2, మార్చి 2023, గురువారం

భగవంతుని సృష్టిలో మానవాళి పాత్ర

 " సహనావవతు ! సహనౌ భునక్తు ! సహవీర్యం కరవావహై ! తేజశ్వినావధీతమస్తు ! మా విద్విషావహై ! "                                       ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః !                                                       ప్రకృతి ప్రసాదించెడి సన్మైత్రీ భావనాత్మక జీవన బాటకు అవరోధాలేల ! సృష్టి కర్త బ్రహ్మ ఒసగిన దివ్యమైన సుప్రకాశాత్మక బ్రతుకులో సుడిగుండాలేల ! సకల జీవ సురక్షాత్మక, సుసంక్షేమాత్మక నిత్య జీవన పథం ! విశ్వ మానవాళి తమ కనీస బాధ్యత నిర్వహించడంలో విఫలులవడం బహు శోచనీయం ! నేడు విశ్వ వ్యాప్త స్థితిగతులను పరికిస్తే, అవగతం అవుతున్న తీరు లోలోతులలో నిశితమైన విధాన బహు రీతుల ఆలోచనీయం ! మానవులలో కనీస మానవతా దృక్పథం కరవవుతున్న నేటి విశ్వ చక్రభ్రమణంలో, ఏమి జరుగుతుందో పూర్తి అయోమయావస్థ ! ఈ దశలోనే మానవాళి తగు రీతిలో యోచించాల్సిన ఆవశ్యకత బహు కీలకం ! భగవంతుని సృష్టిలో మానవాళి పాత్ర ఎంతో ఉన్నతం, మహత్తరం ! సకల జీవ పరిరక్షణలో వారి నిత్య కర్తవ్యం, విశ్వ సురక్షాత్మక నిత్య నడవడికలో విశ్వ మానవాళి సృష్టి, విశ్వ ప్రశాంత జీవన సంకేతం ! భగవత్కల్పితమైన తమ జీవన పయనంలో, సకల చరాచర జీవ జగతికి నిత్య సత్య సుహృద్భావ స్ఫూర్తి కల్పించడమే తమ బాధ్యతగా గుర్తెరిగి మసలాల్సిన సమయమిది !                                       " సర్వే భవంతు సుఖినః ! సర్వే సంతు నిరామయాః ! సర్వే భద్రాణి పశ్యంతు ! మా కశ్చిత్ దుఃఖభాగ్భవేత్ ! "                                ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః !                                       రచన:                                       

   గుళ్లపల్లి ఆంజనేయులు

కడుపు నింపే దేవాలయ నిర్మాత!*


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



  *కడుపు నింపే దేవాలయ నిర్మాత!*

                  ➖➖➖✍️


ఆ నవయువకుడు తనది కాని దేశంలో ఉద్యోగం చేయడానికి కడుపు చేతితో పట్టుకుని వచ్చాడు. 

కావేరి, గోదావరి నదుల దగ్గర ఉద్యోగం చేశాడు. ధవళేశ్వరంలో ఉద్యోగ నిమిత్తం కాపురం ఉన్నాడు. 


ఓసారి ఆతని ఇంటిలో పనిచేసే ఆమె ఓ పదిరోజులు పనిలోకి రాలేదు. పదకొండో రోజున పనిలోకి వచ్చిన పనిమనిషిని ఆతని భార్య నిలదీసింది 'పనిలోకి ఇన్ని రోజులనుంచి ఎందుకు రాలేదని?' 


అంతే...ఆ పనిమనిషి భోరున ఏడవడం మొదలుపెట్టింది. ఆ దొరసాని పనిమనిషిని ఓదార్చి వివరం కనుక్కుంది. ఆరోజులలో గోదారి సీమ అంతా కరువు కాటకాలతో తల్లడిల్లిపోతోంది. కడుపుకింత అన్నం కూడ లేదు. గోదారి ఒండ్రు మట్టిని కూసింత గంజిలో కలుపుకుని అదే అమృతంగా ఇంటిల్లిపాదీ రోజూ తాగి కడుపు నింపుకునే వారు. బతుకు కొనసాగించేవారు. 


అలాంటి వేళలో ఎవరో కాస్త కలిగిన మహానుభావులు ఆ పనిమనిషి సంతానమైన ఆడపిల్లను కొనుగోలు చేసేందుకు వచ్చారు. ఆతల్లి ముందు- వెనుకలాలోచించకుండా తన సంతానాన్ని అమ్మేసింది! డబ్బుకోసం కాదు!! 

తనెలాగూ తన బిడ్డను పోషించలేదు. కాస్త కలిగిన చోట పడితే కనీసం అదన్నా బతుకుతుందని!!! 

ఆ చేతిలో పడ్డ కాసులతో మిగతా కుటుంబం కాలం వెళ్ళదీయచ్చునని!!!!


అమ్మడమంటే అమ్మేసింది కాని అమ్మ మనసును గట్టిపరుచుకోవడానికి సమయం పట్టింది. అందుకే పనిలోకి రాలేకపోయింది. ఇదంతా దొరసానికి భోరున విన్నవించుకుంది.


ఆతర్వాత ఆ దొరసానికి రెండు రాత్రుళ్ళు కంటికి నిద్ర లేదు.. నోటికి ముద్ద పోలేదు. భర్తేమో ఊళ్ళో లేడు. 


భర్త రాగానే ఈ విషయాన్నంతటినీ వివరించింది. “మీరు ఇంజనీర్ కదా...

ఇంతటి గోదావరి మహానది ప్రవహిస్తున్నా ఇక్కడి ప్రజానీకాన్ని ఇలాంటి దుర్గతి నుండి తప్పించలేరా....”అని నిలదీసింది.


ఆ దొర గారు అప్పుడు ఆలోచించారు.

ఏదో ఒకటి చెయ్యాలనుకున్నాడు. గోదారి నీళ్ళను బీడు భూములలోనికి ప్రవహింప చేయాలనుకున్నాడు. పంటలు పండించి అందరి కడుపు నింపాలనుకున్నాడు.!!!

వెంటనే ప్రభుత్వానికి మహజరు పంపాడు. ఎన్నో తిప్పలు పడి విదేశీ ప్రభుత్వాన్ని ఒప్పించాడు.


కాని ఇప్పుడొచ్చింది అసలు సమస్య!!

మహోధృతంగా ఉత్తుంగ తరంగంగా ప్రవహించే గోదావరి నదికి తాను అడ్డుకట్ట వేయగలడా!?

దైవప్రేరేపణ కాకుంటే అసలు తనకా ఆలోచన ఎందుకు వచ్చింది? అని తర్కించుకున్నాడు!!

వెంటనే ఓ మెరుపు మెరిసింది!!

తాను కావేరీ నది పరీవాహాన్ని అధ్యయనం చేసినప్పుడు ఆనదిపై 900 సంవత్సరాల క్రితమే రాజరాజ చోళుడు ఇసుకతో ఆనకట్టను నిర్మించిన ఘట్టం గుర్తుకొచ్చింది. తాను మాత్రం ఆవిధంగా ఎందుకు చేయకూడదు?అనుకుని తన మిత్రుడు అయిన 

‘వీరం వీణెన్న’ను వెంటబెట్టుకుని రంగంలోకి దిగిపోయాడు. గోదావరి సీమ అణువణువూ గాలించేశాడు. గోదారమ్మ పాయలుగా చీలుతున్న ధవళేశ్వరం, ర్యాలి గ్రామాల మధ్యన ఆనకట్ట కట్టేడు.


కోట్లాది మంది కడుపులు నింపాడు. శతాబ్దాలకు,సహస్రాబ్దాలకు సరిపడే సంపద కూర్చి పెట్టేడు!!!!!!


*ఆ దొర గారే సర్.ఆర్ధర్.కాటన్.....!*


అంత కష్టపడ్డందుకు ఆయనకు కలిగిన ఫలితం...

ఆయన ఆనకట్ట పనిమీద దూరంగా ఉన్నప్పుడు ఆయన ముద్దుల కూతురు ఆయన లేకుండానే తుది శ్వాస విడిచింది..!


ఆ పాప సమాధి ధవళేశ్వరంలో ఉంది.


ఆనకట్ట కట్టిన తరువాత దాని పర్యవేక్షణలో కోనసీమలో తిరుగుతుండగా ఓ అగ్రహారంలో ఓ ఉదయాన్న ఓ పండితుడు "కాటన్ మహాశయం తన్నమమ" అంటూ సూర్యభగవానునికి అర్ఘ్యమిస్తుండగా చూశాడు. 


వెంటనే డఫేదారుని అలా ఎందుకంటున్నాడో కనుక్కు రమ్మని పంపేడు.


"ఇక్కడ ఇంత గోదారి ఉన్నా మాకు మన్నేగాని అన్నమేనాడూ లేదు. కాటన్ దొరగారి పుణ్యమా అని మాకందరకూ అన్నపానాలకు,సిరిసంపదలకూ లోటులేకుండా బ్రతుకు గడిచిపోతోంది. ఆయనే మా ప్రత్యక్ష దైవం! అందుకే మా సూర్యునితో పాటుగా ఆయనకూ అర్ఘ్యమిస్తున్నాను" అని అన్నాడట ఆ ఘనాపాటి.


"ఇంతకన్నా నాకింకేం కావాలి"

అని తన జీవితచరిత్ర లో వ్రాసుకున్న అల్పసంతోషి సర్.ఆర్ధర్ కాటన్.


ఆ ప్రత్యక్ష దైవానికి ఆయన పుట్టినరోజు సందర్భంగా మా రైతులందరి పక్షాన....

అనేకానేక కృతజ్ఞతాంజలులు"✍️

    -చక్రావధానుల రెడ్డప్ప ధవేజి.

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀

నిర్మల భక్తి!

 1102.     2-4.   020323-6.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

కన్నయ్య కథలు…


                    *నిర్మల భక్తి!

                    ➖➖➖✍️


మధురకు దూరాన అడవిలో ఒక గురుకులం ఉండేది,     దానికి శ్రీకృష్ణుని భక్తుడైన ‘హరిదామ్యుడు’ అనే గురువు ఉండేవారు. ఆయన తన శిష్యులతో కలసి   యాత్రలకు వెళ్ళొస్తుండేవాడు. అలా ఒక రోజు  తిరుగు ప్రయాణంలో ఉండగా సాయంత్రం వేళ పెద్దవర్షం ఎడతెరపి లేకుండా కురియడం వలన వర్షం ధాటికి నీళ్లు ముంచెత్తడంతో మార్గంలోని పల్లెల్లో దారులన్నీ నీటితో నిండి నిర్మానుష్యమయ్యాయి, వేరే దారిలేక ఒక పల్లెలోని ఇంట్లో విడిది చేశారు. 


ఆ భారీ గాలి, వర్షానికి దారిలోని అందరూ ఇళ్లల్లో తలుపులు బిగించుకొని ఉన్నారు. 


హోరుగాలి, వానలో సుడిగాలికి ఎగిరివచ్చిన ఎండుటాకులాంటి ఒక కుర్రవాడు నిరాధారంగా తిరుగుతూ తనకేదైనా ఆశ్రయం దొరుకు తుందేమోనని పది పన్నెండేళ్ళ మధ్యన వయసున్న సన్నగా, దుర్భలంగా వున్న శరీరంపై చిన్న లాగు చొక్కా తప్ప వాన, చలి నుండి కాపాడడానికి వేరే మరింకే ఆచ్ఛాదన లేని ఒక బాలుడు. ఆ కుర్రవాడి పేరు అనంతుడు. చలికి గజగజ వణుకుతూ ఎటుపోవాలో తెలియక చాలాసేపు దారిమధ్యలో నిలబడి పోయాడు.


అటూ ఇటూ పరికించి చూశాడు, ఎవరినైనా తలుపుతట్టి ఆశ్రయం అడగాలంటే అపరిచితుడైన తనను దొంగగా భావించి లోపలికి రానివ్వరనే భయంతో అలాగే సాగిపోతుంటే ఒక పెద్ద వటవృక్షం కనిపించింది. ఆ చెట్టు మొదల్లో కాస్తంత స్థలం నీరులేకుండా కనిపించడంతో బ్రతుకు జీవుడా అని ఆ జానెడు స్థలంలో ముడుచుకొని కూర్చున్నాడు. కొంతసేపటికి నిద్రలోకి జారిపోయాడు.


తూర్పు తెలవారుతుండగా వాన ఆగిపోయింది... ప్రజలింకా తలుపులు తెరువలేదు. ఆ సమయంలో గురువు హరిదామ్యుడు వారి శిష్యులు గురుకులానికి బయలుదేరి ఆ దారిన నడిచివెళ్తుండగా అనుకోకుండా ‘అనంతుడు’ గురువుగారి దృష్టిలో పడ్డాడు. 


కనీసం కప్పుకునేందుకు చిన్న దుప్పటైనా లేకుండా ఆ భయంకరమైన వాన, చలిలో ముడుచుకొని వున్న ఆ బాలుని చూసి గురువు దయార్ద్ర హృదయం ద్రవించింది. వెంటనే ఆ బాలుని దగ్గరకు వెళ్లి తట్టి లేపాడు. బాలుడు కళ్ళు తెరచి ఎదుట నిలిచివున్న గురువును చూసి భయంతో, భక్తితో లేచి నిలబడ్డాడు. 


“ఎవరు నువ్వు? ఈ వాన, చలిలో ఇక్కడ ఇలా ఎందుకు పడుకున్నావు” అని ప్రశ్నించిన గురువుకు తన పేరు అనంతుడు అని, తనకెవ్వరూ లేరని, ఈ ఊరిలో ఏదైనా బ్రతుకుదెరువుకోసం పని దొరికితే చేసుకుందామని వచ్చానని, తుఫాను తాకిడికి ఎటుపోవాలో తెలియక ఈ చెట్టునాశ్రయించానని చెప్పడంతో గురువు జాలిగుండె కరిగి, తనతో తన ఆశ్రమానికి రమ్మని చెప్పాడు. మహదానందంతో అనంతుడు గురువును అనుసరించాడు.


గురుకుల ఆశ్రమానికి చేరుకున్నాక తన శిష్యుడిని పిలిచి అనంతుడికి భోజనం పెట్టి మార్చుకొనేందుకు బట్టలిచ్చి ఇకపై ఆ కుర్రవాడు ఇక్కడే వుండి ఆశ్రమంలో ఏదో ఒక పని చేసుకుంటూ తల దాచుకునేటట్టు ఏర్పాటు చేయమన్నాడు. 


గురువుకు కృతజ్ఞతలు చెప్పుకొని అనంతుడు ఆ శిష్యుడి వెనుక వెళ్ళాడు. 


ఆ రోజునుండి ఆశ్రమంలో తోటపని, ఇతర చిన్నా, చితక పనులు చేసుకుంటూ నమ్మిన బంటులా అందరి తలలో నాలుకలా మసలుకుంటూ అందరితోపాటు గురువుగారి మన్ననకు పాత్రుడయ్యాడు.


కొంతకాలం తర్వాత ఎందుకో అనంతుడు మొఖం చాలా ఉదాసీనంగా మారడం గమనించాడు గురువు. ముందులా హుషారుగా కాకుండా ఏదో పరధ్యానం, అసంతృప్తి అతనిలో కనిపిస్తున్నాయి. అన్ని విధాలా విచారించగా అతనిపట్ల ఎవ్వరూ అనుచితంగా ప్రవర్తించలేదని, అన్నీ సక్రమంగానే వున్నాయని తెలిసింది. అయితే ఆ మార్పుకు కారణమేమిటి? అంతుబట్టలేదు గురువుగారికి. 


అసలు కారణం     వచ్చిన క్రొత్తలో తినడానికి తిండి, తలదాచుకోవ డానికి నీడ దొరికాయని సంతోషించాడు. కానీ కొన్ని రోజుల తర్వాత తన పనులు తాను చేస్తూనే ఇక్కడికి వచ్చే అందరినీ గమనించేవాడు. అనేకమంది ఇక్కడకు వచ్చి గురువువద్ద ఆధ్యాత్మిక విద్య, స్తోత్రపాఠాలు నేర్చుకొనేవారు. ధ్యానమందిరంలో కూర్చొని పూజలు, ప్రార్థనలు చేసేవారు. ఇవన్నీ చూశాక అనంతుడు వారంతా గొప్పవారు, చదువుకున్నవారు, వారు మంత్రాలతో, ప్రార్థనలతో, భగవంతుని కీర్తిస్తూ దైవానుగ్రహానికి పాత్రులవుతున్నారని, తనకు చదువు, సంధ్యా, వాక్సుద్ధి లేదు కాబట్టి ఎలా ప్రార్థించాలో తెలియక నిరాశా, నిస్పృహలతో వున్నాడు. రోజంతా కష్టపడి పనిచేసి, వేళకి తిని, పడుకొనే తనకు దైవానుగ్రహం ఎందుకు లభిస్తుంది? 

తనపట్ల దైవం ఎలా ప్రసన్నం కాగలడు?  ఇదీ అతనిలో నైరాశ్యానికి మూలకారణం.


ఒకనాడు హఠాత్తుగా ఒక చిత్రమైన పరివర్తన అనంతుడి ముఖంలో కనిపించడంతో గురువుగారు ఆశ్చర్యపడ్డాడు. 


ఎన్నడూ లేని ఒక క్రొత్తకాంతి అతని మొఖంలో చోటు చేసుకుంది. అతని మాటల్లో, చేతల్లో సంతోషం, ఉత్సాహం పొంగిపొర్లుతున్నాయి. 


అందుకు కారణమేమైవుంటుందా అని తెలుసుకోవాలని నిశ్చయించు కున్నాడు గురువుగారు. 


ఆరోజు మధ్యాహ్నం భోజనానంతరం ఎవరికి వారే ఎండవేళలో తమ తమ కుటీరాల్లోకి వెళ్ళిపోయారు. గురువు గారు కూడా తన కుటీరంలోనికి వెళ్లి తలుపులు మూసుకొని కిటికీలో నుండి అనంతుడిని గమనించసాగాడు. 


ఎప్పటిలా తన పనులన్నీ ముగించుకొని కుటీరం దగ్గర అరుగుపైన కూర్చున్న అనంతుడు ఒకసారి లేచి నిలబడి చుట్టూ పరికించి చూశాడు. ఎవరూ లేరని తననెవరూ గమనించడం లేదని దృఢపడ్డాక మెల్లగా ముందుకు నడిచాడు. అది చూసిన గురువు కుటీరం నుండి బయటకు వచ్చి అనంతుడు తనను చూడకుండా జాగ్రత్తపడుతూ అతడేం చేస్తున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో గమనించ సాగాడు. 


అనంతుడు తిన్నగా కుటీర ధ్యానమందిరంలోనికి వెళ్లి తలుపులు మూసుకొనడం చూసి గురువుగారు దిగ్భ్రాంతి చెందాడు. 


వెంటనే సడీచప్పుడు చేయకుండా కుటీర మందిరం వద్దకు వెళ్లి చాటుగా అనంతుడు ఏం చేస్తున్నాడో చూడసాగాడు.


అనంతుడు మందిరం మధ్యలో వున్న శ్రీ కృష్ణుని విగ్రహంముందు మోకాళ్ళపై కూర్చొని ప్రార్థనా పూర్వకంగా భక్తితో ఏదో మాట్లాడడం చూసి గురువుగారు శ్రద్ధగా విన్నాడు..

"కృష్ణా! అందరూ నిన్ను స్తోత్ర పాఠాలతో స్తుతించి, ప్రార్థించి నీ మన్ననలు పొందుతున్నారు..

నాకు చదువురాదు.. పూజలు రావు.. స్తోత్రాలు రావు... అందుకే నిన్ను నాకు తెలిసిన విద్యతో ప్రసణ్ణున్ని చేసుకోవాలని వచ్చాను.    రోజూ నా ప్రదర్శన చూసి నన్ను అనుగ్రహించి 

నీ దర్శనభాగ్యం ప్రసాదించడం నా అదృష్టం. అందుకే ఈరోజు మరికొన్ని క్రొత్త ఆటలు ఆడి నిన్ను సంతోషపెట్టాలని వచ్చాను. చూసి ఎలా ఉన్నాయో చెప్తావు కదూ?" అంటూ తన సంచిలో నుండి 10 బంతులు బయటకు తీసి వాటిని గాలిలో ఎగురవేస్తూ ఒక్కటికూడా క్రిందపడకుండా ఆడాడు, ఆ తర్వాత అరచేతిని నేలపై మోపి తల క్రిందికి, కాళ్ళు పైకి పెట్టి మందిరం అంతా నడిచాడు. ఆ తర్వాత చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేశాడు. అన్నీ ముగిశాక మోకాళ్ళపై మోకరిల్లి స్వామితో.. "కృష్ణా! చెప్పు! ఈ రోజు నేను ప్రదర్శించిన విద్యలు నీకు నచ్చాయా?” అని భక్తితో అడిగాడు. 


వెనువెంటనే భగవానుడి విగ్రహంనుండి కనులు మిరుమిట్లు గొలిపే ప్రకాశవంతమైన వెలుగు వెలువడింది. ఆ వెలుగుతోపాటు స్వామి మాటలు కూడా ప్రతి ధ్వనించాయి..."మిత్రమా! అనంతా!! నీ విద్యలు అమోఘం... అవి చూసి నేను చాలా ఆనందించాను. రేపు కూడా వచ్చి నీ ఆటలు ప్రదర్శిస్తావు కదూ?" అన్నాడు.


"తప్పకుండా కృష్ణా!" అని లేచి నిలబడ్డాడు అనంతుడు. 


బయటనుండి ఈ దృశ్యం చూసి…                 శ్రీ కృష్ణుని పలుకులు విని గురువుగారు శిలాప్రతిమలా నిలబడిపోయాడు. 


తలుపులు తెరిచిన అనంతుడు గురువును చూసి ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. 


కానీ గురువుగారు అతన్ని ఆమాంతం ఆలింగనం చేసుకున్నాడు..“నాయనా అనంతా! ఎన్నో దశాబ్దాలనుండి ఏకదీక్షతో నేను స్వామిని కొలుస్తున్నాను, ఎన్నో మంత్రాలు జపిస్తున్నాను. ఎందరికో నేర్పిస్తున్నాను. కానీ ఇంతవరకు నాకు ఆ భగవానుడి సాక్షాత్కారం లభించలేదు. ఈ రోజు నిర్మల భక్తిభావంతో సరళ హృదయంతో నీవు ఆటలాడి స్వామిని మెప్పించి సాక్షాత్కారాన్ని పొందావు. నీవు ధన్యుడవు. ఈ రోజునుండి నీవు ఈ ఆశ్రయంలో పనివాడవు కాదు.. నా ప్రథమ శిష్యుడవు.. నీకు సకల విద్యలూ నేర్పిస్తాను” అన్నాడు ఆనందాశ్రువులతో...


 దైవానుగ్రహం పొందాలంటే కేవలం జప తపాదులు, యజ్ఞయాగాదులు, మంత్రతంత్రాలు మాత్రమే కాదు. వాటితో బాటుగా ముఖ్యంగా కావల్సింది నిర్మలమైన భక్తి, స్వచ్ఛత తప్పక ఉండాలి.* ✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

శ్రీ కరకచెట్టు పోలమాంబ ఆలయం

 విశాఖపట్నం జిల్లా : పెద్దవాల్తేరు

⚜ శ్రీ కరకచెట్టు పోలమాంబ ఆలయం


💠 సాధారణంగా సముద్రంలో జాలర్లు 'వల' విసిరినప్పుడు దేవతా విగ్రహాలు ఆ వలలో పడటమనేది జానపద కథల్లో వింటూ ఉంటాము. కానీ నిజంగానే కొన్ని వందల సంవత్సరాల క్రితం, చేపల వేటకి సముద్రంలోకి వెళ్లిన ఇక్కడి జాలరులు 'వల' విసరగా అందులో దుర్గాదేవి మూర్తి పడింది. 

అమ్మవారి మహిమగా భావించిన జాలరులు ఆ ప్రతిమను తీసుకువచ్చి తాత్కాలికంగా ఒక 'కరకచెట్టు' క్రింద ఉంచారు.

ఆ తరువాత భక్తుల సంకల్పంతో అమ్మవారికి ఆలయం నిర్మించబడింది. ఈ అమ్మవారు వచ్చిన దగ్గర నుంచి వర్షాలు బాగా కురవడం .. పొలాలు కళకళలాడుతూ ఉండటం జరుగుతోంది. ఆరంభంలో కరకచెట్టు క్రింద ఉండటం వలన .. పొలాలు పచ్చగా వుంచుతున్నందు వలన ఈ అమ్మవారిని 'కరకచెట్టు పోలమాంబ'గా భక్తులు పూజిస్తుంటారు .. ఆ తల్లి అనుగ్రహాన్ని పొందుతుంటారు.


💠 విశాఖలో ‘వాల్తేరు’ ...ఈ పేరు  వినగానే ఉత్తరాంధ్ర వాసులందరికీ శ్రీ పోలమాంబ అమ్మవారి ఆలయం గుర్తొస్తుంది. విశాఖపట్నం సమీపంలోని పెద్ద వాల్తేరు సమీపంలో ఉన్న ఆలయానికి వందల సంవత్సరాల చరిత్ర ఉంది.


💠 విశాఖ నగర తీరాన కొందరు దేవతలు కొలువై ఉన్నారు. వీరిలో ఎరుకమాంబ, శ్యామలాంబ, పోలమాంబ, కుంచమాంబ, ముత్యామాంబ, నూకలమ్మ, ఎర్నిమాంబ, నుత్యమాంబ, నీలమ్మ పేర్లతో ఉండే ఈ గ్రామ దేవతలందరూ విశాఖపట్నాన్ని కంటికి రెప్పలా కాపాడతారని అక్కడి ప్రజలు నమ్ముతారు. 

ఈ గ్రామ దేవతల్లో ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేక చరిత్ర ఉంది. 

ఈ నేపథ్యంలో విశాఖ సమీపంలోని వాల్తేరు శ్రీ కరకచెట్టు పోలామాంబ అమ్మవారి ఆలయ విశిష్టత, ప్రాముఖ్యతల గురించి తెలుసుకుందాం...


💠 గతంలో అమ్మవారిని జీడిపళ్ల అమ్మవారు అని పిలిచేవారు. ఎందుకంటే పండుగ జరుపుకునే సమయంలో ఈ అమ్మవారి గుడిపై జీడిపళ్లు విసిరేసేవారట. గర్భాలయంలో కొలువుదీరిన అమ్మవారి శిరస్సుపై సర్పం, చేతుల్లో ఖడ్గం, కుంకుమ భరణి, నిమ్మకాయల దండ అలంకరణతో మనకు దర్శనమిస్తారు. జ్ఞానం, ఐశ్వర్యం, శక్తిని మూడింటిని ఏక కాలంలో ప్రసాదించే అమ్మవారే పోలామాంబ అని స్థానికులు నమ్ముతారు. 

ఈ అమ్మవారు పొలాల్ని రక్షించే దైవంగా భావిస్తారు. అధిక పంటలు రావడంలో ఈ అమ్మవారి అనుగ్రహం ఉంటుందని గట్టిగా నమ్ముతారు. అందుకే ఈ అమ్మవారికి శ్రీ పోలామాంబ అనే పేరొచ్చింది.


💠 శ్రీ పోలమాంబ అమ్మవారు అక్కడ కొలువు దీరడం వెనుక శతాబ్దాల చరిత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అమ్మవారిని జీడిపళ్ల అమ్మవారు, సర్పదేవత, సముద్ర దేవత పేర్లతోనూ పిలుస్తారు. 

ఈ అమ్మవారు ఉత్తరాంధ్ర ప్రజలకు, విశాఖపట్నం చుట్టూ పక్కల ఉన్న 14 గ్రామాల వారికి ఈ అమ్మవారే ఆరాధ్య దైవం. 


💠 పిలిస్తే పలికే దైవంగా.. తమ ఇంటి ఇలవేల్పుగా, సముద్ర దేవతగా, సర్ప దేవతగా, శశ్య దేవతగా భక్తులు కొలుస్తారు. 

ప్రతి మంగళవారం, శుక్రవారాల్లో భక్తులు ఈ పుణ్యక్షేత్రానికి భక్తులు తరలివస్తారు. 

ప్రతి సంవత్సరం ఉగాది, శ్రావణ మాసంలో ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు.


🔅 చరిత్ర 🔅


💠 ఈ అమ్మవారు సుమారు 900 సంవత్సరాల క్రితం విశాఖ సాగర తీరంలో జాలర్లకు అమ్మవారి విగ్రహం దొరికినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఆ విగ్రహాన్ని తమ గ్రామంలో ప్రతిష్టించి కొలుస్తుండగా.. ఒకరోజు జాలర్లకు అమ్మవారు కలలో కనిపించి, తనను పెద్ద వాల్తేరులో ఉన్న మద్ది వంశీయులకు అప్పగించాలని ఆదేశించిందట. దీంతో వారు వెళ్లి అక్కడ అప్పగించారు. 

ఆ తర్వాత మద్ది వంశం వారికి కూడా కలలో కనిపించి తనను పెద్ద వాల్తేరులోని కరకచెట్టు కింద ప్రతిష్టించమని ఆదేశించగా వారు అక్కడే అమ్మవారిని ప్రతిష్టించి పోలమాంబ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. అప్పటినుంచి ఈ అమ్మవారు కరకచెట్టు పోలమాంబగా ప్రసిద్ధి చెందారు.


💠 గర్భాలయంలో, ఆలయంలో మూడు విగ్రహాలు ప్రతిష్టించబడ్డాయి. మొదటిది లక్ష్మీదేవి యొక్క స్వరూపం అయిన కుంచమాంబ, రెండవది దుర్గాదేవి యొక్క స్వరూపం అయిన పోలమాంబ. మరియు మూడవది సరస్వతీ దేవి యొక్క అభివ్యక్తి అయిన నీలమాంబ దేవి.


💠 అమ్మవారికి రెండు వైపులా కుంచెమాంబ, నీలమాంబ అమ్మవార్లు కొలువు దీరి ఉంటారు. ఇక్కడ ఉండే ఉప ఆలయాల్లో నేస్తాలమ్మ, బంగారమ్మ, ముత్యమ్మ, సత్యెమ్మ, పిడుగులమ్మతో పాటు ఇంకా ఇతర దేవతలను మనం చూడొచ్చు. 


💠 ఇక్కడ 2 వేపచెట్టులు ఇదే గట్టుపై ఉండేవని, ఆలయంలో ఒక వేపచెట్టు ఎండిపోయి ఉండగా దాన్ని బొర్రకు ఒక పశువుల కాపరి ఎండిపోయింది కదా అని అగ్గి పెట్టగా అతన్ని అమ్మవారు సర్ప రూపంలో వచ్చి కాటువేసిన వైనాన్ని పూర్వికులు, చెపుకోవడంతో అమ్మవారి ప్రాబల్యం మరింత తెలిసింది. 

మిగిలిన ఒక వేప చెట్టు ఈనాటికి సజీవంగా శ్రీ పోలమాంబ పుట్టబంగారాన్నీ తోలేళ్ళు రోజున తీసుకొచ్చి అమ్మవారి ఉత్సవాలు జరపటం నేటికీ ఆనవాయితీగా వస్తుంది.


💠 కేవలం పది రోజుల వ్యవధిలోనే అమ్మవారి ఆలయాన్ని నిర్మించుకున్న ఘనత ఆ పోలమాంబ అమ్మవారిదే.


💠 ఉగాది తర్వాత ఆదివారం నుంచి 9 రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు కొనసాగుతాయి.


💠 విశాఖ రైల్వేస్టేషన్ నుంచి  4 కిమీ దూరంలో ఉంది.


 





చమత్కార శ్లోకం

 ఒక చమత్కార శ్లోకం చూడండి ...


 అంబలి ద్వేషిణం వందే


 చింతకాయ శుభ ప్రదమ్


 కూరగాయ కృత త్రాసం


 పాలనేతి గవాం ప్రియమ్


తెలుగూ, సంస్కృతమూ కలగూరగంపలా కలగలిసి పోయిన ఈ శ్లోకం చూసారా ? 


కవిగారి అభావ చేష్ఠ అని పోనీ లెమ్మని సరి పెట్టుకుందామంటే అర్ధం కూడా అదోలా లేదూ?


అంబలిని ద్వేషించే వాడికి వందనమట. 

చింతకాయ చాలా శుభ దాయకమట.

 కూరగాయ భయోత్పాతకమట. 

ఆవు పాల నేయి ప్రియమైనదట. 


ఏమిటీ కారు కూతలూ అనుకుంటున్నారా ?


అం , బలి = బలిని అణచి వేసిన వాడు


చింతక , ఆయ = నామ స్మరణ చేసే వారికి సకల శుభాలు ఇచ్చేటి వాడు


కు , ఉరగాయ = దుష్ట సర్పమును ( కాళీయుని) అణచి వేసిన వాడు


పాలన , ఇతి = గోవులను కాచునట్టి వాడు (అయినట్టి) ( శ్రీ కృష్ణునికి )


వందే = నమస్కరించుచున్నాను.


ఇది శ్రీ కృష్ణ నామ స్మరణ చేసే శ్లోకం.


🌷🌷🌷🌷🌷🌷

అనుభవించవలసినదే

 .


                     *సుభాషితమ్*


శ్లో.

*త్రయః కాలకృతాః పాశాః*

*శక్యన్తే న నివర్తితమ్।*

*వివాహో జన్మ మరణం*

*యథా యత్ర చ యేన చ॥*


తా|| 

*వివాహము, జన్మ, మృత్యువు ఈ మూడు కాలపాశములు ఎప్పుడు ఎక్కడ ఎవడిచే అనుభవించబడవలెనో అప్పుడు అక్కడ అతడు అనుభవించవలసినదే! ఇవి మార్చడానికి అసాధ్యమైనవి*.

మా కాలనీ మొత్తం వస్తుంది"

 ఒక ఫ్లాట్ లో డోర్ బెల్ మోగింది

ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ తలుపు తీసింది

బిచ్చగాడు

"భవతీ, భిక్షాం దేహీ!" 

మహిళ:

"ఇదిగో, తీసుకో అయ్యా"

బిచ్చగాడు

 "తల్లీ, కొంచెం గుమ్మం ఇవతలికి వచ్చి వేస్తారా!" 

మహిళ గుమ్మం దాటి రాగానే 

బిచ్చగాడు ఆమె చేయి పట్టుకుని

"హ హ్హ హ్హా.... నేను బిచ్చగాణ్ణి కాను, రావణుడిని" 

😛😛

అందుకామె,

" హా హా హా..... నేను కూడా సీతను కాను, పనిమనిషిని"... 

😛😛😛

కథ ఇంతటితో అయిపోలేదు... 

రావణుడు

 " హ హ్హ హ్హా.... సీతని తీసుకెళ్లినందుకు ఇప్పటికీ బాధపడుతున్నాను.... అదే నిన్ను తీసుకెళ్తే మండోదరి కూడా సంతోషపడుతుంది.... తనకి కూడా పనిమనిషి అవసరం ఉంది "

😛😛😛

మహిళ

" హా హా హా..... పిచ్చి వాడా..... సీత కోసం రాముడొక్కడే వచ్చాడు.... నా కోసం అయితే మా కాలనీ మొత్తం వస్తుంది"

😝😝😂😜😜

డోన్ట్ అండరెస్టిమేట్ ది పవర్ ఆఫ్ పనిమనిషి 😜 #🤣

ఇహలోకంలోను పరలోకంలో కూడా!

 శ్లోకం:☝️

*నాస్తి వేదాత్పరం శాస్త్రం*

 *నాస్తి మాతుః పరో గురుః ।*

*నాస్తి దానాత్పరం మిత్రం*

 *ఇహ లోకే పరత్ర చ ll*

    అత్రిస్మృతిః - 148


భావం: వేదాలను మించిన శాస్త్రం లేదు. తల్లిని మించిన గురువు లేదు, దానాన్ని మించిన స్నేహితుడు లేడు; ఇహలోకంలోను పరలోకంలో కూడా!

తులసి దళం చేత ఇంత అద్భుతమా

 ఒక వ్యక్తి రోజు అడవిలోకి వెళ్లి కూరాకులు కోసుకొచ్చి అమ్ముకుంటూ జీవనం గడుపుతున్నాడు

అలా అతను రోజూ అడవికి వెళ్లే దారిలో ఒక గుడిసె ముందు ఒక ముసలాయన ఏడుకొండల స్వామి విగ్రహం చిన్నది పెట్టుకుని తులసి ఆకులతో అర్చన చేసేవారు


అది చూసి చాలా ముచ్చటపడేవాడు

మనం కూడా ఇలా చేయాలి అని అనుకున్నాడు కాని

చేయలేకపోయేవాడు

అతను అడవిలో కూరాకులు కోస్తుంటే  తులసి చెట్టు కనిపించింది

వెంటనే ఆ వ్యక్తి మనం ఎలాగూ పూజ చేయలేము ఇవి కోసుకెళ్లి ఆ బ్రాహ్మణుడికి ఇద్దాం అని అనుకున్నాడు


కోసిన కూరాకులతో పాటు తులసి దళాలను కట్ట కట్టి నెత్తిన పెట్టుకుని వచ్చాడు

అతడికి తెలియని విషయం ఏంటంటే నల్ల నాగు ఒకటి అందులో ఉన్నింది


ఇతను వెళ్లి గుడిసె ముందు నిలబడగానే 

ఎవరో వచ్చి నిలబడ్డారని తల తిప్పి చూసిన బ్రాహ్మణుడితో అయ్యా తులసి దళాలు తెచ్చాను పూజకు 

నేను చేయలేను అందుకే మీకు ఇస్తున్నాను అని అన్నారు


ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్న ఆ బ్రాహ్మణుడికి తన దివ్యదృష్టితో తులసి దళాలనూతెచ్చిన వ్యక్తి  వెనుక రాహువు నిలబడిఉండడం  గమనించాడు


అతడితో నాయనా  నేను చెప్పేవరకు ఈ కట్టను  నీ తలపై నుండి దించకు అని చెప్పి గుడిసె వెనకకు వెళ్ళి ఒక మంత్రం జాపించగానే రాహువు వచ్చాడు


రాహువుకు నమస్కరించి ఎందుకు అతడి వెనుక వచ్చావువని అడగగా

రాహువు ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి 

నేను ఈరోజు అతడికి హాని చేయాల్సి ఉంది అదే విధి రాత కాని అతను తన తలపైన తులసి దళాలను మొస్తున్నాడు అందుకే నా పని చేయలేకపోయాను అతను అది దించగానే నేను కాటేసి వెళ్ళిపోతాను అని అన్నాడు


ఈ విషయం వినగానే బ్రాహ్మణుడికి చాలా జాలేసింది 

ఎప్పుడూ రానివాడు ఈరోజు పూజకు దళాన్ని తీసుకురావడంతో .

ఇతడిని ఈ గండం నుండి తప్పించాలంటే ఏదైనా పరిష్కారం ఉందా అని అడిగినప్పుడు రాహువు


అయ్యా మీరు ఇన్నిరోజులు పూజ చేసిన పుణ్యాఫలాన్ని అతడికి దానం ఇచ్చినట్టయితే ఈ గండం నుండి తప్పించవచ్చు అని రాహువు చెప్పగానే 


బ్రాహ్మణుల వారు ఏమీ ఆలోచించకుండా అతడికి దానం ఇస్తున్నాను అని చెప్పడంతో రాహువు ఆశ్చర్యపోయి సంతోషంతో వెళ్ళిపోయాడు

ఆ పాము మాయమైంది


ఒక్క తులసి దళం చేత ఇంత అద్భుతమా 

ఒక దానం  ఇవ్వడం వల్ల ఒక్క ప్రాణం నిలబడడమా 

మన సంపాదించుకున్న పుణ్య ఫలం ఇంత శక్తి గలదా  

దేవతా గ్రహాలని బ్రహ్మ రాతను మార్చేంత శక్తి గలదా 


బ్రాహ్మణుడు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఇక నుండి రోజూ నాకు తులసి దళాలను తెచ్చి ఇవ్వాలి అని చెప్పాడు

సంతోషించిన ఆ వ్యక్తి అలాగే అని ఒప్పుకున్నాడు


ఆస్తులే కూడబెట్టక్కరలేదు ఆపదను తప్పించుకోవడానికి కొంచం మంచి పనులు చేయండి


🌹 లోకాస్సమస్తాః సుఖినోభవంత 🌹

🙏🏼 సమస్త సన్మంగళాని భవంతు 🙏🏼

  🌿 *_శుభమస్తు_* 🌿

మీరు అదృష్ట వంతులే

 *మీ నాన్న గారి జీవితం కంటే మీ జీవితం మెరుగ్గా ఉంటే మీరు అదృష్ట వంతులే.కొంతమంది కోట్లు సంపాదిస్తారు.వారిలో కొందరు పూర్తిగా దివాళా తీస్తారు. మరి అలా దివాళా తీసిన వారు మీకు కనిపించరా?*


*మైక్రో సాఫ్టు అధినేత సత్యానాదెళ్ళ గారు వేల కోట్లు సంపాదించారు. కానీ వారికి పూర్తి అంగవైకల్యం ఉండి వీల్ ఛైర్ కు మాత్రమే పరిమిత మైన కొడుకు ఉండేవాడు.అతను దాదాపు 25సంవత్సరాలపాటు అలాగే జీవించి ఇటీవలే మరణించాడు.మరి వారికి వచ్చి న ఈ దురదృష్టం ఎందరికి తెలుసు?*


*అలాగే మాగుంట సుబ్బరామిరెడ్డి గారు వేలకోట్లు సంపాదించారు.వారికి మానసిక వికలాంగుడైన కొడుకు ఉండేవాడు.అతనికి అంగరంగ వైభవంగా పెళ్ళి చేశాడు. కానీ అది కూడా ఫలించలేదు.*


*మన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు కూడా వందల కోట్ల ధనము సంపాదించాడు. అయినా గానీ వారి‌మొదటి భార్య చనిపోతే ప్రేమ తో పట్టెడు అన్నం పెట్టే వాళ్లు లేరు. అలాగని రెండో పెళ్ళి చేసుకుంటే కుటుంబ కలహాలతో పదవీ చ్యుతుడై మనస్తాపం తో చనిపోయాడు.*


*రేమండ్సు అధినేత విశ్వపతి సింఘానియా తన స్వశక్తితో రేమండ్సు కంపెనీ ని బాగా అభివృద్ధి చేశాడు వేలకోట్ల ఆస్తులను తన పుత్ర రత్నానికి బహుమతి గా ఇచ్చాడు. ఇంత చేస్తే ఆ పుత్రుడే వారిని తమ ఇంటి నుంచి బయటకు గెంటేశాడంటే ఎంత హృదయ విదారకంగా ఉంటుంది. ?*


*మనము ఎంత సంపాదించామనేది ముఖ్యం కాదు. మనము ధర్మ మార్గం లో జీవిస్తూ ఉండటం ముఖ్యం. మన పిల్లలకు మరియు ఇతర కుటుంబ సభ్యులకు మంచి సంస్కారం అందించాలి. ఇలా ఉంటూ మన శక్తి మేరకు సంపాదిస్తూ వచ్చి న డబ్బు ను ఆస్తులను ఒక ధర్మ కర్త వలె ఖర్చు పెట్టాలి.అప్పుడే ఆ డబ్బు సుఖమును తృప్తి ని ఇస్తుంది. ఇలా తృప్తి సుఖము ఉంటే అన్నీ ఉన్నట్లే. ఎంత సంపాదించాము అనేది ముఖ్యము కాదు.*


*ఇలా ఎంతో మంది ధనికులు చాలా బాధలు పడ్డారు.*


*డబ్బు తనతో పాటు కొంత చెడును కూడా తీసుకుని వస్తుంది. డబ్బు ఉంటే అహంకారం వస్తుంది. ఆ అహంకారమే అన్ని అనర్థాలకు మూలకారణం అవుతుంది.*


*ఇలా ప్రతివారికీ ఏవో దురదృష్టం కూడా ఉంటుంది. కావున ఇతరుల ఆస్తులను గూర్చి అసూయ పడ కూడదు.*


*ఎంత చెట్టు కు అంత గాలి ఉంటుంది. ఈ విషయం మరచిపోకూడదు.*


*మనకు ఉన్న దానితో సంతోషిస్తూ మన తెలివితేటలతో ఎక్కువ సంపాదించే కృషి చేయాలి.*


*మనకు మంచి ఆకలి వేస్తూ ఉండటం, ఆకలివేసినపుడు‌మంచి భోజనం, మంచి నిద్ర, ఒక ఇల్లు, సంఘంలో గౌరవ ప్రదమైన జీవితం జీవిస్తూ ఉంటే మనము చాలా ధనవంతులము, అదృష్ట వంతులము కూడా. దానికి తోడు ప్రశాంతమైన,ధర్మ మార్గం లో జీవనం. ఇవి ఉంటే అన్నీ ఉన్నట్లే.*


*ఎవరికీ ఎప్పుడూ సుఖాలు ఉండవు. సుఖపడినవారు కష్టాలు పడతారు. కష్టపడిన వారు సుఖపడే అవకాశం కూడా ఉంటుంది. కష్టపడేవారు హాయిగా భోజనం చేసి హాయిగా నిద్రపోతారు. ఈ అవకాశం చాలా మంది ధనవంతులకు లేదు గదా.*


*ఏ కష్టాలు లేని వారి ఇంటి నుంచి గుప్పెడు బియ్యం తీసుకుని రాగలరా? ప్రయత్నించి చూడండి.*


*ఇలా అసూయ పడతారనే శేషప్ప కవిగారు సరళమైన తెలుగు పదాలతో ఇలా చెప్పారు.*


*తల్లి గర్భము నుంచి ధనము తేడెవ్వడు*


*వెళ్ళి పోయెడినాడు వెంటరాదు*


*లక్షాధికారైన లవణమన్నమె గాని*


*మెండుబంగారంబు మింగబోడు.*


*ఏ వస్తువు అయినా తాత్కాలికంగా సుఖమును ఆనందమును ఇస్తుంది. సుదీర్ఘ కాలములో ఎన్ని ఎక్కువ వస్తువులు ఉంటే అంత ఎక్కువ అశాంతి ఉంటుంది. కావాలంటే మీరు కూడా సేకరించి చూడండి. ఎక్కువ డబ్బు సంపాదించినా కూడా అదికూడా అశాంతికి దారితీస్తుంది.*


*మన కోరిక లే అన్ని దుఃఖాలకు మూలకారణం అని బుధ్ధుడు ఎప్పుడో చెప్పాడు. తక్కువ కోరిక లతో తృప్తిగా హాయిగా సమాజం లో గౌరవప్రదంగా జీవించడం చాలా అదృష్టం.*


*లోచర్ల సాయిదివాకర్ గౌరీప్రసాద్*🙏🙏🙏💐🙏🙏🙏

దుష్టుడి సహాయం

 *దుష్టుడి సహాయం దుఃఖాలకు మూలకారణం*.


*ఆపత్కాలంలో (కష్టకాలంలో) కూడా ఆశ్ర యించ  కూడని వారు.*

1:- *షండుడు*:- సకాలంలో స్నానం చేయని వాడు, దేవతలను, తల్లిదండ్రులను గౌరవింపనివాడు.


2:- *మార్జానుడు*:- అహంకారం తోను, నిర్లక్ష్యం తోను, జప, తపాలు చేసేవాడు.


3:- *అఖువు*:- కావలసినన్ని సంపదలు ఉన్నా తాను తినక, ఇతరులకు పెట్టని వాడు.


4:- *కుక్కుటుడు*:- పక్షపాతం తో తీర్పులు చెప్పేవాడు.


5:- *పతితుడు*:- తన ధర్మం  విడిచి  పరధర్మం ఆచరించేవాడు.


6:- *అపవిద్దుడు*:- గో హత్య,స్త్రీ హత్య మొ:లగు పాతకాలు చేసే వాడు.


7:- *నగ్నుడు*:- దైవ భక్తి లేనివాడు.


8:- *ఛండాలుడు*:- ఎంతో ఆశతో వచ్చిన వానికి,తాను సహా యపడక, ఇతరులు కూడా సహాయం చయకుండా  అడ్డుపడే వాడు, మరియూ శరణు కోరి వచ్చేవానిని  గాలికి వదిలేసేవాడు.


9:- *అధముడు*:- బంధువులు, స్నేహితులు, ఉత్తములు  మొదలగువారికి దూరమైనవాడు.


ఇలాంటి వారిని, ఎంత కష్టదశలో ఉన్నా  వా

ఆశ్రయించరాదని, విజ్ఞులైన మనపెద్దలచే చెప్పబడింది.

*🙏🙏సర్వే జనాః సుఖినోభవంతు 🙏🙏*

శిల్పాలు కేవలం రాతి విగ్రహాలు

 భారతీయ శిల్పాలు కేవలం రాతి విగ్రహాలు కావు


పాచ్యపాశ్చాత్య సాంస్కృతిక మూల్యాలను పరస్పరం అవగాహన చేసుకునే నిమిత్తం, ఏర్పడిన యునెస్కో వారి ప్రాచ్యపాశ్చాత్య బృహత్పథకం క్రింద, హెన్రీ లేనార్ట్స్ అనే బెల్జియన్ శిల్పి భారతదేశంలో పర్యటించటానికి వచ్చారు.


వారి అధ్యయన విషయం భారతీయ నాగరకత - హిందూ, బౌద్ధమతాలకు ఇదివరలోనూ ఇప్పుడూ భారతీయ సంస్కృతి మీద వున్న ప్రభావం అనేది.


మత సముద్ధరణ కేంద్రాలుగా ప్రసిద్ధికెక్కిన సంస్థలను సందర్శిస్తూ 24-1-1965వ తేదీన వారు కంజీవరంలో కామకోటి పీఠాధిపతులను కలుసుకున్నారు. టి.ఎన్. రామచంద్రన్ వారిని వెంటబెట్టుకు వచ్చారు. 


లేనార్ట్స్ : ఆధునిక నాగరకత గురించి మీరేమనుకుంటున్నారు? మానవ పురోగమనానికి అది దోహదం చేస్తుందనుకుంటున్నారా? 


స్వామివారు : చేయదనే అనుకుంటున్నాను. ఎందువల్ల నంటే దానికి మానవుల మనస్సును కలుషితం చేసే గుణం వుంది. అలా చేయబట్టే ఈనాడు ప్రపంచంలో ఇంత దారుణమైన ఘర్షణ, ఇంత హింస, ఇంత ఆర్తీ చూస్తున్నాము. 


లేనార్ట్స్ : అరణ్య జీవిత, నగర జీవితాల్లో ఏది మంచిది? 


స్వామివారు : నిస్సందేహంగా అరణ్య జీవితమే మంచిది. అరణ్యాల్లో సామాన్యంగా అమాయికంగా కలతకూ, కార్పణ్యాలకూ దూరంగా జీవించవచ్చు కాని నగరాల్లో అలాకాదు. ఉండటానికి అన్ని సౌకర్యాలూ, ఆధునిక నాగరకత సమకూర్చి పెట్టిన అన్ని సుఖాలూ వుంటాయి. కాని చిత్తశాంతి మాత్రం వుండదు. 


లేనార్ట్స్ : నాగరకతకు చైతన్యం వుంది. అది జడం కాదు. అందువల్ల అదెప్పుడూ పురోగమిస్తుంది. ఈ విషయంలో మీ అభిప్రాయ మేమిటి?


స్వామివారు : విజ్ఞానశాస్త్ర పురోగమనం వల్ల సమాజం అభివృద్ధి చెందిన మాట వాస్తవమే. కాని దానివల్ల కలిగే అనర్థాలు సామాజికాభివృద్ధిని అందరూ అనుభవించటానికి వీల్లేకుండా చేశాయి. అందరూ సుఖంగా జీవించాలంటే ప్రతివాడికీ సరళమైన మనస్సు, అమాయికమైన అంతరంగం వుండాలి. అవి ఏకాంత ప్రశాంతమైన వనజీవనంలోనే సాధ్యపడతాయి. వనజీవనంలోనూ ఆధునికమైన సౌకర్యాలు, సుఖాలూ అనుభవించవచ్చు, విజ్ఞానశాస్త్రం అందించే వసతు లేర్పరుచుకోవచ్చు. 


స్వామివారు : మీరు ఉత్తర భారతంలోని దేవాలయాలూ, దక్షిణాది దేవాలయాలూ, ఆ దేవాలయాల్లోని విగ్రహాలూ చూచారు. వాటిని చూచినప్పుడు మీకెలాటి భావం కలిగింది?


లేనార్ట్స్ : భారతదేశంలోని ఆలయశిల్పాలు చూస్తున్నప్పుడు మనస్సులో పవిత్రమైన ప్రశాంతి ఏర్పడుతుంది. పారమార్థికమైన స్పందన కలుగుతుంది. ఆ శిల్పాలు కేవలం రాతి విగ్రహాలు కావు. భారతీయుల ఆధ్యాత్మిక చిత్తవృత్తికి చిహ్నాలు. వారి భక్తి ప్రపత్తులకు ప్రతీకలు.


--- హెన్రీ లేనార్ట్స్


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం