23, సెప్టెంబర్ 2024, సోమవారం

24. " మహాదర్శనము

 24. " మహాదర్శనము "--ఇరవై నాలుగవ భాగము --ఉపనయనపు సంభ్రమము


24.  ఇరవై నాలుగవ భాగము--  ఉపనయనపు సంభ్రమము 



          చైత్ర శుద్ధ పంచమి గురువారము యాజ్ఞవల్క్యునికి ఉపనయనము . కేవలము పంచాంగపు లెక్క ప్రకారము వయస్సు నిర్ణయించువారంతా , " ఇదేమిటి , పిల్లవాడికి ఐదేండ్లయినా నిండలేదు , వాడి నోటికి మంత్రాలు వస్తాయా ? " అని మందలించేవారిలాగా మాట్లాడుతారు . అయితే వాడిని కళ్ళారా చూచినవారు మాత్రము , " వాడిని చూస్తే ఎనిమిదేళ్ళ పిల్లవాడిలాగా ఉన్నాడు. నోటిలో మాటలు పటపటమని పేలాలు వేయించినట్లు వస్తున్నాయి , శ్లోకములను అంత స్ఫుటముగా పలికేవాడికి మంత్రాలేమి కష్టము ? " అంటారు .


         జాయంతీ , ఆమె భర్త మహిదాసుడూ ఉపనయనపు ఆహ్వానమును చూచి చకితులైనారు . మహిదాసుడు ఏవేవో కార్యాంతరముల వలన గడచిన రెండు సంవత్సరాలుగా మనవడిని చూడనేలేదు . జాయంతి , కూతురు పంపిన వర్తమానమును భర్తకు చెప్పినది : " పోయిన సంవత్సరమే , అంటే , ఆ ధేనువు మాట్లాడిన ప్రసక్తి వచ్చింది కదా , అప్పుడే , గర్భ పంచమములో ఉపనయనము కావలెనని బుడిలులు చెప్పినారట ! వారి ఇంట్లో , ముఖ్యముగా మీ అల్లుడికి బుడిలుల మాట అంటే వేద వాక్యము కదా ? " అన్నది . 


        మహిదాసులు , " బుడిలులంతటి వారు వేలకొక్కరు ఉంటే అపురూపము . కాబట్టి వీరలా ఉండడం లో అతిశయమేముంది ? " అని , ఆ మాటకు ఒప్పుకొని , ’ ఐతే బయలుదేరేది ఎప్పుడు ? ’ అని అడిగారు . 


        జాయంతి నవ్వుతూ , " నన్నడిగితే ?  మీరు ఎప్పుడు బండి తెచ్చి నిలిపితే అప్పుడే ’ అన్నది . మహిదాసుడు ఆలోచించి , " పాడ్యమినాడు స్థాలీపాకము ముగించుకొని వెళదాము " అన్నాడు .


        జాయంతి , వృద్ధులకు మాత్రమే సాధ్యమైన ఎత్తిపొడుపుగా అంది " అలాగ వెళ్ళుట ఎందుకు ? రావడము లేదు అని చెప్పి పంపిస్తే ఎంతో క్షేమము " 


మహిదాసుడు ఈ వెటకారానికి సిద్ధముగా లేడు . " అలాగంటే ? " అన్నాడు .


          " చూడండి , తెలియనట్లు మాట్లాడుచున్నారు . నేను ఇక్కడి నుండీ వెళ్ళిన తరువాత అక్కడ ఎంత పని ఉంటుంది ? అప్పడములు , వడియములు చేయవలెను . బాణలి పట్టుకోవలెను , ఉండలు సిద్ధం చేయవలెను , ఇంత, కొండంత పని ఉంచుకొని , నేను పాడ్యమికి బయలుదేరితే  చూసేవారేమంటారు ? " 


        " ఔను , నువ్వు నీ కూతురి గురించి ఆలోచించినావు , నిజమే , ఇవన్నీ నువ్వు వెళ్ళు వరకూ ఆలంబి చేయదు . అలాగయితే , ఇలాగ చేయి , రేపు దశమే కదా , మధ్యాహ్నము భోజనము అయ్యాక బయలుదేరు . నేను విదియకు వచ్చేస్తాను . " 


          " మీమాటకి ఎప్పుడైనా ఎదురు చెప్పానా ? అయితే , రేపు మీరు కూడా నాతో పాటు వచ్చి , నన్ను అక్కడ వదలి , అల్లుడుగారిని మాట్లాడించుకొని , వచ్చేయండి . మరలా విదియకు రావచ్చు గాని ? " 


        " దీనికేనా నన్ను మొద్దు అనేది ? ఆ మాత్రము నాకు తెలీదనుకున్నావా ? ఏకాంతముగా బండిలో కూర్చొని వినోదము చేయుటకు  అవకాశముంటుందని నీ ఎత్తుగడ ? " 


ఆ మాటకు అసహనము నటిస్తూ , " వయసైపోయినాక కూడా ఇవే మాటలా ? " అంది జాయంతి.


          మహిదాసుడు ఆమెను కవ్వించునట్లు కొంటె నవ్వు నవ్వుతూ , " కొన్ని పళ్ళు దోరగా ఉన్నపుడు రుచి , కొన్ని పళ్ళు సపోటా వంటివి ,  చెట్టుపైనున్ననూ , కొన్ని రోజులైనా మాగితే రుచి , ఏదో నాపాలిటికి సపోటా దొరికింది " అన్నాడు. ఆ హావభావ విన్యాసాలు , దేహపు ఏవేవో భాగాలను సపోటకు పోల్చినట్టున్నాయి , అయితే అవి ఇద్దరికీ హితముగానే అనిపించినాయి . 


        జాయంతి , భర్తతో పాటు దశమికి కూతురు ఇంటికి వచ్చింది . అమ్మ వచ్చిందని కూతురికి కలిగిన సంభ్రమము , సంతోషము , అంతా ఇంతా కాదు . తాను , తన కొడుకుతో తల్లిదండ్రులకు నమస్కారము చేసి , భర్తను పిలుచుకు వచ్చి నమస్కారము చేయించినది . తల్లిని బచ్చలింటికి పిలుచుకొని వెళ్ళి " నువ్వొచ్చినావు , ఇక అన్నీ నిరాటంకముగా జరుగుతాయి " అంది . " కాళ్ళు ముఖము కడుక్కొని రా , అంతా చెబుతాను " అన్నది . 


        అంత లోపల యాజ్ఞవల్క్యుడు పరుగెత్తి వచ్చినాడు , " అమ్మా , తండ్రి గారు రమ్మన్నారు , రా " అన్నాడు . ఆలంబిని భర్తను చూడటానికి కొడుకుతో పాటు వెళ్ళింది .


        భర్త మామగారిని చూపించి , ’ వారు ఎప్పుడు బయలుదేరి వచ్చినారో ఏమో , మడి సిద్ధము చేయి " అన్నాడు . ఆలంబిని , " లే నాయనా , అంతా సిద్ధముగా ఉంది " అంది . అప్పటికే కొడుకు వెళ్ళి ఒక దుత్తలో నీరు తెచ్చినాడు .


మహిదాసుడు , " ఏమిటయ్యా ? నేనే కాళ్ళు కడుక్కొనేదా ? నువ్వు కడుగుతావా ? "  అని అడిగినాడు . 


        యాజ్ఞవల్క్యుడు తండ్రిని చూపించి , " వారి అనుమతి అయితే నేనే చేస్తాను " అన్నాడు . దేవరాతుడు , ’ అలాగే కానీవయ్యా ’ అన్నాడు మహిదాసుడు కాళ్ళు జోడించి నిలుచున్నాడు . యాజ్ఞవల్క్యుడు భక్తితో తాత పాదాలు కడిగి ఆ నీటిని తల్లిదండ్రులకు ప్రోక్షించి , తానూ ప్రోక్షించుకున్నాడు . 


       మహిదాసుడు మనవడి ఆ భక్తిని చూచి చాలా మెచ్చుకొని . " కొడుకును బాగా పెంచినారు . ఇంత భక్తి సంపన్నుడై ఉండుట మనందరి భాగ్య విశేషము ! " అని నోరారా పొగిడినాడు . 


        మహిదాసుడు మడి కట్టుకొని వచ్చి కూర్చున్నాడు . మామగారికి అల్లుడు ఉపచార పూర్వకముగా , పత్నీ ముఖముగా అల్పాహారమును నివేదించినాడు . అల్పాహారమైనాక మహిదాసుడు ప్రయాణమయినాడు . ఉండమని ఎంత అడిగిననూ , ’ విదియ నాటికి వస్తానుకదా ’ అని బయల్దేరినాడు . ఆలంబినీ , దేవరాతుడూ కొడుకుతో పాటు నమస్కారము చేసి , " కుటుంబపు వారందరినీ పిలుచుకొని రావలెను " అని విన్నవించుకున్నారు . 


         ఆలంబిని తండ్రిని పంపించి తల్లి వద్దకు వచ్చింది . " అమ్మా , నువ్వు వచ్చినావుకదా , ఇక ఒడుగు నిరాటంకముగా లక్షణముగా జరుగుతుంది. విను , మొదటిది రాజాస్థానము వారి సంగతి . వచ్చి ఇక్కడ చూడు , ఈ సామానులన్నీ రాజ భవనము నుండీ వచ్చినాయి . చూడు , నాలుగు మూటలు మంచి సన్నబియ్యము , రెండు మూటలు గోధుమలు , రెండు మూటలు చక్కెర , ఒక మూట బెల్లము , నాలుగు పెద్ద బిందెల నిండా నెయ్యి , ఇంకా వీటితోపాటు కావలసిన సామానులు . అక్కడ చూడు , నూనె ఎనిమిది గంగాళములు , ఇవన్నీ ఎందుకో తెలుసా ? చౌల పంక్తిలో పిల్లలకు , బ్రహ్మ భోజనములో బ్రాహ్మణులకు పంచాన్నములూ , పంచ భక్ష్యములూ కావలెనంట. నేతిని దొన్నెలతో వడ్డించాలే గానీ , గరిటతో వడ్డించరాదట . అప్పుడు వైశ్వానరుడు తృప్తుడై మనందరినీ కటాక్షించునట్లు చేయవలెనట . అది రాజాజ్ఞయట . మూడు దినములనుండీ వీరు వద్దు వద్దు అంటున్నారు , భార్గవులేమో , ’ రాజధానిలో ఉండి రాజాజ్ఞను మీరుట ఎవరి తరమూ కాదు . మీ పుత్రుడు సర్వజ్ఞుడగునని బుడిలులు చెప్పినారట ? బుడిలుల మాట అంటే రాజభవనములో ఎంత గౌరవమో తెలుసా ? ఆ సర్వజ్ఞునికి మా కానుక అని వారు ఇస్తుంటే , మీ అడ్డము ఏమిటి ? " అని నానా రాద్దాంతము చేసి చివరికి ఒప్పించినారు . ఇది ఒకటయిందా ? "


" సరేనమ్మా " 


" కార్యక్రమము ముగిసిన మరుసటి రోజు ఊరికంతటికీ సమారాధన కావలెనంట. "


" సరే "


         " సరే , ఇదంతా బయటి వ్యవహారమైంది , ఈ ఉపనయనము అంటే పరమ వైదీక కర్మ. ఏదో బుడిలులు ఉండి , అన్నీ చూచుకొని వెళ్ళెదరు , అయినా మన ఆడవారి కర్మలు దేనిని తప్పించుకోగలము ? నువ్వే చెప్పు . అయినా , నేను ఉపనయనాలు మళ్ళీ మళ్ళీ చేస్తానా ?  చెప్పు ? ఇదొకటేగా . దీనిని ఆడంబరముగా చేసితీరవలెను . ఇంకా పది సంవత్సరములైనా ఆడవాళ్ళు , మగవాళ్ళు అందరూ ఈ ఒడుగును గుర్తు చేసుకుంటూ ఉండవలెను , అంత గొప్పగా చేయవలెను . చూడమ్మా , నువ్వు చేయగలనంటే , జంతికలు , ముచ్చార్లు ఎలాగుండాలో తెలుసా ?  అవి చూసి మగవారు కళ్ళు తిప్పుకోలేనట్లుండాలి , పెద్ద కంచములో నయినా , తుంచకుండా ఉంచలేనంత పెద్దగా ఉండాలి . ఉండలు కూడా అలాగే ! తలకాయంత పరిమాణములో ఉండవలెను . ఏమమ్మా ? సరేనా ? "


        ఆలంబిని చిన్నపిల్ల కన్నా ఎక్కువగా , తల్లి వద్ద , కాదు , తల్లి ఒడిలో కూర్చొనుటకూ సిద్ధమై , తన ఆశలను , కోరికలను , ఆడంబరపు అవసరాన్ని , తన అభిప్రాయాలను చెప్పుకున్నది . కూతురి తల నిమురుతూ , " చక్కిలములనైతే పెద్దవిగా చేయవచ్చు , దానికి తగ్గ బాణలి తెప్పించు , అంతే . ఉండలను మన కైవాటము కొద్దీ చేయవచ్చు . అంతకన్నా పెద్దగ చేయుట ఎలా సాధ్యము ? కానిమ్ము , ఎంత పెద్దగా వీలగునో అంత పెద్దగా చేదాము . మరి అప్పడములూ , వడియములూ ? "  అన్నది . 


         " అప్పడములు పెద్దవిగా ఉండవలెను , వడియములు లావుగా ఉండవలెను . నువ్వు తాంబాణి , బాణెల అన్నావు కదా , వాటిని కావాలనే పెద్దగా చేయించినాను . ఒక మూట చక్కిలం పిండి , రెండు మూటలు  వడ్ల పేలాలు , రెండు మూటలు అటుకులు , దానికి కావలసిన ఇతర దినుసులు , ఒక మూట ఉద్ది పిండి , వెలిగారము , నల్లేరు , అన్నీ తెప్పించినాను . అన్నీ ఒకసారి చూసుకో . ఇంకేమైనా కావాలంటే చెప్పు , అవికూడా తెప్పిస్తాను . "


తల్లీకూతుర్లు , సామానులు , దినుసులున్న గదికి చూచుటకు వెళ్ళినారు . 

Janardhana Sharma

"ఒక పుష్పంబు

 


"ఒక పుష్పంబు భవత్పదద్వయముపై

 నొప్పంగ సద్భక్తి రం

 జకుడైపెట్టిన,పుణ్యమూర్తికి పునర్జన్మంబులేదన్న, బా

యక కాలత్రితయోపచారముల నిన్నర్చించుచున్ పెద్ద  నై

 ష్ఠికుడై యుండెడువాడు,నీవగుట తా

 చిత్రంబె? సర్వేశ్వరా!


సర్వేశ్వర శతకం-చిమ్మపూడి అమరేశ్వరుడు.


భావం: ఓసర్వేశ్వరా!నీపాదాలపై భక్తితో ఒకపువ్వుంచి

ప్రార్ధించినవాడికి పునర్జన్మమేలేదని పురాణాలుప్రవచిస్తున్నాయ్.అలాంటిది ముక్కాలములయందూ మూడుసంధ్యలా ,మహానిష్ఠతో నిన్నర్చించేవాడు నీలోసమైక్యమైతే యిక నాశ్చర్యపడవలసినదేమున్నది?అనిభావం.


          ఈశ్వరార్చనకు ఫలితం జన్మరాహిత్యమేనని,ఈశ్వరసాయుజ్యమేనని చెప్పే యీపద్యం.కాకతిరాజులకు

సమకాలికుడైన చిమ్మపూడి రచించుట విశేషం.🌷🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

బ్రాహ్మణులు

 జై శ్రీ రామ్

‘‘బ్రాహ్మణులు’’ అనే మాట ‘బ్రాహ్మన్’-అంటే ‘‘యజ్ఞం’’ అనే పదం నుండి వచ్చింది. యజ్ఞాలు చేసే వారు బ్రాహ్మణులని చెప్పుకోవచ్చు. అలానే ‘బ్రహ్మ’ అంటే వేదం అని, జ్ఞానం అని, వీటి నుంచే బ్రాహ్మణ శబ్దం వచ్చిందని చెప్పుకోవచ్చు. వేదాధ్యయనం చేసినవాడు బ్రాహ్మణుడు అని అర్థం. బ్రాహ్మణ స్ర్తియందు, బ్రాహ్మణ పురుషుడి వలన జన్మించి, తదుపరి, జాతి, కులం, వృత్తి, స్వాధ్యాయం, జ్ఞానాల వల్ల బ్రాహ్మణుడిగా పిలువబడతాడు. తాను నిరంతరం చదువుకుంటూ వుండడం, శిష్యులకు బోధించడం, యజ్ఞాలు చేయడం, యజమానులతో చేయించడం, దానాలు ఇవ్వడం-తీసుకోవడం బ్రాహ్మణులు చేయాల్సిన పని. బ్రాహ్మణ వంశంలో పుట్టిన వారంతా బ్రాహ్మణులు కాలేరు. వారిలో ఉపనయనాది సంస్కారాలు, వైదిక కర్మలు లేని వారిని ‘‘మాత్రులు’’ అని, వైదికాచారాలు పాటిస్తూ శాంత స్వభావులైన వారిని ‘‘బ్రాహ్మణులు’’ అని, బ్రాహ్మణోచితమైన షట్ కర్మలను ఆచరించే వారిని ‘‘శ్రోత్రియులని’’, నాలుగు వేదాలను అధ్యయనం చేసిన వారిని, విద్వాంసులు,‘‘అనూచానులు’’ అని, ఇంద్రియాలను తమ వశంలో వుంచుకున్నవారిని ‘‘భ్రూణులు’’ అని, ఎప్పుడూ ఆశ్రమంలోనో, అరణ్యంలోనో వుండే వారిని ‘‘ఋషికల్పులు’’ అని, రేతస్కలనం లేక సత్య ప్రజ్ఞులైన వారిని ‘‘ఋషులు’’ అని, సంపూర్ణ తత్వ జ్ఞానం కలవారిని ‘‘మునులు’’ అని అంటారు. అఖండ భారత దేశంలోని అన్ని ప్రాంతాలలో బ్రాహ్మణులు విస్తరించి వున్నారు. ఉత్తర భారతంలో పంచగౌడులుగా, దక్షిణ భారతంలో పంచ ద్రావిడులుగా పిలువబడే స్మార్త గౌడ సరస్వతీ బ్రాహ్మణులు (ఆంధ్రా తెలంగాణా ప్రాంతాల్లో గౌడు లేదా గౌడ అని పిలుస్తారు), భారతావనికి ఆవల వున్న దేశాలలోనూ వున్నారు. నేపాల్‌లో ‘‘బహున్’’లుగా, మయన్మార్‌లో ‘‘పొన్న’’లుగా, వివిధ పేర్లతో బ్రాహ్మణులున్నారు. దక్షిణాది బ్రాహ్మణులతో స్మార్తులని, వైష్ణవులని, మధ్వులని, మూడు ప్రధానమైన విభాగాలున్న


జై శ్రీ రామ్ 

కంచర్ల వెంకట రమణ

(23-09-2024) రాశి ఫలితాలు

  (23-09-2024) రాశి ఫలితాలు



గురు నారాయణ భవిష్యవాణి వారి ఉచిత నిత్య రాశి ఫలితాలు మీ రాశి ఫలితాలు

మీరు ఏ సమస్యల్లో ఉన్నా మీ జాతకం/హస్తరేఖలు చూసి మీ సమస్య లకు పరిష్కారం చేయగలం సమర్ధులం పూజ/గ్రహజపం/హోమం ద్వారా ఖచ్చితంగా పరిష్కారం చేయగలం ఇప్పుడే ఫోన్ చేయండి "జ్యోతిష్య రత్న" జరిగిన విషయం లు చెప్పి మీ భవిష్యత్తు చెప్పగలం వివాహం నకు జాతకం లు సరిపోల్చుట కూడా చూడబడును మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి 7981622895 గత 35 సంవత్సరంల నుండి ఇదే ఫీల్డ్ లో ఉన్నాం మా దగ్గర సిద్ధి పొందిన మంత్రాలు ఉన్నాయి మా గురువు ల ద్వారా మాకు వచ్చాయి. విద్య ఉద్యోగం వివాహం సంతానం కారాగృహ విముక్తి అనారోగ్యం రాజకీయ పదవులు ఋణ విమోచనం వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి రోగ నివారణ శత్రువులు నుంచి రక్షణ గృహ నిర్మాణం ఇలా ఏదైనా పరిష్కారం చేయగలం సమర్ధులం హోమం ద్వారా ఖచ్చితంగా మీ కోరికలు తీరేలా చేయిస్తాం మీ కోరికలు తీరకపోతే మీ ధనం వాపసు ఇస్తాం షరతులు వర్తిస్తాయి  

మీ తండ్రి గారు స్వర్గస్తులైన తిథి గుర్తు లేకపోతే మహాలయ పక్షం లో అమావాస్య నాడు శ్రాద్ధ కర్మ చేయొచ్చు.

శ్రాద్ధ కర్మలు మూడు రకాలు 

1. అన్న శ్రాద్ధం 

2. ఆమ శ్రాద్ధం 

3. హిరణ్య శ్రాద్ధం.

మొదటి ది యథావిధిగా బ్రాహ్మణులు కి అన్నం వండి భోజనం తర్వాత పిండప్రదానం చేయాలి. రెండో ది స్వయంపాకం బ్రాహ్మణులు కి దానం ఇవ్వాలి దక్షిణ కూడా ఇవ్వాలి. మూడోది కేవలం ధన మాత్రమే బ్రాహ్మణులు కి శ్రాద్ధం నిమిత్తం ఇస్తారు ఇంకా చెప్పాలంటే ఫోన్ చేయండి 

మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి

సకల శుభ పౌరోహిత్యం కార్యక్రమాలు చేయించబడును

మేషం

 23-09-2024

మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు . విలువైన వస్తు లాభాలు పొందుతారు.ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.ఇంటా బయట బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులు ఆశించిన స్థానచలన సూచనలున్నవి.


వృషభం

 23-09-2024

 దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఇంటాబయట సమస్యలు చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు సాదాసీదాగా నడుస్తాయి. ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురవుతారు.


మిధునం

 23-09-2024

చేపట్టిన పనులలో మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తవుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి.


కర్కాటకం

 23-09-2024

సంఘంలో పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ఆర్థిక లాభాలు పొందుతారు. నిరుద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.


సింహం

 23-09-2024

కీలక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు అమలు చెయ్యడం మంచిది. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగస్తులు విధుల్లో సమస్యలు తప్పవు. బంధు వర్గం వారితో విభేదాలు కలుగుతాయి


కన్య

 23-09-2024

వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. నూతన రుణయత్నాలు కలసిరావు. స్థిరస్తి ఒప్పందాలలో ఆటంకాలు తప్పవు. చేపట్టిన పనులు మధ్యలో వాయిదా పడతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు. ఉద్యోగులకు సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి.


తుల

 23-09-2024

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. భూవివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి.


వృశ్చికం

 23-09-2024

సంఘంలో పెద్దల నుండి వివాదాలకు సంభందించి ముఖ్య సమాచారం అందుతుంది. పనుల్లో మరింత పురోగతి సాధిస్తారు. మిత్రుల నుంచి వివాహ శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో సానుకూల ఫలితాలుంటాయి.


ధనస్సు

 23-09-2024

ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల వలన మానసిక సమస్యలు కలుగుతాయి. నిరుద్యోగులు మరింత కష్టపడాలి. వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడుతాయి.


మకరం

 23-09-2024

ఇతరులకు ధనపరంగా మాట ఇవ్వడం మంచిది కాదు. గృహమున మీ ఆలోచనలు అందరికి నచ్చవు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. స్థిరస్తి వ్యవహారాలలో తొందరపాటు మంచిది కాదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.


కుంభం

 23-09-2024

సన్నిహితుల నుండి కీలక విషయాలు తెలుసుకుంటారు. సంతనానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగ విషయంలో సమస్యలు అదిగమించి ముందుకు సాగుతారు. ఆర్థిక పరంగా ఇబ్బందులు తొలగుతాయి.


మీనం

 23-09-2024

ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలలో భాగస్థులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి.

*శ్రీ విరూపాక్ష దేవాలయం*

 🕉 *మన గుడి : నెం 448*


⚜ *కర్నాటక  : హంపి : విజయనగర*






⚜ *శ్రీ విరూపాక్ష దేవాలయం*



💠 హంపిని ఎప్పుడైనా సందర్శించాలని ప్లాన్ చేస్తున్నారా?  అయితే, హంపిలోని అత్యంత పురాతనమైన మరియు పవిత్రమైన విరూపాక్ష దేవాలయాన్ని తప్పకుండా సందర్శించండి. 



💠 శివునికి అంకితం చేయబడిన విరూపాక్ష దేవాలయం, కర్ణాటకలోని పురాతన నగరం హంపిలో ఒక ప్రముఖ మైలురాయి. 

ఈ ఆలయం కేవలం మతపరమైన ప్రదేశం మాత్రమే కాదు, చారిత్రక మరియు నిర్మాణ అద్భుతం, ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులను ఆకర్షిస్తుంది. 


💠 విరూపాక్ష దేవాలయం దక్షిణ భారత ఆలయ నిర్మాణ శైలిలో నిర్మించబడింది, దీనిని ద్రావిడ శైలి అని కూడా పిలుస్తారు.


💠 హంపిలోని విరూపాక్ష దేవాలయం రూపకల్పన మరియు నిర్మాణంలో గణిత శాస్త్ర ఆలోచనలను ఉపయోగించడం అనేది కొంతమందికి మాత్రమే తెలిసిన అత్యంత ఆసక్తికరమైన అంశాలలో ఒకటి. 

 

💠 ఈ ఆలయాన్ని విజయనగర సామ్రాజ్యం యొక్క ప్రౌడ దేవ రాయ అని కూడా పిలువబడే పాలకుడు దేవరాయ II ఆధ్వర్యంలోని నాయకుడు లక్కన్ దందేశ నిర్మించారు . 


💠 హంపిని పంపా క్షేత్రం, కిష్కింధ క్షేత్రం మరియు భాస్కర క్షేత్రం అని కూడా అంటారు.


🔆 *ఆలయ చరిత్ర*


💠 విజయనగర సామ్రాజ్యానికి పూర్వం నుండే ఈ విరూపాక్ష దేవాలయం ఉందని శీలా శాసనాలు ద్వారా తెలుస్తున్నది. 

చరిత్రకారులు దీనిని 10-12 శతాబ్దాలకు చెంది ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

చారిత్రక ఆధారాల ప్రకారం, ప్రధాన ఆలయాన్ని చాళుక్యులు మరియు హొయసలులు మార్పులు చేసారు, అయితే ప్రధాన ఆలయాన్ని విజయనగర రాజులు నిర్మించారు.

విజయనగర రాజుల పతనం తరువాత, దండయాత్రల వలన 16 వ శతాబ్ధానికి హంపి నగరం లోని అత్యద్భుత శిల్ప సౌందర్యం నాశనం చేయబడింది.


💠 విరూపాక్ష ఆలయంలో దేవునికి ధూపదీప నైవేద్యాలు నిరంతరాయంగా కొనసాగాయి. 19వ శతాబ్దం ప్రారంభంలో ఈ దేవాలయంపై కప్పు పై చిత్రాలకి, తూర్పు, ఉత్తర గోపురాలకి జీర్ణోద్ధరణ జరిగింది.


🔆 *విరుపాక్ష దేవాలయ వర్ణన* 


💠 ఈ ఆలయానికి 3 ప్రాకారాలు ఉన్నాయి. 9ఖానాలతో 50 మీటర్ల ఎత్తులో ఉన్న తూర్పు గోపురం లోని రెండు ఖానాలు రాతితో నిర్మించబడ్డాయి. 

మిగిలిన 7 ఖానాలు ఇటుకతో నిర్మించబడ్డాయి.


💠 తూర్పు ముఖంగా, విరూపాక్షాలయంలో 11 అంతస్తుల ఎత్తైన ప్రధాన రాజ గోపురం ఉంది. ఈ  రాజగోపురంపై స్త్రీ పురుషుల, జంతువుల శిల్పాలు చాలా ఉన్నాయి. 

గోపుర ద్వారం లోపల ఒక పక్క  పక్క మూడు తలల  నంది, ఇంకొక పక్క ఒక చిన్న నంది ఉన్నాయి. వీటికి ఎదురుగా మరో గోపురమున్నది.


💠 ఈ రెండో గోపురం మొదటి దానికన్నా చిన్నది. దీనిని రాయలవారి గోపురం అంటారు. దీనిని శ్రీ కృష్ణ దేవరాయల వారు నిర్మించినందున దీనిని రాయల గోపురం అని కూడా అంటారు. 

ఈ ద్వారం తర్వాత ఉన్నదే రెండో ఆవరణం.


💠 ఇందులో మధ్యన - ముఖమంటపం, దాని తర్వాత గర్భగుడి ఉన్నాయి. 

గర్భగుడి చుట్టూ ఉన్న వరండాలలో ఇతర దేవతా ఉప ఆలయాలు ఉన్నాయి.

 అవి పాతాళేశ్వర, ముక్తి నరసింహ మరియు శ్రీ వేంకటేశ్వరుడు వంటి దేవతల ఆలయాలున్నాయి.


💠 విరూపాక్ష స్వామి వారికి పంపాపతి అనే మరొక పేరు కలదు. 

పూర్వం పంపానదిగా పిలువబడినదే ఈనాటి తుంగభద్రనది. 

ఈ ఆలయంలో త్రికాల పూజలు జరుగుతాయి. ఈ ఆవరణంలో దీపస్తంభం, ధ్వజస్తంభం, నాలుగు కాళ్ల మంటపం ఉన్నాయి నాలుగు కాళ్ల మంటపంలో, మూడు' నందులున్నాయి.

తర్వాత ముఖమంటపం ఉన్నది. 

ముఖ మంటపంలోనికి ఎక్కేమెట్ల ప్రక్కన ఒక శిలాశాసనం పురాతన తెలుగులో రెండు వైపులా చెక్కి ఉన్నది. 

ముఖమంటపం అనేక స్తంభాలతో, వాటిపై అతి సుందర శిల్పాలతో మలచబడి ఉన్నది.


💠 గర్భగుడికి కుడిప్రక్కన కొంత ఎత్తులో స్వామి వారి బంగారు రత్న ఖచిత కిరీటం యొక్క చిత్రపటం ఉన్నది. 

ఈ అసలు కిరీటాన్ని శ్రీకృష్ణదేవరాయలవారు చేయించాడు.


💠 ప్రస్తుతం ఆ కిరీటం ప్రభుత్వ ఖజానాలో భద్రపరచబడి ఉన్నది. ఉత్సవాల సందర్భాలలో దాన్ని స్వామివారికి ధరింపజేస్తారు.


💠 విరూపాక్ష దేవాలయం దగ్గరలో గణపతి విగ్రహం ఉన్నది. ఈ గగణపతి విగ్రహం 15 అడుగుల ఎత్తు మరియు విగ్రహం పైభాగంలో  శనగబడలవలే బుడిపెలతో కూడుకొని ఉంటుంది. దీనిని శనగలరాయి గణపతి అని అంటారు. దీనికి సమీపంలోనే వేరొక విగ్రహం అతి చిన్న చిన్న బుడిపెలతో కూడుకొని 10 అడుగుల ఎత్తులో ఉంటుంది.

దీనిని ఆవాలరాయి గణపతిగా పిలుస్తారు. 


💠 ఈ ప్రాంతమే రామాయణంలో సుగ్రీవుడు నివసించిన కిష్కింద అని తన సోదరుడైన వాలి నుండి తప్పించుకోవడానికి ఇక్కడే ఒక గుహలో నివసించేవాడని, రామచంద్రమూర్తి సుగ్రీవుడిని ఇక్కడే కలిసాడని తెలియుచున్నది.


💠 గర్భగుడికి వెనుక ఉన్న ద్వారం గుండా బయటకు వెళితే అక్కడ శ్రీ విద్యారణ్యస్వామివారి మఠం, ఆలయం ఉన్నది.

ఈ విద్యారణ్యస్వామి 'విజయనగర సామ్రాజ్య నిర్మాణకర్త. 


💠 బెంగుళూరు నుండి 350 కి.మీ మరియు బళ్లారికి 75 కి.మీ. దూరంలో వుంది. 

*శ్రీ శంకరాచార్య చరిత్రము 20

 _*శ్రీ శంకరాచార్య చరిత్రము 20 వ భాగము*_ 

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐


*పరకాయప్రవేశము: శంకరుల వివరణ*


ఆ నిర్ణయం తీసు కోవడమే తడవు ఉభయభారతి శంకరు నిపై ఈ విధంగా ప్రశ్నల వర్షం కురిపించింది: "శంకరాచార్యా! స్త్రీ పురుషుల మధ్య కామకళ శుక్ల పక్ష మందెట్లుండును? కృష్ణ పక్షమందు ఎట్లుండును అట్టి కళ లెన్ని? వాని స్వరూపమేమి నీకు తెలిసిన వివరించెదవా. 


చటుక్కున వచ్చిన ప్రశ్నలకు సమాధానము చెప్పిన ఒక చిక్కు, చెప్పకున్న మరొక చిక్కు ఇది ఒక కుయుక్తితో చేసిన పన్నాగము. ప్రత్యుత్తర సమయంలో నీ అనుభవ మేమి అనే ప్రశ్న వస్తుంది. అందు వలన ఈ యుక్తికి పై యుక్తియేసమాధానము కాగలదని తలచాడు శంకరుడు. "దేవీ! నాకు మూడు మాసముల వ్యవధి కావలెను. వాద మధ్యమున ఇట్లు వ్యవధి తీసికొనుట సనాతన సంప్రదాయ బద్ధముకదా! ఈగడువు గడచిన పిమ్మట మన వాదము తిరిగి నడచును గాక!" అని పలికారు శంకరులు. ఉభయభారతి అంగీక రించడంతో నాటి పరిషత్సభ వాయిదా పడింది.


సభ ముగిసిన తరువాత శంకరులు శిష్యగణముతో కూడి నదీతీరాన ఉన్న ఉద్యానవనం చేరుకు న్నారు. వేకువనే లేచి కాలకృత్యములు తీర్చు కొని తెల్లవారగనే శంకరులు గగన మార్గాన పయనమై పోతున్నారు. ఒక అరణ్యంలో ఆ ప్రాంతా న్ని పాలించే అమరకు డనే మహారాజు వేటకు వెళ్ళి మరణించగా రాజు మృతదేహము చుట్టూచేరి రాజు భార్యలు నూర్గురు రోదనము చేయడం చూచారు శంకరుడు. ఆ దృశ్యాన్ని తన శిష్యుడైన పద్మపాదు నకు చూపించి "పద్మపాదా! పతి వియోగం భరించలేక ఆ రాణులు విలపిస్తు న్నారు. నేను ఆ రాజు శరీరంలో ప్రవేశిస్తే వారి దుఃఖం పోతుంది. పాప మా రాజు తన పుత్రుని కి యువరాజ పట్టాభి షేకం కూడ చేయలేదు. నేనా రాజు శరీరంలో ప్రవేశిస్తే ఆ పని కూడా పూర్తి చేసినవాడను అవుతాను. నేను ఆ కాంతామణులతో విహ రించి ఆ కళల విశేషాల్ని తెలిసి కొన వచ్చును గదా? నేను కేవలం సాక్షీ భూతుడనై వ్యవహరిస్తాను కాబట్టి నాకు ఎట్టి దోషమూ ఉండదు” .


గురువుగారి మాటలను విన్న పద్మపాదుడు నిశ్చేష్టుడయ్యాడు. వెంటనే తేరుకొని గురువుతో ఇలా అంటాడు: "స్వామీ! మీకు చెప్పదగ్గ వాడను కాను. పరకాయ ప్రవేశము కానిదని విన్నాను. దీనికి అనేక దృష్టాంతాలున్నాయి. ఒకపుడు మత్స్యేంద్రు డనే మహానుభావుడు తన శరీరమును భద్రంగా కాపాడమని తన శిష్యుడు గోరక్షకుని కడ పెట్టి మృతుడైన రాజు శరీరంలో ప్రవేశించి ఆ రాజ్యాన్ని వైభవంగా పాలించడం మొదలు పెట్టాడు. ఆతని పాలనలో మున్నెన్నడు చూడని మహావైభవం ప్రాప్తించిం ది ఆదేశానికి. ప్రతిభా వంతులైన మంత్రులకు అనుమానం వచ్చింది. మరణించి బ్రదికిన రాజుకు అంతకు ముందు తమకు తెలిసిన రాజుకు శరీరంలో తక్క ఏ విధమైన సామ్యమూ కానరావడం లేదు. ఇదివరకు రాజు ఒక లాగున ఇప్పుడు వేరొక లాగున ఉన్నారు. ప్రతిభా పాటవాలతో బహు ధర్మాలెరిగిన వాడిలా ధర్మపరిపాలన చేస్తున్న ఈతడు మన అసలు రాజు కాదు. ఎవరో సమర్థుడు రాజు శరీరంలో ప్రవేశించి ఉంటాడని నిశ్చయించు కొన్నారు మంత్రులు కలిసి. 


ఈ వార్త తెలిసిన రాణులు అతనిని ఇతోధికంగా సంతోష పెట్టేలాగున వర్తించడం తో, మత్స్యేంద్రుడు భోగలాలసుడైనాడు. ఇదిచూచిన గోరక్షకుడు తన గురువు మహాత్ముడు ఇలా అయిపోయాడని చింతించి ఉపాయంతో రాజాంత:పురం చేరి మెలమెల్లగా గురువుకు పూర్వస్మృతి కలిగించా డు. తన శరీరాన్ని శిష్యుడు భద్రంగా దాచి ఉన్నాడు కాబట్టి తిరిగి మత్స్యేంద్రుడు స్వశరీ రంలో చేరగలిగాడు. గురుదేవా! విషయాను రాగం ఎంతటి వారి నైనా లొంగదీయును. జ్ఞానాన్ని నాశనం చేసి మూర్ఖుణ్ణి చేయును. మీకు చెప్పదగిన వాడను కాను. కాని చెప్పకుండా ఉండ లేకున్నాను. లోకోద్ధర ణార్థం పరమ పావన మైన బ్రహ్మచర్య వ్రతం చేపట్టిన మీకు ఇదేమి వైపరీత్యము? ఈ మాటలు మీతో అనుటకు తమరు నాయందు చూపిన అవ్యాజమైన కరుణ, వాత్సల్యమే బలాన్ని ఇచ్చింది. ధర్మసంస్థా పకా! ఆలోచించుడు” అని దీనంగా వేడు కొన్నాడు పద్మపాదుడు శంకర స్వామిని. ప్రియశిష్యుని భయం పోగొట్టడానికి శంకరులు ఇలా చెప్పారు: “పద్మపాదా! నీవు చెప్పిన దానిలో పొరపాటు ఇసుమంత కూడా లేదు. ధర్మాసక్తి కలవారు ధర్మరక్షణకే ఎప్పుడూ పాటు పడతారు. శాస్త్రము లలో ఈ విషయమై విధినిషేధములున్న మాట వాస్తవమే. ఆ నిషేధములు ముక్తి పొంద వలసిన వారికే వర్తిస్తాయి. ముక్తులైన వారికి ఆ నిషేధము లతో పని లేదు. సంకల్ప రహితులకు విషయాసక్తు లుండవు. కోరికలు లేని మనస్సు సర్వదా పరిశుద్దమే. సంకల్పములే లేని వారికి కోరికలు మొలకె త్తవు. ముక్తి నొందిన వానిని ఎవరూ ఏమీ చేయలేరు. శ్రీకృష్ణుడు అనేక వేల గోపకాంత లతో శృంగార లీలలు సల్పినా ఆయన సదా బ్రహ్మచారిగాకొనియాడ బడుతున్నాడు. విధి నిషేధాలకు అతీతమైన పరతత్వమున్నది. ఉపనిషత్తులలో వజ్రయోలి యోగ మను నది ఉన్నది. అది పరకాయప్రవేశము వంటిది. ఆ యోగము నొందినవాడు యోగ భ్రష్టుడు కాడు సరి కదా మహాతేజస్సుతో విరా జిల్లుతుంటాడు. పరకాయప్రవేశములోని అనుభూతులు

ఏమియు సత్యములు కావు. అవి కేవలము లీలలు. శ్రీకృష్ణుడు సర్వాంతర్యామి. సంకల్పరహితుడు. నేనూ అంతే. సందేహము విడనాడుము".


మరల వివరిస్తున్నాడు శంకరుడు శిష్యునికి: "పద్మపాదా! అవతార పురుషుడు సర్వాతీతుడు.


వర్ణాశ్రమధర్మములు, కర్మవిధులు అన్నీ పరిత్యజించి పరమాత్మే తానన్న నిశ్చయంతో పరిపూర్ణుడై, మాయాతీతుడై శాశ్వతానందంలో తేలియుండును. పద్మపాదా! అజ్ఞాన మున్నంతవరకు ప్రకృతి సత్యమనీ, కర్మఫలము లు నిజమనీ తోస్తుంది. జ్ఞానము కలుగగానే అవి యెల్ల మిథ్య యనీ స్వప్నతుల్యములనీ తెలుస్తుంది. దీనిని నేను చేస్తున్నాను, దీన్ని నేను అనుభవిస్తు న్నాను అనే భావన లేని వానికి ఏదియు అంటదు. తత్త్వవేత్త సుకృత దుష్కృతము లకు లోబడడు. అట్టివానికి విశ్వప్రేమ ఉండును. ఏ జీవిని అతడు హింసించడు. ఒకవేళ అలా చేసినా దానికి అంతర్భాగమైన

కారణముంటుంది. ఇందులకు ఒక దృష్టాంత మున్నది. వినుము. 


త్వష్టకుమారుడు విశ్వరూపుడనే వాడు ద్వాదశాదిత్యులలో ఒకడు. ఆతడు మహాగర్వంతో లోకాలను పీడించడం మొదలు పెట్టాడు. అది చూచి దేవేంద్రుడు తన వజ్రాయుధంతో అతణ్ణి చీల్చి చెండాడి ముక్కలు ముక్కలుగా చేసి కాకులకు గ్రద్దలకు ఆహారంగాపారవేశాడు. అంత చేసినా దేవేంద్రునికి ఏమీ కాలేదు. జనకమహా రాజు అనేక యజ్ఞ యాగాదులు, దాన ధర్మాలు చేసినవాడు. కాని అనునిత్యం తత్త్వజ్ఞానియై కర్మ ఫలితాలను పొందక పరమ నిత్యమైన మోక్షానందమే పొందాడు" అని బోధించాడు శిష్యుని సందేహ నివృత్తి కోసం.


*శంకరుని పరకాయ ప్రవేశము:*


గగనవీధిలో శిష్య సమేతంగా ప్రయాణించి ఒకచోట పర్వత శిఖరం మీదకు చేరిన తర్వాత ఒక గుహను సమీపించి దానిని మూయడానికి అనువైన రాతి పలక నొకటి సంపాదించు కొన్నారు. 


శంకరాచార్యుడు తన శరీరాన్ని ఆ గుహలో భద్రపరచి జాగరూకత తో కాపాడమని శిష్యు లకు ఆదేశించారు. తాను తిరిగి వచ్చే వరకు ఏమరుపాటు లేకుండా ఉండమని చెప్పి యోగశక్తితో స్వశరీరాన్ని విడిచి అమరకమహారాజు మృతశరీరంలో బ్రహ్మ రంధ్రంగుండా ప్రవేశిం చాడు. వెను వెంటనే ప్రాణవాయువును ప్రవేశపెట్టి ఆపాద మస్తకము సంచరించు నట్లొనరించారు. ప్రాణము రాగానే రాజు శరీరం కదలడం మొదలుపెట్టింది. కండ్లు తెరచి కూర్చొన్నాడు. రాజకాంతలు, పరివార ము సంతోష సంభ్రమా లతో కోలాహలంగా అయింది. పురములోని వార్త తెలిసి దివ్య మంగళధ్వనుల మధ్య వేదపారగులు స్వస్తి వచనములు చెప్పు చుండగా దివ్య వాహనంపై రాజును పురప్రవేశము చేయిం చారు మంత్రి సైన్యాధ్యక్ష ప్రముఖులు. కొలదిరోజుల తరువాత అమరకమహారాజు మంత్రులు, దండ నాయకులు, సేనాధి పతులు, సామంతులు, న్యాయాధీశులు, కవి పండిత గాయక ముఖ విద్యాధికులు, వివిధ కళాప్రపూర్ణులు, ఉన్న నిండు కొలువును ఏర్పరచి అందరికీ ఆదేశ మిచ్చాడు: “ఈ రోజు నుండి మనము క్రొత్త దీక్షతో రాజ్యాన్ని అన్ని విధాల ఉత్తమ రాజ్యంగా నడపు తుండాలి. రాజశాస నాన్ని ప్రజలందరూ విధిగా గౌరవించి పాటించాలి. దేశంలోనికి శత్రువులు చొరకుండా అప్రమత్తులమై మెలగాలి. రాజోద్యోగు లందరు ప్రజాసేవయే పరమావధిగా రాచ కార్యములుచక్కబెట్టాలి. ఎవరి వృత్తులు వారు సవ్యంగా నిర్వర్తిస్తూ ఒకరికొకరు ఐకమత్యం ప్రేమ, సద్భావము కలిగి కృషి చేస్తుండాలి. శాసనములను ఉల్లం ఘించిన వారు, దుష్టవర్తనులు నిర్దయ గా శిక్షకు గురి ఔతారు. ఈ విషయాలను మదిలో నుంచుకొని ఎవరి విధులు వారు సక్రమంగా దృఢబుద్ధితో అమలు పరచాలి. ఇలా జరిగేలా ప్రధానామా త్యులు నా ప్రతినిధిగా నిర్వహిస్తారు ఇక్కడి నుండి" అని ఆజ్ఞాపించినాడు.


ఒక క్రొత్తశకం ఆరంభమై నట్లు రాజ్యం సుభిక్షమై నెలకు మూడు వానలు పడి దేశం సస్యశ్యామ లముగా అలరారు తోంది. గోవులు కుంభవృష్టిగా క్షీరము లిస్తున్నాయి. బ్రాహ్మణు లు యజ్ఞయాగాది క్రతువులతోదేవగణాన్ని తృప్తి పరుస్తున్నారు. వస్త్రోత్పత్తి మెండుగా ఉండి ఆహార వస్తువు లు సమృద్ధిగా న్యాయ పద్ధతిలో వస్తువిక్ర యాలు జరుగుతున్నవి. 

ప్రధానామాత్యుడు రాజు ప్రతినిధిగా ఎంతో సమర్థనీయంగా నడుపుతున్నాడు. రామ రాజ్యము అంటే ఇదే నన్న గాఢమైన నమ్మకం కలిగిస్తోంది. రాజ్య భారాన్ని మొత్తం ప్రధానామాత్యునిపై మోపిన రాజు ఏం చేస్తున్నాడు? తానెందులకీ వేషం వేయవలసిందో తన్నిమిత్తమై శృంగారకళావిశేషాలు ఆ రాణులందరి సహ వాసంతో ప్రత్యక్షసాక్షిగా తత్సంబంధమైన శాస్త్ర విద్య నేర్వకపోయినా విద్యార్థిగా క్షుణ్ణంగా నేర్చుకొనే ధార్మిక యత్నంలో నిమగ్నుడై ఉన్నాడు. ఆ యత్న మెలాంటిది? తాను పూనుకొన్న అద్వైత మత స్థాపనా యజ్ఞం సంపూర్ణ సాఫల్యాన్ని చేరుకొంటేగాని తన అవతారలక్ష్యం సిద్ధించదు. ఆ లక్ష్య సాధనకు ఏ ప్రాపంచిక మైన అవరోధమూ కలుగకూడదు. ప్రియ శిష్యుడైన పద్మపాదు నకు వివరించినట్లుగానే సాక్షీభూతభావంతో లీలా సదృశమైన ప్రవృత్తి చేపట్టినాడు.


ఈలోగా ఒకనాడు మంత్రులందరు కలసి సమావేశమైరహస్యంగా ఇలా మాట్లాడుకొంటు న్నారు. 'చనిపోయి రాజు తిరిగి బ్రతికి వచ్చిన పిమ్మట అంతకు ముందు ఉన్న పరిస్థితులలో హస్తి మశకాంతర భేదం కనిపిస్తోంది. ఇతః పూర్వము ఎన్ని యత్నాలు చేశాము దేశంలోని సమస్యలను

సరిదిద్దడానికి? ఏ ఒక్కటీ కించిత్తు కూడ ఫలించలేదు. ఇప్పుడు ఏ శ్రమా లేకుండా అన్నీ చక్కగా జరిగిపోతు న్నవి మహావైభవంగా! అప్పుడు శత్రుబాధ లేని రోజు లేదు. ఈ నాడు దేశంలో ఏ విధమైన వివాదాలే లేవే! ఆనాటి ఉద్యోగుల మే ఈనాడు కూడా చేస్తున్నవారము. ఈ అతి విచిత్రమైన మార్పుకు కారణము ఉండాలి. మన రాజు చచ్చి బ్రతికిన తర్వాత వచ్చిన మార్పులివి.


అమరక మహారాజు యొక్క పాలన మనకు తెలిసినదే కదా! ఏ మానవాతీతుడో మన రాజు మృతకళేబరంలో పరకాయ విద్యతో ప్రవేశించి ఈ మార్పు లకు కారణభూతుడై యుండవలెను'. ఏది ఏమయినా ప్రజాక్షేమ హితమైన ఈ మార్పు ను మెచ్చకుండ ఉండ గలమా?’


*కాలడి శంకర కైలాస శంకర*


*శ్రీ శంకరాచార్య చరిత్రము*

*20 వ భాగము సమాప్తము*

🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం  - వర్ష ఋతువు - భాద్రపద మాసం - కృష్ణ పక్షం  - షష్ఠి - రోహిణీ -‌‌ ఇందు వాసరే* (23.09.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*