10, డిసెంబర్ 2020, గురువారం

వాత,పిత్త,కఫ హెచ్చుతగ్గుల వల్ల సంభవించు వ్యాధులు -

 శరీరం నందు వాత,పిత్త,కఫ హెచ్చుతగ్గుల వల్ల సంభవించు వ్యాధులు - 


 * శరీరం నందు వాతం వృద్ది చెందినచో శరీరం కృశించుట, శరీరం నందలి నీలవర్ణం , ఉష్ణం పెరగడం , కామం , అనాహం , శరీరం నందు వణుకుడు , మలబద్దకం , బలం తగ్గటం , నిద్ర తగ్గటం , ఇంద్రియ హాని , తనలోతాను మాట్లాడుకొనుట , భ్రమ , దైన్యం అను ఉపద్రవములు కలుగును.


 * శరీరం నందు పిత్తము వృద్దిచెందినచో మలము , మూత్రము, నేత్రములు వీనియందు పీతవర్ణం , ఆకలి, దప్పి , తాపము, స్వల్పనిద్ర మొదలగు ఉపద్రవములు కలుగును.


 * శరీరం నందు శ్లేష్మం వృద్దిచెందినచో అగ్నిమాంద్యం , నోట నీరువూరుట , బద్దకించుట , శరీరం నందు శుక్ల వర్ణం , అంగముల యందు చల్లదనం , అంగములు శైధిల్యం చెందుట, శ్వాస భారంగా రావటం , ఆయాసం , అధిక నిద్ర అను వికారములు కలగచేయును . 


  * శరీరం నందు రసం వృద్దిచెందినచో అగ్నిమాంద్యం అనగా అజీర్ణ సంభంద సమస్యలు కలుగును. 


 * శరీరం నందు రక్తం అధికంగా వృద్దిచెందిన విసర్పం, ప్లీహం ( spleen) సమస్యలు , విద్రది అను కురుపు , కుష్టు , వాతరక్తం , గుల్మము అనగా గడ్డలు , దంత సంబంధ సమస్యలు , కామెర్లు , చర్మం, మూత్రం , నేత్రములు యందు రక్తవర్ణం కనిపించును.


 * శరీరం నందు మాంసం వృద్దిచెందినచో గడ్డలు , క్యాన్సర్ కణుతులు మొదలగు రోగములు కలుగును. చెక్కిలి, తొడలు,ఉదరం నందు మాంసం వృద్దిచెందును . కంటం , నోటిలోపలి దవడ , నాలుక యందు మాంసం వృద్ధిచెందును. 


 * శరీరం నందు మూత్రం వృద్దిచెందినచో పొత్తికడుపు నందు నొప్పిని కలుగజేయును . మూత్రం విసర్జించినను మరలా మూత్రం వచ్చునట్లు అనిపించు రోగం కలుగును.


 * శరీరం నందు మలం వృద్దిచెందినచో కడుపుబ్బరం , ప్రేగులు అరుచుట , శరీరం నందలి నొప్పి కలుగజేయును 


 * శరీరం నందు స్వేదం వృద్ది అయినచో అదికంగా చెమట పట్టి శరీరం నందు దుర్గంధం  

మొదలగును .


 వాత,పిత్త,కఫాలు క్షీణించిన కలుగు ఉపద్రవాలు - 


 * శరీరం నందు వాతం క్షయించినచో కాళ్లు ,చేతుల యందు అశక్తి , అగ్నిమాంద్యం వంటి ఉపద్రవాలు కలుగును. 


 * శరీరం నందు పిత్తం తగ్గినచో అగ్నిమాంద్యము , శీతలం పెరుగును , శరీరం కాంతి తగ్గును. 


 * శరీరం నందు కఫం తగ్గినచో భ్రమ కలుగును. హుద్రోగం , సంధులలో శైథిల్యం పెరుగును 


 * శరీరం నందు రసము క్షయించినచో శ్రమ , శోష , శబ్దం సహించలేని సమస్య కలుగును. 


 * శరీరం నందు రక్తం క్షయించినచో ఆమ్లరసం , చల్లగా ఉండు వస్తువుల పైన ఇష్టం పెరగటం , సిరలు శైథిల్యం చెందటం వంటి సమస్యలు సంభవిస్తాయి.


 * శరీరం నందు మాంసం క్షయించినచో ఇంద్రియములకు గాని , చెక్కిలి, పిరుదులు , కీళ్ల సంధుల యందు పోటు పొడిచినట్లు అగుచుండును.


 * శరీరం నందు మేథస్సు క్షయించినచో పిరుదులు చచ్చుబారుట, ప్లీహం ( spleen) వృద్ది అగుట, శరీరం కృశించుట అగును.


 * శరీరం నందు ఎముకలలో క్షయం మొదలైనచో ఎముకల్లో బాధలు , దంతములు తలవెంట్రుకలు , గోళ్లు మొదలైనవి ఊడటం వంటి సమస్యలు కలుగును.


 * శరీరం నందు మజ్జ క్షయించినచో ఎముకల్లో రంధ్రాలు , భ్రమ పడటం , కండ్ల యందు చీకటి గమ్ముట వంటి సమస్య కలుగును.


 * శరీరం నందు శుక్రం క్షయించినచో చిరకాలం మీద శుక్రం బయటకి వెడలును. లేక రక్తం బయటకి వెడలును. మరియు వృషణముల యందు అధికంగా బాధ కలుగును . అంగము యొక్క రంధ్రము నుండి పొగ పోతున్నట్లు బాధ కలుగును.


 * శరీరం నందు మలము క్షయించినచో వాతం పొట్టచుట్టూ ఆవరించి ఉండును. మరియు ఆ వాతం పేగుల్లో చుట్టుకొని గొప్ప ధ్వనితో గూడి రొమ్ము , పక్కల్లో చాలా నొప్పి సంభంవించును.


 * శరీరం నందు మూత్రం క్షయించినచో కొంచం మూత్రం రావటం మరియు అతికష్టం మీద బాధతో కూడి మూత్రం రావటం , దుష్టమూత్రం రావటం , రక్తంతో కూడిన మూత్రం రావటం వంటి తీవ్రమయిన సమస్యలు సంభంవించును.


 * శరీరం నందు స్వేదం క్షయించిచో వెంట్రుకలు రాలిపోవడం , చర్మం నందు పగుళ్లు రావటం , వెంట్రుకల రంగు మారడం వంటి లక్షణాలు కలుగును.


        అనుభవం గల వైద్యుడు పైన చెప్పిన లక్షణాలుబట్టి సమస్యని కనుగొని చికిత్స చేయవలెను . 


       గమనిక -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

కామెంట్‌లు లేవు: