20, మార్చి 2026, శుక్రవారం

వాల్మీకి రామాయణం - 4 )

 శ్రీరామ (11)


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏


             ( వాల్మీకి రామాయణం - 4 )


         " 20-3-'26, ఉదయం పోష్టు తరువాయి భాగం "

                                ----------


శ్రీరామచంద్రుని శుభ గుణములను నారదమహర్షి, వాల్మీకి మహర్షికి ఇంకా ఇలా తెలియజేస్తున్నారు.


13. శ్లో// ప్రజాపతిసమః శ్రీమాన్ ధాతా రిపునిషూదనః /

రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షితా //


14. శ్లో// రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా /

వేదవేదాంగ తత్త్వజ్ఞో ధనుర్వేదేచ నిష్ఠితః //


15. శ్లో// సర్వ శాస్త్రార్థ తత్త్వజ్ఞః స్మృతిమాన్ ప్రతిభానవాన్ /

సర్వలోక ప్రియః సాధు రదీనాత్మా విచక్షణః //



33.ఆ రాముడు సాక్షాత్తూ సృష్టికర్త అయిన బ్రహ్మదేవునితో సమానుడు (ప్రజాపతి సమః).


34.మరియు, సకల లోకములను మించిన ఐశ్వర్యము కలవాడు (శ్రీమాన్).


35. రాముడు సకల లోకములను పోషించే వాడు (ధాతా).


36.ధర్మవిరోధులను నశింపజేసేవాడు (రిపునిషూదనః)..


37. జీవులందరినీ రక్షించే వాడు (రక్షితా జీవలోకస్య).


38.ధర్మాన్ని బాగుగా రక్షించే వాడు (ధర్మస్య పరిరక్షితా)


39.రాముడు ఎల్లప్పుడు తనవంశాచారాలను కాపాడుకునే వాడు (రక్షితా స్వస్య ధర్మస్య).


40. తన బంధు, మిత్రులందరినీ కాపాడుకునే వాడు (స్వజనస్య చ రక్షితా).

(అత్యాసన్నం పరిత్యజ్య మునేర్దత్తం తు 

నిష్ఫలమ్ = దగ్గర బంధువును,లేదా ఆశ్రితుని, కాదని మునీశ్వరునికి దానం చేసినను అది నిష్ఫలమే, అను ధర్మశాస్త్రము ననుసరించి ఆశ్రిత బాంధవులను విశేషించి రక్షించువాడు అని అర్థం)



41. శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము, అనే ఆరు అంగములతో కూడిన వేదము సంపూర్ణంగా అధ్యయనం చేసిన వాడు.

ఋక్,యజుస్,సామ,అథర్వము లనే నాలుగు వేదములు తెలిసిన వాడు. 

 వేద, వేదాంగముల అర్థమే గాకుండా, వాటి తత్త్వము కూడా తెలిసిన జ్ఞాని 

(వేద వేదాంగ తత్త్వజ్ఞః).


42. ధనుర్వేదమునందు విశేషమైన ప్రతిభ కలవాడు (ధనుర్వేదే చ నిష్ఠితః)


43. .సమస్త శాస్త్రములు తెలిసినవాడు.

ఆ శాస్త్రములయొక్క అర్థము, ఆ శాస్త్రములయొక్క ప్రయోజనము, ఏ ఉద్దేశముతో శాస్త్రము అలా చెబుతున్నది? అనే విషయములతో కూడిన శాస్త్రము యొక్క తత్త్వము బాగా తెలిసినవాడు.

(సర్వ శాస్త్రార్థ తత్త్వజ్ఞః).


44. తెలిసిన విషయములన్నీ ఎప్పుడూ జ్ఞప్తిలో ఉంచుకునే వాడు ( స్మృతిమాన్).


45. ఆ తెలిసిన విషయములను దేశ, కాలములకు అనుగుణంగా ఆచరణలో పెట్టే ప్రతిభ (యుక్తి) కలవాడు.

(ప్రతిభానవాన్).


46. తన ప్రవర్తన వల్ల సమస్తజీవులకు ఇష్టమైన వాడు.

( సర్వలోక ప్రియః).


47. తనకు, అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చేసే సాధు పురుషుడు (సాధుః).


48. ఎన్ని కష్టములు వచ్చినా,దీనత్వము పొందని, ఆత్మవిశ్వాసము కలవాడు (అదీనాత్మా - Abundant Self confidence)


49. దేశ కాల పరిస్థితులను అవగాహన చేసుకుని,ఎప్పుడు 

 ఏమి చేయవలెను, ఏమి చేయగూడదు, అనే విచక్షణా జ్ఞానం కలవాడు.

( విచక్షణః).




(సశేషం)

శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

20-3-'26

ప్రభావం ప్రారంభమైంది

 

 ప్రభావం ప్రారంభమైంది

ఈరోజు ఉదయం రోజాటి లాగానే మా ఇంటికి సమీపంలో ఉన్న టిఫిన్ సెంటర్లో టిఫిన్ కొనుక్కోవటానికి వెళితే అక్కడ టిఫిన్ సెంటర్ తలుపులు ముసి వేసి ఉన్నాయి ప్రతి రోజు ఆ టిఫిన్ సెంటరు ముందర ఎన్నో స్కూటర్లు మోటార్ సైకిళ్ళు ఆగి ఉండే ప్రాంగణం పూర్తిగా బోసిపోయి ఉంది ఎందుకు ఇవాళ టిఫిన్ సెంటర్ బంద్ పెట్టారు నాకు తెలిసి ఆ టిఫిన్ సెంటరు ఏ నాడు ముసి వుండగా నేను చూడలేదు. అందు కాని అనుమానం వేసి నేను  అక్కడి వాళ్ళని విచారిస్తే గ్యాస్ దొరకటం లేదు అందుకే ఈరోజు టిఫిన్ సెంటర్ తెరవలేదు అని అందులో పని చేసే ఒక వర్కర్ చెప్పాడు. ఆహా ఇక కష్టాలు మొదలు అని మనసులో అనుకొని మోటార్ సైకిల్ స్టార్ట్ చేసుకుని ఇంకొక టిఫిన్ సెంటర్ కి వెళ్లి అక్కడి నుంచి టిఫిన్ కొనుక్కొని వెళ్లాను ఆ సెంటర్ కూడా ఎన్నాళ్లు నడుస్తుందో చెప్పలేం, పరిస్థితి రోజురోజుకీ జటిలమైతున్నట్టుగా తోస్తున్నది.

 ఆకాశాత్ పతితం తోయం యథా గచ్ఛతి సాగరమ్

సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి ॥

ఆకాశం నుంచి ఉద్భవించిన జలం ఏ విధంగా అయితే సాగరాన్ని చేరుతుందో అదే రకంగా మనం ఏ భగవంతుడిని పూజించిన అన్ని నమస్కారాలు అ కేశవుడికి మాత్రమే చందుతాయని దీని అర్థం. ఇది మనం నిత్యం చదువుకునే శ్లోకం  దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే భగవంతుడు ఒక్కడే మనం ఏ రూపంలో ప్రార్ధించిన అని ఒక అర్థము ఎలాగంటే  ఎక్కడ పడ్డ వర్షపు నీరు అయినా కుడా సముద్రంకు చేరుకోవలసిందే అని మనకు తెలుస్తుంది.  అంటే సర్వం ఒకటే అనే అర్ధం మనం తీసుకోవచ్చు.

 ఈరోజు ప్రపంచం మొత్తం ఒక గ్రామంగా పరిగణించవచ్చు ఒక గ్రామంలో ఏ రకంగా అయితే ఒకచోట ఏదైనా సమస్య ఏర్పడితే ఆ సమస్య పూర్తి గ్రామాన్ని చుట్టుముడుతుందో అదే విధంగా ఈరోజు ప్రపంచంలో ఏ దేశంలో ఏ సమస్య వచ్చినా ఆ సమస్య ప్రభావం ప్రపంచం మొత్తం లో ఉన్న జనాల మీద పడుతుందన్న దాంట్లో ఏమాత్రం సందేహం. మన దేశానికి ఏ మాత్రం సంబంధం లేకుండా మన దేశానికి ఎంతో దూరంగా ఉన్న ఇరాన్ ఇస్రైయిల్ అమెరిక  దేశాలలో ఈరోజు జరుగుతున్న యుద్ధం నిజానికి మనదేశానికి కాని దేశప్రజలకు కానే ఏరకంగా ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని సంబంధం లేదు.  కాని మనం అలా అనుకోవటానికి వీలు లేదు.కాని ఆ యుద్ద పరిణామాలు మనం కుడా  అనుభవించాల్సిన పరిస్థితి వస్తున్నది, అంటే దీనికి మించిన ఉదాహరణ ఇంకోటి లేదు.  ప్రపంచం మొత్తం శాంతియుతంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎవరో అధికారులు ఎవరో రాజకీయ దురంధరులు వారి వారి రాజకీయ ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని యుద్ధాలు చేస్తే మానవ నష్టం ఎలాగో జరుగుతుంది అంతేకాక  దానికి తోడుగా ప్రపంచ జనం మొత్తం కష్టపడాల్సిన పరిస్థితి వస్తున్నది అన్నది సత్యం.

 ఇంకొక విషయం మనం రోజు వార్తల్లో చూస్తున్నాము అనేక విమానాలు మన దేశం నుండి యుద్ధం జరిగే దేశాల వైపుగా వెళ్లి అక్కడికి వెళ్ళిన మన దేశ ప్రజలన్నీ రక్షించేందుకు ఎంతో కష్టపడుతున్నాయి. మార్చి 2026 నాటికి, అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ సంఘర్షణ కారణంగా మధ్యప్రాచ్యంలో చిక్కుకుపోయిన వేలాది మంది పౌరులను స్వదేశానికి రప్పించడానికి, భారతదేశం ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ మరియు ఇండిగో ద్వారా 58 ప్రత్యేక విమానాలను నడుపుతూ అత్యవసర స్వదేశీ తరలింపును నిర్వహిస్తోంది . అవసరమైతే వైమానిక దళం మద్దతుతో, దుబాయ్, దోహా, మస్కట్ మరియు జెడ్డా నుండి ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ మరియు కొచ్చిలకు విమానాలు నడుస్తున్నాయి. సహాయక చర్యలకు సంబంధించిన కీలక వివరాలు (మార్చి 2026): కీలక ప్రాంతాలు: యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియా మరియు ఒమన్‌లపై ప్రధాన సహాయక చర్యలు కేంద్రీకరిస్తున్నాయి. ప్రభుత్వ చర్య: పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మరియు భారత రాయబార కార్యాలయాలు 24x7 హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేశాయి మరియు సురక్షితమైన వాయు మార్గాలను నిర్ధారించడానికి గగనతల మూసివేతలను పర్యవేక్షిస్తున్నాయి. 2026 మార్చి ప్రారంభంలో భారతీయ విమానయాన సంస్థలు 15,000 మందికి పైగా చిక్కుకుపోయిన ప్రయాణికులను తిరిగి తీసుకువచ్చాయి. పరిస్థితి వేగంగా మారుతోంది; భద్రతా అంచనాల ఆధారంగా వైమానిక కార్యకలాపాలు దశలవారీగా జరుగుతున్నాయి. తక్షణ సమాచారం కోసం, చిక్కుకుపోయిన ప్రయాణికులు సమీపంలోని భారత రాయబార కార్యాలయాన్ని లేదా కాన్సులేట్‌ను సంప్రదించాలి లేదా ఎయిర్ ఇండియా మరియు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) నుండి వచ్చే అప్‌డేట్‌లను అనుసరించాలని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.  దీనిని బట్టి మనకు తెలిసేది ఏమిటంటే మనకు యేరకంగాను సంబందంలేని ఈ యుద్ధం వలన మనం ఏరకంగా బాధ పడవలసి వస్తున్నది అన్నది తెలుస్తున్నది.  ప్రభుత్వం ఒక విమానం నడపాలంటే ఖర్చు లక్షల్లో ఉంటుందని మనందరికీ తెలుసు. అటువంటప్పుడు వేల కొద్ది విమానాలను నడపాలంటే యెంత కర్చు అవుతుందో మనం వేరే చెప్పనవసరం లేదు. కోటాను కోట్ల రూపాయల కర్చు మన దేశ ఆర్దిక వెవాస్త మీద్ పడుత్న్నది. మనదేశం ఆ వేలతిని పురించుకోవటానికి తప్పని సరి పరిస్తితుల్లో ప్రజలమీద్ పన్నుల భారం వేయవలసి వస్తుంది కదా. అంటే మనకు ఏమాత్రం సంబంధం లేని ఎక్కడో దూరంగా వున్నా దేశాలలోని పోరు మనమీద్ ఎలాంటి ప్రభావం చుపెడుతున్నదో కదా.

 ఇంకొక విషయం పెట్రోలు, ప్రత్రోలియం  ప్రొడక్ట్స్ సమయానికి తగువిధంగా దొరకకపోతే అటు వ్యాపారంగము ఇటు సామాజిక రంగం పూర్తిగా అతలాకుతలం అవుతుంది అన్నది అక్షరసత్యం. ఈరోజు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగితే దాని ప్రభావం  కేవలం వాహనాల మట్టికే పరిమితం కాదు. మన నిత్యజీవితంలో కొనుక్కునే అగ్గిపెట్ట దగ్గర నుంచి బియ్యం బస్తా దాకా ప్రతి దాని రేటు ఊహించని విధంగా పెరుగుతుంది అంటే సామాన్యులు వారి సంపాదనకు మించిన ఖర్చులు భరించాల్సి వచ్చే  పరిస్థితి ఏర్పడుతుంది.

 కాబట్టి దేశ విదేశ నాయకులు అందరూ ఈ విషయాన్ని గుర్తించి సాధ్యమైనంత మటుకు అక్కడ జరిగే యుద్ధాన్ని నివారించి సామరస్య ధోరణితో వాళ్ళ మధ్య సంధి ఏర్పరచి  ప్రపంచంలో శాంతిని నెలకొల్పాలని ప్రతివారిని ఇందుమూలంగా కోరుచున్నాను ఈ మెసేజ్ ని సాధ్యమైనన్ని గ్రూపులలో ఫార్వర్డ్ చేసి ప్రపంచ శాంతికి అందరం దోహదం చేసే విధంగా తోడ్పడాలని కోరుతున్నాను

 

 

 

20మార్చి2026🪷* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

    🌹 _*శుక్రవారం*_ 🌹

   *🪷20మార్చి2026🪷*  

   *దృగ్గణిత పంచాంగం*  

                                     

          *స్వస్తి శ్రీ పరాభవ* 

         *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*చైత్రమాసం - శుక్ల పక్షం* 


*తిథి : విదియ* రా 02.30 వరకు ఆపైన *తదియ*         

*వారం    : శుక్రవారం* (భృగువాసరే)

*నక్షత్రం  : రేవతి* రా 02.27 వరకు ఉపరి *అశ్విని*

*యోగం : బ్రహ్మ* రా 10.15 వరకు ఉపరి *ఐంద్ర*

*కరణం  : బాలువ* మ 03.43 *కౌలువ* రా 02.30 ఉపరి *తైతుల*

*సాధారణ శుభ సమయాలు*

*ఉ 09.30 - 10.30 మ 02.00 - 03.00*               

అమృత కాలం  : *రా 12.13 - 01.43*

అభిజిత్ కాలం  : *ప 11.51 - 12.39*

*వర్జ్యం    : మ 03.16 - 04.46*

*దుర్ముహూర్తం  : ఉ 08.37 - 09.25 మ 12.39 - 01.28*

*రాహు కాలం   : ఉ10.44- 12.15*

గుళికకాళం      : *ఉ 07.43 - 09.13*

యమగండం    : *మ 03.17- 04.47*

సూర్యరాశి : *మీనం*                    

చంద్రరాశి : *మీనం/మేషం*

సూర్యోదయం :*ఉ 06.21*

సూర్యాస్తమయం :*సా 06.27*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం      :*ఉ 06.12 - 08.38*

సంగవ కాలం       :*08.38 - 11.03*

మధ్యాహ్న కాలం    :*11.03 - 01.28*

అపరాహ్న కాలం   :*మ 01.28- 03.53*

*ఆబ్ధికం తిధి    :చైత్ర శుద్ధ విదియ*

సాయంకాలం  :*సా 03.53 - 06.18*

ప్రదోష కాలం     :*సా 06.18 - 08.41*

రాత్రి కాలం       :*రా 08.41 - 11.51*

నిశీధి కాలం       :*రా 11.51 - 12.39*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.37 - 05.24*

☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆

        *🌷ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🪷శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం🪷*


*అరూపా బహురూపా చ* 

*విరూపా విశ్వరూపిణీ*

           

            *🪷ఓం శ్రీ🪷* 

*🌷మహాలక్ష్మీ దేవ్యై నమః🌷*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

మహాభారతము

 🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*గురువారం 19 మార్చి 2026*

``

              *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో!

                      1️⃣6️⃣9️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


        *సంపూర్ణ మహాభారతము*      

      

                    *169 వ రోజు*                    

*విరాట పర్వము ద్వితీయాశ్వాసము*


*కీచకుడు ద్రౌపదిని చూచుట*```


అజ్ఞాతవాసం ప్రశాంతంగా కొన్నిరోజులలో ముగుస్తున్న సమయంలో విరాటుని బావమరిది కీచకుడు అంతఃపురంలో అక్కను చూడటానికి వచ్చి యాదృచ్ఛికంగా ద్రౌపదిని చూసాడు. కీచకుడు మంచి అందగాడు, బలవంతుడు, కాని వివేక హీనుడు. అతడికి బలగర్వం, సౌందర్య గర్వం ఎక్కువ. అతడు విరాటరాజు కొలువులో దండనాయకుడు. కీచకుడు ద్రౌపది అందానికి ఆశ్చర్యపోయి ఆమె నుండి చూపులు మరల్చుకోలేక పోయాడు. అతడు మనసులో 

“అహా! మానవులు ఎవరైనా ఇంతటి అందగత్తెను చూసి ఉండరు. ఇంతటి అందగత్తె మన్మధుని వద్ద ఉంటే ఆనాడు అతడు శివుని కూడా జయించే వాడు కదా. బ్రహ్మదేవుడు మన్మధుని అయిదు బాణాలు కలిపి ఈమెను సృష్టించాడో యేమో. మన్మధుడు కూడా విరహ తాపంలో వేగిపోతాడేమో. ఈ సుందరాంగి తల్లితండ్రులు ఎవరో, అదృష్టవంతుడైన భర్త ఎవరో, పేరు ఏమో,ఈమెను పొందే మార్గమేమిటో, ఈపనికి ఎవరు నాకు సాయపడగరు” అని పరిపరి విధాల ఆలోచించాడు. మాసిన చీర ధరించిన ద్రౌపది అతని వికారపు చూపులకు అసహ్యించుకుంది. 


ఆమె మనసులో “ఇతడు ఏమిటి ఇలా చూస్తున్నాడు. ఇప్పుడు నన్ను ఇతని నుండి రక్షించే దిక్కెవరో?” అనుకున్నది. 


కీచకుడు అదేమి పట్టించుకోకుండా ఆమె చూపులను చూసి శృంగార చేష్టలని అపోహ పడ్డాడు. పక్కనే సుధేష్ణ, పరిచారికలు చూస్తున్నా పట్టించుకోకుండా ఆమె వైపు మోహంతో తదేకంగా చూసాడు. తరువాత తేరుకుని అక్క సుధేష్ణకు నమస్కరించాడు. ఆమె అతనికి ఉచితాసనం చూపించింది.```


*కీచకునికి సుధేష్ణ బుద్ధిమతి చెప్పుట*```


కీచకుని మాటలు విన్న సుధేష్ణ 

“నేను అనుకున్నంత అయింది. ఈ సైరంధ్రిని చూసి కీచకుడు మోహావేశంలో పడ్డాడు. వీడికి ఏమి కీడు మూడుతుందో? వద్దన్నా వినే వాడు కాదు. నేనేమి చేసేది? నా శక్తి వంచన లేకుండా చెప్పి చూస్తాను” అనుకున్నది. 


సుధేష్ణ “తమ్ముడా కీచకా! నీ అంతఃపురంలో అతి సుందరులైన కాంతలు ఉన్నారు. ఈ నీరసాకార అయిన సైరంధ్రి ఎందుకు?” అని అనునయంగా చెప్పింది సుధేష్ణ. 


కీచకుడు “అక్కా! ఈ సైరంధ్రిని పోలిన అందగత్తె ఈ భూమి మీదే కాదు దేవతలలో కూడా లేదు ఇది నిజం. ఆమె నేత్రాలు, పద్మాలవంటి కళ్ళు, ఆ కోకిల కంఠం, ఆ మేని సొంపు నన్ను ఆకర్షిస్తున్నాయి. ఏ ఉపాయం అయిన సరే ఆమె నాకు కావాలి!”అన్నాడు. 


కీచకుడు మామూలు మాటలతో వినడని సుధేష్ణ కొంచం కటువుగా చెప్ప సాగింది. “తమ్ముడా కీచకా! పరస్త్రీ సాంగత్యం వలన నీ ఆయుష్షు, ఐశ్వర్యం, కీర్తి హరింపబడతాయని తెలియదా? ధర్మాత్ములు దీనిని హర్షించరు. భర్తకు తెలిస్తే ప్రాణం మీదకు వస్తుందని, ఇతరులు చూస్తే పరువు పోతుందని, సాటి ఆడువారికి తెలిస్తే గౌరవం పోతుందని, బంధువులకు తెలిస్తే వంశనాశనం ఔతుందని క్షణ క్షణం భయపడుతూ, భయపడుతూ, వ్యధతో ఉండే పరస్త్రీతో ఏమి సుఖపడతావు. జారిణితో పొందు సుఖం కాదని అందరూ దూరంగా ఉంటారు. ఆమె భర్తలు గంధర్వులు. వాళ్ళ చేతిలో నీవు మరణించవచ్చు. దానిని మర్చిపోరా తమ్ముడూ. చెడు మార్గలో చరించే వారికి వినాశనం తప్పదు నీ లాంటి బుద్ధి మంతులకు ఇది తగదు” అన్నది సుధేష్ణ. 


అక్క చెప్పిన మాటలు కీచకుని చెవికెక్క లేదు. “ఓ సుధేష్ణా! ఒక్క మాట చెప్తున్నాను విను. ఈ భూలోకంలో నన్ను ఎదిరించి నిలువగల వీరుడు లేడు. నా బాహుబలంతో గంధర్వాదులను సంహరించగలను. కనుక నాకు బుద్ధి చెప్పుట మాని నా కోరిక మార్గం సుగమం చెయ్యి” అని వంగి అక్క పాదాలకు నమస్కరించాడు. 


సుధేష్ణ ఇక వీడు ఏమి చెప్పినా వినడు. వీడికి ఆమెను జతచేస్తే సరి. ఆమె భర్తలైన గంధర్వుల చేతిలో చస్తాడు. లేకున్న మన్మధుడి చేతిలో చస్తాడు. ఎలాగైనా వీడికిక చావు తధ్యం!” అనుకున్నది సుధేష్ణ.```



             *(సశేషం)*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

*శ్రీ మహావిష్ణు పురాణం*

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*గురువారం 19 మార్చి 2026*


       *శ్రీ మహావిష్ణు పురాణం* 

 `` *30వ భాగం*``


*మత్స్యావతార కథ*```


మానససరోవరంలోని రాజహంస నారదుని కోరికపై శ్రీహరి మత్స్యావతార కథ చెబుతోంది. 


బ్రహ్మకు రోజులో పగలు పూర్తి అయ్యి రాత్రి వచ్చే సమయం అవుతోంది. బ్రహ్మదేవుడు సృష్టి ఆపి రాత్రి సమయంలో నిద్రిస్తాడు. సృష్టికర్త శయనించగానే భూమిపై జలప్రళయం వస్తుంది. భూమి పైన నివసించే వారికి ఈ సంగతి తెలియదు. సకల రాజ్యాలలో ప్రజలు ధర్మ మార్గం అనుసరిస్తూ సుఖశాంతులతో ఉన్నారు. 

అలా సుఖశాంతులు కలిగి ఉన్న దేశాలలో ద్రవిడ దేశం ఒకటి. 

ఆ రాజ్యానికి సత్యవ్రతుడు మహారాజుగా ఉన్నాడు.


సత్యవ్రతుడు శ్రీమహావిష్ణువు భక్తుడు. తన రాజ్యంలో అనేక వైష్ణవాలయాలు నిర్మించి నారాయణుడి విగ్రహాలు ప్రతిష్టించి నిత్య పూజలు ఘనంగా చేయడానికి తగిన ఏర్పాట్లు చేశాడు. 

తన రాజభవనానికి ఎదురుగా వైష్ణవాలయం నిర్మించి ప్రతిష్టించిన శ్రీమహావిష్ణువు విగ్రహానికి స్వయంగా నిత్యాభిషేక అర్చనలు చేసేవాడు.


ప్రతిరోజూ ప్రాతఃకాలంలో లేచి నగర సమీపాన గల'కృతమాలిక" అనే నదిలో స్నాన సంధ్యలు పూర్తిచేసి నారాయణునికి జలతర్పణం ఇచ్చేవాడు. 

నిత్య పూజలతో, అర్చనలతో, అభిషేకాలతో, తర్పణాలతో సత్యవత్రుడు విష్ణువుకి అత్యంత ప్రియభక్తుడు అయ్యాడు. శ్రీహరి తన ప్రియభక్తుని రాబోయే జల ప్రళయం నుండి రక్షించడానికి సంకల్పించాడు.


రాబోయే జల ప్రళయాన్ని సూచిస్తూ ఆకాశమంతా దట్టమైన మేఘాలతో నిండిఉంది. సత్యవ్రతుడు ప్రతిరోజు లాగానే తెల్లవారుజామునే లేచి కృత మాలికనదిలో స్నానసంధ్యాదులు పూర్తి చేసి శ్రీహరికి జలతర్పణం ఇవ్వడానికి ‘ఓం నమోనారాయణాయ’ మంత్రం జపిస్తూ దోసిలిలోకి నీరు తీసుకుని కన్నులు మూసుకుని వదలబోయాడు.


అప్పుడు సత్యవ్రతుడికి "మహారాజా! ఆగుము! శరణు కోరే నా విన్నపం వినుము" అన్న మాట వినిపించింది. 


కన్నులు తెరచి చుట్టూ చూసాడు. ఎవరు కనపడలేదు. దోసిలి లోని నీటిలో కలకలం ఏర్పడింది. దోసిలి వంక చూస్తే నీటిలో ఒక చిన్న చేప పిల్ల కనిపించింది. ఉలిక్కిపడి ఆ చేపను దోసిలి నీటితో సహా నదిలోకి వదల బోయాడు.


ఆ చిన్న చేపపిల్ల మానవభాషలో "రాజా! నదిలోకి నన్ను వదలద్దు. నేను చెప్పే మాట వినుము" 

అని అరిచింది. 


సత్యవ్రతుడు ఆశ్చర్యంతో దోసిలి నీటిలో 

ఉన్న చేపపిల్ల వంక చూశాడు.


"సత్యవ్రత మహారాజా! నన్ను రక్షించి కాపాడుము. ఈ నదిలోని పెద్ద చేపలు నాలాంటి చిన్న చేపలను పట్టుకుని తినేస్తాయి. ఆ పెద్ద చేపలనుంచి తప్పించుకుని జీవించినా జాలరులు తమ వలలు విసిరి పట్టుకుని ప్రాణం తీసి తినడానికి అమ్మేస్తారు. నా ప్రాణాలు కాపాడుకోవడానికి నీ దోసిలిలోకి వచ్చాను.


నీవు శ్రీమన్నారాయణుని మహాభక్తుడివి. నిత్యం తర్పణాలు, పూజలు చేస్తావు. నారాయణుడు సకల జీవుల పై సమాన కరుణ చూపించి కాపాడుతాడు. ధర్మమూర్తివైన నీవు దేవాధిదేవుడు శ్రీహరిలాగా చిన్నచేపపిల్లనైన నన్నురక్షింపుము. నీ శరణుకోరుతూ వచ్చాను" అని దీనంగా అడిగింది.


సత్యవ్రతుడు చేపపిల్ల మాటలకు జాలిపడి దానిని తన కమండలం లోని నీటిలోకి విడిచాడు. తర్పణాలు పూర్తి చేసుకుని కమండలంతో రాజభవనానికి వెళ్లాడు. రాత్రి గడిచేసరికి ఆ చేపపిల్ల కమండలం పట్ఠనంత ఎదిగింది. సత్యవ్రతుడు పొద్దున చూసి ఆశ్చర్యపోయాడు. రాజుని చూసిన చేపపిల్ల తనను కమండలం నుంచి పెద్ద పాత్రకు మార్చమని కోరింది.


చేపపిల్ల కోరిక మన్నించి సత్యవత్రుడు ఆ చేపను అంతపురంలో గల పెద్ద నీటిబానలో జారవిడిచాడు. మూడు ఘడియల సమయం అయ్యే సరికి ఆ చేప నీటిబానలో ఇమడలేనంతగా పెరిగింది. మరింత ఆశ్చర్యం చెందిన సత్యవ్రతుడు చేపను తీసుకుని చిన్న సరస్సులో వదిలాడు. 

మరో ఘడియ గడిచేసరికి చేప మడుగంత పెరగటంతో నదిలోకి తీసుకెళ్లి వదిలాడు.


మరి కొంత సమయం గడిచేసరికి నది విస్తీర్ణం దాటి చేప ఎదిగింది. విస్తుబోయన సత్యవత్రుడు జాలిపడి ఆ మహామత్స్యాన్ని తీసుకెళ్లి సముద్రంలో వదిలేశాడు. అప్పుడు ఆమహామత్స్యం సత్యవత్రుని చూసి "రాజా! నన్ను ఇంతవరకు కాపాడి ఇప్పుడు మహాసముద్రంలో వదిలేశావు. ఇక్కడ ఉండే మొసళ్ళు, తిమింగలాలు నన్ను వెంటాడి వేటాడి చంపి తినేస్తాయి. నీకు న్యాయమా!" అని అడిగింది.


చేప మాట్లాడిన మాటలకు, ఆకారానికి పొంతన లేకపోవడంతో సత్యవత్రుడు విస్మయం చెందుతూ "మత్స్యమా! నీవు ఒక్క రోజులో నూరు యోజనాల పొడవు పెరిగావు. నీ లాంటి మత్స్యాన్ని ఇంతవరకు చూడలేదు, వినలేదు. ఇంత ఆకారం ఉండి నీవు దీనంగా మాట్లాడిన మాటలు వింతగా ఉన్నాయి. నీవు మామూలు చేపవి కావు. తప్పకుండా నన్ను పరీక్షంచడానికి వచ్చిన 

నా దైవం నారాయణుడవే నీవు!


ఈ మత్స్యావతారం ధరించి నన్ను పరీక్షించడం దేనికి? కారణం ఏమిటి? నన్ను అనుగ్రహించి బోధపరచుము!" అని ప్రార్ధించాడు. 


కరుణించిన శ్రీమహావిష్ణువు మత్స్య రూపం వదలి శంఖ చక్ర గదా పద్మ ధరుడైన చతుర్భుజ రూపంలో దర్శవమిచ్చాడు. సత్యవ్రతుడు దివ్య నారాయణమూర్తి దర్శనంతో తన్మయుడై శ్రీహరిని అనేక విధాలుగా స్తుతించాడు.


ప్రసన్నుడైన నారాయణుడు చిరునవ్వుతో "సత్యవ్రతా! నేటికి ఏడవ రోజున బ్రహ్మదేవుడి పగటి కాలం అంతమై రాత్రి ప్రారంభమవుతుంది. జల ప్రళయం సంభవించి భూమండలం జలరాశిలో మునిగిపోతుంది. భూమి పై గల సమస్త ప్రాణులు అంతరించి పోతాయి. ఒక నావ మాత్రం జలధిలో తేలుతూ వస్తుంది. ఆ నావలో సప్త ఋషులు పునఃసృష్టికి కావలసిన జీవ జంతువులు, ధాతువులతో ఉంటారు. మహర్షుల తేజస్సు నీకు అంధకారంలో కాంతిపుంజం వలె కనిపిస్తుంది.


పునఃసృష్టి కావలసిన అన్ని రకాల ధాన్య, ఫల, ఆహార పదార్థాలు విత్తనాలు సేకరించి నీవు ఆ నావలోకి చేర్చుము. నీవు నావ ఎక్కి కూర్చున్న తరువాత నేను ఈ మత్స్య రూపంలో వచ్చి నావను నాతో తీసుకు వెళతాను. 

నా మత్స్యావతారం నీకు చూపించడం వెనుక గల ఉద్దేశం ఇదే! నీవు సిద్దంగా ఉండుము" అని అదృశ్యమయ్యాడు.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

పాత్రతనుబట్టి

 శ్రీరామ (117)

శుభోదయం.


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏


 శ్లో// విద్యా వివాదాయ ధనం మదాయ,

శక్తిః పరేషాం పరిపీడనాయ /

ఖలస్య సాధో ర్విపరీత మేతద్,

జ్ఞానాయ దానాయ చ రక్షణాయ //


(దుష్టునకు విద్య యున్నచో వాదవివాదములు సల్పుచుండును.

ధనమున్నచో మదించిపోవుచుండును.

బలమున్నచో ఇతరులను బాధించుచుండును.

అదియే విద్య సజ్జనునకు ఉన్నచో దానిద్వారా అతడు జ్ఞానమును సంపాదించుకొనును.

ధనమున్నచో దానధర్మములకు వినియోగించును.

బలమున్నచో కష్టములలో ఉన్నవారిని, దీనులను రక్షించుటకు వినియోగించును)

ఈవిధంగా ఒకే విద్య, ధనము, బలము, పాత్రతనుబట్టి భిన్న భిన్న ఫలితములనిచ్చును.


శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

20-3-'26.

సుందోపసుందులు

  🪷🇮🇳🪷🇮🇳🪷🇮🇳🪷

సుందోపసుందులు నికుంభుడనే రాక్షస రాజు కుమారులు, వీరు మహాభారతంలోని ప్రసిద్ధ కథ. అత్యంత అన్యోన్యంగా ఉండే ఈ సోదరులు, బ్రహ్మ కోసం తపస్సు చేసి "ఒకరి చేతిలో తప్ప వేరే ఎవరి చేతిలోనూ తమకు మరణం ఉండకూడదు" అనే వరం పొంది, ముల్లోకాలను పీడిస్తారు. చివరికి, దేవతల ఉపాయంతో తిలోత్తమ అనే అప్సరస కోసం కొట్టుకుని ఇద్దరూ చనిపోతారు.

 *సుందోపసుందుల కథ - ముఖ్య అంశాలు:* 

 *జననం & అన్యోన్యం:* హిరణ్యకశిపుని వంశానికి చెందిన నికుంభుని కుమారులు. ఇద్దరూ ఒకరి విడిచి ఒకరు ఉండేవారు కాదు.

 *కఠోర తపస్సు:* ముల్లోకాలను జయించాలనే కోరికతో వింధ్య పర్వతాల వద్ద బ్రహ్మ గురించి కఠోర తపస్సు చేశారు.

 *విచిత్రమైన వరం:* తమకు ఇతరుల వల్ల మరణం లేకుండా, కేవలం తమలో తాము కొట్టుకుంటేనే మరణం సంభవించేలా వరం పొందారు.

రాక్షస పాలన: ఆ వరంతో మునులను, దేవతలను, ముల్లోకాలను భయభ్రాంతులకు గురిచేస్తూ చిందరవందర చేశారు.

 *దేవతల ఉపాయం:* సుందోపసుందులను అంతం చేయడానికి బ్రహ్మ దేవసభలోని అత్యంత సౌందర్యవతి అయిన **తిలోత్తమ**ను పంపుతారు.

 *అంతం:* ఆమె సౌందర్యానికి ముగ్ధులై, ఒకరితో ఒకరు పోట్లాడుకుని, చివరకు ఒకరి చేతిలో ఒకరు చనిపోయారు. 


ఈ కథ పాండవులకు ద్రౌపదీ దేవి విషయంలో, ఐదుగురు అన్నదమ్ములు ఒకరితో ఒకరు అన్యోన్యంగా ఉండాలని హితవు చెప్పే సందర్భంలో దేవముని నారదుడు చెబుతాడు.

🪷🇮🇳🪷🇮🇳🪷🇮🇳🪷

...శ్రీమాత శ్రీశారదామాతకు జయము జయము


...ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ


...ఓం శ్రీరామ జయరామ జయజయరామ


...ॐ नमः शिवाय


...సర్వేషాం ఉగాది శుభాకాంక్షలు

🪷🇮🇳🪷🙏🪷🇮🇳🪷

ఆర్యా శతకం - 1*

  *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*ఆర్యా శతకం - 1*


*శ్లోకము - 56*


*ఆహితవిలాసభంగీమాబ్రహ్మ స్తంబశిల్పకల్పనయా।*

*ఆశ్రితకాంచీమతులామాద్యాం విస్ఫూర్తిమాద్రియే విద్యామ్||*


*భావము :*


*ఆ జగన్మాత పూర్వజ. అందరికంటే ముందు ఉన్నది. గడ్డి పరక మొదలు, సృష్టికర్తయైన బ్రహ్మవరకు సృష్టించింది ఆమెయే. ఈ విశ్వములో మొదటి చైతన్యము మాతదే. అటువంటి కాంచీపురములో వెలసిన మాతను నిరంతరం ప్రార్థిస్తాను.*


🙏🙏🙏*శ్రీమాత్రే నమః* 🙏🙏🙏

భగవద్గీత

  -------------------- భగవద్గీత. -------------------

తృతీయోధ్యాయ: కర్మ యోగము.


యది హ్యయం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః ।

మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః ।। 23 ।।



ప్రతిపదార్థ:



యది — ఒకవేళ; హి — నిజముగా; అహం — నేను; న — కాదు; వర్తేయం — ప్రవర్తించు; జాతు — ఎప్పటికీ; కర్మణి — విహిత కర్మలు ఆచరించటంలో; అతంద్రితః — జాగ్రత్తగా; మమ — నా యొక్క; వర్త్మ — దారిని; అనువర్తంతే — అనుసరిస్తారు; మనుష్యాః — అందరు మనుష్యులు; పార్థ — అర్జునా, ప్రిథ పుత్రుడా; సర్వశః — అన్ని విధములుగా.

  

 తాత్పర్యము : 


  

నేను నా విహిత కర్మలను జాగ్రత్తగా చేయనిచో, ఓ పార్థా, అందరు మనుష్యులు నా దారినే అన్ని విధాలుగా అనుసరిస్తారు.



 వివరణ:


భూలోకంలో తన దివ్య లీలలలో భాగంగా, శ్రీ కృష్ణుడు ఒక రాజుగా మరియు గొప్ప నాయకుడుగా, తన పాత్రను నిర్వహించాడు. ఈ భౌతిక ప్రపంచంలో శ్రీ కృష్ణుడు, అత్యంత ధర్మాత్ముడైన వసుదేవ మహారాజు పుత్రునిగా, వృష్ణి వంశంలో అవతారమెత్తాడు. ఒకవేళ శ్రీ కృష్ణ పరమాత్మయే తన వేదవిహిత కర్మలను చేయకపోతే, అలా ఉల్లంఘించటమే ప్రామాణిక పద్ధతి అని అనుకొంటూ, ఎంతోమంది సామాన్య జనులు ఆయన అడుగుజాడల్లో నడుస్తారు. అలా చేస్తే జనులను తప్పుదారి పట్టించటంచే దోషుడనవుతాను అని శ్రీ కృ-------------------- భగవద్గీత. -------------------

తృతీయోధ్యాయ: కర్మ యోగము.


యది హ్యయం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః ।

మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః ।। 23 ।।



ప్రతిపదార్థ:



యది — ఒకవేళ; హి — నిజముగా; అహం — నేను; న — కాదు; వర్తేయం — ప్రవర్తించు; జాతు — ఎప్పటికీ; కర్మణి — విహిత కర్మలు ఆచరించటంలో; అతంద్రితః — జాగ్రత్తగా; మమ — నా యొక్క; వర్త్మ — దారిని; అనువర్తంతే — అనుసరిస్తారు; మనుష్యాః — అందరు మనుష్యులు; పార్థ — అర్జునా, ప్రిథ పుత్రుడా; సర్వశః — అన్ని విధములుగా.

  

 తాత్పర్యము : 


  

నేను నా విహిత కర్మలను జాగ్రత్తగా చేయనిచో, ఓ పార్థా, అందరు మనుష్యులు నా దారినే అన్ని విధాలుగా అనుసరిస్తారు.



 వివరణ:


భూలోకంలో తన దివ్య లీలలలో భాగంగా, శ్రీ కృష్ణుడు ఒక రాజుగా మరియు గొప్ప నాయకుడుగా, తన పాత్రను నిర్వహించాడు. ఈ భౌతిక ప్రపంచంలో శ్రీ కృష్ణుడు, అత్యంత ధర్మాత్ముడైన వసుదేవ మహారాజు పుత్రునిగా, వృష్ణి వంశంలో అవతారమెత్తాడు. ఒకవేళ శ్రీ కృష్ణ పరమాత్మయే తన వేదవిహిత కర్మలను చేయకపోతే, అలా ఉల్లంఘించటమే ప్రామాణిక పద్ధతి అని అనుకొంటూ, ఎంతోమంది సామాన్య జనులు ఆయన అడుగుజాడల్లో నడుస్తారు. అలా చేస్తే జనులను తప్పుదారి పట్టించటంచే దోషుడనవుతాను అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు.ష్ణుడు అంటున్నాడు.

శుక్రవారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

20-03-2026 శుక్రవారం రాశి ఫలితాలు


మేషం


బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సమాజంలో పెద్దల అనుగ్రహంతో కీలకమైన పనులు పూర్తిచేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.

---------------------------------------


వృషభం


కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు మానసికంగా కొంత చికాకు కలిగిస్తాయి. ప్రయాణ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి, వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు కలసిరావు. కీలక విషయాలలో అలోచించి ముందుకు సాగాలి.

---------------------------------------


మిధునం


అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. మాతృ వర్గ బంధు మిత్రులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారములలో నష్ట సూచనలున్నవి. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో మార్గ అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.

---------------------------------------


కర్కాటకం


వృత్తి ఉద్యోగమున పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. బంధు, మిత్రులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. 

---------------------------------------


సింహం


ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగములలో బాధ్యతలు నిర్వహించడంలో లోటుపాట్లు కలుగుతాయి. సోదరులతో స్ధిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఆర్ధిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. నేత్ర సంభందిత సమస్యలు కలుగుతాయి.

---------------------------------------


కన్య


కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశములు అందుతాయి. భాగస్వామ్య వ్యాపారాలకు నూతన పెట్టుబడులు లభిస్తాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. మొండి బాకీలు ఋణాలు తీర్చగలుగుతారు.

---------------------------------------


తుల


గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఇంటాబయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. కీలక వ్యవహారాలలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పై అధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి.

---------------------------------------


వృశ్చికం


కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కొన్ని పనులు అనుకూలంగా పూర్తిచేస్తారు. ఆర్థికంగా వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

---------------------------------------


ధనస్సు


మొండి బాకీలు వసూలు అవుతాయి. దైవ సేవ కార్యక్రమాలు నిర్వహించి పెద్దల నుండి ప్రశంసలు అందుకుంటరు. వృత్తి,ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. గృహమున సంతాన వివాహ విషయమై చర్చలు జరుగుతాయి. పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------


మకరం


ఇతరులతో అలోచించి మాట్లాడటం మంచిది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు మరింత నిరాశ కలిగిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు పని భారం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు.

---------------------------------------


కుంభం


నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. బంధుమిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. దూర ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆర్ధిక సమస్యలు కలుగుతాయి. ఉద్యోగమున సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి.

---------------------------------------


మీనం


వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. చాలాకాలంగా వేధిస్తున్న స్థిరాస్తి వివాదాల నుండి బయట పడతారు. ఆర్ధిక విషయంలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార విషయమై పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. విద్యార్థులకు నూతన అవకాశములు లభిస్తాయి. పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు.

---------------------------------------

రామాయణ

  *సంక్షిప్త దివ్య రామాయణ పారాయ‌ణం*

        🌸🌸🌸🌸 


             *2 వ రోజు* 


       *అయోధ్య కాండ‌*

 

               ****

శ్రీ‌రాఘ‌వం ద‌శ‌ర‌థాత్మ‌జ మ‌ప్ర‌మేయం

సీతాప‌తిం ర‌ఘుకులాన్వ‌య ర‌త్న‌దీపం

ఆజానుబాహుం అర‌వింద ద‌ళాయ‌తాక్షం

రామం నిశాచ‌ర వినాశ‌క‌రం న‌మామి.

                ****

కోస‌ల‌దేశంలోని అయోధ్యా న‌గ‌రం స‌ర్వశోభాయ‌మానంగా అల‌రారుతున్న‌ది. మిథిలాన‌గ‌రం నుంచి వ‌చ్చిన పెళ్లి వారంద‌రికీ ఆతిథ్యాలు అందించారు. వ‌శిష్ఠుల‌వారి ఆదేశానుసారం నూత‌న దంప‌తుల‌కు జ‌రిపించ‌వ‌ల‌సిన కార్య‌క్ర‌మాల‌న్నీ జ‌రిపించారు. పౌరులంద‌రూ ఉత్స‌వాలు జ‌రుపుకుని సంతోష‌సాగ‌ర త‌రంగాల‌లో తేలియాడుతున్నారు. ఒక‌నాడు భ‌ర‌తుడు, శ‌త్రుఘ్న‌డు తమ తాత‌గారి వ‌ద్ద‌కొంత కాలం ఉండి రావ‌డానికి వెళ్లారు.

రోజులు ఆనందంగా గ‌డిచిపోతున్నాయి. రాముడి శౌర్య ప్ర‌తాపాల‌ను ప్ర‌జ‌లు వేనోళ్ల కొనియాడుతున్నారు. 

ఒక‌రోజు ద‌శ‌ర‌థుడు మంత్రి, సామంత , పురోహిత‌, దండ‌నాదుల‌తో స‌మావేశం ఏర్పాటుచేశాడు. తనకు వ‌య‌సు పైబ‌డిన రీత్యా అగ్ర‌జుడైన రామ‌చంద్రునికి రాజ్య‌భారాన్ని అప్ప‌గించి విశ్రాంతి తీసుకోవాల‌ని ఉంది, మీ రేమంటారు?అని అడిగాడు. మీరు అనుమ‌తిస్తే త్వ‌ర‌లోనే శ్రీ‌రామ ప‌ట్టాభిషేకం జరిపిద్దాం అన్నాడు. 

ఆ మాట విన్నంత‌నే ప్రజలు అంద‌రూ శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తి రాజుకావాల‌న్న మా మ‌నసులోని మాట‌నే మీరూ చెప్పార‌ని సంతోషం వ్య‌క్తం చేశారు. దీనితో మ‌హారాజు వారంద‌రికీ అభివాదం చేసి కుల‌గురువులు వ‌శిష్ఠ వామ‌దేవుల‌వైపు చూసి ప‌ట్టాభిషేకానికి సుమూహూర్తం నిర్ణ‌యించ‌మ‌ని కోరాడు. అందుకు వ‌శిష్ఠుల‌వారు అప్ప‌టిక‌ప్పుడే పుష్య‌మీ న‌క్ష‌త్ర‌యుక్త సుముహూర్తం నిర్ణ‌యించి -రేపే అభిషేకం అన్నాడు.

వెంట‌నే రామ‌చంద్రుని స‌భామందిరానికి పి‌లిపించి ప‌ట్టాభిషేకం గురించి తెలియ‌జేశాడు. రాజ‌ధ‌ర్మాలు, స‌దా గుర్తుంచుకోవాల‌న్నాడు. భ‌ర‌తుడు న‌గ‌రంలో లేని స‌మ‌యంలోనే ప‌ట్టాభిషేకం జ‌రిగిపోవాల‌న్నాడు.

రాముడు తండ్రికి పాదాభివంద‌నం చేసి అక్క‌డి నుంచి వెళ్లి ,త‌ల్లి కౌస‌ల్య‌కు ఈ విష‌యం చెప్పాడు. ప‌ట్టాభిషేకానికి వ్ర‌త‌దీక్ష‌ను త‌మ‌చేత పూర్తిచేయించాల్సిందిగా కోరాడు. 

*కైక- ద‌శ‌ర‌థుడి వ‌రాలు.....*


దేశ‌వాసులంతా సంబ‌రాల‌లో మునిగిపోయారు. అదే స‌మ‌యంలో కైకేయి దాసి మంధ‌ర ఈ ఉత్స‌వాల హ‌డావుడి చూసి ప‌రిచారిక‌ను ఏమిటీ హడావుడి అని అడిగింది. రామ‌చంద్రుల వారి ప‌ట్టాభిషేక సంరంభాల గురించి ప‌రిచారిక తెలియ‌జేసింది. వెంట‌నే మంథ‌ర కైకేయి మందిరానికి వెళ్లి, కైకేయిని ఉద్దేశించి, ఇక అంతా అయిపోయింది. రామ‌చంద్రుడు రాజుకాబోతున్నాడు. ఇక నువ్వు నీ కుమారుడి బ‌తుకు నాలాగే అంటూ విషం వెళ్ల గ‌క్కింది. భ‌ర‌తుడు రాజు కావాల‌ని నూరిపోసింది . ద‌శ‌ర‌థ‌డు గ‌తంలో కైకేయికిఇచ్చిన రెండు వ‌రాలు గుర్తుచేసింది. ఇప్ప‌డు వ‌రాలు తీర్చ‌మ‌ని కోర‌మ‌ని చెప్పింది. కైకేయికి ముందు ఇష్టం లేక‌పోయినా మంథ‌ర మాట‌లు క్ర‌మంగా ప‌నిచేసి అల‌క మందిరం చేరింది. ద‌శ‌ర‌ధుడు అల‌క మందిరం చేరి విష‌యం తెలుసుకుని బాధ‌ప‌డ్డాడు. కైకేయి ని బ్ర‌తిమాలాడు. క‌న్నీరు కార్చాడు. అయినా కైకేయి భ‌ర‌తుడి ప‌ట్టాభిషేకం జ‌ర‌గాల‌నిప‌ట్టుబ‌ట్టింది. రాముడు 14 సంవ‌త్స‌రాలు అరణ్య వాసం చేయాల‌ని, నార‌బ‌ట్ట‌లు క‌ట్టి సంచ‌రించాల‌ని కోరింది.కైకేయి మాట‌ల‌కుద‌శ‌ర‌థుడు మూర్ఛ‌పోయాడు. మ‌రోవైపు రామ ప‌ట్టాభిషేకానికి ప‌నులుసాగుతున్నాయి. ఇంత‌లోనే కైకేయి రాముడిని పిలిపించి తండ్రిగారు త‌న‌కు ఇచ్చిన వ‌రాల గురించి తెలియ‌జేసింది. రాముడు అమ్మా....’'నాన్నగారు స్వ‌యంగా ఈ విష‌యం చెప్తేనేను కాదంటానా..వారు ఆదేశిస్తే ప్రాణాలైనా విడ‌వ‌డానికి నేను సిద్ధ‌మే కదా'' అని అన్నాడు. అమ్మా దీనికి ఇంత ఆలోచ‌న ఎందుకు,వెంట‌నే వ‌న‌వాసానికి బ‌య‌లుదేరుతున్నాను.... అన్నాడు రాముడు. 

ల‌క్ష్మ‌ణుడికి ఈ వార్త తెలిసి ఉగ్రుడ‌య్యాడు. రాముడు శాంత‌ప‌రిచాడు. కౌస‌ల్యా మాత విష‌యం తెలుసుకుని త‌ల్ల‌డిల్లింది. అర‌ణ్య‌వాసం త‌ప్ప‌ద‌ని రాముడు చెప్పాడు. ల‌క్ష్మ‌ణుడు, అన్నా నేను నీవెంటే వస్తాను అని అన్నాడు. సీత‌మ్మ‌ కూడా సిద్ధమైనది. వ‌ద్ద‌ని వారించినా, ఒప్పుకోలేదు. అర‌ణ్య‌వాసానికి సిద్ధ‌మైంది.కుల‌గురువుల‌కు న‌మ‌స్కారం చేసిరామ‌చంద్రుడు త‌న నిర్ణ‌యం తెలిపాడు. వారూ వ‌ద్ద‌ని వారించారు. అయినా రామ‌చంద్ర‌మూర్తి పితృవాక్య ప‌రిపాల‌నే ప‌ర‌మ‌ధ‌ర్మంగా భావిస్తాన‌ని చెప్పి వారి నుంచి సెల‌వుతీసుకున్నాడు. అంద‌రికీ న‌మ‌స్క‌రించి సుమంత్రుడు తెచ్చిన ర‌థంలో సీతా, రామ లక్ష్మ‌ణులు అర‌ణ్య‌వాసానికి బ‌య‌లుదేరారు.


*వ‌న‌వాసం.....*


 ర‌థం క‌దులుతుంటే జ‌నం ప్రాణాలు పైపైనే పోయిన‌ట్టు విల‌పిస్తున్నారు. కొంద‌రు రామ‌చంద్ర‌డు లేని అయోధ్య‌లో ఉండ‌లేమంటూ ర‌థం వెంట బ‌య‌లుదేరారు. జ‌నం వెంట వ‌స్తుండ‌డంతో రాముడు ర‌థం వేగం పెంచ‌మ‌ని సుమంతుడికి సూచించాడు. అయినా కొంద‌రు ర‌థం వెంట ప‌రుగులు తీస్తూనే ఉన్నారు. సాయంత్రానికి ఒక న‌ది ఒడ్డుకుచేరి అక్క‌డ విశ్ర‌మించారు. జ‌నం కూడా అక్క‌డ విశ్ర‌మించారు. రాత్రి పొద్దుపోయాక‌, సుమంత్రా ఈ జ‌నం ఇలాగే నాతో అడవికి వ‌చ్చేలా ఉన్నారు. అందువ‌ల్ల వారు నిద్ర‌లో ఉండ‌గానే మ‌నం ఇక్క‌డి నుంచి వెళ్లిపోవ‌డం ఉత్త‌మం అని చెప్పి రాత్రి వేళ ర‌థాన్ని ఎక్కి అక్క‌డి నుంచి బ‌య‌లు దేరారు. అలా వెళ్లి గంగా న‌దీ తీరం చేరారు. అక్క‌డ గుహుడు వారికి స్వాగ‌తం ప‌లికి ఆతిథ్యం ఇచ్చాడు. సుమంత్రుడికి చెప్ప‌వ‌ల‌సిన జాగ్ర‌త్త‌లుచెప్పి వీడ్కోలు ప‌లికాడు రాముడు. సీతారామ ల‌క్ష్మ‌ణులు గుహుడు ఏర్పాటుచేసిన ప‌డ‌వ‌లో గంగాన‌ది దాటి అర‌ణ్యంలోకి ప్ర‌వేశించారు. వారు కంటికి క‌నిపించ‌నంత దూరం వ‌ర‌కూ వారిని చూస్తేనే ఉండి వెన‌క్కు తిరిగివ‌చ్చాడు గుహుడు.

సీతా,రామ‌ల‌క్ష్మ‌ణులు అలాఅర‌ణ్య మార్గంలో ముందుకు సాగుతున్నారు. స‌ర్యాస్త‌మ‌య వేళ‌కు ప్ర‌యాగ‌కు స‌మీపంలో ని భరద్వాజ మ‌హ‌ర్షి ఆశ్ర‌మం చేరుకున్నారు. మ‌హ‌ర్షికి న‌మ‌స్క‌రించి వారి ఆతిథ్యం స్వీక‌రించారు. కోస‌ల‌కు ద‌గ్గ‌ర‌గా ఉండ‌డంతో అక్క‌డ ఉండ‌డం స‌రికాద‌ని రామ‌చంద్రుల వారుత‌ల‌చారు. మ‌హ‌ర్షుల‌వారి ఆశీర్వ‌చ‌నం తీసుకుని అక్క‌డి నుంచి మాల్య‌వ‌తీ తీరం చేరి చిత్ర‌కూట ప్రాంతంలో ఆశ్ర‌మం ఏర్పాటు చేసుకున్నారు.

 అక్క‌డ అయోధ్య‌లో అంతా భార‌మైన హృద‌యంతో ఉన్నారు. సుమంత్రుడు రామ‌చంద్రుని విడిచి అయోధ్య‌లో రాజ‌మందిరానికి వెళ్లాడు. ఒంట‌రిగా వ‌చ్చిన సుమంత్రుడిని చూసి ద‌శ‌ర‌ధుడు క‌న్నీరుమున్నీరై మూర్ఛ‌పోయాడు. పుత్ర‌శోకంతో ద‌శ‌ర‌ధుడు ఆ రాత్రి క‌న్నుమూశాడు. వెంట‌నే భ‌ర‌త‌, శ‌తృఘ్నుల‌ను వ‌శిష్ఠుల వారు, మంత్రులు పిలిపించారు. భ‌ర‌త శ‌తృఘ్ణులు అయోధ్య‌ప్ర‌వేశిస్తూనే జ‌ర‌గ‌రానిదేదో జ‌రిగింద‌ని గ‌మ‌నించారు. తండ్రిమ‌ర‌ణ‌వార్త విని త‌ల్ల‌డిల్లారు. త‌న ప‌ట్టాభిషేకానికి త‌ల్లి వ‌రాలు కోరింద‌ని, సీతా,రామ ల‌క్ష్మణులు అర‌ణ్య‌వాసం చేస్తున్నార‌ని తెలిసి ఉగ్రుడ‌య్యాడు. అన్న‌గారు లేని రాజ్యం త‌న‌కు వ‌ద్ద‌న్నాడు. ఇలాంటి పాపిష్ఠిప‌ని తాను చేయ‌న‌ని భ‌ర‌తుడు త‌ల్లికి తెగేసి చెప్పాడు.

స‌ర్వ‌జ‌న‌ప్రియుడైన శ్రీ‌రామచంద్రుడిని అడ‌వి నుంచి తీసుకువ‌చ్చి సింహాసనం ఎక్కిస్తాన‌న్నాడు. వెంట‌నే తండ్రికి నిర్వ‌హించ‌వ‌ల‌సిన అంతిమ సంస్కారాలు నిర్వ‌హించాడు. 

మ‌రునాడు రాజ్యాధికారులంద‌రూ వ‌చ్చి , రాజ్యం రాజులేకుండా ఉండ‌రాదు కనుక రాజ్య‌భారం వ‌హించాల్సిందిగా భ‌ర‌తుడిని కోరారు. వారి మాట‌ల‌ను భ‌ర‌తుడు సున్నితంగా తిర‌స్క‌రించాడు. జ్ఞాన‌స‌మానులైన మీరు నా మ‌న‌సు ఎరుగ‌ని వారు కారు. అన్న‌గారే రాజ్య‌భారం వ‌హించాల‌ని తెగేసి చెప్పాడు. అన్న‌గారిని తీసుకువ‌చ్చి సింహాసనం పై కూర్చోబెట్టి నేను వ‌న‌వాసం చేస్తాను. త‌క్ష‌ణం అన్న‌గారి వ‌ద్ద‌కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేయండి అన్నాడు.చ‌తురంగ బ‌లాల‌తో అయోధ్యావాసుల‌తో క‌ల‌సి భ‌ర‌తుడు శ్రీ‌రామచంద్ర మూర్తిని తీసుకువ‌చ్చేందుకు బ‌య‌లుదేరాడు. గుహుడి సాయంతో గంగా న‌దిని దాటారు. అక్క‌డి నుంచి భ‌ర‌ద్వాజ మ‌హ‌ర్షి ఆశ్ర‌మానికి వెళ్లారు. వ‌శిష్టుల‌వారిని ముందుంచుకుని భ‌ర‌ద్వాజ మ‌హ‌ర్షి వ‌ద్ద‌కు వెళ్లాడు. ఏం నాయ‌నా రాజ్య పాల‌న విడిచి ఇలా వ‌చ్చావేం, నీ తండ్రి కామ‌మోహితుడై కుమారుడిని అడ‌వుల‌కు పంపాడు. నీకు ఎదురులేకుండా ఉంటుంద‌ని వారిని వ‌ధించ‌డానికి నీవు వెళ్ల‌డం లేదు క‌దా అని భ‌ర‌ద్వాజ మ‌హ‌ర్షి అన్నాడు.

 మ‌హ‌ర్షి నోట ఆమాట రావ‌డంతో భ‌ర‌తుడి క‌ళ్లు అశ్రుపూరితాల‌య్యాయి. న‌న్ను శంకిస్తున్నారా మ‌హ‌ర్షీ అంటూ త‌లెత్త కుండా కంట‌త‌డి పెట్టి నిల‌బ‌డ్డాడు భరతుడు. రామ‌చంద్ర‌మూర్తికి తిరిగి సింహాసనం అప్ప‌గించేందుకు భ‌ర‌తుడు వ‌చ్చాడ‌ని తెలిసి, భ‌ర‌ద్వాజ మ‌హ‌ర్షి ఎంతో సంతోషించాడు. 

రాముడు చిత్ర‌కూటంలో నివ‌శిస్తున్నాడ‌ని చెప్పాడు. ఆ రాత్రి భ‌ర‌ద్వాజ మ‌హ‌ర్షి ఆతిథ్యం స్వీక‌రించి మ‌రునాడు అంద‌రూ శ్రీ‌రామ ద‌ర్శ‌నార్థం బ‌య‌లు దేరారు. భ‌ర‌తుడి సేన‌ల‌తో అర‌ణ్యంలో అల్ల‌క‌ల్లోలం మొద‌లైంది. వ‌న్య‌మృగాలు భ‌యంతో ప‌రుగులుతీస్తున్నాయి. ఈ అలికిడికి రాముడు, ల‌క్ష్మ‌ణుడితో, ల‌క్ష్మ‌ణా అడ‌వి అల్ల‌క‌ల్లోలంగా ఉంది. ఏంజ‌రుగుతున్న‌దో చూసిరా అని రాముడు, ల‌క్ష్మ‌ణుడిని పంపాడు. అల్లంత దూరంలో కోస‌ల దేశ సేన కంట‌ప‌డింది. భ‌ర‌తుడు త‌మ‌ను చంప‌డానికే సేనావాహినిని తీసుకుని వ‌స్తున్నాడ‌ని ల‌క్ష్మ‌ణుడు భావించి అన్న‌గారికి విష‌యం నివేదించాడు. ఆదేశిస్తే భ‌ర‌తుడిని , అత‌ని సేన‌ల‌ను బూడిద చేస్తాన‌న్నాడు ల‌క్ష్మ‌ణుడు. రాముడు ప్ర‌శాంత చిత్తంతో ల‌క్ష్మ‌ణుడిని శాంతింప‌చేశాడు. 

భ‌ర‌తుడిని ఇలా అనుమానించ‌డం త‌గ‌ద‌న్నాడు. ఇంత‌లోనే భ‌ర‌త ,శ‌తృఘ్నులు ప‌రివారంతో కూడి ప‌ర్ణ‌శాల చేరుకున్నారు. శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తిని చూడ‌గానే భ‌ర‌త‌,శ‌తృఘ్ణులు పాదాల‌పై ప‌డ్డారు. వారిని పైకి లేపి కుశ‌ల ప్ర‌శ్న‌లు అడిగాడు. తండ్రి గారు ఎలా ఉన్నార‌ని అడిగాడు రామచంద్ర‌మూర్తి. రాజ‌ధర్మం స‌క్ర‌మంగా నిర్వ‌ర్తిస్తున్నావా ...అని అడుగుతూ పోతున్నాడు. దుఃఖం పొంగిపొర్లుతున్న కంఠంతో ఇంకెక్క‌డి తండ్రి అన్న‌య్యా, నీ వు వ‌న‌వాసానికి వ‌చ్చిన అనంత‌రం వారు కాలం చేశారు అని తండ్రి మ‌ర‌ణ‌వార్త చెవిన‌వేశాడు. రాముడు లేచి పితృక‌ర్మ‌లు నిర్వ‌హించాడు.

భ‌ర‌తుడు నెమ్మ‌దిగా రామ‌చంద్ర‌మూర్తి వ‌ద్ద‌కు చేరి అన్న‌య్యా, అమ్మ మ‌న‌సు మారింది. నువ్వు సింహాస‌నాన్నిఅధిష్ఠించి జ‌న‌రంజ‌కంగా పాల‌న‌చేయి అని ప్రాధేయ‌ప‌డ్డాడు. రాముడు అది స‌రికాద‌న్నాడు. తండ్రికి ఇచ్చిన మాట త‌ప్ప‌న‌న్నాడు. ఇంత‌లో జాబాలి లేచి ఈ లోకంలో ఎవ‌డికి ఎవ‌డు బంధువు? చ‌నిపోయిన‌వారి కి ఇచ్చిన మాట మీద ఇంత‌ ప‌ట్టుద‌ల ఎందుకు ?అంటూ హిత‌వ‌చ‌నాలు చెప్ప‌డానికి ప్ర‌య‌త్నించాడు. రాముడు సున్నితంగా ఆమాట‌ల‌ను తిర‌స్క‌రించాడు. స‌త్యం ఒక్క‌టే లోకాన్ని ర‌క్షిస్తుంది అని రాముడు స‌త్యంగొప్ప‌ద‌నాన్ని వివ‌రించాడు. రాముడి మ‌న‌సు మార్చ‌డం ఎవ‌రిత‌ర‌మూ కాద‌ని నిశ్చ‌యించుకున్నారు. ఇక చేసేది లేక భ‌ర‌తుడు రామ‌పాదుక‌లు రాముడి ముందు పెట్టి, వీటిని ప‌విత్రం చేయి, ఈ ప‌ద్నాలుగేళ్లూ ఈ పాదుక‌లే రాజ్య‌పాల‌నం చేస్తాయి .నేను జ‌టావ‌ల్కాలు ధ‌రించి వాటిని పూజిస్తాను అన్నాడు. రాముడు అలాగేచేశాడు . భ‌ర‌తుడు ఆ పాదుక‌ల‌నుతీసుకుని అయోధ్య చేరాడు. కొంత‌కాలానికి త‌న మ‌కాం నందిగ్రామానికి మార్చాడు.

ఇక్క‌డ అరణ్య‌వాసంలో ఉన్న రామచంద్ర‌మూర్తి చిత్ర కూటం విడిచి అత్రి మ‌హ‌ర్షి ఆశ్ర‌మ ప్రాంతానికివెళ్లారు. అత్రి మ‌హ‌ర్షికి, అన‌సూయాదేవికీ వారు న‌మ‌స్క‌రించారు. వారు సీతారామ ల‌క్ష్మ‌ణుల‌ను ఆశీర్వ‌దించి అక్కున చేర్చుకున్నారు. అన‌సూయాదేవికి సీతామాత పాదాభివంద‌నం చేసి నిల‌బ‌డింది. అన‌సూయాదేవీ సీతారామ క‌ల్యాణ వైభ‌వ ఘ‌ట్టాన్నిసీతాదేవి చేత చెప్పించుకుని విని సంతోషించింది. అన‌సూయాదేవి సీతామ‌హాల‌క్ష్మికి వ‌స్త్రాలు బ‌హుక‌రించింది.వాటిని ధ‌రించింది. ఆ రాత్రి అక్క‌డ విడిది చేసి మ‌రునాడు వారు ముందుకు క‌దిలేందుకు సిద్ధ‌మయ్యారు.

మీరు వెళ్లే దారిలో రాక్షసులు ఉంటారు జాగ్ర‌త్త అంటూ మహ‌ర్షులు సూచ‌న చేశారు. వారికి ప్ర‌ణ‌మిల్లి సీతా,రామ ల‌క్ష్మ‌ణులు అర‌ణ్య‌మార్గంలో ముందుకు సాగారు.


*శ్రీ రామ రామ రామేతి*

*రమే రామే మనోరమే*

*సహస్రనామ తత్తుల్యం*

*రామనామ వరాననే*


*రామాయ, రామభద్రాయ*

*రామ చంద్రాయ వేదసే*

*రఘునాథాయ నాథాయ*

*సీతాయా: పతయే న్నమః*


*( అయోధ్య‌కాండ స‌మాప్తం)*


























సరస్వతీ స్తుతి

 🌸సరస్వతీ స్తుతి🙏🙏

            

  సీ౹౹వాణిపుస్తకపాణి వాగ్దేవి శారద

    నీకువందనములు నీలవేణి!   

   ఆశ్రిత సురభూజ! హంసవాహిని! దేవి!

             నిలచి నా రసనపై పలుకునిమ్ము!

   నలువరాణివి తల్లి!నాదస్వరూపిణి!

             సకలశాస్త్రవినుత!శరణు శరణు!

   విశ్వసంరక్షణి!వేదస్వరూపిణి!

                     సత్కళాశోభిత సంప్రతీత!

తే౹౹భారతి!మహాసరస్వతి! భవ్యనేత్ర 

     నాద బిందు కళాధరి! నాదరూప!

     భగవతీ! సత్య రూపిణి! నిగమవేద్య!

  శాబ్ది పావకి శ్రుతదేవి జయము జయము🙏🙏


సాహితీ శ్రీ జయలక్ష్మి