ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
మికతలు-2 --------------------- భక్తి ఛానెల్ లో ప్రవచనాలు వింటూ వైరాగ్యం వంట పట్టించుకునే లోపలే ఓ గుండాయన తెర మీద ప్రత్యక్షమై 'డబ్బులు ఊరికే రావు'అని హెచ్చరిస్తాడు! రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు,బంగారు కొట్టు వాళ్ళు చిట్ ఫండ్ వాళ్ళు ఊరించే ఆఫర్లతో నేల మీదకు గుంజేస్తున్నారు! నేనెన్నడూ మారనంటే నా తప్పేముంది చెప్పండి!! ****** -సత్యభాస్కర్
చెల్లని రూపాయి ---- రోజులు నిర్విరామంగా ఖాళి అవుతున్నాయి నెలలు దొర్లిపోతున్నాయి ఇంతకు ముందు ఎప్పుడో ఓసారి పలకరించే మృత్యువు జీవితంలో భాగమై పోయింది!
సన్నిహితులు,హితులు,స్నేహితులు బంధువులు అంటూ తీరికలేకుండా కోపతాపాలు,ప్రేమానురాగాలు,రాగ ద్వేషాలతో గడిపిన కాలం గతమైపోయింది!
ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ నాలుగు గోడలమధ్య,శూన్యం లోకి చూస్తూ జవాబు తెలీని ప్రశ్నలను తరిచి చూస్తూ కత్తిమొన మీద జీవితం గడుపుతున్నట్లుంది!
ఇంతవరకు వినోదాన్ని పంచుతూ, సంచలన వార్తలతో దృష్టినాకర్షించే రంగుల బుల్లితెర మరణ మృదంగం మోగిస్తోంది భయోత్పాతంతో అదే కంపిస్తోంది!
తాము సర్వ శక్తిమంతులమని ఇన్నాళ్లు మనలను నమ్మించిన నాయకమణ్యులు చేతులెత్థేసి,దీపాలు వెలిగించమని,పల్లాలు మోగించమని చెబుతూ మన ప్రాణాలను గాలిలో దీపం చేయడం కన బడుతోంది!
విశ్వాన్ని ఆక్రమిస్తా,అంగారకుడిని వశపరుచుకుంటాని విర్రవీగిన అగ్రరాజ్యంకూడా అక్కరకు రాని రాజ్యం అయిపొయింది!
ప్ర్రాణావసర మందులను,వైద్యాన్ని శవపేటికలను కూడా బ్లాక్ మార్కెట్ చేసే ధన పిశాచులు రాజ్యమేలేచోట సామాన్యుడి బతుకు చెల్లని రూపాయయి పోయింది! **** -సత్యభాస్కర్ ,9848391638 (This poetry is published in''SOPATHY'' Sunday magzine of Nava Telangana ON 16-08-2020)
3 కామెంట్‌లు:
మికతలు-1
---------------------
ఫేస్బుక్ వాట్సాప్ వగైరాలలో
నిత్యం మునిగి తేలేవాళ్లకు
కరోనా అంటదట!
ఎందుకంటే,
మనుషులతో సంపర్కంలోనే
వుండరుగా!అందుకు!
****
-సత్యభాస్కర్ ,9848391638
మికతలు-2
---------------------
భక్తి ఛానెల్ లో ప్రవచనాలు వింటూ
వైరాగ్యం వంట పట్టించుకునే లోపలే
ఓ గుండాయన తెర మీద ప్రత్యక్షమై
'డబ్బులు ఊరికే రావు'అని హెచ్చరిస్తాడు!
రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు,బంగారు కొట్టు వాళ్ళు
చిట్ ఫండ్ వాళ్ళు ఊరించే ఆఫర్లతో
నేల మీదకు గుంజేస్తున్నారు!
నేనెన్నడూ మారనంటే
నా తప్పేముంది చెప్పండి!!
******
-సత్యభాస్కర్
****
చెల్లని రూపాయి
----
రోజులు నిర్విరామంగా ఖాళి అవుతున్నాయి
నెలలు దొర్లిపోతున్నాయి
ఇంతకు ముందు ఎప్పుడో ఓసారి
పలకరించే మృత్యువు జీవితంలో భాగమై పోయింది!
సన్నిహితులు,హితులు,స్నేహితులు
బంధువులు అంటూ తీరికలేకుండా
కోపతాపాలు,ప్రేమానురాగాలు,రాగ ద్వేషాలతో
గడిపిన కాలం గతమైపోయింది!
ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ
నాలుగు గోడలమధ్య,శూన్యం లోకి చూస్తూ
జవాబు తెలీని ప్రశ్నలను తరిచి చూస్తూ
కత్తిమొన మీద జీవితం గడుపుతున్నట్లుంది!
ఇంతవరకు వినోదాన్ని పంచుతూ,
సంచలన వార్తలతో దృష్టినాకర్షించే
రంగుల బుల్లితెర మరణ మృదంగం మోగిస్తోంది
భయోత్పాతంతో అదే కంపిస్తోంది!
తాము సర్వ శక్తిమంతులమని ఇన్నాళ్లు
మనలను నమ్మించిన నాయకమణ్యులు
చేతులెత్థేసి,దీపాలు వెలిగించమని,పల్లాలు మోగించమని చెబుతూ
మన ప్రాణాలను గాలిలో దీపం చేయడం కన బడుతోంది!
విశ్వాన్ని ఆక్రమిస్తా,అంగారకుడిని వశపరుచుకుంటాని
విర్రవీగిన అగ్రరాజ్యంకూడా
అక్కరకు రాని రాజ్యం అయిపొయింది!
ప్ర్రాణావసర మందులను,వైద్యాన్ని
శవపేటికలను కూడా బ్లాక్ మార్కెట్ చేసే
ధన పిశాచులు రాజ్యమేలేచోట
సామాన్యుడి బతుకు చెల్లని రూపాయయి పోయింది!
****
-సత్యభాస్కర్ ,9848391638
(This poetry is published in''SOPATHY'' Sunday magzine of Nava Telangana ON 16-08-2020)
కామెంట్‌ను పోస్ట్ చేయండి