శ్రీ మాత్రే నమః.
🙏🙏🙏🙏🙏
ది:10-12-2020 గురువారం.
420 *గాయత్రీ*
లలితా సహస్ర నామాల్లో గాయత్రి ఒక నామం.
గాయత్రీ శబ్దం వేదమాత అయిన త్రిపదా గాయత్రి యందు వర్తిస్తున్నది. గానం చేసేవారిని రక్షించేది గాయత్రీ మాత.
ఋగ్, యజుర్, సామ వేదాల్లోని ఒక్కో పాదం అభివ్యక్తమై (fully expressed) త్రిపదా గాయత్రి అయింది.
ఒక్కో పాదంలో 8 అక్షరాలు వుంటాయ్. 24 అక్షరాలతో కూడిన గాయత్రి చతుర్వింశతి (24)తత్వాత్మాకమైన దేవికి ప్రతిరూపం.;ఇది మంత్రపరము.ద్వాత్రింశిక (32) వర్ణములతో కూడినది (తురీయపాదసహితము)పూర్ణగాయత్రి. 24 అక్షరములది త్రిపదా కూట త్రయాత్మకము.32 అక్షరములది చతుష్కూటాత్మకము. షోడశీ కళాయుక్తము.
ఇది తన్ను గానము చేయువారిని రక్షించి, పరబ్రహ్మమును పొందించునది అని అర్థం. ఇహలోకంలో సకల సంపదలు ఇచ్చునది.
భగవద్గీత 10 వ అధ్యాయం 35 వ శ్లోకం లో గీతాచార్యుడు *గాయత్రీ ఛందసామహం*
చందస్సులలో గాయత్రిని నేనే అన్నారు.
*పద్మపురాణం* లో గాయత్రి జననం గురించి మీరు వినివుంటారు.
421 *వ్యాహృతీ*
అంతటా వ్యాపించినదని అర్థం. ఉచ్చారణ రూపమైన మంత్ర విశేషానికి వ్యాహృతి అని పేరు. మూడు పాదాలు గల గాయత్రీ మంత్రానికి భూ: భువ:సువ: అని మూడు వ్యాహృతులు (వ్యాహృతి త్రయం)అని సంప్రదాయ సిద్ధము.
భూలోక, భువర్లోక, సువర్లోకములు
బ్రహ్మ స్వరూపములు అని శృతి, స్మృతి,ప్రసిద్ధము.
ఆ విధంగా వ్యాపకత్వము శ్రీదేవికి వ్యాహృతులలో సార్ధకం గావున్నది.
🙏🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి