4, సెప్టెంబర్ 2021, శనివారం

*33 కోట్ల దేవతలు

 *33 కోట్ల దేవతలు ఎవరు?*

                ➖➖➖✍️


మీ 33 కోటి దేవతల పేర్లు ఏమని ప్రశ్న అడిగి వెక్కిరిస్తారు. హిందువులు కూడ ఈ ప్రశ్న విని విచలితులవుతారు.*


*అసలు ఈ కోటి అను పదముయొక్క అర్థమును సంపూర్ణముగా మరుగునపరచి మెకాలే, ముల్లర్ వంటివారు తమకు కావలసిన ఒక మత ధర్మమునకు అనుకూలమగునటుల చరిత్ర ను తీర్చి తిద్ది తెలివిమంతులు అనిపించుకొన్నారు.*


*హిందువులు అటువంటి చరిత్రను చదివి బుద్ధి హీనులు వారు అనిపించుకొనిరి.*


 *వేదపురాణములు తెలుపునట్టి త్రయత్రింశతి కోటి(33కోటి) దేవతలు మరియు వారి పేర్లు మరియు హిందూ ధార్మిక సాహిత్య మందు ఉల్లేఖించబడిన 33కోటి దేవతలు ఎవరు వారి పేర్లు ఏమి అని తెలుసా?*


*హిందూ ధర్మ - సంస్క్రతియందు 33కోటి దేవతల ఉల్లేఖన ఉంది. మిక్కిలి జనులు ఇక్కడ 'కోటి' అంటే సంఖ్య అనుకొన్నారు. మరియు 33కోట్ల పేర్లను చెప్పమని బలవంతం చేస్తారు. వాస్తవముగా ఈ 'కోటి' సంఖ్యను సూచించే కోటి కాదు.*


*సంస్క్రతములో 'కోటి' అనగా 'విధము' 'వర్గము' (type) అని అర్థమూ ఉంది.*


 *ఉదా: ఉచ్ఛకోటి. దీని అర్థం ఉచ్ఛమైన వర్గమునకు చేరిన వారు అని అర్థం.* 


*అలాగే మరియు ఉదాహరణము: సప్త కోటి బుద్ధులు. దీని అర్థం ఏడు ప్రధాన బుద్ధులు.*


*యజుర్వేద, అథర్వణ వేద, శతపథ బ్రాహ్మణులు మొదలైన ప్రాచీన కృతులందు 33 విధముల దేవతలను ఉల్లేఖించారు. వీరే త్రయత్రింశతి కోటి (33కోటి) దేవతలు.* 


*హిందూ గ్రంధములేకాదు బౌద్ధ, పార్శీ మొదలైనవి కూడ 33 దేవవర్గముల గురించి తెలుపుతాయి. బౌద్ధుల దివ్యవాదము మరియు సువర్ణప్రభాస సూత్రములందు వీటి ఉల్లేఖన ఉన్నది.*


 *ఇపుడు దేవతల ఈ 33వర్గములనూ, అందులో వచ్చు దేవతల పేర్లనూ చూద్దాము:*


*12 ఆదిత్యులు (ద్వాదశాదిత్యులు) :* 1. త్వష్ట, 2. పూష. 3.వివస్వాన్ 4. మిత్ర 5. ధాతా 6. విష్ణు 7. భగ. 8. వరుణ 9. సవితృ 10. శక్ర 11.అంశ 12. ఆర్యమ.


*11 రుద్రులు (ఏకాదశ రుద్రులు):*

1.మన్యు 2. మను 3. మహినస 4. మహాన్ 5. శివ 6. ఋతధ్వజ 7. ఉగ్రరేతా 8. భవ 9 కాల 10. వామదేవ 11. ధృతవృత.  


*8 వసువులు(అష్టవసువులు):* 

1. ధరా 2. పావక 3 అనిల 4. అప 5. ప్రత్యుష 6. ప్రభాస 7. సోమ 8 ధ్రువ. 


మరి ఇద్ధరు: 1. ఇంద్ర 2. ప్రజాపతి. 


త్రయత్రింశతి (33) కోటి దేవతలు ఎవరని తెలిసినది కదా! ఈ పేర్లను కంఠపాఠము చేయునది చాలా సులభము. ఎవరైననూ ఇపుడు 33కోటి దేవతల పేర్లను చెప్పమంటే వెనుక ముందు చూడవలసిన అవసరమే లేదు! కదా?.

సంస్కృత మహాభాగవతం

 *4.09.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఐదవ అధ్యాయము*


*భగవంతుని సేవింపనివారిగతి - భగవంతుని పూజావిధానము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*5.33 (ముప్పది మూడవ శ్లోకము)*


*ధ్యేయం సదా పరిభవఘ్నమభీష్టదోహం తీర్థాస్పదం శివవిరించినుతం శరణ్యమ్|*


*భృత్యార్తిహం ప్రణతపాల భవాబ్ధిపోతం వందే మహాపురుష తే చరణారవిందమ్॥12356॥*


వారు భగవంతుని ఈ విధముగా స్తుతింతురు. 'శరణాగతవత్సలా! మహాపురుషా! ప్రభూ! నీ పాదపద్మములకు పదేపదే నమస్కరింతుము. అవి సర్వదా ధ్యానయోగ్యములు. లౌకికములైన సంకటములనుండియు, ఇంద్రియ ప్రకోపములనుండి రక్షించునట్టివి. ఇష్టార్థములను అనుగ్రహించునట్టివి. గంగాది పుణ్యతీర్థములకును ఆశ్రయములగుటవలన పరమపావనమైనవి. శంకరునిచేతను, బ్రహ్మేంద్రాది సకల దేవతలచేతను నిరంతరము స్తుతింపబడుచుండునట్టివి. సకలప్రాణులకును శరణ్యములు. భక్తులయొక్క కష్టములను తొలగించు చుండుటయేగాక వారిని సంసార సముద్రమునుండి తరింపజేయునట్టివి.


*5.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*


*త్యక్త్వా సుదుస్త్యజసురేప్సితరాజ్యలక్ష్మీం ధర్మిష్ఠ ఆర్యవచసా యదగాదరణ్యమ్|*


*మాయామృగం దయితయేప్సితమన్వధావద్వందే మహాపురుష తే చరణారవిందమ్॥12357॥*


ధర్మపరిపాలన ధురంధరా! అయోధ్యారాజ్యలక్ష్మిని పొందుటకొరకు దేవతలు సైతము అర్రులు చాచుచుందురు. అట్టి మహాసామ్రాజ్య వైభవములను త్యజించుట సామాన్యులకు అసాధ్యము. కానీ రామావతారమున పూజ్యుడైన మీ తండ్రియగు దశరథుని వాక్య పరిపాలనకై మహాసామ్రాజ్యమును సైతము త్యజించి, నీ పాదారవిందములు అరణ్యములయందు సంచరించినవి. నీకు ప్రాణప్రియమైన సీతాదేవి యొక్క ముచ్చటదీర్చుటకు అవి మాయామృగమును వెంబడించినవి. అట్టి నీ దివ్యచరణ కమలములకు పదే పదే ప్రణమిల్లుదుము.


*5.35 (ముప్పది ఐదవ శ్లోకము)*


*ఏవం యుగానురూపాభ్యాం భగవాన్ యుగవర్తిభిః|*


*మనుజైరిజ్యతే రాజన్ శ్రేయసామీశ్వరో హరిః॥12358॥*


నిమిమహారాజా! కృత - త్రేతా - ద్వాపర - కలియుగములలోని ప్రజలు ఆయా యుగములకు అనురూపముగా వేర్వేరు పద్ధతులలో భగవంతుని నామ, రూప, గుణ వైభవములను ఆరాధింతురు. సర్వసమర్థుడైన శ్రీహరి వారికి ధర్మార్థకామ, మోక్షములు అను చతుర్విధ పురుషార్థములను ప్రసాదించును.


శ్లో. *ధ్యాయన్ కృతే, యజన్ యజ్ఞైః త్రేతాయాంద్వాపరేఽర్చయన్|*


*యదాప్నోతి తదాప్నోతి కలౌ సంకీర్త్య కేశవమ్॥*


కృతయుగమునందు ధ్యానించుటవలనను, త్రేతాయుగమునందు యజ్ఞయాగాదులను ఆచరించుటవలనను, ద్వాపరయుగమునందు అర్చించుటచేతను కలుగు లాభములు కలియుగమునందు శ్రీహరి సంకీర్తనము చేయుటవలననే ప్రాప్తించును. 


*5.36 (ముప్పది ఆరవానణ శ్లోకము)*


*కలిం సభాజయంత్యార్యా గుణజ్ఞాః సారభాగినః|*


*యత్ర సంకీర్తనేనైవ సర్వస్వార్థోఽభిలభ్యతే॥12359॥*


కలియుగమునందు భగవత్సంకీర్తనము చేతనే స్వార్థపరమార్థములు (సకలపురుషార్థములు) ప్రాప్తించును. అందువలననే గుణజ్ఞులు (ఇతరులలో దోషములున్నను, వారి గుణములనే గ్రహించువారు), సారగ్రాహిణులు (ప్రధాన విషయసారమును గ్రహించువారు) కలియుగమును ఎంతయు ప్రశంసింతురు.


*5.37 (ముప్పది ఏడవ శ్లోకము)*


*న హ్యతః పరమో లాభో దేహినాం భ్రామ్యతామిహ|*


*యతో విందేత పరమాం శాంతిం నశ్యతి సంసృతిః॥12360॥*


భగవత్సంకీర్తనము పరమపురుషార్థ సాధనము. దీనివలన సంసారబంధములు తొలగిపోవుటయేగాక పరమశాంతియు లభించును. అందువలన సంసారచక్రములో పరిభ్రమించుచుండెడి దేహాభిమానులకు (ఇహపరలాభములను పొందుటకు) సంకీర్తనమువంటి సరళసాధనము మరియొకటి లేదు.


*5.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*


*కృతాదిషు ప్రజా రాజన్ కలావిచ్ఛంతి సంభవమ్|*


*కలౌ ఖలు భవిష్యంతి నారాయణపరాయణాః॥12361॥*


*5.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*


*క్వచిత్క్వచిన్మహారాజ ద్రవిడేషు చ భూరిశః|*


*తామ్రపర్ణీ నదీ యత్ర కృతమాలా పయస్వినీ॥12362॥*


*5.40 (నలుబదియవ శ్లోకము)*


*కావేరీ చ మహాపుణ్యా ప్రతీచీ చ మహానదీ|*


*యే పిబంతి జలం తాసాం మనుజా మనుజేశ్వర|*


*ప్రాయో భక్తా భగవతి వాసుదేవేఽమలాశయాః॥12362॥*


నిమిమహారాజా! కృత-త్రేతా-ద్వాపర యుగముల యందలి ప్రజలుగూడ కలియుగమునందు జన్మించుటకు అభిలషింతురు. ఏలయన, కలియుగమునందు జనులు అక్కడక్కడ శ్రీమన్నారాయణ సేవాపరాయణులగుదురు. అందునా దక్షిణభారతదేశమున పెక్కుమంది భక్తులు జన్మింతురు. ద్రవిడదేశమునందు పవిత్రములైన తామ్రపర్ణి, కృతమాల, పయస్విని, కావేరి, మహానది, ఇంకను పడమరదిశగా ప్రవహించుచుండెడి నదులును గలవు. నిమి మహారాజా! ఆ నదుల జలములను స్నానపానాదులతో సేవించినవారు తరచుగా నిర్మలచిత్తులై శ్రీకృష్ణపరమాత్ముని యందు భక్తితత్పరులగుదురు.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఐదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235g

ఆశీర్వచనం

 *...*


★ *ఆశీర్వచనం ఎందుకు చేస్తారు,

ఆశీర్వచనానికీ,అక్షింతలకీ ఏమిటి సంబంధం,పసుపుతో కలిపిన బియ్యమే ఎందుకు చల్లాలి..*


★ హిందూ సనాతన సంస్కృతిలో ఆశీర్వచనానికి చాలా విలువ వుంది. అనేక సందర్భాలలో చిన్న వారిని పెద్దవారు ఆశీర్వదిస్తారు. 


★ విద్యార్ధులను విద్యా ప్రాప్తిరస్తు అని, పెళ్ళయిన ఆడవారిని దీర్ఘ సుమంగళీభవ అని, పురుషులని దీర్ఘాయుష్మాన్ భవ అని.. అలా.. సమయానికి తగ్గట్లు వుంటాయి.. ఆ దీవెనలు.


★ యజ్ఞయాగాదులు చేసేటప్పుడు, వేదోక్తంగా జరిగే కార్యక్రమాలలో అక్కడ పండితులు "గో బ్రాహ్మణో శుభంభవతు, లోకాస్సమస్త సుఖినోభవంతు" అనే ఆశీర్వచనంతో దేశంలో రాజు న్యాయంగా, ధర్మంగా పరిపాలించాలనీ, దేశం సుభిక్షంగా వుండాలనీ, గోవులు, బ్రాహ్మణులు, ప్రజలందరూ సుఖంగా వుండాలనీ, దేశంలో సకాలంలో వర్షాలు కురిసి దేశం సుభిక్షంగా వుండాలనీ, పిల్లలు లేనివారికి పిల్లలు కలగాలనీ, వున్నవారికి వంశాభివృధ్ధి చేసే మనవలు కలగాలనీ, ధనం లేని వారికి సంపదలు కలగాలనీ, వగైరా సమాజంలో అందరి శ్రేయస్సు కోరుతూ ఆశీర్వచనం చేస్తారు.


◆ *అయితే ఈ ఆశీర్వచనాలకి ప్రభావం వుందా.. అవి ఫలిస్తాయా... తప్పకుండా ఫలిస్తాయి...*


★ సత్పధంలో నడిచే వారికి సత్పురుషులు చేసిన ఆశీర్వచనాలు తప్పక ఫలిస్తాయి. ఈ ఆశీర్వచనాల వల్ల జాతకంలో వుండే దోషాలు తొలుగుతాయి, అకాల మృత్యు దోషాలు తొలుగుతాయి. అంతేకాదు, పూర్వ జన్మ పాపాలు కూడా నాశనమవుతాయంటారు.


★ గురువులు, సిధ్ధులు, యోగులు, వేద పండితులు, మనకన్నా చిన్నవారైనా వారి కాళ్ళకి నమస్కరించి వారి ఆశీర్వచనం తీసుకోవచ్చు. అక్కడ మనం నమస్కరించేది వారి వయసుకి కాదు, వారి విద్వత్తుకు, వారిలోని సరస్వతికి...


◆ *అక్షింతల సంకేతం.....*


★ సాధారణంగా శిశువు జన్మించినప్పుడు పురిటి స్నానం రోజునుంచీ ప్రతి శుభసందర్బం లోనూ ఆశీర్వదించినప్పుడు తలమీద అక్షింతలు జల్లుతారు. 


◆ *ఆశీర్వచనానికీ, అక్షింతలకీ ఎమీటి సంబంధం.*.


◆ అక్షింతలే ఎందుకు చల్లాలి వేరే ధాన్యాలు వున్నాయికదా వాటిని చల్లవచ్చుకదా..


◆ మరి పసుపుతో కలిపిన బియ్యమే ఎందుకు చల్లాలి..


◆ బియ్యం చంద్రుడికి కారకం. చంద్రుడు మనస్సుకి కారకుడు. అంటే మనస్ఫూర్తిగా ఇచ్చే ఆశీర్వచనానికి చిహ్నమన్నమాట. 


★ బియ్యంలో కలిపే పసుపు గురువుకి కారకం. గురువు శుభ గ్రహం. ఆయనకి సంకేతంగా, శుబానికి సంకేతంగా పసుపు రంగు కలిపిన అక్షింతలను మంత్రపూర్వకంగా తలమీద చల్లుతారు. 


★ మంత్రం అంటే క్షయం లేనటువంటిది. అకారంనుంచి క్షకారం దాకా వున్న అక్షరాలతో, బీజాక్షరాలతో కూడిన మంత్రానికి శక్తి వుంటుంది. మంత్రాన్ని చదివేటప్పుడి చేతితో పట్టుకున్న అక్షింతలకి కూడా ఆ శక్తి వస్తుంది. క్షయంలేని మంత్రాలను, క్షయంలేని అక్షింతలు పట్టుకుని చదివి, అవి ఎవరి తలపై వేస్తారో వారుకూడా క్షయం లేకుండా ఆభివృధ్ధి చెందాలని ఆశీర్వదిస్తారు. ఆలాంటి ఆశీర్వచనానికి శక్తి వుంటుంది.


★ మన పూజలు, శుభ సందర్భాల్లో అక్షింతలకు ఏంతో ప్రాధాన్యత ఉంది. అక్షింతల్ని సంస్కృతంలో అక్షతలు అంటారు. ఏ పూజ చేసినా దేవుని వద్ద అక్షింతలు ఉంచి మధ్యమధ్యలో ”అక్షతాన్ సమర్పయామి” అంటూ భక్తిగా అక్షతలు జల్లడం హిందూ సంప్రదాయం. పెళ్ళిళ్ళు, పేరంటాలలో వధూవరులపై అక్షతలు జల్లి ఆశీర్వదిస్తారు. ఉయ్యాల, పుట్టినరోజు లాంటి అనేక వేడుకల్లోనూ అక్షింతలు తలపై జల్లి ఆశీర్వచనాలు పలుకుతారు.


★ మంత్రించిన అక్షతలు తలపై జల్లి ఆశీర్వదించినట్లయితే, శుభం చేకూరుతుందని, చెడు ఫలితాలు, దోషాలు అంటకుండా ఉంటాయని పెద్దలు చెప్తారు. కేవలం పెళ్ళిళ్ళు, శుభకార్యాల్లోనే కాదు, అశుభ కార్యాల్లో కూడా అక్షతలు ఉపయోగించే సంప్రదాయం ఉంది.


★ బియ్యంలో తగినంత పసుపు, చిటికెడు కుంకుమ, తడిచీ తడవనట్లు కొన్ని నీళ్ళు, నాలుగు చుక్కలు నూనె వేసి అక్షతలను తయారుచేస్తారు. ఒకవేళ మంత్రించిన పసుపు లేదా కుంకుమలను వేసి తయారుచేసినట్లయితే ఆ అక్షతలు మరీ పవిత్రమైనవి...

*శుభమస్తు*

 *ఓం నమః శివాయ*

Naivedya items

 Naivedya items made by Chandramathi Rao for Lord Krishna. She made 75 items as she does every year. She has lot of bhakti for Lord Krishna.she loves sharing food. She has received awards for promoting small scale industries(handloom ) and was a lecturer in Mangalore. . It took her 3 days to cook all these sweets.

Krishna's rajabogh items.

****************************

1 churmundo 

2. Besan undo

3. Tila undo

4. Astami undo

5. Nelakadle laddu

6. Shevu laddu

7. Tambittu undo

8. Gundittu undo

9. Churmuri undo

10. Soye undo

11. Rava laddu

12. Pova laddu

13. Layeepitta. Undo

14. Mughadali undo

15. Mitayi undo

16. Soft motichur laddu

17. Puttani undo

18. Seven cup burfi

19. Milk coconut burfi

20. Badami burfi

21. Besan burfi

22. coconut burfi

23. Kuvale kadi

24. . Agra peta

25. Kuvale kashi halwa

26. Carrot halwa

27. Badami halwa

28 sakkare rotti

29. Penori

30. Sakkare tukdi

31. Stardedigned tukudi

32. Nevari

33. Chandrakala

34. Pova gass mando

35. Biscuit tukadi

36. Chakkuli

37. Tingalodu

38. Vooodo

39. Nippat

40. Kodubale

41. Masale kadlo

42. Nendra kele chips

43. Pova chuda

44. Godda chana panchakajjai

45. Sakkare chana panchakajjai

46. Muga panchakajjai

47. Pova panka panchakajjai

48. Dryfruits ani pova panchakajjai

49. Laye pankadayi

50 tiki layeepitta panchkdayi 

51. Doodapak

52. Hayagreeva Maddi

53. Chandali madgale(plan was to make sukrundo.but chanadal overcooked.)     

54. Sapada baksha

55. Kesari bath(sheera)

56. Methi mattari (methi bakarvadi)

57 chana upkari

58. Mughadali usli

59. Dahi pova

60. Kallepovu

61. Amubuli chatney

62. Alle tambuli(ginger)

63. Alvathi

64. Trimadhura(banana+honey+suger)

65. Nava neetha (fresh butter+little sugar)

66. Kesari badam milk

67. Kesar lassi

68. Puttani panchkdayi

69. Kaja

70. Doodapeda

71. Sweet boondi

72. Sakkar para

73. Sakkare chano  

74. Dryfruit churna. +dry fruits+fruits

75. Panchmrtha (honey+milk+curd+suger+ghee)

*లక్ష యువ గళ గీతార్చన

 https://youtu.be/-b8RD25sRWo


నమస్కారం..


 *విశ్వ హిందూ పరిషత్* 

వారి ఆధ్వర్యంలో


 *లక్ష యువ గళ గీతార్చన*


15 నుండి 40 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న 

ఒక లక్ష మంది యువతీ యువకులకు 

భగవద్గీతలో ఎంపిక చేసిన

40 శ్లోకాలు (గీతా చాలీసా )

నేర్పించి..

గీతా జయంతి 

( ఇంకా తేదీ నిర్ణయం చేయలేదు సుమారు డిసెంబర్ లో ఉంటుంది.)

 *భాగ్యనగరంలో* భగవద్గీత శ్లోకాలు 

పారాయణం చేయించాలి..

అనే లక్ష్యంతో


 *V. H. P. ఆధ్వర్యంలో* 

బృహత్తర కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది..


మీకు...

 *40 శ్లోకాలు నేర్చుకునే*

 *యూట్యూబ్ లింక్ పంపిస్తున్నాము.* 


మీ పిల్లలకు శ్లోకాలు నేర్చుకోమని ప్రోత్సహించండి..

తరువాత..

 *మీకు తెలిసిన గీతా భక్తులకు,* 

 *భజన మరియు గీతా సమాజాల వారికి,* 

 *కళాశాల యాజమాన్యం వారికి* 

ఈ సమాచారం తెలియచేసి...


గీతా శాస్త్రమును నా భక్తుల

హృదయంలో పదిలపరచువాడు..

నన్నే పొందును..

                 *భగవద్గీత 18 - 68*


మీరు కూడా....

గీతా జ్ఞాన ప్రచార యజ్ఞంలో

భాగస్వాములు కండి..

భగవంతుని కృపకు పాత్రులు కండి..


ధన్యవాదములు... మీ

 *హైందవి.. 9393 044 127*

ప్రశ్న పత్రం సంఖ్య: 25

 ప్రశ్న పత్రం సంఖ్య: 25  కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

కొలతలు-కొలమానానికి సంబంధ క్రింది ప్రశ్నలకు జవాబులు తెలుపండి  

  1)ఒక రోజుకు గంటలు, నిముషాలు, సెకన్లు ఎన్ని. 

2) ఒక ఎకరానికి కుంటలు ఎన్ని. 

3) ఎన్ని సెంట్లు ఒక గుంట, ఎకరం అవుతుంది. 

 4)  ఒక హెక్టారుకు ఎకరాలు ఎన్ని 

 5) యుగములు ఎన్ని అవి ఏవి 

6) క్వింటాలుకు ఎన్ని కిలోలు 

7) కెల్విన్ మానం అంటే ఏమిటి 

8) కిరాణాషాపులో దొరికే వంటనూనె ఒక లీటరు పొట్లము యెంత బరువు ఉంటుంది. 

9) సేచ్ఛమైన పాల చిక్కదనాన్ని కొలిచే సాధనాన్ని ఏమంటారు. 

10) ఎన్ని కుండలు ఒక బస్తా అవుతుంది. . 

 11) ఒక మెట్రిక్ టన్నుకు కిలోలు ఎన్ని 

12) ధర్మామీటరు మనం ఇంట్లో ఎందుకు వుంచుకుంటాము. 

 13) వ్యవసాయ భూమిని  నీటి వసతిని పట్టి రెండు విధాలుగా పేర్కొంటారు అవి ఏమిటి. 

14) ఒక మానికకు ఎన్ని సోలలు, ఎన్ని గిద్దలూ 

15) ఇప్పుడు కలియుగంలో ఎన్నవ పాదం నడుస్తున్నది. 

16) భారత కాలమానము గ్రీన్విచ్ కాలమానానికి తేడా యెంత 

17) పల్లెటూరులలో ధాన్యాన్ని అప్పు తీసుకునే విధానాన్ని యేమని పిలుస్తారు.  

 18) ఆకాశ గమన రుగ్మత (air sickness) అనగా నేమి  

19) ఒక గజానికి అడుగులు ఎన్ని 

 20) ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన కొలమాన పద్ధతులు ఎన్ని అవి ఏవి  

సంస్కృత మహాభాగవతం*

 *4.09.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఐదవ అధ్యాయము*


*భగవంతుని సేవింపనివారిగతి - భగవంతుని పూజావిధానము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*5.25 (ఇరువది ఐదవ శ్లోకము)*


*తం తదా మనుజా దేవం సర్వదేవమయం హరిమ్|*


*యజంతి విద్యయా త్రయ్యా ధర్మిష్ఠా బ్రహ్మవాదినః॥12348॥*


ఆ యుగము నందలి ధర్మనిష్ఠాపరులు, వేదాధ్యయనము నందును, అధ్యాపనమునందును పారంగతులు. వారు సర్వదేవ స్వరూపుడు, దేవాదిదేవుడగు శ్రీహరిని ఋగ్వేద-యజుర్వేద-సామవేద మంత్రములద్వారా ఆరాధింతురు.


*5.26 (ఇరువది ఆరవ శ్లోకము)*


*విష్ణుర్యజ్ఞః పృశ్నిగర్భః సర్వదేవ ఉరుక్రమః|*


*వృషాకపిర్జయంతశ్చ ఉరుగాయ ఇతీర్యతే॥12349॥*


ఈ యుగమునందు విష్ణువు, యజ్ఞపురుషుడు, పృశ్నిగర్భుడు, సర్వదేవుడు, ఉరుక్రముడు, వృషాకపి, జయంతుడు, ఉరుగాయుడు అను నామములతో పరమాత్మయొక్క గుణలీలావైభవములను జనులు కీర్తించుచుందురు.


*5.27 (ఇరువది ఏడవ శ్లోకము)*


*ద్వాపరే భగవాఞ్శ్యామః పీతవాసా నిజాయుధః|*


*శ్రీవత్సాదిభిరంకైశ్చ లక్షణైరుపలక్షితః॥12350॥*


ఆ పరమాత్మ ద్వాపరయుగము నందు శ్యామవర్ణశోభితుడై పట్టుపీతాంబరములను ధరించును, కంఠమున కౌస్తుభమణితోడను, వక్షస్థలమున శ్రీవత్సాది చిహ్నములతోడను ఒప్పుచు, కరములయందు శంఖ, చక్ర, గదా, పద్మములను దాల్చును. ఆ స్వామియొక్క అఱచేతుల యందును, పాదతలములయందును పద్మాదిశుభచిహ్నములు అలరారుచుండును.


*5.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*


*తం తదా పురుషం మర్త్యా మహారాజోపలక్షణమ్|*


*యజంతి వేదతంత్రాభ్యాం పరం జిజ్ఞాసవో నృప॥12351॥*


నిమిమహారాజా! ఆ యుగమునందు పరమపురుషుడు ఛత్రచామరాది మహారాజ లక్షణములతో విలసిల్లుచుండును. జిజ్ఞాసువులైన మానవులు ఆ ప్రభువును వైదిక మంత్రములతో, ఆగమాది తంత్రములద్వారా ఆరాధింతురు.


*5.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*


*నమస్తే వాసుదేవాయ నమః సంకర్షణాయ చ|*


*ప్రద్యుమ్నాయానిరుద్ధాయ తుభ్యం భగవతే నమః॥12352॥*


*5.30 (ముప్పదియవ శ్లోకము)*


*నారాయణాయ ఋషయే పురుషాయ మహాత్మనే|*


*విశ్వేశ్వరాయ విశ్వాయ సర్వభూతాత్మనే నమః॥12353॥*


వాసుదేవా! సంకర్షణా! ప్రద్యుమ్నా! అనిరుద్ధా! పరమాత్మా! నీకు నమస్కారములు. నారాయణా! యోగేశ్వరా! పురుషోత్తమా! మహాత్మమా! విశ్వేశ్వరా! విశ్వరూపా! సర్వభూతాత్మా! నీకు ప్రణామములు అని ఈ యుగమువారు భగవంతుని పూజింతురు.


*5.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*


*ఇతి ద్వాపర ఉర్వీశ స్తువంతి జగదీశ్వరమ్|*


*నానాతంత్రవిధానేన కలావపి యథా శృణు॥12354॥*


నిమిమహారాజా! ఈ విధముగా ద్వాపరయుగమునందు భక్తులు ఆ జగదీశ్వరుని స్తుతింతురు. కలియుగమునందు కూడ వివిధములగు తంత్రవిధానముల ద్వారా ఆ సర్వేశ్వరుని ఆరాధింతురు.


*5.32 (ముప్పది రెండవ శ్లోకము)*


*కృష్ణవర్ణం త్విషాకృష్ణం సాంగోపాంగాస్త్రపార్షదమ్|*


*యజ్ఞైః సంకీర్తనప్రాయైర్యజంతి హి సుమేధసః,12355॥*


కలియుగమునందు భగవంతుడు శ్రీకృష్ణనామధేయుడై ఇంద్రనీలమణికాంతులతో తేజరిల్లుచుండును. హృదయాది మంత్రమూర్తులతో, కౌస్తుభాది ఉపాంగములతో, సుదర్శనాది ఆయుధములతో సునంద, నందాది పార్షదులతో విరాజిల్లుచుండును. వివేకవంతులు యజ్ఞయాగములద్వారా ఆ పరమపురుషుని ఆరాధించుదురు. ఆ స్వామియొక్క నామ, గుణ, రూపలీలావైభవములను పారవశ్యముతో కీర్తింతురు.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఐదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235g

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*406వ నామ మంత్రము* 4.9.2021


*ఓం శివారాధ్యాయై నమః*


శివునిచే ఉపాసింపబడిన పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *శివారాధ్యా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును, *ఓం శివారాధ్యాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే, భక్తులకు సర్వాభీష్ట సిద్ధిని కలుగజేయును.


శ్రీవిద్యోపాసకులలో శివుడు కూడా శ్రీవిద్యోపాసకుడే. శ్రీవిద్యోపాసనతో పరమేశ్వరిని ఆరాధించి అర్ధనారీశ్వరుడైనాదు.


'శివుడు పరమేశ్వరిని ఆరాధించి, ధ్యానించి, ధ్యానయోగముయొక్క శక్తిచే సర్వసిద్ధులను పొందగలిగెను, అర్ధనారీశ్వరుడయ్యెను' అని బ్రహ్మాండపురాణంలో చెప్పబడినది. మనం జపించే పంచదశీ మంత్రమునకు వాగ్భవకూటము, కామరాజకూటము, శక్తికూటము అను మూడుకూటములు గలవు. కాని శివుడు ఉపాసించిన శ్రీవిద్యకు నాలుగుకూటములు ఉన్నవి. అందుచే పరమేశ్వరి *చతుష్కూట విద్యాస్వరూపురాలు* అని యనబడినది.


అలాగే పరమేశ్వరుడు భువనేశ్వరీ హృదయాన్ని, ధూమావతీ కవచాన్ని, శ్యామలాాస్తోత్రముసు, అన్నపూర్ణా సహస్రమును, రేణుకా కవచమును...ఇంకను ఎన్నో స్తోత్రాలతో పరమేశ్వరిని ఆరాధించాడు. గనుక జగన్మాత *శివారాధ్యా* యని అనబడినది.


పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం శివారాధ్యాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*989వ నామ మంత్రము* 4.9.2021


*ఓం వాంఛితార్థప్రదాయిన్యై నమః*


కోరిన కోర్కెలను ఇచ్చు స్వభావము గలగిన పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *వాంఛితార్థప్రదాయినీ* అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం వాంఛితార్థప్రదాయిన్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు వారి కోరినకోర్కెలను సిద్ధింపజేయును.


జగన్మాత కోరిన కోర్కెలను నామస్మరణ మాత్రమననే ఇచ్చును. గనుకనే ఆ తల్లి *వాంఛితార్థప్రదాయినీ* యని అనబడినది. సరస్వతీ దేవిని ఆరాధిస్తే విద్యలను ఇస్తుంది. లక్ష్మీదేవిని ప్రార్థిస్తే ఐశ్వర్యములను కలుగజేస్తుంది. అలాగే విష్ణుమూర్తి మోక్షమును ప్రసాదిస్తాడు. ఆదిత్యుడు (సూర్యుడు) ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడు. శంకరుడు ధర్మార్థమోక్షములను ఇస్తాడు. కాని పరమేశ్వరి భక్తుల వాంఛితార్థములు ఏవైనను ప్రసాదిస్తుంది. అంటే దేవతలకు భక్తుల కోరికలను తీర్చడంలో కొంత పరిధి ఉన్నది. కాని జగన్మాత కోర్కెలు ఏవైనను తీర్చుతుంది. అందుకే ఆ తల్లి *వాంఛితార్థప్రదాయినీ* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం వాంఛితార్థప్రదాయిన్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

నవగ్రహ ప్రదక్షిణలు

 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

     *నవగ్రహ ప్రదక్షిణలు*



*శివాలయాల్లో నవగ్రహాలకు ప్రత్యేకమైన సన్నిధి వుంటుంది. మూలవిరాట్టును దర్శించుకుని బయటికి వచ్చాక నవగ్రహాలను దర్శించుకోవాలి.*


*''ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ:'' అంటూ తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి.*


లేదా....


*మొదటి ప్రదక్షిణలో... జపాకుసుమాల వర్ణం గలవాడా, కాశ్యపగోత్రుడా, నవగ్రహమండలనాయకుడా, శ్రీసూర్యభగవానుడా, సదా శుభాన్ని అనుగ్రహింతువు గాక!*


*రెండో ప్రదక్షిణలో... కర్కాటక రాశికి అధిపతి అయిన ఓ చంద్రుడా, పెరుగు, శంఖాల వంటి ధవళవర్ణం గలవాడా, ఆత్రేయగోత్రోద్భవుడా, శ్రీచంద్రభఘవానుడా, మమ్మల్ని కరుణించు!*


*మూడో ప్రదక్షిణలో ..బంగారు రంగుతో మెరిసిపోయేవాడా, వృశ్చికమేషరాసులకు అధిపతి అయినవాడా, భరద్వాజగోత్రుడా, శ్రీ అంగారకుడా మాకు మంగళాలను ప్రసాదించు!*


*నాలుగో ప్రదక్షిణలో ..నల్లని వర్ణం గలవాడా, కన్యా మిథునరాసులకు అధిపతి అయినవాడా, ఉత్తరదిశలో బాణరూపమండలంలో వసించేవాడా, శ్రీబుధరాజా మాకు మేలు కలిగింతువు గాక!*


*ఐదో ప్రదక్షిణలో.. అంగీరసగోత్రుడా, ధనుస్సు, మీనరాసులకు అధిపుడా, దేవగురువైన బృహస్పతీ, శ్రీగురుభగవానుడా, మాపై కరుణను వర్షించు!*


*ఆరో ప్రదక్షిణలో ..భార్గవగోత్రం గలవాడా, దైత్యగురువైన శుక్రాచార్యుడా, స్త్రీభోగాలను ప్రసాదించేవాడా, మా పైన కరుణావృష్టిని కురిపించు!*


*ఏడో ప్రదక్షిణలో.. కాశ్యపగోత్రుడూ, కుంభమృగశీర్షాలకు అధిపతి అయినవాడూ, దీర్ఘాయువును ప్రసాదించేవాడూ అయిన శ్రీశనైశ్చరుడా, మాకు మంగళాలు కలిగేలా చూడు!*


*ఎనిమిదో ప్రదక్షిణలో.. సింహికాగర్భసంభూతుడా, దక్షిణాన దక్షిణముఖంగా నక్షత్రమండలంలో వుండేవాడా, శ్రీరాహుభగవానుడా మాకు సదా మంగళాలు కలిగింతువు గాక!*


*తొమ్మిదో ప్రదక్షిణలో.. జైమినిగోత్రికుడా, గంగాయాత్రను సంప్రాప్తింపజేసేవాడా, రౌద్రస్వరూపంతో వుంటూ, రుద్రాత్మకుడుగా పేరు పడినవాడా, శ్రీకేతుభగవానుడా మాకు మేలు కలుగజేయి!*


*అంటూ ప్రార్థించుకుంటూ ప్రదక్షిణలు చేయాలి.*


🙏🌹🍁 *సేకరణ*🍁🌹🙏

శ్రీశనిత్రయోదశి

 🙏🍃 *శ్రీశనిత్రయోదశి*🍃🙏

*☘️నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం|*

*ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం||*

🙏🌹🌹🌹🌹🌹🌹🙏

🌿శని త్రయోదశి ప్రాముఖ్యత!!



🌻 నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని పురాతన తాళపత్రాలు చెబుతున్నాయి. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కళంకములేని కరుణామూర్తి శనీశ్వరుడని భక్తుల విశ్వాసం.


🌻జ్యోతిష్య శాస్త్రరీత్యా శని శనివారానికి అధిపతి. ఏ వ్యక్తికైనా పూర్వజన్మ సుకృత, దుష్కృత ఫలితాలను ప్రదానం చేసే అధికారం శనిది. ఆధ్యాత్మిక జ్యోతిష్యం లో శనిని పూర్వజన్మలోని సంచిత కర్మలకు అధిష్టాత గా చెప్పబడింది. శని దశల్లో వ్యక్తికి పూర్వజన్మలోని దుష్కర్మలకు సైతం దండన లభిస్తుంది.


🌻బౌతిక దృష్టి లో శని క్రూరుడుగా కనపడినా వాస్తవానికి అగ్ని పరీక్షకు గురి చేసి వ్యక్తిని సత్కర్మల వైపు మళ్ళిస్తాడు.. ఈశ్వర శాసనం లో శని దండనాధికారి. శని మనం చేసిన దుష్కర్మాలకే దండన విధిస్తాడు నిస్పక్షపాతం గా ఉన్న న్యాయాధిపతిలా శని దండన విధిస్తాడు.


🌻శనివారానికి స్థితి కారకుడైన శ్రీమన్నారాయణుడు అధిపతి , త్రయోదశి కి అధిపతి కామదేవుడు. అంటే శివుడు. అలా శివకేశవుల క్రియలకు శని అధిపతి అయ్యాడు. అందుకే శనిత్రయోదశి శని కి ఇష్టమైన రోజు. త్రయోదశి తిథి శివుడికి ఎంతో ప్రీతికరమైనది. క్షీరసాగర మదనం జరిగి అమృతం ఉద్భవించిన తరువాత, హాలాహలాని దిగమింగి తన కంఠం లో దాచుకొని లోకాలను కాపాడిన శివుడికి కృతఙ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళినది ఈ త్రయోదశి తిథి నాడే అని పురాణాల ద్వారా తెలుస్తుంది.


🌻ఆ సమయం లో శివుడు , మన గణాల ప్రకారం 2 గంటల 24 నిమిషాల పాటు ఆనంద తాండవం చేసాడంట. ఆ శివ తాండవాన్ని దేవతలందరూ పరవశించి చూస్తూ ఆనందించారని చెప్పబడింది. ఆ తాండవం చేసిన సమయమే ప్రదోషం. ప్రదోషమంటే మునిమాపు వేళ "దోషం" అంటే రాత్రి అని అర్ధం చంద్రున్ని దోషాకరుడు అని అంటారు,రాత్రికి కారణమయ్యేవాడనే అర్ధం ప్రదోషమంటే దోష ప్రారంభకాలం అంటే రాత్రి ప్రారంభ సమయం. ప్రదోష కాలం లో చేసే పూజాపునస్కారాలు దానధర్మాలు మామూలు సమయం లో చేసే వాటికంటే అధిక శుభఫలితాలనిస్తాయి, అలాగే ఈ సమయం లో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాలనిస్తాయి. శని త్రయోదశి ప్రదోషసమయాన శివుడికి అభిషేకం చేయడం వలన విశేష ఫలితం లబిస్తుంది.


🌻ఈ సమయం లో శివుడికి చేసే పూజలు అత్యంత ఫలితాలనిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. జాతక రీత్యా శని బాగాలేని వారు, శని దశ అంతర్దశలు జరుగుతున్న వారు. ఏలిననాటి శని, అష్టమ శని, అర్దాష్టమ శని వలన పీడింప బడుతున్నారో అటువంటి వారు ఈ రోజు శని పరిహారాలు చేయడం ఉత్తమం అవి : నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయడం,శనిత్రయోదశి రోజున ఉపవాసం ఉండడం, రావిచెట్టుకి ప్రదక్షిణాలు చేసి ఆవనూనె తో దీపం పెట్టడం, నువ్వుల నూనెలో ముఖం చూసుకొని ఆ నూనెని దానం చేయడం. నల్ల కాకులకు అన్నం పెట్టడం, నల్ల కుక్కల్కు అన్నం పెట్టడం, నల్లని గొడుగు, నల్లని వస్త్రాలు, తోలు వస్తువులు, నవధాన్యాలు, ఇనుముకు సంబంధించిన వస్తువులను పెదవారికి దానం చేయడం. శనిగ్రహదోషాలవలన బాధపడుతున్నవారు (నీలాంజన సమాభాసం,రవిపుత్రం యమాగ్రజం, ఛాయా మార్తాండ సంభూతం,తం నమామిశనైశ్చరం) అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసారులు పఠించటం.వికలాంగులకు ఆకలి గొన్న జీవులకు భోజనం పెట్టటం ఎవరివద్ద నుండి ఇనుము,ఉప్పు,నువ్వులు,నువ్వులనూనె చేతితో తిసుకోకుండా వుండటం చేయాలి.


🌻మద్య మాంసాదులను ముట్టరాదు. వీలైనవారు నల్ల నువ్వులతో శివార్చన స్వయముగా చేయటము.


🌻శనీశ్వర గాయత్రి: "ఓం కాకధ్వజాయ విద్మహే, ఖడ్గ హస్త ధీమహి తన్మోమంత ప్రచోదయాత్‌" (శనీశ్వర దోషపీడితులు ఈ గాయత్రి మంత్రాన్ని నిత్యం ప్రాత:సమయాన ఎనిమిదిమార్లు జపించవలెను) ఈ విధం గా శని ని పూజించి ఆరాదిస్తే బద్ధకం, చెడు ఆలోచనలు, రోగాలు, అపమృత్యు దోషము, దారిద్ర్యం తొలగుతాయి.వృత్తిపరమైన సమస్యలు, వివాహం లో ఆటంకాలు, శత్రు భయం, కోర్టు సమస్యలలో ఉన్న వారి సమస్యలు కూడా తొలగుతాయి.


🌻పూర్వజన్మ కర్మ ఫలం:- ఓ వ్యక్తి పూర్వ జన్మలో చేసిన కర్మల ఫలితాలనే ఈ జన్మలో అనుభవిస్తాడు. అందుకే ప్రతి వ్యక్తీ తన మహర్దశ, అంతర్దశలను తెలుసుకోవలసిన అవసరం ఉంది. జీవితంలో ఎదురయ్యే చేదు అనుభవాలనుంచి తప్పించుకోవడానికి ఇది చాలా అవసరం. శని మంచి దృష్టితో ఉంటే జీవితం నందనవనమవుతుంది.


🌻అదే శనిదేవుడు వక్రదృష్టి పడిందంటే అంతే సంగతులు. ఆయన అనుగ్రహముంటే రాజ్యాలేలే చక్రవర్తులవుతారు లేదా అనేక ఇబ్బందుల పాలవుతారు. చెడు కార్యాల్లో నిమగ్నమైనవారినే శనీశ్వరుడు పీడిస్తాడు. ఫలితం అనుభవించాల్సిందే ఎంత దైవాంశ సంభూతులైనా వారి వారి కర్మల ననుసరించి ఫలితాలను అనుభవించి తీరాలి. చెడు కార్యాలకు పాల్పడిన వారిని శనిదేవుడు తప్పనిసరిగా శిక్ష విధిస్తాడు. పురాణాల ప్రకారం సూర్యభగవానుడు కర్మలకు సాక్షి అయితే, శనిదేవుడు వాటి ఫలితాలను నిర్దేశిస్తాడు. ఆయా ఫలితాలను మాతృ గర్భం నుండి వెలువడిన మరుక్షణం నుంచీ అనుభవించడం మొదలవుతుంది. మంచి కార్యాలు చేసినవారికి శనిదేవుడు చల్లగా చూసి అద్భుతమైన జీవితం ప్రసాదిస్తాడు. ఇది అర్థం చేసుకోనివారు శని భగవానుని క్రూరాత్మునిగా భావిస్తారు. ఇది కేవలం మూర్ఖత్వం. శని దేవుడికి భయపడడం అవివేకం. ఆయన మానవ కర్మలకు ఫలితాలనిచ్చే దైవం.


🌻అలుపు సొలుపూ లేకుండా బిజీగా ఉండే లైఫ్‌లో కొంచెం సమయాన్ని సత్కార్యాలకు కేటాయించాలి. నిజాయితీగా జీవించాలి. శనిదేవునికి జీవరాసుల కర్మల ఫలితాలను ఇచ్చే వర్రపదాయినిగా బాధ్యతలు ఉన్నాయి. ఆయన తన బాధ్యతలను నిజాయితీగా, ఖచ్చితత్వంతో సమవర్తిగా నిర్వహిస్తాడు. ఇందులో ఎటువంటి పక్షపాతబుద్ధి లేదు. దీనికోసం ఆయనను పూజించాలే కానీ, భయపడకూడదు. ప్రకృతి నియమాలను అనుసరించి ఏ జీవి అయినా తన వంశ పారంపర్య లక్షణాలను వదులుకోడు.శనిదేవుడు మంచి మార్గంలో నచిచే మానవులకు సేవకుడిలా, ముక్తి ధామానికి కొనిపోయే మార్గదర్శిలా కూడా పనిచేస్తాడు.శనిదేవుని అనుగ్రహం పొందడానికి ఎన్నో మార్గాలున్నాయి. ఓర్పు, సహనం ముఖ్యం.మంచి కన్నా చెడు రాజ్యమేలే కలియుగంలో శని అనుగ్రహం సంపాదిం చాలంటే ఓర్పు సహనం ఉండాలి.


🌻అవినీతి, అపసవ్య మార్గాలలో పనులు సాధించుకోవాల నుకునేవారు, ధనార్జన చేసేవారు తొలుత విజయం పొందగలిగినా చివరకు దక్కించుకునేది అశాంతినే! తాత్కాలిక విజయాలు సాధించినవారు శనిదేవుని కోర్టులో తప్పక శిక్షించబడతారు. మానవులు తాము చేసిన ప్రతి దుష్కర్మకు జవాబు చెప్పి తీరాల్సిందే! అక్కడ ఏ దేవుడూ శనీశ్వరుడి బారినుంచి తప్పించలేరు. ఆయన ఒక్కసారి తీర్పు ప్రకటిస్తే దానికి తిరుగులేదు. త్రిమూర్తులలో ఎవరూ దానిని సరిచేయలేరు. కనీసం అడ్డుకోలేరు. ఆయన ముందు మంచి పనులు, ప్రార్థనలు, భక్తి యుతులు తప్ప ఏవీ పనిచేయవు. శనిదేవుడు చెడ్డవారిని, తప్పులు చేసినవారిని పట్టి పీడించడం ద్వారా వారిలో పశ్చాత్తాపాన్ని కలుగజేస్తాడు.


🌻మోక్షం దిశగా వారి ఆలోచనలను పురిగొల్పుతాడు. గర్వంతో విర్రవీగేవారిని నేలకు దించుతాడు. శనీశ్వరుడు మానవులలోని మాలిన్యాన్ని కడిగేస్తాడు. శని దండనాధికారి శాస్త్రరిత్యా శని శనివారానికి అధిపతి. ఏ వ్యక్తికైనా పూర్వజన్మ సుకృత, దుష్కృత ఫలితాలను ప్రదానం చేసే అధికారం శనిది. ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో శనిని పూర్వజన్మలోని సంచిత కర్మలకు అధిష్టాతగా చెప్పబడింది. శని దశల్లో వ్యక్తికి పూర్వజన్మలోని దుష్కర్మలకు సైతం దండన లభిస్తుంది. భౌతిక దృష్టిలో శని క్రూరుడుగా కనపడినా వాస్తవానికి అగ్ని పరీక్షకు గురి చేసి వ్యక్తిని సత్కర్మల వైపు మళ్ళిస్తాడు.. ఈశ్వర శాసనంలో శని దండనాధికారి. శని మనం చేసిన దుష్కర్మాలకే దండన విధిస్తాడు నిష్పక్షపాతంగా ఉన్న న్యాయాధిపతిలా శని దండన విధిస్తాడు.

🙏🌹🍁 *సేకరణ*🍁🌹🙏

               *న్యాయపతి*

            *నరసింహారావు*


_*🚩ఈ రోజు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే దేవుడు సంతృప్తి చెందుతాడు ?🚩*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉


శనిదేవుడు అంటే చాలా మంది బయపడతారు. వాస్తవానికి శని దేవుడు చాలా మంచివాడు. అమ్మ నాన్నల ప్రేమను శని దేవుడు చూపిస్తాడు. శని భగవానుడు అంటే నీతి , న్యాయం , ధర్మబద్దతకు కట్టుబడి ఉంటాడు. గోచారరిత్య శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు భక్తితో కొలిచి ధర్మబద్దంగా జీవించే వారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు.


*శని త్రయోదశి అంటే*


శనివారం రోజు త్రయోదశి తిథి ఉన్న రోజును శని త్రయోదశి అంటారు. ఆ రోజు స్వామి వారిని నువ్వులతో , నూనేతో నల్లని వస్త్రంతో అభిషేకం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు. 


*అయితే ఎలాంటి అభిషేకాలు చేయాలి , ఎలా చేయాలి ?*


శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి.


కుటుంబ , ఉద్యోగ , వ్యాపార , ఆరోగ్య , కోర్టు కేసులు , శత్రువులు , రుణాలు నుంచి విముక్తుల్ని చేయాల్సిందిగా మొక్కుకుని నియమాలు పాటిస్తారు. శనీశ్వరుడి ఆలయం నుంచి బయటికు వెళ్ళేప్పుడు అక్కడ ఉన్న బిక్షగాల్లకు , పేదవారికి శక్తి కొలది ఆహార రూపంలో కాని , వస్త్ర , ధన , వస్తు రూపంలో కాని దాన ధర్మాలు విరివిగా విశాల హృదయంతో చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి.

పూజకు వాడే నల్లటి వస్త్రం సుమారు రెండు మీటర్ల పోడవు అంటే ఒక లుంగి లాంటిది ఉండాలి. పూజ తరువాత ఆ వస్రాన్ని దానం చెస్తే దానం తీసుకున్నవారు ఉపయోగించుకునేలా ఉండాలి అని అర్ధం . దానాలు అనేవి ఉన్నవారికి చేస్తే ఫలితం రాదు. కేవలం నిరుపేదలకు , పశు పక్షాదులకు చేస్తేనే పుణ్యఫలం దక్కుతుంది ఇది గమనించాలి.


*త్రయోదశి వ్రతం :-*


శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. కశ్యపబుషి గోత్రం. సోదరుడు యమధర్మరాజు , సోదరి యమున , స్నేహితులు హనుమాన్ , కాలభైరవుడు. శనికి ఉన్న ఇతర పేర్లు కోణస్త , పింగళ , కృషాణు , శౌరి , బభ్రు , మంద , పిప్పలా , రౌద్రాంతక , సూర్యపుత్ర అని పిలవబడుతాడు.

నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కరుణామూర్తి శనీశ్వరుడు. ఏ త్రయోదశి అయితే శనివారంతో కూడి ఉంటుందో ఆ రోజు శని గ్రహాన్ని శనీశ్వరుడుగా సంబోధించి పరమశివుడు వరం ఇచ్చాడని అంటారు.

ఈ శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టం. దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న కోరికలను తీర్చి శుభ ఫలితాలను అందించేవాడు శనీశ్వరుడు. దీనికి నిష్టా నియమం కావాలి. ఈ రోజు ఎలాంటి నియామాలు పాటించాలి.



*శని త్రయోదశి రోజున పాటించవలసిన నియమాలు*



🌹 ఉదయాననే నువ్వుల నూనేతో ఒళ్ళంతా మర్ధన చేసుకుని తలస్నానం చేయాలి.


🌹 ఆ రోజు మద్య , మాంసాలు ముట్టరాదు.


🌹 వీలైన వారు శివార్చన తామే స్వయంగా చేస్తే మంచిది.


🌹 శనిగ్రహ స్థానదోషాల వలన బాధపడేవారు

*నీలాంజన సమభాసం*

*రవిపుత్రం యమాగ్రజం*

*ఛాయా మార్తాండ సంభూతం*

*తం నమామి శనైశ్చరం.*


అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు పఠిస్తే మంచిది.


🌹 వీలైనంత వరకు ఏపని చేస్తున్నా మౌనంగా ఉంటూ దైవ చింతనతో ఉండాలి.


🌹 అందరిలోను ప్రతీ జీవిలోను దేవున్ని చూడగలగాలి.


🌹 ఎవరితోను వాదనలకు దిగరాదు.


🌹 ఆరోజు ఆకలితో ఉన్న వారికి , పశు పక్షాది జీవులకు భోజనం పెడితే మంచిది.


🌹 ఉదయం సూర్యోదయం కాగనే శరీరానికి నువ్వుల నూనే రాసుకుని గంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేస్తే శని అనుగ్రహాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి.


🌹 మూగ జీవులకు ఆహార గ్రాసలను , నీటిని ఏర్పాటు చేయాలి.


🌹 కాకులకు బెల్లంతో చేసిన రొట్టెలను నువ్వులనూనేతో కాల్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి కాకులకు వేయాలి.


🌹 అనాధలకు , అవిటి వారికి , పేద వితంతువులకు , పేద వృద్ధులకు ఏదో రూపంగా సహయపడాలి.


🌹 జీవిత భాగస్వామితో సఖ్యతతో మెలగాలి.


🌹 ప్రతి రోజు తల్లి దండ్రుల పాద నమస్కారం చేసుకోవాలి.


🌹 అత్త మామలను , వంట చేసి వడ్డించిన వారిని , మన మేలు కోరేవారిని , ఉద్యోగం ఇప్పించిన వారిని , ఆపధ కాలంలో సహాయంగా నిలచిన వారిని ఎట్టి పరిస్థితులలో నిందించరాదు.


🌹 ఎట్టి పరిస్థితులలోను భాద్యతలను , భవ బంధాలను మరువరాదు.


ఈ విధంగా వ్యవహరించగలిగితే తప్పక శని భగవానుడు పూర్తి స్థాయి మేలు చేసి మంచి ఉన్నత స్థానంలో నిలబెడతాడని పురాణ వచనం.



దశరథుని రాజ్యానికి శనైశ్చర గ్రహబలం లేనందున కష్టాలు వస్తే , శనైశ్చరుని స్తుతించి దశరథుడు ఈ స్తోత్రాన్ని చేస్తాడు. ఈ స్తోత్రం పారాయణము చేసినవారికి శీఘ్రముగా నవగ్రహ అనుగ్రహం కలిగి ఏలినాటి శని , అర్ధాష్టమ శని దోషాలు తొలగి సంపదలు , ఐశ్వర్యాన్ని ఇస్తారని ఫలశ్రుతి. నిత్యం లేదా తప్పక శని వారం శనిత్రయోదశి వంటి పర్వదినాలలో పారాయణము చేయడం మంచిదని గురువుగారు పద్మపురాణ ప్రవచనంలో చెప్పారు. 



దశరథకృత శ్రీ శని స్తోత్రం*


ఓం నమః కృష్ణాయ నీలాయ - శితికంఠనిభాయ చ

నమః కాలాగ్ని రూపాయ - కృతాంతాయ చ వై నమః


నమో నిర్మాంసదేహాయ దీర్ఘశ్మశ్రుజటాయచ

నమో విశాల నేత్రాయ - స్థూలరోమ్ణే చ వై పునః


నమో దీర్ఘాయ శుష్కాయ కాలదంష్ట్ర నమోస్తుతే

నమోస్తు కోటరాక్షాయ - దుర్నిరీక్షాయ వై నమః


నమో నీలమధూకాయ - నీలోత్పలనియభాయ చ

నమో ఘోరాయ రౌద్రాయ - భీషణాయ కరాళినే


నమస్తే సర్వభక్షాయ - బలీముఖ నమోస్తుతే

సూర్యపుత్ర నమస్తేస్తు భాస్కరాభయదాయ చ


అథో దృష్టే నమస్తేస్తు - సంవర్తక నమోస్తుతే

నమో మందగతే తుభ్యం నిస్త్రింశాయ నమోస్తుతే


తపసా దగ్ధదేహాయ- నిత్యం యోగరతాయ చ

నమో నిత్యం క్షుధార్తాయ - అతృప్తాయ చ వై నమః


జ్ఞాన చక్షు ర్నమస్తేస్తు- కశ్యపాత్మజసూనవే

తుష్ఠోదదాసి నై రాజ్యం - రుష్ఠో హరసి తత్తణాత్


దేవాసురమనుష్యా శ్చ సిద్ధ విద్యాధరోరగాః

త్వయా విలోకితా స్సర్వే - నాశం యాంతి సమూలతః


ఓం నమస్తే కోణసంస్థాయ - పింగళాయ నమోస్తుతే

నమస్తే బభ్రురూపాయ - కృష్ణాయ చ నమోస్తుతే


నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయ చ

నమస్తే యమసంజ్ఞాయ- నమస్తే సౌరయే విభో


నమస్తే మందరూపాయ శనైశ్చర నమోస్తుతే

ప్రసాదం కుర మే దేవ వరార్థో హ ముపాగతః


ప్రసాదం కురు దేవేశ - దీనస్య ప్రణతస్య చ


*ఇతి శనిస్తోత్రమ్ |*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏


🙏🌹🍁 *సేకరణ*🌹🍁🙏

మంచి అలవాటు/Good Habits

 మంచి అలవాట్లు /Good Habits

మనం నిండు నూరేళ్లు పూర్తి ఆరోగ్యవంతులుగా సంతోషంగా, ఆనందంగా ఉండటానికి కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ముందు జాగ్రత్త తరువాతి ఆపదలను నివారిస్తుంది. 

 1. ప్రతిరోజు ఉదయం 5గంటలకి లేవాలి.( సూర్యోదయానికన్నా నిద్ర లేవటం వలన ఉషారుగా వుంటారు) 

2.ఉదయం పలహారానికి ముందు ఒక లీటరు నీరు త్రాగాలి.( ఉదయం త్రాగే నీటి వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది, రక్తంలో నీటి శాతం పెరిగి చురుకుగా వుంటారు. రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది) 

3.ఆహారం తినేముందు కాళ్ళు,  చేతులను శుభ్రంగా కడగాలి (పరిశుభ్రత పాటిస్తే సూక్ష్మ క్రిములు మన శరీరంలోకి రావు 

4.ఉదయంపూట పెరుగు అన్నం, గంజి అన్నం, ఇడ్లీ, దోస లేదా పెసరెట్టు మొదలగునవి తినాలి. 

5. రోజుకు 4నుంచి 6నానబెట్టిన బాదం పప్పు తినాలి. 

6.ఉదయం 6 నుంచి 8,సాయంత్రం 4నుంచి 6గంటల సమయములో ఎండ శరీరానికి తగలాలి ( ప్రాతః కాలపు సూర్య రశ్మిలో మన శరీరంలో Vit-D తయారు అయ్యే వ్యవస్త పనిచేస్తుంది) 

7.ఆకుకూరలు, కూరగాయలు,పప్పు,దంపుడు బియ్యం పెరుగులాంటివి మన ఆహారంలో తీసుకోవాలి ( విటమినులు సరియిన మోతాదులో లభించి కావలసినంత రోగ నిరోధత వృద్ధి చెందుతుంది) 

8.ప్రతిరోజు కాకరకాయ కూర లేదా వేప ఆకులు తింటూ ఉండాలి 

9.రోజు ఒక పండు తినాలి(అవి అరటి,ఆరంజ్, జామ,మామిడిపండు మొదలగునవి)

10. రాత్రి బోజనం 7గంటలలోపు తినాలి. 11. రాత్రి 10గంటలకి బ్రష్ చేసి పడుకోవాలి.

12.తలస్నానం ప్రతిరోజు చేయాలి(షీకకాయ షాంపుని వారానికి 2సార్లు ఉపయోగించాలి

13. రోజుకు 01గ్లాసు నిమ్మరసం త్రాగాలి.

 14.రోజుకు 10నుంచి 12 గ్లాసుల.నీరు త్రాగాలి.  

15.వంటకి నువ్వులనూనె, వేరుశనగనూనె గాని ఉపయోగించాలి. 

16. రోజుకు 01 గ్లాసు పాలు త్రాగాలి

 17. రోజుకు 01 గ్లాసు అంబలి త్రాగాలి.

18. కొబ్బరి నీరు, మజ్జిగ లాంటివి సేవిస్తూ ఉండాలి.

 19. డికాషను గాని, కాఫీగాని త్రాగాలి.

 20. మూడునెలలకు ఒకసారి కానీ లేక్ కనీసం ఆరు నెలలకు ఒకసారి ఆముదము సేవించాలి.  దీనిద్వారా జీర్ణాశయం శుద్ధి అవుతుంది 

21.సున్నుండలు,పప్పు చెక్కలు,నువ్వుల ఉండలు మొదలగునవి తింటూ వుండాలి.(వీటిలో ప్రోటీనులు సంవృద్ధిగా వుంది శరీరానికి బలాన్ని చేకూరుస్తాయి) 

23. పంచదారకి బదులు బెల్లం వాడుతుండాలి. 

22.రోజుకు 01చెంచా తేనె సేవించాలి.

24. కుండలో నీరుగాని రాగి, ఇత్తడి పాత్రలలో నీరుగాని త్రాగుతు వుండాలి

. 25. ప్రతిరోజు 1/2 టీ స్పూను నెయ్యి అన్నంతో తినాలి.

26. వారానికి ఒకసారి శరీరానికి నూనె పట్టించి ఆరిన తరువాత నలుగు పెట్టాలి. 

27. ప్రతిరోజు ఒక కప్పు మొలకెత్తిన గింజలు తినాలి. 

28. అప్పుడప్పుడు వంటలలో పచ్చి కొబ్బరి వాడాలి.

 29. ప్రతిరోజు కనీసం అరగంటవ్యాయామం (నడక,జాగింగ్,యోగాసనాలు) చేయవలెను.

30. బాండ పచ్చళ్ళు ఇనపముకుడులో వేయించటం, తాలింపు చేయటం చేయాలి ( ఆ పచ్చళ్లలో ఇనుము కొద్దిగా కరిగి మన శరీరంలో హిమోగ్లోబిన్ వృద్ధి చెందటానికి సహకరిస్తుంది తత్వారా అనీమియా రాకుండ కాపాడుతుంది.) 

31. అనవసరంగా ఎవరిమీద కోపగించవద్దు. ( కోపం వలన నరాలు ఉద్రేకానికి లోనయి రక్త పీడనాన్ని పెంచుతాయి తత్వారా అనేక రుగ్మతలు కలుగ వచ్చు) మౌనశ్చ కలహం నాస్తి. 

33) రోజులో ఎక్కువ భాగం సంతోషంగా ఉండటానికి ప్రయత్నించండి. 

34) గతాన్ని ఎప్పుడు తలుచుకోకండి గతంలోని సంతోషాలను, ఆనందాలను మాత్రమే తలుచుకొని మళ్ళి సంతోషపడండి. 

35. ఇతరులతో ప్రేమగా ప్రవర్తించండి. ఎవరైనా మిమ్మలిని చులకన చేసిన పట్టించుకోకండి.  వారితో తక్కువగా వ్యవహరించండి. 

36. అనవసరంగా ఇతరులతో ఎక్కువగా మాట్లాడకండి.  ప్రపంచంలో ఎవ్వరు మీ ప్రతిభను గుర్తించాలని అనుకోకండి. 

37. నీ సాటి వాడు అభివృద్ధి చెందాడని ఈర్ష్య పడకండి.  దేముడు ఎవరికి ఏది ఇవ్వాలో వారికి అది ఇస్తాడు. 

38) రోజులో కొంత సమయం దైవ సంబందితి కార్యక్రమాలు అంటే పూజలు, జపాలు, నామ స్మరణం మొదలైనవి చేసి మనస్సు ప్రశాంతంగా ఉండేటట్లు చేసుకోండి. 

39) భగవత్గీతలో శ్రీ కృష్ణ పరమాత్మా చెప్పినట్లు మీ ధర్మం ఏమిటో తెలుసుకొని దానిని మాత్రమే ఆచరించాలి.  ఎట్టి పరిస్థితిలోను నీ ధర్మం కానిదానిని ఆచరించవద్దు. 

40) వేదవిహిత కర్మలు అంటే మంచి పనులు మాత్రమే చేయాలి.  నిషిద్ద కర్మలు ఎట్టి పరిస్థితిలోను చేయకూడదు. 

41) దైవ దూషణ ఎట్టి పరిస్థితిలోను చేయకూడదు. 

42) సాధ్యమైనంత వరకు సత్యాన్ని పలకాలి 

43) ఇతరులకు హాని కలిగించే పనులు అస్సలు చేయకూడదు. 

44) అన్యాయ ఆర్జన కోసం ప్రయత్నించకూడదు. 

45) చిన్న చిన్న అనారోగ్యాలకు ఇంట్లోని చిట్కాలను వాడితే మంచిది. 

46) అనవసరంగా అంటిబొయితికులు వాడకూడదు. 

47) పూర్తి కడుపునిండ తినకుండ కొంత వెలితిగా శ్రీ కృష్ణ భగవానులు గీతలో తెలిపినట్లు తినాలి. 

48) రోజు సమయానికి భోజనము, నిద్ర ఉండేటట్లు చూసుకోవాలి. 

49) దానం పోయిన పరవాలేదు కానీ ఆరోగ్యం పాడు కాకూడదని భావించాలి. 

50) క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవరచుకోవాలి. 

 గమనికః ఈ ప్రతిని తీసుకొన్నవారు కనీసం 10 కాపీలు తీసి 10మందికి పంచగలరు





అమృతాంజనం

 అమృతాంజనం మనమెందుకు ఆదరించాలో తెలుసా ?

.......................................................


కాశీనాథుని నాగేశ్వరరావు అభ్యుదయవాది, దేశభక్తుడు, సంఘసంస్కరణాభిలాషి, సాహితీపరుడు. కాశీనాథుని నాగేశ్వరరావుపంతులు గారు 1860లో కృష్ణాజిల్లా గుడివాడతాలూకా యలమర్రులో జన్మించారు. బందరు, గుంటూరులలో చదువుకొన్నారు.


సత్ప్రవర్తన, క్రమశిక్షణ, నిబద్ధతలతో చదువుసాగించారు. అప్పట్లో గుంటూరుపట్టణంలో రెంటాల వెంకటసుబ్బారావనే వకీలు వుండేవారు. పేరుకు వకీలైనా మేడ్ ఈజీపేరుతో పాఠ్యపుస్తకాలకు గైడులు వ్రాసిపేరును ధనాన్ని బాగా ఆర్జించారు. వేంకటసుబ్బారావు గారికి మందుల వ్యాపారం కూడా వుండేది. రెంటాలకు మదరాసులోని విక్టోరియాలో డిపో వుండేది.ఆయన దృష్టిలో పడ్డాడు నాగలింగం.నాగలింగం ఎవరనే సందేహం కదూ కాశీనాథుని నాగేశ్వరరావు పంతులకు తల్లిదండ్రులు పెట్టినపేరు నాగలింగమే మరి.


కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారి స్ఫూరదృష్టి, మంచితనం, తెలివితేటలు రెంటాలవెంకటసుబ్బారావుకు బాగానచ్చాయి. తన మేనకోడలు మాయమ్మను ఇచ్చి చేయాలని నిర్ణయించాడు.నాగేశ్వరరావు కూడా సరేనన్నారు. కానీ తల్లిఒప్పుకోలేదు. ఎందుకంటే నాగలింగం ఆరాధ్యశైవ బ్రాహ్మణుడు. అమ్మాయి నియోగిశాఖకు చెందిన బ్రాహ్మణవధువు.పెళ్ళి జరిగితే శాఖంతరవివాహమైతుంది. అప్పటికే కందుకూరి వీరేశలింగం పంతులగారి సంస్కరణవాదం బాగా వంటబట్టి వుండటంతో శాఖాబేధాలను నాగేశ్వరరావు పట్టించుకోలేదు.


1890 లో కొండావెంకటప్పయ్య వంటి స్నేహితులే పెండ్లిపెద్దలై పెండ్లిజరిపించారు.అమ్మ పెండ్లికిరాలేదు. అందువలన రెంటాలవారి ఇంట్లోనే మకాంవేశాడు.

రెంటాలవారి మేడ్ ఈజీ, సాహిత్యం,మందులవ్యాపారం పై దృష్టిసారించి వ్యాపార మేళుకువలను బాగా ఆకలింపు చేసుకొన్నాడు. ఇద్దరు వ్యక్తుల మధ్య మనస్పర్థలు రావటానికి మగువ మద్యం మాంసం ఆర్థికభాగస్వామ్యం బుుణం వృత్తి మొదలైనవి బాగా పనిచేస్తాయి. కాశీనాథపంతులకు రెంటాలకు భాగస్వామ్య విషయంగా మనస్పర్థలు వచ్చాయి.


కాశీనాథుడు రెంటాలనుండి విడిపోయి కలకత్తా వెళ్ళిపోయి వ్యాపారంచేసి బాగా నష్టపోయి చేసేదేమిలేక బొంబాయి (ముంబాయి) చేరుకొన్నాడు.


బొంబాయిలో విలియం అండ్ కో అనే కంపెనివుండేది. అదో మందుల కంపెని. దాని యాజమానో పాశ్చాత్యుడు. ఆ కంపెనీలో పంతులు ఉద్యోగిగా చేరాడు. 

కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు నమ్మకం కష్టపడి పనిచేయడం సత్ప్రవర్తనలలో ఇంగ్లీసు దొరను మెప్పించాడు.ఆ దొర ఐరోపాకు తిరిగివెళ్ళిపోతూ కంపెనీని పంతులకు ఇచ్చివేశాడు.


గతంలోనే మందుల కంపెనీలో పనిచేయడం వలన, స్వంత తెలివితేటలతో పంతులుగారు ఆంగ్లేయుడు ఇచ్చిన కంపెనీలో 1893లో ఒక అంజనాన్ని (బామ్ / మలాం ) తయారుచేసి దానికి అమృతాంజనం అనేపేరు పెట్టాడు. నిజంగా ఈ అంజనం తలనొప్పి వంటి నొప్పులకు అమృతంలా పనిచేసింది.అమృతాంజనమనే పేరు సరిగా సరి పోయింది.


అమృతాంజనం తయారైంది కాని మార్కెటింగ్ ఎలా చేయాలి, అమ్మకాలు ఎలా పెంచాలో తెలియదు. అమృతాంజనంలో విలువైన ఆయుర్వేద ఔషదాలను కలిపాడు, అమృతాంజనం సీసాలకు స్వయంగా భార్యతోకలిసి పేపర్లు చుట్టాడు. అడ్వర్టెజ్ ( ప్రకటనలు ) వినూత్నపద్ధతిలో చేశాడు. ఏదైనా సభాకార్యక్రమం జరిగితే అక్కడ ఉచితంగా అమృతాంజనం పంచాడు. వినూత్నపద్ధతిలో ప్రకటనలు చేయడం వలన వ్యాపారం జోరందుకొంది.అమృతాంజనం అమృతప్రాయమైంది. త్వరలో కంపెని లాభాలబాట పట్టింది.


లాభాలు లక్షలరుపాయలకు చేరుకొంది. లాభాలను స్వంతానికి ఉపయోగించుకోలేదు. మొదటనుండి సంస్కరవాది, స్వతంత్ర్యపిపాసి, వచ్చిన డబ్బు వచ్చినట్లుగానే దేశసేవకు వినియోగించాడు. అందుకే పంతుల గారికి విశ్వదాత, దేశోద్ధారక అనే బిరుదులను ఇచ్చారు.



ఆయన స్థాపించిన ఆంధ్రపత్రిక స్వాతంత్ర్యోద్యమంలో కీలకపాత్ర వహించిన పత్రిక. 1908 సంవత్సరం సెప్టెంబరు 9 తేదీన, తెలుగు కాలమానంలో కీలక నామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికను బొంబాయినుండి ప్రారంభించారు.


వారపత్రికగా ఆంధ్రపత్రికను 9.9.1908 న ప్రారంభించి దానిని 04-01-1914లో దినపత్రికగా మార్చి మదరాసునుండి ప్రచురించడం జరిగింది.


ఇక సాహిత్యసేవకు గాను పంతులుగారు భారతిపత్రికను ప్రారంభించాడు.భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో మరీ ముఖ్యంగా మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న తెలుగు సాహిత్య మాస పత్రిక. 

 భారతి తొలిసంచిక రుధిరోద్గారి నామసంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైంది.


ఇలా తన సంపాదనను జాతి అభ్యున్నతికొరకు త్యాగంచేసిన 

కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారు1938లో మరణించాడు.


కాని ఆయన మనకిచ్చిన భారతిపత్రికను కనుమరుగుచేసి, ఆంధ్రపత్రికను అమృతాంజనంలను బ్రతికించు కోలేకపోతున్న తెలుగు వాళ్ళం మనం. అమృతాంజనం పోటీ ప్రపంచంలో ఎలాగో ఒకలా నెట్టుకు వస్తోంది. కాశీనాథుని సేవానిరతిని త్యాగాన్ని గుర్తించి, దేశసేవకు పాల్పడిన అమృతాంజనాన్ని మనం తప్పక ఆదరించాలి. మంట పుట్టించే జాండులకన్నా ఔషధాలున్న అమృతాంజనం ఎంతోమిన్న. కొనాల్సివస్తే నేను తప్పకుండా అమృతాంజనంనే కొంటాను. దయచేసి మీరు కూడా కొనాల్సివస్తే మంట పుట్టించే జాండులను కొనకుండా పనిచేసే అమృతాంజనాన్నే కొని కాశీనాథనాగేశ్వరరావుగారిని గౌరవించుకోవాలి సుమా!.


( సేకరణ)

----------------------------------------- జిబి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

ఎంత ప్రయత్నించినా ఆరని జ్వాల ...

అక్బర్ , షాజహాన్ , ఔరంగజేబ్ ఎంత ప్రయత్నించినా ఆరని జ్వాల ...

అక్బర్ ఈ జ్వాలాముఖి గుడిని నాశనం చేసే ఉద్దేశ్యంతోనే వచ్చాడు. అఖండ జ్యోతిని ఆర్పడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. రెండడుగుల మందంగల ఇనుప దిమ్మలను పెట్టించాడు ఆ జ్యోతిపైన ఈ సృష్ఠి మొదలైనప్పటినుండి ఆ అఖండ జ్యోతి వెలుగుతూనే వుంది. తన తరం కాలేదు. అలాంటి నాలుగైదు దిమ్మలు పెట్టిచాడు. ఆ ఇనుప దిమ్మల మధ్యనుండి జ్యోతి పైకి వచ్చింది. ఈరోజునకూడా ఆ ఆనవాళ్లు కనబడతాయి. అక్బర్ తన తప్పును తెలుస్కుని అమ్మవారి క్షమను అర్ధించి బంగారు ఛత్రం చేయించి సమర్పించుకున్నాడు .నేటికి ఆ ఛత్రాన్ని ఆలయంలో మనం దర్శించవచ్చు. ఆ తర్వాతనే హిందూ మతాన్నికూడా గౌరవించడం మొదలుపెట్టాడు. రాజ్యంలో బీర్ బల్ అనే పండితుడికి స్థానం కల్పించాడు. హిందూ రాజకుమారిని వివాహం చేసుకున్నాడు. 

షాజహాన్ ఈ జ్వాలలను తానూ ఆర్పుతానని కొన్ని లక్షల క్యూసెక్కుల నీళ్ళు తెప్పించి ధారాపాతంగా పోయించాడు .ఎన్ని రోజులు ఇలా నెలలు పోస్తున్నా జ్వాలలు ఆరలేదు సరికదా నీటి సమస్య వచ్చింది,రాజ్యంలో ఎక్కడ ఒక్క నీటి చుక్క లేకుండా చెరువులు బావులు ఇంకిపోయాయి .అప్పుడు అమ్మవారి శక్తిని అంగీకరించి క్షమాపణ కోరి వెనుదిరిగాడు.

ఔరంగజేబు , అక్బర్ షాజహాన్ చేయలేని పనిని తను పూర్తి చేస్తానని బయల్దేరాడు సైన్యంతో సహా. కాని పఠాన్ కోట్ తర్వాత ప్రస్తుత హిమాచల్ ప్రదేశ్ లోని కాంగడా మాత గుడి దగ్గరకు వచ్చేసరికి ఒక్కసారి తేనెటీగలు వాడి సైన్యాన్ని చుట్టుముట్టి చంపేశాయి. బతుకు జీవుడా అనుకుంటూ ఆగ్రా పారిపోయాడు. ఈ రోజుకీ కాగడా మాత, జ్వాలాజీ మాత గుళ్లలో ఆ ఆనవాళ్లు కనబడతాయి. తొమ్మిది రంగులలో గోడమీద జ్వాల వెలుగుతూంటుంది ఈ రోజుకికూడా. మినుకు మనుకు మంటూ ఆరడానికి సిధ్ధంగా వున్న జ్యోతి ఎప్పటినుండి అలా వెలుగుతోందో ఆర్కియాలజిస్టుల దగ్గర వున్న పరికరాలు కూడా చెప్పలేకపోతున్నాయి.

హిందూ మతాన్ని విమర్సించే జన అఙ్ఞాన వేదిక వాళ్లకు ఈ గుడి చూపించండి చాలు. ఎందుకంటే NASA scientists కూడా చాలా ప్రయోగాలు చేశారు. కింద భూమిలో పెట్రోలుందని తవ్వి చూసి అలాంటిదేమీ లేదని జుట్టుపీక్కుంటూ వెళ్లిపోయారు. ఆ గుడిలోనే గోరఖ్ నాథుడి ఉపాలయం వుంది. ఎలాంటి వెంటిలేషన్ లేనిచోట ఒక గొయ్యి ప్రక్కనే ఒకటిన్నర అడుగు ఎత్తు వరకూ అఖండ జ్యోతి వెలుగుతూంటుంది. మామూలుగానైతే ఆ గోతిలోని నీరు వేడెక్కిపోవాలి. కానీ ఆ నీరు చల్లగా ఫ్రిజ్ వాటర్ మాదిరి చల్లగా వుంటాయి. ఆ ప్రాంతం మొత్తం వేడెక్కి మాడి మసైపోవాలి కాని అలా జరగదు. ఈ ఔరంగజేబు ఉదంతం తర్వాతే ఆ గుడికి ప్రాముఖ్యత లేక దాదాపు జీర్ణవ్యవస్థకు చేరుకుంది. ఈ మధ్య దానినికూడా బాగు చేశారు.

ఈ ఆలయంలో 9 జ్వాలలు ఉంటాయి ... ఆ జ్వాలలు నవ దుర్గా స్వరూపిణిలుగా ఆరాధించబడుతున్నారు ... ఈ తొమ్మిది జ్వాలలను ఈ వీడియోలో చూడవచ్చు.

ఈ ఆలయం హిమాచల్ ప్రదేశ్ లోని ఖంగ్ర లో ఉన్నది.

ఓం శ్రీ మాత్రే నమః

గంగు మెహతార్

 " గంగు మెహతార్ " 

 మరాఠా సైన్యంలో ఒక ప్లటూన్ కు నాయకత్వం వహించిన ధీశాలి..

తనమీద ఒకేసారి దాడి చేసిన రెండు పులులను చురకత్తితో చంపేసిన మహావీరుడు..

భరతమాత ను తన తల్లిగా ఆరాధించిన ప్రఖర దేశభక్తుడు..తన సాటి సైనికులతో ..

"ఈ నేల మన మాతృభూమి.. మన తల్లి..మన తల్లిని స్వేచ్ఛగా ఉంచడానికి మన పూర్వీకులు చేసిన త్యాగం గుర్తు తెచ్చుకోండి ..ఈ తల్లి మళ్ళీ దాస్యశృంఖల అయింది తిరిగి మన తల్లికి స్వేచ్ఛను ఇవ్వాల్సిన బాధ్యత మనదే.. ఏదో ఒకరోజు నా మాతృభూమి శృంఖలాలు తెంచుకొని స్వేచ్ఛ అనుభవిస్తుంది " అని చెప్పేవారు.. 

1857 స్వాతంత్య్ర సంగ్రామంలో, గంగు మెహతార్ 150 మంది బ్రిటిషర్లను చంపాడు. బ్రిటిష్ దుర్మార్గులు ఆయనను అరెస్టు చేసి, చున్నిగంజ్‌లోని వేప చెట్టుకు ఉరితీశారు..

బ్రిటిష్ ప్రభుత్వం మనలోని అనేక స్వాతంత్ర సమరయోధులు, ధార్మిక యోధులు, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన మరియు బ్రిటీష్ ఆధిపత్యాన్ని ఎన్నడూ గుర్తించని వారిని దొంగలు..దోపిడీదారులుగా ముద్రవేసింది.. స్వతంత్ర భారతదేశంలో నేడు 300 కు పైగా కులాలు/తెగలను బ్రిటిష్ వారు అప్పుడు వేసిన ముద్రనుంచి నేటికీ బయటపడలేకపోతున్నారు..

ఉదాహరణకు స్టూవర్ట్ పురం .. అలాగే భద్రాద్రి గుత్తికోయలు .. వీరినందరిని పుట్టుకతోటే దొంగలు నేరస్తులుగా బ్రిటిష్ ప్రభుత్వం దుర్మార్గమైన ముద్రవేసింది... అలాగే గంగు మెహతర్‌పై కూడా ఒక నకిలీ కథను సృష్టించారు..దానిద్వారా ఆయన కులాన్ని ఆయన్ను ఒక నేరచరిత్ర గల వర్గంగా ముద్ర వేసి ఆయన్ను హంతకుడు దోపిడీదారుగా వాళ్ళ రికార్డుల్లో రాసుకున్నారు.. దీనివలన ప్రభుత్వ రికార్డులలో ఆయన ఎల్లప్పుడూ ఎక్కువ మంది బ్రిటిషర్లను చంపిన నేరస్థుడిగా ఉంటాడు.

ఈ చరిత్ర తిరగరాయాల్సిన అవసరం ఉన్నది..అలాగే కొన్ని కులాల మీద వేసిన ముద్ర కూడా అధికార రికార్డులనుంచి తొలగించాల్సిన ఆవశ్యకత కూడా ఉంది..

ఇలాంటి మహావీరులు చెట్లకు తమ దేహాలను వేలాడతీసినందువలన మనకు స్వతంత్రం వచ్చింది..

ప్రయోగాల పేరుతో వయసులో ఉన్న మహిళల దేహాలకు హత్తుకొని ఆ వేడిని అనుభవించిన వ్యక్తుల వలన స్వతంత్రం రాలేదు..

మహావీరులకు ఇవ్వాల్సిన గౌరవం వారికిద్దాం..వారి త్యాగాలను గుర్తిద్దాం..

నేడు గంగు మెహతార్ జీ పుణ్యతిది..

భారత్ మాతాకీ జై..