10, డిసెంబర్ 2020, గురువారం

ధార్మికగీత -105

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                           *ధార్మికగీత -105*

                                     *****

            *శ్లో:- అస్థిరం  జీవనం   లోకే ౹*

                   *అస్థిరం యౌవనం ధనం ౹*

                    *అస్థిరం  దార పుత్రాది ౹*

                    *ధర్మ కీర్తి ద్వయం స్థిరమ్ ౹౹* 

                                        *****

*భా:- లోకంలో మన జీవనవిధానంలో స్థిరములని, అస్థిరములని రెండు విధము లున్నాయి. పరిశీలిద్దాం*.     *1."జీవనము":- మానవ జీవనం ఆశాశ్వతము. క్షణభంగురము. నీటిబుడగవంటిది. దేహం ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. ఉన్న నాలుగు రోజులు భోగాలు ,రోగాలు.కష్టాలు,* *నష్టాలు,కలతలు,నలతలతో సరి.2. "యౌవనము":- యౌవనం శరత్ కాలమేఘము వంటిది. గర్జించడమే గాని వర్షించనిది. ఇట్టే వచ్చి అట్టే మాయమవుతుంది*. *యౌవన ప్రాయము కూడ   మూడు నాళ్ల ముచ్చటే. 3. "ధనము":- డబ్బు చంచలము. క్షణికము. రాకడ, పోకడ మనచేతిలో ఉండదు. అర్థాలు,అనర్థాలు డబ్బు వల్లనే.సుఖదుఃఖాలు డబ్బువల్లనే.4. "దార పుత్రాదులు"*:- *భార్యాబిడ్డలు కేవలం ఋణానుబంధమే. అప్పు తీరిపోగానే కనుమరుగవుతారు. మనలను అనుసరించి వచ్చేవారు కానేకారు.* *వీరు రైలు ప్రయాణంలో ప్రయాణీకులవంటి వారు మాత్రమే పైన చెప్పిన జీవనము,యౌవనము,ధనము,భార్యాబిడ్డలు అశాశ్వతమైన వారే.ఇక మనం త్రికరణశుద్ధితో చేసిన  "ధర్మము"; క్రమశిక్షణ, అంకితభావము, విశ్వాసము, సేవాతత్పరతలతో,విద్యుక్తధర్మనిర్వహణలో  గడించుకొన్న "కీర్తి" ; యీ రెండును మాత్రమే శాశ్వతములుగా* *చెప్పబడుచున్నవి. అస్థిరములైన వీటికోసం తాపత్రయం వదిలి, శాశ్వతమైన పరమపదము లక్ష్యముగా నిరంతర ఆధ్యాత్మిక చింతనా తత్పరులుగా మనుగడ సాగించాలని సారాంశము*.

                                 -*****

                   *సమర్పణ  :   పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: