1, మే 2022, ఆదివారం

ఆధ్యాత్మిక సాధనకి

 నేటి నుండి వైశాఖ మాసం ప్రారంభం  అయిన సందర్భంగా...


ఆధ్యాత్మిక సాధనకి అద్భుతమైన మాసాలలో ఒకటి వైశాఖము. వైశాఖము, మాఘము, కార్తికము - ఈ మూడింటినీ ఆధ్యాత్మిక సాధనలో చాలా ప్రధానంగా చెప్తారు. ఏవిధంగా అయితే కార్తీక పురాణం, మాఘ పురాణం ఉన్నాయో అదేవిధంగా వైశాఖ పురాణాన్ని కూడా వ్యాసదేవుడు రచించాడు.


ఆధ్యాత్మికంగా భగవదనుగ్రహం పొందడానికి ఈ మాసం అన్ని విధాలా అనుకూలమైనది. సాధనా మాసంగా దీనిని నిర్వచించవచ్చు. వసంతఋతువులో రెండవ మాసం. ఇది. దీనికి వైదిక నామం మాధవ నామము. మధు అని చైత్రమాసానికి, మాధవ అని వైశాఖ మాసానికి అంటారు. వైశాఖమాసం లక్ష్మీ నారాయణుల ఆరాధనకి చాలా ప్రసిద్ధమైనది.


వైశాఖంలో రకరకాల వ్రతాలు చెప్పారు. ఈసారి వైశాఖమాసము 01-05-2022 నుండి 30-05-2022 వరకు ఉంది. వైశాఖంలో పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా అనునిత్యం నారాయణుని తులసితో ఆరాధించడం చేయాలి. ఆ తులసి కూడా కృష్ణ తులసి సమర్పిస్తే శ్రేష్టం అని ధర్మశాస్త్రం చెప్తున్నది.


విష్ణుసహస్రనామ పారాయణ వైశాఖం అంతా చాలా ప్రశస్థమైనటువంటిది.


అనునిత్యం కూడా అశ్వత్థ వృక్షానికి సమృద్ధిగా జలం పోసి ప్రదక్షిణలు చేయడం, వైశాఖం అంతా చేసినట్లయితే అభీష్ట సిద్ధి లభించడమే కాక పితృదేవతలు తృప్తి చెందుతారు అని చెప్తున్నారు.


గళంతిక ఆరాధన - శివునకు ఈ మాసమంతా అభిషేకం చేస్తే చాలా ప్రసిద్ధి. అనునిత్యం శివారాధన అభిషేకంతో చేయాలి. అది ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆదిదైవిక తాపత్రయాలను తొలగించి మనశ్శాంతినిస్తుంది. అందుకు శాంతి కోసం శివునికి అభిషేకం చేస్తారు. శివాలయాలలో శివునకు పైన గళంతికను ఏర్పాటు చేయడం కూడా చాలా మంచిది. దీనినే ధారాపాత్ర అంటారు. నిరంతరం శివుడి మీద ధార పడేటట్లుగా ఒక పాత్రను ఏర్పాటు చేయాలి. ఇలా నేలంతా శివునిపై ధార పడేటట్లు చేసినట్లయితే సృష్టిలో ఉన్నటువంటి వేదనలు, తాపాలు, అరిష్టాలు నశిస్తాయని ధర్మశాస్త్రములు చెప్తున్న విషయం.


వైశాఖంలో ఉదకకుంభ దానము. అంటే నీటితో నింపిన పాత్రను దానం చేయడం. బాటసారులకు చలివేంద్రములు ఏర్పాటు చేసి జలాన్ని ఇవ్వడం వైశాఖంలో ప్రసిద్ధి.

 * నల్లధనం సంపాదించే మార్గాలకు స్వస్తి పలకాలి, నోటు నిషేధం ఎందుకు?  *

    అందుకే నేను డాక్టర్‌ని

    * "నిజాయితీగల వైద్యులందరికీ నేను క్షమాపణలు కోరుతున్నాను...!"  *

    • ........ గుండెపోటు "జరిగింది ...

    వైద్యులు అంటున్నారు - స్ట్రెప్టోకినేస్ ఇంజక్షన్ ఇవ్వండి ... 9,000 / = రూ ... * ఇంజెక్షన్ అసలు ధర రూ.  700 / - నుండి 900 / =, కానీ MRP రూ.  9,000 / =!  * మీరు ఏమి చేస్తారు?

    టైఫాయిడ్ వచ్చింది

    వైద్యులు రాశారు - * మొత్తం 14 మోనోసోఫ్ తీసుకోండి!  హోల్‌సేల్ ధర రూ.25/=... హాస్పిటల్ కెమిస్ట్ రూ.53/= ఇస్తాడు... * మీరేం చేస్తారు ??

    • ............ ,,,, కిడ్నీ ఫెయిల్యూర్ .., * మూడు రోజులకు ఒకసారి డయాలసిస్ మోడ్‌టరే, డయాలసిస్ ఇంజెక్షన్ చేయండి - MRP 1800  *

    * నేను హోల్‌సేల్ మార్కెట్ నుండి తీసుకుంటానని మీరు అనుకుంటున్నారు!  ఇండియా మొత్తం వెతికినా ఎక్కడా దొరకలేదు... ఎందుకు?  *

    * కంపెనీ సరఫరా వైద్యులు మాత్రమే !!  *

    * ఇంజెక్షన్ అసలు ధర 500 / =, అయితే వైద్యులు వారి ఆసుపత్రిలో MRP 1,800 /= ఏమి చేస్తారు...* ??

    * .......... సోకిన .., డాక్టర్ రాసిన యాంటీబయాటిక్ రూ.  ., మేము ఏ జెనరిక్ ఇవ్వము .., డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మాత్రమే ఇవ్వండి ... అంటే 540 / =?  * నువ్వేమి చేస్తున్నావు ??

    • మార్కెట్‌లో అల్ట్రాసౌండ్ పరీక్ష ధర రూ.  750 / =, ట్రస్ట్ ఫార్మసీ రూ.  240 / =!  750 / = డాక్టర్స్ కమీషన్ 300 / = రూ.  *

    ఎంఆర్‌ఐపై డాక్టర్ కమిషన్ రూ.  2,000 / నుండి 3,000 / =!

    * డాక్టర్లు మరియు ఆసుపత్రుల ఈ దోపిడీ విపరీత, భయంకరమైన, భయంకరమైన భారతదేశంలో జరుగుతోంది!

    ఔషధ కంపెనీల లాబీ దేశాన్ని నిలువరించేంత బలంగా ఉంది!

    * అందులో డాక్టర్లు, ఫార్మాస్యూటికల్ కంపెనీలు!  ఇద్దరూ ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు...!!  *

    పెద్ద ప్రశ్న ఏమిటంటే...

    * మీడియా పగలు రాత్రి ఏం చూపిస్తుంది?  *

    * గోతిలో పడిన యువరాజు, .., డ్రైవర్ లేని కారు, రాకీ సావంత్, బిగ్ బాస్, అత్తగారు, క్రైమ్ రిపోర్ట్, క్రికెటర్ గర్ల్ ఫ్రెండ్ ఇలా అందరూ కనిపిస్తారు కానీ... డాక్టర్ల కంపెనీలు, హాస్పిటల్, ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఎందుకు? దాని స్పష్టమైన దోపిడీని చూపించలేదా?  *

    సమాజానికి మీడియా సాయం చేయకపోతే ఎవరు వస్తారు?

    మెడికల్ లాబీ యొక్క క్రూరత్వాన్ని ఎలా నిరోధించాలి?

    ఇదేనా ప్రభుత్వంపై లాబీయింగ్?

    మీడియా ఎందుకు మౌనంగా ఉంది?

    * ఆటోరిక్షా డ్రైవర్ కు రూ.20కి మించి అడిగితే

    వైద్యులు ఏమి చేస్తారు ???


    * ఇది నిజమని మీకు అనిపిస్తే, అన్నింటినీ పంపండి!  అవగాహన కల్పించండి మరియు అవగాహన పెంచడానికి మీ మద్దతు ఇవ్వండి !!!  *

   


    మీరు ఐదుగురిని పంపితే, ఆ ఐదుగురు తదుపరి ఐదుగురికి పంపుతారు!  అందరు పంపితే దేశమంతా ఒక్కతాటిపైకి వస్తుంది.


    


    నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను

    కనీసం ఐదు గ్రూపులకు

    పంపండి.  ధన్యవాదాలు

న్యాయవ్యవస్థ దారెటు

 సాక్షాత్ దేశ ప్రధానమంత్రినే అత్యంత హేయంగా దూశించిన... తుక్డే గ్యాంగ్ సభ్యుడు MLA జిగ్నేష్ మేవానికేమో వెంటనే "బెయిల్" దొరికింది....


అదే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే ఇంటి ముందు "హనుమాన్ చాలీసా" పఠిస్థామ్మన్నా MLA రవిరాణే & MP నవనీత్ రాణా దంపతులకేమో "బెయిల్" దొరకలేదు....


వాహ్ క్యా బాత్ హై...!

ఏమీ మన ఘనమైన కోర్టులు...!!

అహాఁ...

ఎంతెంత న్యాయమైన... నాణ్యమైన తీర్పులిస్తున్నాయో కదా మన కోర్టులు !!!

ఓహో...

ఎంత నిష్పక్షపాతమో కదా మన కోర్టుల్లో...


LONG LIVE INDIAN JUDICIARY ✊️✊️


ఇక ఆశ్చర్యమేంటంటే...

"హనుమాన్ చాలీసా పఠనం" చేస్తామన్న నవనీత్ దంపతులపైనేమో "రాజద్రోహం" కేసు...

ఇకదే ప్రధాన్ని దూశించిన తుక్డే గ్యాంగ్ జిగ్నేష్ మేవానీ పైనేమో ఆశామాషీ కేసులో వెంటనే 'బెయిల్' దొరికింది, అయితే ఆఁ మహానుభావుడు "బెయిల్' దొరికాక ఎయిర్పోర్ట్ కు ఒక మహిళా పోలీస్ అధికారి పట్ల అత్యంత అసభ్యంగా ప్రవర్తించగా పోలీసులు మళ్ళీ అరెస్టు చేసిన కేసులో కోర్టు మళ్ళీ "బెయిల్" ఇవ్వడమే కాకుండా, అసలు ఆఁ కేసు FIR నే కోర్టు తప్పుపట్టడం విశేషం...

అసలు మన న్యాయవ్యవస్థ దారెటు !!??


పై రెండు కేసుల్లో అటు రవి రాణా దంపతులు & జిగ్నేష్ మేవానీ ఇద్దరూ కూడా దళితులే కావడం యాదృచ్చికం....

గమనార్హం...


అయితే

బ్రహ్మ పథం

 🍁🍁  బ్రహ్మ పథం   🍁🍁

నిర్వహణ:-గాజుల విష్ణువర్ధన్. M. A.

--------------------🙏--------    --------------------

                    ఉచితం

                       ***

  మహాభారతంలో  మనకు తెలియని  కథలెన్నో  దాగివున్నాయి.

    జూదం, ద్రౌపది వస్త్రాపహరణం, కురుక్షేత్ర యుద్ధం, వీటినే చూపెడతారు, నిజానికి  ఇప్పటి సమాజానికి  కావాల్సిన "  నీతి కథలు "   ఎన్నో ఉన్నాయి!!!

 అందులో ఇదొకటి.

పంచ పాండవులలో  మొదటివాడైన  ధర్మరాజు  ఎక్కువ ధర్మాలు  చేసేవాడని పేరు. తనకంటే  ఎక్కువ దానం చేసిన వాళ్ళు ఇంకెవరు లేరని  ధర్మ రాజు అభిప్రాయం. ఇది ఆయనకు  అహంకారంగా  మారకూడదని   శ్రీకృష్ణుడికి  అనిపించింది. అందుకోసం  కృష్ణుడు  ధర్మారాజుని  వేరే రాజ్యానికి  తీసుకు వెళ్ళాడు.

 ఆరాజ్యం  మహాబల  చక్రవర్తి గారి  పాలనలో  ఉండేది.    అక్కడ  ఒకరి ఇంట్లోకి వెళ్లి నీళ్లు అడిగారు. ఆ ఇంటిలోని ఆమె వారికి  బంగారు గ్లాసులో నీళ్లు ఇచ్చింది. వారు తాగేశాక  ఆమె  ఆగ్లాసును  బయటికి విసిరేసింది!. 

ధర్మరాజు ఆమెతో, ఏమిటమ్మా బంగారాన్ని  దాచుకోవాలి గాని  ఇలా వీధిలో  పడేస్తే ఎలా?  అని చెప్పడంతో ఆమె,  మారాజ్యంలో  ఒక్కసారి  వాడిన  వస్తువును మళ్ళీవాడము  అని బదులు చెప్పి లోనికి వెళ్ళిపోయింది.   ఆరాజ్య సంపదను గురించి  ఆలోచిస్తూ  ఆశ్చర్య పోయాడు  ధర్మరాజు.

 ఇక రాజును  కలవడానికి ఇద్దరు వెళ్లారు, కృష్ణుడు  మహాబలరాజుతో   ధర్మారాజును  ఈ విధంగా పరిచయం  చేయసాగాడు.

రాజా!  ఈయన  ప్రపంచంలోనే  ఎక్కువ ధర్మాలు  చేసిన వ్యక్తి  పేరు " ధర్మరాజు " అని చెప్పాడు. అయినా  ఆరాజు  ధర్మరాజు  ముఖం కూడా  చూడలేడు  సరికదా  కృష్ణుడితో  ఇలా  అన్నాడు.

 కృష్ణా!  మీరు చెప్పిన విషయం  సరికాని, నారాజ్యంలో  ప్రజలకు  సరిపడా  పనిఉన్నది, అందరి దగ్గరా  సంపద  బాగా ఉన్నది, నారాజ్యంలో  అందరికి  కష్టపడి  పనిచేయడం  ఇష్టం, ఇక్కడ  భిక్షం తీసుకోడానికి  తావులేదు, ఇక్కడ ఎవరికీ  దానాలు  తీసుకోవాల్సిన  అవసరంలేదు, ఈయన  రాజ్యంలో  బీదవాళ్లు  ఎక్కువగా  ఉన్నట్టు ఉన్నారు అందుకే, అందరు దానాలు  అడుగుతూ  వస్తున్నారేమో, ఈయన రాజ్యంలో  అంతమందిని  పేదవారీగా  ఉంచినందుకు  ఈ రాజు  మొఖం  చూడాలంటేనే  సిగ్గుపడుతున్నాను అన్నారు !

 తన రాజ్య స్థితిని  తలచి సిగ్గుపడి తల దించుకున్నాడు  ధర్మరాజు.

 సహాయం అనీపేరుతో  ప్రజలు  అడుక్కుతినేలా మార్చడం, ఉచితం  అనీపేరుతో  ప్రజలను  సోమరులుగా  మార్చిన  దేశం ఎప్పటికైనా  తల దించు కోవాల్సిందే అని చక్కగా వివరించారు. మరి మనపాలకులు  ఎప్పుడు తెలుసుకుంటారో, ఉచిత బియ్యం, రుణమాఫి, ఆ పథకం, ఈ పథకం, చదువు  అన్నీ ఉచితమని  ఓట్లు అడుక్కొని ప్రజలను  బిచ్చగాళ్ళుగా  మార్చుతున్నారు, మరి ప్రజలు  ఎప్పుడు మారుతారో.


చిన్న విన్నపం (సే )

        సాధ్యమైనంత  ఎక్కువ మందికి  విధిగా  ఈసందేశం  పంపండి, ఎందుకంటే  కనీసం  కొంతమందినైనా  మార్చి  జాతిని  జాగ్రతం  చేయాలని  ఆశిస్తూ..


        .   ఓం నమః శివాయః..

వైశాఖ పురాణం - 1 వ అధ్యాయము

 _*ఆదివారం May 1, 2022**_


_*🚩వైశాఖ పురాణం - 1 వ అధ్యాయము🚩*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*వైశాఖమాస ప్రశంస*


☘☘☘☘☘☘☘☘☘


*నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |*

*దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||*


సూతమహర్షి శౌనకాది మహర్షులనుద్దేశించి యిట్లు పలికెను. మహర్షులారా ! వినుడు రాజర్షియగు అంబరీషుడు బ్రహ్మ మానసపుత్రుడగు నారదుని జూచి నమస్కరించి మహర్షీ ! మీరు అన్ని మాసముల మహత్త్వమును వివరించిరి. అన్ని మాసముల యందును వైశాఖ మాసము మిక్కిలి యుత్తమమైనది. శ్రీమహావిష్ణువునకు మిక్కిలి ప్రీతి పాత్రమైనదని చెప్పినారు. 


వైశాఖమాసము శ్రీమహావిష్ణువునకు యిష్టమగుటకు కారణమేమి ? 


ఈ మాసమునందు విష్ణుప్రియములైన ధర్మములేవి ? 


మానవులాచరింవలసిన దానములను , వాని ఫలములను వివరింపగోరుచున్నాను. పూజ , దానము మున్నగు వానిని యే దైవము నుద్దేశించి చేయవలయును ? 


వాని ఫలమెట్టిది ? పూజాద్రవ్యములెట్టివి ? 


మున్నగు విషయములను దయయుంచి వివరింపగోరుచున్నానని సవినయముగ ప్రశ్నించెను.


నారదుడును రాజర్షీ ! అంబరీషా ! వినుమని యిట్లు పలికెను. పూర్వమొకప్పుడు నేను బ్రహ్మను మాసముల మహిమను మాస ధర్మములను వివరింపగోరితిని. బ్రహ్మయు *'నారదా ! శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి మాసధర్మములను చెప్పుచుండగ వింటిని. నీకిప్పుడు శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన విషయమునే చెప్పుదును. మాసములన్నిటిలోను కార్తికము , మాఘము , వైశాఖము ఉత్తమములు. ఆ మూడు మాసములలో వైశాఖమాసము మిక్కిలి ఉత్తమము. వైశాఖము ప్రాణులకు తల్లివలె సదా సర్వాభీష్టములను కలిగించును. ఈ మాసమందాచరించిన స్నానము , పూజ , దానము మున్నగునవి పాపములన్నిటిని నశింపజేయును. ఈ మాసమున చేసిన స్నాన , పూజా , జప , దానాదులను దేవతలు సైతము తలవంచి గౌరవింతురు. 


విద్యలలో వేదవిద్యవలె ,


మంత్రములలో ఓంకారమువలె , 


వృక్షములలో దివ్యవృక్షమైన 

కల్పవృక్షము వలె , 


ధేనువులలో కామధేనువువలె , 


సర్వసర్పములలో శేషునివలె , 


పక్షులలో గరుత్మంతునివలె , 


దేవతలలో శ్రీమహావిష్ణువువలె , 


చతుర్వర్ణములలో బ్రాహ్మణునివలె 


ఇష్టమైన వానిలో ప్రాణమువలె , 


సౌహార్దములు కలవారిలో భార్యవలె , 


నదులలో గంగానది వలె , 


కాంతి కలవారిలో సూర్యుని వలె , 


ఆయుధములలో చక్రమువలె , 


ధాతువులలో సువర్ణమువలె , 


విష్ణుభక్తులలో రుద్రునివలె , 


రత్నములలో కౌస్తుభమువలె , 


ధర్మహేతువులగు మాసములలో వైశాఖమాసముత్తమమైనది. విష్ణుప్రియమగుటచేతనే వైశాఖమాసమును మాధవమాసమనియునందురు. విష్ణుప్రీతిని కలిగించు మాసములలో వైశాఖమాసమునకు సాటియైనదిలేదు. సూర్యుడు మేషరాశియందుండగా వైశాఖమున సూర్యోదయమునకు ముందుగ నదీ , తటాకాదులలో స్నానమాచరించినచో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో గలసి అతిప్రీతితో వానినుద్దరింపనెంచును. ప్రాణులు అన్నమును తిని సంతోషమునందినట్లు శ్రీమహావిష్ణువు వైశాఖ స్నానమాచరించిన వారి విషయమున సంప్రీతుడగుచున్నాడు. అట్లు వైశాఖ స్నానమాచరించినవారికి అన్ని వరముల నీయ సిద్దమై యున్నాడు. వైశాఖమాసమున ఒకసారి మాత్రమే స్నానమును , పూజను చేసినను , పాప విముక్తుడై విష్ణులోకమును చేరుచున్నాడు. వైశాఖమున వారమునాళ్లు స్నానాదికమును చేసినను ఈ మాత్రమునకే శ్రీహరియనుగ్రహ బలమున , కొన్నివేల అశ్వమేధయాగములను చేసినచో వచ్చునంతటి పుణ్యమునందును. స్నానము చేయు శక్తి లేక , స్నాన సంకల్పము దృఢముగనున్నచో నతడు నూరు అశ్వమేధయాగములు చేసినంత పుణ్యము నందును. సూర్యుడు మేషరాశిలోనుండగా వైశాఖ స్నానము నది , ఏరులో చేయవలెనని సంకల్పించిన వాడై అశక్తుడై యున్నను , కొంతదూరమైనను ఇంటి నుండి ప్రయాణమైన వాడు వైశాఖమున నదీ స్నాన సంకల్పము దృఢముగనున్నచో విష్ణు సాయుజ్యము నందును.


అంబరీష మహారాజా ! సర్వలోకములయందున్న తీర్థ దేవతలు బాహ్యప్రదేశముననున్న జలము నదియైనను , తటాకమైనను , సెలయేరైనను , అందుచేరియుండును. జీవి చేసిన సర్వపాపములను , జీవి అట్టిజలమున పవిత్ర స్నానమాచరించు వరకును , యముని యాజ్ఞననుసరించి జీవి సూక్ష్మ శరీరముననుసరించి రొద చేయుచుండును. జీవి వైశాఖమున అట్టి బాహ్యప్రదేశమున నున్న జలమున స్నానమాచరింపగనే ఆ జలమునధిష్టించి యున్న సర్వతీర్థ దేవతల శక్తి వలన ఆ జీవి చేసిన సర్వపాపములు హరించును. సర్వతీర్థదేవతలు సూర్యోదయమును మొదలుకొని ఆరు ఘడియల వరకు బాహ్య ప్రదేశమునందున్న ఆ నదీ జలమునాశ్రయించి యుండును. ఆ జలమున తామున్న సమయమున స్నానమాచరించిన వారికి హితమును కలిగింతురు. చేయనివారిని శాపాదులచే నశింపచేయుదురు. వారు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞననుసరించి యిట్లు చేయుదురు. సూర్యోదయమైన ఆరు ఘడియల తరువాత తీర్థ దేవతలు తమ తమ స్థానములకు పోవుదురు. మరల సూర్యోదయమునకు ముందుగా బాహ్య ప్రదేశమందున్న జలము నావహించి స్నానమాడిన వారి పాపముల నశింపజేయుచుందురు.


*వైశాఖ పురాణం  మొదటి అధ్యాయం సంపూర్ణం*


        🌷 *సేకరణ*🌷

      🌹🌷🌞🌞🌷🌹

           *న్యాయపతి*

        *నరసింహా రావు*


🙏🙏🌞🙏🙏🌞🙏🙏🌞🙏🙏

వైశాఖమాస ప్రశంస*

 _*🚩వైశాఖ పురాణము లోని అధ్యాయములు🚩*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*1 . వైశాఖమాస ప్రశంస*


*2 . వైశాకమాసమున చేయవలసిన వివిధ దానములు - వాటి  ఫలితములు*


*3 . వివిధ దానములు - వాటి మహత్యములు*


*4 . వైశాఖధర్మ ప్రశంస*


*5 . వైశాఖమాస విశిష్టత*


*6 . జలదాన మహత్యము - గృహగోధికా కథ*


*7 . వైశాకమాస  దానములు*


*8 . పిశాచ మోక్షము*


*9 . సతీదేహ త్యాగము*


*10 . దక్షయజ్ఞనాశము కామదహనము*


*11 . రతి దుఃఖము - దేవతల ఊరడింపు*


*12 . కుమార జననము*


*13 . అశూన్య శయన వ్రతము*


*14 . ఛత్రదాన మహిమ*


*15 . వైశాకవ్రత మహిమ*


*16 . యముని పరాజయము*


*17 . యమదుఃఖ నిరూపణము*


*18 . విష్ణువు యముని ఊరడించుట*


*19 . పిశాచత్వ విముక్తి*


*20 . పాంచాలరాజు రాజ్యప్రాప్తి*


*21 . పాంచాలరాజు సాయుజ్యము*


*22 . దంతిల కోహల శాపవిముక్తి*


*23 . కిరాతుని పూరజన్మ*


*24 . వాయుశాపము*


*25 . భాగవత ధర్మములు*


*26 . వాల్మీకి జన్మ*


*27 . కలిధర్మములు - పితృముక్తి*


*28 . అక్షయతృతీయ విశిష్టత*


*29 . శునీ మోక్షప్రాప్తి*


*30 . పుష్కరిణి - ఫలశ్రుతి*


🙏🙏🌞🙏🙏🌞🙏🙏🌞🙏🙏

మాధవ మాసం

 _*🚩రేపు ఆదివారం  తేది 1..5..22 నుండి వైశాఖ మాసం ప్రారంభం🚩*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉


వైశాఖ మాసానికి మరో పేరు మాధవ మాసం. మాసాలన్నింట్లో  వైశాఖమాసం ఉత్తమమైనది. విశేషదానాలకి ఎంతో పుణ్య ప్రదమైన మాసంగా పురాణాలలో చెప్పబడింది. శ్రీ మహా విష్ణువు కు ప్రీతి కరమైన ఈ వైశాఖ మాసం లో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవితో కలిపి పూజించిన వారికి ముక్తి దాయకం. ఈ మాసం లో  *ఏక భుక్తం , నక్తం అయాచితం గా భుజించడం ఉత్తమం గా చెప్పబడింది.*  వైశాఖ మాసం దేవతలతో సహా అందరికీ పూజనీయమైనది. యజ్ఞాలకు , తపస్సులకు పూజాదికాలకు , దాన ధర్మాలకు ఎంతో ఎక్కువ ఫలమిచ్చి శాంతినిచ్చి కోరికలను తీరుస్తుంది.


ఎవరైతే ఈ మాసం లో సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేస్తారో , వారికి ఉత్తమగతులు కలుగుతాయి. ఉదయాన్నే స్నానం చేసి ఎక్కువ నీటి తో రావి చెట్టు మొదళ్ళను తడిపి ప్రదక్షిణాలు చేస్తే పూర్వీకులంతా తరిస్తారు. ఈ మాసం లో శివునికి ధారపాత్ర ద్వారా అభిషేకం జరిగేలా ఏర్పాటు చేయడం శుభ ఫలితాలనిస్తుంది.

మన సంస్కృతి ఉత్కృష్టమైనది. మనకు ఈ ప్రకృతి.. అందులోని చరాచరాలన్ని పూజనీయాలే ! అంతేకాకుండా మనం కాలగణనకు ఉపయోగించే తిథులు , నక్షత్రాలు , వారాలు , మాసాలు అన్నీ ఎంతో గొప్పదనాన్ని , ప్రత్యేకతను సంతరించుకున్నటువంటివే. 

చాంద్రమానం పాటించే మనకు చైత్రం మొదలుకుని ఫాల్గుణం వరకు పన్నెండు నెలలు ఉన్నాయి. ఒక్కో మాసానికి ఒక్కో ప్రత్యేకత , విశిష్టత ఉన్నాయి.

కార్తీక మాఘమాసాల తర్వాత అంతటి మహత్యాన్ని స్వంతం చేసుకున్న పుణ్యప్రదమైన మాసం వైశాఖం. ఈ నెలలోనే పూర్ణిమ తిథినాడు విశాఖ నక్షత్రం ఉండడం వల్ల ఈ మాసానికి *వైశాఖమాసం* అనే పేరు ఏర్పడింది. ఆద్యాత్మికత , పవిత్రత , దైవశక్తి ఉన్న నెలల్లో వైశాఖమాసానికి ప్రత్యేక స్థానం ఉంది.


ఇది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాకరమైన నెల. అందువల్లనే వైశాఖమాసానికి మాధవమాసం అని పేరు. అత్యంత పవిత్రమైన మాసంగా

పేరుపొందిన *వైశాఖమాస మాహత్మ్యంను పూర్వం శ్రీమహావిష్ణువు  స్వయంగా శ్రీమహాలక్ష్మికి వివరించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి.* అత్యంత పవిత్రమైన మాసంగా చెప్పబడుతూ ఉన్న వైశాఖమాసంలో ప్రతి దినమూ పుణ్యదినమే.

అటువంటి ముప్పై పుణ్యదినాలు కలిగిన ఈ మాసంలో ఆచరించాల్సిన విధులు పురాణా గ్రంధాల్లో వివరించబడ్డాయి. ముఖ్యంగా స్నాన , పూజ , దానధర్మాల వంటి వాటిని ఈ నెలలో ఆచరించడం వల్ల మానవుడికి ఇహలోకంలో సౌఖ్యం , పరలోకంలో మోక్షం సిద్ధిస్తాయని పురాణ కథనం.


వైశాఖమాసంలో నదీ స్నానం ఉత్తమమైనదిగా చెప్పబడింది. అందుకు అవకాశం లేని స్థితిలో గంగ , గోదావరి వంటి పుణ్యనదులను స్మరించుకుంటూ కాలువల్లోగానీ , చెరువులోగాని , బావుల వద్దగానీ అదీ కుదరకపోతే ఇంట్లోనే స్నానం చేయాలి నీటియందు సకల దేవతలు కొలువుతీరి ఉంటారని పురాణాలు చెబుతున్నాయి.


వైశాఖమాసంలో సూర్యుడు మేషరాశిలో సంచరిస్తూ ఉంటాడు. కనుక ఎండలు అధికంగా ఉండి మానవులను ఇబ్బందులను గురిచేస్తూ ఉంటాయి. కనుక వేడిమినుంచి ఉపసమనం కలిగించేవాటిని దానం ఇవ్వాలనేది శాస్త్రవచనం , నీరు , గొడుగు , విసనకర్ర , పాదరక్షలు వంటివి దానం చేయడం శ్రేష్టం. అట్లే దాహంతో ఉన్నవారికి మంచినీటిని ఇవ్వడం , చలివేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల దేవతానుగ్రహం కలుగుతుంది.

సంధ్యావందనాలు ఆచరించడంతో పాటు శ్రీమహావిష్ణువును తులసీదళాలతో పూజించవలెను. శ్రీమహావిష్ణువు వైశాఖమాసం మొదలుకొని మూడునెలలపాటూ ఈ భూమి మీద విహరిస్తూ ఉంటాడు. అతనికి అత్యంత ప్రీతికరమైన తులసీదళములతో అర్చించడం వల్ల సంతుష్టుడై సకల సౌభాగ్యాలను, సౌఖ్యాన్ని ప్రసాదిస్తాడని చెప్పబడుతున్నది.


        🌷 *సేకరణ*🌷

      🌹🌷🌞🌞🌷🌹

           *న్యాయపతి*

       *నరసింహా రావు*

🙏🙏🌞🙏🙏🌞🙏🙏

ఆరోగ్య చిట్కాలు

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*కొన్ని ప్రాచీన భారతీయ ఆరోగ్య చిట్కాలు.*

🏵️🙏🏵️🙏🏵️🙏🏵️🙏🏵️🙏


🏵️1. _*అజీర్ణే భోజనమ్ విషమ్.*_

➖➖➖➖➖➖➖➖➖

మధ్యాహ్న భోజనం జీర్ణం కాకపోతే, రాత్రి భోజనం చేయడం, విషం తీసుకోవడంతో సమానం అని ఈ సూత్రానికి అర్థం. ఆకలి అనేది మునుపటి ఆహారం జీర్ణం కావడానికి ఒక సంకేతం. కాబట్టి ఆకలి లేకుండా మళ్ళీ ఆహారం తీసుకోకూడదు.


🏵️2. *అర్ధరోగహరి నిద్రా*

➖➖➖➖➖➖➖➖➖

సరైన నిద్ర, మీ వ్యాధులలో సగం నయం చేస్తుంది. మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో, తగినంత నిద్ర కూడా అంతే ముఖ్యం. ఆరోగ్యవంతుడు రోజుకి కనీసం ఆరు గంటలు నిద్రపోవాలి. తిన్న ఆహారం జీర్ణం కావడానికి, శారీరక శ్రమ వల్ల కాళ్ళు, చేతులు, గుండె, మెదడు మొదలైన ముఖ్య అంగాలు అలసట తీరి సక్రమంగా పనిచేయడానికి నిద్ర ఉపకరిస్తుంది. అటువంటి వారికి రోగాలు దరిచేరవు. కనుక మంచి నిద్ర సగం రోగాలను హరించి వేస్తుంది అని ఈ సూక్తికి అర్థం.


🏵️3. _*ముద్గధాలి గధవ్యాలి*_

➖➖➖➖➖➖➖➖➖➖

అన్ని రకాల పప్పుధాన్యాలలో, పచ్చ *పెసలు* (Greengrams) ఉత్తమమైనవి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇతర పప్పుధాన్యాలు అన్నీ,

 ఒకటి లేదా మరొకటి దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి.


🏵️4. *బాగ్నస్తి సంధనకరో రాసోనాహా*

➖➖➖➖➖➖➖➖➖➖

వెల్లుల్లి విరిగిన ఎముకలతో కలుస్తుంది. వెల్లుల్లి తరచుగా తినేవారిలో ఎముకలు, వాటి జాయింట్లు గట్టిగా ఉంటాయి.


🏵️5. *అతి సర్వత్రా వర్జయేత్*

➖➖➖➖➖➖➖➖➖➖➖

అధికంగా తినేది ఏదైనా, అది మంచి రుచిని కలిగి ఉన్నా, ఆరోగ్యానికి మంచిది కాదు. మితంగా (తక్కువ) తినండి.


🏵️6. *నాస్తిమూలం అనౌషాధం*

➖➖➖➖➖➖➖➖➖➖➖

శరీరానికి ఎటువంటి ఔషధ ప్రయోజనం లేని కూరగాయలు అంటూ లేవు.


🏵️7. *నా వైద్యా ప్రభుయుయుషా*

➖➖➖➖➖➖➖➖➖➖➖

ఏ డాక్టర్ కూడా మన దీర్ఘాయువుకు ప్రభువు కాదు. వైద్యులకు కొన్ని పరిమితులు ఉన్నాయి.


🏵️8. *చింతా వ్యాధి ప్రకాషయ*

➖➖➖➖➖➖➖➖➖➖➖

చింత అనారోగ్యాన్ని తీవ్రతరం చేస్తుంది.


🏵️9. *వ్యాయమాశ్చ సనైహి సనైహి*

➖➖➖➖➖➖➖➖➖➖➖

ఏదైనా వ్యాయామం నెమ్మదిగా చేయండి. వేగవంతమైన వ్యాయామం మంచిది కాదు. నడక కూడా ఇందులోకి వస్తుంది.


🏵️10. *అజవత్ చార్వనం కుర్యాత్*

➖➖➖➖➖➖➖➖➖➖➖

మీరు తినే ఆహారాన్ని మేక లాగా నమలండి. ఎప్పుడూ ఆత్రుత తో ఆహారాన్ని మింగకూడదు. జీర్ణక్రియలో లాలాజలమే మొదట సహాయపడుతుంది.


🏵️11. *స్నానమ్ నామా మనఃప్రసాధనకరం దుస్వప్న విధ్వంసకం*

➖➖➖➖➖➖➖➖➖➖➖

స్నానం డిప్రెషన్ ను తొలగిస్తుంది. ఇది చెడ్డ కలలనును దూరం చేస్తుంది.


🏵️12. *న స్నానం ఆచరేత్ భుక్త్వా.*

➖➖➖➖➖➖➖➖➖➖➖

ఆహారం తీసుకున్న వెంటనే స్నానం చేయకండి. జీర్ణక్రియ ప్రతికూలంగా ప్రభావితమవుతుంది.


🏵️13. *నాస్తి మేఘసమం తోయం.*

➖➖➖➖➖➖➖➖➖➖➖

స్వచ్ఛతలో వర్షపునీటికి, ఏ నీరు సాటి రాదు. పల్లెటూళ్ళలో ఇప్పటికీ వర్షపు నీటిని పట్టి వడకట్టి త్రాగుతారు. కాని నేరుగా పడిన వర్షపు నీటినే పట్టాలి. ఇంటి చూరుల మీదనుంచి కారిన నీరుకాదు.


🏵️14. *అజీర్నే భేజాజం వారీ*

➖➖➖➖➖➖➖➖➖➖

మంచినీరు ఎక్కువగా తీసుకోవడం ద్వారా అజీర్ణాన్ని పరిష్కరించవచ్చు.


🏵️15. *సర్వత్ర నూతనం శాస్త్రం సేవకన్న పురాతనం.*

➖➖➖➖➖➖➖➖➖➖➖

తాజా విషయాలను ఎల్లప్పుడూ ఇష్టపడండి. ఓల్డ్ రైస్ మరియు ఓల్డ్ సర్వెంట్‌ను కొత్తగా మార్చాల్సిన అవసరం ఉంది. (ఇక్కడ సేవకుడి విషయంలో అసలు అర్థం ఏమిటంటే: అతని విధులను మార్చండికానీ, తొలగించవద్దు.)


🏵️16. *నిత్యామ్ సర్వ రసభ్యాసహా.*

➖➖➖➖➖➖➖➖➖➖➖

ఉప్పు, తీపి, చేదు, పులుపు, (Astringent మరియు pungent) అన్ని రుచులు కలిగి ఉన్న పూర్తి ఆహారాన్ని తీసుకోండి.


🏵️17. *జఠరామ్ పూరైధార్ధమ్ అన్నాహి*

➖➖➖➖➖➖➖➖➖➖➖

మీ కడుపు అరవంతు ఘనపదార్థాలతో, పావువంతు నీటితో నింపండి మరియు మిగిలినది ఖాళీగా ఉంచండి.


🏵️18. *భుక్త్వోపా విసస్థాంద్ర*

➖➖➖➖➖➖➖➖➖

ఆహారాన్ని తీసుకున్న తర్వాత ఎప్పుడూ పనిలేకుండా కూర్చోవద్దు. కనీసం 100 అడుగులు అయినా నడవండి.


🏵️19. *క్షుత్ సాధూతం జనయతి*

➖➖➖➖➖➖➖➖➖➖➖

ఆకలి, ఆహార రుచిని పెంచుతుంది. (ఇంకా చెప్పాలంటే, ఆకలితో ఉన్నప్పుడు మాత్రమే తినండి.)


🏵️20. *చింతా జరానామ్ మనుష్యానమ్*

➖➖➖➖➖➖➖➖➖➖➖

చింతించడం 😭అనేది వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది. కనుక అనవసరపు చింతలతో ఆరోగ్యాన్ని పాడుచేసుకోకండి.


🏵️21. *సతం విహయ భోక్తవ్యం*

➖➖➖➖➖➖➖➖➖➖➖

ఆహారం తీసుకొనే సమయం వచ్చినప్పుడు, ఎంతటి పనినైనా కూడా పక్కన పెట్టండి. నిదానంగా భోజనం చేయండి. వేగంగా తినడం, పని ఉందని అసలు భోజనమే మానివేయడం చాలా అనర్థదాయకం.


🏵️22. *సర్వ ధర్మేశు మధ్యమామ్.*

➖➖➖➖➖➖➖➖➖➖➖

ఎల్లప్పుడూ మధ్యే మార్గాన్ని ఎంచుకోండి. దేనిలోనైనా విపరీతంగా వెళ్లడం మానుకోండి. ఈ ఆరోగ్య సూత్రాలు పాటించిన వారికి చిరాయువు, నిత్య ఆరోగ్యం  తప్పక లభిస్తాయి.


స్వస్తి.....

శోభించదు

 *ॐ卐 _-||-సుభాషితమ్||-_ ॐ卐*


శ్లో𝕝𝕝 ఏకేన రాజహంసేన 

యా శోభా సరసో భవేత్।

న సా బకసహస్రేణ 

పరితః తీరవాసినా॥


*--- సూక్తిసుధానిధిః ---*


తా𝕝𝕝 *ఒక్క రాజహంసవిహారం వల్ల శోభించే సరస్సు, వేలకొద్ది కొంగలు వచ్చిననూ శోభించదు*.... 🔥🧘‍♂️💫🙏

☝యక్ష ప్రశ్నలు

 శ్లోకం:☝యక్ష ప్రశ్నలు

యక్ష ఉవాచ:

*కేనస్వి దావృతో లోకే*

    *కేనస్వి న్నప్రకాశతే |*

*కేన త్యజతి మిత్రాణి*

    *కేన స్వర్గం న గచ్ఛతి ||* 81

యుధిష్ఠిర ఉవాచ:

*అజ్ఞానే నావృతో లోకా*

    *స్తమసా న ప్రకాశతే |*

*లోభా త్త్యజతి మిత్రాణి*

    *సంగాత్స్వర్గం న గచ్ఛతి ||* 82


భావం: యక్షుడు - _లోకము దేనిచేత ఆవరింపబడి యున్నది? దేనిచేత ప్రకాశము పొందకున్నది? ఏ కారణము చేత మిత్రులని వదిలివేయుచున్నది? ఏ కారణమున స్వర్గమునకు పోదు?_

యుధిష్ఠిరుడు - _అజ్ఞానము లోకమును క్రమ్మివేయుచున్నది? చీకటి వలన లోకము ప్రకాశింపకున్నది. లోభము వలన నరుడు మిత్రులను వదిలివేయును. మమకారము వలన స్వర్గమును పొందకున్నాడు._