10, డిసెంబర్ 2020, గురువారం

వాత,పిత్త,కఫ హెచ్చుతగ్గుల వల్ల సంభవించు వ్యాధులు -

 శరీరం నందు వాత,పిత్త,కఫ హెచ్చుతగ్గుల వల్ల సంభవించు వ్యాధులు - 


 * శరీరం నందు వాతం వృద్ది చెందినచో శరీరం కృశించుట, శరీరం నందలి నీలవర్ణం , ఉష్ణం పెరగడం , కామం , అనాహం , శరీరం నందు వణుకుడు , మలబద్దకం , బలం తగ్గటం , నిద్ర తగ్గటం , ఇంద్రియ హాని , తనలోతాను మాట్లాడుకొనుట , భ్రమ , దైన్యం అను ఉపద్రవములు కలుగును.


 * శరీరం నందు పిత్తము వృద్దిచెందినచో మలము , మూత్రము, నేత్రములు వీనియందు పీతవర్ణం , ఆకలి, దప్పి , తాపము, స్వల్పనిద్ర మొదలగు ఉపద్రవములు కలుగును.


 * శరీరం నందు శ్లేష్మం వృద్దిచెందినచో అగ్నిమాంద్యం , నోట నీరువూరుట , బద్దకించుట , శరీరం నందు శుక్ల వర్ణం , అంగముల యందు చల్లదనం , అంగములు శైధిల్యం చెందుట, శ్వాస భారంగా రావటం , ఆయాసం , అధిక నిద్ర అను వికారములు కలగచేయును . 


  * శరీరం నందు రసం వృద్దిచెందినచో అగ్నిమాంద్యం అనగా అజీర్ణ సంభంద సమస్యలు కలుగును. 


 * శరీరం నందు రక్తం అధికంగా వృద్దిచెందిన విసర్పం, ప్లీహం ( spleen) సమస్యలు , విద్రది అను కురుపు , కుష్టు , వాతరక్తం , గుల్మము అనగా గడ్డలు , దంత సంబంధ సమస్యలు , కామెర్లు , చర్మం, మూత్రం , నేత్రములు యందు రక్తవర్ణం కనిపించును.


 * శరీరం నందు మాంసం వృద్దిచెందినచో గడ్డలు , క్యాన్సర్ కణుతులు మొదలగు రోగములు కలుగును. చెక్కిలి, తొడలు,ఉదరం నందు మాంసం వృద్దిచెందును . కంటం , నోటిలోపలి దవడ , నాలుక యందు మాంసం వృద్ధిచెందును. 


 * శరీరం నందు మూత్రం వృద్దిచెందినచో పొత్తికడుపు నందు నొప్పిని కలుగజేయును . మూత్రం విసర్జించినను మరలా మూత్రం వచ్చునట్లు అనిపించు రోగం కలుగును.


 * శరీరం నందు మలం వృద్దిచెందినచో కడుపుబ్బరం , ప్రేగులు అరుచుట , శరీరం నందలి నొప్పి కలుగజేయును 


 * శరీరం నందు స్వేదం వృద్ది అయినచో అదికంగా చెమట పట్టి శరీరం నందు దుర్గంధం  

మొదలగును .


 వాత,పిత్త,కఫాలు క్షీణించిన కలుగు ఉపద్రవాలు - 


 * శరీరం నందు వాతం క్షయించినచో కాళ్లు ,చేతుల యందు అశక్తి , అగ్నిమాంద్యం వంటి ఉపద్రవాలు కలుగును. 


 * శరీరం నందు పిత్తం తగ్గినచో అగ్నిమాంద్యము , శీతలం పెరుగును , శరీరం కాంతి తగ్గును. 


 * శరీరం నందు కఫం తగ్గినచో భ్రమ కలుగును. హుద్రోగం , సంధులలో శైథిల్యం పెరుగును 


 * శరీరం నందు రసము క్షయించినచో శ్రమ , శోష , శబ్దం సహించలేని సమస్య కలుగును. 


 * శరీరం నందు రక్తం క్షయించినచో ఆమ్లరసం , చల్లగా ఉండు వస్తువుల పైన ఇష్టం పెరగటం , సిరలు శైథిల్యం చెందటం వంటి సమస్యలు సంభవిస్తాయి.


 * శరీరం నందు మాంసం క్షయించినచో ఇంద్రియములకు గాని , చెక్కిలి, పిరుదులు , కీళ్ల సంధుల యందు పోటు పొడిచినట్లు అగుచుండును.


 * శరీరం నందు మేథస్సు క్షయించినచో పిరుదులు చచ్చుబారుట, ప్లీహం ( spleen) వృద్ది అగుట, శరీరం కృశించుట అగును.


 * శరీరం నందు ఎముకలలో క్షయం మొదలైనచో ఎముకల్లో బాధలు , దంతములు తలవెంట్రుకలు , గోళ్లు మొదలైనవి ఊడటం వంటి సమస్యలు కలుగును.


 * శరీరం నందు మజ్జ క్షయించినచో ఎముకల్లో రంధ్రాలు , భ్రమ పడటం , కండ్ల యందు చీకటి గమ్ముట వంటి సమస్య కలుగును.


 * శరీరం నందు శుక్రం క్షయించినచో చిరకాలం మీద శుక్రం బయటకి వెడలును. లేక రక్తం బయటకి వెడలును. మరియు వృషణముల యందు అధికంగా బాధ కలుగును . అంగము యొక్క రంధ్రము నుండి పొగ పోతున్నట్లు బాధ కలుగును.


 * శరీరం నందు మలము క్షయించినచో వాతం పొట్టచుట్టూ ఆవరించి ఉండును. మరియు ఆ వాతం పేగుల్లో చుట్టుకొని గొప్ప ధ్వనితో గూడి రొమ్ము , పక్కల్లో చాలా నొప్పి సంభంవించును.


 * శరీరం నందు మూత్రం క్షయించినచో కొంచం మూత్రం రావటం మరియు అతికష్టం మీద బాధతో కూడి మూత్రం రావటం , దుష్టమూత్రం రావటం , రక్తంతో కూడిన మూత్రం రావటం వంటి తీవ్రమయిన సమస్యలు సంభంవించును.


 * శరీరం నందు స్వేదం క్షయించిచో వెంట్రుకలు రాలిపోవడం , చర్మం నందు పగుళ్లు రావటం , వెంట్రుకల రంగు మారడం వంటి లక్షణాలు కలుగును.


        అనుభవం గల వైద్యుడు పైన చెప్పిన లక్షణాలుబట్టి సమస్యని కనుగొని చికిత్స చేయవలెను . 


       గమనిక -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

నువ్వెంత అదృష్టవంతుడివో

 🕴🏻నువ్వెంత అదృష్టవంతుడివో నీకు తెలుసా...??🕴🏻*


        _**మనలో చాలా మంది నేను దురదృష్టవంతుడిని, నా తలరాత ఇంతే, నా బ్రతుకింతే ఇలా తమని తామే నిందించుకుంటూ, తక్కువ చేసుకుంటూ, మనసులోనే కుమిలి కుమిలి పోతూ ఉంటారు. కానీ మనం ఎంత అదృష్టవంతులమో తెలిస్తే మనకున్న సగం అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి. ఎందుకంటే "మన మనసులోని బాధలే మన అనారోగ్యానికి మూల కారణం". మరి ఆ బాధలేమిటో పరిశీలిద్దాం..*_


_*(1) ఈ రోజు పొద్దున్నే నువ్వు "ఏ నొప్పులు, బాధలు లేకుండా, నిన్నేవ్వరూ లేపకుండా, నీకు నీవే ఆరోగ్యంగా నిద్రలేచావంటే ".. దేశంలో నిన్న రాత్రి అనారోగ్యం వచ్చిన పది లక్షల మంది కన్నా నువ్వు గొప్ప అదృష్టవంతుడివన్నమాట.*_


_*(2) నువ్వింత వరకు యుద్దంలో రక్తపాతం కాని, జైల్లో ఒంటరితనాన్ని గాని, కరువు సమయంలో శరణార్థ శిబిరాన్ని కాని చూడలేదంటే...ప్రపంచంలోని 200 కోట్ల మంది అనాధల కంటే నీవే గొప్ప అదృష్ట వంతుడివన్నమాట.*_


_*(3) నువ్వీరోజు ఏ భయమూ లేకుండా, ఏ అయుధమూ లేకుండా, నీ చుట్టూ పది మంది అనుచరులు లేకుండానే నీవు హాయిగా బయట తిరగ్గలిగావంటే..300 కోట్ల మంది నివసించే దేశాలలో నువ్వు లేవన్నమాట.*_


_*(4) ఈ రోజు నువ్వు కడుపునిండా తిని, ఒంటి నిండా బట్టలు కప్పుకొని,  ఓ ఇంటి కప్పుకింద కంటినిండా నిద్ర పోగలిగితే...ఈ భూప్రపంచంలోని 50 శాతం మంది కన్నా నీవు అతిపెద్ద ధనవంతుడివి అన్నమాట.*_


_*(5) నీ జేబులో ఈ రోజుకి సరిపడా డబ్బుండి, నీ బ్యాంక్ ఖాతాలో భవిష్యత్తు అవసరాలకు సరిపడా నగదు నిల్వ ఉన్నట్లయితే...ప్రపంచంలో  8 శాతంగా ఉన్న ఆత్యంత ధనవంతుల్లో నీవొకడివన్నమాట.*_


_*(6) నీ తల్లిదండ్రులు బ్రతికి ఉండి,  వారు నీతోనే కలిసి మెలిసి ప్రేమగా, తృప్తిగా జీవిస్తున్నారంటే.. ఈ ప్రపంచపు 15 శాతం మంది "అనాధ కుటుంబాలలో "నువ్వు ఒకడివి కాదన్నమాట. "జీవితంలో అనాధలు అంటే తల్లిదండ్రులు లేనివారు కాదు, ఉన్న తల్లిదండ్రులను సంతృప్తిగా చూసుకోలేనివాడు అసలైన అనాధలు". అయితే కొందరు సాకులు చెబుతూ ఉంటారు, తల్లిదండ్రులు అలాంటి వారు, ఇలాంటి వారు అని. కానీ "నువ్వూ అలాంటి వాడివే " కాకూడదు కదా !*_


_*(7) నువ్వు నీ భార్యపిల్లలు, స్నేహితులు, ఇతర కుటుంబసభ్యులతో కలిసి హాయిగా తలెత్తుకొని గర్వంగా సమాజంలో తిరగగలుగుతూ, ఆహ్లదంగా నవ్వగలిగితే, నీ ప్రవర్తన ద్వారా అందరినీ మెప్పిస్తున్నావంటే, ఈ ప్రపంచంలో చాలా మంది చెయ్యలేనిది నువ్వు చేస్తున్నావన్నమాట. అదే అసలైన హీరోయిజం.*_


_*(8) నీవు ఈ మాటలు చదువగలుగుతున్నావూ అంటే ప్రపంచంలో.. 50 కోట్ల నిరక్ష్యరాస్యులకంటే నువ్వు అదృష్టవంతుడివన్నమాట.*_


_*(9) నువ్వింకా నాకు అదిలేదు, ఇదిలేదు, ఇంకా ఏదో కావాలని అసంతృప్తిగా ఉన్నావంటే, నీకున్న ఆస్తులని, నీ విలువలని, నీ శక్తులని, నీ అదృష్టాన్ని నువ్వు గుర్తించడం లేదన్నమాట.*_


        _**ఇప్పటికైనా తెలిసిందా ఈ ప్రపంచంలో మీరెంత అదృష్టవంతులో, నాకు తెలిసి మన జీవితంలో "తృప్తికి మించిన సంపద " మరొకటి లేనేలేదు.*_


        _**ఇప్పటికైనా ..మీకు ఏమైనా బాధలు, కష్టాలూ ఉంటే వాటిని తగ్గించుకుంటూ..ఉన్నంతలో మీరు.. మీతోటి వారిని సంతోషంగా ఉంచటానికి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను...*_


       _**అందరం అర్థం చేసుకుంటే మరింత కాలం సంతోషంగా బ్రతుకుదాం !!!*_


       _**మనతోపాటు అందరినీ ఆనందంగా బ్రతకనిద్దాం......*_

మన తల్లిదండ్రులు ఇంత మంచి జన్మనిచ్చారు అంటే మన అంత అదృష్టవంతులు ఈ భుమి మీద మరెవరు ఉండరు


     _**సర్వే జనా సుఖినోభవంతు.*_🙏

        _**మనలో చాలా మంది నేను దురదృష్టవంతుడిని, నా తలరాత ఇంతే, నా బ్రతుకింతే ఇలా తమని తామే నిందించుకుంటూ, తక్కువ చేసుకుంటూ, మనసులోనే కుమిలి కుమిలి పోతూ ఉంటారు. కానీ మనం ఎంత అదృష్టవంతులమో తెలిస్తే మనకున్న సగం అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి. ఎందుకంటే "మన మనసులోని బాధలే మన అనారోగ్యానికి మూల కారణం". మరి ఆ బాధలేమిటో పరిశీలిద్దాం..*_


_*(1) ఈ రోజు పొద్దున్నే నువ్వు "ఏ నొప్పులు, బాధలు లేకుండా, నిన్నేవ్వరూ లేపకుండా, నీకు నీవే ఆరోగ్యంగా నిద్రలేచావంటే ".. దేశంలో నిన్న రాత్రి అనారోగ్యం వచ్చిన పది లక్షల మంది కన్నా నువ్వు గొప్ప అదృష్టవంతుడివన్నమాట.*_


_*(2) నువ్వింత వరకు యుద్దంలో రక్తపాతం కాని, జైల్లో ఒంటరితనాన్ని గాని, కరువు సమయంలో శరణార్థ శిబిరాన్ని కాని చూడలేదంటే...ప్రపంచంలోని 200 కోట్ల మంది అనాధల కంటే నీవే గొప్ప అదృష్ట వంతుడివన్నమాట.*_


_*(3) నువ్వీరోజు ఏ భయమూ లేకుండా, ఏ అయుధమూ లేకుండా, నీ చుట్టూ పది మంది అనుచరులు లేకుండానే నీవు హాయిగా బయట తిరగ్గలిగావంటే..300 కోట్ల మంది నివసించే దేశాలలో నువ్వు లేవన్నమాట.*_


_*(4) ఈ రోజు నువ్వు కడుపునిండా తిని, ఒంటి నిండా బట్టలు కప్పుకొని,  ఓ ఇంటి కప్పుకింద కంటినిండా నిద్ర పోగలిగితే...ఈ భూప్రపంచంలోని 50 శాతం మంది కన్నా నీవు అతిపెద్ద ధనవంతుడివి అన్నమాట.*_


_*(5) నీ జేబులో ఈ రోజుకి సరిపడా డబ్బుండి, నీ బ్యాంక్ ఖాతాలో భవిష్యత్తు అవసరాలకు సరిపడా నగదు నిల్వ ఉన్నట్లయితే...ప్రపంచంలో  8 శాతంగా ఉన్న ఆత్యంత ధనవంతుల్లో నీవొకడివన్నమాట.*_


_*(6) నీ తల్లిదండ్రులు బ్రతికి ఉండి,  వారు నీతోనే కలిసి మెలిసి ప్రేమగా, తృప్తిగా జీవిస్తున్నారంటే.. ఈ ప్రపంచపు 15 శాతం మంది "అనాధ కుటుంబాలలో "నువ్వు ఒకడివి కాదన్నమాట. "జీవితంలో అనాధలు అంటే తల్లిదండ్రులు లేనివారు కాదు, ఉన్న తల్లిదండ్రులను సంతృప్తిగా చూసుకోలేనివాడు అసలైన అనాధలు". అయితే కొందరు సాకులు చెబుతూ ఉంటారు, తల్లిదండ్రులు అలాంటి వారు, ఇలాంటి వారు అని. కానీ "నువ్వూ అలాంటి వాడివే " కాకూడదు కదా !*_


_*(7) నువ్వు నీ భార్యపిల్లలు, స్నేహితులు, ఇతర కుటుంబసభ్యులతో కలిసి హాయిగా తలెత్తుకొని గర్వంగా సమాజంలో తిరగగలుగుతూ, ఆహ్లదంగా నవ్వగలిగితే, నీ ప్రవర్తన ద్వారా అందరినీ మెప్పిస్తున్నావంటే, ఈ ప్రపంచంలో చాలా మంది చెయ్యలేనిది నువ్వు చేస్తున్నావన్నమాట. అదే అసలైన హీరోయిజం.*_


_*(8) నీవు ఈ మాటలు చదువగలుగుతున్నావూ అంటే ప్రపంచంలో.. 50 కోట్ల నిరక్ష్యరాస్యులకంటే నువ్వు అదృష్టవంతుడివన్నమాట.*_


_*(9) నువ్వింకా నాకు అదిలేదు, ఇదిలేదు, ఇంకా ఏదో కావాలని అసంతృప్తిగా ఉన్నావంటే, నీకున్న ఆస్తులని, నీ విలువలని, నీ శక్తులని, నీ అదృష్టాన్ని నువ్వు గుర్తించడం లేదన్నమాట.*_


        _**ఇప్పటికైనా తెలిసిందా ఈ ప్రపంచంలో మీరెంత అదృష్టవంతులో, నాకు తెలిసి మన జీవితంలో "తృప్తికి మించిన సంపద " మరొకటి లేనేలేదు.*_


        _**ఇప్పటికైనా ..మీకు ఏమైనా బాధలు, కష్టాలూ ఉంటే వాటిని తగ్గించుకుంటూ..ఉన్నంతలో మీరు.. మీతోటి వారిని సంతోషంగా ఉంచటానికి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను...*_


       _**అందరం అర్థం చేసుకుంటే మరింత కాలం సంతోషంగా బ్రతుకుదాం !!!*_


       _**మనతోపాటు అందరినీ ఆనందంగా బ్రతకనిద్దాం......*_

మన తల్లిదండ్రులు ఇంత మంచి జన్మనిచ్చారు అంటే మన అంత అదృష్టవంతులు ఈ భుమి మీద మరెవరు ఉండరు


     _**సర్వే జనా సుఖినోభవంతు.*_🙏

ఉత్పన్న ఏకాదశి

 _*రేపు ఉత్పన్న ఏకాదశి – ఉపవాసం విశిష్టత*_




🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉




కార్తీక పూర్ణిమ తర్వాత వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని *ఉత్పన్న ఏకాదశి* అంటారు. ఇది పరమ ఏకాదశి తర్వాత వచ్చే ఏకాదశి. ఈ ఉత్పన్న ఏకాదశి శ్రీమహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన తిధి.


ఉపవాసములు ఆచరించవలసిన ముఖ్యమైన ఏకాదశి ఈ ఉత్పన్న ఏకాదశి. శ్రీమహావిష్ణువు యొక్క శక్తి స్వరూపములను తెలిపే ఏకాదశులలో ఇది చాలా ప్రత్యేకమైనది.


ముర అనబడే రాక్షసుడిని శ్రీమహావిష్ణువు సంహరించే సందర్భంలో ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి రాక్షసుడైన మురను సంహరించింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని నామధేయం చేశాడు. సప్తమాతృకలలో ఒక స్వరూపమైన వైష్ణవీదేవి విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి స్వరూపములలో ఒకటి. అందువల్ల ఉత్పన్న ఏకాదశి ని ఏకాదశి తిధి యొక్క జయంతిగా భావిస్తారు.


ఈరోజు ఉపవాసం తప్పనిసరిగా చేయవలెను. ఉత్పన్న ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారి పాపములు హరించబడతాయి.  ముర అంటే తామసిక , రాజసిక , అరిషడ్వర్గాలకు ప్రతీక. ఈ రోజు ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువును పూజించిన వారి ఆ మురను జయించి మిగతా 23 ఏకాదశులలో ఉపవాసం చేసిన ఫలితం కలిగి వైకుంఠప్రాప్తి పొందగలరు. వితంతువులు కానీ ఈ రోజు ఉపవాసము ఆచరించిన యెడల ముక్తిని పొందగలరు.



*ఉత్పన్న ఏకాదశి యొక్క ప్రాముఖ్యత:*



ఉత్పన్న ఏకాదశి యొక్క గొప్పతనాన్ని శ్రీ కృష్ణుడు మరియు యుధిష్ఠిర రాజు మధ్య సంభాషణ రూపంలో *'భవవ్యోత్తర పురాణం'* వంటి వివిధ హిందూ గ్రంథాలలో వర్ణించారు. 'సంక్రాంతి' వంటి పవిత్ర రోజులలో విరాళాలు ఇవ్వడం లేదా హిందూ తీర్థయాత్రలలో పవిత్ర స్నానం చేయడం వంటివి ఉత్పన్న ఏకాదశి యొక్క ప్రాముఖ్యత. ఉత్పన్న ఏకాదశి  అతని / ఆమె పాపాల నుండి విముక్తి పొందాడని మరియు చివరికి మోక్షాన్ని పొందుతారని భావిస్తారు. మరణం తరువాత 'వైకుంఠం' విష్ణువు నివాసానికి నేరుగా తీసుకువెళతారు. 1000 ఆవులను దాతృత్వంగా దానం చేయడం కంటే ఉత్పన్న ఏకాదశి మహిమ ఇంకా ఎక్కువ అని నమ్ముతారు. ఉత్పన్న ఏకాదశిలో  ఉపవాసం హిందూ మతం యొక్క మూడు ప్రధాన దేవతలు బ్రహ్మ , విష్ణు , మరియు మహేశ్వరులకు ఉపవాసానికి సమానం. అందువల్ల హిందూ భక్తులు ఉత్పన్న ఏకాదశి వ్రతాన్ని పూర్తి అంకితభావంతో , ఉత్సాహంగా పాటిస్తారు.



*ఉత్పన్న ఏకాదశిలో ముఖ్యమైన సమయాలు*



సూర్యోదయం డిసెంబర్ 10, 2020 7:01 ఉదయం

సూర్యాస్తమయం డిసెంబర్ 10, 2020 5:37 అపరాహ్నం

ద్వాదాషి ముగింపు క్షణం డిసెంబర్ 12, 2020 7:02 ఉదయం

ఏకాదశి తిథి ప్రారంభమైంది డిసెంబర్ 10, 2020 12:51 అపరాహ్నం

ఏకాదశి తిథి ముగుస్తుంది డిసెంబర్ 11, 2020 10:04 ఉదయం

హరి వసారా ముగింపు క్షణం డిసెంబర్ 11, 2020 3:18 అపరాహ్నం

పరానా సమయం డిసెంబర్ 11, 7:02 AM - డిసెంబర్ 11, 9:09 ఉదయం



_*శ్రీ ధర్మశాస్తా వాట్సాప్ గ్రూప్స్*_




9849100044

_*శ్రీ శివ మహాపురాణం

 _*శ్రీ శివ మహాపురాణం - 26 వ అధ్యాయం*_



🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️



*సృష్ట్యు పాఖ్యానే ముని ప్రశ్న వర్ణనము*



☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️



ఇపుడు రెండవది యగు రుద్ర సంహిత ఆరంభింపబడుచున్నది. జగత్తు యొక్క సృష్టి స్థితి లయాదులకు ఏకైక కారణము. గౌరీ దేవికి భర్త, తత్త్వముల నెరింగిన వాడు. అనంతమగు కీర్తి గలవాడు, మాయకు ఆశ్రయమైన వాడు, మాయచే ప్రభావితుడు కాని వాడు, మనస్సుచే ఊహింపశక్యము గాని రూపము గలవాడు, జ్ఞాన స్వరూపుడు, నిర్దోషుడునగు శివునకు నమస్కరించెదను . ప్రకృతి కంటె అతీతుడు, ఆది లేని వాడు, శాంతస్వరూపుడు, అద్వితీయుడు, పురుషోత్తముడునగు శివునకు నమస్కరించుచున్నాను. ఆయన ఈ జగత్తు నంతనూ తన మాయచే సృష్టించి,జగత్తునకు లోపల, బయట ఆకాశమువలె వ్యాపించి యున్నాడు . శివుడీ జగత్తును తన స్వరూపము నుండియే సృజించి సర్వమును వ్యాపించి యున్నవాడై, తన గూఢ రూపమునందు ప్రతిష్ఠితుడై యున్నాడు. అయస్కాంత సన్నిధిలో లోహశకములు వలె, ఈ భువనములు నిత్యము ఆయన చుట్టూ తిరుగాడుచున్నవి. అట్టి శివుని నమస్కరించుచున్నాను .


*వ్యాసుడిట్లు పలికెను -*


జగత్తునకు తండ్రియగు శివుని, తల్లియగు పార్వతిని, వారి కుమారుడగు గణపతిని సమస్కరించి, ఈ గాథను వర్ణించుచున్నాము . ఒకప్పుడు నైమిషారణ్యము నందు నివసించే శౌనకుడు మొదలగు మునులందరు గొప్ప భక్తితో సూతుని ప్రశ్నించిరి .


*ఋషులు ఇట్లు పలికిరి -*


మంగళ కరము, సాధ్యసాధన ఖండ యను పేరు గలది, సుందరమైనది, భక్తులకు అనుగ్రహ కారమునగు విద్యేశ్వర సంహితా ప్రసంగమును వినియుంటిమి . ఓ సూతా!మహాత్మా!చిరకాలము సుఖివై జీవించుము. వత్సా! నీవు మాకు శంకరుని దివ్య గాథను వినిపించుచున్నావు గదా! ఓ పుణ్యాత్మా! నీ ముఖ పద్మము నుండి ప్రసరించు జ్ఞానామృతమును మేము పానము చేసినాము. కాని మాకు తృప్తి కలుగుట లేదు. మేము నిన్ను ఒక విషయమును ప్రశ్నించగోరుచున్నాము . నీవు వ్యాసుని అనుగ్రహముచే సర్వజ్ఞుడవు, కృతార్థుడవు అయినావు. భూత , వర్తమాన , భవిష్యత్‌ కాలములలో నీకు తెలియనిది లేదు .


నీవు గొప్ప భక్తిచే గురువు యొక్క పరమకృపను పొంది, సర్వమును వివరముగా తెలుసుకొంటివి. నీ జన్మ సార్థకమైనది . ఓ గొప్ప జ్ఞానీ! ఇపుడు సర్వశ్రేష్ఠమగు శివుని స్వరూపమును, శివ పార్వతుల దివ్య చరిత్రలను సంపూర్ణుగా చెప్పుము . మహేశ్వరుడు నిర్గుణుడైననూ, లోకములో సగుణుడుగ నున్నాడు. ఇది యెట్లు? విచారించినచో, మాకెవ్వరికీ శివుని తత్త్వము తెలియదు . శంభుడు సృష్టికి పూర్వము స్వరూపములో నుండుట యెట్టిది? స్థితి కాలములో ఆ ప్రభువు క్రీడించు విధమెట్టిది ?


ఆ మహేశ్వరుడు లయకాలమునందెట్లుండును ? లోకములకు శుభమును కలుగజేయు ఆ శంకరుడు ప్రసన్నుడగు విధమెయ్యది? . ఆ మహేశ్వరుడు ప్రసన్నుడై తన భక్తులకు మరియు ఇతర భక్తులకు ఇచ్చే మహా ఫలము ఏది ? ఈ విషయములనన్నిటినీ మాకు చెప్పుము . భగవానుడు వెనువెంటనే ప్రసన్నుడగునని వింటిమి. దయామయుడగు ఆ మహాదేవుడు భక్తుల కష్టమును చూడజాలడు . బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ముగ్గురు దేవతలు శివుని దేహము నుండి జన్మించిరి. వారిలో మహేశుడు శివుని పూర్ణాంశము కలవాడు గనుక, సాక్షాత్తుగా శివస్వరూపుడే .


హే ప్రభూ! ఆ శివుని ఆవిర్భావమును, చరిత్రలను, ఉమ యెక్క ఆవిర్భావమును, మరియు వారి వివాహమును వివరముగా చెప్పుము . ఓ అనఘా! శివుని గృహస్ధాశ్రమ గాధలను, ఇతర లీలలను వివరముగా చెప్పుము. ఇదంతయూ మాత్రమే గాక, ఇంకను చెప్పదగిన విశేషములను కూడ చెప్పవలెను .


*వ్యాసుడిట్లు పలికెను -*


ఈ విధముగా ఆ ముని వరులచే ప్రార్థింపబడిన సూతుడు శంభుని పాదపద్మములను స్మరించి వారికి ఇట్లు బదులిడెను .


*సూతుడిట్లు పలికెను -*


ఓ మునిశ్రేష్ఠులారా! మీరు చక్కగా ప్రశ్నించితిరి. మీ మనస్సులలో సదాశివుని గాథయందు నిష్ఠ కలిగినది. మీరు ధన్యులు . సదాశివుని కథలను గురించి ప్రశ్న గంగా జలమువలె స్త్రీలను , పురుషులను, చెప్పు వానిని, మరియు వినువానిని పవిత్రము చేయును . ఓ ద్విజులారా! శంభుని గుణముల ప్రసంగము సాత్త్వికులను, రాజసులను, తామసులను కూడా సర్వదా ఆనందింపజేయును. అట్టి ప్రసంగమునందు పశు హింసకునకు తప్ప మరెవ్వరికి విరక్తి కలుగును? 


శంభుని గుణములను నిష్కామ భావనతో గానము చేయు భక్తునకు సంసారమనే రోగము తొలగిపోవును. ఈ గుణగానము మనస్సునకు ఆహ్లాదకరముగను, చెవులకు ఇంపుగను ఉండుటయే గాక, సర్వకార్యములను సిద్ధింపజేయును . మీ ప్రశ్నకు సమాధానముగా నేను శివలీలను నా బుద్ధికి తోచినంతలో శ్రద్ధతో వర్ణించెదను. ఓ ద్విజులారా! మీరు ఆదరముతో వినుడు . ఒకప్పుడు నారదుడు శివస్వరూపుడగు విష్ణువుచే ప్రోత్సహింపబడినవాడై, తండ్రిని ఇదే ప్రశ్నను అడిగినట్లే అడిగెను . శివభక్తుడగు బ్రహ్మ గారు కుమారుని ప్రశ్నను విని, ప్రసన్నమగు మనస్సు గలవాడై, నారదునకు ఆనందము కల్గు విధముగా ప్రీతితో శివుని కీర్తిని గానము చేసెను . సూతుడు పలికిన ఈ మాటలను విని ఆ మునివరులు కుతూహలము గలవారై ఆ సంవాదమును చెప్పుమనని ఆయనను కోరిరి .




*ఋషులు ఇట్లు పలికిరి -*


ఓ సూతా! మహాత్మా! నీవు శైవులలో గొప్పవాడివి. మహాబుద్ధి శాలివి. నీమధురమగు పలుకులను వినుటకై మా మనస్సులు కుతూహలముతో ఉవ్విళ్లూరుచున్నవి . బ్రహ్మకు, నారదునకు రమ్యమగు ఆ గొప్ప సంవాదము ఎప్పుడు జరిగెను? కైలాసగిరివాసుని లీలా సంవాదము సంసారము నుండి విముక్తిని కలిగించును . హేసూతా! శంకరుని కీర్తిని గానము చేయు బ్రహ్మనారద సంవాదమును ప్రీతితో మా ప్రశ్నలకను రూపముగా మాకు వివరింపుము . పవిత్రాంతః కరణులగు ఆ మహర్షుల పలుకులను విని సూతుడు మిక్కిలి సంతసించినవాడై ఆ సంవాదము యొక్క వివరములను వర్ణించెను .


*శ్రీ శివ మహాపురాణములో రెండవదియుగు రుద్రసంహితయందలి సృష్ట్యుపాఖ్యానమను మొదటి ఖండములో ముని ప్రశ్న వర్ణనమనే మొదటి అధ్యాయము ముగిసినది.*




_*శ్రీ ధర్మశాస్తా వాట్సాప్ గ్రూప్స్*_




9849100044

*కార్తీక పురాణం - 26 వ అధ్యాయము*_

 _*కార్తీక పురాణం - 26 వ అధ్యాయము*_




🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉




*దూర్వాసుడు శ్రీహరిని శరణువేడుట - శ్రీహరి హితబోధ*




☘☘☘☘☘☘☘☘☘




ఈ విధముగా అత్రిమహముని అగస్త్యునితో - దూర్వాసుని కోపమువల్ల కలిగిన ప్రమాదమును తెలిసి , మిగిలన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను.


ఆవిధముగా ముక్కోపియైన దూర్వాసుడు భూలోకము , భువర్లోకము , పాతాళలోకము , సత్యలోకములు తిరిగి తిరిగి అన్ని లోకములలోను తనను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకువెళ్లి *"వాసుదేవా ! జగన్నాథా ! శరణాగతరక్షణ బిరుదాంకితా ! రక్షింపుము. నీభక్తుడైన అంబరీషునకు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుడను గాను. ముక్కోపినై మహాపరాధము చేసితిని. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగుమహర్షి నీ యురముపై తనిన్నను సహించితివి. అ కాలిగురుతు నేటికినీ నీవక్షస్దలమందున్నది. ప్రశాంతమనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడ రక్షింపుము. శ్రీహరి ! నీచక్రాయుధము నన్ను జంపవచ్చుచున్న"* దని దూర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరివిధముల ప్రార్దించెను. ఆవిధముగా దూర్వాసుడు అహంకారమును వదలి తనను ప్రార్దుంచుట చూచి - శ్రీ హరి చిరునవ్వు నవ్వి *"దూర్వాసా ! నీ మాటలు యదార్ధములు. నీవంటి తపోధనులు నాకత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమున బుట్టిన రుద్రడవు. నిన్ను జూచిన వారు మూడు లోకములందు భయపడకుందురా ! నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము యెట్టి హింసా కలిగించను. ప్రతియుగమందున గో , దేవ , బ్రాహ్మణ , సాధు జనంబులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్ధితలకు తగిన రూపములు ధరించి దుష్టశిక్షణ శిష్టరక్షణ గావింతును. నీవకారణముగా అంబరీషుని శపించితివి. నేను శత్రువుకైనను మనోవాక్కయములందు కూడా కీడు తలపెట్టను. ఈ ప్రపంచమందుగల ప్రాణి సమూహము నా రూపముగానే జూతును. అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను. కాని , అటువంటి నాభక్తుని నీవు అనేక విధములు దూషించితివి. నీ యెడమ పాదముతో తన్నితివి. అతని ఇంటికి నీవు అతిథినై వచ్చికూడ , నేను వేళకు రానియెడల ద్వాదశి షుడియలు దాటకుండ భుజింపుమని అంబరీషునకు చెప్పవైతివి. అతడు వ్రతభంగమునకు భయపడి , నీ రాకకై చూచి జలపానమును మాత్రమే జేసెను. అంతకంటే అతడు అపరాధము యేమిచేసెను ! చాతుర్వర్ణములవారికి భోజన నిషిద్ద దినములందు కూడా జలపానము దాహశాంతికిని , పవిత్రతకును చేయదగినదే కదా ? జలపాన మొనరించిన మాత్రమున నాభక్తుని దూషించి శపించితివి. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కాని నిన్నవమానించుటకు చేయాలేదే ? నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపచేయ జూచెను. ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణువేడెను. నేనపుడు రాజు హృదయములో ప్రవేశించినాను. నీ శాపఫలము పది జన్మలలో అనుభవించుదునని పలికిన వాడిని నేనే. అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను. కాని , తన దేహము తాను తెలుసుకోనే స్దితిలో లేడు. నీ శాపమును అతడు వినలేదు. అంబరీషుడు నాభక్త కోటిలో శ్రేష్టుడు. నిరపరాధి , దయాశాలి , ధర్మతత్పరుడు. అటువంటి వానిని అకారణముగా దూషించితివి. అతనిని నిష్కారణముగా శపించితివి. విచారించవలదు. ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవింతును.


అదెటులనిన నీ శాపములోనిది మొదటి జన్మ మత్స్యజన్మ. నేనీ కల్పమును మనువును రక్షించు నిమిత్తము , సోమకుడను రాక్షసుని జంపుటకు మత్స్యరూపమెత్తుదును. మరి కొంత కాలమునకు దేవదానవులు క్షీర సాగరమును మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు. అ పర్వతమును నీటిలో మునగకుండ కూర్మరూపమున నా వీపున మోయుదును. వరాహజన్మమెత్తి హిరణ్యాక్షుని వధింతును. నరసింహ జన్మమెత్తి హిరణ్యకశిపుని జంపి , ప్రహ్లాదుని రక్షింతును. బలిచే స్వర్గమునుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామనరూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళలోకమునకు త్రొక్కివేతును. భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంపి బ్రాహ్మణుడనై జన్మించి భూభారమును తగ్గింతును. లోకకంటకుడయిన రావణుని జంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడనై జన్మింతును. పిదప , యదువంశమున శ్రీకృష్ణునిగను , కలియుగమున బుద్దుడుగను , కలియుగాంతమున విష్ణు చిత్తుడను విప్రునియింట *"కల్కి"* యను పేరున జన్మించి , అశ్వారూడుండనై పరిభ్రమించుచు బ్రహ్మదోషులనందరను మట్టుబెట్టుదును. నీవు అంబరీషునకు శాపరూపమున నిచ్చిన పదిజన్మలను ఈ విధముగా పూర్తిచేయుదును. ఇట్లు నా దశావతారములను సదా స్మరించువారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నోసంగుదును. ఇది ముమ్మాటికి తథ్యము.



*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహత్మ్యమందలి షడ్వింశోధ్యాయము - ఇరవయ్యారో రోజు పారాయణము సమాప్తము.*




_*శ్రీ ధర్మశాస్తా వాట్సాప్ గ్రూప్స్*_




9849100044

రాజయోగాలను

 రాజయోగాలను ప్రసాదించే గ్రహాల ఆధిపత్యం


నవగ్రహాల్లో ఐదు, రెండు, తొమ్మిది, పది మొదలైన స్థానాలలో ఏ గ్రహమైనా ఆధిపత్యం వహిస్తే రాజయోగాలను అందిస్తారని శాస్త్రం చెబుతోంది. అందులో రెండో స్థానం కుటుంబాధి పత్యం, ఐదో స్థానం త్రికోణ స్థానంగా వ్యవహరించటంతో పాటు కుటుంబంలో మంచి అభివృద్ది అవకాశాలు లభిస్తాయి.


పదకొండో స్థానం ధనాధిపత్యం, పదో స్థానంలోలాభాధిపత్యం వహించటంతో.. వృత్తుల్లో మంచి అభివృద్దిని పొందుతారు. మంచి ఆనందదాయకమైన జీవితాన్నికూడా పొందుతారు. అదేసమయంలో ఈ జాతకుల గ్రహాలు నీచస్థానాలను పొందకూడదు. రాహు 3, 5, 10, 11 స్థానాల్లో కేంద్ర, కోణాలలో ఆధిపత్యం వహిస్తే మంచి ఫలితాలుంటాయి. రాహు, కేతులు పాప గ్రహాలైన ఒక్కో సమయంలో వాటి ఆధిపత్యం వలన మంచి యోగాలు లభిస్తాయి. కేతు మూడోస్థానంలో ఉంటే మంచి ఫలితాలను ఆశించవచ్చును.


అయితే ఐదు, తొమ్మిది స్థానాల్లో ఉంటే కీడును కలిగిస్తాడు. పదో స్థానంలో తప్ప మిగిలిన కేంద్రస్థానాల్లో రాహు ఆధిపత్యం వహిస్తే మంచి ఫలితాలు ఉండవు. రాహు, కేతులు 3, 6, 10, 11 స్థానాల్లో ఉంటే మంచి అభివృద్ది అవకాశాలు లభిస్తాయని గ్రహించాలి. శుక్ర, చంద్రులు మూడో స్థానంలో ఉంటే శుక్రదశా కారణంగా మంచి రాజయోగాలను ప్రసాదిస్తాడు.


ఈ కాలంలో కీర్తి ప్రతిష్టలు చేరుతాయి. పదో స్థానంలో ఆధిపత్యంతో పాటు 3, 11 స్థానాల్లో గ్రహాధిపత్యం ఉంటే సుమారైన ఫలితాలు కలుగుతాయి. సాధారణంగా 9వ స్థానంలో ఆధిపతిగా ఎనిమిదో స్థానంలో ఉంటే కీడైన ఫలితాలు కలుగుతాయి. గురు ఎనిమిదో స్థానంలో ఉంటే మంచి యోగాలను అందిస్తాడు. తొమ్మిదో స్థానంలో ఆధిపత్యం వహిస్తూ అష్టమాధిపత్యం కారణంగా లేదా గ్రహాల దృష్టి ప్రభావం చేత దశాకాలంలో మంచి ఫలితాలు అందజేస్తారు.


10,11 స్థానాల్లో అధిపతులుగా ఉన్న గ్రహాలు వేరొక గ్రహ సంయుక్తంతోనూ లేదా దృష్టి ప్రభావంతో లాభాధిపతి దశాకాలంలో మంచి ఫలితాలను అందిస్తారు. పదో స్థానాధిపతి దశాకాలంలో శుభఫలాలు, అశుభఫలాలు సంయుక్తంగా కలుగుతాయి. శని గ్రహం 3, 9 స్థానాల్లో ఉంటే మంచి ఫలితాలను అందజేస్తాడు.


అంతేగాక వారి స్థానాల్లో 9వ స్థానంలో ఆధిపత్యం వహించినా మంచి లాభాలు లభిస్తాయి. 5, 10 స్థానాలకు చెందిన అధిపతులు 10వ స్థానంలో ఉంటే కీర్తి, అధికారయుక్తంగా జీవిస్తారు. 9, 10 స్థానాలకు చెందిన అధిపతులు లగ్నంతో పాటు 7వ స్థానంలో ఉంటే ఐశ్వర్యం, కీర్తి ప్రతిష్టలు చేకూరుతాయి. గురు, చంద్రులు కటంకంలోనూ, సూర్య, శని, కుజ స్థానాలు ఉచ్చస్థానం పొందటం ద్వారా బంగారం, గృహనిర్మాణం, వాహనాలు వంటి నూతన వస్త్రాలను చేర్చటంలో ఆసక్తి వహిస్తారు....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్:- 9866193557

420 *గాయత్రీ

 శ్రీ మాత్రే నమః.

🙏🙏🙏🙏🙏


ది:10-12-2020 గురువారం.


420 *గాయత్రీ*


లలితా సహస్ర నామాల్లో గాయత్రి ఒక నామం.

గాయత్రీ శబ్దం వేదమాత అయిన త్రిపదా గాయత్రి యందు వర్తిస్తున్నది. గానం చేసేవారిని రక్షించేది గాయత్రీ మాత. 


ఋగ్, యజుర్, సామ వేదాల్లోని ఒక్కో పాదం అభివ్యక్తమై (fully expressed) త్రిపదా గాయత్రి అయింది.


ఒక్కో పాదంలో 8 అక్షరాలు వుంటాయ్. 24 అక్షరాలతో కూడిన గాయత్రి చతుర్వింశతి (24)తత్వాత్మాకమైన దేవికి ప్రతిరూపం.;ఇది మంత్రపరము.ద్వాత్రింశిక (32) వర్ణములతో కూడినది (తురీయపాదసహితము)పూర్ణగాయత్రి. 24 అక్షరములది త్రిపదా కూట త్రయాత్మకము.32 అక్షరములది చతుష్కూటాత్మకము. షోడశీ కళాయుక్తము.


ఇది తన్ను గానము చేయువారిని రక్షించి, పరబ్రహ్మమును పొందించునది అని అర్థం. ఇహలోకంలో సకల సంపదలు ఇచ్చునది.


భగవద్గీత 10 వ అధ్యాయం 35 వ శ్లోకం లో గీతాచార్యుడు *గాయత్రీ ఛందసామహం*

చందస్సులలో గాయత్రిని నేనే అన్నారు.


*పద్మపురాణం* లో గాయత్రి జననం గురించి మీరు వినివుంటారు.


421 *వ్యాహృతీ*


అంతటా వ్యాపించినదని అర్థం. ఉచ్చారణ రూపమైన మంత్ర విశేషానికి వ్యాహృతి అని పేరు. మూడు పాదాలు గల గాయత్రీ మంత్రానికి భూ: భువ:సువ: అని మూడు వ్యాహృతులు (వ్యాహృతి త్రయం)అని సంప్రదాయ సిద్ధము.         


భూలోక, భువర్లోక, సువర్లోకములు 

బ్రహ్మ స్వరూపములు అని శృతి, స్మృతి,ప్రసిద్ధము. 


ఆ విధంగా వ్యాపకత్వము శ్రీదేవికి వ్యాహృతులలో సార్ధకం గావున్నది.


🙏🙏🙏🙏

I'm your BF!

 A little boy said to a little girl:

- I'm your BF!

The little girl asked:

- What is BF?

The boy laughed and answered:

- That means Best Friend.


They later dated, the young man said to the girl:

- I am your BF!

The girl leaned lightly on the boy's shoulder, shyly asked:

- What is BF?

The boy replied:

- It's Boy Friend!


A few years later they got married, had lovely children, and the husband smiled again and told his wife:

- I am your BF!

The wife gently asked her husband:

- What is BF?

The husband looked at the lovely and happy children and replied:

- It's Baby's father!


As they get old, they sit together and watch the sunset on the front porch, and the old man tells his wife:

- Honey! I am your BF!

The old woman smiled with wrinkles on her face:

- What is BF?

The old man smiled happily and gave a mysterious answer:

- Be Forever!


When the dying old man also said:

- I can BF.

The old woman replied with a sad voice:

- What is BF ??

The old man answered and then closed his eyes:

- It's Bye Forever!


A few days later, the old woman also passed away. Before closing her eyes, the old woman whispered by the old man's grave:

- Beside Forever 💓💓

మాండూక్యోపనిషత్

 మాండూక్యోపనిషత్:-

 కప్ప నవమాసాలు ధ్యానం చేసుకుని, వర్షాకాలంలో  బొరియల నుండి బయటకు వచ్చి కన్నీరు కార్చే ప్రాణులను ఓదారుస్తుంది.  అలాగే ధ్యానులు, ఋషులు తాము సముపార్జించిన జ్ఞానాన్ని మానవాళికి అందిస్తారు. అజ్ఞానాన్ని తొలగించే ప్రక్రియను మాండూక్యోపనిషత్తు ద్వారా తెలుసుకుంటాం. 


 అజ్ఞానం రెండు రకాలు:-

1. అగ్రహణం - నేను 'ఆత్మ'ను అని తెలియకపోవటమే.

2. అన్యధా గ్రహణం - నేను ఏది కాదో దాన్నే నేను అనుకోవడం.

దానం

 *మహాదాత*

 

 ఒకానొక కోటీశ్వరుడు ప్రతి సంవత్సరం వ్యాపారం లో తనకొచ్చిన లాభాలలో నాలుగో వంతన్నా దాన ధర్మాలకు ఖర్చు చేసేవాడు. అందరూ తనను దాన కర్ణుడు అని ప్రశంసిస్తూ ఉంటే ఆయనకు అదొక తృప్తి గా ఉండేది. చనిపోయిన తరవాత కోటీశ్వరుడు స్వర్గం చేరాడు. కానీ అక్కడ కొద్ది కాలం మాత్రం గడిపిన తర వాత, యమదూతలు తనని నరకానికి తీసుకువెళ్లటం అతడికి బాధతో పాటు ఆశ్చర్యాన్ని కలిగింది. నరకా నికి వెళుతూనే, చిత్రగుప్తుడితో వాదం పెట్టుకొన్నాడు. ‘అయ్యా! ఇన్ని దానధర్మాలు చేసిన నన్ను నరకానికి పంపడ మేమిటి? మీ లెక్కలో ఏదో పొరపాటు జరిగింది. దాన్ని సరిచేయించండి’ అని.


 చిత్రగుప్తుడు కోటీశ్వరుడికి పరిస్థితి వివరించాడు: ‘నాయ నా, పొరపాటేమీ లేదు. నీకు నీ దానధర్మాల వల్ల చాలా పుణ్యం రావలసిన మాట నిజ మే. కానీ, నువ్వు దానం కోసం నీ దగ్గరకు వచ్చిన వాళ్ల ను చులకనగా చూసి, ఒకటికి పదిసార్లు నీ చుట్టూ తిప్పించుకొన్న తరవాతే నువ్వు చేసే దానమేదో చేసేవా డివి. ఆ కారణంగా, నీకు రావలసిన పుణ్యంలో నాలు గోవంతు చేతులారా నువ్వే పోగొట్టుకొన్నావు! ఆ తర వాత, ‘నేను అంత దానం చేశానూ, ఇంత దానం చేశానూ’ అని పదే పదే ప్రతిచోటా సందర్భం ఉన్నా లేకపోయినా ఆత్మస్తుతి చేసుకొని మరో నాలుగో వం తు పుణ్యం పోగొట్టుకున్నావు!’


 ‘అయినా, కనీసం ఆ మిగతా సగం పుణ్యమన్నా నాకు దక్కాలి గదా?’ అన్నాడు కోటీశ్వరుడు. ‘దక్కేదే, కానీ దాన గ్రహీతల చేత నువ్వు చేయించుకొన్న సత్కా రాలూ, సన్మానాలు, స్తుతులు, స్తోత్రాలూ వగైరాలకూ నీ పేరు ఉండాలని బలవంతం చేసి, నువ్వు సంపాదిం చిన పుణ్యంలో మిగిలిన భాగం కూడా అప్పుడే ఖర్చు చేసేసుకొన్నావు! కనక నీకు రావలసిన పుణ్యంలో స్వల్పమైన భాగమే నీ ఖాతాలో చేరింది’ అన్నాడు చిత్ర గుప్తుడు. ‘అదేమిటి? నా డబ్బుతో కట్టించిన ఆశ్రమా లకు నా పేరు పెట్టమంటే తప్పా? నా సొమ్ము దానం చేసినప్పుడు నేను దానం చేశానని చెప్పుకొంటే పాప మా?’ ఆక్రోశంతో ప్రశ్నించాడు కోటీశ్వరుడు.


 ‘అక్కడే చాలా మందిలా నువ్వూ పొరబడుతున్నా వు నాయనా! భూమి మీద నువ్వు జన్మ ఎత్తినప్పుడు నీ దగ్గర నువ్వు తెచ్చుకొన్న ద్రవ్యమంటూ ఒక్కపైసా లేదు. నీ జీవిత కాలంలో కొన్ని కోట్ల రూపాయలు నీ చేతికి వచ్చాయి. కానీ ఆ జీవిత కాలం ముగిసిన తర్వా త సంక్రమించినదాన్లో ఒక పైసా కూడా మళ్లీ నీతో తెచ్చుకోలేకపోయావు. ఇక అది నీ సొమ్ము ఎలాగ యింది చెప్పు? Ftసృష్టిలో ఉన్న ఐశ్వర్యాలూ, వనరులూ అన్నీ భగవంతుడివే. నీ కర్మ ఫలం వల్ల, ఆయన తన మహదైశ్వర్యంలో కొద్దిపాటి భాగం కొంతసేపు నీ చేతి లో ఉంచాడు. ఆ ధనంలో కొంత భాగం నువ్వు ఆయ న మెచ్చే దానధర్మాల కోసం వాడిన మాట నిజమే! ఆ మాత్రానికే నీకు ఎంతో పుణ్యం రావలసింది. కానీ ఆ పుణ్యమేదో అప్పటికప్పుడే పేరు కోసం, కీర్తి కోసం, అహం కోసం ఖర్చు పెట్టేసుకొన్నావు. మిగిలిన అతి స్వల్ప భాగం నువ్వు చేసిన కొద్ది కాలపు స్వర్గవాసంతో చెల్లు అయిపోయింది’ అని చిత్రగుప్తుడు చెప్పేసరికి కోటీశ్వరుడు కొయ్యబారి పోయాడు.

ఎం. మారుతిశాస్త్రి

ధార్మికగీత -105

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                           *ధార్మికగీత -105*

                                     *****

            *శ్లో:- అస్థిరం  జీవనం   లోకే ౹*

                   *అస్థిరం యౌవనం ధనం ౹*

                    *అస్థిరం  దార పుత్రాది ౹*

                    *ధర్మ కీర్తి ద్వయం స్థిరమ్ ౹౹* 

                                        *****

*భా:- లోకంలో మన జీవనవిధానంలో స్థిరములని, అస్థిరములని రెండు విధము లున్నాయి. పరిశీలిద్దాం*.     *1."జీవనము":- మానవ జీవనం ఆశాశ్వతము. క్షణభంగురము. నీటిబుడగవంటిది. దేహం ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. ఉన్న నాలుగు రోజులు భోగాలు ,రోగాలు.కష్టాలు,* *నష్టాలు,కలతలు,నలతలతో సరి.2. "యౌవనము":- యౌవనం శరత్ కాలమేఘము వంటిది. గర్జించడమే గాని వర్షించనిది. ఇట్టే వచ్చి అట్టే మాయమవుతుంది*. *యౌవన ప్రాయము కూడ   మూడు నాళ్ల ముచ్చటే. 3. "ధనము":- డబ్బు చంచలము. క్షణికము. రాకడ, పోకడ మనచేతిలో ఉండదు. అర్థాలు,అనర్థాలు డబ్బు వల్లనే.సుఖదుఃఖాలు డబ్బువల్లనే.4. "దార పుత్రాదులు"*:- *భార్యాబిడ్డలు కేవలం ఋణానుబంధమే. అప్పు తీరిపోగానే కనుమరుగవుతారు. మనలను అనుసరించి వచ్చేవారు కానేకారు.* *వీరు రైలు ప్రయాణంలో ప్రయాణీకులవంటి వారు మాత్రమే పైన చెప్పిన జీవనము,యౌవనము,ధనము,భార్యాబిడ్డలు అశాశ్వతమైన వారే.ఇక మనం త్రికరణశుద్ధితో చేసిన  "ధర్మము"; క్రమశిక్షణ, అంకితభావము, విశ్వాసము, సేవాతత్పరతలతో,విద్యుక్తధర్మనిర్వహణలో  గడించుకొన్న "కీర్తి" ; యీ రెండును మాత్రమే శాశ్వతములుగా* *చెప్పబడుచున్నవి. అస్థిరములైన వీటికోసం తాపత్రయం వదిలి, శాశ్వతమైన పరమపదము లక్ష్యముగా నిరంతర ఆధ్యాత్మిక చింతనా తత్పరులుగా మనుగడ సాగించాలని సారాంశము*.

                                 -*****

                   *సమర్పణ  :   పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲


 

God











 

Pravachanam











 

శివ మహా పురాణం

 **దశిక రాము**


**శ్రీ శివ మహా పురాణం**


25  by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


నటరాజు


మనకి పరమశివుని స్వరూపము అనేకరకములయిన మూర్తులుగా గోచరిస్తూ ఉంటుంది. పరమ శివునికి అరువది నాలుగు మూర్తులు ఉన్నాయి. శివుని స్వరూపమేమి అని అడిగితె మనకి శివలింగం అనే సమాధానం వస్తుంది. సాధారణంగా శివాలయముల అన్నిటియందు లింగ స్వరూపమే ఉంటుంది. కానీ సాకారంగా పరమశివుడికి పార్వతీదేవికి మూర్తి ఉన్నది. ఈ అరువది నాలుగులో ఒక భాగమును ‘ఘోర స్వరూపములు’ అంటారు. ఇవి సాధారణంగా శిక్షించడానికి వస్తాయి. రెండవది ‘అఘోరరూపములు’. మంగళప్రదంగా ఉంటాయి. అటువంటి మూర్తిని మీరు చూసినప్పుడు మీకు చాలా ఆనందం కలుగుతుంది. మీకు ప్రపంచంలో ఎన్ని రకములయిన విద్యలు ఉన్నాయో ఎన్ని కళలు ఉన్నాయో అంతమందీ కూడా తమ తమ కళలను ప్రదర్శన ప్రారంభం చేసే ముందు నమస్కరించవలసిన మూర్తి ఒకటి లోకంలో ఉంది. దానిని ఆనంద తాండవమూర్తి అంటారు. దానిని మనం ‘నటరాజు’ అని పిలుస్తుంటాం. కానీ శైవాగమం దానిని ‘ఆనంద తాండవ మూర్తి’ అని పిలుస్తుంది. ఆ తాండవం చెయ్యడంలో గొప్ప రహస్యములు కొన్ని ఉంటాయి. ఆనంద తాండవం చేసిన పరమశివుడు ఎవరు ఉన్నారో ఆయనలోంచే సమస్త శాస్త్రములు ఉద్భవించాయి. ఆయనలో నుంచే సమస్తమయిన కళలు వచ్చాయి. ఒక్క శంకరుడు చేసిన తాండవంలోంచి 650 రకాలైన నాట్యములు పుట్టాయి. ఈవేళ ఇప్పటికీ కర్మభూమిలో బ్రతికినవి 108 రకముల నాట్యములు. కూచిపూడి, ఒడిస్సీ, భరతనాట్యము ఇవన్నీ ఆనంద తాండవ మూర్తి అయిన శంకరుని దగ్గరనుంచే వచ్చాయి.

ఈ ఆనంద తాండవ మూర్తి చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఈ చిత్రమును గీయడం లేదా నిలబెట్టడం చాలా కష్టం. చేతులు కట్టుకుని ఆయన నాట్యమును నలుగురు మాత్రమే చూస్తారు. అందులో ఒకడు నందీశ్వరుడు, రెండవ వాడు భ్రుంగి, మూడవ వాడు పతంజలి, నాల్గవ వాడు వ్యాఘ్రపాదుడు. ఈ తాండవం ఆ స్వరూపంలో అప్పుడు సమస్త లయకారకమై ఉంటుంది. ఈ తాండవం ప్రదోష వేళలో జరుగుతూంటుంది. ఆయన నాట్యము చేత ఈ లోకమునకు రాజయ్యాడు. అందుకే ‘నటరాజు’ అని పిలుస్తుంటాము. ఆయన చేసే నాట్యం మామూలు నాట్యం కాదు. అది మీరు తెలుసుకుంటే చిదంబరంలో కనకసభ దగ్గరకు వెళ్లి అంత పెద్ద ఆనంద మూర్తిని మీరు చూడవచ్చు. అక్కడ ఆ మూర్తిని చూడగానే మీరు ప్రణిపాతం చేసి సాష్టాంగనమస్కారం చేసేస్తారు. అఘోర స్వరూపముల యందు చాలా గొప్ప స్వరూపములలో ఆనందమూర్తి స్వరూపం ఒకటి.

ఆనంద తాండవం చూసే స్థాయి పొందిన వాళ్ళలో మొదటి వాడు నందీశ్వరుడు. ఆయన అయ్యవారికి చాలా గొప్ప భక్తుడు. రెండవ వాడు భ్రుంగి. మూడవ వాడు పతంజలి. ఆదిశేషుని అవతారము. అందుకని ఆయన తల మనుష్యుడిగా ఉంటుంది. మిగిలిన శరీరం పాముగా ఉంటుంది. వ్యాఘ్రపాదుడికి తలకాయ మనుష్యుడిది. పాములు పెద్దపులివి ఉంటాయి. ఈ నలుగురు నిలబడి తాండవం చూస్తూంటారు. ముప్పది మూడు కోట్లమంది దేవతలు అక్కడే ఉంటారు. బ్రహ్మ శ్రీమహావిష్ణువు మద్దెల వాయిస్తూ ఉంటారు. పతంజలి తప్ప మిగిలిన దేవతలు ఎవరికీ తోచిన వాద్య విశేషణాన్ని వారు వాయిస్తూంటారు. డమరుకం కదలిక చేత ఇన్ని రకములయిన సృష్టి ప్రారంభం అయింది. ఆయన చేతిలో ఉన్న డమరుకం కారణంగా ఈయన సృష్టికర్త అయ్యాడు. పరమేశ్వరుని సృష్టి కదలిక వలన కొత్తగా కొన్ని ప్రాణులు లోకంలోకి వచ్చాయి. ఈ లోకంలోకి కొత్తగా ప్రాణులు రావడం అనే సమస్త కదలికలకు డమరుక సంకేతం. ఇవన్నీ జరుగుతున్నాయి అనడానికి ఆయన కదలికే కారణము. ఈశ్వరుని కదలికకు నర్తనమని పేరు. ఇదే ఆనంద తాండవము. ఆనంద తాండవ మూర్తి చేతిలో కుడివైపు డమరుకం ఉంటుంది. ఎడమచేతి వైపు అగ్నిహోత్రం ఉంది. ప్రపంచంలోని అన్ని వస్తువులు చివరకు భస్మమే అయిపోతాయి. ఈ విషయం లోపల బాగా నాటినట్లయితే వ్యక్తి తప్పుడు పనులు చేయడు. ఏది కాలంలో వచ్చిందో అది కాలమునందు ఉండదు అని మీకు అర్థం అయిపోతే మీ నడవడి యందు మార్పు వచ్చేస్తుంది. నటరాజ స్వామిని పరిశీలించినట్లయితే ఆయన కుడికాలి క్రింద ఒక రాక్షసుడు ఉన్నాడు. ఈయన కాలుకింద పడుకుని తల ఎత్తి నవ్వుతూ ఉంటాడు. ఏడవడు. మాయను గెలవడమే కుడికాలి కింద రాక్షసుని తొక్కి పట్టడం. ఎడమ కాలు బ్రాహ్మీ స్థితిని సూచిస్తుంది. కుడికాలు మాయను తొక్కితే పైకి లేచేది ఎడమకాలు. అందుకే ఆనంద తాండవ మూర్తి ఎడమకాలు పైకి లేచి ఉంటుంది. నీవు ఊర్ధ్వ ముఖ చలనము చేసి ఈశ్వరుడిని తెలుసుకునే ప్రయత్నం చేసి బ్రాహ్మీభూతుడవై ధ్యానము చేసి ధ్యానమునందు ఆనందమును పొంది ‘నేనుగా ఉండడం’ నీవు నేర్చుకో. నీవు నేనై ఉన్నాను అని తెలుసుకో. దానికి ధ్యానం అవసరం. ఇది చెప్పడానికి ఎడమచెయ్యి పైకి లేచిన ఎడమ పాదమును చూపిస్తుంది. కుడి చేయి అభయ ముద్ర పట్టింది. శివుడు చాలా తేలికయిన వాటిని పుచ్చుకుని పెద్ద శుభ ఫలితములను ఇస్తాడు. ఇది చెప్పడానికే ఆయన అభయముద్రను ప్రదర్శించాడు. పాపమును హరిస్తానని చెప్పాడు. హరించినప్పుడు ఉపాసకుడు క్రమంగా పెరుగుతాడు. పెరిగి ‘శివ’ – అంటే మంగళమును చేరతాడు. ఈ ‘శివ’ నుండి ఆనంద తాండవ మూర్తిలోనికి లయం అయిపోవాలి, తాను ఆనందంగా మారిపోవాలి. అలా మారిపోతుంటే ఇప్పుడు ఆయన దిగంబరుడుగా వచ్చాడు. అంటే శరీర భ్రాంతి లేకపోవడాన్ని ఆనందం అంటారు. ఆత్మస్వరూపి అయిన ఆనంద తాండవ మూర్తియండు సాధకుడు కలిసిపోతే తానె ఆనంద తాండవ మూర్తి అయిపోతాడు. ఆయనకి మరల చావడం అనేది ఉండదు. ఇదే ఆఖరి చావు.

శివుని విశేషములను వేటినీ మీరు సామాన్యముగా తీసుకొనుటకు ఉండవు. మీరు కేవలం ఒక నటరాజ స్వామి వారి మూర్తిని పెట్టుకుని అష్టోత్తరం చేస్తాను, సహస్రం చేస్తాను అంటే మీకు ఈ తత్త్వము ఆవిష్కరింపబడదు. ఇలా చూడాలన్న కోరిక పుట్టడమే చాలా కష్టం. కోరిక పుట్టినా అది నిలబడడం చాలా కష్టం. ఎందుకు అంటే కింద కుడికాలిక్రింద నవ్వుతూ ఒకడు బ్రతికే ఉంటాడు. వాడు ఎప్పుడు లేచి పట్టేసుకుంటాడో మనకి తెలియదు. ఎప్పుడయినా మాయ మళ్ళీ పట్టేస్తుంది. మళ్ళీ కూపంలోకి పడిపోతాడు. ఉదాహరణకు రావణాసురుడు శంకరుని ప్రార్థన చేశాడు. తనకు ఎటువంటి శంకరుని చూడాలని ఉన్నదో వివరిస్తూ స్తోత్రం చేశాడు “జటాటవీ గలజ్జల’ అని. ఇంత స్తోత్రం చేసిన రావణాసురుడు అలా నిలబడ లేకపోయాడు. పరమేశ్వరుని తనతో లంకకు రమ్మన్నాడు. ఏమయిపోయింది ఈ స్తోత్రం. అంటే అంతలో మాయ కమ్మింది. అడగడం కాదు. అడిగినవాడు నిలబడడం కూడా చాలా కష్టం. నిలబడడానికి శివానుగ్రహం ఉండి తీరాలి. శివానుగ్రహం కలిగితే ఆయనే నడిపిస్తాడు. కాబట్టి అటువంటి ఆనంద తాండవ మూర్తి అనుగ్రహం మనకు కలిగి మనుష్యజన్మ ప్రయోజనం నెరవేరేటట్లుగా నిర్హేతుక కృపాకటాక్షవీక్షణముల చేత ఈశ్వరానుగ్రహం మనయందు ప్రసరింపబడాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థన చేద్దాము.


🙏🙏🙏

శ్రీమద్భాగవతము

 **దశిక రాము**


**శ్రీమద్భాగవతము**


 ప్రథమ స్కంధం -7


నారదుని పూర్వకల్పము 


మహానుభావా! నేను గడచిన కల్పంలో గత జన్మలో ఒక దాసీపుత్రుణ్ణి. మా అమ్మ వేదవేత్తలైన వారి ఇంటిలో పని చేస్తూ ఉండేది. నన్ను చాతుర్మాస్యాలలో వానాకాలం నాలుగు నెలలూ ఒకే స్థానంలో నివాసం ఏర్పరచుకొనిన కొందరు యోగిజనుల సేవనిమిత్తమై వారు నియమించారు. ఆ పెద్దల ఆనతి శిరసా వహిస్తూ వారికి సేవ చేస్తూ ఉండేవాణ్ణి. ఆ మహానుభావులకు పరిచర్యలు చేసేవాణ్ణి. ఓ పుణ్యాత్ముడా! ఓర్పుతో నేర్పుతో భయభక్తులతో ప్రవర్తించేవాణ్ణి. తోటిపిల్లలతో ఆటపాటలకు పోకుండా, ఎటువంటి ఇతర సంబంధాలూ పెట్టుకోకుండా శ్రద్ధాభక్తులతో ఆ మహాత్ముల్ని కొలిచేవాణ్ణి. నే నా యోగిజనులు భుజించిన అనంతరం భిక్షాపాత్రలలో మిగిలి ఉన్న అన్నాన్ని భక్షించేవాణ్ణి: ఎండని, వానని లేకుండా వారి ముందు నిలబడి, ఎంతో జాగ్రత్తగా మారుమాటడకుండా వారి ఆజ్ఞలు పాలించేవాడిని. ఈ ప్రకారంగా వర్షాకాలం, శరత్కాలం గడచిపోయాయి. ఆ మహానుభావులకు నా మీద అనుగ్రహం కలిగింది. ప్రాజ్ఞులైన ఆ బ్రహ్మజ్ఞులు శ్రీ కృష్ణుని కథలు చదువుతూ, హరి లీలలు వర్ణిస్తు హరినామ సంకీర్తనం చేస్తూ ఉండేవారు. అనుక్షణం ఆ పుణ్యాత్ముల నోటినుండి వెడలి వచ్చే ఆ పలుకులు అమృత రసప్రవాహాలై నా వీనులవిందు చేసేవి. నా హృదయం ఆనందంతో నిండిపోయేది. క్రమక్రమంగా నేను ఇతర విషయా లన్నింటికి స్వస్తి చెప్పి భగవంతుడైన హరిని ఆరాధించటం ఆరంభించాను. అప్పుడు నాకు హరి సేవలో అమితమైన ఆసక్తి ఏర్పడింది. అందువల్ల నేను ప్రపంచాతీతుణ్ణి బ్రహ్మ స్వరూపుణ్ణి అయి, యట్టి నా యందు స్థూలం సూక్ష్మం అయిన ఈ శరీరం కేవలం మాయా కల్పితమని తెలుసుకున్నాను. మహానుభావులైన ఆ యోగీంద్రుల అనుగ్రహంవల్ల రజస్తమోగుణాలను రూపుమాపే అచంచల భక్తి నాకు సంప్రాప్తించింది. చాతుర్మాస్య వ్రతం అనంతరం ఆ మహాత్ములు మరొక ప్రదేశానికి వెళ్లటానికి ఉద్యుక్తులైనారు.ఈ విధంగా ఎట్టి ఒడుదుడుకులూ రాకుండా, చాంచల్యం లేకుండా ముప్పూటలా భక్తితో ఆరాధించి నందుకు ఆ సాధుపుంగవులు సంప్రీతు లైనారు. ఎంతో సంతోష కారుణ్య వాత్సల్యాలతో అతిరహస్యము, అమోఘము అయిన ఈశ్వరవిజ్ఞానాన్ని ఆ మహాత్ములు నాకు ఉపదేశించారు.

దేవాదిదేవుడైన వాసుదేవుని మాయాప్రభావాన్ని నేను కూడా ఆ మహనీయుల మహోపదేశం వల్ల తెలుసుకున్నాను. తాపత్రయాన్ని రూపుమాపే పరమౌషధం ఈశ్వరార్పణం చేసిన కర్మమే. లోకంలో ఏ పదార్థం వల్ల రోగం ఉద్భవించిందో ఆ పదార్థం ఆ రోగాన్ని పోగొట్టలేదు. మరో పదార్థం చేత చికిత్స జరిగితేనే కాని ఆ రోగం శాంతించదు. ఈ ప్రకారంగా కర్మలు భవబంధ కారణాలే అయినప్పటికీ, ఈశ్వరార్పణం చేయటం మూలాన తమ అస్తిత్వాన్ని కోల్పోతాయి. పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి చేసే కార్యం విశిష్టమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అందువల్ల ఈశ్వరుడు సంతోషించి అచంచల భక్తిని అనుగ్రహిస్తాడు. భగవంతుని ప్రబోధం వల్ల కర్మలు కావించేవారు శ్రీ కృష్ణ గుణ నామాలను కీర్తించటంలో, సంస్మరించటంలో ఆశ క్తులౌతారు. ఓంకారపూర్వకంగా వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ, అనిరుద్ధ నామాలు నాలుగింటిని భక్తితో ఉచ్చరించి నమస్కరించి చిన్మయ స్వరూపుడైన యజ్ఞేశ్వరుణ్ణి ఆరాధించే మానవుడు సమ్యగ్దర్శనుడై సమదృష్టి కలవాడౌతాడు.నేనీ విధంగా ప్రవర్తించుటవల్ల విష్ణుభగవానుడు విశిష్టమైన ఈశ్వరజ్ఞానాన్ని నాకు అనుగ్రహించాడు. నా నడవడి ఆ శ్రీమన్నారాయణునికి తెలుసు. ఓ వ్యాసా! నీవు కూడా శ్రీహరిని సంకీర్తించు. వ్యాసా! నీవు మునులలో ఎంతో ప్రసిద్ధుడవు. వినేవారి దుఃఖాలన్నీ దూరమై వారి స్వాంతనాలకు శాంతి లభించేటట్లు, చక్కగా వాసుదేవుని కీర్తించుము.“ఇలా నారదమహర్షి తన పుట్టు పూర్వోత్తరాలు వినిపించగా ఆలకించిన, వ్యాసముని నారదుణ్ణి మళ్లీ ఇలా ప్రశ్నించాడు. “ఆయ్యా! నీకు ఆ మహానుభావులైన సాధువులు ఎంతో దయతో ఈశ్వరజ్ఞానాన్ని ఉపదేశించి వెళ్లిపోయారు గదా. అటు పిమ్మట నీ బాల్యం ఎలా గడిచింది. పెద్దవాడ వయ్యాక ఎక్కడెక్కడ సంచరించావు. ఈ జన్మలో ఇప్పుడు నీకు పూర్వ జన్మస్మృతి ఏ విధంగా కలిగింది. దాసీవుత్రుడవైన నీవు ఏ విధంగా నీ దేహాన్ని త్యజించావు దయచేసి వివరించు.” వ్యాసులవారి ప్రశ్నలకు నారదులవారు ఇలా సమాధానం చెప్పారు”ఆ విధంగా నేను ఆ సాధుపుంగవుల వల్ల ఈశ్వర పరిజ్ఞానాన్ని పొంది యున్నాను. మా తల్లిది చాలా జాలిగుండె. ఉత్త అమాయకురాలు. తల వంచుకొని యజమానుల గృహాల్లో పనులన్నీ క్రమం తప్పకుండ చేసేది. తన దాస్యాన్ని గూర్చి కించిత్తు కూడా కించపడేది కాదు. నేనంటే ఆమెకు పంచప్రాణాలు. అయ్యో నా బిడ్డ అలసిపోయాడు. సొలసిపోయాడు, ఆకలి గొన్నాడు. అని అంటూ ప్రతిరోజూ అల్లారుముద్దుగా ఆదరించి నన్ను పెంచి పెద్దచేసింది. ఎంతో ప్రేమగా మాటిమాటికీ నా బుగ్గలు ముద్దుపెట్టుకొనేది. నా జట్టు దువ్వేది. నాఒళ్లు నిమిరేది. నన్ను ఆప్యాయంగా అక్కున చేర్చుకొనేది. ఈ విధంగా తల్లి ప్రేమతో పెరిగిన నేను ఆమెను విడిచి పోలేక ఇంట్లోనే ఉండిపోయాను. అయితే నేను సంసారవ్యామోహంలో చిక్కుబడలేదు. జ్ఞానాన్ని విడువలేదు. అయిదేళ్ళు వచ్చేదాక అలా మౌనిగ ఉన్నాను. అప్పుడు వ్యాసమహర్షీ! ఒకనాడు ఏమి జరిగిందంటే. మా అమ్మ రాత్రివేళ కటిక చీకటిలో ఆవు పాలు పిండటం కోసం ఇల్లు


వదలి బయటికి వెళ్లింది. త్రోవలో ఆమె ఒకపామును త్రొక్కింది. ఆ సర్పం ఆమె పాదాన్ని కరచింది. అత్యంత భయంకరమైన ఆ త్రాచుపాము కోరలలోని విషాగ్ని జ్వాలల వల్ల అమ్మ నేల మీద పడిపోయిది. అలా మా అమ్మ క్రిందపడి విలవిల తన్నుకొని వివశురాలై ప్రాణాలు వదిలింది. అప్పుడు నేను ఆ విషాదదృశ్యాన్ని చూసి ఏ మాత్రం కలవరపడకుండా, నాచిత్తం శోకాన్నిపొందకుండా, నిబ్బరించుకొని నిలబడ్డాను. ”మంచిది, బంధం తెగిపోయింది" అనుకొన్నాను. ఇక నాకు హరిచరణస్మరణమే అవశ్యకర్తవ్యమని నిర్ణయించుకొన్నాను.అలా అనుకొన్న నేను ఉత్తర దిక్కుగా బయలుదేరి పల్లెలు, పట్టణాలు, నగరాలు, జనపదాలు, గ్రామాలు, పేటలు, భిల్లవాటికలు దాటుకొంటూ, ఆటవికుల నివాసాలు, పెద్ద కొమ్మల మహావృక్షాలు, బాటసారుల మార్గాయాసాన్ని పోగొట్టే తటాకాలు, నానావిధాలైన పక్షుల కలకలారావాలతో రమణీయమై, వికసించిన తామరపూలలోని మకరందాన్ని త్రాగి పరవశించి పరిభ్రమించే గండుతుమ్మెదలతో నిండిన సరస్సులు దాటుతూ ముందుకు సాగాను. అప్పుడు నాకు ఆకలి దప్పికా ఎక్కువయ్యాయి. ఒక యేటి మడుగులో శుభ్రంగా స్నానం చేసి నీరు త్రాగి నా మార్గాయాసాన్ని తగ్గించుకొన్నాను.తోడేళ్ళు, కోతులు, ఎలుగుబంట్లు, అడవివరాహాలు, ఏనుగులు, దున్నపోతులు, ఏదుపందులు, గుడ్లగూబలు, శరభమృగాలు, శార్దూలాలు, కుందేళ్లు, మనుబోతులు, ఖడ్గమృగాలు, క్రూరసర్పాలు, కొండచిలవలు నిండిన భయంకరారణ్యాల గుండా మళ్లీ ప్రయాణించాను.దాట శక్యం కాని నీలితుప్పలు, వెదురు పొదరిండ్లు దగ్గరగా గల ఒక రావిచెట్టు కింద కూర్చున్నాను. నేను విన్న విధంగా నా హృదయంలో పదిలం చేసికొన్ని పరమాత్మ స్వరూపుడైన హరిని ధ్యానం చేశాను.


నారదునికి దేవుడుదోచుట 


నా కళ్ళల్లో ఆనందబాష్పాలు పొంగిపొర్లాయి. నా శరీరమంతా పులకించింది. ఆ భక్తి పారవశ్యంలో భగవంతుని చరణాలు ధ్యానిస్తున్న నా చిత్తంలో ఆ దేవదేవుడు సాక్షాత్కరించాడు. నేను కన్నులు తెరచి చూచేసరికి భక్తుల దుఃఖాలను పటాపంచలు చేసే పరమేశ్వరుని స్వరూపం అదృశ్యమైపోయింది. నేను విచారంతో లేచి నిల్చున్నాను. మళ్లీ ఆ దేవదేవుని దివ్యస్వరూపాన్ని దర్శించాలనే ఉత్కంఠతో నిర్మానుష్యమైన ఆ అరణ్యంలో అటూ ఇటూ తిరుగసాగాను. కాని నాకు తిరిగి ఈశ్వర సాక్షాత్కారం కలుగలేదు. అంతలో మాటలలో వివరించ సాధ్యం కాని వాడు అయిన శ్రీహరి మధుర గంభీర వచనాలు నా శోకాన్ని ఉపశమింపజేస్తూ నన్ను ఓదారుస్తూ ఈ విధంగా వినవచ్చాయి. నాయనా! ఎందుకలా వృథాగా ఆయాసపడతావు. నీవు ఎంత ప్రయత్నించినా ఈ జన్మలో నన్ను దర్శించలేవు. కామక్రోధాది అరిషడ్వర్గాన్ని జయించి నిర్మూలితకర్ములైన ముని ముఖ్యులే నన్ను చూడ గల్గుతారు. అంతే కాని జితేంద్రియులు కానివారు నన్ను దర్శించలేరు. అయినా నీ మనసులోని కోరికను కొనసాగించటం కోసం క్షణ కాలం నా స్వరూపాన్ని నీకు స్ఫురింపజేశాను. వత్సా! నా యందు లగ్నమైన నీ కోరిక వ్యర్థం కాదు. నీ సమస్త దోషాలూ దూరమౌతాయి. నన్ను సేవించటం వల్ల నాభక్తి అచిరకాలంలోనే నీమదిలో పదిలమౌతుంది. కుమారా నా యందు లగ్నమైన నీ హృదయం వచ్చే జన్మలో కూడా నన్ను అంటిపెట్టుకొని ఉంటుంది. నీవు ఈ దేహాన్ని వదలిన అనంతరం నా అనుజ్ఞతో మరు జన్మలో నా భక్తుడివై ఉద్భవిస్తావు. విను చిట్టితండ్రి! ఈ సృష్టి యావత్తూ లయమైపోయిన పిమ్మట వేయి యుగాలు చీకటి రాత్రిగా గడిచిపోతుంది. అప్పుడు తిరిగి సృష్టి ఏర్పడుతుంది. నీవు మళ్లీ జన్మిస్తావు. నీకు పూర్వస్మృతి ఉంటుంది. నా అనుగ్రహం వల్ల నీ దోషాలన్నీ నశించి సత్వ గుణసంపన్నులైన హరిభక్తులలో అగ్రగణ్యుడవై ప్రసిద్ధుడవు అవుతావు.”

ఈ విధంగా చెప్పి విరమించిన సర్వవ్యాపి, సర్వనియంత, వేదమయమూ అయిన ఆ మహాభూతానికి నేను తలవంచి మ్రొక్కాను. భగవంతుని అనుగ్రహానికి ఆనందించాను. మదాన్ని వీడాను. మాత్సర్యాన్ని దిగనాడాను. కామాన్ని అణచిపెట్టాను. క్రోధాన్ని వదలిపెట్టాను. లోభాన్ని, మోహాన్ని వదలివేసాను. సంకోచం లేకుండా గొంతెత్తి అనంతుని అనంతనామాలు ఉచ్చరిస్తూ, పరమపవిత్రాలయిన హరి చరిత్రలను స్మరిస్తూ, నిత్యసంతుష్టుడనై వాసుదేవుని హృదయంలో పదిలపరచుకొన్నాను. ప్రశాంతమైన అంతఃకరణంతో వైరాగ్యాన్ని అవలంబించి కాలాన్ని నిరీక్షిస్తూ తిరుగసాగాను. కొన్నాళ్లకు మెరుపు మెరిసినట్లుగా మృత్యుదేవత నా ముందు ప్రత్యక్షమయింది. అప్పుడు నేను పంచభూతాత్మకమైన పూర్వదేహాన్ని పరిత్యజించి భగవంతుని దయవల్ల సత్త్వగుణాత్మకమైన భాగవతదేహంలో ప్రవేశించాను. తర్వాత కల్పాంతకాలంలో ఏకార్ణవమైన జలమధ్యంలో శ్రీమన్నారాయణుడు శయనించి ఉన్న సమయాన, బ్రహ్మదేవుని నిశ్వాసంతో పాటు నేనూ భగవానుని ఉదరంలో ప్రవేశించాను. వెయ్యి యుగాలు గడిచిపోయిన తర్వాత లేచి లోకాలు సృష్టించ తలచెడి బ్రహ్మదేవుని నిశ్వాసం నుంచి మరీచి మొదలైన మునులు, నేను జన్మించాము. ఈ జన్మలో నేను అస్ఖలిత బ్రహ్మచారినై, భగవంతుని అనుగ్రహం వల్ల త్రిలోక సంచారినై, పరబ్రహ్మముచేత సృష్టింపబడిన సప్తస్వరాలు తమంతతామే మ్రోగే ఈ మహతి అనే వీణమీద విష్ణు కథలు గానం చేస్తూ ఇలా విహరిస్తున్నాను. నేను విష్ణుమూర్తి లీలలను గానం చేసినప్పుడ;, తీర్థపాదుడు, దేవాదిదేవుడు, వాసుదేవుడు అయిన పేరు పెట్టి పిలిచినట్లుగా వచ్చి నా మనస్సులో దర్శనము ఇచ్చేవాడు. ఓ వ్యాస


మహర్షీ! ఈ సంసార సముద్రంలో మునిగి తేలుతూ విషయవాంఛలచే క్రిందుమీదై బాధపడేవానికి గోవింద గుణకీర్తనం గట్టుకు చేర్చే తెప్ప లాంటిది. 

మునికులభూషణా! యమ, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహారాది అష్టాంగముల ద్వారా మనస్సును ఎంత కట్టుదిట్టం చేసుకొన్నప్పటికీ కామం, రోషం మొదలైన వానిచే అది మాటిమాటికీ రెచ్చిపోతూనే ఉంటుంది. కానీ శాంతించదు. అట్టి శాంతి వాసుదేవుని సేవ వల్లనే క్రమంగా లభిస్తుంది. నా పుట్టు పూర్వోత్తరాల రహస్యమంతా నీవు కోరిన ప్రకారం నీకు వివరించి చెప్పాను.“ అని ఈ ప్రకారంగా భగవంతుడు అయిన నారదుడు వ్యాస మునీంద్రునితో పలికి వీడ్కోలందుకొని వీణను మ్రోగించుకుంటూ వెళ్లిపోయాడు. అనంతరం సూతమహాముని శౌనకాదులతో ఇలా అన్నాడు. “నారదమహర్షి సర్వదా మహతీ విపంచి వాయిస్తు, ముకుందగీతాలు మ్రోయిస్తు, సకల జగత్తులకు వీనులవిందు చేస్తు, లోకుల పాపసమూహాలను మాయిస్తు, సంచరించే మేటి భక్తుడు. ఆయనకు ఆయనే సాటి.”అంటూ నారదమహర్షిని సూతుడు స్తుతించగా ”నారదుని మాటలు ఆలకించిన అనంతరం వ్యాసభగవానుడు ఏం చేసాడో చెప్ప” మని శౌనకుడు అడిగాడు. సూతుడు ఇలా చెప్పాడు. ”బ్రహ్మదేవతాత్మికమైన సరస్వతీనది పడమటి తీరాన ఋషులు యజ్ఞాలు చేసుకోటానికి అనుకూలమై అనేక రేగుచెట్లతో నిండి శమ్యాప్రాసమనే ఆశ్రమం ఉంది. వ్యాసుడు ఆ ఆశ్రమానికి వెళ్లి తన చిత్తంలో భగవంతుణ్ణి దర్శించాడు. ఈశ్వరుని మాయ ఆవరించి ఉన్న జీవుని సంసారాన్ని చూశాడు. మాయా మోహితుడైన జీవుడు త్రిగుణాతీతుడై కూడా మయా ప్రభావం వల్ల గుణాభిమానం కలవాడై, తానే కర్తను భోక్తను అనే అనర్థభావనలు చేస్తాడని, ఈ అనర్థాన్ని ఉపశమింప చేయటానికి విష్ణుభక్తి అనే యోగం తప్ప మరొకటి ఏదీ లేదని నిశ్చయించాడు. ఈ విశాల భూమండలంలో ఏ మహాగ్రంథాన్ని విన్నంత మాత్రం చేతనే సంసారబంధాలు సమసిపోయి జగన్నాథుడైన నారాయణునిపై అచంచలమైన భక్తి ఆవిర్భవిస్తుందో, అట్టి లోకకల్యాణకరమైన మహాగ్రంథాన్ని, వేదస్వరూపమైన భాగవతాన్ని బాదరాయణ మహర్షి ఓర్పుతో నేర్పుతో రూపొందించాడు.ఈ విధంగా మహాభాగవత మనే సంహితను కల్పించి ముముక్షువైన శ్రీశుకునిచే చదివించాడు” అని సూతుడు చెప్పగానే శౌనకముని విని ”మోక్ష మందు మాత్రమే అపేక్ష కలిగి, సమస్త మందు ఉపేక్ష కల శుకయోగీంద్రుడు భాగవతాన్ని ఎందుకోసం అధ్యయనం చేసాడు” అని ప్రశ్నించగా సూతమహర్షి ఇలా అన్నాడు.శ్రీహరి గుణకీర్తన ముందు ఆసక్తుడూ, ఉత్తమ విష్ణుభక్తుడూ అయిన శుకమహర్షి ముల్లోకాలకూ కల్యాణప్రదమైన భాగవతము అనే వేదమును విశ్వశ్రేయస్సును ఆకాక్షించి అధ్యయనం చేసాడు. జ్ఞానవంతుడా! వేలకొద్దీ వేదాలను ఎంత చదివినా మోక్షసంపదలు అందుకోడం అంత సుళువు కాదు. అదే భాగవతము, అనే వేదాన్ని పఠిచటం ద్వారా అయితే మోక్షం అతి సుళువుగా దొరుకుతుంది."

🙏🙏🙏

సేకరణ


**ధర్మము-సంస్కృతి**

🙏🙏🙏

మహాభారతం

 **దశిక రాము**


       **కవిత్రయ**


  **మహాభారతం**


ఆది పర్వము -8


నాగులకు శాపము :


కశ్యప ప్రజాపతి భార్యలైన వినతా కద్రువలు తమకు సంతానం కావాలని భర్తను కోరారు. కశ్యపుడు వారిని మీకు ఎలాంటి పుత్రులు కావాలి అని అడిగాడు. కద్రువ తనకు ప్రకాశవంతమైన దేహాలు కలిగిన పుత్రులు వెయ్యి మంది కావాలని కోరింది. వినత తనకు వారి కంటే బలవంతులైన ఇద్దరు పుత్రులు కావాలని కోరింది. పుత్రుల కొరకు కశ్యపుడు పుత్రకామేష్టి యాగం చేసాడు. యాగ ఫలితంగా కద్రువకు వెయ్యి అండాలు వినతకు రెండు అండాలు కలిగాయి. ముందుగా కద్రువ అండాలు పక్వం చెంది వెయ్యి మంది నాగ కుమారులు జన్మించాయి. అందుకు వినత ఉక్రోష పడి తన అండాలలో ఒకదానిని బలవంతంగా చిదమింది. దాని నుండి సగము దేహంతో జన్మించిన అనూరుడు ఎందుకు అమ్మా తొందరపడి అండాన్ని చిదిమావు. నీ వలన నేను సగం దేహంతో పుట్టాను. ఈ దేహం కలిగినందుకు కారణమైన నీవు నీ సవతికి దాసివి అగుదువుగాక అని శపించాడు. ఆ తరువాత తాను సూర్యునికి సారధిగా వెళ్ళాడు. అనూరుడు వెళుతూ తన తల్లితో అమ్మా రెండవ అండాన్ని జాగ్రత్తగా కాపాడు. దాని నుండి పుట్టేవాడు మహా బల సంపన్నుడు. అతడి వలన నీకు దాస్య విముక్తి కాగలదు అని చెప్పి వెళ్ళాడు.


క్షీరసాగర మధనం :


ఇలా ఉండగా దేవ దానవులు వాసుకిని కవ్వపు త్రాడుగా చేసి మంధర పర్వతాన్ని కవ్వంగా చేసి పాల సముద్రాన్ని మధించడం మొదలు పెట్టారు. ముందుగా పుట్టిన భయంకరమైన హాలాహలం శంకరుడు గ్రహించి లోకాలను రక్షించాడు. ఆ తరువాత పుట్టిన ఉచ్చైశ్వం, ఐరావతం ఇంద్రుడు స్వీకరించాడు. కౌస్థుభ మణిని, లక్ష్మీ దేవిని విష్ణుమూర్తి స్వీకరించాడు. ఆ తరువాత కల్పవృక్షం, కామధేనువు, అప్సర కాంతలు, సుర మొదలైనవి లభించాయి. చివరగా ధన్వంతరి అమృత కలశంతో అవతరించాడు. అమృత కలశాన్ని రాక్షసులు లాక్కుని వెళ్ళారు. అమృతం

కోసం దేవ దానవులు కలహించారు. విష్ణు మూర్తి మోహిని అవతారంలో రాక్షసులను వంచించి అమృతాన్ని గ్రహించి అమృతాన్ని దేవతలకు మాత్రం పంచసాగాడు. ఇది గ్రహించిన రాహువు, కేతువు దేవతల వేషంలో అమృతం సేవించారు. సూర్య చంద్రులు ఇది గ్రహించి విష్ణు మూర్తికి చెప్పారు. విష్ణు మూర్తి వారి శిరస్సును చక్రా యుధంతో ఖండించాడు. అప్పటికే గొంతు వరకూ దిగిన అమృతం వలన వారి శిరస్సులు చిరాయువు అయ్యాయి మిగిలిన శరీరం పడిపోయింది. అది మొదలు వారు సూర్య చంద్రులపై వైరం పెంచుకున్నారు. వంచించ బడినట్లు గ్రహించిన రాక్షసులు బలి చక్రవర్తితో ఆలోచించి దేవతలతో యుద్ధం చేసారు. యుద్ధంలో ఓడిపోయి సముద్రంలోకి పారిపోయారు. దేవతలు మంధర పర్వతాన్ని స్వస్థలంలో ఉంచి స్వర్గలోకం చేరారు.


🙏🙏🙏

సేకరణ

కార్తీక పురాణం*

 **దశిక రాము**


**కార్తీక పురాణం**

🕉🕉🕉🕉🕉🕉🕉🕉


**26వ అధ్యాయము**


**దూర్వాసుడు శ్రీహరిని శరణువేడుట - శ్రీహరి హితబోధ**


ఈ విధముగా అత్రిమహముని అగస్త్యునితో - దూర్వాసుని కోపమువల్ల కలిగిన ప్రమాదమును తెలిసి, మిగిలన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను.


ఆవిధముగా ముక్కోపియైన దూర్వాసుడు భూలోకము, భువర్లోకము, పాతాళలోకము, సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములలోను తనను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకువెళ్లి "వాసుదేవా! జగన్నాథా! శరణాగతరక్షణ బిరుదాంకితా! రక్షింపుము. నీభక్తుడైన అంబరీషునకు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుడను గాను. ముక్కోపినై మహాపరాధము చేసితిని. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగుమహర్షి నీ యురముపై తనిన్నను సహించితివి. అ కాలిగురుతు నేటికినీ నీవక్షస్దలమందున్నది. ప్రశాంతమనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడ రక్షింపుము. శ్రీహరి! నీచక్రాయుధము నన్ను జంపవచ్చుచున్న"దని దూర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరివిధముల ప్రార్దించెను. ఆవిధముగా దూర్వాసుడు అహంకారమును వదలి తనను ప్రార్దుంచుట చూచి - శ్రీ హరి చిరునవ్వు నవ్వి "దూర్వాసా! నీ మాటలు యదార్ధములు. నీవంటి తపోధనులు నాకత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమున బుట్టిన రుద్రడవు. నిన్ను జూచిన వారు మూడు లోకములందు భయపడకుందురా! నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము యెట్టి హింసా కలిగించను. ప్రతియుగమందున గో, దేవ, బ్రాహ్మణ, సాధు జనంబులకు సంభవించే యాపదలను పోగొట్టుటకు ఆయా పరిస్ధితలకు తగిన రూపములు ధరించి దుష్టశిక్షణ శిష్టరక్షణ గావింతును. నీవకారణముగా అంబరీషుని శపించితివి. నేను శత్రువుకైనను మనోవాక్కయములందు కూడా కీడు తలపెట్టను. ఈ ప్రపంచమందుగల ప్రాణి సమూహము నా రూపముగానే జూతును. అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను. కాని, అటువంటి నాభక్తుని నీవు అనేక విధములు దూషించితివి. నీ యెడమ పాదముతో తన్నితివి. అతని యింటికి నీవు అతిథినై వచ్చికూడ, నేను వేళకు రానియెడల ద్వాదశి షుడియలు దాటకుండ భుజింపుమని అంబరీషునకు చెప్పవైతివి. అతడు వ్రతభంగమునుకు భయపడి, నీ రాకకై చూచి జలపానమును మాత్రమే జేసెను. అంతకంటే అతడు అపరాధము యేమిచేసెను! చాతుర్వర్ణములవారికి భోజన నిషిద్ద దినములందు కూడా జలపానము దాహశాంతికిని, పవిత్రతకును చేయదగినదే కదా? జలపాన మొనరించిన మాత్రమున నాభక్తుని దూషించి శపించితివి. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కాని నిన్నవమానించుటకు చేయాలేదే? నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపచేయ జూచెను. ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణువేడెను. నేనపుడు రాజు హృదయములో ప్రవేశించినాను. నీ శాపఫలము పది జన్మలలో అనుభవించుదునని పలికిన వాడిని నేనే. అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను. కాని, తన దేహము తాను తెలుసుకోనే స్దితిలో లేడు. నీ శాపమును అతడు వినలేదు. అంబరీషుడు నాభక్త కోటిలో శ్రేష్టుడు. నిరపరాధి, దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటి వానిని అకారణముగా దూషించితివి. అతనిని నిష్కారణముగా శపించితివి. విచారించవలదు. ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవింతును.


అదెటులనిన నీ శాపములోనిది మొదటి జన్మ మత్స్యజన్మ. నేనీ కల్పమును మనువును రక్షించు నిమిత్తము, సోమకుడను రాక్షసుని జంపుటకు మత్స్యరూపమెత్తుదును. మరి కొంత కాలమునకు దేవదానవులు క్షీర సాగరమును మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు. అ పర్వతమును నీటిలో మునగకుండ కూర్మరూపమున నా వీపున మోయుదును. వరాహజన్మమెత్తి హిరణ్యాక్షుని వధింతును. నరసింహ జన్మమెత్తి హిరణ్యకశిపుని జంపి, ప్రహ్లాదుని రక్షింతును. బలిచే స్వర్గమునుండి పారద్రోలబడిన ఇంద్రనకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామనరూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళలోకమునకు త్రొక్కివేతును. భూభారమును తగ్గి౦చుటకు క్షత్రియులను చంపి బ్రాహ్మణుడనై జన్మించి భూభారమును తగ్గింతును. లోకకంటకుడయిన రావణుని జంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడనై జన్మింతును. పిదప, యదువంశమున శ్రీకృష్ణునిగను, కలియుగమున బుద్దుడుగను, కలియుగాంతమున విష్ణు చిత్తుడను విప్రునియింట "కల్కి" యను పేరున జన్మించి, అశ్వారూఢు౦డనై పరిభ్రమించుచు బ్రహ్మదేషులనందరను మట్టుబెట్టుదును. నీవు అంబరీషునకు శాపరూపమున నిచ్చిన పదిజన్మలను యీ విధముగా పూర్తిచేయుదును. ఇట్లు నా దశావతారములను సదా స్మరించువారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నోసంగుదును. ఇది ముమ్మాటికి తథ్యము.


**ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్టప్రోక్త కార్తీక మహత్మ్యమందలి షడ్వి౦శోధ్యాయము - ఇరవయ్యారో రోజు పారాయణము సమాప్తము.**


🙏🙏🙏

విశ్వజగత్తు

 దశిక రాము??


*విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభుః*

*భూతకృద్ భూతభృద్ భావో భూతాత్మా భూతభావనః*

*తా:-* విశ్వజగత్తు రూపమున ఉన్నవాడు, 
అంతటా వ్యాపించి ఉన్నవాడు,యజ్ఞ పురుషుడు,త్రికాలాలకు ప్రభువు,సమస్త 
జీవరాశులను సృష్టించి నాశనమొనర్చువాడు,జీవులను పోషించువాడు,జగత్తు రూపమున ఉనికిగా ఉన్నవాడు,సర్వ ప్రాణుల హృదయాలలో ఆత్మ రూపమున వెలుగొందుచున్నవాడు,జీవులను సృజించి వృద్ధి చేసేవాడు అయిన విష్ణుదేవునికి నమస్కరిస్తున్నాను.


      *శుభోదయం*
🙏🙏🙏 

*శ్రీ శివ మహా పురాణం

 **దశిక రాము**


**శ్రీ శివ మహా పురాణం**


24  by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


మార్కండేయ చరిత్ర


పూర్వకాలంలో మృకండుడు అనబడే ఒక మహర్షి ఉండేవాడు. గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణయందు ఆయన, ఆయన భార్యయైన మరుద్వతి ఇద్దరూ కూడా బహుశ్రద్ధ పూనిక ఉన్నవారు. వీళ్ళిద్దరూ హిమాలయ పర్వత ప్రాంతంలో ఒక ఆశ్రమమును నిర్మితం చేసుకుని తల్లిదండ్రులతో, శిష్యులతో అక్కడ నివసిస్తున్నారు. ఆవులనన్నిటినీ చేరదీసి కాపాడుతూ ఆ ఆవుపాలతో శివార్చన చేస్తూ ఆయన ఈలోకమునందు ప్రకాశిస్తున్నాడు. మరుద్వతి ఎంతో సంతోషంతో అత్తమామలకు సేవ చేసేది. భర్తను సేవించేది. శిష్యులను తల్లిలా కాపాడేది. వాళ్ళిద్దరూ గృహస్థాశ్రమంలో తమ జీవితమును పండించుకుని అందరికీ కామధేనువై కల్పవృక్షమై తమ జీవితమును నడుపుతున్నా వారికి బిడ్డలు కలుగలేదు. ఆ సాకుతో వారు శివార్చన మాత్రం మానలేదు. ఈశ్వరుడిస్తాడని పూనికతో వారు శివార్చన చేస్తున్నారు.

ఇలా ఉండగా ఒకరోజు మృకండుడు బ్రహ్మ ఉండే అంతఃపురప్రదేశమునకు వెళ్ళి బ్రహ్మగారి సభలోనికి ప్రవేశించడం కోసం మిగిలిన ఋషులతో పాటుగా లోపలికి వెడుతున్నాడు. అపుడు ఆయనను అక్కడ ఉండే ద్వారపాలకులు మీరు వెళ్ళకూడదు అని అడ్డుపెట్టారు. ఆయన ఆశ్చర్యపోయి ‘నేను ఎందుకు వెళ్ళకూడదు?” అని ప్రశ్నించారు. ‘మీకు సంతానం లేదు. అందువల్ల మీకు బ్రహ్మ సభా ప్రవేశార్హత లేదు’ అన్నారు. మృకండుని అవమానించడం వారి ఉద్దేశం కాదు. శాస్త్రవాక్కు ఒకటి ఉన్నది. సంతానం లేకపోతే పితృ ఋణం తీరదు. ఎవరయినా వివాహం చేసుకోక బ్రహ్మచర్యంలోనే ఉండిపోతే ఇలాంటి బిడ్డలను కన్నారు కాబట్టి ఆ బిడ్డల తల్లిదండ్రులను తిరగేసి చెట్లకు కట్టేస్తారు. దేవీ భాగవతంలో దీనికి సంబంధించి ఒక కథ ఉంది. అందుకే నేను పెళ్లి చేసుకోను అనరాదు. చేసుకుని తీరాలి. ఇక్కడ మృకండునికి పితృ ఋణం తీరలేదు. అది దోషం. మృకండు మహర్షి ధర్మ సూక్ష్మం తెలిసిన ఉన్నవాడు. ‘నాకు అనపత్య దోషం ఉంది’ అని మనస్సులో కొంచెం బాధపడుతూ ‘అయ్యో నన్ను ఎందుకు ఈశ్వరుడు పితృ ఋణం నుంచి విముక్తుడిని చేయలేదు’ అని బెంగ పెట్టుకుని తిరిగి వచ్చేస్తున్నాడు. అదే సమయంలో వేరొక ప్రదేశంలో ఉండే మహర్షుల భార్యలు అక్కడి ప్రదేశంలో ఉండే తపోవనములను దర్శించడం కోసమని వచ్చారు. వారు మరుద్వతిని చూసి చాలా సంతసించి ‘అమ్మా మేము చాలా దూర ప్రాంతం నుంచి ఇక్కడ ప్రదేశములను చూడడానికి వచ్చాము. మాకు కొంచెం దేవతార్చనకు అవకాశం ఇవ్వగలవా’ అని అడిగారు. అపుడు ఆవిడ మీరందరూ తప్పకుండా రండి’ అని వారందరినీ పిలిచి పంచభక్ష్య పరమాన్నాలతో చక్కటి భోజనం తయారుచేసి వాళ్ళకి భోజనం వడ్డించింది. అపుడు వాళ్ళు ‘అమ్మా, అలా మేము ఒక్కళ్ళం భోజనం చేయము మేమూ తల్లులమే కదా! నీ బిడ్డలను పిలు. నీ బిడ్డలు కూడా ఇక్కడ కూర్చుంటే మేము నివేదన చేసుకుని స్వీకరిస్తూ తత్ప్రసాదమును వారి చేతిలో కూడా ఉంచుతాము. ఆ పిల్లలతో కలిసి తినాలని మాకు కోరికగా ఉంది. నీ బిడ్డలను పిలువవలసినది’ అన్నారు. అపుడు మరుద్వతి ‘అమ్మా నేను తక్కువ నోములు నోచాను. నా నోములు ఫలించలేదు. నాకు బిడ్డలు లేరు. మీవంటి తపస్వినులు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో అన్నం తిన్న పుణ్యం చేత నాకడుపు పండుతుందని అనుకుంటున్నాను. దయచేసి స్వీకరించండి’ అంది. అపుడు వాళ్ళు ‘అమ్మా, ఏమీ అనుకోవద్దు. పురుషుడు పితృ ఋణం తీరడం కోసమే సంతానమును అపేక్షించే క్షేత్రముగా భార్యను స్వీకరిస్తున్నాడు. మీరు గృహస్థాశ్రమంలో ఎందుకు ప్రవేశించారో తత్ఫలాన్ని ఇప్పటికీ పొందలేక పోయారు. కాబట్టి అలా బిడ్డలు లేని ఇంట మేము భోజనం చేయము’ అని చెప్పి వారు వెళ్ళిపోయారు. అపుడు మరుద్వతి ఎంతో బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంది.ఆసమయంలో మృకండు మహర్షి కూడా బాధపడుతూ ఇంటికి వచ్చాడు. ఆయన భార్యను నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అని అడిగారు. జరిగిన విషయం చెప్పింది ఆవిడ. అపుడు ఆయన కన్నుల కూడా నీరు కారింది. సంతానం కలుగకుండా గల దోషం పరిహరింప బడడం ఈశ్వరానుగ్రహంగా ఉంటుంది. ప్రత్యేకించి సుబ్రహ్మణ్యుని అనుగ్రహం మీదనే వంశవృద్ధి ఆధారపడి ఉంటుందని శాస్త్రవాక్కు. అందుకే సుబ్రహ్మణ్యారాదన అంత గొప్పది. ఆయన పూజ తద్దోషమును పరిహరిస్తుంది. అపుడు మృకండుడు అన్నాడు “అయ్యయ్యో మరుద్వతీ, ఏక కారణమునకు ఇద్దరమూ గురయ్యాము. దేవీ, నువ్వు బాధపడకు. ఈశ్వరుడు ఉన్నాడు. నేను ఆయన గూర్చి తపస్సు చేస్తాను, బయలుదేరుతున్నాను” అని నీ తపస్సు చేసుకోవడం కోసమని బయలుదేరి ఒక మారేడు వనమునందు శివలింగమును ప్రతిష్ఠించి దానికి రోజూ అర్చన చేస్తూ తపస్సు చేస్తున్నాడు. మరుద్వతి తపస్సు చేస్తున్న భర్త గారికి అన్నీ అందిస్తూ ఆయన క్షేమమును విచారిస్తూ తాను కూడా ఖాళీ సమయంలో పరమేశ్వరారాధన చేస్తోంది. వీరిద్దరూ ఇలా తపస్సు చేస్తున్నా శంకరుడు ప్రత్యక్షం అవలేదు.

నారదమహర్షి కైలాసమునకు వెళ్ళి శంకరుని చూసి ‘తండ్రీ, నిన్ను నమ్మి ఆ దంపతులిద్దరూ తపస్సు చేస్తున్నారు. ఇలా పిలిస్తే పలికేవాడివి.వారినింకా ఎన్నాళ్ళు పరీక్షిస్తారు’ అన్నాడు. శంకరుడు మహర్షికి ప్రత్యక్షమై నీకు పదహారేళ్ళ వయసు ఉండే కుమారుడు జన్మిస్తాడని వరమిచ్చాడు. కుమారుడు పుట్టాడు. మార్కండేయుడని పేరు. ఆ దంపతులు, కుమారుడు కూడా పరమేశ్వర భక్తితో కాలం గడుపుతున్నారు. ఇలా గడిపేస్తుండగా ఒకరోజు నారదమహర్షి అక్కడికి వచ్చారు. మృకండు దంపతులు మహర్షికి అర్ఘ్యపాద్యాదులు సమర్పించారు. నారదుడు మృకండునితో ‘మృకండా, నీకు ఒక్క విషయం జ్ఞాపకం ఉందా? ఈ పిల్లవానికి పదిహేనవ సంవత్సరం వెళ్లి పదహారవ సంవత్సరం వచ్చింది. అది కూడా కొద్ది రోజులలో అయిపోబోతోంది. ఆనాడే ఉపద్రవం కూడా వచ్చేస్తుంది. ఇలాంటి పిల్లవాడికి ఏదయినా జరగరానిది జరిగితే మీరు తట్టుకోగలరా! ఈ పిల్లవాడి ఆయుర్దాయం అయిపోతోంది కదా’ అన్నాడు. నారదుడు ఈమాటలు చెప్పగానే మరుద్వతి ఏడుస్తోంది. ఇంత తపో నిష్ఠా గరిష్టుడయిన మృకండుడు కూడా దుఃఖమును ఓర్చుకోలేక క్రిందపడి దొర్లి ఏడుస్తున్నాడు. ఇంతలో మార్కండేయుడు గబగబా లోపలికి వచ్ఛి మీరు ఎందుకు ఏడుస్తున్నారు అన్నాడు. వాళ్ళు ఉన్న సత్యమును ఎరుకలో పెట్టారు. పిల్లవాడు మాత్రం ఏ విచారమూ లేకుండా నవ్వుతూ నిలబడి ఉన్నాడు. అపుడు నారదుడు వాడి భక్తి, వాడి విశ్వాసం వాడి ధృతి వాడి ధైర్యం చూశారా! మీరు ఏ తపస్సు చేస్తే వాడు పుట్టాడో ఇప్పుడు వాడే తపించగల శక్తితో ఉన్నాడు. వాడే శివుడున్నాడు, రక్షించి తీరుతాడనే పూనికతో ఉన్నాడు. కాబట్టి మీరు కూడా శివార్చనను పెంచండి. తపస్సు మొదలుపెట్టండి. మొట్టమొదట వీనిని హిమాలయ పర్వత ప్రాంతములకు పంపించి వీనిని అక్కడ కూర్చోపెట్టి తపస్సు చేయమని చెప్పండి. ఎ శంకరుడు వీనిని ఇచ్చాడో ఆ శంకరుడు వేడిని రక్షిస్తాడో రక్షించడో తేలిపోతుంది. పిల్లాడిని పంపండి’ అన్నాడు. అపుడు మార్కండేయుడు “నన్ను అనుమతించండి. నేను దీర్ఘాయుష్మంతుడనవ్వాలని ఆశీర్వచనం చేయండి. శంకరుని గూర్చి తపస్సు చేస్తాను. నాకు ఆ మహానుభావుడు సిద్ధిని ఇస్తాడు. మీరేమీ బెంగ పెట్టుకోకండి’ అని చెప్పి పిల్లవాడు వెళ్ళిపోయాడు. అలా వెళ్లి హిమాలయ ప్రాంతమందు ఒక శివలింగమును తయారు చేసి దానికి చిన్న దేవాలయం లాంటిది నిర్మించి అక్కడ కూర్చుని తపస్సు మొదలు పెట్టాడు.

సమయం ఆసన్నమయింది. అక్కడ యమలోకంలో యమ ధర్మరాజు దూతలను పిలిచి మార్కండేయుడిని పాశములచేత బంధించి ఈ లోకమును చేరండి’ అని చెప్పాడు. యమదూతలు వెళ్లి పాశం వెయ్యడానికి భయం వేసి యమలోకానికి తిరిగి వెళ్ళిపోయారు. అపుడు యమధర్మరాజుకు ఎక్కడలేని కోపం వచ్చి నేను బయలుదేరి వెడతాను. నాకు ఏమగాడు అడ్డు వస్తాడో చూస్తాను’ అని బయలుదేరుతుండగా నారదుడు ఎదురు వచ్చాడు. మహర్షిని నమస్కారం చేశాడు యమధర్మరాజు. అపుడు నారదుడు ‘ఎందుకయ్యా పంతాలు పట్టింపులు. వాళ్లకి ఉన్నది ఒక్క పిల్లాడు. మహర్షి కదా. పుత్రభిక్ష పెట్టిన వాడవు అవుతావు కదా’ అన్నాడు. నారదుడు ఇలా అనేసరికి యమధర్మరాజుకి కోపం వచ్చేసింది. ప్రాణములు తీసి తీరతాను అని దేవాలయం దగ్గరకు వెళ్ళాడు. అతనిని బహిర్ముఖుని చేస్తే సరిపోతుంది అనుకోని బయటకు రా నేను యమధర్మరాజుని నీ ప్రాణములు తీయడానికి వచ్చాను. అదే నీకు మోక్షము. బయటకు రా’ అన్నాడు. అపుడు మార్కండేయుడు ‘ఓరి పిచ్చివాడా! నీకుకూడా ప్రభువెవడో వానిని నేను ఆరాధన చేస్తున్నాను. నేను ఈ శరీరంతో ఉండిపోవాలని కాదు. నా తల్లిదండ్రుల కోర్కె తీర్చడానికి ఈ శరీరంలో ఉండాలనుకుంటున్నాను. అలా ఉండేటట్లు చేయమని పరమశివుని ప్రార్థిస్తున్నాను. నేను ఆయనను ఆరాధన చేస్తుండగా ఫలితం ఆయన ఇవ్వాలి తప్ప ఇవ్వడానికి నువ్వెవరు? నీకు చేతనయితే ప్రాణాలు తియ్యి’ అన్నాడు. యమధర్మరాజు గారికి ఎక్కడలేని కోపం వచ్చేసింది. చేతిలో మెరిసిపోతున్న యమపాశమును విసిరి లాగుతున్నాడు. పిల్లవాడు భయపడకుండా శివలింగమును కౌగలించుకుని చంద్రశేఖరునిపై అష్టకం చదువుతున్నాడు. అలా కౌగలించుకోవడంలో కంఠమునకు పడిన పాశం శివలింగమునకు తగిలింది. అంతే ఒక్కసారి శివలింగం ఫెటిల్లున పేలిపోయింది. వామార్ధ భాగమునందు పార్వతీ దేవితో శంకరుడు ఆవిర్భవించి తన ఎడమకాలి పాదంతో యమధర్మరాజు వక్షస్థలం పై ఒక్క తన్ను తన్నేటప్పటికి యమధర్మరాజు నీలపై విరుచుకు పడిపోయాడు. అపుడు శివుడు తన చేతిలోని త్రిశూలంతో ఒక పోటు పొడిస్తే యముడు మరణించాడు. పిమ్మట మార్కండేయుని వంక ప్రసన్నుడై చూశాడు. ఒక్కవరం కోరుకో. అన్నాడు.

మార్కండేయుడు ఇరువురికీ నమస్కరించి నేను ఏ కోరిక కోరను? పాపం యముడు తెలియక పొరపాటు చేశాడు. ఆయనను బ్రతికించండి’ అన్నాడు. అపుడు శంకరుడు ప్రసన్నుడై చూడగా యమధర్మరాజు మళ్ళీ లేచి నమస్కరించి “స్వామీ, నువ్వు వరం ఇచ్చినప్పుడు ఈ బాలుడికి పదహారు సంవత్సరములు ఆయుర్దాయం మాత్రమె ఉంటుందని చెప్పావు. నేను చేసిన దోషం ఏమిటి? చెప్పవలసింది’ అన్నాడు. శివుడు మందహాసం చేసి నా హృదయం నీకు అర్థం కాకపోవడమే నీ దోషం. ఎప్పుడూ పదహారేళ్ళు వయస్సు ఉండే పిల్లవాడిని నేను వాళ్లకి ఇచ్చాను. నువ్వు పదహారేళ్ళే అర్థం చేసుకున్నావు. అందుకని ఇలా జరిగింది ఏమీ బెంగలేదు. వెళ్ళు’ అన్నాడు. మార్కండేయుడిని చూసి పార్వతీదేవి పొంగిపోయింది. వీడికి మంచి వరమును ఇవ్వవలసింది అని చెప్పింది భర్తకి. అప్పుడు పరమేశ్వరుడు ‘ఈ లోకములు అన్నీ ఎప్పుడు ప్రళయ సముద్రంలో మునిగిపోతాయో, ఎప్పుడు వటపత్రశాయి తన బొటనవేలిని నోటిలో పెటుకుని చీకుతూ ఒక మర్రి ఆకుమీద పడుకున్తాడో అప్పటి వరకు చిరంజీవివై ఉంది మార్కండేయాయుష్షు అనే కొత్త ఆయుష్షును సృష్టించి నీకు ఇస్తున్నాను అన్నాడు. అందుకే మనవాళ్ళు పూర్వం పిల్లలకు నీళ్ళు పోస్తే నాన్నా నీకు మార్కండేయ ఆయుష్షురా’ అనేవారు. అలా రోజూ అంటూ నీళ్ళు పోస్తే ఆ ఆశీర్వచనం నిజమౌతుంది అని వారి ఉద్దేశం.

ఎక్కడైనా సరే శివాలయంలో కూర్చుని ఒంట్లో బాగుండని వారు చంద్రశేఖర అష్టకమును నామీద నమ్మకంతో చదివితే వాళ్లకి అపమృత్యుదోషం రాకుండా నేను పరిహరిస్తాను. వారిని నేను రక్షించి తీరుతాను అంటాడు పరమేశ్వరుడు. కాబట్టి చంద్రశేఖరాష్టకం అంత గొప్పది. ఎవరయితే ఈ చంద్రశేఖరాష్టకమును నమ్ముకుని ప్రతిరోజూ ఇంట్లో చాడువుకుంటారో అలాంటి వాళ్ళ ఇళ్ళలోంచి అకారణంగా సమయం కాకుండా అపమృత్యు దోషం వలన బయటికి శరీరములు వెళ్ళవలసిన అవసరం లేకుండా నేను వాళ్ళని వాళ్ళ వంశములను కాపాడతాను. ఇది చదివిన వారికి దీనిని వినిన వారికి అపారమయిన కీర్తిని తేజస్సుని ఆయుర్దాయం నేను కృప చేస్తున్నాను అన్నాడు. ఈ అష్టకం ఎక్కడ చదువుతున్నారో అక్కడ అంతా శుభం జరుగుతుంది అన్నాడు. ఎవరు నమ్మకంతో రోజూ శివుని సన్నిధానమునందు మృత్యు భీతితో ఈ అష్టకమును పూనికతో చదువుతున్నారో అటువంటి వారికి మృత్యు భయం ఉండదు. ఆపదలు రాకుండా పూర్ణమయిన ఆయుర్దాయం వాళ్ళు పొందుతారు. దానితో బాటుగా అఖిలమయిన అర్థములు యశస్సు సంపత్తి అన్నీ చేకూరుతాయి. వీరి ప్రయత్నం లేకుండా చిట్టచివరి రోజున చంద్రశేఖరాష్టకం చదివిన ఫలితం చేత ఊపిరి జారిపోతున్నప్పుడు శంకరుని నామం జ్ఞాపకమునకు వచ్చి చంద్రశేఖరా అంటూ ప్రాణం విడిచి ఆయన చేతనే మోక్షం ఇవ్వబడి ఆయనలోనే కలిసిపోతాడు. అంత గొప్ప అష్టకంతో కూడిన ఈ మార్కండేయ మహర్షి జీవితమును ప్రత్యేకించి మాఘమాసంలో ఎవరు చదువుతున్నారో/వింటున్నారో వారికి పరిపూర్ణమయిన శివకటాక్షం కలుగుతుందని శివపురాణామ్తర్గతమయిన వాక్కు.


🙏🙏🙏

శ్రీమద్భాగవతము ప్రథమ స్కంధం -6

 దశిక రాము


శ్రీమద్భాగవతము


 ప్రథమ స్కంధం -6


వ్యాసచింత 


అలా అడుగుతున్న శౌనకాది మునీంద్రులతో సూతమహర్షి ఇలా చెప్పసాగాడు”మూడో యుగమైన ద్వాపరం పూర్తి అవుతున్న సమయంలో ఉపరిచర వసువు వీర్యం వల్ల ఉద్భవించి వాసవి అనబడే సత్యవతికి పరాశరుని వల్ల నారాయణాంశతో వేదవ్యాసుడు జన్మించాడు. ఒకనాడు ఆయన బదరికాశ్రమంలో, సరస్వతీనదిలో స్నానాది నిత్యకృత్యాలు పూర్తిచేసుకొని శుచియై, సూర్యోదయ సమయంలో ఏకాంతస్థలంలో ఒంటరిగా కూర్చున్నాడు. భూత భవిష్య ద్వర్తమానాలు తెలిసిన ఆ మహర్షి అవ్యక్తమైన కాల వేగానికి లోకంలో యుగ ధర్మాలు సాంకర్యం పొందుతాయని, పాంచ భౌతిక శరీరాలకు శక్తి సన్నగిల్లుతుందని, మానవులు సారహీనులు, ధైర్యరహితులు, మంద బుద్ధులు, అల్పాయుష్కులు, దుర్బలులు అవుతారనీ తన దివ్య దృష్టితో తెలుసుకొన్నాడు. అన్ని వర్ణాలకి, అన్ని ఆశ్రమాలకి మేలు కలిగించాలనే ఆశయంతో హోత, ఉద్గాత, అధ్వర్యుడు. బ్రహ్మ అనే నలుగురు ఋత్విక్కులచే అనుష్ఠింపదగి ప్రజలకు క్షేమం చేకూర్చే వైదికకర్మలైన యజ్ఞాలు నిరంతరం అవిచ్ఛిన్నంగా సాగటం కోసం ఒకటిగా ఉన్న వేదాన్ని ఋక్కు, యజస్సు, సామము, అథర్వణము అనే నాలుగు వేదాలుగా విభజించాడు. ఇతిహాస పురాణాలన్నీ కలిపి పంచమ వేదంగా పేర్కొన్నాడు. పైలుడు ఋగ్వేదాన్ని చదవటం మొదలు పెట్టాడు. జైమిని సామవేదం చదువసాగాడు. వైశంపాయనుడు యజుర్వేదాన్ని అధ్యయనం చేయటం మొదలు పెట్టాడు. సుమంతుడు అథర్వ వేదాన్ని ఆరంభించాడు. మా తండ్రిగారైన రోమహర్షణుడు పట్టుదలతో సమస్త పురాణాలూ, ఇతిహాసాలూ పఠించటం ప్రారంభించాడు. ఇలా తాము నేర్చుకొన్న వేదాలూ, పురాణాలూ, ఇతిహాసాలూ ఆ తపోధనులు తమ శిష్యులకు వేరువేరుగా విభజించి చెప్పారు. ఆ శిష్యు లందరూ తమ తమ శిష్యులకు అనేక విధాలుగా ఉపదేశించారు. అలా వేదం భూమి మీద అనేక శాఖలతో బ్రాహ్మణ సమాజంలో ప్రకాశించింది.ఈ విధంగా వేదములు విభజింపబడి మందబుద్ధు లైన మానవులచే పఠింపబడుతూ ఉన్నాయి. బ్రహ్మ బంధువులు, స్ర్తీలు, శూద్రులు, వేద శ్రవణానికి సమర్థులు కారు కనుక, సామాన్యు లందరికీ క్షేమం కలగాలని దీనవత్సలుడైన వ్యాసభగవానుడు మహాభారతాన్ని రచించాడు. అయినప్పటికీ విశ్వశ్రేయస్సు కోసం తాను చేసిన కృషిలో ఆయన హృదయం సంతుష్టి చెందలేదు. అందువల్ల ఆ మహర్షి సరస్వతీ నదీతీరంలో ఏకాంతంగా కూర్చుండి తన అసంతుష్టికి కారణం ఏమిటా అని ఆలోచించసాగాడు.


నారదాగమనంబు 


ఆ సమయంలో తన చేతిలో ఉన్న మహతి అనే వీణ తీగలో నుంచి నారాయణనామం నిరంతరంగా ప్రతిధ్వనిస్తూ ఉండగా, నోటివెంట వెలుపడే హరినామ సంకీర్తనం అనే అమృతప్రవాహంలో మహాయోగులందరూ పరవశించిపోతు ఉండగా, బంగారు రంగు జటాజూట కాంతి సమూహాలకు దిక్కులన్నీ ప్రభాత కాంతులతో మెరుస్తుండగా, ఒంటినిండా ధరించిన తులసిమాలల సుగంధాలు ఆకాశం నిండా వ్యాపిస్తుండగా ముల్లోకాలలో అఖండమైన పేరు ప్రతిష్ఠలు గలవాడు, సకల శాస్ర్తపురాణ విశారదుడు ఐన నారదుడు వ్యాసుని దగ్గరకు ఆకాశ మార్గాన వచ్చాడు. అలా వచ్చిన నారదమహర్షి వినయశీలుడూ, వేదాలను విభజించిన ఉల్లాసం కలవాడు, సంసార దుఃఖం లేనివాడూ, మనోవిజ్ఞానం పూర్తిగా కలిగినవాడూ అయిన వ్యాసమునీంద్రుణ్ణి చూసాడు. ఈ విధంగా తన ఆశ్రమానికి విచ్చేసిన నారదుడిని చూసి, లేచి వ్యాసుమహర్షి యథావిధిగా పూజించాడు. అప్పుడు నారదుడు మధుర మందహాస సుందర వదనారవిందంతో మహతీవిపంచిని మెల్లగా మీటుతూ ఇలా ప్రశ్నించాడు. పరాశరుని పుత్రుడా! వ్యాసమునీంద్రా! నీవు బ్రహ్మదేవుడివి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాల్ని జయించిన వాడివి. పరబ్రహ్మ తత్త్వాన్ని నిర్ణయించిన వాడివి, యోగులలో అగ్రేసరుడివి, వినయసంపన్నుడివి. ఇటువంటి నీవు ఈ విధంగా చలించిపోయి పిరికివాడి లాగ విచారించటం ఆశ్చర్యంగా ఉంది. కారణమేమిటయ్యా?” అలా అడిగిన నారదమహర్షితో వ్యాసమహర్షి ఇలా అన్నాడు. నారద మునీంద్రా! నీకు తెలియనిది ఏముంది. బ్రహ్మమానస పుత్రుడవు. శ్రీమన్నారాయణ సంకీర్తనాన్ని స్వీకరించావు. దశదిశలందు తిరిగావు. మహత్తరమైన తత్త్వజ్ఞానంలో అందెవేసిన చేయ్యి అనిపించుకొన్నావు. అంతేకాకుండా. నీవు సూర్యభగవానుడిలా ముల్లోకాలలోను సంచరిస్తూ ఉంటావు. వాయుదేవుడిలాగా సర్వమానవుల మనస్సులలో మెలగుతూ ఉంటావు. సమస్తమూ తెలిసినవాడివి. నారదా! నీకు తెలియని ధర్మం ఏ లోకంలోను లేదు. అనేక విషయాలను అవలోచించినవాడివి. నాకు ప్రాప్తించిన కొరతకి కారణం ఏమిటో అదంతా దయతో నాకు వివరంగా చెప్పు." అని అడిగిన వ్యాసమునీంద్రుడితో నారదుడు ఇలా 

అన్నాడు. ఆర్యులచే పూజితుడా! వ్యాసా! పవిత్రమైన అనేక ధర్మవిశేషాలను నీవు వెల్లడించావు. సరే కానీ, పొరపా టేమిటంటే దానిలో కొంచెం మాత్రమే విష్ణుకథలు చెప్పావు. చక్కగా సమగ్రంగా చెప్పలేదు. వాసుదేవుని గుణవిశేషాలు వర్ణించి చెప్తే సంతోషించినట్లు, ఎన్ని ధర్మాలు విస్తరించి చెప్పినా భగవంతుడు సంతోషించడు. నీ మనస్సుకు ఈ లోటు రావటానికి కారణం నీవు నీ గ్రంథాలలో హరినామ సంకీర్తనం ప్రధానంగా చేయకపోవటమే. పరాశర పుత్రా! వ్యాసా! హరినామ సంకీర్తనంతో ప్రకాశించే కావ్యం బంగారు కమలాలతో, కలహంస పంక్తులతో శోభాయమానమైన మానససరోవరం లాగ విరాజిల్లుతుంది. హరినామ సంకీర్తనం లేని కావ్యం చిత్ర


విచిత్రా


లైన అర్థాలతో కూడినప్పటికీ దుర్గందాలతో, కాకోలవిషాలతో కూడిన బురదగుంట లాగ ఉంటుంది. అది శోభంకరం కాదు.

తత్త్వవిశారదా! వ్యాస మునీంద్రా! పవిత్రమైన హరి చరిత్రలు కలిగిన కావ్యాలు తప్పులతో కూడుకొన్నప్పటికీ, సకల పాపాలను పటాపంచలు చేస్తాయి. అందువల్లనే సజ్జనులైన తపోధనులు శ్రీహరిని భావిస్తూ, శ్రీహరి లీలలు గానం చేస్తూ, నామం జపం చేస్తూ, కథలు చెవులారా ఆలకించుట చేస్తూ, ఎప్పుడూ ఆయననే కీర్తిస్తూ తమ జన్మలు సార్థకం చేసుకొంటారు కదా. వ్యాస మునివర్యా! కర్మవాసన లేనిది, ఆధారం లేనిది అయిన జ్ఞానం విష్ణుభక్తి లేకపోతే విశేషంగా ప్రకాశించదు. ఫలాపేక్షలేని నిష్కామకర్మమయినా భగవదర్పితం కాకపోతే అది ప్రశస్తం కాదు. జ్ఞానం కాని, వాక్కు కాని కర్మకాని అవి యెంత గొప్పవైనను భక్తిలేనినాడు నిరర్థకాలే. అందువల్ల వ్యాసమహర్షీ! నీవు మహానుభాపుడవు, సత్యదర్శనుడవు, దిగంత విశ్రాంతమైన కీర్తి కలవాడవు, సత్యనిష్ఠుడవు, నియమ పరాయణుడవు, మానవు లందరికీ భవబంధవిముక్తి కోసం భగవంతుడైన మాధవుని లీలలు భక్తితో విశేషంగా వర్ణించు. వాసుదేవుని వర్ణించని ఘట్టాలన్నిటిలో భావార్థ భేదాలు వెతుక్కుంటూ, ఆయా వివక్షల రూపాలు నామాలు పట్టుకు వేళ్ళాడేవాడి మనసు, ప్రచండమైన వాయువేగానికి ప్రవాహంలో పడి కొట్టుకుపోయే పడవలా రేవు చేరలేదు. కామ్యకర్మలందు ఆసక్తులైన మూఢమానవులకు నియతాలైన ధర్మాలు చెప్పి అనుశాసించటం నీవంటి వానికి తగదు. ఎందుకంటే వారు అదే ప్రధానమని భావించి కలుషితాలైన కామ్యకర్మలకు అలవాటు పడి పరమార్థాన్ని విస్మరిస్తారు. అందువల్ల బుద్ధి పెడదారి పట్టించకుండా వారికి భగవత్తత్త్వాన్ని అందించి వారి వ్యథలు తొలగించు” అని చెప్పి నారదుడు ఇంకా ఇలా పలికాడు. “మునీంద్రా వ్యాసా ! కామ్యకర్మ లన్నింటినీ పరిత్యజించి ప్రాజ్ఞుడైనవాడు గోవిందుని గుణగణాలందు అనురక్తుడై, హరి స్వరూపాన్ని తెలిసికోవటం కోసం సమర్థమైన ప్రయత్నం చేస్తాడు. అజ్ఞుడైనవాడు వివేకహీనుడై దేహాభిమానం, ధనాభిమానం మొదలైనవి కలవాడై సంచరిస్తూ ఉంటాడు. అటువంటి అజ్ఞానులకి సైతం ఈశ్వరుని లీలావిలాసాలు తెలిసేటట్లుగా నీవు చెప్పాలి.

ఎవడైతే తన కులధర్మాలను వదలిపెట్టినా సరే, గోవింద పదారవిందాలను శ్రద్ధాభక్తులతో సేవిస్తూ కృతార్థుడు కాకుండానే మృతి పొందుతాడో, అట్టివానికి నష్టమేమీ కలుగదు. అతడు ఆ జన్మలో కాకపోయినా మరుజన్మలో నైనా తన సేవకు ఫలాన్ని పొందుతాడు. అలా కాకుండా విష్ణుసేవకి దూరమైనవాడు ఎట్టి కులధర్మాలను గౌరవించి ఆచరించినప్పటికీ వాడు ఎన్ని జన్మలెత్తినా కృతార్థుడు కాలేడు. అందువల్ల సత్యం తెలుసుకున్నవాడు శ్రీహరి చరణ సేవాపరాయణుడు కావటానికి ప్రయత్నం చేయటం మంచిది. కాలానుసారంగా కష్ట సుఖాలు సంప్రాప్తమైనా, శ్రీహరి సేవను విడిచిపెట్టటం తగినపని కాదు. ఆ హరిసేవ వల్ల బ్రహ్మలోకం నుండి స్థావర పర్యంతం పరిభ్రమిస్తున్న జీవులకు పొందశక్యంకాని ఆనందం ఏదైతే ఉందో, అది తప్పకుండా సిద్థిస్తుంది. శ్రీహరి సేవాపరాయణు డైనవాడు నీచజన్మని పొందినప్పటికీ సంసారబంధాల్లో చిక్కుకోడు. పూర్వజన్మ సంస్కారం వల్ల భక్తి పరవశుడై హరిచరణస్మరణం విడిచిపెట్టకుండా సాగిస్తూనే ఉంటాడు.ఈ విశాల ప్రపంచంలో విష్ణువు కంటె ఇతరమైనది ఏదీ లేదు. ఈ విశ్వమంతా విష్ణుమయం. ఆ పరమేశ్వరుని సంకల్పం చేతనే ఈ ప్రపంచానికి సృష్టి స్థితిసంహారాలు ఏర్పడుతుంటాయి. వ్యాస మహర్షీ! నీవు సర్వజ్ఞుడవు నీకు తెలియనిది ఏముంది. నీవే ఒక చోట ఈ విషయాన్ని చెప్పావు. ఈ విశ్వకల్యాణం కోసం మహావిష్ణువు అంశతో జన్నించానన్న మాట గుర్తు చేసుకో. అందువల్ల నీవు శ్రీహరి లీలావతారాలలోని విక్రమ విశేషాలను స్తుతించు మానవుని జ్ఞానానికీ, అధ్యయనానికీ, ఔదార్యానికీ, అనుష్ఠానానికీ, తపస్సుకూ, ధైర్యానికీ, సంపదకూ ప్రయోజనం పుణ్యశ్లోకుడైన పురుషోత్తముణ్ణి స్తుతించటమే.

🙏🙏🙏

సేకరణ


*ధర్మము-సంస్కృతి*

🙏🙏🙏

ఆది పర్వము -7

 **దశిక రాము**


ఆది పర్వము -7


రురుడు ప్రమద్వరల వృత్తాంతం :


చ్యవనునికి శర్యాతి కుమార్తె నుకన్యకు వివాహమైంది. వారికి ప్రమతి అనే కుమారుడు ఉన్నాడు. ప్రమతికి క్షీరసాగర సమయంలో అమృత కలశంతో పుట్టిన ఘృతాచి అనే అప్సరసతో వివాహం అయింది. ప్రమతికి ఘృతాచికి పుట్టిన కుమారుడు రురుడు. రురుడు స్థూలకేశుడు అనే ముని ఆశ్రమంలో పెరుగుతున్న ప్రమద్వరను వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. విశ్వావసు అనే గంధర్వ రాజుకు మేనకకు పుట్టిన కుమార్తె ప్రమద్వర. ఒక రోజు ప్రమద్వర పాముకాటుతో మరణించింది. ప్రమద్వర మరణానికి ఆశ్రమవాసులు దుఃఖించసాగారు. అది విన్న రురుడు రోదిస్తూ

 అరణ్యంలోకి పరిగెడు తాడు.


ప్రమద్వరను బ్రతికించుట :


రురుడు శోకిస్తూ ప్రద్వరను బ్రతికించమని దేవతలను ఓ దేవతలారా ! ఓ బ్రాహ్మణులారా ! నేను దేవ యజ్ఞములు, వేదాధ్యయనం, వ్రతములు, పుణ్యకార్యములు చేసిన వాడిని అయితే, నేను నా గురువులను భక్తితో సేవించిన వాడిని అయితే, నేను ఘోరమైన తపసు చేసిన వాడిని అయితే నా ప్రేయసి ప్రమద్వర మీ దయ వలన విషం నుండి విముక్తి కాగలదు అని ప్రార్ధించాడు. తిరిగి మంత్ర తంత్రములు తెలిసిన వారు విషతత్వ శాస్త్రములు తెలిసిన వారు ఎవరైనా ప్రమద్వర విషమును హరిస్తే అతడికి నా తపః ఫలమును, అధ్యయన ఫలమును ధారపోస్తాను. అని రోదించాడు. అప్పడు ఆకాశం నుండి ఒక దేవత బ్రాహ్మణోత్తమా !ప్రమద్వర కాలవశమున మరణించింది. ఆయషూ తీరింది కనుక దానిని ఆపడం ఎవరి తరం కాదు. అయినా దానికి నేను ఒక ఉపాయం చెప్తాను. ఎవరైనా తమ ఆయుష్షులో సగం ఇస్తే ఆమె ముందరి కంటే తేజస్సుతో బ్రతుకుతుంది అని నేను యమధర్మరాజు అనుమతితో పలుకుతున్నాను అని పలికాడు. రురుడు అందుకు అంగీకరించి తన ఆయుర్ధాయంలో సగం ఇచ్చి ఆమెను బ్రతికించి వివాహం చేసుకున్నాడు.


సర్పముల మీద రురుడి పగ:


కానీ రురుడికి పాముల మీద కోపం పోలేదు. కర్రతో కనిపించిన పాములను చంపడం మొదలు పెట్టాడు. చెట్ల వెంట పుట్టల వెంట తిరుగుతూ కనిపించిన పాములను చంపుతూ ఉండసాగాడు. అలా చంపుతూ ఒక రోజు డుండుభం అనే ఒక పామును చంపడానికి కర్రను పైకి ఎత్తాడు. ఆ పాము భయపడి తేజోవంతుడివి అయిన బ్రాహ్మణుడివి అయినా నీవు ఇలా పాములను చంపడానికి కారణం ఏమిటి అని అడిగాడు. రురుడు నా పేరు రురుడు. నేను ప్రమద్వర అనే ఆమెను ప్రేమించాను. నేను ప్రాణప్రదంగా ప్రేమించిన ప్రమద్వరను ఒక పాము కాటు వేసింది. అందు వలన నేను పాములను చంపుతున్నాను. నిన్ను కూడా చంపుతాను అని చెప్పి కర్రను పైకెత్తాడు. వెంటనే ఆ పాము ఒక మునిగా మారి రురుడి ముందు నిలిచింది.


ఖగముని వృత్తాంతం:


రురుడు డుండుభం అనే పాముని చంపబోతుండగా ఆ పాము ఒక మునిగా మారాడు. రురుడు ఆ పాముని ఇదేమిటి పాముగా ఉన్న నీవు మనిషిగా మారడానికి కారణం ఏమిటి అని అడిగాడు. అందుకు ఆ పాము నేను సహస్రపాదుడు అనే మునీశ్వరుడను. నా సహచరుడు ఖగముడు. ఒక రోజు నా సహచరుడు ఖగముడు అగ్ని కార్యం చేస్తున్నాడు. ఆసమయంలో నేను అతడి మీద పరిహాసంగా గడ్డితో చేసిన పాముని వేసాను. అతడు నాపై కోపించి నన్ను విషం లేని పాముగా పడి ఉండమని శపించాడు. నేను అతడిని పరిహాసానికి చేసిన పనికి నన్ను ఇలా శపిస్తావా ! నన్ను క్షమించ లేవా అని ప్రార్ధించాను. నా ప్రార్ధన మన్నించి ఖగముడు మిత్రమా ! నా మాట జరిగి తీరుతుంది. అయినా నీవు పాముగా పడి ఉన్న తరుణంలో రురుడు అనే భృగువంశ సంజాతుడు వస్తాడు. అతడిని చూడగానే నీకు నీ రూపం వస్తుంది. అని చెప్పాడు. అయ్యా మీరు బ్రాహ్మణులు. దయాగుణం కలవారు. పూర్వం నీ తండ్రి శిష్యుడైన ఆస్తికుడు కద్రువ శాప కారణంగా సర్పయాగంలో ఆహుతి అవుతున్న పాములను కాపాడాడు. నీవు కూడా పాములను చంపడం ఆప లేవా ! అన్నాడు. రురుడు పాములను చంపడం ఆపివేసాడు. ఈ కథను వింటున్న మునులు తల్లి కొడుకులకు శాపం ఇవ్వడం ఏమిటి. మాకు సవిస్తరంగా చెప్పండి అని కోరారు.

🙏🙏🙏

సేకరణ

*శ్రీ శివ మహా పురాణం*

 **దశిక రాము**


**శ్రీ శివ మహా పురాణం**


23 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


గౌరీపూజ


ఒకానొక సమయంలో పార్వతీ పరమేశ్వరులిరువురూ మందరగిరి పర్వతం మీద కూర్చుని ఉన్నారు. వారిని ఆ పర్వతం ఒక జీవ స్వరూపమును పొంది సేవిస్తోంది. పార్వతీదేవి నలుపు రంగులో ఉంటుంది. పరమశివుని చెల్లెలుగా సరస్వతీ దేవి సంభావించబడుతుంది. శంకరుడు తెల్లగా ఉంటాడు. ఆయన వాహనమైన వృషభం తెల్లగా ఉంటుంది. ఆయన ఉండే పర్వతం తెల్లగా ఉంటుంది. వేసుకునే పుర్రెల మాల తెలుపు. ఒంటికి రాసుకునే విభూతి తెలుపు. తెల్లటి శంకరుడు జ్ఞానప్రదాతయై ఉంటాడు. ఇంత తెల్లటి శంకరుడి ప్రక్కన నల్లగా ఉన్న అమ్మవారు కూర్చుంది. కానీ యథార్థమునకు శివ పార్వతులిరువురిలో కూడా వారి రూపురేఖలకు సంబంధించిన భావములేవీ లేవు. ఆయన పార్వతీదేవి వంక చూసి ‘కాళీ’ అని పిలిచారు. ఆ పిలుపు పూర్వం పిలిచినట్లు లేదు. కొద్దిగా ఏదో ఎత్తిపొడిచినట్లుగా ఉంది. ‘ఓ నల్లపిల్లా’ అని పిలిచినట్లు అనిపించింది. వెంటనే ఆవిడ ముఖం ఎర్రగా అయిప్యి కన్నుల వెంట భాష్పధారలు కారుతుండగా అమ్మవారు క్రిందికి దిగి ‘లోకమునందు ఎన్ని సుఖములైనా ఉండవచ్చు, ఎన్ని భోగాములైనా ఉండవచ్చు. కానీ భర్తకు ప్రీతి చేయలేని సౌందర్యం ఈ శరీరమునందు లేనప్పుడు ఒక కాంత అటువంటి శరీరమును పొంది ఉండడంలో ఎంతో బాధపడుతుంది. ఇప్పుడు నేను కైలాసంలో ఉన్నా, మణిద్వీపంలో ఉన్నా, నన్ను ఎంతమంది సేవిస్తున్నా, మా వారు మాత్రం నన్ను కాళీ అని పిలుస్తారు. ఇటువంటి భావన నాకు కలగగానే ఈ శరీరం మీద ఎక్కసం కలుగుతోంది’ అంది. అన్ని కారణముల చేత ఆవిడ భర్త ప్రీతిని కోరుకుంటుంది. తాను ఏది చేసినా భర్త ప్రీతి కొరకే చేస్తుంది. ఇది మహా పతివ్రత లక్షణము. అందుకే శంకరాచార్యులంతటి వారు సౌందర్యలహరి ప్రారంభం చేస్తే ‘శివశ్శక్త్యా యుక్తో’ అని ప్రారంభించారు. ఆయన పేరు ఎత్తకుండా మొదలెడితే అమ్మవారు ముఖం చిట్లించుకుంటుందని ప్రాజ్ఞులు మహానుభావులు అయిన శంకరులకు తెలుసు కనుక భర్త పేరుతోనే మొదలుపెట్టారు. ఆయన పేరు చెప్తే ఆవిడకు సంతోషం. ‘నీవు ఈ శరీరమును చూసి ప్రీతిని పొందడం లేదు. అటువంటప్పుడు ఈ శరీరంతో నేను ఉండాలని అనుకోవడం లేదు. ఈ నల్లటి శరీరమును వదిలిపెట్టేస్తాను. నీకు ప్రీతిని కలిగించే శరీరముతో వస్తాను. దేవా నన్ను అనుగ్రహించండి’ అంది. ఈ మాటకు శంకరుడు కూడా ఒక్కసారి ఉలిక్కిపడి ‘అయ్యో పార్వతీ, నా మనస్సు నీకు తెలియదా. నీయందు నాకెప్పుడూ అటువంటి భావన లేదు. ఒకవేళ నేను పరాచికానికి అన్నమాట నీకు అంత కష్టపెట్టి ఉన్నట్లయితే ఇంతటి నిర్ణయం తీసుకునేటట్లయితే నేను నీ పాదములమీద వ్రాలి నీ సేవ చేస్తాను. నువ్వు ఇంత తొందర నిర్ణయమును తీసుకోవద్దు’ అన్నాడు. ఈ సంఘటన అంతఃపురంలో జరిగింది. ఎవ్వరికీ తెలియని విషయం. ఇప్పుడు ఈ విషయం లోకానికంతటికీ తెలుస్తోంది.

పరమశివుని మాటలను విన్న ఆవిడ ‘లేదు లేదు. నేను మీ మనస్సును చూరగొనలేక పోయినప్పుడు నేను అలా ఉండడాన్ని ఇష్టపడను. నేను ఇంక ఈ శరీరంతో ఉండను’ అని శరీరమును వదిలిపెట్టేసింది. మరల ఆవిడ హిమవంతుని కుమార్తెగా పుట్టి గొప్ప తపస్సు చేసి పరమశివుడికి ఇల్లాలయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఆవిడ తపస్సుకు బయలుదేరింది. ఆకాశగంగలో స్నానం చేసి తపస్సుకు అనుకూలమయిన వస్త్రములను ధరించింది. ఎవరు ఈమాట అన్నాడో ఆయనకు ప్రీతి కలిగిన రంగును నేను పొందుతాను అని నియతమయిన సంకల్పం చేసి తపస్సు చేయడం ప్రారంభించింది. ఆమెను తిందామని ఒక పులి వచ్చింది. ఆమెను చూడగానే దుష్ట గుణము కలిగిన పులి సాత్త్విక ప్రవృత్తిని పొంది అలా నిలిచిపోయింది. తిందామన్న కోరికతో వచ్చి నిలబడిన వస్తువుకు కూడా మూడు రకములయిన మలములు ఆవిడను చూసేసరికి ఎగిరిపోయాయి. అమ్మవారి పాదములకు ఉండే బొటనవేలి గోటి నుండి వస్తున్నా కాంతిని చూస్తే పాపములు ఎగిరిపోతాయని వ్యాసమహర్షి అంటారు. అగ్నిహోత్రమును ముట్టుకుంటే కాల్చడం దాని ధర్మం. ఈశ్వర దర్శనం ఎలా చేసినా అది ఏ దృష్టితో చేసినా తేరిపారి అమ్మవారి వంక అలా చూసినంత మాత్రం చేత ఆవిడ దానిలో ఉన్న మూడు రకములయిన మలములను తీసివేసింది. అది అదేపనిగా అమ్మవారు తపస్సు చేసుకుంటున్న ప్రదేశం చుట్టూ తిరుగుతూ అమ్మవారి తపస్సును భంగం చేయడానికి ఏ ప్రాణిని లోపలికి రాకుండా కాపాడుతోంది. పిమ్మట శుంభనిశుంభులను సంహరించదానికి ఒక రూపమును ఇవ్వమని బ్రహ్మ అడిగాడు. ఆ తల్లి ఇపుడు రూపమును స్వీకరించాలి బంగారు రంగులో ఉండే మొగలి పువ్వు ఎలా ఉంటుందో అలాంటి రంగుతో తెలుపు ఎరుపు పసుపు రంగులతో కూడిన రంగులోకి అమ్మవారు మారిపోయింది. గౌరవర్ణమును పొందింది కాబట్టి గౌరీ అని పిలిచారు. తన నల్లని శరీరమును పాము కుబుసము విడిచినట్లు అమ్మవారు లీలా మాత్రంగా శరీరమును విడిచింది. ఈ విధంగా విడిచిన నల్లని శరీరమునకు కౌశికి అనే పేరు వస్తుంది.

ఇక్కడ మీకొక విషయం అవగతం కావాలి. పార్వతీ పరమేశ్వరుల మధ్య జరిగినది కాముని బాణముల వలన జరిగిన సృష్టి కాదు. అది లీలా మాత్రంగా వీళ్ళిద్దరూ కలిసి కామేశ్వరుడై, ఆ తల్లి లోపల మనస్సు నందు కదిలితే, ఆ సృష్టిగా పరిణమించింది. కనుక ఇప్పుడు కౌశికి అనే పేరుతొ నల్లటి శరీరమును ఇచ్చి ఈవిడ వచ్చి శుంభ నిశుంభులను సంహారం చేస్తుందని బ్రహ్మ కోర్కెను తీర్చింది. ఇపుడు ఈ కౌశికి వెళ్లి శుంభనిశుంభుల సంహారం పూర్తిచేసింది. ఆ తర్వాత అమ్మవారు వింధ్యవాసినియై వింధ్య పర్వతం మీద కూర్చుని ఉంది. ఆ సమయంలో బ్రహ్మ అమ్మవారికి కైమోడ్చి నమస్కరించి స్తోత్రం చేసి ఒక సింహమును ఆవిడకి వాహనంగా బహూకరించాడు. సింహవాహన అనే పేరుతో వింధ్యవాసిని అనే పేరుతో ఆ కౌశికి మనలనందరిని రక్షించడం కోసమని ఆ వింధ్యపర్వతం మీద వేంచేసి ఉన్నది.

ఇపుడు ఈ గౌరీ వ్యాఘ్రమును కూడా వెంటపెట్టుకుని పరమశివుడు ఉన్న మందరపర్వతం మీదకు వెళ్ళింది. ఆమెను చూసి పరమశివుడు ఎంతో సంతోషించాడు. ‘పార్వతీ, నేను ఆనాడు ఈమాట ఎందుకన్నానో దానిలో గల రహస్యం ఈనాడు నీకు అర్థం అయింది. ఈ శరీరమును విడిచిపెట్టి దీనితో రాక్షస సంహారం జరగాలి. ఇప్పుడు నువ్వు నాకు ప్రీతి కలగడం కోసమని అటువంటి శరీరంతో వచ్చి పక్కన కూర్చోవడం చేత లోకమునకు ఒక కొత్త మర్యాద ఏర్పడాలి. నీవు వాక్యము, నీవు విద్య. నేను ఆ విద్యచేత ప్రతిపాదింపబడే జ్ఞానమును. విద్య జ్ఞానము ఈ రెండూ ఎలా విడివడి ఉండవో అలా నీవు నేనూ ఎల్లప్పుడూ కలిసే ఉంటాము. నీవు సోమాత్మకంగా ఉంటావు. నేను అగ్నిస్వరూపంగా ఉంటాను. ఊర్ధ్వముఖ ప్రయాణం నాది. నీవు క్రిందికి వెడతావు.నేనే ఈ సృష్టినంతటినీ లయకారకుడనై కేవలము బూదిగా మార్చి ఉంచినపుడు నీ అనుగ్రహ ప్రవేశం చేత మరల సృష్టి పునఃసృష్టి జరుగుతోంది. కాబట్టి ఈ సమస్తము మనమిరువురమై ఉన్నాము. ఇక మనం విడివడినది ఎప్పుడు! అటువంటిది నీవు నామీద కోపపది దూరంగా వెళ్ళినట్లుగా కనపడడం ఒక అద్భుతం. లోకరక్షణ కోసమని ఇద్దరం ఇలా ఆకృతులను స్వీకరించాము. మనం చేసిన ఈ లీల వృథాగా పోదు. రాబోవు కాలంలో లోకమునకు రక్షణ హేతువు అవుతుంది’ అన్నాడు. ఇక్కడ మనం ఆ లోక రక్షణ హేతువైన విషయమును గూర్చి తెలుసుకోవాలి. ఆంద్రదేశమునందు, తమిళ దేశమునందు ఒక అలవాటు ఉంది. మనం పెళ్ళిచేస్తే ఆడపిల్ల ముందుగా గౌరీపూజ చెయ్యాలి. గౌరీపూజ చెయ్యడం వెనకాల ఒక రహస్యం ఉంది. అన్నీ అమ్మవారి స్వరూపములే. పరమేశ్వరునికి ఇల్లాలిగా ఉండడం చాలా కష్టం. ఎప్పుడూ ఆయన మనస్సుకి ప్రీతిగా ప్రవర్తించాలి. ఏ చెరుకువిల్లు పట్టుకుని బాణాలు వేస్తే కాముడు సాధించలేకపోయాడో ఆ చెరుకు విల్లు తాను పట్టుకుని ఏమీ మాట్లాడకుండా కూర్చున్న వాడిని మనకోసమని సంసారంలోకి తీసుకువచ్చి సింహాసనం మీద కూర్చోపెట్టింది. ఇటు బిడ్డలకి తండ్రిని కూర్చోబెట్టింది. అటు ఈ సృష్టి నంతటినీ చేసి మరల ఆవిడ అనుగ్రహంతో లోకమంతటినీ ఆయనలో కలుపుతోంది. ఏకకాలంలో ఈ పనులన్నింటినీ అమ్మవారు చేస్తోంది. నూతన వధువు కూడా ఒకరికి ఇల్లాలు అవడం కోసమని పీటల మీదికి వెడుతున్నపుడు ఆమెకు కూడా సర్వకాలములయందు కష్టం వచ్చినా సుఖం వచ్చినా భార్య భర్తకు విశ్రాంతి స్థానము కనుక ఆమెయందు అటువంటి బలం రావాలని ఆమెచేత సన్నికల్లు తోక్కిస్తారు. పెళ్ళి పీటలమీద కూర్చునేముందు పెళ్ళి కూతురుచేత గౌరీపూజ చేయిస్తారు. ఆ సందర్భంలోనే తల్లిదండ్రులు తమ కుమార్తెకు ‘సన్నికల్లు ఎలా ఉందొ అలా నువ్వు కూడా అన్నిటినీ గట్టి మనస్సుతో పెట్టుకోవాలి. అత్తవారింటికి వెళ్ళగానే అత్తమీద మామమీద మరిది మీద ఆడపడుచుల మీద భర్తకు వేరొక రకమయిన మాటలను భర్తకి చెప్పి కష్టం కలిగించి ఇంటిని రెండు చేయకు అని బోధ చేస్తారు. వధువు ‘నా భర్తను అనుగమించి నా భర్త శుశ్రూష చేసి నా భర్త పొంది పోయేటట్లుగా ఆయన మనస్సు నేను గెలుచుకోవాలి. ఏది చేస్తున్నా, అయ్యో దానికి తెలియకుండా చెయ్యడమా నన్ను అంత అనుగమించే మనిషి కదా అని దానికి చెప్పి చేద్దామని చేసేటట్లుగా భర్త మనస్సు గెలుచుకోగల స్థితిని నాకు కల్పించు. నేను కూడా నా భర్త చేత అంతటి అనురాగమును పొందెదను గాక. నువ్వు ఎలా పెద్దింటమ్మవై వుండి పసుపు కుంకుమలతో గౌరివి అయ్యావో మమ్మల్ని కూడా అలా కాపాడు’ అని పెళ్ళికూతురు గౌరీ తపస్సు చేస్తుంది. మన ఆర్షధర్మం అంత గొప్పది. మనజాతి దంపతులు అలా ఉండాలని కోరుకుంది. అలా ఉండాలి లోహితాస్యుని వంటి బిడ్డలు పుట్టాలంటే మహాతల్లి ఆ గౌరీదేవిని ఉపాసన చెయ్యండి. ఆడపిల్ల ఒక ఇంటి కోడలిగా వెడితే అంతటి ధృతిని పొంది ఉండాలని, అంతటి ధర్మాచరణమును పొంది ఉండాలని మనం గౌరీపూజ చేస్తాము.

అక్కడ వ్యాఘ్రమునకు ఒక విచిత్రం జరిగింది. అక్కడ అమ్మవారు పులిని కూడా మందర పర్వతము దగ్గరకు తీసుకువెళ్ళింది. దానిని పరమశివునకు చూపించి – ‘అయ్యో పాపం ఇది నాతో పాటు వచ్చింది. తన స్వభావమును మార్చుకుంది. కాబట్టి దీనికి కూడా నందీశ్వరునితో సమానంగా నా అంతఃపురమునందు రక్షణ భారము వహించే అదృష్టమును ఇవ్వండి’ అంది. అపుడు శంకరుడు తప్పకుండా పార్వతీ అని వెండి బెత్తమును ఒక మంచి ఖడ్గమును ఇచ్చి ఒక బంగారు కవచం కట్టి అమ్మవారి ఇంటిముందు నందీశ్వరుని కన్న కొద్ది స్థాయిలో సోమనంది అనే పేరుతో నిలబడే అనుగ్రహాన్ని ప్రమథగణములలో ఒకడిగా ఇచ్చాడు. అమ్మవారిని అలా చూసినందుకు అది సోమనంది అయింది. సోమనంది మనకి నవనందులలో ఒకటిగా కనపడుతుంది. ఈ సోమనంది వృత్తాంతం ఈ గౌరీ వృత్తాంతం కౌశికీ వృత్తాంతం రాక్షససంహారం ఎవరు చదువుతున్నారో వాళ్ళందరికీ అమ్మవారి అనుగ్రహం చేత చక్కటి అనుకూల్యముతో కూడిన దాంపత్యము సిద్ధించి ఏ ఇబ్బందులు రాకుండా స్త్రీలు పసుపుకుంకుమలతో పదికాలాలపాటు ఉండి లోకమంతా సుభిక్షంగా సంతోషంగా ఆనందంగా ఉంటుందని పెద్దలు విశ్వసించి పలికిన పలుకు. కనుక అమ్మవారి అనుగ్రహంతో అటువంటి స్థితిని మనం పొందెదముగాక!


🙏🙏🙏

శ్రీమద్భాగవతము

 **దశిక రాము**


*శ్రీమద్భాగవతము**


 ప్రథమ స్కంధం -5


ఏకవింశత్యవతారములు 


అది అన్ని అవతారాలకు మూలవిరాట్టయిన అదినారాయణుని దేదీప్యమానమైన దివ్యరూపం. ఆ దివ్యరూపాన్ని మహాత్ములైన యోగీంద్రులు దర్శిస్తారు. శ్రీమన్నారాయణ దేవుని నాభికమలం నుంచి సృష్టికర్తలలో ఆద్యుడైన బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. శ్రీహరి అవయవ స్థానాలనుంచి లోకాలు సమస్తము ఆవిర్భవించాయి.

1) ఆదినారాయణదేవుడు మొదట కౌమార మనే స్వర్గాన్ని ఆశ్రయించి సనకసనందనాది రూపాలతో కఠోరమైన బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తు బ్రహ్మణ్యుడై చరించాడు.

2) రెండవసారి యజ్ఞవరాహదేహం ధరించి విశ్వసృష్టి నిమిత్తం రసాతలం నుంచి భుమండలాన్ని ఉద్ధరించాడు.

3) మూడవ పర్యాయం నారదు డనే దేవర్షిగా జన్మించి మోక్షదాయకమైన వైష్ణవధర్మాన్ని బోధించాడు.

4) నాలుగవ అవతారంలో ధర్ముడను వానికి మూర్తి యందు నరనారాయణ స్వరూపుడై ఆవిర్భవించి ఆత్మశాంతికోసం అపారమైన తపస్సు చేసాడు.

5) ఐదవ అవతారం కపిలావతారం. దేవహూతి కర్దములకు జనించి ఆసురి అనే బ్రాహ్మణునికి తత్త్వనిరూపకమైన సాంఖ్యాన్ని ఉపదేశించాడు.

6) ఆరవ అవతారంలో అత్రి అనసూయలకు దత్తాత్రేయుడై పుట్టి అలర్కుడు, ప్రహ్లాదుడు మొదలైవారికి ఆత్మవిద్య ప్రబోధించాడు.

7) ఏడవ పర్యాయం యజ్ఞుడనే నామంతో రుచికి, ఆకూతికి కుమారుడై, యమాది దేవతలతో స్వాయంభువ మన్వంతరాన్ని సంరక్షించాడు.

8) ఎనిమిదవ రూపంలో నాభికి మేరుదేవియందు ఉరుక్రముడను పేర ప్రభవించి పండితులకు పరమహంస మార్గాన్ని ప్రకటించాడు.

9) తొమ్మిదవ జన్మలో ఋషుల ప్రార్థన మన్నించి పృథుచక్రవర్తి యై భూదేవిని గోవు గావించి సర్వ ఓషధులను పిదికాడు.

10) పదవదైన మత్స్యావతారం దాల్చి చాక్షుష మన్వంతరంలో సంభవించిన జలప్రళయంలో నావపై నెక్కించి వైవస్వత మనువును కాపాడాడు. 

11) పదకొండవ పర్యాయం కూర్మావతారం స్వీకరించి మున్నీటిలో మునిగిపోతున్న మందరపర్వతాన్ని నేర్పుగా వీపుపై ధరించాడు.

12) పన్నెండవ అవతారంలో ధన్వంతరి యై దేవదానవులు మథిస్తున్న పాలసముద్రంలో నుంచి అమృతకలశం హస్తాన ధరించి సాక్షాత్కరించాడు.

13) పదమూడవ అవతారంలో మోహిని వేషంలో రాక్షసులను వంచించి దేవతలకు అమృతం పంచి పెట్టాడు.

14) పద్నాలుగవ సారి నరసింహమూర్తిగా అవచతరించి ధూర్తుడైన హిరణ్యకశిపుణ్ణి రూపుమాపాడు.

15) పదిహేనవ అవతారంలో మాయా వామనుడై బలిచక్రవర్తిని మూడడుగులు దానమడిగి ముల్లోకాలు ఆక్రమించాడు.

16) పదహారవమారు పరశురాముడై రౌద్రాకారంతో బ్రాహ్మణ ద్రోహులైన రాజులను, ఇరవై ఒక్కమారు సంహరించి ధాత్రిని క్షత్రియహీనం కావించాడు.

17) పదిహేడవసారి వేదవ్యాసుడై అల్పప్రజ్ఞులైన వారికోసం వేదశాఖలను విస్తరింపజేశాడు.

18) పద్ధెనిమిదవ పర్యాయం శ్రీరాముడై సముద్రబంధనాది వీరకృత్యాలు ఆచరించి దేవకార్యం నిర్వర్తించాడు.

19) పందొమ్మిదవ అవతారంలో బలరాముడుగా, 

20) ఇరవయ్యో అవతారంలో శ్రీకృష్ణుడుగా సంభవించి భూభారాన్ని హరించాడు.

21) ఇరవై ఒకటవసారి బుద్ధుడై మధ్య గయా ప్రదేశంలో తేజరిల్లి రాక్షసులను సమ్మోహపరచి ఓడిస్తాడు.

22) ఇరవై రెండవ పర్యాయం కల్కి రూపంతో విష్ణుయశుడనే విప్రునికి కుమారుడై జన్నించి కలియుగాంతంలో కలుషాత్ములైన రాజులను కఠినంగా శిక్షిస్తాడు అని పలికి సూతుడు ఇంకా ఇలా అన్నాడు.

ప్రపంచంలో సరస్సుల నుండి ఎన్నో కాలవలు వెలువడి ప్రవహిస్తూ ఉంటాయి; అలాగే శ్రీమన్నారాయణుని లోనుంచి విశ్వశ్రేయోదాయకములైన ఎన్నెన్నో అవతారాలు ప్రావిర్భవిస్తూ ఉంటాయి; రాజ్యాలేలేవాళ్ళు, దేవతలు, బ్రాహ్మణులు, బ్రహ్మర్షులు, మహర్షులు ఆ నారాయణుని సూక్ష్మ అంశలచే ఉద్భవించిన వారే; పూర్వం బలరామునిగా, అతని సోదరుడు శ్రీకృష్ణునిగా శ్రీమహావిష్ణువు తానే అవతరించాడు కదా. ప్రతి యుగంలో రాక్షసుల చేష్ఠలతో లోకాలు చీకాకుల పాలయ్యే సమయాలలో, భగవంతుడైన శ్రీమహావిష్ణువు విడువక తగిన అవతారాలు అవతరించి దుష్టుల శిక్షించి, శిష్టుల రక్షించి లోకాలను ఉద్ధరిస్తాడు.అత్యంత రహస్య గాథలైన వాసుదేవుని అవతార గాథలు, ఏ మానవుడైతే ఉదయము సాయంకాలము అత్యంత శ్రద్ధాభక్తులతో నిత్యము పఠిస్తాడో, అతడు దుఃఖమయమైన సంసార బంధాలకు దూరంగా తొలగిపోయి ఆనందం అనుభవిస్తాడు.వినండి, ప్రాకృత రూప రహితుడు చిదాత్మస్వరూప జ్ఞానస్వరూపుడు ఐన జీవునికి మహదాదులైన మాయాగుణాల వల్ల ఆత్మస్థానమైన స్థూలశరీరం ఏర్పడింది; గగన మందు మేఘసమూహాన్ని ఆరోపించినట్లూ, గాలి యందు పైకి లేచిన దుమ్ముదుమారాన్ని ఆరోపించినట్లూ అజ్ఞానులైన వారు సర్వదర్శి అయిన ఆత్మ యందు దృశ్యత్వాన్ని ఆరోపించుతున్నారు; జీవునికి కనిపించే ఈ స్థూలరూపం కంటే కనిపించనిది, వినిపించనిది ఐన జీవాత్మ యొక్క ఉత్ర్కాంతి గమనాగమనాల వల్ల మళ్లీ మళ్లీ జన్నిస్తున్నట్లు అనిపిస్తుంది; స్వస్వరూపజ్ఞానం వల్ల ఈ స్థూల సూక్ష్మరూపాలు రెండు తొలగిపోతాయని, మాయవల్ల ఇవి ఆత్మకు కల్పింపబడతాయని గ్రహించి నప్పుడు జీవునికి బ్రహ్మసందర్శనానకి అధికారం లభిస్తుంది; సమ్యక్ జ్ఞానమే దర్శనం; సర్వజ్ఞుడైన ఈశ్వరునికి లోబడి క్రీడిస్తూ అవిద్య అనబడే మాయ ఉపశమించి, తాను విద్యగా పరిణమించినప్పుడు ఉపాధి అయిన స్థూల సూక్ష్మరూపాలను దగ్ధం చేసి, కట్టె లేకుండా ప్రకాశిస్తున్న అగ్నిలాగా తానే బ్రహ్మస్వరూపాన్ని పొంది, పరమా


నందంతో విరాజిల్లుతాడని తత్త్వవేత్తలు వివరిస్తారు” అని సూతుడు మళ్లీ చెప్పసాగాడు.

చక్రధారుడైన ఆ హరికి జన్మ అన్నది లేదు. ఏ కర్మలూ ఆయనని అంటవు. సమస్తజీవుల చిత్తములలోను ఆయన నివసిస్తూ ఉంటాడు. ఆ పరాత్పరునికి విద్వాంసులు జన్మలు కర్మలు కల్పించి. ఉదాత్తములైన పదజాలాలతో వర్ణిస్తున్నారు. స్తోత్రాలు చేస్తున్నారు. వాస్తవానికి వేదాలన్నీ వెదకి చూసినా జీవునికి వలె దేవునికి జన్మలు కర్మలు లేనేలేవు. ఈ సకల భువన జాలాన్నీ తన అమోఘమైన లీలావిలాసం చేత శ్రీమన్నారాయణుడు పుట్టిస్తుంటాడు, రక్షిస్తుంటాడు, అంతం చేస్తూ ఉంటాడు. కాని తాను మాత్రం ఆ జనన మరణాలలో నిమగ్నం కాడు. సర్వ ప్రాణి సమూహ మందు ఆత్మస్వరూపుడై విహరిస్తుంటాడు. ఎంతో దూరంలో అందకుండా స్వర్గంలాగా ఉండి, జీవుల ఇంద్రియాలకు సంతోషాన్ని సమకూరుస్తూ, తాను మాత్రం ఇంద్రియాలకు అతీతుడుగా ఉండి, నియంతయై ఇంద్రియాలను తన ఇష్టం వచ్చినట్లు త్రిప్పుతూ ఉంటాడు.సర్వలోకేశ్వరుడైన శ్రీహరి లీలావిలాసంగా నానావిధాలైన నామరూపాలు ధరిస్తూ ఉంటాడు. కళా హృదయం లేని అజ్ఞుడు, నాట్యంలోని అందచందాలను అర్థంచేసికొని ఆనందించి అభినందించ లేనట్లే, వితర్కాలు కుతర్కాలు నేర్చినవాడు తర్క శాస్ర్త పాండిత్యం ఎంత ఉన్నా, భగవంతుని సత్యస్వరూపాన్ని మనస్సుచేత గానీ వాక్కుల చేతగానీ ఇంత అని గ్రహింపలేడు.మర్మము అన్నది కొంచం కూడ లేకుండ, ఎడతెగని భక్తితో ప్రవర్తిస్తూ, నారాయణ చరణారవింద సుగంధాన్ని సేవించే మహాత్ముడు, బ్రహ్మాదులకు సైతం అందుకొన శక్యం కాని భగవంతుని అత్యద్భుతమైన లీలావిశేషాలను తెలుసుకొంటాడు” ఇలా చెప్పి సూతుడు శౌనకాది మహర్షులతో ఇలా అన్నాడు. “ఓ బ్రహ్మణ్యులారా ! మీరు పుణ్యవంతులలో శ్రేష్ఠులు, సర్వం తెలిసిన మునివరేణ్యులు. మీలో శ్రీహరి చరణయుగంపై భక్తి ఇంతగా ఆరూఢమై ఉన్నది. మీ హృదయాలు శ్రీహరి యందు అసక్తములై ఎడబాటు ఎరుగకుండా ఉన్నాయి. శ్రీమన్నారాయణ సంస్మరణ ప్రభావం వల్ల ఈ చావు పుట్టుకల బాధలు ఎన్నడూ మీ సమీపానికి రాలేవు.


శుకుడుభాగవతంబు

జెప్పుట 


పుణ్యకీర్తనుడైన విశ్వేశ్వరుని చరిత్రం శ్రీమద్భాగవతం. ఇది పరబ్రహ్మకు ప్రతిరూపమైనది. సర్వ పురాణాలలోను మేలుబంతి. ఈ మహాగ్రంథాన్ని పూర్వం లోకకల్యాణం కోసం భగవంతుడైన వ్యాసభట్టారకుడు అత్యంత పవిత్రంగా, ఆనందమయంగా, అనురాగ పూర్వకంగా రచించాడు. అలా రచించిన ఈ గ్రంథాన్ని సమగ్రంగా ఆయన తన కుమారుడైన శ్రీశుకునిచేత చదివింపచేసాడు. సమస్తవేదాల, ఇతిహాసాల సారభూతమైన ఈ భాగవతాన్ని ఆ శుకయోగీంద్రుడు గంగానది మధ్యలో మునిగణ సహితుడై, అత్యంత విరక్తుడై, ప్రాయోపనిష్ఠుడై ఉన్న పరీక్షిన్మహారాజు అడుగగా చెప్పాడు. ధర్మము, జ్ఞానములతోపాటు శ్రీకృష్ణుభగవానుడు తన లోకమైన వైకుంఠానికి వెళ్లి పోయిన తరువాత లోకంలో కలియుగం ప్రవేశించింది. కలికాల దోషాలనే చిమ్మచీకటిలో గ్రుడ్డివారు అయిపోయి దిక్కు తెలియక చిక్కుపడి ఉన్న మానవులకు ఇప్పుడీ మహాపురాణం పద్మాలకు ఇష్ఠుడైన సూర్యుడిలా వెలుగులు పంచుతోంది. ఆనాడు మునుల ముందు మహాతేజస్వియై శ్రీహరి లీలలు కీర్తిస్తూ ఉన్న బ్రహ్మర్షి శ్రీశుకయోగివల్ల నేను నేర్చుకొన్న విధంగా, నా మనస్సుకు స్ఫురించినంతవరకు మీకు వినిపిస్తాను” అన్నాడు సూతుడు. అప్పుడు ఆయనను ముని శ్రేష్ఠుడైన శౌనకుడు ఇలా అడిగాడు. సూతమహామునీ! ఏ యుగంలో ఏ ప్రదేశంలో ఏ ఉద్దేశంతో వ్యాసుల వారిని భాగవతాన్ని రచించమని ఎవరు అడిగారు? ఆ వ్యాసభగవానుడు దేనికోసం వేద, ఇతిహాసాదుల సారం అంతా ఎంతో పరిశోధించి ఈ మహాగ్రంథాన్ని రచించాడు? ఆయన కుమారుడైన శుకుబ్రహ్మ ఎటువంటి ప్రీతితో, ఏ విధంగా పరీక్షిన్మహారాజుకి భాగవతకథ వినిపించాడో? అదంతా మాకు సమగ్రంగా వివరించి చెప్పు. సుధీమణి! సూతా! వ్యాసుభగవానుని పుత్రుడైన శుకుడు మహా గొప్పయోగి, విరాగి, సమదర్శనుడు, బ్రహ్మజ్ఞుడు, మాయాతీతుడు, సర్వజ్ఞుడు. ఆయన నిగూఢ వర్తన కలవాడు. మూఢునిలా లోకానికి కనిపిస్తాడు, భేదాలు ఖేదాలు అంటని నిత్యానందుడు. అంతేకాకుండా సుధీమణి! సూతా! వ్యాసుభగవానుని పుత్రుడైన శుకుడు మహా గొప్పయోగి, విరాగి, సమదర్శనుడు, బ్రహ్మజ్ఞుడు, మాయాతీతుడు, సర్వజ్ఞుడు. ఆయన నిగూఢ వర్తన కలవాడు. మూఢునిలా లోకానికి కనిపిస్తాడు, భేదాలు ఖేదాలు అంటని నిత్యానందుడు. అంతేకాకుండా.

అప్పుడు నగ్నంగా స్నానాలు చేస్తున్న దేవకాంతలు, దిగంబరుడు, నవయువకుడు ఐన తన కొడుకును చూసి సిగ్గుపడి చీరలు ధరించకుండా, వస్త్రధారి వృద్ధుడు ఐన తనను చూసి లజ్జతో వస్త్రాలు కట్టుకొన్న దేవకాంతలను చూసి ఆశ్చర్యపడి, వ్యాసుడు అందుకు కారణ మేమిటని అడిగాడు; అప్పుడు వారు”నీ కుమారుడికి స్త్రీపురుషబేధభావము లేదు; అంతేకాక ఆయన నిర్వికల్పుడు; మరి నీలో స్త్రీ పురుష భేదభావం ఇంకా పోలేదు; నీకు, ఆయనకు ఎంతో భేదం ఉంది” అని అన్నారట; అటువంటి శుకబ్రహ్మ కురుజాంగల దేశాలు ఎలా ప్రవేశించారు; హస్తినాపురంలోని పౌరులు ఆయన్ని ఎలా గుర్తుపట్టారు; పిచ్చివాడిలా, మూగవాడిలా, జడుడునిలా ఉండే ఆ మహర్షి, రాజర్షియైన పరీక్షిన్మహారాజుల మధ్య సంభాషణ ఏ విధంగా కుదిరింది; శ్రీమహాభాగవత సంహితను చెప్పడానికి ఎంతో కాలంపడుతుంది; దానిని శుకబ్రహ్మ వచించంటం ఎలా జరిగింది; అంతేగాక మహావిరాగి యైన ఆ శుకయ


ోగి గృహస్థుల ఇండ్లలో గోవు పాలు తీసేటంత సేపు మాత్రమే నిలుస్తాడని, ఆయన గో దోహన మాత్ర సమయం నిలిచిన చోట్లు అన్నీ పుణ్యతీర్థాలౌతాయని పెద్దలు అంటారు; అట్టి మహానుభావుడు అన్నాళ్ళు ఒకే ప్రదేశంలో ఎలా ఉన్నాడు? భగవద్భక్తులలో శ్రేష్ఠుడైన ఆ పరీక్షిన్నరేంద్రుడి జన్మ ప్రకారం ఏమిటి, ఏమేమేం చేసాడు? దయతో ఈ విశేషాలన్నీ వివరంగా తెలుపుము. ఆ పరీక్షిన్మహారాజు సామాన్యుడు కాడు; తన పరాక్రమంతో పాండవుల వంశం, బలం, గౌరవప్రతిష్ఠలు వర్థిల్లునట్లు ప్రవర్తించిన వాడు; పరరాజ్యపాలకులు అందరు బంగారురాసులు తీసికొచ్చి ఆయన కాళ్ల ముందు క్రుమ్మరించి ఆయన పాదపద్మాలను సేవించారు; ఆ మహావీరుని తండ్రి అయిన అభిమన్యుడు అసహాయశూరుడై, ద్రోణ కర్ణాదులచే పరిరక్షితమైన కౌరవసేవావ్యూహంలో ప్రవేశించి చీల్చి చెండాడాడు; ఆయన తాత యైన అర్జునుడు మహారథుడైన భీష్ముని రక్షణలో ఉన్న కురుసేనావాహినిని పారద్రోలి గోవులను మరలించి తెచ్చాడు; అటువంటి అఖండ కీర్తి సంపన్నుడైన పరీక్షిత్తు మహారాజు విడువరాని రాజ్యలక్ష్మిని విడిచి, గంగానదిలో ప్రాయోపవేశం చేసి ప్రాణాలను బిగట్టుకొని ఎందుకు ఉండవలసి వచ్చింది. అత్యుత్తమ కీర్తి ప్రతిష్ఠలు కల మానవోత్తములు నవ్వులాటకైనా ఆత్మ సుఖాన్ని అంతరాత్మలోనైనా అభిలషించరు; అట్టి వారు ఎల్లప్పుడూ లోకంలో అందరికీ అర్థసంపద, ఐశ్వర్యం, సౌఖ్యం, శ్రేయస్సూ చేకూర్చాలని ఆకాంక్షిస్తూ ఉంటారు; పరోపకార పారీణమైన తన దేహాన్ని ఆ ప్రభువరేణ్యుడు ఆవిధంగా ప్రాయోపవేశం చేసి ఎందుకు పరిత్యజించాడో? ఓ మహానుభావా! సూతా! నీవు సమస్త గ్రంథాల సారం తెలిసినవాడివి; భాషణలు అన్నీ బాగా తెలిసినవాడివి; అనేక విధాల కథలను చక్కగా చెప్పటంలో మిక్కిలి నేర్పరివి; ఇప్పుడు మేము అడిగిన విషయాలన్ని, ఆ మూలాగ్రంగా మాకు సవివరంగా వివరించు.”

🙏🙏🙏

సేకరణ