26, నవంబర్ 2020, గురువారం

God









 

Rain water






 

కొబ్బరి నూనెను మీ పాదాలకు

 *కొబ్బరి నూనెను మీ పాదాలకు అరికాళ్ళకు  రాసుకుని మసాజ్  చేయండి.*


 *1. *ఒక తాతకు 87 సంవత్సరాల వయస్సులో కూడా తలనొప్పి గానీ, వెన్నునొప్పి గానీ, కీళ్ల నొప్పులు, దంతాల సమస్య లేదు. కొబ్బరి నూనెను వాడడమే అతని ఫిట్నెస్ కు మూలకారణం.*


*2. *మణిపాల్‌కు చెందిన ఒక విద్యార్థి మాట్లాడుతూ, కొబ్బరి నూనెను అరికాళ్ళకు రాసుకోవాలని నా తల్లి పట్టుబట్టేది.  చిన్నతనంలో నా దృష్టి బలహీనపడిందని చెప్పారు. అమ్మ ఈ ప్రక్రియను కొనసాగించినప్పుడు, నా కళ్ళ దృష్టి క్రమంగా పూర్తిగా, ఆరోగ్యంగా బాగుపడింది.*


 *3. *కేరళ కు నేను సెలవు కోసం వెళ్ళానని ఒక పెద్దమనిషి రాశాడు. నేను అక్కడ ఒక హోటల్‌లో పడుకున్నాను. నేను నిద్ర  పోలేకపోయాను. నేను బయట నడవడం ప్రారంభించాను. ఆ రాత్రి బయట కూర్చున్న ముసలి కాపలాదారు నన్ను "ఏమిటి విషయం?" అని అడిగాడు. నాకు నిద్ర రావటం లేదు అని చెప్పాను! "మీ దగ్గర కొబ్బరి నూనె ఉందా?" అని అడిగాడు. నేను ఏం చెప్పలేదు, అతను వెళ్లి కొబ్బరి నూనె తెచ్చి, "మీ పాదాలకు అరికాళ్ళకు కొన్ని నిమిషాలు మసాజ్ చేయండి" అని అన్నాడు.  నేను నిద్రలోకి వెళ్ళిపోయాను.*


*4. *నాకు కడుపు సమస్య వచ్చింది. కొబ్బరి నూనెతో నా అరికాళ్ళకు మసాజ్ చేసిన తరువాత, నా కడుపు సమస్య 2 రోజుల్లోనే నయమైంది.*


*5. *నేను గత 15 సంవత్సరాలుగా ఈ ట్రిక్ చేస్తున్నాను. ఇది నాకు బాగా నిద్రపోయేలా చేస్తుంది. కొబ్బరి నూనెతో నా పిల్లల అరికాళ్ళను కూడా మసాజ్ చేస్తాను.  ఇది వారిని సంతోషంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.*


*6. *నా కాళ్ళు ఎప్పుడూ వాపుతో ఉంటాయి. నేను నడుస్తున్నప్పుడు నేను అలసిపోతాను. నేను రాత్రి నిద్రపోయే ముందు కొబ్బరి నూనె మసాజ్ ప్రక్రియను నా పాదాల అరికాళ్ళపై ప్రారంభించాను. కేవలం 2 రోజుల్లో, నా కాళ్ళ వాపు మాయమైంది.*


*7. *ఇది అద్భుతమైన విషయం, *విశ్రాంతి కోసం నిద్ర మాత్రల కంటే ఈ చిట్కా మంచిది. ఇప్పుడు నేను ప్రతి రాత్రి నా పాదాలకు, అరికాళ్ళకు కొబ్బరి నూనె రాసుకుని మసాజ్ చేసుకుంటూ నిద్రపోతాను.*


*8. *మా తాతకు తలనొప్పి, పాదాలకు మండుతున్న అనుభూతి,  ఉన్నాయి. కొబ్బరి నూనెను తన అరికాళ్ళపై రాయడం ప్రారంభించే సమయానికి, నొప్పి పోయింది.*


*9. *నాకు థైరాయిడ్ వ్యాధి వచ్చింది. నా కాళ్ళు అన్ని వేళలా దెబ్బతింటున్నాయి. గత సంవత్సరం ఎవరో రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెను పాదాలకు, అరికాళ్ళకు మసాజ్ చేయాలని సూచించారు.  నేను శాశ్వతంగా చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉంటున్నాను.*


*10. *నాకు పన్నెండు సంవత్సరాల క్రితం హేమోరాయిడ్స్ వచ్చాయి. నా స్నేహితుడు నన్ను 90 సంవత్సరాల వయస్సులో ఉన్న ఒకతను వద్దకు తీసుకువెళ్ళాడు. కొబ్బరి నూనెను అరచేతులపైన, వేళ్ళమధ్య, వేలుగోళ్ల మధ్య, గోళ్ళపై రుద్దమని ఆయన సూచించారు మరియు ఇలా అన్నారు:* *నాభికి నాలుగైదు చుక్కల కొబ్బరి నూనె రాసుకుని నిద్రపోండి. నేను అతని సలహాను అనుసరించడం ప్రారంభించాను.  నాకు చాలా ఉపశమనం కలిగింది.*  

*11. *ఈ చిట్కా నా మలబద్ధకం సమస్యను కూడా పరిష్కరించింది. నా శరీర అలసట కూడా మాయమైంది. గురకను నివారిస్తుంది.*


*12. *చిన్నప్పటి నుండి నా కాళ్ళు, మోకాళ్ళల్లో నొప్పి వస్తుండేది. ఇప్పటికీ నేను రోజూ కొబ్బరి నూనె నా పాదాలకు, అరికాళ్ళకు రాసుకుని,  మసాజ్ చేస్తుంటాను, నాకు మంచి నిద్ర వస్తుంటాది.*


 *13. చాలా సంవత్సరాల నుండి నాకు వెన్నునొప్పి వచ్చింది, నేను పడుకునే ముందు కొబ్బరి నూనె  నా కాళ్ళ మీద రాసుకుని మసాజ్ చేసుకోవడం  మొదలు పెట్టినప్పటి నుండి, నా వెన్నునొప్పి పూర్తిగా తగ్గిపోయింది, నా నిద్ర బాగా మెరుగుపడింది.*


*దక్షిణ భారత రహస్యం ఈ క్రింది విధంగా ఉంది:*


*రహస్యం చాలా సులభం:*

*"మీరు కొబ్బరి నూనెను మాత్రమే వర్తించనవసరం లేదు రాయనవసరం లేదు. మీరు ఏదైనా నూనె, ఆవాలు, ఆలివ్ మొదలైన నూనెలతో పాదాలపై,  అరికాళ్ళపై, మొత్తం పాదాలకు రాసుకోవచ్చు, ముఖ్యంగా అరికాళ్ళపై మూడు నిమిషాలు, పాదాలకు మూడు నిమిషాలు.*


*అరికాళ్ళపై 100 ఆక్యుప్రెషర్ పాయింట్లు ఉన్నాయి.*

 *మానవ అవయవాలను నొక్కడం మరియు మసాజ్ చేయడం ద్వారా కూడా నయం చేస్తారు.* 

*ఫుట్ రిఫ్లెక్సాలజీ*


 *దయచేసి ఈ సమాచారాన్ని మీ స్నేహితులతో పంచుకోండి*

10 -అద్వైత జ్ఞానమంజరి

 *🧘10 -అద్వైత జ్ఞానమంజరి🧘‍♂

🕉🌞🌎🌙🌟🚩


మానవులకు రూపం, గుణాలు ఉన్నాయి కాబట్టి సామాన్య జీవుని జ్ఞానం ఈ రూపాలకు, గుణాలకు అతీతంగా ఆలోచించడం కష్టం. దేవుడిని నిరాకారముగా పూజించడములో తలెత్తే పెద్ద సమస్య ఇదే. దానివలన మనకు ఏదీ సరిగా అర్థం కాదు. ఆధ్యాత్మికముగా ఎంతో ఉన్నతస్థితిలో ఉన్నవారికి మాత్రమే ఇది సాధ్యము.



సాకారోపాసన అంటే పరమాత్మను గణపతిగానో, విష్ణువుగానో, శివుడిగానో పూజించడం. అయితే వారందరూ ఒకే పరమాత్మ అని గ్రహించాలి, లేకుంటే అజ్ఞానం పెరిగి పెద్దదై, నీ దేవుడి కంటే నా దేవుడే గొప్ప అనే దురభిమానం ఏర్పడుతుంది. ఆరాధించే దైవం ఏదైనా భక్తి ప్రదానం. అచంచల భక్తితో జ్ఞానం కలుగుతుంది. జ్ఞానంతో వెలుగులోనికి మనం ప్రయాణించగలం. కాని అసలు సత్యం అనేది వెలుగుచీకట్లకు, జ్ఞానాజ్ఞానాలకు అతీతమైనది.



సత్యమే పరమాత్మ! జీవుని అసలు స్వరూపం కూడా పరమాత్మే అన్నది అసలు సత్యం! సాధనతో ఆ సత్యమైన పదార్థం "నేనే" అన్న ఎరుక పొందడమే ఆత్మజ్ఞానం! దాని ఫలితమే ఆత్మానుభూతి! ఇదే అత్యున్నత స్థితి! బ్రహ్మైక్య స్థితి! 



ఎప్పటికైనా ఈ శరీరం కాలి బూడిద అయిపోతుంది. ఈ ప్రాణం మరణంలేని ఆత్మతో కలిసిపోతుంది కాబట్టీ, ఓ మనసా! విచారణ చెయ్యు, సాధనతో లక్ష్యాన్ని సాధించు, ఆ "నేను"ని తెలుసుకో, అని ఒక "స్వయం ప్రేరణ" చేసుకోవాలి సాధకుడు. 



ఓ పరమాత్మా! నేను చేసిన అన్ని పనులూ నీకు తెలుసు. ఇంతవరకు చేసిన పనుల ఫలితాలను మాత్రం అనుభవించేటట్లు చేసి, ఇకమీదట చేయబోయే పనుల ఫలితం నాకు అంటకుండా వాటిని నిష్కామంగా చేసేట్టు చేయి అని ప్రార్దించాలి సాధకుడు.



సాధనలో, ఎవరిచేత ప్రేరేపింపబడి మనస్సు వస్తుప్రపంచము వైపు ఆకర్షింపబడుతున్నది? ఎవరి ఆజ్ఞకు లోబడి ప్రాణము నిలుస్తున్నది? ఎవరి వలన వాక్కు ప్రకటితమౌతున్నది? ఏ జ్ఞానము కళ్ళను, చెవులను ప్రేరేపిస్తున్నది? అన్న ప్రశ్నలకు సమాధానం అన్వేషించాలి. 



వీటికి సమాధానం కేనోపనిషత్తులో చెప్పబడింది! చెవికి చెవిగా, మనస్సుకి మనస్సుగా, వాక్కనకు వాక్కుగా, ప్రాణమునకు ప్రాణముగా, నేత్రమునకు నేత్రముగా అయివున్న వస్తువు ఒకటుంది! 



దేనిని వాక్కు వ్యక్తపరచలేదో, దేనివలన వాక్కు వ్యక్తమగునో! దేనిని గూర్చి మనస్సు వూహించలేదో, దేనివలన మనస్సు సంచరించుచున్నదో! దేనిని కళ్ళు చూడలేవో, దేనివలన కళ్ళు చూడగలుగుచున్నవో! దేనిని చెవులు ఆలకించలేవో, దేనివలన చెవులు ఆలకించగలుగుతున్నవో! దేనిని ముక్కు శ్వాసించలేదో, దేనివలన ముక్కు శ్వాసించుచున్నదో అదే ఆత్మ! దానినే బ్రహ్మమని కూడా అంటారు. 



ఆత్మ / బ్రహ్మము శాశ్వతమైనది, చైతన్యవంతమైనది, సర్వవ్యాపకమైనది, సాక్షీభూతమైనది, అన్ని జీవులలో నెలకొనివుంటుంది కాబట్టీ జ్ఞానంతో దాన్ని తెలుసుకోవచ్చు. జీవుని జ్ఞానానికి ఆధారంగా, సాక్షిగా ఈ ఆత్మచైతన్యస్ఫూర్తి ఎల్లప్పుడూ వెన్నంటివుంటుంది. అది సత్యము.



ప్రతివిషయాన్ని సూక్ష్మబుద్ధితో/జ్ఞానంతో ఎవడు దర్శిస్తాడో అతడు అమృతత్వమును పొందుతాడు. ఆత్మద్వారానే జీవుడు వీర్యవంతుడవుతాడు. జ్ఞానము ద్వారానే జీవుడు అమరుడవుతాడు. 



జీవుడు దీనిని ఈ జన్మలోనే గనుక తెలుసుకుంటే, సత్యము అవగతమౌతుంది. తెలుసుకోలేకపోతే లోకంతో బంధం ఏర్పడుతుంది. మరల ఈ లోకంలో జన్మించవలసి వస్తుంది. కావునా జ్ఞానవంతులు సర్వభూతములలో ఒకే ఆత్మను దర్శించి, బంధరహితులై, లోకంనుండి పూర్తిగా విముక్తిని పొంది జీవన్ముక్తులవుతున్నారు. 


🕉🌞🌎🌙🌟🚩

కఠోపనిషత్‌ వివరణ -

 *🌹. కఠోపనిషత్‌ వివరణ  - చలాచలభోధ  - 113 🌹*

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 

📚. ప్రసాద్ భరద్వాజ


*🌻.   ఆత్మను తెలుసుకొను విధము -43 🌻*


అందువలననే సాధన చతుష్టయ సంపత్తి, యమనియమాదులు తప్పక అధికారికములై వుంది. శిష్యుడు అనిపించుకోవాలి అంటే, తప్పక సాధన చతుష్టయ సంపత్తిని, అష్టాంగ యోగాన్ని, అభ్యసించినటువంటి సాధకుడై ఉండాలి. 


మామూలుగా సంసారికులై, విషయవ్యావృత్తితో విషయానురక్తులై శబ్ద స్పర్శ రూప రస గంధాది విషయములందు మనస్సును పోనిస్తూ సదా విషయసుఖాన్ని ఆసక్తితో అనుభవించేటటువంటి సామాన్యమైనటువంటి మానవులకు ఆత్మసాక్షాత్కార జ్ఞానం అందని మామిడి పండు లాంటిది. అది ఎప్పటికి సుదూరంగానే ఉంటుంది. ఎంతకాలమైనా మాకు సాధ్యపడటం లేదండీ, ఎంత ప్రయత్నించినా, సాధ్యపడడం లేదండీ అనేటటువంటి వారంతా తప్పక ఈ స్వాధ్యాయశీలిగా అవ్వవలసినటువంటి అవసరం ఉన్నది.


        ఎక్కడెక్కడైతే మనస్సు ఆ రకమైనటువంటి పద్ధతిగా ప్రవృత్తి మార్గంలోకి దిగివచ్చేస్తోందో, మనం గుర్తించాలి. ఎక్కడెక్కడ స్పందిస్తోందో గుర్తించాలి. ఎక్కడెక్కడ ప్రతిస్పందిస్తోందో కూడా గుర్తించాలి. 


ఎక్కడ విశేష స్థాయిలో స్పందిస్తోంది? ఎక్కడ సామాన్యస్థాయిలో స్పందిస్తోందనేది కూడా గ్రహించాలి. ఈ గ్రాహ్యక శక్తి చాలా అవసరం. సూక్ష్మమైనటువంటి మనసును కానీ, సూక్ష్మమైనటువంటి బుద్ధిని కానీ, ఆ పైన ఉన్నటువంటి మహతత్త్వాన్ని కానీ, దానిపైనున్న అవ్యక్తాన్ని కానీ, నువ్వు గుర్తించాలి. 


అంటే, ఆ రకమైనటువంటి గ్రాహ్యక శక్తి పరిజ్ఞానం పెంపొందించుకోవలసినటువంటి అవసరం ఉంది. స్వభావయుతమైనటువంటి ప్రేరణలు, ప్రేరణగా నీలో ఉత్పన్నమైనప్పుడే ఆ మార్పును గుర్తించి, సవరించుకోగలిగేటటువంటి సమర్థతని సంపాదించాలి. దీనినే “యోగః ప్రవృత్తి నిరోధకః” అని అంటారు.


సాధకులు వాక్‌సంయమనము ఎందుకు కలిగి ఉండాలి అంటే, నాలుగు మహాపాపాలు నిరంతరాయంగా చేస్తుంది. వాగీంద్రియము అన్నమాట. వాగుడుకాయలు చాలా మంది ఉంటారు, మాట్లాడడం మొదలుపెడితే దానికి వివేకం లేకుండా, విచక్షణ లేకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. 


ఆ మాటకి శక్తి ఉన్నదనిగాని, ఆ మాట ద్వారా సాధించ బడవలసిన లక్ష్యమున్నదని కానీ, ఆ లక్ష్యానికి లోబడే మాట్లాడాలి అనేటటువంటి నియమము లేకపోవుట చేత, అయితే ‘ఆత్మస్తుతికాని లేక పరనింద కానీ లేదా పరస్తుతి కానీ లేదా ఆత్మనింద కానీ’ ఇలా ఒకదానికొకటి వ్యతిరేక లక్షణాలతో వారిట్లా మాట్లాడుతు ఉంటారన్నమాట. ఏది మాట్లాడినా అందులో అది ఉంటుంది! తటస్థ భావన ఉండదన్నమాట! సాక్షీ భావన ఉండదన్నమాట! ఆత్మ భావన ఉండదన్నమాట! ప్రత్యగాత్మ స్థితి అసలే ఉండదన్నమాట!


        మరి మన ఇంద్రియాలని వాడేటప్పుడు నీవు ఆత్మభావనలో ఉండి, పనిముట్లుగా కదా, ఉపయోగించుకోవలసింది? అంతేకానీ, ఆ పనిముట్టుయందు నీవు రమించరాదు కదా!


        సుఖ, దుఃఖ అను భోక్తవ్యాన్ని స్వీకరించ రాదు కదా! అదేంటోనండీ, మాట్లాడడానికి ఎవరూ దొరకడం లేదండీ! అని బాధపడిపోయేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అనేక రకాలైనటువంటి లౌల్యత. దీనిని ఏమంటారంటే, ఇంద్రియ లౌల్యత. 


లోలత్వము అంటారు. అంటే, ముట్టుకోకుండా ఉండలేడు, మాట్లాడకుండా ఉండలేడు, చూడకుండా ఉండలేడు, చెయ్యకుండా ఉండలేడు. వినకుండా ఉండలేడు, తినకుండా ఉండలేడు. అన్నిటికీ ఈ ఉండలేడు అనేటటువంటి ‘ఆ ఉండలేని తనం’ బలహీనతగా మనలో ప్రాప్తించింది అన్నమాట. అదేమిటోనండీ, ఒక్కసారైనా మా మనుమడితో మాట్లాడకుండా ఉండలేను, ఒక్కరోజు మొత్తం మీద. - విద్యా సాగర్ స్వామి  


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

యజ్ఞం

*7-వేదములు📚((((((((((🕉)))))))))) ఆచార్య వాణి🧘‍♂️* 🕉🌞🌏🌙🌟🚩 🔥ఓంశ్రీమాత్రే నమః🔥 అద్వైతచైతన్యజాగృతి 🕉🌞🌏🌙🌟🚩 *6. యజ్ఞం* ((((((((((🕉)))))))))) *అగ్ని సహాయంతో, మంత్రోచ్చారణతో విధ్యుక్తమైన కర్మలు చేయటమే యజ్ఞయంటే. ''యజ్ఞ'' మన్న పదం ''యజ్‌'' అనే ధాతువునుండి వచ్చింది. దీని అర్థం - ''ఆరాధించు'', లేక, ''సమర్పించు''.* *క్రతువుని మనసారా, పరమాత్మ పట్లా దేవతల పట్లా సంపూర్ణమైన భక్తి భావంతో నిర్వహించటమే యజ్ఞమంటే. ''మననం చేసేవాడిని రక్షించేది మంత్ర''మని చెప్పుకొన్నాం. పఠించేవాడిని కాపాడటం మంత్రం యొక్క విధి. మననమంటే మనసారా జపించటం. సాధారణంగా మంత్రాలని వినబడేట్టు ఉచ్ఛరించ వలసినా కొన్నిటిని మాత్రం అట్లా పలుకనక్కరలేదు. నిశ్శబ్దంగా జపించినా మంత్రాలు ఆయా నాడులను అనుకూలంగా ప్రకంపింప చేస్తాయి.* *దానినే బిగ్గరగా వల్లె వేస్తే దాని కొక మహనీయత ఉన్నట్టు తెలుస్తుంది - అర్థం తెలియక పోయినా పరవశింప చేస్తుంది. మనస్సులో ఉన్నది. వల్లెవేసినప్పుడు బయటకు వస్తుంది. అది శరీరకదలిక ద్వారా కార్యరూపం దాలుస్తుంది. వేదోక్తమైన విధినిర్వహణకు మనస్సు, వాక్కు, కాయమూ ఒకే విధంగా పని చెయ్యాలి - అన్నీ పరిపూర్ణంగా పాలుపంచుకొంటున్నట్లవుతుంది. అంటే, మననం శబ్ద రూపంలో నోటి ద్వారా బయటకు వచ్చి, శరీరం చేసే పని ద్వారా యజ్ఞమవుతుంది.* *అందువల్ల యజ్ఞము వేదోక్తమైన ముఖ్యమైన విధులలో ఒకటి. ఇతర మతాలలో లేదు: ఇటువంటి కర్మకాండ ఇతరమతాలలో లేదు. వేదాలపై ఆధారపడి యుండటం వల్ల మన మతాన్ని వైదిక మతమంటారు. దీనికీ, ప్రపంచంలో ఉన్న ఇప్పటి మతాలకీ ఒక ముఖ్య భేదముంది. క్రైస్తవమతం, ఇస్లాం ఇత్యాది మతాలు ''అందరూ ఆరాధించవలసిన దైవమొక్కడే'' అని అంటాయి.* *వేదాలు కూడా అన్ని ఆత్మలూ తనలోనే ఉన్న ఒకే ఒక దేవుడున్నాడంటాయి. కాని, ''ఒక దేవుడు'' అన్న భావాన్ని అనుభవసిద్ధం చేసుకోవటానికి చింతనద్వారా కలిగే జ్ఞానమవసరం. ఆ స్థితిని చేరుకోవటానికి వినీతి ఎంతో అవసరం. భగవంతునితో ఏకమైనప్పుడు మనకి గోచరించే జగత్తు మాయమవుతుంది : ఆ స్థితిని చేరుకోవాలి. ప్రాపంచక విషయాలలో తేలిపోయే మన జీవితాలను ఎంతో క్రమ శిక్షణకు లోను చేస్తేనే గాని ఆ స్థితిని చేరుకోలేం. ఈ వ్యాపకాలలో చిక్కుకొన్న మనం ధర్మమార్గాన పోవాలి, మనస్సుని క్షాళనం చేసి, పరిణతిని కలిగించే క్రతువులని చెయ్యాలి. ఆ స్థితిని చేరుకొన్న తరువాత ప్రాపంచక బంధాలు తెగిపోతాయి. ఆ గమ్యాన్ని చేరటానికి వేదాలు అనేక మార్గాలనూ, ఉపాయాలనూ సూచించాయి.* *వీటిలో యజ్ఞమనే కర్మ అతిముఖ్యమైనది. ఒకే ఒక దేవునికి కాక, అనేక దేవతలకు ఉపహారాలిస్తూ ఫలితాన్ని భగవంతునికి సమర్పించటమే యజ్ఞమంటే, యజ్ఞమన్నది మన మతానికి ప్రత్యేకం. ఏ ఇతర మతంలోనూ ఇది లేదు. వేదమంత్రాలని పఠిస్తూ వివిధ పదార్థాలని అగ్నికి ఆహుతి చెయ్యాలి యజ్ఞంలో. దీనిని ''హోమ'' మంటారు. అగ్నికి ఆహుతి చేసినా అన్నిటినీ అగ్నికే సమర్పిస్తున్నామని అర్థం కాదు. ప్రత్యేకంగా అగ్నికి సమర్పిస్తున్నట్టు మంత్రం చెప్పినప్పుడే అవి అగ్నికి చెందుతాయి.* *ఇతర దేవతలకి అంటే రుద్రునకూ, విష్ణువునకూ, ఇంద్రునకూ, వరుణునకూ, వాయువునకూ, సోమునకూ సమర్పించిన వాటిని వారికి చేరుస్తాడు అగ్నిదేవుడు. మిగిలిన మతాలకీ, వైదిక మతానికీ గల ముఖ్యమైన వ్యత్యాసమిదే. మనం కూడా ఒకే దేవుడ్ని విశ్వసించినా, ఆయనకే కాక ఇతర దేవతలకి కూడ అగ్ని ద్వారా ఉపహారాలర్పిస్తాం.మానవసేవ భగవంతునికి ప్రీతిపాత్రమంటాం. సంఘసేవకులు ''మానవసేవే మాధవసేవ - సమాజానికి సేవ భగవంతునికి సేవ'' అంటారు.* *ఆ విధంగానే యజ్ఞాల ద్వారా, భగవంతుని సృష్టియైన దేవతలకు యజ్ఞమూలకంగా సేవ చేయటం కూడ భగవంతుని అనుగ్రహాన్ని సంపాదించి పెడుతుంది. భగవంతు డొక్కడే అనీ, ఆయనే అనేక దేవతల రూపాలను ధరిస్తాడనీ వేదాలు నొక్కి చెప్పుతాయి. ఏ దేవతని వర్ణించినా, ఆ దేవత పరమాత్మ అంటాం. వేదాలు కూడా దైవమొక్కడే అని చెప్తాయి. భగవంతునికీ దేవతలకీ గల భేదాన్ని మాత్రమే అవి సూచిస్తాయి.* *ఎందరో దేవతలని భగవంతునిగా పేర్కొంటాయి కాబట్టి ''వేదాలు అనేక దేవుళ్లున్నారని అంటాయి'' అనుకోవటం తప్పు. ఒకే దేవుడు అనేక దేవతలుగా కనబడుతాడని అర్థం. విశ్వనియంత్రణకై అనేక దేవతలను సృష్టించాడు భగవంతుడు. ఈ దేవతలు వేరు వేరు విధులను నిర్వహించాలి - మన వలనే దేవతలు కూడ సృష్టింపబడ్డారు. మనని కూడ తననుండే సృష్టించాడు ఈశ్వరుడు.* *అద్వైత సిద్ధాంతం ప్రకారం జీవాత్మా, పరమత్మా ఒకటే. అందువల్ల పరమాత్మ దేవతలకు కూడ ప్రతినిధే. అద్వైత సిద్ధాంతాన్ని ఆకళింపు చేసుకొనే స్థితికి చేరుకొనే వరకూ - మనకూ దేవతలకూ భేదముందనుకొంటూ యజ్ఞాలూ, పూజలూ లోకశ్రేయస్సుకోసం చేస్తూండాలని వేదాలు నిర్దేశించాయి. ప్రకృతిలోని శక్తులూ, సర్వభూతాలూ పరమాత్ముని ఆదేశానుసారం, దేవతల ఆధీనంలో, ప్రవర్తిస్తాయి.* *కాబట్టి మనమూ, మనచుట్టూ ఉన్న ప్రపంచమూ ప్రకృతి శక్తులనుండి లబ్ధిని పొందాలంటే ఆయా అధిష్ఠాన దేవతలను సంతృప్తి పరచాలి. దేవతలు యజ్ఞాల వల్ల సంతుష్టులవుతారని వేదాలు చెప్తాయి. ఆధ్యాత్మికంగా మేల్కొన్నప్పుడూ పరమాత్ముని స్వయంగా గ్రహించినప్పుడూ విడిగా దేవతలని సంతృప్తి పరచవలసిన అవసరముండదు. మనం ద్వైత భావంతో ఉన్నంత కాలమూ ప్రతి దేవతనీ పూజించాలి. ఇది వేదవాక్కు.* 🕉🌞🌏🌙🌟🚩

Narayana Suktam in Telugu

Narayana Suktam in Telugu సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువమ్ । విశ్వై నారాయణం దేవం అక్షరం పరమం పదమ్ ॥ 1 ॥ విశ్వతః పరమాన్నిత్యం విశ్వం నారాయణం హరిమ్ । విశ్వం ఏవ ఇదం పురుషః తద్విశ్వం ఉపజీవతి ॥ 2 ॥ పతిం విశ్వస్య ఆత్మా ఈశ్వరం శాశ్వతం శివమచ్యుతమ్ । నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణమ్ ॥ 3 ॥ నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణః పరః । నారాయణ పరం బ్రహ్మ తత్త్వం నారాయణః పరః । నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణః పరః ॥ 4 ॥ యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేఽపి వా । అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః ॥ 5 ॥ అనన్తం అవ్యయం కవిం సముద్రేన్తం విశ్వశంభువమ్ । పద్మ కోశ ప్రతీకాశం హృదయం చ అపి అధోముఖమ్ ॥ 6 ॥ అధో నిష్ఠ్యా వితస్త్యాన్తే నాభ్యామ్ ఉపరి తిష్ఠతి । జ్వాలామాలాకులం భాతీ విశ్వస్యాయతనం మహత్ ॥ 7 ॥ సన్తతం శిలాభిస్తు లమ్బత్యా కోశసన్నిభమ్ । తస్యాన్తే సుషిరం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితమ్ ॥ 8 ॥ తస్య మధ్యే మహానగ్నిః విశ్వార్చిః విశ్వతో ముఖః । సోఽగ్రవిభజంతిష్ఠన్ ఆహారం అజరః కవిః ॥ 9 ॥ తిర్యగూర్ధ్వమధశ్శాయీ రశ్మయః తస్య సన్తతా । సన్తాపయతి స్వం దేహమాపాదతలమాస్తకః । తస్య మధ్యే వహ్నిశిఖా అణీయోర్ధ్వా వ్యవస్థితాః ॥ 10 ॥ నీలతోయద-మధ్యస్థ-ద్విద్యుల్లేఖేవ భాస్వరా । నీవారశూకవత్తన్వీ పీతా భాస్వత్యణూపమా ॥ 11 ॥ తస్యాః శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః । స బ్రహ్మ స శివః స హరిః స ఇన్ద్రః సోఽక్షరః పరమః స్వరాట్ ॥ 12 ॥ ఋతం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పిఙ్గలమ్ । ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః ॥ 13 ॥ ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి । తన్నో విష్ణుః ప్రచోదయాత్ ॥ ఓం శాంతి శాంతి శాంతిః ॥ మంత్ర పుష్పమ్ భద్రం కర్ణే'భిః శృణుయామ' దేవాః | భద్రం ప'శ్యేమాక్షభిర్యజ'త్రాః | స్థిరైరంగై''స్తుష్టువాగంస'స్తనూభిః' | వ్యశే'మ దేవహి'తం యదాయుః' ‖ స్వస్తి న ఇంద్రో' వృద్ధశ్ర'వాః | స్వ'స్తి నః' పూషా విశ్వవే'దాః | స్వస్తినస్తార్క్ష్యో అరి'ష్టనేమిః | స్వస్తి నో బృహస్పతి'ర్దధాతు ‖ ఓం శాంతిః శాంతిః శాంతిః' ‖ యో'ఽపాం పుష్పం వేద' | పుష్ప'వాన్ ప్రజావా''న్ పశుమాన్ భ'వతి | చంద్రమా వా అపాం పుష్పమ్'' | పుష్ప'వాన్ ప్రజావా''న్ పశుమాన్ భ'వతి | య ఏవం వేద' | యో'ఽపామాయత'నం వేద' | ఆయతన'వాన్ భవతి | అగ్నిర్వా అపామాయత'నం | ఆయత'నవాన్ భవతి | యో''ఽగ్నేరాయత'నం వేద' | ఆయత'నవాన్ భవతి | ఆపోవా అగ్నేరాయత'నం | ఆయత'నవాన్ భవతి | య ఏవం వేద' | యో'ఽపామాయత'నం వేద' | ఆయత'నవాన్ భవతి | వాయుర్వా అపామాయత'నమ్ | ఆయత'నవాన్ భవతి | యో వాయోరాయత'నం వేద' | ఆయత'నవాన్ భవతి | ఆపో వై వాయోరాయత'నం | ఆయత'నవాన్ భవతి | య ఏవం వేద' | యో'ఽపామాయత'నం వేద' | ఆయత'నవాన్ భవతి | అసౌ వై తప'న్నపామాయత'నం | ఆయత'నవాన్ భవతి | యో'ఽముష్యతప'త ఆయత'నం వేద' | ఆయత'నవాన్ భవతి | ఆపో వా అముష్యతప'త ఆయత'నం |ఆయత'నవాన్ భవతి | య ఏవం వేద' | యో'ఽపామాయత'నం వేద' | ఆయత'నవాన్ భవతి | చంద్రమా వా అపామాయత'నమ్ | ఆయత'నవాన్ భవతి | యశ్చంద్రమ'స ఆయత'నం వేద' | ఆయత'నవాన్ భవతి | ఆపో వై చంద్రమ'స ఆయత'నం | ఆయత'నవాన్ భవతి | య ఏవం వేద' | యో'ఽపామాయత'నం వేద' | ఆయత'నవాన్ భవతి | నక్ష్త్ర'త్రాణి వా అపామాయత'నం | ఆయత'నవాన్ భవతి | యో నక్ష్త్ర'త్రాణామాయత'నం వేద' | ఆయత'నవాన్ భవతి | ఆపో వై నక్ష'త్రాణామాయత'నం | ఆయత'నవాన్ భవతి | య ఏవం వేద' | యో'ఽపామాయత'నం వేద' | ఆయత'నవాన్ భవతి | పర్జన్యో వా అపామాయత'నం | ఆయత'నవాన్ భవతి | యః పర్జన్య'స్యాయత'నం వేద' | ఆయత'నవాన్ భవతి | ఆపో వై పర్జన్య'స్యాయత'నం | ఆయత'నవాన్ భవతి | య ఏవం వేద' | యో'ఽపామాయత'నం వేద' | ఆయత'నవాన్ భవతి | సంవత్సరో వా అపామాయత'నం | ఆయత'నవాన్ భవతి | యః సం'వత్సరస్యాయత'నం వేద' | ఆయత'నవాన్ భవతి | ఆపో వై సం'వత్సరస్యాయత'నం | ఆయత'నవాన్ భవతి | య ఏవం వేద' | యో''ఽప్సు నావం ప్రతి'ష్ఠితాం వేద' | ప్రత్యేవ తి'ష్ఠతి | ఓం రాజాధిరాజాయ' ప్రసహ్య సాహినే'' | నమో' వయం వై''శ్రవణాయ' కుర్మహే | స మే కామాన్ కామ కామా'య మహ్యమ్'' | కామేశ్వరో వై''శ్రవణో ద'దాతు | కుబేరాయ' వైశ్రవణాయ' | మహారాజాయ నమః' | ఓం'' తద్బ్రహ్మ | ఓం'' తద్వాయుః | ఓం'' తదాత్మా | ఓం'' తద్సత్యమ్ | ఓం'' తత్సర్వమ్'' | ఓం'' తత్పురోర్నమః ‖ అంతశ్చరతి' భూతేషు గుహాయాం వి'శ్వమూర్తిషు | త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వ-మింద్రస్త్వగ్ం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం' ప్రజాపతిః | త్వం త'దాప ఆపో జ్యోతీరసోఽమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ | ఈశానస్సర్వ' విద్యానామీశ్వరస్సర్వ'భూతానాం బ్రహ్మాధి'పతిర్-బ్రహ్మణోఽధి'పతిర్-బ్రహ్మా' శివో మే' అస్తు సదాశివోమ్ | తద్విష్ణో''ః పరమం పదగ్ం సదా' పశ్యంతి సూరయః' | దివీవ చక్షురాత'తమ్ | తద్విప్రా'సో విపన్యవో' జాగృవాగ్ం సస్సమిం'ధతే | విష్నోర్యత్ప'రమం పదమ్ | ఋతగ్ం సత్యం ప'రం బ్రహ్మ పురుషం' కృష్ణపింగ'లమ్ | ఊర్ధ్వరే'తం వి'రూపాక్షం విశ్వరూ'పాయ వై నమో నమః' ‖ ఓం నారాయణాయ' విద్మహే' వాసుదేవాయ' ధీమహి | తన్నో' విష్ణుః ప్రచోదయా''త్ ‖ ఓం శాంతిః శాంతిః శాంతిః' |

శ్రీలక్ష్మి గణపతి స్వామి వారి ఆలయం

 🌳🌳🌳🌳🌳🌳🌳🌳 స్వయంభూ శ్రీలక్ష్మి గణపతి స్వామి వారి ఆలయం తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కాకినాడ నుంచి రాజమండ్రి కెనాల్ రూట్ లో అనపర్తి కి 10కి.మీ.సామర్లకోటకు 15కి.మీ దూరం లో కలదు. ద్రాక్షారామం కు 20కి.మీ.దూరంలో కలదు. అలాగే రాజమండ్రి కి40కి. మీ దూరంలో బిక్కవోలు గ్రామంలో కలదు. ఈ ఆలయం ఉదయం 6గంటలనుండి మధ్యాహ్నం 12.30నిముషముల వరకూ, సాయంత్రం 4 గం. ల నుంచి రాత్రి 8గం.ల వరకూ తెరిచి ఉంటుంది.

              ఈ ఆలయ చరిత్ర 1100సంవత్సరాల చరిత్ర ఉన్న తూర్పు చాళుక్యరాజులచే ఆరాధించబడిన స్వయం భూ విఘ్నేశ్వరుని అద్భుతమైన క్చేత్రం. కోరిన కోర్కెలు తీర్చే వినాయకుడు. ఈ బిక్కవోలు ఒకప్పుడు బిరుదాంకినవోలు. తూర్పు చాళుక్యరాజుల పరిపాలనా కాలంలో 849-892మధ్య బిక్కవోలు రాజధానిగా పరిపాలించబడి పలుదేవాలయాలు నిర్మించారు. ప్రపధమంగా క్రీ. శ. 9వ శతాబ్దంలో తూర్పు దిశగా స్వయం భూ శ్రీ విఘ్నేశ్వరుని ఆరాధించినారు. ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద శిలావిగ్రహంగా భాసిల్లతున్నది. భూమిలోపలికి ఎన్ని అడుగుల వరకు ఉన్నదో ఎవరికీ తెలియదు.

           శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి నిజరూపమున శ్రీ స్వామి వారికి నాగాభరణం, నాగ యఙ్ఞోపవీతము, నాగమొలత్రాడు బిళ్ళకట్టు పంచతో సుఖాసనం మీద కూర్చుని రాజఠీవితో భక్తులకు దర్శనం ఇస్తారు.

  స్వామి వారి ప్రత్యేకత :-దక్చిణా వ్రుత్తం (తొండం), కోరికలు స్వామి వారి చెవిలో చెప్పకొనుట వలన భక్తులు కోరికలు తీరి పునహ దర్శనం చేయుట జరుగుచున్నది.

   శ్రీ స్వామివారికి ప్రతీ నెలా శుద్ధ చవితినాడు అనగా అమావాస్య వెళ్లిన నాలుగవ రోజున మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, నవగ్రహారాధన, సూర్య నమస్కారములు, మహాలింగార్చన, సుందరకాండ, సప్తశతీపారాయణ, గణపతి హోమం, చంఢిహోమం, లక్చపత్రిపూజ జరుగును. మరియూ స్వామి వారి ఆలయము నందు ప్రతీనెలా సంకటహరిచవితి రోజున లక్చపత్రిపూజలు జరుగును. గణపతి నవరాత్రులు గ్రామస్తుల సహకారంతో అత్యంత వైభవంగా జరుగుతాయి. ఇంకొక విషయం :-ప్రతీ రోజూ జరుగు అన్నదానం లోని ప్రతీ పదార్థాలు మరియు నిత్య ప్రసాదం లోని ప్రతీ పదార్థాలు వంట బ్రాహ్మణులు చే తయారు చేయించబడును.

     ఇదే గ్రామంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం చాలా ప్రత్యేకత పొందినది. వళ్ళీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పుట్ట కూడా ఉంది. ఇక్కడ స్వామి వారిని దర్శించుకుని మొక్కుకుంటే వివాహం కాని వారికి వివాహము జరగడం, సంతానం కలగనివారికి సంతానం కలగడం ఎంతోమంది కి నిదర్శనమని చెబుతారు. కావున ముఖ్యంగా దర్శించవలసిన క్చేత్రము. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌳🌳🌳🌳🌳🌳🌳🌳

శ్రీకాళహస్తీశ్వరమ్

 శ్రీకాళహస్తీశ్వరమ్


శివ ! శివా! యని నిత్య చేతనోల్లాసాన 

          బ్రతికెడు నీ ప్రియ  భక్తునకును 

కాఠిన్య వజ్రమ్ము  కడు సౌకుమార్యమౌ

          భువన మనోహర  పుష్ప మగును 

అత్యంత వేడిమి నందించు ననలమ్ము

          మహిత శీతలమైన మంచు యగును 

నిండు జలంబుల  నీరధి వెనువెంట 

          వాసయోగ్యమైన  వసుధ యగును

సతత శత్రుత్వాన సాధించు వైరియు

          మించిన  ప్రేమతో  మిత్రు డగును 

కడు భయంకరమైన కాలకూటవిషమ్ము

         భువి రుచ్యమైనట్టి  భోజ్య మగును 

నీదు నామామృతము జూడ నిక్కమరయ 

సర్వమును వశ్యపరచును జగతి యందు 

భక్త పరిపాల శంకరా ! భవ విదూర !

రమ్య శ్రీ కాళహాస్తీశ్వరా ! నమోస్తు .           


✍️గోపాలుని మధుసూదన రావు 🙏

ధార్మికగీత - 92*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                          *ధార్మికగీత - 92*

                                    *****

        *శ్లో:-  దైవాధీనం జగ త్సర్వం ౹*

                *సత్యాధీనం తు దైవతం ౹*

                *తత్సత్యం ఉత్తమాధీనం ౹*

                *ఉత్తమో మమ దేవతా  ౹౹*  

                                      *****

*భా:- విశ్వంలో చరాచర సృస్తికర్త  బ్రహ్మ. ఆ జీవకోటి పోషణ, పాలన కర్త విష్ణువు. జీవితాంతాన ప్రాణికోటి  లయకర్త మహేశ్వరుడు. ఈ విధంగా జగన్నాటక సూత్రధారి దేవుడే. ఆ దైవాధీనమే యీ జగత్తంతా. అట్టి  దైవము సత్యానికి అధీనుడై ఉన్నాడు. సత్యమే దైవము. దైవమే సత్యము. సత్యము లేని పూజ,జపము,తపము,మనో  వాక్కాయాలు  ఊషర క్షేత్రంలో బీజావాపనము వంటి వని శాస్త్రం చెబుతోంది. సత్యము లేని పురుషార్థాలు శశి లేని నిశి వలె నిరుపయోగాలు. అట్టి సత్యము ఉత్తముల యొక్క అధీనమై ఉన్నది. శ్రీరాముడు, హరిశ్చంద్రుడు,శిబి,రంతి,బలి మున్నగు చక్రవర్తులు ఆపత్తులను,విపత్తులను ధైర్యస్థై ర్యాలతో అధిగమించి, సత్యము నాచరించి, "సత్యమేవ జయతే" అని నిరూపణ చేసి చూపించారు. ధ్రువుడు,ప్రహ్లాదుడు,మార్కండేయుడు సత్యనిష్ఠతో దైవ సాక్షాత్కారం పొందగలిగారు. అమేయ కీర్తి గడించారు. అలాంటి "ఉత్తములే నా పాలిట దైవమ"ని శ్రీకృష్ణ పరమాత్మ  ఒక సందర్భంలో  వెలిబుచ్చిన సూనృతవాణి యిది. కాన "సత్యమూలాని సర్వాణి", "సత్యం బ్రూయాత్ - ప్రియం   బ్రూయాత్", "సత్య మేవేశ్వరో లోకే" ఇత్యాది ఆర్యోక్తులను అనునిత్యం గ్రహణ,ధారణ, మననములు చేసికొంటూ, మానవాళి సత్యవర్తనులై  ఆదర్శంగా జీవించి తరించాలని  సారాంశము*.

                                *****

                *సమర్పణ   :    పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

శ్రీ సత్యనారాయణస్వామి వ్రత మహాత్మ్యము

 శ్రీ సత్యనారాయణస్వామి వ్రత మహాత్మ్యము


వ . ఆ సమయ మందున ...


భూరి ధనమున్న భూపతి బొక్కసమున 

ద్రవ్యమును కొంద రారేయి తస్కరించి 

భటుల గాంచియు భయమున పరుగులెత్తి 

దూరి  రా సాధుగృహమున దూకుడుగను    81


దొంగ లారీతి తెచ్చిన దొంగ సొత్తు 

భటుల వల్లను యత్యంత భయము నొంది 

సాధు వున్నట్టి  స్థలమున జారవిడిచి 

మరలి చూడక వెనువెంట మాయ మైరి      82


తస్కరుల వెంట వచ్చిన దండధరులు 

సాధు వల్లుడు యున్నట్టి సదన మందు 

తస్కరించగ బడినట్టి ధనము గాంచి 

తస్కరులు వీరె యనిమది తలచి రంత.    83


అంత రాజభటులు యా వర్తకుల బట్టి 

పంతగించి కట్టి బంధనముల 

రాజు వద్ద కంత రయమున గొంపోయి 

విన్నవించి రపుడు కన్నదంత                   84

                         

అంత చంద్రకేతు యాగ్రహం బొందియు 

సత్యదేవుమహిమ సంక్రమించ 

నెరపకుండ యెట్టి నేరపారోపణ 

యిరువు రొర్తకులను చెరను నెట్టె            85


సత్యవ్రతముమాని సాధువు యిల్లుండు 

వెతల జిక్కి రరయ గతిని దప్పి 

యెంత వేడుకొనిన సుంతైన వినకను 

నేర మెఱుగకున్న నెట్టె చెరలొ               86


మఱియు చంద్ర కేతు మామ యిల్లుండ్రవి 

ధనము నంత గొనియు దండనిచ్చె 

సర్వ ధనము పోయి సంతాపమే దక్కె 

సత్యదూరుడైన  సాధువునకు             87


ఇట యిర్వురు యిటులుండను 

యట మాతా సుతలు యింట యాఱడి పడుచున్ 

పటుతర దారిద్ర్యమునను 

కటకట పడుచుండి రరయ కష్టము లందున్ 88



ఇంట చోరులు పడియును యిల్లు దోచ 

కలిమి సర్వము నశియించి కలిగె లేమి 

పూట గడవక యిర్వురు పాటు బడుచు 

తల్లడిల్లుచునుండిరి తల్లి సుతలు            89


కలిమి యందు యెపుడు తులతూగు వారికి 

కలిమి దక్క నేడు కడుపు మాడె 

చేత గవ్వ లేక చేయునదియు లేక 

తిరిప మెత్త దిగిరి తిండి కొఱకు             90


                                 సశేషము….


    ✍️గోపాలుని మధుసూదన రావు🙏

జీవితం సఫలం కావడానికి

 🙏శ్రీమతే రామానుజాయ నమః 🙏


సందేహం;- జీవితం సఫలం కావడానికి మనం భగవంతుడిని ఏమి కోరుకోవాలి?


సమాధానం;- ఇది మంచి ప్రశ్న. ఒక సంఘటనలోకి వెళ్ళి దీనికి సమాధానం తెలుసుకుందాం.


కంసుని ఆహ్వానంపై అక్రూరుడితో బలరాముడు, కృష్ణుడు రేపల్లె నుండి మధురకు వచ్చారు. రాజవీధిలో నడుస్తున్నారు. మాలలు కట్టే సుదాముడింటికి వచ్చారు. అతని మాలా సత్కారంతో వారు సంతోషించారు. అపుడు శ్రీకృష్ణుడు సుదాముడి భుజంపై చేయివేసి *ఏం కావాలో కోరుకో* అని అప్యాయంగా అడిగాడు. అపుడు శ్రీకృష్ణుడు సాక్షాత్ భగవంతుడే అని తెలిసినా సుదాముడు ఏమడిగాడు? మడులా, మాన్యాలా? వనాలా, భవనాలా, వజ్రాలా, వైఢూర్యాలా? అందాల అతివలా, అష్టైశ్వర్యాలా? ఇవేం కోరుకోలేదు. మరేం కోరుకున్నాడు?


*నీ పాద కమల సేవయు*

*నీ పాదార్చకుల తోడి నెయ్యమును, నితాం*

*తా పార భూత దయయును*

*తాప సమందార నాకు దయసేయగదే!*


"సదా నీ సేవాభాగ్యం ఇలాగే కల్పించు స్వామీ! అదే పదివేలు. తనకంటే తన భక్తులను ప్రేమించేవారంటే భగవంతుడికి ప్రీతి. అదుగో అటువంటి స్వామి భక్తులతోనే తాను సహవాసం చేయాలి. అంతేనా ఎల్లవేళలా సర్వప్రాణుల పట్ల తాను దయగలిగి ప్రవర్తించాలి. తాపసులకు, సాధు జనులకు కల్పవృక్షం వంటి వాడా ఇవే నాకు అనుగ్రహించమని నిన్ను వేడుకుంటున్నాను"


అని నమస్కరించాడు సుదాముడు. జీవితం సార్ధకం కావడానికి ఎవరైనా ఇంతకంటే కోరదగిన దేముంటుంది?🙏

*కార్తీక పురాణం

 🚩 _*కార్తీక పురాణం*_🚩

 🚩 _*12 వ అధ్యాయము*_🚩


🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*ద్వాదశి ప్రశంస*

*సాలగ్రామ దానమహిమ*



🕉️☘☘☘☘☘☘🕉️


*"మహారాజా ! కార్తీకమాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశీవ్రతమును గురించి , సాలగ్రామపు మహిమలను గురించి వివరించెదను విను"* మని వశిష్ట మహాముని ఈవిధముగా తెలియచేసిరి.


కార్తీక సోమవారమునాడు ఉదయముననే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్లి స్నానముచేసి ఆచమనము చేయవలయును. తరువాత శక్తి కొలది బ్రహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసముండి , సాయంకాలము శివాలయమునకు గాని , విష్ణ్వాలయమునకు గాని వెళ్లి దేవుని పూజించి , నక్షత్ర దర్శనము చేసికొని పిమ్మట భుజింపవలయును. ఈవిధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయే గాక , మోక్షము కూడా పొందుదురు.


కార్తీక మాసములో శని త్రయోదశి వచ్చిన యెడల నా వత్రమాచరించినచో నూరు రేట్లు ఫలితము కలుగును. కార్తీక శుద్ధ ఏకాదశిరోజున , పూర్ణోపవాసముండి ఆ రాత్రి  విష్ణ్వాలయమునకు వెళ్లి శ్రీహరిని మనసారా ధ్యానించి , శ్రీహరి సన్నిధిన పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన , కోటి యజ్ఞముల ఫలితము కలుగును. ఈవిధముగా చేసిన వారలకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానముచేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానము చేసినంత పుణ్యము కలుగునో దానికంటే అధికముగా ఫలము కలుగును. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయుణుడు శేషపానుపు నుండి లేచును గనుక , కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు యిష్టము. అరోజున శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి , ఆవుకాళ్ళకు వెండి డెక్కలు తగిలించి , దూడతో సహా బ్రహ్మణునకు దానమిచ్చిన యెడల ఆయావు శరీర ముందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్ర లోకములో స్వర్గ సుఖములందుదురు. కార్తీకశుద్ధ పాడ్యమి రోజున , కార్తిక పౌర్ణమిరోజున కంచుపాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మ మందు చేసిన సకల పాపములు హరించును. ద్వాదశినాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు ఇహపర సుఖమును పొందగలరు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టునుగాని , సాలగ్రామమునుగాని ఒక బ్రాహ్మణునకు దానమిచ్చినయెడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును.

దీనికి ఉదాహరణముగా ఒక కథ గలదు - శ్రద్దగా అలకింపుము.


*సాలగ్రామ దానమహిమ*


🕉️🌹🌹🌹🌹🌹🌹🕉️


పూర్వము అఖండ గోదావరి నదీ తీరమందలి ఒకానొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను. వాడు మిగుల దురాశాపరుడై నిత్యము ధనమును కూడా బెట్టుచు , తాననుభవించక , యితరులకు బెట్టక , బీదలకు దానధర్మములు చేయక , ఏల్లప్పుడు పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవిగుచూ యేజీవికీ కూడా ఉపకారమైననూ చేయక *"పరులద్రవ్యము నెటుల అపహరింతునా !"* యను తలంపుతో కుత్సిత బుద్ది కలిగి కాలము గడుపుచుండెను.


అతడొకనాడు తన గ్రామమునకు సమీపమున నున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పుయిచ్చెను. మరి కొంత కాలమునకు తన సొమ్ము తనకిమ్మనిని అడుగగా ఆ విప్రుడు *"అయ్యా ! తమకీయవలసిన ధనము ఒక నెలరోజుల గడువులో యివ్వగలను. మీ ఋణముంచుకోను. ఈ జన్మలో తీర్చని యెడల మరుజన్మమున మీ యింట యేజంతువుగానో పుట్టి అయినా , మీ ఋణము తీర్చుకోగలను"* అని సవినయముగా వేడుకోనెను. ఆ మాటలకు కోమటి మండిపడి *"అట్లు వీలులేదు. నాసొమ్ము నాకిప్పుడే యీయవలయును. లేనియెడల నీ కంఠమును నరికి వేయుదును"* అని ఆవేశం కొలదీ వెనుక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తుకను కొసెను. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిల తన్నుకొని చనిపోయెను. ఆ కోమటి భయపడి , అక్కడనే యున్నచో రాజభటులు వచ్చి పట్టుకొందురని జడిసీ తన గ్రామమునకు పారిపోయెను. బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక , అప్పటి నుండి అ వైశ్యునకు బ్రహ్మహత్యా పాపమావహించి కుష్ఠువ్యాధి కలిగి నానా బాధలూ పడుచూ మరి కొనాళ్లకు మరణించెను. వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకోనిపోయి రౌరవాది నరకకూపముల బడద్రోసిరి.


ఆ  వైశ్యునకు ఒక కుమారుడు కలడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దానదర్మాలు చేయుచు పుణ్యకార్యము లాచరించుచు , నీడకొరకై చెట్లు నాటించుచు , నూతులు , చెరవులు త్రవ్వించుచు , సకల జనులను సంతోషపెట్టుచు మంచికీర్తిని సంపాదించెను. ఇటులుండగా కొంత కాలమునకు త్రిలోకసంచారియగు నారదులవారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి , త్రోవలో ధర్మవీరుని యింటికి వెంచేసిరి. ధర్మవీరుడు నారదులవారికి సాష్టాంగ దండ ప్రణామము లాచరించి , విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాద్యాది విధుల చేత సత్కరించి , చేతులు జోడించి *"మహానుభావా ! నాపుణ్యం కొలదీ నేడు తమ దర్శనం లభించినది. నేను ధన్యుడను. నాజన్మ తరించినది. నాయిల్లు పావనమైనది. శక్తి కొలదీ   నే జేయు సత్కారములను స్వీకరించి తమరువచ్చిన కార్యమును విశధీకరింపుడు"* అని సవినయుడై వేడుకొనెను. అంత నారదుడు చిరునవ్వు నవ్వి *"ఓ ధర్మవిరా ! నేను నీకోక హితవు చెప్పదలచి వచ్చితిని. శ్రీమహావిష్ణువునకు కార్తీకమాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రితికరమైన దినము. అరోజున స్నాన , దాన , జపాదులు ఏవి చేసిననూ అత్యంత ఫలం కలుగును. నాలుగు జాతులలో నేజాతివారైననూ - స్త్రీ అయినా పురుషుడైనా , జారుడైనా , చోరుడైన , పతివ్రతమైనా , వ్యభిచారిణియైనా కార్తీకశుద్ద ద్వాదశి రోజున సూర్యుడు తులారాశియందు వుండగా నిష్ఠగా ఉపవాసముండి , సాలగ్రామదానములు చేసిన యెడల వెనుకటి జన్మలందూ , ఈ జన్మమందూ చేసిన పాపములు పోవును. నీ తండ్రి యమలోకంలో మహా నరకమనుభవించుచున్నాడు. అతనిని వుద్ధరించుటకై నీవు సాలగ్రామదానము చేయక తప్పదు. అట్లుచేసి నీతండ్రి ఋణం తిర్చుకోనుము"* అని చెప్పెను.  అంతట దర్మవిరుడు *" నారద మునివర్యా ! నేను గోదానము , భూదానము , హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసియుంటిని , అటువంటి దానములు చేయగా నాతండ్రికి మోక్షము కలుగనప్పుడీ "సాలగ్రామ" మనే జాతిని దానము చేసినంత మాత్రమున ఆయన యెట్లు వుద్ధరింపబడునా   యని సంశయము కలుగుచున్నది. దీనివలన ఆకలిగొన్నవాని ఆకలితీరునా ! దాహంగొన్న వానికి దాహం తీరునా ? కాక , యెందులకీ దానము చేయవలయును ? నేనీ సాలగ్రామదానము మాత్రము చేయజాల"* నని నిష్కర్షగా పలికెను.


ధర్మవీరుని అవివేకమునకు విచారించి *"వైశ్యుడా ! సాలగ్రామమును శిలామాత్రముగా ఆలోచించితివి. అది శిలకాదు. శ్రీహరి యొక్క రూపము. అన్నిదానములకంటె సాలగ్రామదానము చేసినచో కలుగు ఫలమే గొప్పది. నీ తండ్రిని నరకబాధ నుండి విముక్తని గావింప నెంచితివేని , యీ దానముతప్ప మరొక మార్గము లేదు"* అని చెప్పి నారదుడు వెడలిపోయాను.


ధర్మవీరుడు ధనబలము గలవాడై యుండియు , దానసామర్థ్యము కలిగియుండియు కూడా సాలగ్రామ దానము చేయలేదు. కొంత కాలమునకు అతడు చనిపోయెను. నారదుడు చెప్పిన హితభోధను పెడచెవిని పెట్టుటచేత మరణాంతర మేడు జన్మలయందు పులియై పుట్టి , మరి మూడు జన్మలందు వానరమై పుట్టి , ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి , పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి , పదిజన్మలు పందిగా జన్మించి యుండెను. అట్లు జరిగిన తరువాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణునింట స్త్రీగా పుట్టి  ఆమెకు యౌవనకాలము రాగా ఆపేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి పెండ్లి చేసెను. పెండ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయెను.


చిన్నతనమందే ఆమెకు అష్టకష్టములు సంభవించినందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాల దుఃఖించిరి. తండ్రి ఆమెకు ఈవిపత్తు యెందువలన కలిగేనా యని దివ్యదృష్టితో గ్రహించి వెంటనే అమెచేత సాలగ్రామదానము చేయించి *"నాకు బాల వైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక"* యని చెప్పించి సాలగ్రామ దానఫలమును ధారవోయి  ఒచెను. ఆరోజు కార్తీక సోమవారమగుట వలన అ సాలగ్రామ దానఫలముతో ఆమె భర్త జీవించెను. పిదప ఆ నూతన దంపతులు చిరకాలమునకు సకల సౌఖ్యములతో జీవిం , జన్మాంతరమున స్వర్గమున కెగిరి. మరికొంత కాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడుగా పుట్టి నిత్యమూ సాలగ్రామదానము చేయుచు ముక్తినొందెను.


కావున , ఓ జనకా ! కార్తీకశుద్ద ద్వాదశిరోజున సాలగ్రామ దానం చేసిన దాన ఫలము యింతింత గాదు. ఎంతో ఘనమైనది. కావున నీవును ఆ సాలగ్రామ దానమును చేయుము.


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి ద్వాదశాధ్యాయము -* *పన్నెండోవ రోజు పారాయణము సమాప్తము.*


🚩🌹🌷🕉️🕉️🌷🌹🚩

_*కార్తీక పురాణం*_🚩

 🚩 _*కార్తీక పురాణం*_🚩 

🚩 _*11 వ అధ్యాయం*_🚩


🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*మంథరుడు - పురాణ మహిమ*



🕉️☘☘☘☘☘☘🕉️


ఓ జనక మహారాజా ! యీ కార్తీకమాస వ్రతము యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటిని. ఇంకనూ దీనిని గురించి యెంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసమందు *విష్ణువును అవిసె పూలతో పూజించిన యెడల చంద్రాయణ వ్రతము చేసినంత ఫలము కలుగును.* విష్ణ్యర్చనానంతరం పురాణ పఠనం చేసినా , చేయించినా , వినినా , వినిపించినా అటువంటి వారూ తప్పని సరిగా వైకుంఠాన్నేపొందుతారు. దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పెదను. శ్రద్దగా ఆలకింపుము. అని వశిష్టుల వారు ఈ విధముగా చెప్ప దొడంగిరి.


పూర్వము కళింగ దేశమునకు మంధరుడను విప్రుడు గలడు. అతడు ఇతరుల యిండ్లలో వంటలు చేయుచు అక్కడే భుజించుచు , మద్య మాంసాది పానీయాలు సేవించుచూ తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నానజప , ధీపారాదనాదికములను ఆచారములును పాటింపక దురాచారుడై మెలుగుచుండెను. అతని భార్య మహాసాధ్వి , గుణవంతురాలు , శాంతమంతురాలు , భర్త యెంత దుర్మార్గుడయిననూ , పతినే దైవముగానెంచి విసుగు చెందక సకలోపచారములు జేయుచు , పతివ్రతా ధర్మమును నిర్వర్తించుచుండెను. మంధరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడుగా పని చేయుచున్ననూ ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను. ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవక పోవుటచే దొంగ తనములు చేయుచూ , దారి కాచి బాటసారులను బాధించి వారి వద్ద నున్న ధనము , వస్తువులు అపహరించి జీవించుచుండెను. ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారిన బడి పోవుచుండ నతనిని భయపెట్టి కొట్టి ధనమపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరిని జంపి ధనము మూటగట్టుకొని వచ్చుచుండెను. సమీపమందున్న ఒక గుహ నుండి వ్యాఘ్ర మొకటి గాడ్రించుచు వచ్చి కిరాతుకుని పైబడెను. కిరాతుకుడు దానిని కూడా చంపెను. కానీ అ పులి కూడా తన పంజా తో కిరాతుకకుని కొట్టి యుండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయెను. ఈ విధముగా ఒక కాలమున నలుగురూ నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమ లోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తము గ్రక్కుచు భాద పడుచుండిరి.


మంధరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యమూ హరి నామ స్మరణ చేయుచు సదాచర వర్తినియై భర్తను తలచుకోని దుఃఖించుచు కాలము గడుపుచుండెను. కొన్నాళ్ళుకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చెను. ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి అర్ఘ్య పాద్యాదులచే పూజించి *" స్వామి ! నేను దీనురాలను , నాకు భర్త గాని , సంతతిగానిలేరు. నేను సదా హరినామస్మరణ చేయుచు జీవించుచున్నదానను , కాన , నాకు మోక్ష మార్గము ప్రసాదించు"* మని బ్రతిమాలుకోనేను. ఆమె వినయమునకు , ఆచారమునకు ఆ ఋషి సంతసించి

*" అమ్మా ! ఈ దినము కార్తిక పౌర్ణమి , చాల పవిత్రమైన దినము. ఈ దినమును వృథాగా పాడు చేసుకోనవద్దు. ఈ రాత్రి దేవాలయములో పురాణము చుదువుదురు. నేను చమురు తీసికొన వచ్చేదను. నీవు ప్రమిదను , వత్తి ని తీసికొని రావాలయును. దేవాలయములో ఈ వత్తిని దెచ్చిన ఫలమును నీ వందుకోనుము"* అని చెప్పిన తోడనే అందుకామె సంతోసించి , వెంటనే దేవాలయమునకు వెళ్లి శుబ్రముచేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానె స్వయముగా వత్తి చేసి రెండు వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనే ప్రమిదెలో పోసి దీపారాధన చేసెను. అటు తరువాత యింటికి వెడలి తనకు కనిపించిన వారి నెల్ల *" ఆరోజు రాత్రి ఆలయ ముందు జరుగు పురాణ కాలక్షేపము నకు"* రమ్మని చెప్పెను. ఆమె కూడా రాత్రి అంతయు  పురాణమును వినెను. ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలము గడుపుచు కొంతకాలమునకు మరణించెను. ఆమె పుణ్యత్మురాలగుటచేత విష్ణుదూతలు వచ్చి విమాన మేక్కించి వైకుంఠమునకు దీసికోనిపోయిరి. కానీ - ఆమెకు పాపత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెము దోషముందుట చేత మార్గ మధ్యమున యమలోకమునకు దీసికోనిపోయిరి. అచట నరక ముందు మరి ముగ్గురితో భాదపడుచున్న తన భర్త ను జూచి *" ఓ విష్ణుదూత లారా ! నా భర్త మరి ముగ్గురును యీ నరక  బాధపడుచున్నారు . కాన , నాయందు దయయుంచి వానిని వుద్దరింపు "* డని ప్రాధేయపడెను. అంత విష్ణుదూతలు *" అమ్మా ! నీ భర్త బ్రాహ్మణుడై యుండియు స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు. రెండవ వాడు కూడా బ్రాహ్మణుడైననూ అతడు కూడా ధనాశచే ప్రాణహితుని చంపి ధనమపహరించెను. మూడవ వాడు వ్యాఘ్రము నలుగవ వాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినాడు  అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము , మద్య మాంసభక్షణ చేసినాడుగాన పాపాత్ముడైనాడు. అందుకే యీ నలుగురు నరకబాధలు పడుచున్నారు. *" అని వారి చరిత్రలు చెప్పిరి. అందులకు ఆమె చాలా విచారించి "ఓ పుణ్యాత్ములారా ! నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురిని కూడా ఉద్ధరింపు"* డని ప్రార్ధించగా , అందులకా దూతలు *" అమ్మా ! కార్తిక శుద్ధ పౌర్ణమినాడు నీవు వత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు , ప్రమిదఫలము కిరాతకునకు , పురాణము వినుటవలన కలిగిన ఫలము ఆ విప్రునకు ధారపోసినచో వారికి మోక్షము కలుగు"* నని  చెప్పుగా అందులకామె అట్లే ధార పోసేను. ఆ నలుగురును ఆమె కడకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్లిరి. కావున , ఓరాజా ! కార్తీకమాసమున పురాణము వినుటవలన , దీపము వెలిగించుట వలన ఎట్టి ఫలము కలిగెనో వింటివా ? అని వశిష్టులవారు నుడివిరి.


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య మందలి*

*పదకొండవరోజు  పారాయణము సమాప్తము.*


🚩🌹🌷🕉️🕉️🌷🌹🚩

Truth

 డ్రమ్ముల మోతను సంగీతమంటున్నారు

పీలికబట్టల్ని వస్త్ర ధారణ అంటున్నారు

భౌతిక అకర్షణను ప్రేమని పిలుస్తున్నారు

సహజీవనాన్ని సంసారమంటున్నారు

గ్రాఫిక్ గిమ్మిక్కులను సినిమా అంటున్నారు

డూప్ ల పోరాటాన్నిహీరోయిజం అంటున్నారు

పదవుల పోరాటాన్నిప్రజాస్వామ్యమంటున్నారు

అధికార ఆరాటాన్ని రాజకీయమంటున్నారు

ఆస్తుల పంపకాన్ని కుటుంబం అంటున్నారు

సరదాలను సంస్కృతి అంటున్నారు

భుక్తి మార్గాన్ని చదువు అంటున్నారు

కోరిన కోర్కెలు తీరిస్తేనే.. దేవుడంటున్నారు

ఆస్తి ఉంటేనే.. గొప్పవాడు అంటున్నారు

మందు పోయిస్తేనే..మిత్రుడు అంటున్నారు

కట్నం తెస్తేనే..భార్య అంటున్నారు

సొమ్ములు తెస్తేనే..సంసారం అంటున్నారు

కాసులు తెస్తేనే..కాపురం అంటున్నారు

అవినీతి చేయకపోతే.. అసమర్ధుడంటున్నారు

అక్రమాలు చేయకపోతే.. అమాయకుడంటున్నారు

అసత్యాలు మాట్లాడితే.. బ్రతక నేర్చినవాడంటున్నారు

నిజం పలికితే.. బ్రతక నేర్వని వాడంటున్నారు

న్యాయబద్ధంగా ఉంటే.. ఎలా బ్రతుకుతాడో అంటున్నారు

అన్యాయంగా బ్రతికితే..ఎంచక్కా ఉన్నాడంటున్నారు

అన్యాయాన్ని ఎదిరిస్తే..అతనికెందుకు అంటున్నారు

నిజాయితీగా బ్రతికితే ..కూడుపెడుతుందా అంటున్నారు

మాయకమ్మిన జీవితాన్నిశాశ్వతమనుకుంటున్నారు

మరణమనే మహా సత్యాన్ని విస్మరిస్తున్నారు

పరిస్థితులకనుగుణంగా..పాత అర్ధం చెరిగిపోయి

ప్రయోజనాలకు అండగా..పరమార్ధం ఆవిర్భవిస్తోంది!

స్వార్ధకాంక్షాణుగుణంగా విపరీతార్ధం ఆవిష్కృతమవుతోంది!

విశ్వ నాధుడు

 విశ్వ నాధుడు ఎవరీ విశ్వ నాధుడు. ఈశా శక్తియై లేక విషు విష్ణు శక్తియా లేక వీటి కలయికయిన లేక వీటి సృష్టికి మూలమైనది. పరిశీలన. విశ్వ అనే పదం సమస్త జగత్తు అయినయెడల అది భూమిపై పదార్ధరూపము ఏల చెందవలె.పదార్ధరూపము విశ్వ మైన దానికి మూల స్థానము కాశీ క్షేత్రమా.అదే ధృఢమైతే యిక పునరావృత్తిలేనతత్వమే కాశీ. కాశీ క జీవ వ్యాప్తిని తెలుపు నది అనగా వ్యాప్తి యైన శక్తిని తిరిగి దేహ ధారణ లేకుండా చేయు శక్తిగల ప్రాంతమని. అక్కడ భాగములకు తావు లేదు. కాని అన్ని భేదములు అచ్చటనే జీవులు పుట్టి అనుభవించుచు లంపటములో పడుచున్నాడుచేటును. యిక త్యాగరాజ స్వామి వారైతే శివ తత్వాన్ని విష్ణు తత్వాన్ని ఎలా తెలియాలి శివుడు మాధవుడవోయని వీరి తత్వము సులువుగా అర్ధ మగుటకు మరియు అంతకు ముందు ఎవరూ ఊహించని పదీర్ధరూపమైన బ్రహ్మ తత్వమేయని తెలుపుటకు సృష్టి మూలం అంతకు ముందు లేని శక్తి రూప లక్షణము దేవుని అది ఆకాశ భ్రాంతి యని లోని లయము లేని మూల తత్వమేయని శివకాశి మిశ్రమమైన జీవ లక్షణము శక్తి యని అదియే విశ్వ తత్వ మని అది విశ్వనాధ తత్వ మని తెలియుచున్నది. విశ్వ తత్వము తెలిసినవాడు విశ్వ నాధుడు యని డు మంత్రి చేరి పుల్లగా లక్షణము వలన ఆత్మ దేహధారణవలననే యని తెలియును. విశ్వ నాధ తక్వం లింగాల కారణమని అది విశ్వం విష్ణుః అని విష్ణు లక్షణము షట్కారమై ఆరుగుణములతత్వము జీవుడు యని విష్ణు సహస్రనామం రుద్రం కూడా వకేశక్తి విషయాన్ని పదే పదే చెప్పినా మనకు తెలుసుకోలేని అజ్ఞానం కమ్మి యున్నది. తెలుసుకుంటూనే వుందాం.

సమాచారం హక్కు చట్టం

 సమాచారం హక్కు చట్టం ప్రకారం  ఏదయినా  సమాచారం  కొరకు  డబ్బులు కట్టి  సమాధానం  రాని వారు కన్స్యూమర్  ఫోరమ్  లో  కేసు  వేయచ్చు.. డబ్బులు  కట్టిన ప్రతి వారు  వియోగదారుడి.. అన్ని నేషనల్  కమిషన్ యిచ్చిన  జడ్జిమెంట్.....


NATIONAL CONSUMER DISPUTES REDRESSAL COMMISSION       NEW DELHI

            

              REVISION PETITION NO. 3146 OF 2012

  (Against the Order dated 16/07/2012 in Appeal No. 201/2012 of the State Commission  Chandigarh)


               WITH      IA/1206/2013,IA/5145/2014


1. SANJAY KUMAR MISHRA

H.No-1224, GF New HBC.Sector-19

Panchkula - 134113

Haryana .........                                                  .    .Petitioner(s)


Versus


1. PUBLIC INFORMATION OFFICER (PIO) & ANR.

State Information Commission (SIS) Punjab S.C.O.

84-85,Sector-17-C

Chandigarh - 160017

Chandigarh


2. Chief Information Commissioner (CIC)

State Information Commission (SIC)

Punjab,SCO-84-85,sector-17-C

Chandigarh - 160017

Chandigarh

3. NFICI                                                    ...........Respondent(s)


2010 యొక్క రివిజన్ పిటిషన్ నెం .3146 లో ఫిర్యాదుదారుడు, అవి శ్రీ సంజయ్ కుమార్ మిశ్రా సమాచార హక్కు చట్టం, 2005 లోని సెక్షన్ 6 (1) కింద ఒక దరఖాస్తును సమర్పించారు (ఇకపై వివరణాత్మక సమాచారాన్ని కోరుతూ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (పిఐఓ) కు ‘ఆర్టీఐ యాక్ట్’) గా సూచిస్తారు అప్లికేషన్ యొక్క 1 మరియు 4 పేరాల్లో. లోపల సమాచారం అందించబడలేదు ముప్పై రోజుల నిర్ణీత వ్యవధి, అతను రాష్ట్ర సమాచార కమిషన్ ముందు అప్పీల్కు ప్రాధాన్యత ఇచ్చాడు. ఈ విజ్ఞప్తిని 06.04.2011 న కొట్టివేసింది. ఆ తరువాత, అతను కింద ఫిర్యాదు చేశాడు కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, 1986 లోని నిబంధనలు (ఇకపై దీనిని ‘యాక్ట్’ అని పిలుస్తారు) చెప్పిన చట్టం యొక్క అర్ధంలో ఉన్న వినియోగదారు మరియు వ్యతిరేకం నుండి పరిహారం కోరడం ఫిర్యాదులో పార్టీలు, అంటే కేంద్ర సమాచార పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కమిషన్, పంజాబ్ మరియు చెప్పిన సమాచార ముఖ్య సమాచార కమిషనర్ కమిషన్. ఫిర్యాదును వ్యతిరేక పార్టీలు వ్యతిరేకించాయి; మైదానంలో ఇంటర్-అలియా కింద జారీ చేసిన ఉత్తర్వుల నుండి ఉత్పన్నమయ్యే ఫిర్యాదును స్వీకరించడానికి జిల్లా ఫోరమ్కు అధికార పరిధి లేదు ఆర్టీఐ చట్టం. జిల్లా ఫోరం వినోదాన్ని అందించే అధికార పరిధిని కలిగి ఉంది ఫిర్యాదు కానీ సేవల్లో లోపం లేదని ఫిర్యాదును కొట్టివేసింది ఫిర్యాదుదారునికి ఇవ్వబడింది. దీనికి అధికార పరిధి ఉందని కనుగొన్నందుకు బాధపడటం అటువంటి ఫిర్యాదును ఎంటర్టైన్ చేయండి ఫిర్యాదులోని వ్యతిరేక పార్టీలు స్టాట్ ముందు అప్పీల్కు ప్రాధాన్యత ఇచ్చాయి కమిషన్. తన ఫిర్యాదును   కొట్టివేసినందుకు బాధపడుతున్నందున, ఫిర్యాదుదారుడు కూడా ఒక ప్రాధాన్యతనిచ్చాడు జిల్లా ఫోరం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రత్యేక అప్పీల్. రాష్ట్ర కమిషన్ తీసుకుంది పైన పేర్కొన్న స్వభావం యొక్క ఫిర్యాదులను స్వీకరించడానికి జిల్లా ఫోరమ్కు అధికార పరిధి లేదు మరియు తదనుగుణంగా ఫిర్యాదుదారు దాఖలు చేసిన అప్పీల్ను కొట్టివేసింది వ్యతిరేక పార్టీలు. స్టేట్ కమిషన్ తీసుకున్న అభిప్రాయం నుండి బాధపడటం, ది పైన పేర్కొన్న పునర్విమర్శ పిటిషన్ ద్వారా ఫిర్యాదుదారు ఈ కమిషన్ ముందు ఉన్నారు.

2. పునర్విమర్శ పిటిషన్ నెం .2028 / 2012 లో, ఫిర్యాదుదారు శ్రీ అజయ్ పాండే మరియు ఒక శ్రీ రామ్కుమార్ గుప్తా బార్ కౌన్సిల్ ఆఫ్ యు.పి నుండి కొంత సమాచారం కోరుతూ దరఖాస్తులను సమర్పించారు.

ఈ సమాచారం అందించబడనందున, అతను సంబంధిత జిల్లా ఫోరమ్ను సంప్రదించాడు బార్ కౌన్సిల్ నుండి పరిహారం కోరుతూ ఫిర్యాదు యొక్క మార్గం. జిల్లా ఫోరం ప్రదానం చేశారు పరిహారం ఫిర్యాదుదారునికి రూ .25,000 / -. యొక్క క్రమం నుండి బాధపడుతోంది  జిల్లా ఫోరం, బార్ కౌన్సిల్ ఆఫ్ యుపి వద్ద యుపి స్టేట్ కమిషన్ ముందు అప్పీల్ చేయడానికి ప్రాధాన్యత ఇచ్చింది లక్నో. ఈ విజ్ఞప్తిని కొట్టివేసిన తరువాత, యుపి యొక్క బార్ కౌన్సిల్ మా ముందు ఉంది  ఈ పునర్విమర్శ పిటిషన్.  2013 యొక్క 362 వ రివిజన్ పిటిషన్లో ఫిర్యాదుదారుడు కొంత సమాచారం కోరింది వ్యతిరేక పార్టీ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. అయితే సమాచారం కొంతవరకు మాత్రమే సరఫరా చేయబడింది. ఉండటం

ఫిర్యాదుదారుడు అతనికి పూర్తి సమాచారం ఇవ్వకపోవడంతో బాధపడ్డాడు మొదటి అప్పీలేట్ అథారిటీ ముందు అప్పీల్కు ప్రాధాన్యత ఇచ్చారు. ఆ తరువాత, అతను మరొకదాన్ని సమర్పించాడు ఆర్టీఐ చట్టం కింద సమాచారం కోరుతూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు. సమాచారం సరఫరా చేయకపోవడంతో, అతను ఫిర్యాదు ద్వారా జిల్లా ఫోరంను సంప్రదించాడు. జిల్లా ఫోరమ్ ఫిర్యాదుదారునికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన తరువాత, అది జారీ చేసిన ఉత్తర్వును బార్ సవాలు చేసింది కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంబంధిత స్టేట్ కమిషన్ ముందు. చెప్పిన అప్పీల్ కొట్టివేయబడింది,  ఈ పునర్విమర్శ పిటిషన్ ద్వారా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మన ముందు ఉంది.

4. రివిజన్ పిటిషన్ నెం .2806 / 2013 లో ఫిర్యాదుదారుడు కిరణ్ కుమార్ సమాచారం కోరింది  అతని MSC బయోకెమిస్ట్రీ పేపర్కు సంబంధించిన RTI చట్టం క్రింద. సమాచారం తిరస్కరించబడింది,

విశ్వవిద్యాలయం యొక్క నిబంధనలపై ఆధారపడిన అతను కర్ణాటక ముందు ఫిర్యాదుకు ప్రాధాన్యత ఇచ్చాడు రాష్ట్ర సమాచార కమిషన్. ఇందులో ఆయన భారత రాష్ట్రపతికి ప్రాతినిధ్యం వహించారు పరిగణించండి మరియు చెప్పిన ప్రాతినిధ్యం ఆధారంగా, సమాచారాన్ని అందించడానికి ఇచ్చిన దిశ ఆయన కోరింది. రాష్ట్ర సమాచార కమిషన్ ముందు విచారణ ముగిసింది  చెప్పిన సమాచార కమిషన్ ద్వారా. దానితో బాధపడిన అతను సంబంధిత జిల్లాను సంప్రదించాడు వినియోగదారుల రక్షణ చట్టం యొక్క నిబంధనల ప్రకారం ఫిర్యాదు ద్వారా ఫోరం. ది ఫిర్యాదును వ్యతిరేకించారు, సెక్షన్ 79 కింద ఇది నిషేధించబడిందని ఇంటర్-అలియా కర్ణాటక స్టేట్ యూనివర్శిటీ యాక్ట్, 2000. 7.8.2012 నాటి ఉత్తర్వులను చూడండి, ఫిర్యాదు సంబంధిత ఫోరం కొట్టివేసింది, ఫిర్యాదుదారుడు వినియోగదారుడు కాదని పట్టుకొని. ఉండటం తన ఫిర్యాదు కొట్టివేయడంతో బాధపడుతున్న అతను సంబంధిత రాష్ట్ర కమిషన్ను సంప్రదించాడు అప్పీల్ యొక్క మార్గం. ఆయన దాఖలు చేసిన విజ్ఞప్తిని రాష్ట్ర కమిషన్ తిరస్కరించి, ఆయన దీనికి ముందు ఉన్నారు

5. మొదటి అప్పీల్ నెం .275 / 2012 లో, ఫిర్యాదుదారు అప్పీలుదారు పిఐఓకు ఒక దరఖాస్తును సమర్పించారు  క్రమశిక్షణకు సంబంధించిన ధృవీకరించబడిన / ధృవీకరించబడిన పత్రాలను కోరుతుంది అతనికి వ్యతిరేకంగా చర్యలు ప్రారంభించబడ్డాయి. సమాచారంలో కొంత భాగాన్ని ఆయనకు సరఫరా చేశారు. బాధపడటం, అతను నిర్దేశించిన అప్పీలేట్ అథారిటీ ముందు అప్పీల్కు ప్రాధాన్యత ఇచ్చాడు. అతను కూడా ఫిర్యాదు చేశాడు EFA యొక్క PIO మరియు ఈ కమిషన్ నిర్ణయంపై ఆధారపడిన అప్పీలేట్ అథారిటీకి వ్యతిరేకంగా డాక్టర్ S.P. తిరుమల రావు Vs. మైసూర్ సిటీ మునిసిపల్ కార్పొరేషన్ RP / 1975/2005, నిర్ణయించింది  28.05.2009 న. అయితే ఆయన దాఖలు చేసిన ఫిర్యాదును రాష్ట్ర కమిషన్ తోసిపుచ్చింది. ఉండటం  బాధపడ్డాడు, అతను పైన పేర్కొన్న విజ్ఞప్తి ద్వారా మన ముందు ఉన్నాడు.

6. సిసి / 66/2014 లో ఫిర్యాదుదారుడు, రైల్వే మంత్రిత్వ శాఖ యొక్క సిపిఐఓకు దరఖాస్తు చేసుకున్నాడు నిర్దిష్ట సమాచారం. సేవలను అందించడంలో వ్యతిరేక పక్షంలో లోపం ఉందని ఆరోపించారు

అవసరమైన సమాచారాన్ని సరఫరా చేయకపోవడం ద్వారా, వారు ఈ కమిషన్ ముందు ఉన్నారుపరిహారం మొత్తం రూ .4,51,00,900 / -.

7. పునర్విమర్శ పిటిషన్ నెం .3146 / 2012 18.02.2014 న విచారణకు వచ్చినప్పుడు, a ఈ కమిషన్ యొక్క ఇద్దరు సభ్యుల ధర్మాసనం, పునర్విమర్శ పిటిషన్లలో నెం .4061 / 2010,

2009 యొక్క 3276/2012, 588 మరియు 589, ఈ కమిషన్ వినియోగదారుల ఫిర్యాదు కాదని తేల్చింది ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 22 మరియు 23 లోని నిబంధనల దృష్ట్యా నిర్వహించదగినది; అయితే దీనికి విరుద్ధంగా ఈ కమిషన్ RP / 1975/2005 లో డాక్టర్ S.P. తిరుమల రావు Vs. మైసూర్సిటీ మున్సిపల్ కార్పొరేషన్, వినియోగదారుల రక్షణ చట్టంలో ఆ పరిహారాన్ని కలిగి ఉంది వినియోగదారునికి అదనపు పరిహారం అందుబాటులో ఉంది. తీసుకున్న దృష్టిలో పైన పేర్కొన్న సంఘర్షణను గమనించడం ఈ కమిషన్, ఒక పెద్ద ధర్మాసనం ఏర్పాటు చేయబడింది, తద్వారా సమస్య చివరకు పరిష్కరించబడుతుంది. మేము

తదనుగుణంగా నేర్చుకున్న సలహాలను మరియు మన ముందు కనిపించే పార్టీలను వెలుగులో విన్నారు ఆర్టీఐ చట్టం మరియు వినియోగదారుల రక్షణ చట్టంలో ఉన్న నిబంధనలు.

8. చట్టం యొక్క సెక్షన్ 2 (సి), (డి) మరియు (ఓ) వరుసగా ‘ఫిర్యాదు’ ‘వినియోగదారు’ మరియు ‘సేవ’ ని నిర్వచించాయి.

వారు చదివినంతవరకు: (2) (సి) “ఫిర్యాదు” అంటే ఫిర్యాదుదారుడు చేసిన వ్రాతపూర్వక ఆరోపణ (iii) అతనిచే నియమించబడిన లేదా పొందబడిన లేదా అద్దెకు తీసుకునే లేదా పొందే సేవలు లోపంతో బాధపడుతున్నారుపైన పేర్కొన్న పునర్విమర్శ పిటిషన్ ద్వారా 10. ఈ విషయాలలో మన పరిశీలన కోసం రెండు ప్రశ్నలు ప్రధానంగా వస్తాయి. మొదట, అని ఒక వ్యక్తి, ఆర్టీఐ చట్టం క్రింద సమాచారం కోరడం అనేది వినియోగదారుని అని చెప్పవచ్చు చట్టం యొక్క సెక్షన్ 2 (1) (డి) యొక్క అర్ధం, మరియు రెండవది, అతను వినియోగదారుడిగా ఉన్నట్లయితే కన్స్యూమర్ ఫోరం యొక్క అధికార పరిధి, అటువంటి విషయాలలో నిబంధనల ప్రకారం నిరోధించబడుతుంది  ఆర్టీఐ చట్టం లేదా.  ‘పరిశీలన’ అనే వ్యక్తీకరణ చట్టంలో నిర్వచించబడలేదు, కానీ దాని నిఘంటువు  అర్థం, ఇంటర్-అలియాలో చెల్లింపు, డబ్బు లేదా ఫీజులు ఉంటాయి. అందువల్ల, ధర యొక్క ఏదైనా చెల్లింపు, రుసుమురూపంలో అయినా, లేకపోతే, సేవను అందించడానికి, ఉంటుంది పరిశీలన. ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ -6 కోరుకునే వ్యక్తికి ఇది తప్పనిసరి చట్టం ప్రకారం ఏదైనా సమాచారం కోరడం, సూచించిన ఫీజును చెల్లించడం సమాచారం కోరుతూ అప్లికేషన్. అందువల్ల ఏ దరఖాస్తును

సమర్పించలేము సూచించిన రుసుముతో పాటు. సెక్షన్ -7 లోని ఉప-విభాగం (3) ఛార్జింగ్ కోసం అందిస్తుంది సమాచారం అందించే ఖర్చును సూచించే తదుపరి రుసుము, ఇక్కడ నిర్ణయం

తీసుకోబడుతుందిఅటువంటి తదుపరి రుసుము చెల్లింపుపై కావలసిన సమాచారాన్ని అందించండి. అలాంటి తదుపరి రుసుము ఉంటుంది

సమాచారాన్ని అందించే ఖర్చును ప్రారంభించండి. అందువలన, సమాచారం కోరే వ్యక్తి  ఆర్టీఐ చట్టం ప్రకారం సెక్షన్ -6 ప్రకారం నిర్దేశించిన రుసుమును చెల్లించడమే కాదు  సమాచారాన్ని అందించే ఖర్చు, ఇక్కడ CPIO / PIO అటువంటి వాటిని అందించాలని నిర్ణయించుకుంటుంది

అందించిన ఖర్చును సూచించే తదుపరి రుసుము చెల్లింపుపై సమాచారం

సమాచారం. మా దృష్టిలో ధర / ఛార్జీల స్థానంలో ‘ఫీజు’ అనే వ్యక్తీకరణను ఉపయోగించడం రుసుము కూడా కోరుకున్నది పొందటానికి చెల్లించవలసిన ధర యొక్క ఒక రూపం కాబట్టి తేడా లేదు సమాచారం. వాస్తవానికి, బ్లాక్ లా డిక్షనరీ (ఆరవ ఎడిషన్) ప్రకారం ‘ఫీజు’ యొక్క నిర్వచనం ప్రభుత్వ అధికారుల సేవలకు లేదా కింద ఉన్న అధికారాన్ని ఉపయోగించటానికి చట్టం ద్వారా నిర్ణయించబడిన ఛార్జీని కలిగి ఉంటుంది ప్రభుత్వ నియంత్రణ. ఇది ప్రతిఫలంగా స్థిర ఛార్జ్ లేదా పెర్క్విజిట్ ఛార్జీని కూడా కలిగి ఉంటుంది శ్రమ కోసం; సేవ యొక్క పనితీరు కోసం ఒక వ్యక్తికి ఇచ్చే బహుమతి, పరిహారం లేదా వేతనం లేదా ఏదో పూర్తయింది లేదా చేయాలి. వాస్తవానికి, రుసుమును పన్నుతో సమానం చేయలేము చట్టబద్ధమైన లెవీ కానీ, ఆర్టీఐ చట్టం వ్యక్తిపై ఎటువంటి పన్ను విధించదు, సమాచారం కోరుతూ, అది మాత్రమే అతను చట్టం యొక్క నిబంధనలకు అనుగుణంగా సూచించిన రుసుమును చెల్లించవలసి ఉంటుంది

నియమాలు దానిపై రూపొందించబడ్డాయి. రుసుము చట్టం ప్రకారం సూచించబడటం మరియు కాదు ఆర్టీఐ చట్టం మరియు సంబంధిత సిపిఐఓ / పిఐఓ కింద దరఖాస్తుదారు మధ్య పరస్పరం  అంగీకరించబడింది. కాబట్టి ఫీజు / తదుపరి రుసుము రూపంలో పరిగణనలోకి తీసుకున్నంత కాలం, అది వివాదాస్పదంగా ఉండదు

ఆర్టీఐ చట్టం కింద సమాచారం పరిశీలన కోసం సరఫరా చేయబడుతుంది.

12. అయితే, రుసుము మరియు అదనపు రుసుము రూపంలో పరిగణనలోకి తీసుకోవడం సమాచార సరఫరా సేవ యొక్క నిర్వచనంలో ఉన్నట్లు అనిపిస్తుంది పాల్గొన్న సమస్య యొక్క నిశ్చయాత్మకమైనది. ఆర్టీఐ చట్టం అమలు వెనుక శాసన ఉద్దేశం, 2005, ఇది తరువాతి చట్టం. గౌరవ సుప్రీంకోర్టు గమనించినట్లు స్టార్ ఎంటర్ప్రైజెస్ & ఆర్స్ లో. Vs. సిటీ & ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మహారాష్ట్ర లిమిటెడ్, 1990 (3) ఎస్.సి.సి 280, ఈ దేశ ప్రజలకు ప్రతి తెలుసుకునే హక్కు ఉంది

పబ్లిక్ యాక్ట్, వారి పబ్లిక్ ఫంక్షనరీలచే బహిరంగ మార్గంలో జరిగే ప్రతి పని మరియు తెలుసుకునే హక్కు వాక్ స్వేచ్ఛ అనే భావన నుండి ఉద్భవించింది. ఇది అర్ధవంతమైనది శాసనసభ తన తెలివిలో ఆర్టీఐ చట్టాన్ని అమలు చేయాలని నిర్ణయించిందని చెప్పిన హక్కుకు అర్థం ఇది, పబ్లిక్ సమాచారాన్ని యాక్సెస్ చేసే హక్కును ఇవ్వడంతో పాటు సమగ్రతను సృష్టిస్తుంది  సమాచార అన్వేషకుడికి కావలసిన సమాచారాన్ని అందించే విధానం.

13. ఆర్టీఐ చట్టం కింద సమాచారం కోరే వ్యక్తి యొక్క మనోవేదనలు విస్తృతంగా ఉంటాయి

 (i) సంబంధిత పబ్లిక్ అథారిటీ చేత CPIO / PIO నియమించబడలేదు;

(ii) అతను కోరుకున్న సమాచారాన్ని అందించడానికి CPIO / PIO కి ఒక అభ్యర్థనను సమర్పించలేకపోయాడు అతనిచే;

(iii) అతని దరఖాస్తును అంగీకరించడానికి CPIO / PIO నిరాకరించింది;

(iv) అతనికి అందించిన సమాచారం సరిపోదు లేదా తప్పుడు లేదా తప్పుదోవ పట్టించేది;

(v) అతనికి సమాచారం ఇవ్వబడలేదు;

(vi) ఇందులో సూచించిన చట్టబద్ధమైన సమయం లోపల సమాచారం అతనికి అందించబడలేదు సంబంధించి;

(vii) అతను అసమంజసమైన రుసుము చెల్లించవలసి ఉంది;

(viii) అతను కోరిన సమాచారం PIO / CPIO చే నాశనం చేయబడింది.

ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 18 కేంద్ర సమాచార కమిషన్ లేదా రాష్ట్రానికి ఆజ్ఞాపించింది సమాచార కమిషన్, ఒక కేసు నుండి, ఫిర్యాదును స్వీకరించడానికి మరియు విచారించడానికి ఏదైనా వ్యక్తి, -

(ఎ) సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కు అభ్యర్థనను సమర్పించలేక పోయిన వారు, లేదా కేసులో స్టేట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కావచ్చు, అలాంటి అధికారి ఎవరూ లేరు ఈ చట్టం క్రింద నియమించబడింది లేదా సెంట్రల్ అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ లేదా స్టేట్ అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, కేసు వలె, నిరాకరించారు ఫార్వార్డ్ కోసం ఈ చట్టం క్రింద సమాచారం లేదా అప్పీల్ కోసం అతని లేదా ఆమె దరఖాస్తును అంగీకరించండి సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ లేదా స్టేట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ లేదా సెనియోకు అదేకమిషన్.-15-__(i) సంబంధిత పబ్లిక్ అథారిటీ చేత CPIO / PIO నియమించబడలేదు;

(ii) అతను కోరుకున్న సమాచారాన్ని అందించడానికి CPIO / PIO కి ఒక అభ్యర్థనను సమర్పించలేకపోయాడు అతనిచే;

(iii) అతని దరఖాస్తును అంగీకరించడానికి CPIO / PIO నిరాకరించింది;

(iv) అతనికి అందించిన సమాచారం సరిపోదు లేదా తప్పుడు లేదా తప్పుదోవ పట్టించేది;

(v) అతనికి సమాచారం ఇవ్వబడలేదు;

(vi) ఇందులో సూచించిన చట్టబద్ధమైన సమయం లోపల సమాచారం అతనికి అందించబడలేదు సంబంధించి;

(vii) అతను అసమంజసమైన రుసుము చెల్లించవలసి ఉంది;

(viii) అతను కోరిన సమాచారం PIO / CPIO చే నాశనం చేయబడింది.

ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 18 కేంద్ర సమాచార కమిషన్ లేదా రాష్ట్రానికి ఆజ్ఞాపించింది సమాచార కమిషన్, ఒక కేసు నుండి, ఫిర్యాదును స్వీకరించడానికి మరియు విచారించడానికి ఏదైనా  వ్యక్తి, -

(ఎ) సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కు అభ్యర్థనను సమర్పించలేక పోయిన వారు, లేదా కేసులో స్టేట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కావచ్చు, అలాంటి అధికారి ఎవరూ లేరు ఈ చట్టం క్రింద నియమించబడింది లేదా సెంట్రల్ అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ఆఫీసర్ లేదా స్టేట్ అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, కేసు వలె, నిరాకరించారు ఫార్వార్డ్ కోసం ఈ చట్టం క్రింద సమాచారం లేదా అప్పీల్ కోసం అతని లేదా ఆమె దరఖాస్తును అంగీకరించండి  సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ లేదా స్టేట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ లేదా సీనియర్ ఉప విభాగంలో పేర్కొన్న అధికారి (సెక్షన్ 19 లోని 10 లేదా కేంద్ర సమాచార కమిషన్ లేదా

రాష్ట్ర సమాచార కమిషన్, ఒకవేళ; (బి) ఈ చట్టం క్రింద అభ్యర్థించిన ఏ సమాచారానికి ప్రాప్యత  నిరాకరించబడింది;

(సి) సమాచారం లేదా ప్రాప్యత కోసం చేసిన అభ్యర్థనకు ఎవరు ప్రతిస్పందన ఇవ్వలేదు ఈ చట్టం క్రింద పేర్కొన్న సమయ పరిమితుల్లో సమాచారం;

(డి) అసమంజసమైనదిగా భావించే రుసుమును ఎవరు చెల్లించాలి;(ఇ) తనకు లేదా ఆమెకు అసంపూర్ణమైన, తప్పుదోవ పట్టించే లేదా తప్పుడు సమాచారం ఇవ్వబడిందని ఎవరు నమ్ముతారు

ఈ చట్టం క్రింద; మరియు  (ఎఫ్) రికార్డులను యాక్సెస్ చేయడానికి లేదా పొందటానికి సంబంధించిన ఇతర విషయాలకు సంబంధించి ఈ చట్టం క్రింద.సెక్షన్ 18 లోని సబ్ సెక్షన్ (6) కేంద్ర సమాచార కమిషన్ లేదా రాష్ట్రానికి అధికారం ఇస్తుంది సమాచార కమిషన్ కేసులో ఉండవచ్చు, ఇతరత్రా ప్రజా అధికారులు అవసరం  ఫిర్యాదుదారునికి నష్టం లేదా ఇతర నష్టాలకు పరిహారం చెల్లించటానికి సంబంధించినది.

-9-(1) లోని సెక్షన్ 19 మొదటి అప్పీలేట్ అథారిటీకి అప్పీల్ చేయడానికి a

ఉప విభాగం (1) లో నిర్దేశించిన సమయానికి నిర్ణయం తీసుకోని వ్యక్తి లేదా

సెక్షన్ 7 లోని సబ్ సెక్షన్ (3) లోని క్లాజ్ (ఎ) లేదా నిర్ణయం నుండి ఎవరు బాధపడతారు CPIO లేదా PIO కేసు కావచ్చు. సెక్షన్ 19 లోని సబ్ సెక్షన్ (3) కింద రెండవ అప్పీల్ పైన పేర్కొన్న చట్టం కేంద్ర సమాచార కమిషన్ లేదా రాష్ట్రానికి అందించబడుతుంది సమాచార కమిషన్ కేసు కావచ్చు.

ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 20, కేంద్రంలో జరిమానా విధించటానికి వీలు కల్పిస్తుంది సమాచార కమిషన్ లేదా రాష్ట్ర సమాచార కమిషన్, ఫిర్యాదును నిర్ణయించేటప్పుడు సెక్షన్ 18 కింద చేసిన లేదా సెక్షన్ -19 కింద ఇష్టపడే అప్పీల్ అభిప్రాయం CPIO / PIO, సహేతుకమైన కారణం లేకుండా, ఒక దరఖాస్తును స్వీకరించడానికి నిరాకరించింది

సమాచారం, లేదా నిర్ణీత సమయానికి సమాచారం ఇవ్వలేదు లేదా కలిగి లేదు అటువంటి అభ్యర్థనను తప్పుగా తిరస్కరించారు లేదా తప్పు, అసంపూర్ణమైన లేదా తప్పుదోవ పట్టించే సమాచారం ఇవ్వండి

లేదా అతను సమాచారాన్ని నాశనం చేశాడు, అది అతనికి లేదా అతనికి చేసిన అభ్యర్థనకు సంబంధించినది కావలసిన సమాచారాన్ని ఇవ్వడంలో అడ్డుపడింది. పైన పేర్కొన్న ఉప-సెక్షన్ (2) కిందవిభాగం, కేంద్ర సమాచార కమిషన్ లేదా రాష్ట్ర సమాచార కమిషన్ కేసు కావచ్చు, అటువంటి CPIO / PIO పై క్రమశిక్షణా చర్యను కూడా సిఫార్సు చేయవచ్చు.

15. అందువల్ల ఆర్టీఐ చట్టం పూర్తి కోడ్ అని చూడవచ్చు, ఇది ఒక

ఏదైనా నిర్ణయం / నిష్క్రియాత్మకత / చర్య / నుండి బాధపడుతున్న వ్యక్తికి తగిన మరియు సమర్థవంతమైన పరిహారం CPIO / PIO యొక్క మినహాయింపు లేదా దుష్ప్రవర్తన. ఈ చట్టం రెండు విజ్ఞప్తులను అందించడమే కాదు, అది కూడా కేంద్ర సమాచార కమిషన్ లేదా రాష్ట్ర సమాచారానికి ఫిర్యాదు కోసం అందిస్తుంది  కమిషన్, ఒకవేళ, CPIO / PIO తన నిర్ణయాన్ని ఇవ్వని సందర్భంలో,  దరఖాస్తు, నిర్ణీత సమయంలో. ఒక వ్యక్తి ఇంకా బాధపడుతుంటే, అతను సంప్రదించవచ్చు

రిట్ పిటిషన్ ద్వారా హైకోర్టుకు సంబంధించినది. వాస్తవానికి, అనేక రిట్ పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి కేంద్ర సమాచార కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా హైకోర్టులు.

16. ఒక శాసనం ద్వారా హక్కును సృష్టించినప్పుడు అది అందించే చట్టపరమైన ప్రతిపాదన పరిష్కరించబడింది చెప్పిన హక్కును అమలు చేయడానికి తగిన మరియు సంతృప్తికరమైన ప్రత్యామ్నాయ నివారణ కోసం, ది అటువంటి హక్కును అమలు చేయాలనుకునే వ్యక్తి తప్పనిసరిగా పరిష్కార యంత్రాంగాన్ని ఆశ్రయించాలి

చెప్పిన హక్కు సృష్టించబడిన చట్టంలో మరియు సివిల్ కోర్టును సంప్రదించలేము అటువంటి హక్కు అమలు. వాస్తవానికి, సివిల్ కోర్టు యొక్క అధికార పరిధి ఒక కేసులో మినహాయించబడదు

ఇక్కడ చట్టం యొక్క నిబంధనలు పాటించబడవు లేదా దీనికి విరుద్ధంగా ఉత్తర్వు ఇవ్వబడుతుంది న్యాయ ప్రక్రియ యొక్క ప్రాథమిక సూత్రాలు.

17. ఉద్దేశం తెలుసుకోవడానికి పరీక్ష అవసరం అవుతుంది మరియు విచారణ ఫలితం కావచ్చు నిర్ణయాత్మక. తరువాతి సందర్భంలో, శాసనం ప్రత్యేక హక్కును లేదా బాధ్యతను సృష్టిస్తుందో లేదో చూడటం అవసరం

మరియు దాని సంకల్పం కోసం అందిస్తుంది మరియు చెప్పిన హక్కు గురించి అన్ని ప్రశ్నలు లేదా అలా ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్స్ మరియు సాధారణంగా నివారణలు అనేవి బాధ్యత నిర్ణయించబడతాయి సివిల్ కోర్టులలో చర్యలతో సంబంధం కలిగి ఉంటుంది. (సి) సివిల్ కోర్టు యొక్క అధికార పరిధిని మినహాయించడం తప్ప er హించలేము

పైన పేర్కొన్న షరతులు వర్తిస్తాయి

18. మా అభిప్రాయం ప్రకారం, పైన పేర్కొన్న చట్టపరమైన సూత్రాలను మినహాయించటానికి సంబంధించి సివిల్ కోర్ట్ యొక్క అధికార పరిధి వినియోగదారుల ఫోరం వంటి ఇతర ఫోరమ్లకు సమానంగా వర్తిస్తుంది. కు వినియోగదారుల ఫోరమ్ను అనుమతించండి, సివిల్ కోర్టు జోక్యాన్ని మినహాయించి జోక్యం చేసుకోవడానికి ప్రత్యేక శాసనం ద్వారా సృష్టించబడిన హక్కును అమలు చేసే విషయం, ఇది కూడా సమర్థవంతంగా అందిస్తుంది అటువంటి హక్కును అమలు చేయడానికి పరిహారం, వెనుక ఉన్న ప్రయోజనాన్ని ఓడించటానికి దారితీస్తుంది

అటువంటి అమలు కోసం ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని అందించడం మరియు సివిల్ యొక్క అధికార పరిధిని తొలగించడం

కోర్టు. మా దృష్టిలో ఇది వినియోగదారుల ఫోరమ్ను అనుమతించే శాసన ఉద్దేశం కాదు జోక్యం చేసుకోండి, చట్టబద్ధమైన హక్కును అమలు చేయడానికి ప్రత్యేక యంత్రాంగాన్ని అందిస్తున్నప్పుడు

చట్టం, మరియు సివిల్ కోర్టు యొక్క అధికార పరిధిని తొలగించడం. అలాంటి ఇతర ఫోరమ్ల అధికార పరిధిఅందువల్ల విషయాలు తప్పనిసరిగా చిక్కుకోవడం ద్వారా నిరోధించబడతాయి.

19. ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 23, ఇది కొన్ని విషయాలలో జోక్యం చేసుకోవడానికి కోర్టుల అధికార పరిధిని నిషేధిస్తుంది

కింద: "న్యాయస్థానాల అధికార పరిధి - ఏ న్యాయస్థానం ఎటువంటి దావా, దరఖాస్తు లేదా ఈ చట్టం క్రింద చేసిన ఏదైనా ఉత్తర్వులకు సంబంధించి ఇతర చర్యలు మరియు అలాంటి ఉత్తర్వులు ఉండకూడదు

ఈ చట్టం క్రింద అప్పీల్ ద్వారా కాకుండా ప్రశ్నార్థకం.

20. ఆర్టీఐ చట్టం కింద ఒక దరఖాస్తుదారు ఆమోదించిన ఉత్తర్వుల నుండి ఎంతవరకు బాధపడతారు ఆర్టీఐ చట్టం ప్రకారం అప్పీలేట్ అధికారులు అతను వినియోగదారుడు అని చెప్పలేము వారిచే విడుదల చేయబడింది. జారీ చేసిన ఉత్తర్వుల యొక్క ఖచ్చితత్వాన్ని పరిశీలించడం వారి పని

CPIO / PIO లేదా ఒక నిర్దిష్ట CPIO / PIO ఒక దరఖాస్తును అంగీకరించడానికి నిరాకరించిందో లేదో నిర్ణయించడం

సమాచారం కోరడం; అవసరమైన సమాచారాన్ని అందించడంలో విఫలమైంది, అసమంజసమైనదిగా కోరింది రుసుము లేదా దరఖాస్తుదారు కోరిన సమాచారాన్ని నాశనం చేసింది. వారు స్వయంగా ఉండరు సమాచారాన్ని సరఫరా చేసే బాధ్యత, వారు దరఖాస్తుదారునికి దాని సరఫరాను నిర్దేశిస్తారు. వాళ్ళు ప్రధానంగా చట్టం ప్రకారం వారికి కేటాయించిన జ్యుడిషియల్ / క్వాసి జ్యుడిషియల్ ఫంక్షన్లను విడుదల చేయండి. ఉంటే ఆర్టిఐ చట్టం, దాని అధికార పరిధిలోని సెక్షన్ 23 యొక్క ప్రయోజనం కోసం వినియోగదారుల వేదికలను ‘కోర్టు’ గా ఉంచారు

ఫిర్యాదుదారుడు కింద జారీ చేసిన ఉత్తర్వులను ప్రశ్నించడానికి ప్రయత్నిస్తే స్పష్టంగా నిరోధించబడుతుంది

ఆర్టీఐ చట్టం యొక్క నిబంధనలు. 21. ఫిర్యాదుల వివాదం ఏమిటంటే, వినియోగదారుల ఫోరం కోర్టు కాదు గౌరవనీయమైన సుప్రీంకోర్టుతో పాటు ఈ కమిషన్ కూడా అనేక నిర్ణయాలు తీసుకుంటుంది. వారు ఉన్నారు

ముఖ్యంగా కర్ణాటక Vs. విశ్వభారతి హౌస్ బిల్డింగ్ కోఆపరేటివ్

సొసైటీ & ఆర్స్. (2003) 2 SCC 412; కర్ణాటక పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ & అన్. Vs. అశోక్ ఐరన్ వర్క్స్ ప్రైవేట్. లిమిటెడ్ (2009) 3 ఎస్సిసి 240; లక్ష్మి ఇంజనీరింగ్ వర్క్స్ Vs. పి.ఎస్.జి. పారిశ్రామిక

ఇన్స్టిట్యూట్ (1995) 3 ఎస్.సి.సి 583 మరియు కార్యదర్శి, తిరుమురుగన్ కోఆపరేటివ్ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీ Vs. ఎల్.ఆర్ & ఆర్స్ ద్వారా ఎం. లలిత (డెడ్). (2004) 1 SCC 305. ప్రతివాదులు, per

దీనికి విరుద్ధంగా, పటేల్ రోడ్వేస్ లిమిటెడ్పై ఆధారపడండి. Vs. బిర్లా యమహా లిమిటెడ్, 2000 (4) ఎస్సిసి 91; జనరల్

-11- మేనేజర్, టెలికాం Vs. M. కృష్ణన్ & అన్., 2009 (8) SCC 481; ట్రాన్స్ ఎండిటరేనియన్ ఎయిర్వేస్ Vs. యూనివర్సల్ ఎక్స్పోర్ట్స్ & అన్., 2011 (10) ఎస్సిసి 316; S.P. గోయెల్ Vs. స్టాంపుల కలెక్టర్, Delhi ిల్లీ,

1996 (1) ఎస్సిసి 573; బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు Vs. సురేష్ ప్రసాద్ సిన్హా, 2009 (8) ఎస్.సి.సి. 483. లక్ష్మి ఇంజనీరిగ్ వర్క్స్ (సుప్రా) లో గౌరవనీయమైన సుప్రీంకోర్టు ప్రధానంగా ఆందోళన చెందింది

చట్టం యొక్క సెక్షన్ 2 (1) (డి) లో ఉపయోగించిన ‘వాణిజ్య ప్రయోజనం’ అనే వ్యక్తీకరణ యొక్క వివరణతో మరియు పైన పేర్కొన్న సందర్భంలో, తీర్పు యొక్క 10 వ పేరాలో ఇది గమనించబడింది ఈ చట్టం ద్వారా సృష్టించబడిన పాక్షిక-న్యాయసంస్థలు / అధికారులు / ఏజెన్సీలు కోర్టులు కావు సివిల్ కోర్టు యొక్క కొన్ని అధికారాలు. అవి పాక్షిక-జ్యుడిషియల్ ట్రిబ్యునల్స్ అని మరింత గమనించబడింది వినియోగదారులకు చవకైన మరియు వేగవంతమైన నివారణలను అందించడానికి ఉనికిలోకి తెచ్చిందిఇప్పటికే ఉన్న న్యాయ వ్యవస్థను భర్తీ చేయకూడదు మరియు భర్తీ చేయకూడదు, ఈ ఆలోచన అందించాలి మధ్య తలెత్తే వివాదాల చవకైన మరియు వేగవంతమైన పరిష్కారాన్ని అందించే అదనపు ఫోరం

వస్తువులు మరియు సేవల వినియోగదారులు మరియు సరఫరాదారులు. కర్ణాటక విద్యుత్ ప్రసారంలో కార్పొరేషన్ (సుప్రా) అపెక్స్ కోర్ట్ ఇంటర్ ఎలియా ప్రకారం విద్యుత్ ద్వారా విద్యుత్ సరఫరా వినియోగదారునికి బోర్డు అనేది వినియోగదారు యొక్క సెక్షన్ 2 (1) (ఓ) యొక్క అర్ధంలో ఉన్న సే రక్షణ చట్టం, 1986 మరియు అంగీకరించిన విధంగా సప్లై సకాలంలో అందించకపోతే అక్కడ

సేవలో లోపానికి ఒక సందర్భం కావచ్చు. తీర్పు యొక్క 17 వ పేరాలో ఇది మరింత గమనించబడింది మినహాయింపుకు సంబంధించి చట్టం యొక్క క్రింది ప్రతిపాదనలు o ఈ పరిస్థితిలో, రిజిస్ట్రేషన్ కోసం ఒక పత్రాన్ని సమర్పించిన వ్యక్తి మరియు   దానిపై స్టాంప్ డ్యూటీని లేదా రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లిస్తుంది, వినియోగదారుగా మారదు లేదా చేయదు  రెండు చట్టాల నిబంధనలను అమలు చేయడానికి నియమించబడిన అధికారులు ఏదైనా సేవను అందిస్తారు వినియోగదారుల రక్షణ చట్టం యొక్క అర్థం. వారు తమ చట్టబద్ధమైన విధులను మాత్రమే నిర్వహిస్తారు (కొన్ని

వీటిలో, ముందుగా సూచించినట్లుగా, పెంచడానికి న్యాయవ్యవస్థ లేదా, కనీసం, పాక్షిక-న్యాయ స్వభావం) మరియు రాష్ట్ర సార్వభౌమ శక్తిలో భాగమైన రాష్ట్ర ఆదాయాన్ని సేకరించండి. ” అపెక్స్ కోర్టు ముందు ఉన్న అప్పీలు లక్నోలో తన మునుపటి నిర్ణయంపై ఆధారపడ్డారుఅభివృద్ధి అథారిటీ Vs. M.K. గుప్తా 1994 (1) ఎస్.సి.సి 243 తన వాదనకు మద్దతుగా వినియోగదారుల రక్షణ చట్టం యొక్క అర్ధంలో వినియోగదారు. చెప్పిన వివాదం, ఏదేమైనా, గౌరవనీయమైన సుప్రీంకోర్టు తిరస్కరించింది, ఈ నిబంధనలను గమనించింది లక్నో డెవలప్మెంట్ అథారిటీలో రిజిస్ట్రేషన్ యాక్ట్ యాడ్ స్టాంప్ యాక్ట్ దీనిని గమనించలేదు (సుప్రా), ఎందుకంటే ఈ విషయం యొక్క ఈ అంశం ఇందులో పాల్గొనలేదు.పటేల్ రోడ్వేస్లో (సుప్రా) క్యారియర్ల సెక్షన్ 9 లో ఉపయోగించిన సూట్ అనే పదాన్ని వివరించేటప్పుడుచట్టం, అపెక్స్ కోర్ట్ ఇంటర్ ఎలియా కింద జరిగింది:"పై నుండి" సూట్ "అనే పదం దానిలో తీసుకునే సాధారణ పదం అని స్పష్టమవుతుందిఅతని క్రింద ఉన్న హక్కును గ్రహించడం కోసం పార్టీ ప్రారంభించిన అన్ని చర్యలను స్వీప్ చేయండి

చట్టం. ‘సూట్’ అనే పదం యొక్క అర్ధం దాని వినియోగదారు యొక్క సందర్భం మీద కూడా ఆధారపడి ఉంటుంది, ఇతర విషయాలతోపాటు, చట్టం లేదా అది ఉపయోగించిన నియమం మీద ఆధారపడి ఉంటుంది. ఎటువంటి సందేహం లేదు  జాతీయ కమిషన్ ముందు విచారణ సాధారణంగా సారాంశం మరియు ఒక పార్టీలు లేవనెత్తిన సమస్యలు చాలా ఉన్నాయని కమిషన్ భావిస్తున్న సందర్భం సారాంశ విచారణలో నిర్ణయించటానికి వివాదాస్పదమైనది, ఇది పార్టీలను సివిల్కు సూచిస్తుంది  కోర్టు. కమిషన్ ముందు కొనసాగాలని నిర్ణయించమని కాదు కొనసాగింపులో క్యారియర్స్ చట్టం (సెక్షన్ 9) యొక్క ఎక్స్ప్రెస్ చట్టబద్ధమైన నిబంధనలను విస్మరిస్తుంది చెప్పిన చట్టంలో నిర్వచించిన విధంగా సాధారణ క్యారియర్కు వ్యతిరేకంగా దావా వేయబడుతుంది. అంగీకరిస్తోంది అటువంటి వివాదం వినియోగదారుల రక్షణ కోసం వస్తువు మరియు ప్రయోజనాన్ని ఓడిస్తుంది చట్టం అమలులోకి వచ్చింది. మా పరిగణించబడిన దృష్టిలో, నేషనల్ కమిషన్ ముందు కొనసాగింపు "సూట్" అనే పదం వస్తుంది. దీని ప్రకారం, శ్రీ అశోక్ లేవనెత్తిన వివాదాన్ని మేము తిరస్కరించాముఈ విషయంలో దేశాయ్. ” ట్రాన్స్ మెడిటరేనియన్ ఎయిర్వేస్ (సుప్రా) లో దీనిని గౌరవనీయమైన సుప్రీంకోర్టు వాదించింది నేషనల్ కమీషన్ 1972 క్యారేజ్ బై ఎయిర్ యాక్ట్ యొక్క అర్ధంలో ఉన్న కోర్టు కాదు. దిఫెయిర్ ఎయిర్ ఇంజనీర్లలో తన నిర్ణయంతో సహా పలు మునుపటి నిర్ణయాలను అపెక్స్ కోర్ట్ పరిగణించిందిప్రై. లిమిటెడ్ (సుప్రా), తిరుమురుగన్ కోఆపరేటివ్ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీ (సుప్రా) మరియు పటేల్రోడ్ వేస్ (సుప్రా), లక్ష్మి ఇంజనీరింగ్ వర్క్స్ (సుప్రా), విశ్వభారతి హౌస్ బిల్డింగ్ సొసైటీ (సుప్రా) మరియు యూనియన్ ఆఫ్ ఇండియాలో రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయంపై ఆధారపడటం Vs. మద్రాస్ బార్ అసోసియేషన్, 2010 (11) SCC 1, మరియు కింద జరిగింది:

CA చట్టం యొక్క రెండవ షెడ్యూల్ యొక్క రూల్ 29 లోని “కోర్టు” అనే పదాన్ని ఉపయోగించడం వార్సా కన్వెన్షన్ నుండి తీసుకోబడింది. "కోర్టు" అనే పదం మన అభిప్రాయం మా విధానంలో ఉన్నట్లుగా కన్వెన్షన్లో కఠినమైన అర్థంలో ఉపయోగించబడలేదు చట్టం. "కోర్టు" అనే పదాన్ని వివాదాన్ని తీర్పు చెప్పే శరీరం అని అర్ధం  సిపి చట్టం యొక్క నిబంధనల ప్రకారం తలెత్తుతుంది. సిపి చట్టం రాష్ట్ర జిల్లా ఫోరమ్లను ఇస్తుంది

-13-ఫోరమ్లు మరియు నేషనల్ కమిషన్ వినియోగదారుల వివాదాలను నిర్ణయించే అధికారం. ది అధికార పరిధి, ఈ ఫోరమ్ల యొక్క శక్తి మరియు విధానం అన్నీ స్పష్టంగా లెక్కించబడతాయి సిపి చట్టం. అయినప్పటికీ, ఈ ఫోరమ్లు సారాంశ విధానాన్ని అనుసరించిన తర్వాత వాటిని నిర్ణయిస్తాయి ప్రధాన వివాదం వివాదాలను నిర్ణయించడం ఇంకా ఉంది, ఇది కోర్టు యొక్క ప్రధాన విధి మరియు ఉద్దేశ్యం. CA చట్టం మరియు వార్సా సమావేశం యొక్క ప్రయోజనం కోసం, ది  వినియోగదారుల ఫోరమ్లు “కోర్టు” అనే వ్యక్తీకరణ యొక్క అర్ధంలోకి వస్తాయి. ఎం. కృష్ణన్ (సుప్రా) లో, ఫిర్యాదుదారుడు తన టెలిఫోన్ డిస్కనెక్ట్ చేయకుండా బాధపడ్డాడు బిల్లు చెల్లించనందున మరియు దిశను కోరుతూ వినియోగదారుల ఫోరమ్ను సంప్రదించింది పరిహారంతో పాటు దాని పున onn సంయోగం. ఇది ఎప్పుడు అని గౌరవనీయమైన సుప్రీంకోర్టు నిర్వహించింద లో వివాదాలకు సంబంధించి టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 7 బిలో ప్రత్యేక పరిష్కారం ఉంది టెలిఫోన్ బిల్లుల గౌరవం, అప్పుడు వినియోగదారుల రక్షణ చట్టం క్రింద ఉన్న పరిష్కారం చిక్కులు

నిరోధించబడింది. తిరువల్లూవర్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో ఇంతకుముందు తీసుకున్న నిర్ణయంపై రిలయన్స్ను ఉంచారు

Vs. కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్, (1995) 2 SCC 479. తిరువల్లూవర్ రవాణాలో కార్పొరేషన్ (సుప్రా) గౌరవ సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధిలో

మోటారు ప్రమాద కేసులలో వినియోగదారు ఫోరమ్ క్రింద గమనించబడింది: “6. అప్పుడు పరిశీలన కోసం తలెత్తే ప్రశ్న జాతీయమా అనేది క్లెయిమ్ దరఖాస్తు మరియు అవార్డు పరిహారాన్ని పొందటానికి కమిషన్ అధికార పరిధిని కలిగి ఉంది శ్రీ కె. కుమార్ మరణంతో సంబంధం ఉన్న ప్రమాదానికి సంబంధించి   మోటారు వాహనం. సందేహాస్పద ప్రాంతానికి ఏర్పాటు చేసిన క్లెయిమ్స్ ట్రిబ్యునల్ స్పష్టంగా ఉంది ఖాతాలో ఏదైనా నష్టం లేదా ఇతర హానిని ఎదుర్కొన్న సమాచార అన్వేషకునికి పరిహారం దాని CPIO / PIO యొక్క చర్యలు, లోపాలు లేదా నిష్క్రియాత్మకత. అందువలన, పరిహారం

ఆర్టీఐ చట్టం క్రింద అందించబడిన యంత్రాంగం ఏ విధంగానైనా తక్కువ ప్రభావవంతంగా ఉంటుందని చెప్పలేము వినియోగదారు ఫోరమ్ ముందు అందుబాటులో ఉన్న పరిహారం. 23. అమలు కోసం ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని అందించడం వెనుక ఉన్న శాసన ఉద్దేశాన్ని పరిశీలిస్తే

ఆర్టీఐ చట్టం ద్వారా ఇవ్వబడిన హక్కులు, వినియోగదారుల వేదిక ‘న్యాయస్థానాలు’ అని మేము అభిప్రాయపడుతున్నాము

ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 23 యొక్క ప్రయోజనం. ఏదైనా ఇతర వివరణ రెండు సమాంతర యంత్రాలను తెరుస్తుంది, ప్రత్యేక శాసనం ద్వారా సృష్టించబడిన అదే హక్కుల అమలు కోసం, అది ఉండకూడదుశాసన ఉద్దేశం, ముఖ్యంగా ఆర్టీఐ చట్టం వినియోగదారుల రక్షణ చట్టానికి ప్రత్యేక చట్టం అయినప్పుడు. ఆర్టీఐ చట్టం యొక్క లక్ష్యం ఒక సేవకు పరిమితం చేయబడింది, అనగా సమాచార సరఫరా, అయితే వినియోగదారుడు రక్షణ చట్టం పరిశీలన కోసం అందించబడిన అనేక రకాల సేవల్లోని లోపాలతో వ్యవహరిస్తుంది. 24. సివిల్ కోర్టు యొక్క అధికార పరిధిని తొలగించడం వెనుక ఉద్దేశ్యం a యొక్క ఆహ్వానాన్ని మినహాయించడం ప్రత్యేక చట్టం క్రింద అందించినవి కాకుండా ఇతర పరిష్కార విధానం. పైన పేర్కొన్న వస్తువు కట్టుబడి ఉంటుంది కన్స్యూమర్ ఫోరం యొక్క అధికార పరిధిని తొలగిస్తున్నప్పుడు ఇది విసుగు చెందదు

ప్రత్యేక చట్టం క్రింద అందించబడిన విధానం అనుమతించబడుతుంది.

25. ఇక్కడ పేర్కొన్న కారణాల వల్ల, (i) కింద సమాచారం కోరే వ్యక్తి

ఆర్టీఐ చట్టం యొక్క నిబంధనలు సంబంధిత పబ్లిక్ అథారిటీకి చెందిన వినియోగదారు అని చెప్పలేము CPIO / PIO దీనిచే నామినేట్ చేయబడింది మరియు (ii) జోక్యం చేసుకోవడానికి వినియోగదారుల వేదిక యొక్క అధికార పరిధి ఆర్టీఐ చట్టం యొక్క నిబంధనల నుండి ఉత్పన్నమయ్యే విషయాలు అవసరమైన చిక్కులతో కూడా నిరోధించబడతాయి చెప్పిన చట్టంలోని సెక్షన్ 23 లోని నిబంధనల ప్రకారం. పర్యవసానంగా ఒక వ్యక్తి ఫిర్యాదు చేయలేదు  CPIO / PIO అందించే సేవల్లో లోపం వినియోగదారు ముందు నిర్వహించదగినది ఫోరం. 2012 యొక్క పునర్విమర్శ పిటిషన్ నెం .2028 మరియు 2013 యొక్క పునర్విమర్శ పిటిషన్ నెం .362, అందువల్ల, అనుమతించబడినది మరియు చెప్పిన పునర్విమర్శ పిటిషన్ల యొక్క ఫిర్యాదుల విషయం కొట్టివేయబడుతుంది. 2014 యొక్క వినియోగదారు ఫిర్యాదు నెం .66 కూడా దీని ద్వారా కొట్టివేయబడింది. 2012 యొక్క పునర్విమర్శ పిటిషన్ నెం .3146, 2012 యొక్క పునర్విమర్శ పిటిషన్ నెం .2806 మరియు 2012 యొక్క మొదటి అప్పీల్ నెం .275 కొట్టివేయబడ్డాయి.

Diabetics

 *Diabetics  - తప్పని సరిగా ఇది చదవండి* . మీకు చాలా ఉపయోగం . 

మీకు Diabetes  లేక పోతే, మీకు తెలిసి *అది ఉన్న వారికి పంపండి* . వారికి ఉపయోగం ! 😊


ఇంగ్లాండు లో ఒక పరిశోధన నిర్వహించారు . 

 *Walking Experiment on Diabetes ఫలితాలు* : 


రోజుకు ఒక అర గంట, లేక 45 నిముషాలు వాకింగ్ ( పొద్దున్న కానీ , సాయంత్రం కానీ , వారి వారి వీలును బట్టి ) *ఏకబిగిన* నడిచే వారికంటే, పొద్దున్న ఒక 5 నుంచి 10 నిముషాలూ, మధ్యాన్నం లంచ్ తరువాత 10 నిముషాలూ, రాత్రి డిన్నర్ తరువాత ఒక 10 నిముషాలూ , అలా మొత్తం రోజులో మొత్తం మీద అరగంట వాకింగ్ చేయడం వల్ల రక్తం లో సుగర్ నిల్వలు బాగా తగ్గుతాయి అని తేలింది ! 

 

అలా *తిన్న  5 నిముషాల లోపు* లేచి , 5-10 నిముషాలు వాకింగ్ చేసిన వారి రక్తం లో Sugar నిలవలు 11% నుంచి 44% శాతం వరకు తగ్గినట్లు వారు నిర్వహించిన Blood Test లలో తేలింది ! 


కాబట్టి, Diabetics  వరకు , ఎంత సేపు వాకింగ్ చేశారు , ఎంత దూరం నడిచారు ? అనే దానికంటే , *టైమింగ్ , అనగా ఎప్పుడు నడిచారు* ? అనే దానికి ప్రాధాన్యత ఉన్నట్లు తేలింది ! 


ఈ పరిశోధన ,  ఇంగ్లాండ్ లో 23 దఫాలు గా నిర్వహించారు . ఇందులో పెద్ద సంఖ్య లో, అనగా *12 లక్షల మంది డయాబెటిస్ ఉన్నవారు  వాలంటీర్స్ గా* సహకరించారు .  ఈ పరిశోధన 40 రోజుల పాటు సాగింది . 

వారు వాడే Medicines Dosage లలో ఏమీ మార్పు లేదు .


ఇందులో సగం  మంది ని, రోజు కు ఏకబిగిన 45 నిముషాలు నడవ మన్నారు . మిగతా సగం మందిని 3 పూటలా , తిన్న వెంటనే ( *తిన్న 5 నిముషాల లోపే , లేచి* ) 10 నిముషాలు నడవమన్నారు . 

40 రోజుల తరువాత 2 గ్రూపు లకీ Blood Test లు చేశారు 


దానిలో ఈ సత్ఫలితాలు వెల్లడి అయ్యాయి . ముఖ్యం గా, రాత్రి Dinner తరువాత 10 నిముషాలు నడిచిన వారి లో Sugar శాతం 22% తగ్గిందని వెల్లడి అయింది . 


Sugar ఉన్నవారు  , స్త్రీలైనా , పురుషులైనా , మొత్తం మీద వారానికి 150 నిముషాలు యావరేజి న వాకింగ్ చెయ్య వలసిందే అని ఏకగ్రీవం గా వెల్లడి అయింది . 

*Action point* : 

తిన్న వెంటనే TV చూస్తూ కూర్చోకండి.  లేచి , *మీ ఇంటి గదుల్లో నే  అయినా సరే , గడియారం చూసుకుని 10 నిముషాలు నడవండి* .  3 పూటలా చేయండి.  40 రోజుల తరువాత  blood test చేయించుకోండి. 

              👍👍 👍👍.

S.498-A IPC. (2019(4) Criminal Court Cases 233 (Bombay)

 Cruelty - Mere demand of money or property, unaccompanied by any harassment does not fall within mischief of S.498-A IPC. (2019(4) Criminal Court Cases 233 (Bombay)


Dishonour of cheque - Notice - Omission or error in mentioning nature of debt or liability in notice does not render notice invalid. (2019(3) Civil Court Cases 403 (Kerala)


DNA test during investigation - Not permissible without carrying out substantial investigation. (2019(4) Criminal Court Cases 133 (S.C.)


Expert opinion - Comparison of signatures with signatures which were subsequent to the filing of suit except one signature - Casts a serious doubt on the reliability of entire report - Report discarded on this ground alone. (2019(4) Civil Court Cases 079 (S.C.)


Investigation undertaken for non-cognizance offence and charge sheet filed under non-cognizance offences only - Charge sheet to be treated as a complaint. (2019(3) Criminal Court Cases 664 (Allahabad)


Maintenance to minor child - Earning mother - Mother should contribute towards the expenses of the child but expenses cannot be divided equally between the two. (2019(3) Criminal Court Cases 131 (Delhi)

ధ్రువోపాఖ్యానం

 సేకరణ 👇


కార్తీక శుద్ధ ద్వాదశి తిథినాడు దృవోపాఖ్యానం చదవడం లేదా వినడం ఎంతో అదృష్టం....


ధ్రువోపాఖ్యానం:


భాగవతంలో ద్రువోపాఖ్యానం అనే ఒక ఉపాఖ్యానం ఉంది. మీరు క్రతువు చేసేటప్పుడు ఒక పుణ్యదినం నాడు ఒక వ్రతం చేయమంటే మీ మనస్సు అక్కడ ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కొన్ని కోట్ల జన్మల తరువాత ఎప్పుడో ఎవడో ఒక్క మనుష్యుడు మాత్రమే ఈశ్వరుని అనుగ్రహం పొందిన వాడు మాత్రమే ద్వాదశినాడు ధ్రువోపాఖ్యానమును వింటున్నాడు. ద్వాదశినాడు ధ్రువోపాఖ్యానం వింటే ఎన్నో మంచి ఫలితములు వస్తాయి. ఎన్నో గ్రహములు ఉపశాంతి పొందుతాయి. ఎంతో మేలు జరుగుతుంది. మనిషి జీవితంలో ధ్రువుని వృత్తాంతమును వినాలి. అందునా భాగవతాంర్గతంగా వినడం అనేటటు వంటిది మరింత గొప్ప విషయం. అందునా ద్వాదశినాడు కానీ, పౌర్ణమి నాడు కానీ, అమావాస్య నాడు కానీ దినక్షయమునందు కానీ, అసురసంధ్యవేళ కానీ ద్రువచరిత్ర వింటే చాలా మంచిది. సుందరకాండ తెలియని వారు ఎలా ఉండరో అలా ధ్రువోపాఖ్యానం ప్రహ్లాదోపాఖ్యానం తెలియని వారు ఉండరు.


ధ్రువచరిత్ర ఒక ఆశ్చర్యకరమయిన సందర్భము. మైథున సృష్టి జరగడం కోసమని బ్రహ్మగారు తన శరీరంలోంచి ఒక స్త్రీ స్వరూపమును ఒక పురుష స్వరూపమును సృష్టి చేశారు. వారే స్వాయంభువమనువు, శతరూప. వారిద్దరిని సృష్టి చేయమని బ్రహ్మగారు ఆదేశించారు. వారికి ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే ముగ్గురు కుమార్తెలు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కుమారులు కలిగారు.


ఉత్తానపాదుడికి మొదటి భార్య సునీతి, రెండవ భార్య సురుచి. ఆ ఇద్దరు భార్యలతో చాలా సంతోషముగా ఉత్తానపాదుడు జీవితమును గడుపుచున్నాడు. ఉత్తాన పాదుడు అంటే పైకి కాళ్ళు ఉన్నవాడు. సునీతి ఎప్పుడూ నీతి చెపుతూ ఉంటుంది. సునీతికి ఒక కుమారుడు సురుచికి ఒక కుమారుడు కలిగారు. సునీతి కుమారుడు ధ్రువుడు. సురుచి కుమారుడు ఉత్తముడు. సాధారణంగా ఎవరికయినా జ్ఞానం పట్ల వైరాగ్యం పట్ల మమకారం ఎప్పుడు ఎప్పుడు కలుగుతుంది? అసలు భోగం అనుభవిస్తే వైరాగ్యం అనే మాట వస్తుంది. భోగమే అనుభవించని వాడికి వైరాగ్యం అనే మాటకు అర్థం లేదు. రాజు యిన ఉత్తాన పాదుడికి సురుచియందున్న ప్రేమ సునీతియందు లేదు. సునీతియందు లోపల గౌరవం ఉన్నా సురుచికి లొంగిపోయిన వాడవడం చేత సునీతిని గౌరవించలేడు. ఒకనాడు ఒక ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. ఒకనాడు అంతఃపురంలో ఉత్తానపాదుడు కూర్చుని ఉన్నాడు. పక్కన సురుచి నిలబడి వుంది. సురుచి కొడుకయిన ఉత్తముడు తండ్రి తొడమీద కూర్చున్నాడు. అపుడు సునీతి కొడుకయిన ధ్రువుడు పరుగుపరుగున వచ్చాడు. అతనికి కూడా తండ్రి తొడమీద కూర్చోవాలని కోరిక కలిగింది. తండ్రి ధ్రువుని తన తొడమీద ఎక్కించుకోలేదు. తండ్రికి కొడుకు మీద ప్రేమలేక కాదు. సురుచి ప్రక్కన ఉండడం వలన ధ్రువుని తన తొడమీదకి ఎక్కించుకోలేదు. ఒకసారి సురుచి వంక చూశాడు. అపుడు ఆవిడ ఒక గమ్మత్తయిన మాట అంది. “నీవు నిజంగా తండ్రి తొడమీద కూర్చునే అదృష్టం పొందిన వాడవయితే నా కడుపున పుట్టి ఉండేవాడివి. కాబట్టి నీకు ఆ భాగ్యం దక్కదు”. కేవలం ఆభిజాత్యముతో ఈమాట అంటోంది. సురుచి మరల అంది “నా కడుపున పుట్టడం అంటే మాటలు కాదు. నా కడుపున పుట్టాలి అంటే ఎంతో అదృష్టవంతుడవు అయి ఉండాలి. నా కడుపున పుట్టలేక పోయిన వాడు తండ్రి తొడమీద కూర్చోవాలంటే ఏమి చేయాలో తెలుసా? ఇంద్రియములకు లొంగని వాడయిన అధోక్షజుడయిన శ్రీమహావిష్ణువు పాదారవిన్దములను సంసేవనం చేయాలి. అపుడు ఆయన అనుగ్రహిస్తాడు.” అంది. నిజమునకు శ్రీమన్నారాయణుని అనుగ్రహం వున్నది కాబట్టి ధ్రువుడు సునీతియందు పుట్టాడు. ధ్రువుడు ఏడుస్తూ వెళ్ళిపోయాడు. అమ్మ వాడిని ఎందుకురా ఏడుస్తున్నావు’ అని అడిగింది. జరిగిన విషయం అంతఃపురకాంతలద్వారా తెలుసుకున్నది సునీతి. ఆవిడ కొడుకును చూసి ‘నాయనా, మీ నాన్న తొడ ఎక్కనివ్వలేదని ఏడుస్తున్నావు కదా! నువ్వు గత జన్మలలో చేసుకున్న పాపమే ఇవాళ నిన్ను ఏడిచేటట్లు చేసింది. నీ పినతల్లి కాని, నేను కాని, నీ తండ్రి కాని నీ బాధకు కారణం కాదు. నువ్వు చేసుకున్న పాపకర్మయే నీ దుఃఖమునకు కారణం. నిజంగా నీ తండ్రి తొడ ఎక్కి కూర్చోవాలన్న కోరిక నీకు వుంటే నీ తండ్రి మనస్సును మరల అలా మార్చగలవాడెవడో తెలుసా! అది నీఅంత నీకు సాధ్యం కాదు. ఈశ్వర పాదములు పట్టుకోవాలి. నీవు అరణ్యములకు వెళ్ళి శ్రీమన్నారాయణుని గూర్చి ధ్యానం చెయ్యి. ఆయన అనుగ్రహం కలిగిందంటే నీ తండ్రి అంకసీమ నీవు చేరగలుగుతావు’ అని చెప్పింది.


అపుడు పిల్లవాడయిన ధ్రువుడు ‘అమ్మా అయితే ఇప్పుడు నేను బయలుదేరతాను. శ్రీమన్నారాయణుడి గూర్చి తపస్సు చేస్తాను. ఆ స్వామి అనుగ్రహమును పొందుతాను’ అన్నాడు. ఇప్పుడు అక్కడికి లోకకళ్యాణము చేసే నారదమహర్షి వచ్చాడు. ‘నాయనా, నీవు ఎక్కడికి అలా వెడుతున్నావు?’ అని అడిగాడు. ‘నేను అడవికి వెళ్ళిపోతున్నాను. నారాయణుని గూర్చి తపస్సు చేస్తాను’ అన్నాడు ధ్రువుడు. అపుడు నారదుడు నవ్వి ‘నీకు నారాయణుని గురించి తపస్సు దేనికి? అని అడిగి ‘ఈ బుద్ధి నీకు నిలబడుగాక!’అని పరమ పావనమయిన తన చేతిని ఆ ధ్రువుని శిరస్సునందు ఉంచాడు. పిమ్మట నారదుడు ధ్రువుని ‘నారాయణుడు కనపడితే ఏమిచేస్తావు? అని అడిగాడు. అపుడు ధ్రువుడు ‘అన్నిటికన్నా చాలా పెద్ద పదవి కోరతాను’ అన్నాడు. ఏ పెద్ద పదవిని కోరతావు’ అని నారదుడు అడిగాడు. ‘ఏమో నన్ను అడగకండి. నాకు ఏ పెద్ద పదవి ఇవ్వాలో ఆయనకు తెలుసు. ముందు నేను ఆయనను చూడాలి. ఆయనతో మాట్లాడాలి. ఆయన ఇవ్వగలడని అమ్మ చెప్పింది ఆయన గురించి తపస్సు చేస్తాను. ఆయన వస్తారు. పెద్ద పదవి కావాలని అడుగుతాను. దానిని పొంది తిరిగి వస్తాను. వెడుతున్నాను’ అన్నాడు.


అపుడు నారదుడు నవ్వి ‘నీవు పొందేదేమిటో నీకు తెలియదా! పెద్ద పదవిని పొండుతావా! అందుకు నేనొకటి చెప్తాను విను. అలా నారాయణుడి కోసం వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంద్రియములను జయించే ప్రయత్నంలో వెళ్ళి కూర్చుని తపస్సు చేసిన వాళ్లకి రాత్రింబవళ్ళు బొటనవ్రేలు మీద నిలబడి తపస్సు చేసిన వాళ్లకి అంతంత కష్టాలు పడినవారికి శ్రీమన్నారాయణ దర్శనం అవలేదు. నీవు నీకు నేనొక పెద్ద సూత్రం చెపుతాను. దానిని నీవు మనసులో పెట్టుకో. అలా చేస్తే నీకు మనస్సునందు కలిగినటువంటి ఖేదము పోతుంది. నీ కన్నా చాలా గౌరవింపదగినటువంటి పెద్దలు కనపడినట్లయితే నువ్వు వాళ్ళని గౌరవించి నమస్కరించి ఆదరించు సంతోషించు. నీకన్నా ఎక్కువ ఈశ్వర విభూతి ఉన్నవాళ్ళు కనబడితే వాళ్ళని చూసి ఎప్పుడూ అసూయపడకు. సంతోషంతో వారిని చూసి నమస్కరించు. నీతో సమానమయిన విభూతి ఉన్నవారితో మిత్రత్వం చెయ్యి. తక్కువ విభూతి వున్న వాళ్ళు కనిపిస్తే వాళ్ళు కూడా పైకిరావాలని ఈశ్వరుని కోరుకుని కారుణ్యంతో ప్రవర్తించు. ఈ మూడూ గుర్తు పెట్టుకుంటే నువ్వు చక్కగా వృద్ధిలోనికి వస్తావు. ఇక ఇంటికి వెళ్ళు’ అన్నాడు.

అపుడు ధ్రువుడు అన్నాడు ‘మీరు చెప్పిన మాటలు వినడానికి చాలా సొంపుగా ఉన్నాయి. కానీ నేను పుట్టుక చేత క్షత్రియుడిని కదా! నాకు కొంచెం పౌరుషం ఎక్కువ. మా పిన్ని నన్ను అంతమాట అంది. నా మనస్సు ఏంటో గాయపడింది. శ్రీమన్నారాయణ సందర్శనమనే రసాయనమే మా పిన్ని మాటలనే ఈ లోపల కలిగినటువంటి వ్రణమును మాన్పగలదు. అందుకని శ్రీహరి కనపడతాడా, కనపడడా అనే బెంగలేదు. నేను వెళ్ళి తపస్సు చేస్తాను. అంతే! నేను వెళ్ళిపోతున్నాను” అన్నాడు. గురువు పట్టుదలను గుర్తించి “నాయనా నీవు యమునానది ఒడ్డున నిరంతరమూ శ్రీమన్నారాయణుని పాదస్పర్శ కలిగిన మధువనము అనే ఒక గొప్ప వనం ఉన్నది. నువ్వు అ వనమునకు వెళ్ళి అక్కడ యమునా నదిలో స్నానం చేసి శుచియై ఆచమనం చేసి కూర్చో. తరువాత నీ మనస్సును నిగ్రహించు. భగవంతుడు నాకెందుకు కనపడడు అని పట్టు పట్టెయ్యి. పువ్వు లేదా నాలుగు ఆకులు, ప్రధానంగా తులసి తెచ్చుకో. స్వామి వారి మూర్తిని నీటిలో కానీ, పవిత్ర ప్రదేశములో కానీ పెట్టి వీటితో పూజ చేయడం ప్రారంభించు. ఏది దొరికితే అది నివేదన చెయ్యి. మితంగా ఆహారం తీసుకో. ఎవ్వరితోనూ మాట్లాడకు. ఈశ్వరుని యందే మనస్సు పెట్టు. నీకు నారాయణుడు కనపడతాడు. నీకు నేను ద్వాదశాక్షరీ మంత్రోపదేశం చేస్తున్నాను. దీనిని ఏడురోజులు నిష్టతో చేసేసరికి నీకు దేవతలు కనపడతారు’ అని చెప్పాడు.

నారదుని మాటలు విన్న ధ్రువుడు తప్పకుండా అలాగే చేస్తానని చెప్పి గబగబా నడుచుకుంటూ అరణ్యమునకు వెళ్ళిపోయాడు. నారదుని మాటలు విన్న ధ్రువుడు తప్పకుండా అలా చేస్తానని చెప్పి గబగబా నడుచుకుంటూ అరణ్యమునకు వెళ్ళిపోయాడు. భగవంతుని ఆరాధన చేసేవాడు. అలా అయిదవ నెల వచ్చేసరికి ఈ పిల్లవాడి నిష్ఠకి కుడికాలు బొటన వేలు తీసి భూమిమీద పెట్టేసరికి భూమండలం అంతా అటు ఒరిగిపోయింది. వాని తపశ్శక్తికి అలా భూమండలం అటూ ఇటూ ఒరగడం ప్రారంభమయింది. ఇలా అపారమయిన తపస్సు చేస్తున్నాడు. అప్పుడు దేవతలు అందరూ భూమండలమే కంపించి పోతున్నది అని బెంగ పెట్టుకుని గబగబా వైకుంఠమునకు వెళ్ళి ప్రార్థన చేశారు. దేవతలకు ఇపుడు ఒక సంకట పరిస్థితి వచ్చింది. అదే ఒక యౌవనంలో ఉన్నవాడు తపస్సు చేస్తుంటే ఒక అప్సరసను పంపించి తపస్సు భంగం చేయమని చెప్పి పంపిస్తారు.

ఐదేండ్ల పిల్లవాడయిన ధ్రువుడి దగ్గరికి ఎవరిని పంపిస్తారు? వీనిని ఎలా నిగ్రహించాలో వాళ్లకి అర్థం కాలేదు. దేవతలు స్వామి దగ్గరకు వెళ్ళి స్వామీ మీరు ఒక్కసారి బయలుదేరి వెళ్ళండి’ అన్నారు. అపుడు పరమాత్మ ఒక్క నవ్వు నవ్వి ‘ఎవడురా నా గురించి ఇలా తపించినవాడు. వాడిని చూడడానికి పొంగిపోతూ వెడుతున్నాను’ అని లక్ష్మీ సహితుడై, గరుడవాహనారూఢుడై భూమండలమునకు వచ్చాడు. ధ్రువుడు కళ్ళు విప్పి చూశాడు. ఎవ్వరికీ దర్శనం ఇవ్వని స్వామి మాంస నేత్రములకు గోచరము కాని స్వామి ఈ నేత్రములకు ధ్రువుడికి దర్శనం ఇచ్చాడు. కానీ ఈ పిల్లవానికి నారాయణ అని పిలవడం కానీ, స్తోత్రం చేయడం కానీ రాదు. వాని కోరిక ఏమిటో వానికే తెలియదు. స్వామిని పైనుంచి క్రిందికి క్రిందనుంచి పైకి చూస్తూ అలాగే కూర్చుండిపోయాడు. అపుడు స్వామి ‘వీడు ఇలానే కూర్చుంటాడు. వీనికి స్తోత్రం చేయడం నేనే నేర్పుతాను అని సమస్తవేదములు ఉపనిషత్తులు వీనికి భాసించుగాక అని నాలుగు అడుగులు ముందుకు వచ్చి తన చేతితో శంఖమును తీసి ద్రువుని శిరస్సు మీద ఉంచాడు. ధ్రువుడు ఎటువంటి భాగ్యమును పొందాడో చూడండి. అందుకే ద్వాదశినాడు ధ్రువ చరిత్ర వింటే మీ అజ్ఞానం దగ్ధం అయిపోతుంది అంటారు.


ఆ శంఖం తలకి తగిలింది. అంతే! ధ్రువుడు పొంగిపోయి స్తోత్రం మొదలుపెట్టాడు. స్వామీ నీవు కనపడ్డావు కాబట్టి నేను ఒకటి అడుగుతున్నాను. జన్మజన్మాంతరములకు నాకు కావలసింది ఏమిటో తెలుసా. ఎప్పుడూ మనస్సంతా ఈశ్వరుని మీద రమిస్తూ ఆఖరుకి దేహం పడిపోతున్నప్పుడు కూడా ఈ శరీరం పడిపోతున్నదని మ్రుత్యుభాయమును పొందకుండా ఆఖరి శ్వాసలో కూడా నిన్నే తలుచుకుంటూ పొంగిపోయే లక్షణం ఉన్నటువంటి మహాభాగవతులు నిన్నే పొందుతున్నారు. వారు నీలో ఐక్యం అయిపోతున్నారు. అటువంటి వారితో నాకు సాంగత్యం ఇప్పించు తండ్రీ’ అని అడిగాడు. అపుడు స్వామి అన్నారు ‘నీవు చాలా గొప్ప స్తోత్రం చేశావు. పెద్ద పదవి కావాలని బయలుదేరావు. కానీ ఆ పెద్ద పదవి ఎవరికీ ఇవ్వరు. ఇంత చిన్నవాడివి ఆ పదవి ఏమిటో తెలియకుండా ఇంత తపస్సు చేశావు. అందుకే ఆ పదవిని నీకు ఇచ్చేస్తున్నాను. ఆ పదవి ఏమిటో తెలుసా. ధర్మమూ అగ్ని కశ్యపుడు సప్తర్షులు కాలమునక్షత్ర మండలము ఋతువులు సూర్య చంద్రాది గ్రహములు ఈ బ్రహ్మాండములు ఏది కదలకపోతే దానిని ఆధారంగా చేసుకుని రంగులరాట్నం తిరిగినట్లు తిరుగుతాయో అటువంటి ధ్రువ మండలం క్రింద నిన్ను మార్చేస్తున్నాను. నీవు ధ్రువ మండలమై వినువీధిన వెలుగుతుంటే నిన్ను ఆధారం చేసుకుని సమస్త జ్యోతిశ్చక్రము తిరుగుతూ ఉంటుంది. అటువంటి పదవిని నీకు అనుగ్రహిస్తున్నాను. కానీ ఇప్పుడే కాదు. ఇప్పుడు నీవు ఇంటికి వెళ్ళు. నీకు భవిష్యత్తు కూడా చెప్పేస్తున్నాను. నీ తమ్ముడు, పిన్ని మరణిస్తారు. నీకు రాజ్యాభిషేకం జరుగుతుంది. తదనంతర కాలమందు నీకు వైరాగ్యం పూర్ణంగా సిద్ధించి తపస్సు చేస్తావు. అప్పుడు నిన్ను అటువంటి ధ్రువ మండలమునకు తీసుకువెళ్ళి తరువాత నాలో ఐక్యం చేసేసుకుంటాను. ఇదే నీకు చిట్టచివరి జన్మ’ అని చెప్పి స్వామి అంతర్ధానం అయిపోయారు.


అపుడు ధ్రువుడు అయ్యో, ఇంత తపస్సు చేస్తే ఇదా నాకు ఫలితం’ అనుకోని ఏడుపు ముఖం పెట్టుకుని చిన్నబుచ్చుకున్న ముఖంతో ఇంటికి బయలుదేరాడు. దీనిని చూసి నారదుడు సంతోషించాడు. ఆయన ఉత్తానపాదుడి దగ్గరకు వెళ్ళాడు. ఉత్తానపాదుడు ఎదురువచ్చి స్వాగతం పలిగి అర్ఘ్యం ఇచ్చి లోపలి తీసుకువెళ్ళి కూర్చోబెట్టాడు. ఉత్తాన పాదుడు కొంచెం బాధగా వున్నాడు. నారదుడు ఉత్తనపాడుడిని ‘అంత బాధగా వున్నావేమిటి” అని అడిగాడు. దానికి ఉత్తానపాదుడు ‘ఏమి చెప్పుకోను. నాకు ఇద్దరు భార్యలు. పాపం ధ్రువుడు కూడా నా కొడుకే, వాడు నా తొడ మీద కూర్చుంటానన్నాడు. సురుచిని చూసిన భయం చేత వానిని నా తొడమీద కూర్చోపెట్టుకోలేదు. సురుచి వారిని నారాయణుని గూర్చి తపస్సు చేయమంది వాడు తపస్సు చేయడానికని అడవులకు వెళ్ళిపోయాడు. నా మనస్సు గాయమును పొందింది’ అన్నాడు. అపుడు నారదుడు ‘నీ కుమారుని గురించి నీవు బాధపడుతున్నావు. కానీ ఇవాళ నీ కొడుకు ఏ స్థితిని పొందాడో తెలుసా! ఏ మహాపురుషుని కేవలం క్రీగంటి చూపుల చేత సమస్త బ్రహ్మాండములు రక్షింపబడుతున్నాయో దేవతలు అందరూ రక్షింపబడుతున్నారో, సృష్టి స్థితి లయములు జరుగుతున్నాయో, ఎవరు హేలగా ఈ బ్రహ్మాండములను సృష్టి చేసి కాపాడుతున్నాడో అటువంటి వాని అనుగ్రహము పొంది నీ కొడుకు వరములను పొందాడు’ అని చెప్పాడు. ఈ మాటలు విని ఉత్తానపాదుడు పొంగిపోయాడు.


ఈలోగా ధ్రువుడు రాజ్యంలోకి వచ్చేస్తున్నాడని కబురు వెళ్ళింది. తండ్రి పొంగిపోయాడు. పెద్ద ఉత్సవం చేశాడు. సునీతిని తీసుకువచ్చాడు. ఉత్సాహంతో ఎదురు వెళ్ళాడు. తన కొడుకు వారములు పొంది వచ్చాడు అని కాదు ఉత్తాన పాదుడి సంతోషం. తనకొడుకు అడవులకి వెళ్ళి తిరిగి ఏ ఆపద లేకుండా తిరిగి వచ్చాడని సంతోషం. కొడుకును చూడగానే గట్టిగా కౌగలించుకున్నాడు. ఆ కౌగిటిలోంచి జారిపోయి తండ్రి పాదముల మీద పడి శిరస్సు తాటించి తండ్రికి నమస్కరించాడు ధ్రువుడు. తండ్రి ‘చిరాయుర్దాయం కలుగుతుంది – ఆయుష్మాన్ భవ’ అని ఆశీర్వచనం చేసి బాలుడిని ఎత్తుకుని కౌగిలించుకున్నాడు.


ఇదీ మర్యాద. అంతేకానీ అమ్మ దగ్గరకు వెళ్ళి ‘అమ్మా ఈయనను ఇన్నాళ్ళనుండి ఎలా భరిస్తున్నావమ్మా’ అని వెర్రి జోకులు తండ్రి మీద వేసేటటువంటి దుష్ట సంస్కారం అసలు ఈ జాతికి తెలియదు. ఎవడో దౌర్భాగ్యుడయిన రచయిత రాసి మనదేశాన్ని నాశనం చేశాడు.

రాజ్యంలోని ప్రజలు అందరూ పిల్లవానికి పట్టాభిషేకం చేయమని అడిగారు. ఉత్తముడు కూడా అంగీకరించాడు. అక్కడికి సునీతి, సురుచి ఇద్దరూ వచ్చారు. ధ్రువుడు ఇద్దరికీ శిరస్సు వంచి నమస్కరించాడు. ఇద్దరూ ఆశీర్వచనం చేశారు. ధ్రువుడికి పట్టాభిషేకం జరిగింది.

సురుచి కుమారుడయిన ఉత్తముడు ఉత్తర దిక్కున వున్న హిమాలయ పర్వతముల మీదికి వెళ్ళాడు. అక్కడే ఉత్తముడు ప్రాణములు కోల్పోయాడు. కొడుకు మరణించాడన్న వార్తా విని సురుచి అరణ్యములో ప్రయాణిస్తూ కార్చిచ్చు పుట్టు అందులో కాలిపోయి మరణించింది. భాగవతులతో జాగ్రత్తగా ప్రవర్తించక పోతే ఎంత ప్రమాదం వస్తుందో ధ్రువోపాఖ్యానం మనకి చెప్పేసింది.


తదనంతర కాలమందు ధ్రువుడికి వివాహం జరిగింది. ‘శిశుమారుడు’ అనే ప్రజాపతికి ఒక కుమార్తె, పేరు భ్రమి. ఆమెను ధ్రువుడు వివాహం చేసుకున్నాడు. ఆమెయందు ద్రువునికి ఇద్దరు కుమారులు జన్మించారు. ఒకడిపేరు వత్సర, రెండవ వాని పేరు కల్ప. తరువాత వాయుదేవుని కుమార్తె అయిన ‘ఇళ’ ను పెళ్ళి చేసుకున్నాడు. ఆమెయందు ఉత్కళ అనే కుమారుడు జన్మించాడు. వేరొక కుమార్తె కూడా జన్మించింది. నిజమునకు ఇవన్నీ ఆయన పొందబోయే పదవి అర్హతలు. ఆయన కదలకుండా ధ్రువ పథమై ఉంటాడు. మిగిలినవి అన్నీ కదులుతుంటాయి. సృష్టి ఉండాలంటే వాయువు ఉండాలి. అందుకని వాయువు కూతురుని వివాహం చేసుకున్నాడు. భ్రమి అంటే కదలుత అని అర్థం. జ్యోతిశ్చక్రము నందు సూర్యమాన చాంద్రమానములచేత తిథులు నక్షత్రంలు బ్రహ్మాండమునందు కాలమునందు కదులుతూ ఉంటాయి. కదులుతున్న కాలమునకు కదలని తాను ఆధారభూతుడై ఉంటాడు. కాలమునకు హద్దు ‘వత్సర’ – అంటే మనం ఒక సంవత్సరమును కాలమునకు ముందు ప్రమాణంగా చెప్తాము. అందుకని వత్సరం ఒక హద్దు. యుగాంతము అయిపోయిన తర్వాత హద్దు కల్పము.

ఉత్తముడిని ఒక యక్షుడు సంహరించాడని తెలుసుకుని ఆగ్రహించి యుద్ధానికి బయలుదేరాడు. రథం ఎక్కి హిమాలయ ప్రాంతమునకు వెళ్ళి కుబేరుని సైన్యమయిన యక్షులతో విశేషమయిన యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో కొన్ని వేలమంది యక్షులను చంపేశాడు. తదుపరి నరనారాయణాస్త్రమును ప్రయోగించడానికి మంత్రమును అనుష్ఠానం చేస్తున్నాడు. ఆ సమయంలో తాతగారయిన స్వాయంభువ మనువు కనపడి ఒకమాట చెప్పాడు. ‘నీవు పొందబోయే పావి ఏమిటి? నువ్వు చేసిన పని ఏమిటి? నీవు ఇటువంటి పని చేయకూడదు. అందుకని ఇప్పటివరకు నువ్వు చేసిన సంహారము చాలు. ఇప్పటికయినా నా మాట విని నరనారాయణాస్త్రమును ఉపసంహారం చేసి నువ్వు చేసిన సంహారము చాలు. ఇప్పటికయినా నా మాట విని నరనారాయణాస్త్రమును ఉపసంహారం చేసి నువ్వు నీ ధనుస్సు పక్కన పెట్టి రాజధానికి వెళ్ళిపో’ అన్నాడు. ధ్రువుడు తాతగారు చెప్పిన మాట విన్నాడు. ధ్రువుడు తిరిగి అంతఃపురమునకు వెళ్ళిపోతుంటే కుబేరునికి ఈ వార్త తెలిసింది. తాతగారు చెబితే ఇంత కోపమును కుబుసం వదిలినట్లు వదిలేసి ధ్రువుడు ఇంటికి వెళ్ళిపోతున్నాడని తెలుసుకున్నాడు. పెద్దల మాటలు విన్న పిల్లలు ఎటువంటి వరములు పొందుతారో చెపుతుంది ధ్రువోపాఖ్యానం.

కుబేరుడు వచ్చి ‘నీకు ఎంతో కోపం వచ్చిందట, కొన్ని వేలమంది యక్షులను సంహరించావట. అంతకోపంతో ఉన్నా మావాళ్ళు నీమీద కలియబడుతుండగా తాతగారు వచ్చి ఇంకా యుద్ధం చేయకు అనేసరికి ఆయన మాటవిని యుద్ధం మానివేశావు. నీలాంటి వానిని చూడడం నాకు మిక్కిలి సంతోషమును కలిగించింది. నీకు కావలసిన వరం కోరుకో ప్రసాదిస్తాను’ అన్నాడు. అప్పుడు ధ్రువుడు అన్నాడు ‘అపుడు నా బుద్ధిలో చిన్న వైక్లబ్యం వచ్చింది. నేను ఎంతో పాపపు పని చేశాను. అందుకని నీవు నాకు వరం ఇస్తే ఏ వరం ఇస్తావో తెలుసా! నా బుద్ధి రాత్రనక పగలనక ఏ కాలమునందు కూడా భగవంతుని పాదారవిందముల నుండి విస్మరణము లేని నామము చెపుతూ తరించి పోయేటటువంటి భక్తి నాకు నిర్హేతుకంగా నీవారము చేత కటాక్షింపబడుగాక’ అని అడిగాడు. ఇదీ వ్యక్తి కోరుకోవలసింది. కుబేరుడు సంతోషముతో ఆ వరమును ద్రువునకు అనుగ్రహించాడు. దానితో ధ్రువుడు అపారమయిన భక్తి సంపన్నుడు అయిపోయాడు. రాజ్యమును పరిపాలించాడు. కుమారుడికి పట్టాభిషేకం చేశాడు. బదరికాశ్రమమునకు చేరి కూర్చుని తపస్సు చేశాడు. ఆ సమయంలో ఒక ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. ఒక చిత్రవిచిత్రమయిన విమానం ఒకటి వచ్చి ఆ పర్వత శిఖరం మీద దిగింది. అందులోంచి ఇద్దరు పురుషులు నడిచి వచ్చారు. వారు నీల మేఘము వంటి శరీరము కలిగినవారి శంఖచక్రగదాపద్మములను పట్టుకుని తానూ అయిదవ ఏట చూసిన శ్రీమన్నారాయణుడు ఎలా ఉంటాడో అటువంటి స్వరూపములతో ఇద్దరు నడిచి వచ్చారు. ధ్రువుడు వాళ్ళను చూసి ఆశ్చర్యపోతూ లేచి వాళ్లకి నమస్కరించి మీరు ఎవరు? ఎందుకు వచ్చారు?’ అని అడిగాడు. అపుడు వాళ్ళు “మరచిపోయావా! ఐదేండ్ల వయసులో నీవు తపస్సు చేయగా స్వామి వరం ఇచ్చారు. నీ శరీరం పడిపోయే రోజు వచ్చింది. ఇప్పుడు నిన్ను మేము ధ్రువ మండలమునకు తీసుకువెళ్ళాలి. అందుకని స్వామి నీకోసం విమానం పంపారు. మేము విష్ణు పార్షదులము. మీరు విజయం చేసి విమానం ఎక్కండి’ అన్నారు.


అపుడు ధ్రువుడు జ్ఞానియై తనే శరీరమును వదిలిపెట్టాడు. మృత్యువు శిరస్సు మీద పాదము పెట్టి విమానంలోకి ఎక్కాడు. అది లోకములను దాటి వెళ్ళిపోతోంది. ఆశ్చర్యంగా ఆ లోకములన్నింటి వంక చూస్తున్నాడు. ఆ విమానంలో కూర్చుని అనుకున్నాడు ‘ఓహోహో ఏమి లోకములు! ఇంతమంది ఇన్ని బాధలు పడి పుణ్యములు పొంది, పుణ్యములు అయిపోయిన తరువాత క్రింద పడిపోయి ఇంత అల్లర్లు పడిపోతున్నారు. అయిదు నెలలు తపస్సు చేస్తే నా స్వామి నాకు ఇటువంటి స్థితినా ఇచ్చారు. పెద్ద పదవి అంటే ఏమో అనుకున్నాను. ఇప్పుడు తెలుస్తోంది. సప్తర్షులు, కశ్యపుడు, ధర్మము, అగ్నిహోత్రము, జ్యోతిశ్చక్రము తిరుగుతున్న మండలమునకు నేను ధ్రువ స్తంభమునై వెలుగొందబోతున్నాను. ఇంతమంది నా చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణం జరుగుతూ ఉంటుంది. నేను నిరంతరం విష్ణులోక దర్శనం చేస్తూ వుంటాను. ఎంత అదృష్టవంతుడిని’ అనుకుని ఈ అదృష్టమునకు కారణము ఎవరి అని ఆలోచించాడు. ‘దీనికి కారణం మా అమ్మ. ఆనాడు మా అమ్మ నన్ను నారాయణుని గూర్చి తపస్సుకు వెళ్ళమని చెప్పింది. ఆమె మాట నన్ను ఈ స్థితికి తీసుకువెళ్ళింది. కానీ ఆ పిచ్చితల్లి ఎక్కడ ఉన్నదో’ అనుకున్నాడు మనసులో. అనుకునే సరికి ఈ విషయమును పార్షదులు గ్రహించారు. ‘నిన్నీ స్థితికి తీసుకువచ్చింది కాబట్టే శ్రీ మహావిష్ణువు నీకన్నా ముందు ఆవిడ విమానం నడుపమని చెప్పారు. కిటికీలోంచి బయటకు చూడు’ అన్నారు. ధ్రువుడు బయటకు చూశాడు. ముందు విమానంలో దివ్యమైన తేజోవిరాజితయై సునీత వెళ్ళిపోతున్నది. ఆవిడ శ్రీమన్నారాయణుడి లోకి వెళ్ళిపోయింది. ధ్రువుడు ధ్రువ మండలమునకు చేరుకొని తదనంతరము స్వామివారి లోనికి లీనమై పోయి పరబ్రహ్మము సాయుజ్య మోక్షమును పొందాడు.


ఇంతటి అద్భుతమయిన ఈ ధ్రువోపాఖ్యానం ఎవరైతే పరమ భక్తితో వింటారో వారందరికీ కూడా ఉత్తర క్షణం అప్పుడే అక్కడే ఆ క్షణంలోనే పాపనాశం జరిగి శ్రీమన్నారాయణుని అనుగ్రహం కటాక్షింపబడుతుంది. ఒకవేళ అల్పాయుర్దాయంతో మృత్యువు తరుముకు వస్తుంటే మృత్యువు ఆగి ఆయుర్దాయం కలుగుతుంది. గ్రహముల వలన ఉద్రిక్త ఫలితము రాబోతుంటే అటువంటి ఫలితములు ఆగిపోయి శుభమును పొందుతారు, కీర్తిని ఇస్తుంది.

శివానందలహారీ

 🙏శివానందలహారీ🙏



అమల శంభుధ్యాన మను " వసంతము " తోడ

            సంబంధ మొందిన స్వచ్చ మైన

నా డెంద మనియెడి నవ వనోద్యానాన

            పలు పరిణామముల్ పరిఢవిల్లె

పాపంబు లనియెడి పండు టాకులు రాలె

             పుణ్యపల్లవపాళి పులకలెత్తె

సద్గుణంబు లనెడి సరసంపు మొగ్గలు

             పారవశ్యమనెడి భక్తి లతలు

జప వచస్సు లనెడి సారంగముల్ పుట్టె

               సత్కర్మ వాసనల్ సంచరించె

జ్ఞాన సుధ పొంగి ప్రవహించె ధ్యానసీమ 

 బ్రహ్మవిజ్ఞాన మొదవెను భాసురముగ

శంకరా ! నిన్ను వినుతింప శక్యమగునె !

పార్వతీనాథ ! పరమేశ ! పాహి పాహి !       47 #



శాశ్వతానందంబు సాత్త్వికంబనియెడి

             సలిలంబునకు నిత్య స్థానమయ్యు

సర్వ సురోత్తమ , సంయమివర్యుల ,

              హృదయాంబుజాళికిన్ సదనమయ్యు 

సద్విజ సేవిత సద్వర్తితంబును

               నిశ్చల మత్యంత నిర్మలంబు

కాలుష్యరహితంబు కడు శాంతయుక్తంబు

               భాసుర సత్కర్మ ప్రకటితంబు

సతత  శివశంకరధ్యాన సరసి యందు 

సంచరించుము మానస రాజహంస !

పనికిరానట్టి పెక్కగు పల్వలముల

సంచరింపంగ నేలకో ? శ్రమను పొంది       48 #



     ✍️గోపాలుని మధుసూదన రావు🙏

చండముండ వధ - 2 🌻*

 *🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 26  / Sri Devi Mahatyam - Durga Saptasati - 26 🌹*

✍️. మల్లికార్జున శర్మ 

📚. ప్రసాద్ భరద్వాజ 


*అధ్యాయము 7*

*🌻. చండముండ వధ - 2 🌻*


16. ఆ దైత్య బలమంతా క్షణమాత్రంలో కూల్చివేయబడడం చూసి, చండుడు అతిభయంకరరూపయై ఉన్న ఆ కాళిక మీదకు ఉరికాడు.


17. ఆ మహాసురుడు (చండుడు) అతిభయంకరమైన బాణవర్షంతో, ముండుడు వేనవేలు చక్రాలను విసరివేయడంతో, ఆ భీషణనేత్రను (కాళిని) కప్పివేసారు.


18. ఆ అనేక చక్రాలు ఆమె నోట్లో అదృశ్యమైపోవడం అనేక సూర్యబింబాలు మేఘమధ్యంలో అదృశ్యమైపోతున్నట్లుగా ఉంది.


19. అప్పుడు భయానక గుర్జారావం చేస్తూ, భయంకరమైన నోటిలో దుర్నిరీక్ష్యంగా మెరుస్తున్న పళ్ళతో కాళి అత్యంత రోషంతో భయంకరంగా నవ్వింది.


20. అంతట ఆ (కాళికా) దేవి తన మహాసింహంపై ఎక్కి, చండుని మీదికి ఉరికి, జుట్టుతో పట్టుకొని అతని శిరస్సును ఖడ్గంతో ఛేదించింది.


21. చండుడు కూలడం చూసి ముండుడు కూడా ఆమెపైకి ఉరికాడు. ఆమె అతణ్ణి కూడా రోషంగా తన ఖడ్గంతో కొట్టి నేలగూల్చింది.


22. చండుడు, అత్యంతశౌర్యవంతుడైన ముండుడు కూల్చబడడం చూసి, అప్పటికి చావక మిగిలి ఉన్న సైన్యమంతా సంభ్రమంతో దిక్కులబట్టి పారిపోయింది.


23. కాళి చండముండల శిరస్సులను తన చేతులతో పట్టుకొని చండిక వద్దకు పోయి ప్రచండంగా, బిగ్గరగా నవ్వుతూ ఇలా పలికింది :


24. “ఈ యుద్ధయజ్ఞంలో యజ్ఞపశువులుగా సమర్పింపబడిన చండముండులను నీ వద్దకు తెచ్చాను. శుంభనిశుంభులను నీవు స్వయంగా చంపుతావు.”


25–27. ఋషి పలికెను : అంత తన వద్దకు తేబడిన ఆ చండముండ మహాసురులను చూసి శుభమూర్తియైన చండిక కాళితో మనోజ్ఞంగా ఇలా పలికెను : “నీవు చండముండులను ఇరువురినీ నా వద్దకు తెచ్చావు కనుక దేవీ! నీవు ఇక లోకమందు చాముండ అనే పేరుతో ప్రసిద్ధి చెందుతావు.” 


శ్రీ మార్కండేయపురాణంలో సావర్ణిమస్వంతరంలో “దేవీ మాహాత్మ్యము” లో “చండముండవధ” అనే సప్తమాధ్యాయము సమాప్తం.


సశేషం....

🌹 🌹 🌹 🌹

Situation







 

మొగలిచెర్ల

 *దత్త రక్షణ..*


"అన్నయ్యా! రాజ్యానికి పెళ్ళికుదిరిందికదా..వెండి సామాను కొనాలి, అలాగే బంగారమూ కొనాలి..నీకెవరన్నా తెలిసినవాళ్ళ షాపు ఉందా?" అని మా చెల్లెలు గాయత్రి నాకు ఫోన్ చేసింది..ఇది 2007 డిసెంబర్ నాటి ముచ్చట..


బంగారానికి, వెండికి సంబంధించి నాకు తెలిసిన ఒకే ఒక్క షాపు, నా స్నేహితుడు గుఱ్ఱం వెంకటేశ్వర్లు దే! నెల్లూరు జిల్లా వింజమూరులో అతని  దుకాణం..


ఇక్కడ శ్రీ గుఱ్ఱం వెంకటేశ్వర్లు గారి గురించి చెప్పుకోవాలి..


శ్రీ దత్తాత్రేయ స్వామి వారు, మాతల్లిదండ్రులను అడిగి మొగలిచెర్ల గ్రామంలో 5 ఎకరాల పొలం ఆశ్రమ నిర్మాణానికి తీసుకున్నారు..అందులో ఆశ్రమ నిర్మాణానికి, నెల్లూరు జిల్లా గొట్టిగుండాల గ్రామ వాస్తవ్యులు శ్రీ బొగ్గవరపు మీరాశెట్టి గారు, వారి ధర్మపత్ని ముందుకొచ్చారు..ఆ మీరాశెట్టిగారి మరదలి కుమారుడే ఈ వెంకటేశ్వర్లు..పెదనాన్న మీరాశెట్టి గారితో మొగలిచెర్ల వస్తూ పోతూ ఉండటం వలనా..వయసులో ఇద్దరం ఇంచుమించు సమానం గనుకా యిట్టె స్నేహితులుగా మారాము..1974 వ సంవత్సరం అంటే నాకు పద్నాలుగేళ్ళు వయసు..


2004 లో నేను మందిరం బాధ్యతలు తీసుకునే నాటికే వెంకటేశ్వర్లు గారికి నగల దుకాణం పెట్టి, వింజమూరు చుట్టుపక్కల చాలా మంచి పేరు తెచ్చుకున్నారు..నావరకూ వెండి, బంగారాల్లో ఏది కొనుగోలు చేయాలన్నా, ఇప్పటికీ అతనే దిక్కు.. గతయేడాది స్వామి వారి మందిరం వద్ద గోశాల కూడా నిర్మించారు..మొగిలిచెర్ల అవధూత దత్తాత్రేయుడి సేవలో తరిస్తున్న వ్యక్తీ..


సరే..గాయత్రి ఫోన్ చేయగానే, వెంటనే మరో ఆలోచన లేకుండా చెప్పాను, "మన వెంకటేశ్వర్లు ఉన్నాడు కదమ్మా..అతన్నే అడుగుదాం "అన్నాను..సరే అన్నది..


నేనూ, మా ఆవిడ జయలక్ష్మీ, చెల్లెలు గాయత్రి కలసి, సింగరాయకొండ నుంచి కార్లో నెల్లూరు వెళ్ళాము..వెంకటేశ్వర్లు అక్కడికి వచ్చారు..మాకు కావాల్సిన వన్నీ దగ్గరుండి ఇప్పించి వెళ్ళారు..


వెళ్ళింది నెల్లూరు కనుకా..భోజనం వేళకు అక్కడే ఉన్నాం కనుకా..రెండో ఆలోచన లేకుండా, తరతరాల నుంచీ మంచి భోజనానికి కేరాఫ్ గా ఉన్న కోమలా విలాస్ లో భోజనం చేసి, తిరుగు ప్రయాణం అయ్యాము..


మా ఆవిడా, చెల్లెలు ఇద్దరూ వెనుక సీట్లో కూర్చున్నారు..నేను డ్రైవింగ్..ఇక కావలి ఓ 5కిలోమీటర్లు ఉందనగా.. హఠాత్తుగా సైకిల్ తొక్కుతూ రోడ్డుకు ఓ పక్కగా వెళుతున్న నడివయస్కుడు, కారుకు అడ్డం రావడం, 100కి.మీ..వేగంతో ఉన్న కారు అతన్ని గుద్దడం, ఆ మనిషి, బంతిలాగా యెగిరి, ముందు అద్దం మీద పడటం, ఆ అద్దం భళ్ళున పగిలి, ముక్కలు నా మీద లోపల పడటం, క్షణాల్లో జరిగిపోయాయి..


ఒక్క క్షణం మెదడు మొద్దుబారిపోయింది..అసలతను ప్రాణాలతో ఉన్నాడో లేడో తెలీదు..సహజంగా ఇలా ప్రమాదం జరిగిన వెంటనే, చుట్టుపక్కల వాళ్ళు ముందూ వెనుకా ఆలోచించకుండా వాహనం నడిపే వాడిని తిట్టడం, లేదా కొట్టడం కూడా జరుగుతుంది..


ఇక్కడే ఆ దత్తాత్రేయుడి లీల మాకందరికీ ప్రత్యక్షంగా కనబడింది..


కార్లో ఉన్న ఆడవాళ్ళిద్దరూ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు..నేను కారు దిగి, అతన్ని పైకి లేపే ప్రయత్నం చేసాను.."నేను నిలబడతానయ్యా"  అన్న మాటలు అతని నోటివెంట వచ్చాయి..అతను నా సహాయంతో రోడ్డు డివైడర్ మీద కూర్చున్నాడు, మోకాలి వద్ద గాయం లోంచి కొద్దిగా రక్తం వస్తోంది..కానీ మనిషి స్పృహలోనే వున్నాడు..


ఈలోపల ప్రక్కనే ఉన్న పొలాలలోంచి ఓ 20మంది ఆడా, మగా వచ్చారు..రావడమే ఆలస్యం ఇద్దరు ఆడవాళ్ళు వెనుకసీటు వద్దకు వెళ్లి, మా ఆవిడతో, చెల్లెలి తో.."అమ్మా మీరేమీ కంగారు పడకండి, ఆయన మా మనిషే..మేము చూసుకుంటాము" అన్నారు..అలాగే ఓ వ్యక్తీ నాదగ్గరకు వచ్చి, "అయ్యా..నువ్వు మొగిలిచెర్ల లోని దత్తాత్రేయ స్వామి దగ్గర వుండే ఆయనవి కదూ..నమస్కారమయ్యా..మా వాడు తాగిఉన్నాడు..మేము కేకవేస్తూనే ఉన్నాము..నీ తప్పేమీ లేదు..ఆడాళ్ళు భయపడ్డట్టున్నారు..నువ్వు బయల్దేరి పో"! అన్నాడు..


నేను 108 కు ఫోన్ చేసాను."ఎందుకయ్యా..మేము తీసుకెళ్తాము వీడిని.."అంటూ దారిలో పోతున్న ఆటో ను మాట్లాడి అతన్ని కూర్చోబెట్టారు..నేను జేబులోంచి ఓ 4000 తీసి ఇవ్వబోయాను..వద్దంటే వద్దన్నారు..నా ఫోన్ నెంబర్ ఇచ్చి, కావలి లో హాస్పిటల్లో చేర్చి నాకు ఫోన్ చేయమన్నాను..నా విజిటింగ్ కార్డు చూసిన ఒకతను, "అయ్యా..నువ్వు మొగిలిచెర్ల స్వామి దగ్గరుంటావా..స్వామీ నమస్కారం అయ్యా" అంటూ ఆటో లో ఆ మనిషిని ఎక్కించుకొని వెళ్ళిపోయారు..కేవలం దత్తాత్రేయుడి కృపే ఆరోజు మాకు కనబడింది..


ప్రమాదం జరిగిన 15 నిమిషాల తరువాత, అద్దం పగిలిపోయిన మా కారు, మేము ముగ్గురమూ మిగిలాము..


ఇప్పటికీ ఆ వ్యక్తుల నుంచి నాకు ఫోన్ లేదు..ఒక్క నయాపైసా తీసుకోలేదు..ఏమీ లేదు..కావలి లో ఉన్న మా బావమరిది ఆరోజు సాయంత్రం అన్ని హాస్పిటళ్లకూ వెళ్లి విచారించాడు..ఎక్కడా ఇలాటి కేసు వచ్చిందని ఎవరూ చెప్పలేదు..


అన్ని వైపులా ఆ దత్తాత్రేయుడి దయ మాత్రం ఉంది..సహస్ర బాహువులతో మమ్మల్ని కాపాడాడని నేనూ నా భార్యా ఇప్పటికీ అనుకుంటాము..


నిజమే..


సర్వం..

దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం.. లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).