10, డిసెంబర్ 2020, గురువారం

*21-వేదములు

 *21-వేదములు📚((((((((((🕉))))))))))     ఆచార్య వాణి🧘‍♂️*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*11. దశోపనిషత్తులు*

((((((((((🕉))))))))))


*కఠోపనిషత్తు :-*


*'కఠ ఉపనిషత్‌' 'కఠోపనిషత్‌' 'కఠకోపనిషత్‌' అనబడే ఉపనిషత్తు కృష్ణయజుర్వేదపు కఠకశాఖలోనిది. యమధర్మరాజుకీ నచికేతుడనే బ్రహ్మచారికీ మరణానంతరం ఆత్మ ఏమౌతుందన్న విషయమైన సంవాదమిది. ఒక కథ వలె ప్రారంభించినా ఒక మహాసత్యాన్ని ఆవిష్కరిస్తుంది. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు ఈ ఉపనిషద్వాక్యాలనే మళ్లీ అంటాడు. ఉదా|| 'నజాయతేమ్రియతేవాకదాచిన్నాయంభూత్వా `ò భవితా వా న భూయః అజోనిత్యః శాశ్వతో`òయంపురాణో నహన్యతే హన్యమానే శరీరే'' (క 2-18) కంకి నుండి గింజలను వేరు చెయ్యాలి. కొబ్బరి ఆకుని తీసివేసి ఈనెను మాత్రం బయట పెట్టాలి.*



*దేహమనే బాహ్య పదార్థం నుండి ఆత్యను నిశ్చయంగా, దృఢంగా వేరు చేయాలి - ఆత్మ తనంతట తానే నిల్వాలి. కామం, కోపం, ద్వేషం, భయం - ఇవన్నీ మనస్సుకి సంబంధించినవే, ఆత్మకి కాదు. ఆకలి దప్పులు దేహానికి సంబంధించినవి. ఆత్మకి కాదు. ఆత్మేతరాలైన వాటిని గుర్తించటం అలవర్చుకోవాలి ఈ అభ్యాసం నిరంతరం కొనసాగిస్తే ''నేను'' అంటే దేహము, మనస్సేనన్న భావం సన్నగిల్లి, క్రమంగా పోతుంది. ఈ దేహాన్నీ మనస్సునీ కలుషితం చేసే అపవిత్రత బారి నుండి తప్పించుకొని నిర్మలమైన 'ఆత్మ' కాగలం. ఆత్మని చుట్టి ఉన్న తొడుగువంటిది ఈ శరీరమని భావించాలి. ఈ దేహం మనకొక అన్య పదార్థమన్నట్టు గుర్తెరిగి యుండాలి. ఈ ప్రపంచంలో ఉంటూ, ఈ శరీరంలోనే మనమున్నామనిపించినప్పుడు ''ఈ శరీరం నేను కాను, ఇది నాది కాదు'' అని అనుకోవటమలవర్చుకోవాలి. అప్పుడు, ముక్తి అన్నది మరణానంతరం సంభవించేదే అనుకోనక్కరలేదు.*



*మోక్ష మంటే మమత నుండి విముక్తే. జీవన్ముక్తుడు ఈ లోకంలోనే ఉంటూ శరీరధ్యాసలేక ఆత్మారాముడై తన ఆనందానికై బాహిర వస్తుజాలాన్ని ఆశ్రయించడు. వేదాలకీ వేదాంతానికీ గల పరమలక్ష్యం మనిషికి విముక్తి కలిగించటమే. భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఈ విషయాన్నే అంటాడు : ''ఈ దేహం నుండి ప్రాణము పోయే ముందే, ఈ లోకంలో నివసిస్తూనే, కామ క్రోధాలను నిగ్రహించి, యోగ స్థితిలో (అంటే, పరమాత్మతో ఏకత్వంతో) ఉండేవాడు ఆనందాన్ననుభవిస్తాడు''. అంటే, ఈ లోకంలో ఉంటూనే తన ఆత్మయొక్క నిజతత్త్వాన్ని ఎరిగి, ఆ అనుభవసిద్ధి కలిగి యుంటే దేహం నశించినా ఏమీ కాదు - ఆ దేహమే తాననిగాని, తనదనిగాని, అతడు జీవించి యున్నప్పుడు కూడ భావించక పోవటం వల్ల.*



*అంటే, మృత్యువు దేహాన్ని తన వశం చేసికొనక ముందే అతడు దేహాన్ని విడిచాడన్నమాట. ''దేహమ''న్న పదంలో మనస్సుకూడా ఉంది. అది మనది కానప్పుడు మృత్యువు కలిగితే మాత్రమేమిటి? దానికి మనపై ఏ విధమైన ప్రభావమూ ఉండదు. మృత్యువు నుండి విముక్తి చెందటం వల్ల అమరుడవుతాడు. ఈ స్థితిలో ఉండటాన్ని పురుషసూక్తంలోని మంత్రాలు వర్ణిస్తాయి. ఇవి కర్మకాండ భాగంలో ఉన్నాయి. ఈ విషయమే ఉపనిషత్తులలో పదే పదే ప్రస్తావింప బడింది. మనకి క్లేశాన్ని కలిగించేది శరీరమూ, తద్వారా మనస్సూ. క్లేశం లేకుండా ఉండటం, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండటమే - స్వర్గమన్నా, మోక్షమన్నా. ఇది అన్ని మతాలలోనూ ఉంది.*



*కాని అద్వైత సిద్ధాంతం తప్ప మిగిలిన అన్ని ధర్మాలూ ఆ చిదానంద స్థితిని అనుభవించాలంటే వేరే లోకానికి వెళ్లాలని అంటాయి. ఈ లోకంలో ఉంటూనే, దేహం పట్ల మమకారాన్ని పూర్తిగా విడచి, ఆత్మలో లీనమై యుండటం వల్ల పరలోకాల్లో లభించే ఆనందం కంటే అధికమైన ఆనందాన్ని పొందవచ్చని ఆదిశంకరులు నిరూపించారు.*


🕉🌞🌏🌙🌟🚩

కామెంట్‌లు లేవు: