30, డిసెంబర్ 2023, శనివారం

విష్ణుచిత్తుని కుమార్తె

 https://youtu.be/vNxjOuvR7e4?si=mAzbn6qcyYQeUgLs


శ్రీభారత్ వీక్షకులకు ధనుర్మాస శుభాకాంక్షలు 🌹 ధనుర్మాసం పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చేది గోదాదేవి, ఆమె రచించిన తిరుప్పావై. లక్ష్మీ దేవి అవతారమైన గోదాదేవి శ్రీరంగనాథుని వలచి, వలపించుకొంది. ఆమె  తిరువిల్లిపుత్తూరు లో విష్ణుచిత్తుని కుమార్తె ఎలా అయిందో,  కాత్యాయనీ వ్రతం చేసి శ్రీరంగనాథుని ఎలా చేరిందో, పాశురాలు ఎందుకు రచించిందో అది ఒక అద్భుతమైన చరిత్ర. ఆ విషయాలన్నీ ఎంతో మృదుమధురంగా వివరించారు ప్రముఖ రచయిత్రి డా. పుట్టపర్తి నాగ పద్మిని గారు. ఆ మాధుర్యాన్ని ఆస్వాదించండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

⚜ శ్రీ మణిమహేశ్ మందిర్

 🕉 మన గుడి : నెం 285


⚜ హిమాచల్ ప్రదేశ్  : కిణ్ణూర్


⚜ శ్రీ మణిమహేశ్ మందిర్


💠 హిమాచల్ ప్రదేశ్లోని ‘చంబా' జిల్లాలో వున్న ఈ ప్రదేశం 4170 మీటర్ల ఎత్తులో ఉంది. 

ఇది గొప్ప శైవక్షేత్రంగా విరాజిల్లుతోంది. మణిమహేశ్లో ఓ సరస్సు కూడా ఉంది. 

ఇక్కడి నుంచి మనం కైలాస పర్వతాన్ని చూడవచ్చు. 

ఈ ప్రాంతాన్ని ఎక్కువగా ట్రెక్కింగికి ఉపయోగిస్తారు.


💠 ఈ ప్రదేశాన్ని చంబా కైలాష్ అని కూడా పిలుస్తారు.

మణిమహేష్ కైలాస శిఖరం శివుని నివాసంగా ప్రసిద్ధి చెందింది.

మణిమహేష్ సరస్సు ని దాల్ సరస్సు అని కూడా పిలుస్తారు.


💠 మణిమహేష్ అంటే "శివుని ఆభరణాలు" అని అర్ధం.  స్థానిక పురాణం ప్రకారం, పౌర్ణమి రాత్రి, అద్భుతమైన సరస్సులో ఈ ఆభరణం యొక్క ప్రతిబింబాన్ని చూడవచ్చు అంటారు..


💠 సంవత్సరంలో ఎక్కువ భాగం, మంచు కారణంగా మూసి ఉంటుంది.  

ఈ సరస్సు చేరుకోవాలంటే 13 కి.మీ దూరం మంత్రముగ్ధులను చేసే పర్వతాలు మరియు పచ్చదనం గుండా ప్రయాణించాలి.  


💠 ఇక్కడి సరస్సు రెండు ప్రధాన భాగాలుగా విభజించబడింది - పెద్ద భాగం శివ కటోరి (శివుని స్నాన ప్రదేశం), మరియు దిగువ భాగాన్ని గౌరీ కుండ్ (పార్వతి దేవి కోసం స్నాన స్థలం) అని పిలుస్తారు.


💠 ఈ పవిత్ర సరస్సులో శివుడు మరియు పార్వతి స్నానం చేస్తారని ప్రజల నమ్మకం.  మణిమహేష్ శిఖరాన్ని చూసేందుకు యాత్రికులు సరస్సుకు చేరుకుంటారు.


💠 పూర్తి ఆధ్యాత్మిక సంతృప్తిని అందజేస్తుందని తెలిసినందున ఈ పవిత్ర స్నానం "మన్ కా మహేష్" అని కూడా పిలువబడుతుంది.


💠 ప్రతి సంవత్సరం ఆగస్టు సెప్టెంబరులో,క్రిష్ణాష్టమినుండి,రాధాష్టమి వరకు ఈ పర్వతాలలో యాత్రలు చేస్తారు.

యీ సమయంలో  మణిమహేష్ సరస్సులో  పరమేశ్వరుడు, దాన్జో గ్రామంలో వున్న 'గౌరీకుండ్' లో పార్వతి దేవి  స్నానం చేస్తారని ఐహీకం. 


💠 గౌరికుండ్ లో స్త్రీలు మాత్రమే  స్నానం చేయాలని నియమం.

ఈ యాత్ర మిక్కిలి పవిత్రమైనదిగా భావిస్తారు.


💠 పరమేశ్వరుడు , బ్రాహ్మీదేవికి యిచ్చిన మాట ప్రకారం బర్మోర్ బ్రాహ్మిణీ ఆలయ పుష్కరిణి లో స్నానం చేసిన తరువాత , మణిమహేష్ సరస్సు లో  స్నానం చేయాలన్నది  ఆచారం. 


💠 ఆరు బయట ,  గోపురం, విమానం ఏమీ లేకుండా  శూలములు మాత్రమే వుంటాయి. సూర్యోదయ దృశ్యం, పౌర్ణమి రోజున మణిమహేష్ శిఖరం చంద్ర కాంతిలో మెరుస్తున్న దృశ్యం పరమాద్భుతము.


💠 స్థల పురాణం పురాణం ప్రకారం, మాతా గిరిజగా పూజించబడే పార్వతీ దేవిని వివాహం చేసుకున్న తరువాత శివుడు మణిమహేష్‌ని సృష్టించాడని నమ్ముతారు . 

ఈ ప్రాంతంలో సంభవించే హిమపాతాలు మరియు మంచు తుఫానుల ద్వారా శివుడు మరియు అతని అసంతృప్తిని ప్రదర్శించడం గురించి అనేక పురాణాలు వివరించబడ్డాయి . 


💠 మణిమహేష్ సరస్సు ఒడ్డున శివుడు తపస్సు చేసినట్లు కూడా పురాణాలు పేర్కొంటున్నాయి. 

శివుడు కైలాస పర్వతంలో ఆరు నెలల పాటు నివసిస్తాడనీ, ఆ తర్వాత విష్ణువుకు రాజ్యాన్ని అప్పగిస్తూ పాతాళానికి వెళతాడని కూడా ఇక్కడి వాసులు నమ్ముతారు. 

అతను భూలోకానికి బయలుదేరే రోజును ప్రతి సంవత్సరం గడ్డీలు ( గొర్రెలు కాచే వారు)  భక్తితో పాటిస్తారు, ఇది జన్మాష్టమి రోజు, భదోన్ (ఆగస్టు) మాసంలో ఎనిమిదవ రోజు (అష్టమి) శ్రీకృష్ణుడు (విష్ణువు అవతారం) పుట్టినరోజు. 


💠 స్థానిక పురాణం ప్రకారం, ఆభరణం నుండి ప్రతిబింబించే చంద్ర కిరణాలు మణిమహేష్ సరస్సు నుండి స్పష్టమైన పౌర్ణమి రాత్రి (ఇది అరుదైన సందర్భం) చూడవచ్చు . 

అయితే, శివుని మెడలో ఉన్న పాము రూపంలో శిఖరాన్ని అలంకరించే హిమానీనదం నుండి కాంతి ప్రతిబింబం ఫలితంగా ఇటువంటి అద్భుత దృశ్యం  సంభవించవచ్చని ఊహించబడింది. 


💠 పురాణాల ప్రకారం, శివుడు ఇక్కడ కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసాడు. 

అతని జటాజూటం నుండి నీటిచుక్కలు వచ్చి సరస్సు రూపాన్ని సంతరించుకున్నాయి. 

ఇది రెండు విభిన్న భాగాలను కలిగి ఉంటుంది. ఎక్కువ భాగం మంచుతో నిండిన చల్లని నీటిని కలిగి ఉంది, దీనిని 'శివ్ కరోత్రి' (శివుని స్నాన ప్రదేశం) అని పిలుస్తారు. 

పొదల్లో దాగి ఉన్న సరస్సు యొక్క చిన్న భాగం గోరువెచ్చని నీటిని కలిగి ఉంది మరియు దీనిని 'గౌరీ కుండ్' అని పిలుస్తారు.

ఇది శివుని భార్య అయిన పార్వతి యొక్క స్నాన ప్రదేశం. అందువలన, పురుషులు మరియు మహిళలు సరస్సు యొక్క వివిధ ప్రాంతాల్లో స్నానం చేస్తారు. 


💠 ఒక కథ ప్రకారం, ఒకసారి ఒక గొర్రెల కాపరి తన గొర్రెల మందతో కలిసి పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించాడు. 

అతను తన గొర్రెలతో పాటు రాయిగా మారాడని నమ్ముతారు. 

ప్రధాన శిఖరం క్రింద ఉన్న చిన్న శిఖరాల శ్రేణి దురదృష్టకరమైన గొర్రెల కాపరి మరియు అతని మంద యొక్క అవశేషాలు అని నమ్ముతారు.


💠 మణిమహేష్ పవిత్ర తీర్థయాత్రకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం, మణిమహేష్ తీర్థయాత్ర కమిటీ మరియు అనేక స్వచ్ఛంద సంస్థలు మద్దతు ఇస్తున్నాయి. 

ఈ ప్రాంతంలోని గడ్డి గిరిజనులకు , సరస్సుకు తీర్థయాత్ర అత్యంత పవిత్రమైనది. 

ఇది స్థానికంగా "డోలీ ఛరి" (యాత్రికులు తమ భుజాలపై మోసే పవిత్ర కర్ర) అని పిలువబడే ఒక ఊరేగింపు  


💠 భార్మావోర్ నుంచి ఈ క్షేత్రం 35 కి.మీ. దూరం

భాషాద్వయ సమ్మేళనమ్

 భాషాద్వయ సమ్మేళనమ్ 

                                                 

       (   చిత్ర కవిత)


              కం:  మాయంమాన సు  నీవే


                     రాయలవై  కావ  దేవరా!  జే జే జే !


                    మాయాతుమ లానిన యది


                    పాయక  సంతోసమున్న  పల  మిలసామీ !


                          కళాపూర్ణోదయము--6  ఆ : 161 పద్యం- పింగళి సూరన !


                       

               ఈపద్యము కళాపూర్ణోదయమున  ప్రథమాగమాదులు  పామరవేషధారులైవచ్చి  కళాపూర్ణుని  స్తుతించు సందర్భము లోనిది. ఇందు ఒకరీతి గా పదములను చదివిన తెనుగును, మరియొక రీతిగా చదువగా సంస్కృత మును మనకు అవగత మగుచుండును. ఇదియే భాషాద్వయ సమ్మేళనము. 


      తెలుగు: పదవిభాగము+ అన్వయము.


                  ఇలసామీ! --మాయమ్మ-  ఆన- సు- నీవే - రాయలవై -కావన్-  దేవరా - జేజేజే- మా ఆతుమలానినయవి- పాయక- సంతోషమున్న- పలము. 


             అర్ధము: దేవరా! ఓరాజా! ! జేజేజే-  జయము జయము జయము;ఇలసామీ-ఓభూపతీ!  నీవే- నీవే ;రాయలవై- రాజువై;

కావన్- రక్షింపగా ; సంతోసము- ఆనందము; పాయక- విడువక; మాయాతుమలను- మామనస్సులందు; ఆనినయది-పొందినది;  ఉన్నపలము- ఇదిమాకు కల్గిన ఫలము; మాయమ్మఆన- మాతల్లిపై  ఒట్టు;


            భావము: ఓరాజా! నీకు జయమగుగాక! మాయమ్మపై నొట్టుపెట్టుకొని చెప్పు చున్నాము.  నీవు రాజువై రక్షించుటచే  మామనస్సులానందముతో నిండిపోయినవి;


             సంస్కృతము:పదవిభాగము+ అన్వయము:   మా-- ఆయమ్--మాన- సునీవే-- రాః - అలవా - ఏకా - అవత్-  ఏవ -రాజే - అజేజే - మా - ఆయాతు-  మలాని-- న- యది- పాయక- సంతః-  అసముత్ - న- వల- మిల- సా- అమీ;


          అర్ధము: హే సునీవే- చక్కని మూలధనముగల ఓరాజా! ;  ఆయమ్- రాబడిని ; మామాన-  లెక్కచేయకుము; అలవా--తరుగని;

రాః - ధనము; ఏవ- ఒక్కటియే; అవత్- రాజును కాపాడును ; అజేజే-- భగవంతుని పూజించు-- రాజే--రాజుకొరకు ; మా- లక్ష్మి; ఆయాతు- వచ్చునుగాక - మలాని- పాపములు-- న-- చేరవు;  పాయక- ఓరక్షకుడా! ; సంతత్సు- పడితులైనచో (చూడవచ్చినవారు)

అసముత్--సంతోషరహితుడవై ; నవల- దూరముగా పోకుము; మిల-- వారిని కలువుము; అమీ-- ఆపండితులే- సా  లక్ష్మీ  -- ఆ  లక్ష్మియని  యెఱుంగుము;


             భావము:  ఓరాజా! రాబడిని నమ్మి  మూలధనమును వమ్ముచేయకుము. తరుగని సంపదయే రాజునకు సంతసమును గూర్చును. భగవదారాధనచే  సకల సంపదలు కలుగును. పాతకములు దరిజేరవు.  ప్రభూ! పండితులను గాంచినంతనే  పరాఙ్ముఖుడవుగాక  ,వారిని సంభావింపుము. వారే లక్ష్మికి  ప్రతిరూపములని భావింపుము.


                 ఇది పాఠకులకు కొంత కష్ట సాధ్యమేయైనను  రహస్య సమాచారాదులకొరకు  వేగులు ,మంత్రులు ,ప్రభువులు, తమతమ

కార్యకలాపములకు ఇట్టివి వాడుచుండెడివారు. 


                                                      స్వస్తి!!🙏🙏👌👌💐🌷🌷🌷🌷💐💐🌷🌷💐💐💐💐💐💐💐🌷

బ్లడ్ క్యాన్సర్ కు మందు

 చాలా ముఖ్యమైన వార్త


 పూణేలో అందుబాటులో ఉంది


 దయచేసి ఈ ముఖ్యమైన వార్తను చదివిన తర్వాత తప్పకుండాఫార్వార్డ్ చేయండి.                                                         


 నా ప్రియమైన స్నేహితులారా


 బ్లడ్ క్యాన్సర్ కు మందు దొరికింది!!


 దాన్ని మళ్లీ ఫార్వార్డ్ చేయకుండా తొలగించవద్దు

 ఇది భారతదేశంలోని ప్రతి ఇంటికి చేరనివ్వండి.


 'ఎమోటిఫ్ మెర్సిలేట్' బ్లడ్ క్యాన్సర్‌ను శుద్ధి చేసే ఔషధం.


 పూణేలోని యోశోద హెమటాలజీ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉచితంగా లభిస్తుంది.


 అవగాహన కల్పించండి.


 ఇది ఎవరికైనా సహాయం చేయగలదు.


 మీకు వీలైనంత వరకు కొనసాగండి.

 నైతికతకు ధర లేదు.


 తెలుసు:

 యశోదా హెమటాలజీ క్లినిక్.  109, మంగళమూర్తి కాంప్లెక్స్, హీరాబాగ్ చౌక్,

 తిలక్ రోడ్,

 పూణే-411002.


 ఫోన్:

 020-24484214 లేదా 09590908080 లేదా 09545027772 లేదా www.practo.comని సందర్శించండి.


 నా వినయపూర్వకమైన అభ్యర్థన: దయచేసి ఫార్వార్డ్ చేయండి

Panchang


 

Doshaalu

 


ఐదు విధాలైన దోషాలు

 🍃🪷🍃🪷🍃🪷🍃

⚡ *మనం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన దోషాలు యిమిడివున్నాయి...*


1.  *అర్ధ దోషం*

2.  *నిమిత్త దోషం*         

3.  *స్ధాన దోషం*

4.  *గుణ దోషం*   

5.  *సంస్కార దోషం*.


 *అర్ధ దోషం*


ఒక సాధువు  తన శిష్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. భోజనం చేస్తున్నప్పుడు ఎవరో  ఒక వ్యక్తి  వచ్చి ఆ శిష్యునికి  ధనంతో వున్న మూటని ఇవ్వడం చూశాడు.భోజనం చేసి, సాధువు ఒక గదిలో విశ్రాంతి తీసుకోసాగాడు. ఆ గదిలోనే  శిష్యుడు ఉంచిన డబ్బు మూట వుంది

హఠాత్తుగా సాథువు మనసులో ఒక దుర్భుధ్ధి కలిగింది, ఆ మూటలో నుండి కొంత డబ్బును తీసుకుని తన సంచీలో దాచేశాడు. తరువాత శిష్యుని వద్ద సెలవు తీసుకుని, తిరిగి తన ఆశ్రమానికివెళ్ళి పోయాడు. మరునాడు పూజా సమయంలో తను చేసిన పనికి సిగ్గుతో పశ్చాత్తాపం చెందాడా సాధువు


తను శిష్యుని ఇంట్లో చేసిన దోషభూయిష్టమైన భోజనం వల్లనే తనకా దుర్బుధ్ధి కలిగిందని రాత్రి ఆహారం జీర్ణమయి, ప్రొద్దుననే  మలంగా విసర్జించబడిన తర్వాత మనసు నిర్మలమై పరిశుధ్ధమైనట్టు అర్థం చేసుకున్నాడు.వెంటనే  తాను తస్కరించిన డబ్బును తీసుకొని శిష్యుని ఇంటికి వెళ్ళి జరిగినదంతా చెప్పి, ఆ డబ్బును  తిరిగి ఇచ్చేశాడు. తర్వాత శిష్యుడిని ఎలాంటి వృత్తి ద్వారా డబ్బు సంపాదిస్తున్నావని అడిగాడు

శిష్యుడు తలవంచుకొని, "నన్ను క్షమించండి, స్వామి! యిది సన్మార్గంలో వచ్చిన డబ్బు కాదు." అని తలవంచుకొన్నాడు

ఈ విధంగా సన్మార్గంలో సంపాదించని డబ్బుతో కొన్న పదార్థాలతో, తయారు చేసిన ఆహారం భుజించడమే అర్ధదోషం. మనం న్యాయంగా సంపాదించిన దానితోనే ఆహారం తయారు చేసుకుని, భుజించడం ముఖ్యం


 *నిమిత్త దోషం*

 

మనం తినే ఆహారాన్ని  వండేవారు కూడా మంచి మనసు కలవారై వుండి, సత్యశీలత కలిగి దయ, ప్రేమ కల మంచి స్వభావము కలిగినవారై ఉండాలి


వండిన ఆహారాన్ని క్రిమికీటకాలు, పక్షులు జంతువులు తాక కూడదు. ఆహారం మీద దుమ్ము, శిరోజాలు  వంటివి పడ కూడదు


అపరిశుభ్రమైన ఆహారం మనసుకి అసహ్యత కలిగిస్తుంది. దుష్టులైన వారి చేతి వంట భుజిస్తే వారి దుష్ట గుణాలు అవతలివారికి అబ్బుతాయి


భీష్మాచార్యుల వారు కురుక్షేత్ర యుధ్ధంలో బాణాలతో  కొట్టబడి, యుధ్ధం ముగిసేవరకు అంపశయ్య పై ప్రాణాలతోనే  వున్నాడు. ఆయన చుట్టూ పాండవులు, ద్రౌపది శ్రీ కృష్ణుడు వున్నారు. వారికి భీష్ముడు మంచి మంచి  విషయాలను  బోధిస్తూ వచ్చాడు


అప్పుడు ద్రౌపది కి ఒక అనుమానం కలిగింది. ఇప్పుడు ఇంత వివేకంగా ఆలోచిస్తు మాట్లాడే భీష్ముడు ఆనాడు దర్యోధనుడు నా వస్త్రాలు ఊడ్చమని దుశ్శాసనునికి ఆదేశించినప్పుడు ఎందుకు ఎదిరించి మాటాడలేక పోయాడు? అని అనుకొన్నది


ఆమె మనసులో ఆలోచనలు గ్రహించిన భీష్ముడు

'అమ్మా ! నేను అప్పుడు దుర్యోధనుని, ప్రాపకంలో వారిచ్చిన ఆహారం భుజిస్తూ వచ్చాను .నా స్వీయ బుధ్ధిని ఆ ఆహారం తుడిచి పెట్టింది. శరాఘాతములతో, ఛిద్రమైన దేహంతో, ఇన్ని రోజులు ఆహారం తీసుకోనందున, పాత రక్తం - బిందువులుగా బయటికి పోయి నేను ఇప్పుడు పవిత్రుడినైనాను

నా బుద్ధి వికసించి, మీకు మంచి మాటలు చెప్పగలుగుతున్నాను అన్నాడు భీష్ముడు

చెడ్డ గుణములు వున్న వారు ఇచ్చిన ఆహారం తినినందువలన మనిషిలోని మంచి గుణములు నశించి నిమిత్త దోషం' ఏర్పడుతోంది


 *స్ధాన దోషం*


ఏ స్ధలంలో ఆహారం వండబడుతున్నదో, అక్కడ మంచి ప్రకంపనలు వుండాలి. వంట చేసే సమయంలో అనవసరమైన చర్చలు, వివాదాల వలన చేయబడిన వంటకూడా పాడైపోతుంది

యుధ్ధరంగానికి, కోర్టులు, రచ్చబండలు వున్న చోట్లలో వండిన వంటలు అంత మంచివి కావు


దుర్యోధనుడు  ఒకసారి యాభైఆరు రకాల వంటలు వండించి శ్రీ కృష్ణుని  విందు భోజనానికి పిలిచాడు. కాని కృష్ణుడు దుర్యోధనుని పిలుపును నిరాకరించి విదురుని యింటికి భోజనానికి వెళ్ళాడు. కృష్ణుని చూడగానే విదురుని భార్య సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు చేసింది.  తినడానికి ఏమిటి పెట్టడం అని యోచించి,  ఆనంద సంభ్రమాలతో తొందర పాటు పడి, అరటి పండు తొక్కవలిచి, పండు యివ్వడానికి బదులుగా తొక్కని అందించింది. కృష్ణుడు దానినే  తీసుకొని  ఆనందంతో భుజించాడు. ఇది చూసిన విదురుడు భార్యవైపు కోపంగా చూశాడు. అప్పుడు కృష్ణుడు, "విదురా! నేను ఆప్యాయతతో  కూడిన ప్రేమకోసమే ఎదురు చూస్తున్నాను. నిజమైన శ్రద్ధా భక్తులతో యిచ్చిన ఫలమో, పుష్పమో, తోయమో, జలమో, ఏదైనా సంతోషంగా తీసుకుంటాను అని అన్నాడు

మనం ఆహారం వడ్డించినప్పుడు, ప్రేమతో వడ్డించాలి


 *గుణ దోషం*


మనం వండే ఆహారం సాత్విక ఆహారంగా వుండాలి. సాత్విక ఆహారం, ఆధ్యాత్మికాభివృధ్ధిని కలిగిస్తుంది. రజోగుణం కలిగించే ఆహారం మనిషిని  లౌకిక మాయలో పడేస్తుంది. స్వార్ధాన్ని పెంచుతుంది


*సంస్కారదోషం*


ఆహారం వండే వారి సంస్కారం బట్టి దోషం ఏర్పడుతుంది. సంస్కారవంతుల చేతి వంట ఆరోగ్యాన్ని ఇస్తే సంస్కారహీనుల చేతి వంట లేని పోని రోగాల్ని తెచ్చి పెడుతుంది.

A Best Collection from Brahmana Samaakya.


🍃🪷🍃🪷🍃🪷🍃

మిఠాయి సత్యం:

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

మిఠాయి సత్యం:


మా ఊర్లో సత్యంగారనే వారు

ఉండేవారు.ఉదయం పదిగంటల నుంచి

జంతికలు,చెగోడీలు,బజ్జీలు,బెల్లం మిఠాయి

ఉండలు చేసి అమ్మేవాడు.


ఎవరింట్లో‌ఏ శుభకార్యాలయినా బూంది లడ్డు, మైసూరు పాక్, ఇలాంటివి  చేయించుకొనే

వారు.దానాదీనా ఆయనకి మిఠాయి సత్యం గారు అనే‌పేరు స్థిరపడిపోయింది.


ఎందుకు ఆయన గురించి చెపుతున్నా నంటే

ఆయన చదువుకోకపోయినా‌ మంచి ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నవాడు.తరచుగా ఆథ్యాత్మిక ఉపన్యాసాలు,హరికథలు వినేవాడు.


ఓ రోజు ఓ స్వాములవారు భగవతత్వం గురించి చెబుతూ,అనేక రూపాల్లో ఉన్నా

భగవంతుడు ఒక్కడే అని చెప్పి ఏమోయ్ సత్యం అర్థమైందా అని అడిగారు.


ఈ సత్యం గారు హరికథ కులకు, స్వామీజీ లకు, పౌరాణికులకు సపర్యలు చేస్తూ ఉండేవాడు.


అయ్! అర్థమయింది. ఎలాగంటే నా బాషలో నే సెబుతా యినండి ఎలా అంటే:


సెనగపిండి (మూలమనుకోండి)

1.సన్న గొట్టంలో సుడితే కారప్పూసండి.

2.లావుగొట్టంలో సుడితే జంతికలు

3.అదే‌సెనగపిండిని సట్రంలో కొట్టి,యేరు సెనగ,పుట్నాలు,అటుకులు ,కర్వేపాకు యేపి

కలిపితే కారంబూంది అవుద్ది.

4.అదే సెనగపిండి సట్రంలో బూంది కొట్టి

పంచదార పాకంలో వేసి ఉండకడితే లడ్డు

ఔతుంది.

5.అదే సెనగపిండి వేయించి, పంచదార, నెయ్యి వేసి ఓ పాత్రలో పాకం పడితే 

మైసూరు పాక్ అవుతుంది.

6.అదే సెనగపిండి ‌పల్చగా కలిపి, మిరపకాయ ముంచి‌వేయిస్తే మిరపకాయ బజ్జీలు, అరటికాయ ముక్కలు ముంచివేస్తే అరటికాయ ‌బజ్జీలు.

7.అదే సెనగపిండి లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు,అల్లం,కలిపి‌వేయిస్తే

పకోడీయండి.


ఒకే సెనగపిండికే ఇన్ని రూపాలున్నట్టే, మూలం శక్తి అయిన భగవంతుడు,మనకి శివుడుగా

యిష్ణువుగా,ఆంజనేయుడుగా,గణపతిగా

ఎన్నో రూపాలు గా కనపడతాడండి ఆయ్.


మనం ఎలా కొలిచినా,పిలిచినా పలికే‌శక్తి‌‌ ఒహటేనండి.ఆయ్! నాకరదమయినకాడికి

సెప్పేనండి అన్నాడు ‌సత్యంగారు.


ఆనాటి స్వామీజీ లు కనుక ఆయన తనకు అంతకు ముందే సభానిర్వాహకులు కప్పిన ‌శాలువ‌సత్యంగారికి కప్పి నిగర్వంగా ఓ ‌మాటన్నారు.


ఇన్ని ‌శాస్త్రాలు‌‌చదివిన నేను కూడా భగవత్ తత్వాన్ని నువు చెప్పినంత సులువు గా చెప్పలేను.


నీకు పరమేశ్వర కటాక్షం దొరికింది అన్నారు.


సభంతా చప్పట్లు మోత.

                 ***.

ఆశించవద్దు

🙏

*దయచేసి ఎవరూ తొందరపాటుతో అపార్ధం చేసుకోవద్దు.*

జనవరి నెల ఒకటో తేదీన నూతన సంవత్సర శుభాకాంక్షలు పెట్టవద్దు.

మా నుండి ఆశించవద్దు.

హిందూ బంధువులారా మనకు సనాతన ధర్మంలో తెలుగువారి సంవత్సరాది పండుగ  ఉగాది.

హిందువులకు నూతన సంవత్సరాది పండుగ యుగాది.

జనవరి ఒకటవ తేదీ హిందువులకు నూతన సంవత్సరం కాదు. దయచేసి హిందూ బంధువులు కేకులు కోయడం కానీ, జనవరి 31వ తేదీన అర్ధరాత్రివేళ నూతనసంవత్సర వేడుకలలో పాల్గొనడంగానీ చేయకండి. కేకులు కోయడం, ఆ కేకుల మధ్యలో కొవ్వొత్తులు వెలిగించి, ఆర్పడం అనేది హిందువులకు పనికిరాదు.

హిందువులు ముఖ్యంగా గమనించిన వలసిన విషయం ఏమనగా హిందూమతంలో  బ్రహ్మ ముహూర్తం అనగా తెల్లవారుజామున సుమారు 3.30గంటలకు ప్రారంభం అవుతుంది. ఆ సమయం నుండి మనము మంచిసమయంగా హిందూధర్మంలో భావిస్తాం.  రాత్రి 11గంటల సమయం నుంచి తెల్లవారుజామున మూడున్నర గంటల వరకు నిషిద్ధసమయముగ భావిస్తాo. ఆ సమయం భూత ప్రేత పిశాచాలు తిరిగే సమయం.

*గమనించండి.* 

హిందువులు వారి పిల్లలకు సనాతన ధర్మం యొక్క విలువలను తెలపండి. కొవ్వొత్తులు ఎక్కడ వెలిగిస్తారో బాగా గమనించండి. మళ్లీ చెబుతున్నా. మనకు తెలుగు సంవత్సరాది నూతన సంవత్సరం ఉగాదిపండుగతో మొదలవుతుంది. హిందువులకు జనవరి 1 వద్దు. ఉగాది ముద్దు. 

దయచేసి ఈ మెసేజ్ ను అన్ని హిందూ గ్రూపులలో ఫార్వర్డ్ చేయండి. దయచేసి హిందూ బంధువులు అర్ధరాత్రి వేడుకలలో పాల్గొనవద్దు. మన  పూర్వీకులు రాత్రిపూట ప్రయాణాలు చేసి ఇంటికి వస్తే 12 దాటితే భోజనం రాత్రి భోజనం గాని అల్పాహారం అని బయట ఎక్కడ చేసి రాకపోయినా పన్నెండు దాటింది ఇప్పుడు తినవద్దు అని వారించే వారు అది ఎందుకో అర్థం చేసుకోండి కాబట్టి 12 గంటలకు సంబరాలు చేసుకుని కేకులు కట్ చేసి తినడం బిర్యానీలు తినడం కూల్ డ్రింక్స్ తాగడం హిందూ సంప్రదాయానికి విరుద్ధం హిందూ బంధువులందరూ దీనిని గ్రూపులలో ప్రచారం చేసి మన సాంప్రదాయాలను కాపాడతామని ప్రతిజ్ఞ చేద్దాం.🙏

*(జై సనాతన ధర్మం. జై హిందూ ధర్మం)*

గుఱ్ఱం గుడెక్కింది*

 *సామెత కథ*


*గుఱ్ఱం గుడెక్కింది* 


దొరలు మనదేశం వచ్చిన కొత్తలో, వాళ్ళు ఊళ్ళో అడుగు పెట్టటానికి పల్లెటూరి ప్రజలు వప్పుకొనేవారు కాదు. ముఖ్యంగా అగ్రహారాల్లో బ్రాహ్మలు సుతరామూ వాళ్ళను రానిచ్చేవాళ్ళు కాదు. ఎందు కంటే, దొరలు అనగా సీమదేశంనించి దిగిన మ్లేచ్ఛులనీ, వాళ్ళ సంపర్కం తగిలితే తమ ప్రదేశం మైలపడిపోతుందనీ వాళ్ళ వుద్దేశం.


అటువంటి కాలంలో— దొరలు కలెక్టర్లుగా, జడ్జీలుగా పెద్ద పెద్ద ఉద్యోగస్థులుగా బస్తీలకు వచ్చి చేరుకొనే వారు, ఉద్యోగరీత్యా చిన్నచిన్న గ్రామాలలో కూడా వారు మకాం చేయవలసి వచ్చేది. ఆవిధంగా మకాంచేసిన దొరలకు ఎదురు చెప్పడమంటే పల్లెటూరి వాళ్లకు భయంగా వుండేది. 


అలా భయపడకుండా ఉండే వాళ్లు గోదావరిజిల్లా కోనసీమలోని *పేరూరు* ద్రావిడులు. వారు దొరలను కాదుకదా, దొరలను పుట్టించిన బ్రహ్మను కూడా లక్ష్యం చేయరన్నమాట. అంతటి ప్రతిభ, పలుకుబడి గల ఆ పేరూరు ద్రావిడులు ఏ పేచీలు వచ్చినా వాళ్ళలో వాళ్ళే తగవులు పరిష్కారం చేసుకొనేవారు. అంతేగాని, కోర్టులకూ గిర్టులకూ తిరిగి పిరికిపంద అనిపించుకునేవారు కాదు.


ఒకసారి పేరూరులో ఒక నేరం జరిగింది. అప్పటికే దొరలు కలక్టర్లుగా వచ్చి, పల్లెలలో మకాం చేసి, కేసులు విచారణ చేయటం విరివిగా సాగుతూ వుంది. అన్ని పల్లెలకు వచ్చినట్టుగానే, కేసు విచారణ కోసం పేరూరులో మకాం పెడదామని ఒక కలెక్టరు గుఱ్ఱం ఎక్కి నవుకర్లతో సహా బయల్దేరాడు.


కలెక్టరుగారు తమ ఊరి పొలిమేరకు వచ్చారనే వార్త పేరూరు ద్రావిళ్ళకు

తెలిసింది. వెంటనే, వారిలో హేమాహేమీలు కొంతమంది ఊరివెలుపల కలెక్టరుగారి వద్దకు వెళ్ళి, "అయ్యా, దొరగారూ! పరాయిదేశస్థులు అగ్రహారంలో ప్రవేశించటానికి వీలులేదని మా పెద్దలు ఏర్పాటు చేశారు. కనుక, మా గ్రామమర్యాద తమరు పాటించాలని కోరుతున్నాము ' అంటూ వినయపూర్వకంగా చెప్పారు.


గర్వంతో, వినీ విననట్లు నటించి నవ్వేసి ఊరుకొన్నారు. ఎన్ని విధాల చెప్పినా వాళ్ల మొర దొరగారి చెవికి ఎక్కేటట్టు కనిపించలేదు. మరి కొంచెం సేపటికల్లా కలక్టరుగారు ఊళ్లో దిగారు. దేవాలయం పక్కనే వేయబడిన డేరాలో ప్రవేశించి, కేసు విచారణ ప్రారంభించారు.


రెండు మూడు రోజులు విచారణ జరిగింది. కలెక్టరుగారి గుఱ్ఱాన్ని

బంట్రోతులు డేరా వెనుక పక్కన కట్టిపెడుతూ ఉండే వారు. మూడోరోజున, కలెక్టరుకు తగిన ప్రాయశ్చిత్తం చేయాలనుకొని, ద్రావిడులు నిశ్చయించారు. ఆరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉండగా, వారు నడుములు బిగించి, ఒకొక్కరు ఒకొక్క గడ్డిమోపు చొప్పున అంచీలమీద తెచ్చి, గుడికి దాపుగా ఏటవాలుగా, చక్కగా మెట్లు కట్టినట్టుగా గుడి మండపం మీది వరకూ పేర్చి, అమర్చారు. తరువాత, గుఱ్ఱాన్ని కట్టిన చోటునుండి, గుడి పైదాకా వారు పేర్చిన మోపుల మీద నవనవలాడే పచ్చగడ్డి ఒత్తుగా చల్లి, ఆ తర్వాత గుఱ్ఱానికి కట్టిన తాడు కాస్తా తొలగించివేశారు.


గుఱ్ఱం ఆ పరకలను అందుకొంటూ, ఒకొక్క అడుగే వేసుకొంటూ, ఆ మోపుల మీదినించి సులువుగా గుడిమీదికి ఎక్కిపోయింది.


తక్షణమే ఎవరు తెచ్చిన మోపు వారు తీసివేసి ఇళ్ళకు పట్టుకుపోయారు.


తెల్లవారింది. దొరగారి గుఱ్ఱం పోయిందంటే పోయిందని ఊరంతా గల్లంతుగా వుంది. "ఏమిరా ఇంత అజాగర్త!” అంటూ దొర నవుకర్లను చెడామడా తిట్టాడు.


నవుకర్లు కంగారుతో గ్రామమంతా చుట్టివచ్చారు. కాని,  గుఱ్ఱం ఎక్కడా అగపడలేదు. ఇంతలో, పచారు చేస్తున్న దొరగారికి ఏమీ తోచక స్వయంగానే వెతకటానికి బయల్దేరారు. కొంచెందూరం పోయేసరికి, యజమాని కంటబడగానే గుడిమీద ఉన్న గుఱ్ఱం సకిలించింది. దొరగారు దాన్ని చూచి ఆశ్చర్యపోయారు. గ్రామస్థులంతా క్షణంలో మూగేశారు. వాళ్ళంతా విస్తుపోయి చూస్తూ గోల చేస్తున్నారేగాని గుఱ్ఱం గుడి ఎందుకు యెక్కింది? ఎలా ఎక్కింది? అనే ప్రశ్న ఒక్కళ్ళకూ తట్టనేలేదు. అప్పుడు ఆ గుంపులోనుంచి ఒక ముసలి బ్రాహ్మడు ఒత్తిగించుకొంటూ దొరగారి వద్దకు వచ్చి, "బాబూ ! ' వద్దండీ ! ' అని మొదట్లోనే మేం మొరపెట్టుకొంటే విన్నారు కాదు. పైగా, దేవాలయం దగ్గరే బస చేశారు. ఇటువంటి అప్రాచ్యపు పనులు మా దేముడు సహిస్తాడనుకొన్నారా? మా దేముడికి ఇప్పుడు కోపం వచ్చింది. అందుకనే మీ గుర్రాన్ని గుడి ఎక్కించేశాడు. ఇప్పుడైతే పోయిందేమిటి? 'శరణు' అన్న వాళ్ళను క్షమిస్తాడు మా దేముడు. ఆయన కరుణిస్తే మీ గుఱ్ఱం మళ్ళీ మీకు దక్కుతుంది. కనుక, దేమునికి సాష్టాంగపడి మొక్కుకొండి !” అన్నాడు.


దొరగారికి ఈ మాట నచ్చింది. ఆ వృద్ధ బ్రాహ్మడు చెప్పినట్టుగా దేముణ్ణి ప్రార్ధించారు. ఈవిధంగా దొరగారు చతుస్సాగర పర్యంతం చెప్పుకొన్నతరువాత, ఆయనతో ద్రావిడ బ్రాహ్మలు "మీరు నిశ్చింతగా ఉండండి. మీ గుర్రానికి వచ్చిన పరవా లేదు ” అని అభయమిచ్చారు.


ఆ రాత్రికి రాత్రి, గడ్డిమోపులు మెట్లుగా పేర్చి, మునుపు ఏవిధంగా గుఱ్ఱాన్ని గుడి ఎక్కించారో అలానే చీమ చిటుక్కుమన కుండా మళ్ళీ దాన్ని భద్రంగా కిందికి దింపి, యధాస్థానంలో డేరా వెనుక గుంజుకు కట్టివేశారు.


మర్నాడు తెల్లవారేసరికల్లా తన గుఱ్ఱం సురక్షితంగా మకాంలో ఉండటం చూచి, కలెక్టరుగారు ఉప్పొంగిపోయారు. ఆనాటి నించీ *పేరూరు* ద్రావిడులంటే దొరగారికి గౌరవమూ, ఆ వూరి దేముడంటే భక్తి విశ్వాసాలూ ఏర్పడినై. స్వామి ధూప దీప నైవేద్యాలకుగాను పది ఎకరాల భూమి పట్టా కూడా వ్రాసి ఇచ్చాడని ప్రజలు చెప్పుకొంటారు.


ఆనాటినించి ఆ వూళ్ళో ఎవరైనా ఒక *కూడనిపని తలపెట్టి ఎదటివాళ్లు ఆ పని చేయవద్దు'* అన్నప్పటికీ మొరాయించి చేయబోతే, *"గుఱ్ఱం గుడెక్కేను, జాగర్త"* అంటూ ఉండేవారు.


ఈ విధంగా ఆ సామెత అలా ఆనాడు పేరూరులో పుట్టి, క్రమక్రమంగా దేశ మంతటా వాడుకలోకి వచ్చిందట.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆

సెకరణ:కె.ఆర్.శాస్త్రి.

(చందమామ, 1950,జూన్)

బలిసినవాడైన

 🍃🪷 బిచ్చగాడైయిన బలిసినవాడైన..

పోరాడేది పైసల కోసమే..మరి తేడా ఎక్కడ వస్తుందంటే..ఆ పైసలు ఒకరికి బ్రతుకుని ఇస్తే ఇంకొకరికి బలుపునిస్తోంది..


🍃🪷కొందరికి మనం చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానం కరెక్టుగా ఉంటుంది..ఓపిక పట్టి చూడు ఓపిక చాలా విలువైనది..


🍃🪷 అబద్ధాలు మాట్లాడుతూ...అవకాశానికి అనుగుణంగా నటిస్తూ బ్రతికే వాళ్లకు ఉన్న విలువ నీతిగా, నిజాయితీగా ఉండేవాళ్ళకు ఉండదు..


🍃🪷మనం మంచోళ్ళమా..! చెడ్డళ్ళమా అనేది ఈ సమాజానికి అవసరం లేదు..వాళ్ళ అవసరాన్ని బట్టి మంచోళ్ళను చేస్తారు..అవసరం తీరిన తరువాత చెడ్డవాళ్ళను చేసేస్తారు.. శివశక్తి సేవాసమితి  


🍃🪷 నమస్సులు మీకు ఆత్మీయంగా స్వీకరించండి

👍👍👍💐💐💐

Vegetables cultivation


 

Srikaalaahasti


 

Verity life style in usa


 

శ్రీ మదగ్ని మహాపురాణము

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

*🔥శ్రీ మదగ్ని మహాపురాణము🔥*

.                *భాగం - 38*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 15*

🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱


*బుద్ధావతార కధనము*


అథ షోడశోధ్యాయః.

అథ బుద్ధాద్యవతార కథనమ్‌.


*అగ్ని రువాచ :*


వక్ష్యేబుద్ధావతారం చ పఠతః శృణ్వతోర్ధదమ్‌ | పురా దైవాసురే యుద్ధే దైత్యైద్దేవాః పరాజితాః. 1


రక్ష రక్షేతి శరణం వదన్తో జగ్మురీశ్వరమ్‌ | మాయామోహస్వరూపో7సౌ శుద్ధోదనసుతోభవత్‌. 2


మోహయామాస దైత్యాంస్తాంస్త్యాజితా వేదధర్మకమ్‌ | తే చ బౌద్ధా బభూవుర్హి తేభ్యోన్యే వేదవర్జితాః.


అగ్ని పలికెను. బుద్ధావతారమును గూర్చి చెప్పెదను. ఇది చదువువానికిని వినువానికిని గూడ మంచి ప్రయోజనమును చేకూర్చును. పూర్వము దేవాసుర యుద్ధము జరిగెను. ఆ యుద్ధమున పరాజితు లైన దేవతలు ''రక్షింపుము రక్షింపుము అని ప్రార్థించుచు పరమేశ్వరుని శరణు జొచ్చిరి. 


అపుడు మాయామోహ స్వరూపుడైన ఆ పరమేశ్వరుడు శుద్ధోదనుని కుమారుడుగా జనించి, దైత్యులకు మోహము కలిగించి, వారు వేదధర్మమును విడచునట్లు చేసెను. వారందరును బౌద్ధులైరి. 


ఆ పరమేశ్వరుడే ఆర్హతుడై, మిగిలిన వేదవర్జితుల నందరిని ఆర్హతులను చేసెను. ఈ విధముగ దైత్యులు వేద ధర్మాదివర్జితు లైన పాషండులుగా ఆయిరి.


నారకార్హం కర్మ చక్రుర్గ్రహీష్యన్త్యధమాదపి | సర్వే కలియుగా న్తే తు భవిష్యన్తి చ సఙ్కరాః. 5


దస్యవః శీలహీనాశ్చ వేదో వాజసనేయకః | దశ పఞ్ఛ చ శాఖా వై ప్రమాణంను భవిష్యతి. 6


వారు నరకమును ఇచ్చు కర్మలు చేసిరి. వీరందరును అధమునినుండి కూడ ప్రతి గ్రహము చేయుదురు. కలియుగాంతమున సంకర మగుదురు. శీలరహితు లైన దొంగ లగుదురు. పదునైదు శాఖలు గల వాజసనేయ వేదము ప్రమాణము కాగలదు.


ధర్మకఞ్చకసంవీతా అధర్మరుచయ స్తథా | మానుషాన్‌ భక్షయిష్యని వ్లుచ్ఛాః సార్థివరూపిణః. 7


ధర్మ మను చొక్కా తొడిగికొనిన వ్లుచ్ఛులు, రాజులై, అధర్మమునందు ఆసక్తి కలవారై మనుష్యులను భక్షించగలరు. (పీడించగలరు.)


కల్కీ విష్ణుయశఃపుత్రో యాజ్ఞవల్క్యపురోహితః | ఉత్సదయిష్యతి వ్లుచ్ఛాన్‌ గృహీతాస్త్రః కృతాయుధః. 8


విష్ణుయశుని కుమారుడును, యాజ్ఞవల్క్యుడు పురోహితుడుగా కల వాడును అగు కల్కి ఆయుధములలో మిక్కిలి నేర్పరియై, అస్త్రములను ధరించి వ్యచ్ఛులను నశింపజేయును.


స్థాపయిష్యతి మర్యాదాం చాతుర్వర్ణ్యే యథోచితామ్‌ | ఆశ్రమేషు చ సర్వేషు ప్రజాః సద్ధర్మవర్త్మని. 9


నాలుగు వర్ణములందు తగిన కట్లుబాట్లు చేయగలడు. ప్రజలను నాలుగు ఆశ్రమములందును, సద్దర్మమార్గము నందును నిలుపగలడు.


కల్కిరూపం పరిత్యజ్య హరిః స్వర్గం గమిష్యతి | తతః కృతయుగం నామ పురావత్సంభవిష్యతి. 10


విష్ణువు కల్కిరూపమును విడచి స్వర్గమునకు వెళ్లును. పిమ్మట పూర్వము నందు వలె కృతయుగ మేర్పడును.


వర్ణాశ్రమాశ్చ ధర్మేషు స్వేషు స్థాస్యన్తి సత్తమ | ఏవం సర్వేషు కల్పేషు సర్వమన్వన్తరేషు చ. 11


అవతారా ఆసంఖ్యాతా అతీతానాగతాదయః | విష్ణోర్దశావతారాఖ్యాన్యః పఠేచ్ఛృణుయాన్నరః. 12


సోవాప్తకామో విమలః సకులః స్వర్గమాప్నుయత్‌ | ధర్మాధర్మవ్యవస్థాన మేవం వై కురుతే హరిః. 13


అవతీర్ణశ్చ స గతః సగ్గాదేః కారణం హరిః |


ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే బుద్ధకల్క్యవతారవర్ణనం నామ షోడశోధ్యాయ.


ఓ మునీ ! వర్ణాశ్రమములు తమ తమ ధర్మములను ఆచరించును, ఈ విధముగా శ్రీమహావిష్ణువు అన్ని కల్పములందును, అన్ని మన్వంతరములందును అనేకము లైన అవతారము లెత్తుచుండును. 


గడచినవి, రానున్నవి అవతారములు ఎన్నియో లెక్కకు మించి ఉన్నవి. విష్ణు దశావతారములను పఠించినవాడును, వినినవాడును, పాపములు నశించి, సర్వకామములు పొంది, కులముతో కూడి స్వర్గము చేరును. 


విష్ణువు ఈ విధముగ ధర్మాధర్మవ్యవస్థ చేయుచుండును సృష్ట్యాదులకు కారణ మైన ఆ హరి ఈ విధముగ అవతరించి మరల (స్వర్గమునకు) వెళ్ళిపోయెను.


ఆగ్ని మహాపురాణమున బుద్ధకల్క్యవతారవర్ణన మను షోడశాధ్యాయము సమాప్తము.

సశేషం....


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱

పాద శ్రీ వల్లభ చరితామృతం

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

🌺🪷🌺🪷🌺🪷🌺🪷🌺🪷

*🪷శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతం🪷*

.                  *భాగం - 5*

🌺🪷🌺🪷🌺🪷🌺🪷🌺🪷

*ఓం సర్వ జగద్రక్షాయ గురు దత్తాత్రేయ*

.  *శ్రీ పాద శ్రీ వల్లభ పరబ్రహ్మాణేినమః*


    శంకరభట్టు ఒక దగ్గర  సుఖంగా కూర్చొని శ్రీపాదుల వారి చరిత్ర వ్రాయలేదు. 

చాలా ప్రయాసలకు ఓర్చి ఎనలేని  కష్టాలు పడి పరీక్షలు ఎదుర్కొని స్వామి వారిని భక్తితో  స్తుతిస్తూ    శ్రీవారి అనుమతితో స్వామివారి చరిత్ర చూసినది చూసినట్లుగా  లిఖించేరు. ఈ గ్రంథం చాలా తక్కువమంది వద్ద వున్నది.  శంకరభట్టు పడిన కష్టాలు పగవాళ్ళకి కూడా వద్దు అని అనిపిస్తుంది. మజిలీ మజిలీకి ఆయన కష్టాలు చదువుతూ వుంటే గుండె‌ ద్రవించకమానదు. 

శంకరభట్టు కదంబవనం చేరేసరికి ఆయన బరువుకోల్పోయినట్లు అనిపించి దూదిపింజలా తేలిక అయినట్లుగా అనిపించి అటు ఇటు దిక్కు తోచక తిరుగుతూవుండగా ఒక పూరాతన శివలింగం కనబడింది.

 చూడచక్కని ఆ మహా శివలింగంను చూసి భక్తితో నమస్కరించిన వెంటనే 

కాళ్శు బరువు అయినట్లుగా అనిపించి 

ఆ ఆలయప్రాంగణంలో తిరుగుతుండగా సిద్దయోగీంద్రుల వారి దర్శనం లభ్యమయినది.

సిద్దయోగీంద్రులు  దీవించి శంకరభట్టు చూసిన శివలింగం చాలా శక్తివంతమైనది  దర్శనమాత్రమున దేవేంద్రునికి బ్రహ్మహత్యా దోషము 

పోవడంవలన‌ దేవేంద్రుడు ఆ శివలింగానికి ఆలయము నిర్మించేడని చెప్పెను. సిద్దయోగింద్రులవారు శ్రీపాదుల వారి దివ్య దర్శనము చేసుకోమని స్వామివారి ఆశీస్సులు మెండుగా వున్నావని స్వామి వారి చరిత్ర వ్రాయుటకు తనను నిమిత్తం చేసుకొని స్వామివారే వ్రాసుకుంటారని చెప్పి మరలా అదే శివలింగాన్ని దర్శనము చేసుకోమని పంపించేరు.

శంకరభట్టు తీరా వెళ్ళి చూసేసరికి అచ్చట తాను లోగడ చూసిన గుడి బదులు అతి సుందరమైన మందిరం జనసందోహం తో కనబడింది.

తాను మధురలో వున్నట్లు మీనాక్షీ దేవీ సుందరేశుని‌ సన్నిధి లో వున్నట్లు అందరూ చెప్పగా ఆశ్చర్యపోయాడు. సుందరేశుని దర్శనం అనంతరం ఎక్కడ చూసినా సిధ్ధయోగింద్రుల ఆశ్రమము కనబడలేదు. 

శ్రీపాదవల్లభుని నామస్మరణ చేసుకుంటూ కొంతదూరం వెళ్ళేసరికి సిధ్దయోగింద్రులు కనబడి శంకరభట్టు చూసిన రెండూ శివాలయాలు ఒక్కటే అని. శ్రీపాదుల వారి కృపతో అప్పటి శివాలయం మరియూ ఇప్పటి శివాలయం కూడా స్వామివారు  దయతో చూడగలిగెనని సెలవిచ్చెను. మధురయొక్క స్ధలపురాణం అంతా సిధ్ధయోగింద్రులువారు వివరించి చెప్పి శ్రీపాదులవారు పిఠాపురంలో జన్మించిరని అప్పటిలో కూడా ఆ వూరిలో స్వామివారిని వ్యతిరేకించిన వారు చాలా మంది వుండేవారని  స్వామివారు తన బాల్యం నుండి  ఎన్నో లీలలు చూపించి తన 16వ యేట తల్లితండ్రులను,వూరివారిని విడిచిపెట్టి  విరాగిగా కురుపురం వెళ్ళిపోయారని త్వరగా వెళ్ళి స్వామివారి దర్శనము‌ చేసుకొమ్మని ఆశ్వీరదించి కడుపునిండా ఆహారము పెట్టి‌ చేతితో శంకరభట్టు వెన్నునిమిరి హాయిగా విశ్రాంతి తీసుకోమన్నారు. శంకరభట్టు ఒడలు తెలియకుండా నిద్రపోయాడు. ఉదయం లేచేసరికి అచ్చట‌ సిద్దయోగీంద్రుల ఆశ్రమము కనబడలేదు. ఆ వింత చూసి  తాను భ్రమలో వున్నాడా లేక సిద్దయోగింద్రుడు మాయావా,మంత్రగాడా  అని మనసులో తలపోస్తూ మూటా ముల్లె సర్దుకొని ప్రయాణించేందుకు ఉపక్రమించేడు.

సశేషం


ఒకసారి శనీశ్వరుడు దత్త స్వామి దగ్గరకు వచ్చి స్వామి రేపు నీ భక్తునికి ఏడున్నర సంవత్సరములు, కష్టములు రానున్నది. కనుక మీరు సెలవివ్వలసిందిగా ప్రార్థించారు. అప్పుడు దత్తస్వామి నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించు నా భక్తుడిని రక్షించుకుంటాను అని చెప్పి శనీశ్వరుని పంపించారు. ఆ తరువాత రోజు నుంచి ఆ భక్తునికి కష్టాలు మొదలైనాయి. అంతటి కష్టం లో ఆ భక్తుడు నిరంతరం దత్త దీక్ష లో ఉండి దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా అనే నామాన్ని నిరంతరం స్మరించ సాగాడు దాంతో శనీశ్వరుడు ఏడున్నర సంవత్సరములు అతని బాధ పెట్టవలసిన శనీశ్వరుడు కేవలం *ఏడున్నర రోజులు* మాత్రమే, అతన్ని కష్టపెట్ట గలిగాడు, ఇదంతా దత్త దీక్ష నామస్మరణ మహిమ, కనుక ఎంత కష్టాల్లో ఉన్న నిరంతరం దిగంబరా దిగంబరా శ్రీ పాద వల్లభ దిగంబరా నామకరణ మనల్ని రక్షిస్తూ ఉంటుంది. 


*సర్వం శ్రీ పాద వల్లభ చరణారవిందమస్తు🙏*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🪷🌺🪷🌺🪷🌺🪷🌺🪷

శ్రీ వివేకానందస్వామి

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.                    *భాగం 131*


*పరివర్తన చెందిన చోరుడు*


హృషీకేశ్ లోఒక గొప్ప సన్న్యాసిని స్వామీజీ కలుసుకొన్నారు. ఆయన ఉన్నత ఆధ్యాత్మిక స్థితులను పొందిన వ్యక్తిలా కనిపించగా, స్వామీజీ ఆయన  వద్దకెళ్లి మాట్లాడనారంభించారు. తమ ప్రయాణ విశేషాలు గురించి చెబుతూ తాము కలుసుకొన్న మహాత్ములను గురించి ప్రస్తావించారు. మాటల మధ్యలో పవహారీ బాబా పేరు చెప్పగానే ఆ సన్న్యాసి కళ్లవెంట నీరు ధారకట్టింది. 


గద్గదస్వరంలో ఆయన, "స్వామీజీ! మీకు బాబా తెలుసా?" అని అడిగారు. "తెలుసు" అని స్వామీజీ జవాబిచ్చారు. "ఆయన ఆశ్రమంలో జరిగిన దొంగతనం గురించి తెలుసా?” అన్న ప్రశ్నకు, "తెలుసు" అన్నారు స్వామీజీ. 


“ఒక రోజు ఆయన ఆశ్రమంలో ఒక దొంగ ప్రవేశించాడు. ఆయనను చూడగానే భయపడిపోయి, తాను దొంగిలించిన వస్తువుల మూటను అక్కడే పడేసి పరుగు లంకించుకొన్నాడు. వెంటనే ఆయన ఆ మూటను పుచ్చుకొని,దొంగను వెంబడించి కొన్ని మైళ్లు పరుగెత్తి ఎట్టకేలకు అతణ్ణి పట్టుకొన్నారు. 


ఆ మూటను అతడి పాదాల వద్ద ఉంచి, చేతులు జోడించి, చెమ్మగిల్లిన కళ్లతో, నాయనా! నిజానికి ఇవన్నీ నీవే. నీ వస్తువులను నువ్వు తీసుకొన్నప్పుడు అడ్డుపడినందుకు నన్ను క్షమించు. వీటిని పుచ్చుకో' అని ప్రాధేయపడ్డాడు" అని స్వామీజీ ఆ కథనం చెప్పి, “నిజంగానే బాబా ఒక అద్భుతమైన వ్యక్తి" అన్నారు.


మౌనంగా వింటూవున్న ఆ సన్న్యాసి కథనం పూర్తికాగానే స్వామీజీని చూస్తూ, ప్రశాంతంగా “స్వామీజీ, ఈ కథలో వచ్చిన దొంగను నేనే" అన్నాడు. స్వామీజీ ఆశ్చర్యచకితులయ్యారు. సన్న్యాసి కొనసాగించాడు:


"ఆ రోజు బాబాను కలుసుకోవడం నా జీవితంలో అనుకోని గొప్ప మలుపుగా పరిణమించింది. నా మార్గం తప్పని నేను గ్రహించాను. ఐశ్వర్యాలలో కెల్లా అత్యున్నతమైన ఐశ్వర్యమయిన భగవంతుణ్ణి పొందడానికి ఈ మార్గాన్ని ఎంపిక చేసుకొన్నాను.”🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

శ్రీమద్భగవద్గీత

 🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷

.           *🌹శ్రీమద్భగవద్గీత🌹*

.           *ప్రధమ అధ్యాయము* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

.         *అర్జున విషాద యోగము*

.                  *శ్లోకము 7*

🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷


*అస్మాకం తు విశిష్టా యే*

*తాన్నిబోధ ద్విజోత్తమ ।*

*నాయకా మమ సైన్యస్య*

*సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే ।।*


అస్మాకం — మన; 

తు — కానీ; 

విశిష్టాః  — శ్రేష్ఠ మైన వారు;                                                                                                                                

యే — ఎవరు; 

తాన్ — వారిని; 

నిబోధ — తెలుసుకొనుము;                                                                                                                                      

ద్విజ-ఉత్తమ — బ్రాహ్మణ శ్రేష్ఠుడా; 

నాయకాః  — నాయకులు;                                                                                                                     

మమ — మన; 

సైన్యస్య — సైన్యానికి; 

సంజ్ఞా-అర్థం — ఎరుక కొరకు ;                                                                                                                  

తాన్ — వారిని; 

బ్రవీమి — తెలుపుతున్నాను; 

తే  — మీకు.


*భావము:* 

ఓ బ్రాహ్మణోత్తమా, మన పక్షంలో ఉన్న ప్రధాన యోధుల గురించి కూడా వినుము, వీరు నాయకులుగా అత్యంత యోగ్యమైన వారు. మీ ఎరుకకై ఇప్పుడు వీరి గురించి తెలుపుచున్నాను.


దుర్యోధనుడు, కౌరవ సైన్యాధ్యక్షుడైన ద్రోణాచార్యుడిని "ద్విజోత్తమ" (బ్రాహ్మణులలో ఉత్తముడైన వాడు) అని సంభోధించాడు. అతను ఉద్దేశపూర్వకంగా ఆ పదాన్ని వాడాడు. నిజానికి ద్రోణాచార్యుడు వృత్తి రీత్యా యోధుడు కాడు, సైనిక విద్యని నేర్పించే గురువు మాత్రమే. ఒక కపట నాయకుడి లాగా దుర్యోధనుడు తన గురువుగారి విధేయత పట్లనే సందేహాలను కలిగిఉన్నాడు.  దుర్యోధనుడి మాటల్లో ఉన్న గూడార్థం ఏమిటంటే, ఒక వేళ ద్రోణాచార్యుడు ధైర్యవంతంగా పోరాడక పోతే అతను దుర్యోధనుడి రాజ మందిరంలో భోజనానికి ఆశపడే సామాన్య బ్రాహ్మణుడు మాత్రమే అవుతాడు అని.


ఈ విధంగా మాట్లాడిన దుర్యోధనుడు, తన స్వంత ఉత్సాహాన్ని తన యొక్క గురువు గారి యొక్క ఉత్సాహాన్ని పెంచటానికి తన పక్షంలో వున్న మహా యోధుల గురించి పేర్కొనటం మొదలు పెట్టాడు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

పెరియ పురాణం

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.          *⚜️పెరియ పురాణం⚜️*

.           *నాయనార్ల చరిత్ర - 43*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 

*కలియ నాయనారు*


తొండ మండలంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో తిరువొట్రియూరు ఒకటి.

ఆ గ్రామంలో గాండ్ల కులానికి చెందిన గొప్ప శివభక్తుడైన కలియనాయనారు

అవతరించాడు. శ్రీమంతుడైన అతడు తిరువొట్రియూరు శివాలయానికి

వెళ్లి రాత్రింబగళ్లు దీపాలు వెలిగించడం ఒక వ్రతంగా నిర్వహిస్తూ వచ్చాడు.


 కలియ నాయనారు శివభక్తిని పరమేశ్వరుడు లోకానికి తెలియజేయాలని

అనుకున్నాడు. అది మొదలుకొని నాయనారు సంపద రోజు రోజుకూ

క్షీణించడం ప్రారంభించింది. అయినప్పటికీ కలియ నాయనారు గుడిలో

దీపాలు వెలిగించే వ్రతాన్ని మాత్రం మానలేదు. కూలిపనికి వెళ్లి వచ్చిన

డబ్బులతో గుడిలో దీపాలు వెలిగించాడు. కొద్ది రోజులైన తరువాత అతనికి

కూలి పని కూడ దొరకలేదు. 


ఇంటిని, ఇంటిలోని వస్తువులను అమ్మి

దేవాలయంలో దీపారాధన నిర్వహించాడు. ఆ డబ్బులు కూడ పూర్తిగా

ఖర్చయిన తరువాత తన భార్యను అమ్మి తన వ్రతాన్ని నిరాటంకంగా

జరపాలనుకున్నాడు. భార్యను పిలుచుకొని నగరమంతటా తిరిగినప్పటికీ

ఆమెను కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు.

దీపాలు వెలిగించడానికి అతనికి ఏ మార్గమూ తోచలేదు.


దేవాలయానికి వెళ్లి ప్రమిదలను వరుసగా అమర్చి వాటిలో వత్తులను వేశాడు. “దీపాలు వెలిగించకుండా జీవించడం కన్నా మరణించడమే మేలు.

నా శరీరంలోని రక్తంతో దీపాలను వెలిగిస్తాను" అని నిశ్చయించుకున్నాడు.

కత్తితో తన శరీరాన్ని పొడుచుకొన్నారు. కరుణామూర్తి అయిన పరమేశ్వరుడు

ప్రత్యక్షమై కలియ నాయనారుకు శివలోక పదవిని అనుగ్రహించాడు.


*నలభైమూడవ చరిత్ర సంపూర్ణం*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

నీతి శాస్త్రం

 *రాజా రాష్ట్రకృతం పాపం రాజపాపం పురోహితః౹* *భర్తా చ  స్త్రీకృతం పాపం శిష్య పాపం గురోరపి॥* ( గురుస్తథా )

- నీతి శాస్త్రం

తాత్పర్యము - రాజ్యానికి రాజు తండ్రి వంటివాడు  కనుక . రాజ్యంలో ప్రజలను ధర్మమార్గంలో పెట్టవలసిన బాధ్యత రాజుది. ప్రజలు తప్పు ద్రోవ పడితే, దానికి రాజే బాధ్యత వహించాలి. అందువలన ప్రజలు చేసిన పాపాలు బాధ్యుడు రాజు; రాజుకు సరైన సలహాలు ఇస్తూ , అతడు ధర్మం తప్పకుండా ఉండేలా చూడాల్సిన బాధ్యత పురోహితులది. ఒకవేళ పురోహితులు రాజుకు సరైన సలహాలు ఇవ్వని పక్షంలో రాజు చేసిన పాపాలకు పురోహితులు బాధ్యులు. భార్యకు భర్త గురువుతో సమానము. భరించువాడు భర్త. ఆమెను ధర్మ మార్గంలో పెట్టవలసిన వాడు, ఆమెకు సరైన మార్గదర్శనం చేయనిపక్షంలో భార్య చేసిన పాపం భర్తను చేరుతుంది. తనను శరణు వేడినవారికి ధర్మమార్గం చూపి, మార్గదర్శనం చేయుట గురువు కర్తవ్యం. శిష్యుడు చేసిన పాపాలన్నిటికి గురువే బాధ్యుడవుతాడు. పైగా శిష్యుని బాధ్యతను తీసుకున్నందుకుగానూ శిష్యుడు చేసిన పాపాలన్నీ గురువునే చేరతాయి.