి పట్టించుకునేవాడు కాదు. ఈ అబ్బాయి స్నేహితుడు ఇవన్నీ రోజూ గమనిస్తూ ఉండేవాడు,

ఒకరోజు తన మిత్రున్ని ఇలా అడిగాడు.


" నువ్వు ప్రతిరోజూ ఇలా నీవు తెచ్చుకున్న ఆహారాన్ని వృధా చేయకుండా

  ఇంత చక్కగా తింటున్నావు కదా! మిగతావాళ్ళు నిన్ను ఎగతాళి చేస్తున్నా

  నీకు బాధ అనిపించదా? " దానికి ఈ అబ్బాయి ఇలా సమాధానం

ఇచ్చాడు.


" ఏదో వారికి తెలియకుండా నన్ను ఎగతాళి చేస్తున్నారు. నాకేం బాధలేదు.

  ఇక నేను అలా తినడానికి కారణం చెప్పనా? అలా తినడం అన్నది 

 నా తల్లిదండ్రులకు నేను ఇచ్చే మర్యాదకు చిహ్నం. అమ్మ ఉదయాన్నే

 లేచి నాకు ఇష్టమైన పదార్థాలను వండి ప్రేమతో బాక్స్ లో పెట్టి పంపిస్తుంది,

 వండటానికి కావలసిన వస్తువులను నాన్న ఎంతో కష్టపడి సాయంత్రానికి

తెస్తాడు. ఇద్దరి ప్రేమతో పాటు వారి కష్టంకూడా నా భోజనంలో ఉంది.

అలాంటప్పుడు నేను ఒక్క మెతుకును వృధా చేసినా వారికి అగౌరవ పరచినట్లే!

అంతేకాదు ఒక రైతు తన చెమటను చిందించి పంటను పండిస్తాడు.

అతన్ని కూడా నేను అవమానపరిచినట్లే కదా! అందుకే నేను ఎవరు

నవ్వుకున్నా ఒక్క మెతుకును కూడా వృధా చేయను .అంతేకాదు ఎంతోమందికి

రెండుపూటలా కడుపునిండా అన్నం దొరకడం లేదు. నాకు దొరికింది. నా తల్లిదండ్రుల

పుణ్యమా అని. అమ్మ ఎప్పుడూ చెపుతుంది. *ఆహారాన్ని వృధా చేయకూడదని "*

అని చాలా చక్కగా చెప్పాడు.


ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇలాంటివి చెప్పి

వారిలో ఆలోచనా శక్తిని పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది.

*జై సద్గురు*జైశ్రీరామ్*

వల్లీ - సుబ్రహ్మణ్య స్వామి :-*

 *శ్రీ వల్లీ,దేవసేనా  సమేత శ్రీ  సుబ్రహ్మణ్య స్వామి స్వరూపం - అంతరార్థం.*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*1. వల్లీ - సుబ్రహ్మణ్య స్వామి :-*


వల్లీ అనే మాటకి తీగ, లత అని అర్థం.  తీగ అల్లుకొని   అలా పైకి వెడుతుంది క్రిందనే అలా ఉండిపోతే లాభంలేదు.  దానికో కొయ్యకావాలి ఆ కొయ్యని అల్లుకొని తీగ పైకి వెడుతూ ఉంటుంది.  పురాణాన్ని పరిశీలిస్తే సుబ్రహ్మణుడు చెట్టుగా మారిన ఘట్టం కూడా ఉంది.  లతా-వృక్షములు సాధారణంగా కలిసియుంటాయని చెప్పబడతాయి.  ఒక తీగ చెట్టుకి అల్లుకున్నట్టుగా వల్లీ సుబ్రహ్మణ్యుడిని అల్లుకుంటుంది.  పురాణాలలో సంకేతవాదాలు, ప్రతీకవాదాలు ఉంటాయి.  క్రిందన తీగ(అనగా మనలో  కుoడలిని) చుట్టలు చుట్టుకొని ఉంటే లాభం లేదు. ఆ తీగ పైకి పాకాలి.  మూలాధారం నుంచి సుషుమ్న అనబడే వెన్ను కొయ్యని అల్లుకొని పైకి పాకుతున్న శక్తిలతే వల్లీ.  కుండలినీ శక్తి అనబడే ప్రాణశక్తి చేత అల్లుకోబడిన ఆత్మస్వరూపుడే సుబ్రహ్మణ్యుడు.  వల్లీ అనగా కుండలినీ శక్తి.



*2. దేవసేన - సుబ్రహ్మణ్య స్వామి :-*


యోగభాషలో, శాస్త్రభాషలో దేవతలంటే మన ఇంద్రియశక్తులు. అవి ఇంద్రియాధిదేవతలు.  మన పురాకృత సుకృతం బట్టి ఒక్కొక్క దేవత ఒక్కొక్క ఇంద్రియంలో కూర్చుంటుంది.  దానితో మనం మంచి పని చేస్తే అక్కడి దేవత శభాష్ అంటుంది.చెడ్డపని చేస్తే ఛీఛీ అని తిడుతుంది.  అవి శభాష్ అంటే పుణ్యాలై, ఛీఛీ అంటే దోషాలై మనకి లభిస్తాయి.మనం చేసే పనులు ఏ  ఇంద్రియంతో చేస్తామో ఆ ఇంద్రియశక్తే పరీక్షిస్తూ ఉంటుంది.అవి శక్తిని ఇచ్చి సాక్షిగానే చూస్తూ ఉంటాయి.  నేత్రాలకి సూర్యుడు, చేతికి ఇంద్రుడు, ఇలా ఒక్కొక్కదానికి ఇంద్రియాధిదేవతలు ఉంటారు.  ఇన్ని దేవతలు శక్తులు మనలో ఉన్నాయి.ఒక సేనాపతి సేనలతో వెళ్ళి యుద్ధం ఎలా చేస్తాడో మన శరీరంలో "నేను" అనేవాడు కూడా ఇంత సేన లేకపోతే వాడు పనిచేయలేడు.  కనుక మన ఇంద్రియశక్తులే దేవసేనలు.  వీటినన్నిటికి కలిపి ఒక నాయకుడులా నడిపించేవాడే మనలో "అహంరూపచైతన్యం", ఒకటున్నది.  అదే దీన్ని చూడు, దాన్ని విను అని ఇంద్రియాలకి చెప్తోంది.  మనలో ఉన్న ఆత్మచైతన్యమే ఇంద్రియరూప దేవసేనలని నడుపుతోంది.


*3. వల్లీ దేవసేనా సహిత సుబ్రహ్మణ్యేశ్వరుడు:-*


ఇంద్రియరూప దేవసేనలకి పతియై, కుండలినీరూప వల్లీశక్తితో అల్లుకొని,మనలో ఉన్న పరమాత్మ చైతన్యమే వల్లీదేవసేనాసమేత  సుబ్రహ్మణ్యస్వామి.  ఈ స్వామిని ఆరాధించటం వలన మనకు ఆత్మజ్ఞానం , పరమాత్మ తత్వం బోధపడుతుంది.


🕉🌞🌎🌙🌟🚩

 *సుబ్రహ్మణ్యస్వామి వారు రాశి భూతమైన జ్ఞానస్వరూపం.*

💥💥💥💥💥💥


 సునిశితమైన మేధస్సుకు స్వామి వారి చేతిలో ఉండే శక్తిఆయుధమే ప్రతీక. శివజ్ఞానప్రదాయిని అయిన అమ్మవారికి ప్రసాదించిన దివ్యాయుధమిది. ఇదేఅజ్ఞానమనే తారకాసురుని సంహరించిన జ్ఞానశక్త్యాయుధము.


 “జ్ఞానశక్త్యాత్మా” అనేదిస్వామి వారి నామాలలో ఒకటి. ఇఛ్చా, జ్ఞాన, క్రియా అనేమూడు శక్తుల మయమైన శక్తినిధరించిన జ్ఞానశక్తి స్వరూపుడు, జ్ఞానయోగంలో సాక్షాత్కరించే శివశక్త్యాత్మక తేజఃపుంజం – కుమారస్వామి.


 ఆరుకోణాల చక్రం అనేది బహుముఖీయమైన ప్రజ్ఞకు సంకేతం కనుక కవిత్వానికీ, ప్రతిభకీ, ఆధారశక్తిగా కూడాకుమారస్వామి ఉపాసన చెప్పబడింది.


 వైదిక వాగ్మయంలో కుమార అనే నామం వినగానేగుర్తుకు వచ్చేది కేవలం బుజ్జి విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడే. సుబ్రహ్మణ్యగణపతులు పరబ్రహ్మ స్వరూపులేకాక, “కుమార”తత్వానికి ప్రతీక. జగత్తులో మాతాపితృతత్వానికి ప్రతీక పార్వతీ పరమేశ్వరులు. (లేదా లక్ష్మీ నారాయణులు, ఎలా పిలిచినాఒకటే). అవ్యక్తం, వ్యక్తం, మహత్, అహంకారం ఈ నాలుగు పంచభూతాత్మక జగత్తుకి ఆధారం.ఇందులో అవ్యక్తానికి ప్రతీకగా అమ్మవారిని పేర్రొంటే, వ్యక్త స్వరూపాలకు సంకేతంగా అయ్యవారిని స్మరించుకోవటం ఆనవాయితి అయితే, మహత్తత్వానికి ప్రతీకగా గణపతిని,అహంకారానికి ప్రతీకగా కుమారస్వామిని చెప్పడం జరిగింది. అహంకార తత్త్వం ఉండడం వల్లనే ఈ సకల జగత్తు సృష్టింపబడినదిఅని చెప్తారు పెద్దలు. నిజానికి ఒకే పరతత్వం యొక్క నాలుగు భూమికలివి.


ఇక్కడ అహంకారం అంటే లోకంలో అనుకునే గర్వం అనేభావం కాదు. నేను అనే స్పృహను అహంకారం అంటారు. ఈశ్వరుని పరంగా ఈ బావం ఉంటుంది.ఇక్కడి నుంచే సృష్టి విస్తృతి ప్రారంభం అవుతుంది. చైతన్యం యొక్క లక్షణం అహంకారం. ఈసృష్టిలో కృత్రిమంగా, యాంత్రికంగా, వైజ్ఞానిక సాంకేతికంగా మానవుని మెదడు వంటిజ్ఞాపక శక్తి కల యంత్రాన్ని తయారు చేయవచ్చునేమో కానీ, దానికి “నేను చేస్తున్నాను” అనే అహంభావం, స్పందన ఇవ్వలేము. అది కేవలం స్వాభావికమైనసృష్టి లక్షణం. అనుభూతులకీ, ఆలోచనలకీ, స్పందనలకీ కేంద్రం ఈ అహం తత్వమే.


ఈ అహంతత్వానికి ప్రతీక సుబ్రహ్మణ్యుడు.రహస్యంగా అందరిలోనూ ప్రకాశించే పరమాత్మ చైతన్యమిది కనుక ‘గుహ’ అన్నారు స్వామిని. శివతేజస్సు నుండి ఉద్భవించినవాడు కనుక జ్ఞానతత్త్వం కలిగి ‘గురుగుహ’ అని స్వామికి నామం. అసలు స్వామి అనే మాట అమరకోశం ప్రకారం ఒక్క సుబ్రహ్మణ్యుడిదే. ఎందుచేతనంటే “దేవసేనాపతీ, శూరః, స్వామీ, గజముఖానుజః “ అని అర్ధంగా ఇవ్వబడింది.


పురుషోవిష్ణు రిత్యుక్తః శివోనానామతః స్మృతః

అవ్యక్తం తు ఉమాదేవీ శ్రీర్వా పద్మ నిభేక్షణా

తత్ సంయోగా దహంకారః స చ సేనాపతిరుహః


పరమ పురుషుడు శివుడు లేక విష్ణువు. అవ్యక్తశక్తి ఉమాదేవి లేక లక్ష్మీదేవి. వీరిరువురి సమైక్య సమన్వయ తత్వమూర్తి కుమారస్వామిఅని స్కాంద పురాణం చెబుతోంది.

అంటే కుమారస్వామిని పూజిస్తే శివశక్తుల్నీ,లక్ష్మీనారాయణులనీ కలిపి అర్చించినట్లే. ప్రకృతీ పురుషుల ఏకత్వం కుమార స్వామితత్త్వం.


కుమార జననంలోనే అనేక తాత్త్విక మర్మాలుఉన్నాయి. పరతత్వం అవ్యక్తం నుండి జగద్రూపం తీసుకొనే పరిమాణ క్రమం కుమార జననంలోకనబడుతుంది. అమోఘమైన శివతేజాన్ని పృథ్వి, అగ్ని, జలం (గంగ), నక్షత్ర శక్తి (షట్కృత్తికలు) ధరించి చివరకు బ్రహ్మతపోనిర్మితమైన శరవణం (రెల్లు తుప్ప) లోంచిఉద్భవించినవాడు కనుక శరవణభవుడు అయ్యాడు.


షణ్ముఖుడి ఆరు ముఖాలుపంచ భూతాలను + ఆత్మను సూచిస్తాయంటారు. ఇంకా అవి యోగ సాధకులకు షట్చక్రాలకు సంకేతాలు...


 సుబ్రహమణ్యేశ్వరుడు మన శరీరంలోని కుండలిని శక్తికి సంపూర్ణమైన సంకేతం. మనలో కుండలిని రూపంలోన ఒదిగిన సుబ్రహ్మణ్యుడు.


కుండలం అంటే పాము చుట్ట అని అర్థం. పాము చుట్టవేసుకొని కూర్చు౦టుంది, సాగదీసిన వెన్నెముక్క నిలబడ్డ పాము యొక్క శరీరం. పాము పడగ విప్పే విధానం మానవ తల వెనుక భాగం నుండి వ్యాపించే విధానం. పాము చుట్టలు చుట్టుకునేది మూల ఆధార చక్రానికి సంకేతం. మనిషి సుబ్రహ్మణ్యుడు కావాలి అంటే కుండలిని శక్తిని జాగృతం చేసుకుని బ్రహ్మ రంద్రం నుండి అమృత బిందువులు శరీరమ౦తా చిలికించుకున్న సందర్భంలో మాత్రమే కాగలడు అని మన ప్రాచీనులు చెప్పారు.


శరీరంలో అసుర సంపద లేకుండా దేవతల వైపు సేనాపతిగా ఉండి అన్ని దైవ లక్షణాలు కలిగి ఉండటమే సుబ్రహ్మణ్య విధానం. సంపూర్ణమైన దైవ భావనలు కలిగి ఉండటం సుబ్రహ్మణ్య విధానానికి వెళ్లే మార్గ లక్షణం. శరవణభవ అనే ఆరు అక్షరాల మహా మంత్రమే జీవుని తరింపజేసే, కుండలిని జాగృత పరిచే దివ్య శక్తి మయమైన శబ్ద బ్రహ్మ స్వరూపం.


'అద్వైతం సత్యం'.నిరంజనం, నిరంతరం, నిర్గుణం, నిరామయం ఈ అద్వైత లక్షణాలు. అదే మహాపరమేశ్వర తత్వం. మహాకాలాగ్ని స్వరూపం ఈశ్వరుడు. 


'ద్వైతం కల్పితం'. సకల చరాచర సృష్టి, కదలీ కదలక కదలే కదలికలకు కారణం ఈ ద్వైతం. అదే మహాశక్తి స్వరూపం.

వ్యక్తా అవ్యక్త స్వరూపమైన శివశక్తిల శక్తిపుంజః స్వరూపమే సుబ్రహ్మణ్యుడు....


*సుబ్రహ్మణ్యేశ్వరస్వామి / కుమార స్వామి వారి వైభవం:*


షణ్మతాలలో కుమారోపాసన (సుబ్రహ్మణ్యోపాసన) ఒకటి. మిగిలినవి సౌర, శాక్త, వైష్ణవ, గాణాపత్య, శైవములు. అయితే అగ్ని గర్భుడు అని పేరు ఉన్న సుబ్రహ్మణ్యారాధన అగ్ని ఉపాసనతోనే జరుగుతుందని శాస్త్ర వాక్యము. అందుచేతనే పంచాయతన పూజలో ప్రత్యక్షంగా సుబ్రహ్మణ్య స్వామి వారి మూర్తి ఉండదు. అయితే దీపారాధన శివశాక్త్యాత్మకుడైన అగ్నిసంభవుడైన సుబ్రహ్మణ్యుని ఆరాధించడమేనని పెద్దలు చెప్తారు. ఈ విధంగా వైదిక ధర్మం లో సుబ్రహ్మణ్యోపాసన చెప్పబడింది.


మనకి వైదిక వాఙ్మయంలో కుమార అనే నామం వినగానే గుర్తుకు వచ్చేది కేవలం బుజ్జి విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడే. సుబ్రహ్మణ్య గణపతులు పరబ్రహ్మ స్వరూపులేకాక, “కుమార”తత్వానికి ప్రతీక. జగత్తులో మాతాపితృ తత్వానికి ప్రతీక పార్వతీ పరమేశ్వరులు. (లేదా లక్ష్మీ నారాయణులు... ఎలా పిలిచినా ఒకటే). అవ్యక్తం, వ్యక్తం, మహత్, అహంకారం ఈ నాలుగు పంచభూతాత్మక జగత్తుకి ఆధారం. ఇందులో అమ్మవారు-అవ్యక్తం, అయ్యవారు-వ్యక్త స్వరూపాలకు సంకేతం అయితే, గణపతి-మహత్తత్వం, కుమారస్వామి-అహంకారం. అహంకార తత్త్వం ఉండడం వల్లనే ఈ సకల జగత్తు సృష్టింపబడినది అని చెప్తారు పెద్దలు. నిజానికి ఒకే పరతత్వం యొక్క నాలుగు భూమికలివి.


ఇక్కడ అహంకారం అంటే లోకంలో అనుకునే గర్వం అనే భావం కాదు. నేను అనే స్పృహను అహంకారం అంటారు. ఈశ్వరుని పరంగా ఈ భావం ఉంటుంది. ఇక్కడి నుంచే సృష్టి విస్తృతి ప్రారంభం అవుతుంది. చైతన్యం యొక్క లక్షణం అహంకారం. ఈ సృష్టిలో కృత్రిమంగా, యాంత్రికంగా, వైజ్ఞానిక సాంకేతికంగా మానవుని మెదడు వంటి జ్ఞాపక శక్తి కల యంత్రాన్ని తయారు చేయవచ్చునేమో కానీ, దానికి “నేను చేస్తున్నాను” అనే అహంభావం, స్పందన ఇవ్వలేము. అది కేవలం స్వాభావికమైన సృష్టి లక్షణం. అనుభూతులకీ, ఆలోచనలకీ, స్పందనలకీ కేంద్రం ఈ అహం తత్వమే.


ఈ 'అహం'తత్వానికి ప్రతీక సుబ్రహ్మణ్యుడు. రహస్యంగా అందరిలోనూ ప్రకాశించే పరమాత్మ చైతన్యమిది కనుక ‘గుహ’ అన్నారు స్వామిని. శివతేజస్సు నుండి ఉద్భవించిన వాడు కనుక జ్ఞానతత్త్వం కలిగి ‘గురుగుహ’ అని స్వామికి నామం. అసలు స్వామి అనే మాట అమరకోశం ప్రకారం ఒక్క సుబ్రహ్మణ్యుడిదే. ఎందుచేతనంటే “దేవసేనాపతీ, శూరః, స్వామీ, గజముఖానుజః “ అని అర్ధంగా ఇవ్వబడినది.


పురుషోవిష్ణు రిత్యుక్తః శివోనానామతః స్మృతః I

అవ్యక్తం తు ఉమాదేవీ శ్రీర్వా పద్మ నిభేక్షణా II

తత్ సంయోగా దహంకారః స చ సేనాపతిరుహః I


పరమ పురుషుడు శివుడు లేక విష్ణువు. అవ్యక్త శక్తి ఉమాదేవి లేక లక్ష్మీదేవి. వీరిరువురి సమైక్య సమన్వయ తత్వమూర్తి కుమారస్వామి అని స్కాంద పురాణం చెబుతోంది.


అంటే కుమారస్వామిని పూజిస్తే శివశక్తుల్నీ, లక్ష్మీనారాయణులనీ కలిపి అర్చించినట్లే. ప్రకృతీ పురుషుల ఏకత్వం కుమార స్వామి తత్త్వం.


కుమార జననంలోనే అనేక తాత్త్విక మర్మాలు ఉన్నాయి. పరతత్వం-అవ్యక్తం నుండి జగద్రూపం తీసుకొనే పరిమాణ క్రమం కుమార జననంలో కనబడుతుంది. అమోఘమైన శివతేజాన్ని పృథ్వి, అగ్ని, జలం (గంగ), నక్షత్ర శక్తి (షట్ కృత్తికలు) ధరించి చివరకు బ్రహ్మతపోనిర్మితమైన శరవణం (రెల్లు తుప్ప) లోంచి ఉద్భవించినవాడు కనుక శరవణభవుడు అయ్యాడు అయ్యాడు.


కాలస్వరూపం: వేదాలలో షణ్ముఖీయమైన సంవత్సర స్వరూపంగా స్వామిని వర్ణించారు. కాలాగ్ని స్వరూపమే ఇది. కాలాగ్నిరుద్రుడైన శివుని తేజమే ఈ సంవత్సరాగ్ని. ఆరు ముఖాలు - ఆరు ఋతువులు. పన్నెండు చేతులు - పన్నెండు మాసాలు. ఇదీ సంవత్సరాగ్ని రూపం. ఈ రూపం చిత్రాగ్ని అనే నెమలిపై ఆసీనమయ్యింది. వివిధ వర్ణాలను వెదజల్లే కాంతి పుంజమే ఈ నెమలి.


 శివజ్ఞానప్రదాయిని అయిన అమ్మవారు ప్రసాదించిన దివ్యాయుధమిది. ఇదే అజ్ఞానమనే తారకాసురుని సంహరించిన జ్ఞానశక్త్యాయుధము. “జ్ఞానశక్త్యాత్మా” అనేది స్వామి వారి నామాలలో ఒకటి. ఇఛ్చా, జ్ఞాన, క్రియా అనేమూడు శక్తుల మయమైన శక్తిని ధరించిన జ్ఞానశక్తి స్వరూపుడు, జ్ఞానయోగంలో సాక్షాత్కరించే శివశక్త్యాత్మక తేజః పుంజం – కుమారస్వామి. ఆరుకోణాల చక్రం -  బహుముఖీయమైన ప్రజ్ఞకు సంకేతం కనుక కవిత్వానికీ, ప్రతిభకీ, ఆధారశక్తిగా కూడా కుమారస్వామి ఉపాసన చెప్పబడినది. “షణ్ముఖీ ప్రతిభ” ప్రసాదించే ఈ కార్తికేయుని ‘కవి’గా పేర్కొన్నాయి శాస్త్రాలు.


“పుట్టన్ బుట్ట శరంబునన్ మొలువ” అనే పద్యంలో పోతన గారు…”కావ్య రచనా సామర్ధ్యానికి నేను వాల్మీకిని కాను (పుట్టన్ బుట్ట), శరవణభవుణ్ణి కాను (శరంబునన్ మొలువ)” అంటూ ప్రార్ధించారు. ఈ మాటలో కూడా కవితా శక్తి నిధిగా స్కందుడోచరిస్తున్నాడు. శివతేజం స్కన్నమై వచ్చి రూపుకట్టిన దైవం కనుక ఈయన స్కందుడు. రామాయణంలో యాగరక్షణకు రామలక్ష్మణులు విశ్వామిత్ర మహర్షితో వెళుతుండగా, మార్గమధ్యంలో స్కందోత్పత్తి (సుబ్రహ్మణ్య జనన ఆఖ్యానము) వివరిస్తారు మహర్షి.


కార్తికేయ భక్తులు ఇహలోకంలో ఆయుష్మంతులై పుత్రపౌత్రులతో వర్ధిల్లి అంత్యమున స్కంద సాలోక్యాన్ని పొందుతారు. ఓ రామా! ఈ కుమారసంభవం “ధన్యపుణ్యగాథ” అని విశ్వామిత్రుని మాట (వాల్మీకి రామాయణం – బాలకాండ).

ఏషతే రామ గంగాయా విస్తరోమయా I

కుమారసంభవశ్చైవధన్యం పుణ్యస్తథైవ చ II

భక్తశ్చయః కార్తికేయే కాకుత్ స్థ భువిమానవాః I

ఆయుష్మాన్ పుత్రపౌత్రశ్చ స్కందసాలోక్యతాం వ్రజేత్ II


మహాభారతంలో కూడా ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామి వారి జనన గాథ, తారకాసుర సంహారం అద్భుతంగా వర్ణించారు వ్యాసమహర్షి. ధర్మరాజుగారికి మార్కండేయ మహర్షి చెప్తారు సుబ్రహ్మణ్య జనన వైభవం గురించి. ఇక్కడ మనం గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే అటు శ్రీరామాయణం లోనూ, ఇటు మహాభారతంలోనూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జననం గురించి ఇవ్వడంలో రహస్యం సాధకులగా మనం గురువుల నుంచి తెలుసుకోవలసిన విషయం. రామాయణం లో రామచంద్రప్రభువుకి స్కందోత్పత్తి చెప్పడంలో ఉద్దేశ్యం ఏమిటంటే, సుబ్రహ్మణ్యుడి యొక్క శక్తి రాముడిలో ప్రవేశించాలి. అది రావణ సంహారమునకు అవసరము. సుబ్రహ్మణ్య స్వామి వారిని అందుకే ఆంగ్ల భక్తులు “The God of War” అని సంబోధిస్తారు. దేవతలకు రాక్షసులకు, మంచికి చెడుకి, రాముడికి-రావణుడికి, పాండవులకి-కౌరవులకి మధ్య జరిగే యుధ్ధములలో దేవతా సైన్యం విజయం సాధించాలంటే, దేవసేనాపతి అయిన సుబ్రహ్మణ్య స్వామి వారి శక్తి అవసరము. ఇక్కడ ఇలా చెప్పడంలో రాముడిని తక్కువ చేయడం నా ఉద్దేశ్యం కాదు…అసలు విషయం ఏమిటంటే సుబ్రహ్మణ్య స్వామి వారు యజ్ఞ తత్వమునకు ప్రతీక, అలాగే శ్రీ మహావిష్ణువు కూడా యజ్ఞపురుషుడిగానూ, యజ్ఞతత్వమునకు ప్రతీక గానూ విష్ణు సహస్ర నామాలలో అభివర్ణించబడినది. అందులోనే శ్రీమహావిష్ణువుకి “స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః” అనే నామాలు ఉన్నాయి, అంటే స్కందుడు అన్నా, సుబ్రహ్మణ్యుడు అన్నా, మహావిష్ణువు అన్నా ఒకటే తత్వం అని అర్ధం.  మరి విష్ణువే రాముడు కదా, ఆయనకి విశ్వామిత్ర మహర్షి సుబ్రహ్మణ్య తత్వం బోధించడంలో ఏమిటి రహస్యం అంటే రాముడు అవతార ప్రయోజనం కోసం సాధారణ మానవుడిగా వచ్చాడు, అప్పుడు ఆయన రావణ సంహారం చేయడానికి అవసరమైన సకల అస్త్ర శస్త్రములతో పాటుగా, యుధ్ధ వీరుడైన సుబ్రహ్మణ్యుని శక్తిని కూడా రాముడిలో ప్రవేశ పెట్టడమే విశ్వామిత్రుల వారి ఆంతర్యము. ఇదే విషయం భారతంలో ధర్మరాజు గారికి సుబ్రహ్మణ్య వైభవం, తారకాసుర సంహారం చెప్పబడడలోనూ వర్తిసుంది.


అయితే రామాయణం లోనూ, మహాభారతంలోనూ, శివమహాపురాణంలోనూ, స్కాందపురాణంలోనూ చెప్పబడ్డ సుబ్రహ్మణ్య స్వామి జనన, లీలా విశేషాలలో చిన్న చిన్న వ్యత్యాసాలు కనిపించవచ్చు. కానీ, అవి అన్నీ సత్యాలే. ఒకే కుమారసంభవమును అనేక కోణాలలో మహర్షులు దర్శించారు.


కుమారస్వామి వారి పేరు చెబితే మనందరికీ గుర్తుకు వచ్చే ఒక గొప్ప కావ్యం…..”కుమారసంభవం”. మహాకవి కాళిదాసు గారు రచించిన ఈ కుమారసంభవం మొత్తం ఎక్కడ చూసినా సుబ్రహ్మణ్యుడి ప్రసక్తి ఉండదు. కేవలం శివ పార్వతుల కళ్యాణ ఘట్టం వరకు చెప్పి ముగిస్తారు కాళిదాసు. శివ పార్వతుల ఏకత్వమే కుమారుని సంభవం.


అష్టాదశపురాణాలలో లక్ష శ్లోకాలు ఉన్న పురాణం స్కాందపురాణం. ఈ పురాణం పరమశివుడి నుంచి స్కందుడు విన్నాడు, అందుకే స్కాంద పురాణం అయ్యింది. తంత్ర శాస్త్రంలో కూడా వివిధ సుబ్రహ్మణ్య స్వరూపాలు చెప్పబడ్డాయి.


ఉత్థిత కుండలినీ శక్తికి ప్రతీకగా సుబ్రహ్మణ్యుడిని సర్పరూపంలో ఆరాధిస్తారు. సుబ్రహ్మణ్యస్వామి వారి ఇద్దరు భార్యలు అంటే ఇక్కడ లౌకికమైన భార్యలు అని కాదు. వల్లీ అమ్మ వారు కుండలినీ శక్తికి ప్రతీక. ఆ శక్తి చలనానికి ఆగమనంలో ప్రాకే నాదశక్తికి ప్రతీక వల్లీ అమ్మ. మనందరిలోనూ కుండలినీ శక్తి మూడున్నర అడుగుల చుట్ట చుట్టుకుని మూలాధార చక్రము నందు ఉంటుంది. అయితే ఆ కుందలినీశక్తిని కదపడం అనేది కేవలం సమర్ధుడైన గురువు పర్యవేక్షణలో తప్ప ఎవరూ సొంత ప్రయోగాలు చేయకూడదని పెద్దలు చెప్తారు.

ఇక దేవసేనా అమ్మ వారు అంటే, ఇంద్రియశక్తులే దేవసేన. కాదు కాదు సకల సృష్టిలో ఉన్న positive energy కి ప్రతీక. వల్లీ, దేవసేనా అమ్మలు ఇద్దరూ చైతన్య స్వరూపుడైన సుబ్రహ్మణ్యుడికి పత్నులు.


“నీవంటి దైవము షడానన! నేనెందుకు కాననురా! మారకోటులందు గల శృంగారము, ఇందుముఖా! నీ కొనగోటను బోలునే!” అని స్కందుని కీర్తించారు నాదబ్రహ్మ త్యాగరాజ స్వామి. అలాగే శ్రీముత్తుస్వామి దీక్షితార్ గారు సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం పొంది, స్వామి అనుగ్రహం పొందిన మహనీయుడు. ప్రఖ్యాత ఆరుపడైవీడు క్షేత్రములలో ఒకటైన ‘తిరుత్తణి’ లో కుమారస్వామి ఒక వృధ్ధ గురురూపంలో కనిపించి “ముత్తుస్వామి దీక్షితార్! ఏదీ నీ నోరు తెరూ…అని చెప్పి ఆయన నోటిలో పటికి బెల్లం వేసి” వెళ్ళిపోయారు. దీక్షితార్ కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ స్వామి లేరు. అప్పటి నుంచే దీక్షితార్ గారు ఆసువుగా సంగీత, సాహిత్య, మంత్రశాస్త్ర, నాదరహస్యాలు కలబోసిన అనేక దివ్యమైన కృతుల్ని చేశారు. ప్రతీ కీర్తనలో ‘గురుగుహ’ అనే నామముతో ముద్రాంకితం చేశారు. “శ్రీగురుగుహ తారయాశు మాం శరవణభవ! శ్రీగురుగుహ తారయాశు మాం శరవణభవ!”, “స్వామినాథ! పరిపాలయాశు మాం స్వప్రకాశ! వల్లీశ! గురుగుహ! దేవసేనేశ!” ఇలా ఎన్నెన్నో కీర్తనలను స్వామివారిపై కీర్తించారు.


అలాగే తమిళనాట విశేష సుబ్రహ్మణ్యారాధన చేస్తారు. అరుణగిరినాథర్ అనే గొప్ప భక్తుడు సుబ్రహ్మణ్యానుగ్రహముతో తిరుప్పుగళ్ అనే పేరుతో కొన్ని వేల కీర్తనలు చేశారు.


చివరిగా నడిచేదేవుడు, కంచికామకోటి పీఠాధిపతి పరమాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర మహాస్వామి వారి మాటలలో చెప్తే, ఉపాసనలో పరమశివుడికి కొన్ని ఇష్టం, అలాగే అమ్మ వారికి కొన్ని ఇష్టం, భక్తులు అమ్మకి అయ్యకి ఇద్దరికీ కలిపి పూజ చేయాలి అంటే కేవలం సుబ్రహ్మణ్యస్వామి వారికి పూజ చేస్తే చాలుట. ఒకేసారి శివపార్వతులను పూజించినట్లే. అదీ కుమార తత్వం. ఇక్కడే కుమార తత్వం గురించి మరో చక్కని మాట విన్నాను. పరమశివుడు ఎప్పుడూ తనలోతానే రమిస్తూ ఉంటాడు కదా, ఆయనకి అవతారాలు ఎత్తడం అవీ ఉండవు. మనకి బాలకృష్ణుడు ఉన్నాడు, అలాగే బాలరాముడు ఉన్నాడు, మరి బాలశంకరుడిని ఎక్కడ చూడగలం? అంటే పరమశివుడు చిన్నపిల్లవాడైతే….అదే మన బుజ్జి సుబ్రహ్మణ్య స్వామి. అటువంటి ముద్దులొలికే నా చిట్టి తండ్రి, మూర్తీభవించిన అందం, తేజస్సు, చిరునవ్వు, అచ్చం అమ్మ పోలికలో ఉండే కారుణ్యమూర్తి, నను గన్న తండ్రి, భక్తుల వరాలను ఇట్టే తీర్చే కామధేనువు, సంతానము లేనివారికి సత్సంతాన భాగ్యం ప్రసాదించే అభయప్రదాత, ఇహమునందు సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి, అంత్యమున తనలో కలుపుకునే స్వామి….

శ్రీసుబ్రహ్మణ్య స్వామి.


🕉🌞🌏🌙🌟🚩

శ్రీ సత్యనారాయణ వ్రత మహాత్మ్యము

 శ్రీ సత్యనారాయణ వ్రత మహాత్మ్యము 


        సత్యనారాయణ సద్వ్రతక్రియను 

        నాల్గు వర్ణంబుల నరులు యెల్లరును 

        వఱలిన భక్తితో వనితలుగూడ 

        చేయంగవచ్చును స్థిరచిత్తమునను 

        పౌరాణ వైదిక ప్రక్రియందునను 

        యరయ బ్రాహ్మణులంత యర్చించవలయు 

        బ్రాహ్మణేతరులంత పౌరాణికముగ 

        సత్యదేవునివ్రతము సల్పంగవలయు 

        ఏ దినమున నైన యీ సత్యవ్రతము 

        సాయంత్రవేళలో సల్పుటుత్తమము 

        సత్యనారాయణ సద్వ్రతమునకు 

        బ్రాహ్మణవర్యులన్ బంధుమిత్రులను 

        ప్రీతిపాత్రంబుగా పిలుచుకోవలయు 

        కదళీఫలంబులు ఖండచెక్కరయు 

        గోక్షీర గోఘృత గోధుమనూక 

        బియ్యపునూకైన బెల్లంబుతోడ 

        కలిపి ప్రసాదంబు గావించవలయు 

        అత్యంత భక్తితో యా ప్రసాదమును 

        నైవేద్యమొనరించి నారాయణునకు 

        యంత తాంబూలంబు నర్పించవలయు 

        ఆ సత్యవ్రతపు యధ్యాత్మకథను 

        నాలకించవలయు నతిభక్తితోడ 

        సద్భక్తితోడను తదుపరందఱును 

        తీర్థ ప్రసాదముల్ తీసుకోవలయు 

         తదుప రాహూతులౌ సద్బ్రాహ్మణులకు 

         విరివిగా దక్షిణ లీయంగవలయు 

         పిదప బ్రాహ్మణులతొ ప్రియబాంధవులతొ 

         భోజనంబును ప్రీతి భుజియించవలయు 


         భోజనకార్యంబు పూర్తైన పిదప 

         సత్యదేవునిహృది సంప్రీతికొఱకు

         యధ్యాత్మికానంద మనుభవించుటకు 

         సంగీత నృత్యాది సత్కార్యములను 

         సద్భక్తితోడను జరిపించవలయు 

         భక్తితో భజనలో పాల్గొనవలయు 


         సత్యనారాయణ సద్వ్రతమిట్లు 

         యానందడెందాన నాచరించినచొ 

         సకలవాంఛాసిద్ధి సమకూరు నిలలొ 

         ఇహపర సౌఖ్యముల్ యిచ్చునీ వ్రతము 

         కడువెతలుండెడి కలియుగమందు 

         యిహమందు రక్షణ యిచ్చి కాచుటకు 

         పరమందు మోక్షంబు బడయజేయుటకు 

         సత్యనారాయణ సద్వ్రతమెపుడు 

         మానవులొనరించి మనుచుంద్రుగాక ! " 19


తే. నరుల బాధలు బాపగ నారదుండు 

     వేడుకొనగను కరుణించి విష్ణుమూర్తి

     సత్యనారాయణస్వామి సద్వ్రతంబు 

     స్వయముగారీతి బోధించె సర్వులకును 20


క. మునిసూతుం డావిధముగ 

    శౌనక ఋషిపుంగవులకు సత్యవ్రతమున్ 

    వినయంబున బోధించగ 

    వినిరందఱు సంతసమున వీనులుపొంగన్ 21


       మొదటి అధ్యాయము సమాప్తము 


                                         సశేషము …..

ప్రశ్న కుండలి - అరోగ్య ఫలితము

 #భువనేశ్వరిపీఠం

ప్రశ్న కుండలి - అరోగ్య ఫలితము


మానవుడు తన నిత్యకార్యకలపాలు సాధించాలంటే ఆరోగ్యంగా ఉండాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అయితే మానవుని శరీరము యంత్రము లాంటిది. ఆ యంత్రానికి కొన్ని సమయాల్లో చిన్న చిన్న సమస్యలు ఏర్పడవచ్చు. అంటే ఆరోగ్య సంబంధ సమస్యలు ఎదురు అవుతాయి. అయితే వ్యాధి తొందరగా మెరుగుపడకుంటే చింత ఏర్పడుతుంది. నిత్య కార్యకలపాలకు ఆటంకం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఈ చింతను దూరము చేయుటకు స్వాస్త లాభము ఎప్పుడు కలుగుననేది ప్రశ్న కుండలి ద్వారా లెక్కించడం సాధ్యపడుతుంది.


త్వరగానే రోగ నివారణ యోగము


లగ్నాదిపతి నుంచి రోగ నివారణ

లగ్నములో స్థితిలో ఉన్న బలమైన గ్రహములు తొందరగానే అరోగ్యం కుదుటపడును. యది లగ్నాదిపతి, దశమాదిపతి మిత్రులుగా సమన్వయం ఉంటే కూడా ఆరోగ్య స్థితిలో మంచి మార్పు ఏర్పడును. చతురాదిపతి, సప్తమాదిపతి మధ్య మిత్రుత్వం ఉంటే కూడా రోగికి త్వరగానే ఆరోగ్యం కుదుటపడును. లగ్నాదిపతి యొక్క చంద్రునితో సంబంధం ఉండి, చంద్రుడు శుభ గ్రహముల ప్రభావములో లేదా కేంద్రములో స్థితిలో దానివలన కూడా తొందరగానే అరోగ్యంలో మంచి మార్పు ఏర్పడుతుంది. అంతేకాదు శుభ గ్రహాల ప్రభావం వల్ల కేంద్రంలో లగ్నాదిపతి, చంద్రుని స్థితి శీఘ్ర లాభమును కలిగించును. ఈ యోగంలో సప్తమాదిపతి వక్రి కాకుండా ఉండాలి. సప్తమాదిపతి సూర్యుడు, అష్టమ భావములోని స్వామి వలన ప్రభావితం కాకుండా ఉండాలి.


చంద్రుని ద్వారా రోగ నివారణ

స్వరాశి లేదా ఉచ్చరాశిలో బలమైన చంద్రుడు ఏదో ఒక శుభ గ్రహంతో సంబంధాన్ని కలిగి ఉంటే, రోగి త్వరగానే కోలుకోగలుగుతాడు. చంద్రుడు యది చర లేదా ద్విస్వభావం రాశిలో ఉండి లగ్నం లేదా లగ్నాదిపతి ద్వారా దృష్టి కలిగి ఉంటే కూడా త్వరగా ఆరోగ్యం మెరుగు పడుతుంది. చంద్రుడు యది స్వరాశిలో లేదా దశమ భావ స్థితిలో ఉన్న కూడా పైన చెప్పిన లాభ ఫలితాలే కలుగుతాయి. శుభ గ్రహాల దృష్టి చంద్రుడు లేదా సూర్యునితో 1, 4 లేదా 7వ భావ స్థితిలో ఉంటే కూడా త్వరగానే ఆరోగ్య లాభం చేకూరుతుంది.


త్వరగా ఫలితాలు కలిగించే యోగాలు

ప్రశ్న జ్యోతిష్య ఆధారంగా యది లగ్నాదిపతి - దశమాదిపతి మధ్య లేదా, చతురాధిపతి - సప్తమాదిపతి మధ్య శత్రుత్వం ఉంటే రోగం అధిగమించును. కుండలిలో షష్టమాదిపతి ద్వారా వ్యాధిని అంచనా(లెక్కించెదరు) వేస్తారు. యది ప్రశ్న కుండలిలో షష్టమాదిపతి, అష్టమాదిపతి, దశమాదిపతి మధ్య సంబంధాలు కలిగి ఉంటే ఆరోగ్య లాభం కలుగడంలో అవకాశాలు తక్కువ ఉంటాయి. లగ్నంలో చంద్రుడు లేదా శుక్రుడు యొక్క ఉపస్థితి ఉండుట వల్ల త్వరగా రోగ నివారణకు అవకాశాలు ఉండవు. ప్రశ్న కుండలిలో లగ్నాధిపతి, కుజుడు యుతి కలిగి ఉండుట కూడా అరోగ్య లాభమునకు ఫలదాయకముగా వుండదు. ద్వాదశ బావములో లగ్నాదిపతి స్థితిలో ఉంటే గనక రోగి ఆలస్యంగా వ్యాధి నుంచి బయటపడగలడు. అంతేకాదు యది లగ్నాదిపతి షష్టమ, అష్టమ బావలలో స్థితిలో ఉన్నా.. అష్టమాదిపతి కేంద్ర స్థితిలో ఉన్నా.. రోగి త్వరగా కోలుకోలేడు.


12 బావములు, శారీరక భాగములు

కుండలిలో 12 బావములు శరీరంలో విభిన్న అంగాలను లెక్కించును. అన్ని భావాలు రోగాలలో ఏదైన ఒక స్థానమును సూచించును.


తొలి బావము : తల, మెదడు, నరాలు

ద్వితీయ బావము : ముఖం, కంఠం, పీక, కళ్ళు

తృతీయ బావము : భుజములు, రొమ్ము, జీర్ణాశము, శ్వాసము, నరాలు, చేయి

చతుర్ధ బావము : స్థనములు, పై అగ్న క్షేత్రము, పై పాచక తంత్రము

పంచమ బావము : హృదయం, రక్తం, వీపు, రక్త సంచార తంత్రం

షష్టమ బావము : నిమ్న ఉదరం, నిమ్న పాచక తంత్రం, నడుము, ఎముకలు, మూత్రాశయం

సప్తమ బావము : ఉదరీయ గుహిక, మూత్రపిండం

అష్టమ బావము : గుప్త అంగం, స్తవిక్రియ, జీర్ణ నాళికలు, మలాశయం, మూత్రాశయం, వెన్నుముక

నవమ బావము : తొడలు, తిత్తులు, ధమని ప్రక్రియ

దశమ బావము : మోకాళ్ళు, ఎముకలు, నరాలను చేర్చుచోటు

ఏకాదశ బావము : కాళ్ళు, పాదమును కాలితో చేర్చు ఎముక మరియు శ్వాసము

ద్వాదశ బావము : కాళ్ళు, రుచి సంబంధమైన ప్రక్రియ, కళ్ళు.....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్:- 9866193557

దుర్గా సప్తశతి

 *🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 19  / Sri Devi Mahatyam - Durga Saptasati - 19 🌹*

✍️. మల్లికార్జున శర్మ 

📚. ప్రసాద్ భరద్వాజ 


*అధ్యాయము 5*

*🌻. దేవీ దూతసంవాదం - 4 🌻*


83-84. ఋషి పలికెను : 

రాజా! దేవతలు ఇలా స్తోత్రాదు లొనర్చుచుండగా, పార్వతీదేవి గంగాజలాలలో స్నానార్థం అచటికి వచ్చింది.


85. అందమైన కనుబొమలతో ఆమె “మీరు ఇప్పుడు స్తుతించింది ఎవరిని?” అని అడిగింది. ఆమె శరీర కోశం నుండి శుభమూర్తియైన ఒక దేవత ఉద్భవించి ఆ ప్రశ్నకు ఇలా బదులు చెప్పింది.


86. శుంభాసురునిచే తిరస్కరించబడి, నిశుంభునిచే యుద్ధంలో ఓడించబడిన దేవతాగణం ఈ స్తోత్రాన్ని నన్ను గూర్చి చేసారు”.


87. ఆ అంబిక పార్వతీశరీర కోశం నుండి వెలువడింది కనుక ఆమెను "కౌశికి” అనే పేరుతో లోకాలన్ని కీర్తించాయి.


88. ఆమె వెడలివచ్చిన పిమ్మట పార్వతి నల్లనై కాళికా నామంతో పేర్కొనబడుతూ, హిమాచలంపై నివాసం ఏర్పరచుకుంది.


89. అంతట అత్యంత మనోహర రూపాన్ని ధరించి ఉన్న అంబికను (కౌశికిని) శుంభనిశుంభ భృత్యులైన చండముండులు చూసారు.


90. వారు ఇరువురూ శుంభునితో “మహారాజా! అత్యంత మనోహరరూప అయిన ఒకానొక స్త్రీ హిమాలయ పర్వతాన్ని ప్రకాశింప జేస్తూ అచట ఉంది.


91. అట్టి అత్యుత్తమ సౌందర్యాన్ని ఎవరూ ఎక్కడా చూసి ఎరుగరు. అసురేశ్వరా! ఆ దేవి ఎవ్వరో కనుగొని ఆమెను తెచ్చుకో!


92. అత్యంత మనోహరాంగాలు గల ఆ స్త్రీరత్నం తన తేజస్సుతో దిశలను ప్రకాశవంతాలు చేస్తూ అచట ఉంది. దైత్యేశ్వరా! నీవు ఆమెను చూసితీరాలి.


93. ప్రభూ! ముల్లోకాలలో గల రత్నాలను, మణులును, గజాశ్వాదులును అన్ని ఇప్పుడు నీ ఇంట ఉన్నాయి. 


94. గజరత్నమైన ఐరావతం ఇంద్రుని నుండి తేబడింది. అట్లే ఈ పారిజాత వృక్షం, ఉచ్చైశ్రవమనే గుఱ్ఱం కూడా (తేబడ్డాయి).


95. పూర్వం బ్రహ్మదిగా ఉన్న హంసలతో ప్రకాశించే ఈ అద్భుత విమానం, రత్నసమానమైనది, నీ ముంగిటిలో ఉంది.


సశేషం....

🌹 🌹 🌹 🌹

*జిడ్డు కృష్ణమూర్తి సంబంధ 14 పుస్తకాలు(PDF

 *జిడ్డు కృష్ణమూర్తి సంబంధ 14 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------


14 పుస్తకాలు ఒకేచోట! https://www.freegurukul.org/blog/jiddukrishnamurthi-pdf/


               (OR)


కృష్ణమూర్తి తత్త్వం www.freegurukul.org/g/JidduKrishnamurthi-1


తెలివిడి నుంచి స్వేఛ్చ www.freegurukul.org/g/JidduKrishnamurthi-2


ఈ విషయమై ఆలోచించండి-2 www.freegurukul.org/g/JidduKrishnamurthi-3


మహాతాత్వికుడు జిడ్డు కృష్ణమూర్తి అవగాహన www.freegurukul.org/g/JidduKrishnamurthi-4


శ్రీలంక సంభాషణలు www.freegurukul.org/g/JidduKrishnamurthi-5


నిరంతర సత్యాన్వేషి కృష్ణమూర్తి తత్త్వదర్శన కరదీపిక www.freegurukul.org/g/JidduKrishnamurthi-6


స్వీయ జ్ఞానం www.freegurukul.org/g/JidduKrishnamurthi-7


ఈ విషయమై ఆలోచించండి-1 www.freegurukul.org/g/JidduKrishnamurthi-8


గతం నుండి విముక్తి www.freegurukul.org/g/JidduKrishnamurthi-9


నీవే ప్రపంచం www.freegurukul.org/g/JidduKrishnamurthi-10


జిడ్డు కృష్ణమూర్తి అవగాహన-1 www.freegurukul.org/g/JidduKrishnamurthi-11


జిడ్డు కృష్ణమూర్తి జీవితము-భాషణము www.freegurukul.org/g/JidduKrishnamurthi-12


మన జీవితాలు www.freegurukul.org/g/JidduKrishnamurthi-13


ముందున్న జీవితం www.freegurukul.org/g/JidduKrishnamurthi-14


జిడ్డు కృష్ణమూర్తి గారి పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.


మరింత సమాచారం కోసం:

ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్

Website: www.freegurukul.org

Android App: FreeGurukul 

iOS App: Gurukul Education  

Helpline: 9042020123

*To Join In WhatsApp Group*: To get this type of Spiritual, Inspirational, PersonalityDevelopment messages daily, join in group by this link www.freegurukul.org/join

వడ్డించేటప్పుడు

 🌹🌹🌹🌹🌹

ప్రశ్న :

వడ్డించేటప్పుడు కూడా మనవాళ్ళు పదార్థాలు ఏ వైపున వడ్డించాలో, ఎలా వడ్డించాలో చెపుతుంటారు. ఆ నియమాలేమిటి? ఎందుకా నియమాలు?


జవాబు ::

మన ప్రాచీనుల ద్రుష్టిలో అన్నం తినడం కేవలం కడుపు నింపుకోవడం కాదు. అనేక మంది దేవతా శక్తుల పభావం అన్నంపై ఉంటుంది. జీవకోటికి దేహ, మనః, ప్రాణాలను సమకూర్చే అన్నాన్ని పవిత్రం చేసుకోవడం వల్ల జీవితం శుద్ధమై సిద్ధులను పొందగలము. అందుకే నియమాలు. అరటి ఆకును వేసేటప్పుడు ఈనె తీయకూడదు. ఆకు చివరి భాగం ఎడమవైపుగా ఉండేటట్లు పెట్టుకోవాలి. విస్తరిలో మొదట ఎదురుగా కూరలు, కూరలు వడ్డన అయిన తరువాత విస్తరి మధ్యలో అన్నం, ఆ పిమ్మట విస్తరిలో కుడివైపున పాయసం, పప్పు, ఎడమవైపున పిండివంటలు, చారు, చివరకు పెరుగు వడ్డించాలి. భోజనం ప్రారంభించక ముందే ఉప్పును వడ్డించకూడదు. పాయసాన్ని, నేతినీ ముందుగానే వడ్డించాలి. పూర్ణిమ, అమావాస్యలలో రాత్రిపోట భోజనం చేయరాదు. వడ్డన అయిన పిమ్మట అన్నాన్నీ, పిండివంటలనూ, పాయసాన్నీ ఘ్రుతంతో అభిఘరించాలి. కూరలు, పచ్చళ్ళను అభిఘరించనవసరం లేదు.

🌹🌹🌹🌹🌹

"ఇస్లాం మామతం

 *"ఇస్లాం మామతం" కానీ "రామాయణం మాసంస్కృతి"* 


ఒకసారి పాకిస్తానీ నియంత జనరల్ జియావుల్ హక్ ఇండోనేషియా వెళ్ళాడు...

 

అది ఒక ముస్లిందేశమని అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు సైన్యశిక్షణానంతరం ఉండే Passing Out Parade కి జియావుల్ హక్ ని ముఖ్య అతిథి గా ఆహ్వానించారు...


ప్రతీ అధికారి హనుమంతుని విగ్రహం ముందు పెరేడ్ చేస్తున్నాడు. 

ఆ విగ్రహం ముందే శపథం స్వీకరిస్తున్నాడు. 

ఇది చూసిన జియావుల్ కి ఒళ్ళు మండిపోయింది. 

అక్కడి సైన్యాధికారిని ఇదేమిటని అడిగాడు. అతను ఎంతో గర్వంతో - 

 *"తాము మతాన్ని మార్చుకున్నామేగానీ ,* 

 *మా సంస్కృతిని , పూర్వీకులను మార్చుకోలేదు గదా!"*

 అని సమాధానమిచ్చాడు.


వాళ్ళు పరిరక్షిస్తున్న సంస్కృతి భారతీయులనుండి వారసత్వంగా గ్రహించినదే కదా!

 వాళ్ళే అంత శ్రద్ధ తీసుకుంటున్నపుడు భారతీయులమైన మనం , మన సంస్కృతీపరిరక్షణలో ఇంకెంత శ్రద్ధ వహించాలి???

 సెక్యులరిజం అనే గోలలో పడిపోయి , మతనిరపేక్షదేశం నుండి సంస్కృతీనిరపేక్ష దేశంగా ఎలా , ఎందుకు వెళ్ళిపోతున్నాము? 

మన సంస్కృతిని మనమే నిర్లక్ష్యం చేస్తున్నాము. 

ఎలాగో చెప్తాను . ఒక ఉదాహరణ చూపిస్తున్నాను.


 *1950వ దశకం లో* ఇండోనేషియా లో *అంతర్జాతీయ రామాయణమహోత్సవం* జరిగింది.

  అందులో భాగంగా జరిగే ఒక నృత్యనాటిక లో పాల్గొనుటకు కళాకారులను పంపమని ఆదేశం ప్రపంచదేశాలకు ఆహ్వానం పంపింది. 

కొన్ని ముస్లిందేశాలు కూడా కళాకారులను పంపాయి.

 కానీ *అప్పటి ప్రధాని నెహ్రూ -* *"మనది సెక్యులర్ దేశమనీ , అందువలన కళాకారులను పంపటం కుదరదు"*

 అని తెలిపాడు. 

అంటే *మనదేశ సంస్కృతీపరిరక్షణ కన్నా అతగాడికి సెక్యులరిజం ఎక్కువైపోయింది.* 

అయితే , 

 *ఆశ్చర్యంగా ఇందిరాగాంధీ* ఇంకొకపని చేసింది.

 మొరాకో రాజధానిలో జరిగే *అంతర్జాతీయ ముస్లిం సమ్మేళనానికి* అప్పటి *కేంద్రమంత్రి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ను పంపింది* .

 అసలు విషయమేమంటే - *మనకు అసలు ఆహ్వానం అందనే లేదు.* 

పైగా ఏమని సమర్థించుకుందో తెలుసా? చాలాముస్లిందేశాలకన్నా మనదేశంలో ముస్లింల జనాభా ఎక్కువట , కాబట్టి పంపక తప్పలేదట. 

మీరంతా తెలివైనవారు కాబట్టి నేను విషయాన్ని వివరించనవసరం లేదు. 


కొంత కాలం కిందట *ఇండోనేషియా దేశం యొక్క విద్య మరియు సంస్కృతీ శాఖామంత్రి అనీస్ బాస్వేదన్* మనదేశం వచ్చారు. 

ఏమన్నారో చూడండి -

 "మా దేశం రామాయణప్రదర్శన లకు పెట్టిందిపేరు. మా కళాకారులు సంవత్సరంలో రెండుసార్లు మీదేశంలోని వివిధ నగరాలలో పర్యటించి రామాయణప్రదర్శనలు చేయడానికి అనుమతించండి. మీ కళాకారులు కూడా మా దేశానికి రండి. ఇరుదేశాలు కలిసి ప్రదర్శనలు చేద్దాము. ఇరుదేశాల విద్యార్థులకు కూడా శిక్షణ ఇద్దాము. 

మా విద్యావిధానంలో రామాయణం ని చేర్చాము." ఈ విషయం మీ మనసుకి ఆహ్లాదాన్ని కలిగించిందా?లేదా? చెప్పండి. 

ఇండోనేషియా మొదటి రాష్ట్రపతి సుకర్ణో సమయంలో , పాకిస్థాన్ కు చెందిన డెలిగేషన్ ఒకటి అక్కడ పర్యటించింది. అపుడు వాళ్ళు రామలీల ప్రదర్శించడాన్ని చూసి షాక్ తిన్నారట. 

ఒక ముస్లిం దేశంలో రామలీలా? అని అడిగారట. దానికి సుకర్ణో సమాధానమేమిటో తెలుసా? ఆయన ఇలా అన్నారట - 

 *" ఇస్లాం మా మతం అంతే , కానీ రామాయణం మా సంస్కృతి."* 

వారి *కరెన్సీ నోట్ పై బొజ్జ గణపయ్య చిత్రం* ముద్రించారు


అటువంటి దేశాధ్యక్షుడికి , తమ సంస్కృతీ పరిరక్షణలో భారతీయులకు ఆదర్శంగా నిలుస్తున్న ఇండోనేషియా ముస్లింలకు శతకోటిప్రణామాలు. 🙏

దేవుడు

 *దేవుడు*

            

ఆల్బర్ట్ ఐన్స్టీన్ 

పలు అమెరికా  విశ్వవిద్యాలయాల కు వెళ్ళినప్పుడు అక్కడి వాళ్ళు ఆయనను "మీకు దేవుడి మీద నమ్మకం ఉందా" అని అడిగేవాళ్ళు.  


"ఉంది. స్పినోజా చెప్పిన దేవుడి మీద నమ్మకం" అనేవాడు ఐన్స్టీన్.


స్పినోజా ఒక డచ్ తాత్వికవేత్త. 17 వ శతాబ్దం వాడు.  


_దేవుడు మనిషికి చెప్పేది , స్పినోజా మాటల్లో_:

   

ప్రార్థనలేవీ అక్కర్లేదు. ప్రపంచం లోకి వెళ్లి జీవితాన్ని ఆస్వాదించండి. సృష్టి సర్వం తో మమైకం కండి. హాయిగా నవ్వండి. భువన గానం లో భాగం కండి.


ప్రార్థనా మందిరాల కు వెళ్లడం దేనికి  ?  నేనక్కడ ఉంటానని ప్రకటిస్తూ అవన్నీ మీ నిర్మాణాలేగా!

పర్వతాలూ , చొరలేని అరణ్యాలూ , నదులూ, సరోవరాలూ , సాగరతీరాలూ... ఇవీ నా నివాసాలు.


మీ దౌర్భాగ్యాలకు నన్ను నిందించడం వదిలెయ్యండి. మీ తప్పటడుగులూ , పాపాలతో నాకు ప్రమేయం లేదు.


మీ పవిత్ర గ్రంధాల తో నాకే సంబంధమూ లేదు.  ఒక పొద్దు పొడుపు లో , ఒక నిర్జన మైదానం లో , ఒక ఆత్మీయ మిత్రుడి స్పర్శ లో , మీ బిడ్డ కళ్ళలో ఉంటాను నేను. ఏవో పుస్తకాల పుటల్లో కాదు.


అవధి లేని ప్రేమ నేను. నేను ఏ తీర్మానాలు చెయ్యను , నిన్ను విమర్శించను. నువ్వంటే కోపాలూ , పట్టింపులూ ఉండవు.


క్షమాపణ లేవి నన్ను అడగకు. క్షమించ వలసిన వేవీ ఉండవు. నీ పరిధులూ పరితాపాలూ ఉద్వేగాలూ సుఖాలూ అవసరాలూ అన్నీ నేను నీలో నింపినవే.  అలాంటప్పుడు నీ అతిక్రమణలకు నిన్నెలా శిక్షిస్తాను నేను ?  నిన్ను   కాల్చి వేసే నరకమొకటి నేను సృష్టించి ఉంటే నేనేం దేవుణ్ణి ?


నిత్య జాగృతి లో బతుకు.  అదే నీ దిక్సూచి. ఇతరులు నీకేది చేయకూడదని నువ్వు భావిస్తావో అది నువ్వు వాళ్లకు చెయ్యకు.


బ్రతుకంటే అదేదో పరీక్ష కాదు. ఒక రిహార్సల్ కాదు. ఏ స్వర్గ ద్వారాలకో పీఠిక అసలు కాదు. ఇక్కడ నడిచే , గడిచే వాస్తవం!!! అంతమాత్రంగానే చూడు దాన్ని. 


పరిపూర్ణ స్వేచ్ఛ నిచ్చాను నీకు. శిక్షలూ పురస్కారాలూ పాపాలూ  సద్గుణాలూ  నా నిఘంటువు లో మాటలు కాదు. ఏదో కలం తో వాటినెవ్వరూ నా దివాణంనం లో లెక్క కట్టరు.  స్వర్గం , నరకం నీకు నువ్వే నిర్మించుకోవాలి.  ఆ స్వేఛ్చ నీదే.


ఈ బ్రతుకు ముగిశాక ఇంకొకటేదైనా ఉందో లేదో నేను చెప్పను. కానీ దీని తరువాత ఇంకేదీ లేదన్నంత దీక్షగా బ్రతుకు. ఇంకొక బ్రతుకు ఉంటే ఇంతకు ముందు నువ్వు ఏం చేశావు , ఇంకేం విస్మరించావు అనే లెక్కలు నేను తిరగ త్రోడను.


నన్ను నమ్మకు.  నమ్మడం అన్నది ఊహాత్మకం. నిన్ను నువ్వు నమ్ముకో. ఏ సాగర జలం లోనో ఈత కొడుతున్నప్పుడో , ఒక శిశువు ను హత్తుకున్నప్పుడో ,  పెంపుడు పశువు ను నిమిరేటప్పుడో , నేను గుర్తు రావడమే నేను ఆశించేది.


నీ కీర్తనలు అన్నీ వదిలెయ్యి. వాటికి ఉప్పొంగి పోతే  నేనేం దైవాన్ని ? నీ ఆరోగ్యం , నీ సంబంధాలూ , సంతోషాలూ సరిచూసుకో. అదే నాకు నువ్వు పఠించే స్తోత్ర పాఠం.


నా గురించి ఇప్పటికే నీ బుర్ర నిండా ఉన్న సరంజామా అంతా చేజార్చుకో. చిక్కు ముడి అదంతా. అద్భుతాలూ  వాటికి అన్నేసి వివరణలూ దేనికి ?


నువ్వు ఇప్పుడు ఇక్కడ శ్వాసిస్తూ ఉన్నావ్. అంతకు మించిన అద్భుతం ఏదో ఇంకా ఎందుకు...?