19, సెప్టెంబర్ 2022, సోమవారం

అమ్మవారిని ఆరాధించే ఐదు పద్ధతులు

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


*అమ్మవారిని ఆరాధించే ఐదు పద్ధతులు ఏమిటి.....!!???* 🙏🏻

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷


🔱🔱🔱🔱🔱🔱🔱🔱


  🥀మొదటిది విగ్రహారాధన. అమ్మవారి యొక్క విగ్రహమునో లేక చిత్రపటమునో పూజగదిలో పెట్టుకుని పూజిస్తాము.  స్త్రీ సాక్షాత్తూ అమ్మవారి యొక్క అంశ స్వరూపమే కాబట్టి, నవ రాత్రులయందు లేక పుణ్య దినములయందు, కుమారీ పూజనో లేక కౌమారీ పూజనో చేస్తాం.ఇదంతా బాహ్య పూజ.


  🥀రెండో  విధములో, అమ్మవారి యొక్క రూపమును లేక పాదములను మనసులో  నిలిపి పూజిస్తాము. దీనినే మానసిక పూజా లేక అంతర్ముఖ పూజ అని కూడా అంటారు.


  🥀మూడవ విధానములో, కుండలినీ రూపముగా అమ్మవారిని  ఆరాధించటం


కుండలిని రూప ఆరాధనకు వచ్చేసరికి, బాహ్య మరియు అంతర అనే రెండు విధానములకు అవకాశమే లేదు. కుండలిని అంతా అంతర్ముఖమే.


🥀నాలుగవ విధానం శ్రీచక్ర ఆరాధన. ఈ విధానములో మనము  శ్రీ చక్రమును ఒక యంత్ర రూపముగా కానీ, లేక ఒక ప్రతిమ రూపముగా కానీ, సంపాదించి    పూజిస్తాము. కానీ ఇది కూడా,  బాహ్య పూజాయే.


🥀ఇక ఐదవ విధానములో,  మనం పద్మాసనంలో కూర్చుని ఉంటే మన శరీరమే శ్రీచక్రము అని అర్థం చేసుకోగలుగుతాము మరియు మన ఉపాదిలో అనగా శరీరంలో కొలువై ఉన్న,  మహాశక్తి అయినటువంటి శ్రీ కనకదుర్గా మాతను,  దహరాకాశములో అనగా మన హృదయ స్థానములో,  లేక చిత్తాకాశములో  అనగా బృగు మధ్య స్థానములో ( అజ్ఞాచక్రములో),  లేక చిదాకాశములో, నిలిపి పూజించగలుగుతాము.


శంకరులు, "సౌందర్యలహరి" లోని పదకొండవ శ్లోకాన్ని, శ్రీచక్ర స్వరూపాన్ని గూర్చి వర్ణిస్తూ, ఇలా రచించారు,


" *చతుర్బిః శ్రీకంఠైః - శివయువతిభిః  పంచభిరపి* 

 *ప్రభిన్నాభిః శంభో - ర్నవభి రపి మూలప్రకృతిభిః* 

 *త్రయశ్చత్వారింశ* - *ద్వసుదళకళాశ్రత్రివలయ* 

 *త్రిరేఖాభిః సార్దం - తవ శరణకోణాః పరిణతాః"* 


అనగా,అమ్మవారు కొలువై ఉండే శ్రీచక్రము,నాలుగు శివ కోణములు మరియు ఐదు శక్తి కోణములు కలిగి, సృష్టికి మూల కారణమైన తొమ్మిది మూల ప్రకృతులతోనూ,అష్టదళపద్మమూ,షోడశదళ

పద్మమూ, మేఖలా త్రయము, రేఖా త్రయము, అనే భూపురత్రయముతోనూ కలిసి, నలభై నాలుగు అంచులు కలిగి ఉంటుంది.


భైరవ యామళము అనే గ్రంథంలో శ్రీ చక్రం గురించి ఇలా ఉంది...


శివాశివుల (అనగా పార్వతీ పరమేశ్వరుల) యొక్క శరీరమే శ్రీచక్రము.


శ్రీ చక్రములోని,   త్రికోణము, అష్టకోణములు, దశకోణములు రెండూ, చతుర్దశారము అనే ణదు శక్తి చక్రములు.


బిందువూ, అష్టదళ పద్మమూ, షోడశదళ పద్మమూ, చతుర్దశ దళ పద్మమూ, అనబడే నాలుగూ, శివ సంబంధమైన చక్రములు.


శివశక్తి చక్రముల కలయికే శ్రీచక్రము.


త్రికోణము అనే శక్తి చక్రంలో బిందువు అనే శివ చక్రము కలిసి ఉంటుంది. అలాగే అష్టకోణము అనే శక్తి చక్రములో,  అష్టదళ పద్మము అనే శివ చక్రము కలిసి ఉంటుంది. శక్తి చక్రములైన దశకోణములు రెండింటిలోనూ,  షోడశదళపద్మము కలిసి ఉంటుంది. చతుర్దశారము అనే శక్తి చక్రంలో, భూపురము చేరి ఉంటుంది. అలా, శ్రీచక్రము నవచక్రాత్మకము.


 *శ్రీచక్రము యొక్క కోణములు ఎన్ని .....* 


"త్రయశ్చత్వారించత్" అంటే నలుబది మూడు కోణములు అన్నది శాస్త్రము.  


అవి ఏమిటి అంటే..!?, 


1)  శక్తి చక్రములలోని "త్రికోణానికి" ఉన్న 

       ఊర్ధ్వకోణము  = 1


2)  శక్తి చక్రములలోని "అష్టకోణానికి" ఉన్న 

      కోణములు = 8


3)  శక్తి చక్రములలోని రెండు దశకోణముల లోపలా        మరియు బయట ఉన్న కోణములు= 20


4) శక్తి చక్రములలోని  చతుర్దశార కోణములు = 14 


వెరసి నలుబది మూడు (43)  కోణములు.


"నవభి రపి మూలప్రకృతిభిః"  శ్రీ చక్రమునకు కారణమైన 9 కోణములే,  ప్రపంచమునకు కారణమైన 9 యోనులు. ఈ నవ యోనులే పిండాండ కారణమైనటువంటి 9 ధాతువులు.


 "కామికా తంత్రము" అనే గ్రంథము, ఈ తొమ్మిది ధాతువులనూ  విశ్లేషిస్తుంది.


చర్మము రక్తము మాంసము మెదడు మరియు ఎముకలు అనే "అయిదు ధాతువులు" శక్తి  సంబంధమైనవి.


మజ్జ అనగా ఎముకలలోని గుజ్జు,  శుక్లము అనగా వీర్యము,  ప్రాణము మరియు జీవము "శివ మూలకములు".


నవ ధాతుమయమే మానవ శరీరం.


శ్రీ చక్రములోని మధ్య బిందువే దశమయోని. ఆదిపరాశక్తి అయినటువంటి శ్రీ కనకదుర్గా మాత.


 శ్రీ చక్రము మరియు శ్రీచక్రార్చన రెండు విధములు. 1)  సమయాచారము మరియు 2) కౌలాచారము.


మనది సమయాచారము. మనం పూజించే శ్రీచక్రములో, పైకి శీర్షములు కలిగిన త్రిభుజములు నాలుగు , క్రిందికి శీర్షములు కలిగిన త్రిభుజములు ఐదు ఉంటాయి.


కౌలాచారములో పూజింపబడే శ్రీచక్రములో

పైకి శీర్షములు కలిగిన త్రిభుజములు ఐదు, క్రిందికి శీర్షములు కలిగిన త్రిభుజములు నాలుగు ఉంటాయి


శ్రీ చక్రమును అర్థము చేసుకోవటమే మహాభాగ్యము.

               

🙏🏻 *శ్రీ మాత్రే నమః* 🙏

*బ్రహ్మా ముహూర్తం

 *బ్రహ్మా ముహూర్తం* అంటే ఏంటి ? బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేవాలా ?


బ్రహ్మా ముహూర్తం..!! ఈ పదాన్ని మనం చిన్నప్పటి నుంచి వినే ఉంటాం. కానీ.. దీనికి సరైన అర్థం, పరమార్థం మాత్రం చాలామందికి తెలియదు. బ్రహ్మా ముహూర్తం తెల్లవారుజామున అని తెలుసు కానీ.. కరెక్ట్ సమయం మాత్రం చాలామందికి తెలియదు.అసలు *బ్రహ్మా ముహూర్తం* అంటే ఏంటి ? బ్రహ్మాముహూర్తంలో నిద్రలేవాలని, పూజ చేయాలని, పిల్లలు చదువుకోవాలని ఎందుకు సూచిస్తారు ? బ్రహ్మా ముహూర్తానికి ఎందుకంత ప్రాధాన్యత ? బ్రహ్మ ముహూర్తంలోనే ఎందుకు నిద్రలేవాలి ? ఇలాంటి అనుమానాలన్నింటికీ.. పరిష్కారం దొరికింది. తెలుసుకోవాలని ఉందా.. అయితే.. ఈ ఆర్టికల్ లోకి ఎంటర్ అయిపోండి.

   

*బ్రాహ్మా ముహూర్తం*

సుర్యోదయానికి 48 నిమిషాల ముందు సమయాన్ని బ్రాహ్మా ముహూర్తం అంటారు.

   

*ఆఖరి నిమిషాలు*

రాత్రిభాగంలోని ఆఖరి 48 నిమిషాలను.. సూర్యోదయానికి ముందు 48 నిమిషాలను బ్రహ్మా ముహూర్తం అంటారు.

   

*పూజలు*

బ్రహ్మా ముహూర్తం పూజలు, జపాలకు మంత్ర సాధనకు విశిష్టమైన సమయంగా చెబుతారు.

   

*విద్యార్థులకు*

విద్యార్థులు బ్రాహ్మా ముహూర్తం లో లేచి చదువుకుంటే బాగా గుర్తుంటుందని నమ్ముతారు.

   

*జీవక్రియలు*

మన శరీరంలో జీవ గడియారం ఉంటుంది. దీన్ని అనుసరించే మన జీవక్రియలన్నీ జరుగుతాయి. అలాగే ఉదయం మనలో కార్టిసోల్ హార్మోన్ ఎక్కువ మోతాదులో విడుదల అవుతుంది. ఈ హార్మోన్ మనలోని ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతుంది. అందుకే పిల్లలు బ్రహ్మా ముహూర్తంలో చదువుకుంటే చక్కగా గుర్తుంటుందట.

   

*ఒత్తిడి*

అలాగే ముందు రోజు భరించిన ఒత్తిడులు అన్ని నిద్రలో మరిచిపోతాం కాబట్టి మెదడు ఉత్తేజంతో ఉంటుంది. పరిసరాలు కూడా నిశ్శబ్దంగా ఉంటాయి. ఈ అన్ని కారణాల వల్ల చదివినది మెదడులో జాగ్రత్తగా నిక్షిప్తం అవుతుంది.

   

*పెద్దవాళ్లు ఎందుకు లేవాలి* ?

ఆయుర్వేదం ప్రకారం రాత్రి తోందరగా నిద్రపోయి ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేచేవారికి ఆరోగ్య సమస్యలు రావు.


*ఫ్రెష్ ఆక్సిజన్*

రాత్రంతా చెట్లు వదిలిన ఆక్సిజన్ వేకువ జామున కాలుష్యం బారిన పడకుండా ఎక్కువ పరిమాణం లో మనకు అందుబాటులో ఉంటుంది. వాకింగ్ కు వెళ్లేవారికి ఇది చాలా ఉపయెాగ పడుతుంది.


*గృహిణులు ఎందుకు లేవాల*ి.?

గృహిణులకు నిద్ర లేచిన దగ్గర నుంచి ఎన్నో పనులు , పిల్లల సంరక్షణ, ఇంట్లో పెద్దవారి సంరక్షణ , వంట పనులు,ఇంటి పనులతో క్షణం తీరిక లేకూండా గడుపుతారు. అలాంటి వారికి ఒత్తిడి లేని మానసిక ,శారీరక ఆరోగ్యం చాలా అవసరం.


*ఆందోళన* 

బ్రహ్మా ముహూర్తంలో లేవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది.ఉదయాన్నే నిద్రలేస్తే...ఇంటిపనులన్ని... ఆందోళన లేకుండా అయిపోతాయి....


*సూర్యోదయము* 

ప్రతిరోజూ సూర్యోదయము చూసే అలవాటు ఉన్నవారికి గుండె,మెదడు,ప్రశాంతంగా ఆరోగ్యంగ ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి....


*ఆరోగ్యము* 

బ్రహ్మా ముహూర్తంలో నిద్రలేవడం వల్ల సూర్యుని లేలేత కిరణాలు మన పైన ప్రసరిస్తాయి సూర్యరశ్మి లో ఉండే విటమిన్ డి ఎముకల బలానికి సహయపడుతుంది.....



మీ......✍🏻........!!!!


*దయచేసి షేర్ చేయండి అందరికి తేలియజేయండ*ి

యజ్ఞోపవీతం_బరువు

 యజ్ఞోపవీతం_బరువు

ఒకరోజు కవిత్వం అంటే ఆసక్తి లేని ఒక రాజు వద్దకు బాగా బక్కచిక్కిన ఒక పేద బ్రాహ్మణుడు వచ్చి తాను రచించిన ఒక కృతిని ఆయన ముందుంచుతాడు. కవిత్వమన్నా, బ్రాహ్మణులన్నా చులకన భావం కల ఆరాజు, హేళనగా "నీకిప్పుడు ఈ పుస్తకమెత్తో, నీయెత్తోధన మివ్వాలా" అంటాడు.

దానికి ఆ వృద్ధ బ్రాహ్మణుడు "అంత అవసరం లేదు మహారాజా, ఈ ఉదయం నేను యజ్ఞోపవీతం మార్చుకున్నాను, నావద్ద తీసివేసిన 'జీర్ణయజ్ఞోపవీతం' ఉన్నది దానెత్తు ఇచ్చిన చాలునంటాడు.

వీడో పిచ్చాడనుకుని ఆరాజు, కోశాధికారితో వీనికోరెండు కాసులిచ్చి పంపమంటాడు.

దానికా బ్రాహ్మణుడు, తనకు ఆ యజ్ఞోపవీతమెత్తే కావాలని పట్టబడతాడు.

దానికా రాజు 'సరదాగా ఆ వేడుక చూద్దామనుకుని, త్రాసు తెప్పించి తూచి ఇమ్మని ఆజ్ఞాపిస్తాడు'.

కానీ, వింత ! ఎంత ధనం వేసినా, ఆ రాజ్యంలో సమస్త సంపదలు కూడా దానికి సరతూగలేదు.

దానికి కారణం, ఆ బ్రాహ్మణుని గాయత్రి మంత్ర అనుష్ఠానబలం. 

దానితో ఆ రాజుకు కనువిప్పు కలిగి, ఆ బక్క బ్రాహ్మణుని శక్తి తెలియవచ్చి, పాదాక్రాంతుడవుతాడు.

జై గాయత్రీమాత

(ఒక మహాత్ముడు పంపిన కధ)🙏🏻🙏🏻🙏🏻

స్నేహ బంధం

 స్నేహ బంధం 

ప్రకృతిలో తియ్యనిది స్నేహం అని అంటారు.  మనకు స్నేహితులు అనేకరకాలుగా తారస పడతారు. కొందరు మన చుట్టుప్రక్కల ఉండటం వలన స్నేహితులుగా వుంటారు. కొందరు మనం చదువుకునే పాఠశాలలోనో లేక కళాశాలలోనో మనతో చదువుకోవటం వలన స్నేహితులుగా అవుతారు.  ఇంకా కొంతమంది మన ఉద్యోగ, వృత్తి, వ్యాపారాలలో మనతో వుండి పరిచయం ఏర్పడి మిత్రులుగా అవుతారు. స్నేహితులు ఏరకంగా వున్నా కూడా ఒక స్నేహితునికి ఇంకొక స్నేహితుడు సహాయ సహకారాలు అందించుకోవటం చాలా  మంచిది. కొంతమంది వ్యసనపరులకు వారి వ్యసనాల ద్వారా కూడా స్నేహితులు ఏర్పడవచ్చు. 

గతంలో మంచి మార్గంలో నడవనివారు కూడా ఒక మంచి స్నేహితుని సాన్నిధ్యంలో మంచివారుగా మారవచ్చు కూడా. అందుకేనేమో "సావాసదోషే గుణీభవన్తు" అని అంటారు. సావాసం వలన మంచి గుణాలు అలవడితే అంతకంటే సంతోషించవలసింది  లేదు. కానీ కొన్ని సందర్భాలలో చెడుగుణాలు కూడా స్నేహ ప్రభావంతో కలుగవచ్చు.  ఉదాహరణకు నీవు మంచివాడివే కానీ నీకు ఒక వ్యక్తి నీవల్ల ఏదో ఆశించి అంటే నీ ఉద్యోగాన్ని ఆసరాగా తీసుకోనో, లేక నీ వృత్తిని, వ్యాపారాన్ని ఆసరాగా తీసుకొని తాను లబ్ది పొందాలని కుతంత్రించి నీకు ఆప్త స్నేహితుడిగా నీతో స్నేహం చేసి నీకు దుర్వాసనలు అలవాటు చేయవచ్చు కూడా నీవు అతను చుపించిన కపటపు ప్రేమను నిజమని నమ్మి అతని మాయకు బలికావచ్చు కూడా ఇలా దొంగ స్నేహితుల మోసాలకు బలైన వారు ఎందరో.  చివరకు కానీ తెలియదు నీవు అతని చేతిలో మోసపోయావని.  అప్పటికే సమయం మించిపోతుంది. ఇలాంటి వారిని నమ్మక ద్రోహులని, నమ్మించి మోసగించేవారని, తడిగుడ్డతో గొంతులు కోసేవారని అనటం మనం నిత్యము వింటున్నాము. 

స్నేహం చేసే ముందు ఆ వ్యక్తి నడవడిక గూర్చి తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఇక కొందరు చాలా సన్నిహితంగా వుంటూ వుంటారు వారినే మనం ప్రాణస్నేహితులు అంటాం.  వారిరువురు "ఛాయా ప్రచ్ఛాయ" లాగ వుంటారు లేక వారిరువుమద్య బంధం "త్వమేవ అహం" అన్నట్లు అంటే వాడే వీడు అన్నట్లు ఎప్పుడు వుంటారు అని అంటారు. నిజానికి ఒక స్నేహితునికి ఆసరాగా ఉండేవాడే నిజమైన స్నేహితుడు వాళ్లదే నిజమైన స్నేహబంధం. మన శాస్త్రాలు ఇద్దరు వ్యక్తులకు మధ్య ఏడు మాటలు కలసిన, లేక ఏడడుగులు కలసి నడచిన స్నేహం కలుగుతుందని పేర్కొన్నాయి.  అందుకే వివాహంలో వధూవరులను ఏడడుగులు కలిపి నడిపిస్తారు.  అంతేకాదు మన సాంప్రదాయంలో వివాహాన్ని "ఎడడుగుల సంబంధం" అని అంటారు. పెండ్లయిన భార్య భర్తలు ఇద్దరు జీవితాంతం మంచి స్నేహితులుగా మూడు పురుషార్ధాలను (ధర్మ, అర్ధ, కామాలను)  కలసి కట్టుగా ఆచరించాలని అనేక ప్రమాణాలను చేయిస్తారు. అందులో భాగంగా అగ్నిసాక్షిగా కూడా ప్రమాణాన్ని చేయిస్తారు. స్నేహ సంబంధాన్ని మధురమైన బంధంగా మనం అనుకుంటాం. నిజానికి స్నేహబంధాన్ని నిలుపుకోవటం ప్రతి స్నేహితుడు చేయవలన పని. ఈ విషయాలు తెలియక ఈ రోజుల్లో అనేకమంది దంపతులు పెండ్లి అయిన ఒక ఏటికే విడాకులకు కోర్టుల చుట్టూ తిరుగుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. 

స్నేహ బంధం ఒక తియ్యని అనుభూతి. కానీ స్నేహితం అనేది ఇద్దరు స్నేహితులల్లో ఒకరు జీవించి ఉన్నంతవరకే ఉంటుంది. మరి ఈ స్నేహబంధం శాస్వితంగా వుంటూ ఎల్లప్పుడూ మధురానుభూతిగా ఉండాలంటే యెట్లా అంటే దానికి ఒక స్నేహితుడు సదా మనకు తోడుగా వుండి మనలను రక్షిస్తూవుండే వాడు కావలి మరి ఎవరు ఆలా వుంటాడు అంటే ఒకే ఒక్కడు మనకు అలంటి స్నేహితుడు దొరుకుతాడు  అతడే ఆ పరమేశ్వరుడు. ఎప్పుడైతే భక్తుడు త్రికరణ శుద్ధిగా పరమేశ్వరుని ఫై అకుంఠిత శ్రర్ధతో, నిష్టతో, అనురక్తితో, అంకితభావంతో, నిష్కల్మషంగా స్నేహం చేస్తాడో అప్పుడు భగవంతుడు భక్తుని ఒక మంచి స్నేహితునివలె సదా వెన్నంటి ఉండి కాపాడుతూవుంటాడు.

దేముడితో స్నేహం: 

దేముడితో యెప్పుడైతే మనం స్నేహం చేయటం మొదలు పెడతామో అప్పుడు ఈ ద్వైత ప్రపంచం మొత్తం మిధ్యగా కనిపిస్తుంది. ఎప్పుడు ఈశ్వరుని గూర్చిన ధ్యాసే ఉంటుంది. 

కృష్ణుడితో స్నేహం: మీరా బాయి శ్రీ కృషునితో స్నేహం చేసింది అతనిలోనే ఐక్యం చెందిని. 

రాముడితో స్నేహం: భక్త రామదాసు, తులసీదాసు, త్యాగరాజు, పోతన్న, ఇలా అనేక మంది  శ్రీ రాముడితో స్నేహం ఏర్పరచుకొని వారి జన్మలను సార్ధకత చేసుకోవటం మాత్రమే కాదు మనకు అనేక గ్రంధాలను అందించారు. 

ఈశ్వరునితో స్నేహం: మార్కండేయుడు, కిరాతుడైన కన్నప్ప మొదలైనవారు తాము ఈశ్వరునితో స్నేహం చేసి ముక్తిని పొందారు. 

ఏదేముడితో స్నేహం చేసిన మనం చేసే స్నేహం కేవలం నిరాకారుడైన ఆ పరబ్రహ్మతోటే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనకు నారద మహర్షి నవవిధ  భక్తి మార్గాలు తెలిపారు అవి శ్రవణం, కీర్తనము, స్మరణం, పాదసేవనం, అర్చన, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అను తొమ్మిది భక్తి మార్గాలు.  కాబట్టి భక్తులు భగవంతునితో నిరంతరం స్నేహంచేసి మోక్షాన్ని పొందాలి. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

 మీ 

భార్గవ శర్మ.

పరమశివడను

 శ్లోకం:☝️

  *మన్తవ్యే చాభిమాతవ్యే*

*బొద్ధవ్యే ధృతిసంగమాత్*

  *సుఖే దుఃఖే విమోహే చ*

*స్థితోఽహం పరమః శివః*

   - శివ దృష్టిః


భావం: ఆలోచనలో, అహంకారంలో (నేను నేను అనుకునేది), మెలకువలో, అవగాహనలో, దృఢ సంకల్పంలో (బుద్ధిలో), సంతోషంలో, బాధలో, నిద్రలో మాయలో కూడా ఇలా సర్వావస్థలలో ఉన్నది నేనే పరమశివడను.🙏