27, ఏప్రిల్ 2023, గురువారం

శరీరతత్వం


 లక్షణాలని బట్టి మన శరీరతత్వం తెలుసుకునే ప్రాచీన వైద్య విధానం  -


 * శరీరపు లక్షణం  -


      వాతరోగి శరీరం నల్లగా ఉండును. పైత్యరోగి శరీరం పచ్చగా కాని , ఎర్రగాకాని ఉండును. శ్లేష్మరోగి శరీరం తెల్లగా ఉండును. ఏవైనా రెండురకాల తత్వాలు కలిగినటువంటి వారియొక్క శరీరం మిశ్రమ వర్ణంగా ఉండును.సన్నిపాత రోగి ( Typhoid ) శరీరం పాలిపోయినట్లు ఉండును.


 * శబ్ద లక్షణం - (నాడి లక్షణం ).


       వాత నాడి కలిగినవాడు నెమ్మదిగా మాట్లాడును . పైత్యనాడి కలిగినవాడు నవ్వుచూ 

తుళ్ళుతూ ఉండును. శ్లేష్మ నాడి కలిగినవాడు సన్నటి , వినివినపడనట్టు గా మాట్లాడును . 


 *  నేత్ర లక్షణం -


        వాతరోగి కనులు నల్లగా కాని మబ్బుగా ఉండి నీరు కారుచుండును. పైత్యరోగి కన్నులు పచ్చగా కాని ఎర్రగా కాని ఉండును. శ్లేష్మరోగి కనులు పుసిగట్టి తెల్లగా ఉండును. సన్నిపాత రోగి కనులు పచ్చగా కాని ఎర్రగా కాని ఉండును. కామెర్ల రోగి కనులు పచ్చగా ఉండును.


 *  మల లక్షణం  - 


       వాతరోగి మలము నల్లగా గట్టిగా మేక పెంటికలు వలే ఉండును. పైత్య రోగి మలము పచ్చగా కాని , ఎర్రగా కాని ఉండును. శ్లేష్మరోగి మలము తెల్లగా , బంకగా నురుగు కట్టి ఉండును. రెండురకాల తత్వాలు కలిసి ఉన్న రోగి మలము మిశ్రమ వర్ణంగా ఉండును.


 *  ముత్ర లక్షణం -


         వాతరోగి మూత్రం తెల్లగా ఉండును. పైత్యరోగి మూత్రం కొంచం ఎరుపుగా ఉండును. కామెర్ల రోగి మూత్రం పచ్చగా ఉండును. శ్లేష్మరోగి 

మూత్రం తెల్లగా నురుగు కట్టి ఉండును. రెండురకాల తత్వాలు పెరుగుట వలన రోగం కలిగిన రోగి మూత్రం మిశ్రమంగా ఉండును.


                  ఉదయాన్నే నిదుర లేచిన వెంటనే వెడల్పాటి తెల్లని పాత్రలో రోగి మూత్రమును పట్టి అందు నూనెచుక్క వేసిన అది వేగముగా మూత్రం అంతా పాకిన వాతరోగం అనియు , మూత్రం రక్తవర్ణంతో ఉండి మూత్రం వేచిన కదలక ఉండిన పైత్యరోగం అనియు , నూనెవేసిన వెంటనే ఆ నూనె చుక్క యందు బుడగలు లేచి మూత్రం పచ్చగా ఉండిన శ్లేష్మరోగం అనియు , మూత్రంలో వేసిన నూనె చుక్క తెల్లటి నురుగు కట్టిన సన్నిపాతరోగి అనియు , నూనె చుక్క వేసిన వెంటనే ఆ నూనె చుక్క ఏనుగు ఆకారంలో రావడం లేదా మనిషి ఆకారం వలేగాని తమలపాకు ఆకారం రావటం కాని లేక వేసిన వెంటనే మునిగిపోవడం గాని జరగడం లేదా మూత్రం నల్లగానో , ఎర్రగానో , పచ్చగానో ఉండిన ఆ రోగి యొక్క రోగం నయంచేయుట అసాధ్యం .


                నూనెబొట్టు పద్మాకారం గాని , శంఖచక్రాకారం గాని , వీణ ఆకారంగాని , సింహాసన ఆకారం కాని మల్లెమొగ్గ వలే ఉండిన ఆ రోగి యొక్క రోగం నయం చేయుటకు సాధ్యం అగును.


 *  నాలిక యొక్క లక్షణం  -


          నాలిక పగిలి పైన పోర పచ్చగా ఉండిన వాతరోగం అనియు నాలిక పైన ద్రవం కలిగి తెల్లగా ఉండిన శ్లేష్మరోగి అనియు నాలిక పైపొర రేగి నల్లగా ఉండి అసలు తడి లేకుండా ఉన్నచో సన్నిపాత రోగి అనియు మిశ్రమవర్ణం కలిగి ఉన్న రెండురకాల తత్వాలు ప్రకోపించుట వలన కలిగిన లక్షణం అని తెలుసుకొని చికిత్స చేయవలెను .


             పైన చెప్పిన లక్షణములు అన్నియు గమనించవలెను. ఒక్క నాడిని పట్టుకొని మాత్రమే రోగ నిర్థారణ చేయడమే కాకుండా రోగి యొక్క లక్షణాన్ని బట్టి వైద్యం చేయడం ప్రతి వైద్యుడు నేర్చుకోవలసిన ప్రధమ లక్షణం . నేను మీకు వివరించిన ప్రతిలక్షణాన్ని జాగ్రత్తగా పరిశీలించి గుర్తుపెట్టుకొన్న యెడల సమస్య ఉత్పన్నం కాకుండా మునుపే తగినజాగ్రత్తలు తీసుకొనచ్చు.


     క్రిముల ( WORMS ) గురించి సంపూర్ణ వివరణ -


        క్రిములు అనేవి అజీర్ణవ్యాధి వలన కలుగును. పాశ్చాత్య వైద్యులు ఆయుర్వేద శాస్త్రము నందు క్రిముల విషయము క్రిముల గురించి ఎక్కడా ఇవ్వలేదు , చెప్పబడలేదు అని , క్రిములకు ప్రాధాన్యత ఇవ్వబడి ఉండలేదని పొరపాటు అభిప్రాయముతో ఉన్నారు . ఆయుర్వేదం నందు క్రిమివ్యాధులకు కూడా అవసరం ఉన్నంత వరకు ప్రాముఖ్యత ఇవ్వబడినది. ఇప్పుడు మీకు ఆయుర్వేదం నందు క్రిముల గురించి ఏమి చెప్పారో మీకు సంపూర్ణముగా వివరిస్తాను. ఇదే విషయము పైన అంతకు ముందు నేను మీకు ఒక పోస్టులో కొంత వివరించాను. ఇప్పుడు మరిన్ని విషయాలు వివరిస్తాను. 


        ఆయుర్వేదం నందు క్రిములను రెండురకాలుగా విభజించారు. అవి 


            1 - బాహ్యక్రిములు . 


             2 - అభ్యంతరములు . 


     త్వక్కులు మొదలగువాని యందు , స్వేదము మున్నగు బాహ్యమలముల యందు శ్లేష్మము , రక్తము , పురీషములను అభ్యంతర మలముల యందు నాలుగు రకములుగా క్రిములు జనించుచున్నవి. 


          ముందుగా మీకు బాహ్యక్రిమి లక్షణం వివరిస్తాను. ఈ బాహ్యక్రిములు 20 రకములు కలవు. ఇవి నువ్వులంత పరిమాణమున ఆకారము కలిగి ఆరంగుతో వస్త్రములను ఆశ్రయించి ఉండును. వీటిని నల్లులు అని పిలుస్తారు . జుట్టులో ఉండు యూక , ఈళ్ళు అని రెండు రకములు ఉండును . వాటిలో మరలా అనేక భేదములు ఉండును. ఎర్రటి మచ్చలు , బొబ్బలు , దురదలను , కంతులను కలిగించును. వీటికి బాహ్యక్రిములు అని పిలుస్తారు .  


             ముందుగా అసలు ఈ క్రిమిసంబంధ వ్యాధులు రావడానికి గల కారణం తెలుసుకుందాము . ఎవరైతే మొదట భుజించిన ఆహారం జీర్ణము కాకుండా మరలా భుజిస్తారో , ఎల్లప్పుడు మధురపదార్ధములను ఎక్కువుగా తీసుకుంటారో , ద్రవపదార్ధముల సేవన మీద మిక్కిలి ప్రేమ కలిగి ఉందురో , బెల్లము కలిసిన తిండి అధికముగా తినుదురో , కసరత్తు చేయనివాడు , పగలు నిద్రించువారు , పరస్పర విరుద్ద ఆహారములను భుజించువారు ఈ క్రిమివ్యాధులకు లోనగుదురు.  


        మినపపిండి , ఆమ్ల లవణ రసములు గల ద్రవ్యములు , బెల్లము , కూరగాయలు అధికముగా తినువానికి పురీషము నందు క్రిములు పుట్టును . 


            మాంసము , మత్స్యము , బెల్లము , పాలు , పెరుగు , పులిసిన ( తరువాణి ) వస్తువులు నిత్యము సేవించువానికి కఫము నందు క్రిములు పుట్టును . 


      అజీర్ణకరమైన శాకములు , విరుద్ద ఆహారములు తీసుకొనుటచేత రక్తము నందు క్రిమిదోషాలు కలుగును  . 


          క్రిముల మన శరీరం నందు ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేక లక్షణాలు కలుగును. మనం ఆ లక్షణాలని గుర్తించి దోషములకు చికిత్స చేయవలెను .  ఇప్పుడు మీకు వాటి గురించి వివరిస్తాను . 


      జ్వరము , శరీరం రంగు మారు ట , శూల , హృదయము నందు జబ్బు , శరీరాకృశత్వము , భ్రమ , అన్నద్వేషము , అతిసారం అనునవి ఉండువానికి శరీరము నందు క్రిమి ఉన్నదని తెలుసుకొనవలెను . 


  


          ఇప్పుడు కఫజ క్రిమి గురించి వివరిస్తాను. కఫము చేత ఆమాశయము నందు క్రిములు పుట్టును . అవి వృద్ది నొంది శరీరము నందు పైభాగము నందును క్రింద భాగము నందును కూడా తిరుగుచుండును . వీటిలో కొన్ని లావుగా , పొడవుగా ఫిడేలు చర్మపు తీగవలే ఉండును. ఇవి ఆమాశయము నందు , చుట్టుపక్కల ఆశయముల యందు పొరను అంటిపెట్టుకుని ఉండును. కొన్ని ఎర్రల వలే ఉండును. మరికొన్ని సమముగా పొడవుగా ఉండును. కొన్ని సూక్ష్మాకారముగా ఉండును.  మరికొన్ని శ్వేత రక్తవర్ణముగా ఉండును. 


       కఫజక్రిములు 7 రకాలుగా ఉండును. అవి 


  *  ఆంత్రాదములు  - 


         ఇవి శరీరం నందలి ప్రేగులను తినుచుండును. 


  *  ఉదరావేష్టములు  - 


         ఇవి కడుపున చుట్టుకుని ఉండును. 


 *   హృదయాదములు - 


         ఇవి హృదయము నందు తిరుగుచుండును. 


 *  మహాగుదములు  - 


        ఇవి వెడల్పైన గుదములు కల్గి ఉండును. 


 *  భుఱువులు  . 


 *  దర్భ కుసుమములు  - 


          ఇవి రెల్లు పువ్వుల వలే ఉండును. 


 *  సుగంధములు  -  


         ఇవి సుగంధము కలిగి ఉండును. 


        కఫజ క్రిముల వలన హృదయము నందు అదురుట , నోట నీరుకారుట , ఆహారం జీర్ణం కాకుండా ఉండుట , అరుచి , మూర్చ , వాంతి , జ్వరము , కడుపుబ్బరం , కృశించుట , తుమ్ములు , పీనస వంటి సమస్యలు కలుగును. 


  రక్తజ క్రిమి లక్షణము  - 


       రక్తమున జనించిన క్రిములు మిక్కిలి సూక్ష్మమైన ఆకారము కలిగి ఉండును. పాదము పొడవు , గుండ్రమైన ఆకారం కలిగి ఉండును. ఎరుపు రంగు కలిగి రక్తం ప్రవహించు సిరలు యందు ఉండును. వాటిలో చాలా వరకు సూక్ష్మ ఆకారం కలిగి ఉండటం వలన కంటికి కనిపించవు. 


       ఈ రక్తజ క్రిమి మొత్తం 6 రకాలుగా ఉండును. అవి 


 *  కేశాదములు  - 


          ఇవి తల వెంట్రుకలను నశింపచేయును . 


 *  రోమ విధ్వంసకములు  - 


         ఇవి శరీరం పైన రోమములను రాలిపోవునట్లు చేయును . 


 *  రోమద్వికములు  - 


        ఇవి రోమకూపములను ఆశ్రయించి ఉండును . 


 *  ఉదుంబరములు 


 *  సౌరసములు . 


 *  మాతలు .  


        ఈ రక్తజ క్రిమి వలన ముఖ్యముగా కుష్టువ్యాధిని కలిగించును. ఈ మాతలను జంతుమాతలు అని అంటారు. 


      పురీషజ క్రిమి లక్షణాలు గురించి తెలుసుకుందాము .  ఇవి పక్వాశయమున పుట్టి అధోమార్గమున సంచరించును. ఇవి వృద్ధినొంది ఆమాశయమునకు పోయి సంచరించునప్పుడు త్రేన్పులు వచ్చును. ఉపిరి బయటకి విడుచునప్పుడు మలము వలే దుర్గంధము బయటకి వెడలును . వీటిలో కొన్ని లావుగా , కొన్ని గుండ్రముగా , కొన్ని స్థూలంగా , కొన్ని శ్యామల పీత వర్ణముగా , కొన్ని తెలుపు , నలుపు రంగులు కలవిగా ఉండును. ఇవి 5 రకాలుగా ఉండును.  అవి 


   *  కకేరుకములు . 


   *  మకేరుకములు . 


   * సౌసుదాములు . 


   *  లేలిహములు . 


   * సశూలములు . 


      ఈ పురీషజ క్రిముల వలన పురీషము ఉండలు ఉండలుగా వెడలుట , శూల , మలబద్ధము , శరీరం కృశించుట , గరగరలాడుట , ఒళ్ళు తెల్లబారి ఉండటం వంటి గుణములు కలిగి ఉండును. ఇవి తమ స్థానములను వదిలి ఇతర స్థానముల యందు సంచరించునప్పుడు గగుర్పాటు , అగ్నిమాంద్యము , గుద స్థానము యందు దురద అను ఉపద్రవములు కలుగును. పాండు రోగము కూడా కలుగును. 


                   


                          9885030034

[26/04, 9:53 pm] +91 98850 30034: మలబద్ధకం గురించి వివరణ  - నివారణా యోగాలు . 


   మలబద్దకం అనేది సమస్తరోగాలకు మొదటి మెట్టు . మలం గాని ఆమం ( సరిగ్గా జీర్ణం కాని పదార్ధం ) వాతం వలన శుష్కించి ఉండలుగా గట్టి మలమార్గము నుండి సునాయాసంగా బైటకు వెడలకున్న యెడల ఆ వ్యాధిని మలబద్దకం అంటారు. ఆయుర్వేదం నందు ఈ వ్యాదికి            "ఆనాహము" అని పిలుస్తారు . 


           మలబద్దకం సమస్య వలన నడుము , వీపు నందు పట్టుకొని ఉండటం , కడుపునొప్పి , ఆయాసము , వాంతి వంటి లక్షణాలు వస్తాయి. దప్పిక , జలుబు , శిరస్సు నందు మంట , రొమ్ము పట్టినట్లు ఉండటం , తేన్పులు పైకి రాకుండా ఉండటం వంటి లక్షణాలు కొందరిలో కనపడతాయి. మలబద్దకం సమస్య పెరుగుతున్న కొలది మనిషి వాతరోగాలు వస్తాయి. 

Xxxxxxx

         ఇప్పుడు మీకు మలబద్దకం నివారణాయోగాలు వివరిస్తాను . 


  నివారణాయోగాలు  - 


 * రాచ ఉశిరికాయ తినుచున్న సుఖవిరేచనం అగును. 


 *  కాకరకాయ కూరను తరచుగా తీసుకొనుచున్న సుఖవిరేచనం అగును. 


 *  ఎండిన ఎర్రరేగుపళ్ళు తినుచుండవలెను . 


 *  చింతపండు చారు అద్బుతముగా పనిచేయును . అతిగా తీసుకున్న విరేచనాలు కలుగచేయును . 


 *  బాగా పండిన అరటిపండు తినుచుండవలెను . 


 *  నాగజెముడు , బొంతజెముడు , ఆకుజెముడు రసము 10 చుక్కలు తీసుకొనుచున్న సుఖవిరేచనం అగును. శరీర బలమును అనుసరించి 5 నుంచి 10 చుక్కలు తీసికొనవలెను . 


 *  విరేచనం ఇబ్బందిగా ఉన్నప్పుడు 4 చెంచాల ఆముదం కొంచం వేడిచేసి లోపలికి తీసికొనవలెను . ఆముదం తీసుకోవడం ఇబ్బందిగా ఉన్నచో ఒక కప్పు గొరువెచ్చని పాలలో ఆముదం కలిపి తీసికొనవలెను . 


 *  రోజూ నిద్రపోయే ముందు రాత్రి సమయములో రెండు గ్లాసుల నీరు తాగుచున్న ఉదయం సుఖవిరేచనం అగును. ఇలా తాగడం మొదలుపెట్టిన మొదటి రోజు నుంచే అవ్వొచ్చు లేదా రోజూ తాగుచున్న 4 రోజుల తరవాతి నుంచి వరస క్రమంలోకి వచ్చి సాఫీగా జరుగుతుంది. 


 *  సునాముఖి చూర్ణం చెంచాడు తీసుకొనుచున్న సుఖవిరేచనం అగును. 


       మలబద్దకం సమస్య అనేది మనం తీసుకునే ఆహారాన్ని బట్టి ఉంటుంది.  ప్రస్తుత కాలంలో జంక్ పుడ్ తీసుకోవడం ఎక్కువ అయ్యింది . ఇది అత్యంత ప్రమాదకరమైన ఆహారం . వీలైనంత వరకు అటువంటి వాటి దూరంగా ఉండవలెను . ఋతువు మారినప్పుడల్లా కడుపును శుభ్రం చేసుకొనుటకు విరేచనం కలిగించే ఔషధాలు తీసుకొనుట అత్యంత ప్రధానం అయింది. 


           చాలా మంది ఉదయాన్నే విరేచనముకు వెళ్ళి తమకు సుఖవిరేచనం అవుతుంది . అనే అపోహలో ఉంటారు. రోజుకి రెండుసార్లు విరేచనమునకు వెళ్ళినప్పుడే ఆరోగ్యకరమైన మనిషిగా భావించవలెను .  మనం తీసుకునే ఆహారం కూడా మలబద్దకం సమస్య రాకుండా ప్రధానపాత్ర పోషిస్తుంది.  ముఖ్యముగా నీరుని తీసుకోవడం , లేత ముల్లంగి , మునగ ఆకులు , మునగకాయ  , కాకరకాయ , పొన్నగంటి కూర , ద్రాక్ష , వెల్లుల్లి , ఆవుపాలు , ఆముదము , ఉలవకట్టు , పాతబియ్యం , నెయ్యి , వెన్న తరచుగా ఆహారం నందు తీసుకోవాలి. పీచుపదార్ధాలు అధికముగా తీసికొనవలెను . పళ్లరసాలు కంటే పళ్లు తినటం మంచిది .  


        శరీరము నుండి వ్యర్థపదార్థాలు ఎప్పటికప్పుడు బయటకి వెళ్లినప్పుడే శరీరం నందు టాక్సిన్స్ పోగుపడవు . శరీరం ఆరోగ్యకరంగా ఉండును.  


     

యోగి ఆదిత్యనాథ్

 ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కాషాయ వేషధారణలో కేవలం "సన్యాసి" మాత్రమేనని చాలా మంది అనుకుంటారు.


 అయితే వాటి గురించిన వాస్తవాలు తెలుసుకోవాలంటే కింద చదవండి....మీకు నచ్చితే షేర్ చేయండి.


 ▪️ అజయ్ మోహన్ బిష్త్ మారుపేరు (పదవీ విరమణ తర్వాత)

 యోగి ఆదిత్యనాథ్

 జన్మస్థలం - ఉత్తరాఖండ్ దేవభూమి


  ▪️HNB గర్వాల్ యూనివర్సిటీ చరిత్రలో అత్యధిక మార్కులు (100%)


 ▪️యోగి జీ గణిత విద్యార్థి, అతను B.Sc గణితం బంగారు పతకంతో ఉత్తీర్ణత సాధించాడు.


 ▪️ 1972లో ఉత్తరాఖండ్‌లోని దేవభూమిలోని వెనుకబడిన పంచూర్ గ్రామంలో చాలా పేద కుటుంబంలో జన్మించారు.  అతనికి ఇప్పుడు 50 ఏళ్లు.


 ▪️భారత సైన్యంలోని పురాతన గూర్ఖా రెజిమెంట్ యొక్క ఆధ్యాత్మిక గురువు.


  ▪️ నేపాల్‌లో యోగి మద్దతుదారుల పెద్ద సమూహం, యోగిని గురు భగవాన్‌గా ఆరాధిస్తారు.


 ▪️ మార్షల్ ఆర్ట్స్‌లో అద్భుతమైన నైపుణ్యం.  ఏకకాలంలో నలుగురిని ఓడించిన రికార్డు.


 ▪️ సుప్రసిద్ధ ఈతగాడు.  ఎన్నో పెద్ద నదులను దాటారు.


 ▪️కంప్యూటర్‌ను కూడా ఓడించే అకౌంటింగ్ నిపుణుడు.  ప్రముఖ గణిత శాస్త్రవేత్త శకుంతలా దేవి కూడా యోగిని మెచ్చుకున్నారు!


  ▪️ రాత్రిపూట కేవలం నాలుగు గంటల నిద్ర.  అతను ప్రతిరోజూ ఉదయం 3:30 గంటలకు లేస్తాడు.


   ▪️ యోగా, ధ్యానం, గౌశల, ఆరతి, పూజ రోజువారీ దినచర్య.


  ▪️ రోజుకు రెండు సార్లు మాత్రమే తింటారు..

  పూర్తిగా శాఖాహారం.  ఆహారంలో దుంపలు, వేర్లు, పండ్లు మరియు దేశీయ ఆవు పాలు ఉంటాయి.


 ▪️ అతను ఇప్పటి వరకు ఏ కారణం చేత ఆసుపత్రిలో చేరలేదు..


  ▪️ యోగి ఆదిత్యనాథ్ ఆసియాలోని అత్యుత్తమ వన్యప్రాణి శిక్షకులలో ఒకరు, అతనికి వన్యప్రాణులంటే చాలా ఇష్టం.


 ▪️యోగి కుటుంబం ఎంపీ లేదా ముఖ్యమంత్రి కాకముందు ఎలాంటి స్థితిలో ఉందో ఇప్పటికీ అలాగే జీవిస్తోంది.


 ▪️ సంవత్సరాల క్రితం పదవీ విరమణ తీసుకున్న తర్వాత యోగి ఒక్కసారి మాత్రమే ఇంటికి వెళ్లారు.


 ▪️ యోగికి ఒకే బ్యాంకు ఖాతా ఉంది మరియు అతని పేరు మీద భూమి ఆస్తి లేదు లేదా అతనికి ఎటువంటి ఖర్చులు లేవు.


 ▪️ వారు తమ సొంత జీతం నుండి వారి ఆహారం మరియు బట్టలు ఖర్చు చేస్తారు మరియు మిగిలిన డబ్బును సహాయ నిధిలో జమ చేస్తారు.


  ఇది యోగి ఆదిత్యనాథ్ ప్రొఫైల్.


 భారతదేశంలో నిజమైన నాయకుడి ప్రొఫైల్ ఇలా ఉండాలి.  అటువంటి సాధువులే భారతదేశాన్ని మళ్లీ ప్రపంచ గురువుగా మార్చగలరు.

 అటువంటి వ్యక్తులను దేవుడు తన మాధ్యమంగా భూమిపైకి పంపే అవతారాలు అంటారు.

 


 🚩 జై శ్రీ రామ్ 🚩

పుష్కరాలకు కాశీకి

 *గంగా పుష్కరాలకు కాశీకి పోలేని వాళ్ళు చింతించక్కరలేదు. శంకరాచార్యులు కాశీ పంచకంలో చెప్పిన ఈశ్లోకం మనస్పూర్తిగా స్మరించుకొంటే చాలు:*

 *"కాశీ క్షేత్రం శరీరం, త్రిభువనజననీ వ్యాపినీ జ్ఞాన గంగా|*


*భక్తిఃశ్రద్ధా గయేయం నిజగురుచరణధ్యానయోగః ప్రయాగః|*


*విశ్వేశోయం తురీయః సకలజనమనస్సాక్షిభూతోంతరాత్మా|*


*దేహే సర్వం మదీయే యది వసతి పునః తీర్థ మన్యత్ కిమస్తి|"*


*తాత్పర్యం:*

**************

*మన శరీరమే కాశీ క్షేత్రం. జ్ఞానమే మూడు లోకాలలో వ్యాపించిన గంగానది. మన భక్తిశ్రద్ధలే గయాక్షేత్రం. మన గురు చరణ ధ్యాన యోగమే ప్రయాగాతీర్థం. సకల జనుల మనస్సాక్షి భూతంగా మనలోని సమాధ్యవస్థాతత్త్వమైఉన్న ఆత్మయే కాశీ విశ్వేశ్వరుడు. ఈ విధంగా మన శరీరంలోనే సర్వ తీర్థాలు నెలకొని ఉండగా ఇంకా వేరే సేవింపదగ్గ పుణ్య తీర్థాలు ఏముంటాయి..!*


🙏🙏🙏

మానవ సంబంధాలు

 *పలచబడి పోతున్న మానవ సంబంధాలు*


హద్దులు గీస్తున్న హోదా , డబ్బులు, అహం ,ఈర్ష్య.

 

   గత ముప్ఫై ఏళ్లుగా కుటుంబ సంబంధాలు మానవ సంబంధాలు లో వస్తున్న మార్పులను చాలా దగ్గరగా చూస్తూ వచ్చాము .

          పెద్దగా ఆస్తులు..చెప్పుకోదగ్గ ఆదాయ వనరులు.. సమాజంలో హోదా.. సౌకర్యాలు సౌఖ్యాలు పెద్దగా లేని రోజుల్లోనే మనుషుల మధ్య ఆప్యాయత అనుబంధాలు చక్కగా (చిక్కగా )వుండేవి..

               ఒకరికి ఒకరు చేదోడుగా.. నిజాయితీగా అరమరికలు లేని సంబంధాలు కొనసాగించారు..

          వున్నంతలో తృప్తిగా వున్నారు.. కష్టానికి సుఖానికి ఒకరికొకరు కలుసుకోవడం.. అందరం దగ్గర వాళ్ళం అనే అనుభూతి పుష్కలంగా వుండేది..

               కుటుంబంలో ఎవరి పిల్లలు అయినా ఏదైనా సాధిస్తే అది కుటుంబం మొత్తం ఉమ్మడిగా సంతోషం వ్యక్తం చేసేవారు..

               మా మనవడు లేదా మనవరాలు..అని తాతలు.. మా మేనకోడలు లేదా మేనల్లుడు అని అమ్మమ్మ ఇంటివారు నానమ్మ ఇంటి వారు అందరూ గర్వంగా చెప్పుకునే వారు..

             కానీ ఎప్పుడైతే 1983-84 నుంచి కార్పొరేట్ కాలేజ్ సంస్కృతి పెరగడం మొదలైందో.. ఎప్పుడైతే ఒక్కొక్కరు పిల్లలను చదివించడానికి priority ఇవ్వడం మొదలైందో.. ఎప్పుడైతే పిల్లలు కూడా ఒకరికి మించి ఒకరు అవకాశాలు అందిపుచ్చుకుంటూ.. కెరీర్ సృష్టించుకోవడం మొదలైందో..ఈ సంబంధాల్లో కూడా compitetion మొదలైంది... పిల్లలో ఈర్ష్య, పెద్దల్లో అసూయ..


             మొదట్లో success అయిన వారే కుటుంబాలలో మిగిలిన వారికి మార్గనిర్దేశనం చేసే వారు.. మిగిలిన వారికి అరమరికలు లేకుండా అండదండలు అందించే వారు.. తాము ఎదగడంతో పాటు తమ వారు కూడా ఎదగడం కోసం సహాయ పడ్డారు..


             కానీ ఎప్పుడైతే సర్వీస్ సెక్టార్ ప్రాముఖ్యత పెరగడం మొదలైందో.. ఎప్పుడైతే వేగంగా కెరీర్ దొరకడం మొదలైందో.. వేగంగా కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మారడం మొదలైందో..

              అంతకు ముందు కన్నా జీవితంలో సౌఖ్యాలు.. విలాసాలు.. పెరిగాయో ఎందుకో మనుషుల వ్యక్తిత్వం మరింత పరిణతి చెందాల్సిన దగ్గర రివర్స్ లో కుంచించుకు పోవడం మొదలైంది పక్కాగా సంబంధాలు పలుచపడటం మొదలైంది.... అంతా కమర్షియల్ అయిపోయింది 

              ఏ ఇద్దరు కలిసినా తమ పిల్లలు సాధించిన విజయాలు.. కొన్న ఆస్తులు.. చేయించుకున్న నగలు.. వారు పొందుతున్న సాలరీ ప్యాకేజ్.. వారు పొందుతున్న కంఫర్ట్ గురించి తప్ప..

               వెనుకటి రోజుల్లో లాగా ఆప్యాయంగా నోరారా పలకరించు కోవడమే తగ్గిపోయింది..పలకరించుకున్నా ఏదో మొక్కుబడిగానే...


                ఆనాటి రోజుల్లో ఇంట్లో కీడు జరిగినా..శుభకార్యం జరిగినా కనీసం 10 మంది చుట్టాలు వారం పది రోజుల ముందు నుంచే వచ్చి వుండేవారు..

              తరువాత కూడా ఇంకో వారం రోజులు వుండేవారు..

            రాత్రి పూట ఆరుబయట మంచాలు వేసుకుని పొద్దుబోయిందాక చక్కగా కబుర్లు చెప్పుకుంటూ పడుకునే వారు..

               ఇప్పుడు ఎంత దగ్గర వారి కార్యక్రమం అయినా.. చేసే వారు కూడా ఆప్పో సొప్పో చేసి పక్క వాడి కన్నా ఘనంగా చేయాలి అని చూపించే శ్రద్ధ మన వాళ్ళను దగ్గరగా నిలుపుకుందాము అని మర్చిపోతున్నారు..


                అటెండ్ అయ్యే వారు కూడా తమ అతిశయం చూపించుకోవడానికి.. తమ స్థితిలో వచ్చిన మార్పు చూపించుకోవడనికి ఇస్తున్న ప్రయారిటీ..

             పారదర్శక సంబంధాల కి ఇవ్వడం లేదు.. చాలా మొక్కుబడిగా ఆహ్వానాలు హజరులు మిగిలిపోతున్నాయి..

           అందరికి పిల్లలు దూరంగా వుంటున్నా.. ఇరుగు పొరుగు నే వుంటున్న రక్త సంబంధీకులు తో కూడా ఆత్మీయ అనుబంధాలు వుంచుకోవడం లేదు..

            నిష్కారణంగా చిన్న చిన్న కారణాలు తోనే విపరీతమైన అహం అతిశయం తో వ్యవహరిస్తూ.. అందరికి అందరూ గిరిగీసుకుని బతకడానికి అలవాటు పడుతున్నారు..


          వయసు పెరిగే కొద్దీ ఓర్పు సహనం పెరగాల్సిన దగ్గర అసూయ ద్వేషాలు పెంచుకుంటున్నారు..

         నూటికి 90% కుటుంబాలలో పిల్లలు దూరంగానే వుంటున్నారు.. వీళ్లకు పెద్ధతనం.. ఒంటరి తనం.. అనారోగ్య సమస్యలు.. మనిషి తోడు అవసరం..

            అయినా కొద్దిపాటి కూడా సర్దుబాటు ధోరణితో వుండడం లేదు.. విపరీతమైన స్వార్థం పక్క వాడి నీడ కూడా సహించడం లేదు..

దగ్గరి వాళ్ళ మధ్య కూడా గొడవలు.. మాట్లాడుకోక పోవడం.. షరా మాములు అయిపోయింది...


 సినిమా లో రాసిన ఓ చక్కని డైలాగ్‌ గుర్తుకొస్తుంది........

‘"మనం బాగున్నప్పుడు లెక్కలు చూసుకుని... కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు" ,


వీలైతే మనం బాగున్నప్పుడు కూడా అందరితో కలిసి ఉండాలి మన వారికీ అవసరమైన సహాయం అందించాలి.

       చాలా కుటుంబాలలో ఇప్పటికే మనుషులు పలచబడ్డారు..

            వలసలు పుణ్యాన.. గత 60-70 సంవత్సరాలుగా అనుసరిస్తూ వచ్చిన ఫ్యామిలీ ప్లానింగ్ వల్ల ఇప్పటికే కుటుంబాల సైజ్ తగ్గిపోయింది.. 

        దానికి తోడు కేవలం కూడూ గుడ్డా కూడా పెట్టని ఈ అడ్డు గోడలు పర్యవసానం..

                బాధాకరమైన విషయం ఏంటంటే ఒక వేళ పిల్లలు కజిన్స్ మన రూట్స్ కాపాడుకుందాం అనుకున్నా..రిలేషన్స్ లో ఎమోషన్ వుంచుకుందాము అనుకున్నా మెజారిటీ కుటుంబాలలో పెద్ద వాళ్ళు దూరిపోయి అగాధం పెంచుతున్నారు..

           చిన్నప్పటి మా రోజులే బంగారపు రోజులు అనిపిస్తున్నాయి..

              నేడు పిల్లలకు అసలు కుటుంబ సంబంధాలు పరిచయం చేయడం ఇన్వాల్వ్ చేయడం ఎప్పుడైతే తగ్గిపోయిందో..

      రేపటి రోజున మన తరువాత మన పిల్లలకు మన అనే వారే లేని.. మిగలని పరిస్థితి సృష్టిస్తున్నాము..

        నీ ఇంటికి వస్తే ఏమి పెడతావు? నా ఇంటికి వస్తె ఏమి తెస్తావు అన్న భావన నుంచి కొద్దిపాటి అయినా మార్పు చెందాలి..

           అందరూ కొద్దిగా ఆలోచించండి.. మన కుటుంబాల్ని మనమే ఎడం చేసుకుంటూ.. మనలో మనమే దూరం పెంచుకుంటూ ఇంకా సమాజం నుంచి మనం ఏమి ఆశిస్తాము..

               ఎవ్వరికీ వారు గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి.. మన చిన్ననాడు మనం ఏమేమి పొందాము నేడు మన పిల్లలకు ఏమేమి దూరం చేస్తున్నాము? 

           ఇప్పటికే చాలా మంది పెద్దవారు వెళ్ళిపోయారు.. మనకి ఎంత టైం వుంటుందో తెలియదు..

           మనం సక్రమంగా ఆరోగ్యంగా వున్నప్పుడే కనీసం మన వాళ్ళ దగ్గర అయినా పనికిమాలిన అహం, అతిశయం, వదిలి వెద్ధాము....

🙏🙏🙏

శ్రీ విద్యారణ్య స్వామి జయంతి

☘️🍃☘️🍃☘️🍃☘️🍃☘️

*_ॐ 27/04/2023 - శ్రీ విద్యారణ్య స్వామి జయంతి 卐_*

~~~~~~~


హిందూ మత పునరుజ్జీవనానికి కృషి చేసిన మహానుభావులు విద్యారణ్యులు అవతరించిన  ఈ మహత్తర పర్వమునాడు ఆ మహనీయుని జీవిత విశేషాలు.


*శ్రీ విద్యారణ్యుల జననం..*


*బాల్యం…*


ఆయన కలిశకం 4397వ సంవత్సరం, శ్రీ దుర్ముఖినామ సంవత్సరం వైశాఖ శుద్ధ సప్తమి బుధవారం-పుష్యమీ నక్షత్రం ధనుర్లగ్నంలో 11-04-1296  జన్మించాడు. ఆయన చిన్ననాటి పేరు మాధవుడు.


*తండ్రే గురువు…*


మాధవునకు తండ్రే గురువు. ఆయన వద్ద తర్క శాస్తమ్రును క్షుణ్ణంగా అభ్యసించాడు. వేదాధ్యయనం, వ్యాకరణం, మీమాంశ శాస్త్రాలకు తండ్రే గురువుకాగా అతను అనతి కాలంలోనే వాటిని ఔపోసన పట్టాడు.


*శ్రీ శంకరానందుల వారి వద్ద శిష్యరికం…*


అత్యంత సుప్రసిద్ధులైన శ్రీ శంకరానందుల వారి వద్దకు విద్య నేర్చుకునేందుకై మాధవుడు వెళ్లగా దివ్యజ్ఞాన సంపన్నుడైన ఆ సద్గురువు వచ్చిన శిష్యుడు సామాన్యుడు కాడని, వేద, ధర్మరక్షణ కోసం అవతరించిన మహా యోగి అని గ్రహించాడు. సర్వ వేదాంత శాస్త్రాల రహస్యాన్ని మిక్కిలి వాత్సల్యంతో ఆయన మాధవునికి బోధించగా, సర్వవిద్యలను నేర్చిన మాధవుడు మాధవాచార్యుడై ఇంటికి వచ్చి గృహస్త జీవితాన్ని ఆరంభించాడు.


*పిలచి పీఠాధిపత్యము నొసగిన శృంగేరీ శంకర పీఠాధిపతులు..*


శ్రీశ్రీశ్రీ విద్యాతీర్థులవారు, మాధవాచార్యుల తపఃశక్తి, వేద వేదాంగాలలో సాధించిన అపూర్వ పాండిత్యము, మంత్ర శాస్త్రాలలో గల అఖండ ప్రజ్ఞా విశేషణములను గూర్చి తెలుసుకుని, ఆ ఉద్దండ పండితునికోసం కబురుపెట్టారు. దేశం ఆనాడు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించమని సూచిస్తూ, తన తదనంతరం పీఠాధిపత్యాన్ని వహించగల సమర్థుడు మాధవాచార్యుడేనని అభివర్ణించాడు. ఎంతో పాండిత్యం సంపాదించినా మాధవుడు ఏదో తెలియని అసంతృప్తి, లేమిని, లోటును ఎదుర్కొంటున్న అనుభూతిని పొందాడు. ఏదో తెలియనని తపన ధర్మరక్షణకై చేయాలని అతన్ని నిలువనీయకుంది.

ఆ సందర్భంలోనే శ్రీ శృంగేరీ పీఠాధిపతుల సాంగత్యం ఆయనకు లభించింది. ఫలితం యోగిగా, విద్వాంసునిగా పేరుగాంచిన మాధవాచార్యులు 1331 సంవత్సరంలో సన్యసించి శ్రీ విద్యారణ్య స్వామిగా అవతరించారు. ఆనాటి గురువుల కఠిన పరీక్షలను ఎదుర్కొని కఠొర నియమాలు ఆచరించినందున విద్యారణ్యుల దైవశక్తి వృద్ధియైనది. విద్యాశంకరులు రెండు సంవత్సరములు విద్యారణ్యులకు శిక్షణను ఇచ్చి దైవ సమాధిని పొందారు. ఆ తర్వాత పూర్తిగా మఠం బాధ్యతను స్వీకరించిన శ్రీ విద్యారణ్యులు 55 సంవత్సరములు ధర్మ పరిరక్షణ చేస్తూ,అనేక అద్భుత గ్రంథములు రచించారు.

మహమ్మదీయ దండయాత్రల వల్ల బలవుతూ బలవంత మతమార్పిడికి గురవుతున్న ఎందరినో మత మార్పిడికి గురికాకుండా హిందూ ధర్మ పునఃప్రతిష్ట చేసారు. తన దివ్య ఆధ్యాత్మిక శక్తితో ఎందరినో తరింపచేసారు.


*శ్రీ విద్యారణ్య దేశాటనం - శ్రీవ్యాస దర్శనం…*


శ్రీ విద్యారణ్యులు దేశ యాత్రకు బయలుదేరి నలుమూలలా హిందూ ధర్మ ప్రచారం చేసారు. కాశీకి వెళ్లి విశ్వనాధుని దర్శించారు. గంగానదిలో స్నానానికై మణికర్ణికా ఘాట్‌కువెళ్లగా ఆయనకు శ్రీ వ్యాస దర్శనం లభించింది. విద్యారణ్యులను రానున్న కాలంలో కర్నాటక దేశాన రాజ్యస్థాపన చేయమని, అక్కడ రాజ్యస్థాపన చేసి విజయనగర సామ్రాజ్యం 300 ఏళ్లు విలసిల్లగలదని వ్యాసుడు ఆశీర్వదించారు. బ్రహ్మానంద పరవశులై విద్యారణ్యులు వ్యాసుని పాదధూళిని స్వీకరించి, త్రివేణీ సంగమం, గయ, మధుర, అయోధ్య మొదలైనవి సందర్శించి తుంగభద్రానది వద్దకు వచ్చిరి.


*తుంగ భద్ర తీరంలో రాజపురుష ద్వయం*


ముస్లిం దండయాత్రల్లో బలవంతాన మతమార్పిడికి గురైన హరిహర రాయలు, బుక్కరాయలు వారు వారిని తన దివ్య బోధనల ద్వారా హిందు మతంలోకి చేర్చారు శ్రీ విద్యారణ్యులు. ఆయన ఆ పని చేయకుంటే 300 సంవత్సరాల తర్వాత తల్లికోట యుద్ధానంతరం కృష్ణానదినుంచి తుంగభద్ర వరకు ఒక్క హిందువు లేక యావన్మందీ ముస్లింలు అయిపోయేవారు అని చారిత్రక పరిశోదకుల ఉవాచ. అంతటి ఘోర విపత్తునుండి హిందూ మతాన్ని కాపాడిన అద్భుత యోగి పుంగవుడు శ్రీ విద్యారణ్యులు. వీర శివాజీ, శ్రీకృష్ణదేవరాయలు సమర్ధరామదాసువలె దైవాంశలు గలవారు విద్యారణ్యులు. విజయనగర సామ్రాజ్య ప్రతిష్టాపకులుగా వీరి కీర్తి ఆచంద్రార్కం నిలిచింది.


*విద్యారణ్యులు - విజయనగర సామ్రాజ్య ప్రతిష్ఠాపన*


విద్యారణ్యులు స్వయంగా మహాసంకల్పం చేసి వాస్తు పురుషుని ఆవాహన చేసి విజయనగర పునాది వేసేందుకై ముహుర్తం పెట్టారు. శ్రీ సామ్రాజ్యలక్ష్మి యంత్రస్థాపన చేసి, కచ్చితమైన సమయాన్ని ఘంటానాదం ద్వారా సూచిస్తానని ఆ సమయంలో ఖచ్చితంగా పునాదిరాయి పునాదిలో పడడానికి ఏర్పాటు చేసారు. కానీ వ్యాసభగవానుని ఆశీస్సులు నిజం చేసేటందుకో ఏమో 3,600 సంవత్సరాల పాటు నగరం సామ్రాజ్యం చెక్కుచెదరకుండా వుండేట్టు శ్రీ విద్యారణ్యులు పెట్టిన ముహుర్తానికి ముందే ఓ కాపాలికుని ఘంటరావం విని అదే గురువుగారి సూచనగా భావిస్తూ హరిహరరాయ సోదరులు పునాదివేసారు. మిక్కిలిగా తపస్సు చేసి శ్రీ విద్యారణ్యులు పెట్టిన శుభ ముహుర్తం వ్యర్ధమైంది.లగ్నం తప్పిన ముహుర్తాన్ని లెక్కగట్టి విద్యారణ్యులు నగర ఆయుర్ధాయాన్ని 2160 సంవత్సరాలుగా నిర్ణయించారు. తర్వాత ముహుర్త దోష కారణంగా ఆ నగరం శత్రువులచే ధ్వంసం గావింపబడుతుందని చెప్పారు. శ్రీ విద్యారణ్య కాలజ్ఞానం అని స్వామివారు రాసిన గ్రంథంలో ఈవిషయం పేర్కొననబడింది.


*సౌందర్యవంతం… విజయనగరం…*

*విద్యారణ్యుల తప్ఫః ఫలం. - విదేశీయుల ప్రశంస*


విజయనగర నిర్మాణానికి శ్రీ విద్యారణ్యులు స్వయంగా ఒక పథకంవేసారు. అభేద్యంగా ఉండే దుర్గ నిర్మాణానికి రచన చేసారు. 20 అడుగుల మందంతో, 30 అడుగుల ఎత్తు, 4 క్రోసుల పొడవుతో కోట నిర్మాణం చేసారు.

12 క్రోసుల నగరాన్ని అద్భుతంగా మలిచారు. విశాలమైన రాజమార్గాలు, రెండువైపులా రాజ పురుషులు ఇతర సిబ్బందికీ అందమైన భవనాలు, క్రీడాసరస్సులు, నడిబొడ్డున విరూపాక్ష ఆలయం, అద్భుత సౌందర్యంతో విద్యారణ్యులు తన వాస్తు ప్రావీణ్యాన్ని ఈ సామ్రాజ్య స్థాపనకు ధారపోసారంటే అతిశయోక్తి లేదు. పైనుంచి చూస్తే ఈ నగరం శ్రీచక్రం ఆకారంలో వుండడం ఒక ప్రత్యేకత. అందుకే దీన్ని ‘శ్రీవిద్యానగరం’ అని అంటారు.


శ్రీ విద్యారణ్యులు పెట్టిన శుభముహుర్తంలో అత్యంత వైభోవేపేతంగా నగర ప్రవేశం జరిగింది. ఆయన స్వయంగా సర్వ పుణ్య తీర్థముల జలాలతో బుక్కరాయలకు పట్ట్భాషేకం చేసారు. అయితే విరూపాక్షదేవుడే సామ్రాజ్యానికి చక్రవర్తిగా శాసనం చేసారు. ఈ పద్ధతే చివరి వరకు కొనసాగింది. శ్రీ విద్యారణ్యులు ముందు ముందు ఎవరెవరు విజయనగరాన్ని పాలిస్తారు? ఎవరు ఎంత కాలం పాలిస్తారు? పేర్లు, సంవత్సరాలతో సహా తాను రచించిన గ్రంథలో పేర్కొన్నారట.


*శ్రీ విద్యారణ్యుల రచనలు…*


తన సోదరులైన సాయనాచార్యులు, ఎందరో ఉద్దండ పండితుల సహకారంతో ‘వేదార్ధాన్ని’ వ్రాయడం చేసారు. హిందూ మత సముద్ధరణ లక్ష్యంగా ధర్మపాలకులు ఆచరించాల్సిన విషయాలు చెప్పడానికి ఆయన వేద భాష్యం ఓ మార్గం అని అభిప్రాయపడ్డారు.


హిందూ ధర్మ రక్షణకు తన రచనలు కూడా అతి ముఖ్యంగా దోహదపడగలవని ఆయన ఆశించారు. ఆదర్శ సమాజంగా నాటి సమాజాన్ని తీర్చిదిద్దేందుకు తన రచనలు తోడ్పడాలని ఆయన భావించారు. దీనికి ఆయన ప్రత్యేకంగా ‘ప్రాయశ్చిత సుధానిధి’ అనే గ్రంథ రచన చేసారు.


ద్వాదశ లక్ష్మణి అనే పూర్వ మీమాంస గ్రంథం, సంగీతసారం అనే సంగీత గ్రంథం, అద్వైత సిద్ధాంత గ్రంథం, పంచదశి మొదలైనవి వీరి ముఖ్య రచనలు.

గొప్ప రాజనీతి కోవిదుడుగా ధర్మసంస్థాపన సల్పిన మహాయోగిగా ఆయన చిరస్థాయిగా సంస్మరణనీయుడైనాడు. ధర్మ సంస్థాపనకు హిందూమత సంరక్షణకు కారకులైన ఇటువంటి మహానుభావులు నిత్య వందనీయులు. అందుకే మన కేలండర్‌లోని పండుగల పట్టికలో ఆ మహానుభావుని జయంతి కూడా నిలిచింది.


🚩 *_స్వస్తి_* 🚩

వైశాఖ పురాణం - 5 వ అధ్యాయము

వైశాఖ పురాణం - 5 వ అధ్యాయము🚩*_


🕉️🌷🕉️🌷🕉️🌷🕉️🌷


*వైశాఖమాస విశిష్టత*


🌹🪷🌹🪷🌹🪷🌹🪷


నారదుని మాటలను విని అంబరీష మహారాజు నారదునితో నిట్లనెను. వైశాఖ మాసము యితర మాసములకంటె తపోధర్మాదులకంటె అధికము ఉత్తమము అని చెప్పిన మాట నాకు సరిగ అర్థము కాలేదు. ఏ కారణము వలన వైశాఖము అన్నిటికంటె నుత్తమమైనదో వివరింపగోరుచున్ననని పలికెను. అప్పుడు నారదుడిట్లు సమాధానము నిచ్చెను.


మహారాజా! శ్రద్దగా వినుము. కల్పాంతకాలమున సృష్టి అంతమగు సమయమున దేవతలకును ప్రభువైన శేషశాయియగు శ్రీమహావిష్ణువు లోకములనన్నిటిని తన యుదరమున నిలుపుకొని ప్రళయకాల సముద్రమున శయనించియుండెను.జీవరూపమున అనేకత్వమునందిన తన మహిమను తనయందే ఉపసంహరించుకొని యుండెను. నిద్రాంతమున వేదములు శ్రీమహావిష్ణువును మేల్పొలిపినవి. దయానిధియగు శ్రీమన్నారాయణుడు శ్రుతి ప్రబోధమున మేల్కొని తన యుదరమందున్న సర్వజీవలోకములను రక్షింపనెంచెను. తన యుదరమున విలీనమైయున్న ప్రాణికోటికి తగిన కర్మ ఫలప్రాప్తికై సృష్టిని ప్రారంభింపవలయునను కోరిక కలుగగనే సర్వలోకాశ్రయమైన సువర్ణపద్మము ఆయన నాభి నుండి వెలువడెను. విరాట్ పురుషునకి చెందినవాడగు బ్రహ్మను పురుషనామముతో సృష్టించెను. వానితోబాటు పదునాలుగు భువనములను కూడ సృష్టించెను. భిన్నవిభిన్నములగు కర్మల నాశ్రయించిన వివిధ ప్రాణులను వారి కర్మ ఫలానుకూలములగు త్రిగుణములను, ప్రకృతిని మర్యాదలను రాజులను, వర్ణాశ్రమ విభాగములను, ధర్మ విధానమును సృజించెను. పరమేశ్వరుడగు శ్రీమన్నారాయణుడు తన యాజ్ఞారూపములుగా చతుర్వేదములను, తంత్రములను, సంహితలను, స్మృతులను, పురాణేతిహాసములను, ధర్మరక్షణకై సృష్టించెను. వీనిని ప్రవర్తింపజేయుటకై ఋషులను కూడ సృజించెను.


ఋషులు ఆచరించి ప్రచారము చేసిన వర్ణాశ్రమ ధర్మములను తమకు దగినట్లుగా ప్రజలాచరించుచు సర్వేశ్వరుడగు శ్రీమహావిష్ణువునకు సంతోషము కలుగునట్లుగా ప్రవర్తించుచుండిరి.


సర్వోత్తమములగు తమ తమ వర్ణాశ్రమ  ధర్మములనాచరించు ప్రజలను వారి ధర్మాసక్తిని, ధర్మాచరణమును తాను స్వయముగ చూడవలెనని భగవంతుడు తలచెను. అప్పుడీ విధముగ నాలోచించెను. తాను సృష్టించిన వర్షాకాలము వర్షముల వలన బాధలుండుటచే పీడితులగు ప్రజలు ధర్మాచరణము సరిగ చేయలేరు. అట్టివారిని చూచిన తనకు తృప్తి కలుగదు. సరికదా కోపము కూడ రావచ్చును. కావున వర్షాకాలమున ప్రజల ధర్మప్రవర్తనను పరిశీలించుట తగదు. శరత్కాలమున వారి కృషి వ్యవసాయము పూర్తి కాదు. కొందరు అప్పుడే పండినపండ్లను తినుచుందురు. నేత్ర వ్యాధులు చలి మున్నగువానిచే పీడింపబడుచుందురు. ఇట్టి పరిస్థితిలో వారి ధార్మిక ప్రవృత్తిని పరిశీలింప జూచుట యుచితముకాదు. వ్యగ్రులై యేకాగ్రతలేనివారిని చూచినచో నాకేమి సంతోషము కలుగును? హేమంత ఋతువున చలిమిక్కుటముగ నుండుటచే జనులు ప్రాతఃకాలమున లేచి సూర్యోదయమునకు ముందుగ లేచి స్నానాదికములను ముగించుకొనజాలరు చలిగాలికి చిక్కి ప్రాతఃకాలమున లేవనివారిని జూచినంతనే నాకు మిక్కిలి కోపము వచ్చును. నేను సృష్టించిన ప్రజలపై నాకు కోపము వచ్చిన వారికి శ్రేయస్కరముకాదు. శిశిరఋతువున ప్రజలను చూడబోయినచో నెట్లుండును? చలిమిక్కుటముగ నుండు ఆ కాలమున ప్రజలు సూర్యోదయమునకు ముందుగ లేవజాలరు. ఆ కాలమున తమకు కావలసిన ఆహారమును వండుకొనుటకును సోమరులై పండిన పండ్లను తినుచుందురు. అనగా సులభముగా లభ్యములగు ఆహారముల కిష్టపడుచుందురు. చలికి భయపడి స్నానమునే మానివేయు స్వభావము కలిగి యుందురు. స్నాన విముఖులైన వారు చేయకలిగిన సభక్తికమైన కర్మకలాప మెట్లుండును? ఈ విధముగ జూచినచో వర్షాకాలము నుండి శిశిరము వరకు నుండు కాలమున వివిధములైన ప్రాక్తనకర్మలకు లోబడిన ప్రకృతి వివశులైన ప్రజలనుండి భక్తి పూర్వక కర్మ ధర్మానుష్ఠానమును ఆశింపరాదు. వసంత కాలము స్నానదానములకు, యాగభోగములకు, బహువిధ ధర్మానుష్ఠానమునకును అనుకూలమైన కాలము మరియు ప్రాణధారులకు ఆవశ్యకములగు ఆహార పదార్థములు సులభముగ లభ్యములగును. సులభమైన యే వస్తువు చేతనైనను తృప్తినంద వచ్చును. ఈ విధముగనైనచో సర్వప్రాణిగతమైన జీవాత్మకును యేదో ఒక విధముగ నీటిని, పండ్లను దానము చేసిన సంతృప్తిని కలిగించి ఆ విధముగ సర్వవ్యాపినగు నాకును సంతృప్తిని కలిగించు నవకాశము ప్రజలకు సులభసాధ్యమై యుండును. కర్మిష్ఠులగు భక్తులెల్లప్పుడును కర్మపరాయణులై ధర్మవ్రతము నాచరింతురు. అది చేయలేనివారికి వసంతకాలము కర్మ ధర్మానుష్ఠానములకు తగినది. వసంతకలమున సర్వవస్తువులును సులభసాధ్యములగుటచే ధర్మకర్మల యనుష్ఠానము దాన ధర్మ భోగములకు యుక్తమైన కాలము. నిర్ధనులు, అంగవైకల్యము కలవారు, మహాత్ములు మున్నగు సర్వజనులకును, నీరు మొదలగు సర్వపదార్థములు సులభములగును. దానధర్మాదులకు ప్రజలు కష్టపడనక్కరలేదు. పత్రము, పుష్పము, ఫలము, జలము, శాకము, పుష్పమాల, తాంబూలము, చందనము, పాదప్రక్షాళనము వీనిని దానము చేయవచ్చును. దానము చేయునప్పుడు వినయము భక్తి మున్నగు గుణములుండ వలయును. దానము పుచ్చుకొను వ్యక్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువను భక్తి భావన ముఖ్యము. అట్టి భావనలననేవిలువకట్టరానంత పుణ్యము నిత్తును.


అని భక్తసులభుడు దయాశాలియనగు శ్రీమహావిష్ణువు ఆలోచించి శ్రీ మహాలక్ష్మితో కలసి లోక సంచారమునకై బయలుదేరెను. పుష్పఫలపూర్ణములగు అడవులను, పర్వతములను లతాతరువులను, జలపూర్ణములైన నిర్మలప్రవాహముకల నదులను, తుష్టి, పుష్టి కల ప్రజలను చూచును. ఉత్తమములగు మునులయాశ్రమములను, అందున్న ధర్మ కర్మానుష్ఠాన పరులగు మునులను, వనగ్రామ నగరవాసులై భక్తి యుక్తులైన జనులను, పవిత్రతను అందమును కలిగించు ముగ్గులు మున్నగువానితో నొప్పు యిండ్ల ముంగిళ్లను, ఫలపుష్పాదులతో వ్రతములనాచరించు భక్తులతో నిండి సందడిగనున్న తోటలను, శ్రీమహావిష్ణువు లక్ష్మీ సమెతుడై తిలకించును. భక్తియుక్తులై వినయాది గుణములతో వ్రతముల నాచరించు, యధాశక్తిగ దానధర్మములను చేయుచు అతిధి అభ్యాగతుల నాదరించు ధర్మాత్ములను పుణ్యాత్ములను, కర్మ పరాయణులను మహాత్ములను అందరిని జూచును. అభ్యాగతుడై, అతిధియై బహు రూపములతో వచ్చి ప్రజల ధర్మకర్మానుష్ఠానములలో పాలు పంచుకొనును. సంప్రీతుడై అఖండ పుణ్యమును, అఖండ భోగభాగ్యములను సర్వసంపదలను, తుదకు ముక్తిని స్వయముగ అడుగకనే వారి వారి భక్తియుక్తులకు దాన ధర్మములకు పూజాదికములకు సాఫల్యము నిచ్చి యనుగ్రహించును. దురాచారులు సోమరులు మున్నగువారైనను సత్కర్మల నాచరించి యధాశక్తిదాన ధర్మములను చేసినచో వారి పాపముల నశింపచేసి పుణ్యమును లేక సుఖములనిచ్చును. అట్లుకాక దుష్టులై సోమరులై నిర్లక్ష్యముగ నున్నచో నెంతతి వారినయినను యధోచితముగ శిక్షించును. కావున సోదర మానవులారా! మనమెట్టివారమైనను మన శక్తియెట్టిదైనను నిశ్చలమైన భక్తితో శ్రీమహావిష్ణువు నారాధించి యధాశక్తిగ దాన ధర్మముల నాచరించి శ్రీమహావిష్ణువు దయను పొందుట మన కర్తవ్యము. కావున చంచలమైన మనస్సును అదుపులో నుంచుకొని యధాశక్తిగ పూజ, దానధర్మములను, భక్తి వినయములతో శ్రద్దాసక్తులతో బలవంతముగనైన ఆచరించి శ్రీహరియనుగ్రహమునందుటకు ప్రయత్నించుట మన ముఖ్య కర్తవ్యము ధర్మము బాధ్యత.


ఇట్లు లోక సంచారము చేయు లక్ష్మీ సహితుడగు శ్రీమహావిష్ణువును స్తుతించుచు సిద్ధులు, చారణులు, గంధర్వులు, సర్వదేవతలు కూడ వెన్నంటి యుందురు. తమ తమ ధర్మములనాచరించుచు భక్తితో వినయముతో దాన ధర్మములను వ్రతములను చేయు, అన్ని వర్ణములవారిని, అన్ని ఆశ్రమములవారిని చూచినవారును సంప్రీతులై శ్రీమహాలక్ష్మీ సమేతుడై యింద్రాది సర్వదేవతా పరివేష్టితుడై, చైత్ర వైశాఖ జ్యేష్ఠాషాఢ మాసములయందు భూలోక సంచారము చేయుచు, శ్రద్దాసక్తులతో వ్రతములను పూజలను చేయుచు శక్త్యనుసారము దానధర్మములు చేయువారినందరిని యనుగ్రహించుచుందురు. కరికలను మించి వరముల నిత్తురు.


శ్రీహరి వైశాఖమున మత్తులై, ప్రమత్తులై వ్రతాచరణము దానధర్మాదికములు లేనివారిని, గమనించి వారిని రోగములు విచారములు మున్నగువానితో శిక్షించును. వైశాఖ మాసమున తననుగాని, పరమేశ్వరునిగాని, యితర దైవతములను సజ్జనులను పూజించినను, వీరందరి స్వరూపుడైన సర్వవ్యాపకుడైన తనను పూజించినట్లే తలచి సంతుష్టుడై వరములనిచ్చును. ఇతరమాసములయందు వ్రతాదికముల నాచరించితిమని తలచి వైశాఖవ్రతమును మానినవారిపై కోపించును. అనగా శ్రీమహావిష్ణువు వైశాఖం వ్రతము మానిన కర్మపరాయణులను గూడ శిక్షించును. వైశాఖ వ్రతము నాచరించిన పాపాత్ములనైనను రక్షించును. అనగా వైశాఖ వ్రతము శ్రీమహావిష్ణు ప్రీతికరమైన వ్రతము. ఈ వ్రతము నాచరించుటవలన శ్రీమహావిష్ణువు సర్వదేవతలు సంప్రీతులై వరముల నిత్తురు. సపరివారముగ వచ్చిన మహారాజును నగరము, గ్రామములు, వనములు, పర్వతములు, నదీ తీరములు మున్నగుచోట నివసించు జనులు దర్సించి యధాశక్తిగ తమకు తోచిన పత్రము, పుష్పము, ఫలము మున్నగు వానినిచ్చి మహాప్రభూ! తమయేలుబదిలో సుఖముగ నుంటిమి అనుగ్రహింపుమని ప్రార్థించినచో మహారాజు వారి పన్నులను తగ్గించుట, సౌకర్యములను కల్పించుట మున్నగు వానినెట్లు చేయునో అట్లే శ్రీమహావిష్ణు ప్రీతికరమైన వ్రతము నాచరించుచు సద్బ్రాహ్మణులను, అతిధులను, అభాగ్యతులను, దైవభావనతో ఉపచారములు చేసి యధాశక్తిగ దానధర్మముల నాచరించినచో శ్రీహరి సంతుష్తుడై కోరిన కోరికల నిచ్చి రక్షించును. పరివార దేవతలును శ్రీమహావిష్ణువు అనుగ్రహము నందిన వారికి తామును యధోచితముగ వరముల నిచ్చి రక్షింతురు. సపరివారముగ వచ్చిన మహారాజును దర్సింపక కానుకల నీయక యున్నచో మహారాజు కుపితుడై శిక్షించును. పరివారమును యధాశక్తిగ శిక్షింతురో అట్లే వైశాఖమాస వ్రత సమయమున వ్రతము నాచరించి యధాశక్తిగ నెట్లు స్తుతించి దాన ధర్మములు చేయని దురాచారులను శ్రీమహావిష్ణువు ఆయన పరివార దేవతలను యధోచితముగ నట్లు సిక్షింతురు. కావున సర్వ జనులును యధాశక్తిగ నెట్లు వైశాఖ వ్రతము నాచరించి యధాశక్తిగ దానధర్మముల నాచరించి దైవానుగ్రహము నందుట మేలు. ఇది గమనింపదగిన ముఖ్య విషయము. కావున వైశాఖమాసము ధర్మరక్షకుడగు శ్రీ మహావిష్ణువు ప్రజలను పరీక్షించు పరీక్షా కాలమని ప్రతి జీవియు గుర్తించి వ్రతమునాచరించి భగవదనుగ్రహము నంద ప్రయత్నింపవలయును. అందుచే వైసాఖమాసవ్రతము కార్తీక మాఘ మాసవ్రతములకన్న మరింత ఉత్తమము అయినది. అని నారద మహర్షి అంబరీష మహారాజునకు  వైశాఖ మాస విశిష్టతను వివరించెను.


            🌷 *సేకరణ*🌷

      🌹🌷🪷🪷🌷🌹

          *న్యాయపతి*

      *నరసింహా రావు*


వైశాఖ పురాణం - 6 వ అధ్యాయము🚩*_


🕉🌷🕉️🌹🕉️🌷🕉️🌹


_*జలదాన మహత్మ్యము - గృహగోధికా కథ*_


🌹🌷🌹🌷🌹🌷🌹🌷


నారదుని మాటలను వినిన అంబరీష మహారాజు నారదునకు నమస్కరించి మహర్షీ ! వైశాఖమాస విశిష్టతను వివరించిన మీకు కృతజ్ఞుడను. వైశాఖమాస విశిష్టతను మరింతగా వివరింపగోరుచున్నానని ప్రార్తించెను. అప్పుడు నారదమహర్షి యిట్లనెను. మహారాజా !  వినుము మాసవ్రతములన్నిటిలో నుత్తమమగు వైశాఖమాసమున మార్గాయాసమున దప్పిక పడిన వారికి నీటినీయనివారు పశు పక్ష్యాది జన్మముల నందుదురు. ఈ విషయమున ఒక బ్రాహ్మణునకు పూర్వము జరిగిన సంవాదమును వినుము. ఈ కథ మిక్కిలి ఆశ్చర్యమును కలిగించును. ఈ కథ వైశాఖమాస దాన మహిమకు తార్కాణమైన ఉదాహరణ.


పూర్వము ఇక్ష్వాకురాజ వంశమున హేమాంగుడను రాజు కలడు. అతడు గోదానముల ననేకములగావించెను. భూమియందు రేణువులను లెక్కించుట , నీటిబొట్టులను గణించుట , ఆకాశామునందలి నక్షత్రములిన్నియని లెక్కించుట యెంత కష్టమో ఆ రాజు చేసిన గోదానములను లెక్కించుట అంత కష్టము. అనేక యజ్ఞములను చేసెను. గోదానము , భూదానము , తిలదానము మున్నగు దానములను గూడ లెక్కింపరాని అంత సంఖ్యలో చేసి చాలామంది బ్రాహ్మణులను సంతోషపరచెను. అతడు చేయని దానమే లేదని ప్రసిద్దినందెను. అందరకు సులభముగ దొరుకునది జలము. అది దైవదత్తము సులభము. అట్టి జలమును దానమిచ్చుటయేమని తలచి జల దానమును మాత్రము చేయలేదు. బ్రహ్మపుత్రుడగు వశిష్ఠుడు ఆ మహారాజునగు గురువు పురోహితుడు. అతడును జలదానము చేయుమని పెక్కుమార్లు ఆ రాజునకు చెప్పెను. నీరు అమూల్యమైనది అట్టిదానిని దానమిచ్చినచో విలువైన ఫలితమేమి వచ్చును. ఎవరికిని సులభము కాని దానిని దానమిచ్చిన పుణ్యము కలుగునని అట్టి వస్తువులను దానమిచ్చెను. అట్లే యెవరును గౌరవింపని వారిని ఆదరించుటయే యుక్తమని తలచి అంగవైకల్యము కల బ్రాహ్మణులను , దరిద్రులను , ఆచారహీనులను ఆదరించి గౌరవించెను. ఆచారవంతులను , పండితులను , సద్బ్రాహ్మణులను ఆదరింప లేదు గౌరవింపలేదు. అందరును ప్రసిద్దులను , ఉత్తములను మాత్రమే గౌరవించినచో అనాధులు , విద్యాహీనులు అయిన బ్రాహ్మణులకు , దరిద్రులకు ఆదరణ చేయు వారెవ్వరు ? నేను అట్టివారినే గౌరవింతునని అట్టివారిని మాత్రమే గౌరవించెను ఆదరించెను. ఈ విధముగ అపాత్రులకు మాత్రమే దానముల నిచ్చెను.


ఇట్టి దోషముచే నా రాజు యొకప్పుడును జలదానము చేయకపోవుట వలన చాతక పక్షిగా ముమ్మారు జన్మించెను. ఒక జన్మలో గ్రద్దగను , కుక్కగ నేడుమార్లు జన్మించెను. అటు పిమ్మట మిధిలాదేశమును పాలించు శ్రుతకీర్తి మహారజు గృహమున గోడపైనుండు బల్లిగా జన్మించెను. అచట వ్రాలు కీటకములను భక్షించుచు బల్లియై హేమాంగద మహారాజు జీవనము గడుపుచుండెను. ఈ విధముగ ఎనుబదియేడు సంవత్సరముల కాలముండెను.


మిధిలాదేశ రాజగృహమునకు శ్రుతదేవమహాముని ప్రయాణముచే అలసిపోయి మధ్యాహ్నకాలమున వచ్చెను. మహారాజు అగు శ్రుతకీర్తి ఆ మునిని జూచి సంభ్రమముతో ఆ మునికి యెదురు వెళ్ళి సగౌరవముగ ఇంటిలోనికి దీసికోవచ్చెను. వానిని మధుపర్కము మున్నగువానితో పూజించి వాని పాదములను కడిగి యా నీటిని తన తలపై జల్లుకొనెను. అట్లు జల్లుకొనుటలో తలపై జల్లుకొన్న నీటి తుంపురులు కొన్ని యెగిరి గోడమీదనున్న బల్లిపై దైవికముగా పడినవి. ఆ పవిత్ర జలస్పర్శ కలుగగనే ఆ బల్లికి పూర్వజన్మస్మృతి కలిగి తన దోషమును తెలిసికొని పశ్చాత్తాపము కలిగెను. నన్ను రక్షింపుము నన్ను రక్షింపుమని మానవునివలె ఆ మునిని ప్రార్థించెను. అప్పుడా ముని బల్లి మాటలకు విస్మయపడి ఓ బల్లీ ! నీవెందులకిట్లు దుఃఖించుచున్నావు. నీవు యేపని చేసి యిట్టి దశనందితివి ? ఇట్లేల అరచుచున్నావు ? నీవు దేవజాతివాడవా , రాజువా , బ్రాహ్మణుడవా ? నీవెవరవు ? నీకీదశయేల వచ్చెనో చెప్పుము. నేను నీకు సాయపడుదునని ప్రశ్నించెను.


శ్రుతదేవుని మాటలను విన్న బల్లిరూపమున నున్న హేమాంగదమహారాజు మహాత్మా ! నేను ఇక్ష్వాకు కులమున జన్మించిన హేమాంగదుడను ప్రభువును. వేదశాస్త్ర విశారదుడను. భూమియందలి రేణువులెన్ని యుందునో , నీటియందు జలబిందువు లెన్నియుండునో , ఆకాశమున నెన్ని నక్షత్రములుండునో అన్ని గోవులను అసంఖ్యాకముగ దానమిచ్చితిని. అన్ని యజ్ఞములను చేసితిని. చెరువులు మున్నగువానిని త్రవ్వించితిని. సర్వవిధములగు దానములను చేసితిని. చెరువులు మున్నగువానిని త్రవ్వించితిని. సర్వవిధములగు దానములను చేసితిని. ధర్మముగా రాజ్యమును పాలించితిని. నేనెన్ని సత్కర్మల నాచరించినను , ముమ్మారు చాతక పక్షిగను , గ్రద్దగను , యేడుమార్లు కుక్కగను , ప్రస్తుతము బల్లిగను జన్మించితిని. ఈ మహారాజు నీ పాదములను కడిగిన పవిత్ర జలమును తనపై జల్లుకొనుచుండగా కొన్ని నీటితుంపురలు నా పైబడి నాకు పూర్వజన్మ స్మరణము కలిగినది. నా పాపభారము తగ్గినట్లనిపించుచున్నది. కాని నేనింకను ఇరువది యేడుమార్లు బల్లిగా జన్మించవలసి యున్నట్లుగ నాకు తోచుచున్నది. నాకీవిధమైన బల్లిగా జన్మపరంపరయెట్లు తొలగునాయని భయము కలుగుచున్నది. నేను చేసిన పాపమేమియో నాకీ జన్మయేల కల్గెనో యెరుగజాలను. దయయుంచి నాకీ జన్మలు కలుగుటకు కారణము అయిన పాపమును ఆపాపము పోవు విధానమును చెప్పగోరుచున్నానని ప్రార్థించెను.


శ్రుతదేవమహాముని హేమాంగదుని మాటలను తన దివ్యదృష్టితో పరిశీలించి యిట్లనెను. రాజా ! నీవు శ్రీమహావిష్ణువునకు ప్రియమైన వైశాఖమాసమున జలమునెవనికిని దానమీయలేదు. జలము సర్వజన సులభము. దానిని దానమిచ్చుట యేమి అని తలచితివి. ప్రయాణమున అలసినవారికిని జలదానమైనను చేయలేదు. వైశాఖమాస వ్రతమును గూడ పాటింపలేదు. హోమము చేయదలచినవారు మంత్రపూతమగు అగ్నియందే హోమము చేయవలయును. అట్లుగాక బూడిద మున్నగువాని యందు హోమము చేసిన ఫలమెట్లు కలుగును ? అట్లే నీవును యోగ్యులగువారికి దానమీయక అయోగ్యులగువారికి దానముల నిచ్చితివి. అపాత్రులకెన్ని దానము లిచ్చినను ప్రయోజనము లేదు కదా ! వైశాఖమాస వ్రతమును చేయలేదు. జలదానమును చేయలేదు. యెంతయేపుగ పెరిగినను , సుగంధాదిగుణములున్నను ముండ్లుకల వృక్షము నెవరాదరింతురు ? అట్టి వృక్షము వలన ప్రయోజనమేమి ? వృక్షములలో రావిచెట్టు ప్రశస్తమైనది. అందువలన అది పూజార్హమైనది. తులసియు మిక్కిలి పవిత్రమైనదే. ఇట్టి రావిచెట్టును , తులసిని వదలి వాకుడు చెట్టునెవరైన పూజింతురా ? అట్టి పూజలవలన ఫలితముండునా ? అనాధలు , అంగవైకల్యము కలవారు దయజూపదగినవారు. వారిపై దయను చూపుట ధర్మము. కాని వారు మాన్యులు పూజ్యులు కారు. అట్టివారిని పూజించుట ఫల దాయకము కాదు. వారిపై దయ , జాలి చూపవచ్చును. కాని గౌరవింపరాదు. తపము , జ్ఞ్ఞానము , వేదశాస్త్ర పాండిత్యము, సజ్జనత్వము కలవారు శ్రీమహావిష్ణు స్వరూపులు. అట్టివారినే పూజింపవలయును. వీరిలో జ్ఞానవంతులు శ్రీమహావిష్ణువునకు మిక్కిలి ఇష్టమైనవారు. అట్టివారిని పూజించినచో తనను పూజించినట్లుగ భావించి శ్రీహరి వరములనిచ్చును. కావున జ్ఞానులైనవారు సర్వాధికులు , సర్వోన్నతులు అట్టివారిని గౌరవింపక పోవుట వారిని అనగా శ్రీమహావిష్ణువును అవమానించుటయే యగును. ఈ విధముగ చేయుట ఇహలోకమున పరలోకమున దుఃఖమును కలిగించును. మానవుడు పురుషార్థములను సాధింపవలెనన్నచో జ్ఞానుల సేవ , వారిని గౌరవించుట ముఖ్య కారణము. జ్ఞానులు కానివారు , అంధులు - ప్రజ్ఞాజ్ఞాన నేత్రములు లేనివారు. అట్టి అంధుల నెంతమందిని పూజించినను ఫల్ముండునా ? గ్రుడ్డివానికేమి కనిపించును ? అతడేమి చెప్పగలడు ? కావున జ్ఞానహీనులైన వారి నెంతమందిని యెంత పూజించినను , వారిని సేవించినను అవి నిష్ఫలములు , నిష్ప్రయోజనములు. అంతేకాక కష్టములను , దుఃఖములను కలిగించును. పురుషార్థములగు ధర్మార్థ కామ మోక్షములెట్లు సిద్దించును ?


తీర్థములు కేవలం జలములు కావు. దేవతలు శిలారూపులు కారు. చిరకాలము తీర్థస్నానము , సేవ చేసినచో శిలారూపముననున్న దైవమును చిరకాలము పూజించినచో వారియనుగ్రహము కలుగును. కాని జ్ఞానులగు సజ్జనులను దర్శించినంతనే వారు ప్రసన్నులగుదురు. ఇష్టఫలప్రాప్తిని కలిగింతురు. కావున జ్ఞానులగు వారిని సేవించినచో వారి ఉపదేశములను పాటించినచో విషాదముండదు. ఇష్టప్రాప్తిచే సంతోషము కలుగును. అమృతమును సేవించినచో జన్మ , మృత్యువు , ముసలితనము మున్నగువానిని వలని బాధయుండదు. అమృతత్వసిద్ది కలుగును. హేమాంగద మహారాజా ! నీవు వైశాఖమాస వ్రతము నాచరింపలేదు. జలదానము చేయలేదు. జ్ఞానులగువారిని సేవింపలేదు. కావున నీకిట్టి దుర్గతి కలిగినది. నీకు ఈ వైశాఖమాస వ్రతము నాచరించి నేను సంపాదించిన పుణ్యమును కొంత నీకిత్తును. దీని వలన దుర్దశ శాంతించుటకై భవిష్యద్వర్తమాన కాలములలోని నీ పాపములను వాని ఫలములను పోగొట్టుకొని విజయము నందగలవు. అని పలికి శ్రుతదేవ మహాముని నీటిని స్పృశించి బల్లి రూపముననున్న హేమాంగద మహారాజునకు తాను చేసిన వైశాఖమాస వ్రతములోని కొన్ని దినముల పుణ్యమును ధారపోసెను.


ఆ పుణ్యఫలమును పొందినంతనే హేమాంగద మహారాజు బల్లి రూపమును విడిచి దివ్యరూపమును పొందెను. శ్రుతకీర్తి మహారాజునకు , శ్రుతదేవమహామునికి నమస్కరించెను. వారి యనుజ్ఞతో శ్రీహరి పంపిన దివ్య విమానము నెక్కి పుణ్యలోకములకు పోయెను. దేవతలందరును హేమాంగదుని అదృష్టమును మెచ్చిరి. హేమాంగదుడును పుణ్యలోకమున పదివేల సంవత్సరములుండెను. దివ్యలోక భోగములను అనుభవించెను. అటు పిమ్మట ఇక్ష్వాకు కులమున కాకుత్స్థ మహారాజుగ జన్మించెను. ఏడు ద్వీపముల భూమిని సజ్జనులు , జ్ఞానులు మెచ్చునట్లు పరిపాలించెను. శ్రీమహావిష్ణువు అంశను పొంది ఇంద్రునికి స్నేహితుడై యుండెను. కులగురువగు వశిష్ఠ మహాముని ఉపదేశమును పాటించెను. వైశాఖమాస వ్రతమును సంపూర్ణముగ ఆచరించెను. అందు చేయవలసిన దానధర్మముల నన్నిటిని శ్రద్దాసక్తులతో భక్తి పూర్వకముగ చేసెను. సర్వపాపములను పోగొట్టుకొనెను. దివ్యజ్ఞానము నందెను. శ్రీమహావిష్ణువు సాయుజ్యము నందెను. కావున వైశాఖమాస వ్రతము సర్వపాపహరము. అనంత పుణ్యప్రదము. ప్రతి మానవుడును వైశాఖమాసవ్రతమును , వ్రతాంగములగు దాన ధర్మాదులను పాటించి శ్రీహరియనుగ్రహము నందవలెను. అని నారదుడు అంబరీషునకు వైశాఖమాసవ్రత విశిష్టతను వివరించుచు గృహగోధికావృత్తాంతమును వివరించెను.


           🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷


🙏🌷🙏🌹🙏🌷🙏🌷

ధర్నాన్ని ఆచరించాలి

 .

            _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లోకం𝕝𝕝


*ధర్మం సమాచరేత్పూర్వం* 

*తతోऽర్థం ధర్మసంయుతమ్।*    

*తతః కామం చరేత్పశ్చాత్స*

*సిద్ధార్థః స హి తత్పరమ్॥*


తా𝕝𝕝

*మొదట ధర్నాన్ని ఆచరించాలి....తరువాత ధర్మయుక్తమైన అర్థాన్ని సంపాదించాలి....తరువాత రెండింటికి ఆనుకూల్యతను సంపాదించుకొని కామభోగాలు అనుభవించాలి*...... *అప్పుడు ఆ వ్యక్తి త్రివర్గ సంగ్రహంతో సఫలుడు అవుతాడు*".....

సిరిసంపదలు

 🎻🌹🙏 మంచి కిటుకులు..!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌹🙏ప్రతిరోజు ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు పనులయందు ఆటంకం కలగకుండా ఉండాలంటే....🌹🙏


🌷ఆదివారం🌷.


ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు...

తమలపాకు నమలడం లేదా

ఆకులు జేబులో ఉంచుకోవడం చేస్తే..

అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి.



🌷సోమవారం🌷.


సోమవారం మీ ముఖాన్ని అద్దంలో ఒకసారి చూసుకుని ఇంట్లో నుండి బయటకు రావాలి. 

వీలైతే కోడి గుడ్డు ఆకారంలో ఉండే అద్దాన్ని 

ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర అమర్చుకోవాలి.



🌷మంగళవారం🌷.


హనుమంతుడికి ఇష్టమైన మంగళవారం 

ఉదయం స్నానం చేసి, 

హనుమాన్ చాలీసా పఠించాలి. 

అలాగే ఉదయాన్నే ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు నోరు తీపి చేసుకోవాలి. 

బెల్లం తింటే మరీ మంచిది.



🌷బుధవారం🌷.


బుధవారం బయటకు వెళ్లేప్పుడు పుదీనా లేదా కరివేపాకు ఆకులు నోట్లో వేసుకోవాలి. 

ప్రతి బుధవారం ఇలా చేస్తే ఆరోగ్యంగానూ..

చాలా ప్రయోజనం ఉంటుంది.



🌷గురువారం🌷.


గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు కొద్దిగా జీలకర లేదా ఆవాలు నోట్లో వేసుకోవడం మంచిది. 

వాటిని నమల కుండా అలానే నోట్లో ఉంచుకోవాలి. గుమ్మం దాటి బయటకు వెళ్లే వరకూ అలాగే ఉంచాలి.



🌷శుక్రవారం🌷.


ముఖ్యమైన పనిమీద శుక్రవారం వెళ్లాల్సి వస్తే 

పెరుగు తిని బయలుదేరాలని హిందూ ధర్మశాస్త్రం చెబుతోంది. 

అలాగే ప్రతి శుక్రవారం కనీసం రెండు టేబుల్ స్పూన్ల పెరుగు ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు తీసుకోవాలి.



🌷శనివారం🌷.


అల్లంతో కలిగే ప్రయోజనాలు అందరికీ తెలుసు. 

ప్రతి శనివారం కొద్దిగా అలం తురుము నేతితో కలిపి తీసుకోవాలి. 

ఇలా చేయడం వల్ల సిరిసంపదలు మీ దరిచేరతాయి....సేకరణ..స్వస్తి..🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸