6, జూన్ 2024, గురువారం

అభీష్టద బ్రహ్మ స్తోత్రం*

 *అభీష్టద బ్రహ్మ స్తోత్రం*

🚩 *®జ్ఞానసింధు®* 🚩

*( ఈ స్తోత్ర పారాయణ సంతానవృధ్ధికరము)*

(జ్యేష్ఠమాసం అంతా ఈ స్తోత్ర పఠనం సర్వశుభప్రదం)

🕉️🌹🍁🌹🍁🕉️🍁🌹🍁🌹🕉️


🙏 *ఓం శ్రీ బ్రహ్మాయ నమః* 🙏


*నమో హిరణ్య గర్భాయ బ్రహ్మణే బ్రహ్మరూపిణే |*

*అవిజ్ఞాత స్వరూపాయ కైవల్యాయామృతాయ చ ||*


*యం న దేవా విజానంతి మనో యత్రాపి కుంఠితం |* 

*న యత్ర వాక్ ప్రసరతి నమస్తస్మై చిదాత్మనే ||*


*యోగినో యం హృదాకాశే ప్రణిధానేన నిశ్చలాః |* 

*జ్యోతిరూపం ప్రపశ్యంతి తస్మై శ్రీ బ్రహ్మణే నమః ||*


*కాలాత్ పరాయ కాలాయ స్వేచ్ఛయా పురుషాయ చ |* 

*గుణత్రయ స్వరూపాయ నమః ప్రకృతి రూపిణే ||*


*విష్ణవే సత్త్వ రూపాయ రజో రూపాయ వేధసే |* 

*తమసే రుద్ర రూపాయ స్థితి సర్గంత కారిణే ||*


*నమో బుద్ధి స్వరూపాయ త్రిధాహం కృతయే నమః |* 

*పంచ తన్మాత్ర రూపాయ పంచ కర్మేంద్రి యాత్మనే ||*


*నమో మనః స్వరూపాయ పంచ బుద్ధీంద్రి యాత్మనే |* 

*క్షిత్యాది పంచరూపాయ నమస్తే విషయాత్మనే ||*


*నమో బ్రహ్మాండ రూపాయ తదంతర్ వర్తినే నమః |* 

*అర్వాచీన పరాచీన విశ్వరూపాయ తే నమః ||*


*అనిత్య నిత్య రూపాయ సదసత్ పతయే నమః |* 

*సమస్త భక్త కృపయా స్వేచ్ఛా విష్కృత విగ్రహ ||*


*తవ నిశ్వసితం దేవాః తవ స్వేదో ఖిలం జగత్ |*

*విశ్వా భూతాని తే పాదః శీర్‌ష్ణో ద్యౌస్సమ వర్తత ||*


*నాభ్యా ఆసీదంతరిక్షం లోమాని చ వనస్పతిః |*

*చంద్రమా మనసో జాతః చక్షో: సూర్యస్తవ ప్రభో ||*


*త్వమేవ సర్వం త్వయి దేవ సర్వం* 

*స్తోతా స్తుతి స్తవ్య ఇహ త్వమేవ |*

*ఈశా త్వయా వాస్యమిదం హి సర్వం* 

*నమోస్తు భూయోపి నమో నమస్తే ||*


*ఇతి స్తుత్వా విధిం దేవాః నిపేతుర్ దండవత్ క్షితౌ|* 

*పరితుష్ట స్తదా బ్రహ్మా ప్రత్యువాచ దివొకసః ||*


*||బ్రహ్మోవాచః||*


*యథార్ధ యానయా స్తుత్యా తుష్టోస్మి ప్రణతాః సురాః |* 

*ఉత్తిష్ఠత ప్రసన్నోస్మి వృణుధ్వం వర ముత్తమం ||*


*యః స్తోష్యత్యనయా స్తుత్యా శ్రద్ధావాన్ ప్రత్యహం శుచిః |* 

*మాం వా హరం వా విష్ణుం వా తస్య తుష్టాః సదా వయం ||*


*దాస్యామః సకలాన్ కామాన్ పుత్రాన్ పౌత్రాన్ పశూన్ వసు |* 

*సౌభాగ్యం ఆయురారోగ్యం నిర్భయత్వం రణే జయం ||*


*ఐహికాముష్మికాన్ భోగాన్ అపవర్గం తథా క్షయం |*

*యద్యదిష్ట తమం తస్య తత్తత్ సర్వం భవిష్యతి ||*


*తస్మాత్ సర్వ ప్రయత్నేన పరితవ్యః స్తవోత్తమః |*

*అభీష్టద ఇతి ఖ్యాతః స్తవోయం సర్వ సిద్ధిదః ||*


*ఓం శ్రీ బ్రహ్మాయ నమః*

*ఓం శ్రీ బ్రహ్మాయ నమః*

*ఓం శ్రీ బ్రహ్మాయ నమః*


*|| ఇతి శ్రీ అభీష్టద బ్రహ్మ స్తోత్రం సంపూర్ణం ||*


🕉️🌹🍁🌹🍁🕉️🍁🌹🍁🌹🕉️

ఈ పద్యం జ్ఞాపకముందా

 అల్లుని మంచితనంబును

గొల్లని సాహిత్యవిద్య, కోమలి నిజమున్

బొల్లున దంచిన బియ్యముఁ

దెల్లని కాకులును లేవు తెలియర సుమతీ!



ఈ పద్యం జ్ఞాపకముందా

Panchaag


 

వైశాఖ పురాణం - 30

 *వైశాఖ పురాణం -  పుష్కరిణి - ఫలశ్రుతి*💫


*వైశాఖ పురాణం - 30 వ అధ్యాయము*





పుష్కరిణి - ఫలశ్రుతి

శక్తియుండి వైశాఖవ్రతము నాచరింపనివారు సర్వపాపములను పొంది నరకమును చేరుదురు. వైశాఖమున నీమూడు దినములందు భాగవతమును యే మాత్రము చదివినను బ్రహ్మపదవిని పొందుదురు. గొప్ప జ్ఞానులగుదురు. ఈ మూడు దినముల వ్రతమును చేయుటచే వారి వారి శ్రద్దాసక్తులను బట్టి కొందరు దేవతలుగను, సిద్ధులుగను, బ్రహ్మపదవిని పొందిరి. బ్రహ్మజ్ఞాని, ప్రయాగలో మరణించినవారు. వైశాఖ స్నానమాచరించినవారు సర్వపురుషార్థములను పొందుదురు. దరిద్రుడగు బ్రాహ్మణునకు గోదానము నిచ్చినవారికి అపమృత్యువెప్పుడును ఉండదు.


మూడుకోట్లయేబది లక్షల తీర్థములును కలసి మేమి పాపములను పోగొట్టుదుమని మానవులు మనలో స్నానము చేయుచున్నారు. అట్టివారు పాపములన్నియు మనలో చేరి మనము యెక్కువగా కల్మషమును కలిగియుంటిమి. దీనిని పోగొట్టుకొను మార్గమును చెప్పుమని శ్రీహరిని కోరవలెను. అనియనుకొని శ్రీహరి కడకు పోయినవి. ఆయన ప్రార్థించి తమ బాధను చెప్పుకొన్నవి. అప్పుడు శ్రీహరి వైశాఖమాస శుక్లపక్షమున అంత్యపుష్కరిణి కాలమున సూర్యోదయముకంటె ముందుగా మీరు నదులు, చెరువులు మున్నగువానిలో స్నానమాడినవారికి మీ కల్మషములంటును అనగా సూర్యోదయముకంటె ముందుగా స్నానము చేసినవారికి మీ కల్మషమంటదు. వారి పాపములు పోవును అని చెప్పెను. సర్వతీర్థములును ఆ విధముగ చేసి తమ కల్మషములను పోగొట్టుకొన్నవి. కావున వైశాఖమాసమున శుక్లపక్షము చివర వచ్చు త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ పవిత్ర తిధులు సర్వపాపహరములు సుమా.






నాయనా! శ్రుతదేవా నీవడిగిన వైశాఖమహిమను, నేను చూచినంత, విన్నంత, తెలిసినంత నీకు చెప్పితిని. దాని మహిమను పూర్తిగ చెప్పుట నాకే కాదు శివునకును సాధ్యము కాదు. వైశాఖమహిమను చెప్పుమని కైలాసమున పార్వతి యడుగగా శివుడు నూరు దివ్యసంవత్సరములు ఆ మహిమను వివరించి ఆపై శక్తుడుకాక విరమించెను. ఇట్టిచోసామాన్యుడనగు నేనెంటివాడను? శ్రీహరి సంపూర్ణముగ చెప్పగలడేమో తెలియదు. పూర్వము మునులు జనహితమునకై తమ శక్తికొలది వైశాఖమహిమను చెప్పిరి. రాజా! నీవు భక్తి శ్రద్ధలతో వైశాఖవ్రతము నాచరించి శుభములనందుము. అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి చెప్పి తన దారిన తాను పోయెను. శ్రుతకీర్తియు పరమ సంతుష్టుడై మహావైభవముతో వైశాఖవ్రతము నాచరించి శ్రీహరిని యూరేగించి తాను పాదచారియై యనుసరించెను. అనేక దానముల నాచరించి ధన్యుడయ్యెను.


అని అంబరీషునకు నారదుడు చెప్పి అంబరీష మహారాజా! సర్వశుభకరమగు వైశాఖమహిమను చెప్పితిని. దీని వలన భుక్తి, ముక్తి, జ్ఞానము, మోక్షము వీనిని పొందుము. దీనిని శ్రద్ధాభక్తులతో నాచరింపుము అని నారదుడనెను. అంబరీషుడును నారదునకు భక్తి శ్రద్ధలతో సాష్టాంగ నమస్కారములను మరల మరల చేసెను. నారదుని బహువిధములుగ గౌరవించెను. నారదుడు చెప్పిన ధర్మములనాచరించి శ్రీహరి సాయుజ్యమును పొందెను.


ఈ యుత్తమ కథను విన్నను చెప్పినను సర్వపాపములను పోగొట్టుకొని ముక్తినందుదురు. దీనిని పుస్తకముగ వ్రాసి యింటనుంచుకొన్న సర్వశుభములు భుక్తి, ముక్తి శ్రీహరియనుగ్రహము కలుగును.


వైశాఖ పురాణం ముప్పైవ అధ్యయము సంపూర్ణము.

సద్గుణ దయను

 *ప్రతీఒక్కరూ సద్గుణదయను కలిగి ఉండండి* 


మనం జీవితంలో పెంపొందించు కోవాల్సిన ముఖ్యమైన లక్షణాలలో దయ ఒకటి.  ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం,దుఃఖం మారుతూ ఉంటాయి కాబట్టి, బాధలో ఉన్నవారికి మనం సహాయం చేయడం చాలా ముఖ్యం.  ఇతరులకు సహాయం చేయాలనే కోరికను పెంపొందించుకోవడానికి మనలో దయ,దాతృత్వం ఉండాలి. 

 భగవంతుని కరుణ అనంతం కాబట్టి ఆయనను కరుణాసాగరుడు అని అభివర్ణించారు.  లోకసంరక్షణ నిమిత్తం భగవంతుడు అనేక అవతారాలు ధరించేలా ప్రేరేపించినదే ఈ దాయాదాతృత్వాలు. 

 ఒకరు దయతో మరొకరికి సహాయం చేసినప్పుడు, ప్రతిఫలంగా ఏమీ ఆశించకూడదు.  అప్పుడే సత్పురుషుడు అని అతనిని పిలవగలరు. 

ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో సద్గుణ దయను అలవర్చుకోవాలి.  ఇతరులకు చేసే చిన్న సహాయం కూడా పుణ్యం.  ఎదుటివారి గురించి మంచి మాటలు చెప్పడంకూడా మంచి పనే.  ఆదిశంకరుడు తనకు హాని తలపెట్టడానికి వచ్చిన ఒక కపాలికుడు పై దయ చూపాడు.  ఇది మహోన్నతమైన దయ. 

 చిన్నతనం నుంచే పిల్లల్లో దయ పెంపొందించాలి.  పాఠశాలలో చదువుకునేటప్పుడే తోటి విద్యార్థులకు ఏ చిన్న సహాయం చేసేలా నేర్పించాలి.  ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకోవడం చూస్తే వారిని శాంతింపజేసి పోరాటాన్ని ఆపడానికి ప్రయత్నించడం మన ధర్మం.  కరుణా హృదయంతోనిండిన వారు మాత్రమే ఈ ప్రయత్నంలో నిమగ్నమవ్వగలరు. 

 మంచి స్థానంలో ఉన్న వ్యక్తి తనని  కోరుకునే వారికి సహేతుకమైన ఉపకారం చేయాలి.  ఇతరులకు సహాయం చేయడానికి మన జీవితంలో చాలా అవకాశాలు ఉన్నాయి.  మీరు వాటిని కోల్పోతే, మీరు చింతించవచ్చు.  అది కూడా అజ్ఞానమే. 

 కాబట్టి ప్రతి ఒక్కరూ ఇతరులకు సహాయం చేయడానికి భగవతానుగ్రహాన్ని సాధించడానికి తమ వంతు కృషి చేద్దాం.


-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ మహాస్వామి వారు*

సరైన నిర్ణయం*

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


*సరైన సమయంలో సరైన నిర్ణయం*

               ➖➖➖✍️


*ఒక కుండలో నీటిని వేడి చేస్తున్నప్పుడు, అకస్మాత్తుగా ఒక కప్ప కుండలోకి దూకి నీటి వలన వేడి ఎక్కడం ప్రారంభించింది. నీటి ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ, కప్ప కూడా తన శరీర ఉష్ణోగ్రతను ఆ వేడి తట్టుకోగల స్థాయికి పెంచడం ప్రారంభించింది, అయినప్పటికీ అది కావాలనుకుంటే బయటకు దూకవచ్చు, కాని అది దూకలేదు మరియు అది భరిస్తూనే ఉంది. ఉష్ణోగ్రత క్రమంగా పెరిగినప్పుడు మరియు నీటిని వేడి చేసినప్పుడు, కప్ప ఇకపై దానిని భరించలేక, దూకాలని నిర్ణయించుకుంటుంది, కానీ అప్పుడు అది దూకడానికి ఏ మాత్రం బలం లేదు. నీరు వేడిగా ఉండడం తద్వారా అది కొద్దిసేపటికి వేడి నీటిలో చనిపోతుంది.*


 *ఇప్పుడు ప్రశ్న ఏమంటే కప్ప ఎలా చనిపోయింది? అప్పుడు చాలా మంది వేడి నీటి కారణంగా చనిపోయింది అని చెబుతారు.*


*కానీ అది వేడి నీటి వలన చనిపోలేదు, ఆలస్యంగా దూకడం వల్ల అది చనిపోయింది.*


*అదే విధంగా, ప్రతి మానవుడికి అతని యవ్వనంలో దేన్నైనా తట్టుకోగల సామర్థ్యం ఉంటుంది.*


*అలాగే మనలో ప్రతి ఒక్కరూ శక్తిని కలిగి ఉన్నప్పటికీ, భగవత్సేవ చేయడం లేదు. భగవంతుని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలని అర్థం చేసుకోవాలి, అంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి.* 


*శరీరంలో జీవన శక్తి తగ్గినప్పుడు, సాధన, భజన ఇక ఉండదు, చిన్న వయసులో నుండి భగవత్సేవ చేయాలి, లేదంటే తర్వాత కాల్షియం లేకపోవడం వల్ల ఒకరు దేవాలయానికి లేదా పవిత్ర ధామాలకు రాలేరు, జీర్ణ శక్తి తగ్గడం వల్ల ఏకాదశి, జన్మాష్టమి ఉపవాసం లేదు, కంటి చూపు కోల్పోవడం వల్ల గీతా భాగవతం చదవలేడు, వినికిడి లోపం కారణంగా, సాధువుల ముఖతః భాగవతం వినరు, వివిధ వ్యాధుల వల్ల శరీరంలో శాంతి లేదు, ఇంట్లో శాంతి లేదు, స్నేహితులు, బంధువులు అందరూ వెళ్లిపోతారు. అప్పుడు, ఆ కప్ప లాగా, మీరు ప్రపంచంలోని వేడి అగ్నిలో కాలిపోయి బూడిదగా మారాలి.*


*కాబట్టి అరుదైన మానవ జన్మను భగవత్సేవలో నియోగించి సార్థకం చేసుకోవాలి.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

పంచ గ్రహ కూటమి

పంచగ్రహకూటమి. 

గ్రహకూటమి అంటే గ్రహాలూ ఒకేరాశిలో వుండటానికి గ్రహకూటమి అంటారు. ఇప్పుడు పంచగ్రహ కూటమి వచ్చింది అంటే ఒకే రాశిలోకి ఐదు గ్రహాలూ వచ్చి చేరాయి అన్నమాట. ప్రతి గ్రాహం దాని దాని వేగంతో పరిభ్రమిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఇవి ఒకే రాశిలో కలుసుకొని వుంటాయో అప్పుడు వాటి ప్రభావం విశ్వము మీద పడుతుంది. అయితే కొందరు జ్యోతిస్కులు ఇప్పుడు ఏర్పడే పంచగ్రహ కూటమి అంత ప్రమాదకారి కాకపోవచ్చు అని అంటున్నారు. ఏదిఏమైనప్పటికీ. పంచగ్రహకూటమి దాని ప్రభావం తప్పకుండ చూపెడుతుంది. కానీ ఏ ఏ రాసులవారి మీద యెంత యెంత ప్రభావం కలిగి ఉంటుంది అనేది మాత్రం జ్యోతిష్య శాస్త్రజ్ఞులు మాత్రమే చెప్పగలరు.

ఆకాశంలో అద్భుతాలు జ‌రుగుతూ ఉంటాయి. అయితే ఒక్కో స‌మ‌యంలో ఒక్కో గ్ర‌హ స్థితి కాంబినేష‌న్ ఆకాశంలో ఏర్ప‌డుతూ ఉంటుంది. కొన్ని కాంబినేష‌న్ల వ‌ల్ల ప్ర‌కృతి విప‌త్తులు ఏర్ప‌డుతూ ఉంటాయి. కొన్ని రాశుల వారికి లాభం కొన్ని రాశుల వారికి న‌ష్టం జ‌రుగుతూ ఉంటుంది. ఈ ఏడాది పంచ గ్ర‌హ కూట‌మి ఏర్ప‌డ‌బోతోంది. అంటే ఐదు గ్ర‌హాలు ఒకేసారి ఆకాశంలో ద‌ర్శ‌న‌మిస్తాయి.

కుజుడు, శుక్రుడు, గురువు, బుధుడు, సూర్య గ్ర‌హం క‌లిసి ఒకేసారి క‌నిపించ‌బోతున్నాయి. ఇది 13 ఏళ్ల త‌ర్వాత ఏర్ప‌డ‌బోతున్న కూట‌మి. ఈ పంచ గ్ర‌హ కూట‌మి అనేది మ‌న‌కు జూన్ 2 నుంచి జూన్ 14 వ‌ర‌కు క‌నిపిస్తుంది. తెల్ల‌వారుజామున 4 గంట‌ల‌కు ఆకాశంలో తూర్పు వైపున చూస్తే క‌నిపిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. ఈ గ్ర‌హ కూట‌మి వ‌ల్ కొన్ని రాసుల వారు  న‌ష్టాలు ఎదుర్కోబోతున్నరు.  మీ రాశికి ఈ పంచగ్రహకూటమి వల్ల  ఎటువంటి ముప్పు  వున్నది,దానికి ఎలాంటి పరిహారాలు చేయించాలి అనేది మీ జ్యోతిష్కుడిని అడిగి తెలుసుకొని అనుసరించండి.  కేవలము పంచ గ్రహ కూటమికి సంబందించిన సమాచారం మాత్రమే ఇక్కడ ఇవ్వబడింది.

కరక్కాయ గురించి

 కరక్కాయ గురించి సంపూర్ణ వివరణ - 


 తెలుగు  - కరక్కాయ . 


 సంస్కృతం  -  హరీతకి . 


 హింది - హరడ్ . 


 లాటిన్  - TERMINALIA CHIBULA . 


 కుటుంబము  - COMBRETACEAE . 


 గుణగణాలు  - 


     కరక్కాయ లవణరస వర్జితముగా , అయిదు రసములు గలదిగా , రూక్షముగా , వేడిగా , జఠరదీపనముగా , బుద్ధిబలమును ఇచ్చునదిగా , మధురపక్వముగా , ఆయురారోగ్యాలను ఇచ్చునదిగా , నేత్రములకు హితవుగా , తేలికగా , ఆయువును పెంపొందించునదిగా , ధాతువృద్ధిగా , వాయువును కిందకి వెడలించునదిగా ఉండును. మరియు శ్వాసను , దగ్గును , ప్రమేహమును , మొలలను , కుష్టును , నంజును , ఉదరమును , క్రిమిని , స్వరభంగమును , గ్రహిణిని , మలబద్ధకమును , విషజ్వరమును , గుల్మమును , కడుపుబ్బరం , దాహము , వాంతిని , ఎక్కిళ్ళను , దురదను , హృదయరోగమును , కామెర్లను , శూలను , ప్లీహారోగమును , అనాహమును , కాలేయవ్యాధిని , శిలామేహమును , మూత్రకృచ్చ రోగమును , మూత్రఘాత రోగమును నాశనం చేయును . 


           కరక్కాయ పులుసు రసం కలిగి ఉండుటచే వాతాన్ని హరించును . తీపి , చేదురసం కలిగి ఉండటం చేత పిత్తాన్ని హరించును . రూక్షత్వం ,వగరు రసం కలదగుట చేత కఫాన్ని హరించును . ఈ విధముగా కరక్కాయ త్రిదోషహరమైనది. 


        కరక్కాయను వర్షఋతువు నందు సైన్ధవ లవణము చేర్చి , శరదృతువు యందు పంచదార చేర్చి  , హేమంత ఋతువు నందు శొంఠిని చేర్చి శిశిర ఋతువు నందు పిప్పలిని చేర్చి , వసంత ఋతువు నందు తేనెని చేర్చి , గ్రీష్మఋతువు నందు బెల్లమును చేర్చి భక్షించవలెను. కరక్కాయను భోజనానంతరం భక్షించినను పథ్యకరమైనది . మరియు భోజనం జీర్ణం అయిన తరువాతను , అజీర్ణసమస్య ఉన్నప్పుడును పుచ్చుకోవచ్చు. 


  రూప లక్షణాలు  - 


     కరక్కాయ మొత్తం 7 రకాలుగా కలదు. అవి 


             *  విజయా . 


             *  రోహిణీ . 


             *  పూతన . 


             *  అమృతా . 


             *  అభయా . 


             *  జీవంతి . 


             *  చేతకీ . 


      అని మొత్తం 7 జాతులుగా ఉండును. ఇప్పుడు మీకు వీటి గురించి సంపూర్ణముగ వివరిస్తాను. 


        విజయా కరక్కాయ వింధ్య పర్వతం పైన పుడుతుంది. చేతకీ కరక్కాయ హిమాలయ పర్వతాలపైన పుట్టుచున్నది. పూతన కరక్కాయ సింధూనది ప్రాంతము నందు పుట్టుచున్నది . అమృత కరక్కాయ , అభయ కరక్కాయ చంపారణ్యం నందు పుట్టుచున్నది. రోహిణీ కరక్కాయ అన్ని స్థలముల యందు పుట్టుచున్నది. జీవంతి కరక్కాయ సౌరాష్ట్ర దేశము నందు పుట్టుచున్నది. 


                  సొరకాయ వలే పొడవుగా , గుండ్రముగా ఉండునది విజయా కరక్కాయ , కేవలం గుండ్రముగా ఉండునది రోహిణి కరక్కాయ , బీజము పెద్దదిగా ఉండి పై చర్మము పలుచగా ఉండునది పూతన కరక్కాయ , బీజములు చిన్నవిగా ఉండి పేడు మందముగా ఉండునది అమృత కరక్కాయ , అయిదు రేఖలు కలిగినది అభయ కరక్కాయ. బంగారు రంగుతో ఉండునది జీవంతి కరక్కాయ , మూడు రేఖలు కలిగినది చేతకీ కరక్కాయ . 


     విజయ కరక్కాయను సర్వరోగముల యందు ఉపయోగించదగినది. రోహిణి కరక్కాయను వ్రణము హరించుటకు ఉపయోగించదగినది . పూతన కరక్కాయ లేపనమందును , పైన పట్టు వేయుటకు ఉపయోగించతగినది. అమృత కరక్కాయ శోధనార్థం , విరేచనములు మొదలగు వానికి ఉపయోగించతగినది. అభయ కరక్కాయ నేత్రరోగములకు ఉపయోగించతగినది. , జీవంతి కరక్కాయ సర్వరోగములను హరించును . చేతకీ కరక్కాయ చూర్ణములకు ప్రశస్తమైనది. 


                కరక్కాయ మనుష్యులకు తల్లివలె హితము చేయును . తల్లికి ఒకప్పుడైనను కోపము కలిగి దండించును. కాని కడుపులో ప్రవేశించిన కరక్కాయ ( తినిన ) ఎప్పటికి హానిచేయదు . ఎల్లప్పుడూ మంచిచేయు గుణము కలిగినది . 


     చేతకీ కరక్కాయ తెలుపు రంగు , నలుపు రంగు బేధము వలన రెండు విధములుగా ఉండును. తెల్ల చేతకీ కరక్కాయ 6 అంగుళముల పొడవుగాను , నల్ల చేతకీ కరక్కాయ ఒక అంగుళము పొడవుగా ఉండును.  


           ఒక జాతి కరక్కాయ తినుట చేతను , ఇంకో జాతి కరక్కాయ వాసన చూసిన మాత్రం చేతను , మరొక జాతి కరక్కాయ ముట్టుకొనిన మాత్రమున , వేరొక జాతి కరక్కాయ చూచిన మాత్రమునే విరేచనం కలిగించును. ఈ ప్రకారం నాలుగు బేధముల విరేచన గుణములు కరక్కాయల యందు కలవు. 


              చేతకీ కరక్కాయ చెట్టు కింద ఏ మనుష్యులు కాని లేక పశు , పక్షి , మృగాదులు కాని తిరిగిన తక్షణం విరేచనములు అగును. చేతకీ కరక్కాయను హస్తము నందు ఎంతసేపు ఉంచుకొనునో అంతవరకు ఆ కరక్కాయ ప్రభావం వలన నిశ్చయముగా విరేచనములు అగుచుండును. చేతకీ కరక్కాయను సుకుమారులు , బలహీనులు , ఔషధము నందు ద్వేషము కలిగినవారు చేతిలో పట్టకూడదు. చేతకీ కరక్కాయ అత్యంత ప్రశస్తమైనది. సుఖవిరేచనం కలిగించుటకు హితకరం అయినది. 


             పైన చెప్పిన 7 జాతులలో విజయ కరక్కాయ ప్రధానం అయినది. ప్రయోగము నందు సుఖవిరేచనం ఇచ్చునది. సర్వరోగముల యందు ఉపయోగించతగినది. ఏ కరక్కాయ నూతనమైనది , జిగట కలిగినది . గొప్పది , గుండ్రనిది , బరువు కలిగినది . నీటిలో మునుగునదిగా ఉండునో ఆ కరక్కాయ ప్రశస్తమైనది. తూనిక నందు 2 తులములు తూగినది ప్రశస్తమైన కరక్కాయ . 


 ఔషధోపయొగాలు  - 


 *  కామెర్ల నివారణ కొరకు  - 


        కరక్కాయ , తేనె , బెల్లం కలిపి తినిన కామెర్లు తగ్గును. 


 *  కీళ్ళవాతము నివారణ కొరకు - 


        కరక్కాయ చూర్ణమును , ఆముదముతో కలిపి ప్రతినిత్యం వాడిన కీళ్లవాతం , గృదసీవాతం ( సయాటికా ) తగ్గును. 


 *  క్రిమిరోగముల నివారణ కొరకు  - 


         కరక్కాయ చూర్ణాన్ని వేడినీటితో కలిపి వాడిన క్రిమిరోగాలు తొలగును . ఇది చక్కని విరేచనాన్ని కలుగచేయును . అర్శమొలల సమస్యతో ఇబ్బంది పడువారికి ఇది చాలా మంచిది . 


 *  కడుపునొప్పి నివారణ కొరకు 


         కరక్కాయ చూర్ణము నందు బెబులిన్ కలదు. ఇది కడుపునొప్పిని తగ్గించును . 


 *  చర్మరోగముల నివారణ కొరకు  - 


         కరక్కాయ చూర్ణమును , గోమూత్రము నందు కలిపి తాగిన పామా , దద్రు మొదలగు చర్మరోగాలు తగ్గును. కరక్కాయను కాల్చి చూర్ణము చేసి ఆ చూర్ణముకు నువ్వులనూనె కలిపి రాసిన పురాణ వ్రణములు తగ్గును. 


 *  విషమ జ్వరాల నివారణ కొరకు  - 


         కరక్కాయను తేనెతో కలిపి వాడిన విషమ జ్వరాలు తొందరగా నయం అగును. 


 *  ఆమ్ల పిత్తము నివారణ కొరకు  - 


         కరక్కాయను ద్రాక్షతో కలిపి సేవించిన ఆమ్లపిత్తము నయం అగును. 


 *  అర్శమొలల నివారణ కొరకు  - 


          కరక్కాయ చూర్ణమును బెల్లముతో కలిపి ప్రతిరోజు సేవించిన అర్శమొలలు , మలబద్ధకం , వాత్తరక్తం శమించును . 


 *  బరువు తగ్గుట కొరకు - 


         కరక్కాయ ప్రతినిత్యం వాడుచున్న బరువు తగ్గును. 


 *  గోరుచుట్టు నివారణ కొరకు  - 


        పసుపు రసమునకి కరక్కాయలను చేర్చి వాటిని బాగా దంచి మెత్తగా నూరి పైపూతగా రాయుచున్న గోరుచుట్టు తగ్గును. 


 *  నీళ్ల విరేచనాల నివారణ కొరకు  - 


         కరక్కాయ చూర్ణాన్ని వేడినీటితో తాగుచున్న నీళ్ళవిరేచనాలు తగ్గును. 


 *  రక్తస్రావ నివారణ కొరకు  - 


        కరక్కాయ చూర్ణాన్ని అడ్డసరం రసంతో భావన చేసి ఎండబెట్టి ఆ చూర్ణమునకు పిప్పళ్లు , తేనె చేర్చి సేవించిన ఎంతపెద్ద రక్తస్రావం అయినను తగ్గును. 


 *  శరీర బలం పెరుగుట కొరకు  - 


         కరక్కాయలను నేతిలో వేయించుకుని తినుచున్న శరీరానికి మంచి బలం కలుగును. 


 *  పాండురోగం నివారణ కొరకు  - 


        కరక్కాయలను గోమూత్రము నందు వేసి మరిగించి తీసి పైపెచ్చు పొడిని చేసి దానిని 5 గ్రాముల మోతాదులో కొంచం ఆముదం కలిపి ప్రతినిత్యం ఉదయం సమయంలో పరగడుపున సేవించవలెను . దీనిని గోమూత్ర హరీతకీ అని అంటారు.  దీనిని వాడటం వలన పాండురోగం , అధిక బరువు , వరిబీజం తగ్గును. 


 *  చర్మ దళ కుష్టు నివారణ కొరకు  - 


       20ml గోమూత్రము నందు 3 గ్రాముల కరక్కాయ చూర్ణము కలిపి తాగితే చర్మ దళ కుష్ఠు , కిటిభకుష్టు  తగ్గును . ఇతర చర్మవ్యాధుల యందు కరక్కాయ పొడికి సమానం వేపాకు చూర్ణం కలిపి 1 స్పూన్ చొప్పున రెండుపూటలా తాగవలెను . 


 *  గొంతు బొంగురు నివారణ కొరకు  - 


       కరక్కాయ చూర్ణమునునకు పిప్పలి చూర్ణం లేదా శొంఠిచూర్ణం మరియు తేనె కలిపి లేహ్యముగా చేసి అరస్పూన్ చప్పరించి మింగుచున్న బొంగురుగొంతు , గొంతులో నస తగ్గును. 


 *  దగ్గు నివారణ కొరకు  - 


        కరక్కాయ పెచ్చును నోటిలో ఉంచుకుని రసము మింగుచున్న కొండనాలుక , దగ్గు , గొంతు వొరుచుకొనుట , పొడిదగ్గు తగ్గును. 


 *  తలనొప్పి నివారణ కొరకు  - 


        కరక్కాయ గింజలతో నుదుటి పైన పట్టువేసిన తలనొప్పి తగ్గును. 


 * కండ్ల ఎరుపు నివారణ కొరకు  - 


         కరక్కాయ , కాచు సమాన భాగాలుగా తీసుకుని నీటితో నూరి కండ్లపైన గుడ్డ వేయవలెను . కండ్ల ఎరుపులు తగ్గును. 


 *  ఎక్కిళ్లు నివారణ కొరకు  - 


       గోరువెచ్చని నీళ్లతో కరక్కాయ చూర్ణం కలిపి ఇచ్చిన ఎక్కిళ్ళు కట్టును . 


 *  ఉదరరోగ నివారణ కొరకు  - 


       ఉదయం మరియు సాయంత్రం ఒక్కొక్క కరక్కాయ చొప్పున 2 నెలలపాటు తినుచుండిన ఎటువంటి ఉదరరోగం అయినను తగ్గిపోవును. 


 *  ఆహారం జీర్ణం అగుటకు  - 


       వేడినీటితో కరక్కాయ చూర్ణం కలిపి తాగిన తినిన ఆహారం సరిగ్గా అరగకుండా ఉన్న సమస్యని తొలగించి ఆహారాన్ని జీర్ణం చేయును . 


 *  కఫజ్వర నివారణ కొరకు  - 


       గోమూత్రంలో కరక్కాయలు భావన చేసి తినిన కఫసంబంధ దోషం వలన వచ్చు జ్వరం నివారణ అగును. 


 *  వాంతుల నివారణ కొరకు  - 


        కరక చూర్ణం తేనెతో సేవించిన వాంతులు తగ్గును. 


 *  కఫ సంబంధ బోదకాలు నివారణ కొరకు  - 


       కరక్కాయ ముద్దను గోమూత్రముతో కలిపి తాగిన బోదకాలు నివారణ అగును. 


 *  గుల్మ నివారణ కొరకు  -  


        కరక్కాయ చూర్ణం బెల్లముతో కలిపి తినుచున్న గుల్మరోగం నివారణ అగును. 


 *  రక్తపిత్త రోగ నివారణ కొరకు  - 


        అడ్డసరం రసములో 7 సార్లు భావన చేసిన కరక్కాయను నీడన ఎండించి మెత్తటి చూర్ణం చేసుకుని కొంచం పిప్పలి చూర్ణం కలిపి తేనెతో సేవించిన అసాధ్యమగు రక్తపిత్తం తగ్గును. 


 *  ఉబ్బురోగం నివారణ కొరకు - 


     బెల్లం మరియు కరక్కాయ సమానంగా కలిపి తీసుకొనుచున్న ఉబ్బురోగములు తగ్గును. 


 *  వాతరక్త వ్యాధి నివారణ కొరకు  - 


     5 కరక్కాయలు బాగుగా నమిలి మింగి తిప్పతీగ కషాయం తాగిన వాతరక్తం తగ్గును.


 *  అండవృద్ధి నివారణ కొరకు  - 


        గోమూత్రము నందు భావన చేసిన కరక్కాయను ఆముదము నందు వేయించి వేడినీటి అనుపానంగా సేవించిన అండవృద్ధి హరించును . 


 *  నేత్రరోగ నివారణ కొరకు  - 


        కరక్కాయ ఆవునేతితో ఉడికించి అది కంటిపైన వేసి కట్టు కట్టుచున్న నేత్ర దోషాలు నివారణ అగును. 


 *  పిల్లల కోరింత దగ్గు నివారణ కొరకు  - 


       కరకపువ్వు 1 భాగము , వేయించిన పిప్పళ్లు 1/2 భాగము , ఎండిన ఉస్తిపండ్లు 1/4 భాగము తీసుకుని వీటన్నింటిని మెత్తగా చూర్ణం చేసి మూడు గురిగింజలంత చూర్ణము 2 గంటలకి ఒక పర్యాయము తేనెతో నాకించుచుండిన కోరింత దగ్గులు తగ్గును. కరకపువ్వు చూర్ణం కూడా వాడవచ్చును  . 


  గమనిక  - 


           అతిగా నడచినవాళ్లు , బలహీన శరీరం కలవాళ్ళు , చిక్కిన శరీరం కలవాళ్లు , ఉపవాసం వలన బలహీనపడిన వారు , శరీరం నందు అమిత వేడి కలిగినవారు , గర్భవతులు , రక్తం తీయబడిన వారు , రక్తస్రావం వలన ఇబ్బందిపడేవారు , హనుస్థంభ వాత రోగులు కరక్కాయను వాడరాదు.

క్యాటరింగ్

 విజయవాడ వారి బ్రాహ్మణ క్యాటరింగ్ 

మధువని క్యాటరింగ్& ఈవెంట్స్ విజయవాడ9182554800,

7396881404


మీ ఇంట జరిగే అన్ని రకాల శుభకార్యాలకి, గృహప్రవేశాలకి,పెళ్ళిళ్లకి, నోములకి, కిట్టీ పార్టీలకి,10 మంది నుంచి 500 మంది వరకు బ్రాహ్మణ భోజనం మీరు కోరిన విధంగా కేటరింగ్ పద్ధతిలో చేసి ఇస్తాం.                                                                                                     


మేము మీ ఇంట జరిగే శుభకార్యాలకి ఈవెంట్స్ కూడా చేస్తాము. మండపం డెకరేషన్, సన్నాయి మేళం, డిజె సౌండ్, యాంకర్, పురోహితులు, క్యాటరింగ్, రాయల్ ఎంట్రీ, మహేంది టాటూ స్టాల్స్, యాంకర్, అందుబాటు ధరలలో ఏర్పాటు చేయబడును


విజయవాడ మీదుగా (కారు, బస్సు) లేదా ఏ ఇతర వాహనాలపై ఇతర ప్రాంతాలకు వెళుతూ ఉన్నవారు ఒకరోజు ముందుగా తెలియజేస్తే చక్కటి ఇంటి తరహా బ్రాహ్మణ భోజనం అందజేస్తాము 

                                        నలుగురికి ఉపయోగపడే పోస్ట్ దయచేసి మీ బంధువులకి,మిత్రులకి షేర్ చేయండి🙏🙏

సంకల్పము

 *శుభోదయం*

*********

సంధ్యావందనం

 మరియు ఇతర

 పూజాకార్యక్రమాల

 సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ 06.06.2024

బృహస్పతివాసరే( గురువారము)

********

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ  క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే

వసంత ఋతౌ వైశాఖ మాసే కృష్ణ పక్షే అమావాస్యాయాం

(సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

బృహస్పతివాసరే( గురువారము)

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర  ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

ఇతర పూజలకు శ్రీ క్రోధి  నామ సంవత్సరే ఉత్తరాయణే

వసంత ఋతౌ 

వైశాఖ మాసే  కృష్ణ పక్షే అమావాస్యాయాం

గురు వాసరే అని చెప్పుకోవాలి.

ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.5.28

సూ.అ.6.28

శాలివాహనశకం 1946 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2081 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5125 వ సంవత్సరం. 

శ్రీ క్రోధి నామ సంవత్సరం 

ఉత్తరాయణ పుణ్యకాలం

వసంత ఋతువు

వైశాఖ మాసం 

కృష్ణ పక్షం

అమావాస్య సా. 5.48 వరకు. 

గురు వారం. 

నక్షత్రం రోహిణి  రా.8.26 వరకు.

అమృతం సా. 5.20 ల 6.53 వరకు. 

దుర్ముహూర్తం ప.9.48 ల 10.35 వరకు. 

దుర్ముహూర్తం మ.2.59 ల 3.41 వరకు. 

వర్జ్యం మ.12.40 ల 2.13 వరకు. 

వర్జ్యం తె.2.00 ల 3.35 వరకు. 

యోగం ధృతి 10.44 వరకు. 

కరణం చతుష్పాద ఉ.6.33 వరకు. 

కరణం నాగవం సా. 5.48 వరకు. 

సూర్యోదయము  ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం సా.1.30 ల 3.00 వరకు. 

గుళిక కాలం ఉ. 9.00 ల 10.30 వరకు. 

యమగండ కాలం ఉ.6.00 ల 7.30 వరకు. 

***********   

పుణ్యతిధి వైశాఖ బహుళ అమావాస్య. 

********

Note:-

శ్రీ పద్మావతి శ్రీనివాస వివాహ సమాచార సంస్థ

*(రి.జి.నెం.556/2013) *

*వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

వధూవరుల వివరాలకై సంప్రదించండి.

 80195 66579.

****************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.


ఈ రోజు పుట్టినరోజు  మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

🙏🙏🙏

ఈ పద్యం జ్ఞ్యాపకముందా

 శా. ఇంతింతై వటుఁడింతయై మరియుఁ దానింతై నభోవీధిపై

      నంతై తోయద మండలాభ్రమున కల్లంతై ప్రభారాశిపై
      నంతై చంద్రుని కంతయై ధ్రువుని పైనంతై మహర్వాటిపై
      నంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై
ఈ పద్యం జ్ఞ్యాపకముందా

హనుమజ్జయంతి ప్రత్యేకం - 6/11

 ॐ       హనుమజ్జయంతి ప్రత్యేకం -  6/11 

         (ఈ నెల 1వతేదీ హనుమజ్జయంతి) 


VI. హనుమంతుడు - కుండలినీ యోగ సాధకుడు 


    యోగి, కుండలినీశక్తిని మూలాధారము నుండి పైకి ప్రయాణింపజేసి, 

    స్వాధిష్ఠాన - మణిపూర - అనాహత - విశుద్ధ - ఆజ్ఞా చక్రములను అతిక్రమించి, 

   చివరికి సహస్రారపద్మాంతర్గత బిందు స్వరూపమైన పరబ్రహ్మ సాక్షాత్కారమును పొందుతాడు. 

    అదే యోగ సిద్ధి. 


    హనుమంతుడు 

  - జితేంద్రియుడు. అంటే ఇంద్రియ చాపలం లేనివాడు. 

  - బుద్ధిమతాంవరిష్ఠుడు. అనగా ఇతర విక్షేపములు లేని బుద్ధితో, లక్ష్యశుద్ధి కలవాడు. 


1.మూలాధారం: 

    హనుమంతుడు మహేంద్రపర్వతం నుండి ఆకాశంలోకి ప్రయాణించడం అంటే మూలాధారంనుంచీ కుండలినీ శక్తిని ఊర్ధ్వముఖంగా ప్రయాణింపజేయడం. 


2.స్వాధిష్ఠాన చక్రం: 

    మైనాకుడు సహాయం చేయవచ్చినా అదికూడా గమనానికి అవాంతరమే కదా! ప్రలోభాలకీ సుఖాలకీ ఆశించక, ఆటంకాన్ని దాటటం స్వాధిష్ఠానాన్ని అతిక్రమించడం. 


3.మణిపూర చక్రం: 

    తనని సురస మ్రింగెదనని, తన నోట ప్రవేశింపుమని అడ్డగించింది. 

    ఆ సురస నోట ప్రవేశించి, బయటపడి తప్పించుకొనడం మణిపూర చక్రాన్ని అతిక్రమించడం. 


4.అనాహత చక్రం: 

    సింహిక ఛాయాగ్రహణం చేయగా, దానిని సంహరించటం అనాహతాన్ని దాటి పైకి సాగటము. 


5.విశుద్ధి చక్రం: 

    లంకా ప్రవేశానికి లంకానగర అధిష్థాన దేవత అడ్డువచ్చింది. 

    ఆమెను గెలవటం విశుద్ధి చక్రాన్నతిక్రమించడం. 


6.ఆజ్ఞా చక్రం: 

    మండోదరిని చూచి సీతయే అని పరమానందం పొందాడు. 

    కానీ లక్షణాలనిబట్టీ, వివేచనచేతనూ ఆమె సీత కాదనుకొన్నాడు. 

    ఆజ్ఞా చక్రాన్ని చేరిన కుండలిని, అదే గమ్యమనుకొని ఆనందపడి, 

    మరల విచక్షణా జ్ఞానంచే,  గమ్యానికి ఇంకా ప్రయత్నం చేయవలసి ఉందని గ్రహించడం ఆజ్ఞా చక్రాన్ని దాటటం. 


7.సహస్రార చక్రం: 

    అశోకవనంలో సీతాదేవిని చూచి, ఆనందించడం సహస్రార చక్ర ప్రవేశం. 

         

    ఆరు చక్రాలనీ జయించుకొని వచ్చిన సిద్ధపురుషునికి 

    సహస్రార చక్రాంతర్గత బిందురూపిణి అయిన శ్రీ భువనేశ్వరీ దర్శనమైనదని అర్థం. 


    చివరకు సీతారాములను తిరిగి కలిపి అయోధ్య చేర్చిన ఆంజనేయ సమారాధనలో సర్వేశ్వరి సాయుజ్యం గోచరిస్తుంది. 


    ఈ విధంగా మారుతి యోగసిద్ధుడు. 

    మనం ఆయనని ఆరాధిస్తూ, ఆయన ఆచరించిన ఈ యోగమార్గంలో పయనించి, 

   "శ్రీచక్రాంతర్గత బిందు స్వరూపిణి" అయిన అమ్మ దర్శనం పొందుతాం. 


               జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 


          జై హనుమాన్ జై జై హనుమాన్  


                           కొనసాగింపు .... 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం 

        (86399 68383)

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - వసంత ఋతువు - వైశాఖ మాసం - కృష్ణ పక్షం  -‌ అమావాస్య  - రోహిణి -‌‌  గురు వాసరే* (06.06.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

గురువారం,జూన్6,2024

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హo*


గురువారం,జూన్6,2024

శ్రీ క్రోధి నామ సంవత్సరం

ఉత్తరాయణం - వసంత ఋతువు

వైశాఖ మాసం - బహుళ పక్షం

తిథి:అమావాస్య సా5.58 వరకు

వారం:గురువారం(బృహస్పతివాసరే

నక్షత్రం:రోహిణి రా8.35 

యోగం:ధృతి రా10.52 వరకు

కరణం:చతుష్పాత్ ఉ6.41 తదుపరి నాగవం సా5.58 వరకు

వర్జ్యం:మ12.47 - 2.21 మరల రా2.08 - 3.44

దుర్ముహూర్తము:ఉ9.48 - 10.40

మరల మ3.00 - 3.52

అమృతకాలం:సా5.28 - 7.02

రాహుకాలం:మ1.30 - 3.00

యమగండ/కేతుకాలం:ఉ6.00 - 7.30

సూర్యోదయం:5.28

సూర్యరాశి: వృషభం

చంద్రరాశి:వృషభం 

సూర్యాస్తమయం:6.28


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*పద్య కవితా శిల్పకళానిధి*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

 *మిట్టాపల్లి*

ఐశ్వర్యసమృద్ధిని

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝   *ఇష్టా విశిష్టమతయోపి యయా దయార్ధ*

        *దృష్ట్యా త్రివిష్టప పదం సులభం లభస్తే*.

        *దృష్టిః ప్రహృష్ట కమలోదరదీప్తి రిష్టాం*

        *పుష్టిం కృషీష్ట మమ పుష్కరవిష్టరాయాః* (09)


               { _/  *కనకధారా స్తవం* _/ } 


*తాత్పర్యం: స్వర్గలోకసుఖం కలిగించే యజ్ఞయాగాదులైన శుభకర్మలు ఆచరించడంలో మనసులేని వారైనప్పటికిని శ్రీమహాదేవి దృష్టి తమపై ప్రసరించగానే మానవులు అనాయాసంగా స్వర్గపదవిని పొందగల్గుతున్నారు. అట్టి పద్మ గర్భం యొక్క కాంతివంటి కాంతి గల్గిన శ్రీమహాలక్ష్మి కడగంటి చూపులు నాకు ఐశ్వర్యసమృద్ధిని సమకూర్చుగాక*!


 ✍️🌷💐🙏

సత్య సాయి సుపర్ స్పెషాలిటీ హాస్పిటల్

 ఓం శ్రీ సాయిరాం, 


బెంగుళూరు సత్య సాయి సుపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో లభించు సేవలు:

కార్డియాలజీ (గుండె జబ్బులు), ENT (చెవి ముక్కు గొంతు), న్యురాలజి(నరములు, ఫిట్స్,,,), న్యూరో సర్జరీ (బ్రెయిన్, వెన్నుముక), ఆర్థోపెడిక్స్ (ఎముకలు,మోకాళ్లు ) జనరల్ సర్జరీ (హెర్నియా, పైల్స్, ట్యూమర్స్, ..) సైక్రియాటరి (మానసిక వ్యాధులు) పీడియాట్రిక్స్ (చిన్నపిల్లల కొరకు), ఆప్తల్మాలజీ (కళ్ళు) , గైనకాలజి 


పుట్టపర్తి సత్య సాయి సుపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో లభించు సేవలు:

కార్డియాలజీ (గుండె జబ్బులు),

యురాలజీ (ప్రోస్టేట్ సమస్యలు, కిడ్నీ ట్యూమర్స్, కిడ్నీ స్టోన్స్.,)

ఆప్తల్మాలజీ (కళ్ళు) , ఆర్థోపెడిక్స్ (ఎముకలు,మోకాళ్లు ), ప్లాస్టిక్ సర్జరీ.


*OP, సర్జరీలు, ఇన్ పేషెంట్ సర్వీసులు పూర్తిగా ఉచితం.*


*రెండు హాస్పిటల్స్ కి Helpline No: 080 4710 4600.*

*పై నెంబర్ కి ఫోన్ చేసి సమస్య ను చెప్పి అపాయింట్ మెంట్ పొందవచ్చు.*