ఆవుతో సేంద్రియ వ్యవసాయం -
పశువులలో గోవు , మనిషికి ముఖ్యంగా రైతుకి ఎన్నొ రకాలుగా ఉపయోగపడుతుంది. ఆవుపాలు , నెయ్యి, మజ్జిగ, పెరుగు, మూత్రము , పెడ, కొమ్ములు గిట్టలు అన్ని వ్యవసాయ రంగానికి ఉపకరించేవి.
ఆవుపాల విశిష్టత -
ఆవుపాలకు వ్యాధికారక వైరస్ ని నిరోధించే శక్తి ఉంది. విత్తనాలను ఈ పాలతో శుద్ది చేయడం శ్రేయస్కరం.వీటితో భూసారాన్ని పెంచవచ్చు.
పంచగవ్య విశిష్టత -
పుజాకాలలో పంచామృతాల పేరుతో ఆవుపాలు , పెరుగు, నెయ్యి, తేనే , కొబ్బరినీళ్ళు వాడతారు. వీటిని పవిత్రముగా చెబుతారు. అలాగే వ్యవసాయానికి సంబందించి ఆవుపాలు , పెరుగు , నెయ్యి, మూత్రము , పెడ , కలిపి పంచగవ్య అంటారు. వీటన్నిటిని నిర్దిష్ట పరిమాణంలో మిశ్రమం చేయాలి . ఈ మిశ్రమం పంటల పెరుగుదలకు, యాంటి వైరస్ గా , యాంటి బ్యాక్టీ రియల్ గా పనిచేస్తుంది.
గిట్టలు, కొమ్ములు , వెంట్రుకలు విశిష్టత -
గోవు సహజంగా మరణించిన తరువాత దాని శరీరం నుండి తీసిన గిట్టలు, కొమ్ములు , వెంట్రుకలు, వీటన్నిటిని కలిపి కాల్చిన పిడక పై వేస్తే పొగ వస్తుంది. దీనిని ప్యుమింగ్ అంటారు. కూరగాయల చెట్లకు ఈ పొగ పెడితే వాటికి కీడు చేసే సూక్ష్మ క్రీములు ఎగిరిపోతాయి, లేదా చనిపోతాయి. చచ్చుబడి మడతలతో వంకరగా తయారైన ఆకుకూరలు దీనివల్ల చక్కగా పొడుగ్గా ఎదుగుతాయి.
కొమ్ముల విశిష్టత -
మరణించిన గొవుల నుండి కొన్ని కొమ్ములు సేకరించి వాటిని ఆవుపేడతో నింపి భుమిలొ పుడ్చిపెట్టాలి. ఆరునెలల తరువాత ఈ కొమ్ములు బయటకు తీసి వాటితో ఒక కొమ్ము పేడను ఒక ఎకరం భూమిని సమస్కరించడానికి , సారవంతం చేయడానికి వినియోగించవచ్చు
ఆవుముత్రం తో అధిక దిగుబడి. -
ఆవుముత్రం 5 రకాలు అవి
1. వట్టిపోయిన ఆవు ముత్రము 2. పాలిచ్చే ఆవుముత్రం . 3. చూడి ఆవుముత్రం . 4. ఎద్దు ముత్రము . 5. ఆవుజాతి పశువుల ముత్రము
మొక్కల ఎదుగుదలకు ఇది చాలా బాగా పనిచేస్తుంది . పురుగులను చెట్ల ధరిచేరనివ్వదు.
వరి నాట్లు పూర్తి అయిన తరువాత 20 రోజులకు ఒక లీటరు దేశవాళి మాములు ఆవుముత్రానికి 10 లీటర్ల నీళ్లు కలిపి స్ప్రె చేస్తే అద్బుత ఫలితాలు కనిపిస్తాయి. తరువాత 20 రోజులకు చూడి ఆవు ముత్రాన్ని 1:10 నిష్పత్తిలో నీటితో కలిపి స్ప్రే చేయాలి . మరలా 20 రోజులకు చూడి ఆవు ముత్రాన్ని లీటరుకు 50 గ్రాములు వాయు విడంగాల పొడిని కలిపి 24 గంటలు నానబెట్టి చల్లాలి. నాలుగో సారి అంటే నాట్లు వేసిన 80 రోజుల తరువాత సాదారణంగా స్ప్రే అవసరం లేదు . అవసరం అనిపిస్తే పైన పేర్కొన్నట్టు స్ప్రే చేయాలి . మనం సహజ పద్ధతిలో చేసే వ్యవసాయం కంటే దీనివల్ల మూడు నుండి ఆరు క్వింటాళ్ళ ధాన్యం అదనంగా పండించవచ్చు.
గోముత్రంలో వాయు విడంగాలను 15 రోజులు మురగబెట్టి, పైరు పూత పూసే సమయానికి ముందు ఆకులపై స్ప్రే చేస్తే మాములుగా పంట కన్నా రెండింతలు దిగుబడి అధికంగా వస్తుంది.
ఇదే విధంగా ఉడుగ చెట్టు ఆకులు, కాయలు గొముత్రంలో పదిహేను రోజులు మురగబెట్టి చల్లినా కుడా రెండింతలు దిగుబడి అదనంగా పొందవచ్చు. అయితే కాయలు మాత్రమే మురగబెట్టినప్పుడు ఒక విధమైన ఫలితం. ఆకులు మాత్రమే మురగబెట్టినప్పుడు ఒక విధమైన ఫలితం కలుగుతుంది.
గొముత్రంతో ఎరువుని ఎలా తయారు చేసుకోవాలి
ఆవుపేడ నే కాదు ముత్రాన్ని కుడా ఎరువుగా వినియోగించుకోవచ్చు . ఆవు ముత్రం సాధారణగా వృధా పొతుంది.అక్కడ ఒక తొట్టె కట్టాలి. ఆ తొట్టెలో ప్రతిరోజు ఉదయం మట్టిని వేసి మరుసటి రోజు తీసివేస్తూ ఉండాలి. ఈ విధంగా తీసిన మట్టిని మొక్కకు ఒక తట్ట చొప్పున వేస్తే స్ప్రే చేయాల్సిన అవసరం లేదు . మంచి దిగుబడి వస్తుంది.
జీవద్రవం తయారి విధానం -
ఆవు ఈనబోయే ముందు ఉచ్చ బు డ్డ కనపడుతుంది . ఒక సంచిలో నీళ్లు ఉన్న విదంగా అది గుండ్రంగా ఉంటుంది.దీనికి రంద్రం చేసి జీవ ద్రవాన్ని బకెట్ లొ పట్టుకొవాలి. దానిలొ ఒక నిమ్మకాయ రసాన్ని పిండితే ఇది 3 నెలలు నిలువ ఉంటుంది.
ఈ జీవద్రవాన్ని లీటర్ కి పది లీటర్ల నీళ్లు కలిపి మొగ్గదశకు ముందే ఏ పంటపైన అయినా చల్లితే పూత , పంట ఎక్కువగా వస్తాయి.నారుమల్లు వేసిన 10 రోజులకు దీనిని స్ప్రే చేస్తే ఆరోగ్యవంతమైన తెగుళ్ళు లేని నారుమడి సాధించవచ్చు.
విత్తనాలు, విత్తనశుద్ధి -
విత్తనశుద్ది కొసం ఒక క్వింటా విత్తనాల పై ఒకటి నుండి ఒకటిన్నర లీటర్ల పైన తెలిపిన జీవద్రవాన్ని చల్లి బాగా కలిపి ఒకరోజు నీడలో ఆరబెట్టి ఆ తరువాత విత్తుకోవాలి. ఏ రకం విత్తనాలనైన విత్తడానికి సిద్దం చేసుకున్న తరువాత ఆవుపాలు ఒక భాగం నీళ్లు 9 భాగాలు కలిపి విత్తనాలపై చల్లి నీడలో ఆరనిచ్చి విత్తుకోవాలి.
ఎద్దులు పొలంలో పనిచేసి ఇంటికి వచ్చిన తరువాత పోసే ముత్రాన్ని సేకరించి క్వింటా విత్తనాలకు ఒకటి లేదా రెండు లీటర్లు కలిపి నీడలో ఒకరొజు ఆరనిచ్చి నాటాలి.