ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
27, నవంబర్ 2024, బుధవారం
కార్తిక పురాణము -ఇరవై ఏడవ అధ్యాయము*
*కార్తిక పురాణము -ఇరవై ఏడవ అధ్యాయము*
ఓ అగస్త్య మునీంద్రా! భగవంతుడైన పురుషోత్తముడిట్లు దుర్వాసునితో పలికి స్వభక్తపాలన దీక్షాతిసహాయమును ప్రకటించుచు భగవంతుడిట్లు పల్కెను.
దుర్వాసా! అంబరీషుని గురించి ఇచ్చిన శాపములు నాకు చాలా సంతోషమును కలగ చేయుచున్నవి.ఈ శాపజన్మల వల్ల నాకేమీ కష్టము లేదు.నీ వచనము వేదతుల్యము గనుక దానిని సత్యముగా చేయవలెను.అట్లుగాని యెడల బ్రాహ్మణ మర్యాదకు భంగము కలుగును.అట్లు నాశము కలిగినంతలో నాకది శాపమగును గాన అట్టి కష్టము లేక ఆనందము కలిగినది.రాజు ప్రాయోపవిష్టుడు వలే బ్రాహ్మణ పరివేష్టితుడై పడియున్నాడు. అదిగాక అయ్యో బ్రాహ్మణాపకారి ఈ ఆత్మయని దుఃఖించుచున్నాడు.కాబట్టి త్వరగా పొమ్ము.రాజు యీ ప్రకారముగా చింతించి దుఃఖించుచున్నాడు.నా మూలముగా సుదర్శన చక్రము బ్రాహ్మణుని వెంటబడినది.ఛీ!ఛీ! బ్రాహ్మణోపద్రప కారకుడయిన రాజు ఎందుకు?రాజు మనుష్యులను పాలించువాడు గనుకను, రాజుకు ముఖ్యము ప్రజారక్షణము గనుకను, రాజు గోవుల నిమిత్తము కొరకును, బ్రాహ్మణుల నిమిత్తము కొరకును ప్రాణములు విడువవలెను.రాజు స్వేదజ, అండజ, ఉద్బుజ, జరాయుజములను నాలుగు విధములగు జీవములను సర్మార్గమందుంచి పాలించవలెను.
అందులో అందరికి దండనము ఈయదగును.పాలించవలెను.బ్రాహ్మణులను విడువవలెను. బ్రాహ్మణుని సత్య ధర్మరతులును, లోభ దంభ శూన్యులును అగు బ్రాహ్మణులే అతని తప్పును తెలుసుకొని దండించవలెను.బ్రాహ్మణుడు పాపమును చేసి ప్రాయశ్చిత్తమును చేసికొనని పక్షమందు అతని తల గొరిగించుట, ధనమును హరించుట, స్థాన భ్రష్టత్వము మొదలయిన దండనముల చేత దండించవలెను. బ్రాహ్మణుడు దుర్మార్గుడై హింస చేయుచున్నను వానిని రాజు దండించరాదు.రాజు ధర్మార్ధ బుద్ధి గలవాడగుచు ఎప్పుడైనను బ్రాహ్మణునకు గాని తనకపకారము చేయువానికి గాని శాస్త్ర ప్రయోగము ఆచరించదగదు.
బ్రాహ్మణేతరులందరూ భయములేక క్షాత్ర కీర్తిని చూపవలయును గాని బ్రాహ్మణ హింసమాత్రము చేయగూడదు. తాను స్వయముగా బ్రాహ్మణుని చంపినాను, తన నిమిత్తమై బ్రాహ్మణుడు చంపబడినాడు, అన్యుని చేత చంపించినను బ్రహ్మహత్య సంభవించునని ధర్మశాస్త్రమునందు చెప్పబడియున్నది.బ్రాహ్మణుడు లాగబడిగాని, కొట్టబడి గాని, ధనహీనుడుగా చేయబడి గాని, ఎవని ఉద్దేశించి ప్రాణములు విడుచునో వాడును బ్రహ్మ హంతకుడగును.
దుర్వాసునకు ప్రాణ హానికరమైన కష్టము నామూలముగా గలిగెను గదా?కాబట్టి నేను బ్రాహ్మణ హంతకుడనైతిని అని అతడు తలచుచున్నాడు.దుర్వాసా! అంబరీషుడీ ప్రసంగముతో మిక్కిలి దుఃఖముతో నున్నాడు.కాబట్టి నీవచ్చటికి త్వరగా పొమ్ము. నీకును రాజునకును కుశలమగును.
ఇట్లు విష్ణువు చెప్పిన మాటను విని దుర్వాసుడు నమస్కరించి అప్పుడే చక్రముతో సహా బ్రాహ్మణ పరివేష్టితుడైన రాజు వద్దకు వచ్చెను.ఇట్లు సూర్యకాంతితో వచ్చుచున్న దుర్వాసుని చూచి అంబరీష మహారాజు లేచి నమస్కరించి సుదర్శన చక్రముతో అంబరీషుడు ఇట్లు పల్కెను. ఓ చక్రమా! నన్ను మన్నించుము.ఆర్తుని సంహరించుట న్యాయము గాదు.గనుక బ్రాహ్మణుని రక్షించుము.అతి క్రౌర్యముతో హింసించుట తగదు.రక్షించుమని వేడుచున్న నన్నును శరణాగతుడైన బ్రాహ్మణుని రక్షించుము.అంబరీషుడిట్లు పలుకుచు దుర్వాసుని కౌగలించుకుని తరువాత అతనిని తన వెనుక ఉంచుకొని తాను ముందు నిలబడి భయములేక ధనువును ఎక్కుపెట్టి సుదర్శన చక్రముతో ఇట్లనియెను.
*ఇతి శ్రీస్కాంద పురాణే కార్తిక మహాత్మ్యే సప్తవింశాధ్యాయసమాప్తః!*
పితృలోకమందున్న
*స్వే స్వే కిల కులే జాతే పుత్రే నప్తరి వా పునః౹*
*పితర: పితృలోకస్థా: శోచంతి చ హసంతి చ౹౹*
*కిం తస్య దుష్కృతే౽స్మాభిః సంప్రాప్తవ్యం భవిష్యతి౹*
*కించాస్య సుకృతే౽స్మాభిః ప్రాప్తవ్యమితి శోభనమ్౹౹*
తాత్పర్యం:-
*పితృలోకమందున్న పితృదేవతలు తమతమ వంశమున కుమారులు, మనుమల పుట్టుకకు వారి చెడుపనివల్ల మనమేం పొందాల్సి ఉంటుందో? అని దుఃఖిస్తారు*....
అలాగే వారి మంచిపనుల వల్ల మనకేం మంచి లభిస్తుందో అని సంతోషిస్తారు....
"ఒక పుష్పంబు
శు భో ద యం🙏
"ఒక పుష్పంబు భవత్పదద్వయముపై
నొప్పంగ సద్భక్తి రం
జకుడైపెట్టిన,పుణ్యమూర్తికి పునర్జన్మంబులేదన్న, బా
యక కాలత్రితయోపచారముల నిన్నర్చించుచున్ పెద్ద నై
ష్ఠికుడై యుండెడువాడు,నీవగుట తా
చిత్రంబె? సర్వేశ్వరా!
సర్వేశ్వర శతకం-చిమ్మపూడి అమరేశ్వరుడు.
భావం: ఓసర్వేశ్వరా!నీపాదాలపై భక్తితో ఒకపువ్వుంచి
ప్రార్ధించినవాడికి పునర్జన్మమేలేదని పురాణాలుప్రవచిస్తున్నాయ్.అలాంటిది ముక్కాలములయందూ మూడుసంధ్యలా ,మహానిష్ఠతో నిన్నర్చించేవాడు నీలోసమైక్యమైతే యిక నాశ్చర్యపడవలసినదేమున్నది?అనిభావం.
ఈశ్వరార్చనకు ఫలితం జన్మరాహిత్యమేనని,ఈశ్వరసాయుజ్యమేనని చెప్పే యీపద్యం.కాకతిరాజులకు
సమకాలికుడైన చిమ్మపూడి రచించుట విశేషం.🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
భగవంతుడు
*భగవంతుడు అనేవారు నిజంగా ఉన్నారా*
దేవుని అసలు స్వభావం ఏమిటి? అతని భౌతిక లక్షణాలు ఏమిటి? అతను ఎలా చూడాలి?దేవుడిని మనం ఎలా చూడగలం..?!
వాస్తవానికి భగవంతుడు స్వచ్ఛమైన చైతన్యం. ఆయన సాధారణ మానవుల లాంటివాడు కాదు. ఆ పరమాత్మకు చేతులు, కాళ్ళు, చెవులు, కళ్ళు, ముక్కు, నోరు లేదా ముఖం లేదు. వేదాలు ప్రకటించినట్లు -
*अपाणिपादो जवनो गृहीता पश्चत्यचक्षुः स |*
*स वेत्ति वेद्यं न च तस्यास्ति वेत्ता तमाहुरग्ग्रं पुरुषं |* |
అతనికి కాళ్ళు లేవు కానీ అవి మెరుపు వేగంతో కదలగలవు. అతనికి చేతులు లేవు కానీ అవి దేనినైనా నిర్వహించగలవు... ఏదైనా స్వీకరించగలవు. కళ్ళు లేకుండా ఆయన చూడగలడు. చెవులు లేకుండా కూడా వినగలడు. ఇది ఎలా సాధ్యమవుతుందో అని మేము ఆశ్చర్యపోతుంటే - మనలో వున్న మాయ కారణంగా మాత్రమే మనము ఆశ్చర్యపోతాము.
మనకు అసాధ్యం ఐయినది ఇతరులకు కూడా సాధ్యం కాదు. మన సామర్థ్యాలను భగవంతుని సామర్థ్యంతో పోల్చకూడదు. మనకు అసమర్థమైనది కూడా భగవంతుని సామర్థ్యానికి మించినది అని అనుకోకూడదు. భవవంతుని సామర్థ్యాలను కొలవడానికి మనం మానవ నిర్మిత కొల మానాలను వేటినీ ఉపయోగించలేము.
ఆయన సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు. కేవలం ఆలోచన ద్వారా, సెకనులో, ఆయన మొత్తం విశ్వాన్ని సృష్టించగలడు. రూపానికి మించినది అయినప్పటికీ తను ఇష్టపడే ఏ రూపాన్ని అయినా ఆరాధించవచ్చు. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు చెప్పినట్లు -
*अजोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोपि सन्* |
*प्रकृतिं स्वामधिष्ठाय ||*
నేను పుట్టుకకు మించినవాడిని. నేను కోరుకునే ఏదైనా లేదా అన్ని రూపాలను ఏక కాలంలో నిర్వహించుకునే శక్తి నాకు ఉంది.
ఆచార్య శంకర భగవత్పాదులు దీనిని మరింత స్పష్టంగా వివరించారు - *स्यात् परमेश्वरस्यापि इच्छावशान्मायामयं रूपं .* భగవంతుడు తన భక్తులను రక్షించడానికి, ఆశీర్వదించడానికి అనేక రూపాల్లో కనిపిస్తాడు. నిజమైన అర్థంలో దేవుడు నిరాకారుడు. ఆయన గుణాలు లేకుండా ఉన్నాడు. కానీ నిరాకారమైన, గుణాలు లేని భగవంతుని ఆరాధించడం సామాన్యులకు కష్టం. భక్తుడు తన హృదయ ఆలయంలో భగవంతుడిని స్థాపించాలని కోరుకుంటాడు. భగవంతుని యొక్క నిరాకార, ఏ లక్షణం లేని స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇది అసాధ్యం. ఆ విధంగా భగవంతుడు , తన భక్తులకు సహాయం చేయడానికి మాత్రమే వివిధ రూపాల్లో కనిపిస్తాడు. ఈ రూపాలు ఏవీ వాస్తవమైనవి కావు. భ్రమలు మాత్రమే.
*अशब्दमस्पर्शमरूपमव्ययं तथाऽरसं नित्यमगन्धवच्च यत् | अनाद्यनन्तं महतः परं ध्रुवं निचाय्य तं ||*
భగవంతుడు రూపాలకు, కాలానికి అతీతుడు. ఆయన అనుక్షణం ఎప్పుడూ ఉనికిలో ఉన్నాడు. భగవంతుని ఉనికిని మనం ఎప్పుడూ తిరస్కరించకూడదు. మన ఈ ఉనికికి మనమే ఆయనకు రుణపడి ఉన్నందున, ఆయన ఉనికిని తిరస్కరించడం కూడా ఆయన ఇచ్చిన శక్తిని ఉపయోగించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అందువల్ల దేవుడు ఉన్నారా? అనే సందిగ్ధ ప్రశ్నకు ఇంకేమీ జవాబు లేదు.
భగవంతుడు తన ఇష్టానుసారం ఈ విశ్వాన్ని సృష్టిస్తాడు. దానిని అదే నిలబెట్టుకుంటుంది, మొత్తం సృష్టి మళ్ళీ చివరికి ఆయనలో కలిసిపోతుంది. అతను ప్రతి ఒక్కరికి వారు చేసే చర్యలకు అనుగుణంగా ఆనందం మరియు దుఖాన్ని ఇస్తాడు.తన చుట్టూ జరిగే ఏవైనా సంఘటనలకు ఆ పరమాత్మ కట్టుబడి ఉండడు. ఇది దేవుని సరైన భావన. భగవంతుని నిజ స్వభావం గురించి చాలామందికి తెలియదు. ఈ కారణంగానే దేవుడు నిజంగా ఉన్నాడా?! అని వారు ఇప్పటికీ ప్రశ్నిస్తున్నారు. ఈ విభిన్న జీవన రూపాల సృష్టి,
నిర్జీవ వస్తువులు దైవిక శక్తి యొక్క అభివ్యక్తి అంతా ఆయన మాయే.
*इच्छामात्रं प्रभोः सृष्टिः आप्तकामस्य का स्पृहा* ? ఈ ప్రపంచం మొత్తం భగవంతుని యొక్క సృష్టి. ఈ విశ్వం యొక్క సృష్టి, జీవనోపాధికి... చివరివారకూ ఆయన మాత్రమే బాధ్యత వహిస్తాడు.
ఒక వ్యక్తి వేర్వేరు ప్రదేశాల్లో భగవంతుని ఆరాధించవచ్చు. అతను ఈ రోజు ఇక్కడ, రేపు ఢీల్లీలో, మరుసటి రోజు కలకత్తాలో ఇంకోరోజు లేదా మరుసటి రోజు అమెరికాలో భగవంతుడిని ఆరాధించవచ్చు. ఈ ప్రార్థనలన్నింటినీ ఆ పరమాత్మ అంగీకరించలేదా? ఎవరైనా దీనిని నమ్మకపోతే అది నిజంగా గొప్ప పాపం. ఆయన మన భక్తితో కూడిన పూజలు అంగీకరించడం లేదని ధిక్కార ప్రకటనలు చేయడం గొప్ప పాపం. అతను ప్రకృతిలో నిరాకారంగా ఉన్నప్పటికీ, ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన భక్తులందరి ప్రార్థనలను ఒకే సమయంలో స్వీకరించగలడు. తన సర్వవ్యాపక కారణంగా ఇది సాధ్యమవుతుంది. ఈ భావనను భగవాన్ వేద వ్యాసులవారు వారి బ్రహ్మసూత్రాలలో వివరించారు.
*विरोधः कर्मणि इति चेत् न अनेकप्रतिपतेः दर्शनात् ?* భగవంతుడు ఒకే సమయంలో వివిధ భక్తుల ప్రార్థనలను, వారు నివేదించే నైవేద్యాలను వివిధ ప్రదేశాల నుండి అంగీకరించడం అతని శక్తులకు నిదర్శనం. *अनेकप्रतिपतेः,* అలాంటిది అతని శక్తి. ఆయనను ఆరాధించే వారందరినీ ఆశీర్వదిస్తాడు. భగవంతుని ఆరాధించడం, ఆయన నామాన్ని జపించడం సర్వులకు సర్వదా శుభం..
*హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ*
-- *జగద్గురు శ్రీ శ్రీ భారతీతీర్ధ మహాస్వామి వారు*
ఏకాదశి సందర్భంగా
*ఏకాదశి సందర్భంగా షోడశ విష్ణు కాశి అంతర్గత యాత్రలో దర్శించస్వలసిన ముఖ్య ప్రదేశములు
కాశీలో విష్ణు యాత్రలో చేర్చబడిన పద్దెనిమిది రూపాలలో విష్ణువు కాశీలో స్థాపించబడ్డాడు. శ్రీ విష్ణువు యొక్క క్రింది రూపాలు. 1. శ్రీ బిందు మాధవ్ 2. శ్రీ ఆది కేశవ్ 3. శ్రీ నారద్ కేశవ్ 4. శ్రీ ప్రహ్లాద్ కేశవ్ 5. శ్రీ యజ్ఞవరః విష్ణువు 6. శ్రీ విదర్ నర్సింహ 7. శ్రీ గోపీ గోవింద్ 8. శ్రీ హయగ్రీవ కేశవ్ 9. శ్రీ శ్వేత్ మాధవ్ 10. శ్రీ ప్రయాగ్ మాధవ్ 11. శ్రీ గంగా కేశవ్ 12. శ్రీ వైకుంఠ మాధవ్ 13. శ్రీ ప్రచంద్ నర్సింహ 14. శ్రీ అత్యుగ్ర నర్సింహ 15. శ్రీ కోలాహల్ నర్సింహ 16. శ్రీ విటాంక్ నర్సింహ 17. శ్రీ కోకవరః 18. శ్రీ ధరణివరాః
కార్తీక పురాణం - 27
_*🚩కార్తీక పురాణం - 27 వ అధ్యాయము🚩*_
🕉🌻🕉️🌻🕉️🌻🕉️🌻🕉️🌻🕉️
*దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట*
☘☘☘☘☘☘☘☘☘
మరల అత్రి మహాముని అగస్త్యున కిట్లు వచించెను - కుంభ సంభవా ! ఆ శ్రీ హరి దూర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకను ఇట్లు చెప్పెను.
*"ఓ దూర్వాసమునీ ! నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారము ఎత్తుట కష్టము గాదు. నీవు తపశ్శాలివి. నీ మాటలకు విలువ ఇవ్వవలెను. కావున , అందులకు నేనంగగీకరించితిని. బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరీవృతుడై ప్రాయోపవేశమొనర్పనెంచినాడు. ఆ కారణము వలన విష్ణు చక్రము నిన్ను బాధింపబూనెను. ప్రజారక్షణమే రాజధర్మము గాని , ప్రజాపీడనము గాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులగు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపియైన మరొక విప్రుడే దండించ వలెను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్దమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు. విప్రుని హింసించువాడును హింసింపచేయువాడును , బ్రాహ్మణ హంతకులకి న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి. బ్రాహ్మణుని సిగబట్టిలాగిన వాడును , కాలితో తన్నినవాడును , విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమిన వాడును , విప్ర పరిత్యాగ మొనరించినవాడును బ్రహ్మ హంతకులే అగుదురు. కాన , ఓ దూర్వాస మహర్షి ! అంబరీషుడు నీ గురించి - తపశ్శాలియు , విప్రోత్తముడును అగు దూర్వాసుడు నా మూలమున ప్రాణసంకటం పొందుచున్నాడు. అయ్యో ! నేను బ్రాహ్మణ హంతకుడనయితినే అని పరితాపము పొందుచున్నాడు. కాబట్టి , నీవు వేగమే అంబరీషుని కడకేగుము. అందువలన మీవుభయులకు శాంతి లభించును"* అని విష్ణువు దూర్వాసునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు బంపెను.
*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహత్మ్యమందలి సప్తవింశోధ్యాయము - ఇరవయ్యేడవ రోజు పారాయణము సమాప్తము.*
🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏
పంచాంగం 27.11.2024
ఈ రోజు పంచాంగం 27.11.2024
Wednesday,
స్వస్తి శ్రీ చాన్ద్రమాన క్రోధి ⁷నామసంవత్సర: దక్షిణాయనం శరదృతు కార్తీక మాస కృష్ణ పక్ష ద్వాదశి తిథి సౌమ్య వాసర: చిత్ర నక్షత్రం ఆయుష్మాన్ యోగః: కౌలవ తదుపరి తైతుల కరణం. ఇది ఈరోజు పంచాంగం.
రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.
యమగండం: ఉదయం 07:30 నుండి 09:00 వరకు.
శుభోదయ:, నమస్కార: