లక్షణాలని బట్టి మన శరీరతత్వం తెలుసుకునే ప్రాచీన వైద్య విధానం -
* శరీరపు లక్షణం -
వాతరోగి శరీరం నల్లగా ఉండును. పైత్యరోగి శరీరం పచ్చగా కాని , ఎర్రగాకాని ఉండును. శ్లేష్మరోగి శరీరం తెల్లగా ఉండును. ఏవైనా రెండురకాల తత్వాలు కలిగినటువంటి వారియొక్క శరీరం మిశ్రమ వర్ణంగా ఉండును.సన్నిపాత రోగి ( Typhoid ) శరీరం పాలిపోయినట్లు ఉండును.
* శబ్ద లక్షణం - (నాడి లక్షణం ).
వాత నాడి కలిగినవాడు నెమ్మదిగా మాట్లాడును . పైత్యనాడి కలిగినవాడు నవ్వుచూ
తుళ్ళుతూ ఉండును. శ్లేష్మ నాడి కలిగినవాడు సన్నటి , వినివినపడనట్టు గా మాట్లాడును .
* నేత్ర లక్షణం -
వాతరోగి కనులు నల్లగా కాని మబ్బుగా ఉండి నీరు కారుచుండును. పైత్యరోగి కన్నులు పచ్చగా కాని ఎర్రగా కాని ఉండును. శ్లేష్మరోగి కనులు పుసిగట్టి తెల్లగా ఉండును. సన్నిపాత రోగి కనులు పచ్చగా కాని ఎర్రగా కాని ఉండును. కామెర్ల రోగి కనులు పచ్చగా ఉండును.
* మల లక్షణం -
వాతరోగి మలము నల్లగా గట్టిగా మేక పెంటికలు వలే ఉండును. పైత్య రోగి మలము పచ్చగా కాని , ఎర్రగా కాని ఉండును. శ్లేష్మరోగి మలము తెల్లగా , బంకగా నురుగు కట్టి ఉండును. రెండురకాల తత్వాలు కలిసి ఉన్న రోగి మలము మిశ్రమ వర్ణంగా ఉండును.
* ముత్ర లక్షణం -
వాతరోగి మూత్రం తెల్లగా ఉండును. పైత్యరోగి మూత్రం కొంచం ఎరుపుగా ఉండును. కామెర్ల రోగి మూత్రం పచ్చగా ఉండును. శ్లేష్మరోగి
మూత్రం తెల్లగా నురుగు కట్టి ఉండును. రెండురకాల తత్వాలు పెరుగుట వలన రోగం కలిగిన రోగి మూత్రం మిశ్రమంగా ఉండును.
ఉదయాన్నే నిదుర లేచిన వెంటనే వెడల్పాటి తెల్లని పాత్రలో రోగి మూత్రమును పట్టి అందు నూనెచుక్క వేసిన అది వేగముగా మూత్రం అంతా పాకిన వాతరోగం అనియు , మూత్రం రక్తవర్ణంతో ఉండి మూత్రం వేచిన కదలక ఉండిన పైత్యరోగం అనియు , నూనెవేసిన వెంటనే ఆ నూనె చుక్క యందు బుడగలు లేచి మూత్రం పచ్చగా ఉండిన శ్లేష్మరోగం అనియు , మూత్రంలో వేసిన నూనె చుక్క తెల్లటి నురుగు కట్టిన సన్నిపాతరోగి అనియు , నూనె చుక్క వేసిన వెంటనే ఆ నూనె చుక్క ఏనుగు ఆకారంలో రావడం లేదా మనిషి ఆకారం వలేగాని తమలపాకు ఆకారం రావటం కాని లేక వేసిన వెంటనే మునిగిపోవడం గాని జరగడం లేదా మూత్రం నల్లగానో , ఎర్రగానో , పచ్చగానో ఉండిన ఆ రోగి యొక్క రోగం నయంచేయుట అసాధ్యం .
నూనెబొట్టు పద్మాకారం గాని , శంఖచక్రాకారం గాని , వీణ ఆకారంగాని , సింహాసన ఆకారం కాని మల్లెమొగ్గ వలే ఉండిన ఆ రోగి యొక్క రోగం నయం చేయుటకు సాధ్యం అగును.
* నాలిక యొక్క లక్షణం -
నాలిక పగిలి పైన పోర పచ్చగా ఉండిన వాతరోగం అనియు నాలిక పైన ద్రవం కలిగి తెల్లగా ఉండిన శ్లేష్మరోగి అనియు నాలిక పైపొర రేగి నల్లగా ఉండి అసలు తడి లేకుండా ఉన్నచో సన్నిపాత రోగి అనియు మిశ్రమవర్ణం కలిగి ఉన్న రెండురకాల తత్వాలు ప్రకోపించుట వలన కలిగిన లక్షణం అని తెలుసుకొని చికిత్స చేయవలెను .
పైన చెప్పిన లక్షణములు అన్నియు గమనించవలెను. ఒక్క నాడిని పట్టుకొని మాత్రమే రోగ నిర్థారణ చేయడమే కాకుండా రోగి యొక్క లక్షణాన్ని బట్టి వైద్యం చేయడం ప్రతి వైద్యుడు నేర్చుకోవలసిన ప్రధమ లక్షణం . నేను మీకు వివరించిన ప్రతిలక్షణాన్ని జాగ్రత్తగా పరిశీలించి గుర్తుపెట్టుకొన్న యెడల సమస్య ఉత్పన్నం కాకుండా మునుపే తగినజాగ్రత్తలు తీసుకొనచ్చు.
క్రిముల ( WORMS ) గురించి సంపూర్ణ వివరణ -
క్రిములు అనేవి అజీర్ణవ్యాధి వలన కలుగును. పాశ్చాత్య వైద్యులు ఆయుర్వేద శాస్త్రము నందు క్రిముల విషయము క్రిముల గురించి ఎక్కడా ఇవ్వలేదు , చెప్పబడలేదు అని , క్రిములకు ప్రాధాన్యత ఇవ్వబడి ఉండలేదని పొరపాటు అభిప్రాయముతో ఉన్నారు . ఆయుర్వేదం నందు క్రిమివ్యాధులకు కూడా అవసరం ఉన్నంత వరకు ప్రాముఖ్యత ఇవ్వబడినది. ఇప్పుడు మీకు ఆయుర్వేదం నందు క్రిముల గురించి ఏమి చెప్పారో మీకు సంపూర్ణముగా వివరిస్తాను. ఇదే విషయము పైన అంతకు ముందు నేను మీకు ఒక పోస్టులో కొంత వివరించాను. ఇప్పుడు మరిన్ని విషయాలు వివరిస్తాను.
ఆయుర్వేదం నందు క్రిములను రెండురకాలుగా విభజించారు. అవి
1 - బాహ్యక్రిములు .
2 - అభ్యంతరములు .
త్వక్కులు మొదలగువాని యందు , స్వేదము మున్నగు బాహ్యమలముల యందు శ్లేష్మము , రక్తము , పురీషములను అభ్యంతర మలముల యందు నాలుగు రకములుగా క్రిములు జనించుచున్నవి.
ముందుగా మీకు బాహ్యక్రిమి లక్షణం వివరిస్తాను. ఈ బాహ్యక్రిములు 20 రకములు కలవు. ఇవి నువ్వులంత పరిమాణమున ఆకారము కలిగి ఆరంగుతో వస్త్రములను ఆశ్రయించి ఉండును. వీటిని నల్లులు అని పిలుస్తారు . జుట్టులో ఉండు యూక , ఈళ్ళు అని రెండు రకములు ఉండును . వాటిలో మరలా అనేక భేదములు ఉండును. ఎర్రటి మచ్చలు , బొబ్బలు , దురదలను , కంతులను కలిగించును. వీటికి బాహ్యక్రిములు అని పిలుస్తారు .
ముందుగా అసలు ఈ క్రిమిసంబంధ వ్యాధులు రావడానికి గల కారణం తెలుసుకుందాము . ఎవరైతే మొదట భుజించిన ఆహారం జీర్ణము కాకుండా మరలా భుజిస్తారో , ఎల్లప్పుడు మధురపదార్ధములను ఎక్కువుగా తీసుకుంటారో , ద్రవపదార్ధముల సేవన మీద మిక్కిలి ప్రేమ కలిగి ఉందురో , బెల్లము కలిసిన తిండి అధికముగా తినుదురో , కసరత్తు చేయనివాడు , పగలు నిద్రించువారు , పరస్పర విరుద్ద ఆహారములను భుజించువారు ఈ క్రిమివ్యాధులకు లోనగుదురు.
మినపపిండి , ఆమ్ల లవణ రసములు గల ద్రవ్యములు , బెల్లము , కూరగాయలు అధికముగా తినువానికి పురీషము నందు క్రిములు పుట్టును .
మాంసము , మత్స్యము , బెల్లము , పాలు , పెరుగు , పులిసిన ( తరువాణి ) వస్తువులు నిత్యము సేవించువానికి కఫము నందు క్రిములు పుట్టును .
అజీర్ణకరమైన శాకములు , విరుద్ద ఆహారములు తీసుకొనుటచేత రక్తము నందు క్రిమిదోషాలు కలుగును .
క్రిముల మన శరీరం నందు ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేక లక్షణాలు కలుగును. మనం ఆ లక్షణాలని గుర్తించి దోషములకు చికిత్స చేయవలెను . ఇప్పుడు మీకు వాటి గురించి వివరిస్తాను .
జ్వరము , శరీరం రంగు మారు ట , శూల , హృదయము నందు జబ్బు , శరీరాకృశత్వము , భ్రమ , అన్నద్వేషము , అతిసారం అనునవి ఉండువానికి శరీరము నందు క్రిమి ఉన్నదని తెలుసుకొనవలెను .
ఇప్పుడు కఫజ క్రిమి గురించి వివరిస్తాను. కఫము చేత ఆమాశయము నందు క్రిములు పుట్టును . అవి వృద్ది నొంది శరీరము నందు పైభాగము నందును క్రింద భాగము నందును కూడా తిరుగుచుండును . వీటిలో కొన్ని లావుగా , పొడవుగా ఫిడేలు చర్మపు తీగవలే ఉండును. ఇవి ఆమాశయము నందు , చుట్టుపక్కల ఆశయముల యందు పొరను అంటిపెట్టుకుని ఉండును. కొన్ని ఎర్రల వలే ఉండును. మరికొన్ని సమముగా పొడవుగా ఉండును. కొన్ని సూక్ష్మాకారముగా ఉండును. మరికొన్ని శ్వేత రక్తవర్ణముగా ఉండును.
కఫజక్రిములు 7 రకాలుగా ఉండును. అవి
* ఆంత్రాదములు -
ఇవి శరీరం నందలి ప్రేగులను తినుచుండును.
* ఉదరావేష్టములు -
ఇవి కడుపున చుట్టుకుని ఉండును.
* హృదయాదములు -
ఇవి హృదయము నందు తిరుగుచుండును.
* మహాగుదములు -
ఇవి వెడల్పైన గుదములు కల్గి ఉండును.
* భుఱువులు .
* దర్భ కుసుమములు -
ఇవి రెల్లు పువ్వుల వలే ఉండును.
* సుగంధములు -
ఇవి సుగంధము కలిగి ఉండును.
కఫజ క్రిముల వలన హృదయము నందు అదురుట , నోట నీరుకారుట , ఆహారం జీర్ణం కాకుండా ఉండుట , అరుచి , మూర్చ , వాంతి , జ్వరము , కడుపుబ్బరం , కృశించుట , తుమ్ములు , పీనస వంటి సమస్యలు కలుగును.
రక్తజ క్రిమి లక్షణము -
రక్తమున జనించిన క్రిములు మిక్కిలి సూక్ష్మమైన ఆకారము కలిగి ఉండును. పాదము పొడవు , గుండ్రమైన ఆకారం కలిగి ఉండును. ఎరుపు రంగు కలిగి రక్తం ప్రవహించు సిరలు యందు ఉండును. వాటిలో చాలా వరకు సూక్ష్మ ఆకారం కలిగి ఉండటం వలన కంటికి కనిపించవు.
ఈ రక్తజ క్రిమి మొత్తం 6 రకాలుగా ఉండును. అవి
* కేశాదములు -
ఇవి తల వెంట్రుకలను నశింపచేయును .
* రోమ విధ్వంసకములు -
ఇవి శరీరం పైన రోమములను రాలిపోవునట్లు చేయును .
* రోమద్వికములు -
ఇవి రోమకూపములను ఆశ్రయించి ఉండును .
* ఉదుంబరములు
* సౌరసములు .
* మాతలు .
ఈ రక్తజ క్రిమి వలన ముఖ్యముగా కుష్టువ్యాధిని కలిగించును. ఈ మాతలను జంతుమాతలు అని అంటారు.
పురీషజ క్రిమి లక్షణాలు గురించి తెలుసుకుందాము . ఇవి పక్వాశయమున పుట్టి అధోమార్గమున సంచరించును. ఇవి వృద్ధినొంది ఆమాశయమునకు పోయి సంచరించునప్పుడు త్రేన్పులు వచ్చును. ఉపిరి బయటకి విడుచునప్పుడు మలము వలే దుర్గంధము బయటకి వెడలును . వీటిలో కొన్ని లావుగా , కొన్ని గుండ్రముగా , కొన్ని స్థూలంగా , కొన్ని శ్యామల పీత వర్ణముగా , కొన్ని తెలుపు , నలుపు రంగులు కలవిగా ఉండును. ఇవి 5 రకాలుగా ఉండును. అవి
* కకేరుకములు .
* మకేరుకములు .
* సౌసుదాములు .
* లేలిహములు .
* సశూలములు .
ఈ పురీషజ క్రిముల వలన పురీషము ఉండలు ఉండలుగా వెడలుట , శూల , మలబద్ధము , శరీరం కృశించుట , గరగరలాడుట , ఒళ్ళు తెల్లబారి ఉండటం వంటి గుణములు కలిగి ఉండును. ఇవి తమ స్థానములను వదిలి ఇతర స్థానముల యందు సంచరించునప్పుడు గగుర్పాటు , అగ్నిమాంద్యము , గుద స్థానము యందు దురద అను ఉపద్రవములు కలుగును. పాండు రోగము కూడా కలుగును.
9885030034
[26/04, 9:53 pm] +91 98850 30034: మలబద్ధకం గురించి వివరణ - నివారణా యోగాలు .
మలబద్దకం అనేది సమస్తరోగాలకు మొదటి మెట్టు . మలం గాని ఆమం ( సరిగ్గా జీర్ణం కాని పదార్ధం ) వాతం వలన శుష్కించి ఉండలుగా గట్టి మలమార్గము నుండి సునాయాసంగా బైటకు వెడలకున్న యెడల ఆ వ్యాధిని మలబద్దకం అంటారు. ఆయుర్వేదం నందు ఈ వ్యాదికి "ఆనాహము" అని పిలుస్తారు .
మలబద్దకం సమస్య వలన నడుము , వీపు నందు పట్టుకొని ఉండటం , కడుపునొప్పి , ఆయాసము , వాంతి వంటి లక్షణాలు వస్తాయి. దప్పిక , జలుబు , శిరస్సు నందు మంట , రొమ్ము పట్టినట్లు ఉండటం , తేన్పులు పైకి రాకుండా ఉండటం వంటి లక్షణాలు కొందరిలో కనపడతాయి. మలబద్దకం సమస్య పెరుగుతున్న కొలది మనిషి వాతరోగాలు వస్తాయి.
Xxxxxxx
ఇప్పుడు మీకు మలబద్దకం నివారణాయోగాలు వివరిస్తాను .
నివారణాయోగాలు -
* రాచ ఉశిరికాయ తినుచున్న సుఖవిరేచనం అగును.
* కాకరకాయ కూరను తరచుగా తీసుకొనుచున్న సుఖవిరేచనం అగును.
* ఎండిన ఎర్రరేగుపళ్ళు తినుచుండవలెను .
* చింతపండు చారు అద్బుతముగా పనిచేయును . అతిగా తీసుకున్న విరేచనాలు కలుగచేయును .
* బాగా పండిన అరటిపండు తినుచుండవలెను .
* నాగజెముడు , బొంతజెముడు , ఆకుజెముడు రసము 10 చుక్కలు తీసుకొనుచున్న సుఖవిరేచనం అగును. శరీర బలమును అనుసరించి 5 నుంచి 10 చుక్కలు తీసికొనవలెను .
* విరేచనం ఇబ్బందిగా ఉన్నప్పుడు 4 చెంచాల ఆముదం కొంచం వేడిచేసి లోపలికి తీసికొనవలెను . ఆముదం తీసుకోవడం ఇబ్బందిగా ఉన్నచో ఒక కప్పు గొరువెచ్చని పాలలో ఆముదం కలిపి తీసికొనవలెను .
* రోజూ నిద్రపోయే ముందు రాత్రి సమయములో రెండు గ్లాసుల నీరు తాగుచున్న ఉదయం సుఖవిరేచనం అగును. ఇలా తాగడం మొదలుపెట్టిన మొదటి రోజు నుంచే అవ్వొచ్చు లేదా రోజూ తాగుచున్న 4 రోజుల తరవాతి నుంచి వరస క్రమంలోకి వచ్చి సాఫీగా జరుగుతుంది.
* సునాముఖి చూర్ణం చెంచాడు తీసుకొనుచున్న సుఖవిరేచనం అగును.
మలబద్దకం సమస్య అనేది మనం తీసుకునే ఆహారాన్ని బట్టి ఉంటుంది. ప్రస్తుత కాలంలో జంక్ పుడ్ తీసుకోవడం ఎక్కువ అయ్యింది . ఇది అత్యంత ప్రమాదకరమైన ఆహారం . వీలైనంత వరకు అటువంటి వాటి దూరంగా ఉండవలెను . ఋతువు మారినప్పుడల్లా కడుపును శుభ్రం చేసుకొనుటకు విరేచనం కలిగించే ఔషధాలు తీసుకొనుట అత్యంత ప్రధానం అయింది.
చాలా మంది ఉదయాన్నే విరేచనముకు వెళ్ళి తమకు సుఖవిరేచనం అవుతుంది . అనే అపోహలో ఉంటారు. రోజుకి రెండుసార్లు విరేచనమునకు వెళ్ళినప్పుడే ఆరోగ్యకరమైన మనిషిగా భావించవలెను . మనం తీసుకునే ఆహారం కూడా మలబద్దకం సమస్య రాకుండా ప్రధానపాత్ర పోషిస్తుంది. ముఖ్యముగా నీరుని తీసుకోవడం , లేత ముల్లంగి , మునగ ఆకులు , మునగకాయ , కాకరకాయ , పొన్నగంటి కూర , ద్రాక్ష , వెల్లుల్లి , ఆవుపాలు , ఆముదము , ఉలవకట్టు , పాతబియ్యం , నెయ్యి , వెన్న తరచుగా ఆహారం నందు తీసుకోవాలి. పీచుపదార్ధాలు అధికముగా తీసికొనవలెను . పళ్లరసాలు కంటే పళ్లు తినటం మంచిది .
శరీరము నుండి వ్యర్థపదార్థాలు ఎప్పటికప్పుడు బయటకి వెళ్లినప్పుడే శరీరం నందు టాక్సిన్స్ పోగుపడవు . శరీరం ఆరోగ్యకరంగా ఉండును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి